మంత్రి అజారుద్దీన్‌కు కేటాయించిన శాఖలు ఇవే | Telangana Govt Allocates Minority Welfare and Public Enterprises to Azharuddin | Sakshi
Sakshi News home page

మంత్రి అజారుద్దీన్‌కు కేటాయించిన శాఖలు ఇవే

Nov 4 2025 2:00 PM | Updated on Nov 4 2025 3:13 PM

Telangana Government Allocates Portfolios To Azharuddin

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: మహ్మద్‌ అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. మైనార్టీ వెల్ఫేర్‌తో పాటు పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ శాఖలను కేటాయించింది. గత నెల అక్టోబర్‌ 31న అజారుద్దీన్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్‌కు ఏ శాఖ ఇస్తారన్నది రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.

బీఆర్‌ఎస్‌ హయాంలో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిత్వ శాఖను కేటాయించిన నేపథ్యంలో అజారుద్దీన్‌కు కూడా మంచి అవకాశం లభిస్తుందనే చర్చ జరిగింది. హోంశాఖ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, మైనార్టీ వెల్ఫేర్‌ సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ శాఖలను ప్రభుత్వం ఆయనకు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement