
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో(Governor Budget Speech) కొత్త విషయాలేవీ లేవని.. మరోసారి అబద్ధాలే చెప్పించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) గరం అయ్యారు. బుధవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
గత 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలను అంగీకరిస్తారేమోనని అసెంబ్లీకి వచ్చాం. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదు. గాంధీ భవన్ ప్రెస్‌మీట్‌లా ఉంది. రైతు సమస్యలతో పాటు దేనని ప్రస్తావించలేదు. గవర్నర్‌తో అన్నీ అబద్ధాలే చెప్పించారు. తద్వారా గవర్నర్ హోదాను దిగజార్చింది ఈ ప్రభుత్వం.
రాష్ట్రంలో 400 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు బాధ పడుతున్నారు. కానీ, రైతు సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదు. సాగునీటి తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటిదాకా 30 శాతం మించి రుణమాఫీ జరగలేదు. సాగు నీటి సంక్షోభం నెలకొన్నది. కేసీఆర్(KCR)పై కోపంతో మేడిగడ్డకు మరమత్తులు చేయించడం లేదు. 20% కమిషన్ కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది..
.. గురుకులాల్లో అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అప్పులు చేశారంటూ గుండె బాదుకున్న సన్నాసులు.. ఏడాదిలోనే 1లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు. ఈ అంశం గవర్నరు ప్రసంగం లో లేదు. ఏడాదిలోనే వరి ధాన్యం పండించామని దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకున్నారు. సిగ్గులేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. గ్రామాలకు వెళ్తే తరిమి కొడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment