Neetha ambani
-
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో వీణ శ్రీవాణి సందడి
వీణ శ్రీవాణి.. ఈ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్.. వీణపై స్వరాలు పలికిస్తూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె టాలెంట్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. తాజాగా ఆమె రిలయన్స్ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అక్కడ తన వీణ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథిలను మెప్పించారు.అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడారంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు (బీకేసీ)లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వారి కల్యాణానికి వేదికగా నిలిచింది. అందులో వీణ శ్రీవాణి తన వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించి మెప్పించారు.ఈ క్రమంలో అంబానీ పెళ్లి వేడుక గురించి వీణ శ్రీవాణి ఇలా చెప్పారు. 'ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకులో నాకు వీణ వాయించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. తెలుగు వారి తరుపన వెళ్లడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. వారు మా కోసం ప్రేత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీ చాలా అద్భుతంగా ఉంది. మన తెలుగు వారి సంప్రదాయాన్ని రిప్రెజెంట్ చేయాలని నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే నీతా అంబానీ గారు కూడా నా డ్రస్‌ను సెలక్ట్ చేశారు. అంబానీ కుటుంబం చాలా గౌరవంగా పలకరించారు. ఎక్కడే కానీ చిన్న ఇబ్బంది కలగకుండా నన్ను చూసుకున్నారు.' అని ఆమె తెలిపింది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
అంబానీ అదిరిపోయే స్కెచ్..!
-
మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ మనోడే హీరో!
తెలుగు తేజం నంబూరి తిలక్ వర్మ... ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడు. ఈ సీజన్లో ముంబై వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికి తాను మాత్రం విఫలం కాలేదు. రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే ధాటిగా ఆడుతున్న రోహిత్‌కు జతయ్యాడు. వాయువుకు అగ్ని తోడయినట్లుగా రోహిత్ అండతో తిలక్ వర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఔటైనప్పటికి అప్పటికే ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు. నిజానికి తిలక్ వర్మ ఔట్ కాకపోయుంటే ముంబై మ్యాచ్‌ను 17 లేదా 18 ఓవర్లలోనే ముగించి ఉండేది. అయితే తిలక్ వర్మ, రోహిత్‌లు వెనువెంటనే ఔట్ కావడంతో మ్యాచ్ చివరి వరకు వెళ్లింది. ఆఖరి బంతికి ఉత్కంఠగా మారినప్పటికి టిమ్ డేవిడ్ రెండు పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ సీజన్ మంచి ఫామ్ కనబరుస్తున్న తిలక్ వర్మ మూడు మ్యాచ్‌లు కలిపి 147 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అతని ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది. అయితే మనోడు మైదానంలోనే కాదు డ్రెస్సింగ్ రూమ్‌లోనూ హీరోగా నిలిచాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ గెలిచాకా ముంబై డ్రెస్సింగ్ రూమ్‌కు ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ వచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను మెచ్చుకున్న ఆమె బ్యాడ్జ్‌లను అందించారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈరోజు మ్యాచ్‌లో రోహిత్, తిలక్ వర్మలు ఇద్దరు కీలకపాత్ర పోషించారు. కానీ నా దృష్టిలో నిజమైన విన్నర్ తిలక్ వర్మ.. అందుకే అతనికి డ్రెస్సింగ్ రూమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేస్తున్నాం అంటూ తెలిపింది. అనంతరం తిలక్ వర్మ పొలార్డ్ చేతుల మీదుగా తన షర్ట్‌కు బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు. ''చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు స్పెషల్.. సీజన్లో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇలానే రాణించాలని కోరుకుంటున్నా థాంక్యూ'' అని తెలిపాడు. ఇక బౌలర్లలో పియూష్ చావ్లా బ్యాడ్జ్‌ను అందుకున్నాడు. 𝕋𝕙𝕖 𝕋𝕚𝕝𝕒𝕜 𝕍𝕒𝕣𝕞𝕒 𝕊𝕙𝕠𝕨 continues... 🔥 Our southpaw was also a winner of the 𝘿𝙧𝙚𝙨𝙨𝙞𝙣𝙜 𝙍𝙤𝙤𝙢 𝙋𝙡𝙖𝙮𝙚𝙧 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙈𝙖𝙩𝙘𝙝 for #DCvMI 💪#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/MCRwulWxu3 — Mumbai Indians (@mipaltan) April 12, 2023 చదవండి: 'మీరు కర్మని నమ్మారు.. మేం మాత్రం శర్మని నమ్మాం' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎంత స్టార్ హీరో అయినా ఆమె చెప్పులు మోయాల్సిందే!
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో తన భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సానికి తన లవర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్‌ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్‌పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు. ప్రియురాలి హీల్స్‌ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు. అయితే గతేడాది డిన్నర్ డేట్లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్‌తో క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Amit Aggarwal (@amitaggarwalofficial) -
నాటు నాటు సాంగ్.. ఒకే వేదికపై ఆలియా భట్, రష్మిక
ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. రెండో రోజు కూడా అదేస్థాయిలో పలువురు బాలీవుడ్ తారలు వేదికపై సందడి చేశారు. వారికి ఇష్టమైన పాటలకు స్టెప్పులు వేస్తూ హల్చల్ చేశారు. వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. పలువురు బాలీవుడ్ తారలు సైతం వేదికపై డ్యాన్స్ చేశారు. రణవీర్ సింగ్ సైతం ప్రియాంక చోప్రాతో కలిసి స్టెప్పులేశారు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తూ జిగి హడిద్‌ను చేతులపై ఎత్తుకుని సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్లో పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, దుల్కర్ సల్మాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Indian Express Entertainment (@ieentertainment) -
విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై యాజమాన్యం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందింది ముంబై ఇండియన్స్. క్యాష్‌రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు(ఐదుసార్లు) ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్ త్వరలోనే మరో రెండు ప్రైవేటు లీగ్స్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న యూఏఈ టి20 లీగ్‌లో ఒక జట్టును.. అదే సమయంలో క్రికెట్ సౌతాఫ్రికా నిర్వహించనున్న సీఎస్కే టి20 లీగ్‌లో మరొక జట్టును(న్యూ లాండ్స్, కేప్‌టౌడ్) కొనుగోలు చేసింది. తాజాగా ఆ జట్లకు సంబంధించిన పేర్లను రివీల్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ముంబై ఇండియన్స్ బ్రాండ్ ను అలాగే ఉంచుతూ యూఏఈ లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ముంబై ఎమిరేట్స్(MI Emirates) గా నామకరణం చేసింది. ఇక సౌతాఫ్రికా టి20 లీగ్‌లో కేప్ టౌన్ ఫ్రాంచైజీని దక్కించుకున్న అంబానీ దానికి ముంబై కేప్‌టౌన్ (MI Cape Town) అని పేరును పెట్టింది. ఈ రెండు పేర్లలో కామన్ గా ఉన్న బ్రాండ్ ముంబై(ఎంఐ-MI). ఫ్రాంచైజీల పేర్లతో పాటు అందులో పాల్గొననున్న ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్ జెర్సీలను ఆటగాళ్లు ధరించనున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీ బ్లూ, గోల్డ్ లతో కలగలిసిన దుస్తులే యూఏఈ, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లలో కనిపించనున్నారు. కేవలం లోగో మాత్రమే మారనుంది. ఈ మేరకు ముంబై ఇండియన్స్.. తన ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే విషయమై నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీలోకి సరికొత్త ఫ్రాంచైజీలు 'ముంబై ఎమిరేట్స్'.. 'ముంబై కేప్ టౌన్'ను స్వాగతించడం చాలా సంతోషాన్నిస్తుంది.ఎంఐ అనే పేరుతో మాకు క్రికెట్‌కు మించిన అనుబంధం ఉంది. మా తాజా ఫ్రాంచైజీలు కూడా ఎప్పటిలాగే ఒకే నైతికతను స్వీకరిస్తాయి. ఎంఐ స్థాయిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. సీఎస్ఏ టి20 లీగ్‌లో మొత్తం ఆరుజట్లు ఉండగా.. అన్నింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజాగా కేప్‌టౌన్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. ముంబై కేప్‌టౌన్‌గా నామకరణం చేసింది. ఇక మిగతా జట్లను పరిశీలిస్తే జొహన్నెస్‌బర్గ్‌ను సీఎస్కే, సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. 🚨 Welcoming @MIEmirates & @MICapeTown into our FA𝐌𝐈LY OF TEAMS! 💙 📰 Read more - https://t.co/85uWk804hU#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA — Mumbai Indians (@mipaltan) August 10, 2022 🇦🇪🤝🇮🇳🤝🇿🇦 Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H — Mumbai Indians (@mipaltan) August 10, 2022 🆕 𝕋𝔼𝔸𝕄 💙 𝕊𝔸𝕄𝔼 FA𝐌𝐈LY 🇦🇪 @MIEmirates 🎨: James Sun#OneFamily #MIemirates @EmiratesCricket pic.twitter.com/bxFM9EzBW7 — Mumbai Indians (@mipaltan) August 10, 2022 చదవండి: The Hundred League 2022: దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్ Sanju Samson: 'మరి అంత పనికిరాని వాడా?.. బీసీసీఐ కావాలనే చేస్తోంది' -
మా లక్ష్యం అదే, ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌పై నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు!
2023 -2027 ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ‘వయాకామ్–18’ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా క్రికెట్ లవర్స్‌ను ఉద్దేశిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ నీతా అంబానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో ప్రతీ క్రికెట్ అభిమానికి రిలయన్స్ సంస్థ వరల్డ్ క్లాస్ ఐపీఎల్ కవరేజ్‌ను అందించేందుకు కృషి చేస్తుందని అనున్నారు. ఇందు కోసం పూర్తి శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తామని అన్నారు. అంతేకాదు భారత్‌కు మరింత పేరును తెచ్చే ఈ ఐపీఎల్ లీగ్‌తో మా అనుబంధాన్ని పెంచుకోవడం మరింత గర్వకారణంగా ఉందని నీతా అంబానీ పేర్కొన్నారు. కాగా, క్రికెట్ అభిమానులకు అమిత వినోదాన్ని అందిస్తూ వస్తోన్న ఐపీఎల్ డిజిటల్ రైట్స్ కోసం జరిగిన వేలంలో ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించున్న విషయం తెలిసిందే. THREE BIG WINS FOR VIACOM18: --TRIUMPHS WITH DIGITAL STREAMING RIGHTS FOR INDIAN SUBCONTINENT --ACQUIRES INDIA STREAMING RIGHTS FOR SPECIAL PACKAGE OF MATCHES --BAGS GLOBAL TV AND DIGITAL RIGHTS FOR MAJOR CRICKETING NATIONS #Viacom18 #NitaAmbani @flameoftruth @RelianceUpdates pic.twitter.com/7S2EsZBHZ1 — Pankaj Upadhyay (@pankaju17) June 16, 2022 -
జియో వరల్డ్ సెంటర్ ప్రారంభం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా ముంబైలో జియో వరల్డ్ సెంటర్‌ను ప్రారంభించింది. దీని విస్తీర్ణం దాదాపు 18.5 ఎకరాలు ఉంటుంది. జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటెయిన్ మొదలైనవి ఉన్నాయి. ఇందులోని కన్వెన్షన్ సెంటర్ దేశంలోనే అతి పెద్దదిగా నిలవనుంది. 5జీ నెట్వర్క్ ఆధారిత కన్వెన్షన్ సెంటర్లో 1.61 లక్షల చ.అ. పైగా విస్తీర్ణం ఉండే మూడు ఎగ్జిబిషన్ హాల్స్, 1.07 లక్షల చ.అ. విస్తీర్ణం ఉండే రెండు కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది దశలవారీగా ఇందులోని వివిధ విభాగాలను సంస్థ ఆవిష్కరించనుంది. నవ భారత ఆకాంక్షలకు ప్రతిరూపంగా జియో వరల్డ్ సెంటర్ ఉంటుందని ఆర్ఐఎల్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ నీతా అంబానీ తెలిపారు. -
Nita Ambani Expensive Things: రూ.100 కోట్ల కారు, డ్రైవర్ జీతం ఎంతంటే?
-
అచ్చం అమ్మలాగే ఇషా అంబానీ
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలికాం మార్కెట్లో జియో సంచలనాలు సృష్టిస్తున్న దగ్గర్నుంచి ఇషా అంబానీ పేరు మారుమ్రోగుతోంది. జియో ఐడియా తన కూతురిదేనని పలుమార్లు ముఖేష్ పలు వేదికలపై వెల్లడించారు కూడా. రిలయన్స్ జియో డైరెక్టర్‌గా ఇషా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె పోలికలు మాత్రం అచ్చం తల్లి నీతా అంబానీ లాంటివేనట. తన తల్లి కోరిక మేరకు అటు చదువును, ఇటు ఉద్యోగాన్ని ఆమె ఎంతో విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారని తెలిసింది. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న నీతా, ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిందని, ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేస్తున్నట్టు తెలిపారు. అటు ఎంబీఏ క్లాసెస్‌కు హాజరు అవుతూనే, బింగ్ అనే స్టాన్ఫోర్డ్ నర్సరీలో ఉద్యోగం చేస్తున్నట్టు నీతా వెల్లడించారు. అక్కడ తాను టీచర్‌గా వర్క్ చేయనున్నట్టు తెలిపారు. నీతా అంబానీ కూడా ముఖేష్ అంబానీని కలిసినప్పుడు స్కూల్ టీచర్‌గానే పనిచేసేవారు. రిలయన్స్ జియోలో డైరెక్టర్ హోదా, స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ, నర్సరీలో ఉద్యోగం అన్నింటిన్నీ విజయవంతంగా చేపడుతున్నట్టు తెలిసింది. దీంతో అచ్చం అమ్మలాగే, కూతురు అంటూ పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. -
రిలయన్స్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్
హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్(ఆర్‌ఎఫ్‌వైఎస్) జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంటు రెండో సీజన్ ప్రారంభమైంది. సమీప భవిష్యత్తులో భారత్‌ను బహుళ క్రీడల దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బుధవారం కోచిలో ఆర్‌ఎఫ్‌వైఎస్ చైర్పర్సన్ నీతా అంబానీ ఈ టోర్నీని ప్రారంభించారు. కోచిలోని రాజగిరి పబ్లిక్ స్కూల్లో వందలాది మంది పాఠశాల విద్యార్థుల కేరింత నడుమ భారత స్ట్రైకర్ సి.కే.వినీత్‌తో కలిసి నీతా అంబానీ ఈ సీజన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని 30 నగరాల్లో జరిగే ఈ టోర్నీకి ఆమె శ్రీకారం చుట్టారు. ''రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా స్ఫూర్తిని పెంచుతుంది. ఆర్‌ఎఫ్‌వైఎస్ ద్వారా ఏకీకృత క్రీడా వ్యవస్థను రూపొందించడమే మా లక్ష్యం. దీనిలో భాగంగా ఒలింపిక్ ప్రధాన క్రీడలన్నింటికీ సంపూర్ణ ప్రణాళిక మా దగ్గర ఉంది. దేశంలోని యువతకు క్రీడల ద్వారా తగిన అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం'' అని నీతా అంబానీ అన్నారు. దేశంలో గ్రామీణ స్థాయి నుంచి ఆటను ప్రోత్సహించడంలో ఆర్‌ఎఫ్‌వైఎస్ అతిపెద్ద టోర్నీగా అవతరించనుంది. వచ్చే ఐదు నెలల్లో 3000 విద్యా సంస్థల నుంచి 60 వేలకు పైగా చిన్నారులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. తొలి ఏడాది 8 ఐఎస్ఎల్ జట్ల వేదికల్లో ప్రారంభమైన ఈ టోర్నీ ఈ సారి బెంగళూరు, అహ్మదాబాద్, షిల్లాంగ్ , ఐజ్వాల్, ఇంఫాల్, హైదరాబాద్, జంషెడ్పూర్లలో కూడా జరుగనుంది. ఫుట్‌బాల్‌లో ప్రతిభకు పెట్టింది పేరైన కేరళ, గోవాలలోని ప్రతి పాఠశాల, కళాశాలకు ఆర్‌ఎఫ్‌వైఎస్ 2016-18 సీజన్ విస్తరించింది. కోచిలోని నిర్మల కళాశాలకు చెందిన 20 ఏళ్ల అజిత్ శివన్ ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్స్లోకి అడుగుపెట్టడం ఆరంభోత్సవంలో ఆకట్టుకుంది. '' గత ఏడాది ఆర్‌ఎఫ్‌వైఎస్‌లో అజిత్ సత్తా చాటాడు. అతను నాణ్యమైన ఆటగాడినని నిరూపించాడు. వెంటనే బ్లాస్టర్స్ అతడిని ఎంపికచేసుకుంది. భవిష్యత్తులో మరింత మంది అజిత్ శివన్‌లను వెలుగులోకి తీసుకొస్తాం. గ్రామీణ స్థాయిలో క్రీడల్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం'' అని నీతా అంబానీ గర్వంగా ప్రకటించారు. ఆర్‌ఎఫ్‌వైఎస్ జాతీయ ఫుట్‌బాల్ టోర్ని నాలుగు విభాగాల్లో జరుగుతోంది. జూనలియర్ బాలురు, సీనియర్ బాలురు, సీనియర్ బాలికలు, కళాశాల బాలురు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ప్రతి నగరంలో ప్రీ క్వాలిఫయింగ్ రౌండ్లతో పోటీలు ప్రారంభమవుతాయి. అందులో సత్తాచాటిన జట్లు మెయిన్ డ్రాలో బరిలో దిగుతాయి. విజేతలుగా నిలిచిన జట్లు జాతీయ స్థాయిలో తలపడతాయి. మెయిన్ డ్రా నుంచి ఫైనల్స్ వరకు మ్యాచ్‌ల వీడియో ఫుటేజీలను రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ అందుబాటులో ఉంచనుంది. దేవవ్యాప్తంగా ఉన్న సహజసిద్ధమైన ప్రతిభావంతుల్ని గుర్తించడానికి ఇదెంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీడియో ఫుటేజీలను సాంకేతిక విశ్లేషణ కోసం పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రారంభ దశలోనే విద్యార్థుల లోపాల్ని సరిదిద్దవచ్చు. దేశంలో గ్రామీణ స్థాయిలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చిన్నారులు, యువత క్రీడ పట్ల ఆకర్షితులవడానికి ఈ టోర్నీ దోహదం చేయాలన్నది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ ఆశయం. ప్రతి చిన్నారి తన ప్రతిభను సానబెట్టుకోవడానికి ఒదికొ వేదిక కావాలన్నది ఆమె లక్ష్యం.