
Rashmika Srivalli : ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రయాణం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–7 (4/7), 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో నిక్కీ 6–4, 6–2తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై గెలిచాడు.
ఇక మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని జంట ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో టోర్నీ మూడో సీడ్ శ్రావ్య శివాని–షర్మదా బాలు (కర్ణాటక) 6–1, 3–6, 10–7తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల– స్నేహల్ మానే (మహారాష్ట్ర) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన సెమీ ఫైనల్లో నిక్కీ పూనాచా–ప్రజ్వల్ దేవ్ (కర్ణాటక) 6–4, 7–5తో పారస్ దహియా (హరియాణా)– ఇక్బాల్ (వెస్ట్‌బెంగాల్) ద్వయంపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు.
చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు
Comments
Please login to add a commentAdd a comment