Bollywood
-
వేసవిలో జాట్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఈ చిత్రాన్ని వేసవిలో ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించి, కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘భారీ యాక్షన్ మూవీగా ‘జాట్’ రూపొందింది. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ప్రదర్శితమైన ‘జాట్’ టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: రిషి పంజాబీ, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బాబా సాయికుమార్ మామిడిపల్లి, జయ ప్రకాశ్ రావు (జేపీ). -
క్యాన్సర్‌తో నటి పోరాటం.. అమ్మతనాన్ని కాపాడుకున్నా.. ఇప్పుడు..!
మానవత్వం చచ్చిపోయిందంటోంది బుల్లితెర నటి చవీ మిట్టల్ (Chhavi Mittal). క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టు కోల్పోతున్న తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ట్రోల్ చేయడం బాధగా ఉందని పేర్కొంది. తనపై వచ్చిన అసభ్య కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.మానవత్వం చచ్చిపోయిందిమానవత్వం చచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ రోజు మరోసారి చూశాను. క్యాన్సర్ చికిత్స వల్ల నేను జుట్టు కోల్పోతుంటే మీరేమో ట్రోల్ చేస్తున్నారు. 2022 నుంచి రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనికి పదేళ్లపాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో నా హార్మోన్ చికిత్సకు మూడేళ్లవుతాయి. ఈ ట్రీట్మెంట్ వల్ల ఎన్నో దుష్ప్రభావాలున్నాయి. చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బరువు సరిగా లేకపోవడం, మూడ్ స్వింగ్స్, తిమ్మిర్లు.. ఇలా వీటన్నింటితోపాటు జుట్టు కూడా ఊడిపోతుంది. ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారుఅమ్మాయిలకు జుట్టు అంటే ఎంతిష్టమో నేను మాటల్లో చెప్పలేను. మొదటగా అమ్మతనానికి అవసరమైన రొమ్ము నిలుపుకోవడానికి పోరాడాను. ఇప్పుడు జుట్టు కోసం! ఇలాంటి సమయంలో మీరు చేసే నెగెటివ్ కామెంట్లు నన్ను మరింత కుంగదీస్తున్నాయి. ఇప్పుడీ పోస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం.. కొందరు నన్ను ఇష్టపడి నా అకౌంట్ ఫాలో అవడం లేదు. కేవలం ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారు. జుట్టు రాలిపోతున్న క్యాన్సర్ వారియర్‌ను ట్రోల్ చేయడానికి మీ మనసెలా అంగీకరించిందో అర్థం కావట్లేదు.నా ఆత్మస్థైర్యాన్ని చూడుమీకు తలనిండా వెంట్రుకలు, క్యాన్సర్ లేని జీవితం, నీచమైన విమర్శలు లేని జీవితం ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా ఎలా ఉంచుకున్నానో చూడు అని రాసుకొచ్చింది. కాగా చవీ మిట్టల్.. తుమ్హారీ దిశ, ట్వింకిల్ బ్యూటీ పార్లర్, ఘర్ కీ లక్ష్మీ బేటియాన్, నాగిన్, బందిని, ఏక్ చుట్కి ఆస్మాన్, కృష్ణదాసి వంటి సీరియల్స్‌లో మెరిసింది. ఏక్ వివాహ్.. ఐసా భీ, పాల్ పాల్ దిల్కే సాత్ చిత్రాలు చేసింది. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) చదవండి: అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ.. -
మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న హీరోయిన్
