Telangana Government
-
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు
-
రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పనకు సంబంధించి మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. రూ.11 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును తెలంగాణలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా నిర్మాణ దశలో వేయి, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులనూ ఈ సంస్థ స్థాపిస్తుంది. తద్వారా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు తోడ్పడుతుంది. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది. తద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా వేయి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.వేయికోట్లతో వెల్నెస్ రిసార్ట్‌ను మేఘా సంస్థ నెలకొల్పుతుంది. తద్వారా నిర్మాణ దశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మేఘాతో ఒప్పందాలపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు. ‘స్కై రూట్’ పెట్టుబడులు రూ.500 కోట్లు హైదరాబాద్‌ను త్వరలోనే ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఆధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడాన్ని అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం అన్నారు. తెలంగాణ, హైదరాబాద్ రైజింగ్ లక్ష్యసాధనలో తాము భాగస్వామ్యం వహిస్తామని స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. యూనీలివర్‌తో ఒప్పందం దావోస్ పర్యటనలో భాగంగా దిగ్గజ కంపెనీ యూనిలీవర్ సంస్థ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు బృందం చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో వ్యాపారం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన యూనీలివర్ బృందానికి రేవంత్ వివరించారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలు వ్యాపారాలకు అనువుగా ఉంటాయన్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు యూనిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌తోపాటు రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల నుంచి బాటిల్ క్యాప్‌ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయి. కాగా, కామారెడ్డిలో అవసరమైన భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో సంప్రదింపులు కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ హార్డ్‌వేర్, ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌లో పేరొందిన ‘సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు బృందం చర్చించింది. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు లాజిస్టిక్స్ కంపెనీల్లో పేరొందిన ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్‌ను కలిశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలు ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్’అనే థీమ్‌తో ప్రారంభమయ్యాయి. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతోపాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేలమంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా అమెజాన్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటల సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్:తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ,అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీజేపీ(Bjp) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) విమర్శించారు. ఆదివారం(జనవరి19) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదని, 7నుంచి10శాతం కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.‘ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేశారు. మళ్లీ దొరుకుతదో దొరకదో అన్నట్లు దోచుకుంటున్న ప్రభుత్వం ఇది. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎవరితరం కాదు. తెలంగాణలో రానున్న శకం బీజేపీది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని నెలల పాటు ‘హై డ్రా’ పేరిట పేదల ఇండ్లు కూల్చింది.కొన్ని నెలల పాటు మూసీ పేరిట ఇండ్లు కూల్చింది.ఈ మధ్య కాలంలో దేశంలోనే పెద్దదైన,అతి పురాతనమైన స్లమ్ బాలాజీనగర్,జవహర్ నగర్ స్లమ్ ఏరియాల్లో ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా వలస వచ్చిన ఎంతోమంది కూలీలు,పేదలు నివసిస్తున్నారు.ఇక్కడి ప్రజలు కబ్జా చేసుకుని ఇండ్లు కట్టుకోలేదు.డబ్బులు పెట్టి కొని కట్టుకున్నారు.బ్రిటీష్ కాలంలో ఈ భూమిని సైనికులకు కేటాయించారు.ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు..కేర్ టేకింగ్ మాత్రమే చేపట్టాలని 1951లోనే స్పష్టంచేశారు.సైనికులు కొందరు ఆ భూమిని అమ్ముకుంటే వారి నుంచి పేదలు కొనుక్కున్నారు. గతంలోనూ కాంగ్రెస్ మంత్రి కమటం రాంరెడ్డి ఆ ప్రాంతంలో ఇండ్లను కూల్చాలని మిషన్లను పంపారు.మళ్లీ ఇప్పుడు రేవంత్ కూల్చివేతలు చేస్తున్నారు.బాలీజీ నగర్లో పేదల ఇండ్లను కబ్జా చేసుకునేందుకు,అమ్మకాలు,కొనుగోలు చేసే బ్రోకర్లు ఎక్కువైపోయారు.రెవెన్యూ అధికారుల ఆగడాలు ఎక్కువైపోయాయి.డబ్బులు ఇస్తే తప్పా మీ ఇండ్లు కూల్చివేతలు ఆగవని చెబుతున్నారు.రెవెన్యూ అధికారులే బ్రోకర్లుగా మారారా? అనే సందేహాలు వస్తున్నాయి.రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులిస్తే తప్ప రేకుల షెడ్ వేసుకునేందుకు అవకాశం ఇవ్వడంలేదు.ఈ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదని హైకోర్డు కూడా మొట్టికాయలు వేసింది..అయినా ఎలా కూల్చుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్ కు ఈ ప్రాంత ప్రజల బాధలు తెలియవా?పేదల ఇండ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోం..కొట్లాటకు కూడా మేం సిద్ధం.కాళేశ్వరం విచారణకు సహకరిస్తారా? అన్న అంశంపై స్పందించిన ఈటల.కాళేశ్వరం విచారణపై అవగాహన లేని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారు.మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారు, ప్రొటోకాల్ తెలియని వారు,అవగాహన లేని మెంటల్ గాళ్లు ఏదోదో మాట్లాడుతారు.ప్రభుత్వ పని విధానం ఎలా ఉంటుందనేది కూడా తెలియని వారు ఇలాంటి మాటలు మాట్లాడుతారు.అన్ని డిపార్ట్ మెంట్లు బిల్లులు చేసి పంపిస్తే బిల్లులు రిలీజ్ చేసిది ఆర్థికశాఖ.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయను’అని ఈటల అన్నారు. -
