![Hrithik Roshan viral pic holding girlfriend Saba Azad heels at Ambani Event - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/4/WhatsApp%20Image%202023-04-04%20at%2018.27.28.jpeg.webp?itok=3_hMmc4M)
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో తన భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సానికి తన లవర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు.
తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్‌ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్‌పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు. ప్రియురాలి హీల్స్‌ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు.
అయితే గతేడాది డిన్నర్ డేట్‌లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్‌తో క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment