breaking news
Delhi
-
ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్
భోజనం హాయిగా నచ్చిన విధంగా ఆస్వాదిస్తేనే కదా మజా..!. దానికి కూడా ఆంక్షలు అంటే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఎవ్వరికైనా. అది సహజం. అందులోనూ సరదాగా వీకెండ్లో నచ్చిన హోటల్ లేదా రెస్టారెంట్లకు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నా..ఇలాంటి మాటలు ఎదురైతే ఎవ్వరికైన ఒళ్లు మండిపోతుంది. అలాంటి అనుభవవే యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మకి ఎదురైంది. పాపం ఆమె ఇదేంటి డబ్బులు కట్టేది కూడా నేనే అయినప్పుడూ ఇదేంటంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..ఆమె ఢిల్లీలో హౌస్ ఆఫ్ మింగ్లో ప్రసిద్ధ తాజ్ మహల్ హోటల్‌కి వెళ్లింది. ఆ హోటల్లో తనకెదురైన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. దీపావళి సందర్భంగా ఏదైనా వెరైటీగా చేయాలనకున్నామని తెలిపింది. ఆ నేపథ్యంలోనే తను సోదిరితో కలిసి తాజ్ హోటల్లో విందుకు వచ్చినట్లు వెల్లడించింది. అంతా బాగానే సాగుతుండగా ఇంతలో మేనేజర్ వచ్చి అతిథుల్లో ఒకరికి మీ వల్ల ఇబ్బంది ఉందంటూ..సరిగా కూర్చొమని చెప్పడం జీర్ణించుకోలేకపోయింది. అక్కడ శ్రద్ధా కూర్చిమీదనే షూస్ వదిలేసి పద్మాసనంలో కూర్చొన్నారు. అది మన భారతీయ సంప్రదాయ విధానమే. అయినా..అలా అనడం శ్రద్ధాని బాగా బాధించడంతో ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో వివరిస్తూ..తానెలా కూర్చొందో కూడా వీడియో రూపంలో చూపించింది. ఇది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని తనకు తెలుసని, ఇక్కడకు చాలామంది ధనవంతులు వస్తుంటారని తనకు తెలుసంటూ ఆగ్రహంగా మాట్లాడారామె. అయినా తాను సంపాదించిన డబ్బుతోనేగా ఇక్కడకు రాగలిగింది అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎవరికో సమస్య ఉంటే ..తనను ఇలా కాళ్లు దించి సరిగా కూర్చోమని చెప్పడం సరికాదు, ఎందుకంటే డబ్బులు కట్టేది తానే కదా అంటూ వాపోయారు. ఇక్కడ సంస్కృతిని, సంపదతో వేరుచేసి చూస్తూ..గోడలు కట్టుకుంటున్నామంటూ మండిపడ్డారమె. అయినా తాను సల్వార్ కుర్తా ధరించి సరిగానే కూర్చొన్నా, మర్యాదగానే ప్రవర్తించాన, మరి దీనికెందుకు అభ్యంతరం చెప్పాలంటూ నిలదీశారు. నిజానికి పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, కానీ ఇవాళ ఆయనకు చెందిన తాజ్ హోటల్ తనను చాలా నిరాశపరిచేలా అవమానించిందని బాధగా చెప్పుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ పోస్ట్‌ని చూసి..లగ్జరీ హోటళ్లు డ్రెస్ కోడ్లంటూ ప్రవర్తన నియమావళి పెడుతున్నారని, ఇవి తప్పనిసరి కాదంటూ ఆమెకు మద్దతు పలికారు. అయినా సరదాగా విందుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడూ ఆ సమయం మనది మనకు నచ్చినట్లు ప్రవర్తించే హక్కు ఉందని, ఎందుకంటే ఆ వ్యవధికి బిల్లు చెల్లించేది మనమే కదా అంటూ శ్రద్ధని సపోర్టు చేస్తూ పోస్టుల పెట్టడం గమనార్హం. మనం వెళ్లే ప్రదేశం బట్టి దానికి అనుగుణంగా మన వ్యవహారశైలి ఉండాలి గానీ, మరి ఇలా సవ్వంగా ఉన్నాకూడా అతి చేస్తే..అసలుకే పెనుముప్పు కదూ..!. హాయిగా ఆస్వాదించే భోజనం వద్ద ఇలా రూల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం సబబు కాదనేది అంగీకరించాల్సిన వాస్తవం.एक आम इंसान, जो मेहनत करके, अपना पैसा कमा कर, अपनी इज़्ज़त के साथ ताज होटल में आता है — उसे आज भी इस देश में ज़लील और अपमानित होना पड़ता है।और मेरी गलती क्या है? सिर्फ़ ये कि मैं बैठ गई एक “regular padmasana style” में?क्या ये मेरी गलती है कि ताज मुझे सिखा रहा है कि कैसे बैठना… pic.twitter.com/vKBYjg8ltb— Shradha Sharma (@SharmaShradha) October 21, 2025 (చదవండి: శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..) -
Delhi: యజమాని తిట్టాడని.. అతని ఐదేళ్ల కుమారునిపై పాశవిక దాడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక డ్రైవర్ అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. నరేలా ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారిపై పగతీర్చుకునేందుకు అతని దగ్గర పనిచేసే డ్రైవర్ నీతు తన యజమాని ఐదేళ్ల కుమారుడిపై ఇటుకలతో దాడి చేసి, కత్తితో తీవ్రంగా గాయపరిచి, హత్య చేశాడు. యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు ముందు అతను ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, తన గదిలో ఉంచాడు. ఆ గదిలోని బాలుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ హత్య అనంతరం నిందితుడు నీతు పరారయ్యాడు. అతనిని వెదికేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నీతూను అతని యజమాని తీవ్రంగా మందలించిన దరిమిలా అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నరేలా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు బాలుని కిడ్నాప్‌పై ఫోన్లో ఫిర్యాదు వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) హరేశ్వర్ స్వామి తెలిపారు. బాలుడు తమ ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో అదృశ్యమయ్యాడని ఫిర్యాదులో తెలిపారన్నారు. కుటుంబ సభ్యులు, ఇంటి చుట్టుపక్కలవారు బాలుని కోసం గాలించగా, అతని మృతదేహం అక్కడికి సమీపంలోని నీతు గదిలో కనిపించిందని హరేశ్వర్ స్వామి వివరించారు.బాలుని తండ్రి ఎనిమిది రవాణా వాహనాలను నడుపుతూ, నీతు, వసీంలను డ్రైవర్లుగా నియమించుకున్నాడని, సోమవారం సాయంత్రం, మద్యం మత్తులో ఇద్దరు డ్రైవర్లూ గొడవ పడ్డారని, దీనిలో జోక్యం చేసుకున్న యజమాని.. డ్రైవర్ నీతును కొట్టాడని హరేశ్వర్ స్వామి చెప్పారు. ఈ అవమాన భారంతో నీతు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడన్నారు. ఈ ఉదంతం గురించి తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్లతో తక్షణ చర్యలు -
ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మంగళవారం నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్ విభాగంలో చేరిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) తెలిపింది. ఇది గతంలో 2024లో 330, 2023లో 218, 2022లో 312, 2021లో 382గా నమోదైందని సీపీసీబీ గుర్తు చేసింది. పండుగ రోజు, సోమవారం రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే, జనం ఆ పరిమితిని పట్టించుకోలేదు.అర్ధరాత్రి వరకు మోతమోగించారు. సోమవారం రాత్రి కాలుష్య కారక సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)స్థాయిలు 675కు చేరాయని సీపీసీబీ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీపై దట్టమైన బూడిదరంగు మంచు మేఘాలు కమ్ముకున్నాయి. వాయు నాణ్యత రెడ్ జోన్ స్థాయికి చేరుకుంది. వీటన్నిటికీ పంజాబ్ రైతుల పంటవ్యర్థాల దహనమే కారణమని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం నిషేధాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపింది. ఢిల్లీలో దీపావళికి ముందు ఏక్యూఐ 345 ఉండగా, మంగళవారం ఉదయం కేవలం 11 పాయింట్లు పెరిగి 356కి చేరుకుందని పేర్కొంది. -
Delhi Danger Bells: దీపావళి బాణసంచాతో మరింత పెరిగిన తీవ్రత
-
INS విక్రాంత్‌లో మోదీ దీపావళి వేడుకలు.. పాకిస్తాన్‌కు కౌంటర్
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొని సైనికులతో సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది. సైనికులే భారత్ బలం. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు, దీపావళికి వెలిగించే దీపాల లాంటివి. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి.#WATCH | Prime Minister Narendra Modi says, "The night spent yesterday on INS Vikrant is hard to put into words. I saw the immense energy and enthusiasm you all were filled with. When I saw you singing patriotic songs yesterday, and the way you described Operation Sindoor in your… pic.twitter.com/UrGF2gngn6— ANI (@ANI) October 20, 2025ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాకు ప్రతీక. ఆపరేషన్ సిందూర్ సమయంలో పరాక్రమం చూపించిన త్రివిధ దళాలకు సెల్యూట్. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు నిద్ర కూడా పట్టదు. ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక. బ్రహ్మోస్, ఆకాశ్ మిస్కైల్ తమ సత్తా ఏంటో చూపించాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరం’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Prime Minister Narendra Modi says, "... Just a few months ago, we witnessed how the very name Vikrant sent waves of fear across Pakistan. Such is its might — a name that shatters the enemy’s courage even before the battle begins. This is the power of INS Vikrant... On… pic.twitter.com/TL03Z9CFdg— ANI (@ANI) October 20, 2025ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత తొలి దీపావళిలో మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. 2014 నుంచి సాయుధ దళాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ..‘దీపావళి వెలుగుల పండగ మన జీవితాలను సౌభాగ్యంతో, సంతోషంతో నింపాలి. సానుకూలత మన చుట్టూ వ్యాపించాలి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.Greetings on the occasion of Diwali. May this festival of lights illuminate our lives with harmony, happiness and prosperity. May the spirit of positivity prevail all around us.— Narendra Modi (@narendramodi) October 20, 2025 -
ప్రమాదకరంగా ఢిల్లీలో వాయు కాలుష్యం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానిలో వాయుకాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది(Delhi Pollution). సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. ఆదివారం వాయునాణ్యత(AQI) సూచీ 300 మార్కు దాటింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత పడిపోవడంతో విజిబిలిటీ తగ్గింది. దీంతో గ్రాప్-2 చర్యలను అమల్లోకి తెచ్చారు. గ్రాప్-2(GRAP-2) చర్యల నేపథ్యంలో.. ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిపై నిషేధం ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదు రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని.. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని.. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ చెబుతుంది. ఇదీ చదవండి: ‘దీపాలపై డబ్బులు తగలేయొద్దు!’ -
ఒకరికి భార్య.. మరొకరికి లవర్.. ఢిల్లీలో జంట హత్యలు!
వివాహేతర సంబంధం కారణంగా తన ప్రాణాలే కోల్పోయింది ఓ మహిళ. తన భార్యను ప్రియుడు తన కళ్లముందే చచ్చేలా కొట్టడాన్ని భరించలేకపోయాడు భర్త. దాంతో ఆ ప్రియుడ్ని కూడా చంపేసి కసి తీర్చుకున్నాడు. భార్యను రక్షిద్దామని చేసిన ప్రయత్నంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నైతికతను మరిచి వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన జంట హత్యలు కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకరు లవర్ కోసం, మరొకరు భార్య కోసం నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రామ్ నగర్ ఏరియాలో షాలిని(22) తనది అంటూ స్థానికంగా క్రిమినల్‌గా పేరొందిన అశూ అలియాస్ శైలేంద్ర రోడ్డుపైనే ఆమెను అడ్డగించాడు. ఇందుకు కారణంగా ఆ రౌడీ షీటర్‌తో షాలిని కొంతకాలం వివాహేతర సంబంధం నడపడమే. భర్తతో కలిసి బయటకు వెళుతన్న సమయంలో ఇది చోటు చేసుకుంది. తామిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టాడని, తనతోనే కలిసుండాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన షాలిని.. లవర్‌తో విభేదించింది. తాను భర్తతో ఉంటానని తెగేసి చెప్పేసింది. దాంతో ఆమెను నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు ప్రియుడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆకాశ్.. భార్యను కాపాడుకునే యత్నం చేశాడు. ఒకవైపు భార్యను లవర్ చావబాదుతంటే అదే స్థాయిలో ప్రతిఘటించాడు. ఈ క్రమంలోనే ముగ్గురికి కత్తిపోట్లు బలంగా దిగాయి. వీరు ముగ్గురు రక్తమడుగులో ఉన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ షాలిని, ఆమె ప్రియుడు ఆశూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు డిల్లీ సెంట్రల్ డీసీపీ నిధిన్ వాల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం భార్యను కాపాడే క్రమంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త ఆకాశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.అతిపెద్ద మ్యూజియంలో అతిపెద్ద చోరీ.. ఏడు నిమిషాల వ్యవధిలోనే..! -
చిమ్మ చీకటిలో ఢిల్లీ..!
చీకటి.. ఢిల్లీ నగరానికి బాగా అలవాటైపోయింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఢిల్లీలో ‘చీకటి’ని తగ్గించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. దీనికి కారణం గాలి కాలుష్య తీవ్రత అదుపులో లేకపోవడమే. దాంతో మరొకసారి ఢిల్లీని చిమ్మ చీకటి అల్లేసింది. దీపాల పండుగ దీపావళి రాకముందే దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి దిజారిపోవడంలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) వ్యాప్తంగా వాయు కాలుష్యం 'చాలా ప్రమాదకరం' కేటగిరీకి చేరింది. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాయు కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దానిని ‘చాలా ప్రమాదకరం’గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 మార్కును దాటేసింది. ఘజియాబాద్‌లోని లోనిలో అత్యధికంగా 339గా నమోదయ్యింది. నోయిడా సెక్టార్ 125లో 358కి చేరింది. అలాగే ఆనంద్ విహార్ (335), వజీర్పూర్ (337) ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) తొలి దశను అమలులోకి తెచ్చారు. ఈ దశలో నిర్మాణ, కూల్చివేతల పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం లాంటి ఆంక్షలు విధించారు. కాలుష్యం మరింత పెరిగిన పక్షంలో రెండో దశ కింద అధికారులు మరిన్ని కఠినమైన చర్యలను చేపట్టనున్నారు.#WATCH | Delhi | The Air Quality Index (AQI) around Akshardham was recorded at 369 this morning, in the 'Very Poor' category in Delhi as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/aPVJ2SZ9ID— ANI (@ANI) October 17, 2025 ఓజోన్, పీఎం10 రేణువుల సాంద్రత వాతావరణంలో పెరగడమే ఈ కాలుష్యానికి ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. గాలి వేగం తక్కువగా ఉండటానికి తోడు ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని వారు చెబుతున్నారు. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం వల్ల చిన్నారులు, వృద్ధులతో పాటు శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్రమైన ఆనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదని, ఒకవేళ తప్పని సరిగా వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాలని చెబుతున్నారు. -
ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఫర్నీచర్‌కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బీడీ మార్గ్‌లోని ఈ అపార్ట్మెంట్.. పార్లమెంట్ హౌస్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో మూడు అంతస్తులు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం ఫోన్ కాల్ తర్వాత 40 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నట్లు తెలిసింది. ఆలస్యంగా రావడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా బాణాసంచా కారణమని స్థానికులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫర్నిచర్ ఉంచడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. సీపీడబ్ల్యూడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ వాసుల ఆరోపిస్తున్నారు. #WATCH | A fire broke out at Brahmaputra Apartments in New Delhi. Six vehicles have been dispatched to the spot. Efforts are underway to put out the fire. https://t.co/QfqJWbteUi pic.twitter.com/0RY9JOzGbq— ANI (@ANI) October 18, 2025 -
Delhi: ప్రొఫెసర్ చెంప మీద కొట్టిన యువతి..
-
హైదరాబాద్‌లో మెరుపులు.. ఇద్దరు డబుల్ సెంచరీలు.. ఏకంగా 529 రన్స్
తూముకుంటలోని నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఢిల్లీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 529 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 256/3తో ఆట కొనసాగించిన జట్టు గురువారం మరో 68 ఓవర్లు ఆడి 273 పరుగులు జోడించింది.సీవీ మిలింద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ బ్యాటర్లలో సనత్ సాంగ్వాన్ (470 బంతుల్లో 211 నాటౌట్; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్ దొసెజా (279 బంతుల్లో 209; 25 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన డబుల్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లను ఉతికారేశారు. ఆయుశ్ ఔటైనప్పటికి సనత్ మాత్రం ఆజేయంగా నిలిచాడు.అనంతరం హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించింది. రాహుల్ సింగ్ (35) అవుట్ కాగా... తన్మయ్ అగర్వాల్ (27 బ్యాటింగ్), అనికేత్ రెడ్డి (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.చదవండి: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్ -
శ్రీలంకను భారత భద్రతకు ముప్పుగా మారనివ్వను
న్యూఢిల్లీ: శ్రీలంక గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుని తీరతానని శ్రీలంక మహిళా ప్రధాని హరిణి అమరసూర్య వ్యాఖ్యానించారు. ఢిల్లీలో డిగ్రీ చదువుకున్న రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. 1991–94కాలంలో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో సోషియాలజీలో డిగ్రీ చదువుకున్న నేపథ్యంలో గురువారం ఆమె పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘శ్రీలంక నిరంతరం ఒకే నిబంధనకు కట్టుబడి ఉంటుంది. పొరుగున ఉన్న మిత్రదేశం భారత్‌కు ముప్పు వాటిల్లేలా మా భూభాగాన్ని ఎలాంటి భారతవ్యతిరేక కార్యకలాపాలకు నెలవు కానివ్వను. ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తాం’’అని అన్నారు. తమ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి గత ప్రభుత్వం కూలిపోవడంపై ఆమె మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం అనేది ప్రేక్షకులు ఆస్వాదించే క్రీడ కాదు. అతి నిరంతర అవిశ్రాంత కృషి. అంటే మన సమాజంతో ఎల్లప్పుడూ మమేకం కావాలి. న్యాయం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరూ తమతమ స్థాయిలో అందరి సంక్షేమం కోసం పాటుపడాలి. శ్రీలంక దేశ చరిత్రలో భారత్ శాశ్వత భాగస్వామిగా కీర్తికిరీటం పొందింది. ద్వీపం అయిన మా దేశంలో ఆర్థికసంక్షోభం తలెత్తినప్పుడు భారత్ నిజమైన నేస్తంలా ఆపన్న హస్తం అందించింది’’అని ఆమె అన్నారు. జయసూర్య తెలుసా? ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని భారత్, శ్రీలంకలో చూడొచ్చు. నాలాంటి సాధారణ వ్యక్తులను సైతం సమాజంలోని సమస్యలు, విద్యావ్యవస్థ రాటుదేలేలా చేస్తాయి. దేశసేవ చేసే స్థాయికి ఎదగనిస్తాయి. పాక్ జలసంధి కేవలం 22 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే సముద్రం వెంట భారత్, శ్రీలంకలను విడదీస్తోంది. కానీ ఇరుదేశాల నాగరికత, సాంస్కృతి, మత, ప్రాచీన బంధం ఏకంగా 2,000 సంవత్సరాల క్రితమే బలపడింది. ఇప్పుడు క్రికె ట్ సైతం ఈ బంధాన్ని పెనవేస్తోంది. 1991 లో ఇక్కడ డిగ్రీ ఆనర్స్ చదివేందుకు హిందూ కాలేజీలో తొలిసారి అడుగు పెట్టినప్పుడు నా పేరు చెప్పా. నాది శ్రీలంక అని తెలిసి చాలా మంది ఒక్కటే ప్రశ్న వేశారు. నీకు క్రికెటర్ జయసూర్య తెలుసా?’’అని ఆమె అన గానే పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ అంజూ శ్రీవాస్తవసహా నాటి ఆమె స్నేహితులు పక్కున నవ్వారు. ‘‘భారత్, శ్రీలంకలు ఒకే సంప్రదాయ వారసత్వం, విలువలు, పరస్పర గౌరవాలతో ఎదిగాయి. ఈ సంస్కృతి బంధం పోగులే ఇరు దేశాల సమాజ సౌభ్రాత్వాన్ని పెనవేసేలా చేశాయి. కొన్ని విషయాల్లో మనలో మనకు కొన్ని పొరపొచ్చాలు రావొచ్చు. కానీ చివరకు అందరం ఇరుగుపొరుగున కలిసే జీవిస్తున్నాం. కలిసి పనిచేస్తున్నాం. చివరకు ఒకరినొకరం గౌరవించుకుంటున్నాం. శ్రీలంక ఆర్థిక పురోభివృద్ధికి భారత్ ఎంతగానో సాయపడుతోంది. కష్టకాలంలో మా ఆర్థిక స్థిరత్వం, ప్రగతికి భారత్ అండగా నిలబడింది. 2022లో తీవ్ర ఆర్థికసంక్షోభంలో మేం కూరుకుపోతే భారత్ రుణసాయం చేసింది. ఈ సాయాన్ని మేం ఏనాటికీ మరువం. ఇరుదేశాల భాగస్వామ్యం నేటి తాత్కాలిక అగత్యం కాదు. రేపటి శాశ్వత అవసరం. గత డిసెంబర్లో మా దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె ఢిల్లీలో పర్యటించడం, ఏప్రిల్‌లో లంకలో మోదీ పర్యటన బలపడుతున్న ఇరుదేశాల బంధానికి గుర్తులు’’అని ఆమె అన్నారు. -
‘తెర’ వెనుక తెగిపోయిన కల
న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని శాంతి నగర్, ఆ రోజు అక్టోబర్ 12. ఆ మధ్య తరగతి కుటుంబంలో ఎప్పుడూ ఉండే ఆనందం, నవ్వులు.. ఆరోజు భయంకరమైన నిశ్శ బ్దంలో కొట్టుకుపోయాయి. తండ్రి ఒక రియల్ ఎస్టేట్ డీలర్, తల్లి గృహిణి, 12వ తరగతి చదువుతున్న కుమార్తె, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు.. ఇంతే ఆ కుటుంబం. పద్నాలుగేళ్ల ఆ బాలునికి ఈ తరం పిల్లల్లాగే సోషల్ మీడియాపై ఆసక్తి ఉంది. తన గదిలోనే ఏదో కొత్త వీడియో తీయాలనే ఉత్సాహంతో ఉన్నా డు. అప్పుడు తెలియదు, ఆ ఉత్సాహమే తన జీవితంలో చివరి క్షణం అవుతుందని.. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని వేళ, తన గదిని ఓ చిన్న స్టూడియోలా మార్చుకున్నాడు. మొబైల్ ఫోన్‌ను ఒక చోట పెట్టి, ’ఆత్మహత్యను అనుకరించే’ దృశ్యాన్ని రికార్డు చేయడం మొదలు పెట్టాడు. తెరపై చూపించే ఉత్కంఠను తానూ అనుభూతి చెందాలనుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నంలో, బాలుడు నిల్చున్న కుర్చీపై నుంచి కాలు జారింది. అంతే.. క్షణాల వ్యవధిలో అంతా మారిపోయింది. బాలుడికి ఊపిరి అందలేదు. కొద్దిసేపటి తరువాత, తల్లిదండ్రులు గదిలోకి వచ్చి చూడగానే.. వారి గుండెలు బద్దలయ్యా యి. ఆందోళనతో వెంటనే దగ్గర్లోని ఆసు పత్రికి తీసుకెళ్లినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ సంఘటనలో ఎలాంటి కుట్ర లేదు. ఆ బాలుడు వీడియో షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపోయి ఉండవచ్చు. వీడియో ఫుటేజీ లోని బాలుని హావభావాలు చూస్తే అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది’.. అని పేర్కొన్నారు. బీజేఆర్ఎం ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి బాలుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమా దవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు. -
ఈసారి ఢిల్లీలో ఘనంగా దీపావళి.. గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు
-
Delhi: గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రజలకు దీపావళికి ముందుగానే పండుగలాంటి వార్త వెలువడింది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఐదేళ్ల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 18 నుంచి, 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ వెలిగించేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణసంచా కాల్చేందుకు అనుమతిచ్చింది. ఇదేవిధంగా సర్టిఫైడ్ క్రాకర్స్ దుకాణాలవారు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ విక్రయించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయి ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.ఢిల్లీ–ఎన్సీఆర్లో గ్రీన్ పటాకుల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ-కామర్స్ ద్వారా పటాకుల విక్రయంపై నిషేధం విధించింది. అలాగే క్యూఆర్ కోడ్ ఉన్న గ్రీన్ పటాకుల విక్రయానికే అనుమతులిచ్చింది. పటాకులు విక్రయాలతో పాటు వాటిని వెలిగించే సమయంలో పోలీస్ అధికారులు ప్రత్యేక పహారా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. సాంప్రదాయ పటాకులు అక్రమంగా విక్రయిస్తున్నారని, వీటివలన కాలుష్యం పెరిగిపోతున్నదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘అర్జున్ గోపాల్’ కేసు తీర్పు దరిమిలా అందుబాటులోకి వచ్చిన గ్రీన్ పటాకుల కారణంగా ఉద్గారాలు తగ్గినట్లు కోర్టు అభిప్రాయపడింది. నీరీ సంస్థ గ్రీన్ పటాకుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని సుప్రీంకోర్టు ప్రశంసించింది. పర్యావరణ పరిరక్షణ–సాంప్రదాయ ఉత్సవాల మధ్య సమతౌల్యం సాధించడమే లక్ష్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.గ్రీన్ క్రాకర్స్ అంటే..కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తున్నారు.మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్‌ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది.గ్రీన్ క్రాకర్స్‌ను గుర్తించడం ఎలా ?.. ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయిస్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయిసఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్‌లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం నుంచి ఇప్పటికి వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉండేది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు (IND vs WI 2nd Test) సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఏడు వికెట్ల తేడాతో జయభేరిప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియా స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలుత అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. ఢిల్లీలో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.కేఎల్ రాహుల్‌తో కలిసితద్వారా విండీస్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో వైట్‌వాష్ చేసింది. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్టులో జురెల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 79 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులతో అజేయంగా నిలిచి.. కేఎల్ రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.సరికొత్త చరిత్రకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ జురెల్ గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారణంగా కొన్నిసార్లు బెంచ్‌కే పరిమితమైన జురెల్.. ఇప్పటికి ఏడు టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 761 పరుగులు సాధించాడు.ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం నుంచి భారత్ తరఫున ఆడిన ఏడు టెస్టుల్లోనూ విజయం సాధించిన జట్లలో భాగమైన తొలి ఆటగాడిగా జురెల్ నిలిచాడు. అంతకు ముందు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అరంగేట్రం (2013) నుంచి వరుసగా ఆరు టెస్టుల్లో గెలిచిన భారత జట్టులో భాగమయ్యాడు.భారత్ తరఫున వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన క్రికెటర్లు👉ధ్రువ్ జురెల్- 7👉భువనేశ్వర్ కుమార్- 6👉కరుణ్ నాయర్- 4👉వినోద్ కాంబ్లీ- 4👉రాజేశ్ చౌహాన్- 4. చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు -
ఢిల్లీలో దీపావళి ధమాకా..?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి టపాసుల మోత మోగే అవకాశాలున్నాయి. వాయు కాలుష్యం దృష్ట్యా ఏళ్లుగా కొనసాగుతున్న సంపూర్ణ నిషేధంపై బీజేపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రజల మతపరమైన, సాంస్కృతిక మనోభావాలను గౌరవిస్తూ, పర్యావరణానికి హాని కలగని రీతిలో హరిత (గ్రీన్) టపాసులకు అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు టపాకాయలపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. గ్రీన్ కాకర్స్కే అనుమతి! సంపూర్ణ నిషేధం బదులుగా, ప్రభుత్వం నిర్దేశించిన, ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే పరిమిత సమయం పాటు కాల్చేందుకు అనుమతించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. పండుగ ఉత్సాహాన్ని దెబ్బతీయకుండా, అదే సమయంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేసేలా ఈ మధ్యేమార్గం ఉత్తమమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యాలని, అందుకే కేవలం తక్కువ ఉద్గారాలు వెలువరించే హరిత టపాసుల వైపే మొగ్గు చూపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఫలించని సంపూర్ణ నిషేధం కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంపూర్ణ నిషేధం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ప్రభుత్వం వాదించనుంది. నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు అక్రమ మార్గాల్లో ప్రమాదకరమైన, అధిక కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను కొనుగోలు చేసి కాలుస్తున్నారని, దీనివల్ల కాలుష్య తీవ్రత తగ్గకపోగా కొన్నిసార్లు మరింత పెరుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కఠినమైన నిషేధం కంటే నియంత్రిత పద్ధతిలో గ్రీన్ క్రాకర్స్‌ను అనుమతించడమే ఆచరణాత్మక పరిష్కారమని బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచి్చంది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి, గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తే నిబంధనల అమలులో ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరం అంతటా పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. -
బంగారు పూత కలశం చోరీ
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో జైన దేవాలయం గోపురం నుండి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు పూత కలశం చోరీ అయ్యింది. ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైన చోరీకి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలివి. జ్యోతి నగర్ ప్రాంత నివాసితులు శుక్రవారం అర్ధరాత్రి భారీ ఎత్తున కర్వా చౌత్ వేడుకల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు విద్యుత్తీగల ఆధారంగా ఆలయం పైకప్పు ఎక్కి, గోపురం పైకి చేరుకున్నాడు. అక్కడున్న బంగారు పూత కలశాన్ని చోరీ చేసి పారిపోయాడు. అష్ట ధాతువులతో కలశం తయారీ చోరీ అయిన కలశం ’అష్ట ధాతువులు’ (ఎనిమిది లోహాల మిశ్రమం)తో తయారైంది. దీని తయారీకి సుమారు 200 గ్రాముల బంగారం వినియోగించారు. కలశం విలువ సుమారు రూ.35–40 లక్షలు ఉంటుందని అంచనా. కలశం సుమారు 25 నుండి 30 కిలోగ్రాముల రాగి, బంగారు పూతతో తయారైందని పోలీసులు తెలిపారు. చోరీపై ఆలయ కమిటీ అధ్యక్షుడు నీరజ్ జైన్ శనివారం ఉదయం ఈస్ట్ జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు బృందాలను ఏర్పాటు చేశామని, అతని కదలికలను తెలుసుకోవడానికి సాంకేతిక నిఘా ఉపయోగిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
6జీ వ్యవస్థపై ఢిల్లీ డిక్లరేషన్
న్యూఢిల్లీ: 6జీ వ్యవస్థను సురక్షితంగా, స్వేచ్ఛగా, సమ్మిళితంగా ఉంచేందుకు ఉపయోగపడే సూత్రాలకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్‌పై భారత్ 6జీ అలయెన్స్‌తో పాటు తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి. నెక్ట్స్జీ అలయెన్స్, 6జీ బ్రెజిల్, జపాన్‌కి చెందిన ఎక్స్‌జీ మొబైల్ ప్రమోషన్ ఫోరం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ భారత్ 6జీ సింపోజియంలో దీన్ని ప్రకటించారు. డిజిటల్ అంతరాలను భర్తీ చేసే విధంగా, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ విశ్వసనీయమైన.. అఫోర్డబుల్ కవరేజీని అందించే విధంగా 6జీ ఉండాలని సంయుక్త ప్రకటనలో తెలిపాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన, నిష్పాక్షికమైన వాతావరణంలో ప్రపంచ దేశాల, ప్రాంతాల, భాగస్వాముల సమాన ప్రాతినిధ్యంతో ప్రమాణాలను రూపొందించాల్సి ఉంటుందని వివరించాయి. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు, టెస్ట్‌బెడ్స్, పైలట్ ప్రాజెక్టుల విషయంలో కలిసి పనిచేయాలని పేర్కొన్నాయి. విశ్వసనీయమైన టెక్నాలజీలను, ఓపెన్ ప్రమాణాలను, సుస్థిర నెట్‌వర్క్‌లను సమిష్టిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఈ డిక్లరేషన్ సూచిస్తోందని భారత్ 6జీ అలయెన్స్ డైరెక్టర్ జనరల్ ఆర్కే పాఠక్ తెలిపారు. 6జీ ట్రయల్స్ 2028లో ప్రారంభమవుతాయని, వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవడానికి మరికొన్నాళ్లు పడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఏఐతో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు .. టెలికం సేవలు 5జీ నుంచి 6జీకి మారుతున్న తరుణంలో సమస్యలేవైనా వస్తే టెలికం నెట్వర్క్ దానంతటదే పరిష్కరించుకునేలా, కస్టమర్లకు మరింత మెరుగైన సరీ్వసులను అందించేలా కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు. ఏఐని మంచికే ఉపయోగిస్తున్నప్పటికీ దుర్వినియోగమయ్యే రిసు్కలు కూడా ఉన్నందున, ఈ టెక్నాలజీ వినియోగంపై అప్రమత్తత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ ఆధారిత టూల్స్ ఏ విధంగా డీప్ ఫేక్స్, వాయిస్ క్లోనింగ్, ఆర్థిక మోసాలు చేసేందుకు దుర్వినియోగమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం టెలికం నెట్‌వర్క్‌లో ఏఐ విషయంలో చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి‘ అని మిట్టల్ వివరించారు. టెలికం శాఖ రూపొందించిన ఏఐ ఆధారిత ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ టూల్‌ని ఉపయోగించి 48 లక్షల అనుమాస్పద లావాదేవీలను బ్లాక్ చేసినట్లు, రూ. 200 కోట్ల నష్టాన్ని నివారించినట్లు పేమెంట్ యాప్స్ అయిన ఫోన్‌పే, పేటీఎం ప్రకటించాయి. -
భారత్‌తో బంధానికి అత్యధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: భారత్‌తో సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సెర్గియో గోర్ చెప్పారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నిమితుడైన సెర్గియో గోర్ శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా సంతకం చేసిన చిత్రపటాన్ని మోదీకి బహూకరించారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై మోదీ, సెర్గియో చర్చించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం సెర్గియో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మోదీని కలుసుకున్నారు. సెర్గియోతో మా ట్లాడడం సంతోషంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా రాయబారిగా ఆయన నేతృత్వంలో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మో దీ గొప్ప నాయకుడు, మంచి మిత్రుడు అంటూ డొ నాల్డ్ ట్రంప్ తరచుగా ప్రశంసిస్తుంటారని సెర్గియో గోర్ గుర్తుచేశారు. మోదీతో కీలక అంశాలపై చర్చించానని తెలిపారు. వరుస భేటీల అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఖనిజాలు సహా ద్వైపాక్షిక వ్యవహారాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో భారత్–అమెరికాలు మరింత సన్నిహితంగా మారడం ఖాయమని అన్నారు. ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. -
అన్నదాతకు అభయం
న్యూఢిల్లీ: దేశంలో తృణధాన్యాల ఉత్పత్తిని భారీగా పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో సాగును ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారు. రూ.24,000 కోట్లతో అమలు చేసే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన(పీఎం–డీడీకేవై)తోపాటు రూ.11,440 కోట్లతో అమలయ్యే ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్’ను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే వ్యవసాయం, పశు పోషణ, మత్స్య, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించి రూ.5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులు సైతం ప్రారంభించారు. రూ.815 కోట్ల విలువైన మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆహారం విషయంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవాలని, ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం వెనుకంజలో ఉందని ఆరోపించారు. వ్యవసాయం, దాని బంధాల రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఏనాడూ ఒక వ్యూహం గానీ, లక్ష్యం గానీ లేవని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తట్టాలి పీఎం–డీడీకేవైతోపాటు తృణధాన్యాల మిషన్ అమలుకు రూ. 35,000 కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నామని, దీనివల్ల కోట్లాది మంది రైతన్నలకు లబ్ధి చేకూరుతుందని, వారి జీవితాల్లో మార్పులు వస్తాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రెండు పథకాలను రాబోయే రబీ సీజన్ నుంచి 2030–31 దాకా అమలు చేస్తారు. 2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సాధనలో అన్నదాతలదే కీలక పాత్ర అని తేల్చిచెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామంటే ఆ ఘనత రైతులదేనని ప్రశంసించారు. అదే స్ఫూర్తితో వికసిత్ భారత్ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్ల అవసరాలకు తగ్గట్టుగా ఆహారం ఉత్పత్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తట్టాలని, విదేశాల్లోని డిమాండ్‌ను తీర్చే పంటలు పండిస్తే మనకు లాభదాయకమని పేర్కొన్నారు. ఆహార దిగుమతులు తగ్గించుకోవడం, ఎగుమతులు పెంచుకోవడం అనే రెండు కీలక లక్ష్యాలు కచ్చితంగా సాధించుకోవాలని వివరించారు. ఇందుకు నేడు ప్రారంభించిన రెండు కొత్త పథకాలు దోహదపడతాయని తెలిపారు. పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలి కేవలం వరి, గోధుమలే కాకుండా పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలని రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ప్రొటీన్ భద్రత కల్పించడానికి తృణధాన్యాల సాగును పెంచాలని చెప్పారు. తృణధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో మన దేశమే తొలిస్థానంలో ఉందన్నారు. అయినప్పటికీ మన అవసరాల కోసం విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘తృణధాన్యాల మిషన్’ కింద తృణధాన్యాల సాగును 2030 నాటికి 35 లక్షల హెక్టార్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏటా 252.38 లక్షల టన్నుల తృణధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయని, 2030–31 నాటికి దీన్ని 350 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. సాగులో సంస్కరణలకు పెద్దపీట ఇక పీఎం–డీడీకేవై కింద 100 జిల్లాలో పంటల సాగు పెంచబోతున్నామని, వేర్వేరు శాఖలకు సంబంధించిన 36 పథకాలను మిళితం చేయబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పంటల ఉత్పత్తిని పెంచడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాగునీరు సదుపాయం, పంటల నిల్వ సామర్థ్యం మెరుగుపర్చడం, రైతులకు రుణాలు ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల అధోగతి పాలైన వ్యవసాయ రంగాన్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టామని గుర్తుచేశారు. ఈ రంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెంచుతున్నామని, విత్తనాల నుంచి మార్కెట్ల దాకా సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. గత 11 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్‌ను ఆరు రెట్లు పెంచామని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ.2 లక్షల కోట్లు అందజేశామని, ఇది చిన్న మొత్తం కాదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక పదేళ్లలో రైతన్నల బాగు కోసం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల రాయితీ ఇచ్చామన్నారు. తృణధాన్యాలు సాగు చేస్తున్న పలువురు రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సంభాíÙంచారు. -
నితీశ్ రెడ్డికి ప్రమోషన్.. ధనాధన్ దంచికొట్టి.. అంతలోనే..
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా (IND vs WI) అదరగొడుతోంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన గిల్ సేన.. లక్ష్యం దిశగా పయనిస్తోంది. శనివారం నాటి రెండో రోజు ఆట భోజన విరామ సమయానికి 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.కాగా అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. ఢిల్లీలో విండీస్‌తో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. తొలిరోజు ఆటలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 318 పరుగులు చేసి ఆధిక్యం ప్రదర్శించింది.డబుల్ సెంచరీ మిస్ చేసుకు న్న జైసూఈ క్రమంలో 318/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 173 పరుగులతో ఆట మొదలుపెట్టిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. మరో రెండు పరుగులు జతచేసి దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. దీంతో డబుల్ సెంచరీ చేయకుండానే జైసూ (175) నిష్క్రమించాడు.నితీశ్ రెడ్డి ధనాధన్అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ జోరు కనబరిచిన ఈ విశాఖ కుర్రాడు.. తృటిలో అర్ధ శతకాన్ని చేజార్చుకున్నాడు. 54 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. విండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత బంతితో నితీశ్ రెడ్డిని వెనక్కి పంపాడు.𝗕𝗶𝗴 𝗵𝗶𝘁, 𝗯𝗶𝗴 𝗶𝗺𝗽𝗮𝗰𝘁! 🙌#NitishKumarReddy hits a massive six, firing up the crowd as #TeamIndia builds momentum. 🔥Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/OZzBhNROPF— Star Sports (@StarSportsIndia) October 11, 2025 ఐదో నంబర్‌కు ప్రమోట్ అయిటీమిండియా తొలి ఇన్నింగ్స్ 108.3వ ఓవర్లో వారికన్ బౌలింగ్‌లో జేడన్ సీల్స్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రెడ్డి పెవిలియన్ చేరాడు. కాగా బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో నంబర్‌కు ప్రమోట్ అయి.. ధనాధన్ దంచికొట్టి ఇలా అతడు వెనుదిరగడం అభిమానులన నిరాశపరిచింది.ఇక లంచ్ బ్రేక్ సమయానికి గిల్ 75 పరుగులు, ధ్రువ్ జురెల్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు అంటే తొలి రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ శతకం (87) చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక విండీస్ తీసిన నాలుగు వికెట్లలో మూడు వారికన్ ఖాతాలోనే ఉన్నాయి. జైసూ రనౌట్‌తో విండీస్‌కు మరో కీలక వికెట్ దక్కింది.చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!Leading from the front! 👑Captain @ShubmanGill brings up a classy half-century - crossing 1000 runs as skipper in international cricket! 💥Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CDjnnehzO6— Star Sports (@StarSportsIndia) October 11, 2025 -
మాకు ఇండియానే ఫస్ట్.. పాకిస్తాన్ కు షాకిచ్చిన తాలిబన్ మంత్రి
-
గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారీ శతకంతో కదంతొక్కిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శనివారం నాటి రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. ద్విశతకానికి పాతిక పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా భారత్- వెస్టిండీస్ (IND vs WI) మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది.తొలిరోజు భారత్దేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ భారీ శతకం బాదాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan- 87) రాణించాడు.జైసూ డబుల్ సెంచరీ మిస్ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక శనివారం ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించిన జైస్వాల్ తన తొందరపాటు చర్యతో రనౌట్ అయ్యాడు.గిల్ తప్పా?టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో విండీస్ పేసర్ జేడన్ సీల్స్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో రెండో బంతికి మిడాఫ్ దిశగా జైసూ బాదిన బంతి నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, ఇంతలోనే జైస్వాల్ పరుగు కోసం క్రీజు వీడగా.. గిల్ మాత్రం పరిస్థితికి తగ్గట్టుగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోనే ఉండిపోయాడు.Yashasvi Jaiswal (runout) seems to have developed a habit of taking off for a run even when the ball goes straight to the fielder. He really needs to learn from this —When you're on a big score, what's the rush for a single? 🤦♂️pic.twitter.com/asdamXT1zj— Sporttify (@sporttify) October 11, 2025 తల బాదుకున్న జైసూదీంతో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా.. అప్పటికే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ దానిని వికెట్లకు గిరాటేశాడు. ఫలితంగా తన ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం రెండు పరుగులు జతచేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన జైసూ.. కోపంలో తలబాదుకుంటూ క్రీజును వీడాడు.తప్పు నీదేఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతుండగా.. కొంతమంది గిల్‌ను తప్పుబడుతున్నారు. అయితే, చాలా మంది మాత్రం.. ‘బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినా తొందరపడి పరుగుకు రావడం జైసూ తప్పు. అతడికి ఇదొక అలవాటుగా మారింది. 175 పరుగులు చేసిన నీకు ఈ రిస్కీ సింగిల్ అవసరమా? ఇది నీ స్వీయ తప్పిదం’’ అంటూ జైస్వాల్‌ను విమర్శిస్తున్నారు.కాగా జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 258 బంతులు ఎదుర్కొని 22 ఫోర్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. వంద ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని! -
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
ముంబై: విమానాల్లో వరుస సమస్యలు ఎయిర్ ఇండియాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా గురువారం ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో దుబాయ్‌లో సురక్షితంగా దించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్‌పీఐ) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానం కూడా బోయింగ్ 787 రకానికి చెందినదే. ఈ నెల 4న బర్మింగ్‌హామ్ వెళ్తుండగా ఇదే రకం విమానంలో ఉన్నట్లుండి అత్యవసర ర్యాట్ తెరుచుకుంది. తాజాగా అదే రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. అయితే, ఆ సమస్యలు ఏమిటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ, ఎఫ్ఐపీ మాత్రం ఆ విమానంలో ఆటోపైలట్, ఇన్స్ట్రుమెంట్ లాండింగ్ సిస్టమ్స్ (ఐఎల్ఎస్), ఫైట్ డైరెక్టరేట్స్ (ఎఫ్‌డీస్) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కీలక వ్యవస్థలన్నీ చెడిపోయాయని ఆరోపించింది. -
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?
ఢిల్లీ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య శుక్రవారం (అక్టోబరు 10) రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలైంది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన భారత జట్టు సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ టీమిండియాకు శుభారంభం అందించారు.ఈసారి నిరాశపరిచిన కేఎల్ రాహుల్అయితే, గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రాహుల్ ఈసారి మాత్రం కాస్త నిరాశపరిచాడు. 54 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. విండీస్ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ జొమెల్ వారికన్ తన తొలి ఓవర్లోనే అద్భుతమైన బంతితో రాహుల్‌ను బోల్తా కొట్టించాడు.Shifting gears! ⚙After a steady start, @klrahul unwinds with an elegant punch down the ground. ⚡Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CpSkK3IJXi— Star Sports (@StarSportsIndia) October 10, 2025స్టంపౌట్గాటీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో పద్దెనిమిదవ ఓవర్ మూడో బంతికి వారికన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో వెంటనే బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ బెయిల్స్‌కు గిరాటేశాడు. pic.twitter.com/iNdmtNK9e6— crictalk (@crictalk7) October 10, 2025 దీంతో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే దురదృష్టవశాత్తూ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 58 పరుగుల స్కోరు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?ఇక తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో ఓపికగా ఆడుతున్నాడు. తొలిరోజు నాటి భోజన విరామ సమయానికి జైసూ 78 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 36 బంతుల్లో మూడు ఫోర్లు బాది 16 పరుగులతో జైసూతో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా శుక్రవారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 28 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో టీమిండియా విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో త్తుగా ఓడించి.. రెండుమ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తుది జట్లు..టీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహహ్మద్ సిరాజ్వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, తగ్‌నరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్‌కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్ -
Delhi: నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె, ఎర్ర కారం.. అరిస్తే ఇంకా పోస్తానంటూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మదన్గీర్లో ఉంటున్న దినేష్.. ఇంట్లో నిద్రస్తున్న సమయంలో అతని భార్య అతనిపై సలసల మరుగుతున్న నూనె, ఎర్రటి కారం పొడి పోసి, అతనికి నరకం అంటే ఏమిటో చూపించింది. అక్టోబర్ 3న ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్మికుడు దినేష్(28) కాలిన గాయాలతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది.అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం దినేష్ నిద్రపోతున్నసమయంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతని భార్య అతని శరీరంపై వేడి నూనె పోసింది. ఆ సమయంలో ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె ఇంట్లోనే ఉంది. అక్టోబర్ 2న.. తన పని ముగించుకున్నాక ఇంటికి తిరిగి వచ్చి, రాత్రి భోజనం చేసి, పడుకున్నానని దినేష్ పోలీసులకు తెలిపాడు. ‘నా భార్య, కుమార్తె అదే గదిలో నిద్రపోతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో, నాకు అకస్మాత్తుగా శరీరం అంతటా మంటపుట్టింది. నా భార్య నా శరీరం, ముఖంపై మరిగే నూనె పోయడం నేను చూశాను. నేను సహాయం కోసం అరుస్తున్నంతలో ఆమె నా కాలిన గాయాలపై ఎర్రని కారం పొడి చల్లింది" అని అతను తన ఫిర్యాదులో ఆరోపించాడు.బాధితుడు అరుస్తుండగా అతని భార్య ‘అరచి గోల చేస్తే.. మీ మీద మరింత నూనె పోస్తానని బెదిరించింది. అయితే దినేష్ బాధను తట్టుకోలేక గట్టిగా కేకలు పెట్టాడు. దానిని విన్న కింద అంతస్తులో ఉంటున్న అతని ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకరైన అంజలి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరుగుతున్నదో చూసేందుకు మా నాన్న ముందుగా పైకి వెళ్ళారు. దినేష్ భార్య లోపలి నుంచి తలుపు తాళం వేసింది. తలుపు తెరవమని మేము వారిని అడిగాం. కొద్దిసేపటి తరువాత ఆమె తలుపులు తెరిచింది. దినేష్ బాధతో విలవిలలాడటాన్ని చూశాం’ అని తెలిపింది.ఈ ఘటన దరిమిలా ఇంటి యజమాని కలగజేసుకుని, బాధితుడిని ఆటోలో ఒంటరిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపించారు. దినేష్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం దినేష్ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో పోలీసులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. తాజాగా ఘటనలో దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు, కొడుక్కి పాలాభిషేకం
విడాకులు (Divoce) అంటేనే అదేదో వినకూడని మాటలాగా, కళంకం అన్న భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్ఫర్తలతో, ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే.. అభిప్రాయాలు కలవన్నప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు.. స్త్రీపురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలు అనేది నేటి మాట. విడాకులు అనేవి అటు మహిళలకుగానీ, ఇటు పురుషులకు గానీ జీవితంలో ఒక ముగింపు కాదని ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనలో గతంలో కూడా చూశాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి, విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారాత్ ఊరేగించి, ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువుర్ని ఆలోచింప జేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభాషేకం, కొత్తబట్టలిచ్చి.. కొత్త జీవితానికి నాంది పలకమని ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్. స్టోరీ ఏంటి అంటే..ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్, భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మర్చిపొమ్మనే సంకేతంగా శుద్ధిగా సంకేతంగా భావించే పాలతో కొడుకుని శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు అతను. బట్టలు, షూ, వాచీ.. ఇలా అన్నీ కొత్తవే అతనికిచ్చింది. అంతేకాదు ‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే ‘120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన అని అర్థం వచ్చేలా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉండటం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి, తానూ తినిపించాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అయ్యింది.చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? Man celebrates divorce with ritual, sweets, and a cake reading “Happy Divorce 120g gold 18L cash.” sharing a caption: “I’m single, happy, free my life, my rules.” Urges others to celebrate themselves.pic.twitter.com/Rrhhlpqoqx— Ghar Ke Kalesh (@gharkekalesh) October 7, 2025 ‘‘120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు తీసుకోలేదు. కానీ నేను ఇచ్చాను.. ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను’’అని పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టూ డివోర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అనికొందరు కమెంట్ చేశారు. జీవితంలోతీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి, చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినపుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చు -అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. -
బాబోయే ఇదేం ట్రాఫిక్!
బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం సహజమే. కానీ, జాతీయ రహదారిల్లో.. అదీ నాలుగు రోజులుగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?(Massive Traffic Jam). ఇదేదో సమ్మెలో భాగం జరిగిందనుకుంటే మీరు పొరపడినట్లే!!. బీహార్‌లోని ఔరంగాబాద్-రోహ్తాస్ మధ్య ఢిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై(Delhi Kolkata Highway) గత నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. వందలాది వాహనాలు బంపర్-టు-బంపర్‌గా నిలిచిపోయి, కిలోమీటర్ల మేర రోడ్డుపై నిలిచిపోయాయి. అయితే ఈ పరిస్థితికి కారణం గత శుక్రవారం రోహ్తాస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు. భారీ వర్షాల కారణంగా.. జాతీయ రహదారి 19పై నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారిపైకి నీరు చేరింది. డైవర్షన్లు, సర్వీస్ రోడ్లు నీటితో మునిగిపోయాయి. అధికార యంత్రాగం సమన్వయం లేకపోవడం, పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహ్తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. స్థానిక పరిపాలన, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI), రహదారి నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అక్కడ ఆగిపోయిన డ్రైవర్లు చెబుతున్నారు. ‘‘30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగాం. టోల్, రోడ్ టాక్స్ చెల్లిస్తున్నాం కదా. అయినా ఎవరూ సహాయం చేయరా?’’అని ప్రవీణ్ సింగ్ అనే ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో డ్రైవర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “రెండు రోజులుగా ట్రాఫిక్‌లోనే ఉన్నాం. ఆకలితో, దాహంతో బాధపడుతున్నాం. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికే గంటల సమయం పడుతోంది” వాపోయాడు.ఇదిలా ఉంటే.. ఈ ట్రాఫిక్ వల్ల వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకెళ్తున్న డ్రైవర్లు అవి పాడైపోతాయని చెబుతున్నారు. ఇంకోవైపు.. అంబులెన్సులు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు ఈ ట్రాఫిక్‌తో ప్రభావితం అయ్యాయి. NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మ ఈ ట్రాఫిక్ సమస్యపై స్పందించేందుకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ప్రపంచంలో అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా?(World Worst Traffic Jam Incident).. అధికారిక గణాంకాలేవీ లేకపోయినా.. 2010లో చైనా దేశంలోని బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వే (National Highway 110) పై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా గుర్తించబడింది. మంగోలియా ప్రాంతం నుండి బీజింగ్‌కు బొగ్గు తీసుకెళ్తున్న వేలాది ట్రక్కులు రహదారిపై నిలిచిపోవడంతో.. బీజింగ్, హెబీ ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 26 వరకు 12 రోజుల పాటు 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయి.. ప్రజలు అవస్థలు పడ్డారు.ఇదీ చదవండి: సౌర తుపానుతో మనిషికి ముప్పేనా? -
దేశంలో తొలి డ్యూయల్ చాంబర్ పేస్‌మేకర్ ఇంప్లాంట్
న్యూఢిల్లీ: గుండె పనితీరును క్రమబద్ధం చేసేందుకు అమర్చే పేస్‌మేకర్ సర్జరీల్లో ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ సరికొత్త చరిత్ర లిఖించింది. దేశంలో తొలిసారి ఓ రోగికి ‘డ్యూయల్ చాంబర్ పేస్‌మేకర్’(డీసీఎల్పీ)ను విజయవంతంగా అమర్చినట్లు మంగళవారం ప్రకటించింది. సాధారణ పేస్మేకర్లు అమర్చేందుకు రోగికి ఛాతీ భాగంలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. పైగా దానికి వైర్లతో బయటి యంత్రానికి అనుసంధానం చేసి గుండె స్పందనలను క్రమబద్ధం చేయాల్సి ఉంటుంది. డ్యూయల్ చాంబర్ లీడ్లెస్ పేస్‌మేకర్లతో ఆ అవసరం ఉండదు.ఇవి చిన్న క్యాప్సూల్ మాదిరిగా ఉంటాయి. వాటిని గుండె పై కర్ణికలో ఒకటి, కింది దమనికలో ఒకదానిని అమరుస్తారు. ఇందుకోసం పొట్టలోకి కృత్రిమంగా ఆహారాన్ని పంపే ఓ గొట్టంలాంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల శస్త్రచికిత్సతో పని ఉండదు. ఈ క్యాప్సూల్స్‌కు వైర్లు ఉండవు. గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి ఈ పరికరాలు రెండు వాటంతట అవే సమాచార మారి్పడి చేసుకుంటాయి. గుండె సాధారణంకంటే వేగంగా కొట్టుకోవటం ప్రారంభించగానే ఇవి పనిచేయటం మొదలుపెట్టి సాధారణ స్థితికి తీసుకొస్తాయి. అలాగే గుండె వేగం సాధారణంకంటే తగ్గితే వెంటనే కృత్రిమంగా వేగాన్ని పెంచుతాయి. 83 ఏళ్ల వ్యక్తికి...మ్యాక్స్ హాస్పిటల్లో 83 ఏళ్ల ఓ రోగికి వీటిని అమర్చారు. ఆస్పత్రి కార్డియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ బల్బీర్‌సింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ అరుదైన చికిత్స నిర్వహించింది. ఆ రోగికి గుండెలో కర్ణిక, దమనికల మధ్య సమన్వయం లోపించటంతో గుండె వేగం సాధారణంకంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వయసు కారణాల రీత్యా సాధారణ పేస్‌మేకర్ చికిత్స సరికాదని గుర్తించి డ్యూయల్ చాంబర్ పేస్‌మేకర్ అమర్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించాయి. -
రిషబ్ పంత్ రీఎంట్రీ..!
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడి, కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతను త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో (Ranji Trophy) తన సొంత జట్టు ఢిల్లీ (Delhi) తరఫున బరిలోకి దిగనున్నాడని సమాచారం.జట్టులోకి రావడమే కాకుండా రంజీ ట్రోఫీలో పంత్ ఢిల్లీ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తాడని తెలుస్తుంది. అయితే ఇదంతా బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించిన తర్వాతే జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధికారి ఒకరు తెలిపారు.అతని మాటల్లో.. పంత్ అక్టోబర్ 25 నుంచి ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు అందుబాటులో ఉంటారు. అయితే అతను క్యాంప్‌లో చేరే ఖచ్చితమైన తేదీని ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అతనికి బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. పంత్ అందుబాటులో వస్తే ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించే అవకాశం ఉంది.కాగా, పంత్ ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా ఆసియా కప్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. గాయానికి చికిత్స పూర్తైనప్పటి నుంచి బీసీసీఐ సెంటల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న పంత్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.బీసీసీఐ నుంచి క్లియరెన్స్ వస్తే అతను త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో పాల్గొంటాడు. ఈ మధ్యలో భారత్ ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు వెళ్లనుంది. ఇందులో రెండు ఫార్మాట్ల (వన్డే, టీ20) జట్లకు పంత్ ఎంపిక కాలేదు. కాబట్టి అతను నవంబర్ మధ్య వరకు ఖాళీగా ఉంటాడు.ఈ మధ్యలో రంజీ ట్రోఫీలో సత్తా చాటితే, ఆతర్వాత జరిగే సౌతాఫ్రికా సిరీస్‌కు అతను సన్నద్దమవుతాడు. సౌతాఫ్రికా నవంబర్ 14 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీలో ఢిల్లీ ప్రయాణం అక్టోబర్ 15న హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవనున్నప్పటికీ.. పంత్ మాత్రం అక్టోబర్ 25 నుంచి హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడు.టీమిండియా షెడ్యూల్ విషయానికొస్తే.. భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఓ మ్యాచ్ అయిపోయగా.. మరో మ్యాచ్ మిగిలింది. ఆ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా జరుగనుంది. అంతకుముందు అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత పరిమిత ఓవర్ల జట్లు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తాయి. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ పర్యటనలోని వన్డే సిరీస్‌తో టీమిండియా వెటరన్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి బరిలోకి దిగుతారు. వీరిద్దరు టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. రో-కో చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
సీజేఐపై దాడికి లాయర్ యత్నం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం 11.35 గంటలకు ఓ కేసుపై విచారణ జరుగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయతి్నంచడం తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టుగదిలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ఆ బూటు జస్టిస్ గవాయ్‌ని తాకలేదు. సీజేఐపై దాడికి ప్రయతి్నంచిన లాయర్‌ను ఢిల్లీ మయూర్ విహార్‌కు చెందిన రాకేశ్ కిశోర్(71)గా గుర్తించారు. అతడిని కోర్టు గది నుంచి బలవంతంగా బయటకు తరలించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోనంటూ రాకేశ్ కిశోర్ నినాదాలు చేయడం గమనార్హం. త నపై జరిగిన దాడి యత్నంపై జస్టిస్ గవాయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు తనపై ఏమా త్రం ప్రభావం చూపబోవని తేల్చిచెప్పారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా స్పష్టంచేశా రు. దాడి యత్నం తర్వాత కూడా కేసుల విచారణ ను ఆయన యథాతథంగా కొనసాగించడం విశేషంఅసలేం జరిగింది? సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం వేర్వేరు కేసుపై విచారణ నిర్వహిస్తుండగా, అక్కడే ఉన్న లాయర్ రాకేశ్ కిశోర్ వారిద్దరూ కూర్చున్న వేదిక వద్దకు దూసుకొచ్చాడు. తన కాలికున్న బూటు తీసి న్యాయమూర్తులపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మధ్యలోనే అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విష్ణు దేవుడి విగ్రహంపై వ్యాఖ్యల వివాదం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహంపై దాఖలైన పి టిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయ్‌పై దాడి యత్నానికి కారణం కావొచ్చని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఖజురహోలోని జవెరీ టెంపుల్‌ను మళ్లీ నిర్మించి, ఏడు అడుగుల విష్ణు దేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ గవాయ్ తిరస్కరించారు. ‘మీరు ఏం కోరుకుంటున్నారో వెళ్లి ఆ దేవుడినే అడగండి. విష్ణు దేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్లి ప్రారి్థంచండి. కొంతసేపు ధ్యానం కూడా చేయండి’’ అని పిటిషనర్‌కు సూచించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.లాయర్‌పై సస్పెన్షన్ వేటు సాక్షాత్తూ సీజేఐపైనే బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్‌పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తక్షణమే చర్యలు తీసుకుంది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. లెసెన్స్‌ను రద్దు చేసింది.రాజ్యాంగంపై దాడి: సోనియాజస్టిస్ గవాయ్‌పై బూటుతో దాడిచేసేందుకు ప్రయతి్నంచడాన్ని కాంగ్రెస్ సీని యర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సిగ్గుచేటు, మతిలేని చర్య అని పేర్కొన్నారు. ఇది మన రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై దాడేనని వ్యాఖ్యానించారు. విద్వేషం, ఉన్మాదం మన సమాజం చుట్టూ ఆవరించుకొని ఉన్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోని యా ఒక ప్రకటన విడుదల చేశారు.జస్టిస్ గవాయ్‌కి ప్రధాని మోదీ ఫోన్ న్యూఢిల్లీ: జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పైకి లాయర్ బూటు విసిరేందుకు ప్రయత్నించడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అనుచిత ధోరణులకు స్థానం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ గవాయ్‌తో ఫోన్లో మాట్లాడానని పేర్కొన్నారు. లాయర్ చర్య పట్ల పూర్తి సంయమనం పాటించినందుకు జస్టిస్ గవాయ్‌ని ప్రశంసించానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ విలువలను, రాజ్యాంగ స్ఫూ ర్తిని బలోపేతం చేయడానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం -
బీసీల రిజర్వేషన్లపై సస్పెన్స్.. ఢిల్లీలో మంత్రుల మంతనాలు
ఢిల్లీ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై(Telangana BC Reservations) అంశంపై నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం అభిషేక్ మనుసింఘ్వీతో వాదనలు వినిపిస్తాం. బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని మాకు నమ్మకం ఉంది. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. సీపెక్ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు. ఇతరుల రిజర్వేషన్లను మేము లాక్కోవడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే మా ఉద్దేశం’ అని తెలిపారు. -
Viral Video: ఢిల్లీ మెట్రోలో పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణికులు
-
ప్రపంచ ఆర్థిక స్థిరీకరణ శక్తిగా భారత్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయని, ఆర్థిక ఆంక్షలు–టారిఫ్‌లు ప్రపంచ సరఫరా వ్యవస్థలను మార్చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ తరుణంలోనూ భారత్ 8 శాతం వృద్ధిరేటును ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ‘కౌటిల్య ఆర్థిక సమావేశం 2025’ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వాణిజ్యం, ఇంధన భద్రత పరంగా ప్రపంచం ఎంతో అసమతుల్యతలను చూస్తోందని, నిర్మాణాత్మక పరివర్తనం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఈ తరుణంలో భారత్ స్థిరీకరణ శక్తిగా నిలుస్తున్నట్టు చెప్పారు. వెలుపలి షాక్‌లను తట్టుకోగలదన్నారు. ‘‘2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు 8 శాతం మేర స్థిరమైన జీడీపీ వృద్ధికి చేరుకోవడం అవసరం. మనం చూస్తున్నది తాత్కాలిక అస్థిరతలు కాదు. నిర్మాణాత్మక మార్పు. ఒకప్పుడు బలమైన కూటములు అనుకున్నవి నేడు కాల పరీక్షను ఎదుర్కొంటున్నాయి. కొత్త కూటములు అవతరిస్తున్నాయి. కనుక కేవలం ప్రపంచ అస్థిరతలను ఎదుర్కోవడమే కాదు. వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక అస్థిరతలతోనూ పోరాడాల్సి రావడం మనముందున్న సవాలు’’అని అని పేర్కొన్నారు. ప్రపంచ సంస్థలు బలోపేతం కావాలి.. అంతర్జాతీయ సంస్థలు (డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ తదితర) బలోపేతం కావాల్సిన అవసరాన్ని మంత్రి సీతారామన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవి నిరీ్వర్యమవుతుండడంతో ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతున్నట్టు చెప్పారు. ఇవి నేటి వాస్తవాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. దేశీయంగా సంస్కరణలు అమలు చేయడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమన్వయం చేసుకోవడం ద్వారా భారత్ పెరుగుతున్న సుంకాల అవరోధాలను, వాణిజ్య కూటముల్లో మార్పులను అధిగమించగలదని చెప్పారు. పెరిగిపోయిన ఉద్రిక్తతలు, అధిక సుంకాలు, విధానపరమైన తీవ్ర అనిశి్చతులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే, పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం, పెరిగిపోయిన నిధుల వ్యయాలు, ఇంధన ధరల్లో అస్థిరతలు సైతం వేధిస్తున్నట్టు చెప్పారు. వీటన్నింటి మధ్య భారత్ స్థిరీకరణ శక్తిగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ ద్రవ్య స్థిరీకరణ, మూలధన వ్యయాల నాణ్యతపై దృష్టి సారించినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ‘‘జీడీపీలో వినియోగం, పెట్టుబడుల వాటా ఈ కాలంలో స్థిరంగా కొనసాగింది. భారత్ వృద్ధి దేశీ అంశాలపై బలంగా ఆధారపడి ఉంది. ఇది వెలుపలి షాక్‌లను పరిమితం చేస్తోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది’’అని వివరించారు. -
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘‘నేను ఖర్గేతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారుకాగా, మల్లికార్జున ఖర్గేకు బుధవారం రాత్రి బెంగళూరు ఆస్పత్రి వైద్యులు పేస్‌మేకర్‌ను అమర్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చిన ఆయన శ్వాసలో ఇబ్బంది, జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు.Spoke to Kharge Ji. Enquired about his health and wished him a speedy recovery. Praying for his continued well-being and long life.@kharge— Narendra Modi (@narendramodi) October 2, 2025తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియా లో..‘వయో సంబంధ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలతో ఖర్గే ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరిచేసేందుకు పేస్‌మేకర్ అమర్చాలని వైద్యులు సలహా ఇచ్చారు’అని తెలిపారు. ఖర్గేకు బుధవారం రాత్రి వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స జరిపి పేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చారు. ఆయన ఆరోగ్యం బాగుందని, గురువారం డిశ్చార్జి అవుతారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. -
Delhi Baba: ‘దుబాయ్ షేక్‌కి ‘పార్ట్నర్’ కావాలి’: షాకిస్తున్న వాట్సాప్ చాట్