Andhra Pradesh: కృష్ణా జలాల 'హక్కులు హుళక్కే'!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ) 2లో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ చట్టానికి సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టాన్ని సవరించకుండా సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన విధి విధానాలను అనుసరించి విచారణ చేయడానికి వీల్లేదనే కోణంలో వాదనలు వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని నిపుణులు తప్పుబడుతున్నారు. చంద్రబాబు సర్కారు సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటామని కేడబ్ల్యూడీటీ 2 గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని.. అంతిమంగా ఇది రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆ తరువాత ఓటుకు కోట్లు కేసుతో వ్యక్తిగత లబ్ధి కోసం 2014–19 మధ్య కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.బాబు సర్కారు నిర్వాకంతో...కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 811 టీఎంసీలను కేటాయిస్తూ 1976 మే 27న కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ఇచ్చింది. అయితే కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమలులోకి రాని నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పే ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్ 89 ద్వారా కేడబ్ల్యూడీటీ–2కే కేంద్రం అప్పగించింది. రెండు రాష్ట్రాలకు నీటి లెక్కలను ట్రిబ్యునల్ తేల్చే వరకూ.. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అదే విధానంలోనే 2023–24 వరకూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తోంది. అయితే ఐఎస్ఆర్డబ్యూడీఏ 1956 సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ కేడబ్ల్యూడీటీ–2కు అదనపు విధి విధానాలను జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ 2023 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఆ రిట్ పిటిషన్‌పై సమర్థంగా వాదనలు వినిపించడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్రం సెక్షన్ 3 కింద జారీ చేసిన అదనపు విధి విధానాలు చెల్లుబాటు కావనే కోణంలో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి ఉంటే.. కేడబ్ల్యూడీటీ–2లో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు.నాటి తరహాలోనే నేడూ..విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, పులిచింతల విద్యుత్ కేంద్రం తమ భూభాగంలో ఉన్నాయంటూ తెలంగాణ సర్కార్ వాటిని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ రాష్ట్ర భూభాగంలో ఉన్నా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆధీనంలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతికి చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టినా నాడు చంద్రబాబు నోరు మెదపలేదు. ఫలితంగా తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను కాలరాస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలిస్తూనే ఉంది. తెలంగాణ సర్కార్ జల దోపిడీపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన ఫలితంగానే 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగ భాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించిందని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ 2014–19 తరహాలోనే వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించేలా కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టినా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని.. కేడబ్ల్యూడీటీ–2లోనూ సమర్థంగా వాదనలు వినిపించడం లేదని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
Telangana: సర్కారు నిధుల వేట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమయ్యే నిధులను అన్వేషించే పనిలో ఆర్థిక శాఖ పడింది. ఆయా పథకాల అమలు కోసం తక్షణమే ఎన్ని నిధులు అవసరం? ఏ నెలలో ఎన్ని నిధులు ఇవ్వాల్సి ఉంటుంది? వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత ప్రతిపాదించాల్సి ఉంటుంది? ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, జీతాలు, పింఛన్లకు తోడు కొత్త పథకాలకు కలిపి నిధుల సమీకరణ ఎలా? రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్లో రుణాలు ఏ మేరకు సాధ్యమవుతాయనే లెక్కలు వేసుకుంటోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతోపాటు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్‌కార్డుల జారీతో పెరిగే సబ్సిడీ వ్యయం కలిపి తక్షణమే రూ.10 వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఈ నిధులు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాబడులకు తోడు అప్పులతో.. పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వస్తున్న రాబడులకు తోడు గణనీయంగానే అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.11 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం సమకూరుతోంది. వచ్చే మూడు నెలల్లో అదనంగా నెలకు మరో రూ.2వేల కోట్ల వరకు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు రూ.30 వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలను రిజర్వు బ్యాంకు ద్వారా సేకరించనుంది. ఈ మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెలా రూ.10 వేల కోట్ల చొప్పున కావాలని ఆర్బీఐకి ఇండెంట్ కూడా పెట్టింది. మొత్తంగా సమకూరే నిధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు, రెవెన్యూ ఖర్చుతోపాటు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చులన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూనే కొత్త పథకాలకు నిధులను సమకూర్చడంపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే గత రెండు నెలలుగా పెద్ద పెద్ద బిల్లుల చెల్లింపును నిలిపివేసినట్టు తెలిసింది. వచ్చే మూడు నెలలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామని, ప్రస్తుతానికి నిధుల లోటు లేకుండా సర్దుబాటు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రణాళికతో వెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ సిద్ధమైందని వెల్లడించారు.మొత్తంగా రూ.45 వేల కోట్ల దాకా...ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతోంది. రైతు భరోసా కింద రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇక భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద తొలి విడత సాయంగా రూ.6 వేల చొప్పున ఇచ్చేందుకు మరో రూ.600 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఈ పథకం కింద 10 లక్షల మంది రైతు కూలీలు లబ్ధిపొందుతారని అంచనా. ఈ రెండు పథకాలకు ఈనెల 31లోపు నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.8,800 కోట్లను ఖజానాకు సమకూర్చడం కోసం ఆర్థిక శాఖ రెండు నెలలుగా కార్యాచరణ అమలు చేస్తోంది. ⇒ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలోపు గ్రామ పంచాయతీల్లో పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.10లక్షలలోపు బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవి సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ⇒ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (తొలి విడతలో స్థలమున్న పేదలకు రూ.5 లక్షల సాయం) కోసం ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకుపైగా అవసరమని భావిస్తున్నారు. దశల వారీగా ఈ నిధులు విడుదల చేసే నేపథ్యంలో... ఏ నెలలో ఎంత అవసరమన్న దానిపైనా ఆర్థిక శాఖ లెక్కలు వేసుకుంటోంది. ⇒ ఇక జనవరి 26 నుంచే కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ కార్డుల జారీ పూర్తయ్యాక మార్చి నెల నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90లక్షల వరకు రేషన్‌కార్డులు ఉండగా.. మరో 10లక్షల వరకు కొత్తవి జారీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. మొత్తమ్మీద కోటి కార్డులకు గాను ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇచ్చేందుకు గణనీయంగా నిధులు కావాలి. ⇒ మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి నెలాఖరు)లోనే రూ.45 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు నిధులు సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు వివరిస్తున్నారు. -
భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు ఛాలెంజ్
సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్‌రావు అన్నారు. భట్టి గోబెల్స్‌ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు -
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతుభరోసా(Rythu Bharosa) మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ (Telangana Government) విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనున్నట్లు ప్రకటించింది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ప్రభుత్వం సాయం అందించనుంది. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని వచ్చేనెల 15 నుంచి 28వ తేదీలోపు అమల్లోకి తీసుకొచ్చేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మేధావులు, ఉద్యోగులు, రైతులు, పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరించి భూభారతి చట్టం తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా కొన్ని నిబంధనలు ఉంటాయని, అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’లోపభూయిష్టంగా ఉందని అన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్! ప్రజాపాలన సభల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల దరఖాస్తులు వస్తే.. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80.60 లక్షల దరఖాస్తులు ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మినహా సుమారు 72 లక్షల దరఖాస్తులపై సర్వే చేపట్టామని, ఈ పథకానికి సంబంధించిన అర్హులను ఈనెల 26న గ్రామసభల్లో నిర్ణయిస్తామని చెప్పారు. అదేరోజు రైతుభరోసాతో పాటు తెల్లరేషన్ కార్డుల ప్రక్రియ, భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వివరించారు. ఈ పథకాలకు అర్హుల గుర్తింపునకు ఈనెల 16 నుంచి కసరత్తు చేపట్టనున్నట్లు తెలిపారు. -
ప్రత్యేక షోలకు పర్మిషన్లు ఎందుకు?: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి : తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమాకు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. తాజా పరిణామాల దృష్ట్యా బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే.. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘‘ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్(Benefit Shows), ప్రత్యేక షోలకు అనుమతించొద్దు. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదు’’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.ఇదీ చదవండి: టికెట్ల రేటు పెంపు ఎవరి కోసం రేవంత్? -
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. జనవరి 10వ తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్‌కు అనుమతి. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపుకు అనుమతి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు. అలానే జనవరి 11 నుంచి 5 షోస్‌కు అనుమతి. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు. సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు. టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోస్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ. -
10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం!
సాక్షి, హైదరాబాద్: పేరుకుపోయిన ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ నెల 10వ తేదీ నుంచి వైద్య సేవలను నిలిపివేస్తామని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు భారీగా ఉండటంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలి పాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ నేతృత్వంలోని ప్రతినిధులు ఆరోగ్య శ్రీ సీఈవోకు మెయిల్ ద్వారా లేఖ పంపారు. 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 368 నెట్వర్క్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కింద రాష్ట్రంలో 368 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్యం అందించే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలను కూడా చేర్చారు. ఈ పథకాల కింద చేసే చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.672 కోట్లు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు అధిక ప్రచారంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరిగాయి. రేవంత్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ఇప్పటివరకు రూ.920 కోట్లు చెల్లించింది. ఇందులో పాత బకాయి రూ.672 కోట్లు పోను సుమారు రూ. 250 కోట్లు మాత్రమే కొత్తగా ఈ ఏడాది కాలంలో చెల్లించిందన్న మాట. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 368 ఆసుపత్రులకు కలిపి సుమారు రూ.1000 కోట్లకు పైగా రీయింబర్స్మెంట్ రావలసి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. ఒక్కో ఆసుపత్రికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు గత సంవత్సరం జనవరి బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఆ తేదీ నుంచే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెన్హా అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ స్పష్టం చేశారు. బకాయిలు రూ.500 కోట్లే: అధికారులు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1000 కోట్లు ఉన్నాయన్న వాదనను ఆరోగ్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. రూ.500 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాది కాలంలో రూ.920 కోట్లు చెల్లించామని, డిసెంబర్ చివరి వారంలో కూడా రూ.40 కోట్ల బిల్లులను విడుదల చేశామని చెప్పారు. 2014– 2023 మధ్య ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు సగటున రూ.52 కోట్ల చొప్పున గత సర్కారు చెల్లిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య ప్రతి నెలా నెట్వర్క్ ఆసుపత్రులకు సగటున రూ.72 కోట్లు చొప్పున చెల్లించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. -
సుప్రీం కోర్టుకు ఈ-కార్ రేసు పంచాయితీ!
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్(Search Warrant) తెచ్చుకుంది.ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్(BRS Party) కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
కోటి ఎకరాలకు ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న రైతుభరోసా పథకం మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6 వేల చొప్పున సాగు ‘యోగ్యమైన’భూములకు రైతుభరోసా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించి అందుకు అనుగుణంగా ఆర్థిక లెక్కలు వేసుకుంటోంది. సాగు ‘యోగ్యత’ప్రకారం సగటున రాష్ట్రంలో కోటి ఎకరాలకు రైతుభరోసా పరిమితం అయ్యే అవకాశం ఉంది. రైతుల వద్ద ఉన్న సాగుయోగ్యమైన పట్టా భూములనే పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవం నాటికి పూర్తిస్థాయి లెక్కలుకట్టి ఎకరాకు రూ. 6 వేల చొప్పున యాసంగికి రూ. 5,500 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు అమలు.. రాష్ట్రంలో సాగుచేసే భూములు 1.48 కోట్ల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖల నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇందులో వానాకాలం సీజన్‌ను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో అత్యధికంగా 1.36 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్క జొన్నతోపాటు వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు రికార్డు ఉంది. ఇంతకు మించి ఏ సీజన్లోనూ పంటల విస్తీర్ణం పెరగలేదు. మరో 12 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు మొదలు అన్ని రకాల ఉద్యాన పంటలు సాగవుతుంటాయి. మొత్తం 1.48 కోట్ల ఎకరాల్లోనే ‘పార్ట్–బీ’కేటగిరీ కింద 18 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయానికి పార్ట్–బీని మినహాయించారు. అయినా 1.52 కోట్ల ఎకరాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. అంటే 1.30 కోట్ల ఎకరాల సాగుభూమితోపాటు మరో 22 లక్షల ఎకరాల సాగులో లేని భూమికి కూడా రైతుబంధు లభించింది. రెండు సీజన్లలో రైతుబంధు దక్కిన సాగులో లేని భూమి 97.51 లక్షల ఎకరాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల రైతుబంధు పథకం లెక్కలను మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2023–24 సంవత్సరంలో ప్రభుత్వం రెండు సీజన్లకు కలిపి 97.51 లక్షల ఎకరాల్లోని సాగులో లేని భూమికి రూ. 4,875.62 కోట్లు చెల్లించిందని తెలిపారు. అంటే సగటున ఒక సీజన్‌కు 48.70 లక్షల ఎకరాలకుగాను రూ. 2,438 కోట్లు చెల్లించినట్లు చెప్పడం గమనార్హం. ఇందులో యాసంగి సీజన్లో సాగు చేయని భూముల లెక్కలు కూడా ఉన్నాయి. కొత్త పథకంలో వానాకాలంలో సాగై యాసంగిలో సాగు చేయని భూములకు కూడా రైతుభరోసా ఇవ్వనున్నారు. అయితే రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకొని ‘పార్ట్–బీ’కేటగిరీ భూములతోపాటు రాళ్లు, రప్పులు, కొండలు, గుట్టలు, రోడ్లు, నాలా మార్పిడి తదితర వివాదాస్పద భూములన్నింటినీ తొలగించి రైతుకు సంబంధించిన సాగు చేసే పట్టా భూములనే లెక్కతేల్చి పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనా ప్రకారం కోటి ఎకరాలలోపు భూములనే సాగుయోగ్యమైన పట్టా భూములుగా వ్యవసాయ శాఖ తేలి్చనట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి తుది జాబితాను ప్రభుత్వం రూపొందించనుంది. -
ఫార్ములా ఈ- రేస్ కేసులో మరో ట్విస్ట్
-
అప్పు చేసి రుణమాఫీ చేశాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి,జగిత్యాల జిల్లా: అప్పు చేసి మరీ రెండు లక్షల రుణమాఫీ చేశామని,రైతుభరోసా కూడా రెండు పంటలకు రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారు. సోమవారం(జనవరి 6) జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతు భరోసా రెండు పంటలకు రూ. 12 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏటా రూ.12000 ఆర్థిక భరోసా ఇస్తాం. ప్రతిపక్షాలు విమర్శించడం మానుకుని మంచి చేస్తే హర్షించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తాం. ఏక మొత్తంగా రుణ మాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం రైతులకు రుణ మాఫీ చేయాలనే ఆలోచన కూడా లేదు. బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేక చేతులెత్తేసింది. కేసీఆర్ రుణమాఫీ చేయలేక ఎన్నికల ప్రణాళికలో కూడా రుణమాఫీ అంశాన్ని చేర్చలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే చేయలేదంటారు. చేస్తేనేమో విమర్శిస్తారు.పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారా..వద్దనుకుంటున్నారా..?పంజాబ్ లో 33 నెలల్లో 50 వేల ఉద్యోగాలను గొప్పగా చెప్తున్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో 12 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’అని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: మీరెన్ని కేసులు పెట్టినా భయపడం -
ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. రేసుకు స్పాన్సర్షిప్ చేసిన గ్రీన్కో కంపెనీ నుంచి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్(BRS)కు లబ్ధిచేకూరినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలు చందాలు, ఎన్నికల బాండ్ల రూపంలో వెళ్లినట్లు సమాచారం.ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్కో(Greenko), దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్కు మొత్తం రూ.49 కోట్లు ముట్టాయి. ఇందులో 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య 41 సార్లు రూ.కోటి చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అలాగే.. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఈ కొనుగోలు వ్యహారం నడిచినట్లు తేలింది. ఈ మేరకు ఈ విషయాన్ని తాజాగా ప్రభుత్వం బయటపెట్టింది. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేస్ కేసును అవినీతి కోణంలో తెలంగాణ ఏసీబీ, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.కేటీఆర్ స్పందనబీఆర్ఎస్కు గ్రీన్కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్ స్పందించారు. ‘‘గ్రీన్కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా-ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు వల్ల గ్రీన్కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్షిప్ నుంచి నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?. ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?. అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం. ’’ అని అన్నారాయన. హైదరాబాద్‌లో ఫార్ములాఈ రేస్ నిర్వహణకు సంబంధించి.. యూకేకు చెందిన ఫార్ములా ఈఆపరేషన్స్ (FEO)కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్ శాఖ(MAUD) తరఫున హెచ్ఎండీఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ ఆమోదం పొందకుండానే.. హెచ్ఎండీఏ ఛైర్మన్ అయిన ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండానే.. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లోని ఎఫ్ఈవో ఖాతాకు బ్రిటన్ పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేసిన క్రమంలో ఆదాయపన్ను మినహాయించలేదని.. అందువల్ల ఆదాయపన్ను శాఖకు రూ.8.06 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల వెనక ఏమైనా మతలబులున్నాయేమో తేల్చాలని కోరారు.ఈ ఘటనల్లో అప్పటి మంత్రి, ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ల పాత్ర ఉండటంతో అవినీతి కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అలాగే.. విదేశీ సంస్థకు నిధుల బదిలీ వెనక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది.ఇదీ చదవండి: ఫార్ములా ఈ రేస్.. ఇదో లొట్టపీసు కేసు! -
సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థికసాయం
-
రైతు భరోసాపై కేబినెట్ లో కీలక నిర్ణయం
-
మార్గదర్శి కేసులో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
-
కొత్త ఏడాదిలో 10 లక్షల కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి అధునాతన సాంకేతికత కూడా ఈ అంశాన్ని ప్రభావితం చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఏడాదిలో తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జోరందుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐటీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తెలంగాణలోనే వివిధ రంగాల్లో పది లక్షల మేర సాధారణ ఉద్యోగాల కల్పన సాధ్యమని అంటున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలతో పాటు రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల విభాగం అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని అంటున్నారు. గత ఏడాదిలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.8 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గగా, 2025లో ఇది మరింత తగ్గుతుందని వివిధ నివేదికలు వెల్లడిస్తుండటం గమనార్హం. పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చినట్లు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం ప్రకటించింది. 