హీరోయిన్ మమత కులకర్ణి (Mamta Kulkarni) సన్యాసం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించానలుకున్న ఆమె ఫిబ్రవరి వరకు కుంభమేళాలో ఉంటానని పేర్కొంది. జనవరి 24న కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది.సాధ్విగా మారిపోయిన హీరోయిన్కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షతో, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో ఆమె నిజమైన సాధ్విగా మారిపోయింది. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ఆమె ఇలా సాధ్విగా మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మమత కులకర్ణి సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది. కరణ్ అర్జున్, దిల్బర్, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ.. -
సైఫ్‌పై దాడి కేసులో నా కుమారుడిని ఇరికించారు: నిందితుడి తండ్రి
'పొట్టకూటి కోసం వచ్చిన నా కొడుకు నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేయలేదు. కావాలనే అతడ్ని ఈ కేసులో ఇరికించారు' అంటున్నాడు నిందితుడి తండ్రి. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించిన విషయం తెలిసిందే! నిందితుడిని బంగ్లాదేశ్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 29వరకు పోలీసుల కస్టడీకి ముంబై కోర్టు అనుమతిచ్చింది.తిరిగి వచ్చేయాలనుకున్నాడుఈ క్రమంలో నిందితుడి తండ్రి మహ్మద్ రుహుల్ అమీన్ ఫకీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియాతో ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు బాగోలేనందున నా కుమారుడు మధ్యవర్తి సాయంతో ఇండియాకు వచ్చేశాడు. ఉద్యోగావకాశాల కోసం గతేడాది ఏప్రిల్‌లో భారత్‌లో ప్రవేశించాడు. కావాల్సినంత సంపాదించుకున్నాక తిరిగి బంగ్లాకు వచ్చేయాలనుకున్నాడు.ముంబైలో ఎందుకంటే?ముందుగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ హోటల్లో పని చేశాడు. బెంగాల్ కంటే ముంబై రెస్టారెంట్లలో ఎక్కువ జీతం కావడంతో తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. తరచూ మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చివరిసారిగా శుక్రవారం నాతో ఫోన్లో మాట్లాడాడు. ప్రతి నెల పదో తారీఖున అతడికి జీతం పడుతుంది. అలా నాకు రూ.10 వేలు పంపాడు. తన ఖర్చుల కోసం రూ.3 వేలు ఉంచుకున్నాడు. మేము పేదవాళ్లమే కానీ నేరస్తులం కాదు. బంగ్లాదేశ్‌లో అతడు బైక్ టాక్సీ నడిపేవాడు.అన్యాయంగా ఇరికిస్తున్నారునా కొడుకును అరెస్ట్ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది నా కొడుకు కాదు. మీరంతా పొరబడుతున్నారు. అతడెప్పుడూ తన జుట్టు అంత పొడవుగా ఉంచుకునేవాడు కాదు. ఎవరో కావాలనే ఈ కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు. అధికారులు నా కొడుకే నిందితుడు అని పొరబడుతున్నారు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇండియాలో మాకు తెలిసినవారెవరూ లేరు. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నా కొడుకు నిర్దోషిగా వస్తాడని ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.సైఫ్‌పై దాడికాగా జనవరి 16న ముంబైలోని ఇంట్లో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జెహంగీర్ గదిలో చొరబడ్డాడు. అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో అతడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్.. కుమారుడు తైమూర్‌తో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సైతం రక్తంతో తడిసిన సైఫ్‌ను చూసి రూపాయి కూడా తీసుకోలేదు. తీవ్రగాయాలపాలైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వెన్నెముకలో విరిగిన 2.5 అంగుళాల కత్తి మొనను సర్జరీ చేసి తొలగించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్.. బిజోయ్ దాస్‌గా పేరు మార్చుకుని భారత్‌లో అక్రమంగా చొరబడ్డాడని గుర్తించారు.చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష -
హీరోల వయసు గురించి ఎందుకు మాట్లాడరో?