న్యూఢిల్లీ: పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతిని అరెస్టు చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఈ నేపధ్యంలో అతని ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిలో పలువురు యువతుల ఫొటోలతోపాటు, సిబ్బంది, విద్యార్థినులతో జరిపిన పలు రకాల వాట్సాప్ చాట్లు ఉన్నాయి. ఇవి పోలీసులను సైతం నివ్వెరరపోయేలా చేస్తున్నాయి.ఎన్డీటీవీ అందించిన ఒక కథనంలోని వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి ఫోన్లో ఒక చాట్ అతని అంతర్జాతీయ నెట్ వర్క్‌ను తెలియజేస్తోంది. దీనిని పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఆ వాట్సాప్ చాట్‌లో చైతన్యానంద సరస్వతి దుబాయ్ షేక్ ‘అవసరం’ తీర్చేందుకు తన ఆధీనంలోని విద్యాసంస్థకు చెందిన విద్యార్థినితో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.ఢిల్లీ బాబా: ‘దుబాయ్ షేక్ ఒకరు తనకు ‘పార్టనర్’ కావాలని అడుగుతున్నారు. అందుకు అనువుగా ఎవరైనా మంచి స్నేహితులు ఉన్నారా?"విద్యార్థిని: ‘కోయీ నహీ హై’ (ఎవరూ లేరు)ఢిల్లీ బాబా: ‘ఎందుకని?’విద్యార్థిని: ‘నాకు తెలియదు’ఢిల్లీ బాబా: ‘నీ క్లాస్మేట్ ఎవరైనా? జూనియర్?’ఇతర చాట్లలో చైతన్యానంద పదే పదేపదే ఒక విద్యార్థిని ‘స్వీటీ బేబీ డాటర్ డాల్’ లాంటి పదాలలో సంబోధించాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చైతన్యానంద సరస్వతి చాట్ చేశాడు.‘బేబీయ్’ (రాత్రి 7:49)‘బేబీ నువ్వు ఎక్కడున్నావు?’ (రాత్రి 11:59)‘గుడ్ మార్నింగ్ బేబీ’ (రాత్రి 12:40)‘నా మీద నీకు ఎందుకు కోపం?’మరో సందర్భంలో ఇలా చాటింగ్.. ‘గుడ్ ఈవెనింగ్ ..నాకు అత్యంత ప్రియమైన బేబీ డాటర్ డాల్’విద్యార్థిని: ‘ఇది మధ్యాహ్నం సార్, హ్యాపీ గుడ్ ఆఫ్టర్ నూన్.. మీరు ఏదైనా తిన్నారా సార్?’మరో చాట్‌లో చైతన్యానంద సరస్వతి ‘డిస్కో డ్యాన్స్ చేస్తున్నాను’ అంటూ నాతో జాయిన్ అవుతావా? అని అడుగుతాడు. ‘వావ్ సార్ ఆర్సమ్’ అంటూ విద్యార్థిని మర్యాద పూర్వకంగా సమాధానం ఇచ్చింది.ఇంకో చాట్‌లో చైతన్యానంద సరస్వతి ఒక విద్యార్థినితో ‘నువ్వు నాతో పడుకుంటావా?’ అని అడిగాడు.17 మంది విద్యార్థులను వేధించాడనే ఆరోపణలతో చైతన్యానందను ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా తప్పించుకుని బృందావన్, మధుర, ఆగ్రాలలో చైతన్యానంద సరస్వతి తిరుగుతూ వచ్చాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి సెప్టెంబర్ 27న పార్థ సారథి అనే పేరుతో ఆగ్రాలోని ఒక హోటల్లో బస చేశాడు. అక్కడే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు. -
నేడు ఆర్ఎస్ఎస్ శత వసంతాల వేడుక
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయవాద భావజాల వ్యాప్తి లక్ష్యంగా వందేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్రీ్టయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 1న ఢిల్లీలో ఘనంగా జరగనున్నాయి. ఈ చరిత్రాత్మక వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని, ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు. బ్రిటిష్ పాలనలో దేశ ప్రజల్లో జాతీయ భావాలను, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. -
Delhi Baba: ఫోన్ నిండా ‘ఫొటోలు.. చాట్లు’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో పలువురు మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానంద సరస్వతిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. చైతన్యానంద సరస్వతి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పరిశీలించగా, మహిళల చిత్రాలు, వారితో చేసిన చాట్లు కనిపించాయి. ఈ చాట్లలో చైతన్యానంద సరస్వతి వివిధ హామీలతో పలువురు మహిళలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.చైతన్యానంద అలియాస్ పార్థ సారథి.. ఆశ్రమంలో పనిచేస్తున్న పలువురు మహిళా సిబ్బంది ఫోటోలను తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడని పోలీసులు కనుగొన్నారు. ఈ చిత్రాలను అతను వారి సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాల నుంచి స్క్రీన్షాట్లను తీసుకుని సేవ్ చేసుకున్నాడని గుర్తించారు. వసంత్ కుంజ్‌లోని శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ అనే ప్రైవేట్ సంస్థ మాజీ డైరెక్టర్ అయిన చైతన్యానంద సరస్వతి పలువురు మహిళలకు అసభ్యకర సందేశాలు పంపడం, బలవంతంగా వారితో శారీరక సంబంధం పెట్టుకోవడం లాంటి ఫిర్యాదులు ఎదుర్కొంటున్నాడు. మహిళా హాస్టల్లో అతను రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.50 రోజుల పాటు పరారీలో ఉన్న చైతన్యానంద సరస్వతిని రెండు రోజుల క్రితం ఆగ్రాలోని ఒక హోటల్లో పోలీసులు పట్టుకున్నారు. కాగా దర్యాప్తుకు చైతన్యానంద సహకరించడం లేదని, విచారణ సమయంలో అబద్ధాలు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్ రాయబారిగా చైతన్యానంద సరస్వతిని పేర్కొంటూ రూపొందించిన రెండు నకిలీ విజిటింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో స్కాలర్షిప్ పొందుతున్న 17 మంది విద్యార్థినులు చైతన్యానంద సరస్వతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నూతన సుపరిపాలన
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొట్టిపారేశారు. ప్రతిరోజూ అబద్ధాలు చెబుతూ, తమపై రాళ్లు విసురుతూ కాలం గడపడం తప్ప విపక్షాలకు ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఈ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ పాలనలో రూ.లక్ష ఖర్చు చేస్తే అందులో పన్నుల కింద రూ.25000 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. అంటే ప్రతి రూ.లక్ష ఖర్చుపై రూ.20,000 చొప్పున ఆదా అయినట్లేనని స్పష్టంచేశారు.సుపరిపాలనలో నూతన మోడల్‌కు శ్రీకారం చుట్టామని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ సోమవారం ఢిల్లీ బీజేపీ శాఖ నూతన ప్రధాన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు చేరేలా చూడాలని బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ పాలనలోని హిమాచల్ ప్రదేశ్‌లో ధరలు తగ్గించడం లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రూ.2 లక్షల దాకా ఆదాయంపై పన్ను ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 లక్షల దాకా ఆదాయంపై పన్ను తొలగించామని, జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, దీనివల్ల దేశ ప్రజలకు ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని పునరుద్ఘాటించారు. కుంభకోణాల రహిత భారత్ ఎన్డీయే ప్రభుత్వం దేశానికి నూతన ‘సుశాసన్ మోడల్’ను ఇచి్చందని ప్రధాని మోదీ వివరించారు. అభివృద్ధితోపాటు దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కుంభకోణాల నుంచి దేశానికి విముక్తి కలి్పంచామని, అవినీతిపై నిర్ణయాత్మక యుద్ధం చేసేలా ఆత్మవిశ్వాసం పెంచామని వెల్లడించారు. స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వదేశీ ఉత్పత్తులను విక్రయించేలా, కొనుగోలు చేసి ఉపయోగించుకొనేలా వ్యాపారులను, ప్రజలను ప్రోత్సహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయాలు మాకు దేవాలయాలు బీజేపీకి అధికారం ముఖ్యం కాదని, ప్రజాసేవే పరమావధి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమని చెప్పారు. ఇక్కడికి వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ప్రజలను, వారి ఆకాంక్షలను అనుసంధానించే వేదికలుగా బీజేపీ ఆఫీసులు పనిచేస్తాయని పేర్కొన్నారు.దక్షిణ భారత శైలిలో బీజేపీ ఆఫీసుఢిల్లీలోని డీడీయూ మార్గ్‌లో ఐదు అంతుస్తుల భవనంలో బీజేపీ నగర నూతన కార్యాలయం ఏర్పాటైంది. దక్షిణ భారత శైలిలో ఆధునిక వసతులతో నిర్మించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఆఫీసు పండిట్ పంత్ మార్గ్‌లో ఉంది. దీపావళి నాటికి కొత్త భవనంలోకి మారనుంది. 825 చదరపు మీటర్ల స్థలంలో పర్యావరణ హితంగా ఈ బిల్డింగ్ నిర్మించారు. ఇందులో 200 మంది కూర్చోవడానికి వీలైన ఆడిటోరియంతోపాటు గ్రంథాలయం కూడా ఉంది. శాశ్వత భవనం లేకపోవడంతో ఢిల్లీ బీజేపీ విభాగం చాలా భవనాల్లోకి మారాల్చి వచి్చంది. అనే ప్రయత్నాల తర్వాత శాశ్వత భవనం సమకూరడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు. -
ఇప్పుడంతా గంటలు, సెకన్ల యుద్ధాలే
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక యుగంలో యుద్ధరీతి పూర్తిగా మారిపోయిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సంఘర్షణలు జరిగే విధానాన్ని శాటిలైట్లు, డ్రోన్లు, సెన్సార్లు సమూలంగా మార్చేశాయని అన్నారు. నెలల తరబడి యుద్ధాలు కొనసాగే రోజులు ఎప్పుడో పోయాయని తెలిపారు. శత్రుదేశాలతో సాయుధ పోరాటానికి గంటలు, సెకన్లలోనే తెరపడే పరిస్థితి వచ్చిందని స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలో ఇండియన్ కోస్ట్‌గార్డ్(ఐసీజీ) కమాండర్ల 42వ సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.మారుతున్న కాలంలో కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించడానికి, విధి నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఐసీజీ అధికారులకు సూచించారు. సైబర్, ఎల్రక్టానిక్ యుద్ధరీతి అనేది ఇక ఎంతమాత్రం ఊహాత్మకం కాదని, అది వాస్తవ రూపం దాల్చిందని గుర్తుచేశారు. మన దేశానికి పెనుముప్పుగా మారిన సైబర్, ఎలక్ట్రానిక్ యుద్ధాలను ఎదుర్కోవడానికి ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు.ఒక దేశం మరో దేశంలోని వ్యవస్థలను నాశనం చేయాలని భావిస్తే శక్తివంతమైన క్షిపణులు ప్రయోగించాల్సిన అవసరం లేదని.. కంప్యూటర్లను హ్యాకింగ్ చేస్తే చాలని అన్నారు. సైబర్ దాడులు, ఎల్రక్టానిక్ జామింగ్‌తో అల్లకల్లోలం సృష్టించవచ్చని తేల్చిచెప్పారు. ఇలాంటి అంతర్జాల దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శిక్షణను, రక్షణ పరికరాలను ఆధునీకరించాలని ఐసీజీకి సూచించారు. నిఘా వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలన్నారు. సైబర్ దాడులను క్షణాల వ్యవధిలోనే తిప్పికొట్టాలంటే కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సంప్రదాయ విధానాలు సరిపోవు అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీ్వప్‌ను కూ డా కలుపుకొంటే భారత్‌కు 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. తీరప్రాంత భద్రత విషయంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సుశిక్షితులైన సిబ్బంది, పటిష్టమైన నిఘా వ్యవస్థ అత్యవసరమని ఉద్ఘాటించారు. సముద్ర తీర ముప్పు కూడా ఆధునికతను సంతరించుకుందని వివరించారు.ఓడల్లో అక్రమ రవాణా, సముద్ర దొంగల గురించి గతంలో మాట్లాడుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడంతా జీపీఎస్ స్ఫూపింగ్, రిమోట్‌తో నియంత్రించే పడవలు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, డార్క్‌వెబ్ వంటి వాటితో నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు సైతం ఆధునిక టెక్నాలజీని వాడుకుంటున్నాయని రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పుడు సముద్ర తీర ముప్పును ఎదిరించాలంటే సంప్రదాయ విధానాలు ఎంతమాత్రం సరిపోవన్నారు. -
50 రోజులు.. 15 హోటళ్లు.. ఢిల్లీ బాబా కేసులో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: బాబా చైతన్యానంద సరస్వతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద.. పోలీసులను తప్పించుకునేందుకు 50 రోజులు పరారీలో ఉండగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని ఓ హోటల్లో బస చేసిన అతడిని ఆదివారం(సెప్టెంబర్ 28) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు సీసీటీవీలకు చిక్కకుండా పరారీలో ఉన్న ఢిల్లీ బాబా గురించి షాకింగ్ విషయాలు పోలీసులు వెల్లడించారు.పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మధుర తదితర ప్రాంతాల్లో తిరిగారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన 50 రోజుల్లో 15 హోటళ్లను మార్చాడు. సీసీటీవీ కెమెరాలు లేని చౌక హోటళ్లలోనే అతను బస చేసేవాడని పోలీసులు తెలిపారు. బాబాకు సహకరించిన ఆయన సహాయకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కాగా, బాబా చైతన్యానంద సరస్వతి నుంచి పోలీసులు ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని తెలిపారు.చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు.ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు గతంలో చైర్మన్‌గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్‌కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్‌డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్‌వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఢిల్లీలోని 300 స్కూళ్లు, సంస్థలకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని 300కు పైగా స్కూళ్లు, సంస్థలతోపాటు పలు విమా నాశ్రయాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. సంబంధిత విభాగాలు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని, బెదిరింపులు వట్టివేనని తేల్చారు. ఇంతకుముందు హెచ్చరికలు పంపిన ’Terrorizers111’ అనే గ్రూప్ నుంచే తాజా ఈమెయిల్ హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం 6.08 గంటల సమయంలో ఇవి ఢిల్లీలోని విమానాశ్రయంతోపాటు పలు స్కూళ్లు, ఇతర సంస్థలకు అందాయి. ‘మీ భవనం చుట్టూ బాంబులు అమర్చాం. 24 గంటల్లోగా స్పందిస్తారా విధ్వంసాన్ని ఎదుర్కొంటారా’అని అందులో ఉంది. ఢిల్లీలోని ద్వారకాలో ఉన్న సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్, కుతుబ్ మినార్ వద్దనున్న సర్వోదయ విద్యాలయకు ఇలాంటి బెదిరింపే అందిందని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో ఢిల్లీలోని పలు సంస్థలకు బాంబు హెచ్చరికలు అందుతుండటం, అవన్నీ వట్టిదేనని అధికారులు సోదాల అనంతరం ప్రకటిస్తుండటం తెల్సిందే. -
ఢిల్లీ సీఎం రేఖాగుప్తతో బతుకమ్మ ఆడిన ఉపాసన
-
ఢిల్లీ బాబా ఆగ్రాలో అరెస్ట్
న్యూఢిల్లీ/ఆగ్రా: ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతి(62) జాడను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు. ఆగ్రాలోని ఓ హోటల్లో బస చేసిన అతడిని ఆదివారం వేకువజామున అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం గమనార్హం. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని పోలీసులు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయంలో తనకు పరిచయస్తులున్నారని చెప్పుకుంటూ చైతన్యానంద, అతడి శిష్యులు అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. కేసు నమోదు కావడంతో అరెస్ట్ భయంతో ఆగస్ట్ 4వ తేదీన ఢిల్లీని దొంగచాటుగా వదిలిన చైతన్యానంద, ఇతడి శిష్యులు పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మథుర తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నారన్నారు. చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు. ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు గతంలో చైర్మన్‌గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్‌కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్‌డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.ఐదు రోజుల పోలీస్ కస్టడీచైతన్యానంద సరస్వతిని ఢిల్లీ కోర్టు ఆదివారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. చైతన్యానంద పలువురు విద్యార్థినులను వేధించాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసేవాడని పలువురు బాధితులకు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఆరోపించారు. విద్యార్థినుల బాత్‌రూంలలోనూ ఇతడు సీసీటీవీ కెమెరాలను అమర్చాడని బాధితుల తరఫు లాయర్లు ఆరోపించారు. సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్‌వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
మరో ‘థార్’ ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ‘థార్’ కారు ప్రమాదాలు అందరికీ దడపుట్టిస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. హైవే ఎగ్జిట్ నంబర్ 9 సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలంగా డివైడర్‌ను ఢీకొని..పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ‘థార్’లో ఏదో పని నిమిత్తమై ఉత్తరప్రదేశ్ నుండి గురుగ్రామ్‌కు వెళుతున్నారు. వేగంగా వెళుతున్న కారును డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో అది బలంగా డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.బైక్‌ను ఢీకొన్న ‘థార్’మహీంద్రా థార్ కారుకు సంబంధించిన మరో ప్రమాదం ఇప్పుడు కలకలం రేపుతోంది. గత నెలలో ఢిల్లీలోని మోతీ నగర్లో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక బైకర్ మృతిచెందాడు. కారు- ట్రక్కు మధ్యలో బైక్ పూర్తిగా నలిగిపోయినట్లు దృశ్యాలు నాడు వైరల్ అయ్యాయి. ‘థార్’ విండ్‌షీల్డ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. థార్ డ్రైవర్ అమరీందర్ సింగ్ సోధి ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలి పారిపోయాడు. పోలీసులు వాహనంలో రెండు మద్యం సీసాలను కనుగొన్నారు.రాష్ట్రపతి భవన్ సమీపంలో మరో ప్రమాదంమరో సంఘటనలో న్యూఢిల్లీలోని చాణక్యపురిలో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక పాదచారి మృతి చెందాడు. ఈ ప్రమాదం రాష్ట్రపతి భవన్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దరిమిలా పాదచారి మృతదేహం నాలుగు గంటల పాటు రోడ్డుపైనే పడి ఉంది. నిందితుడు నిద్రమత్తులో ఉన్నాడని, వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో, ఒక మహిళ మహీంద్రా థార్ కారును కొనుగోలు చేసిన వెంటనే దానిని నడిపేందుకు చేసే ప్రయత్నంలో అది అదుపుతప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. -
కాంగ్రెస్ హెడ్డాఫీసులో మన్మోహన్ సింగ్ పేరుతో లైబ్రరీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరుతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో 1,200 పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటైంది. దీనిని శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రారంభించారు. కార్యక్రమంలో మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్, ఇతర కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీలో మహాత్మాగాం«దీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీ తదితరులకు సంబంధించిన గ్రంథాలతోపాటు ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ కాంగ్రెస్’, పార్టీ మేనిఫోస్టోలు ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరా భవన్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ లైబ్రరీ మన్మోహన్ సింగ్ 93వ జయంతినాడు ప్రారంభమైందని రాహుల్ గాంధీ ఎక్స్‌లో తెలిపారు. గ్రంథాలయంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన రాజ్యాంగ సభ సభ్యులతో కూడిన అరుదైన చిత్రం ప్రధాన ఆకర్షణగా ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర యోధుల జీవిత చరిత్రలు, ప్రసంగాలు, ఎంపిక చేసిన గ్రంథాలు ఉన్నాయి. -
Delhi Baba: ‘స్టీవ్ జాబ్స్, ఒబామా.. నా ముందు దిగదుడుపే’.. సరికొత్త వాదన
న్యూఢిల్లీ: పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు చైతన్యానంద సరస్వతి తనను తాను అర్హత కలిగిన మేనేజ్మెంట్ గురువునని, ప్రముఖ రచయితనంటూ చెబుతున్నాడు. పైగా ‘స్టీవ్ జాబ్స్, ఒబామా.. తన ముందు జుజుబీ’.. అటూ సరికొత్త వాదన వినిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అతని వ్యక్తిగత జీవితంపై పడింది.పలు విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డిగ్రీలుఅకడమిక్ రీసెర్చ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లోని చైతన్యానంద ప్రొఫైల్‌లో అతను చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ, పీహెచ్డీ చేసినట్లు చూపిస్తోంది. అలాగే అతను పోస్ట్-డాక్టోరల్ డిగ్రీలు, డీలిట్ పూర్తి చేసారని, భారతదేశంతో పాటు విదేశాలలోని పలు విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డిగ్రీలను కలిగి ఉన్నాడని ఆ సైట్లో పేర్కొన్నారు. అయితే ఈ వాదనలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న అతని పుస్తక రచయిత పేజీలలోనూ ఉన్నాయి. అతని విద్యాభ్యాస వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.స్టీవ్ జాబ్స్ ముందుమాటతన పుస్తకాలపై చైతన్యానంద తనను తాను ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రచయిత’గా పరిచయం చేసుకుంటాడు. అతని పుస్తకాలలో ఒకటైన ‘ఫర్గెట్ క్లాస్రూమ్ లెర్నింగ్’లో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ముందుమాటను రాసినట్లు ఉంది. పుస్తకం మొదటి పేజీలో ఈ చైతన్యానంద పుస్తకం.. ప్రపంచానికి అపూర్వమైన మార్గదర్శకాల మాన్యువల్’ అని జాబ్స్ చెప్పినట్లు ప్రచురితమయ్యింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైతన్యానంద పుస్తకం ‘ట్రాన్స్ఫార్మింగ్ పర్సనాలిటీ’ని పదేపదే ప్రస్తావించారనే అనే విషయం బయటకొచ్చింది. ఈ పుస్తకం 2007లో యూరోపియన్, ఉత్తర అమెరికా మార్కెట్లలో బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా నిలిచిందని సమాచారం.రెండు దశాబ్ధాలుగా మహిళలపై వేధింపులుఈ పుస్తకంలో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ పేరుతో ప్రశంసా సందేశం కూడా ఉంది. ఆయన ఆ పుస్తకంలో రచయిత గురించి చెబుతూ, ప్రముఖ ప్రొఫెసర్, ప్రముఖ రచయిత, వక్త, విద్యావేత్త, ఆధ్యాత్మిక తత్వవేత్త పరోపకారి, భారతదేశంతో పాటు విదేశాలలో మేనేజ్మెంట్ నిపుణునిగా పేర్కొన్నారు. కాగా చైతన్యానంద ఎడ్యుకేషన్ ప్రొఫైల్‌లోని చాలా సమాచారం నకిలీదని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. వసంత కుంజ్‌లోని శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చైతన్యానంద సరస్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా అతను అతను దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. చైతన్యానంద రెండు దశాబ్దాలుగా మహిళలను వేధిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. కాగా జుజుబీ అంటే రేగిపండు.. దీని శాస్త్రీయ నామం జిజిఫస్ జుజుబా (Ziziphus jujuba). రేగిపండు చిన్నగా ఉంటుంది. దేన్నయినా జుజుబితో పోలిస్తే అది 'నా వెంట్రుకతో సమానం' అనే అర్థం వస్తుంది. -
పరారీలో ‘గలీజు’ బాబా చైతన్యానంద సరస్వతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో బాబా స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి)(Swami Chaitanyananda Saraswati)విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. విద్యార్థినులు తమ ఫిర్యాదులో బాబాపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం చైతన్యానంద సరస్వతి పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి) ఢిల్లీలోని వసంత్‌కుంజ్( Vasant Kunj) ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. గత 12 ఏళ్లుగా ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన వారంతా ఉపకార వేతనాలతో ఈ విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. అయితే, చైతన్యానంద సరస్వతి తమతో అసభ్య పదజాలాన్ని వాడుతూ దుర్భాషలాడటం, సందేశాలు పంపడమే కాకుండా లైంగికంగా వేధింపులకు గురిచేశాడని విద్యార్థినులు ఆరోపించారు.విద్యా సంస్థలో ఉన్న 32 మంది విద్యార్థుల్లో 17 మంది ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఇతర మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే తమను నిందితుడికి పరిచయం చేశారని వాపోయారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా తాము కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఇక, ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు ఉండే ప్రాంతంతో సహా బాధితులు పేర్కొన్న స్థలాల్లో తనిఖీలు చేశారు.ఇది కూడా చదవండి: యూపీలో సరికొత్త అధ్యాయం.. ఉమెన్ పోలీసింగ్ పవర్ ఇది..కాగా, విద్యార్థినుల ఫిర్యాదు తర్వాత చైతన్యానంద సర్వసతి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, చివరిగా అతడి లొకేషన్‌ను ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విద్యాసంస్థకు చెందిన బేస్మెంట్లో ఒక కారు గుర్తించిన పోలీసులు.. దానికి ఉన్నది నకిలీ నంబర్ ప్లేట్ అని వెల్లడించారు. ఇక, ఆయనపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఒక మహిళ కూడా ఈ తరహా వేధింపుల పైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. -
'మండోదరి'గా పూనమ్ పాండే.. బీజేపీ ఎంట్రీతో తొలగింపు
ప్రతి ఏడాది ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే లవ్ కుశ్ రామ్‌లీలా ప్రదర్శన వివాదంలో చిక్కుకుంది. రావణుడి భార్య మండోదరి (రావణుడి భార్య) పాత్ర కోసం బాలీవుడ్ వివాదాస్పద నటి పూనం పాండే(Poonam Pandey)ను ఎంపిక చేయడంతో బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అభ్యంతరం తెలిపాయి. ఆమెను ఈ పాత్ర నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంతో లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ నిర్వాహకులు పూనమ్ పాండేను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ , వీహెచ్‌పీ ప్రాంతీయ ప్రతినిధి సురేంద్ర జైన్ రాంలీలా కమిటీకి ఒక లేఖ రాశారు. పూనమ్ పాండేను పౌరాణిక ఇతిహాసంలో నటించడం వల్ల ప్రజల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. తరచూ వివాదాస్పదంగా ఉండే నటిని మండోదరి పాత్ర కోసం ఎంపిక చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని, తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని బీజేపీ నేతలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. పూనం పాండే తన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలతో పాటు కొన్ని వీడియోలతో వివాదాల్లో నిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందితో పాటు యువత చూసే ఈ పవిత్ర కార్యక్రమానికి ఆమెను దూరంగా ఉంచడం మంచిదని పేర్కొన్నారు.కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ.. ఒక కళాకారుడిని వారి గతాన్ని బట్టి కాకుండా వారి పనిని బట్టి అంచనా వేయాలన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూనమ్ పాండేను మండోదరి పాత్ర నుంచి తొలగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆమె పట్ల అగౌరవంగా ఎవరూ చూడకూడదని పేర్కొంది. మండోదరి పాత్రలో నటించాలని ఆమె కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. అందుకోసం కొద్దిరోజులుగా ఉపవాసంతో పాటు చాలా నియమాలు పాటించిందని ఆయన గుర్తు చేశారు. కానీ, లవ్ కుష్ రామ్‌లీలా కమిటీ మాత్రం ప్రజల మతపరమైన భావాలను ఎప్పుడూ గౌరవిస్తుంది.దేశ రాజధాని ఎర్రకోట వద్ద ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా జరిగే లవ్ కుశ్ రామ్‌లీలా ప్రదర్శన అనేది ఢిల్లీలో జరిగే ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం. ఇక్కడ నవరాత్రులు, దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ క్రమంలోనే రామాయణం కథను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి చాలా మంది బాలీవుడ్ మరియు టీవీ ప్రముఖులు, అలాగే అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, భారీ లైటింగ్, 3డి ప్రొజెక్షన్లు, ఇతర విజువల్ ఎఫెక్ట్స్ ఈ ప్రదర్శనను మరింత ఆకట్టుకునేలా చేస్తాయి. -
సినిమాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి– రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
‘‘కళలు, సినీ రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుకుంటున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈ తరుణంలో మహిళల ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలి. జ్యూరీ, కేంద్ర, ప్రాంతీయ ΄్యానెల్లలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించాలి. విద్యాసంస్థల అవార్డుల ప్రదానోత్సవాల్లో ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు ఉండటం అనేది దేశ అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ప్రయత్నం, కృషి సినిమా అవార్డుల్లోనూ ఉండాలి. సినిమాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే అసాధారణ విజయాలు సాధిస్తారని నమ్ముతున్నాను’’ అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొ న్నారు. ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వైభవంగా జరిగింది. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 ఏడాదికిగాను ఎంపికైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. విజేతలకు పురస్కారాలు అందజేసిన అనంతరం ద్రౌపది ముర్ము మాట్లాడుతూ – ‘‘సినిమా కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు... దేశాన్ని, సమాజాన్ని మేల్కొల్పే శక్తిమంతమైన మాధ్యమం. పౌరులను ప్రభావితం చేసే సాధనం. ఒక సినిమాకు ప్రజాదరణ లభించడం మంచి విషయమే కావొచ్చు. కానీ ప్రజా ప్రయోజనాలు, ముఖ్యంగా ఈ తరం యువతకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండటం ఇంకా గొప్ప అంశం. ఈ రోజు అవార్డులు పొందిన చిత్రాల్లో తల్లులు తమ పిల్లలను తీర్చిదిద్దే కథలు, ధైర్యవంతమైన స్త్రీల కథలు, మంచి కుటుంబ కథలు, సామాజిక సంక్లిష్టతలను ఎదుర్కొంటూ పితృస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా తమ గొంతును లేవనెత్తేటువంటి చిత్రాలు ఉండటం మంచి విషయం ‘గాంధీ తాత చెట్టు’ అనే తెలుగు సినిమాలో ఓ చిన్నారి ఒక చెట్టును సంరక్షించేందుకు సత్యాగ్రహ ఆందోళన చేస్తుంది. ఇలాంటి కథలు బాలల్లో చైతన్యాన్ని, పర్యావరణం పట్ల సామాజిక స్పృహను కలిగిస్తాయి’’ అని చె ప్పారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత మోహ న్లాల్ను ‘‘పరిపూర్ణ నటుడు’’ అని కూడా ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఈ వేడుకలో ఉత్తమ నటులుగా హీరో షారుక్ ఖాన్ (‘జవా న్’), విక్రాంత్ మస్సే (‘ట్వల్త్ ఫెయిల్’), నటిగా రాణీ ముఖర్జీ (‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’), ఉత్తమ చిత్రదర్శకుడు విధు వినోద్ చోప్రా (‘ట్వల్త్ ఫెయిల్’) అవార్డులు అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ చిత్రం ‘భగవంత్ కేసరి’కిగానూ దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గార పాటి అవార్డు స్వీకరించారు. ‘హనుమా న్’ మూవీకి బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజ న్ రెడ్డి, ఇదే విభాగంలో వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జెట్టీ వెంకట్‌కుమార్, ‘బేబీ’ సినిమాకిగాను స్క్రీన్‌ప్లే విభాగంలో సాయి రాజేశ్, ఇదే చిత్రానికి నేపథ్య గాయకుడుగా పీవీఎన్ఎస్ రోహిత్, ‘బలగం’కి పాట రచయితగా కాసర్ల శ్యామ్, ‘యానిమల్’ (హిందీ)కి నేపథ్య సంగీతానికి హర్షవర్ధ న్ రామేశ్వర్, ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకి ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డులు అందుకున్నారు.సినిమా నా ఆత్మ హృదయ స్పందన– నటుడు మోహన్‌లాల్‘‘మలయాళ పరిశ్రమ నుంచి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన రెండో వ్యక్తిను నేను. అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ పురస్కారం మలయాళ పరిశ్రమ మొత్తానికి చెందుతుంది. మలయాళ సినీ పరిశ్రమ సృజనాత్మకత, స్థిరత్వం, సమష్టి కృషికి పత్రీకగా నేను ఈ అవార్డును భావిస్తున్నాను. ఈ అవార్డుని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఏదో మ్యాజిక్ జరిగినట్లుగా ఉంది. కేరళ ప్రేక్షకులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను. ఒక నటుడిగా ఈ అవార్డు నా అంకితభావాన్ని, నా నిబద్ధతను, సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారికి, భారత ప్రధాని నరేంద్ర మోదీగారికి, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్గార్లకు, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. సినిమా అనేది నా ఆత్మ హృదయ స్పందన... జై హింద్.ప్రతి పాటనూ మరింత బాధ్యతగా రాస్తా – రచయిత కాసర్ల శ్యామ్ ‘‘ఇకపై ఏ పాట రాసినా నన్ను జాతీయ అవార్డుగ్రహీత స్థాయిలో చూస్తారు కాబట్టి మరింత బాధ్యతగా పాటలు రాయాల్సి ఉంటుంది. అవార్డు తెచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటూ ప్రతి పాటనూ మరింత బాధ్యతగా రాస్తాను’’ అని కాసర్ల శ్యామ్ అన్నారు. ‘బలగం’లోని ‘ఊరు పల్లెటూరు...’ పాటకు జాతీయ అవార్డు అందుకున్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకోవడం ఓ మధురానుభూతి. ఇది నాకు, నా కుంటుంబానికే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా గర్వకారణం. ‘బలగం’ సినిమాలోని ప్రేక్షకుల హృదయాలను బాగా ప్రభావితం చేసిన ‘బలరామ నర్సయ్యో’ పాటకు అవార్డు వస్తుందని భావించాను. కానీ ‘ఊరు పల్లెటూరు..’కు రావడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. మా నాన్న రంగస్థల, టీవీ నటుడు. సుమారు 25కు పైగా సినిమాల్లో పాత్రలు వేశారు. కానీ బలమైన పాత్రలు రాక నిరాశతో వెనక్కి వచ్చేశారు. ఆ ప్రభావం నాపైన పడింది. ‘లై’ సినిమాకు రాసిన ‘బొమ్మోలె ఉన్నదిరా ΄ోరీ’ పాట నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పడు జాతీయ అవార్డు సాధించి మా నాన్న ఆశయాన్ని నెరవేర్చాననే సంతృప్తి కలిగింది’’ అని చె ప్పారు. – సాక్షి, న్యూఢిల్లీ -
ఢిల్లీలో 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం (ఫోటోలు)
-
డిజిటల్ అరెస్ట్‌తో రూ. 23 కోట్లు దోచేశారు.. నా జీవితం మీ అందరికీ హెచ్చరిక..!
తాము ఆఫీసర్లమని చెబుతూ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు ఇటీవల కాలంలో మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే డిజిటల్ అరెస్ట్ బారిన పడి కోట్లలో పోగోట్టుకున్నవారు అనేక మందిఉండగా, అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఘటనలో ఓ వృద్ధుడు రూ. 23 కోట్లును పోగొట్టుకున్నాడు. సౌత్ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్‌లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్, 75 ఏళ్ల వృద్ధుడు నరేష్ మల్హోత్రాను ఏకంగా నెలకు పైగా డిజిటల్ అరెస్ట్ చేశారు. దాంతో ఆయన జీవితాంత పొదుపు చేసుకున్న రూ. 23 కోట్లను దోచేసుకున్నారు. నరేష్ మల్హోత్రాకు సౌత్ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్ ఒక భవనం ఉంది. అందులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసి ఒంటరిగా జీవిస్తున్నారు. మరో ఇద్దరు కుమారులు విడివిడిగా నివసిస్తున్నారు. ఆయనకు నలుగురు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అతని భార్య చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఆయన శస్త్రచికిత్స చేయించుకుని జూలై 4న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎయిర్టెల్ మెయిన్ ఆఫీస్ పేరుతో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా ఆ ఫోన్ కాల్‌ను మహిళ చేసింది. తన ల్యాండ్‌లైన్ నంబర్ హ్యాక్ చేశారని, ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ముంబైలో ఒక నంబర్ తీసుకున్నట్లు తెలిపింది. తన ఆధార్ నంబర్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని, ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు ₹1,300 కోట్ల నిధులు సమకూర్చారని ఆ ఫోన్ చేసిన మహిళ తెలిపింది. దీనిలో భాగంగా ఎన్ఐఏ చట్టం అరెస్ట్ చేస్తామని నరేష్ మల్హోత్రాను భయపెట్టింది. మీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. మేము మిమ్మల్ని ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయానికి కనెక్ట్ చేస్తున్నామని తెలిపింది. అనంతరం ఆ వృద్ధుడికి ఓ వీడియో కాల్ వచ్చింది. ఈ క్రమంలోనే నరేష్ మల్హోత్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, తదితర వివరాలు దోచేసింది ఆ మహిళ. తరువాత నరేష్ మల్హోత్రాపై నకిలీ చార్జిషీట్ తయారు చేసి పంపారు. ప్రతి రెండు గంటలకు తనను విచారిస్తామని ఆమె చెప్పింది. ఇది సీక్రెట్స్ యాక్ట్. మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. మీరు ఎవరితోనైనా మాట్లాడితే, మనీలాండరింగ్ నిరోధక ఆరోపణల కింద మిమ్మల్ని అరెస్టు చేస్తారని అని బెదిరించారు. ఇలా నెల రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ, సుప్రీంకోర్టు , ఆర్బీఐ పేర్లను వాడుకుంటూ నెలరోజుల్లో రూ. 23 కోట్లు దోచేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది భారత దేశంలో అతిపెద్ది డిజిటల్ అరెస్ట్. ఈ డబ్బు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రూ. 12.11 కోట్లను మాత్రం పోలీసులు సీజ్ చేశారు.నా జీవితం మీ అందరికీ హెచ్చరికఅయితే తాను దాచుకున్న డబ్బును ఇలా కొట్టేయడంపై నరేష్ మల్హాత్రా కన్నీటి పర్యంతమవుతున్నారు. తనకు ఈ వయసులో ఇలా జరగడం నిజంగా దురదృష్టమేనని, ఇది మిగతా అందరికీ ఒక హెచ్చరిక, మేలుకొలుపు అవుతుందన్నారు. తాను డిజిటల్ అరెస్ట్ మోసగాళ్లను నమ్మిన కారణంగానే ఇలా జరిగిందని, ఎవరూ కూడా తనలా మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు నరేష్ మల్హాత్రా. -
పరువు నష్టం నేరం కాదు: సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసుల(Defamation Cases)ను నేరరహి తంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ‘ది వైర్’అనే ఆన్లైన్ పబ్లికేషన్ సంస్థపై పరువు నష్టం కేసు వేశారు(The Wire Defamation Case). ఈ మేరకు మేజిస్ట్రేట్ కోర్టు ది వైర్‌కు సమన్లు జారీ చేయగా, ఢిల్లీ హైకోర్టు దానిని సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ‘ది వైర్’వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేశ్(Justice MM Sundaresh).. ‘ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం నేరం కాదని నిర్థారించాల్సిన సమయం వచ్చింది’ అంటూ వ్యాఖ్యానించారు. ది వైర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ దీనిని సమర్థిస్తూ సంబంధిత చట్టంలో సంస్కరణలను చేపట్టాల్సిన అవసర ముందన్నారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 499 ప్రకారం పరువునష్టం కలిగించడం నేరం కాగా, దీనినే భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) కూడా సెక్షన్ 356గా కొనసాగించింది. అయితే, న్యాయ మూర్తి సుందరేశ్ వ్యాఖ్యలు 2016లో సుబ్రమణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పరువు నష్టం చట్టంలోని నిబంధనలకు రాజ్యాంగబద్థత ఉందని అప్పటి తీర్పులో సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే, గౌరవం పొందే ప్రాథమిక హక్కు కిందకు ఇది వస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: కొందరు జడ్జిలు సరిగా పని చేయట్లేదు! -
జీఎస్టీ పొదుపు ఉత్సవం మొదలైంది
న్యూఢిల్లీ: తగ్గిన జీఎస్టీ పన్నుల కారణంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు మొదలు ఇంటి ముంగిళ్ల దాకా ప్రజలకు ఖర్చులు తగ్గి పొదుపు ఉత్సవం మొదలైందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. నగదు ఆదా ఉత్సవం ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ శోభను మోసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజునే జీఎస్టీ తగ్గుముఖం పట్టిందని, ఇది శుభసూచకమంటూ దేశ ప్రజలకు మోదీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘షాపింగ్ చేసే వాళ్లకు ఇది నిజంగా పండుగే. అన్ని మార్కెట్లలో, అందరి ఇళ్లలో నగదు ఆదా ఉత్సవం ఆరంభమైంది. నవ శకం జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. సెపె్టంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు పొదుపు పెంచడంతోపాటు రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్య తరగతి, వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దాకా సమాజంలోని ప్రతి ఒక్క వర్గానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ శుభతరుణంలో అందరం ఆత్మ నిర్భరత పథంలో కలిసి నడుద్దాం. 2047 ఏడాదికల్లా వికసిత్ భారత్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధిద్దాం. ఈ సంవత్సరం పండుగల సీజన్ కొత్త సంతోషాలను మోసుకొచ్చింది. తగ్గిన జీఎస్టీతో ప్రజలు డబుల్ బొనాంజాను ఒడిసిపట్టారు. జీఎస్టీ సంస్కరణలు అద్భుతమైన ప్రగతికి, పెట్టుబడులకు బాటలు వేయనున్నాయి. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోనుంది’’ అని మోదీ ఆ లేఖలో అభిలషించారు. పన్ను రహితం లేదా 5 శాతం ‘‘ఆహారం, ఔషధాలు, సబ్బులు, టూత్‌పేస్ట్, బీమా ఇలా మరెన్నో వస్తూత్పత్తులు ఇప్పుడు పన్నురహితంగా లేదా కేవలం 5 శాతం జీఎస్టీ శ్లాబులో అందుబాటులోకి వచ్చాయి. గతంలో 12 శాతం శ్లాబులో ఉన్న ఎన్నో ఉత్పత్తులు ఇప్పుడు 5 శాతం శ్లాబులోకి దిగొచ్చాయి. ఇవి ‘శ్లాబులు మారడానికి ముందు, ఆ తర్వాత రేట్లు’ అంటూ వ్యాపారులు తమ దుకాణాల ముందు బోర్డ్‌లు తగిలించడం చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. రూ.12 లక్షల వార్షికాదాయంపై సున్నా పన్నును అమలుచేసి మధ్యతరగతి ప్రజల చేతుల్లో నగదు నిలిచేలా చేశాం. ఇప్పుడు తగ్గిన జీఎస్టీ రేట్లు, అమలవుతున్న జీరో ఐటీ ట్యాక్స్‌తో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్ల సొమ్ము ఆదా అయింది. దీంతో చిన్న ఇల్లు కట్టుకోవడం, కొత్త వాహనం కొనుక్కోవడం, గృహోపకరణాలు కొనుగోలుచేయడం, కుటుంబంతో కలిసి సరదాగా బయట భోజనం చేయడం వంటి ఆనందాలెన్నో సాకారమవుతున్నాయి’’ అని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. This festive season, let's celebrate the 'GST Bachat Utsav'! Lower GST rates mean more savings for every household and greater ease for businesses. pic.twitter.com/QOUGWXrC3d— Narendra Modi (@narendramodi) September 22, 2025‘చిరు’వ్యాపారుల పెద్ద పండుగ ‘‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు జీఎస్టీ తగ్గింపుతో పండుగ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. సులభతర వ్యాపారానికి అనువైన వాతావరణం నెలకొంది. తక్కువ ట్యాక్స్‌లు, తక్కువ ధరలు, అనువైన నిబంధనల కారణంగా వ్యాపారం ఊపందుకోనుంది. వ్యాపారాభివృద్ధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థానిక ఉత్పత్తుల విస్తృతి పెరగనుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా పెద్ద అడుగు’’ అని అన్నారు. కవరేజీ కమాల్ తగ్గిన జీఎస్టీతో ప్రజల కొనుగోళ్లు పెరగనున్నాయని, పౌరుల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయంటూ సోమవారం పలు ప్రధాన హిందీ, ఇంగ్లిష్ దినపత్రికల్లో వచ్చిన కథనాలు, ప్రధాన వార్తలను ప్రధాని ప్రస్తావించారు. ‘తక్కువ ధరలు, ఎక్కువ ఆనందాలు’ అనే క్యాప్షన్ పెట్టి మోదీ పలు న్యూస్పేపర్ల ఫ్రంట్ పేజీలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. తగ్గిన జీఎస్టీతో వినియోగదారులకు భారీ ప్రయోజనం చేకూరనుందంటూ దైనిక్ భాస్కర్, దైనిక్ జాగరణ్, ఎన్బీటీ, హిందుస్తాన్, హరిభూమి, రాష్ట్రీయ సహారా సహా పలు ప్రధాన ఆంగ్ల పత్రికల తొలి పేజీ క్లిప్పింగ్‌లను మోదీ షేర్ చేశారు. -
ఎలుక హల్చల్.. మూడు గంటలు ఆలస్యంగా ఇండిగో విమానం టేకాఫ్
కాన్పూర్: 172 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైన ఇండిగో విమానం ఒక ఎలుక కారణంగా మూడు గంటలు ఆలస్యంగా టేక్ ఆఫ్ అయ్యింది. కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానపు సిబ్బంది క్యాబిన్లో ఎలుక కనిపించడంతో ఎలుకను వెదికి పట్టుకునేందుకు ముందుగా ప్రయాణికులను కిందకు దింపారు. ఎలుకను పట్టుకుని, దానిని తొలగించిన తర్వాత విమానం బయలుదేరింది.షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ-కాన్పూర్ ఇండిగో విమానం ఆదివారం మధ్యాహ్నం 2.10 గంటలకు చకేరి విమానాశ్రయం(కాన్పూర్)లో ల్యాండ్ అయింది. ఆ విమానం మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో విమానంలో దాదాపు 172 మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్‌కు సిద్ధం అయ్యేంతలో క్యాబిన్ లోపల ఒక ఎలుక పరిగెత్తుతున్నట్లు సిబ్బంది ఒకరు గమనించారు. ఆయన ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేయగా, తొలుత ప్రయాణికులందరినీ దింపి, లాంజ్‌కు తరలించారు. ఎలుకను పట్టుకుని , దానిని తొలగించిన తర్వాత ప్రయాణికులను విమానంలోనికి ఎక్కాలని కోరారు. విమానం సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరింది. కాన్పూర్ విమానాశ్రయ మీడియా ఇన్ఛార్జ్ వివేక్ సింగ్ విమానంలో ఎలుక ఉందని ధృవీకరించారు. ఎలుకను పట్టుకునేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టిందన్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని నివారించేందుకు రిఫ్రెష్మెంట్లు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో అధికారులు తెలిపారు. -
మళ్లీ మొదలైన పంట వ్యర్ధాల దహనం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి పొరుగునున్న పంజాబ్‌లో మళ్లీ పంట వ్యర్థాల దహనాలు మొదలయ్యాయి. ఇలా పంట వ్యర్థాలకు నిప్పు పెడితే ఉపేక్షించరాదని, అవసరమైతే కొందరు రైతులను జైలుకు పంపాలని ఇటీవల సుప్రీకోర్టు సైతం కన్నెర్ర చేసింది. రైతులు మాత్రం పట్టించుకోకుండా గడ్డి దుబ్బలను దహనం చేస్తున్నారు. పంట వ్యర్థాల దహనాలపై ఆదివారం ఒక్క రోజే పంజాబ్‌లో 12 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పంజాబ్‌లో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలవుతున్నందున రానున్న రోజుల్లో వ్యర్ధాల దహనం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరి కోతల తర్వాత అక్టోబర్–నవంబర్ నెలల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాలను కాల్చడమే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. వరి కోతకు, రబీలో గోధుమలను విత్తడానికి మధ్య సమయం తక్కువగా ఉండటంత్లో రైతులు తరచుగా వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం పెరిగేందుకు కారణమవుతోంది. ఈ దృష్ట్యా పంట దహనాలను నివారించేందుకు కేంద్రం భూ విస్తీర్ణం ఆధారంగా రూ.5వేల నుంచి రూ.30వేల వరకు జరిమానాలు విధిస్తూ కేంద్రం గత ఏడాది ఉత్తర్వులిచి్చంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 400 మార్కును దాటుతుండటం, ప్రజలకు తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్యాలను ఎదుర్కొంటుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 1,500 మందికి పైగా రైతులకు జరిమానాలు సైతం విధించారు. దీంతో పాటే పంట వ్యర్థాలను కాల్చే సంఘటనలను నివారించేందుకు 8వేల మంది నోడల్ అధికారులతో ఓ ప్రత్యేక దళాన్ని సైతం ఏర్పాటు చేశారు. దీనికి తోడు సెక్షన్ 223 కింద గత ఏడాది 5,797 కేసులు సైతం నమోదయ్యాయి. ఇందులో ఒక్క సంగ్రూర్ జిల్లాలోనే 1,725 కేసులు నమోదయ్యాయి. -
ఢిల్లీలో జరిగే రామ్‌లీలా నాటకంలో పరశురాముడిగా బీజేపీ ఎంపీ
ఢిల్లీలో ప్రతి ఏటా రామ్‌లీలా నాటక ప్రదర్శన ఎంతో వైభోవపేతంగా జరుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాటకంలో ప్రముఖులు, సెలబ్రిటీలు, నటులు ఇందులో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అదరమో అని బిరుదుల అందుకుంటుంటుంది. ఈసారి కూడా అలానే నటులు, గాయకులతోపాటు రాజకీయ నాయకులు కూడా పాల్లొనడం విశేషం. ఈ ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో రామ్‌లీలకు సంబంధించిన లవ్‌కుశ అనే నాటికను ప్రదర్శించనున్నారు. అందులోని పరుశురాముడి పాత్రలో బీజేపీ ఎంపీ , భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ నటించనున్నారు. విఘ్ణువు ఆరవ అవతారంగా భావించి పరుశురాముడిలా ఒదిగిపోనున్నారు ఎంపీ తివారీ. ఆయన గతేడాది కూడా ఇదే పాత్రలో ఒదిగిపోయి ప్రశంసలందుకున్నారు. పౌరాణిక పురాణాల ప్రకారం పరుశురాముడు కలియుగం చివరిలో కల్కి గురువుగా కనిపిస్తాడని చెబుతుంటారు. ఇక రాముడి పాత్రలో నటుడు కిన్షుక్ వైద్య, నటుడు ఆర్య రావణుడి పాత్రను పోషిస్తున్నారు. అలాగే గాయకుడు శంకర్ సాహ్నే గతేడాది పోషించిన పాత్రలోనే ఒదిగిపోనున్నారు. రామ్‌లీలా నాటక విశిష్టత..యునెస్కో జాబితాలో కూడా ఈ రామలీలా నాటకం చోటుదక్కించుకుంది. యునెస్కో ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్ వెబ్సైట్ ప్రకారం..అక్షరాల రామాయణ ఇతిహాసానికి సంబంధించిన రాముడి నాటిక ఇది. ఇందులో కథనం, పారాయణం, సంభాషణలు ఉంటాయి. ఇది ఉత్తర భారతదేశం అంతటా దసరా పండుగ సందర్భంగా ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి ఏడాది శరదృతువులో ఈ నాటకంను ప్రదర్శిస్తారు. దీన్ని తులసీదాస్ విరచిత రామచరిత మానస్ ఆధారంగా రూపొందిస్తారు. ఇక ప్రపంచంలోనే అతి పురాతనమైన రామ్‌లీల నాటిక వారణాసిలోని చిత్రకూట్ రామ్‌లీల ప్రదర్శితమవుతోంది. ఇక్కడ ఇది సుమారు 485 సంవత్సరాల క్రితం నుంచి ప్రదర్శిస్తున్నారట.(చదవండి: బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం) -
నేడు ప్రధాని మోదీ ప్రసంగం.. జీఎస్టీపై కీలక వ్యాఖ్యలు!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. అయితే, దేశంలో రేపటి నుంచి(సెప్టెంబర్ 22వ తేదీ) జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉండగా.. జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులుగా రెండు శ్లాబులు చేసింది. ఇందులో ఒకటి 5% కాగా రెండోది 18%. దీని ప్రకారం 12%, 28% పన్ను శ్లాబులు ఇకపై ఉండవు. దీంతో.. చాలా వస్తువులు, వాహనాలు పలు వాటిపై ధరలు తగ్గే అవకాశం ఉంది. Prime Minister Narendra Modi will address the nation today at 5 pm. pic.twitter.com/YFJc7fLdVu— ANI (@ANI) September 21, 2025 -
‘ట్రంప్ H1B బాంబ్’పై భారత్ స్పందన
భారత్‌పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. -
Delhi: పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (శనివారం) ఉదయాన్నే పలు పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, ఇతర అత్యవసర సంస్థలు తనిఖీలు ప్రారంభించాయని ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి ఒకరు తెలిపారు. ఉదయం 6:35 నుండి 7:48 గంటల మధ్యలో ఈ బాంబు బెదిరింపులకు సంబంధించిన కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు.బాంబు బెదిరిపుల కాల్స్ వచ్చిన పాఠశాలల్లో ఆంధ్రా స్కూల్, బీసీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, రావు మాన్ సింగ్ స్కూల్, కాన్వెంట్ స్కూల్, మాక్స్ ఫోర్ట్ స్కూల్ ద్వారకలోని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పోలీసు బృందాలు ఆయా పాఠశాలల్లో పరిశీలనలు జరుపుతున్నాయి. పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడమనేది గత నాలుగు రోజుల్లో ఇది మూడవ సంఘటన. గత సోమవారం ఢిల్లీ అంతటా 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. తరువాత అవి ఫేక్ అని తేలింది. అలాగే బుధవారం దాదాపు 50 పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా మరోమారు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు జరిపిన పోలీసులు వాటిని ఫేక్ అని తేల్చారు. -
శరీరం తిరగబడుతుంది
న్యూఢిల్లీ: ‘రక్త ప్రసరణలో వ్యత్యాసం ఏర్పడుతుంది. ముఖం ఉబ్బుతుంది, గుండె వేగం తగ్గుతుంది, వెన్నెముక సాగుతుంది, నడుము నొప్పి మొదలవుతుంది. పొట్టలోని పదార్థాలు తేలుతున్నట్లు అనిపిస్తుంది. ఆకలి అనిపించదు.. ఇవన్నీ అంతరిక్షంలోకి చేరుకున్నాక తాను ఎదుర్కొన్న సమస్యలని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తెలిపారు. ఢిల్లీలో ఎఫ్ఐసీసీఐ సీఎల్వో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన అంతరిక్ష అనుభవాలను పంచుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో జీవితం మానవ సహనానికి ఒక పరీక్ష లాంటిదని అభిప్రాయపడ్డారు. అది పట్టుదల, సహనం, జట్టు స్ఫూర్తిని నేరి్పందని పేర్కొన్నారు. అంతరిక్ష యాత్రలంటే సరదాగా ఉంటాయని అందరూ భావించవచ్చు.. నిజం చెప్పాలంటే అవి అలానే ఉంటాయి కానీ, ఒకసారి సూక్ష్మ గురుత్వాకర్షణలోకి చేరుకోగానే, శరీరం తిరుగుబాటు చేస్తుందని శుభాంశు శుక్లా స్పష్టం చేశారు. శరీరం అప్పటివరకు అలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడకపోవడమే అందుకు కారణమని.. అక్కడ ప్రతిదీ మారిపోతుందని వివరించారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు శుభాంశు శుక్లా.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సంభాíÙంచడం తెలిసిందే. ఆ సంభాషణకు ముందు తనకు కడుపులో వికారంగా అనిపించిందని, తలనొప్పితో బాధపడ్డానని శుక్లా గుర్తు చేసుకున్నారు. వాంతులు రాకుండా మందులు వేసుకుంటే మగతగా అనిపిస్తుందని.. కాబట్టి అవి కూడా వేసుకునేందుకు వీల్లేకపోయిందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తన జట్టు సభ్యులు ఎంతో సహకరించారని చె ప్పారు. అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు.. భారతదేశాన్ని గుర్తించడం ఒక అద్భుతమైన అనుభవమని శుక్లా తెలిపారు. అంతరిక్షం నుంచి చూసినప్పు డు భారతదేశం చాలా అందంగా కనిపించిందని శుభాంశు శుక్లా ఆనందం వ్యక్తం చేశారు. -
నీటి వినియోగ లెక్కల్లేవ్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదుల్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వినియోగిస్తున్నామన్న లెక్కలు ప్రభుత్వం వద్ద లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో రాష్ట్రానికి 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నా అందులో ఎంత నీటిని వాడుతున్నామన్న దానిపై స్పష్టత కొరవడిందన్నారు. శుక్రవారం ఢిల్లీలో వివిధ అంశాలపై సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇందులో భాగంగా నీటి వినియోగ లెక్కల గురించి ఆయన వివరించారు. ‘గోదావరిలోని 968 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఎన్ని టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకుంటోందో ఎవరికీ తెలియదు. ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నదీ.. ఎంత ఆయటక్టుకు నీళ్లిస్తున్నదీ తెలియకుండా గత ప్రభుత్వం అంతా గందరగోళం చేసింది. ఒక ప్రాజెక్టు ఆయకట్టును ఇంకో ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టులో కలిపి చూపించింది. దీంతో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు ఉందో, ఎంత నీటిని వినియోగిస్తున్నామో రాష్ట్రం వద్ద లెక్కల్లేవు. అందుకే ఆ లెక్కలు తయారు చేయాలని అధికారులను ఆదేశించాం. అది పూర్తయితేనే తెలంగాణకు మిగిలిన నీటి వాటా ఎంతో తెలుస్తుంది.ఆ మిగిలిన నీటి వాటాను వినియోగించుకునేలా తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టులను చేపడతాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ఇక కృష్ణాలోనూ పరీవాహకం ఆధారంగా 904 టీఎంసీలను కోరుతున్నామని.. అందులో నికర, వరద, మిగులు జలాలన్నీ కలిపి ఉన్నాయని సీఎం వివరించారు. ‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణకు జాప్యం ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరినా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఇస్తే 48 గంటల్లో తేలుస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఇంతకాలం అవుతున్నా కనీసం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేదు? ప్రాజెక్టు లోపాల్లో కుట్రదారులెవరో తేల్చాల్సి ఉన్నా, సమగ్ర విచారణ జరగాల్సి ఉన్నా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది? విచారణ జరగకుండా కేటీఆర్ ఆపుతుంటే దానికి కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది’అని సీఎం ఆరోపించారు. హైకోర్టు చెప్పినట్లుగా ఈ నెలాఖరులోగా ‘స్థానికం’కష్టసాధ్యం.. స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు విధించిన ఈ నెల 30లోగా నిర్వహించడం కష్టసాధ్యమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపాం. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ అధికారం సుప్రీంకు ఉందా? అని రాష్ట్రపతి సుప్రీంకు రెఫరెన్స్ ఇచి్చంది. ఆ రెఫరెన్స్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థలపై నిరీక్షిస్తాం. ఆ తర్వాతే తదుపరి కార్యాచరణ చేపడతాం’అని సీఎం రేవంత్ తెలిపారు. కేసీఆర్, ఎల్ అండ్ టీ తప్పులకు ప్రజలపై భారమా? హైదరాబాద్ మెట్రో విస్తరణలో ఎల్ అండ్ టీ సంస్థ తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు. మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ సహకరించాలని.. లేకపోతే ప్రభుత్వపరంగా ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ‘మెట్రో విస్తరణలో భాగంగా 76 కి.మీ. కనెక్టివిటీ జరగాలి. ఇది పూర్తి కావాలంటే ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం షరతు పెడుతోంది. కానీ మెట్రోతో మాకు నష్టాలు వస్తున్నందున కొత్త పనులు చేయలేమని ఎల్ అండ్ టీ అంటోంది. కేసీఆర్, ఎల్ అండ్ టీ చేసిన తప్పిదాలు, భూసేకరణలో జాప్యం వల్ల రూ. 13 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం కాస్తా రూ. 20 వేల కోట్లకు పెరిగింది. వాళ్లు చేసిన తప్పిదాలకు రాష్ట్ర ప్రజలు భారం భరించాలా? ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టీ డిక్టేట్ చేయజాలదు’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కోసమే యూరియా డ్రామా... రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రంపై కక్ష సాధిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్రానికి సీజన్లో 9.8 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ 2 లక్షల టన్నుల యూరియాను కేంద్రం సరైన సమయానికి సరఫరా చేయలేదు. ఈ విషయంలో బీఆర్ఎస్కు తిరిగి జీవం పోసేలా బీజేపీ డ్రామాలాడింది. ఇదే అదునుగా బీఆర్ఎస్ ప్రజల్లో యూరియా లేదని ఒక అస్థిరతను సృష్టించడం.. రైతులు ఎక్కువగా కొనుగోళ్లు చేయడంతో సమస్య పెద్దదైంది. బీఆర్ఎస్ను నిలబెట్టేందుకు కేంద్రం రైతులకు నష్టం చేస్తోంది’అని సీఎం ఆరోపించారు. కండువాలు కప్పితే పార్టీ మారినట్లు కాదు.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని స్పీకర్‌కు సూచించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అయితే పార్టీ కండువాలు కప్పుకున్నంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదన్నారు. ‘కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను ఈరోజు ఎంతో మందికి కండువాలు కప్పాను. వారికి కప్పిన కండువా ఏదో వారికే తెలియదు. ఎవరి ఇంటికి వెళ్తే ఏం భోజనం పెడతారో ముందే తెలియదు కదా? బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల్లోంచి ప్రతి నెలా రూ. 5 వేలు ఆ పార్టీ ఫండ్‌కు వెళ్తున్నాయి. తమ పారీ్టకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఆ మేరకు సమయం కేటాయించాలని అసెంబ్లీలో హరీశ్‌రావు ఆన్ రికార్డుగా చెప్పారుగా’అని సీఎం గుర్తుచేశారు. బీఆర్ఎస్లో ఆస్తుల గొడవతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు.. బీఆర్ఎస్లో కవిత ముసలం పుట్టిందని సీఎం అన్నారు. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న పాపం ఊరికే పోదు కదా? అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావులు కలిసి కవితపై మూకుమ్మడిగా దండయాత్ర చేస్తున్నారని.. అయితే ఈ ఆస్తుల గొడవతో తమ పారీ్టకి సంబంధం లేదన్నారు. మావోలతో చర్చించాలి.. కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ సూచించారు. ఉగ్రవాదులతోపాటు దాయాది దేశమైన పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతున్న కేంద్రం.. మావోయిస్టులతో చర్చిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. వాళ్లూ ఈ దేశ ప్రజలే కదా.. మన అక్కాతమ్ముళ్లే కదా అని పేర్కొన్నారు. -
ఈసీ కీలక నిర్ణయం.. 474 పొలిటికల్ పార్టీల గుర్తింపు రద్దు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 474 రిజిస్టర్ పొలిటికల్ పార్టీల గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. వరుసగా ఆరేళ్ల పాటు పోటీ చేయకపోవడంతో రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళనలో భాగంగా గుర్తింపులేని పార్టీలపై ఈసీఐ దృష్టి పెట్టింది. మొదటి విడతలో 334 రిజిస్టర్డ్ పార్టీలను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా 474 పార్టీల గుర్తింపు రద్దు చేసింది.దీంతో ఇప్పటివరకు మొత్తం 808 రిజిస్టర్ పార్టీల గుర్తింపును ఈసీఐ రద్దు చేసింది. మరో 359 పార్టీల గుర్తింపు రద్దు చేసే ప్రక్రియలో ఈసీఐ ఉన్నట్లు సమాచారం. తాజాగా ఏపీలో 17, తెలంగాణలో 9 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఇప్పటివరకు 2520 గుర్తింపు లేని రిజిస్టర్ రాజకీయ పార్టీలు ఉండగా, తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని పేర్కొంది. -
సుప్రీంకోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు(84)కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. చికిత్స విషయంలో ఆయన వేసిన ఓ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. భీమా కోరేగావ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టైన ఆయన.. కోర్టు షరతులతో ముంబైలో ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే..వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్‌లో చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో చికిత్సకు అధిక ఖర్చు అవుతోందని.. హైదరాబాదులో తమ బంధువులు డాక్టర్లైన నేపథ్యంలో అక్కడ చికిత్స పొందేందుకు అనుమతించాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. కానీ కోర్టు ఆ అభ్యర్థను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేసింది. భీమా కోరేగావ్ హింస కేసులో పూణే పోలీసులు వరవరరావును ఉపా చట్టం కింద 2018 ఆగస్టు 28వ తేదీన అరెస్ట్ చేసి తలోజా జైలు(మహారాష్ట్ర)కు తరలించారు. ఆపై నెలలోపే సుప్రీం కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని నివాసానికి తరలించి గృహనిర్బంధం చేశారు. మరో రెండు నెలల తర్వాత కోర్టు అనుమతితో తిరిగి తలోజా జైలుకు తరలించారు. అయితే..2020 జులైలో ఆయనకు జైలు కరోనా సోకడంతో వరవరరావుకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఈ తరుణంలో.. మహారాష్ట్ర హైకోర్టు 2021 ఫ్రిబవరిలో మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షరతుల మీద ఆయన ముంబైలో అద్దె నివాసంలో ఉన్నారు. అటుపై 2022లో సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ.. ముంబై విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. -
కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
చొరబాటుదారుల కోసం కాంగ్రెస్ యాత్రలా?
న్యూఢిల్లీ: విపక్ష కాంగ్రెస్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా ఆ పార్టీ యాత్రలు చేస్తోందని మండిపడ్డారు. చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 ప్రజా సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. దేశ పౌరులపై కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీకి ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. అందుకే చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నారని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితాల్లో చొరబాటుదారులు ఎప్పటికీ ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. మనదేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి ఓట్లు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో నెగ్గడానికి అక్రమ వలసదారులకు అండగా నిలుస్తారా? ఇదెక్కడి చోద్యం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ విజయాలను ప్రజలు మర్చిపోలేరుదేశంలో ఓటర్ల జాబితాల ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు అమిత్ షా స్పష్టంచేశారు. బిహార్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రపై విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగిస్తే తప్పేమిటని అన్నారు. దేశ సరిహద్దులను మోదీ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. మన సరిహద్దులను అతిక్రమించాలని చూసిన శత్రువులపై సర్జికల్, వైమానిక దాడులు చేసినట్లు గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం నేర్పామని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో 2027 నాటికి మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్వవస్థగా మారడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్నో విజయాలు సాధించిందని, దేశ ప్రజలు వాటిని ఎప్పటికీ మర్చిపోలేరని వెల్లడించారు. మోదీ పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి లభించిందని గుర్తుచేశారు. -
మసూదే సూత్రధారి
ఇస్లామాబాద్: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం ముక్కలైపోయిందని స్వయంగా వెల్లడించిన ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ మరో సంచలన విషయం బయటపెట్టాడు. భారత్‌లోని ఢిల్లీ, ముంబైలో జరిగిన భీకర ఉగ్రవాద దాడుల్లో మసూద్ అజార్‌దే కీలక పాత్ర అని స్పష్టంచేశాడు. ఆయా దాడులకు ప్రణాళిక రూపొందించి, అమలు చేసింది అతడేనని పేర్కొన్నాడు. ఢిల్లీ, ముంబై ఉగ్రవాద దాడుల వెనుక తమ పౌరుల హస్తం లేదంటూ నమ్మబలుకుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అసలు రంగు దీనితో తేలిపోయింది. పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థలే భారత్‌లో మారణహోమం సృష్టించినట్లు స్పష్టంగా బహిర్గతమయ్యింది. బాలాకోట్ నుంచే కుట్ర భారత నిఘా వర్గాలు గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అమీర్–ఉల్–ముజాహిదీన్ మౌలానా మసూద్ అజార్‌కు మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందాడు. అతడు ఇటీవల మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో 1999లో విమానం హైజాక్ ఉదంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల డిమాండ్ మేరకు భారత ప్రభుత్వం మసూద్ అజార్‌ను విడుదల చేసింది. అలా పాకిస్తాన్‌కు చేరుకున్న మసూద్ అజార్ ఇక్కడి నుంచే భారత్‌లో ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేశాడని మసూద్ ఇల్యాస్ కశ్మీరీ చెప్పాడు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌ను అడ్డాగా మార్చుకొని, అనుచరుల సంఖ్యను పెంచుకొని, వారికి శిక్షణ ఇచ్చి, భారత్‌పైకి ఉసిగొల్పాడని వెల్లడించాడు. బాలాకోట్ అతడికి సురక్షిత ప్రాంతంగా మారిందని అన్నాడు. 2001 డిసెంబర్ 13న ఢిల్లీలోని భారత పార్లమెంట్‌పై ఆత్మాహుతి దాడి, 2008 నవంబర్ 26న ముంబైలో దాడులకు బాలాకోట్ నుంచే కుట్ర సాగించాడని తేల్చిచెప్పాడు. రెండు భీకర దాడులు జైషే మొహమ్మద్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే గుర్తించింది. భారత పార్లమెంట్‌పై 2001లో ఐదుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి దిగారు. హోంశాఖ స్టిక్కర్ ఉన్న కారులో లోపలికి దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. 2008లో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. 12 ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 166 మందిని బలి తీసుకున్నారు. -
అంధుల T20లో వైజాగ్ అమ్మాయి
‘నాకు బాల్ కనపడదు. కాని నా మైండ్‌తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’ అంటోంది విశాఖ అంధబాలిక పాంగి కరుణ కుమారి. పదో తరగతి చదువుతున్న కరుణ బ్యాటింగ్‌లో దిట్ట. అందుకే నవంబర్ 11న ఢిల్లీలో తొలిసారి నిర్వహించనున్న అంధుల టి20 వరల్డ్ కప్‌కి భారత జట్టులో ఎంపికైంది. తెలుగువారు సంతోషపడాల్సిన సందర్భం ఇది. స్ఫూర్తినిస్తున్న కరుణ కుమారి పరిచయం.స్కూలు పుస్తకాల్లో అక్షరాలు కనపడటం లేదని చదువు మానేసి ఇంట్లో కూచున్న అమ్మాయి నేడు భారత దేశ అంధ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సం పాదించింది. ఆ అమ్మాయి పాంగి కరుణకుమారి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన అరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఢిల్లీలో నవంబర్ 11 నుంచి జరగనున్న అంధ మహిళల టి20 వరల్డ్ కప్‌లో ఆమె భారత్ తరఫున ఆడనుంది. అంధ మహిళల కోసం టి20 వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే ప్రథమం.ఆమె ఆల్రౌండర్వంట్ల మామిడిలో కూలినాలి చేసుకునే రాంబాబు, సంధ్యల మొదటి కుమార్తె కరుణ పుట్టుకతోనే దృష్టిలోపంతో పుట్టింది. ఒక కన్ను కొద్దిగా మరో కన్ను పూర్తిగా కనిపించేది కాదు. ఏడవ తరగతి వచ్చేసరికి చూపు దాదాపుగా పోవడంతో చదువు మానేసి ఇంట్లో కూచుంది. అయితే చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. ఫోన్లో క్రికెట్ చూసేది. ఈ విషయం తెలిసి అంధ బాలికలను వెతికి చదివించే బాధ్యతతో విశాఖ అంధ బాలిక ఆశ్రమ పాఠశాల వారు కరుణ తల్లిదండ్రులను ఒప్పించి తమ స్కూల్లో చేర్పించారు. రెసిడెన్షియల్ స్కూల్ కావడం వల్ల అక్కడ కరుణ తిరిగి చదువులో, ఆటల్లో పడింది. క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పీటీ మేడమ్ కరుణనుత్సహించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. మూడింటిలో ప్రతిభ చూపుతూ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది కరుణ. నేషనల్ సెలక్షన్స్‌లో భాగంగా 2023లో హైదరాబాద్‌లో, 2024లో హుగ్లీలో, 2025లో కొచ్చిలో మేచెస్ ఆడింది. సెలెక్టర్ల దృష్టిలో పడింది.60 బాల్స్‌లో 100 పరుగులుఅంధ మహిళల టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో 20 రోజుల క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్‌లో కరుణ 60 బంతుల్లో 100 పరుగులు చేయడమే కాక 114 నాటౌట్‌గా నిలిచింది. బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో కూడా ప్రతిభ చూపింది. దాంతో భారత జట్టుకు కరుణను సెలెక్ట్ చేశారు. ‘నాకు బాల్ కనపడదు. కాని దాని రాకను పసిగట్టగలను. బాల్ రాకను అర్థం చేసుకోలేనప్పుడు అది ఒంటికి తగిలి దెబ్బలయ్యేవి’ అని తెలిపింది కరుణ. ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. ఇన్ని ప్రతికూలతల్లోనూ ప్రతిభ చూపుతోంది కరుణ.ఆరు దేశాలతో...అంధ మహిళల టి20 వరల్డ్ కప్‌లో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నే పాల్, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కలిసి 21 లీగ్ మేచ్‌లు, 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్‌ను ఆడనున్నారు. ఈ వరల్డ్ కప్‌లో మన దేశం కప్పు గెలవాలని, మన కరుణ గొప్ప ప్రతిభ చూ పాలని కోరుకుందాం. -
కార్లతో సమానంగా ఏసీల కాలుష్యం
న్యూఢిల్లీ: ఎండల తీవ్రత పెరిగిన కొద్దీ దేశంలో ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకప్పటి విలాస ఉపకరణం నేడు ముఖ్యావసరంగా మారింది. ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఏసీ ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ కనిపిస్తోంది. అయితే, కారు మాదిరిగానే ఏసీకూడా వాతావరణం మరింత వేడెక్కేందుకు కారణమవుతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. వాతావరణం కోణంలో చూస్తే ఏసీ కూడా ప్రమాదకరమైన గృహోపకరణమేనని ఢిల్లీకి చెందిన ఐఫారెస్ట్ సంస్థ సర్వే తేల్చింది. ఇంకా ఏం చెప్పిందంటే.. 2030 నాటికి భారత్‌లో గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేసే అతిపెద్ద గృహోపకరణంగా ఎయిర్ కండిషనర్లు మారనున్నాయి. దేశంలో 2035 నాటికి వాతావరణంలో కలిసే కార్బన్ డయాక్సైడ్ రెట్టింపయ్యి 329 మిలియన్ టన్నులకు చేరుకోనుంది. 2024లో ఒక్క ఏడాదిలోనే ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) 156 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమాన ఉద్గారాలను విడుదల చేశాయని, ఇది దేశంలోని అన్ని ప్రయాణికుల కార్ల ఉద్గారాలకు సమానమని వెల్లడైంది. ఇందులో 52 మిలియన్ టన్నుల ఉద్గారాలు కూలింగ్ గ్యాస్ లీకేజీల (రెఫ్రిజిరెంట్లు) వల్లనే జరిగాయని పేర్కొంది. 2035 నాటికి ఏసీల వల్ల విడుదలయ్యే మొత్తం ఉద్గారాలు 329 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వాటితో పోలిస్తే రెట్టింపునకు మించి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఒక ఏసీని రెండేళ్లకోసారి గ్యాస్ రీఫిల్ చేయిస్తే, అది ఓ కారు విడుదల చేసేంత ఉద్గారాలను విడుదల చేస్తుంది. వాతావరణ పరంగా చూస్తే ఏసీ కూడా కారు లాంటిదే, అంతే ప్రమాదకరమైందని ఐఫారెస్ట్ అధ్యక్షుడు, సీఈవో చంద్ర భూషణ్ చెప్పారు. రెఫ్రిజిరెంట్ల తయారీదారులు ఉద్గారాలను మరింతగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఒత్తిడిపెంచాలి. ప్రభుత్వం జాతీయ రెఫ్రిజిరెంట్ డేటాబేస్ ఏర్పాటు చేయాలి. వాతావరణంపై తీవ్రప్రభావాన్ని తగ్గించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ చర్యలతో వచ్చే దశాబ్దంలో 500–650 మిలియన్ టన్నుల రెఫ్రిజిరెంట్ ఉద్గారాలను తగ్గించవచ్చని, వాటి విలువ 25 నుంచి 33 బిలియన్ల డాలర్ల కార్బన్ క్రెడిట్లుగా ఉండొచ్చని ఐఫారెస్ట్ నివేదిక పేర్కొంది. అలాగే, వినియోగదారులు 10 బిలియన్ డాలర్ల వరకు రీఫిల్లింగ్ ఖర్చులు ఆదా చేసుకోగలరని తెలిపింది. ఏసీ వాడకం ఎలా ఉంటుందంటే..2024లో 62 మిలియన్లు ఉన్న ఏసీలు, 2035 నాటికి 245 మిలియన్లకు చేరనున్నాయి. వార్షిక విక్రయాలు సైతం 14 మిలియన్ల నుంచి 40 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. 2020 నుంచి ఏసీల విక్రయాలు ఏడాదికి 15 నుంచి 20% చొప్పున పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో నగరీకరణ, వ్యక్తుల ఆదాయాల్లో పెరుగుదల, పెరిగిన ఎండల తీవ్రత తదితరాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి. సర్వే ఎలా జరిపారంటే..ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, పుణె, జైపూర్ నగరాల్లో 3,100 కుటుంబాలపై ఈ సర్వే చేపట్టారు. ఆయా నివాసాలు, కార్యాలయాల్లోని 80% ఏసీలు ఐదేళ్ల లోపు తయారైనవి. ఇందులో 87% కుటుంబాలు ఒకే ఏసీ కలిగి ఉండగా, 13% మంది రెండు, అంతకంటే ఎక్కువ ఏసీలను వాడుతున్నారు. చెన్నై, జైపూర్, కోల్‌కతా, పుణెల్లోని ఎక్కువ కుటుంబాలు ఒకటికి మించి ఏసీలను కలిగి ఉన్నాయి. కోల్‌కతా, జైపూర్, పుణె వాసులు ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సైతం నివేదిక వెల్లడించింది. రెఫ్రిజిరెంట్ రీఫిల్లింగ్ భారత్‌లో రీఫిల్లింగ్ ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. సాధారణంగా ఏసీలను ఐదేళ్లకోసారి రీఫిల్ చేస్తే సరిపోతుంది. కానీ, భారత్‌లో సగటున 40% ఏసీలు ఏటా రీఫిల్ అవుతున్నాయి. ఐదేళ్లకు మించి ఉన్న ఏసీలలో 80%కు పైగా ఏటా రీఫిల్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. వినియోగదారులు 2024లో రూ.7,000 కోట్ల విలువైన రెఫ్రిజిరెంట్ల రీఫిల్లింగ్ చేసుకున్నారు. ఇది 2035 నాటికి రూ. 27,540 కోట్లకు పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది.హానికరమైన రెఫ్రిజిరెంట్లు దేశంలో ప్రధానంగా వాడే హెచ్ఎఫ్సీ–32 అనే గ్యాస్, కార్బన్ డయాక్సైడ్ కంటే 675 రెట్లు ఎక్కువ ఉష్ణతాపాన్ని కలుగ జేస్తుంది. 2024లో రెఫ్రిజిరెంట్ లీకేజీల వల్ల 52 మిలియన్ టన్నుల ఉద్గారాలు వెలువడగా, 2035 నాటికి ఇది 84 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది.వినియోగం తీరు ఎలా ఉంది? దేశంలో కుటుంబాలు సగటున ఏసీని రోజుకు 4 గంటల పాటు వాడుతున్నాయి. వేసవిలో ఎక్కువగా 7.7 గంటలపాటు వాడుతున్నారు. వర్షాకాలంలో 3.2 గంటలు మాత్రమే వినియోగించుకుంటున్నారు. దాదాపు 98% కుటుంబాలు 3 స్టార్ నుంచి 5 స్టార్ రేటెడ్ ఏసీలు వాడుతున్నారు. త్రీస్టార్ ఏసీలు 60% ఇళ్లలో ఉంటే 5 స్టార్ ఏసీలు 28% మంది వినియోగిస్తున్నారు.థర్మోస్టాట్ సెట్టింగ్స్ దేశంలో సగటున 67% కుటుంబాలు ఏసీని 23నిసెల్సియస్–25సెల్సియస్ మధ్య ఉంచుతున్నాయి. కేవలం 33% మాత్రమే 22 సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేస్తున్నారు. వీరిలో అత్యధికులు ఢిల్లీ, ముంబయి, పుణెకు చెందినవారేనని సర్వేలో తేలింది. విద్యుత్ వినియోగంపై ప్రజలు జాగ్రత్తగా ఉన్నా, రెఫ్రిజిరెంట్ల విషయంలో అవగాహన తక్కువగా ఉంది. ప్లాస్టిక్ లాగే రెఫ్రిజిరెంట్ల జీవిత కాలంపై కూడా సమగ్ర అవగాహన అవసరమని ఐఫారెస్ట్ చైర్మన్ చంద్ర భూషణ్ అంటున్నారు. -
నేడు భారత్, అమెరికా వాణిజ్యచర్చలు
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌ల భారం మోపడంతో వాటిని తగ్గించుకునేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో అమెరికా అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందంతో వాణిజ్య చర్చలు జరపనుంది. ఈ వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వాణిజ్య సలహాదారు పీటర్ నవరో సోమవారం వెల్లడించారు. భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో అమెరికాకు భారతీయ సరకుల ఎగుమతులు ఆగస్ట్‌లో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ కీలక వాణిజ్య చర్చలు మొదలుకానుండటం గమనార్హం. భారత్, అమెరికా వాణిజ్యచర్చల అంశాన్ని సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో నవరో వెల్లడించారు. భేటీ కచి్చతంగా జరగనుందని భారత్ తరఫున చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశ వాణిజ్యమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ సైతం చెప్పారు. అమెరికా మధ్య, దక్షిణాసియా వ్యవహారాల వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ సైతం ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ‘‘ భారత్ ఎప్పటికైనా అమెరికాతో వాణిజ్య చర్చలపై తుది నిర్ణయం తీసుకోక తప్పదు. లేదంటే వాణిజ్యం అనేది సవ్యంగా సాగదు. టారిఫ్‌ల విషయంలో భారత్ మహారాజు వంటిదే. మా సరకులపై అత్యధిక సుంకాలు మోపుతుంది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు వరకు రష్యా నుంచి భారత్ కొనుగోలుచేసిన ముడి చమురు పరిమాణం చాలా అత్యల్పం. కొన్ని చుక్కల ఆయిల్ మాత్రమే కొన్నదేమో. ఇప్పుడేమో భారీఎత్తున కొనగోలుచేస్తూ భారత్ లాభాలను కొల్లగొడుతోంది. రష్యా ఆయిల్ రిఫైనరీ సంస్థలు సైతం భారత్‌కు చమురు అమ్మేసి లాభాల పంట పండిస్తున్నారు. ఈ లాభాలతో ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు సాయపడేందుకు అమెరికా పెద్ద ఎత్తున సొంత ఖజానా కరెన్సీని ఖర్చుచేస్తోంది. అలా అమెరికన్లు పన్నుల రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాలన్నీ ఉక్రెయిన్ యుద్ధం కోసం వృథా అవుతున్నాయి’’ అని భారత్‌ను పరోక్షంగా నవరో విమర్శించారు. -
పక్కనే ఆస్పత్రి ఉండగా.. 19 కిలోమీటర్ల దూరం ఎందుకు తీసుకెళ్లినట్లు!
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీ నవ్‌జ్యోత్‌సింగ్ (52) రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవ్‌జ్యోత్‌సింగ్ మరణానికి కారణమైన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు గుర్గావ్ పోలీసులు నిందితులపై అదనపు కేసులు నమోదు చేశారు.ఆదివారం ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రోస్టేషన్ సమీపంలో గగన్‌ప్రీత్ (38),పరిషిత్ మాక్కాడ్(40)లు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూకారు.. గురుద్వార్ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న నవ్‌జ్యోత్‌సింగ్, అతని భార్య సందీప్‌కౌర్ ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్‌జ్యోత్‌సింగ్ మరణించగా.. సందీప్‌కౌర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గగన్ ప్రీత్ బీఎండబ్ల్యూకారు తమని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఢీకొట్టినట్లు సందీప్‌కౌర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. నిందితులు నన్ను,నా భర్త నవజోత్ సింగ్‌ను ఓ వ్యానులో ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యానులో ఉన్న నేను మమ్మల్ని సమీప ఆస్పత్రికి తరలించమని నిందితుల్ని ప్రాధేయపడ్డ.. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 19కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్ న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించారు. ఫలితంగా నా భర్త వ్యాన్లోనే ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలు గగన్‌ప్రీత్ తండ్రి సదరు న్యూలైఫ్ ఆస్పత్రికి సహయజమాని అని నిర్ధారించుకున్నారు. దీంతో కేసును కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందా అన్న కోణంలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సందీప్కౌర్కు ట్రీట్మెంట్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కారు ప్రమాదంలో నిందితులకు కఠిన శిక్ష పడేందుకు ఉపయోగపడే ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నంలో న్యూలైఫ్ ఆసుపత్రికి తీసుకువచ్చారని అనుమానించారు.ఇదే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ ఆస్పత్రి ప్రతినిధుల్ని పోలీసులు ప్రశ్నించారు. ట్రీట్మెంట్ విషయంలో సదరు ఆస్పత్రి వైద్యులు,యాజమాన్యం ప్రొటొకాల్ పాటించామని చెప్పాయి. కానీ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఆస్పత్రి ఉంచుకొని.. 19కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికే ఎందుకు తరలించారు అనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
25 గ్యాంగ్‌స్టర్ స్థావరాలపై 380 మంది పోలీసుల భారీ దాడులు
న్యూఢిల్లీ: ప్రముఖ గ్యాంగ్‌స్టర్ సిండికేట్ల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ పోలీసులు ఢిల్లీతోపాటు హర్యానా అంతటా 25 ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ద్వారక డీసీపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 380 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఈ ఏడాది ఈ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్‌స్టర్ వ్యతిరేక ఆపరేషన్లలో ఒకటిగా తెలుస్తోంది.25 గ్యాంగస్టర్ స్థావరాలపై జరిగిన దాడుల్లో ఢిల్లీలో 19, హర్యానా, ఎన్సీఆర్లో ఆరు ఉన్నాయి. దోపిడీలు, హత్యలు, ఆయుధ అక్రమ రవాణాతో సహా పలు హై ప్రొఫైల్ నేరాలకు పాల్పడిన కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు, విక్కీ టక్కర్‌ల క్రిమినల్ నెట్‌వర్క్‌లపై దాడులు జరిగాయి. ఈ దాడులలో పోలీసులు పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు,పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 8 పిస్టల్స్, 29 లైవ్ కార్ట్రిడ్జ్లు, మూడు మ్యాగజైన్లు, బుల్లెట్‌ప్రూఫ్ టయోటా ఫార్చ్యూనర్, ఆడి కారు, 14 హై-ఎండ్ లగ్జరీ గడియారాలు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్లు, నగదు లెక్కింపు యంత్రాలు, వాకీ-టాకీ సెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో పోలీసులు 26 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు కీలక గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులందరూ నందు, విక్కీ టక్కర్ ముఠాతో సన్నిహిత సంబంధాలు కలిగినవారు.అర్టెస్టయిన నిందితులుపవన్ అలియాస్ ప్రిన్స్ (18): రాజ్‌మందిర్ స్టోర్, చావ్లా కాల్పుల కేసుల్లో పాల్గొన్న నందు ముఠాకు చెందిన షూటర్.హిమాన్షు అలియాస్ మచ్చి (24): విక్కీ టక్కర్ గ్యాంగ్ సభ్యుడు. ఏడు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాడు.ప్రశాంత్: నందు గ్యాంగ్ షూటర్. ఇతనిపై 11 కేసులు నమోదయ్యాయి.రాహుల్ దివాకర్ అలియాస్ మన్‌ప్రీత్ (25): విక్కీ టక్కర్ గ్యాంగ్‌కు చెందినవాడు. 20 ఎఫ్ఐఆర్లలో ఇతని పేరు ఉంది.అంకిత్ ధింగ్రా అలియాస్ నోని (34): నందు గ్యాంగ్‌తో సంబంధం ఉన్నాడు. ఇతనిపై 10 కేసులున్నాయి.ప్రవీణ్ అలియాస్ డాక్టర్: ఇతని పేరు మీద 25కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. -
‘బీఎండబ్ల్యూ’తో రోడ్డుపై మహిళ హల్చల్.. ఆర్థిక శాఖ సీనియర్ అధికారి దుర్మరణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీఎండబ్ల్యూ కారును నిర్లక్ష్యంగా నడిపిన ఓ మహిళ.. ప్రభుత్వ సీనియర్ అధికారి దుర్మరణానికి కారకురాలయ్యారు. ఈ దుర్ఘటనలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్తోజ్ సింగ్ మృత్యువాత పడ్డారు. ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న ఒక మహిళ.. బైక్ వస్తున్న నవ్తోజ్ సింగ్ దంపతులను ఢీకొంది. ఈ ప్రమాదంలో సీనియర్ అధికారి నవ్తోజ్ సింగ్ మరణించగా, అతని భార్య తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.ఆర్థిక వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్తోజ్ సింగ్ ఆదివారం బంగ్లా సాహిబ్ గురుద్వారా నుండి తన బైక్‌పై భార్య సందీప్ కౌర్‌తో పాటు ఇంటికి తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నవ్తోజ్ సింగ్ వయసు 52 సంవత్సరాలు. ప్రమాదం అనంతరం వీరి కుమారుడు మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన తన తల్లిదండ్రులను ఘటన జరిగిన ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలోని నులైఫ్ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అప్పటికే తన తండ్రి చనిపోయారని తెలిపాడు. Finance Ministry Deputy Secretary dies after BMW hits his bike in Delhi.A Deputy Secretary in Finance Ministry died and his wife is seriously injured after a BMW hit his motorcycle on Delhi's Ring Road, police said.He was returning home from Bangla Sahib Gurudwara when he met… pic.twitter.com/Ml4gizQnr9— Nitesh Sharma (@nitesh1572) September 14, 2025తన తల్లిదండ్రుల బైక్‌ను ఢీకొన్న బీఎమ్‌డబ్ల్యూ కారు నడిపిన మహిళ కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని, అయితే ఆస్పత్రి సిబ్బంది ఆమె గురించిన సమాచారం వెల్లడించలేదని నవ్తోజ్ సింగ్ కుమారుడు తెలిపాడు. ప్రమాదానికి కారకురాలైన మహిళ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆమె కోసం నకిలీ మెడికో-లీగల్ సర్టిఫికేట్‌ను సిద్ధం చేసేందుకు ఆస్పత్రి యాజమాన్య సహాయం చేస్తోందని ఆయన ఆరోపించాడు.కాగా కారు నడిపి మహిళను గగన్‌ప్రీత్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త పరీక్షిత్ పాసింజర్ సీట్లో కూర్చున్నాడు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును, నవ్తోజ్ సింగ్ మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద స్థలాన్ని క్రైమ్ బృందం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా సంఘటనా స్థలంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
‘సిక్’ అని మెసేజ్ చేసిన 10 నిమిషాలకే..
న్యూఢిల్లీ: హఠాత్తుగా ఒంట్లో బాగోలేదంటూ ఉన్నతాధికారికి స్మార్ట్‌ఫోన్‌లో సందేశం పంపిన పది నిమిషాలకే ఆ ఉద్యోగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్లకే ఓ ఉద్యోగి నూరేళ్లు నిండిన విషాద ఘటన తాలూకు వివరాలను పైఅధికారి కేవీ అయ్యర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘నా కింది ఉద్యోగి శంకర్ నుంచి ఉదయం 8.37 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది.భయంకరమైన వెన్నునొప్పి కారణంగా ఈరోజు ఆఫీస్‌కు రాలేకపోతున్నా, ఒక రోజు సెలవు ఇవ్వండి అని అందులో ఉంది. సరే విశ్రాంతి తీసుకో అని సమాధానం ఇచ్చా. ఆ తర్వాత కేవలం 10 నిమిషాలకే కుప్పకూలి శంకర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కొద్దిసేపటి తర్వాత నాకొక ఫోన్‌కాల్ వచ్చింది. శంకర్ చనిపోయాడని అవతలి వ్యక్తి చెబితే నమ్మలేకపోయా. వెంటనే మరో ఉద్యోగికి ఫోన్‌చేసి ఆరాతీశా.10 నిమిషాలకే చనిపోయాడని వాళ్లు కూడా చెప్పడంతో నిశ్ఛేష్డుడినయ్యా. వెంటనే శంకర్ ఇంటి అడ్రస్ కనుక్కుని పరుగున వెళ్లా. కానీ అతనిక లేడని తెల్సి దుఃఖంలో మునిగిపోయా. శంకర్ ఆరేళ్లుగా మా ఆఫీస్‌లోనే పచిచేస్తున్నాడు. వయసు కేవలం 40 ఏళ్లు. పెళ్లయింది. వాళ్లకొక పసి పిల్లాడు ఉన్నాడు. అతనికి ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు లేవు. మరునిమిషం ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. చుట్టూ ఉన్న వాళ్లతో హాయిగా ఉండండి. చివరిదాకా జీవితాన్ని ఆస్వాదించండి’’ అని అన్నారు. -
Delhi: 15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు.. రోజుకొక బహుమతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు నుండి రాజధానిలో 15 రోజుల పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. త్యాగరాజు స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15 కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇతర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాలు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. వేడుకలలో ఢిల్లీ పౌరులకు ప్రతిరోజూ కొత్త బహుమతిని అందించనున్నామని ప్రకటించారు. ఇవి ఢిల్లీ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, వీక్షిత్ ఢిల్లీ దార్శనికతను నెరవేర్చడంలో సహాయపడతాయని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. వీటిలో 101 ఆరోగ్య నిలయాలు, 150 డయాలసిస్ కేంద్రాలు, కొత్త హాస్పిటల్ బ్లాక్‌లు, అవయవ మార్పిడి, అవగాహన పోర్టల్ ప్రారంభం మొదలైనవి ఉండనున్నాయి.అలాగే ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రాజ్‌పుతానా రైఫిల్స్ బేస్ సమీపంలో ఫుట్ ఓవర్‌బ్రిడ్జికి పునాది వేయడం, ఆటోమేటెడ్ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థలకు శ్రీకారం, గ్రీన్ ఎనర్జీ,పరిశుభ్రత విస్తరణ ప్రణాళికలు, నంగ్లీ సక్రవతిలో బయోగ్యాస్ ప్లాంట్, ఘోఘా డైరీలో బయోగ్యాస్ ప్లాంట్, యమునా యాక్షన్ ప్లాన్ అప్‌గ్రేడ్, మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులు మొదలైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నరేలాలో కొత్త అగ్నిమాపక కేంద్రం, మండోలి జైలు సమీపంలో రూ. 65 కోట్ల గ్రిడ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణ , పారిశుధ్యం, విద్య, రవాణా, పునరుత్పాదక ఇంధనం వరకు మొత్తం 75 ప్రాజెక్టులు, పథకాలను 15 రోజుల పాటు జరిగే ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రారంభించనున్నారు. -
ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల కలకలం
ఢిల్లీ: నగరంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా, తాజ్ ప్యాలెస్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ హైకోర్టులో బాంబు ఉందంటూ నిన్న(శుక్రవారం) బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు బెంచ్‌ల న్యాయమూర్తులు.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆ ఘటనను మరువక ముందే మధ్యాహ్నం బాంబే హైకోర్టుకు కూడా మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ అమర్చామని.. బాంబులతో కోర్టును పేల్చేస్తామని హెచ్చరించారు. వరుస ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.అయితే, ఈ ఘటనల్లో కూడా అవి ఆకతాయిలు చేసిన బెదిరింపు మెయిల్లు అని పోలీసుల విచారణలో తేలింది. భద్రతా సిబ్బంది బాంబ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు. ఇవాళ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకలేదు. ఇది కూడా ఆకతాయిలు చేసిన మెయిలేనని ఢిల్లీ పోలీసులు తేల్చారు.#WATCH | Taj Palace Hotel in Delhi received a bomb threat mail. Nothing was found; it has been declared a hoax: Delhi Police pic.twitter.com/OPDEZVnDlH— ANI (@ANI) September 13, 2025 -
షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్‌తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్‌కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్‌ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్‌మన్ వికాస్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్‌తో పని చేస్తోందని అప్పటికే సేల్స్‌మన్ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్‌లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. View this post on Instagram A post shared by 🌸 (@___maanniiiiii) -
బాణసంచాపై దేశవ్యాప్త నిషేధం ఉండాలి
న్యూఢిల్లీ: బాణసంచా వినియోగంపై దేశ రాజధాని ఢిల్లీ(ఎన్సీఆర్)లో మాత్రమే ప్రత్యేకంగా నిషేధం ఎందుకు విధించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోని కొందరు ధనవంతులు మాత్రమే స్వచ్ఛమైన గాలికి అర్హులా? దేశంలోని ప్రజలంతా స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు అర్హులేనని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచా వినియోగాన్ని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ‘ఎన్సీఆర్ పరిధిలోని నగరాల్లో ప్రజలకు మాత్రమే పరిశుభ్రమైన గాలికి అర్హులా? మిగతా నగరాల్లోని పౌరులకు ఎందుకు కారు? ఇక్కడ ఎలాంటి విధానముందో దేశవ్యాప్తంగానూ అదే ఉండాలి. ఉన్నత పౌరులుంటున్నారనే కారణంతో ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించలేం. గత శీతాకాలంలో అమృతసర్ వెళ్లాను. గాలి కాలుష్యం అక్కడ ఢిల్లీ కంటే దారుణంగా ఉంది. బాణసంచాపై నిషేధమే విధించాల్సి వస్తే, అది దేశమంతటా ఉండాలి’అని సీజేఐ పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ క్రాకర్స్‌ను తక్కువ రసాయనాలను వినియోగించి రూపొందించే విధానంపై నేషనల్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నీరి) కసత్తు చేస్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం బాణసంచా తయారీ, విక్రయాల లైసెన్సులపై యథాతథ పరిస్థితిని కొనసాగించాలని పేర్కొన్న ధర్మాసనం..తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది. -
ఆ 77 ఏళ్ల తల్లి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు..!
ఓ తల్లి కొడుకు ఆచూకి కానరాక తల్లడిల్లింది. అది కూడా చెట్టంత కొడుకు ఆసరాగా ఉండాల్సిన వయసులో.. అతడి ఆచూకీకై నిరీక్షించడం అంటే ఆ తల్లికి అదొక శాపం. పాపం ఆ తల్లి బాధను చూడలేక ఆ దేవుడే ఇలా ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చి కొడుకును ఆమె వద్దకు చేర్చాడేమో అన్నట్లుగా కలుసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని అమ్రోహాలో చోటు చేసుకుంది.అమ్రెహాకు చెందిన ఇన్స్పెక్టర్ అశ్వని మాలిక్ కేవలం పోలీప్ ఆఫీసర్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో ఫేమస్. ఒకరోజు మాలిక్ ఎప్పటిలానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా..రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చున్నవ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో అపరిశుభ్రంగా ఎలాంటి భావోద్వేగం లేనట్లుగా కనిపించాడు. దాంతో ఆయన తన సహచర పోలీసులు మొహ్మద్ సల్మాన్, కాషిఫ్ల సాయంతో అతన్ని లోపలకి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు శుభ్రం చేసి, ఆహారం ఇచ్చి..అతడి వివరాలను కనుక్కొన్నారు. తర్వాత ఆ వ్యక్తిని మొహమ్మద్ సలీంగా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో కలిపే తన సోషల్ మీడియా సేవలో భాగంగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియో ముంబైలోని సలీం మేనల్లుడు మొహమ్మద్ గుఫ్రాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. అతను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఈ వీడియో కంటపడింది. వెంటనే తన 77 ఏళ్ల అమ్మమ్మ రసుమా బానోకు చూపించాడు. ఆమె వెంటనే ఆ వ్యక్తిని చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కొడుకుగా గుర్తించింది. నిజానికి మొహమ్మద్ సలీం ఒకప్పుడూ ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా హరైయా గ్రామంలో నివశించేవాడు. అతను తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆ బాధలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సుమారు 12 ఏళ్లుగా మళ్లీ తిరిగి రాలేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి కొడుకు చనిపోయాడా లేదా బతికే ఉన్నాడో తెలియక తల్లడిల్లింది. పాపం సలీం తండ్రి కూడా అతడు ఇల్లు వదిలి వెళ్లినప్పుడే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అతడి తల్లి కొడుకు ఆచూకి కనుగొంటానని గానీ, చూస్తానని గానీ అస్సలు భావించలేదు. నిజానికి అస్సలు ఆమె ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా అనుకోలేదట. ఇన్నాళ్లు బతకాలి కాబట్టి బతుకుతున్నా అన్నట్లుగా ఆ తల్లి రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతో తన కొడుకుని ఆ వీడియోలో గుర్తించి కలుసుకుందో తన ఇన్నాళ్ల బాధకు ఒక్కసారిగా తెరపడినట్లయ్యిందని ఆవేదనగా అంటోంది ఆ తల్లి రసుమా బానో. అతడి మేనల్లుడు గుఫ్రాన్ కూడా తన అమ్మమ్మ ఇలాంటి రోజుని చూస్తుందని అస్సలు అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. View this post on Instagram A post shared by Ashwani Kumar (@ashmalikupcop) (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
భారత 15 ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
-
ఢిల్లీ హైకోర్టులో ఐశ్వర్యారాయ్ కి ఊరట
-
బాబోయ్.. ఎయిరిండియా విమానాల్లో ఉక్కపోత!
దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. రెండుగంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిరిండియా ప్రకటన చేసినా.. చేయకపోయినా.. అది ఏసీ వల్లే అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చేసింది. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.పీటీఐ కథనం ప్రకారం.. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ రాత్రి 11గం. సమయంలో సింగపూర్‌కు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్మెంట్ చేశారు. అయితే.. రెండు గంటలు గడిచినా మరమ్మత్తులు కాలేదు. ఆపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణికులను సిబ్బంది కిందకు దించేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఏసీ పని చేయకపోవడంతో ప్యాసింజర్లు మ్యాగజైన్లు, న్యూస్పేపర్లతో విసురుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా విమానాల్లో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకున్నాయి. Now after suffering without AC for around 2 hrs, passengers of Delhi-Singapore @airindia flight being deplaned suspecting a technical glitch. Pathetic service @airindia @DGCAIndia @moneycontrolcom https://t.co/omaceiKZ41 pic.twitter.com/MOccbgH4JT— Ashish Mishra (@AshishM1885) September 10, 2025ఢిల్లీ–సింగపూర్ విమానం (AI2380) – సెప్టెంబర్ 10, 2025(తాజా ఘటన)బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానంలో విద్యుత్ సరఫరాలో లోపంతో పని చేయని ఏసీలు!200 మందికి పైగా ప్రయాణికులు రెండు గంటల పాటు ఎదురు చూశాక.. చివరికి విమానం నుంచి దిగమన్నారుఢిల్లీ–పాట్నా విమానం – మే 19, 2025తీవ్ర వేడిలో AC పనిచేయకపోవడంతో ప్రయాణికులు పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగించి గాలి తీసుకునే ప్రయత్నంరిషి మిశ్రా అనే నేత ఓ వీడియో షేర్ చేసి విమానయాన మంత్రిత్వ శాఖను ప్రశ్నించారుఅహ్మదాబాద్–లండన్ విమానం (AI171) – జూన్ 12, 2025ఈ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే.. విమానం క్రాష్‌కి ముందు ప్రయాణికులు AC పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారుTV స్క్రీన్లు, లైట్లు, సిబ్బందిని పిలిచే crew call buttons కూడా పనిచేయలేదని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ఎయిర్ ఇండియా CEO ఏమన్నారంటే..వరుసగా ఈ తరహా ఘటనలు జరగడంపై కాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందిస్తూ.. ఎయిరిండియాకు ఉన్న విమానాల సంఖ్య, సిబ్బంది, సంస్థ పరిమాణాన్ని బట్టి చూస్తే.. ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణమే. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. -
ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో(సీఈఓ) కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వర్క్‌షాప్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఈ భేటీలో ఆమోదముద్ర వేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, అనర్హుల పేర్లు చేరుస్తున్నారని మండిపడుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ఎస్ఐఆర్ పేరిట కుట్రలు సాగిస్తున్నారని బీజేపీ కూటమిపై ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. విపక్షాల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్కు సిద్ధమవుతుండడం గమనార్హం. ధ్రువపత్రాల జాబితా సిద్ధం చేయండి బిహార్ ఎన్నికలు ముగియకముందే దేశమంతటా ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బుధవారం జరిగిన వర్క్‌షాప్‌లో సీఈఓల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం సేకరించింది. ఎస్ఐఆర్కు ఎప్పటిలోగా సిద్ధం కాగలరని ప్రశ్నించగా.. సెపె్టంబర్లో ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పూర్తిచేస్తామని, అక్టోబర్ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించగలమని చాలామంది సీఈఓలు బదులిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎస్ఐఆర్కు సంబంధించిన వనరులు, సన్నాహాలపై మూడున్నర గంటలపాటు ప్రజంటేషన్ ఇచ్చారు. ఓటర్ల అర్హతను తేల్చడానికి అవసరమైన ధ్రువపత్రాల జాబితాను సిద్ధం చేయాలని సీఈఓలను ఆదేశించారు. స్థానికంగా ఆమోదించే, సులభంగా లభించే ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్పష్టమైన సమగ్ర ఓటర్ల జాబితా కోసమే.. ఎస్ఐఆర్ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే తేల్చిచెప్పింది. పారదర్శకమైన, అత్యంత కచి్చతత్వంతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందించడమే అసలు లక్ష్యమని వెల్లడించింది. మరణించివారి పేర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి పేర్లను, డూప్లికేట్ ఎంట్రీలను, దేశ పౌరులను కానివారి పేర్లను తొలగించడానికే ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేసింది. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొంది. ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేర్లను ఇందులో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. సమగ్రమైన, స్పష్టమైన ఓటర్ల జాబితాను రూపొందించాలంటే ఎస్ఐఆర్ తప్పనిసరి అని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సవరించిన ఓటర్ల జాబితాలతోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
ఐఎస్ఐకి భారత సిమ్ కార్డుల సరఫరా .. నేపాలీ జాతీయుడి అరెస్టు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీకి భారత సిమ్ కార్డులను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక నేపాలీ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియా(43) బీఎస్సీ చదువుకున్నాడని, మహారాష్ట్ర, ఢిల్లీలో ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పనిచేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.మహారాష్ట్రలోని లాతూర్‌లో నమోదైన తన ఆధార్ కార్డును ఉపయోగించి బీహార్, మహారాష్ట్రల నుండి 16 సిమ్ కార్డులను కొనుగోలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. తరువాత వాటిని గూఢచర్యంతో సంబంధం ఉన్న కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆగస్టు 28న స్పెషల్ పోలీసు బృందం లక్ష్మీ నగర్‌లోని విజయ్ బ్లాక్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. లాహోర్, బహవల్పూర్, పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల నుండి ఐఎస్ఐ ఆపరేటర్లు పదకొండు సిమ్‌లను ఆపరేట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితుడు 2024లో నేపాలీ మధ్యవర్తి ద్వారా ఐఎస్ఐ హ్యాండ్లర్లను సంప్రదించాడని దర్యాప్తులో తేలింది. అమెరికా వీసా, విదేశాల్లో జర్నలిజంలో అవకాశాల హామీతో అతన్ని ఐఎస్ఐ ఏజెంట్లు ఆకర్షించారు. డీఆర్డీఓ, ఆర్మీ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిని అతనిని అప్పగించారని స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ కౌశిక్ తెలిపారు.నిందితుడు సిమ్ కార్డులను భారతదేశం నుండి ఖాఠ్మండుకు అక్రమంగా రవాణా చేసి, తరువాత ఐఎస్ ఐహ్యాండ్లర్లకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 2017లో ప్రభాత్ చౌరాసియా ఖాఠ్మండులో ఒక లాజిస్టిక్స్ కంపెనీని ప్రారంభించాడు. అది ఆర్థిక నష్టాల కారణంగా మూతబడింది. దీంతో సంపాదన కోసం ఐఎస్ఐ హ్యాండ్లర్లతో పరిచయం పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నిందితుని నుంచి పలు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియాపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్‌లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్‌తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్‌కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్‌ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. -
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో వైఎస్సార్సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. తన నివాసానికి వైఎస్సార్సీపీ ఎంపీలను పీయూష్ ఆహ్వానించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్‌రెడ్డి.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.కాగా, ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఇవాళ (మంగళవారం) ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్‌ను నిర్వహించాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరుగుతోంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. -
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
-
ఢిల్లీలో అత్యంత ధనవంతులు వీళ్లే - ఫోటోలు
-
కలశం దొరికింది
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ‘ఆగస్ట్ 15 పార్కు’లో సెపె్టంబర్ 3వ తేదీన జరిగిన జైన ఉత్సవం సమయంలో రూ.కోటిన్నర విలువైన బంగారు కలశం మాయం కావడం తెల్సిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ప్రధాన నిందితుడు భూషణ్ వర్మ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. చోరీకి గురైన బంగారు కలశం సహా సుమారు రూ.కోటిన్నర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు హాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం భూషణ్ వర్మను, అంకిత్, గౌరవ్ అనే వారిని వీరి నుంచి బంగారు కలశంతోపాటు, 150 గ్రాముల కరిగించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ లైన్స్‌కు చెందిన సు«దీర్ జైన్ అనే భక్తుడి వద్ద రూ.కోటి విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన బంగారు కలశ పాత్ర ఉంది. ఈ కలశాన్ని ఆయన ఆగస్ట్ 28వ తేదీ నుంచి ఉత్సవాలకు తీసుకు వస్తున్నారు. అప్పటి నుంచి దానిపై కన్నేసిన భూషణ్ వర్మ రోజూ పూజా ప్రాంతంలోకి సాధారణ భక్తుడి వేషధారణలో వచ్చి రెక్కీ నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 3వ తేదీన స్టేజీపై ఉన్న వారంతా బిజీలో ఉండగా కలశం మాయం చేశాడు. అంతకుముందు కూడా అతడు అక్కడున్న పలు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు. వీటి మొత్తం విలువ రూ. కోటిన్నర పైమాటే. తాజాగా, వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
స్వదేశీ మేళాకు పట్టం కట్టండి
న్యూఢిల్లీ: స్నేహితుడు, శత్రువు అనే బేధం లేకుండా అమెరికా ప్రభుత్వం అందరిపై సుంకాలతో బాదేస్తున్న వేళ ప్రధాని మోదీ స్వదేశీరాగం అందుకున్నారు. విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకుని స్వదేశీ వస్తువులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సోమవారం ఎన్డీఏ కూటమి ఎంపీలతో సమావేశంలో పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. ‘‘దేశవాళీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగేలా చూడండి. స్వదేశీ మేళాను ఉద్యమస్థాయికి తీసుకెళ్లండి. విదేశాల అధిక టారిఫ్‌ల వంటి ప్రతికూలతలు, సవాళ్ల సమయంలో భారత్ స్వావలంబన ద్వారా తన శక్తిసామర్థ్యాలను మరింతగా సంతరించుకోవాల్సిన తరుణమిది. మేడిన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించండి. జీఎస్టీ రేట్లు భారీగా తగ్గిన చక్కటి తరుణంలో స్వదేశీ వస్తువుల గొప్పతనాన్ని జనాన్ని తెలిసేలా చేయండి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి పండుగల సీజన్లో మీమీ నియోజకవర్గాల్లో ప్రజలతో, వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటుచేసి తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను వివరించండి’’అని మోదీ అన్నారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మీడియాకు వివరించారు. అమెరికా 50 శాతం టారిఫ్ భారం మోపిన వేళ మోదీ స్వదేశీ వస్తువుల ప్రాశస్థ్యాన్ని ప్రస్తావించడం గమనార్హం. శక్తివంతమయ్యేవేళ సవాళ్లు సాధారణం ‘‘భారత్ శక్తివంతంగా ఎదిగే క్రమంలో సవాళ్లు ఎదురవడం సాధారణం. అయినాసరే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే క్రమంలో ఇలాటి సవాళ్లను ఎదుర్కొంటూ ఆత్మనిర్భర్‌ను సాధించాలి. సొంత నియోజకవర్గాల్లో దేశీయ ఉత్పత్తుల ప్రచారాన్ని మీరే నాయకులుగా ముందుండి నడపాలి. గతంలో భారత్‌లో జపాన్ తయారీ వస్తువుల వినియోగం అధికంగా ఉండేది. అలాంటి భారత్‌లో ఇప్పుడు దేశీయోత్పత్తులను అధికంగా ఉపయోగించగల్గుతున్నామని గర్వపడేలా మనం చేయాలి. మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో స్వదేశీ ఉత్పత్తులు కనిపించాలి. ఉపయోగించాలి’’అని ఎంపీలకు మోదీ సూచించారు. ‘‘జీఎస్టీ శ్లాబుల తొలగింపు అనేది ప్రజల్లో పెను సంచలనంగా మారింది. ప్రజలతో ‘స్వదేశీ మేళాలు’, వ్యాపారులతో ‘వ్యాపారీ సమ్మేళన్’లు నిర్వహించండి. గాల్లో తుపాను చెలరేగినాసరే మనం వాహన టైరులో మళ్లీ గాలి కొట్టాల్సిందే. అలాగే దేశీయంగా ‘స్వదేశీ వాతావరణం’ఉన్నాసరే మన మళ్లీ విడిగా మన వంతు తోడ్పాటు అందించాల్సిందే’’అని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాగ్రత్త ‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఎంపీలు జాగ్రత్త వహించండి. తప్పులు దొర్లకుండా ఓటేయండి. పార్లమెంట్ సభ్యులే ఓటింగ్‌లో తప్పులు చేస్తే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది. మన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఉత్తమ అభ్యర్థిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా చక్కటి సేవలు అందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. తన పాలనాదక్షతతో ఆయ ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తేగలరని నేనూ విశ్వసిస్తున్నా’’అని అన్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందం వెనుక అధికార కూటమి ఎంపీల కృషిదాగి ఉందని మోదీ ప్రశంసించారు. హిమాచల్, పంజాబ్‌కు నేడు మోదీ వరద విలయంలో చిక్కుకుని అల్లాడిపోతున్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ మంగళవారం పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకూ మోదీ వెళ్లి అక్కడి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. హిమాచల్‌లోని కంగ్రాకు మోదీ వెళ్లనున్నారు. అక్కడే ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. -
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యరి్థ, తెలుగుబిడ్డ జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు రేవంత్‌రెడ్డి క్షుణ్ణంగా దిశానిర్దేశం చేశారు.ముఖ్యంగా, ఇది రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగే ఎన్నిక కాబట్టి, దీనిని ఇండియా కూటమికి అనుకూలంగా ఎలా మలచుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. మిగతా పారీ్టల ఎంపీలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని కోరుతూ ఎవరెవరితో సంప్రదింపులు జరపాలి అనే అంశాలపై సీఎం ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది.రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన అభ్యరి్థగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయడం చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ఇతర పార్టీల ఎంపీలకు కూడా నొక్కిచెప్పాలని సూచించారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకునేలా ఎంపీలందరూ సమష్టిగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం జరిగే పోలింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎంపీలకు స్పష్టం చేశారు.రెండు రోజులు ఢిల్లీలోనే సీఎం.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలను పర్యవేక్షిస్తారు. వీలును బట్టి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ను అడిగినట్టు తెలిసింది. ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి కూడా సీఎం మాట్లాడే అవకాశముందని సమాచారం. మరోవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీల సమర భేరి సభకు ఏఐసీసీ పెద్దలను రేవంత్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. -
ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ని కలిసిన YV సుబ్బారెడ్డి
-
వేరొకరితో సహజీవనం చేస్తే భరణం హక్కుండదు
సాక్షి, న్యూఢిల్లీ: వేరే పురుషునితో సహజీవనం చేస్తూ భర్త నుంచి భరణం పొందేందుకు ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. మరో వ్యక్తితో ఆ మహిళ సహజీవనం చేస్తోందనే కారణంతో ఆమెకు భరణం హక్కు ఉండదని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. తన మాజీ భర్త చట్టపరంగా, నైతికంగానూ తనకు భరణం చెల్లించాల్సిన బాధ్యత ఉందని మహిళ వాదించినప్పటికీ కోర్టు ఆ వాదనలో పసలేదని తిరస్కరించింది. గతంలో జరిగిన విచారణలోనూ డీఎన్ఏ పరీక్ష ఫలితాల ప్రకారం ఆమె పిల్లల్లో ఒకరికి మాజీ భర్త తండ్రి కాదని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ, అనేక ఆస్తుల నుంచి నిరంతరంగా ఆదాయం పొందుతున్న అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని తాజా పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంది. నేర శిక్షాస్మృతిలోని 125(4)సెక్షన్ ప్రకారం మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్యకు భరణం పొందగోరే హక్కు ఉండదని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ‘‘డీఎన్ఏ రిపోర్ట్‌తో పాటు విడాకుల తీర్పును ఈ మహిళ ఎప్పుడూ సవాలు చేయలేదు. అంటే ఆ నిర్ణయాలను ఆమె అంగీకరించినట్లే. ముఖ్యంగా భరణం అడిగిన మహిళ ఆర్థికంగా స్వతంత్రురాలు. అనేక ఆస్తుల నుంచి ఆదాయం పొందుతున్నారు. కనీసం పిల్లల పోషణ బాధ్యత కూడా ఈమెకు లేదు. భర్తే పిల్ల బాధ్యతలు, ఖర్చులు చూసుకుంటున్నారు. అత్త హత్య కేసులో నిందితురాలిగా నాలుగేళ్లపాటు ఈమె జైలులో ఉండి వచ్చారు. ఆమె తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఉంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆమెకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని ప్రిసైడింగ్ ఆఫీసర్ నమ్రత అగర్వాల్ తన తీర్పులో పేర్కొన్నారు. -
రాగద్వేషాల్లేకుండా..
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని అమలుచేయాలంటే న్యాయస్థానాలు ఎలాంటి భయాలు, రాగద్వేషాలు లేకుండా తమ విధి నిర్వహణకు అంకితం కావాలని సర్వోన్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో జస్టిస్ నాగరత్న పాల్గొని ప్రసంగించారు. ‘‘చట్టం అనేది నిబంధనల సమాహారం మాత్రమే కాదు. పేదలు, ధనికులు, కిందిస్థాయి, పైస్థాయి, కులం, మతం, లింగ భేదాలకు అతీతంగా ఎలాంటి నమ్మకాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోకుండా చట్టం ముందు అందరూ సమానులే అనే భావనతోనే చట్టాన్ని అమలుచేయాలి. శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే కోర్టులు, న్యాయ సేవలు అందుబాటులో ఉంటాయనే అపోహ తొలగిపోవాలి. ఈ తప్పుడు భావనను న్యాయవాదులు సైతం మార్చగలరు’’అని జస్టిస్ నాగరత్న అన్నారు. ఈ సందర్భంగా యువ లా విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘నిజమైన బాధితుల కేసులను వాదనల కోసం స్వీకరించాలి. అప్పుడు బాధితులకు సాంత్వన, న్యాయం చేకూర్చే వారధులుగా న్యాయవాదులు కీర్తిగడిస్తారు. రాజ్యాంగానికి పౌరులకు, న్యాయానికి ప్రజలకు మధ్య సైతం అడ్వొకేట్లు సేతువుగా నిలబడాలి. న్యాయవాద వృత్తి అనేది మార్పునకు వాహకంగా ఉండాలి. ముఖ్యంగా భారతీయ సమాజంలో చూస్తే చరిత్రాత్మకంగా వివక్ష, వెలివేతకు గురైన, అసమానత కారణంగా అన్యాయమైన వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు న్యాయవాద వృత్తిని సాధనంగా ఉపయోగించుకోవాలి’’అని అన్నారు. ‘‘సుపరిపాలనలో చట్టాలను సమగ్రస్థాయిలో అమలుచేయడం అనేది అత్యంత ఆవశ్యకం. న్యాయపాలన అనేది కూడా కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే భారత్‌లో న్యాయవ్యవçస్థ పూర్తి స్వతంత్రంగా అమలవుతోంది. ఈ కోర్టుల వ్యవస్థకు స్వతంత్ర బార్ వ్యవస్థ చేదోడువాదోడుగా నిలిచింది’’అని అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని అమలుచేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న నేతలు, ధర్మాసనంలో తీర్పులిచ్చే న్యాయమూర్తులేకాదు న్యాయవాదులకూ ఉంది. రాజ్యాంగాన్ని అడ్వొకేట్ చేయాల్సిన విధ్యుక్తధర్మాన్ని ప్రతి ఒక్క అడ్వొకేట్ పాటించాలి’’అని అన్నారు. -
Daslakshan Mahaparv: వజ్రాలు పొదిగిన స్వర్ణకలశం చోరీ
న్యూఢిల్లీ: ఎర్రకోట ప్రాంగణం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే దేశ రాజధానిలోని కీలక చారిత్రక ప్రాంతం. పోలీసుల వలయంగా వినతికెక్కిన అలాంటి చోట సైతం చోరకళను ప్రదర్శించాడు ఒక దొంగ. కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని కొట్టేసే లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆ దొంగ జైన గురువు వేషధారణలో వచ్చి అలవోకగా కలశాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జరిగిన ఈ చోరీ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెల్సుకున్న పోలీసులు వెంటనే ఆ చోరశిఖామణి వేటలో తలమునకలయ్యారు. వజ్రవైడ్యూరాలు, రత్నాలు, కెంపులు వంటి అత్యంత విలువైన రాళ్లు పొదిగిన ఆ కలశాన్ని భుజానికున్న బ్యాగులో పెట్టుకుని ఉడాయించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జంకులేకుండా వచ్చి మరీ.. ఎర్రకోట ప్రాంగణంలోని 15వ నంబర్ గేట్ వద్ద సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జైనుల సంబంధ మత కార్యక్రమం ‘దస్‌లక్షణ్ మహాపర్వ్’నిర్వహించారు. ఆగస్ట్ 28వ తేదీ నుంచి మొదలై సెప్టెంబర్ 9వ తేదీదాకా జరగనున్న ఈ కార్యక్రమం కోసం సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన సుదీర్జైన్ అనే వ్యాపారి తన సొంత పుత్తడి కలశాన్ని ప్రతిరోజూ తీసుకొచ్చి పూజ తర్వాత ఇంటికి తీసుకెళ్తున్నారు. 760 గ్రాముల బరువైన ఈ కలశానికి చుట్టూతా 150 గ్రాముల బరువైన, అత్యంత విలువైన వజ్రాలు, కెంపులు, మరకతాలు అందంగా అద్ది ఉంటాయి. ఎప్పటిలాగే ఆయన కలశాన్ని తీసుకురాగా ఉదయం 9 గంటల 26 నిమిషాలకు కొందరు ప్రముఖులు కార్యక్రమానికి వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం వచ్చి జైన గురువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీంతో కలశ యజమానిసహా తదితరులు పక్కకు వెళ్లారు. అదే అదునుగా భావించి ఒక దొంగ జైన గురువు వేషధారణలో శ్వేతవర్ణ దుస్తులు ధరించి కార్యక్రమంలో చొరబడ్డాడు. ఎవరూ గమనించని సమయంలో ఆ కలశంతోపాటు మరో కొబ్బరికాయ ఆకారంలోని పాత్ర, మరో బంగారు పాత్రను దొంగ ఎత్తుకుపోయాడు. ఈ తతంగం అంతా అక్కడి గదిలోని సీసీటీవీలో రికార్డయింది. కార్యక్రమం నిర్వాహకుడు పునీత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చేపట్టారు. అయితే ఈ దొంగ గతంలో ఇదే ఎర్రకోట ప్రాంగణంలో మూడుసార్లు చోరీలు చేసి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దొంగను గుర్తించామని త్వరలనే అతడిని పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. అయినప్పటికీ ఎర్రకోట ప్రాంగణంలో సరైన పోలీసు భద్రత లేదనే ఆరోపణ మరోసారి తెరమీదకొచ్చింది. ఇటీవల ఎర్రకోట సమీపంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు సన్నాహకాల వేళ ఉత్తుత్తి బాంబును సైతం గుర్తించడంలో విఫలమైన కానిస్టేబుల్సహా ఏడుగురు ఢిల్లీ పోలీసులను సస్పెండ్ చేయడం తెల్సిందే. -
10న రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతలతో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. తెలంగాణలో బీజేపీ ‘యాక్షన్ ప్లాన్’ను ఖరారు చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీకి ముందే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు శని, ఆదివారాల్లో నడ్డా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంపీలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ వరుస భేటీలతో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అధికార సాధనే లక్ష్యంగా వ్యూహరచనగత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైనా.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సమానంగా 8 సీట్లు గెలుచుకోవడం, అనంతరం 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని గెలుచుకోవడంతో రాష్ట్రంలో పార్టీకి ఆదరణ పెరుగుతోందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులు, కార్యవర్గ కూర్పుపై సందిగ్ధత, అసంతృప్తులు, సమన్వయ లేమి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వమే సీబీఐ విచారణ కోరటంతో దీనిని అవకాశంగా మార్చుకోవాలని ఇప్పటికే ముఖ్య నేతలు ఉద్బోధ చేసినట్టు సమాచారం. అంతర్గత, బహిర్గత సమస్యలతో బీఆర్ఎస్ బలహీనపడటంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఇదే మంచి తరుణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని రాష్ట్ర పార్టీకి నాయకత్వం నిర్దేశించినట్టు సమాచారం.ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి మరింత మందిని చేర్చుకునే పనిని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్‡్షకు మరింత పదును పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లను అధిక సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. -
పైలెట్ పాడుపని.. సిగరెట్ లైటర్ స్పై కెమెరాలతో..
ఢిల్లీ: నగరంలో ఓ పైలట్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. పైలెట్ మోహిత్ ప్రియదర్శిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్స్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేసిన మోహిత్.. స్పై కెమెరాతో యువతుల వీడియోలు తీస్తూ.. కీచకుడి అవతారం ఎత్తాడు. సిగరెట్ లైటర్ ఆకారంలో ఉన్న స్పై కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇటీవల ఢిల్లీలోని కిషన్‌గఢ్ ప్రాంతంలోని శని బజార్లో మోహిత్ లైటర్‌తో మహిళల వీడియోలను రికార్డ్ చేయడాన్ని ఓ యువతి గమనించింది. వెంటనే అప్రమత్తమైన ఆ మహిళ.. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. అనంతరం మార్కెట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.మోహిత్ ప్రియదర్శి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. విచారణలో నిందితుడు ఓ ప్రముఖ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. మోహిత్ వద్ద నుంచి స్పై కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మహిళలకు సంబంధించిన అనేక అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. -
ఉదృతంగా యమునా నది.. జలదిగ్బంధంలో ఢిల్లీ
-
భారత్–సింగపూర్ మధ్య సుదృఢ బంధం
న్యూఢిల్లీ: సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఒక రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిణామాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. భారత్–సింగపూర్ మధ్య దౌత్యానికి మించిన గొప్ప అనుబంధం ఉన్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్‌తోపాటు ఇతర డిజిటల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై సింగపూర్‌తో కలిసి పోరాడుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. లారెన్స్ వాంగ్‌తో భేటీ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాలు ఉగ్రవాదం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడడం మానవత్వాన్ని విశ్వసించే అన్ని దేశాల బాధ్యత అని స్పష్టంచేశారు. భారత్–సింగపూర్ సంబంధాలకు కలిసి పంచుకుంటున్న విలువలు, ప్రయోజనాలే ప్రాతిపదిక అని పేర్కొన్నారు. శాంతి, సౌభాగ్యాలే రెండుదేశాల ఉమ్మడి లక్ష్యమని వివరించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్–సింగపూర్ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఎన్నో రెట్లు పెరిగిందని లారెన్స్ వాంగ్ స్పష్టంచేశారు. మోదీ, వాంగ్ భేటీ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ పలు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మధ్య డిజిటల్ అస్సెట్ ఇన్నోవేషన్ ఒప్పందం కుదిరింది. అలాగే గ్రీన్ షిప్పింగ్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు కలిసికట్టుగా గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్(జీడీఎస్సీ)ను ఏర్పాటు చేయబోతున్నాయి. జేఎన్‌పోర్ట్ పీఎస్ఏ టెర్మినల్ రెండో దశ ప్రారంభం భారత, సింగపూర్ ప్రధానమంత్రులు మోదీ, లారెన్స్ వాంగ్ గురువారం ముంబైలో జేఎన్‌పోర్ట్ పీఎస్ఏ టెర్మినల్ రెండో దశను వర్చువల్‌గా ప్రారంభించారు. దీనివల్ల ఈ టెర్మినల్ కంటైనర్ హ్యాండ్లింగ్ సామర్థ్యం 4.8 మిలియన్ టీఈయూలకు పెరగనుంది. -
ఢిల్లీ కుబేరులు.. ఇదిగో టాప్ 10 జాబితా
ఢిల్లీ భారతదేశానికి రాజధాని నగరం. ఇది రాజకీయాలకు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రం కూడా. ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఎక్కువ మంది ధనవంతులు నివసిస్తున్న నగరాల్లో కూడా ఢిల్లీ స్థానం సంపాదించుకుంది. ఈ కథనంలో ఢిల్లీలోని అత్యంత ధనవంతులు ఎవరు?, వారి నెట్‌వర్త్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.➤శివ్ నాడార్: 40.2 బిలియన్ డాలర్లు➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 30.7 బిలియన్ డాలర్లు➤రవి జైపురియా: 17.3 బిలియన్ డాలర్లు➤బర్మన్ కుటుంబం: 10.4 బిలియన్ డాలర్లు➤కపిల్ & రాహుల్ భాటియా: 10.1 బిలియన్ డాలర్లు➤వినోద్, అనిల్ రాయ్ గుప్తా & కుటుంబం: 9.5 బిలియన్ డాలర్లు➤వివేక్ చాంద్ సెహగల్ & కుటుంబం: 8.9 బిలియన్ డాలర్లు➤విక్రమ్ లాల్ & కుటుంబం: 8.8 బిలియన్ డాలర్లు➤కులదీప్ సింగ్ & గుర్బచన్ సింగ్ ధింగ్రా: 7.5 బిలియన్ డాలర్లు➤రమేష్, రాజీవ్ జునేజా & కుటుంబం: 7 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?పైన వెల్లడించిన లిస్టులో ఉన్న ప్రముఖులు ఢిల్లీలో మాత్రమే కాదు.. ప్రపంచ ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. వీరందరూ పారిశ్రామిక రంగంలో తమదైన ముద్రవేసి, ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2025 ఆగస్టులో ఢిల్లీలో జీఎస్టీ వసూళ్లు రూ. 5725 కోట్లు అని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. దేశ ఆర్ధిక వృద్ధికి ఢిల్లీ ఎంత ముఖ్యమైన నగరమో అర్థం చేసుకోవచ్చు. -
మరో వారం రోజుల పాటు ఢిల్లీకి వాతావరణ శాఖ వర్ష సూచన
-
‘బాహుబలి తిరిగొచ్చాడు’.. వీడియో వైరల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది. ఢిల్లీ వీధులు చెరువుల్లా మారాయి. ఈ క్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. అయితే, ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా.. తన బైక్‌ను భుజాలపై మోసుకుంటూ వెళ్లాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో బాహుబలి నగరంలోకి వచ్చేశాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.భారీ వర్షాలు కారణంగా గురుగ్రామ్- ఢిల్లీ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తమ బైక్‌ను భుజాలపై మోస్తూ నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ను జాగ్రత్తగా భుజాలపై బ్యాలెన్స్ చేస్తూ, కార్లు, ద్విచక్ర వాహనాలతో నిండిపోయిన రోడ్డులో నడుస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది.Bahubali! 🔥Ft. Gurugram Rains Traffic JamA man carrying his scooter on his shoulder to bypass traffic jam after heavy rains.. pic.twitter.com/p7qO80dtUG— Keh Ke Peheno (@coolfunnytshirt) September 4, 2025కాగా, యమునా నది వరద డేంజర్ మార్క్ దాటింది. పలు కాలనీలోకి వరద నీరు చేరుకుంది. యమునా బజార్ సహా పలు కాలనీలలో ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. దాదాపు 15 వేల మంది ప్రజలను తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ వెల్లడించింది. మరో వారం పది రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి రోజు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. 67 సంవత్సరాల తర్వాత మూడోసారి 207 మీటర్ల డేంజర్ మార్కును దాటింది. వరద నీరుతో పాటు మురుగునీరు కూడా ప్రవహిస్తుంది. వరద మురుగతో ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డేంజర్ మార్క్‌ను దాటేసిన యమునా.. ఢిల్లీ అప్రమత్తం
ఢిల్లీ: యమునా నది ప్రమాద స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. వరద నీరు బయటకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యమునా నది హోల్డింగ్ కెపాసిటీ పెంచామని ప్రభుత్వం వెల్లడించింది. యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న మురికివాడల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.మరో మూడు రోజులపాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అవసరముంటే తప్ప బయటకి రావద్దని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది. పలు ప్రాంతాల్లో జలమయం కావడంతో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. పాత రైల్వే వంతెనను మూసివేశారు.#WATCH | Yamuna river continues to flow above the danger mark in Delhi; Visuals from Old Yamuna Bridge. pic.twitter.com/vypHTNP1Uo— ANI (@ANI) September 3, 2025బుధవారం మధ్యాహ్నం 1 గంటకు 207 మీటర్లు దాటి పోయింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. 1963 నుంచి ఇప్పటివరకు దాదాపు ఆరు దశాబ్దాల్లో యమునా నది 207 మీటర్ల మార్క్‌ను దాటడం ఇది ఐదోసారి. 2023 (208.66 మీ), 2013 (207.32 మీ.), 2010 (207.11 మీ.), 1978 (207.49 మీ.) దాటి ప్రవహించింది. -
డేంజర్ మార్క్ దాటేసిన యమునా.. ఢిల్లీకి వార్నింగ్ బెల్
యమునా నది ఉగ్రరూపంతో.. దేశ రాజధాని పరిధిలోని పలు ఇళ్లలోకి మంగళవారం ఉదయం నీరు చేరింది. నది ప్రవాహం డేంజర్ మార్క్ దాటేయడం, ఎగువ నుంచి వరద పోటెత్తుతుండడంతో కొనసాగుతుండడంతో ఢిల్లీకి ముంపు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. భారీ వర్షాలతో గురుగ్రామ్‌లోనూ జనజీవనం స్తంభించిపోగా, మరోసారి భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. హర్యానా హాథ్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీగా వరద నీరు కిందకు విడుదల అవుతోంది. దీంతో.. రాజధాని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, హెచ్చరికలు జారీ చేశామని అధికారులు అంటున్నారు. మరోవైపు షాదరా జిల్లాలో యమునా నదిపై ఉన్న లోహపుల్ వంతెన మీదుగా మంగళవారం సాయంత్రం రాకపోకలు పూర్తిగా బంద్ చేయనున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ప్రకటించారు. VIDEO | After incessant heavy rains in Delhi-NCR, the Yamuna River has risen and crossed the danger mark.Drone visuals from Loha Pul (Old Iron Bridge). As per officials, it will remain shut as water levels approach the evacuation mark of 206 meters.#DelhiFloods #YamunaRiver… pic.twitter.com/aa4rOiKjRU— Press Trust of India (@PTI_News) September 2, 2025 #YamunaRiver is flowing above the #DangerMark due to #ContinuousRainfall since yesterday. pic.twitter.com/cxSizrOdQp— Upendrra Rai (@UpendrraRai) September 2, 2025 సోమవారం కురిసిన భారీ వర్షంతో గురుగ్రామ్ అతలాకుతలం అయ్యింది. గురుగ్రామ్ ట్రాఫిక్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని, అలాగే ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం వెసులు బాటు కల్పించాలని కంపెనీలకు అధికార వర్గాలు సూచించాయి. రోడ్ల మీద భారీగా నీరు చేరడంతో జనాలు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ద్వారాకా ఎక్స్‌ప్రెస్ వే సర్వీస్ లేన్‌పై భారీగా వరద నీరు చేరడంతో మూసేశారు. -
సెమికాన్ ఇండియా సదస్సు నేటి నుంచి
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా మార్చే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీ మరో అంతర్జాతీయ మహాసదస్సుకు వేదికైంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని యశో భూమిలో ‘సెమికాన్ ఇండియా–2025’సదస్సును ప్రారంభించనున్నారు. ఈ నెల 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు కొనసాగనుంది. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ వివిధ కంపెనీల సీఈవోల రౌండ్‌టేబుల్ భేటీలో పాల్గొని చర్చలు జరపనున్నారు. సదస్సుకు 20,750 మంది పాల్గొననున్నారు. వీరిలో 48 దేశాల 2,500 ప్రతినిధులున్నారు. 350 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. 2022లో బెంగళూరు, 2023లో గాం«దీనగర్, 2024లో గ్రేటర్ నోయిడాలో ఈ సదస్సులు జరిగాయి. -
ప్రసాదం లేదంటే చంపేస్తారా.. మనం రాక్షసులుగా మారిపోయాం: ప్రముఖ నటి
ఢిల్లీ నగరంలోని ప్రసిద్ధ కల్కాజీ ఆలయంలో జరిగిన ఘోరమైన సంఘటన గురించి బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్రంగా స్పందించారు. రెండురోజుల క్రితం ఆలయంలో ప్రసాదం పంపిణీ సమయంలో భక్తుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రసాదం స్టాక్ అయిపోయిందని ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్(35) చెప్పడంతో సహించలేని కొందరు యువకులు గొడవకు దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెద్దది కావడంతో యోగేంద్రను బయటకు లాగి, అతను చనిపోయేంత వరకు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. తను ప్రాణాలు వదిలేసిన సరే కర్రలతో కొడుతూనే ఉన్నారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటనపై నటి స్వర భాస్కర్ రియాక్ట్ అయ్యారు.ఈ సంఘటనపై తాజాగా నటి స్వర భాస్కర్ ఇలా రియాక్ట్ అయ్యారు.' ఇది చాలా దారుణం, భయంకరమైన సంఘటన. ప్రజలను కొట్టి చంపడం భారతదేశంలో ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. అందరికీ చిరాకు తెప్పించేలా ఉంది. సిగ్గుచేటు, మన సమాజం గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. మనం రాక్షసులుగా మారిపోయాం.' అని ఆమె రాసింది.దాడిలో తీవ్రంగా గాయపడిన యోగేంద్ర సింగ్‌ను AIIMS ట్రామా సెంటర్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం మొత్తం అతనిపైనే ఆధారపడి జీవిస్తుంది. CCTV ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక నిందితుడు అతుల్ పాండేను అరెస్ట్ చేశారు, మరిన్ని అరెస్టులు జరుగుతున్నాయి.Warning ⚠️ This video is from Kalkaji Mandir where people murdered seva dar for not giving chunni in parsad. These people are seriously mad. Strict action should be taken. #KalkajiMandir #kalkaji #KalkajiTemple #Delhi #DelhiNCR #delhi @gupta_rekha pic.twitter.com/Xp6cvbtAQu— Sachin Bharadwaj (@sbgreen17) August 30, 2025 -
బర్త్ డే గిఫ్ట్ కోసం గొడవ..భార్యను హత్య చేసిన భర్త!
