
ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. రెండో రోజు కూడా అదేస్థాయిలో పలువురు బాలీవుడ్ తారలు వేదికపై సందడి చేశారు. వారికి ఇష్టమైన పాటలకు స్టెప్పులు వేస్తూ హల్‌చల్ చేశారు. వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. పలువురు బాలీవుడ్ తారలు సైతం వేదికపై డ్యాన్స్ చేశారు. రణవీర్ సింగ్ సైతం ప్రియాంక చోప్రాతో కలిసి స్టెప్పులేశారు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తూ జిగి హడిద్‌ను చేతులపై ఎత్తుకుని సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్‌లో పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, దుల్కర్ సల్మాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment