పంజాబీ నటి సోనమ్ భజ్వా బాలీవుడ్‌లో డబుల్ ధమాకా కొట్టారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, సంజయ్‌దత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. తరుణ్ మన్సుఖాని ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సోనమ్ భజ్వా. ఈ చిత్రంలో సోనమ్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకముందే మరో బాలీవుడ్ చిత్రం ‘బాఘీ 4’లో హీరోయిన్‌గా నటించే చాన్స్‌ను దక్కించుకున్నారు సోనమ్ భజ్వా.
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకత్వం వహించనుండగా, సంజయ్‌దత్ ఓ లీడ్ రోల్‌లో నటిస్తారు. ‘బాఘీ, హౌస్‌ఫుల్’.. ఈ రెండూ బాలీవుడ్‌లో హిట్ ఫ్రాంచైజీలే. అలాగే ఈ రెండు సినిమాలకు నిర్మాత సాజిద్ నడియాద్ వాలాయే కావడం విశేషం. ‘‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకుండానే, ‘బాఘీ 4’లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సోనమ్ భజ్వా.
Comments
Please login to add a commentAdd a comment