ఇక హృతిక్ రోషన్ 'వార్' సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో లీడ్ క్యారక్టర్స్‌లో నటించిన హృతిక్, టైగర్ ష్రాఫ్‌ల నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా హృతిక్ తన లుక్స్, బాడీ ఫిజిక్, యాక్షన్ సీన్స్‌తో యూత్‌కు పిచ్చెక్కించాడు. ఇక టైగర్ ష్రాఫ్ చేసిన యాక‌్షన్ సీన్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
అలాగే వార్ సినిమా కోసం హృతిక్ రోషన్ తన బాడీనీ మేకోవర్ చేసిన విధానాన్ని 'కబీర్ ట్రాన్స్‌పార్మేషన్ ఫర్ వార్' పేరుతో వీడియో రూపంలో సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన బాడీ ఫిజిక్‌ను మార్చుకోవడానికి హృతిక్ భారీ కసరత్తులే చేయాల్సి వచ్చింది. తాజాగా వార్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బాస్టర్ రన్‌ను కొనసాగిస్తుడంతో ఆ కష్టాన్ని మరిచిపోయేలా చేసింది.