
కోర్టు గదిలో కేసులపై విచారణ జరుగుతుండగా ఘటన
అప్రమత్తమై మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది
దాడులు తనపై ఎలాంటి ప్రభావం చూపబోవన్న జస్టిస్ గవాయ్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం 11.35 గంటలకు ఓ కేసుపై విచారణ జరుగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయతి్నంచడం తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టుగదిలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ఆ బూటు జస్టిస్ గవాయ్‌ని తాకలేదు.
సీజేఐపై దాడికి ప్రయతి్నంచిన లాయర్‌ను ఢిల్లీ మయూర్ విహార్‌కు చెందిన రాకేశ్ కిశోర్(71)గా గుర్తించారు. అతడిని కోర్టు గది నుంచి బలవంతంగా బయటకు తరలించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోనంటూ రాకేశ్ కిశోర్ నినాదాలు చేయడం గమనార్హం. త నపై జరిగిన దాడి యత్నంపై జస్టిస్ గవాయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు తనపై ఏమా త్రం ప్రభావం చూపబోవని తేల్చిచెప్పారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా స్పష్టంచేశా రు. దాడి యత్నం తర్వాత కూడా కేసుల విచారణ ను ఆయన యథాతథంగా కొనసాగించడం విశేషం
అసలేం జరిగింది?
సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం వేర్వేరు కేసుపై విచారణ నిర్వహిస్తుండగా, అక్కడే ఉన్న లాయర్ రాకేశ్ కిశోర్ వారిద్దరూ కూర్చున్న వేదిక వద్దకు దూసుకొచ్చాడు. తన కాలికున్న బూటు తీసి న్యాయమూర్తులపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మధ్యలోనే అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
విష్ణు దేవుడి విగ్రహంపై వ్యాఖ్యల వివాదం
మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహంపై దాఖలైన పి టిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయ్‌పై దాడి యత్నానికి కారణం కావొచ్చని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఖజురహోలోని జవెరీ టెంపుల్‌ను మళ్లీ నిర్మించి, ఏడు అడుగుల విష్ణు దేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ గవాయ్ తిరస్కరించారు. ‘మీరు ఏం కోరుకుంటున్నారో వెళ్లి ఆ దేవుడినే అడగండి. విష్ణు దేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్లి ప్రారి్థంచండి. కొంతసేపు ధ్యానం కూడా చేయండి’’ అని పిటిషనర్‌కు సూచించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
లాయర్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షాత్తూ సీజేఐపైనే బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్‌పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తక్షణమే చర్యలు తీసుకుంది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. లెసెన్స్‌ను రద్దు చేసింది.

రాజ్యాంగంపై దాడి: సోనియా
జస్టిస్ గవాయ్‌పై బూటుతో దాడిచేసేందుకు ప్రయతి్నంచడాన్ని కాంగ్రెస్ సీని యర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సిగ్గుచేటు, మతిలేని చర్య అని పేర్కొన్నారు. ఇది మన రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై దాడేనని వ్యాఖ్యానించారు. విద్వేషం, ఉన్మాదం మన సమాజం చుట్టూ ఆవరించుకొని ఉన్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోని యా ఒక ప్రకటన విడుదల చేశారు.
జస్టిస్ గవాయ్‌కి ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పైకి లాయర్ బూటు విసిరేందుకు ప్రయత్నించడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అనుచిత ధోరణులకు స్థానం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ గవాయ్‌తో ఫోన్‌లో మాట్లాడానని పేర్కొన్నారు. లాయర్ చర్య పట్ల పూర్తి సంయమనం పాటించినందుకు జస్టిస్ గవాయ్‌ని ప్రశంసించానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ విలువలను, రాజ్యాంగ స్ఫూ ర్తిని బలోపేతం చేయడానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ప్రధాని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం