breaking news
KTR
-
కేటీఆర్ అరెస్టు.. ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను హకీంపేట వద్ద పోలీసులు అరెస్టు చేసి బోయిన్పల్లి పీఎస్‌కు తరలించడంతో బోయిన్‌పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బోయిన్పల్లి పోలీసు స్టేషన్‌కు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేటీఆర్‌ను బోయిన్‌పల్లికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌లు పెద్ద సంఖ్యలో అనుచరులతో పీఎస్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్‌ను పోలీసు స్టేషన్‌లోపలికి తీసుకెళ్లకుండా వాహనాలకు అడ్డుపడ్డారు.సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ నుంచి నేరుగా బోయిన్పల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఇంతలోనే స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడటంతోపాటు వారిని పోలీసు స్టేషన్ ఆవరణ నుంచి తరిమేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కేటీఆర్‌ను సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. చివరకు ఆయనను సొంతపూచీకత్తుపై విడుదల చేయగా, అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావుపై క్రిమినల్ కేసు సాక్షి, హైదరాబాద్: శాసనసభ గేట్ నంబర్–3 వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనభాపక్ష ఉప నేత టి.హరీశ్‌రావు సహా 14 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారు.పోలీసులపై తోపులాట, దాడి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైఫాబాద్ పోలీసులకు ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. వీరిలో ఎవరిపాత్ర ఏమిటో తేల్చ డానికి వివిధ వీడియోలు, ఫొటోలు అధ్యయనం చేస్తున్నారు. గేట్–3 వద్ద జరిగిన మొత్తం ఘటన వీడియో ఫుటేజీలో నమోదై ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.సీసీ కెమెరా దృశ్యాలు, అసలు వీడియో రి కార్డింగుల ఆధారాలను సేకరించి ప్రతి ఒక్కరి పాత్ర ను నిర్ధారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు డి.సు«దీర్‌రెడ్డి, గంగుల, పాడి కౌశిక్‌రెడ్డి, జి.జగదీశ్వర్‌రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ, సబిత, సంజయ్, విజయు డు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్ కుమార్‌రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.ఇవి కూడా చదవండి: తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి -
కేటీఆర్,హరీష్ రావు విడుదల.. సీఎం రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ గుండాలను కేసీఆర్ ఇంటి మీదకు పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బోయిన్పల్లి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేల మీద హేయంగా దాడి చేశారని అందరి కంటే ముందు చావు వచ్చేది కాంగ్రెస్ పార్టీకేనని 600కు పైగా హామీలిచ్చి వెయ్యిరోజులైనా ఇంకా వాటిని నేరవేర్చలేదని..స్కూటీలు ఇస్తానని లూటీలు చేశారని రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. దశాబ్దాల తెలంగాణ కలను కేసీఆర్ నెరవేర్చారని ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టారని కొనియాడారు. అనంతరం జవహర్ నగర్ పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్ రావు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ చేసే దమనకాండను రాష్ట్ర ప్రజలంగా గమనిస్తున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో హెడ్ లైన్స్ మారుతాయి కానీ ప్రజల జీవితాలు మారవని చెప్పారు. హరీష్ రావు మాట్లాడుతూ.."తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించారు. యూరియా యాప్‌లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నయాపైసా ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. సబితక్క గొంతు మీద మగ పోలీసు చేయి వేసి నొక్కారు అసెంబ్లీ గౌరవ సభను రేవంత్ కౌరవసభగా మార్చారు." అన్నారు. కాగా ఈ రోజు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.ఏం జరిగింది?కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో యాదాద్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ని బోయన్ పల్లి, హరీష్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. కాసేపటి క్రితమే వారిద్దరిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరు మీడియా ఎదుట మాట్లాడారు. ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్, హరీష్ -
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!
-
కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే అగ్నిగుండమే : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఏం జరిగినా పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందన్న ఆయన.. పోలీసులే దగ్గరుండి కాంగ్రెస్ గుండాలని పంపుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇంటి ముట్టికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో యాదాద్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. -
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల అరెస్ట్ పరిణామంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ చేశారు. ‘మేము సిద్ధం.. మీరు సిద్ధమా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.హైకోర్టు నిన్న స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్‌రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలానే…— KTR (@KTRBRS) September 8, 2026 ఇదీ చదవండి: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: సాక్షితో తాతా మధు -
గొంతులు నొక్కారు.. చీరలు లాగారు..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటన అత్యంత హేయమని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని, చీరలు పట్టుకుని లాగారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి ఆరోపించారు. మహిళల పట్ల ముఖ్యమంత్రికి గౌరవం లేదని విమర్శించారు.పోలీసుల ముసుగులో కొందరు గూండాల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నేతలకు రక్షణ లేకుండా పోయిందని, ఇది అసెంబ్లీనా?.. రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన గొంతు, జుట్టు పట్టుకుని లాగారని, సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ అడ్డుకోకుంటే తమను కిందపడేసి పోలీసులు తొక్కేవారని అన్నారు.ప్రశ్నిస్తే గొంతు పిసికే పరిస్థితిప్రశ్నిస్తే గొంతు పట్టుకుని పిసికే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని సబిత విమర్శించారు. జరిగిన ఘటనను మహిళా మంత్రి సీతక్క ఖండించాల్సింది పోయి డ్రామాగా పేర్కొనడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అహంకారం పెరిగిపోయిందని, ఘటనపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవికి సీఎం రాజీనామా చేయాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, మహిళా ఎమ్మెల్యేలమని చూడకుండా పోలీసులు గొంతులు నొక్కారని కంట తడిపెట్టారు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతోందన్నారు. తమ టీషర్టులపై ముఖ్యమంత్రి మాట్లాడే బూతు భాష లేదని, కేవలం హామీల అమలు కోరుతూ నినాదాలున్నాయని కోవా లక్ష్మి తెలిపారు. పోలీసులు కేటీఆర్ గొంతు పట్టుకుని లాగారని, హరీశ్‌రావు చొక్కా చించారని, జగదీశ్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు.ఇవి కూడా చదవండి: దాడికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత -
దాడికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ‘ఆడ బిడ్డల చీరలు లాగి.. గొంతులు పట్టి.. జుట్టు లాగుతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన?..’ అని నిలదీశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సభలోకి రాకుండా పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ భయపడుతోంది..తప్పు చేయకుంటే ప్రజా సమస్యలను ఎజెండాలో పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో తమకూ ఉందని అన్నారు. ‘రాహుల్‌గాంధీ నల్ల టీ షర్టు వేసుకుని, నినాదాలు చేస్తూ పార్లమెంట్‌కు వెళ్తే అడ్డుకోరు.. మేం అదే చేస్తే పోలీసులు అడ్డుకుంటారా?..’ అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి గతంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారంటీ అని చెప్పారని, ఇప్పుడు తమ నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.గతంలో మేం క్షమాపణ చెప్పాం..సీఎం కూడా ఎమ్మెల్యేనే అని, స్పీకర్ పక్షపాత వైఖరి వీడి అందరికీ సమాన నిబంధనలు వర్తింపజేయాలని కేటీఆర్ కోరారు. తమ ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదిస్తూ అసలు దాడి ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో డీకే అరుణకు మనస్తాపం కలిగినప్పుడు కేసీఆర్ ఆదేశాలతో తాము క్షమాపణ చెప్పామని, అదే తమ సంస్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని, మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు, సీఎం క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.దళితులపై రేవంత్ కపట ప్రేమదళితులపై రేవంత్‌రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దళిత బంధును ఎత్తివేసి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు, అసైన్డ్ భూములకు పట్టాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటా వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తమ ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.జగదీశ్‌రెడ్డికి పరామర్శనిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని కేటీఆర్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన క్షేమ సమాచారాన్ని కేటీఆర్ వైద్యులనడిగి తెలుసుకున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. -
మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
-
‘ఇది తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానం’
హైదరాబాద్: తాము నిరసన తెలిపే క్రమంలో పోలీసుల బలగం అత్యంత దుర్మార్గంగా వ్యహరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారని మండిపడ్డారు. ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారన్నారు. పోలీసు చర్యలతో సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారన్నారు.ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 7వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది శాసన సభ కాదు.. దుశ్శాసన సభ. లోక్‌సభకు రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని వెళ్తున్నారు. మేం టీ షర్ట్లు వేసుకుంటే తప్పేంటి.. ఏ రూల్ ప్రకారం అడ్డుకుంటున్నారు. పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ డిసైడ్ చేయడానికి డీసీపీ ఎవరు?, మహిళా నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా హక్కు. స్పీకర్ వివక్ష చూపడం తగదు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ అనడం ఏంటి?, ప్రజలపై చేసే దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలపై సభలో నిలదీస్తాం. ఈ రోజు జరిగిన ఘటనకు బాధ్యుడు సీఎం రేవంత్. సీఎం రేవంత్ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి ఇవాళ అవమానం జరిగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఈ రోజు జరిగిన ఘటనపై హైకోర్టుకు వెళ్లాం. ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్‌కు కూడా వెళ్తాం. బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై మమ్మల్ని అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు.ఇదీ చదవండి:నల్లదుస్తులతో వస్తే తప్పేంటి?: సబిత ఫైర్ -
తెలంగాణ అసెంబ్లీ : బీఆర్ఎస్ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)
-
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్‌లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్‌కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్‌ను ఆయన తన బ్రాండ్‌గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్‌లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్‌తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్‌ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్షంపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. సోమవారం ఉదయం నల్ల టీషర్లుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ దుస్తులతో అనుమతించబోమని చెప్పారు. అయితే తమను లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో మెయిన్‌గేట్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నేల మీద పడుకుని పలువురు నేతలు నిరసన తెలిపారు. తన టీ షర్ట్ తీసేసి.. ఇప్పుడైనా అనుమతించాలని హరీశ్‌రావు కోరారు. అయినా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో వాగ్వాదం కాస్త.. తోపులాటగా మారింది. పోలీసులు నెట్టేయడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు కిందపడిపోయారు. కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026ఈ క్రమంలో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ బట్టి నెట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గాయాలయ్యాయి. కేటీఆర్ ముఖం, చేతులకు దెబ్బలు తగిలాయి. తన చీర లాగారంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టగా.. సబిత ఓదార్చారు. ఆపై హరీష్‌రావు, కేటీఆర్ సహా పలువురు నేతల్ని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డినలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులుకౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026అసెంబ్లీ వద్ద తమకు అవమానం జరిగిందని.. పోలీసులు తమతో ప్రవర్తించిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.స్పీకర్ చెబితేనే: డీసీపీ శిల్పవల్లిఅసెంబ్లీ గేటు వద్ద పరిణామాలపై స్థానిక డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల దుస్తులతో లోపలికి అనుమతించొద్దని స్పీకర్ ఆదేశించారని.. అందుకే అడ్డుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణల్లో నిజం లేదని.. తామేం అమర్యాదగా నడుచుకోలేదన్నారు. అలాగే.. వద్దని చెబుతున్నా బలవంతంగా నిరసనలకు దిగడంతోనే అదుపులోకి తీసుకున్నామని వివరించారు.ఇదీ చదవండి: ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి -
మళ్లీ బీఆర్ఎస్ సునామీ!
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం. –కేసీఆర్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా మళ్లీ బీఆర్ఎస్ సునామీ రాబోతోందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్ అయింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరికి బీఫాం ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంది. అలా అని పార్టీ నేతలు, కార్యకర్తలు రిలాక్స్ కావొద్దు. ప్రజల్లో ఉంటూ నిరంతరం పోరాడాలి..’ అని చెప్పారు. సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో.. అసెంబ్లీ, మండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. థర్డ్‌క్లాస్ పాలన..రైజింగ్ కాదు డౌన్‌ఫాల్ ‘కాంగ్రెస్‌ది థర్డ్‌క్లాస్ పాలన. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్‌ఫాల్ వైపు వెళ్లింది. కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని అర్థమైంది. అందుకే ఆ పార్టీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్‌ఫాల్ వైపు వెళ్లింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని అధికార పక్షం బూతు కూతలకు వేదికగా మార్చింది. పాలన చేతకాక చిల్లర మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా ప్రజల గొంతును ఉభయ సభల్లో బలంగా వినిపించే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంది. ప్రజల జెండానే బీఆర్ఎస్ ఎజెండాగా ఉండాలి., ప్రతి చర్చలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా పాల్గొనాలి. శాసనమండలి కూడా పాత భవనంలోకి వచ్చిన నేపథ్యంలో రెండు సభల్లో పార్టీ సభ్యులు మరింత సమన్వయంతో వ్యవహరించాలి..’ అని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ చెప్పినా కాళేశ్వరంపై నిర్లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టులను వినియోగించుకోవచ్చని కోవచ్చని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మేడిగడ్డ వద్ద అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టులను వినియోగంలోకి తెస్తే దాదాపు 13 జిల్లాల రైతాంగానికి ప్రయోజనం కలుగుతుంది. అయినా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా తెలంగాణ పంటలకు విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 90 శాతం పూర్తి చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి అంశాలపై అవసరమైతే ఉభయ సభలను స్తంభింపజేయాలి. వీటి విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం..’ అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలపై సర్కారును నిలదీయాలి ‘పేద విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీనిపై విద్యార్థుల తరఫున అసెంబ్లీ వేదికగా గళం విప్పాలి. పాలిటెక్నిక్ విద్యను దెబ్బతీసేలా జీవో 97 తీసుకొచ్చిన ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలి. ఎన్నికలకు ముందు లక్షలాది ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎందుకు విఫలమైందో నిలదీయాలి. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే ప్రయత్నాలు, గురుకులాల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థులు, బాలికల మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పేలా చేయాలి. పేదలు, మధ్యతరగతి ప్రజల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి అత్యవసర పరిస్థితుల్లోనూ విక్రయించుకోలేని పరిస్థితి కల్పించడంపైనా పోరాడాలి. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.. మిషన్ భగీరథ వ్యవస్థను నిర్వీర్యం చేసి తాగునీటి సమస్యను తీవ్రతరం చేశారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు ఉచిత విద్యుత్‌కు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు వెనుక కుట్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్ వంటి బకాయిలు చెల్లించకపోవడం, పీఆర్సీ పెండింగ్, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం, సింగరేణిలో అవినీతి, ప్రభుత్వ భూముల విక్రయాలు, మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం, గోదావరి–కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై ఉభయ సభల్లో ప్రశ్నించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, మహిళలపై దాడులు పెరగడం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వంటి అంశాలపైనా కాంగ్రెస్‌ను ఎండగట్టాలి..’ అని కేసీఅర్ స్పష్టం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు, హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేకపోయిన ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా నాయకత్వం, కార్యకర్తలను అభినందించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను కేసీఆర్ కోరగా.. ప్రస్తుత సభ గౌరవ సభగా కాకుండా ‘కౌరవ సభ’గా మారిందని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
మోదీని వణికించిన యువతకు రేవంత్ ఓ లెక్కా?
కరీంనగర్/సిరిసిల్ల: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్నే వణికించిన యువతకు తెలంగాణ సీఎం ఓ లెక్క కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరీంనగర్లో శనివారం నిర్వహించిన ‘యువ సమరభేరి’ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఉడుకు నెత్తు రు ఉరకలెత్తితే పోరాటం పోటెత్తుతుందని, యువతతో పెట్టుకుంటే పెద్దపెద్ద వాళ్లే దిగిపోయారన్నారు. కష్టపడి సాధించుకు న్న తెలంగాణను పదేళ్లపాటు అభివృద్ధి పథంలో నడిపించా మని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, యూత్ కమిషన్, ప్రైవేటు కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్, యువతకు రూ.10లక్షల రుణాలు, రూ.4వేల నిరు ద్యోగభృతి, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో జాబ్ కేలండర్ లేదని, స్కాం కేలండర్ నడుస్తోందని విమర్శించారు. నోటిఫికేషన్ లేకపోయినా లూటిఫికేషన్ కొనసాగుతోందన్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెయ్యి రోజులైనా హామీలను అమలు చేయలేని రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ రాజీనామా చేయాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అశోక్‌నగర్‌లో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్‌గాంధీ.. ఓట్లు వేయించుకున్న తర్వాత తెలంగాణకు అడ్రస్ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దండం పెట్టి ఓట్లు వేసిన ఉద్యోగులే కాంగ్రెస్‌కు పిండం పెడతారన్నారు. జీవో 97 రద్దు చేసే వరకు పోరాడతాం రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల భూములు, ఆస్తులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన జీవో 97ను రద్దు చేసే వరకు బీఆర్ఎస్ విద్యార్థుల వెంట ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్ కాలేజీలో 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసిన కేటీఆర్ వారి సమస్యలు తెలుసుకుని మాట్లాడారు. హైదరాబాద్‌లోని మాసబ్ట్యాంక్తోపాటు సిరిసిల్ల, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాల్లో విలువైన భూముల్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలేమయ్యాయి? కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడంపైనే దృష్టి పెట్టిందని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్–ఐపాస్ తీసుకొచ్చామన్నారు. సుమారు 6.50 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని వివరించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు వివిధ దశల్లో ఆర్థిక సాయం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. కేటీఆర్ కారుకు ప్రమాదం కరీంనగర్ జిల్లా పర్యటనలో కేటీఆర్ ప్రయాణిస్తున్న కారుకు అలుగునూర్ వద్ద లారీ తగిలింది. ప్రమాదం జరిగిన సమయంలో కేటీఆర్ కారులోనే ఉన్నారు. లారీ ఢీకొనడంతో కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం కేటీఆర్ తన పర్యటనను కొనసాగించారు. సమరభేరి సభలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
తమ్ముడూ.. మీ ఇంటికొస్తా!
పెనుబల్లి: ‘తమ్ముడూ భయపడకు.. నేనున్నా, మీ ఇంటికి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తా’అంటూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాలుడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు. కేటీఆర్‌ను చూడాలనేది తన కోరికగా వెల్లడించిన బాలుడిని వీడియోకాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడించగా ఆయన ధైర్యం చెప్పారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన బన్నే వెంకటేశ్వర్లు – దేవి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు మణికంఠ ఉన్నాడు. ఐదేళ్ల క్రితం మణికంఠ కింద పడగా కాలికి గాయమైంది. కొన్నాళ్లకు మానిపోయినా ఏడాది క్రితం అదే కాలికి వాపు రావడంతో హైదరాబాద్ తీసుకెళ్తే బోన్ కేన్సర్‌గా నిర్ధారించారు. రూ.లక్షలు వెచ్చించి చికిత్స చేయించినా తగ్గకపోగా కేన్సర్ చివరి స్టేజీలో ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు మణికంఠను వెంటిలేటర్ మీదే ఇంటికి తీసుకొచ్చారు. చికిత్సకోసం రోజుకు రూ.10 వేలు వెచ్చిస్తున్నారు. మణికంఠ తన చివరి కోరికగా కేటీఆర్‌ను చూడాలని బంధువులతో చెప్పుకున్నాడు. ఈ విషయం తెలియడంతో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం బాలుడిని వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ‘నీకేం కాదు.. మీ కుటుంబానికి అండగా ఉంటాం. తప్పకుండా వచ్చి నిన్ను కలుస్తా’అని ధైర్యం చెబుతూ ఓదార్చారు. -
‘రాహుల్ ఎక్కడున్నావు.. హైదరాబాద్‌కు ఎందుకు రావు’
సాక్షి, కరీంనగర్: ఒక్కరిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వమే బర్తరఫ్ కానుందంటూ రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ యువ సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘రాహుల్ గాంధీ, ఎక్కడున్నావు.. హైదరాబాద్‌కు ఎందుకు రావు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.రేవంత్‌రెడ్డి రెన్యూవల్ సీఎం.. జాబ్ క్యాలెండర్.. చిత్తు కాగితం కంటే హీనమని తేలిపోయింది. వెయ్యి రోజులయ్యాయి. యూత్ డిక్లరేషన్ గురించి అడిగితే బూతులు వినిపిస్తున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వాటాలు, కమీషన్ల కోసం తన్నుకుంటున్నారు. వీళ్లకు తిక్క ఉంది.. కానీ లెక్కలేదు. నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లు మాత్రం జరుగుతున్నాయి. నిరుద్యోగులు నిప్పు కణికలే మండాలి.. మళ్లీ పుడతామా ఏంటి?’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.కేసీఆర్ రాజీనామా చేయాలా?. ధోకేబాజ్ రేవంత్ చేయాలా?. కేసీఆర్‌తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫోర్ ట్వంటీ హామీలిచ్చిన మీరే 420 సార్లు హామీలు చేయాలి. మంత్రులు, ముఖ్యమంత్రి కొట్లాడుకుంటున్నారు. మీకు దండం పెట్టినోళ్లే.. రేపు పిండాలు పెడతారు. రాహుల్ గాంధీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. అవుతల పడ్డాడు. సీల్డ్ కవర్లో పంపిన మీ సీఎం ఏం చేస్తుండో నీకు సోయి ఉందా రాహూల్ ?. నెలకోసారి మూటలు తీసుకుని రాహూల్ గాంధీ నోరు మూసుకుని కూర్చుంటుండు’’ అంటూ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. -
రైతుల కోసం పాదయాత్ర చేస్తా: కేటీఆర్
నల్లగొండ: గతంలో నీళ్ల కోసం కోదాడ నుంచి హాలియా వరకూ కేసీఆర్ పాదయాత్ర చేశారని, ఇప్పుడు వినాయక చవిత లోపల నీటి షెడ్యూల్‌ను విడుదల చేయకపోతే అదే కోదాద నుంచి హాలియా వరకూ తాను పాద్రయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో రైతులు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఇప్పటివరకూ వెయ్యి రోజుల పడకల పాము పాలన చూశామని విమర్శించారు కేటీఆర్ఈరోజు(గురువారం, సెప్టెంబర్3వ తేదీ) నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ మేరకు కేటీఆర్ మాట్లాడుతూ.. మిర్యాలగూడలో రైతు ధర్నాను అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ‘పచ్చని పొలాలతో ఉన్న మిర్యాలగూడ ప్రాంతంలో రైతు మహా ధర్నా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలి. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ ఇచ్చిన హామీ ఏమైంది?, రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా రూ. 15 వేలు ఏమైంది?, రైతు బంధు, రైతు బీమా ఎగ్గొట్టింది ఎవరు?, పంటలకు నీళ్లు ఇవ్వమంటే బీఆర్ఎస్ వాళ్ల రక్తం చల్లుతానని రేవంత్ అంటున్నారు. సాగర్‌లో నీళ్లు ఉన్నా పంటలకు నీళ్లు ఇవ్వాలనే సోయి జిల్లాలో ఉన్న మంత్రులకు లేదు. ఉత్తమ్ నీళ్ల మంత్రి కాదు. రైతుల కళ్లలో నీళ్లు నింపుతున్న మంత్రి. ఎంతటి కరువు పరిస్థితి ఉన్నా గతంలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం. నీకు ఓట్లేయడమే ఎడమ కాలువ రైతులు చేసిన తప్పా. ఓటేసిన పాపానికి రైతాంగానికి అన్యాయం చేస్తోంది. రైతులకు యూరియా కూడా దొరకడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి:రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం -
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకొనే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కు రాజీనామాలు కొత్త కాదని.. ఆయన రాజీనామాతోనే ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు గుర్తుచేశారు. కేసీఆర్ లేకపోతే రేవంత్‌కు సీఎం పదవి ఉండేది కాదన్నారు. కేసీఆర్‌ను రాజీనామా చేయాలనే నైతిక అర్హత రేవంత్‌కు లేదన్నారు. కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్‌రెడ్డి లాంటి అర్భకుడికి తట్టుకొనే శక్తి ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మురికి మాటలు వినేందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ కచ్చితంగా తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తారన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఇతర నేతలతో కలిసి తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ 23 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం.. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో ప్రజలకు నరకం చూపించిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదని.. వెయ్యి రోజుల శని పాలన, ప్రజాపీడన అని విమర్శించారు. ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ లేదా పచ్చ కాంగ్రెస్ పాలన కనిపించడం లేదని.. లుచ్చా కాంగ్రెస్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. సంపాదన కోసం సీఎం, మంత్రుల కొట్లాట ఎంగిలి విస్తరాకుల వద్ద కుక్కలు కొట్టుకున్నట్టుగా రాష్ట్ర సంపద కోసం సీఎం, మంత్రులు కొట్లాడుకుంటున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్ స్థాయిలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తూ తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలను గురుదక్షిణగా అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి నష్టం చేసేలా ఉంది. ఎస్ఎల్బీసీ కూలిపోయినా, చెక్ డ్యామ్‌లు దెబ్బతిన్నా కేంద్ర సంస్థలు, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది. రూ. 50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. యూరియా అడిగిన రైతులపై లాఠీచార్జి చేయడం, నీళ్లు అడిగితే తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. రైతు సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ఎంపీల కొడుకులపై యాక్సిడెంట్ల కేసుల నమోదులో వివక్ష ‘హైదరాబాద్‌లో పట్టపగలే హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మంత్రుల కుమారులు దౌర్జన్యాలకు పాల్పడినా, ఇతర పారీ్టల ఎంపీల కుమారులు ప్రమాదాలకు కారణమైనా కేసులు నమోదు చేయడంలో పోలీసులు వివక్ష చూపుతున్నారు. బొల్లారం మిలిటరీ స్థావరంపైనే దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ విద్యను అనుసంధానం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పగించిన రాష్ట్రాన్ని కుప్పకూల్చారు: హరీశ్‌రావు కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించిన తెలంగాణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూల్చుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ‘కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చింది. తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం, శాంతిభద్రతల వంటి రంగాల్లో గతంలో తెలంగాణ దేశా>నికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందితే ఇప్పుడు కరెంట్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మందులు కూడా దొరకని స్థితికి చేరింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్లపై హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే చార్జిషీట్ విడుదల చేశాం. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ప్రకటించిన పోరాటాన్ని ప్రజల పోరాటాన్ని కొనసాగిస్తాం’అని హరీశ్‌రావు ప్రకటించారు. -
కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని.. అప్పుల భారం ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మేమే చెల్లిస్తున్నాం. సర్పంచ్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం. వెయ్యి రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు.‘‘ఎన్నికల్లో చెప్పిన మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కాలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ మేల్కొవడం లేదు. కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అభూత కల్పనలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. త్వరలో మూడు లక్షల పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. 2014-2018లో ఎన్నికల మ్యానిఫెస్టో లో పోడు భూముల సమస్య తీరుస్తామన్నారు.. తీర్చారా? బీఆర్ఎస్ పాలనలో ఆరాచకాలు మర్చిపోయి వంద రోజుల పాలన అంటూ విమర్శలు చేస్తారా?.’’ అంటూ పొంగులేటి మండిపడ్డారు.హరీష్‌రావుకు పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. పొడుగు మనిషి 22ఏపై అసెంబ్లీలో ఇరగదీస్తా అంటుండు.. ఎం చేస్తాడో నేను చూస్తా. పక్కా పేపర్ ఆధారాలతో నేను అసెంబ్లీ లోనే సమాధానం చెప్తా.. 22ఏ అడ్డం పెట్టుకుని దందా చేస్తానంటే ఇక నడువదు. ధరణి పేరుతో పక్కరాష్ట్ర రాజులకు భూములను హరీష్ రావు కట్టబెట్టారు. కవిత ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి’ అంటూ పొంగులేటి నిలదీశారు. -
సర్కార్ పై గులాబీ సమరం
-
ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచింది: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ తీరు తెన్నులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ దళితులను దగా చేసిందని ఆరోపించారు. తెలంగాణకు పీడ దినాలు పట్టి 1000 రోజులు అయ్యిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల చేసిన కేటీఆర్ మాట్లాడుతూ పలు సమస్యలతో రైతులు ధాన్యం కుప్పల మీద చనిపోతున్నారని, నీళ్లు అడిగితే తెలంగాణ సీంఎం రక్తం పారిస్తున్నారన్నారు. ఈ వెయ్యి రోజుల్లో ఎంతో మంది రైతులు చనిపోయారు. రైతు బీమాను కూడా తెలంగాణ ప్రభత్వం రద్దు చేసింది. రేవంత్ అన్నదాతల జేబులు కొట్టి రాహుల్ జేబు నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంపై కక్ష రైతులకు శిక్షగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రశ్నించిన ఇంజినీర్లను బెల్టుతో కొడతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.జాబులు అడిగితే లాఠీలతో కొడుతున్నారు. ఉద్యోగాలు అడిగితే బావిలో దూకమంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్.. చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. చదువురాని వ్యక్తి చేతుల్లో విద్యాశాఖ ఉందన్నారు. విద్యాసంస్థల భూములను కూడా గుంజుకున్నారు. విద్యావ్యవస్థను సీఎం భ్రష్టు పట్టిస్తున్నారు. హెచ్‌సీయూ భూముల మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అడిగిన కాలేజీలను బెదిరిస్తున్నారు.ఇప్పుడున్నది లుచ్చా కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు. వైఎస్ఆర్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌ను తాము కొనసాగించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ అంటున్నారు. పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎప్పుడు పెంచుతారని కేటీఆర్ ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లపై ప్రభుత్వం పిటిషన్లు వేయించిందని ఆరోపించారు. పథకాలు లేవు కానీ మూసీకి కోట్ల నిధులు ఖర్చు చేస్తామని చెబుతున్నారన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో దళిత, గిరిజనులకు అన్యాయం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన కాంగ్రెస్ పాలన అని ఎద్దేవా చేశారు. కమిషన్లు, పర్సంటీజీల పాలన కాంగ్రెస్ పాలన అని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి. హామీలు అమలు కాక ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో పట్టపగలే దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయి. మెట్రో విస్తరణను గాలికొదిలేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. పాక్సో నిందితులను ప్రభుత్వం కాపాడుతోంది. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. తనకు హిట్లర్ ఆదర్శం అని రేవంత్ అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో స్కామ్‌ల జాతర సాగుతోంది. వీళ్ల అవినీతి భరించలేక ఓ ఐఎఎస్ కూడా పాడిపోయారని కేటీఆర్ అన్నారు. ప్రతి పనిలోనూ కుంభకోణానికి పాల్పడుతున్నారు. వాటాల కోసం మంత్రులు కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని రేవంత్ అంటున్నారు. కేసీఆర్‌కు రాజీనామాలు కొత్తకాదు. కేసీఆర్ రాజీనామా చేస్తేనే కదా రాష్ట్రం వచ్చింది అని కేటీఆర్ అన్నారు కేసీఆర్ అనే నాయకుడు లేకుంటే..రేవంత్‌కు సీఎం పదవి వచ్చేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్.. అధికార పార్టీపై పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అసెంబ్లీ వేదికగా, ప్రజా సమస్యలపై సాగించిన పోరాటాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ కార్యాచరణను ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు ఏడు రోజుల కార్యాచరణను రూపొందించింది. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ‘చార్జ్‌షీట్’ విడుదల చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలు తీరును ఇందులో ప్రధానంగా ఎత్తిచూపనుంది. కేవలం చార్జ్‌షీట్ విడుదలతో సరిపెట్టకుండా.. ఏ హామీ ఎంత మేర అమలైంది, ఏది అమలు కాలేదు, ప్రజలకు ఎంత నష్టం జరిగిందన్న అంశాలను వివరిస్తూ ‘బాకీ కార్డులు’రూపొందించి ఇంటింటికీ పంపిణీ చేయాలని పార్టీ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల పాలన వైఫల్యాలని ప్రతీ గడపకూ తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం రచించింది. చార్జ్‌షీట్ నుంచి బహిరంగ సభ వరకు..! రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయి ఆందోళనల్లో ప్రధానంగా ప్రస్తావించనుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీరు, ఎరువుల సమస్యలతోపాటు ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నిరసనలు నిర్వహిస్తూ స్థానిక సమస్యలను కూడా ఈ ఉద్యమంలో భాగం చేయాలని పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో ఏడు రోజుల ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో ఏదో ఒకచోట భారీ బహిరంగ సభ నిర్వహించే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. వివిధ అంశాలపై వివిధ సందర్భాల్లో చేసిన పోరాటాలను ఒక సమగ్ర రాజకీయ ఉద్యమంగా మలచాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకోసం కేటీఆర్ పార్టీ నేతలతో పలుమార్లు టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి కార్యాచరణను వివరించారు. బాకీ కార్డుల ద్వారా ఇంటింటికీ, చార్జ్‌షీట్ ద్వారా ప్రజా చర్చలోకి, నిరసనల ద్వారా క్షేత్రస్థాయిలోకి, బహిరంగ సభ ద్వారా రాష్ట్రస్థాయికి తీసుకెళ్లాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. -
సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు. బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.మంత్రుల సంతాపంసూర్యాపేట బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. పోస్టుమార్టం కోసం రెండు బృందాల ఏర్పాటు చేయాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు త్వరగా అప్పగించాలని సూచించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి తెలిపారు.ప్రభుత్వం ఆదుకోవాలిసూర్యాపేట రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఊహించని ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.చదవండి: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదంఘటనా స్థలంలో కలెక్టర్కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పరామర్శించారు. డ్రైవర్ మారిన మరుక్షణమే.. తాను డ్యూటీ మారిన తర్వాతనే ప్రమాదం జరిగిందని రెండో డ్రైవర్ మీడియాతో చెప్పారు. సూర్యాపేటలో తాను డ్రైవింగ్‌ను మరో డ్రైవర్‌కు అప్పగించి, పడుకున్నానని వెల్లడించారు. తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం సంభవించిందని తెలిపారు. బస్సులో 42 మంది ఉన్నారని చెప్పారు.కొద్దిలో బతికిపోయావెనుక సీటులో కూర్చోవడం వల్ల ప్రమాదం నుంచి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డానని ఓ ప్రయాణికుడు తెలిపారు. రాఖీ పండుగ కోసం చెల్లెలు దగ్గరికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డానని చెప్పారు. ఇనుప రాడ్ తన ముఖం వరకు వచ్చి ఆగడంతో బతికిపోయానని వెల్లడించారు. బస్సు సూర్యాపేటలో ఆగి.. మళ్లీ స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు. -
కాంగ్రెస్ దగాపై సమరభేరి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరభేరికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వేయి రోజులు పూర్తయినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. బాకీ కార్డులతో హామీల వైఫల్యం రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువత తదితర వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ‘బాకీ కార్డుల’రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆయా వర్గాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పేరుకుపోయిన బకాయిల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం హామీలు అమలు కాలేదనే అంశానికే పరిమితం కాకుండా, 1,000 రోజుల పాలనలో ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎదుర్కొన్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వార్డు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. కొత్త తరానికి చేరువయ్యేలా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించి వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు సహా అన్ని స్థాయిల నాయకులు వారం రోజుల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. -
రాహుల్‌గాంధీ ద్వంద్వ నీతిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ప్రశ్నిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నట్లు రాహుల్‌గాంధీ నాటకాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝళిపిస్తూ, వారిని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కేలా దాడులకు పాల్పడుతున్నా రాహుల్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థుల హక్కులు అణచివేస్తున్నా రాహుల్ స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో జరిగిన లాఠీచార్జ్‌ను కూడా ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేయాలని కేటీఆర్ కోరారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకతీతంగా నిలబడతారా.. లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయాలని, లేకపోతే విద్యార్థుల పట్ల ఆయనది కపట ప్రేమగానే ప్రజలు భావించాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి అంశంపై హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి, మంత్రుల కేసుల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీగా చెల్లించే ప్రభుత్వం.. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన ఈ పథకాన్ని కాపాడేందుకు ఎందుకు కౌంటర్ వేయలేదని నిలదీశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడారు.తులం బంగారం హామీ ఏమైంది?కేసీఆర్ ప్రభుత్వం 2014లో ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర సాయం అందించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నికల్లో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ హామీని అమలు చేయాల్సి వస్తుందనే భయంతోనే పథకాన్ని రద్దు చేసేందుకు చూస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కుట్రను అడ్డుకునేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, వార్డులో ‘కల్యాణలక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? తులం బంగారం ఎప్పుడు ఇస్తారు?’అంటూ కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీసేలా ప్రచారం నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. -
అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలు కొత్త పథకాల జాడే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వ తీసుకవచ్చిన కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతుభీమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన ఈ రోజు (శనివారం) మీడియా సమావేశం నిర్వహించారు. దేశానికే అన్నం పెట్టిన తెలంగాణను ఈ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. తెలంగాణ మళ్లీ పట్టాలెక్కాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎనుముల హబ్స్.. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ లాభాలు: కేటీఆర్ సెటైర్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూ కేటాయింపుల అంశం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ భూముల కేటాయింపులు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపణలకు దిగింది. అయితే ఈ ఆరోపణలతో కూడిన ఓ వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.టీ-హబ్‌ను నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం నిర్మించాం. కానీ రేవంత్ రెడ్డి ‘ఎనుముల హబ్స్’ను రూపొందిస్తున్నారు. కుటుంబ ఆధారిత, కుటుంబ ప్రయోజనాల కోసం నడిచే వ్యవస్థ అంటూ ఘాటు విమర్శలు చేశారు.“జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో.. వందల కోట్ల లాభాలు?”కేటీఆర్ తన వ్యాఖ్యల్లో ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి అత్యంత తక్కువ ధరకు విలువైన ప్రభుత్వ భూమి కేటాయించారంటూ ఆరోపణలు చేశారు. “జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో డిఫెన్స్ కంపెనీ నిర్మించి, రాత్రికి రాత్రే రూ.200 కోట్ల లాభాలు సాధించిన ఆవిష్కర్తగా అనుముల కొండల్ రెడ్డిని గుర్తించాలి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.అలాగే మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ యువతకు ప్రభుత్వ భూములు ఎలా పొందాలో ఈ “మ్యాజిక్ ట్రిక్” నేర్పించాలని ఎద్దేవా చేశారు.While we built T-Hub to ensure that real startups’ thrive, Revanth Reddy is busy devising “Anumula Hubs” - family-run, family-driven, zero-innovation, zero-employee scam…err scheme.!If you are one of the Anumula brothers, you get land allotted for dirt cheap. No questions… https://t.co/jZjt65VZvm— KTR (@KTRBRS) August 12, 2026బీఆర్ఎస్ తన ప్రచారంలో దీనిని “ఎనుముల బ్రదర్స్ రూ.200 కోట్ల భారీ భూ స్కాం”గా అభివర్ణించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కుటుంబానికి చెందిన వారికి విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భూ కేటాయింపుల అంశం మరోసారి రాజకీయ పోరుకు కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
సీఎం తమ్ముడి కంపెనీకి రూ. 200 కోట్ల భూమి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక్క ఉద్యోగి కూడా లేని, కేవలం రూ.లక్ష పెయిడ్ అప్ మూలధనం ఉన్న కంపెనీకి ఇంత విలువైన భూమిని ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలోని అతిపెద్ద భూకేటాయింపు అక్రమాల్లో ఒకటిగా అనుమానిస్తున్నామని చెప్పారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే లోకాయుక్త, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క ఉద్యోగి లేని సంస్థకు ఐదెకరాలా?‘టెస్సరాక్ట్ చైర్మన్ తానేనంటూ సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తమ సంస్థ పనిచేస్తున్నట్టు పేర్కొంటూ కొండల్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ కూడా పాల్గొన్నారు. టెస్సరాక్ట్ చైర్మన్ హోదాలోనే యూఎస్ భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్‌రెడ్డి చేరినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టెస్సరాక్ట్ కంపెనీ వెబ్సైట్లో ఫోన్ నంబర్ 123456789గా పేర్కొంటూ, 2025 మార్చి 31 నాటికి ఉద్యోగుల సంఖ్య సున్నాగా పేర్కొన్నారు. పటాన్‌చెరులోని ఓ చిన్న ఫ్లాట్‌ను టెస్సరాక్ట్ చిరునామాగా చూపుతున్నారు. గజానికి సుమారు రూ.3,700 చొప్పున ఐదు ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీలో రూ.7 కోట్లకు కేటాయించింది. రూ.200 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కేటాయించడం కుంభకోణం కాదా. టెస్సరాక్ట్‌కు, కొండల్‌రెడ్డికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం విడ్డూరం. అమెరికాలో ఉన్న సీఎం మరో సోదరుడు జగదీశ్‌రెడ్డికి చెందిన స్వచ్ఛ్ బయో సంస్థతో సుమారు రూ.1,000 కోట్ల ఎంఓయూను అమెరికా పర్యటన సందర్భంగా రేవంత్ కుదుర్చుకున్నాడు. మంత్రి శ్రీధర్‌బాబు శాఖలోనే ఈ నిర్ణయాలు జరిగితే ఆయనకు సమాచారం లేదా. టెస్సరాక్ట్‌కు భూ కేటాయింపు వ్యవహారంపై చివరి వరకు పోరాడతాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే జల ఉద్యమం‘కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరుతోంది. ఇదే విషయాన్ని ఈ నెల 18న జరిగే గోదావరినది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఎజెండాలో చేర్చడం సరికాదు. ఎజెండాలో ఈ అంశాలను తొలగించకుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని బహిష్కరించాలి. లేదంటే జల ఉద్యమం చేపట్టి, అవసరమైతే జీఆర్ఎంబీ సమావేశం జరిగే జలసౌధను ముట్టడిస్తాం. సీఎం యాగాలు చేయడాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ నీటిని ఒడిసి పట్టే పనులు చేయకుండా యాగాలు చేయడాన్నే మేము ప్రశ్నిస్తున్నాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే కేటీఆర్ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ‘దోపిడీ చేసింది మీరా, మేమా? మీ పాలనలో లీజు భూములను క్రమబద్ధీకరించారు. అప్పుడు తప్పనిపించలేదా?’అని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. సీఎం సోదరులకు భూకేటాయింపులు చేశారంటూ కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీధర్‌బాబు మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ‘ఎవరో చెబితే పనిచేసే రకం కాదు నేను. నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయమూ నాకు తెలుసు’అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 90 లక్షలకు ఎకరం ఇస్తే తాము రూ. కోటిన్నరకు ఇచ్చామని తెలిపారు. బోర్డు నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదన్నారు. 32 దరఖాస్తుల్లో టెస్సరాక్ట్ కంపెనీ ఒకటని వివరించారు. ఏ కంపెనీ ప్రారంభంలో అయినా పెట్టుబడి తక్కువ ఉంటుందని వెల్లడించారు. టెస్సరాక్ట్ కంపెనీకి, సీఎం సోదరులకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి.. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. 5 ఎకరాల్లో రూ. 34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీని రూ.200 కోట్ల కంపెనీ అని కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముడుపులు తీసుకొనే కంపెనీలకు భూములిచ్చారా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వం తక్కువ ధరకు భూములు ఎందుకు ఇచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెస్సరాక్ట్‌కు నిబంధనల ప్రకారమే భూకేటాయింపులు జరిగాయని.. దీనిపై ప్రతిపక్షాలు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పత్రికల్లో రాస్తారని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హిడెన్ ఎజెండాతోనే.. పీఎం ఏక్తా మాల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయని మంత్రి శ్రీధర్‌బాబు మరోసారి స్పష్టం చేశారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం మాల్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రూ. 200 కోట్ల రుణం తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపారు. ప్రీ బిడ్డింగ్‌లో ఏడుగురు బిల్డర్లు పాల్గొంటే ఇద్దరిని ఎంపిక చేశారని వివరించారు. పీఏం ఏక్తా మాల్ నిర్మాణంలో ప్రభుత్వంపై భారం లేకుండా లాభం జరుగుతుందని చెప్పారు. పరిశ్రమలు రావొ ద్దనే హిడెన్ ఎజెండాతో కేటీఆర్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్కు మళ్లీ అధికారం కల..నిరుపయోగంగా ఉన్న క్రమబద్దీకరించిన భూములను హిల్ట్–పీ ద్వారా బదలాయింపునకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కలేనన్నారు. ఆ పారీ్టపై కక్షతో ముందుకెళ్లే ఉద్దేశం ఉంటే కేటీఆర్ సహా ఇతరులంతా ఎక్కడో ఉండేవాళ్లని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రెండున్నరేళ్లుగా దుష్ప్రచారం చేస్తున్నా, భయపెట్టినా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. -
ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..?
-
‘రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. సీఎం సోదరులు ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘సీఎం సోదరుల వ్యవహరశైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో సీఎం రేవంత్ సోదరులకు ప్రత్యేక రూల్స్ ఎందుకు?. సీఎం రేవంత్‌రెడ్డి దోపిడీని ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. చదువు రాని రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లుతో కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ లేరు.. ఆ కంపెనీకి వేల కోట్ల భూములు కేటాయింపు. 200 కోట్ల విలువ చేసే స్థలాన్ని 7 వేల కోట్లకి కేటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆ కంపెనీకి కొండల్ రెడ్డికి సంబంధం లేదని ఎలా చెబుతారు?..మీ శాఖలో ఏం జరుగుతుందో శ్రీధర్ బాబుకి తెలియదా? లేక సీఎం ఒత్తిడికి తలొగ్గరా? కొండల్ రెడ్డికి సంబంధం లేకుంటే యూఎస్ కౌన్సిల్ మీటింగ్‌కి ఎలా వెళ్ళారు. ఈ భూ కేటాయింపులను వదలం. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం. 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనేది ఆందోళనకరం. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాంఅర్హుల ఓట్లు కోల్పోకుండా చూస్తాం. తెలంగాణణకి అన్యాయం చేసే జీఆర్ఎంబీ మీటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా? లేదా స్పష్టం చేయాలి. జలసౌధాలో జరిగే జీఆర్ఎంబీ ఎజెండా మార్చుకుంటే జలసౌధను ముట్టడిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర చెప్పినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
కేసీఆర్ వస్తారు.. మెడికల్ కాలేజీకి ‘పెద్ది’ పేరు పెడతారు
సాక్షి, వరంగల్/నర్సంపేట: తెలంగాణ ఉద్యమ బిడ్డ పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉద్యమ గడ్డ ఘనమైన గౌరవం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పెద్ది ఆశయాల మేరకు నర్సంపేటను అభివృద్ధి చేస్తామన్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది దశదిన కర్మ సందర్భంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన నివాళులర్పించారు.పెద్ది అంతిమయాత్రకు కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓరుగల్లు మొత్తం కదిలివచ్చిందని, 12 గంటలపాటు లక్షలాది మంది తరలిరావడం ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టకపోయినా తెలంగాణ ఉద్యమంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజానాయకుడని కొనియాడారు.చివరి రోజుల్లోనూ దేవాదుల నీటి కోసం, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసేందుకు పెద్ది తపించారని గుర్తుచేసుకున్నారు. కరోనా, ఆర్థిక సంక్షోభ సమయంలోనూ నర్సంపేటలో ఇంటింటికీ పైపులైన్ గ్యాస్ అందించారని, రైతుల కోసం రూ.100 కోట్ల ప్రత్యేక ప్రాజెక్టును సాధించారని తెలిపారు. పెద్ది భార్య స్వప్న, వారి పిల్లలు, కుటుంబసభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకున్నా: హరీశ్పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకపోతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఉద్యమ సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో డీసీఎం పైనుంచి కిందపడిపోయిన నన్ను.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. అదే ఆస్పత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అంటూ హరీశ్ కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులు లెక్కచేయకుండా పెద్ది పోరాడారన్నారు. మానుకోట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉపఎన్నికల్లో ఆయన పోరాట స్ఫూర్తి మరువలేనిదన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ, రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లు సాధించడంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ సభలో పార్టీ ముఖ్యనేతలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.ఉద్రిక్తత మధ్య విగ్రహావిష్కరణపెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ట తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. స్థానిక మెడికల్ కాలేజీ సమీపంలో విగ్రహం పెట్టాలని నిర్ణయించగా సంబంధిత నిర్మాణాన్ని ఆదివారం రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో సోమవారం ఉదయం పలువురు నాయకులు ఆందోళనకు దిగారు. కూల్చిన ప్రదేశంలోనే మళ్లీ గద్దె నిర్మించగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
‘సీఎంకి భూమి అంటే రియల్ ఎస్టేట్ తప్ప మరేం లేదు’
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం ముల్లు గర్రతో పొడిస్తే తప్ప ప్రభుత్వం బాద్యతలు నిర్వహించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకి భూమి అంటే రియల్ ఎస్టేట్ తప్ప మరేం లేదని విమర్శించారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో మా హరీష్‌రావు జీఆర్ఎంబీ ఎజెండాపై ప్రశ్నించారు. కన్నేపల్లికి నేను వెళ్లి లక్ష క్యూసెక్కులు పోతున్నాయని చెప్పా. క్షద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షద్ర రాజకీయాలు చేస్తున్నారు. కరెంట్ ఉండి నేడు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో కరెంట్ సరఫరా సరిగా ఉండటం లేదు. యాగాలు చేస్తే తప్పు లేదు... కేసీఆర్ యాగాలు చేశారు’ అని పేర్కొన్నారు. త్వరలో అన్ని ఆధారాలతో వివరాలు బయటపెడతారంగారెడ్డి జిల్లాలో భారీ భూకుంభకోణం జరుగుతోంది. త్వరలో ఆధారాలతో సహా వివరాలు బయటపెడతా. రైతులు, కంపెనీ మధ్య సీఎం, పొంగులేటి జోక్యం చేసుకున్నారు. ఎకరానికి రూ. 10 కోట్లు వరకూ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. కానీ ఎకరానికి రూ. 5 కోట్ల లోపే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. త్వరలో సర్వే నంబర్లతో సహా అన్ని బయటపెడతా’ అని హెచ్చరించారు. -
రేవంత్ మాటలే బీఆర్ఎస్కు ఆయుధాలు!
తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పెనుగులాట ఆసక్తికరంగా ఉంది. మూడో పక్షం బీజేపీ అధికార సాధన లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటివరకైతే ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో పట్టు నిలబెట్టుకోవడంతో పాటు,ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో హైడ్రా ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం అయిన భూముల అమ్మకం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ ను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించినా అందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లుగా కనిపిస్తుంది. ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందన్నది చర్చగా ఉంది. ప్రభుత్వంపై కాని, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాని ఆరోపణలు వస్తున్న తీరు రేవంత్ కు చికాకు కలుగుతుండవచ్చు. ఇక బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ఆధారపడి రాజకీయాలను నడుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం జనంలో తిరగకుండా, వెనుక ఉండి పార్టీని నడుపుతున్నారు. ఫేసెస్ ఆఫ్ ద పార్టీగా కేటీఆర్, హరీష్ రావులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ఆందోళనలకు సన్నద్దమవుతున్నారు. రేవంత్ ప్రసంగాలలో ఏ మాత్రం తప్పులు దొర్లినా వెంటనే అందుకుని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేటీఆర్, హరీష్ రావు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ప్రభుత్వపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు.ఈ క్రమంలో కొన్నిసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల దుమారం హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం ఇంజనీర్లందరిని కించపరచడం కాకపోవచ్చు. ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కోల్పోతోందని చెప్పాలన్నది ఆయన భావన. అందులో కొంత నిజం ఉంది. కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల సుమారు 60 కాలేజీలు మూతపడ్డాయట. లెక్చరర్లు మంచి విద్య అందించాలని చెప్పడం తప్పు కాదు. కాని అసలు ఆ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని అనడం విమర్శలకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఒక్కోసారి కొన్ని వ్యాఖ్యలు చేసి ఇబ్బందులలో పడుతున్నారు. హైడ్రాను సమర్ధించడానికి హిట్లర్‌తో పోల్చుకోవడం, ఇరాన్ యుద్ద విధ్వంసాన్ని ప్రస్తావించడం వంటివి చేశారు. ఇప్పుడేమో ఇంజనీరింగ్ విద్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ రంగంలో అయినా కొన్ని ప్రమాణ లోపాలు ఉండవచ్చు. కాని అంతమాత్రాన దానిని క్రిమినల్ వేస్ట్ అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. అలాగైతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలను ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది కదా! ఇంజనీరింగ్ విద్యను లక్షలాది మంది చదువుకున్నారు కాబట్టే దేశంలోకాని, ఇతర దేశాలలో కాని మనవాళ్లు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారన్న సంగతిని గ్రహించాలి. రేవంత్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోవడానికిబీఆర్ఎస్ నేతలు అన్ని వ్యూహాలు అమలు చేశారు. తెలంగాణలోని యువతను అవమానించే రీతిలో రేవంత్ మాట్లాడారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్లికేషన్ రాయలేని స్థితిలో ఇంజనీర్లు ఉన్నారంటున్న రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్ ను పూర్తి చయగలరా అని సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీనే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు . ఆ తర్వాత రేవంత్ పై కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు.రేవంత్ ఇంజీనిరింగ్ విద్యను వేస్ట్ అనడాన్ని ఎవరూ సమర్దించరు. అలాగే కేటీఆర్ కూడా రేవంత్ ను అదే మాట అనడం కరెక్టు కాదని చెప్పాలి. తమను వ్యక్తిగతంగా అటాక్ చేస్తే తామూ అదే చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కొంత హద్దులు మీరి ఇరువైపులా విమర్శలు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంజీనర్లకు మద్దతు ఇస్తూ రాకెట్ పంపుతున్నవారిని అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఆయన మండిపడ్డారు. జెన్ జి, కాక్రోచ్ ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఈ రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ ఉన్నా, తెలంగాణకు వచ్చేసరికి అదికారంలో అదే పార్టీ ఉండడంతోబీఆర్ఎస్ ఆ అవకాశాన్ని వాడుకుంది. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులతో సంగ్రామ్ పేరుతో ఒక భారీ సభను నిర్వహించారు. ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడాన్ని తన నోట్ లో తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జీషీట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం యువతను ఆకర్షిస్తే తమకు అధికారం రావడం ఖాయమనిబీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్న తరుణంలో రేవంత్ వ్యాఖ్య వారికి అందివచ్చినట్లయిందనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో రేవంత్ కోర్టు ఆదేశాలను పాటించడానికి ఇష్టపడడం లేదని అర్దం అవుతుంది. రంగనాధ్ ను బదిలీ చేయాలని హైకోర్టు సూచించినా ,అది ప్రభుత్వ విచక్షణాధికారమన్న భావనలో రేవంత్ ఉన్నారనుకోవాలి. అదే టైమ్ లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల అమ్మకం ద్వారా అరవైవేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు దీనిని వాడవచ్చన్నది ప్రభుత్వ వర్గాల భావన. అయితే ఈ భూములను అమ్మడానికి అవకాశం లేదన్నది విపక్షం వాదనగా ఉంది. గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి ఉండడం, ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేకపోవడం, మెట్రో రైలు రుణం వ్యవహారం మొదటికి రావడం ఇలా అనేక సమస్యలు ఉన్న తరుణంలో నిజంగానే ఈ భూములను అమ్మే అవకాశం వస్తే అది ప్రభుత్వానికి జాక్ పాట్ అవుతుంది.కాని మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి.ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను చెల్లించవలసిన సుమారు 400 కోట్లకు పైగా రుణాన్ని తీర్చివేశారట.ఇది ఎలా సాధ్యమైందని,దానిపై విచారణ చేయించగలరా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లూటింగ్ ఏజెంట్లుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఆయా శాఖలలో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఇవన్ని ఒక చక్రబంధం వంటివి. వీటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు పోవాలని అదికార కాంగ్రెస్ యత్నిస్తుంది. కాని ఆ చక్రబంధంతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికిబీఆర్ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ఎవరిది పై చేయి అవుతుందో కాలమే తేల్చుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్‌రెడ్డే క్రిమినల్ వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, చదువుకున్న యువతను ‘క్రిమినల్ వేస్ట్’గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొనడం అత్యంత అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న లక్షలాది మంది యువతను అవమానించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. నిజంగా క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉంటే 89 కేసులు ఎదుర్కొంటున్న రేవంత్‌రెడ్డేనని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన అసలైన క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి కలిసి ఇచ్చిన గ్యారంటీలు, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశారని విమర్శించారు. కనీసం తన ఎన్నికల అఫిడవిట్‌ను అయినా స్వయంగా నింపే సామర్థ్యం రేవంత్‌కు ఉందా? అని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి బాధ్యత నుంచి వెంటనే తప్పుకోవాలని, రాహుల్‌గాంధీతో కలిసి తెలంగాణ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవ¯న్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేణు సూసైడ్ లేఖ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పట్టే చార్జిషీట్ లాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగాల హామీ అమలు కాకపోవడం వల్లే తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వేణు తన లేఖలో పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని అన్నారు. అయితే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించి యువతకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేశారు. లేకుంటే యువతకు జరిగిన ద్రోహంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున గట్టిగా ప్రశ్నిస్తామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీరు ఎలా వస్తోందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. గాయత్రి, మేడారం పంపింగ్ వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన రాయదుర్గం–ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇటీవల దివంగతుడైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపైనా కేసులు పెట్టారని మండిపడ్డారు. పౌర సరఫరాలు, విద్యాశాఖ అవినీతి అంశాలను బయటపెట్టి ఈడీ, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. -
‘18 గంటల సీఎం’ ఏం సాధించారు?
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ‘18 గంటలు పని చేశానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సాధించింది ఏముంది? కేవలం సర్వే నంబర్లు చూస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదు’అని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి పాలనలో కేవలం మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప, మిగిలిన అన్ని రంగాలు వెనక్కి వెళ్ళిపోయాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి గురించి మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సైతం తన పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇదే సమయంలో పోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా తప్పించేందుకు, సీఎం రేవంత్ రెడ్డి బంధువు అయిన శరత్ రెడ్డికి వాటాలు ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించారు’ అని ఆరోపించారు.‘మాక్స్ బీన్’ కంపెనీ నుంచి మెడికవర్ ఆసుపత్రికి నిధులు మళ్లించారని, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా పోరాడటం వల్లే పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లేకపోతే అతనికి బెయిల్ వచ్చేంత వరకు మెడికవర్ ఆసుపత్రిలోనే దాచిపెట్టేవారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తాము గమనిస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి లెక్కలు బయటకు తీస్తామని కేటీఆర్ హెచ్చరించారు. -
రాహుల్ గాంధీ మాట తప్పారు జాబ్ రాక విద్యార్థి సూసైడ్ నోట్
-
వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం.. ఆ తర్వాత నట్టేట ముంచటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య ఘటన ఆవేవన కలిగించిందన్న ఆయన.. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ యువతను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కానీ, ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లుగా జాబ్‌క్యాలెండర్ ఇవ్వలేదు. తెలంగాణ యువత.. ప్రత్యేకించి నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో వేణు అనే యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వేణు తన లేఖలో రాశాడు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని కూడా గుర్తు చేశాడు. వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ రాశాడు. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల 42 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. హైదరాబాద్‌లో 142 ఫ్లైఓవర్లు నిర్మించిందెవరు? సచివాలయం కట్టించింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో చివర 48 వేల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చాం.రేవంత్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానవతా దృక్ఫతం లేకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు. విద్యార్థుల విలువ సీఎం రేవంత్‌కు ఏం తెలుసు?. అసలు నిరుద్యోగులకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయి. 7 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకిచ్చారు?. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చింది. అశోక్ నగర్లో సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువ లేదు. ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రాహుల్ పట్టించుకోరా? ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులపై దాడులు జరిగితే వెళ్తున్న ఆయన.. అసలు హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదు?. తెలంగాణ వైపు చూసే దమ్మే ఆయనకు లేదా?కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటోంది. రాహుల్, రేవంత్ తెలంగాణ యువతను మోసం చేశారు. వాళ్లు ఇద్దరు ప్రకటించిన డిక్లరేషన్లు, కార్డులు క్రిమినల్ వేస్ట్. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడం క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. వేణు సూసైడ్‌కు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫారాలు నింపడం రాదని రేవంత్ అన్నారు. ఆ మాటలకు మేం బాధపడ్డాం. అసలు ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఫారం నింపడం వచ్చా?. ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణాలు తెలుసు.. కాంగ్రెస్‌కు ఎలా సమాధి కట్టాలో తెలుసు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మళ్లీ పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా.. ముందు ఆ హామీని నెరవేర్చండి. యువత సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రండి అని కేటీఆర్ రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు. -
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అంటారా?.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయమై రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, ఇంజినీర్లను "క్రిమినల్ వేస్ట్" అనడం ఏంటని దేశ అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్న ఇంజినీర్లను అవమానించడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి చేత క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీదేనని కేటీఆర్ స్పష్టం చేశారు.కేటీఆర్ మాట్లాడుతూ.. "ఒకవేళ రాహుల్ మౌనం వహించడం అంటే రేవంత్ వ్యాఖ్యలను సమర్థించినట్లే విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ విద్యార్థులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత కాంగ్రెస్ హామీల మోసాన్ని గుర్తుంచుకుంటుంది రేవంత్ వెంటనే విద్యార్థులు, గురువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
మీడియాపై కొన్ని పార్టీల కక్ష
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. పత్రికలు వాస్తవాలు రాస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు మీడియాపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ ఏ ప్రభుత్వానికీ ఇచ్చిన వరం కాదు. అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రభుత్వాలు, అధికారాలు శాశ్వతం కాదు. రాజ్యాంగమే శాశ్వతం. మీడియా ప్రభుత్వాల మంచి పనులను ప్రజలకు తెలియజేయడంతోపాటు తప్పులను ఎత్తిచూపే బాధ్యత కూడా నిర్వర్తించాలి. ప్రస్తుతం దేశంలో మీడియా స్వేచ్ఛ హరించబడుతోంది. ప్రశి్నస్తే దేశద్రోహిగా ముద్ర వేయడం, మీడియాపై ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతున్నాయి.ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ 11వ వార్షికోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, పత్రికా సంపాదకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ మీడియా సంస్థలు కార్పొరేట్ గుప్పిట్లోకి వెళితే నిజాలు మరుగునపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, దేశంలో విభిన్న అభిప్రాయాలను అణచివేసే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పిస్తూ అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలను మీడియా ఎత్తిచూపాలని, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. వార్తను వార్తగా రాసే పరిస్థితి లేకుండా పోయిందని, నిజాలను నిర్భయంగా చెప్పేవారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో యువత చేపట్టిన ఆందోళనలు కొత్త తరానికి సమాజంపై ఉన్న నిబద్ధతను చాటాయని, ఆ ఉద్యమాలు తమకు కొత్త దారిని చూపించాయని చెప్పారు.కేంద్రమంత్రి తనయుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల ఘటన, హెచ్‌సీయూ భూముల వ్యవహారం వంటి అంశాలకు ప్రధాన మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నవారు ముందుగా హేట్ స్పీచ్‌ను మానేయాలని, ఆ తర్వాతే హేట్ స్పీచ్‌పై చట్టాలు తీసుకురావాలని సూచించారు. జాన్‌వెస్లీ, కూనంనేని మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు అండగా నిలవాలని కోరారు. దోపిడీదారుల నుంచి పేదలకు మేలు జరిగేలా చూడాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానం సరికాదని చెప్పారు. అధికారంలోకి వచి్చన తర్వాత రాజకీయ నేతల్లో మీడియాపై అసహసం పెరిగిపోతుందన్నారు. -
కేటీఆర్ విచారణలో కొత్త మలుపు.. ₹55 కోట్ల చెల్లింపులపై ఏసీబీ ప్రశ్నలు..!
-
ఏసీబీ కోర్టు: లక్ష పూచీకత్తు సమర్పించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఇవాళ్టి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ముగిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) విచారణ కోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు సమర్పించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తే రాజకీయ కక్షతో నేరంగా చిత్రీకరిస్తున్నారని కేటీఆర్ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు వచ్చే నెల(ఆగస్టు) 25కి వాయిదా వేసింది.ఐదుగురిపై అభియోగాలుఈ కేసులో కేటీఆర్ సహా ఐదుగురిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థ ప్రతినిధి అల్బెర్టోకు సైతం కోర్టు సమన్లు జారీ చేసింది. మే 14న ఏసీబీ కోర్టు ఛార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించింది.అనుమతులు లేకుండానే.. ఏసీబీ ఛార్జ్‌షీట్ ప్రకారం.. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు పొందకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. కేబినెట్, ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లారని పేర్కొంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై సంతకం జరిగేలా కేటీఆర్ వ్యవహరించారని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారని, ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్ల భారం పడిందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది.ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలుఫార్ములా ఈ రేసు కోసం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఏసీబీ ఆరోపించింది. క్విడ్‌ప్రోకో అంశంతో పాటు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని కూడా ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. బీఆర్ఎస్కు వచ్చిన రూ.44 కోట్ల విరాళాల అంశాన్ని కూడా ఏసీబీ తన అభియోగాల్లో పేర్కొన్నట్లు సమాచారం. రాజకీయంగా ప్రాధాన్యంఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదొక లొట్ట పీసు కేసు అని అభివర్ణించారు. ఎలాంటి అవినీతి జరగలేదని.. ఎలాంటి రహస్య ఒప్పందాలు, లావాదేవీలు లేవని చెప్పారాయన. ఇప్పుడు.. నాంపల్లి కోర్టు విచారణ నేపథ్యంలో కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. -
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
హైడరాబాద్: యువ ఇంజనీర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యువ ఇంజనీర్లను అవమానించే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. యువ ఇంజనీర్లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం: హరీష్ఉద్యోగులకు సీఎం రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ, డీఏ హామీలు ఏమయ్యాని ఆయన నిలదీశారు. ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందన్నారు హరీష్‌రావు. -
హిమాన్షుకు సర్జరీ.. AIG ఆస్పత్రికి కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు రావుకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం శస్త్రచికిత్స జరిగింది. ఈ నెల 6వ తేదీన జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కిందపడటంతో హిమాన్షు ముక్కుకు గాయమైంది. అప్పట్లో వైద్యులు వైద్య సేవలు అందించి పంపినప్పటికీ, భవిష్యత్తులో శ్వాసపరంగా లేదా ఇతరత్రా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సర్జరీ అవసరమని నిపుణులు సూచించారు.వైద్యుల సలహా మేరకు హిమాన్షు తాజాగా ఆసుపత్రిలో చేరగా, వైద్య బృందం నేడు ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. సర్జరీ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న తన మనవడు హిమాన్షును పరామర్శించారు. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని, సర్జరీ తర్వాతి రికవరీని అక్కడి సీనియర్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఆసుపత్రిలోనే ఉండి వైద్యులతో మాట్లాడారు. వైద్యుల పర్యవేక్షణలో హిమాన్షు మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని, తాను వేగంగా కోలుకుంటున్నానని సోషల్ మీడియాలో తెలిపారు. -
ఫార్ములా ఈ-రేస్ కేసు.. రేపు కోర్టుకు కేటీఆర్ హాజరు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేటీఆర్ హాజరు అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
ఆపదలో ఆదుకున్నది కేటీఆర్ అన్న మాత్రమే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టకాలంలో తమకు అండగా నిలిచి, దేవుడిలా ఆదుకున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రమేనని నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులు తమను కేవలం వాడుకున్నారే తప్ప ఎలాంటి సాయం యలేదని మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ గోపాల్ కుటుంబ సభ్యులు మాట్లాడూతూ... ‘మమ్మల్ని అందరూ రాజకీయంగా వాడుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మా వద్దకు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోయారే తప్ప సహాయం చేయలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మా పక్క ఊరికి (రెండు కిలోమీటర్ల దూరంలోకి) వచ్చినా కనీసం పరామర్శించలేదు. మీకు రూ. 20 కోట్లు ఇప్పిస్తా’ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ, రూపాయి సాయం చేయలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారి పీఏలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. బండి సంజయ్ విజయసంకల్ప యాత్ర చేసిన సమయంలో కూడా మమ్మల్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదని తెలిపారు.కుటుంబ సభ్యుడిలా అండగానిలిచిన కేటీఆర్ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కేటీఆర్ అన్న స్వయంగా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూశారు. ‘నేను మీ ఇంట్లో పెద్ద అన్నలాంటివాడిని, ఆస్పత్రి ఖర్చులు, ఆర్థికసాయం ఏది కావాలన్నా నేను చూసుకుంటా’ అని ధైర్యం చెప్పారని తెలిపారు. ‘చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పరామర్శించిన ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమే అని, కల్వకుంట్ల కవిత అక్క కూడా మాతో మాట్లాడి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ కుటుంబానికి కష్ట సమయంలో నిజమైన అండగా నిలిచింది కేటీఆర్ మాత్రమేనని, అందుకే తాము ఎప్పటికీ ఆయననే నమ్ముతామని స్పష్టం చేశారు. మాట్లాడిన వారిలో గోపాల్ భార్య గంధం లావణ్య, తల్లి బాలవ్వ, కూతుళ్లు అక్షిత, నిఖిత, కొడుకు అభినయ్, తమ్ముడు గొర్రె మహేశ్ ఉన్నారు. -
హైడ్రా ఒక వేట కుక్క
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైడ్రా ఒక వేట కుక్కలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆ వేట కుక్కను పంపించి, దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా ద్వారా బడా బాబులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బులో కొంత వాటా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీకి, మరికొంత వాటా బీజేపీకి ఇస్తున్నారని ఆరోపించారు. ‘హైడ్రా అనేది తొమ్మిది తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింది.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుంది? సీఎంకు సిగ్గుండాలి..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా అనేది నువ్వు చెప్పినట్టు సంస్కరణ అయితే, మీ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుల ఇళ్లు ఎందుకు కూల్చడం లేదు?..’అని నిలదీశారు. కేటీఆర్ మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ దామోదరరావులతో కలసి రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ వద్దిరాజు నివాసంలో అందరితో కలిసి మీడియాతో మాట్లాడారు. నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు ‘హైడ్రాపై 65 సార్లు హైకోర్టు చెప్పినా వినవా? ఇంకా ఎవరు చెప్తే వింటావ్? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లర్ అనుకొని, హిట్లర్‌కు ఇష్టమైన పదం ‘‘హైడ్రా’’ఐ డిమాలిíÙంగ్ ఎవ్రీథింగ్, ఇరాన్, ఇజ్రాయెల్ మాదిరిగానే ఉంటాను అంటావా? హైదరాబాద్‌ను శిథిలావస్థలోకి తీసుకునిపోతావా?ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? మమ్మల్ని కబ్జాకోరులు అని అంటున్నావ్. మేం కాదు ..నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు. అందరికంటే ఎక్కువ ఆస్తి దోచుకుంటున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులే.హైకోర్టు చెప్పి 24 గంటలైనా ఇంకా రంగనాథ్‌ను కొనసాగించొచ్చా? మా హయాంలో ఉన్న ‘ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్’(ఈవీడీఎం) పేరు మార్చి, అన్నిటికీ రంగులేసినట్టు, సున్నాలేసినట్టు దీనికి కూడా వేసి పోజులు కొట్టడం తప్ప పీకిందేమీ లేదు. కేవలం దాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్‌రెడ్డి అతిపెద్ద బ్లాక్ మెయిలర్‌గా మారారు. వాస్తవానికి అధికారంలోకి రాకముందే పెద్ద బ్లాక్ మెయిలర్. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు. ఇప్పుడు హైడ్రాని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడు..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ రహస్య మిత్రులు బీజేపీ వాళ్లే.. రేవంత్ ఢిల్లీలో ఉన్నప్పుడే కేటీఆర్ కూడా ఉంటున్నారంటూ బీజేపీ ఎంపీ «ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డి కేసులు పెట్టేది మా మీద. తెల్లారి లేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్‌రెడ్డి రహస్య మిత్రులు బీజేపీ వాళ్లని రాష్ట్రంలో అందరికీ తెలుసు. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుని 9 రోజులు అరెస్టు చేయకుండా కాపాడింది రేవంత్‌రెడ్డే అనే విషయం అందరికీ తెలుసు. అమృత్ పథకంలో రేవంత్‌రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే, అక్కడ సృజన్‌రెడ్డి నాయకత్వంలో, రేవంత్‌రెడ్డి బావమరిది నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే, మేము వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014లో కూడా బకాయిలున్నాయి.. ‘మేము అధికారంలోకి వచి్చనప్పుడు 2014లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4 వేల కోట్లు ఉన్నాయి. వాటిని మేం చెల్లించలేదా? బకాయిలు అనేది నిరంతర ప్రక్రియ..’అని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ‘చెల్లని నాణేనికి గీతలు ఎక్కువ, చేతగానోడికి మాటలు ఎక్కువ..’అంటూ ఎద్దేవా చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునరి్వభజన చేపట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావాలంటే లోక్‌సభ స్థానాల కంటే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే సంస్కరణలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, అయితే కొత్త బిల్లులు తెచ్చేముందు గతంలో నియమించిన కమిటీల సిఫార్సుల అమలుపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే డివిజన్, వరంగల్‌లో ఏఐ సెంటర్ కాజీపేటలో ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, సిరిసిల్ల, వేములవాడ స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో చేర్చాలని కోరామన్నారు. వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటుచేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎస్టీపీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. -
బీఆర్ఎస్ వచ్చాక.. హైడ్రా బంగాళాఖాతంలోకే.. కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌కు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా ను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.హైడ్రా పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూలగొట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌ను కుప్పకూల్చారన్నారు. హైడ్రా అనేది బ్లాక్ మెయిల్ చేసి దోపిడి చేసే సంస్థని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రా ను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి ఒక్కో బిల్డర్ వద్ద ఫీట్ కు 200 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైల్వే పనులన్నీ స్తంభించిపోయాయని కేటీఆర్ ఆరోపించారు.హైడ్రా అనే సంస్థ తొమ్మిది తలల విషసర్పంలా మారిందని, కేవలం పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోందని, అధికార పార్టీ నేతలు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరిందని తెలిపారు.భూ వ్యవహారాల్లో అవినీతి, కమిషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలుచేశారు.హైదరాబాద్‌లో వేలాది ఇళ్లను కూల్చివేసి, ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా, సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డిసోదరుడు తిరుపతి రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పట్నం మహేంద్ర రెడ్డి,మంత్రి వివేక్ నివాసాలను ఎందుకు కూల్చడం లేదు.బిల్డర్స్ ను బెదిరించి డబ్బులు వసూల్ చేస్తున్నారని హైడ్రా సంస్థ సీఎం రేవంత్‌కు వేటకుక్కలా మారిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
జెన్‌జీ గురించి రేవంత్ మాట్లాడుతారా? అర్వింద్
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకుండా జెన్‌జీ భవిష్యత్తును నాశనం చేస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ క్యాబినెట్ సగటు వయస్సు 62 సంవత్సరాలని ఆయన జెన్‌జీ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే కుటుంబ పాలన చేస్తున్నారని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి దర్యాప్తును కేంద్రానికి అప్పగించడం లేదని కేసులు ముందుకు కదలకుండా కేటీఆర్ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారని ప్రశ్నించారు. దోచుకున్న వారిని కాపాడుతూ రేవంత్ మరింత దోపిడికి పాల్పడుతున్నారని, రేవంత్, కేటీఆర్ కేవలం మెుక్కుబడికోసమే ఢిల్లీకి వచ్చారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు.. -
కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద తగిన నీటి మట్టం ఉన్నందున పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు అందించడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత పరిమిత స్థాయిలో నీటిని నిల్వ ఉంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించారని తెలిపారు.సోమవారం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే 48 గంటల్లో నివేదిక ఇచ్చారని, అందుకే దానిని బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదుం ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి సాధ్యం కాకపోవడంతోనే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పారు. ఐటీ ఉద్యోగాలు తగ్గాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం ఐటీ టవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. టీ–ఫైబర్ ప్రాజెక్టును పూర్తి చేస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్–కరీంనగర్ రైల్వే మార్గం విద్యుద్దీకరణతోపాటు మిడ్ మానేరు వద్ద రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ సాధించిన విజయం తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచానికి చాటిందని కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని, అర్ధరాత్రి వేళల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదా లు జరిగినా వివరాలు బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్కడ దొరికిన నగదును లెక్కించడానికి మిషన్లు కూడా సరిపోవట్లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కేటీఆర్ కుటుంబం.. స్పెషల్ బర్త్‌డే వేడుకలు చూశారా? (చిత్రాలు)
-
కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్.. బర్త్ డే రోజే సంచలన నిర్ణయం!
-
సర్కారు బడికి రోబోటిక్ టీచర్!
