Hrithik Roshan
-
ఢీ అంటే ఢీ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మాసీ సాంగ్‌ను ముంబైలో వేసిన ఓ సెట్లో చిత్రీకరించారని బాలీవుడ్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.డిసెంబరు రెండో వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో హృతిక్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్యా చో్రపా నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!
చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు స్లిమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. అలాగే ఆరోగ్యంపై సరైన అవగాన కల్పిస్తున్నారు కూడా. కొంతమంది వారిని ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గుతున్నారు కూడా. ఇప్పుడు తాజాగా అదే కోవలోకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా కూడా చేరిపోయారు. కిలోల కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సునైనా వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ కుమార్తె సునైనా బొద్దుగా అందంగా ఉండేది. చాలమందికి తెలుసు ఆమె చాలా లావుగా ఉంటుందని. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతలా స్లిమ్‌గా మారిపోయింది. దాదాపు 50 కిలోలు బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆమెకు కామెర్లు వంటి ఆరోగ్య సమస్యలున్నప్పటికీ విజయవంతంగా బరువు తగ్గినట్లు వెల్లడించిది. నిజానికి ఆమె గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్‌తో పోరాడుతోంది. ఆమె ఇన్ని అనారోగ్య సమస్యలను అధిగమించి మరీ..బరువు తగ్గేందుకు ఉపక్రమించడం విశేషం. తన అనారోగ్య భయమే తనను సరైన ఆహారం తీసుకునేలా చేసిందంటోంది సునైనా. తాను పూర్తిగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. "సరైన జీవనశైలితో కూడిన ఆహారం కామెర్లు సమస్యను తగ్గుముఖం పట్టేలా చేసింది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. తన తదుపరి లక్ష్యం పూర్తి స్థాయిలో ఫ్యాటీలివర్ని తగ్గిచడమే". అని ధీమాగా చెబుతోంది సునైనా View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) ఫ్యాటీ లివర్‌తో బరువు తగ్గడం కష్టమా..?ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఆ సమస్యతో ఉండే వ్యక్తులు బరువు తగ్గడం అనేది అంత ఈజీ కాదు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది జీవక్రియ చర్యలకు అంతరాయం కలిగించి బరువు పెరిగేలా చేస్తుంది. పైగా దీర్ఘకాలిక మంట, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీసి కండరాల పనితీరుని, శరీరంలోని శక్తి స్థాయిలను తగ్గించేస్తుంది. ఫలితంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..) -
ఐ యామ్ లెజెండ్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం 2025 ఆగస్టు 15న విడుదల కానుంది. కాగా ‘వార్ 2’ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమా చేస్తారనే మాట కొన్నిరోజులుగా బాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఐ యామ్ లెజెండ్’ (2007) రీమేక్ హక్కులను హృతిక్ రోషన్ దక్కించుకున్నారని బీటౌన్ సమాచారం. దీంతో ఈ సినిమా హిందీ రీమేక్‌లో హృతిక్ తొలుత నటిస్తారని, ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని టాక్. -
యుద్ధానికి సిద్ధం
‘వార్’కి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్‌తో ఆయన యుద్ధం చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర:పార్ట్ 1’ గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ‘దేవర’ రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక నెల విరామం తీసుకుని రెండో భాగం పనులు మొదలు పెట్టమని కొరటాల శివకి ఎన్టీఆర్ సూచించారట.ఇక ఎన్టీఆర్ మాత్రం ‘వార్ 2’ చిత్రం షూట్లోపాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ తదితరుల కాంబినేషన్లో ‘వార్ 2’ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్.ఇప్పటికే అటు ముంబై ఇటు హైదరాబాద్ షెడ్యూల్స్‌లో హృతిక్–ఎన్టీఆర్‌లపై కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించారు మేకర్స్. అయితే ‘దేవర:పార్ట్ 1’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ‘వార్ 2’ షూట్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. దసరా పండగ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య క్లైమాక్స్ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. -
డ్యాన్స్ టైమ్
ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తారు. మరి... ఈ ఇద్దరూ కలిసి ఓపాటకు డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ అనే స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓపాట ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఈపాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్ టు డ్యాన్స్ అంటూ... ఈ నెల మూడో వారంలో ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో ఈపాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ ఈ సాంగ్‌కు స్టెప్స్ సమకూర్చనున్నారని భోగట్టా. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
ఆలియా ‘ఆల్ఫా’లో అతిథిగా స్టార్ హీరో!
ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’. శివ్ రవైల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీని ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్లో జరుగుతోంది. ఆలియా, శార్వరీ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఓ అతిథి పాత్ర చేయనున్నారని, ఆయన పాత్ర తాలూకు సన్నివేశాల చిత్రీకరణను కూడా ఈ షూటింగ్ షెడ్యూల్లోనే ప్లాన్ చేశారని బాలీవుడ్ టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్
హీరోహీరోయిన్లు అనగానే.. వాళ్లకేంటి బోలెడన్ని డబ్బులున్నాయని అనుకుంటారు. అది నిజమే కానీ కొందరు హీరోయిన్లు చాలావరకు అద్దెకు ఉంటుంటారు. మన దగ్గర చాలామందికి సొంతిళ్లు ఉంటాయి. బాలీవుడ్లో మాత్రం రెంట్ కల్చర్ ఎక్కువే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అదే ఫాలో అయిపోయింది. స్టార్ హీరో ఇంటిని అద్దెకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్)ప్రభాస్ 'సాహో'లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా కపూర్.. తాజాగా 'స్త్రీ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదలా పక్కనబెడితే శ్రద్ధా.. ఇప్పుడు ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న హీరో హృతిక్ రోషన్ ఇంటిని అద్దెకు తీసుకునే ప్లాన్‌లో ఉందట. బీచ్‌కి ఎదురుగా ఉంటే ఈ బిల్డింగ్‌లో హీరో అక్షయ్ కుమార్ అపార్ట్మెంట్ ఉండటం విశేషం.శ్రద్ధా కపూర్ ఇల్లు మారడానికి కారణం ఉంది. 1987లో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్.. జుహూలోనే ఓ ఇంటిని కొన్నారు. దాన్ని ఇప్పుడు కాస్త విస్తరించి రీ మోడలింగ్ చేయాలనుకుంటున్నారు. అందుకే వేరే ఇంట్లో కొన్నాళ్ల పాటు అద్దెకు ఉండాలి. అలా ఇప్పుడు హృతిక్ ఇంట్లోకి శ్రద్ధా కపూర్ రానుందనమాట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
హృతిక్ రోషన్‌తో ‘జీప్’ ప్రచార కార్యక్రమం
హైదరాబాద్: కార్ల తయారీ సంస్థ ‘జీప్ ఇండియా’ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో కలిసి నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా జీప్ రాంగ్లర్ అత్యుత్తమ ప్రదర్శన, ఆకర్షణీయ ఫీచర్లను కస్టమర్లకు తెలియజేయనుంది.‘వన్‌అండ్‌ఓన్లీ’ ట్యాగ్‌లైన్ తగ్గట్లు సాటిలేని ప్రమాణాలతో వాహనాలను రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అత్యుత్తమ స్థాయిని చేరుకోవడమే కాకుండా, ఈ స్థాయిని నిలుపుకునేందుకు నిరంతరం శ్రమిస్తామని జీప్ ఇండియా ప్రకటించింది. హృతిక్ రోషన్‌ను జీప్ సంస్థ ఇటీవలే తమ బ్రాండ్ పార్ట్నర్గా నియమించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హృతిక్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
హైదరాబాద్‌లో యుద్ధం
హైదరాబాద్‌లో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్. వారిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోగా దూసుకెళుతున్న ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మూవీపై ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.ముంబై, గోవాతో పాటు విదేశాల్లోనూ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ముంబై షెడ్యూల్లో ఎన్టీఆర్–హృతిక్ రోషన్ పాల్గొన్నారు. కాగా ‘వార్ 2’ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో భారీ బడ్జెట్‌తో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారు.ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్–హృతిక్‌లపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట. ఇంటర్వెల్లో వచ్చే ఈ ఫైట్ సినిమాలో ఓ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ ని యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదలకానుంది. కాగా 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. -