2023తో పోలిస్తే ఎఫ్‌డీఐల్లో 33 శాతం వృద్ధి నమోదు కాగా, రూ.3,185 కోట్లు అదనంగా వచ్చాయి. 2024లో వచ్చిన ఎఫ్‌డీఐల్లో 93 శాతం అంటే రూ.11,970 కోట్లు హైదరాబాద్‌కు రాగా, రంగారెడ్డి జిల్లాకు రూ.680 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.116 కోట్లు, మెదక్‌కు 96.99 కోట్లు వచ్చాయి. ఇదేవిధంగా ఎఫ్‌డీఐల రాక కొత్త ఏడాది కూడా కొనసాగుతుందని, ఉద్యోగాల కల్పనకు ఇవి కీలకంగా మారతాయని అధికార వర్గాలంటున్నాయి. ఐటీ రంగంలో గడిచిన రెండేళ్లుగా నెలకొన్న మాంద్యం, భారత్‌లో ఎన్నికల వాతావరణం తదితర కారణాలతో ఉద్యోగ నియామకాలకు దూరంగా ఉన్న అమెరికా, ఐరోపా కంపెనీలు ఈ ఏడాది జరిపే నియామకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. జీసీసీలకు కేంద్రంగా తెలంగాణ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటు ద్వారా ఉద్యోగాల కల్పన భారీగా సాధ్యమవుతుందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీసీసీలను ఆకర్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబయి, చెన్నై వంటి దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల కల్పన, మార్కెట్ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల తదితరాల్లో 2030 నాటికి ఈ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్లలో భారత్‌లో ఏర్పాటైన జీసీసీల్లో 30 శాతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 355 జీసీసీలు ఉండగా, సాఫ్ట్వేర్/ఇంటర్నెట్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, సెమికండక్టర్, ఫార్మా స్యూటికల్స్, రిటైల్, మెడికల్ డివైసెస్, టెలీ కమ్యూనికేషన్స్, బీఎఫ్ఎస్ఐ, ఆటోమేటివ్, వృత్తిపరమైన సేవల రంగాల్లో కొత్త జీసీసీల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోనూ ఏర్పాటు చేయాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సరీ్వస్ కంపెనీస్ (నాస్కామ్) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దేశంలోని జీసీసీల్లో పనిచేస్తున్న 19 లక్షల మంది ఉద్యోగుల్లో 12 శాతం మంది తెలంగాణకు చెందిన నిపుణులే ఉండటం గమనార్హం. ఇది వచ్చే రెండేళ్లలో 15 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఎంఎస్ఎంఈలదీ పెద్ద పాత్రే.. ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ద్వారా రాష్ట్రంలో 5.6 లక్షల మంది ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగాల కల్పన 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెప్తున్నారు. -
రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం 75% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. 40% రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు విడుదల చేయలేదు. విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎదురుచూస్తూనే ఉన్నారు. రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు ప్రస్తుతం రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.275 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.175 కోట్లు ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు విడుదలలో జాప్యం జరిగింది. అయితే నెలన్నర క్రితం అప్పటి నిధులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేసిన వెంటనే ఈ నిధిని వినియోగించాలనే నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకుంటే వాటిని కేంద్రం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో తాజా దరఖాస్తుల ప్రక్రియ మరోవైపు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 31తోనే ఈ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందలేదు. దీంతో గడువు పొడిగింపు కోసం సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఉగాదికి సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగా సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీని.. ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఖరీఫ్ (వానాకాలం)లో రైతులు పండించిన సన్న ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి సేకరిస్తున్న ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే మరోసారి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదనంగా 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. పేద, దిగువ మధ్య తరగతికి ఊరట ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుంది. తద్వారా బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రీసైక్లింగ్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. సాధారణ రకం సన్న బియ్యం ధర కిలో రూ.60–65 వరకు ఉండగా.. ఫైన్ రకాల బియ్యం ధర రూ.70కిపైగానే ఉంది. దీనితో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్‌కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపని మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10–20 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్‌మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రేషన్‌పై సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే దానిని వినియోగించుకుంటారని.. బ్లాక్ మార్కెట్ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు ఖర్చేమీ లేకుండానే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు సన్న బియ్యం అన్నం తింటారని, ఇది వారికి భారీ ఊరట అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కార్‌పై మరో రూ.1,500 కోట్ల భారం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. అందులో జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి 54.5 లక్షలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన పథకం కింద మరో ఐదున్నర లక్షల కార్డులున్నాయి. వీరందరికీ కేంద్ర ప్రభుత్వమే ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో కిలో అదనంగా కలిపి ఆరు కిలోల చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరో 35.66 లక్షల ఆహార భద్రత కార్డులపై రాష్ట్ర ఖర్చుతోనే బియ్యం పంపిణీ చేస్తోంది. ఇదంతా దొడ్డు బియ్యం మాత్రమే. అయితే కేంద్రం నేరుగా బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ ద్వారా.. ఈ బియ్యాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 89.6 లక్షల కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేయనుంది. సన్న బియ్యం కోసం కిలోకు రూ.55, ఆపై ఖర్చవుతుందని అంచనా. అంటే కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా సుమారు రూ.3,600 కోట్ల సబ్సిడీని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సన్న బియ్యం పంపిణీతో మరో రూ.1,500 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బియ్యం బాగుంటాయన్న సూచనలతో..సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను కనీసం రెండు మూడు నెలలైనా మాగనిచ్చి మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించడంతో.. రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చర్చించిన అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఉగాది (మార్చి నెలాఖరు) నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం సీరియస్
-
మొదటిసారి గెలవడం ఓకే.. రెండోసారి గెలవడమే గొప్ప
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొలిటికల్ క్లాస్ తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటిసారి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం సరదాగా మాట్లాడుతూ.. తన రాజకీయ అనుభవాన్ని పంచుకున్నారు. ‘ప్రజాప్రతినిధిగా మీరు చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్ అవుతుంటాయి. అన్ని విషయాలను వారు గుర్తుపెట్టుకుంటారు. మొదటిసారి మీపై చాలా అంచనాలతో గెలిపిస్తారు. అది గొప్ప విషయమేమీ కాదు. మీరేంటో తెలిసిన తర్వాత, మీ పనితీరు అర్థం చేసుకున్న తర్వాత రెండోసారి గెలిపిస్తేనే గొప్ప విషయం. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లి వస్తుండాలి. కార్యకర్తలతో మమేకం కావాలి. మీరు ఈజీగా తీసుకుంటే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ప్రజలు ఒకసారి ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత అసలు రాజకీయమంటే ఏంటో అర్థమవుతుంది’అని క్లాస్ తీసుకున్నారు. అక్కడే ఉన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఉద్దేశించి.. ఆయన ఎలా గెలుస్తున్నారో అడిగి తెలుసుకోవాలని సూచించారు. మీరే మాట్లాడండి.. కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. తాను కూడా మరింత పట్టుదలతో పనిచేస్తానని చెప్పారు. ఉదయం నుంచి మంత్రులకు, పార్టీ నేతలకు తానే ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపండి. వీలున్నప్పుడల్లా వారితో మాట్లాడండి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌ను కలుపుకుని ముందుకెళ్లండి. ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి’అని సూచించారు. నా రిపోర్టు నా దగ్గరే ఉంది తన పనితీరుకు 100కి 100 మార్కులు వేసుకోబోనని సీఎం రేవంత్ అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి వచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని, తన రిపోర్టు కూడా తన దగ్గరే ఉందని తెలిపారు. ఈ రిపోర్టులను త్వరలోనే అందరికీ పంపిస్తానని కూడా చెప్పినట్టు తెలిసింది. సీఎంగా అధికారిక బాధ్యతలు అలవాటు అయినందున.. ఇక నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకోవద్దని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలకు స్పష్టంచేసినట్లు తెలిసింది. అంగన్వాడీలు, రేషన్ డీలర్ల నియామకంలో తమకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ఓ మంత్రి కోరిన సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. సీఎం మాటలు స్ఫూర్తినిచ్చాయి: ఎంపీ చామల కిరణ్‌రెడ్డి ప్రజాప్రతినిధి హోదాలో తొలిసారి సీఎం రేవంత్‌ను కలవడం స్ఫూర్తినిచ్చిందని, ఆయన చెప్పిన మాటలు తన బాధ్యతను మరింత పెంచాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌ను ఎప్పుడు కలిసినా ఏదో ఉత్తేజం వస్తుందని, ఈసారి మాత్రం రాజకీయ అనుభవాల గురించి ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. -
ఉత్తరానికి వెళ్లే రైలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. నగర ఉత్తర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు కీలకమైన మెట్రో రైలు కారిడార్లను నిర్మించాలని నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల పొడవుతో రెండు కారిడార్లకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి డీపీఆర్ తయా రు చేయాలని.. మెట్రో రైల్ ఫేజ్–2 ‘బీ’లో భాగంగా ఈ రెండు కారిడార్లను కూడా కేంద్రం అనుమతి కోసం పంపించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. సీఎం బుధవారం ఈ అంశంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఎన్వీఎస్ రెడ్డిలతో చర్చించారు. ప్రతిపాదిత కారిడార్లు ఇవీ.. ప్యారడైజ్ మెట్రోస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్లు కారిడార్ ఉంటుంది. ఇది నిజామాబాద్/ఆదిలాబాద్ వెళ్లే మార్గం (నేషనల్ హైవే నంబర్ 44) వెంట కొనసాగుతుంది. అలాగే జేబీఎస్ (జూబ్లీ బస్‌స్టేషన్) మెట్రోస్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. ఇది కరీంనగర్/రామగుండం వెళ్లే రాజీవ్ రహదారి వెంట కొనసాగుతుంది. ఇప్పటికే ఈ రెండు మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ నిర్ణయించింది కూడా. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, మెట్రో కలసి డబుల్ డెక్కర్ మార్గంగా నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నందున ఆ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, కారిడార్ల రూట్ మ్యాప్‌లపై అవగాహన ఉందని... అయినా రూట్‌మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచనలు, సలహాలను తీసుకోవాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ సూచించారు. మూడు నెలల్లో డీపీఆర్ సీఎం ఆదేశాల మేరకు ఉత్తర ప్రాంతంలోని రెండు మెట్రో కారిడార్లకు సంబంధించి మూడు నెలల్లో డీపీఆర్ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రెండు కారిడార్లను మెట్రో రెండో దశలోని పార్ట్ ‘బీ’లో భాగంగా పరిగణిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్‌కు అనుమతి లభించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామని వెల్లడించారు. వీటి నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు నెలల కిందే రెండోదశ ఆమోదం హైదరాబాద్ మెట్రో రైల్ రెండోదశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్లోనే ఆమోదం తెలిపింది. రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర పార్ట్–ఏ కింద ఐదు కారిడార్ల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశారు. అలాగే పార్ట్–బి కింద శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 40 కిలోమీటర్ల పొడవున ఆరో కారిడార్ నిర్మించనున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన ప్యారడైజ్– మేడ్చల్, జేబీఎస్– శామీర్‌పేట కారిడార్లను కూడా పార్ట్–బిలోనే చేర్చనున్నారు. ఇప్పటికే మూడు కారిడార్లలో నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా అధికారులు చెబుతున్నారు. రెండో దశలోని పార్ట్–ఏ, పార్ట్–బి మార్గాలు కూడా పూర్తయితే... హైదరాబాద్ మెట్రోరైల్ 11 కారిడార్లు, 240.4 కిలోమీటర్లకు చేరుతుంది. ఉత్తర ప్రాంతాలకు ఎంతో మేలు: మంత్రి పొన్నం ప్రభాకర్ శామీర్‌పేట, మేడ్చల్‌లకు రెండు కొత్త మెట్రో కారిడార్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు నగరంలోని ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని గుర్తు చేశారు. ఈ రూట్లలో ఇప్పటికే ఎక్స్‌ప్రెస్ రోడ్లు మంజూరువడం, తాజాగా మెట్రో నిర్మాణం చేపట్టనుండటంతో.. ఈ ప్రాంతాల ప్రజల కష్టాలు తీరుతాయని మంత్రి చెప్పారు. -
సంక్రాంతికే భరోసా!
ఏమిటీ సెల్ఫ్ డిక్లరేషన్?‘అయ్యా.. ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నంబర్ 1లో ఎకరం పొలం ఉంది. నా ఇంటి ఆవరణతో కలిపి 100వ సర్వే నంబర్లో మరో ఎకరం చెలక ఉంది. ఇంటి జాగా 2 గుంటలు పోను మొత్తం ఎకరా 38 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను. దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి’ రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన ‘సెల్ఫ్ డిక్లరేషన్ ’ నమూనా ఇది. సాక్షి, హైదరాబాద్: ‘రైతుభరోసా’ అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో ‘రైతు భరోసా’ను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పథకం మార్గదర్శకాలపై చర్చించింది. తాజాగా రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు అందేది. ఇలాఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమిని లెక్కగట్టనున్నారు. అలాగే వ్యవసాయాధికారి ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను సరిపోల్చుకున్న తర్వాతే పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయడంతో పాటు తాను ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నాననే విషయాన్ని ప్రకటించేలా చూడటం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లకుండా రైతు సాగు చేసిన భూమికే కచ్చితంగా పెట్టుబడి సాయం అందుతుందని భావిస్తోంది. సాగు విస్తీర్ణంలో కచ్చితత్వం కోసమే అంటున్న సర్కారు రైతు అందించే సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల ఒక గ్రామంలో ఉన్న పట్టా భూమి ఎంత? అందులో సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలియడమే కాకుండా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు కూడా కచ్చితంగా తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్లో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణం లెక్కల్లో కచ్చితత్వం ఉండడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఈ యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు కాగా, రైతులు ఏకంగా 79.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఇందులో వరి 63.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 7.18 లక్షల ఎకరాల్లో సాగవుతుందంటూ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఇప్పుడు రైతు భరోసాకు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన వల్ల ఈ పంటలకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం ఉందని, అలాగే ఏ పంటల లోటు ఎంత ఉందో తెలుసుకుని తదనుగుణంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందుతుందనే నిబంధన వల్ల..గతంలో పునాసలో మాత్రమే సాగు చేసే రైతు యాసంగిలో కూడా తప్పకుండా ఏదో ఒక పంట పండించేందుకు ఆసక్తి చూపుతారని, తద్వారా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఎంత పెద్ద రైతుకైనా భరోసా ఖాయం! రైతు భరోసా కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిని ఎంతకు పరిమితం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 2 లేదా 3వ తేదీన ఉపసంఘం మరోసారి సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అనే అంశాన్ని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఎంత పెద్ద రైతైనా నిరీ్ణత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాలు పైనున్న భూ యజమానికి పెట్టుబడి సాయం అందని విషయం విదితమే. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉప సంఘం 3వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేస్తే 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.