సిరిసిల్ల టౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ బడి విద్యార్థులకు తెలంగాణలోనే మొదటి హ్యూమనాయిడ్ రోబో టీచర్‌ను అందించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఈ పుట్టినరోజున అత్యాధునిక రోబోను పాఠశాలకు బహుమతిగా అందజేశారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, విద్యార్థులకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడం కోసం ఈ రోబోను తెలంగాణలోనే తొలి ప్రయోగంగా ప్రవేశపెట్టామన్నారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ రోబో విద్యాబోధనలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌తో రోబోటిక్ టీచర్ నేరుగా మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులు అడిగిన వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. సర్కారు బడి విద్యార్థులు చిన్న వయసు నుంచే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ద్వారా రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతపై ఆసక్తి పెంచేందుకు దోహదం చేసింది. -
అణచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేస్తారు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు. యువతరం సీబీఐ, ఈడీ దాడులకు భయపడే రకం కాదు.. వారి స్వరం మారుతోంది. శ్రీలంకలో ఈ యువతరమే ప్రభుత్వాన్ని పాతరవేసింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్ర వాదులు, దేశద్రోహులు పాకిస్తానీలంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆగ్రహంతో ఉన్న యువత స్వరాన్ని అణచివేయాలని చూస్తే మీ ప్రభుత్వాన్ని ఒక్కో మెట్టు ఎక్కి తొక్కుతారు..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అణిచివేతకు, దాష్టీకానికి పాల్పడుతోందని విమర్శిస్తూ భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ‘లీక్ ఇన్ ఇండియా’గా మార్చేశారు.. ‘ఏ రాజకీయ నాయకుడి అండ లేకున్నా దేశ నలుమూలల నుంచి వేలాది మంది ఢిల్లీ జంతర్ మంతర్‌కు తరలి వస్తున్నారు. యువత ఆగ్రహం కేవలం నీట్ పేపర్ లీక్‌కు సంబంధించినదే కాదు. 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ చేస్తున్న మోసాలు, ద్రోహాలపై వారు మండిపడుతున్నారు. పాలనను పక్కదోవ పట్టిస్తూ మతం పేరిట ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్న తీరును యువత అర్ధం చేసుకుంది. మేకిన్ ఇండియా అడిగితే ‘లీక్ ఇన్ ఇండియా’ను ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నుంచి యువతరం జవాబుదారీతనాన్ని కోరుకుంటోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేక బీఆర్ఎస్ చేపట్టిన నిరసన వెనుక ఎలాంటి రాజకీయం లేదు.ఇద్దరు పిల్లలకు తండ్రిగా విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిరసనలో పాల్గొంటున్నా. యువతరం ప్రధాన మంత్రి కుర్చీనో, కేంద్ర మంత్రి పదవినో అడగడం లేదు. తమకు న్యాయం చేసి, భవిష్యత్తును కాపాడమని అడగడంలో అన్యాయం ఏముంది? మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియా అండతో జెన్ జీ యువత దేశాన్ని కదిలిస్తోంది. 50 ఏళ్ల క్రితం ‘జీనాహైతో మర్నా సీఖో.. కదం కదం పర్ లడ్నా సీఖో’అంటూ తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక యువకుడు ఇచ్చిన నినాద బలంతో దేశ యువత ప్రస్తుతం పోరాడుతోంది..’అని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు.. ‘రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపినట్లు చెప్పుకున్న ప్రధాని ఢిల్లీలో పిల్లల మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఆపడం లేదు? మోదీకి వ్యతిరేకంగా గొంతు విప్పితే నొక్కేసే ప్రయత్నం చేస్తూ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు. మీడియాతో ఎజెండాను సెట్ చేసే రాజకీయం ఇకపై నడవదు. కాక్రోచ్లు ఢిల్లీలో దండయాత్ర చేస్తున్నాయి. పిల్లలు గర్జిస్తుంటే విశ్వ గురువు నోరు విప్పడం లేదు. ‘పరీక్షా పే చర్చా’అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ప్రశ్నపత్రాల లీక్‌లకు సమాధానాలు చెప్పాలి. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడి అక్రమ కేసులు నమోదు చేయడంపై క్షమాపణ చెప్పడంతో పాటు పోలీసు కేసులను వెనక్కి తీసుకోవాలి. రేప్ కేసుల్లో నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రులు కుమారులకు బెయిల్ సులభంగా వస్తోంది కానీ పేపర్ లీక్‌లపై ప్రభుత్వం నుంచి సమాధానం ఎందుకు రావడం లేదో బీజేపీ నేతలు చెప్పాలి. రాజకీయ ఎజెండాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఢిల్లీలో యువత, విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పా ర్టీల జెండాలు, ఎజెండాలతో కలుషితం చేయొద్దు. ఎజెండాను హైజాక్ చేసే ప్రయత్నాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. స్వతంత్రంగానే మీ ఎజెండా మేరకు మీ ఉద్యమాన్ని కొనసాగించండి. పా ర్టీలతో కలిసి మీరు కొట్లాడితే మిమ్మల్ని ఆయా పార్టీల ఏజెంట్లు అని మీ ఉద్యమాన్ని, మీ డిమాండ్లను బలహీనపరిచే ప్రమాదం ఉంది. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. విద్యార్థులు, యువతకు అవసరమైన సమయంలో కేసీఆర్ వెంట నిలుస్తారు. కేంద్రం దిగి వచ్చే దాకా విద్యార్థులకు అండగా ఉంటాం..’అని కేటీఆర్ చెప్పారు. నేను తప్పు చేస్తే నిరూపించి ఉరితీయించు ‘పేపర్ లీక్ అంశంపై రేవంత్‌రెడ్డి నాపై దు్రష్పచారం చేస్తున్నారు. నేను తప్పు చేస్తే నిరూపించి నన్ను ఉరి తీయి. నేను మోదీని ప్రశి్నస్తే రేవంత్‌రెడ్డి అనే కేడీకి కోపం ఎందుకు వస్తోంది? ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో కొట్లాడుతుంటే నల్లమల పులిని అని చెప్పుకునే రేవంత్ పిల్లిలా కొడంగల్‌లో దాక్కున్నాడు. రేవంత్ కూతురునో, మనవడినో ఢిల్లీలో పిల్లలను కొట్టినట్లు కొడితే ఆయన ఊరుకుంటాడా. దేశమంతా మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశి్నస్తుంటే రేవంత్ మాత్రం కేటీఆర్, కేసీఆర్‌ను విమర్శిస్తున్నాడు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
GEN Zతో పెట్టుకున్నావ్.. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది..
-
ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే మోదీ పెట్టుకున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత అద్భుత పోరాటం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారు. యువత.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో యువత కదం తొక్కుతున్నారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతున్నారు. మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. యువతపై జరుగుతున్న దాడులు దారుణం. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషం.. పిల్లలపై పోలీసులు దాడులు చేశారు. విద్యార్థులు న్యాయం అడిగితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. యువకులను దారుణంగా కొట్టారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారు. ఉద్యమ పార్టీగా మాకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంది.ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ కొరివితో తల గోక్కుంటున్నారు. విద్యార్థులు మంత్రి పదవి అడగలేదు. న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నారు. ఢిల్లీలో ఇటీవల ఘటనలు చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ జనరేషన్ చావుకు భయపడే రకం కాదు. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి.. వచ్చాయా?. ఈ జనరేషన్ ఐటీ, ఈడీ సోదాలకు భయపడే వారు కాదు. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారు. నేను మోదీని ప్రశ్నిస్తే ఇక్కడున్న కేడీకి ఎందుకంత భయం?. పేపర్ లీక్‌కు, నాకు సంబంధం ఉందని రేవంత్ అంటున్నాడు. మోదీని ఎదిరించే దమ్ము రేవంత్‌కు లేదు. పాత కేసులు చూపించి జైల్లో పెడతారని రేవంత్‌కు భయం ఉంది. ఢిల్లీలో గల్లా పట్టి అడిగే దమ్ము మాకుంది ’ అని వ్యాఖ్యలు చేశారు. -
హైదరాబాద్‌లో హైటెన్షన్.. బీఆర్ఎస్ Vs యూత్ కాంగ్రెస్..
బీఆర్ఎస్ నిరసనలు అప్డేట్స్..ఇందిరా పార్క్ చేరుకున్న కేటీఆర్నల్ల చొక్కా ధరించి నిరసనలో పాల్గొన్న కేటీఆర్భారీగా చేరుకున్న విద్యార్థులు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంనీట్ పేపర్ లీక్ వ్యవహారంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు సంఘీభావంగా మౌనం పాటించిన కేటీఆర్మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్..ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వాటర్స్బీజేపీ-బీఆర్ఎస్ రెండు ఒక్కటే..గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీక్స్ వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయారు.కేటీఆర్‌ని అడ్డుకొని తీరుతాము.అరెస్ట్ చేసినా మళ్ళీ వచ్చి అడ్డుకుంటాము.బీజేపీ హయంలోనూ పేపర్ లీకులే జరుగుతున్నాయి.సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నల్ల చొక్కాతో నిరసనల్లో కేటీఆర్..నల్లచొక్కా ధరించి నిరసనలో పాల్గొననున్న కేటీఆర్ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంపోలీసుల మోహరింపు..గాంధీ భవన్ బయట భారీగా మోహరించిన పోలీసులు...నిరుద్యోగ జేఏసీ గాంధీ భవన్ ముట్టడి నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు..అడ్డుకున్న పోలీసులు..ఆదర్శ్ నగర్ నుంచి ఇందిరాపార్కు వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలు..భారీగా మోహరించిన పోలీసులుఎమ్మెల్యే క్వార్టర్స్ గేటు దాటకుండా అడ్డగిస్తున్న పోలీసులుపలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులునగరంలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ చేపట్టనున్న నిరసన దీక్షను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో పేపర్ లీక్‌లకు కారణం అయిన బీఆర్ఎస్ ఇప్పుడు నిరసన పేరుతో నాటకం ఆడుతుందని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ హెచ్చరించారు.ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంనిరసనలో పాల్గొననున్న విద్యార్థులు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలుకాసేపట్లో ఇందిరా పార్క్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్మరోవైపు ఇందిరాపార్క్ వద్ద పోలీసుల బందోబస్త్బీఆర్ఎస్ నిరసనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్దీంతో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం వద్ద పోలీస్ బందోబస్త్బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిపోలీసుల భారీ బందోబస్తు..ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు భారీ గా చేరుకుంటున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు..బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్‌లకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్..నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్..మరికాసేపట్లో ర్యాలీగా ఇందిరా పార్క్ వరకు వెళ్లనున్న యూత్ కాంగ్రెస్ నేతలు..కేటీఆర్‌ను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ హెచ్చరించిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.నిరసనలకు కేటీఆర్..మరోవైపు.. ఉదయం పది గంటల నుంచి ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంనిరసనలో పాల్గొననున్న కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలుఆంక్షలు ఇలా..కేటీఆర్ ధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతి1000 మందికి మించి ధర్నా చేయరాదుమధ్యాహ్నం 2 గంటల లోపే ధర్నా ముగించాలిసచివాలయం, అసెంబ్లీ వైపు వెళ్ళరాదుమైక్ సౌండ్లు కూడా పరిమితిలో వినియోగించాలి. -
కొడంగల్‌లో ధర్నా రాజకీయ నాటకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: నీట్ పరీక్ష ఉదంతంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాజ్ భవన్ ముందు ధర్నా చేయాల్సిందిపోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తే ఆయన కొడంగల్‌కు పోయి అక్కడ ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘మోదీ అంటే రేవంత్‌కు భయం. ఆయన పగలు కాంగ్రెస్‌తో ఉంటాడు. రాత్రయితే బీజేపీతో కలుస్తాడు..’అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని ఆరోపించారు. సీఎంపై ఉన్న పాత కేసులను బీజేపీ ప్రభుత్వం తోడుతుందనే ఉద్దేశంతోనే ప్రధాని పేరును కూడా పలకడానికి భయపడుతున్నాడని విమర్శించారు. గురువారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు ‘ఇది మూటలు పంపే పాలన. ప్రజలకు ఉపయోగపడే ఏ పని రేవంత్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టులను తన బంధువులకు ఇప్పించుకుంటున్నారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. ఆయన బామ్మర్ది సృజన్‌రెడ్డికి మేలు జరిగే విధంగా వ్యవహరించారు. కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరు? బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులేవీ కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయడం లేదు. ఆ పనులు పూర్తి చేస్తే మాకు పేరొస్తుందని సీఎం భయపడుతున్నారు. దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు నీటిని పంపిణీ చేయరు? కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా తాము ఆపలేదని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు..’అని కేటీఆర్ అన్నారు. నాలుగు పార్టీలు మారి హరీశ్‌రావుపై ఆరోపణలా? ‘హరీశ్‌రావు పార్టీ మారరు. బీఆర్ఎస్ పార్టీ లోనే తన పుట్టుక, చావు అని ఇప్పటికే పలుమార్లు హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. హరీశ్‌రావుపై నాలుగు పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఎవరితోనూ పొత్తులుండవు.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. కవిత అంశంపై కూడా వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగానే మాట్లాడతాం. కేసీఆర్ దయవల్లే మేమంతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 వరకు పెరిగే అవకాశం ఉంది. పునర్విభజన వల్ల నా నియోజకవర్గం మారే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉండటమే నాకు ఎక్కువ సంతృప్తినిస్తోంది.ప్రజా సమస్యలపై అంశాల వారీగా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహించాం. త్వరలో ఇతర వర్గాలతో కూడా సమావేశాలు చేపడతాం. నిరుద్యోగం, యువత సమస్యలు, రైతుల ఇబ్బందులపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా పోరాటాలు కొనసాగిస్తుంది. అలాగే వచ్చే ఏడాది పాదయాత్ర కూడా చేస్తా. త్వరలోనే తేదీలు, వివరాలు ప్రకటిస్తాం. విద్యార్థుల ఆగ్రహం మోదీపైకి మళ్లింది.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనలు పెరుగుతున్నాయి. మొద ట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. దేశంలో యువత, నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తే దీనికి కారణం. మోదీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకుంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి వారసత్వ హక్కు కాదు.. ‘ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. సీఎం పదవి అనేది వారసత్వ హక్కు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడు.. కేసీఆర్ కుమారుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా రాష్ట్ర సాధన పోరాటంలో మమేకం అయినందుకు గర్వపడుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదవులు ప్రజల అభీష్టం మేరకు వస్తాయని, ప్రజలు ఏది కోరుకుంటే అదే అవుతుందని అన్నారు. -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబేరినా టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. గ్లోబేరినా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు.‘‘గ్లోబేరినా బినామీ కంపెనీ అనడం, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శలు గుప్పించారు. గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
సీఎం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించాలి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి తన ఏకపక్ష పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించడం ప్రారంభించాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేశారు. ‘పేపర్ లీకుల వంటి అత్యంత దురదృష్టకరమైన సంఘటనపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం హేయమైనది..మీ పదవికి అపఖ్యాతిని తెచ్చిపెట్టేది. దానిని మీ చవకబారు అజెండాల కోసం ఉపయోగించవద్దు. మరోసారి చెబుతున్నాను బీఆర్ఎస్కు గానీ, నా కుటుంబానికి గానీ, నాకు గానీ గ్లోబరీనాతో ఎటువంటి సంబంధాలు లేవని’ కేటీఆర్ స్పష్టం చేశారు.‘మీరు క్షమాపణ చెప్పండి లేకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోండి అని చెబుతూ నా న్యాయ బృందం త్వరలో మీకు నోటీసు పంపుతోంది. చవకబారు మంత్రి గారూ, చాలాసార్లు, మీ అసభ్యకరమైన, అసంబద్ధమైన ఆరోపణలకు నేను స్పందించను, ఎందుకంటే అవి మొదటి నుంచే అసంబద్ధమైనవి. నేను మౌనంగా ఉన్నంత మాత్రాన మీతో ఏకీభవిస్తున్నానని కాదు. కేవలం ఈ బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం లేదు’ అంటూ తనకు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్ రెడ్డి కి లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ ప్రకటించారు. -
అర్హుల ఓట్లు తొలగిపోకూడదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం తన నివాసంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్.రమణ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వివరించింది. లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో చాలామందికి నోటీసులు జారీ చేయాల్సిన విభాగంలో చేర్చారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి వారికి వెంటనే మార్గనిర్దేశం చేసి అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సీసీఐ పునరుద్ధరణ కీలకమని చెప్పారు. రూ.250 కోట్ల రాష్ట్ర వాటాతో పునరుద్ధరణ సాధ్యమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడమే జాప్యానికి కారణమని అన్నారు. పునరుద్ధరణపై రేవంత్ ఇచ్చిన హామీలను కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో చిత్తశుద్ధితో వ్యవహరింట్లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతిపాదనలను ఆయన ప్రస్తావించారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం వల్లే జాప్యం జరుగుతోందని తెలిపారు.పూర్తి లేఖ -
రేవంత్‌కు తెలిసింది ఒట్లు.. తిట్లే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఢిల్లీలో పార్లమెంట్ వద్ద వేలాది యువత నిరసనతో కేంద్రాన్ని ఎలా గడగడలాడించిన్రో చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. యువత, రైతన్నలు తిరగబడితే కాంగ్రెస్ నాయకుడు బయట తిరగలేరు.’అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు అధ్యక్షతన జరిగిజన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడుతున్నారు. అన్ని గండాలను దాటిన రేవంత్‌రెడ్డి గండం రైతులు దాటలేకపోతున్నారు. రైతులకే కాక అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది. 31నెలలు అయిపోయింది. ఇంకా 29నెలలే ఉంది. యువ సంగ్రామ సదస్సుతో ప్రభుత్వాన్ని ఎండగట్టాం. యువత చేతికి రేవంత్‌రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారు. పాము సొంత పిల్లల్ని తిన్నట్లు రేవంత్‌రెడ్డి రైతులను చెప్పలేని కష్టాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. కన్నెపల్లి వద్ద 94మీ.ఎత్తులో నీరు పారుతున్నా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు నడిపిస్తే, రోజుకు 3టీఎంసీల ఎత్తిపోయవచ్చు. ఎన్డీఎస్ఏ కన్నెపల్లి నీళ్లు ఎత్తిపోయొద్దని చెప్పిందా? అని ప్రశ్నించారు. గోదావరి, ప్రాణహిత నదులు పారుతున్నా పరిపాలించే వారికి సోయి లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రూ.400కోట్లతో ఎల్అండ్టీ సంస్థ రిపేరు చేస్తామని చెప్పినా ప్ర భుత్వం పట్టించుకోలేదు. ఆయన గురువు చంద్రబాబు పట్టిసీమ లిఫ్టు నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లది రక్తం చల్లండి అంటే ప్రశాంత్‌రెడ్డి, సూర్యాపేట జిల్లాలో రైతులు రక్తం చల్లారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసింది ఒట్లు, తిట్లు మాత్రమే.’అని విమర్శించారు. ఈ సందర్భంగా వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన హామీలపై వీడియోను ప్రదర్శించారు. ఏ జాతి నీది అంటున్నారని, తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ.50లక్షలతో కొనుగో లు చేసేందుకు వెళ్లిన జాతి తమదికాదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రెండే జాతులున్నాయని, ఒకటి ప్రేమించేది, మరోటి రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి అన్నారు. కాగా, వరిధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి గాలివానకు గోడ కూలి చనిపోయిన నలుగురు రైతులు తనుగుల నాగరాజు, తనుగుల అభిరాం, నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్ కుటుంబాలకు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ.5లక్షలు అందజేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సు లో ఆసిఫాబాద్, బాల్కొండ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, నారదా సు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, దాసరి మనోహర్, నాయకులు రామ్మోహన్రావు, జాన్సన్‌నాయక్, విజిత్‌రావు పాల్గొన్నారు. -