విడాకుల తర్వాత మరొకరితో లవ్.. సంతోషంగా ఉందన్న తల్లి
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుజానే ఖాన్.. చిన్ననాటి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు కలిసున్నారు. పరిస్థితులు తారుమారవడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. హృతిక్ మరో హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపించడం వల్లే ఈ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.విడాకుల తర్వాత ప్రేమలో..అయితే విడాకులు తర్వాత ఇద్దరూ శత్రువుల్లా మారిపోకుండా పిల్లల కోసం ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అలాగని ఒంటరిగానూ మిగిలిపోలేదు. అటు హృతిక్.. నటి సబా ఆజాద్‌తో ప్రేమలో పడగా ఇటు సుజానే.. నటుడు అర్స్‌లన్ గోనిని లవ్ చేస్తోంది. తాజాగా సుజానే ప్రేమాయణం గురించి ఆమె తల్లి జరీన్ మాట్లాడింది. సుజానే పార్ట్నర్ అర్స్‌లన్ న్యాయవిద్యను అభ్యసించాడు. జమ్ములో పేరున్న రాజకీయ కుటుంబానికి చెందినవాడు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టం. పెళ్లి చేసుకోవాలనేం లేదునటనారంగంలోనూ తను రాణించాలని ఆశిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులు కూడా ఎంతో మంచివారు! సుజానే, అర్స్‌లన్ కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒకరితో మనకు సంతోషం దక్కుతుందంటే మంచిదే కదా.. అలా అని పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం కంటిన్యూ అవుతుందనేం లేదు. అర్స్‌లన్, సుజానేలు వారి కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. వారిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.చదవండి: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో! -
హృతిక్ రోషన్ అలా చేస్తాడనుకోలేదు: బాలీవుడ్ నటుడు
డబ్బులిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధం అనేవాళ్లు చాలామంది! స్టార్ హీరోలు కూడా ఇందుకు అతీతం కాదు. కోట్లాది రూపాయలు ఆశ చూపిస్తే చాలు.. పాన్ మసాలా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో కనిపిస్తారు. అవి మంచివి కావని తెలిసినా యాడ్స్‌లో నటించి జనాలను ఎంకరేజ్ చేస్తారు. ఈ ధోరణి అస్సలు మంచిది కాదంటున్నాడు ప్రముఖ నటుడు గోవింద్ నాందేవ్.హృతిక్ రోషన్ అంటే అభిమానంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నటీనటులు బాధ్యతగా వ్యవహరించాలి. కొత్త జనరేషన్‌కు వారొక దిక్సూచీలా ఉండాలి. అభిమానులను పెడదారి పట్టించే పనుల జోలికి వెళ్లకూడదు. నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం.. తనపై ఎంతో అభిమానగౌరవం ఉండేది. కానీ చివరకు తను కూడా గుట్కా యాడ్‌లో కనిపించాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అది చూసి నాకు తల తిరిగిపోయింది. ఈయన ఎందుకిలాంటివి చేస్తున్నాడనిపించింది. అది తప్పు కాదా?యాడ్‌లో గుట్కా, బెట్టింగ్ మంచిదేనని హీరోలు పొగిడితే జనాలు అవి అలవాటు చేసుకోరా? అనుకరించరా? ప్రజలను తప్పుదారి పట్టించకుండా నటులు బాధ్యతగా ఉండొచ్చు కదా! జనాల వల్లే హీరోలుగా అందనంత ఎత్తులో ఉన్నప్పుడు వారికి హాని చేసేవాటిని ఎంకరేజ్ చేయడం తప్పు కాదా? అని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇప్పటికీ బాధపడుతున్నా20 ఏళ్ల క్రితం తనకంత అవగాహన లేక ఓ పాన్ మసాలా యాడ్‌లో నటించానని, అందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు గోవింద్ నాందేవ్ తెలిపాడు. అప్పట్లో నటుడిగా బాధ్యతగా వ్యవహరించాలన్న జ్ఞానం లేకపోవడం వల్లే సదరు ప్రకటనలో కనిపించానన్నాడు. తర్వాత అలాంటి తప్పు మళ్లీ ఎన్నడూ రిపీట్ చేయలేదన్నాడు.చదవండి: దీనస్థితిలో నటుడు.. ఆదుకున్న కమెడియన్.. -
మాజీ ప్రియురాలికి సపోర్ట్ చేసిన స్టార్ హీరో
హీరోయిన్ కంగనా రనౌత్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్ అనే పదమే. కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్ చేసింది గానీ తర్వాత తర్వాత మూవీస్ కంటే వివాదాల వల్లే పేరు తెచ్చుకుంది. రీసెంట్గా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించింది. కానీ గెలిచిన తర్వాత రోజే ఈమెకు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి కంగన చెంప చెళ్లుమనిపించింది. ఈ విషయమై సోషల్ మీడియాలో భిన్నాబిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)గతంలో ఖలీస్థానీ ఉద్యమం గురించి కంగన చేసిన కామెంట్స్ వల్ల సదరు మహిళా అధికారి కంగన చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు మహిళా అధికారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలైన అలియా భట్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ తదితరులు మాత్రం కంగనకు జరిగిన అవమానంపై తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కంగనకు అండగా నిలబడుతున్నారు.మిగతా వాళ్ల సంగతేమో గానీ తాజాగా సీఐఎస్ఎఫ్ అధికారికి వ్యతిరేకంగా పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కంగన-హృతిక్ ప్రేమించుకున్నారు. పరిస్థితులు అనుకూలించక విడిపోయారు. మధ్యలో పోలీస్ కేసుల వరకు వెళ్లారు. అలాంటిది ఇప్పుడు మాజీ ప్రియురాలికి పరోక్షంగా హృతిక్ సపోర్ట్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్) -
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
-
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
బాలీవుడ్‌నూ మడతెట్టేశాడుగా.. దటీజ్ తారక్
-
షూటింగ్... పార్టీయింగ్...
ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’ షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్‌తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. ‘ఎన్టీఆర్ సార్.. ఈ రోజు నా బర్త్ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్. ఇక హిందీలో ‘వార్ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. -
హిందీ వార్‌లో హాలీవుడ్ యాక్షన్
బాలీవుడ్ ‘వార్ 2’లో హాలీవుడ్ తరహా యాక్షన్ కనిపించనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట మేకర్స్. ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేశారని బాలీవుడ్ సమాచారం. ఇక ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేశారు స్పిరో. కాగా స్పై జానర్లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. -
వార్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. కొత్త లుక్ ఫోటోలు వైరల్
బాలీవుడ్ ‘వార్’లో అడుగుపెట్టేశారు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయనే విషయం తెలిసిందే.. హృతిక్‌రోషన్‌కు సంబంధించిన చాలా సీన్లు మేకర్స్ చిత్రీకరించేశారు. తాజాగా తారక్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో తారక్ పాల్గొననున్నారు. వార్2 కోసం ఎన్టీఆర్ 60రోజులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హృతిక్, తారక్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిద్దరు కలిసి మొత్తంగా 30 రోజుల పాటు కలిసి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ పనులతో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. 2024 అక్టోబర్ 10న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తారక్ వచ్చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియాలో తారక్ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by ɴᴛʀ ғᴀɴs ᴄʟᴜʙ™ (@ntrloversoffl) -
వార్‌కు రెడీ!
బాలీవుడ్ ‘వార్’కు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ మొదలైందని, హృతిక్‌రోషన్ పాల్గొనగా కొంత చిత్రీకరణ కూడా జరిపారని టాక్. కాగా ఈ వారంలో ‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట అయాన్ ముఖర్జీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఈ సారి హాలీవుడ్ రేంజ్ లో క్రిష్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్న హృతిక్
-
మహేష్‌కు సరైన విలన్‌ను సెలెక్ట్ చేసిన రాజమౌళి
-
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ నేటి నుంచి ప్రారంభం
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) తొలి ఎడిషన్ నేటి నుంచి (మార్చి 6) ప్రారంభంకానుంది. ఈ కొత్త క్రికెట్ లీగ్ భారత దేశపు నలుమూలల్లో దాగివున్న యంగ్ టాలెంట్‌ను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ లీగ్ ద్వారా పరిచమయ్యే ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, తగు ప్రోత్సాహకాలతో పోటీ ప్రపంచంలో నిలబెట్టాలన్నది నిర్వహకుల ఆలోచన. జట్లను కొనుగోలు చేసిన ప్రముఖ సినీ తారలు.. ఐఎస్పీఎల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. చీఫ్ మెంటార్‌గా రవిశాస్త్రి.. ఈ లీగ్‌కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చీఫ్ మెంటార్‌గా వ్యవహరించనుండగా.. భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, జతిన్ పరంజపే సెలెక్షన్ కమిటీ హెడ్లుగా పని చేయనున్నారు. అమితాబ్ వర్సెస్ అక్షయ్.. ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో అమితాబ్ మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగనుంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఇదే వేదికగా జరుగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్ 2 టీవీ ఛానెల్లో చూడవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్‌లోనూ వీక్షించవచ్చు. సచిన్ జట్టుతో తలపడనున్న అక్షయ్ టీమ్.. ఇవాళ జరుగబోయే ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ఓ ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. -
సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే?
హిందీ చిత్రం ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తారా? అసలు ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు చిన్న క్లూ దొరికింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందట. ఇక యశ్‌రాజ్ స్పై యూనివర్శ్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్ 2’ మల్టీస్టారర్ మూవీ అనే విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. ఇంకో విషయం ఏంటంటే... ‘వార్ 2’లో రహస్య గూఢచారిగా యుద్ధం చేసే ఎన్టీఆర్‌తో ఆ తర్వాత ఇదే పాత్రతో ఒక ఫుల్ మూవీ తీయాలని, ఆ తర్వాత వచ్చే ఈ స్పై చిత్రాల్లో కీలక పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూపించాలని ఆదిత్య చోప్రా అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. -
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ -2 చిత్రంపై కీలక అప్డేట్
ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు. అతిత్వరలో వార్ 2 మొదలు కాబోతోంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైమ్ కూడా ఉండదేమో అని తెలిపారు. 2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు. ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం అంతలా ప్రభావం చూపింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. వార్ 2 లో ఈ సారి హృతిక్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కాబోతుండడం ఆసక్తిగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్‌ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారు. ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట. గత రెండు వారాల నుంచి హృతిక్ వార్ 2 చిత్రం కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నారు. ఆ సమయంలోనే హృతిక్ గాయపడ్డారు. ప్రస్తుతం హృతిక్ కోలుకుంటున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ వచ్చే వారం షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి ప్రధాన కారణం తారక్ ఫిబ్రవరి, మార్చి నెలలో వార్ 2 చిత్రం కోసం డేట్స్ కేటాయించడమే అని తెలుస్తోంది. ఈ చిత్రం డార్క్ థీమ్‌లో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ యాక్షన్ ఫీస్ట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ నటించబోతున్న వార్ 2 చిత్రంపై ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇటు సౌత్‌లో ఉన్న అభిమానులకు, నార్త్‌లో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే. వచ్చే ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. -
వార్ 2 నుండి కిక్కెక్కించే న్యూస్