చిత్ర పరిశ్రమలో వయసనేది పెద్ద సమస్యే కాదని నటి మనీషా కొయిరాలా(Manisha Koirala) అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు చేసే అవకాశం ఇవ్వాలి. వయసు, వృద్ధాప్యం అనేది సినిమా ఇండస్ట్రీలో పెద్ద సమస్య కాదు. కానీ, ఇది పరిష్కరించాల్సిన సామాజిక సమస్య.ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోల వయసు గురించి ఎవరూ మాట్లాడరు. హీరోల ఏజ్‌పై కామెంట్స్ చేయడం నేనిప్పటి వరకూ వినలేదు. ఏజ్ విషయంలో కేవలం నటీమణులను మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థం కావడం లేదు. సీనియర్లకు తల్లి పాత్రలో లేక సోదరి పాత్రలో ఇద్దామనుకుంటున్నారు. మహిళలు ఎలాంటి పాత్రలైనా చేయగలరు. యాక్షన్ పాత్రలని కూడా సులభంగా చేయగలరు.గతంలో ఎంతో మంది సీనియర్ నటీమణులు ఈ విషయాన్ని నిరూపించారు. నేను కూడా ఇప్పటికీ ఎలాంటి పాత్ర అయినా సవాల్‌గా స్వీకరిస్తాను. కొత్త పాత్రలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే. యాభై సంవత్సరాలు దాటినా మంచి జీవితాన్ని గడపగలం. అసలు వయసనేది సమస్య కాదని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈ విషయంలో భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలవాలి. నేను జీవించి ఉన్నంత వరకు ఆరోగ్యంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలనుకుంటున్నా.. ఇదే ఆశయంతో జీవిస్తున్నాను’’ అన్నారు. -
ఈ ఒక్క పాత్ర చాలు.. ఇక రిటైర్ అయిపోతా: రష్మిక కామెంట్స్ వైరల్
పుష్ప-2 అభిమానులను అలరించిన రష్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విక్కీ కౌశల్ సరసన ఛావా చిత్రంతో అలరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఛావా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ మూవీలో మరాఠా రాణి యేసుబాయి భోన్సాలే పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ పాత్రతో ఇక తాను సినిమాల నుంచి రిటైర్ అయిపోయినా సంతోషమేనని రష్మిక వెల్లడించింది. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. 'ఇది నాకు గొప్ప గౌరవం. మహారాణి యేసుబాయి పాత్రను పోషించడానికి దక్షిణాది అమ్మాయిగా చాలా సంతోషంగా ఉంది. నా సినీ కెరీర్లో అత్యంత విశేషమైన, ప్రత్యేకమైన పాత్ర. అందుకే నేను డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సార్‌తో ఒక విషయం చెప్పాను. ఈ పాత్ర చేశాక నేను సంతోషంగా రిటైర్ అయిపోతా అని చెప్పా' అని అన్నారు.తననే ఈ పాత్రకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ..' ఈ విషయంలో నేను షాక్ అయ్యా. అసలు లక్ష్మణ్ సర్ నాకు ఇలాంటి పాత్ర ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశాడు. నాకు లక్ష్మణ్ సర్ ప్రత్యేక పాత్ర ఇవ్వడంతోనే ఫిదా అయిపోయా. ఇక్కడ నాకు భాషతో పాటు ప్రతిదీ చాలా రిహార్సల్‌గా అనిపించింది. కానీ లక్ష్మణ్ సార్‌కు ఏది అడిగినా చేయడానికి నేను ఉన్నా అన్న ధైర్యమిచ్చా' అని అన్నారు.గాయంతోనే ఈవెంట్‌కు..కాగా.. ఇటీవల రష్మిక మందన్నా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసింది. కాలు ఎంత ఇబ్బంది పెడుతున్నా కుంటుతూనే ఈవెంట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ.కాగా.. ఛావాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, దివ్య దత్తా, నీల్ భూపాలం, సంతోష్ జువేకర్, ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
ఏంటి సైఫ్? అర లక్ష ఏం సరిపోతుంది? కనీసం రూ.11 లక్షలైనా..: సింగర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి అతడి ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఆదుకున్న నీకు ఏమిచ్చినా తక్కువే అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ సదరు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిసి అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. రూ.50 వేల నగదును బహుమానంగా ఇచ్చాడు. అలాగే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా రానాకు రూ.11 వేల రివార్డు అందించింది.రూ.1 లక్ష సాయం ప్రకటించిన సింగర్తాజాగా సింగర్ మికా సింగ్.. ఆటో డ్రైవర్‌కు రూ.1 లక్ష సాయం ప్రకటించాడు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండియా ఫేవరెట్ సూపర్‌స్టార్‌ను కాపాడిన అతడికి కనీసం రూ.11 లక్షలైనా రివార్డుగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సమయానికి హీరోలా వచ్చి కాపాడాడు. దయచేసి అతడి వివరాలు ఎవరైనా నాకు తెలియజేస్తారా? అతడు చేసిన మంచి పనికి మెచ్చుకోలుగా రూ.1 లక్ష సాయం చేయాలనుకుంటున్నాను అని పేర్కొన్నాడు.అతడు రియల్ హీరోసైఫ్ అర లక్ష సాయం చేశాడని రాసున్న పోస్ట్‌ను షేర్ చేస్తూ.. సైఫ్ భాయ్, దయచేసి అతడికి రూ.11 లక్షలివ్వు. అతడు రియల్ హీరో. ముంబై ఆటోవాలా జిందాబాద్ అని రాసుకొచ్చాడు. కాగా జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ దుండగుడు చొరబడ్డాడు. సైఫ్ చిన్నకుమారుడి జెహ్ దగ్గర అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేసింది. ఆ శబ్దం విని కిందకు వచ్చిన సైఫ్.. దుండగుడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతడు తన దగ్గరున్న కత్తితో నటుడిని పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.(చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష)ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు కూడా అందుబాటులో లేదు. దీంతో అతడు నడుచుకుంటూ రోడ్డు మీదకు రాగా ఓ ఆటో డ్రైవర్ అతడిని చూసి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో సైఫ్‌కు చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలవగా వెన్నెముక దగ్గర 2.5 అంగుళాల కత్తిమొనను వైద్యులు సర్జరీ చేసి తొలగించారు.నిందితుడి అరెస్ట్నటుడిపై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతడిని బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌గా గుర్తించారు. భారత్‌కు వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.చదవండి: ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి -
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. లైవ్ షో మధ్యలోనే వెళ్లిపోయిన సింగర్
సింగర్ మోనాలి ఠాకూర్ (Monali Thakur) ఆస్పత్రిపాలైంది. లైవ్ షోలో పాడుతున్న ఆమెకు ఉన్నట్లుండి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. జనవరి 21న పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిఈ వీడియోలో లైవ్ షోలో పాడుతున్న గాయనికి ఉన్నట్లుండి ఏదో ఇబ్బందిగా అనిపించి తలపట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆమె పాట పాడటం ఆపలేదు. ఎలాగోలా సాంగ్ పూర్తి చేసింది. కానీ తర్వాత షోను కొనసాగించలేకపోయింది. నాకు ఈ రోజు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. కాబట్టి షో ముగించేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని స్టేజీపైనే క్షమాపణలు చెప్పింది. షో రద్దు చేసిన వెంటనే ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.సింగర్ మాత్రమే కాదు, నటి కూడా!ఈ నెల ప్రారంభంలోనూ మోనాలి ఠాకూర్ వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పర్ఫామెన్స్ మధ్యలోనే స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈవెంట్ మేనేజ్మెంట్ అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు తన సిబ్బందిని వేధింపులకు గురిచేసిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే లైవ్ షో మధ్యలోనే వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చింది. మోనాలి ఠాకూర్.. సవార్ లూన్, జర జర టచ్ మీ, చమ్ చమ్, తేర ఇంతేజర్, మమ్మీ కసమ్.. వంటి పాటలు ఆలపించింది. తెలుగు దర్శకుడు నగేశ్ కుకునూర్ హిందీలో తెరకెక్కించిన లక్ష్మి సినిమాలో కీలక పాత్ర పోషించింది. చదవండి: బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు -
బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదింపులు ఈమెయిల్స్
-
బాలీవుడ్ కు గుడ్ న్యూస్ మళ్లీ బిజీ అవుతున్న ఖాన్స్
-
బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపులు, సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలతో చిత్రపరిశ్రమలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. పాకిస్తాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముంబైలోని అంబోలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.రిప్లై రాలేదంటే తీవ్ర పరిణామాలుఈమెయిల్లో ఏముందంటే..? నువ్వేం చేస్తున్నావో ప్రతీది గమనిస్తున్నాం. ఓ సున్నిత విషయాన్ని నీ దృష్టికి తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నాం. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు, అలా అని నిన్ను వేధించడమూ లేదు. ఈ మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, అలాగే దీన్ని సీక్రెట్‌గా ఉంచాలని కోరుతున్నాం.. ఇట్లు బిష్ణు అని రాసుంది. అంతేకాకుండా ఎనిమిది గంటల్లో ఈ మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలని లేదంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు.వరుసగా బెదిరింపులుకపిల్ కంటే ముందు సుగంధ మిశ్ర, రెమో డి సౌజ, రాజ్‌పాల్ యాదవ్‌కు సైతం ఇటువంటి మెయిల్సే వచ్చాయి. సల్మాన్ ఖాన్ స్పాన్సర్ చేస్తున్న షోలో భాగమైన కపిల్ శర్మను, అతడి టీమ్ మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నదెవరు? అందుకు గల కారణాలేంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే గత వారం సైఫ్ అలీఖాన్ ఇంట్లో అతడిపై దాడి జరిగింది. ఓ దుండగుడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన నటుడికి వైద్యులు సర్జరీ చేశారు. తన శరీరంలో నుంచి 2.5 అంగుళాల కత్తి మొననను తీసేశారు.చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్ -
రష్మిక మందన్న 'ఛవా' చిత్రం ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఎవరీ మోనాలిసా? ఓవర్‌నైట్‌లో జాక్‌పాట్ కొట్టిన తేనె కళ్ల సుందరి (ఫోటోలు)
-
మహాకుంభ్ మేళా తేనే కళ్ల బ్యూటీ.. ఏకంగా సినిమాలో ఆఫర్!
సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు.. రాజకీయ నాయకురాలు అంత కన్నా కాదు. ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టికూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందేనే వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం.యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహకుంభ్ మేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. దానికి కారణం ఆమె కళ్లు. తేనేలాంటి కళ్లతో మహాకుంభ్ మేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ తర్వాత అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఏ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.మహాకుంభ్ మేళాలో అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న తేనేకళ్ల సుందరి మోనాలిసా. ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు. దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ అట్రాక్షన్ కళ్లు. ఆ అందమైన కళ్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకున్న బాలీవుడ్ డైరెక్టర్‌కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశమివ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్‌నైట్ స్టార్ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీఖాన్.. ఎంత నగదు ఇచ్చారంటే?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్‌కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్‌ను పలువురు అభినందించారు.ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్‌ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్‌కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది. సైఫ్ ఆర్థిక సాయం..తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.నిందితుడి అరెస్ట్.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ షరీఫుల్‌గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్.. అదే ప్రధాన కారణం: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం స్కై ఫోర్స్ అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. సందీప్ కేవ్లానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హైజరైన అక్షయ్ బాక్సాఫీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఓటీటీల వల్లే మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయని అక్షయ్ కుమార్ అన్నారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల భారీగా తగ్గిందని తెలిపారు. పెద్ద చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీలేనని వెల్లడించారు.అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..'ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి ఆరా తీశా. ఏ సినిమా అయినా ఓటీటీలో చూస్తామని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీనే అని నాకు అర్థమైంది. కరోనా టైమ్‌లో ఓటీటీ వేదికగా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు మారినప్పటికీ ప్రేక్షకులు ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. అది ఒక అలవాటుగా మారిందని' అన్నారు. కాగా.. తెలుగులోనూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
నాగచైతన్య పాన్ ఇండియా ప్రాజెక్ట్.. కీలక పాత్రలో లాపతా లేడీస్ నటుడు!
అక్కినేని నాగచైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్లో చైతూ వంట వండుతున్న వీడియోలు వైరలయ్యాయి. అంతేకాకుండా నమో నమశ్శివాయ అనే రెండో లికరికల్ సింగిల్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.అయితే ఈ మూవీ తర్వాత చైతూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. ఎన్సీ24 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. విరూపాక్ష మూవీతో హిట్ కొట్టిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు.విలన్‌గా లపట్టా లేడీస్ నటుడు..అయితే ఈ మూవీలో లాపతా లేడీస్ యాక్టర్ స్పార్ష్ శ్రీవాస్తవ నటిస్తారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. అమిర్ ఖాన్- కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ గతేడాది విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తన అమాయకమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు శ్రీవాస్తవ. దీంతో నాగ చైతన్య రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో శ్రీవాస్తవ విలన్‌గా చేయనున్నారని ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కాగా.. గతంలో చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఎన్సీ24 మూవీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తారని కూడా తెలుస్తోంది. ఈ మూవీలో నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
హీరోయిన్‌తో డేటింగ్.. స్నేహితురాలితో పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అడార్ జైన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్న నాటి స్నేహితురాలు అలేఖ అద్వానీని ఆయన పెళ్లాడారు. గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు,కుటుంబ సభ్యులు సందడి చేశారు. వారం రోజు క్రితమే వీరి పెళ్లి వేడుక జరగగా.. తాజాగా నటుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. అడార్ జైన్ ప్రముఖ సీనియర్ నటుడు రాజ్ కపూర్ మనవడు. రాజ్ కపూర్ కుమార్తె రీమా కపూర్ కుమారుడు. వీరంతా బాలీవుడ్ సినీ తారలైన రణ్ బీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్లకు బంధువులే. అయితే వీళ్లెవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. కానీ గత సంవత్సరం ముంబయిలోని ఆదర్ నివాసంలో జరిగిన రోకా వేడుకలో మాత్రం పాల్గొన్నారు. రోకా వేడుకకు అలియా భట్, నీతు కపూర్ కూడా హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆదర్ జైన్- అలేఖా అద్వానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో మూడుముళ్లబంధంలోకి అడుగుపెట్టారు.తారా సుతారియాలో డేటింగ్..అంతతముందు అడార్ జైన్ కొన్నేళ్ల పాటు బాలీవుడ్ భామ తారా సుతారియాతో డేటింగ్లో ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరిద్దరు పలు ఈవెంట్లతో సందడి చేశారు. 2020లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2023లో ఈ జంట విడిపోయారు. కాగా.. 2017లో ఖైదీ బ్యాండ్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అడార్ జైన్.. చివరిసారిగా హలో చార్లీ చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Aadar Jain (@aadarjain) -
మోనికా ఓ మై డార్లింగ్..!
ఢిల్లీ : మోనికా ఓ మై డార్లింగ్..! అంటూ ఇండియన్ నేవీ బృందం చేస్తున్న డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి 26న గణతంత్ర దినోవ్సత వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో విన్యాసాలు చేసేందుకు భారత నావికాదళం బృందం సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఎర్రకోట ముందు రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్ విరామ సమయంలో ఉత్సాహం, వినోదాన్ని జోడిస్తూ నేవీ బృందం మోనికా ఓ మై డార్లింగ్ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో బ్యాండ్ వాయించే నేవీ గ్రూప్ సభ్యులు మోనికా ఓ మై డార్లింగ్ సాంగ్ రిథమ్‌కు తగ్గట్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం సంబంధిత వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. Monica oh my darling ❤️ pic.twitter.com/m5XVOeRNzG— Prayag (@theprayagtiwari) January 20, 20252022లో బాలీవుడ్లో వాసన్ బాల డైరెక్షన్లో రాజ్‌కుమార్‌రావు, హ్యుమాఖురేషి, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో మోనికా ఓ మై డార్లింగ్ సినిమా క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కింది. ఈ సినిమాలో అంచిత్ థక్కర్ నేపథ్య సంగీతం డిఫరెంట్‌గా ఉంది. ఓల్డ్ మెలోడీ థీమ్‌లో సాగే మ్యూజిక్ ఆయా సన్నివేశాలకు కొత్తదనం తెచ్చింది. నేవీ బృందం డ్యాన్స్ వేసింది కూడా ఈ సినిమాలోని పాటకే. -
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిందితుడి అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు. పోలీసు కస్టడీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. -
దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియాలో క్రియేట్ చేసిన వీడియోను ఓ బాలీవుడ్ నటుడు షేర్ చేయడంతో కరీనా తాజాగా రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ మీడియాలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) గురించి చాలా కథనాలతో పాటు పలు వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సైఫ్ ఇంటి చుట్టూ నిత్యం కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా పిల్లలతో సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు. (ఇదీ చదవండి: త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల)ఈ వార్తలు చూసిన కరీనా కపూర్ ఆవేదనతో ఒక పోస్ట్ చేసింది. 'దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి' అంటూ వేడుకుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని కరీనా కోరింది. తమ ప్రకటన లేకుండా ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. ప్రస్తుతం తామె ఎంతో కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నామని పరిస్థితిని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేసింది. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది.ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన అతను తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. -
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. పారిపోవాలనుకున్నాడు
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. విదేశీయులు, పాస్‌పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్‌నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్‌లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్‌లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్‌కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్‌ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.ఎలా పట్టుకోగలిగారు? వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత దాదర్‌కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్‌పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు. బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్‌పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్‌నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్‌ను అందజేశాడు. తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్‌తో చేసిన గూగుల్‌పే లావాదేవీతో ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్‌ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్‌ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్‌లోని సైఫ్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది. -
'మగాడు కేవలం దానికోసమే'.. హీరోయిన్ టబు కథనాలపై స్పందించిన టీమ్!
హీరోయిన్ టబు తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు 50 ఏళ్లు దాటినా కూడా తనదైన గ్లామర్‌తో సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన భూత్ బంగ్లా చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోలేదు.తాజాగా ఆమె తన పెళ్లి గురించి మాట్లాడారని కొన్ని వార్తలొచ్చాయి. మగాడు కేవలం బెడ్ మీదకే మాత్రమే పనికొస్తాడని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సోషల్ మీడియాతో పాటు పలువురు వార్త కథనాలు రాసుకొచ్చారు. ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తుంటే.. మరికొందరు సమర్థించారంటూ ప్రచురించారు. ఈ నేపథ్యంలో టబుపై వస్తున్న వార్తలపై ఆమె టీమ్ ఘాటుగానే స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.ఖండించిన టబు టీమ్..ఇటీవల ఆన్లైన్లో వచ్చిన అసభ్యకర కథనాలను టబు టీమ్ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా అనేక వార్తా వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్లు వివాహంపై టబు తన అభిప్రాయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారని ప్రచురించాయి. ఈ కథనాలన్నీ కేవలం కల్పితమని వాటిలో ఎలాంటి నిజం లేదని టబు టీమ్ స్పష్టం చేసింది. ఆమె ఎప్పుడు ఇలా మాట్లాడలేదని.. కేవలం అభిమానులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నైతికి ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటనలో పేర్కొంది. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది టబు టీమ్.కాగా.. టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో భూత్ బంగ్లా చిత్రం కోసం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబోలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ గతంలో 'హేరా ఫేరీ', భాగమ్ భాగ్, గరం మసాలా, దే దానా దాన్, భూల్ భూలయ్యా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. అంతేకాదు దాదాపు 25 సంవత్సరాల తర్వాత అక్షయ్, టబుల కాంబో రిపీట్ కానుంది. వీరిద్దరూ చివరిసారిగా 'హేరా ఫేరి'లో కలిసి నటించారు.ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్, అ క్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 2, 2026న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. టబు చివరిసారిగా డూన్: ప్రొఫెసీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఆమె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. -
సైఫ్ అలీ ఖాన్‌ను గుర్తు పట్టలేదు.. డబ్బులు కూడా తీసుకోలేదు: ఆటో డ్రైవర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో.. బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్ రోడ్, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్) కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు. -
సైఫ్ అలీఖాన్‌కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
బాలీవుడ్ నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిణామాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు. ఆయన తొలుత సహ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకుని 13 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు 2004లో విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే గతంలో అమృతా సింగ్ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఆ విషయం హల్చల్ చేస్తోంది. చిత్రనిర్మాత, సూరజ్ బర్జాత్యా ఒకసారి ఒక చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్‌కి అమృతా సింగ్ నిద్రమాత్రలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్‌తో పాటు కరిష్మా కపూర్, సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే, మోహ్నీష్ బహ్ల్, టబు కీలక పాత్రల్లో నటించారు. హమ్ సాత్ సాథ్ హై సెట్స్‌లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితమైన షాట్‌ను ఖచ్చితంగా చేయడానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు. అతనికి కారణాలేమో తెలీదు కానీ అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో చాలా రీటేక్‌లు ఇవ్వాల్సి వచ్చింది.‘‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది. అందుకే ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఈ చిత్రంలోని ‘సునో జీ దుల్హన్’ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలు మార్లు రీటేక్‌లు తీసుకుంటున్నాడు. ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు. నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది’’ అంటూ సూరజ్ బర్జాత్యా గుర్తు చేసుకున్నారు.అప్పుడు ఆయన సైఫ్ అలీఖాన్ భార్య అమృతాసింగ్కు ఓ సలహా ఇచ్చాడు. ’’అతను రాత్రంతా నిద్రపోవడం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను. అదేంటంటే... సైఫ్‌కు తెలియకుండా నిద్రమాత్రలు ఇవ్వాలని. నా సలహా ను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది’’ అంటూ ఆయన చెప్పారు. దాంతో అతని సన్నివేశాలు చాలా వరకూ ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట. కేవలం ఒక్క టేక్‌లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు. దాంతో షూటింగ్లో అందరూ షాక్ అయ్యారు’’ అన్నారాయన.హమ్ సాథ్ సాథ్ హై చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతాసింగ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, అతను 2012లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు.