rashmika
-
నార్త్ లో రష్మిక కు నయా క్రేజ్..!
-
తొలి రౌండ్లో రష్మిక పరాజయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ50 మహిళల టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులకు నిరాశ ఎదురైంది. సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఏడుగురు బరిలోకి దిగగా... రియా భాటియా మినహా మిగతా ఆరుగురు భమిడిపాటి శ్రీవల్లి రషి్మక, అంకితా రైనా, కర్మన్ కౌర్, ఆకాంక్ష, వైదేహి, వైష్ణవి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్ రషి్మక 1–6, 3–6తో మరియా కొజిరెవా (రష్యా) చేతిలో, అంకిత రైనా 1–6, 3–6తో లౌరా సామ్సన్ (చెక్ రిపబ్లిక్) చేతిలో, కర్మన్ కౌర్ 4–6, 1–6తో పన్నా ఉడ్వార్డి (హంగేరి) చేతిలో, వైదేహి 4–6, 4–6తో తాతియానా ప్రొజోరోవా (రష్యా) చేతిలో, వైష్ణవి 6–7 (3/7), 2–6తో డాలియా జకుపోవిచ్ (స్లొవేనియా) చేతిలో, ఆకాంక్ష 0–6, 1–6తో ఫాన్‌గ్రాన్ టియాన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. రియా భాటియా 7–6 (7/3), 2–6, 7–5తో ఎరి షిమిజు (జపాన్)పై విజయం సాధించింది. -
త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్న బ్యూటీస్ విల్లే
-
2025లో టాలీవుడ్ ని శాసించనున్న రష్మిక, శ్రీలీల, మీనాక్షి
-
ప్రిక్వార్టర్స్‌లో రష్మిక
నవీ ముంబై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ50 టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–4, 6–2తో థాయ్‌లాండ్‌కు చెందిన బున్యావి థామ్‌చైవాట్‌పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రియా భాటియా (భారత్) 6–3, 6–4తో భారత్‌కే చెందిన తనీషా కశ్యప్‌పై, టాప్ సీడ్ అంకితా రైనా (భారత్) 1–6, 6–4, 6–4తో వాలెంటిని (గ్రీస్)పై నెగ్గగా... ఆకాంక్ష నిట్టూరె (భారత్) 6–7 (8/10), 4–6తో నహో సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సహజ (భారత్)–హిరోకొ కువాటా (జపాన్) ద్వయం 6–3, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో వైష్ణవి–పూజా (భారత్) జంటపై గెలిచింది. -
ఐకానిక్ లెహంగాలలో నేషనల్ క్రష్ స్టన్నింగ్ లుక్స్..!
-
రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ రిపీట్?
-
పుష్ప రాజ్ రూలింగ్ స్టార్..
-
పుష్ప కోసం జీవితం పెట్టేశాం: అల్లు అర్జున్
‘‘పుష్ప 1, పుష్ప 2’ సినిమాల కోసం మేమంతా కష్టపడ్డామని చెబితే చిన్న మాట అవుతుంది. సుకుమార్‌గారు, నేను, మా యూనిట్ అంతా ఐదేళ్ల జీవితాలు పెట్టేశాం. మా నిర్మాతలు నవీన్, రవిగార్లకు కృతజ్ఞతలు. వాళ్లు కాకుండా ఏ ప్రోడ్యూసర్ అయినా ‘పుష్ప’ అయ్యేది కాదు. మమ్మల్ని నమ్మి కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు.సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2: ది రూల్’ కోసం నాతో పనిచేసిన వారందరికీ థ్యాంక్స్. నాది, దేవి శ్రీది 20 ఏళ్ల ప్రయాణం. తన పాటల్లో నా కోసం ఎక్స్ట్రా లవ్ ఉంటుంది. ఈ తరం తెలుగమ్మాయిలకు శ్రీలీల స్ఫూర్తి. నేను ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓకే ఒక హీరోయిన్ రష్మిక. తన అంకితభావానికి హ్యాట్సాఫ్. సుకుమార్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.‘పుష్ప 1, పుష్ప 2’ ఆయన సినిమాలే. ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా? అనే భావనని ఆయన కలిగిస్తారు. సుకుమార్‌గారు లేకపోతే నేను లేను. ఆయన నాతో ‘ఆర్య’ తీయకపోయి ఉంటే నేను, ఈ వేదిక, ఈ జనాలు ఏవీ ఉండేవి కాదు. ‘పుష్ప’ నా కోసం ఆడాలని నేనెప్పుడూ అనుకోలేదు. సుకుమార్‌గారి కష్టం కోసమైనా ఆడాలనుకున్నాను. అలాగే ఈ సినిమా కోసం మూడేళ్లు త్యాగం చేసి, కష్టపడిన చిత్రబృందం కోసం ఆడాలని రెండోసారి అనుకున్నాను. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంతో గర్వించారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాకీ ఆ స్థాయిలో అంచనాలు ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలి అనుకున్నాను’’ అని తెలిపారు.దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘సుమారు రెండు మూడు నెలల క్రితం ‘పుష్ప 2’ షూటింగ్‌కి వెళ్లాను. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్‌ని సుకుమార్‌గారు చూపించారు. ఆ ఒక్క సన్నివేశం చూడగానే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు అర్థం అయిపోయింది’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను వారం క్రితం ‘పుష్ప 2’ సినిమా చూసి ఇంటికెళ్లాను. ‘మగధీర’ సినిమాకి ముందు మీ మొహం ఎంతో వెలిగిపోవడం చూశాను.. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’ అని నా భార్య నిర్మల అన్నారు. ‘పుష్ప’ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని తెలిపారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘పుష్ప’ ఇలా వచ్చిందంటే కారణం కేవలం నాకు, బన్నీకి మధ్య ఉన్న బంధమే. తన మీద ప్రేమతోనే ఈ సినిమా తీశాను. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘పుష్ప 2’ని ప్రేక్షకులు హిట్ చేస్తారనుకుంటున్నాం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని రవిశంకర్ చెప్పారు.‘‘ఇంత పెద్ద మూవీ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ. ‘‘పుష్ప’ చిత్రంలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ‘‘ఈరోజు నేను ఇలా నటిస్తున్నానంటే అది కేవలం సుకుమార్, అల్లు అర్జున్గార్ల వల్లే’’ అని తెలిపారు రష్మిక మందన్నా. ‘‘పుష్ప’ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్’’ అని శ్రీలీల చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు నాగవంశీ, సతీశ్ కిలారు, దర్శకులు గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, నటి అనసూయ, కెమెరామేన్ మిరోస్లో కుబా బ్రోజెక్ తదితరులు మాట్లాడారు. -
లవ్ లో ఉన్న మాట నిజమే.. ఓపనైపోయిన రౌడీస్టార్.. విజయ్
-
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
-
సరికొత్త ఫ్యాషన్‌తో శోభిత ధూళిపాళ్ల.. రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్స్!
సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో శోభిత ధూళిపాళ్ల..రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్...ఆ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుందన్న రష్మిక మందన్నాకలర్ఫుల్ డ్రెస్‌లో హన్సిక మోత్వానీ హోయలు..శారీలో మెరిసిపోతున్న మేఘా ఆకాశ్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
పుష్ప 2 సీక్రెట్స్ బయట పెట్టిన రష్మిక
-
పెళ్లి కొడుకైన కిదాంబి శ్రీకాంత్.. సంగీత్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మిక మందన్న (ఫొటోలు)
-
రష్మిక , స్మృతి శుభారంభం
మైసూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక , స్మృతి భాసిన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 7–5, 6–1తో సోనల్ పాటిల్ (భారత్)పై నెగ్గగా... స్మృతి 4–6, 6–0, 6–2తో ఐదో సీడ్ కరోలాన్ డెలానే (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించింది.తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హుమేరా బహార్మస్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో హుమేరా 7–5, 6–4తో అమోదిని నాయక్ (భారత్)పై గెలిచింది. డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని (భారత్)–కరోలాన్ డెలానే (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో శ్రావ్య శివాని–కరోలాన్ ద్వయం 7–6 (7/3), 6–3తో శ్రీనిధి బాలాజీ–హర్షిణి నాగరాజ్ (భారత్) జంటను ఓడించింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత రైజింగ్ స్టార్స్, తెలంగాణ క్రీడాకారిణులు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్ బెస్ట్ర్యాంక్లను అందుకున్నారు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 23 ఏళ్ల సహజ మూడు స్థానాలు ఎగబాకి 295వ స్థానంలో... 22 ఏళ్ల రషి్మక 22 స్థానాలు పురోగతి సాధించి 318వ స్థానంలో నిలిచారు. సహజ భారత నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... రషి్మక భారత మూడో ర్యాంకర్‌గా ఉంది. ఈ ఏడాది సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో నిలకడగా రాణిస్తోంది. మొత్తం 23 టోర్నీల్లో పోటీపడింది. 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. లాస్ఏంజె లిస్లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో సహజ సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మరోవైపు రష్మిక కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 21 టోర్నీల్లో పాల్గొన్న రషి్మక 25 మ్యాచ్‌ల్లో గెలిచి, 21 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇండోర్‌లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ35 టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
బిగ్‌బాస్ 8లోకి హీరోయిన్ రష్మిక బెస్ట్ ఫ్రెండ్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం: కాజల్
కాజల్ అగర్వాల్..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చందమామ’తో హిట్ అందుకొని.. స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎక్కేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే..2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆతర్వాత ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తన సినీ జీవితం ఇంత సాఫీగా సాగడానికి భర్త గౌతమ్ కిచ్లూనే కారణం అంటోంది కాజోల్. తన సపోర్ట్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని చెబుతోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. గౌతమ్ తనను బాగా సపోర్ట్ చేస్తాడని, ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ సినిమాలు చేస్తున్నానని చెప్పింది. సినిమాల ఎంపిక విషయంలో అతను జోక్యం చేసుకోడు కానీ..కొన్ని సలహాలు మాత్రం ఇస్తాడట. ఖాలీ సమయం దొరికితే తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారట. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్‌కి చాలా ఇష్టమని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను షేక్ చేస్తున్న పుష్ప 2 సాంగ్స్..
-
పుష్ప 2 నుంచి వచ్చేసిన సెకండ్ సింగిల్.. శ్రీవల్లి దెబ్బకు ఆడియన్స్ ఫిదా..!
-
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
నేషనల్ క్రష్‌గా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. గతేడాది యానిమల్తో హిట్‌ను ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న కన్నడ భామ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముంబయిలో నిర్మించిన అటల్ సేతు గురించి మాట్లాడింది. ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రశంసలు కురిపించారు.రష్మిక మాట్లాడుతూ..' ముంబై-ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు అద్భుతంగా ఉంది. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లో చేరుకుంటున్నాం. అసలు మాటలు రావడం లేదు. ముంబయి టూ నవీ ముంబయి, ముంబయి టూ గోవా, ముంబయి టూ బెంగళూరు ప్రయాణించడం చాలా ఈజీ అయిపోయింది. ప్రస్తుతం ఇండియా చాలా వేగంగా దూసుకెళ్తోంది. మరింత వేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ విషయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు" అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. #WATCH | Mumbai: On the Mumbai-trans Harbour Link (MTHL) Atal Setu, Actor Rashmika Mandana says, "Who would have thought that something like this would have been possible. Now we can easily travel from Mumbai to Navi Mumbai. India is moving very fast and growing at a fast pace.… pic.twitter.com/ACwSoSNaa7— ANI (@ANI) May 14, 2024 -
నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్ ఎంట్రీ యానియల్ సినిమాతో హిట్ కొట్టింది. కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి. -
మెగా కోడలు లేటేస్ట్ లుక్.. రెడ్ డ్రెస్‌లో శ్రీలీల హోయలు!
అలాంటి డ్రెస్‌లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి లుక్స్.. కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న నేషనల్ క్రష్ రష్మిక.. శారీలో బుల్లితెర భామ రూపాలీ గంగూలీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్‌లో శ్రీలీల హోయలు.. రెడ్ శారీలో శృతిహాసన్ గ్లామర్ లుక్స్.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
రన్నరప్ రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో రెండో సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన డబ్ల్యూ35 ఐటీఎఫ్ టోర్నీలో 22 ఏళ్ల రన్నరప్‌గా నిలిచింది. రెండో సీడ్ దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్మిక 3–6, 2–6తో ఓడిపోయింది. 67 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో రష్మికకు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసేందుకు తొమ్మిదిసార్లు అవకాశం వచ్చినా ఆమె ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఫైనల్ చేరే క్రమంలో రష్మిక టాప్ సీడ్, ఐదో సీడ్, ఏడో సీడ్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ టోర్నీ ప్రదర్శనతో రష్మిక నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 428వ ర్యాంక్‌కు చేరుకుంటుంది. -
విజేత రష్మిక – వైదేహి జోడి
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ టూర్ – డబ్ల్యూ35 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత జోడి శ్రీవల్లి రష్మిక భమిడిపాటి – వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రష్మిక – వైదేహి జంట 6–3, 7–5 స్కోరుతో నాలుగో సీడ్ య సువాన్ లీ (చైనీస్ తైపీ) – సొహ్యున్ పార్క్ (కొరియా)ని ఓడించింది. మరో వైపు సింగిల్స్ విభాగంలో కూడా రష్మిక ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో రష్మిక 6–3, 6–4తో ఏడో సీడ్ పొలినా లాట్సెంకో (రష్యా)పై గెలుపొందింది. ఫైనల్లో రెండో సీడ్ దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)తో రష్మిక తలపడుతుంది. -
రఫ్ఫాడించిన రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కళ్లు చెదిరే ప్రదర్శన చేసింది. సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన రష్మిక... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 486వ ర్యాంకర్ రషి్మక 6–0, 6–0తో ప్రపంచ 249వ ర్యాంకర్ జస్టినా మికుల్స్కయిటీ (లిథువేనియా)పై జయభేరి మోగించింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా ‘డబుల్ బేగల్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ ఇవ్వకుండా సెట్‌ను 6–0తో గెలిస్తే టెన్నిస్ పరిభాషలో దానిని ‘బేగల్’గా అభివర్ణిస్తారు. ఈ మ్యాచ్‌లో రష్మిక రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. జస్టినా సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన రష్మిక తన సర్వీస్‌లో మూడుసార్లు గేమ్ పాయింట్లను కాపాడుకుంది. మరోవైపు డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ 6–1, 7–6 (8/6)తో హైదరాబాద్‌కు చెందిన సహజ యామలపల్లి–జీల్ దేశాయ్ (భారత్) జంటపై గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ద్వయం మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ యా సువాన్ లీ (చైనీస్ తైపీ)–షోయున్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీతో రషి్మక–వైదేహి జంట తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ పొలీనా లాచెంకో (రష్యా)తో రషి్మక ఆడుతుంది. -
సింగిల్స్ క్వార్టర్స్‌లో రష్మిక... డబుల్స్ సెమీస్‌లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి, డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... సహజ యామలపల్లి సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి, డబుల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రష్మిక 6–1, 2–6, 6–1తో మర్వాయోవా (స్లొవేకియా)పై గెలిచింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–3, 6–4తో అకీకో ఒమాయి–మె యామగుచి (జపాన్) జోడీపై నెగ్గింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సహజ 1–6, 4–6తో మనన్‌చాయ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ–జీల్ దేశాయ్ (భారత్) జోడీ 6–1, 6–2తో సౌమ్య (భారత్)–మె హసెగావ (జపాన్) జంటపై గెలిచింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక , సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్ లో రష్మిక 6–3, 1–0తో టాప్ సీడ్ ఇరీనా మరియా (రొమేనియా)పై ... సహజ 6–3, 6–1తో జీల్ దేశాయ్‌పై గెలిచారు. రష్మికతో మ్యాచ్‌లో రెండో సెట్ మధ్యలో గాయంతో ఇరీనా వైదొలిగింది. -
రష్మిక జోడీ శుభారంభం
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–2, 6–1తో సౌజన్య బవిశెట్టి (భారత్)–మె హసెగావా (జపాన్) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి, హుమేరా బహార్మస్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
ఇన్నేళ్లకు కల నిజమైంది: రష్మికా మందన్నా
చిన్ననాటి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఎనిమిదో ఎడిషన్ ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డ్స్ ఫంక్షన్‌కు అతిథిగా వెళ్లారు రష్మిక. విజేతలకు అవార్డులను అందజేశారు. జపాన్‌కు వెళ్లడం పట్ల రష్మికా మందన్నా ఈ విధంగా స్పందించారు.‘‘నా చిన్నతనంలో జపాన్‌కు వెళ్లాలనే కల ఉండేది. అయితే అది అసాధ్యం అనుకున్నాను. కానీ ఇన్నేళ్లుగా జపాన్‌కు వెళ్లాలనే కల మాత్రం అలానే ఉంది. ఇప్పుడు అది సాధ్యమైనందుకు సంతోషంగా ఉంది. కొన్నేళ్ల నా కల నిజమైంది. జపాన్‌లోని ఆహారం, వాతావరణం, ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమ, ఆదరణ నాకు ఆనందాన్నిచ్చాయి. జపాన్ నాకు ఇప్పుడు చాలా స్పెషల్’’ అని ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు రష్మిక. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ధనుష్ ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్), హిందీ ‘ఛావా’లో హీరోయిన్గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు రష్మికా మందన్నా. -
WTA Mumbai Open: పోరాడి ఓడిన రష్మిక..
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. ముంబైలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 520వ ర్యాంకర్ రషి్మక 7–5, 4–6, 4–6తో రష్యా టీనేజర్, ప్రపంచ 134వ ర్యాంకర్ అలీనా కోర్నివా చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రషి్మక ఐదు ఏస్‌లు సంధించి, ఏకంగా 14 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు డబుల్స్ తొలి రౌండ్లో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీ 3–6, 6–7 (1/7)తో రెండో సీడ్ సబ్రీనా (అమెరికా)–దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. -
ఓటీటీలో యానిమల్.. ఆ రెండు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది!
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే గతనెలలో ఓటీటీకి వచ్చేసిన యానిమల్.. అదే జోరుతో దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే టాప్ టైన్లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతే కాకుండా మొదటి వారంలోనే ప్రభాస్ సలార్ మూవీని వెనక్కి నెట్టి రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది యానిమల్. రెండోవారంలో ఏకంగా టాప్-1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సలార్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. యానిమల్ మూవీకి మొదటి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది. తాజాగా ఈ రికార్డ్‌ను యానిమల్ అధిగమించింది. ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్షిప్ను యానిమల్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. -
రష్మిక సంచలనం
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ –125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. తొలి రౌండ్లో ప్రపంచ 520వ ర్యాంకర్ రష్మిక 2–6, 6–1, 7–6 (7/5)తోప్రపంచ 93వ ర్యాంకర్, రెండో సీడ్ నావో హిబినో (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. -
రష్మిక సంచలనం
ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. ముంబైలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ప్రపంచ 374వ ర్యాంకర్ రష్మిక 6–3, 6–2తో ప్రపంచ 117వ ర్యాంకర్ వాలెంటిని గ్రామటికోపులు (గ్రీస్)ను బోల్తా కొట్టించింది. మొర్వాయోవా (స్లొవేకియా)తో నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో మ్యాచ్‌లో రష్మిక గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తుంది. -
సెమీస్‌లో వైదేహి–రష్మిక జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండోర్‌లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 6–2, 6–1తో మూడో సీడ్ కరోల్ మొనెట్ (ఫ్రాన్స్) –యషీనా (రష్యా) జంటపై నెగ్గింది. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక ద్వయం ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. -
పుష్ప-2 పై రూమర్స్.. డైరెక్టర్ సుకుమార్ పోస్ట్ వైరల్!
ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్ప సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందని చాలా సార్లు వార్తలొచ్చాయి. వీటిపై డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ కూడా ఇచ్చారు. పుష్ప-2 రిలీజ్ తేదీలో ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సుకుమార్. 'పుష్ప రాజ్ రూల్ బిగిన్స్ ఇన్ 200 డేస్' అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో వాయిదా అంటూ రూమర్స్ వైరలవుతున్న వేళ మరోసారి క్లారిటీ ఇచ్చిపడేశారు. తాజాగా డైరెక్టర్ చేసిన పోస్ట్‌తో పుష్ప-2పై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పడినట్లే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. గతేడాది ఎవరూ ఊహించని విధంగా 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టు కావడంతో అనుకున్న సమయంలో సినిమా విడుదల కాకపోవచ్చనే వార్త ప్రచారం జరిగింది. గతంలో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్'2021లో విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇందులో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్రకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో ఫహద్ ఫాజిల్ కొద్దిసేపు మాత్రమే కనిపించారు. పార్ట్-2లో ఆయన ఎక్కువ సేపు కనిపిస్తారని టాక్ ఉంది. పార్ట్-1కు వచ్చిన ఆదరణ చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్- 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. 200 DAYS for Pushpa Raj to begin his RULE 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024 ❤🔥#PushpaKaRuleIn200Days 💥💥 Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/RxUDlkdrpB — Mythri Movie Makers (@MythriOfficial) January 29, 2024 View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
ఓటీటీకి యానిమల్.. ఆ రోజే రిలీజ్?
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం అంతేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు ఈ చిత్రాన్ని తప్పుబట్టారు. అయితే బాక్సాఫీస్ సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 26న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా యానిమల్ మూవీపై వివాదం తలెత్తింది. ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టులో దావా వేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన సినీ1 స్టూడియోస్. దీంతో రిపబ్లిక్ డే రోజున ఓటీటీ రిలీజ్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. (ఇది చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక) అసలేం జరిగిందంటే.. కాగా.. యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరిగింది. వివాదం తొలగినట్లే..! ఈ అంశంపై ఈ నెల 22న ఢిల్లీ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ సంయుక్తంగా ఓ అవగాహన ఒప్పందానికి ఓకే చెప్పినట్లు ఇరు పక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ఒప్పందాన్ని కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించారు. వారి మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో యానిమల్ ఓటీటీ రిలీజ్‌కు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును మరోసారి జనవరి 24న విచారించనున్నారు. కాగా.. ఈ సినిమాను ఓటీటీలో 3 గంటల 29 నిమిషాల రన్‌టైమ్ ఉండనుంది. థియేటర్ వర్షన్‌కు అదనంగా మరో 8 నుంచి 10 నిమిషాల పాటు సీన్స్ అదనంగా చేర్చారు. -
విజయ్- రష్మిక నిశ్చితార్థం.. స్పందించిన టీం!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది. (ఇది చదవండి: మంచు మనోజ్ దంపతుల గొప్పమనసు.. ప్రెగ్నెన్సీ తర్వాత తొలిసారి!) కాగా.. విజయ్, రష్మిక జంటగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఈ జోడీకి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లోనూ ఒకటి, రెండుసార్లు నెటిజన్లకు దొరికిపోయారు. కానీ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎక్కడా కూడా స్పందించలేదు. తాజాగా ఈ జంట ఎంగేజ్మెంట్కు సిద్ధమైనట్లు వార్తలు రావడంతో విజయ్ టీం క్లారిటీ ఇచ్చింది. కాగా.. గతేడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్..ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడీగా కనిపించనుంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు యానిమల్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక.. అల్లు అర్జున్ సరసన పుష్ప-2లో నటిస్తోంది. -
Pushpa 2: ఈ ఏడాది రూల్ పుష్పదే.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో సుకుమార్ పుష్ప-ది రూల్(పార్ట్-2) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేశారు. స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఈ ఏడాది పుష్పదే రూల్ అంటూ పోస్ట్ చేశారు. 2024 విడుదల కానున్న పుష్ప-2 ఏ మేరకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే. #2024RulePushpaKa ❤️🔥 Pushpa Raj is coming back this year to rule the worldwide box office 🔥🔥 May you all rule your year with ambition & determination and may you get everything you desire for 💫 Happy New Year 2024 ❤️#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG… pic.twitter.com/u6VED8LZbr — Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2024 -
'సరైన వ్యక్తుల వల్లే మీరేంటో తెలుసుకుంటారు': నేషనల్ క్రష్
యానిమల్ సినిమాతో హిట్ కొట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం రష్మిక షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పుష్ప సినిమాతో శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న భామ.. పుష్ప-2లోనూ నటిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. జీవితంలో కొన్నిసార్లు అగి ఆలోచించాలంటూ పోస్ట్ చేసింది. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'జీవితం గురించి కొన్నిసార్లు ఆగి ఆలోచించాలి. అదంతా ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అసలేందుకు ఇదంతా జరిగిందని. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఇదంతా జరిగినందుకు ప్రశాంతంగా, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే.. ఇదే నేను ఎప్పటినుంచో కలలు కనేది. కానీ నేను ఇదంతా జరుగుతుందని నేను గ్రహించలేదు. అంతే కాదు నాకు ఏం కావాలో తెలియని దాని వైపు పరుగులు తీస్తూనే ఉంటా. సరైన వ్యక్తులతో ఉండటం వల్ల మీరు కొన్నిసార్లు ఆగి.. దాన్ని గ్రహించాల్సి ఉంటుందని మీరు తెలుసుకుంటారు. ఈ లిటిల్ అమ్మాయి కలలు కంటూ పెరిగింది కూడా ఇదే!' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు నేషనల్ క్రష్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
టాప్ సీడ్ జోడీకి రష్మిక ద్వయం షాక్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టో ర్నీలో హైదరాబాద్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నవీ ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక –వైదేహి (భారత్) ద్వయం 7–6 (7/5), 6–2తో టాప్ సీడ్ జిబెక్ కులమ్బయేవా (కజకిస్తాన్)–జస్టినా మికుల్స్కయిట్ (లిథువేనియా) జోడీని బోల్తా కొట్టించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జంట 1–6, 6–2, 12–14తో అకీకో ఒమాయి (జపాన్)–బీట్రయిస్ గుమల్యా (ఇండోనేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
ఫైనల్లీ.. తన క్రష్ ఎవరో బయటపెట్టిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యానిమల్ మూవీతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రష్మిక.. స్టార్ హీరోలకి మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. వరుస హిట్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక రష్మిక అండే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి రష్మిక క్రష్ ఎవరో తెలుసా? ఈమధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది. ఇక యానిమల్ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించింది ఈ బ్యూటీ. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేయడంలో తగ్గేదేలే అంటుంది రష్మిక. ఇక తన దుస్తుల్లో స్ట్టన్నింగ్గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్ఫిట్సే నా ఫ్యాషన్ స్టయిల్ అంటూ రివీల్ చేసింది. తాజాగా ప్రమోషన్స్‌లో గులాబీ రంగు చీరలో తళుక్కుమంది ఈ బ్యూటీ. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ చీర ధర అక్షరాలు రూ. 1,90,000లుగా ఉంది. -
బాక్సాఫీస్ వద్ద యానిమల్ ప్రభంజనం.. 9 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 650కి పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో పఠాన్, జవాన్, గదర్-2 ఉన్నాయి. ఇదే స్థాయిలో కలెక్షన్స్ వస్తే త్వరలోనే వెయ్యి కోట్లకు చేరుకునేలా కనిపిస్తోంది. తొమ్మిది రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన యానిమల్.. ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. #Animal Roars Louder 🔥🪓 Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/rXLUe4SSod — Animal The Film (@AnimalTheFilm) December 10, 2023 -
'అమ్మాయిలు చప్పట్లు కొడుతుంటే బయటకొచ్చేశా'.. యానిమల్ చిత్రంపై తీవ్ర విమర్శలు..!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. అయితే మొదటి రోజే పాజిటివ్ రావడంతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రంపై అభిమానులతో సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రశంసల కంటే విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ లిరిసిస్ట్ స్వానంద్ కిర్కిరే కూడా చేరిపోయారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్లో వరుస పోస్టులు చేశారు. స్వానంద్ కిర్కిరే తన ట్వీట్లో రాస్తూ.. 'యానిమల్ సినిమా చూశాక.. నేటి తరం మహిళలపై నాకు నిజంగా జాలి కలిగింది. మీకోసం కొత్త వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అంతే కాదు.. అతను మరింత భయంకరంగా ఉన్నాడు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. మిమ్మల్ని అణచివేసే వ్యక్తి గురించి నువ్వు గర్వపడుతున్నావు. నేటి తరం అమ్మాయిలు థియేటర్లో కూర్చోని రష్మికను చూసి చప్పట్లు కొడుతుంటే.. మనసులో సమానత్వం అనే ఆలోచనకు నివాళులు అర్పించి నిరాశ, నిస్పృహలతో బయటకు వచ్చేశా. ఈ సినిమా విపరీతంగా వసూళ్లు రాబట్టినప్పటికీ.. నా భారతీయ సినిమా ఉజ్వల చరిత్ర మాత్రం దారి తప్పుతోంది. యానిమల్ భారతీయ సినిమా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భయంకరమైన, ప్రమాదకరమైన దిశలో తీసుకెళ్తోంది.' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన యానిమల్ చిత్రబృందం స్పందించింది. అతని ట్వీట్లను ఉద్దేశించి తగిన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ట్వీట్లో రాస్తూ.. "మీ మోకాళ్లను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం, పాదాలు బ్యాలెన్స్ కోసం వేరు వేరుగా ఉంచండి. మీ పాదాలను సురక్షితంగా ల్యాండ్ చేయండి. అప్పుడు అది కచ్చితంగా ల్యాండ్ అవుతుంది' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. కాగా.. యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, ట్రిప్తీ డిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. शांतराम की - औरत , गुरुदुत्त की - साहब बीवी और ग़ुलाम , हृषीकेश मुखर्जी की - अनुपमा , श्याम बेनेगल की अंकुर और भूमिका , केतन मेहता की मिर्च मसाला , सुधीर मिश्रा की मैं ज़िंदा हूँ , गौरी शिंदे की इंगलिश विंगलिश , बहल की क्वीन सुजीत सरकार की पीकू आदि , हिंदुस्तानी सिनेमा — Swanand Kirkire (@swanandkirkire) December 2, 2023 Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing. Yes.... now it landed perfectly 😘… pic.twitter.com/OxTOE0vlvI — Animal The Film (@AnimalTheFilm) December 6, 2023 -
రష్మిక జోడీకి డబుల్స్ టైటిల్... సింగిల్స్ చాంపియన్ రామ్‌కుమార్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో భారత క్రీడాకారులు రాణించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ టో ర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక భారత్‌కే చెందిన వైదేహితో కలిసి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్ ఫైనల్లో రష్మిక –వైదేహి ద్వయం 6–1, 6–2తో సోహా సాదిక్–ఆకాంక్ష (భారత్) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక జోడీ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో రామ్‌కుమార్ 6–2, 6–1తో డేవిడ్ పిచ్లార్ (ఆ్రస్టియా)పై నెగ్గాడు. రెండు నెలల వ్యవధిలో రామ్‌కుమార్‌కిది మూడో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. -
యానిమల్ అసలు రన్‌టైమ్ అది కాదు.. వామ్మో అంతకుమించి!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు అమాంతెం పెంచేసింది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న చిత్రబృందం చెన్నైలోనూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు రణ్‌బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మూవీ రన్‌టైమ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్ అవుతానంటున్న కంటెస్టెంట్!) ప్రస్తుతం ఆడియన్స్ రెండున్నర గంటల సినిమా చూసేందుకే బోరింగ్‌గా ఫీలవుతున్నారు. అలాంటిది సందీప్ రెడ్డి ఏకంగా మూడు గంటల 21 నిమిషాల రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే దీనిమీదే ప్రస్తుతం ఆడియన్స్‌లో తెగ చర్చ నడుస్తోంది. అయితే చెన్నైలో జరిగిన ఈవెంట్లో దీనిపై మేకర్స్ చేసిన కామెంట్స్ మరింత వైరలవుతున్నాయి. కాగా.. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సందీప్ రెడ్డి వంగా చిత్రానికి అసలు రన్ టైమ్ సుమారు 3 గంటల 49 నిమిషాలుగా ఉందట. ఇంత లాంగ్ రన్‌టైమ్ మూవీని చూడాలంటే ఆడియన్స్‌కు కష్టమే. అందులోనూ రోజు నాలుగు షోలు వేయాలంటే కూడా వీలు కాదు. అందువల్లే 3 గంటలా 21 నిమిషాలకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రణ్‌బీర్ కపూర్ ప్రమోషన్స్‌లో వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏకంగా 18 నిమిషాల పాటు సాగుతుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే సినిమా వచ్చే దాకా వేచి చూడాల్సిందే. అయితే ఓటీటీలోనైనా ఫుల్ మూవీని రిలీజ్ చేస్తారేమో చూడాలి. (ఇది చదవండి: రణ్‌బీర్.. ఇక్కడికి షిఫ్ట్ అయిపో.. తెలుగువాళ్లు బాలీవుడ్‌ను..) -
ప్రమోషన్స్‌లో చీరకట్టులోనే కనిపిస్తున్న రష్మిక..అదే కారణమా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్‌తో రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్‌తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, రణబీర్ కపూర్ జంటగా నటించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీం. ఇందులో రష్మిక లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నా మధ్య రష్మిక తన ఇన్‌స్టాలో.. శారీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మీరంతా(అభిమానులను ఉద్దేశించి)నాకు చీరలపై ఉన్న ఇష్టాన్ని పెంచేశారు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రష్మిక ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది. తాజాగా యానిమల్ ప్రమోషన్స్ అన్నింట్లో చీరల్లోనే మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది రష్మిక. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఆర్గాంజా శారీలో అదరహో అనిపించే అందంతో మెరిసిపోయింది. మొన్నటికి మొన్న ఓ షోకు హాజరైన రష్మిక బ్లాక్ శారీలో తళుక్కుమంది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఈ చీర ధర అక్షరాల 80వేల రూపాయలట. ఇక రీసెంట్గా ప్రముఖ డిజైనర్ అర్పితా ఖాన్ డిజైన్ చేసిన పింక్ చీరలోనూ వయ్యారాలు ఒలికించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే రష్మిక చీరకట్టులోనూ మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో రష్మికకు-చీరలకు ఏందో లింక్ ఉన్నట్లుంది, త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాల్సి ఉంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
చాంపియన్ శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: టోర్నీ టోర్నీకీ తన ఆటతీరును మెరుగుపర్చుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్లో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం ముగిసిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో 21 ఏళ్ల రష్మికచాంపియన్గా అవతరించింది. గంటా 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రష్మిక6–0, 4–6, 6–3తో భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌ను ఓడించింది. ప్రస్తుత జాతీయ చాంపియన్ రష్మికఈ మ్యాచ్‌లో 11 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన రష్మికకు 3,935 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫలితంగా నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రష్మిక 181 స్థానాలు పురోగతి సాధించి 706వ ర్యాంక్ నుంచి 525వ ర్యాంక్‌కు చేరుకుంటుంది. -
ఫైనల్లో రష్మిక భమిడిపాటి
ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రష్మిక 6–2, 6–1 స్కోరుతో రెండో సీడ్ లన్లనా తరారుడీ (థాయిలాండ్)పై విజయం సాధించింది. 57 నిమిషాల పాటు సాగిన పోరులో ఆద్యంతం రష్మిక ఆధిపత్యం కొనసాగింది. తరారుడీ ఒక ఏస్ కొట్టినా ఐదు డబుల్ ఫాల్ట్‌లతో ఓటమిని ఆహ్వానించింది. మరో భారత క్రీడాకారిణి జీల్ దేశాయ్ కూడా ఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ సెమీస్‌లో జీల్ 3–6, 6–4, 7–5 స్కోరుతో భారత్‌కే చెందిన మూడో సీడ్ రుతుజ భోసలేను ఓడించింది. 2 గంటల 31 నిమిషాల పాటు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన జీల్ విజేతగా నిలిచింది. రుతుజ 2 ఏస్‌లు కొట్టగా, జీల్ ఒక ఏస్ సంధించింది. జీల్ 7 డబుల్ ఫాల్ట్‌లతో పోలిస్తే 10 డబుల్ ఫాల్ట్‌లు చేసిన రుతుజ ఓటమిపాలైంది. -
క్వార్టర్ ఫైనల్లో రష్మిక
మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నిలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికసింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నిలో గురువారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల రష్మిక4–6, 7–5, 7–5తో నాలుగో సీడ్ వైదేహి (గుజరాత్)ను ఓడించింది. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మికనాలుగు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రష్మికతన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 6–0, 6–3తో కశిష్ భాటియా–వన్షిత (భారత్) జంటపై నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన యడ్లపల్లి ప్రాంజల పోరాటం ఈ టోర్నిలో ముగిసింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల 4–6, 3–6తో రుతుజా భోస్లే (భారత్) చేతిలో ఓడిపోయింది. -
ఇదే అప్పుడు జరిగి ఉంటే.. ఊహించుకుంటేనే భయంగా ఉంది: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎవరిదో వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మిక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా చేయడాన్ని సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. బాధ్యులను తగిన విధంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (ఇది చదవండి: రిసెప్షన్లో లావణ్య ధరించిన చీర చాలా స్పెషల్.. ధర ఎంతో తెలుసా..?) అయితే తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో పట్ల రష్మిక మందన్నా స్పందించింది. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తలుచుకుంటే నిజంగా భయంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. ట్వీట్లో రష్మిక ప్రస్తావిస్తూ..' ఇలాంటి విషయం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇలాంటివి నాకే కాదు..టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి చాలా భయంగా ఉంటుంది. ఈ రోజు నేను ఒక మహిళగా, నటిగా మాట్లాడుతున్నా. నాకు మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. కానీ నేను స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. దీన్ని ఎలా తట్టుకోలగనో నా ఊహకు అందడం లేదు. ఇలాంటి వాటి బారిన మనలో ఎక్కువ మంది పడకముందే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలి.' అంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫేక్ వీడియోను అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు ఖండించారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. (ఇది చదవండి: సలార్ ట్రైలర్ విడుదల తేదీ లాక్..?) I feel really hurt to share this and have to talk about the deepfake video of me being spread online. Something like this is honestly, extremely scary not only for me, but also for each one of us who today is vulnerable to so much harm because of how technology is being misused.… — Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023 -
చికిత ‘పసిడి’ గురి...
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తణిపర్తి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ గ్రామానికి చెందిన చికిత ఫైనల్లో 143–142తో ప్రియా గుర్జర్ (రాజస్తాన్)పై గెలిచింది. మరోవైపు మహిళల టెన్నిస్ ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో పతకాన్ని దక్కించుకుంది. మహిళల టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గిన రష్మిక... డబుల్స్ విభాగంలో శ్రావ్య శివానితో రజతం సాధించింది. ఆదివారం జరిగిన సింగిల్స్ విభాగంలో రష్మిక రజత పతకం సొంతం చేసుకుంది. వైదేహి (గుజరాత్)తో జరిగిన టైటిల్ పోరులో రష్మిక 5–7, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ 3 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 22వ స్థానంలో ఉంది. -
రన్నరప్ రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల టెన్నిస్ (ఐటీఎఫ్) సర్క్యూట్లో తొలి సింగిల్స్ టైటిల్ సాధించేందుకు హైదరాబాద్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. బ్యాంకాక్‌లోని హువా హిన్‌లో ఆదివారం ముగిసిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో రష్మిక రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆరో సీడ్ రష్మిక 2–6, 1–6తో రెండో సీడ్ అయూమి కోషిషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా పది డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. తన సర్విస్‌ను ఆరుసార్లు కోల్పోయిన రష్మిక ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. రన్నరప్‌గా నిలిచిన రష్మికకు ట్రోఫీతోపాటు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
రష్మిక అలవోక విజయం
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోరీ ్న లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–1, 6–3తో నాలుగో సీడ్ హిరోకో కవాటా (జపాన్)పై గెలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఎనిమిది ఏస్‌లు సంధించడం విశేషం. -
సెమీస్‌లో రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రషి్మక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రషి్మక 6–2, 6–3తో వలెరి జినీనా (రష్యా)పై గెలిచింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించింది. మరోవైపు న్యూఢిల్లీలో జరుగుతున్న ఫెనెస్టా ఓపెన్ జాతీయ చాంపియన్íÙప్లో అండర్–14 బాలుర డబుల్స్ విభాగంలో హృతిక్ కటకం (తెలంగాణ)–తవీష్ (హరియాణా) జోడీ టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో హృతిక్–తవీష్ ద్వయం 6–4, 7–5తో శౌర్య–రణ్వీర్ జంటపై నెగ్గింది. సింగిల్స్‌లో హృతిక్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో హృతిక్ 6–4, 6–1తో అనురాగ్‌పై గెలిచాడు. -
సౌత్‌లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతంటే.. టాప్‌లో ఎవరో తెలుసా?
సినీరంగంలో ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చినా తనదైన మార్కెట్‌తో దూసుకుపోతుంటారు. వారు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కూడా సినిమా ఛాన్స్‌లు వస్తుంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సినీరంగంలో పనిచేసే వారే చాలాసార్లు చెప్తుంటారు. సినిమాల్లో మగవాళ్లలా నటీమణులు కనీసం 40, 50 ఏళ్లు కూడా ఉండలేరు. ఒకవేళ ఉన్నా సపోర్టింగ్ రోల్స్‌లలో నటించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వారు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో మార్కెట్ పడిపోతుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా ఇంకా తమ సత్తా చాటుతున్నారు. త్రిష, నయనతార వంటి నటీమణులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకానీ సపోర్టింగ్ రోల్స్ లో నటించడం లేదు. అనేక భారీ బడ్జెట్, పాన్-ఇండియన్ చిత్రాలలో ఇటీవలి కాలంలో హీరోలతో సమానంగా వారు కూడా రెరమ్యునరేషన్ పొందుతున్నారు. వీళ్లు రూ. 10 నుంచి 11 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్. ఒక సినిమాకు రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి దక్షిణ భారత నటిగా నయనతారకు గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి మరోకరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు నటి త్రిష. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి త్రిష. ప్రస్తుతం నయనతార పారితోషికం కంటే త్రిష ఎక్కువ తీసుకుంటున్నట్లు టాక్. దీనికి ప్రధాన కారణం త్రిష నటనా ప్రావీణ్యంతో పాటు.. 40 ఏళ్లు దాటినా యూత్ ఫుల్ అందం అని చెప్పవచ్చు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు త్రిష 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయం గూగుల్ కూడా తెలుపుతుంది. త్రిషకు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి త్రిష అని పరిగణనలోకి తీసుకుంటే, నయనతార రెమ్యూనరేషన్ పెద్దగా తగ్గలేదు. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార ఈ సినిమా కోసం 11 కోట్ల పారితోషికం తీసుకుందట. రెమ్యునరేషన్ పరంగా అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆమె పారితోషికం రూ.6 కోట్లు. అనుష్క ప్రస్తుతం తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. సమంత రూ.6 నుంచి 8 కోట్లు ఒక సినిమాతో సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన యశోద, శకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. పూజా హెగ్డే సౌత్ ఇండియన్ బిజీ నటీమణులలో ఒకరు. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. జైలర్ ద్వారా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. రూ. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఒక సినిమా కోసం ఒకటిన్నర నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నటి ఏడాది క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు 1.5 నుంచి 3.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం, కీర్తి సురేష్ ఒక సినిమాకు రూ.2.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు సరైన హిట్ దక్కలేదు. -
విజయ్- రష్మిక జోడీ.. ఆ మాత్రం ఉండాల్సిందే!
టాలీవుడ్లో విజయ్ దేవరకొండ- రష్మిక జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌లోనూ కలిసి నటించారు. దీంతో వీరిద్దరు టాలీవుడ్లో ఫేవరేట్ జోడీగా నిలిచారు. ఇండస్ట్రీలో విజయ్, రష్మిక గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక చేసిన ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: యానిమల్ టీజర్.. సందీప్ రెడ్డి వంగా ఏ మాత్రం తగ్గలేదు) ప్రస్తుతం రష్మిక, రణ్‌బీర్ కపూర్ జంటగా యానిమల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 28న రణ్‌బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం సర్ప్రైజ్ ఇచ్చింది. యానిమల్ టీజర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. అయితే దీనికి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. విష్ యూ మై డార్లింగ్స్ అంటూ పోస్ట్ చేశారు. విజయ్ ట్వీట్‌కు రష్మిక మందన్నా కూడా రిప్లై ఇచ్చింది. థ్యాంక్యూ.. యూ ఆర్ ది మై బెస్ట్.. అంటూ ట్వీట్ చేసింది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు బెస్ట్ పెయిర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా..రష్మిక, రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) కాగా.. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి అక్కడా మంచి విజయాన్ని అందుకున్నారాయన. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కిస్తోన్న యానిమల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Thankyouuuuuuu @TheDeverakonda 🤗❤️ You be the bestestestestttt! ❤️ https://t.co/vz9MCFhsiA — Rashmika Mandanna (@iamRashmika) September 28, 2023 -
రష్మిక శుభారంభం
అంతర్జాతీయ మహిళల టెన్నిస్ (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన ఆమె, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పెర్త్‌లో జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–3, 6–3తో జెస్సీ కులే (ఆస్ట్రేలియా)పై గెలిచింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక (భారత్)–మోనిక్ బ్యారీ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 7–6 (7/5)తో ఎలీనా మిసిచ్ (ఆ్రస్టేలియా)–మిచికా ఒజెకి (జపాన్) జంటను ఓడించింది. -
పోరాడి ఓడిన రష్మిక జోడి
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. పెర్త్‌లో జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక (భారత్)–మోనిక్ బ్యారీ (న్యూజిలాండ్) ద్వయం 6–3, 1–6, 7–10తో మిసాకి–నాహో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. సింగిల్స్‌లో రష్మిక తొలి రౌండ్లో 3–6, 3–6తో ఐవా డెస్టానీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓటమి పాలైంది. -
తెలుగు హీరోతో సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్.. తగిన శాస్తే జరిగింది!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ ట్యాగ్ సొంతం చేసుకున్న భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్తా గందరగోళంగా మారింది. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్న తరహాలో రష్మిక పరిస్థితి ఉందటున్నారు నెటిజన్స్. అసలు విషయానికొస్తే కన్నడ చిత్రసీమ నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన ముద్దుగుమ్మ. అక్కడ ఛలో అనే తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత చిత్రం గీతగోవిందంతో అనుహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రం ఏకంగా రష్మిక దశనే మార్చేసింది. ఈ చిత్రం ఆమెను బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. (ఇది చదవండి: Roopa Koduvayur: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు బ్యూటీ ) అలా అక్కడ రెండు, మూడు చిత్రాలు చకచకా చేసేసింది భామ. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయినా, నటిగా రష్మికకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టాయి. దీంతో మరో రెండు, మూడు చిత్రాలు ఈ బ్యూటీని వరించాయి. అలా రణ్వీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా షాహీద్ కపూర్ జత కట్టే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. ఆ చిత్రం కోసం తెలుగులో టాలీవుడ్ హీరో నితిన్ సరసన నటించే అవకాశాన్ని వదులుకుంది. నిజానికి ఈ జంట భీష్మ చిత్రం సక్సెస్‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. కాగా ఇప్పుడేమో షాహీద్ కపూర్ సరసన నటించే బాలీవుడ్ చిత్రం బడ్జెట్ కారణంగా ఆగిపోయిందనే విషయం రష్మికకు షాక్ ఇచ్చిందని సమాచారం. దీంతో ఆమె ఊహించింది ఒకటైతే జరిగింది.. మరొకటి అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్ చిత్రం, తెలుగులో పుష్ప –2 చిత్రాలు పైనే ఆశ పెట్టుకుందని సమాచారం. అదే విధంగా రెయిన్బో అనే మరో ద్విభాషా చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!) -
అల్లు అర్జున్‌కే అవార్డు అని ముందే హింట్ ఇచ్చిన రష్మిక.. వీడియో వైరల్
టాలీవుడ్ సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యపడని రికార్డును పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు. 69 ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం బన్నీకి దక్కింది. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి నటుడు ఆయనే అని ప్రకటన వచ్చాక. ఆయన షాక్‌కు గురయ్యాను అని కామెంట్ చేశారు. అంతలా ఈ అవార్డుకు ప్రాధాన్యత ఉంది. అల్లు అర్జున్‌కు అవార్డు దక్కడంతో డైరెక్టర్ సుకుమార్,మైత్రి మూవీ మేకర్స్ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?) పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు... ఇందులో నటించిన రష్మిక నేషనల్ క్రష్‌గా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవల్లీగా ఆమె నటన బాగా మెప్పిస్తుంది. పార్ట్-2లో శ్రీవల్లీ విశ్వరూపం మరో రేంజ్లో ఉంటుందని ఇప్పటికే సుకుమార్ కూడా తెలిపారు. తాజాగ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడంతో గతంలో పుష్ప సక్సెస్ మీట్లో రష్మిక మాటలు మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి) పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని అప్పట్లో సక్సెస్ మీట్లో నేషనల్ అవార్డు గురించి రష్మిక ఇలా చెప్పింది. 'నేనైతే చెప్తున్నానండి.. పుష్పగారికి ఈసారి నేషనల్ అవార్డే కాదు.. ప్రతీ అవార్డు తప్పకుండా వస్తుంది. రాకపోతే మొదట హర్ట్ అయ్యేది నేనే అండి. ఆ స్క్రీన్ మీద ఆయన చేసిన ఫర్ఫార్మెన్స్ వల్ల సినిమాను మరో స్థాయికి తీసుకుపోయింది. కేవలం మేకప్ కోసమే ఆయనకు ప్రతిరోజు సుమారు 3గంటల సమయం పడుతుండేది. ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది.' అని రష్మిక పేర్కొంది. తాజాగ ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు వస్తుందని రష్మిక అందరి కంటే ముందుగా ఎప్పుడో చెప్పిందని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Filmy Grammm (@filmygrammm) -
Vijay Deverakonda & Rashmika Mandanna: గీత గోవిందం @5.. విజయ్-రష్మిక-పరశురాం ముచ్చట్ల (ఫొటోలు)
-
శ్రీలీల ఆ సినిమా చేసుంటే ఈ పాటికి రష్మిక పెళ్లి అయిపోయేది
-
నా ఫేవరేట్ ఐపీఎల్ టీం అదే.. మనసులో మాట చెప్పేసిన శ్రీవల్లి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప-2లో బన్నీ సరసన మరోసారి అలరించనుంది. ఇప్పటికే పుష్ప-2 షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది శాండల్‌వుడ్ భామ. (ఇది చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) అయితే ఈ ఏడాది ఐపీఎల్-2023 ప్రారంభోత్సవంలో తమన్నా భాటియాతో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఫేవరేట్ జట్టు గురించి మనసులోని మాటను బయటపెట్టింది. అంతే కాకుండా తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పేసింది ముద్దుగుమ్మ. రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ' నేను కర్ణాటక నుంచి వచ్చా. ఈసారి ఐపీఎల్ తప్పకుండా ఆర్సీబీ గెలుస్తుందని ఆశిస్తున్నా.( ఈ సాలా కప్ నమ్దే) . ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆర్సీబీ ఆటను ఆస్వాదిస్తున్నా. ఐపీఎల్లో నా ఫేవరేట్ క్రికెటర్ విరాట్ సర్. అతను ఓ స్వాగర్. అతనొక అద్భుతం.' అంటూ కొనియాడింది. కాగా.. ప్రస్తుతం దేవ్‌మోహన్‌తో కలిసి రెయిన్బో చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. మరోవైపు టాలీవుడ్ హీరో నితిన్‌తో ఓ చిత్రంలో కనిపించనుంది. (ఇది చదవండి: మహారాణి పాత్రలో నటించనున్న రష్మిక మందన్నా!) .@iamRashmika reveals her RCB FAN-GIRL side. 🙈💓 From being a die-hard @ImVkohli fan to chanting ‘Ee Sala Cup Namde’, she is a TOTAL RCBian! 🤩 Tune-in to #LSGvRCB on #IPLonStar Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#GameOn #BetterTogether pic.twitter.com/C3NkP9KRl0 — Star Sports (@StarSportsIndia) May 1, 2023 View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
టాప్-3లో రష్మిక.. అల్లు అర్జున్ను దాటేసిందిగా!
నేషనల్ క్రష్, కన్నడ భామ 'ఛలో' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ కావడంతో రష్మిక దశ ఒక్కసారిగా తిరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్పతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఐఎండీబీ ప్రకటించిన ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ కేటగిరిలో శ్రీవల్లి చోటు సంపాదించుకుంది. ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్-3లో నిలిచింది. రష్మిక ఈ లిస్టులోకి ఎంట్రీ అవ్వడం ఇదే మొదటిసారి. ఈ జాబితాలో అల్లు అర్జున్ 17వ ప్లేస్‌లో నిలిచారు. తాజాగా ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులోకి కొత్తగా డెబ్యు ఇచ్చిన వాళ్లలో వెట్రిమారన్, అల్లు అర్జున్, నాని, కీర్తి సురేష్, తమన్నా, కరీనా కపూర్, సారా అలీ ఖాన్ కూడా ఉన్నారు. నాని, కీర్తి సురేశ్‌ల దసరా సినిమా హిట్ కావడంతో పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలుగా మారారు. కాగా.. ప్రస్తుతం రష్మిక సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రష్మిక బర్త్‌డే సందర్భంగా ‘పుష్ప2’ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. Bringing you this week's edition of new entrants who made into IMDb's Popular Indian Celebrities Feature this week ✨💛 Wondering where you can find it? On the IMDb app on iOS and Android! 🍿 Who's your favourite? pic.twitter.com/LnCUYt2he7 — IMDb India (@IMDb_in) April 14, 2023 With his birthday last week and the anticipation building for the release of #Pushpa2 , @alluarjun in on everyone’s minds right now as he debuts on the IMDb Popular Indian Celebrities Feature at #17! 🔥 pic.twitter.com/ci45NoJzNk — IMDb India (@IMDb_in) April 14, 2023 -
విజయ్-రష్మికల డేటింగ్ నిజమే.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు!
హీరోయిన్ రష్మిక మందన్నా- విజయ్ దేవరకొండ డేటింగ్లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో తొలిసారిగా కలిసి నటించిన వీరిద్దరూ ఆ సినిమా డియర్ కామ్రేడ్ చిత్రంలో మరోసారి జంటగా కనిపించారు. చేసింది రెండు సినిమాలే అయినా వీళ్ల జోడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రష్మకి-విజయ్‌ల కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లో కూడా వీళ్ల పెయిర్‌కు మాంచి క్రేజ్ ఉంది. కలిసి వర్కవుట్ చేయడం దగ్గర్నుంచి డిన్నర్, వెకేషన్స్ అంటూ ఇద్దరూ కలిసి తిరగిన ఫోటోలు బయటకు రావడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తోడు విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రష్మిక అటెండ్ అవడం, కలిసి న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. తాజాగా రష్మిక బర్త్‌డే సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా సేమ్ లొకేషన్లో ఉన్న ఓ ఫోటో బయటకు వచ్చింది. దీంతో ఓ మీడియా సంస్థ విజయ్-రష్మికల డేటింగ్ను కన్ఫామ్ చేస్తూ.. ''విజయ్, రష్మికలు డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమే. విజయ్ తన ఫేవరెట్ రింగ్‌ను రష్మికకు తొడిగాడు. వారిద్దరూ ఒకే ఇంట్లో, ఒకే రూమ్‌లో ఉంటున్నారు. మనం త్వరలోనే గుడ్‌న్యూస్ వినబోతున్నాం'' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ..'అయ్యో ..అతిగా ఆలోచించకు బాబు' అంటూ రీట్వీట్ చేసింది. కానీ తాము ప్రేమలో లేమని మాత్రం చెప్పలేకపోయింది. దీంతో విజయ్-రష్మికలు త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. #RashmikaMandanna & #VijayDeverakonda On Dating It's Clearly Proved... Yes but it was very Seriously 😳 #VijayDevarakonda Favourite Ring 💍 To #Rashmika Figure.. They Both are living in same house same Room.. Surely we can Hear great News 😀 @iamRashmika @TheDeverakonda pic.twitter.com/VotVtLUAr5 — South Digital Media (@SDM_official1) April 6, 2023 -
అసలు పుష్ప ఎక్కడ?.. బన్నీ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప: ది రూల్'. సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్లోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్లో పుష్ప-2 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇవాళ రష్మిక బర్త్ డే సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్తో ముందుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప' అనే డైలాగ్‌తో 20 సెకన్ల గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అసలు పుష్ప ఎక్కడ? అంటూ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేశారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. పుష్ప-2 గ్లింప్స్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ కూడా.. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అలానే అల్లు అర్జున్ కూడా ఈ సీక్వెల్‌తో 'పుష్ప' కన్నా హై రేంజ్లో హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పాన్ వరల్డ్ వైడ్‌గా తన క్రేజ్‌ను పెంచుకోవాలని మరింత కష్టపడుతున్నాడు. #WhereIsPushpa ? The search ends soon! - https://t.co/clOLWfGV6L The HUNT before the RULE 🪓 Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥 Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial pic.twitter.com/ayodpfY45a — Pushpa (@PushpaMovie) April 5, 2023 -
నాకు సినిమాలపై ఆసక్తి లేదు సార్.. ఫోన్ పెట్టేయండి: రష్మిక
రష్మిక మందన్నా ఈ పేరు వింటే చాలు సౌత్, బాలీవుడ్‌తో ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆమె నటించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ఏకంగా నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ సొంతం చేసుకుంది. ఇవాళ రష్మిక 28వ ఏట అడుగుపెడుతోంది. ఏప్రిల్ 5న ఈ అమ్మడు బర్త్ డే కావడంతో పుష్ప-2 టీమ్ కూడా క్రేజీ అప్ డేట్‌తో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. చివరిసారిగా వారసుడు మూవీతో అభిమానులను పలకరించింది అమ్మడు. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. అయితే తన సినీరంగంలో ఎంట్రీపై ఆసక్తికర విషయాలు పంచుకుంది ముద్దుగుమ్మ. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందాల పోటీలో గెలుపొందిన తర్వాత తనకు సినిమాలో ఆఫర్ చేశారని తెలిపింది. అయితే అది ప్రాంక్ కాల్‌గా భావించి 'నాకు సినిమాలపై ఆసక్తి లేదు సార్.. ఫోన్ పెట్టేయండి' అని ఆ నంబర్‌ను బ్లాక్ చేసినట్లు తెలిపింది. దీంతో దర్శక, నిర్మాతలు స్నేహితుల ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ చివరికి వారు నా క్లాస్ టీచర్ ద్వారా నన్ను కలిశారు. చిత్రనిర్మాతని కలిశాక.. తనకు ఎలా నటించాలో తెలియదని చెప్పినట్లు రష్మిక తెలిపింది. అయితే తనతో కొన్ని డైలాగ్‌లను రికార్డ్ చేసిన తర్వాత ఎంపిక చేశారని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం టాలీవుడ్ మూవీ పుష్ప సీక్వెల్ పుష్ప-2 అలరించేందుకు సిద్ధమైంది. రష్మిక సినీ కెరీర్ రష్మికా మందన్నా 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. 2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించిన రష్మిక 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె పాత్రకు ఉత్తమ తొలి ప్రదర్శనగా సైమా అవార్డును కూడా గెలుచుకుంది. 2017లో రష్మిక రెండు కన్నడ చిత్రాలలో అంజనీ పుత్ర, చమక్‌లో కనిపించింది. టాలీవుడ్లో ఛలో చిత్రం ద్వారా అడుగు పెట్టింది. 2021లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం కాగా.. అదే సంవత్సరంలో గుడ్ బై సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్- 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2017లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. కాగా.. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పుష్ప మేకర్స్ విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది. Team #PushpaTheRule wishes the gorgeous 'Srivalli' aka @iamRashmika a very Happy Birthday ❤️ May you continue to RULE our hearts ❤️🔥 Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/wNbsDxOUys — Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023 -
సమంత షాకింగ్ నిర్ణయం.. రష్మిక చేతిలోకి బిగ్ ప్రాజెక్ట్
-
నాటు నాటు సాంగ్.. ఒకే వేదికపై ఆలియా భట్, రష్మిక
ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. రెండో రోజు కూడా అదేస్థాయిలో పలువురు బాలీవుడ్ తారలు వేదికపై సందడి చేశారు. వారికి ఇష్టమైన పాటలకు స్టెప్పులు వేస్తూ హల్చల్ చేశారు. వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. పలువురు బాలీవుడ్ తారలు సైతం వేదికపై డ్యాన్స్ చేశారు. రణవీర్ సింగ్ సైతం ప్రియాంక చోప్రాతో కలిసి స్టెప్పులేశారు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తూ జిగి హడిద్‌ను చేతులపై ఎత్తుకుని సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్లో పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, దుల్కర్ సల్మాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Indian Express Entertainment (@ieentertainment) -
అట్టహాసంగా ఐపీఎల్.. స్టేడియాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్
ఐపీఎల్-2023 సందడి గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఆరంభ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా వేదికపై మెరిశారు. టాలీవుడ్ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ స్టేడియాన్ని ఊర్రూతలూగించారు. 'ఊ అంటావా మావ' అంటోన్న తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నా ఐపీఎల్ వేదికపై అదరగొట్టింది. పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అంటూ స్టేడియాన్ని హోరెత్తించింది. ఈ పాటకు అభిమానులు మొత్త స్టేడియంలో పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోయారు. 𝘿𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧!@tamannaahspeaks sets the stage on 🔥🔥 with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C — IndianPremierLeague (@IPL) March 31, 2023 నాటు నాటు సాంగ్‌తో రష్మిక మందన్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఐపీఎల్ వేదికపై దుమ్మురేపింది. పుష్ప సినిమాలోని 'సామి సామి', శ్రీవల్లి పాటలతో సహా.. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు అంటూ స్టెప్పులతో అదరగొట్టింది. కాగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్-2023 వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. Sound 🔛@iamRashmika gets the crowd going with an energetic performance 💥 Drop an emoji to describe this special #TATAIPL 2023 opening ceremony 👇 pic.twitter.com/EY9yVAnSMN — IndianPremierLeague (@IPL) March 31, 2023 -
రష్మిక వాలెంటైన్స్ డే విషెస్.. విజయ్ కోసమేనా..!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అటు టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలతో తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా రష్మిక చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. మీ అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను ప్రేమించే వారికి మా తరఫున ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ వీడియోలో తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కనిపించింది ముద్దుగుమ్మ. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ కోసమేనా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో విజయ్ ఎక్కడ? కియారా-సిద్ధార్థ్ లాగా మీరు కూడా పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక- విజయ్ బెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. కాగా.. ఇటీవలే విజయ్‌తో నటించిన వారిసు(వారసుడు)తో సక్సెస్ అందుకున్న నేషనల్ క్రష్ అల్లు అర్జున్ పుష్ప-2 నటించనుంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 'పుష్ప' హిట్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘యానిమల్’ సినిమాలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఐదేళ్లలో 5 లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక? నెట్టింట ట్వీట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న రష్మికకు సంబంధించి తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. కెరీర్ ప్రారంభించిన 5ఏళ్లలోనే రష్మిక ఐదు ప్రదేశాల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసిందట. తన సంపాదనలో ఎక్కువ శాతం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేస్తోందని, ఇందులో భాగంగానే హైదరాబాద్, కూర్గ్, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్మెంట్స్ ఉన్నాయంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా రష్మిక స్పందించింది. 'ఇదంతా నిజమైతే బాగుండు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఇవన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. కాగా ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. 'పుష్ప' హిట్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘యానిమల్’ సినిమాలో నటిస్తుంది. #Rashmika owns 5 luxurious apartments in 5 places🤨#RashmikaMandanna 🔥 pic.twitter.com/9zHBwvPU37 — Nerdy News (@NerdyNews07) February 10, 2023 -
చాలా అందమైన సినిమా: రష్మిక ప్రశంసల వర్షం
విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. యూట్యూబ్ యాక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. కలర్ ఫోటోతో హీరో అయ్యాడు. ఈ తర్వాత ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన సుహాస్ మూవీని పలువురు సినీతారలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ట్వీట్ చేసింది పుష్ప భామ. రష్మిక తన ట్విటర్లో రాస్తూ.. ' మీరు చాలా అందమైన సినిమా తీశారు. మీ చిత్రబృందాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న మీకు ప్రత్యేక అభినందనలు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి వెళ్లి ఈ చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మహిళల కోసం ప్రత్యేకంగా ఈనెల 8న ఉచిత షోలు ఏర్పాటు చేసినట్లు రైటర్ పద్మభూషణ్ చిత్రబృందం ప్రకటించింది. మాస్ మహారాజా రవితేజ సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని కొనియాడారు. సుహాస్ నటన అద్భుతంగా ఉందని.. ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశానని తెలిపారు. క్లైమాక్స్ హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రశంసించారు రవితేజ. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరో హీరో నవీన్ పోలిశెట్టి సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రబృందాన్ని అభిందిస్తూ ట్వీట్ చేశారు. You guys have made such a beautiful film..@SharathWhat @anuragmayreddy and @ActorSuhas Dear comrade to now- so so proud! ❤️Congratulations on this huge success you guys🤗🤗❤️ I hope all of you go give it a watch.. highly recommended for u my beautiful ladies❤️ and guess what.👇🏻 pic.twitter.com/t7NtOdO7ls — Rashmika Mandanna (@iamRashmika) February 7, 2023 What a performance by @ActorSuhas.Thoroughly enjoyed watching #WriterPadmabhushan. The climax is heart of the film❤️ Absolutely loved it. A must watch for all. Kudos to @anuragmayreddy @SharathWhat, director @prasanthshanmuk & young team for pulling off such a refreshing film — Ravi Teja (@RaviTeja_offl) February 7, 2023 So happy to see the response to #WriterPadmabhushan . The team deserves all the love. Go watch the film with your families if you haven’t yet. Congrats Agent Bobby @ActorSuhas . And super happy for my brothers @SharathWhat @anuragmayreddy ❤️ — Naveen Polishetty (@NaveenPolishety) February 7, 2023 -
మళ్లీ దొరికిపోయిన రష్మిక-విజయ్.. ఈసారి ఏకంగా!
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ గురించి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ జంట ఎక్కడికెళ్లినా ఇద్దరు ప్రత్యక్షమవుతుంటారు. గతంలో వ్యాకేషన్‌కు వెళ్లి సోషల్ మీడియాలో షేర్ ఫోటోలు షేర్ చేసి దొరికిపోయారు. తాజాగా మరోసారి ఈ జంట దుబాయ్‌లో మెరిసింది. ఇప్పటికే ఈ జంటపై సోషల్ మీడియాలో డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో విజయ్ దేవరకొండ, అతని కుటుంబంతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అక్కడే విజయ్ పక్కన రష్మిక నవ్వుతూ కనిపించింది. అయితే ఇప్పటివరకు ఈ జంట రిలేషన్‌పై ఎక్కడా నోరు విప్పలేదు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న విజయ్‌తో అతని తల్లిదండ్రులతో కలిసి వ్యాకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో పలుసార్లు విదేశాల్లో పర్యటించినా.. ఇద్దరు కలిసి ఫోటోలో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ ఫోటోలను కొందరు నెటిజన్లు ట్విటర్లో షేర్ చేశారు. రష్మిక -విజయ్ రష్మిక మందన్నా, విజయ్ జంటగా తెలుగులో రెండు చిత్రాల్లో నటించారు. అయితే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి. కాగా.. విజయ్ చివరిసారిగా పాన్-ఇండియా చిత్రం 'లైగర్'లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత సమంతతో కలిసి 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు రష్మిక చివరిసారిగా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను'లో కనిపించింది. ఆమె ఇప్పుడు టాలీవుడ్లో సూపర్ హిట్ మూవీ పుష్ప సీక్వెల్లో నటిస్తోంది. ఆ తర్వాత రణబీర్ కపూర్‌తో 'యానిమల్' చిత్రంలో కనిపంచనుంది. Virosh at Dubai #VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/VDfyNhlkel — Rashmika VijayDeverakonda 💕 (@Rashmikavijay8) January 30, 2023 -
రష్మిక నోటి దురుసు.. సౌత్ ఇండస్ట్రీ నుండి బ్యాన్..?
-
యూట్యూబ్ లోనూ " తగ్గేదేలే " అంటున్న " పుష్ప " సాంగ్స్
-
ITF Tennis Tourney: క్వార్టర్స్‌లో రష్మిక, సౌజన్య
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–2, 6–1తో ప్రతిభ (భారత్)పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణకే చెందిన టోర్నీ నాలుగో సీడ్ యడ్లపలిప్రాంజల, సౌజన్య బవిశెట్టి... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రాచపూడి ప్రత్యూష క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రాంజల 6–3, 6–3తో యువరాణి బెనర్జీ (భారత్)పై, సౌజన్య 6–2, 6–2తో సోహా సాదిఖ్ (భారత్)పై, ప్రత్యూష 2–6, 6–2, 6–4తో జగ్మీత్ కౌర్ (భారత్)పై గెలిచారు. అయితే మరో తెలంగాణ ప్లేయర్ సామ సాత్వికకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 4–6, 6–2, 2–6తో క్వాలిఫయర్ ఆకాంక్ష దిలీప్ (భారత్) చేతిలో ఓడింది. -
'నేషనల్ క్రష్' చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..
National Crush Rashmika Mandanna Childhood Photos: రష్మిక మందన్న.. నిజానికి కన్నడ నటి. తెలుగులో ఛలో సినిమాలో నటించినా అంత గుర్తింపు రాలేదు. కానీ గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా తెలుగు స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న 'పుష్ప: ది రైజ్' చిత్రంలో 'శ్రీవల్లి' పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'సామి సామి' సాంగ్ ఎంత బంపర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా 'మిషన్ మజ్ను' చిత్రంతో హిందీలో అరంగ్రేటం చేయనుందీ క్యూటీ. సినిమాలో బిజీయే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుందీ శ్రీవల్లి. అయితే తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన నేషనల్ క్రష్ చిన్ననాటి ఫొటోలపై ఓసారి లుక్కేద్దామా ! View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) 1996, ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాజీపేటల జన్మించింది రష్మిక మందన్న. సైకాలజీలో బ్యాచ్‌లర్ డిగ్రీ, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది. ఓ పక్క చదువుతూనే మరోపక్క మోడలింగ్ కూడా చేసింది. 2014కు గాను 'క్లీన్ అండ్ క్లియర్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ అఫ్ ఇండియా' టైటిల్ కూడా గెలుచుకుంది. 2016లో కన్నడ సినిమా 'కిర్రాక్ పార్టీ'తో సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. తర్వాత 2017 జూలై 3న తన కోస్టార్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. అనంతరం పలు అనివార్య కారణాలతో వారి వివాహం ఆగిపోయింది. తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన 'గీతా గోవిందం'తో ఒక్కసారిగా పాపులర్ అయింది రష్మిక. ఇది చదవండి: 'ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. అది సమస్యేమీ కాదు' -
Srivalli Rashmika:: ముగిసిన శ్రీవల్లి రష్మిక ప్రయాణం
Rashmika Srivalli : ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రయాణం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–7 (4/7), 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో నిక్కీ 6–4, 6–2తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై గెలిచాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని జంట ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో టోర్నీ మూడో సీడ్ శ్రావ్య శివాని–షర్మదా బాలు (కర్ణాటక) 6–1, 3–6, 10–7తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల– స్నేహల్ మానే (మహారాష్ట్ర) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన సెమీ ఫైనల్లో నిక్కీ పూనాచా–ప్రజ్వల్ దేవ్ (కర్ణాటక) 6–4, 7–5తో పారస్ దహియా (హరియాణా)– ఇక్బాల్ (వెస్ట్‌బెంగాల్) ద్వయంపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు