ముంబై : బాలీవుడ్ ప్రేమ జంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు విడిపోయారని జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీలు, ఈవెంట్లలో సన్నిహితంగా మెలగడంతోపాటు దీర్ఘకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరి బ్రేకప్ బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. గత కొద్ది వారాలుగా వీరిద్దరి మధ్య చెడిందని, ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఇప్పుడది అధికారికంగా బ్రేకప్‌కు దారితీసిందని ఇద్దరికీ సన్నిహితంగా మెలిగేవారు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి.
గతంలోనూ వారిద్దరూ స్నేహితులే తప్ప అంతకుమించిన బంధం ఏమీ లేదని, అలాంటప్పుడు ఇక బ్రేకప్‌కు అవకాశం ఏముందని వారి సన్నిహితులు ప్రశ్నిస్తున్నట్టు ఓ వెబ్‌సైట్ పేర్కొంది. దిశా, టైగర్‌లు తొలిసారిగా మ్యూజిక్ వీడియో బేఫిక్రాలో తొలిసారిగా తెరను పంచుకోగా, బాగి-2లో కలిసి నటించారు. దిశా పటానీ సల్మాన్ సరసన భారత్‌లో ఆడిపాడారు. ఇక టైగర్ ష్రాఫ్ చివరిసారిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో సందడి చేయగా, హృతిక్ రోషన్‌తో పాటు సిద్ధార్ధ్ ఆనంద్ మూవీలో కనిపించనున్నారు. ఇక బాగీ 3ని చేయాలని కూడా టైగర్ ష్రాఫ్ సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment