Tiger Shroff
-
డబుల్ ధమాకా
పంజాబీ నటి సోనమ్ భజ్వా బాలీవుడ్లో డబుల్ ధమాకా కొట్టారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, సంజయ్‌దత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. తరుణ్ మన్సుఖాని ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సోనమ్ భజ్వా. ఈ చిత్రంలో సోనమ్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకముందే మరో బాలీవుడ్ చిత్రం ‘బాఘీ 4’లో హీరోయిన్గా నటించే చాన్స్‌ను దక్కించుకున్నారు సోనమ్ భజ్వా.టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకత్వం వహించనుండగా, సంజయ్‌దత్ ఓ లీడ్ రోల్లో నటిస్తారు. ‘బాఘీ, హౌస్‌ఫుల్’.. ఈ రెండూ బాలీవుడ్లో హిట్ ఫ్రాంచైజీలే. అలాగే ఈ రెండు సినిమాలకు నిర్మాత సాజిద్ నడియాద్ వాలాయే కావడం విశేషం. ‘‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకుండానే, ‘బాఘీ 4’లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సోనమ్ భజ్వా. -
అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ మంచి మనసు చాటుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న సినిమా టెక్నీషియన్ రవి కుమార్‌కు ఆర్థిక సాయం చేశాడు. టైగర్ ష్రాఫ్ తొలి సినిమా 'హీరోపంతి'కి రవి కుమార్ ఫోకస్ పుల్లర్ (అసిస్టెంట్ కెమెరామన్)గా పని చేశాడు. తాజాగా రవి కుమార్ మాట్లాడుతూ.. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్‌తో మా అన్న ప్రసాద్ కలిసి పని చేశాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ సమయంలో మా అన్న చేయి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఆపరేషన్‌కు జాకీ సర్ సాయం చేశాడు.అప్పుడు ఆయన.. ఇప్పుడు..ఇప్పుడు ఆయన కుమారుడు నాకు సాయపడ్డాడు. నేను హీరోపంటి సినిమాకు వర్క్ చేశాను. అలా ఆయన నాకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. టైగర్ తల్లి ఆయేషా ష్రాఫ్ నాకు మంగళవారం ఫోన్ చేసి మాట్లాడింది. టైగర్ ఫస్ట్ సినిమాకు నేను పని చేశానని బహుశా తనకు గుర్తుండకపోవచ్చు. అయినా మంచి మనసుతో నన్ను ఆదుకున్నాడు అని తెలిపాడు.దాచుకుందంతా అయిపోయిందికాగా రవి కుమార్ పని చేస్తున్న పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి ఇంకా జీతం అందలేదని తెలుస్తోంది. ఓ పక్క రావాల్సిన డబ్బు ఆగిపోగా, మరోపక్క యాక్సిడెంట్ వల్ల ఎనిమిది నెలలపాటు మంచానికే పరిమితమైన పరిస్థితి! దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోవడంతో సాయం కోసం ఎదురు చూశాడు. ఇంతలోనే టైగర్ ష్రాఫ్ పెద్ద మనసుతో అతడి చికిత్సకు, ఆర్థిక అవసరాలకు సరిపడా డబ్బు సమకూర్చాడు. అది లక్షల్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.చదవండి: ఆ స్టార్ హీరోల ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను కొట్టేసిన ప్రభాస్ -
రకుల్ భర్త జాకీ భగ్నానికి అండగా నిలిచిన అక్షయ్ కుమార్
అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బడేమియా ఛోటేమియా’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీగానే నష్టాలు మిగిలాయి. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇందులో మానుషి చిల్లర్, అలయా ఎఫ్ ,ఇమ్రాన్ హష్మి, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఇందులో నటించారు.‘బడేమియా ఛోటేమియా’ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ సంస్థపై రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, ఆయన తండ్రి వాసు భగ్నానీ అనేక చిత్రాలను నిర్మించారు. కానీ, ‘బడేమియా ఛోటేమియా’ చిత్రం కోసం రూ. 350 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ కావడంతో వారికి కేవలం రూ. 110 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ నిర్మాణ సంస్థకు కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులకు కూడా పూర్తి చెల్లింపులు చేయలేకపోయింది. బాలీవుడ్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ పెద్ద మనుసు చేసుకొని తమకు అండగా నిలిచారని ఆ చిత్ర నిర్మాత కుమారుడు జాకీ భగ్నాని తాజాగా తెలిపారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వమని అక్షయ్ కోరారని ఆయన అన్నారు. అందరికంటే ఎక్కువ మొత్తం కూడా అక్షయ్ కుమార్‌కే ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయినా సరే తనను నమ్మి సినిమా తీసిన నిర్మాణ సంస్థ ఇబ్బందులో పడకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో వారి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ముందకు వచ్చారట.ఈ క్లిష్ట సమయంలో తన సహాయాన్ని అందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు జాకీ భగ్నాని కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ కుమార్ తనని ఇటీవల కలిశారని పరిస్థితి గురించి తెలియజేసిన తర్వాత ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చారని జాకీ తెలిపాడు. 'అక్షయ్ సర్ .. కష్ట సమయంలో మా వెంట నిలబడ్డారు. మా పట్ల ఆయన చూపించిన ప్రేమకు మేము చాలా కృతజ్ఞులం' అని జాకీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. హీరోకు రూ.165 కోట్ల పారితోషికం!
భారీ బడ్జెట్ సినిమాలు క్లిక్కయితే లాభాల వరద పారుతుంది.. తేడా వచ్చిందంటే మాత్రం రక్తకన్నీరు కారుతుంది. చాలా సినిమాల విషయంలో ఇది రుజువైంది కూడా! బాలీవుడ్ బ్యానర్ పూజా ఎంటర్టైన్మెంట్కు ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, తన తండ్రి వాసు భగ్నానీతో కలిసి ఈ నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు.రూ.250 కోట్ల అప్పు.. అయినా..ఈ బ్యానర్లో ఇటీవల బడే మియా చోటే మియా, గణపత్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ రూ.250 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాలకుగానూ అతడికి రూ.165 కోట్లు చెల్లించారని ప్రచారం జరుగుతోంది. అది కూడా కంపెనీపై అధిక భారానికి కారణమైందన్నది చర్చ! తాజాగా దీనిపై నిర్మాత సునీల్ దర్శన్ స్పందించాడు.అప్పట్లో సక్సెస్..మీరు అనుకుంటున్న మొత్తానికి కాస్త అటూఇటుగా హీరో టైగర్ ష్రాప్‌కు రెమ్యునరేషన్ చెల్లించాం. అయితే అదెంత అనేది బయటకు చెప్పలేను. కానీ ఓ విషయం చెప్పాలి.. 1990'స్లో వాసు భగ్నానీ.. డేవిడ్ దావణ్‌తో కలిసి అర డజను సినిమాలు చేసి సక్సెస్ రుచి చూశాడు. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి! ఇప్పుడు వారి స్ట్రాటజీలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు. అక్షయ్‌కు ఎంత ఇచ్చారన్నది మాత్రం బయటపెట్టలేదు. ఇకపోతే పూజా బ్యానర్లో అక్షయ్ కుమార్.. బడే మియా చోటే మియా, బెల్ బాటమ్, మిషన్ రాణిగంజ్, కట్‌పుత్లి సినిమాలు చేశాడు.చదవండి: -
ఓటీటీలో రూ. 350 కోట్ల బడ్జెట్ సినిమా
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది.కొన్నేళ్ల నుంచి వరుస ప్లాపులతో ఉన్న అక్షయ్‌కుమార్ ‘బడేమియా ఛోటేమియా’తో హిట్ కొట్టాలని చాలా కష్టపడ్డాడు. కానీ, ఫలితం మారలేదు. మరో డిజాస్టర్ ఆయన ఖాతాలో చేరిపోయింది. సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాకు కేవలం రూ. 90 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపిస్తే.. సానాక్షి సిన్హా ఓ కీలక పాత్రలో కనిపించింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దేశభక్తి ప్రధానంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇందులో భారీ తారాగణంతో పాటు కావాల్సినంత సాంకేతిక హంగులు, మంచి లొకేషన్లు ఉన్నాయి. యాక్షన్ సీన్స్‌లలో గన్నులు, ట్యాంకర్లు, హెలికాఫ్టర్లు అడుగడుగునా ఉపయోగించి భీకర పోరాటాలు చేసినా సరైన కథ, కథనాలు లేకపోవడంతో సినిమాకు బాగా మైనస్ అయింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న 'బడేమియా ఛోటేమియా'ను ఇంట్లోనే చూసేయండి. -
ఫిట్నెస్ ఫ్రీక్,స్టార్ కిడ్ కృష్ణ ష్రాఫ్: క్రేజీ ఫోటోస్
-
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్‌వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్‌కు తోడబుట్టింది. స్టార్ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లాగా సినిమాలను కరిర్‌గా ఎంచుకోలేదు. కానీ స్టార్ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్‌ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్‌ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్‌లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్‌పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్- ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్‌శెట్టి హోస్ట్ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది. -
రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు
బాలీవుడ్లో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే.. భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది. ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగాలేదని టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్ కాస్త పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
దిల్ సే సోల్జర్స్... దిమాక్ సే సైతాన్స్!
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన యాక్షన్ చిత్రం ‘బడే మియా చోటే మియా’. మానుషీ చిల్లర్, ఆలయ హీరోయిన్లుగా పృథ్వీరాజ్ సుకుమారన్ , సోనాక్షీ సిన్హా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. జాకీ భగ్నానీ, వసు భగ్నాని, దీప్సిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరు నువ్వు..’, ‘ప్రళయం నేను..’, ‘ప్రపంచం ఇలాంటి ఓ యుద్ధాన్ని ఇప్పటివరకూ చూసి ఉండదు. మీ దగ్గర మూడే రోజులు ఉన్నాయి. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిందే’, ‘అలాంటి ఓ సైకోని పట్టుకోవాలంటే ... ఆ సైకోను మించి సైకోలుగా మేం మారాల్సిన అవసరం ఉంది’, ‘దిల్ సే సోల్జర్స్.. దిమాక్ సే సైతాన్స్ హై ఓ’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే ఓ సైకో సైంటిస్ట్‌ను ఇద్దరు భారత సోల్జర్స్ ఏ విధంగా అడ్డుకున్నారు? అన్నదే ఈ చిత్రకథ. -
యాక్షన్ లవర్స్ గెట్ రెడీ.. 'బడే మియా చోటే మియా' వచ్చేస్తున్నారు!
ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘బడే మియా చోటే మియా’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కళ్ళు చెదిరే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు.భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. REAL ACTION ka ek bada dose lekar aa rahe hain #BadeMiyanChoteMiyan!#BadeMiyanChoteMiyanTrailer out on March 26! 👊 🤜🤛 IN CINEMAS ON 10th APRIL! #BadeMiyanChoteMiyanOnApril10 #BadeMiyanChoteMiyanOnEid2024 pic.twitter.com/Wzw1BbpwYf — Akshay Kumar (@akshaykumar) March 23, 2024 -
IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. జోష్‌గా స్టెప్పులేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. 𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO — IndianPremierLeague (@IPL) March 22, 2024 𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️ Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU — IndianPremierLeague (@IPL) March 22, 2024 💃🕺 Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPL pic.twitter.com/jVnlskQKQj — IndianPremierLeague (@IPL) March 22, 2024 అనంతరం సోనూ నిగమ్ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మా తుజే సలాంతో గూప్‌బంప్స్ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్ చౌహాన్ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్ బర్సోరే సాంగ్‌తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది. 𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog — IndianPremierLeague (@IPL) March 22, 2024 బీసీసీఐ బాస్‌లు, కెప్టెన్ల ఆగమనం వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు. ఆ తర్వాత ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. -
నాకు సిగ్గబ్బా.. 25 ఏళ్లవరకు ఎవరినీ ప్రేమించలేదు: హీరో
యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇతడు ప్రస్తుతం బడే మియా చోటే మియా (పెద్దోడు.. చిన్నోడు) అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్‌తో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా రంజాన్‌కు రిలీజ్ కానుంది. ఇకపోతే టైగర్ చేతిలో బాఘీ 4 కూడా ఉంది. 25 ఏళ్ల వయసులో లవ్.. ఈ మూవీ థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ గ్రాండ్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ వేదికపై టైగర్‌పై జోకులు పేల్చాడు హీరో వరుణ్ ధావన్. ముందుగా యాక్షన్ హీరో మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, కలిసిపోనని నీకు తెలుసుగా వరుణ్. అందరితో కలివిడిగా ఉండలేను. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు అని చెప్పాడు. ఫస్ట్ లవ్.. ఆమె కాదా? అయితే వరుణ్ మాత్రం.. నిజంగానా? 25 ఏళ్లవరకు నీకు ప్రియురాలే లేదా? అని ఆశ్చర్యపోయాడు. అవును, నాకు పాతికేళ్లు నిండాక.. తొలి సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అంటే నీ ఫస్ట్ మూవీ హీరోయిన్ కృతి సనన్‌నే కదా నువ్వు మొదటిసారి ప్రేమించింది? అని అడిగాడు. ఆమె పేరు చెప్పగానే షాకైన టైగర్.. కాదు.. ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్.. సరే, నేను సరదాగా అన్నాను. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే! ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోకండి అని చెప్పాడు. దిశాతో డేటింగ్- బ్రేకప్ కాగా టైగర్ ష్రాఫ్- దిశా పటానీ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య విడిపోయారని రూమర్స్ రాగా ఇటీవల మాత్రం ఓ ఈవెంట్లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం అతడు నిరాకరించాడు. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరు కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Tiger talks about Disha and that she is his first gf and how he met her Varun: Kriti Sanon 😒🤣#KritiSanon pic.twitter.com/JSVtwZ3Dg1 — kariti_arab (@aaryan_koki) March 19, 2024 చదవండి: అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్‌పై ధనుష్ కామెంట్ -
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
బడే మియా ఛోటే మియా మూవీ టీజర్
-
'మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం..' బాలీవుడ్ మూవీ టీజర్ చూశారా?
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. ఇందులో అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్లో రిలీజ్ డేడ్ను కూడా ప్రకటించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్‌లో బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కానుంది. టీజర్ రిలీజ్ గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. "ప్రళయం రాబోతోంది.. ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను మార్చేస్తుంది... ఆ మహా ప్రళయం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలను శాశ్వతంగా నిర్ములిస్తుంది. హిందుస్తాన్ నాశనమైపోతుంది. మమ్మల్నెవరు ఆపుతారు? అన్న డైలాగ్ వినిపిస్తుంది. మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం.. సరిగ్గా అప్పుడే రంగంలోకి దిగిన ఇద్దరు హీరోలను చూపిస్తారు. 'సైనికుడి వీరత్వం, సైతాన్ క్రూరత్వం మా సొంతం. మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం' అనే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
రంజాన్‌కు పెద్దోడు.. చిన్నోడు...
రంజాన్‌కు థియేటర్స్‌కు వస్తున్నారు ‘బడే మియా చోటే మియా’ (పెద్దోడు.. చిన్నోడు). అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘బడే మియా చోటే మియా’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షీ సిన్హా, మానుషీ చిల్లర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీలో ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్కాట్లాండ్, యూఎస్, ఇండియా, లండన్ వంటి లొకేషన్స్‌లో కొంత భాగం చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు, ఈ ఏడాది రంజాన్ సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రపంచం అంతం అవుతుందన్నప్పుడు మా హీరోలు మాత్రం రైజ్ అవుతుంటారు’ అనే క్యాప్షన్‌ని ఈ పోస్టర్‌కు జత చేశారు. -
ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!
దసరా సందర్భంగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటితో పాటే సందట్లో సడేమియా అన్నట్లు బాలీవుడ్ నుంచి 'గణపథ్' మూవీ కూడా రిలీజైంది. ట్రైలర్ రిలీజ్ కాగానే దీన్ని ప్రభాస్ 'కల్కి'తో దీన్ని పోల్చారు. తీరా చూస్తే డిజాస్టర్ కా బాప్ అనేలా టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ అయితే ఘోరం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) 'గణపథ్' కథేంటి? అది 2060 సంవత్సరం. ప్రపంచం రెండుగా విడిపోయుంటుంది. సిల్వర్ సిటీలో కేవలం ధనవంతులే ఉంటారు. ఇక్కడ మనుషుల కంటే రోబోలు, డ్రోన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. గరీబొంకి బస్తీలో పేదవాళ్లు మాత్రమే ఉంటారు. తమని కాపాడేందుకు గణపథ్ వస్తాడని వేయి కళ్లతో వీళ్లు ఎదురుచూస్తుంటారు. అయితే డబ్బునోళ్ల వైపు ఉన్న గణపథ్(టైగర్ ష్రాఫ్).. పేదవాళ్లవైపు ఎలా వచ్చాడు? అనేదే స్టోరీ. ఎలా ఉంది? ఈ డైరెక్టర్ ఎవడో గానీ సినిమాతో ప్రేక్షకులకు నరకం అంటే చూపించాడు. ట్రైలర్ చూసి అందరూ 'కల్కి'తో పోలికలు ఉన్నాయన్నారు గానీ అంత సీన్ లేదు. హాలీవుడ్ హిట్ మూవీస్ అయిన మ్యాడ్ మాక్స్, డ్యూన్, ఎలిసియం లాంటి సినిమాల్ని 'గణపథ్' కోసం డిటోకి డిటో దర్శకుడు కాపీ కొట్టేశాడు. అమితాబ్ లాంటి స్టార్‌ని ఒక్క శాతం కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక హీరో అయితే బాడీ ఉంది కదా అని అవసరమున్నా లేకపోయినా చూపిస్తూనే పోయాడు. అది అయితే చిరాకు తెప్పించింది. ఓవరాల్ గా థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకుడు.. చివరివరకు కూర్చుంటే గ్రేట్ అనేంత డిజాస్టర్ కా బాప్, పెద్ద కళాఖండం ఈ సినిమా. ఇకపోతే తొలిరోజు రూ 2.5 కోట్లు వచ్చాయి. టైగర్ ష్రాఫ్ కెరీర్ లో ఇది చాలా తక్కువ. అలా కూడా చెత్త రికార్డ్ సెట్ చేశాడీ హీరో. (ఇదీ చదవండి: నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!) -
కొత్త బాయ్ ఫ్రెండ్‌తో స్టార్ హీరోయిన్.. అతడిని వదిలేసి!?
స్టార్ హీరోయిన్ దిశా పటానీ తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎందుకంటే తనతో పాటు కలిసి నటించిన ఓ హీరోతో ఈమె గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు తెగ రూమర్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మరో వ్యక్తితో కలిసి పార్టీలో కనిపించడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరతడు? ముంబయి బ్యూటీ దిశా పటానీ.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్, స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్‌తో ఈమె చాలాకాలం నుంచి రిలేషన్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. (ఇదీ చదవండి: నటి పవిత్ర లోకేష్‌కు బిగ్ షాక్...) ఎందుకంటే 2018లో 'భాఘీ 2' వచ్చింది. దీని తర్వాత దిశా-టైగర్ కలిసి ఒక్క సినిమా మాత్రమే చేశారు. కానీ పార్టీలు-పబ్బులు-ఈవెంట్స్ అని ఎక్కడి పడితే అక్కడ కనిపించేవారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూస్తే ఎవరికైనా సరే డేటింగ్ చేస్తున్నారా అనిపించేది. అలాంటిది వీళ్లకు బ్రేకప్ అయిందని గతేడాది రూమర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత పలు సందర్భాల్లో టైగర్.. దిశా తనకు ఫ్రెండ్ లాంటిదని చెప్పుకొచ్చాడు. అయితే దిశా-టైగర్ ష్రాఫ్ విడిపోలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాంటిది దిశా ఇప్పుడు అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో ఓ పార్టీలో కనిపించింది. అతడిని తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఆమె.. కొత్త బాయ్ ఫ్రెండ్ అని కన్ఫర్మ్ చేసేసిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి టైగర్ పరిస్థితి ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. దిశా కొత్త బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఎవరో కాదు టైగర్ ఫిట్నెస్ కోచ్. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్) -
జర్మన్ కారు కొనుగోలు చేసిన టైగర్ ష్రాఫ్ - ధర అక్షరాలా..
Tiger Shroff BMW: బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'టైగర్ ష్రాఫ్' (Tiger Shroff) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆయన ఇటీవల జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, టైగర్ ష్రాఫ్ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ సెడాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మూవీజ్ అడ్డా అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఇందులో కారుని స్పష్టంగా చూడవచ్చు. టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ 330 ఎల్ఐ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 258 పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. (ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!) డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, 190 పీఎస్ పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో గంటాకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతంగా అవుతుంది. ఈ లగ్జరీ సెడాన్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్స్ లభిస్తాయి. -
గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!
బాలీవుడ్ బ్యూటీ, దిశా పటానీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిశా పటానీ తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. అయితే గతంలో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఈ బాలీవుడ్ బ్రేకప్ చెప్పేసుకుంది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న టైగర్ ష్రాఫ్ తాను సింగిల్‌గానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇది చదవండి: దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ) అయితే తాజాగా ఓ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశా పటానీ, ఆమె మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ జంటగా కనిపించారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కు ఈ మాజీ లవర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు దిశా, టైగర్ మళ్లీ కలిసిపోయారంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా దిశా పటానీ విష్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ లవర్‌కు విషెస్ చెప్పింది. కాగా.. దిశా పటాని ప్రస్తుతం యోధా, కంగువా, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ గణపత్, బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) Tiger and Disha together again 😍#TigerShroff #DishaPatani pic.twitter.com/LrThURuSgO — $@M (@SAMTHEBESTEST_) July 2, 2023 Disha Patani with Tiger Shroff @DishPatani @iTIGERSHROFF #DishaPatani #TigerShroff pic.twitter.com/gChdDXIVS7 — Disha Patani Fan Club ❤️ (@satyam20157) July 1, 2023 View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
స్టార్ హీరో ప్రేమ వ్యవహారంపై క్లారిటి ఇచ్చిన తల్లి
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ లవ్‌లో ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఈ జంట ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్ బర్డ్స్.. కానీ బ్రేకప్ చెప్పుకున్నారంటూ బీటౌన్‌లో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. వారిద్దరూ మౌనంగా ఉన్నప్పటికి, టైగర్ తల్లి అయేషా ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో క్లారటీ ఇచ్చింది. టైగర్, దిశా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పుడల్లా తాను నవ్వుకుంటానని, సరదాగా ఉంటుందని వెల్లడించింది. (చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్ ఎంగేజ్మెంట్? ) అంతేకాక దిశాతో టైగర్ డేటింగ్ అనేది నిజం కాదా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ‘దిశతో టైగర్ డేటింగ్ అనే దాంట్లో వాస్తవం లేదు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఆ రూమర్‌ని నమ్మొద్దు. దిశాతో నాకు కూడా మంచి స్నేహం ఉంది’ అని అయేషా చెప్పుకొచ్చింది. (చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ ) ఇక టైగర్ నటించిన సినిమాల్లో వార్, హీరోపంతి2 సినిమాలంటే ఇష్టమని తెలిపింది. దిశా పటానీకి టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా తనూ వెళ్తూ ఉంటుంది. ఇలా చక్కగా వారి కుటుంబంతో కలిసిపోయేది. కానీ ఈ రూమర్స్ వల్ల ప్రస్తుతం దూరంగా ఉంటుందని టాక్. ఏదేమైనా బాలీవుడ్లో చూడచక్కని ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. పుకార్లను పక్కన పెడితే వీరు సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు. -
షూటింగ్లో ప్రమాదం.. గాయపడ్డ స్టార్ హీరో అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ గాయపడ్డారు. షూటింగ్ సెట్లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా అనుకోకుండా అక్షయ్‌కు గాయమైంది. ప్రస్తుతం అక్షయ్ స్కాట్లాండ్లో బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో భాగంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టంట్ సీన్ చేస్తుండగా అక్షయ్ మోకాలికి గాయమైంది. అయినప్పటికీ అక్షయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించడం విశేషం. గాయం తీవ్రత అంతగా లేకపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. కాగా టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్, టైగర్లతో పాటు సోనాక్షి సిన్హా ఇందులో నటిస్తుంది. ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు మూవీ టీం స్కాట్లాండ్కు పయనమయ్యారు. -
ఫారిన్ స్టోరీ.. బాలీవుడ్ మూవీ
విదేశీ కథలపై హిందీ దర్శక–నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు పది విదేశీ చిత్రాలు రీమేక్ రూపంలో హిందీ తెరపై కనిపించనున్నాయి. ఆ ఫారిన్ చిత్రాల్లోని కథలు ఇండియన్ ఆడియన్స్‌కు దగ్గరగా ఉండటంతో రీమేక్ చేస్తున్నారు. ఇక ఫారిన్ స్టోరీతో రీమేక్ అవుతున్న బాలీవుడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. స్పానిష్ స్పోర్ట్స్ అండ్ కామెడీ డ్రామా ‘చాంపియన్స్’ (2018) హిందీ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా కోసం ఆమిర్, సల్మాన్‌లు కలిసి చర్చించుకున్నారు. ఈ చిత్రానికి ఆమిర్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనుకుంటున్నారట. ఒకవైపు ఈ రీమేక్ గురించి చర్చిస్తూనే మరోవైపు సౌత్ కొరియన్ డిటెక్టివ్ డ్రామా ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ దర్శక –నిర్మాత అతుల్ అగ్ని హోత్రి దక్కించుకున్నారు. ఇక అమెరికన్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్’ (2015) హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఈ రీమేక్‌కి అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ సినిమా నుంచి దీపికా తప్పుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే షూటింగ్ ఆరంభించలేదని టాక్. కాగా, ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ట్రాన్స్పోర్టర్’ (2002) హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు నిర్మాత విశాల్ రానా. ఇందులో హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్లలో ఎవరో ఒకరు నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే అమెరికన్ సూపర్‌హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ర్యాంబో’ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్నారని ప్రకటన వచ్చిoది. ఇక షాహిద్ కపూర్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘బ్లడీ డాడీ’ అనే సినిమా రూపొందుతోంది. ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ ‘స్లీప్‌లెస్ నైట్’ (2011)కు రీమేక్ అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అదే విధంగా సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్’ (2011) హిందీ రీమేక్‌లో సోనమ్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘కోడ’ (2021) రీమేక్‌ను దర్శకుడు విశాల్ బాల్ తెరకెక్కించనున్నారని, అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ (2003) రీమేక్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా విదేశీ చిత్రాల హిందీ రీమేక్ జాబితాలో మరికొన్ని కూడా ఉన్నాయి. -
ఆ ముగ్గురిలో ప్రభాస్‌నే పెళ్లాడతా.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మొదటిసారి ప్రభాస్‌తో నటిస్తోంది భామ. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్‌తో నటించడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిది ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్ నటి కావడంతోనే కృతిసనన్ బాగా ఫేమస్ అయింది. (చదవండి: ఆది పురుష్ ఆలస్యానికి అసలు కారణం అదే.. కృతి సనన్ కామెంట్స్ వైరల్) దీంతో ఆమె గతంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో ముద్దుగుమ్మ షాక్‌కు గురైంది. అవకాశం వస్తే ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్.. ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అలాగే ఫ్లర్ట్ కూడా' అంటూ దిమ్మతిరిగే ప్రశ్న అడిగారు. దీనికి కృతి సమాధానమిస్తూ.. 'కార్తిక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్, టైగర్‌తో డేటింగ్. ఇక ప్రభాస్‌తో పెళ్లి' అని నవ్వుతూ సమాధానమిచ్చింది ఆదిపురుష్ భామ. ప్రస్తుతం ఆమె భేదియా(తోడేలు) ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్ గురించి కృతిసనన్ మాట్లాడారు. ఆయనే తన అభిమాన నటుడని, షూట్ సమయంలో భాషాపరంగా సాయం చేశారని చెప్పారు. రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నారు. If ever get a chance I will marry #Prabhas. -@kritisanon ❤ Ok ika fix aipondi North Vadina ani 🥳🥳🥰 #Prakrithi pic.twitter.com/Q67ppL7WIy — Dps Nayak™ 💔 (@NayakTweetz) November 25, 2022 -
ఆ హీరో చేసిన పనికి ఆగిపోయిన రష్మిక సినిమా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్‌తో రష్మిక క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. సౌత్ సహా నార్త్‌లోనూ వరుస ఆఫర్లతో యమ బిజీగా అయిపోయింది ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న రష్మికకు గట్టి షాక్ తగిలింది. ఆమె నటిస్తున్న సినిమా ఆగిపోయినట్లు సమాచారం. ఇంతకీ ఏమైందంటే.. టైగర్ ష్రాఫ్‌తో కలిసి రష్మిక 'స్క్రూ ఢీలా' అనే చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం టైగర్‌కు రూ 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేశాడు. అయితే షూటింగ్ మొదలయ్యాక టైగర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని కరణ్ అతన్ని కోరాడట. ప్రస్తుతం బాలీవుడ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున పారితోషికం కింద రూ.20కోట్లు తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవాలని కరణ్ అడిగాడట. ఇందుకు ఇందుకు టైగర్ ససేమీరా అనడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు బీటౌన్ టాక్. దీంతో టైగర్ చేసిన పనికి రష్మికకు కూడా మంచి ఛాన్స్ మిస్సయినట్లైంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: 'ఆంటీ' అంటూ ట్రోలింగ్.. పోలీస్ కంప్లైట్ ఇచ్చిన అనసూయ