చిన్నపాటి గొడవలు.. ఆపై క్షణికావేశ హత్యలు. దీనికి అన్నింటికీ కారణం అహం. మనలోని అహం మనల్ని మనిషిగా నాశనం చేయడమే కాదు.. మన కోసం వచ్చిన వారిని కూడా దూరం చేస్తుంది. సర్దుకుపోదాం.. ఉన్నంతలో బతుకుదాం అనే ఆలోచన నేటి తరంలో చాలా అరుదుగా కనిపిస్తున్నట్లే ఉంది. భర్త చెప్పిన మాట వినలేదని భార్య, తన మాట భర్త వినలేదని భార్య.. ఇలా ఏదొక సందర్భాన్ని ఆసరాగా ఘర్షణలు పడటం జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది.ఇలా భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఊచలు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అర్థం పర్థం లేని గొడవ. కొడుకు బర్త్ డే గిఫ్ట్ విషయంలో గొడంపడ్డ భర్త.. భార్యను హత్య చేశాడు. ఆపై తన అత్తను కూడా పొట్టనుపెట్టుకున్నాడు.ఢిల్లీలోని రోహిణి సెక్టార్-17లో యోగేష్ సెహగాల్ అనే వ్యక్తి.. తన కుమారుడు బర్త్ డే విషయంలో భార్య ప్రియా సెహగాల్(34)తో గొడవ పడ్డాడు. కుమారుడు బర్త్ డే ముందస్తు ఏర్పాట్లులో భాగంగా భార్యతో ఘర్షణ పడ్డాడు. దాన్ని సర్దిచెప్పడానికి అత్త కుసుమ్ సిన్హా(63) కూతురి ఇంటికి వచ్చింది. ఆమెతో పాటు కొడుకు, అంటే యోగేష్‌కు బావమరిది మేఘ్ సిన్హా కూడా వచ్చాడు. అక్కడ అల్లుడిని ఏదో రకంగా ఒప్పించింది అత్త. అయితే అక్కడ మేఘ్ ఉండటంతో ఆ సమయంలో యోగేష్ పెద్దగా ఏమీ మాట్లాడకుండానే రాజీ పడ్డాడు. మనసులో మాత్రం అక్కసును పెట్టుకున్నాడు. మేఘ్ సిన్హా వెళ్లిపోవడంతో మళ్లీ గొడవ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే భార్య కూడా తల్లిని వెనకేసుకొచ్చింది. దాంతో భార్యను, అత్తను చంపేశాడు. మేఘ్.. తల్లితో మాట్లాడదామని ఫోన్ చేశాడు. తల్లి ఫోన్ ఎత్త లేదు.. అక్కకు చేశాడు.. అక్క కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన మేఘ్.. తిరిగి మళ్లీ ఘటనా స్థలికి వచ్చేసరికి తలుపులు లాక్ చేసి ఉన్నాయి. అనుమానంతో పోలీసులకు కాల్ చేయడంతో వారు డోర్స్ ఓపెన్ చేశారు. తల్లి, అక్క ఒక రూమ్‌లో పడి ఉండటంతో బావ హత్య చేశాడనే విషయం అర్థమైంది. దీనిపై ఫిర్యాదుతో యోగేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నపాటి బర్త్ డే గొడవతో ఇలా జంట హత్యలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. -
Fire Indication: ఇండోర్ విమానం ఢిల్లీకి మళ్లింపు
న్యూఢిల్లీ: ఇండోర్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానపు కుడి ఇంజిన్‌లో అగ్నిప్రమాద సూచన అందుకున్న దరిమిలా పైలట్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.ఢిల్లికి తిరిగి వచ్చిన విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశామని, ప్రయాణికులను ఇండోర్‌కు ప్రత్యామ్నాయ విమానంలో తరలించామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ‘ఆగస్టు 31న ఢిల్లీ నుండి ఇండోర్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది.కాక్‌పిట్ సిబ్బందికి ఇంజిన్‌లో మంటలు వస్తున్నట్లు సూచన అందింది. ప్రామాణిక విధానాన్ని అనుసరించి.. కాక్‌పిట్ సిబ్బంది ఇంజిన్‌ను ఆపివేయాలని నిర్ణయించుకుని, ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలోకి తరలిస్తున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రధాన ప్రాధాన్యత’ అని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. Indore-bound Air India plane returns to Delhi airport after fire indication in engine; lands safely https://t.co/OrMzQfYt5g— JAMMU LINKS NEWS (@JAMMULINKS) August 31, 2025 -
Delhi: ప్రసాద వితరణలో వివాదం.. ఆలయ సేవకుడి హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ కల్కాజీ ఆలయంలో ఘోరం జరిగింది. ఆలయంలో ప్రసాద వితరణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, ఆలయ సేవకుని హత్యకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.పోలీసులు తెలిపిన ప్రకారం శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్కాజీ ఆలయంలో చోటుచేసుకున్నఘర్షణ గురించి పోలీసులకు ఫోన్ వచ్చింది. కొందరు భక్తులు ప్రసాదం కోసం డిమాండ్ చేసిన సందర్భంగా వివాదం చెలరేగింది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపధ్యంలో కొందరు ఆగ్రహంతో ఊగిపోతూ, కర్రలతో ఆలయ సేవకునిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆలయ సేవకుడు అపస్మారక స్థితిలో పడి ఉండటం, ఇద్దరు వ్యక్తులు అతనిని కర్రలతో కొట్టడం కనిపిస్తోంది. Tragic incident at #Delhi's Kalkaji Temple: Sevadar Yogesh Singh beaten to death over "chunni prasad" dispute. CCTV footage captures mob violence, highlighting no fear of police in the city. Authorities investigating, public safety concerns rise. #KalkajiTemple #DelhiCrime pic.twitter.com/C1j33Uejvu— Thepagetoday (@thepagetody) August 30, 2025ఆలయ సేవకుడిని ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందిన యోగేంద్ర సింగ్ (35) గా పోలీసులు గుర్తించారు. అతను గత 15 ఏళ్లుగా ఆలయంలో సేవ చేస్తున్నాడు. దాడి అనంతరం బాధితుడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. స్థానికులు ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరైన అతుల్ పాండే (30)ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. -
బీజేపీ-ఆర్ఎస్ఎస్ వైరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదే. నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.అంతర్గత వైరుధ్యాలు ఉన్న వ్యవస్థలు ఉన్నాయని.. అయితే ఏ విధంగానూ వివాదం లేదన్న ఆయన.. ప్రతి ప్రభుత్వంతో తమకు మంచి సమన్వయం ఉందంటూ పేర్కొన్నారు. ‘‘మనం రాజీ గురించి మాట్లాడినప్పుడు, పోరాటం తీవ్రమవుతుంది. అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మేం చర్చించుకుంటాం. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ‘ఒకరినొకరు విశ్వసిస్తాయి’’ అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. -
నాన్న చెబితే వినక తప్పదు.. నా ఫోకస్ మాత్రం..: ఆర్యవీర్ సెహ్వాగ్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వారసుడు ఆర్యవీర్ (Aaryavir Sehwag) సెహ్వాగ్ లీగ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే ధనాధన్ ఆడి.. శుభారంభం అందుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)-2025లో భాగంగా సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరఫున ఆర్యవీర్ బుధవారం అరంగేట్రం చేశాడు.వరుసగా రెండు బౌండరీలుఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా పేసర్ నవదీప్ సైనీ (Navdeep Saini) బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది ఆర్యవీర్ తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అయితే, మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న ఈ జూనియర్ సెహ్వాగ్ నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.ఏదేమైనా.. క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా ఆర్యవీర్ సెహ్వాగ్ తండ్రి వీరేందర్ సెహ్వాగ్‌ను గుర్తుచేస్తూ అభిమానులను అలరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యశ్ ధుల్ దులిప్ ట్రోఫీ కారణంగా ఈ మ్యాచ్ మిస్సయ్యాడు.ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయానుమా జట్టు గత మ్యాచ్ పూర్తైన తర్వాతే.. ధుల్ స్థానంలో నేను ఆడబోతున్నానని తెలిసింది. జాంటీ భయ్యా వచ్చి నాకు ఈ విషయం ఈ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఆడటం బాగా అనిపించింది. బౌండరీలు బాదడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే, ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాను. తదుపరి మ్యాచ్‌లో మరింత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నా’’ అని ఆర్యవీర్ తెలిపాడు. నాన్న చెబితే ఎవరైనా వినక తప్పదుఇక తండ్రి వీరేందర్ సెహ్వాగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాన్న చెబితే ఎవరైనా వినక తప్పదు కదా!’’ అంటూ ఆర్యవీర్ నవ్వులు చిందించాడు. తండ్రి నుంచి తప్పక ఫీడ్‌బ్యాక్ తీసుకుంటానని తెలిపాడు.కేవలం ఆట మీద మాత్రమే దృష్టిఅదే విధంగా.. ‘‘మమ్మల్ని, మా ఆట తీరును అందరూ గమనిస్తూ ఉంటారని తెలుసు. స్కౌట్స్ మా ప్రదర్శనను విశ్లేషిస్తూ ఉంటారు. అయితే, ఆ విషయం గురించి మేము ఎక్కువగా ఆలోచించము. ఒకవేళ అలా చేసినట్లయితే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి.. మైదానంలో కేవలం ఆట మీద మాత్రమే నేను దృష్టి సారిస్తాను’’ అని ఆర్యవీర్ సెహ్వాగ్ ఐపీఎల్లో ఆడాలన్న తన కల గురించి చెప్పుకొచ్చాడు.కాగా భారత ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన వీరేందర్ సెహ్వాగ్‌కు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆర్యవీర్. చిన్నోడు వేదాంత్. ఆర్యవీర్ దేశీ క్రికెట్లో ఇప్పటికే సత్తా చాటుతున్నాడు. డీపీఎల్ వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని ఎనిమిది లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది.చదవండి: గిల్, స్కై, సంజూ కాదు!.. టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు: సెహ్వాగ్ -
‘సమాజం కోసం రాజీ పడితే.. చివరికి మనిషే లేకుండా పోయింది’
న్యూఢిల్లీ: తన సోదరి నిక్కీ భాటి దారుణ హత్యకు గురి కావడంపై సోదరుడు రోహిత్ గుర్జార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరి నిక్కీ భాటిని శాశ్వతంగా తిరిగి పుట్టింటికి తీసుకొచ్చినట్లైతే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నాడు. తన సోదరి నిక్కీ భాటి విషయంలో తాము రాజీ పడే బ్రతికామని, అందుకు ఇంతటి దారుణం జరిగిపోయిందన్నాడు. సమాజానికి జడిసి తన సోదరిని పుట్టింటికి తీసుకురావడంలో వెనుకడుగు వేశామన్నాడు. సమాజంలో తమ పరువు పోతుందనే ఆలోచించాం కానీ సోదరీ పడే బాధను పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. ‘మేము మా సోదరీమణులు నిక్కీ, కాంచనాల కోసం రూ. 8 లక్షల ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించాం. ఆ పార్లర్లు పెట్టించి సుమారు ఏడాదిన్నర అవుతుంది. బావలు విపిన్, రోహిత్ భాటిలకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. వారి కుటుంబానికి చిన్న కిరాణా దుకాణం మాత్రమే ఉంది. కానీ మా చెల్లెళ్లు వారి స్వయం శక్తితో పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. భర్తల నుంచి ఎటువంటి నగదు అడగకుండానే కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మా చెల్లెళ్ల పార్లర్లను అత్త మామలు ధ్వంసం చేశారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు సోదరుడు గుర్జార్.భర్త విపిన్ భాటి బాధలు భరించలేక చాలాసార్లు తిరిగి పుట్టింటికి వచ్చేదని, కానీ వారు మళ్లీ బుజ్జగింపు మాటలు చెప్పి తిరిగి తీసుకెళ్లిపోయేవారని నిక్కీ భాటి కుటుంబం తెలిపింది. అతి దారుణంగా హత్య.. యూపీ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో పరిధిలో సిర్సా గ్రామంలో విపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు.మరో రూ. 35 లక్షలు కావాలని వేధింపులుమరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేసి చివరికి అతి దారుణంగా ఒంటికి నిప్పంటించి హత్య చేశారు.యాసిడ్ పోసి లైటర్‌తో అంటించి కన్నకొడుకు కళ్లముందే భార్యను తగలబెట్టాడు -
దివ్యాంగులపై జోకులా.. కమెడియన్లకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
ఢిల్లీ: దివ్యాంగులపై జోకులు వేసే కమెడియన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులపై అనుచితమైన జోక్స్ తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవమానించే వ్యాఖ్యలు ఎప్పుడు ఆగుతాయంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అసభ్యకరమైన జోకులు వేసిన కమెడియన్లను మందలించింది. ఇలాంటి షోల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేసినవారు తమ సామాజిక మాధ్యమాల్లో కూడా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.సామేయ్ రైనా, విపున్ గోయల్, బల్ రాజ్ పరమజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ వంటి కమెడియన్లు వికలాంగులను అపహాస్యం చేశారంటూ ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హాస్యం జీవితంలో భాగమే, కానీ అది ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయకూడదంటూ ధర్మాసనం హెచ్చరించింది.సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలంటూ ఆదేశించింది. ఇలాంటి కేసులలో భవిష్యత్తులో జరిమానాలు కూడా విధించవచ్చంటూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇకపై కమెడియన్లు ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం.. ఈ ఇన్ఫ్లుయెన్సర్లపై విధించాల్సిన జరిమానాపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ వివాదం అనంతరం సమయ్ రైనా తన షో "ఇండియాస్ గాట్ లాటెంట్"ను నిలిపేసిన సంగతి తెలిసిందే. -
రీల్స్, బ్యూటీ పార్లర్.. నిక్కీ కేసులో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: నోయిడా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విపిన్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను హత్య చేసిన విపిన్.. ఏ మాత్రం పశ్చాత్తాపం కనబడటం లేదు. ‘‘నేను చంపలేదు.. తనే చనిపోయింది’’ అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నాడు.నిక్కీ బ్యూటీపార్లర్ ఓపెన్ చేయడాన్ని విపిన్ వ్యతిరేకించడంతో పాటు.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడం కూడా హత్యకు గల కారణాలుగా పోలీసులు చెబుతున్నారు. నిక్కీ మర్డర్ కేసులో విపిన్ తల్లి దయాభాటి హస్తం కూడా ఉన్నట్లు తేలింది. కిరోసిన్ బాటిల్ అందించినట్లు నిక్కీ సోదరి కంచన్ ఫిర్యాదులో పేర్కొంది. దయాభాటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధించారు.యూపీలో గ్రేటర్ నోయిడా పరిధిలోని సిర్సా గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే లక్షల కట్నం చాలదని, మరింత తేవాలని చిత్రహింసలు పెట్టి, చితకబాది, చివరకు యాసిడ్ పోసి, ఆపై సజీవదహనం చేసినట్టు వెల్లడైంది! దాంతో ఆ నరరూప రాక్షసుడు కటకటాలపాలయ్యాడు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యతి్నంచి, పోలీసుల తూటా దెబ్బకు గాయపడి మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. అతనితో పాటు, కోడలిని రాచిరంపాన పెట్టిన అత్తను కూడా అరెస్టు చేశారు. సిర్సా వాసి సత్యవీర్ రెండో కొడుకు విపిన్‌కు 26 ఏళ్ల నిక్కీతో 2016లో పెళ్లయింది. లక్షల నగదుతో పాటు స్కార్పియో కారు, విలువైన వస్తువులు కట్న కానుకలుగా ఇచ్చారు. ఇటీవల సత్యవీర్ బెంజ్ కారు కొనుకున్నాడు. తనకూ అలాంటి మరో కారైనా, మరో రూ.36 లక్షల అదనపు కట్నమైనా తేవాలని నిక్కీని విపిన్ హింసించసాగాడు. అందుకు తల్లి దయావతి వంతపాడేది. పెద్ద కొడుకు భార్య అయిన నిక్కీ అక్కడ కంచన్కు కూడా వేధింపులు మొదలయ్యాయి. గురువారం రాత్రి నిక్కీని ఇష్టానికి బాది, యాసిడ్ పోసి మరీ నిప్పంటించారు. అగ్నికి ఆహుతవుతూ మెట్ల నుంచి నిక్కీ పడిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి.భర్త, అత్త కలిసి ఆమెను జుట్టుపట్టి కొడుతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని కంచన్ రికార్డు చేసి పోలీసులకు అందించింది. తీవ్రగాయాల పాలైన నిక్కీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలొదిలింది. ‘‘నా చెల్లెలిని కొట్టొద్దని వారించినందుకు నన్నూ చితకబాదారు. తన తల, మెడపై విపరీతంగా కొట్టి యాసిడ్ పోశారు’’ అంటూ కంచన్ వాంగ్మూలమిచి్చంది. ఆమె ఫిర్యాదు మేరకు విపిన్, దయావతిని అరెస్టు చేశారు.సీన్ రీకన్స్ట్రక్ఛన్ కోసం నిక్కీని ఆదివారం మధ్యాహ్నం అతన్ని ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఎస్సై నుంచి పిస్టల్ లాక్కొని పారిపోయాడు. వెంటాడుతున్న పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అతని కాళ్లపై షూట్ చేశారు. కుప్పకూలాక అదుపులోకి తీసుకున్నారు.పాపం పసివాడు! ఆరేళ్ల లేత ప్రాయం. కన్నతల్లిని తన తండ్రే నాయనమ్మతో కలిసి మరీ కర్కశంగా సజీవ దహనం చేస్తుంటే కళ్లారా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకుని ఉండడు! ‘‘అమ్మను నాన్న, నానమ్మ చెంపపై బాగా కొట్టారు. మండిపోయేది అమ్మపై పోశారు. తర్వాత నాన్న లైటర్‌తో నిప్పు పెట్టాడు’’ అంటూ జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పుకుంటూ వెక్కిళ్లు పెడుతున్న ఆ బాలున్ని చూసి కంటతడి పెట్టని వారు లేరు. -
సీఎం రేఖా గుప్తాపై కత్తితో దాడి ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నిందితుడిని విచారణగా.. సీఎం రేఖా గుప్తాను కత్తితో పొడవాలని ముందే ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి వద్ద భారీ భద్రత కారణంగా ప్లాన్‌ను అమలు చేయలేదని నిందితుడు చెప్పినట్టు జాతీయ మీడియా పలు కథనాల్లో పేర్కొంది. దీంతో, ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 20న సివిల్ లైన్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రేఖా గుప్తా ‘జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్(41) ముఖ్యమంత్రిపై దాడి చేశాడు. పత్రాలను అందిస్తూ.. సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. పెద్దగా కేకలు వేస్తూ.. చెంపదెబ్బ కొట్టాడు. ఆమెను వెనక్కు తోసేయడానికి ప్రయత్నించాడు. ఆమె జట్టును గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అనూహ్య ఘటనలో ముఖ్యమంత్రి తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి.ఇక, అతడి విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. విచారణలో సకారియా..‘ఢిల్లీలో వీధి కుక్కలను తొలగించాలని నేను చాలా సార్లు అభ్యర్థించా. దీని గురించి సీఎం పట్టించుకోకపోవడంతోనే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నా. సీఎం అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు సుప్రీంకోర్టుకు వెళ్లా. న్యాయస్థానం బయట సెక్యూరిటీ చూసి అక్కడి నుంచి వచ్చేశా. అనంతరం సివిల్ లైన్స్‌లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లా. తొలుత ఆమెను కత్తితో పొడవాలని ప్లాన్ చేశా. కానీ, భద్రతా ఎక్కువగా ఉండటం చూసి కత్తిని బయటే పడేశాను’ అని చెప్పినట్టు సమాచారం.🚨Pre-planned attack on Delhi Chief Minister Rekha Gupta?CCTV footage shows accused Rajesh Sakriya scouting her Shalimar Bagh residence a full day before the assault. Police have recovered videos of CM’s house from his phoneDuring a public hearing at her residence this… pic.twitter.com/F270zGKiY4— Nabila Jamal (@nabilajamal_) August 20, 2025 -
ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్.. 82 కోట్ల కొకైన్ స్వాధీనం
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న కిలాడీ లేడీ వద్ద కొకైన్‌ను గుర్తించారు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ.82 కోట్లు విలువ చేసే 5.5 కిలోల కొకైన్‌ను సీజ్ చేశారు.వివరాల ప్రకారం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ దొరకడం తీవ్ర కలకలం రేపింది. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న కిలాడీ లేడీ గోల్డ్ కలర్ చాక్లెట్స్‌లో కొకైన్‌ను నింపి తరలించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు.. ఆమె వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
భార్యను హత్య చేసి.. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి..!
న్యూఢిల్లీ: వరకట్న వేధింపులతో భార్యను హత్య చేసిన ఓ భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య నిక్కీ భాటిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భర్త విపిన్ భాటి పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భార్యను చంపినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేని అతను తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. దాంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయాలపాలయ్యాడు. అతన్ని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పరిధిలో గ్రేటర్ నోయిడాలోవిపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు. కాగా, మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధిస్తున్నారేది ప్రధాన ఆరోపణ. -
‘ఆనాడు కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే.. ఈ బిల్లు వచ్చేది కాదు’
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ వరుసగా నెల రోజులు జైల్లో ఉంటే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బిల్లును విపక్షాలు వివాదాస్పద బిల్లు అని అంటుంటే, కేంద్రం మాత్రం దాన్ని సమర్ధించుకుంటుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైబడినా ఈ తరహా బిల్లును ఎవరూ తీసుకురాలేదని, దీన్ని తీసుకొచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం గర్విస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లులకు చట్ట సవరణలు చేయాలా? వద్దా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ బిల్లుకు చట్ట సవరణ వద్దు అని విపక్షాలు పట్టుబట్టినా దాన్ని తాము ముందుకు తీసుకెళ్లామన్నారాయన. పీఎం నుంచి సీఎం, మంత్రులు ఇలా వెవరైనా తీవ్ర నేరాలకు పాల్పడి ఆ అభియోగాలపై 30 రోజుల పాటు జైల్లో ఉంటే రాజీనామా చేయాలనే బిల్లును తీసుకొస్తే తప్పేముందని ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రశ్నించారు. ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారణంగానే తీసుకొచ్చిన బిల్లు అనే చర్చకు కూడా ఆయన పుల్‌స్టాప్ పెట్టారు. లిక్కర్ కేసులో జైలు పాలైన అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ బిల్లు వచ్చి ఉండేది కాదేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు అమిత్ షా. ఎక్కడైనా నైతికత అనేది చాలా ముఖ్యమైనదని, దాన్ని తుంగలో తొక్కి మళ్లీ పదవులు అలంకరిస్తామంటే కుదరదన్నారు. తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగించిన విషయాన్ని అమిత్ షా ఉదహరించారు. ప్రజాస్వామ్యంలో నైతికతకు ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత తీసుకోవాలనేది తమ విధానమన్నారు. ఈ క్రమంలోనే బిల్లును సవరించామన్నారు. ‘ఈ దేశంలోని ప్రజలు.. ఏ రాష్ట్ర సీఎం అయినా జైల్లో ఉండి పరిపాలించాలని కోరుకుంటారా?, ఇదేంటో అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరి వైపు నుంచి చూసినా నైతికత అనేదే ముఖ్యం’ అని కేరళలోని మనోరమా న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. People of the nation have to decide whether they want a PM, CM, or minister to run government from jail. pic.twitter.com/a8yiTYXM5T— Amit Shah (@AmitShah) August 22, 2025 కాగా, గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. -
గోడ దూకి పార్లమెంట్ కాంప్లెక్స్ లోకి చొరబడిన ఆగంతకుడు
-
నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్
ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ ఢిల్లీలో నిర్వహించిన వీజీ మిసెస్ ఇండియా–2025 పోటీల్లో హైదరాబాద్ సిటీ బేగంపేటకు చెందిన నమిత కుల్ శ్రేష్ట మిసెస్ ఇండియా–2025 టైటిల్ దక్కించుకున్నారు. ఈ మేరకు బేగంపేటలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నమిత కుల్ శ్రేష్ట కుటుంబ సభ్యులు పోటీల వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 700 మంది మహిళలు మిసెస్ ఇండియా పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా చివరి నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఫైనల్స్‌కు 56 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో కఠినమైన రౌండ్లు, సవాళ్లతో కూడిన పోటీలో జడ్జ్‌లు అడిగిన ప్రశ్నలకు ఆకట్టుకునే రీతిలో సమాధానాలు చెప్పిన నమితకు మిసెస్ సౌత్ జోన్ టైటిల్‌తో పాటు వయోవర్గంలో మిసెస్ ఇండియా–2025 టైటిల్ అందజేసినట్లు తెలిపారు. దీంతో పాటు మిసెస్ ఇండియా ఎలిగెన్స్, మిసెస్ ఇండియా గ్రేస్‌ఫుల్ సోల్, మిసెస్ ఇండియా చారిటీ క్వీన్ టైటిళ్లు కూడా దక్కాయని తెలిపారు. (చదవండి: డ్రెస్ స్టైల్‌నూ మార్చేయచ్చు..!) -
స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఇచ్చిన ఉత్తర్వు పట్ల జంతు ప్రేమికుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో.. ఆ ఉత్తర్వులో మార్పులు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కుక్కలకు స్టెరిలైజేషన్(పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స) పూర్తి చేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలని తేల్చిచెప్పింది. రేబిస్ వంటి వ్యాధులు, ఆవేశపూరిత, విపరీత ప్రవర్తన ఉన్న కుక్కలను మాత్రం స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అనంతరం ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వు అత్యంత కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అంగీకరించింది. వీధి కుక్కల బెడద దేశమంతటా ఉన్నట్లు గుర్తుచేసింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాణాలు సైతం కోల్పోతున్నారని, అందుకే దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణకు ఒక జాతీయ విధానం తీసుకొచ్చే విషయం ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారంపై ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కుక్కలన్నింటినీ 8 వారాల్లోగా బంధించి, షెల్టర్లకు తరలించాలంటూ జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను జంతు ప్రేమికులు తప్పుబట్టారు. దాంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ త్రిసభ్య ధర్మాసనానికి ఇప్పగించారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టింది. తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా అన్ని కుక్కలను బంధించి, షెల్టర్‌కు తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే.. → వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం నేరం. ఉల్లంఘించినవారికి శిక్ష తప్పదు. → వాటికి ఆహారం అందించడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వీధుల్లో ఇళ్ల ముందు కుక్కలకు అన్నం పెట్టినవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. → వీధి కుక్కలను జంతు ప్రేమికులు దత్తత తీసుకోవచ్చు. వాటిని వారు సరిగ్గా సంరక్షించాలి. మళ్లీ వీధుల్లోకి వదిలేయకూడదు. → ఢిల్లీలో వీధి కుక్కలను కాపాడాలంటే పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి రూ.25,000, ఎన్జీఓలు రూ. 2 లక్షల చొప్పున కోర్టులో డిపాజిట్ చేయాలి. → కుక్కల సమస్యకు సంబంధించిన హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నాం. ఒక జాతీయ పాలసీని రూపొందించే దిశగా విచారణ చేపడతాం. → వీధి కుక్కల కేసులో కేవలం ఢిల్లీని మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేరుస్తున్నాం. → సుప్రీంకోర్టు తాజా తీర్పు పట్ల జంతు ప్రేమికులు హర్షం వ్యక్తంచేశారు. -
సీఎం రేఖా గుప్తాపై దాడి.. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌పై బదిలీ వేటు
ఢిల్లీ: సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన జనం,కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ అగంతకుడు దాడికి పాల్పడిన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కమిషనర్ ఎస్బీకే సింగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సతీష్ గోల్చాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఎస్బీకే సింగ్ ఆగస్టు 1న ఢిల్లీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. స్వల్ప వ్యవధిలోనే సీఎం రేఖా గుప్తాపై నిందితుడు దాడికి పాల్పడడంతో ఢిల్లీ ప్రభుత్వం ఎస్బీకే సింగ్‌ను విధుల నుంచి తప్పించింది. -
కొంప ముంచింది ఆ ఇద్దరే.. 30 రోజులు జైల్లో ఉంటే నేతల పదవి ఊస్టింగ్..
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులుగా కస్టడీలో గడుపుతున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి,కేంద్ర రాష్ట్రమంత్రులను పదవి నుంచి తొలగించేలా కేంద్రం మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రం ఈ వివాదాస్పద బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ఇద్దరు నేతలు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు? వాళ్లు ఏం నేరం చేశారు.గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో,తీవ్రమైన నేరాలకు పాల్పడి నెలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రజాప్రతినిధుల్ని పదవుల్ని తొలగించేలా కేంద్రం చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ గతేడాది జూన్‌లో అరెస్టయ్యారు.జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జైలు శిక్షను అనుభవించారు. జైలు శిక్షను అనుభవించే సమయంలో సీఎం పదవికి రాజీనామా చేయలేదు.ఆ సమయంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం భావించింది. కానీ ఆ సమయంలో చట్టాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలపై కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని అపవాదు వస్తుందనే ఉద్దేశ్యంతో వేచి చూసి ధోరణిని అవలంభించింది. కొంత కాలం తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో వివాదాస్పద చట్టం మరుగున పడింది. మళ్లీ ఇన్నాళ్లకు అదే చట్టాన్ని అమలు చేసేలా లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రేరేపించిన మరో కేసు తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ కేసు. డీఎంకే పార్టీలో నాలుగు సార్లు సెంథిల్ బాలాజీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళనాడు మాజీ రవాణాశాఖ మంత్రి, ఉద్యోగాల పేరుతో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. 2023లో ఆయనను అరెస్ట్ చేసింది. దాదాపు 14 నెలలు జైల్లో ఉన్న తర్వాత 2024 సెప్టెంబర్ 26న బెయిల్ మంజూరైంది. సెంథిల్ బాలాజీ అరెస్టయి జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో ఎలాంటి శాఖ లేకపోయినా మంత్రిగా కొనసాగారు. ఇదే విషయంలో మద్రాస్ హైకోర్టు బాలాజీపై తీవ్ర విమర్శలు చేసింది. శాఖ లేకుండా మంత్రిగా కొనసాగడం అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కావడంతో తన పదవికి రాజీనామా చేశారు.బెయిల్ తర్వాత అన్నాడీఎంకేలో చేరి సెంథిల్ బాలాజీ మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు మీరు మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పుడు సీనియర్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం రావచ్చు’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా తప్పులు చేసి 30రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన నేతల పదవులు కోల్పోయేలా బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేసినట్లు సమాచారం. -
Gen Z: ఉదయం ఉద్యోగంలో చేరి.. మధ్యాహ్నానికే ‘గుడ్‌బై’!
ఢిల్లీ: వామ్మో..నేను బతుకుంటే.. బలుసాకైనా అమ్ముకుని బతికేస్తా.. కానీ మీ కంపెనీలో మాత్రం ఉద్యోగం చేయను బాబోయ్ అంటూ ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే..లంచ్ టైంలో జాబ్‌కు రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన కార్పొరేట్ కంపెనీల్లో టాక్సిక్ వర్క్ కల్చర్‌కు అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.ఆ ట్వీట్ సారాశం ఏంటంటే?. నా స్నేహితుడు ఢిల్లీకి చెందిన స్టార్టప్‌లో చేరాడు. చేరిన తొలిరోజు లంచ్ టైం వరకు పనిచేశాడు. లంచ్ టైం తర్వాత తన ల్యాప్‌ట్యాప్‌ను కూడా డెస్క్‌పై వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. ఆఫీస్ నుంచి వెళ్లిన తర్వాత..సదరు కంపెనీ ప్రతినిధులు ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్ వాటికి రిప్లయి ఇవ్వలేదు.కానీ చివరికి కంపెనీ హెచ్ఆర్ నుంచి ఫోన్ రావడంతో రిప్లయి ఇవ్వక తప్పలేదు. హెచ్ఆర్తో బతుకుంటే బులుసాకైనా అమ్ముకుంటా కానీ మీ కంపెనీలో నేను పని చేయనని తేల్చి చెప్పాడు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.ఆ ట్వీట్‌పై నెటిజన్లు పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. చేరిన తొలిరోజే ఉద్యోగానికి రిజైన్ చేసిన వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. స్టార్టప్ కల్చర్‌లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబే. ఇది ఆశ్చర్యకరం కాదు. స్టార్టప్ కల్చర్ కొన్నిసార్లు తట్టుకోలేని విధంగా ఉంటుంది.మొదటి రోజే వర్క్ ప్లేస్ సరిగా అనిపించకపోతే,వెళ్లిపోవడం మంచిదే’అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. చాలా మంది ప్లాన్ చేస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే అమలు చేస్తారు’అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ సంఘటన జెన్‌జీ వర్క్ కల్చర్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. జెన్‌జీకి వర్క్ కల్చర్ బాగుండాలి. అంటే పనిచేసే కార్యాలయం తమ మనసుకు అనుగుణంగా ఉంటే ఫర్లేదు. లేదుంటే మానసిక ప్రశాంతను చెడగొట్టుకుని పనిచేకపోవడం ఇష్టం ఉండదు. అందుకే వెంటే రాజీనామా చేస్తారు. A friend told me about this guy who joined a startup here in Delhi. On his very first day, he left his laptop on his desk during lunch and just never came back. He ignored everyone’s calls initially but later picked up HR’s, and just said he cannot work there 😭— Poan Sapdi (@Poan__Sapdi) August 19, 2025 -
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. భారత్‌లో ఆన్లైన్ గేమింగ్‌కు నూకలు చెల్లాయి. నెటిజన్లను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సర్వనాశనం చేస్తున్న ఈ భూతానికి సమాధి కట్టే దిశగా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే ప్లాట్‌ఫాంలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆన్లైన్ ప్రమోషన్, నియంత్రణకు ఉద్దేశించిన ‘రెగ్యులేషన్, ప్రమోషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్’బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమ్ యూజర్లు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ దిశగా కఠిన చర్యలకు ఉపక్రమించింది.ముఖ్యంగా యూజర్లకు నగదు ప్రోత్సాహకాలను ఎరగా వేస్తున్న గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం చట్టబద్ధమైన ని యంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఒక ఆన్లైన్ గేమింగ్ నగదు బెట్టింగ్ పరిధిలోకి వస్తుందా, రాదా అన్నది తేల్చే పూర్తి అధికారాలు దానికి కట్టబెట్టనున్నారు.దేశాన్ని పట్టి పీడిస్తున్న నగదు అక్రమ చెలామణీ (మనీ లాండరింగ్), అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ క్రైమ్ వంటి పలు జాఢ్యాలకు ఈ ఆన్లైన్ నగదు బెట్టింగ్‌లు ఊతమిస్తున్నట్టు తేలిన నేపథ్యంలో కఠిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లును ఇవాళ (బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు.బిల్లులోని కీలకాంశాలు..👉రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, బాధ్యులకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.కోటి దాకా జరిమానా. పదేపదే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. 👉వాటిని ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల దాకా జైలు, రూ.50 లక్షల దాకా జరిమానా 👉ఇలాంటి గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం 👉ఇలాంటి వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాంలకు వాణిజ్య ప్రకటనలను కూడా పూర్తిగా నిషేధిస్తారు 👉నమోదు కాని, అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపుతారు 👉ఇ–స్పోర్ట్స్, క్యాండీ క్రష్ వంటి నైపుణ్యాధారిత ఆన్లైన్ గేమ్స్ తదితరాలను ఇతోధికంగా ప్రోత్సహిస్తారు 👉ఇలాంటి గేమ్స్ ఆడేవారిని మాత్రం శిక్షల పరిధి నుంచి తప్పించారు. వారిని బాధితులుగా పరిగణించాలని నిర్ణయించారు -
Delhi: 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. వారంలో రెండో ఘటన
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని 50 కి పైగా పాఠశాలలకు బుధవారం ఉదయం ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే ఏ పాఠశాలలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయో స్పష్టంగా తెలియకపోయినా, వాటిలో మాలవీయ నగర్, నజాఫ్‌గఢ్‌లోని పాఠశాలలు ఉన్నట్లు సమాచారం.ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలోని సర్వోదయ కన్యా విద్యాలయ (ఎస్కేవీ)కి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ , భద్రతా సిబ్బంది పాఠశాలకు చేరుకుని, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నగరంలోని 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడాన్ని మరచిపోకముందే, తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో వివిధ పాఠశాలల్లో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.గడచిన సోమవారం నగరంలో 32 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా, సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పరుగుపరుగున పాఠశాలలకు చేరుకుని, తమ పిల్లలను ఇంటికీ తీసుకెళ్లారు. తాజాగా పాఠశాలలకు తిరిగి బాంబు బెదిరింపులు వచ్చిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారని, ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయిని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. గుజరాతీ పనేనా?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. ‘జన్ సున్‌నాయ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ముఖ్యమంత్రి రేఖను దూషిస్తూ.. ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని గుజరాత్‌కు చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడి వివరాలు తెలియ్సాలి ఉంది. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ వ్యక్తి చేయి చోటుచేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాయి. తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ స్పందించారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. దీనిపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. A mishap happened during Jan Sunvai at CM Residence, Civil Lines. Delhi BJP President Virendraa Sachdeva strongly condemns the attack on CM Rekha Gupta during the weekly Jan Sunvai. Police inquiry to reveal details: Delhi BJP— ANI (@ANI) August 20, 2025ఢిల్లీ ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని బీజేపీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఖండించారు. సీఎంపైనే దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇలా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరగడం భద్రతా వైఫల్యమని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా దాడి చేసిన వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన సమయంలో ఏం జరిగిందే అక్కడే ఉన్న ఓ మహిళ వివరించారు.. తాజాగా అంజలి అనే మహిళ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతున్న సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. జన్‌సున్‌వాయ్ నిర్వహిస్తుండగా సదరు వ్యక్తితో సీఎం రేఖా మాట్లాడుతున్న సమయంలో అతడు.. చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇలా చేయడం తప్పు అని చెప్పారు. #WATCH | Attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai | Anjali, who was present at the spot, says, "This is wrong. Everyone has the right to Jan Sunvai. If an imposter can slap her, this is a big deal...I was there...The person was speaking and he suddenly slapped. Police… pic.twitter.com/fsQCY8Jl0P— ANI (@ANI) August 20, 2025#WATCH | Attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai | Shailendra Kumar says, "I had come from Uttam Nagar with a complaint over sewer. When I reached the gates, chaos broke out because the CM was slapped. This is wrong..." pic.twitter.com/dVIJhz6ipD— ANI (@ANI) August 20, 2025 -
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
సాక్షి, ఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. సోమవారం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత..ద్వారకా ఏరియాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు సోమవారం ఉదయం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీస్, ఫైర్ సిబ్బందితోపాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ క్యాంపస్‌కు చేరుకుని అక్కడున్నవాళ్లను ఖాళీ చేయించి తనిఖీ చేపట్టారు. ఆ వెంటనే మరికొన్ని స్కూళ్లకు ఇదే తరహాలో ఫోన్లు, మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ పరిసరాల్లోని పాఠశాలలకు ఇలా బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కవారంలోనే పాతికకు పైగా ఇలాంటి బాంబు బూచీ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో.. ఉత్తుత్తి బెదిరింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈమెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ IP అడ్రస్‌లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. తాజాగా.. ఓ స్కూల్‌కు బాంబు ఉందని, పిల్లలు చనిపోతారని కాల్ చేసిన వ్యక్తిని.. 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించడం తెలిసిందే. స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ ప్లేసులు, ఆఖరికి విమానాల్లోనూ బాంబు ఉందంటూ ఫోన్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా వచ్చినా, కఠిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ జరుగుతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడినవారిపై జైలు శిక్ష, ఆర్థిక జరిమానా విధిస్తారు. విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తే శిక్షతోపాటు ప్రయాణాలు చేయకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. BNS (భారతీయ న్యాయ సంహిత) ప్రకారం ఉగ్రవాద చర్యగా పరిగణించి జీవిత ఖైదు తరహా కఠిన శిక్షా పడొచ్చు. -
‘రన్‌వేపై విమానం జారింది’: తప్పిన ప్రమాదంపై ఎంపీ వ్యాఖ్యలు
కొచ్చి: ‘ఎయిర్ ఇండియా’పై నీలి నీడలు ఇప్పట్లో వీడేలా లేవు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. నేటి (సోమవారం) తెల్లవారుజామున కేరళలోని కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా టేకాఫ్‌ను నిలిపివేశారు. అనంతరం ఊహించని విధంగా విమాన ప్రయాణం ఆలస్యం అవుతున్నదని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ఈ విమానంలో లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ నేత హిబి ఈడెన్ కూడా ప్రయాణిస్తున్నారు.కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్)ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక సమస్యల కారణంగా ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ను నిలిపివేసిందని, విమానాన్ని మారుస్తున్నామని, త్వరలోనే బయలుదేరే అవకాశం ఉందన్నారు. టేకాఫ్ రోల్ సమయంలో గుర్తించిన సాంకేతిక సమస్య కారణంగా కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్లే విమానం ఏఐ504 ఈ రోజు సాయంత్రం బయలుదేరేలా తిరిగి షెడ్యూల్ చేశారని అన్నారు. కాక్‌పిట్ సిబ్బంది ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి, టేకాఫ్ రన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారని, నిర్వహణ తనిఖీల కోసం విమానాన్ని తిరిగి బేకు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. Something unusual with this flight ✈️ AI 504, it just felt like the flight skid on the runway and hasn't taken off yet. Air India cancelled AI 504 and announced a new flight at 1 am which hasn't still started boarding, today is the third flight which has been AOG— Hibi Eden (@HibiEden) August 17, 2025ఈ ఘటన దరిమిలా ప్రయాణికులు విమానం నుంచి దిగిపోయారని, కొచ్చిలోని తమ సహోద్యోగులు వారికి సహాయం అందిస్తున్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. కాగా ఈ ఘటన సమయంలో విమానంలో ఉన్న ఎర్నాకులం కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ .. తాను ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయ్యే ప్రయత్నంలో రన్‌వే నుండి జారిపోయినట్లు అనిపించిందని సోషల్ మీడియాలో పోస్ట్‌లో తెలిపారు.ఆ సమయంలో విమానంలో ఏదో అసాధారణమైనది జరిగిందన్నారు. తెల్లవారుజామున ఒంటి గంటకు తదుపరి విమానాన్ని ప్రకటించారని, అయితే ఇంకా బోర్డింగ్ ప్రారంభించనేలేదని ఆయన పేర్కొన్నారు. కాగా 2022 జనవరిలో ప్రైవేట్ యాజమాన్యంలోకి వచ్చినప్పటి నుండి ఎయిర్ ఇండియా చివరి నిమిషంలో విమానాల జాప్యాలు, రద్దులను ఎదుర్కొంటోంది. దీనికి సాంకేతిక, నిర్వహణ సమస్యలే ప్రధాన కారణమని ఎయిర్ ఇండియా చెబుతూవస్తోంది. -
ఎయిమ్స్‌ను వీడుతున్న వైద్యులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఒకప్పుడు ఇందులో చేరడానికి వైద్యులు పోటీపడ్డ సంస్థను ఇప్పుడు వైద్యులు వీడుతున్నారు. ఎంతో ప్రతిష్ట ఉన్న సంస్థ. ఆ సంస్థతో అంతే విడదీయలేని అనుబంధం. కొంతమంది డాక్టర్లయితే.. వారి పేరుతో కాకుండా.. ఎయిమ్స్‌తోనే గుర్తింపు. అలాంటి గుర్తింపును కూడా ఎందుకు వదులుకొంటున్నారు? పేగుబంధం లాంటి అనుబంధాన్ని తెంచేసుకుంటున్నారు? ఇటీవల పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెప్పిన సత్యాలేంటో చూద్దాం. ఢిల్లీ ఎయిమ్స్ నుంచే ఎక్కువగా... దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ల్లో 429 మంది రాజీనామా చేశారు. 2022 నుంచి 2024 మధ్య రెండేళ్ల కాలంలోనే, రాజీనామాలు సంభవించాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి అత్యధికంగా 52 మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. రిషికేశ్‌లో 38 మంది, రాయ్‌పూర్‌లో 35, బిలాస్పూర్లో 32, మంగళగిరిలో 30 మంది, భోపాల్‌లో 27 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 1,000 మందికంటే ఎక్కువ మంది అధ్యాపకులు, విభాగాధిపతులు, కేంద్రాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు. అయితే.. ఇక్కడ జరిగిన రాజీనామాలలో ఎక్కువ భాగం ఉన్నత స్థాయిలోనే జరిగాయి. అత్యున్నత స్థాయివారే అత్యధికం.. రాజీనామా చేసినవారిలో మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వంటి ప్రముఖులు ఉండటం గమనార్హం. ఆయన వీఆర్ఎస్ తీసుకుని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శివ్ చౌదరి రాజీనామా చేసి ఫోర్టీస్ ఎస్కార్ట్‌లో చేరారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ శశాంక్ శరద్ కాలే అపోలోకు మారారు. రాజీనామా చేసిన ప్రముఖుల్లో ఈఎన్టీ విభాగం, నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ మాజీ అధిపతి డాక్టర్ అలోక్ టక్కర్, రోటరీ కేన్సర్ హాస్పిటల్ అనస్థీషియాలజీ అధిపతి డాక్టర్ సుష్మా భటా్నగర్, న్యూరాలజీ విభాగం మాజీ అధిపతి, న్యూరోసైన్సెస్ సెంటర్ చీఫ్ డాక్టర్ పద్మ శ్రీవాస్తవ, ఆర్థోపెడిక్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ రాజేష్ మల్హోత్రా కూడా ఉన్నారు. వీరంతా ఎయిమ్స్‌లోనే ఎదిగి, 3 దశాబ్దాలకు పైగా ఇక్కడే సేవలందించడం గమనార్హం. అపనమ్మకం.. అసమర్థత... ఢిల్లీలోని ఎయిమ్స్ అంటే.. తక్కువ ఖర్చుతో అత్యున్నతమైన వైద్యం అందుతుందనే అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే.. ఇప్పటికీ ప్రతిరోజూ వేలాది మంది రోగులు వస్తుంటారు. అలాంటి సంస్థ చిత్రం మొత్తం మారిపోయింది. సరైన నాయకత్వం లేకపోవడం నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. అపాయింట్మెంట్ల కోసం గంటల తరబడి క్యూలు, శస్త్రచికిత్సల కోసం నెలలపాటు సుదీర్ఘ నిరీక్షణలు సర్వసాధారణం అయ్యాయి. ఇప్పుడు వ్యవస్థ మొత్తం నిత్యం ఒత్తిడిలో ఉంటోంది. గతంలో ఎయిమ్స్ డైరెక్టర్ అంటే.. గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు అపనమ్మకం, అసమర్థతతో కూడిన వాతావరణాన్ని సృష్టించారు. ఇక విభాగాధిపతులైతే తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోలేని స్థితికి తీసుకొచ్చారు. వారి ప్రతిపాదనలన్నీ కాగితాలపైనే నిలిచిపోతున్నాయి. రోజువారీ పనితీరు కూడా కష్టమవ్వడం వల్లే ఎయిమ్స్‌ను వీడామని పలువురు చెబుతున్నారు. రోటరీ హెడ్షిప్ విధాన అమలే లేదు.. ఇక్కడ మరో వివాదాస్పద అంశం రోటరీ హెడ్షిప్ విధానం. రోటరీ హెడ్షిప్ అనేది వైద్య కళాశాల విభాగాల అధిపతులను రొటేషన్ పద్ధతిలో నియమించే విధానం. దీని ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఒక అధ్యాపకుడు ఆ విభాగానికి అధిపతిగా ఉంటారు. ఆ తర్వాత మరొకరు ఆ స్థానాన్ని తీసుకుంటారు. అధ్యాపకులందరికీ నాయకత్వ అవకాశం కల్పించడం, వారి అనుభవాన్ని పెంచడం లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలలో అమలు చేసే వ్యవస్థ. ఢిల్లీలోని ఎయిమ్స్, చండీగఢ్‌లలోని పీజీఐఎంఈఆర్‌లో దీనిని అమలు చేయాలని 2023లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 జూన్ వరకు గడువు విధించింది. అయినా ఈ విధానం అమలు కాలేదు. రాజకీయాలతో విశ్వసనీయతకు మచ్చ.. ఎయిమ్స్‌తో 30 నుంచి 35 ఏళ్ల అనుబంధం కలిగి ఉండి కూడా.. జరుగుతున్న నష్టాన్ని చూస్తూ భరించలేక వీడామని సీనియర్లు అంటున్నారు. నిబద్ధతతో ఉన్న వైద్యులపై రాజకీయాలు చేయడం, తక్కువ అనుభవం ఉన్నవారికి సంస్థలో నిర్ణయాధికారాలు కట్టబెట్టే ధోరణి సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. తప్పని పరిస్థితుల్లోనే అంత గొప్ప సంస్థను వీడామంటున్నారు. తాము వేతనాలకోసమే అయితే ఎప్పుడో వెళ్లిపోయేవారమని, ఇన్ని దశాబ్దాల తరువాత సంస్థను వీడాల్సి రావడానికి సంస్థలో రాజకీయాలే కారణమని చెబుతున్నారు. ఈ సామూహిక వలసలతో సీనియర్ స్థాయి వైద్యుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువ మంది అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో నిండిపోయింది. ఇది ఎయిమ్స్ ఢిల్లీ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవత్తుతోంది.సౌకర్యాల కొరతతో పోస్టులు ఖాళీ.. ఎయిమ్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ సరిపోను క్వార్టర్స్ ఉండటం లేదు. కనెక్టివిటీ తక్కువగా ఉంటోంది. దగ్గరలో ఉన్నతస్థాయి పాఠశాలు ఉండటం లేదు. షాపింగ్ కాంప్లెక్సులు సరికదా.. చివరకు ఇంటర్నెట్ సౌకర్యంగా కూడా సరిగా ఉంటం లేదు. ఇక వీరు ఉంటున్న ప్రాంతాలు టైర్–3 నగరాలుగా గుర్తించి హోమ్ అలవెన్స్ తక్కువగా ఇస్తున్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేదు. దీంతో ఇక్కడికి రావడానికి వైద్యులు అంతగా ఆసక్తి చూపడం లేదు. రాయ్‌బరేలిలో 201 ఫ్యాకల్టీ పోస్టులకు 88 భర్తీ కాలేదు. జమ్మూలోని ఎయిమ్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో 183కి గాను 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు మూడేళ్లుగా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గత మూడేళ్లలో ఒక్క ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే 1,191 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 827 భర్తీ అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా 2023–24లో 1,207 పోస్టులు మంజూరు కాగా, 850 భర్తీ అయ్యాయి. 2024–25లో 1,235 పోస్టులు మంజూరు కాగా, 803 భర్తీ అయ్యాయి. 2025–26 సంవత్సరానికి 1,306 పోస్టులు మంజూరు కాగా, 844 భర్తీ అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 ఎయిమ్స్‌ల్లో సగానికి పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. -
రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి డ్రామాలా?
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అధికారంలో ఉండగా రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి, చట్టాలను కాలరాసి, అంబేడ్కర్ ఆశయాలను పాతర వేసినవారే నేడు అదే రాజ్యాంగ ప్రతులను తలపై పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. డ్రామాలాడుతున్నారు’’ అని మండిపడ్డారు. రూ.11,000 కోట్లతో నిర్మించిన ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డును ఆదివారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలైన హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘సామాజిక న్యాయం గురించి పెద్ద మాటలు చెబుతున్న విపక్షాలు అధికారంలో ఉండగా బడుగు బలహీన వర్గాలను దగా చేసే చట్టాలు, నిబంధనలు తెచ్చాయి. ఆ తిరోగమన చట్టాలను వందలాదిగా రద్దు చేస్తున్నాం’’ అని మోదీ వివరించారు.‘వికసిత్’ నమూనాగా ఢిల్లీ ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ప్రజలు బీజేపీ భుజాలపై పెద్ద బాధ్యత పెట్టారని మోదీ అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా ఆ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని వివరించారు. ‘‘కొన్ని పార్టీలు ప్రజాతీర్పును ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నాయి. ప్రజల విశ్వాసానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా బతుకుతున్నాయి. ఢిల్లీలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కొన్ని నెలల క్రితం పెద్ద కుట్రలు జరిగాయి. ఢిల్లీకి వచ్చే తాగు నీటిలో హరియాణా ప్రజలు విషం కలిపారంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఆ ప్రతికూల రాజకీయాల నుంచి ఢిల్లీవాసులకు స్వేచ్ఛ లభించింది. వికసిత్ భారత్‌కు ఢిల్లీని ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దుతాం’’ అన్నారు. జీఎస్టీలో అత్యాధునిక సంస్కరణల రూపంలో దీపావళికి దేశవాసులకు డబల్ బోనస్ దక్కనుందని శ్లాబుల తగ్గింపును ఉద్దేశించి పునరుద్ఘాటించారు. జీఎస్టీ సంస్కరణలకు సహకరించాలని ప్రజలను కోరారు. వాటితో పేదలు, మధ్య తరగతి ప్రజలతోపాటు చిన్న, పెద్ద వ్యాపారాలకు మేలు జరుగుతుందన్నారు. -
ఓటు చోరీ వివాదంపై EC ప్రెస్ మీట్
-
తల్లిపై ‘అనుమానం’తో రెండుసార్లు అకృత్యం.. చేసిన పనికి శిక్ష ఇదేనంటూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మానవత్వం మంటగలిసిన ఉదంతం చోటుచేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన సొంత తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు తనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తనను ‘శిక్షిస్తున్నాడని’ ఫిర్యాదు చేసింది.బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన కుమారునిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వీరి కుటుంబం హౌజ్ ఖాజీ ప్రాంతంలో ఉంటోంది. బాధితురాలి పెద్ద కుమార్తెకు వివాహం కాగా, ఆమె అదే పరిసరాల్లో తన భర్త, అత్తమామలతో ఫాటు ఉంటోంది.జూలై 17న బాధితురాలు, ఆమె భర్త , చిన్న కుమార్తె సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ సమయంలో నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వారిని వెంటనే తిరిగి రమ్మని కోరాడు. తల్లికి వెంటనే విడాకులు ఇవ్వాలని, ఆమెకు కొన్నేళ్లుగా ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తాను కనుగొన్నానని చెప్పాడు. తరువాత కూడా కుమారుడు ఇదే తరహాలో తండ్రికి ఫోన్లు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలో అరేబియా నుంచి వారి కుటుంబం ఆగస్టు ఒకటిన ఢిల్లీకి తిరిగివచ్చింది.తల్లిని చూడగానే ఆ కుమారుడు ఆమెపై దాడి చేశాడు. కుమారుని ప్రవర్తనకు భయపడి తల్లి ఇల్లు విడిచిపెట్టి పెద్ద కుమార్తె ఇంటిలో ఆగస్టు 11 వరకూ ఉంది. ఆ తరువాత ఆమె తిరిగి తన ఇంటికి వచ్చింది. ఆరోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో, నిందితుడు తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాడు. తరువాత ఆమెను గదిలో బంధించి, అత్యాచారం చేశాడు. ఆమె ఎంతలా వేడుకున్నప్పటికీ విడిచిపెట్టలేదు. గతంలో ఆమె చేసిన తప్పుకు శిక్షిస్తున్నానని చెప్పాడు.బాధితురాలు వెంటనే ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే గురువారం తెల్లవారుజామున కుమారుడు ఆమె గదిలోనికి వచ్చి మళ్లీ లైంగిక దాడి చేశాడు. మర్నాడు తల్లి జరిగిన విషయాన్ని చిన్న కుమార్తెకు చెప్పింది. తరువాత వారిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, నిందితునిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తుకు ఉపక్రమించారు. -
శుభాంశు వచ్చేశాడు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పాదం మోపిన తొలి భారతీయునిగా సరికొత్త చరిత్ర సృష్టించిన వాయుసేన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి రెండు గంటలు దాటాక ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్లా భార్య కామ్నా, కుమారుడు కియష్తో పాటు అసంఖ్యాకులైన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్, పలువురు ఉన్నతాధికారులు ఎదురెళ్లి మరీ కరతాళ ధ్వనుల మధ్య శుభాంశును విమానాశ్రయం నుంచి బయటకు తీసుకొచ్చారు. #WATCH | Delhi: Group Captain Shubhanshu Shukla arrives back in India. He is welcomed by Union MoS for Science & Technology, Dr Jitendra Singh and Delhi CM Rekha Gupta.He was the pilot of NASA's Axiom-4 Space Mission, which took off from NASA's Kennedy Space Centre in Florida,… pic.twitter.com/FTpP1NaY0O— ANI (@ANI) August 16, 2025త్రివర్ణ పతాకాలను చేబూని నినాదాలతో హోరెత్తించిన అభిమానులకు ఆయన చిరునవ్వుతో అభివాదం చేశారు. డప్పుచప్పుళ్లు, జయజయధ్వానాలతో పండుగ వాతావరణం నెలకొంది. ‘‘స్వదేశానికి తిరిగిరావడం ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా ఇంతటి సాదర స్వాగతం పలకినందుకు కృతజ్ఞతలు’’ అని కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ శుక్లా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లడం, ఆ మర్నాడు ఐఎస్ఎస్కు చేరుకోవడం తెలిసిందే. అక్కడ 18 రోజులపాటు ఆయన 20 ప్రత్యేక కార్యక్రమాలు, 60కి పైగా ప్రయోగాలుచేశారు. జూలై 15న భూమికి చేరుకున్నారు. నాసా క్వారంటైన్లో గడిపి తాజాగా స్వదేశం చేరారు. శుభాంశు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. అనంతరం సొంతూరు లఖ్‌నవూ వెళ్తారు. తర్వాత 22, 23వ తేదీల్లో ఢిల్లీలో జాతీయ అంతరిక్ష దినోత్సవాలో పాల్గొంటారు. శుభాంశు దిగ్విజయ అంతరిక్ష యాత్రపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. #WATCH | Delhi: Group Captain Shubhanshu Shukla arrives back in India. He is welcomed by Union MoS for Science & Technology, Dr Jitendra Singh and Delhi CM Rekha Gupta.He was the pilot of NASA's Axiom-4 Space Mission, which took off from NASA's Kennedy Space Centre in Florida,… pic.twitter.com/FTpP1NaY0O— ANI (@ANI) August 16, 2025 -
నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రవాణా సౌకర్యాలకు కొత్త ఊపిరి పోసే రెండు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని రోహిణిలో రూ.11 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. అనుసంధానత మెరుగు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్–2 (యూఈఆర్–2) ప్రాజెక్టులను చేపట్టారు. ప్రపంచ స్థాయి రవాణా సదుపాయాలు, మలీ్ట–మోడల్ కనెక్టివిటీ కలి్పంచడమే వీటి ప్రధాన ఉద్దేశం. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేపై దాదాపు రూ.5,360 కోట్లతో 10.1 కిలోమీటర్ల ఢిల్లీ భాగం అభివృద్ధి చేశారు. ప్యాకేజీ–1 కింద శివమూర్తి కూడలి నుంచి ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ వరకు (5.9 కి.మీ), ప్యాకేజీ–2 కింద ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ నుంచి ఢిల్లీ–హరియాణా సరిహద్దు వరకు (4.2 కి.మీ) నిర్మాణం చేశారు. ఇది యశోభూమి, డీఎంఆర్సీ బ్లూ, ఆరెంజ్ లైన్లు, కొత్తగా వచ్చే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా బస్ డిపోలతో నేరుగా అనుసంధానమవుతుంది. గత సంవత్సరం మార్చిలో హరియాణా విభాగంలోని 19 కి.మీ భాగాన్ని మోదీ ప్రారంభించారు. యూఈఆర్–2 ప్రాజెక్టు రూ.5,580 కోట్లతో యూఈఆర్–2లోని అలీపూర్–డిచాన్ కలాన్ రహదారితో పాటు, బహదూర్గఢ్, సోనిపట్‌లకు కొత్త లింక్ రోడ్లు కూడా ప్రజల వినియోగానికి అందించనున్నారు. ఇవి ఢిల్లీ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్, ఎన్‌హెచ్–09 వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి. అంతేగాక పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని పెంచడంతో పాటు ఎన్సీఆర్లో రవాణా వేగవంతం అవుతుంది. ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా రోహిణిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. -
ఘనంగా జన్మాష్టమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జన్మాష్టమి సందర్బంగా ‘దహీ హండీ’ (ఉట్టికొట్టే ఉత్సవం) వేడుకలకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. #WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025కృష్ణుడు వెన్న దొంగిలించినందుకు గుర్తుగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. దహి హండీ మహోత్సవంలో పాల్గొనేందుకు స్పానిష్ క్యాస్టెల్లర్ల బృందం ఇప్పటికే మహారాష్ట్ర చేరుకుంది.#WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల ఇస్కాన్ ఆలయంలో భక్తులు శ్రీకృష్ణుడిని, రాధాదేవిని దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు. మధురలోని శ్రీ కృష్ణుని ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.#WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025ప్రధాని మోదీ ‘ఎక్స్’లో దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘నమ్మకం, ఆనందం, ఉత్సాహం నడుమ జరిగే ఈ ఉత్సవం అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను.. జై శ్రీ కృష్ణ’అని రాశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.सभी देशवासियों को जन्माष्टमी की असीम शुभकामनाएं। आस्था, आनंद और उमंग का यह पावन-पर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय श्रीकृष्ण!— Narendra Modi (@narendramodi) August 16, 2025 -
హైకోర్టు కంటే సుప్రీం ఎక్కువ కాదు: సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టులు కూడా రాజ్యాంగ న్యాయస్థానాలేనని, ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే తేడా లేదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. అదేవిధంగా, ఫలానా వ్యక్తినే న్యాయమూర్తిగా సిఫారసు చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టులకు ఆదేశాలు ఇవ్వ జాలదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయవాదులను హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించే అంశాన్ని పరిశీలించాలంటూ అంతకుముందు బార్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వినతిపై ఆయనీ మేరకు స్పందించారు. ‘జడ్జీల నియామకంపై సిఫారసులు చేయాల్సింది ముందుగా హైకోర్టులే. హైకోర్టులు అందజేసిన పేర్లలో కొన్నిటిని మాత్రం మేం సిఫారసు చేస్తాం. తిరిగి మాకు అందిన జాబితాలోని వారు మాత్రమే జడ్జీలుగా నియమితులవుతారు’అని ఆయన తెలిపారు. -
ఢిల్లీ నిజాముద్దీన్‌లో విషాదం.. కూలిన దర్గా పైకప్పు.. ఏడుగురు దుర్మరణం
ఢిల్లీ: ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియాలో దర్గా పై కప్పు కూలి పలువురు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) సాయంత్ర సమయంలో చోటు చేసుకుంది. నిజాముద్దీన్‌ప్ ప్రాంతంలోని హుమయూన్ సమాధ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. దర్గా శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. #WATCH | Delhi | NDRF personnel conduct a search operation at Dargah Sharif Patte Shah, located near Humayun's Tomb, in the Nizamuddin area, following the collapse of the roof of a room in the dargah premises. Police and Fire Department personnel are also present. So far, 11… pic.twitter.com/6oW3XjroAX— ANI (@ANI) August 15, 2025 సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యటు చేపట్టారు. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ చర్యలు చేపట్టింది. -
అమెరికా ఓవరాక్షన్.. ఎర్రకోటపై ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో భారత శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు.దేశంలో 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం, అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో పౌరులను ఉద్దేశిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోటపై మోదీ మాట్లాడుతూ.. ‘కొందరు భారత్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చరిత్రను లిఖించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ప్రపంచ మార్కెట్‌ను పాలించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. తక్కువ ధర, అధిక నాణ్యత అని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతోంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకుసాగాల్సిన సమయం ఇది అని పిలుపునిచ్చారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "... Viksit Bharat ka aadhar bhi hai Aatmanirbhar Bharat... If someone becomes too dependent on others, the very question of freedom starts to fade... Aatmanirbhar is not limited merely to imports, exports, rupees, pounds, or… pic.twitter.com/ZmP6uYoezm— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో మన శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలన్నారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మన పురోగతిని గమనిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదన్నారు. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడతారు. అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడాలి. డీజిల్, పెట్రోల్ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలి. నేడు ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోంది అంటూ కామెంట్స్ చేశారు.A very sharp message from PM Modi: Don’t waste your energy containing the other, focus all your energy on boosting your own. Economic selfishness is on the rise, but we must not sit and cry about it. Focus on building your future. No “selfishness” can trap us. This goes hard. pic.twitter.com/duImGAtzjJ— Shubhangi Sharma (@ItsShubhangi) August 15, 2025 -
దేశ ప్రజల క్షేమమే మా ధ్యేయం..! ఎర్ర కోటపై పవర్ ఫుల్ స్పీచ్
-
ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
-
బ్లాక్ మెయిల్ నడవదు.. పాక్ బెదిరింపులకు భయపడేది లేదు: మోదీ హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మెయిల్‌కు భారత్ తలవంచే రోజులు పోయాయని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో మన దేశ సత్తా చాటామని చెప్పుకొచ్చారు. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆత్మనిర్భర్ అంటే డాలర్, పౌండ్‌పై ఆధారపడటం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై 12వసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ విజయం గురించి మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద ఎంఐ-17 హెలికాప్టర్ పూల వర్షం కురిపించింది. ఎర్రకోటపై జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. ప్రతీ ఇంటిపై మువ్వెన్నల జెండా ఎగిరే సమయం ఇది. 140 కోట్ల మంది సంకల్ప పండుగ ఇది. సమైక్య భావంతో దేశం ఉప్పొంగే సమయం. కోట్ల మంది త్యాగాలతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం కోసం ప్రాణ త్యాగం చేశారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "My beloved citizens of India, this festival of independence is a festival of 140 crore resolutions. It is a moment of collective achievements, filled with pride and joy. The nation is continuously strengthening the spirit of… pic.twitter.com/YPze5woDJ6— ANI (@ANI) August 15, 2025ఉగ్రవాదులకు బుద్ది చెప్పాం.. పహల్గాంలో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. భార్య ముందే భర్తలను చంపేశారు. పిల్లల ముందే తండ్రిని చంపేశారు. మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారు. ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం. మన సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో మన దేశ సత్తా చాటాం. ఆపరేషన్ సిందూర్ హీరోలకు నా సెల్యూట్. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు. పాక్ బ్లాక్ మెయిల్ నడవదు.. ఇకపై ఎవరి బ్లాక్ మెయిల్ నడవదు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు. ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ది చెప్పింది. మన సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చాం. ఉగ్రవాదులకు సాయం చేసే వారినీ వదలిపెట్టం. బ్లాక్ మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సింధూ నది జలాలపై భారత్‌కు పూర్తి హక్కులున్నాయి. ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బంది పడ్డారు. సింధూ నదిలో నీరు భారతీయుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. ఆత్మ నిర్భర్ భారత్‌తో స్వయం సమృద్ది..ఆపరేషన్ సిందూర్‌తో మేడిన్ ఇండియా సత్తా ప్రపంచానికి చాటి చెప్పాం. ఆత్మనిర్భర్ అంటే డాలర్, పౌండ్‌పై ఆధారపడటం కాదు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా నడుస్తోంది. న్యూక్లియర్ ఎనర్జీపై భారత్ చొరవ చూపిస్తోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్వయం సమృద్ధిపై వెనక్కి తగ్గేది లేదు. ప్రతీ రంగంలో భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. 2030లోగా భారత్‌లో 50 శాతం క్లీన్ ఎనర్జీ తీసుకురావడం లక్ష్యం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయం సమృద్ధి కాదు. స్వయం సమృద్ధి అంటే సమున్నతంగా నిలబడటం. మేక్ ఇన్ ఇండియా నినాదం రక్షణ రంగంలో మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. టెక్నాలజీ సాయం కోసం భారత్ ఇప్పుడు ప్రపంచాన్ని అర్థించడం లేదు. ప్రపంచ దేశాలకు సాయం, టెక్నాలజీ అందిస్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్‌తో మన సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసింది. దీపావళి బహుమతి ఇవ్వబోతున్నాం..సైబర్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీల్లో భారత్ బలమైన పాత్ర. ప్రపంచ వాణిజ్యంలో మన సామర్థ్యం చాటాల్సి ఉంది. అంతరిక్ష పరిశోధనాల్లోనూ భారత్ తనదైన ముద్ర వేసింది. గగన్‌యాన్‌తో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది. మన యువ శాస్త్రవేత్తలు, నిపుణులు నిరంతరం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాం. అనేక క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ అండగా నిలిచింది. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నాం. దీని వల్ల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. దేపావళికి దేశ ప్రజలకు బహుమతి ఇవ్వబోతున్నాం. ఈసారి దీపావళికి రెండింతల సంతోషం తీసుకురాబోతున్నాం. ఖనిజాలే ముఖ్యం.. నాకు యువత శక్తి, సామర్థ్యాలపై నమ్మకం ఉంది. సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌వైపు దేశ యువత దృష్టి పెట్టాలి. ఫైటర్ జెట్లకు మేడిన్ ఇండియా ఇంజిన్లపై దృష్టిపెడతాం. గ్రీన్హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్తున్నాం. కొత్త ఇందనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలన్నది లక్ష్యం. 2047 నాటికి న్యూక్లియర్ ఎనర్జీని 10 రేట్లు పెంచాలన్నది టార్గెట్. 10 కొత్త అణు రియాక్టర్లపై వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతుంది. కీలక ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. ఖనిజాల కోసం 1200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో మేడిన్ ఇండియా చిప్స్ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో భారత్ ఎప్పుడో ఆలోచన చేసింది. యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం. పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పేరుతో పథకం. పంద్రాగస్ట్ సందర్భంగా పథకం ప్రారంభం. సంస్కరణల విషయంలో మాకు మద్దతు పలకాలి. తొలిసారి ఉద్యోగం పొందిన యువతీయువకులకు 15వేలు అందజేస్తాం. కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తాం. ఇక, అంతకుముందు.. ఎర్రకోటలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. కాగా, 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం నయా భారత్ థీమ్‌తో ఉత్సవాలు జరుపుతోంది.#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay (Video Source: DD) pic.twitter.com/UnthwfL72O— ANI (@ANI) August 15, 2025#WATCH | Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat, in Delhi, on #IndependenceDay (Video: DD) pic.twitter.com/3ecTwDdQXB— ANI (@ANI) August 15, 2025 -
ఢిల్లీ మెట్రో రైలు ఎక్కిన కేంద్ర మంత్రి బండి దంపతులు.. కారణం ఏంటంటే..
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు న్యూఢిల్లీలో మెట్రో రైలులో ప్రయాణించారు. వాస్తవానికి ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లోని తన నివాసం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంది. అయితే, భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీవల్ల ఢిల్లీలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రోటోకాల్ కాన్వాయ్‌ను పక్కన పెట్టి సతీమణి బండి అపర్ణతో కలిసి సమీపంలోని శివాజీ స్టేడియం వద్దనున్న మెట్రో స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ టిక్కెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కి ఢిల్లీలోని ఏరో మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టులోకి వెళ్లి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పయనమయ్యారు. -
ఢిల్లీలో ఊహించని విషాదం.. సీసీటీవీ దృశ్యాలు
ఢిల్లీ: నగరంలో ఊహించని విషాదం జరిగింది. కల్కాజీ ప్రాంతంలో తండ్రి, కూతురు బైక్‌పై వెళ్తుండగా భారీ వర్షానికి బైక్‌పై చెట్టు కూలిపోయింది. తండ్రి మృతి చెందగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. సుధీర్ కుమార్ (50) అనే వ్యక్తి తన కుమార్తె ప్రియ (22)తో కలిసి వెళ్తుండగా.. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీలో ఒక పాత వేప చెట్టు విరిగి బైకర్, పక్కనే ఉన్న వాహనాలపై పడింది. ఈ ఘటన ఉదయం 9:50 గంటలకు జరిగింది. సీసీటీవీలో ఈ విషాద ఘటన రికార్డయ్యింది.చెట్టు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పీసీఆర్ కాల్‌కు పోలీసులు వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు బాధితులను బయటకు తీసి, సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ (CATS) అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.In South Delhi’s Kalkaji, a biker lost his life after a tree collapsed on him during heavy rain.pic.twitter.com/58u0JEa4E4— Greater Noida West (@GreaterNoidaW) August 14, 2025తండ్రి, కుమార్తె ఇద్దరినీ AIIMS ట్రామా సెంటర్లో చేర్చారు. తండ్రి తీవ్ర గాయాలతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున నుండి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు ప్రభావంతో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది. జనజీవనానికి అంతరాయం కలిగింది. -
జలదిగ్బంధంలో ఢిల్లీ.. ప్రమాద స్థాయికి ‘యమున’
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నేటి (గురువారం) ఉదయం నుండి ఎడతెరిపిలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. STORY | Yamuna nears warning mark in DelhiREAD: https://t.co/Khi8oNlw1WVIDEO | pic.twitter.com/jBQVZ17moE— Press Trust of India (@PTI_News) August 14, 2025భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజాగా రెడ్ అలర్ట్ జారీచేసింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.VIDEO | Gurugram: Heavy rainfall on Thursday led to significant waterlogging and traffic congestion at IFFCO Chowk.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/zeQR1oE7ON— Press Trust of India (@PTI_News) August 14, 2025ఆగస్టు 17 వరకు ఈ ప్రాంతంలో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. మరింత అంచనా వేసింది. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం పాత రైల్వే వంతెన వద్ద 204.43 మీటర్లకు చేరుకుంది.VIDEO | Delhi: Heavy rain floods Mathura Road, causing severe waterlogging as vehicles struggle through the traffic.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/w4FYsbgkga— Press Trust of India (@PTI_News) August 14, 2025అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని ఐఎండీ తెలిపింది.వర్షం కారణంగా రింగ్ రోడ్, దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఢిల్లీని కలిపే అనేక ప్రధాన మార్గాలతో సహా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.#WATCH | Commuters wade through a partially waterlogged street near BD Marg area in Delhi, as the city receives continuous rain pic.twitter.com/CRdWc8w45N— ANI (@ANI) August 14, 2025సుబ్రోతో పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు, ద్వారకా సెక్టార్-20, గురుగ్రామ్‌లోని బసాయి రోడ్డు, ఘజియాబాద్, నోయిడాలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోయింది. ప్రజలు దాని గుండా వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
రేపు ఎర్రకోటపై ‘నయా భారత్’.. సంబరాల జాబితా ఇదే
న్యూఢిల్లీ: రేపు.. ఆగస్టు 15న భారతదేశం తన 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలకు సారధ్యం వహించనున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర సంబరాలు ‘నయ భారత్’ ఇతివృత్తం చుట్టూ తిరగనున్నాయి. ఎర్రకోటపై పంద్రాగస్టున జరిగే కార్యక్రమాలివే..గార్డ్ ఆఫ్ హానర్..ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు ప్రధానమంత్రి మోదీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్వాగతిస్తారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసులకు చెందిన 96 మంది సిబ్బందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని అందుకోనున్నారు.ఘనంగా గన్ సెల్యూట్అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట ప్రాకారాల వద్దకు వెళతారు. అక్కడ ఫ్లయింగ్ ఆఫీసర్ రషికా శర్మ జాతీయ జెండాను ఎగురవేయడంలో ప్రధానికి సహాయం చేస్తారు. ఈ సమయంలో స్వదేశీ 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్ ఉపయోగించి 1721 ఫీల్డ్ బ్యాటరీ ద్వారా 21-గన్ సెల్యూట్ జరగనుంది.అగ్నివీరుల జాతీయ గీతాలాపనమొదటిసారిగా 11 మంది అగ్నివీర్ సంగీతకారులు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఈ సమయంలో రెండు ఐఏఎఫ్ ఎంఐ 17 హెలికాప్టర్లు పూల రేకులను కురిపించనున్నాయి. వీటిలో ఒకటి త్రివర్ణ పతాకాన్ని మోసుకెళుతుంది. మరొకటి ‘ఆపరేషన్ సిందూర్’ జెండాను ఎగురవేయనుంది.‘ఆపరేషన్ సిందూర్’ విజయం హైలెట్ఈ ఏడాది వేడుకలు ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రతిబింబించనున్నాయి. ఆపరేషన్ సింధూర్ లోగో ఎర్రకోటలోని జ్ఞానపథ్‌లో కనిపించనుంది. పూల అలంకరణ ప్రముఖంగా నిలవనుంది.ఎన్సీసీ క్యాడెట్లు ‘నయా భారత్’ లోగో..జ్ఞానపథ్‌లో 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు ‘నయా భారత్’ లోగోను రూపొందించనున్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ముగింపు అనంతరం జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ వేడుకలకు దేశంలోని విభిన్న రంగాలకు చెందిన సుమారు ఐదువేల మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపేందుకు వివిధ రాష్ట్రాల నుండి సాంప్రదాయ దుస్తులలో 1,500 మంది ఆహ్వానితులు తరలిరానున్నారు. -
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై మానవ మృగాల అకృత్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మరో ఘోరం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువతిపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఒక పార్టీలో 24 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు, వారి కోసం గాలింపు కొనసాగుతున్నదన్నారు. ఆ నలుగురు నిందితులు బాధితురాలిని వాష్రూమ్లోనికి లాకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు తాను పార్టీలో మద్యం సేవించిన తర్వాత నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఆరోపించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.తన స్నేహితుడు తనను సివిల్ లైన్స్‌లోని మరో స్నేహితుని ఇంటికి పార్టీకి ఆహ్వానించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమె తన స్నేహితురాలు, మరొక పరిచయస్తుడు, మరో ఇద్దరు యువకులను కలుసుకుంది. వారంతా మద్యం సేవించి, అర్థరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. తరువాత నలుగురు యువకులు ఆమెను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారు. అలాగే దీనిని వీడియో తీశారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ యువకులు ఆమెను.. ఆమె ఇంటి బయట దింపి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఒక మహిళా అధికారి ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. తరువాత బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వీధికుక్కల తరలింపు తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది. గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌ల ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రేబిస్ వ్యాధి, కుక్క కాటు,ప్రజల భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకూడదని, షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.అదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో ఆహారం పెట్టే ప్రేమికులు, తమ ఇంట్లోనే పెట్టొచ్చుగా? అని కోర్టు ప్రశ్నించింది. రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా? అంటూ జంతు హక్కుల కార్యకర్తలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.అయితే, ఈ తీర్పుపై వివాదం చెలరేగింది. జంతు ప్రేమికులు ఈ తీర్పును సవాలు చేశారు. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. వీధికుక్కల షెల్టర్లకు తరలింపుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునసమీక్షిస్తామని తెలిపారు.ఈ క్రమంలో బుధవారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఆదేశాల మేరకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును రేపు విచారించనుంది.#BREAKING Delhi Stray dog case referred to SC 3-judge bench.A 3-judge bench of the #SupremeCourt to hear the case tomorrow.This is different from the 2-judge bench.A bench of Justices Vikram Nath, Sandeep Mehta and NV Anjaria will hear the matter tomorrow. pic.twitter.com/o0RSdoXyXp— Kashmir Dot Com (KDC) (@kashmirdotcom) August 13, 2025 -
భౌ.. భౌ..!
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి.. పిచ్చి కుక్క కరిచి పది మందికి గాయాలు.. ఇలాంటి వార్తలు నిత్యం మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. వీధి కుక్కల ముప్పు ఒక్క ప్రాంతానికో, నగరానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కుక్కకాటు సంఘటనలు మూడేళ్లలో 70 శాతం పెరిగాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్) పరిధిలోని అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చాలామంది రాత్రుళ్లు వీధుల్లో నడవడానికి, బైక్‌మీద వెళ్లడానికి భయపడతారు. ఉదయం మార్నింగ్ చేసేటప్పుడు చాలామంది కర్రలు పట్టుకుంటారు. వీటన్నింటికీ కారణం.. గ్రామ సింహాలు. బైక్ మీద వేగంగా వెళ్తుంటే కుక్కలు వెంటపడి, కరిచి లేదా వారు కిందపడి ఎంతో మంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. మనదేశంలో కుక్కల ప్రతాపం చవిచూడని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. సుమారు 70 శాతం పెరిగాయికుక్కకాటు సంఘటనలు 2024లో దేశంలో 37 లక్షలకుపైగా నమోదయ్యాయి. మూడేళ్లలో ఈ ఘటనలు 69.6 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనే 4.29 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా రేబీస్ అనుమానిత కేసులు భారీగా తగ్గుతూ వచ్చాయి. 2022తో పోలిస్తే గత ఏడాది ఈ కేసులు 78 శాతం క్షీణించాయి. కానీ మరణాలు మాత్రం ఊహించని స్థాయిలో అధికం అయ్యాయి. రెండేళ్లలో ఎనిమిది రెట్లకుపైగా పెరిగి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గత ఏడాది వీధి కుక్కల దాడి కారణంగా రేబీస్‌తో భారత్‌లో 180 మంది మరణించగా.. వీరిలో అత్యధికంగా మూడింట రెండొంతులు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం. 11 సెకన్లకు ఒకటి..భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా తక్కువ మాత్రమే సహజ మరణాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యాధులతో మరణించేవే అధికం అన్నమాట. దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కుక్కల దాడి వల్ల రేబీస్ సోకి గత ఏడాది 180 మంది ప్రాణాలను బలిగొంది. ఈ వీధి కుక్కలు భారతీయ రోడ్లు, పొలాల్లో రోజూ 15,000 టన్నులకు పైగా మలం, 8 మిలియన్ గ్యాలన్ల మూత్రం విడుదల చేస్తున్నాయి. ఇది ఒక ప్రధాన ఆరోగ్య, పర్యావరణ సమస్య అన్నది వైద్యుల మాట. ఇక, పెంపుడు కుక్కలు దేశంలో 3 కోట్లకుపైచిలుకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.» భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా.» దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి.» దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. » కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు2022 21,89,909 2023 30,52,5212024 37,15,713