‘కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం’
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాహభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.మాది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతి.. తెలంగాణ ఇచ్చిన జాతి అని స్పష్టం చేశారు. ఇచ్చిన తెలంగాణను అందరూ మెచ్చె తెలంగాణగా తీర్చిదిద్దుతున్న జాతి తమదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి.. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి తమేదనని చెప్పారు. తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టడమేగాక, తెలంగాణ భవిష్యత్తు తరాలకు బాసటగా నిలిచామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ..ఎక్కుపెట్టిన తుఫాకికి ఎదురుగా నిలబడ్డ ఉద్యమకారుల వెనుక దాక్కున పిరికిపందల జాతి మీదని మంత్రి అన్నారు. రాష్ట్రం కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంటల మీద చలికాచుకున్నది మీరని గుర్తు చేశారు. తెలంగాణ అమరవీరుల సమాధుల మీద గడీలు కట్టుకున్న నికృష్టపు జాతి ఎవరిదో ప్రజలకు తెలుసని వివరించారు.యువకుల బలిదానాల మీద కూర్చొని పంచభక్ష్య పరమాన్నాలు తిన్నడమేకాకుండా..తెలంగాణ సంపదను అనకొండలా అమాంతం మింగేశారని..అధికారాన్ని అడ్డం పెట్టుకున్ని అహంకారం చూపించినందుకే..తెలంగాణ ప్రజల చైతన్యం ముందు చెత్త కుప్పలో పడ్డ విషయాన్ని కేటీఆర్ మరిచిపోవొద్దని మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. -
10 నెలల కిందటే చెప్పా.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమీపంలో జరిగిన కాక్రోచ్ పార్టీ (CJP) ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే దేశంలో జెన్-జీ ఉద్యమం తప్పదని తాను 10 నెలల క్రితమే హెచ్చరించానని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘దాదాపు 10 నెలల క్రితం ఓ మీడియా సమావేశంలో.. యువత ఆశయాలు, ఆకాంక్షలను పరిష్కరించకపోతే మన దేశంలో జెన్-జీ నిరసన తప్పదని చెప్పాను’’ అని గుర్తుచేశారు.‘‘ఢిల్లీలో నిన్న జరిగిన నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుత పాలన, జవాబుదారీతనం, విద్యా రంగ సంస్కరణలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి కారణాలను గుర్తించి, విద్యా వ్యవస్థలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and… pic.twitter.com/9kTIDx9Oi8— KTR (@KTRBRS) July 21, 2026 -
రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలో.. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో మూలంగా కరువు పరిస్థితులు ఎదురవుతాయని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓ వైపు రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకుంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో పడుకుందని ఎద్దేవా చేశారు. వ్యవసాయంపై అవగాహన లేని ప్రభుత్వానికి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళిక, దిశ లేదని మండిపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మోరిల్ శ్రీనివాస్ తెలంగాణ భవన్లో సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక చిచోరా. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నాడు. తెలంగాణలో దోచుకున్న డబ్బును మూటలు కట్టి నెలకోమారు రాహుల్ గాంధీకి అప్పగించి తన పదవిని రెన్యూవల్ చేసుకోవడమే రేవంత్‌కు తెలుసు. తెల్లారితే కేసీఆర్‌ను దూషించడం, దేవుళ్లపై ఒట్లు వేయడం మినహా రేవంత్ ప్రభుత్వానికి మరో పని లేదు. రెండున్నరేళ్లలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ‘కాళేశ్వరం’పై కాంగ్రెస్ రాజకీయాలు ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది.మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయనే సాకుతో మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాగునీరు విడుదల కోరితే రక్తం చల్లాలని సీఎం అంటున్నారు. తెలంగాణ కోసం రక్తంతో పాటు ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్దం’అని కేటీఆర్ ప్రకటించారు. ‘ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్లలో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 70వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
-
70 వేల ఉద్యోగాలు ఇచ్చుంటే.. రాజకీయ సన్యాసం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే.. నేను రాజకీయ సన్యాసం చేసి, రాహుల్‌గాం«దీకి జై కొడతా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్‌నగర్ స్టేడి యం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరోలెక్క.. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. జంగ్ సైరన్ మోగించిన యంగ్ జనరేషన్ కాకతీయ, ఉస్మానియా, మహాత్మాగాం«దీ, శాతవాహన వర్సిటీలతోపాటు అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ నుంచి యువశక్తి శివమెత్తి పోటెత్తింది. పిడికిళ్లు బిగిస్తే.. పీఠాలే కదిలిపోతాయి. తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చింది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరే. దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వారికి డెత్ డిక్లరేషన్ రాయాలి ‘సరిగ్గా 38 నెలల క్రితం ఇదే నేలపై తెలంగాణ యువతకు దారుణమైన దగా జరిగింది. ప్రియాంకగాం«దీతోపాటు ఢిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్, హై కమాండ్ నుంచి గాం«దీలు, గాంధీ భవన్ నుంచి గాడ్సేలు కలిసి వచ్చి.. మాయామశ్చింద్ర చేశారు. యూత్ డిక్లరేషన్ పేరుతో నయవంచనకు పాల్పడ్డారు. మన యువతకు 24 హామీలు ఇచ్చారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి రాలేదు. డిగ్రీ పాసైతే రూ.లక్ష రాలేదు. పీహెచ్డీ చేస్తే రూ.ఐదు లక్షలు రాలేదు. అధిష్టాన పుత్రుడు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చిండు. చాయ్ తాగి, బిస్కెట్లు తిన్నడు. తెలంగాణ నిరుద్యోగులకు బిస్కెట్లు వేశాడు. రెండు (కేసీఆర్, కేటీఆర్) ఉద్యోగాలు తీసేస్తే.. ఒకేసారి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. కొలువుల కుంభమేళా అన్నారు. కుంభకోణాల పర్వానికి తెరతీశారు. యూత్ డిక్లరేషన్ చేసిన రాహుల్‌గాం«దీకి, ప్రియాంకగాంధీకి, రేవంత్‌రెడ్డికి డెత్ డిక్లరేషన్ రాయాల్సిన అవసరం ఉంది’ అని కేటీఆర్ చెప్పారు. నిన్ను సీఎంను చేసింది ఇందుకేనా..? ‘రాహుల్‌కు ప్రధాని జాబ్ వచ్చే వరకు విడిచి పెట్టబోననని సీఎం రేవంత్ చెబుతున్నాడు. తెలంగాణ యువత నిన్ను సీఎం చేసింది యువతకు జాబ్‌లు ఇవ్వాలని, లేక రాజకీయ నిరుద్యోగి రాహుల్‌కు ప్రధాని జాబ్ ఇవ్వమనా..? ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబులు నింపడం లేదు కానీ రాహుల్‌గాంధీ జేబులు, అన్నదమ్ముల అల్మారాలు బినామీల బీరువాలు నింపుతున్నాడు. ఉస్మానియా, కాకతీయ పీహెచ్డీ విద్యార్థులు.. ‘ఓటు కోసం కోటి మోసాలు.. కాంగ్రెస్ నాటకాలు’ అనే థీసిస్ చేయాలి. 20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని నింపాలని దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన చేస్తుంటే.. లాఠీలు ఝళిపిస్తున్నాడు. దమ్ముంటే సెక్యురిటీ లేకుండా వీఎం హోంకు రా? ఎవరు ఉంటారో? ఎవరు చస్తాడో ? తేలుతుంది. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది’ అని కేటీఆర్ చెప్పారు. వాళ్లది పోటీ పరీక్షలు రాసిన ముఖమా? ‘పట్టాలు చేతపట్టుకుని, కిరాయి కట్టలేక, ఖాళీ కడుపుతో నిద్రహారాలు మాని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల పరిస్థితి మాకు తెలుసు. ఇలాంటి వారి జీవితాలతో కాంగ్రెస్, బీజేపీలు పరిహాసమాడుతున్నాయి. కేంద్రంలోని బడేభాయ్ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాÐనన్నాడు. ఇక్కడి చోటే భాయ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. పకోడీలు, చెకోడీలు వేసుకొమ్మని మోదీ చెబుతుంటే.. ఎండ్రిన్ తాగి చావండని రేవంత్ చెబుతున్నాడు. పోటీ పరీక్షలకు హాజరు కావడం, ఉద్యోగం కొట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు.. కానీ బండి సంజయ్, రేవంత్ ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖం కాదు. తెచ్చుకున్న తెలంగాణ తెర్లవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నేపాల్ మాదిరి భూకంపం పుట్టించమనడం లేదు. శ్రీలంకలా శివతాండవం చేయమనడం లేదు. ప్రభుత్వాన్ని కూల్చమనడం లేదు. మాది అల్లర్లు సృష్టించి, కేసుల్లో ఇరికించి, నెత్తురు చిందించి తప్పించుకునే పార్టీ కాదు. విద్యార్థులకు అండగా ఉంటాం. 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే. కేసీఆరే సీఎం. గతంలా కాకుండా ఈసారి మీ పూర్తి బా«ధ్యతను తీసుకుంటా. ఓ అన్నగా అండగా ఉంటా’ అని కేటీఆర్ పేర్కొన్నారు. స్కైరూట్‌కు అభినందనలు.. ‘బీఆర్ఎస్ హయాంలో ప్రైవేటు రంగంలో 26 లక్షల కొలువులు సృష్టించాం. ప్రతి మూడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఊహలకు రెక్కలిచ్చి ఆలోచనలకు ఆవిష్కరణలుగా మార్చే ఒక టీహబ్‌ను సృష్టించాం. ఇక్కడ పురుడు పోసుకున్న స్కైరూట్.. 79 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ రాకెట్‌ను నింగిలోకి పంపింది.. స్కైరూట్‌ను అభినందిస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. -
కాంగ్రెస్‌కు 'డెత్ డిక్లరేషన్' రాయాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలతో యువతను మోసం చేసిందని, ఆ మోసానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా డెత్ డిక్లరేషన్ రాయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచారానికే పరిమితమైందని మండిపడ్డారు.సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన 'యువ సంగ్రామ సభ'లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ మోసం చేసిన సరూర్నగర్లోనే 'యువ సంగ్రామ సభ' నిర్వహించాం. 38 నెలల క్రితం కాంగ్రెస్ మాటలు నమ్మి యువత దగా పడింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు. అది చిత్తు కాగితంగా మారింది. ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా. ఇదే నా సవాల్. వాస్తవానికి 10 వేల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు.నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచారానికే పరిమితమైంది. రేవంత్ ప్రభుత్వం క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తోంది. గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలకూ తమదే ఘనతగా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ వంటి హామీలు అమలు కాకపోగా, లూటిఫికేషన్ మాత్రమే జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి గాంధీలు, గాంధీ భవన్ నుంచి గాడ్సేలు వచ్చారు. రాష్ట్రంలో ఉన్మాద పర్వం నడుస్తోంది. పాత కేటుగాళ్ళు, కొత్త డూప్లికేట్ గాళ్ళు యువతను మోసం చేశారు. మోసం చేసిన వాళ్లను ఏమని అందాం. 60 ఏళ్ళు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ మాటలు నమ్మాం. అందరి కాళ్లు మొక్కి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. రేవంత్ రెడ్డి భాషలో బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా? లాగులో తొండలు విడుద్దామా?. యువతతో పెట్టుకుంటే పుట్ట గతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలి. రాహుల్ గాంధీ జేబులు రేవంత్ రెడ్డి నింపుతున్నారు. అన్నదమ్ముళ్ల అల్మారాలు నింపుతున్నారు.తెలంగాణ విద్యార్థుల గుండెల్లో బుల్లెట్లు దింపింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ రక్త పిశాచి. రక్తం పంట పొలాల్లో చల్లాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. 50 లక్షలతో అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికారు. క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?. అబద్దాలు చెప్పడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఓటుకు నోటు దొంగ కుర్చీలో కూర్చున్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి బిస్కెట్లు తిని మనకు బిస్కెట్లు వేసి పోయారు’ అంటూ సెటైర్లు వేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన తెలిపితే బూతులు తిడుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటావా?. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు.. మీ అయ్య జాగీరా?. ప్రజలు హామీలపై ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడుతున్నారు. నమ్మించి మోసం చేయడంలో రేవంత్ పీహెచ్డీ చేశారు. తెలంగాణలో భూములు, బూడిద, ఇసుక లూటిషికేషన్ జరుగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రపంచంలోనే అతి పెద్ద మోసం. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రేవంత్ సున్నాలు దిద్దుతున్నారు. మనం తెచ్చిన కంపెనీలకు రేవంత్ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. బడేభాయ్ రెండు కోట్లు, చోటా భాయ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను రాజు నేను హిట్లర్ అంటూ బట్లర్ మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికార పీఠం.. నిరుద్యోగులకు బలిపీఠం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
బీఆర్ఎస్ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు!
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. మూడేళ్ల క్రితం సరూర్‌నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎండగట్టేందుకు సమాయత్తమైంది. నిరుద్యోగ యువతతో కలిసి ధర్నాలు, ఆందోళనలకు సిద్దమైంది.బీఆర్ఎస్ పార్టీ శనివారం ‘చలో సరూర్‌నగర్’ పేరిట యువ సంగ్రామ సభ నిర్వహించనున్నది. ఈ సదస్సుకు గులాబీ పార్టీ సర్వం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న ఈ సభను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. సుమారు 20వేల మంది తరలిరానున్న నేపథ్యంలో అనేక ఆటంకాలు, ఇబ్బందులను అధిగమించి చకచకా ఏర్పాట్లు చేసింది.బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభకు వెళ్లకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ https://t.co/roxyHPPbHN pic.twitter.com/plf2dkrsgQ— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభా ప్రాంగణం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో పోలీసుల తనిఖీలు చేస్తున్నట్టు గులాబీ నేతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభా ప్రాంగణం వద్ద భారీగా పోలీసుల మోహరింపుఅన్ని మెట్రో స్టేషన్లలో పోలీసుల తనిఖీలునిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం https://t.co/lNODxhBULE pic.twitter.com/V71mY5cx9F— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026 -
నేడు బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం పూరించిన బీఆర్ఎస్ పార్టీ శనివారం సరూర్‌నగర్ స్టేడియం వేదికగా ‘యువ సంగ్రామ సదస్సు’ను నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు హాజరయ్యేలా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు సంబంధించి సుమారు పది రోజుల క్రితం నుంచే బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది.అయితే చివరి నిమిషం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో శుక్రవారం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సదస్సు నిర్వహణకు సంబంధించి పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, స్పోర్ట్స్ అథారిటీకి తాము దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం అనుమతులిచి్చంది. పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి తదితరులు సరూర్ నగర్ స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆరు డిక్లరేషన్లపై సమరభేరి2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2022 మే మొదలుకుని 2023 నవంబరు వరకు ఆరు డిక్లరేషన్లు విడుదల చేసింది. వరంగల్‌లో 2022 మే 6న జరిగిన ‘రైతు డిక్లరేషన్’ సభకు రాహుల్ గాం«దీ, హైదరాబాద్‌లో 2023 మే 9న జరిగిన ‘యూత్ డిక్లరేషన్’సభకు ప్రియాంక గాందీ, చేవెళ్లలో 2023 ఆగస్టు 26న జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , 2023 నవంబర్ 9న హైదరాబాద్‌లో జరిగిన ‘మైనారిటీ డిక్లరేషన్’ సభకు మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, నవంబర్ 10న కామారెడ్డిలో జరిగిన ‘బీసీ డిక్లరేషన్’ సభకు అప్పటి కర్ణాటక సీఎం సిద్దరామయ్యలు హాజరయ్యారు. ఈ సభల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ల వారీగా సమరభేరీ మోగించాలని, ఆయా తేదీల్లో సభలు జరిగిన చోటే పోటీ సభలు లేదా సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.హైకోర్టు గ్రీన్సిగ్నల్సరూర్నగర్ స్టేడియంలో నేడు బీఆర్ఎస్ నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. శనివారం ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు సదస్సును నిర్వహించాలని షరతు విధించింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల సమస్యలు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది. యువ సంగ్రామ సదస్సుకు అనుమతివ్వాలని, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, ఎల్బీ నగర్ డీసీపీ, ఏసీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేరుస్తూ లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టీ.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.వాదనలు విన్న న్యాయమూర్తి సదస్సుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
బీఆర్ఎస్ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రేపు (శనివారం, జూలై 18) నిర్వహించ తలపెట్టిన ‘యువ సంగ్రామ సదస్సు’కు తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ సభ నిర్వహణ కోసం బీఆర్ఎస్ నేతలు జూన్ 30నే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్ నివేదికల నెపంతో పోలీసులు చివరి నిమిషంలో అనుమతిని నిరాకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సభను అడ్డుకుంటోందని మండిపడ్డ బీఆర్ఎస్ లీగల్ సెల్, దీనిపై అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న న్యాయస్థానం.. కొన్ని షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేస్తూ సభ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ‘యూత్ డిక్లరేషన్’ హామీలను (మెగా డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి) నెరవేర్చడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఎన్నికల ముందు ఇదే సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సమక్షంలో ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించగా, ఇప్పుడు అదే వేదిక నుండి కాంగ్రెస్ వైఫల్యాలపై ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. హైకోర్టు అనుమతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. -
కాళేశ్వరం రాజకీయ యుద్ధంగా మారిందా?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిత్యం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. అది క్రమేపి రాజకీయ రూపు దాల్చుతోంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది. ఒక వైపు వానలు అంతంత మాత్రంగా ఉండడం, మరో వైపు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వస్తాయో, రావో అన్న సందిగ్దత గందరగోళంగా మారింది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసినప్పటికీ మెడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు కుంగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా డామేజి జరిగింది.2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిలో ఆ సమస్య కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిమీద సరైన క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నదన్న విమర్శ వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన పగుళ్లనండి. లేదా పిల్లర్లు కుంగడం అనండి.. ఏదైనా కానివ్వండి.. గ్రౌండ్ సిచ్చుయేషన్కు అనుగుణంగా నిర్ణయాలు చేసి రేవంత్ తనకు అడ్వాంటేజ్ తెచ్చుకునే అవకాశం ఒక దశలో ఉంది.ఆ ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నేషనల్ డామ్ సేఫ్టి అథారిటి చెబుతోందన్నది ఆయన వాదనగా ఉంది. ఇందులో స్కామ్ అని, మరొకటి అని చెప్పి గత రెండేళ్లుగా అలాగే ఉంచేశారు. ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది. కాని వారు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ పొందగలిగారు. కమిషన్ రిపోర్టుకు కూడా పెద్ద విలువ లేకుండా పోయిందనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీరు నిల్వచేసి పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి ఆయా ప్రాంతాలలో ఉన్న రిజర్వాయిర్లను నింపాలా? వద్దా? అన్న చర్చకు పరిస్థితి చేరింది. ఇక్కడే రేవంత్ ప్రభుత్వం పొరపాటు చేస్తున్నదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి, అక్కడ నీటిని తోడకపోతే తామే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. తనకు ఇరిగేషన్ మంత్రి పదవి అప్పగిస్తే, మూడునెలల్లో బారేజీలను బాగు చేయించి చూపుతానని హరీష్‌రావు సవాల్ చేశారు. వీటికి ప్రతిగా రేవంత్ కూడా ధీటుగానే బదులు ఇచ్చారు. అది వేరే విషయం.నిజానికి ఇంతదాకా రేవంత్ ప్రభుత్వం వెళ్లనిచ్చి ఉండాల్సింది కాదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు ఆయా జిల్లాలను ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీరు ఎలా ఇవ్వవచ్చా అన్నదానిపై ఆలోచన చేసి ఉండాల్సింది. కేసీఆర్ కట్టించినంత మాత్రాన ఆ ప్రాజెక్టు ఆయనది అయిపోదు. అలాగే ఆరోపణలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టుతో రేవంత్‌కు సంబంధం ఉండకపోదు. అది ప్రజల ఆస్తి.ఈ క్రమంలోనే వాదోపవాదాలు, విమర్శ, ప్రతి విమర్శలకు అవకాశం ఇచ్చారు. కాళేశ్వరం నీరు ఎత్తిపోయకుండా పగ పట్టారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి బదులుగా నీళ్లు ఉన్నంత మాత్రాన ఎత్తిపోయలేం అని, నీటి నిల్వకు ఆ బారేజీలు అనువుగాదని జాతీయ డామ్ భద్రత అథారిటీ చెబుతోందని, బరాజ్‌లు సురక్షితం కాదని కూడా ఆ సంస్థ చెప్పిందని రేవంత్ అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అందుకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే, రైతుల పొలాలకు నీరందించలేకపోతే, వర్షాలు సరిగా కురవకపోతే ఆ ప్రభావం అంతా తన ప్రభుత్వంపైనే పడుతుందన్న సంగతి ఆయన గుర్తించాలి.అంతేకాక విపక్షాన్ని ఉద్దేశించి పొలాలలో రక్తం చల్లితే పంటలు పండుతాయని అనడం సరికాదు. ఎదుటి పక్షం వారు ఎదైనా చిన్న వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తేనే కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కాస్త బెటర్ అయినా, ఈ మధ్య జరిగిన కొన్ని అరెస్టులు చూస్తే, ఇక్కడ కూడా టీడీపీ పెత్తనం సాగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా తీవ్ర అసహనంతో మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఆయనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణలో ఆయన శిష్యుడుగా పేరొందిన రేవంత్ కూడా అదే బాటలో వెళ్లకుండా ఉంటే మంచిది.రేవంత్ వ్యాఖ్యను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకుని, గోదావరి నీళ్లు రైతులకు అందిస్తామంటే తమ రక్తం ఇస్తామంటూ పెద్ద హడావుడినే సృష్టించింది. తెలంగాణ భవన్లో భారీగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరిటేట్ చేసి ముగ్గులోకి దించాలని రేవంత్ చూస్తున్నప్పటికి, ఆయన తొణకడం లేదు. కేటీఆర్, హరీష్‌రావులే గట్టిగా బదులు ఇస్తున్నారు. దీనివల్ల కూడా రేవంత్ అసహనానికి గురి అవుతున్నారేమో తెలియదు. రేవంత్ కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే దాని పునరుద్దరణపై పూర్తి శ్రద్ద పెట్టి ఉంటే ఆయనకు పేరు వచ్చేది.కేసీఆర్‌ను విమర్శించవచ్చు. అందులో అవినీతి ఉంటే దానిపై దర్యాప్తు చేయించవచ్చు. కాని అల్టిమేట్‌గా ప్రజలకు కావల్సింది నీరు. అందులోను వర్షాభావ స్థితిలో తమ పొలాలకు నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అందువల్ల బీఆర్ఎస్ కోరడానికి ముందే, గోదావరిలోకి వచ్చిన వరద నీటిని అంచనా వేసుకుని, పంప్ హౌస్‌ల ద్వారా నీరు లిఫ్ట్ చేయించడం మొదలు పెడితే బాగుండేదేమో! కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా దానినే సూచిస్తున్నారట. ఒక వేళ నిజంగానే గోదావరి నీటిని లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది ఉంటే, విపక్షాన్ని కూడా ఆహ్వానించి, వారిని కూడా ఆయా బారేజీల వద్దకు, పంప్ హౌస్‌ల వద్దకు తీసుకువెళ్లి ఇరిగేషన్ అధికారుల ద్వారా పరిస్థితిని వివరించి ఉండవచ్చు. అలాగే మేధావులైన ఇంజనీర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కోసం ఒక సమావేశం పెట్టి ఉండవచ్చు. ఇవేవి చేసినట్లు లేరు. పైగా అనుచిత వ్యాఖ్య చేసి తనకు రావల్సిన మైలేజీని రేవంత్ వదులుకున్నారేమో అనిపిస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఊపిరి పోస్తుందనిపిస్తుంది. కారణం ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం కూడా మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల పునరుద్దరణకు వేగంగా చర్యలు చేపట్టలేదన్న భావన ఉంది. ఒకప్పుడు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఉన్న బారేజీ గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో ఉభయ గోదావరి జిల్లాలకు తీవ్ర సంక్షోభం వచ్చే స్థితి ఏర్పడింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్వయంగా ధవళేశ్వరం వెళ్లి, అక్కడే మకాం చేసి ఆ గేట్లను బాగుచేయడమో. కొత్త గేట్లను బిగించడమో చేశారట. దానివల్ల ఆయనకు ఖ్యాతి వచ్చింది.1986లో వచ్చిన భారీ వరదలకు గోదావరి రెండువైపులా గట్లు పలుచోట్ల తెగిపోయాయి. ఆ నది వెంబడి ఉన్న జిల్లాలన్నీ మునిగిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం వెంటనే గోదావరి గట్లను పటిష్టపరిచే పని చేపట్టింది. అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని చెబుతూ కాలం గడపలేదు. ఇలాంటి అనుభవాలు మరి కొన్ని కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కుని ముందుకు పోవడంలోనే ప్రభుత్వ విజన్ కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దానిని వినియోగించుకుంటే మంచిది. పాజిటివ్ దృక్పథంతోనే రేవంత్ ముందుకు వెళితే ఆయనకు మైలేజీ రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదన్నారు కేటీఆర్. దీనిలో భాగంగా ఈనెల 18వ తేదీన సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలుఅప్రకటిత కరెంట్ కోతతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. 11 జిల్లాల్లో రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేశారని, బొగ్గు కొరతతో విద్యుత్‌కి అంతరాయ ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని నిద్ర లేపినా.. ఉలుకు లేదు.. పలుకు లేదని మండిపడ్డారు. థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు లేదని, విద్యుత్ ఉత్పత్తి లేక కోత విధిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందని, 7180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు హరీష్. ఇది చేతకాని ప్రభుత్వమని, ప్రభుత్వం 3190 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్ కోతలని మండిపడ్డారు. ప్రభుత్వం నడిపే వారికి కనీస అవగాహన, సోయి లేదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కనీసం సోయి లేదన్నారు. ఎనిమిది గంటల విద్యుత్ అనేది రైతులకు అందించడం లేదని హరీష్‌రావు ఆరోపించారు. -
76 సార్లు ఢిల్లీ వచ్చారు.. 76 పైసలైనా తెచ్చారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘పంటలకు నీళ్లు అడిగితే రక్తం చల్లాలి’ అని సీఎం అంటారా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ తన తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అసలు ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏమాత్రం నియంత్రణ ఉందో లేదో అర్థం కావడం లేదని విమర్శలు సంధించారు. బుధవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్‌చాట్’లో కేటీఆర్ మాట్లాడారు. ‘అధికారం చేపట్టిన 31 నెలల్లో దాదాపు 76 సార్లు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి కనీసం 76 పైసలు అయినా రాష్ట్రానికి తెచ్చారా, ఒక ప్రాజెక్టును తెచ్చారా, రైతులకు యూరియా తెచ్చారా?’ అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. 30 శాతం పర్సంటేజ్ మంత్రి పొంగులేటి ‘తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి లాక్ అన్‌లాక్ గేమ్ ఆడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 16లక్షల ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. భూముల వివాదాలను అన్‌లాక్ చేసేందుకు 30శాతం వసూలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30శాతం పర్సంటేజ్ మంత్రిగా మారారు. సర్వేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లు చూస్తోంటే ఆయనలో... ‘రాము, రెమో’లు ఇద్దరు ఉన్నట్లు కనిపిస్తోంది’ కేటీఆర్ పేర్కొన్నారు. దక్షిణాది వాటా యథావిధిగా ఉంటేనే మద్దతు దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్లమెంట్లో 24శాతం ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని కొనసాగించాల్సిందేనని అని కేటీఆర్ అన్నారు. యధావిధిగా దక్షిణాది వాటా ఉంటేనే బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు. తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరగడం ఖాయమని, అది డీలిమిటేషన్ విధానంలో అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైనా సీట్లు పెరగాల్సిందేనన్నారు. ఏదైనా సరే బీజేపీ అనుకుంటే అవుతుందని, లేదంటే ఆలస్యం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం రేవంత్ నాలుగు సర్వేలు చేయించుకున్నాడు. బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఈ నాలుగు సర్వేలు రిపోర్టు ఇవ్వడాన్ని రేవంత్ జీరి్ణంచుకోలేకపోతున్నాడని ధ్వజమెత్తారు. మెట్రో భూములపై రేవంత్ కన్ను ‘మా ఓటమికి 100 శాతం కారణం మా పొరపాట్లే. అందుకే మేం ఓడిపోయాం. ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకుంటున్నాం. మమ్మల్ని ఓడించారని ప్రజలను మేం ఎప్పుడూ తప్పుబట్టలేదు. మాకు రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు, మూడోసారి మమ్మల్ని పక్కనపెట్టారు. ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతోంది. 18 కోట్ల చదరపు అడుగుల్లో ‘మెట్రో’కు సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించేందుకు మెట్రోలో భాగస్వాములైన కంపెనీలకు 2008లో అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 280 ఎకరాల భూమిని కేటాయించారు. లీజు పీరియడ్ 30–40 ఏళ్లు ఉంది. అయితే ఇప్పటి వరకు 1.4 కోట్ల చదరపు అడుగుల్లో కూడా నిర్మాణం జరగలేదు. ఆ 280 ఎకరాలపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లతో వ్యక్తిగతంగా నాకు గట్టు పంచాయితీలు లేవు. కేవలం రాజకీయ విభేదాలే. 2027లో పాదయాత్ర చేస్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యా. సెలెట్రిటీల ఫోన్ ట్యాప్ కాలేదని పోలీసు అధికారులే చెబుతున్నారు. ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో ఈ నెల 31న హాజరుకావాలని సమన్లు అందాయి. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరవుతా’ అని కేటీఆర్ అన్నారు.బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయిన కేటీఆర్ ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించండి కేంద్రమంత్రి కుమారస్వామికి కేటీఆర్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తక్షణమే పునఃప్రారంభించి, భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన కమిటీతో కలసి బుధవారం ఢిల్లీలో ఆయన కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. సీసీఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉండి, పునరుద్ధరణ జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీసీఐ పునరుద్ధరణకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్‌లోని రూ.50 కోట్ల విలువైన యంత్రాలను ఈ–వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ కొనసాగిస్తోందని, ఇది ఆందోళనకరమని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది పాదయాత్ర: కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి కుమారస్వామితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం సమావేశమైంది. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. ఈ-ఫార్ములా రేసు కేసులో జులై 31న కోర్టులో హాజరవుతానని.. న్యాయబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. కేసు నుంచి బయటపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.‘‘న్యాయస్థానంపైన విశ్వసనీయత ఉంది. వచ్చే ఏడాది పాదయాత్ర మొదలు పెడతా. ఎప్పుడు ఎక్కడ అనేది త్వరలో చెప్తాం. కేసీఆర్ నెక్స్ట్ సీఎం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరు తెలియదు. 8 మంది తామంటే తాము సీఎం అని అంటున్నారు’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.‘‘దక్షిణాది వాటా తగ్గకుంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది వాటా 24 శాతం కొనసాగాలి. యథావిధిగా దక్షిణాది వాటా ఉంటే బిల్లుకు మద్దతిస్తాం. 73 సార్లు ఢిల్లీకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి 73 పైసలు తీసుకువచ్చాడా?. హిట్లర్ ఆదర్శమని చెబుతున్న రేవంత్‌పై రాహుల్ గాంధీ చూస్తూ ఊరుకుంటాడా.. ఎన్డీఎస్ఏ కార్యాలయానికి ఎందుకు వెళ్లలేదు?. ఎన్డీఎస్ఏ కేవలం ఒక సలహా సంఘం మాత్రమే’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రైతులు, నిరుద్యోగులు ఆశపడ్డారు. కొందరు ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేది. రేవంత్ రెడ్డి నాలుగు సర్వేలు చేయించుకున్నాడు. సర్వేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఫోన్ ట్యాపింగ్‌లో హీరోయిన్ల ఫోన్లు రికార్డ్ చేశామన్నారు. ఎక్కడ ఆధారాలు పెట్టలేదు. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా అలాంటివేవీ రికార్డు లేదని చెప్పాడు.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్.. కేంద్రమంత్రితో ప్రత్యేక భేటీ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ బృందంతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు (బుధవారం) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో కేటీఆర్ తన బృందంతో కలిసి భేటీకానున్నారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేయనున్నారు.ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరనున్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రికి వివరించనున్నారు. ఈ బృందంలో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న , ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, CCI సాధన సమితి నాయకులు ఉన్నారు.ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని 1984 ఉత్పత్తిని ప్రారంభించింది. తీవ్రమైన నిధుల కొరత అధికంగా నిలిచిపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర కారణాలతో కేవలం 14 సంవత్సరాలకే తన ఉత్పత్తులను నిలిపివేసింది. దీంతో ఆ ప్రాంతంలోని యువత ఉద్యోగ అవకాశాలలో తీవ్రంగా నష్టపోయారు. -
ఎన్కౌంటర్ల పేరుతో పిట్టల్లా కాల్చారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ పిల్లలని కాల్చి చంపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయన్నారు. నెత్తురు ఇస్తేనే నీళ్లిస్తామంటే అందుకు తాము సిద్ధమని.. మీ రక్తదాహం తీర్చుకొని పొలాల జలదాహం తీర్చండన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన రక్తం వ్యాఖ్యలపై కేటీఆర్ హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఘాటుగా బదులిచ్చారు.కేటీఆర్ మాట్లాడుతూ'' నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ! ఇంకా తీరలేదా మీ రక్తదాహం ? 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా? తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు! 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్ల జూశారు. 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచాయని మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్నారు. కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..! మీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, రైతులకు దయచేసి నీళ్లు ఇవ్వమని కేటీఆర్ విమర్శించారు.తాము పేగులు తెగే దాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లమని రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని తాము నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లమని నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తామని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి తీవ్ర పదజాలంతో విమర్శించారు. -
ఎప్పుడూ అనుములే కాదు.. అన్నారం కూడా పట్టించుకోండి: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్ చేయకుండా రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు అని అన్నారు. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయవచ్చు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీల్లు లిఫ్ట్ చేయవచ్చు. గోదావరి బేసిన్లో 77 శాతం నీళ్లు లేవు. సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోతున్నారు. మేము కన్నెపల్లికి పోగానే సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని.. భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని అంటున్నారు. ఎల్‌నినో అంటూ రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారు. సీఎం రేవంత్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎం బండారం బయటపడింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. రోజుకు 9 టీఎంసీల నీళ్లు కొందకు వృథాగా పోతున్నాయి. ఈ నీళ్లతో తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు నింపవచ్చు.గేట్లు తెరిస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందని రేవంత్ అంటున్నారు. రేవంత్‌కు ప్రాజెక్ట్‌లపై అవగాహన తెచ్చుకోవాలి. గతంలో భారీ వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడింది. అన్నారం, సుందిళ్లకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్ చేయకుండా రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు. వరదను తట్టుకని మేడిగడ్డ.. మేటిగడ్డగా నిలబడింది. కాళేశ్వరంపై బురద చల్లేందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై రేవంత్ అజ్ఞాన ప్రదర్శన చేశాడు.మాపై కక్ష ఉంటే కేసులు.. కానీ, రైతులను పగబట్టకు. మీ రాజకీయం కోసం లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ, మన సీఎం మాత్రం సొంత రాష్ట్ర ప్రయోజనాలనే ఫణంగా పెడుతున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌పై ఒక్కనాడైనా సీఎం రేవంత్ రివ్యూ చేశారా?. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు. ఎప్పుడు అనుముల గురించే కాదు.. అన్నారం గురించి కూడా పట్టించుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతా
-
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సొంత సర్వేలో తేలిందన్న కేటీఆర్.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేల భయంతోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైంది. మరోసారి ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని తెల్చిచెప్పారు...సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే మరోసారి ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని.. సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
హిమాన్షుకు గాయం.. హైదరాబాద్‌కు కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు స్వల్పగాయమైంది. హిమాన్షుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కొన్ని రోజుల్లో కోలుకుంటారని కేటీఆర్ ఎక్స్‌లో చెప్పారు. తన కుమారుడి గురించి కాల్స్, మెసేజ్‌లు చేస్తున్న వారికి థ్యాంక్యూ చెప్పారు.తన మనవడు హిమాన్షును చూడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. హిమాన్షుతో కాసేపు మాట్లాడి పరామర్శించారు. కాగా, హిమాన్షు జిమ్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన ముక్కుకు గాయమైనట్లు సమాచారం. My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern— KTR (@KTRBRS) July 7, 2026 -
ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల డిజైన్ల తయారీ, నిర్మాణం, కూలిపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, బరాజ్‌ల వైఫల్యానికి నాటి సీఎం, ఇరిగేషన్, ఆర్థిక శాఖల మంత్రులే బాధ్యులని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తేల్చిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయని, సీకెంట్ పైల్స్, స్టిల్లింగ్ బేసిన్ల నిర్మాణంలో తప్పిదాలే ప్రధాన కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీ నివేదించిందని చెప్పారు. అయినప్పటికీ ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే’ అన్న తరహాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధోరణి ఉందని మంత్రి మండిపడ్డారు. బరాజ్‌ల భద్రత ప్రమాదంలో ఉందని, నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ కమిటీ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఒకవేళ నీళ్లను నిల్వ చేస్తే దిగువన ఉన్న భద్రాచలం పట్టణం, ఆలయంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయని తెలిపారు. ‘మీరు ఇదే కోరుకుంటున్నారా?’ అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. కేటీఆర్ కంటే ఎన్డీఎస్ఏ నిపుణులకు కొద్దిగా జ్ఞానం ఎక్కువ ఉందని భావించి బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేయడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. మీరే సరిగ్గా కట్టి ఉంటే.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా కట్టి ఉంటే ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇంత దురదృష్టకరమైన దుస్థితి ఉండేది కాదు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టును ఇష్టమొచి్చనట్లు నిర్మించారు. కాళేశ్వరం చేపట్టకుండా రూ.38,500 కోట్లతో ప్రాణహిత–చేవెళ్లను పూర్తి చేసి ఉంటే ఎల్‌నినో పరిస్థితుల్లో సైతం తెలంగాణ సస్యశామలమయ్యేది. బీఆర్ఎస్ పాలకుల ఘోర తప్పిదంతోనే మూడు బరాజ్‌లు పనికి రాకుండా పోయాయి. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలూ ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్చి రాష్ట్రానికి ద్రోహం చేశారు. నిర్మాణం పూర్తైన కొన్ని రోజులకే మూడు బరాజ్‌లలో లోపాలు, సీపేజీలు బయపడ్డాయి. అయినా మరమ్మతులు చేయకుండా గత సర్కారు నిర్లక్ష్యం చేసింది. మరమ్మతుల కోసం బరాజ్‌లలో నీళ్లను ఖాళీ చేసేందుకు గత ప్రభుత్వ పెద్దలు అనుమతించలేదు. అంతేకాదు..పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు. వ్యవస్థ కుప్పకూలిపోయింది. బీఆర్ఎస్ వాళ్లు ఏది ముడితే అది నాశనమైంది. మన పిల్లలు, వారి పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టి అధిక వడ్డీలతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పులు తెచ్చారు. దేశంలో మరే రాష్ట్రం చేయనంతగా రూ.1.81 లక్షల కోట్లను కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి ఎకరం కూడా కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురాలేదు..’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2027 ఆగస్టు నాటికి బరాజ్‌ల పునరుద్ధరణ ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లకు పరీక్షలు, మరమ్మతులను పూర్తి చేసి 2027 జూలై/ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరించి వినియోగంలోకి తెస్తాం. మూడు బరాజ్‌లకు రక్షణగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు స్టిల్లింగ్ బేసిన్ సామర్థ్యం పెంచాల్సి ఉంటుందని అంచనా వేశాం. నెల రోజుల్లో బరాజ్‌ల పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేసి పనులను ప్రారంభిస్తాం..’ అని మంత్రి తెలిపారు.కాగా బరాజ్‌లకు గేట్లను దింపితేనే నీళ్లను పంపింగ్ చేయడానికి వీలుంటుందని, ప్రస్తుతం గేట్లు దింపే పరిస్థితి లేదని నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్ చెప్పారు. నీటిపారుదల శాఖ సలహాదారులతో కలిసి ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బరాజ్‌ల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్డీఎస్ఏ సూచించిన అన్ని రకాల టెస్టులను పకడ్బందీగా నిర్వహిస్తుండడంతోనే పునరుద్ధరణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, సొరంగాల నిపుణులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌పై కక్షతోనే రైతులకు గోస
సాక్షి ప్రతినిధి, వరంగల్: కేసీఆర్‌పై రాజకీయ కక్షతో తెలంగాణ రైతులను ఈ ప్రభుత్వం గోస పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తెలంగాణకు వరప్రదాయిని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. ఓ వైపు ఎల్‌నినోతో 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొంటే.. మరోవైపు 98 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తుంటే ముఖ్యమంత్రి సిగ్గులేకుండా.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటిౖకైనా పంప్‌హౌస్‌లు ప్రారంభించకపోతే 60 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్‌హౌస్ ముట్టడించి గేట్లు తెరుస్తామని హెచ్చరించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం రైతుల ఆత్మహత్యలు ఆపింది.. ‘రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కన్నెపల్లి పంప్‌హౌస్‌లను నిలిపివేశారు. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి మేలు జరిగింది. రైతు ఆత్మహత్యలను ఆపింది. భూముల విలువ, తెలంగాణ రైతు విలువ పెంచింది. కానీ ముఖ్యమంత్రి దు్రష్పచారం చేస్తున్నారు. ప్రాజెక్టు రూ.94 వేల కోట్లు అయితే, రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటూ స్వయానా ముఖ్యమంత్రి మామే అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డైలాగులు చెప్పారు. 2014 కంటే ముందు మీరే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదు? ఉత్తమ్‌కుమార్.. మీ శ్రీమతి ప్రాతినిథ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో కాకతీయ కెనాల్లో ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయా?..’ అని కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందనే.. ‘కాళేశ్వరం ద్వారా ఇప్పుడు నీళ్లిస్తే యూరియా ఇవ్వాలన్న భయంతోనే రేవంత్ ఇలా చేస్తున్నారు. అంతేకాదు నీళ్లిస్తే పంటలు పండుతాయి. పంట పండితే బోనస్ అడుగుతారు. ఆ పంట మళ్ళీ కొనాలి. కాబట్టే నీళ్లు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. కాళేశ్వరం రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన ఒక అద్భుత వరం. రాష్ట్రానికి పట్టిన శని రేవంత్‌రెడ్డి అని జగిత్యాల సభలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చెప్పారు. ఒక వారం పాటు కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పజెప్పండి. మొత్తం తెలంగాణ నిండా నీటిని పారించే బాధ్యత మాది. కన్నెపల్లి నుంచి రోజుకు దాదాపు రెండు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ట్యాంక్‌బండ్ కెపాసిటీ ఒక టీఎంసీ, హుస్సేన్‌సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ. రెండు హుస్సేన్‌సాగర్‌లను లిఫ్ట్ చేసే కెపాసిటీ కాళేశ్వరం మోటార్లకు ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. పోలీసుల తీరుపై ఆగ్రహం ‘హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి నాలుగు గంటల్లో చేరాల్సిన మా బృందం, పోలీసులు విధించిన ఆంక్షల కారణంగా ఏడు గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. పెంబర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ తదితర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు..’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు మలోత్ కవిత, వినోద్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, విద్యాసాగర్‌రావు, జీవన్‌రెడ్డి, రాజయ్య, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది: కేటీఆర్
కన్నెపల్లికి తాము రాకుండా ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్‌ను వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వృథాగా పోతున్న జలాలను పరిశీలించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సముద్రంలో వెళ్తున్న నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రతో జలదౌత్యం చేశాం. నీళ్లు పల్లమెరుగు అనే నానుడిని తప్పు అని కేసీఆర్ నిరూపించారు. బీఆర్ఎస్ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నీళ్లు తీసుకొచ్చాం. నీళ్లు ఎత్తేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన వరం కాళేశ్వరం. ఆంక్షలు, ఆటంకాల నడుమ కన్నెపల్లి వద్దకు చేరుకున్నా. పంప్ హౌస్ వద్దకు రాకుండా మా కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోతుంది. నీళ్లు, నిధులు, నియామకాల మీద తెలంగాణ పోరాటం సాగింది. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సంకల్ప బలంతో నీటి పారుదల కోసం ఒక యజ్ఞంలా శ్రీకారం చుట్టారు. సముద్రానికి 80, 90 మీటర్ల ఉన్న గోదావరి నీటిని ఒడిసి పట్టి లిఫ్ట్ సాయంతో ఎగువకు పంపిచవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడి హెట్టి నిర్మాణానికి ప్రయత్నం చేయలేదు. తెలంగాణ బీడు భూములకు నీరు అందించాలని ఉద్దేశంతో జలదౌత్యం చేశారు. మూడున్నర సంవత్సర కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. సెంట్రల్ వాటర్ కమీషన్ పెట్టి బెస్ట్ పాయింట్ ని గుర్తించి ప్రాజెక్టు నిర్మించాం. మహారాష్ట్ర వెళ్లి ఒప్పించి వేగంగా నిర్మించారు’’ అని తెలిపారు. -
కన్నెపల్లి పంప్ హౌస్‌కు కేటీఆర్
కేటీఆర్ కన్నెపల్లి పర్యటన అప్డేట్స్కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలువృథాగా పోతున్న జలాలను పరిశీలించిన కేటీఆర్కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సముద్రంలో వెళ్తున్న నీటిని ఎత్తిపోయాలని డిమాండ్పెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణంపెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణుల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా కేవలం కేటీఆర్ వాహనానికి మాత్రమే అనుమతి ఇస్తామని, మిగిలిన నాయకులు, కార్యకర్తల వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కేటీఆర్.. తన వాహనాన్ని రహదారిపైనే నిలిపివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను నెట్టేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పెంబర్తి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
ఆగని అప్పుల రగడ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన అప్పులపై చెలరేగిన వివాదం మూడో రోజు కూడా కొనసాగింది. తొలిరోజు.. కేటీఆర్ చేసిన బహిరంగ చర్చ సవాల్‌తో రభస ప్రారంభం కాగా, రెండో రోజు గురువారం గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదిక గా రచ్చరచ్చ అయ్యింది. మంత్రివర్గ భేటీలోనూ చర్చనీయాంశమైంది. ఇక శుక్రవారం అప్పులపై అధికార పక్షం, విపక్షం లేఖాస్ర్తాలు సంధించుకున్నాయి. తాను చెప్పిన అప్పు లెక్కలకు కట్టుబడి ఉన్నానంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావుకు లేఖలు రాసిన ఆయన.. తాను చెప్పిన అప్పు లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించినా, నిరూ పించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.దీనిపై చర్చించేందుకు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తున్నానని, బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని సవాల్ చేశారు. చెప్పినట్లే సాయంత్రం ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా మంత్రి జూపల్లి లేఖలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. తాను కూడా ఆయనకు ఒక లేఖ రాశారు.కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల గణాంకాలతో పాటు, బీఆర్ఎస్ చేసిన అప్పుల లెక్కలను అందులో వివరించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి, తాను అప్పుల గురించి మాట్లాడిన వీడియోలను వాట్సాప్ ద్వారా మంత్రి జూపల్లికి పంపారు. ఇవి చూసిన తర్వాతైనా రాజీనామా చేయాలన్నారు. మరోవైపు సంగారెడ్డిలోనూ మాట్లాడుతూ..జూపల్లిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం భట్టి కూడా శుక్రవారం.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ హ యాంలో చేసిన అప్పులు, చెల్లింపులపై గణాంకాలు వెల్లడించారు. -
కుర్చీ, శాలువా రెడీ చేసినా రాలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు చర్చకు రాకుండా తోక ముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు వస్తానని చెప్పడంతో ప్రత్యేకంగా కుర్చి, శాలువా సిద్ధం చేసి మూడు గంటల పాటు వేచి చూసినా రాలేదన్నారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గన్‌పార్క్ వద్ద చర్చకు వెళ్లేందుకు సిద్ధమైతే హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. నన్ను కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు రానీయకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఒకవైపు మంత్రులు సవాళ్లు విసురుతుంటే మరోవైపు పోలీసులతో మమ్మలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. కంచ¯న్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పార్టీ నేతలను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చర్చించే ధైర్యం లేక ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనించారు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో సదస్సులు ‘రాష్ట్రంలో ’ఆర్ఆర్ టాక్స్’వసూళ్లపై ప్రధానమంత్రి వ్యాఖ్యల తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అమత్, హోలోగ్రామ్ టెండర్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ఎందుకు జరగడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ నేతలకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 14 డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. త్వరలో రైతు, యువజన, విద్యార్థి సదస్సులు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ముఖ్యమంత్రి, మంత్రులు ఈరోజు చర్చ నుంచి తప్పించుకున్నా ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం ఆగదు..’అని కేటీఆర్ అన్నారు. వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి‘ముఖ్యమంత్రి రేవంత్‌కు నిజంగా చర్చించే ధైర్యం ఉంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సభలో మైక్ కట్ చేయకుండా మాకు మాట్లాడే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, ఎన్నికల హామీల అమలుపై పూర్తి వివరాలను ప్రజల ముందు పెడతాం. రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం పొంతన లేని గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్బీఐ, కాగ్ వెల్లడించిన లెక్కలే దీనికి ప్రామాణికం. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై వాస్తవాలు ప్రజలకు తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శిఖండి రాజకీయాలు చేస్తోంది..’అని కేటీఆర్ మండిపడ్డారు. -
చర్చ.. రచ్చ!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో గురువారం రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, బీఆర్ఎస్ హయాంలో అప్పుల విమర్శలు ఇందుకు కారణమయ్యాయి. ఆయా అంశాలపై చర్చకు సిద్ధమన్న ఇరుపక్షాలు ఎలాంటి చర్చలూ జరగకుండానే గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదికగా పరిస్థితిని రచ్చరచ్చగా మార్చాయి. ముగ్గురు మంత్రులు గన్‌పార్క్ వద్దకు చేరుకుని మరోసారి విపక్షానికి సవాల్ విసరగా, గన్‌పార్క్ వద్ద చర్చకు సై అన్న విపక్ష నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద మాట్లాడిన మంత్రులు, తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రెండు రోజులుగా మాటల యుద్ధం అవినీతి, అప్పులపై ఉభయ పార్టీల మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సై అంటూనే అప్పులకు సంబంధించిన తప్పుడు లెక్కలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్పందించారు. మరోవైపు గురుకులాల్లో విద్యార్థులకు సరఫరా చేసే యూనిఫాం, విద్యా కిట్లలో రూ.2 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ చేయగా, తాము సిద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్కు వద్దకు వచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ లేదా హరీశ్‌రావు తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. గన్‌పార్క్ వద్ద జూపల్లి, అడ్లూరి, అజహర్, పొన్నం కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు హరీశ్ తరలింపు మంత్రులతో గన్‌పార్కు వద్ద చర్చకు తాను సిద్ధమంటూ హరీశ్‌రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. అయితే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు. కానీ తాను వెళ్లి తీరతానంటూ హరీశ్ పట్టుపట్టడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ భవన్‌లోనే కేటీఆర్ బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అప్పులపై తనతో చర్చించేందుకు రావాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సవాల్ చేసిన కేటీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే తెలంగాణ భవన్‌కు వస్తానన్న జూపల్లి రాకపోగా.. గన్‌పార్క్‌కు రావాలంటూ సవాల్ చేయడంతో.. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్ వెళ్లడానికి బయలుదేరారు. కానీ ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..మీ మంత్రులు పారిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, తాను గన్‌పార్క్‌కు వెళ్తానని అన్నా సరే ఆయన తెలంగాణ భవన్ దాటి రాకుండా పోలీసులు నిలువరించారు. అప్పుల గణాంకాలు వెల్లడించిన జూపల్లి గాందీభవన్‌లో జరిగిన ప్రజలతో ముఖాముఖి అనంతరం నేరుగా గన్‌పార్క్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు, 2023లో బీఆర్ఎస్ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను గణాంకాలతో సహా వివరించారు. తాను చెప్పిన గణాంకాలు తప్పని కేసీఆర్‌తో చెప్పిస్తే తాను చెప్పిన కట్టుబడి రాజీనామా చేస్తానని మరోమారు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మళ్లీ తెలంగాణ భవన్‌కు హరీశ్ ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ నుంచి నేరుగా మళ్లీ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అయితే చివరకు రెండు పార్టీల నేతలు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవినీతి, అప్పులపై చర్చించాలని పట్టుపట్టడం గమనార్హం. ఇలావుండగా మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. -
మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో
-
‘మంత్రులు గన్‌పార్క్‌కు కాదు.. జూపార్క్‌కి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: మంత్రులు తొడ కొట్టడం ఎందుకు? తోక మూడవటం ఎందుకు?. చేత కానప్పుడు.. మంత్రులు ఎందుకు సవాళ్లు విసిరారు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తప్పుల మీద.. మా మీద వేస్తున్న అప్పులు నిందల గురించి సవాల్ చేశాను. టైము, డేటు, ప్లేస్ రేవంత్‌నే చెప్పమన్నా.. మధ్యలో జూపల్లి దూరారు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘జూపల్లి ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌కు వస్తున్న అని తొడగొట్టారు.. జూపల్లికి స్వాగతం చెబుదామని శాలువా, దండలు రెడీ చేసుకుంటే తోక ముడిచి పారిపోయి గాంధీభవన్‌లో దాక్కున్నాడు. మంత్రులు రావాల్సింది గన్ పార్క్‌కు కాదు.. జూ పార్క్‌కి.. విచిత్రమైన వ్యక్తుల్ని జూ పార్క్‌లో పెట్టాలి. గన్ పార్క్‌కి బయలుదేరితే మా వాళ్లని అరెస్ట్ చేశారు.. పోలీసులను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారు.’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూసుకుంటూ ఊరుకోవటానికి కాదు ఇక్కడ ఉన్నది కేసీఆర్ దళం.. తెలంగాణ అప్పుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ ఏం చెప్పింది?. పార్లమెంట్లో చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు.. రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్ల అంటాడు.. భట్టి విక్రమార్క 7 లక్షల కోట్ల అప్పంటాడు. రేవంత్ రెడ్డికి అప్పులు చేయటం.. భూములను అమ్మటం, అనుముల బ్రదర్స్‌కి దోచి పెట్టడం ఇదే తెలుసు.’’ అంటూ కేటీఆర్ ఆరోపించారు. -
పోలీసులతో వాగ్వాదం KTR అరెస్ట్
-
బీఆర్ఎస్-కాంగ్రెస్ సవాళ్ల నడుమ.. కేసీఆర్‌కు అద్దంకి ఫోన్
కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల అప్డేట్స్.. తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశంలో హరీష్తెలంగాణ భవన్‌కు వస్తానన్న మంత్రి జూపల్లి ఎందుకు రాలేదు: హరీష్జూపల్లికి చీము, నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిమంత్రి జూపల్లికి విషయం లేకనే చర్చకు రాలేదుమంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు వస్తానని సెల్ఫ్‌గోల్ వేసుకున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదుకేసీఆర్ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు: అద్దంకికేసీఆర్ బయటకు రావడానికి బయపడుతున్నాడు.బీజేపీ పొత్తులొ ఎక్కువ సీట్లు లాగేందుకు బిఆర్ఎస్ బలంగా ఉందని చెప్పేందుకు కేటీఆర్- హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు.జీతం తీసుకునేందుకే మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ వస్తున్నారు.కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు హరీష్ రావు, కేటీఆర్.కేటీఆర్, హరీష్ ను పంపి తెలంగాణను ఆగం చేస్తున్నారు.కేటీఆర్- హరీష్ రావు సైడ్ యాక్టర్స్.బీజేపీ- బిఆర్ఎస్ మధ్య సీట్ల ఒప్పందం జరుగుతుంది.ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫోన్మీడియా సమావేశం నుంచే కేసీఆర్‌కు ఫోన్ చేసిన అద్దంకిఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఇలాగే చేస్తానంటుంన్న అద్దంకిఅసెంబ్లీకి రావాలని కోరడానికే కేసీఆర్‌కు ఫోన్ చేస్తున్నా అంటున్న అద్దంకి. తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.తెలంగాణ భవన్ వద్ద మరోసారి హైటెన్షన్..గన్‌పార్క్‌కు బయలుదేరిన కేటీఆర్.గన్‌పార్క్‌కు వెళ్తుండగా కేటీఆర్‌ను అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం.పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం.కేసీఆర్ రావాలంటే రాహుల్ గాంధీ రావాలిరాహుల్ గాంధీని తోలుకొస్తే.... కేసీఆర్ ను తెచ్చే భాద్యత నాదిఅక్కడేమో మంత్రులు తొడలు కొడుతున్నారు.. ఇకడేమో పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారుముఖ్యమంత్రి సవాల్ విసిరితే సందట్లో సడేమియా అన్నట్టు మద్యలో జూపల్లి దూరిండుఅన్ని లెక్కలు చెప్పడానే సిద్ధంగా ఉన్నాం.సీఎం, జూపల్లికి కేటీఆర్ సవాల్.. అరెస్ట్ ఎందుకు.. చర్చకు దమ్ము లేదా?: కేటీఆర్ సవాల్తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌తో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.సవాల్ చేసిన సీఎం తోక ముడిచి పారిపోయారు.సవాళ్ల మధ్యలో మంత్రి జూపల్లి దూరారు.చర్చకు సిద్దమైతే మంత్రి జూపల్లి ఎక్కడికి పోయారు.బహిరంగంగా చర్చించే దమ్ము మంత్రులకు లేదు.చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు చేయాలి?.చర్చించేందుకు కనీసం అసెంబ్లీ అయినా పెట్టండి.సవాళ్లు చేయడం.. పారిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనం.ముఖ్యమంత్రి, మంత్రులు చేతకాని వాళ్లని తేలిపోయింది.విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు.చర్చకు మంత్రి వస్తారనుకుంటే ముఖం చాటేశారు.ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం బయటపడింది.మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు.అప్పులపై చర్చకు రావాలని మొన్న సీఎం సవాల్ విసిరారు.గురుకులాల్లో అవినీతిపై చర్చకు వెళ్తే హరీష్‌రావును అరెస్ట్ చేశారు.తెలంగాణ భవన్‌కు వస్తానని జూపల్లి అన్నారు.తెలంగాణ భవన్‌కు రాకుండా జూపల్లి ఎక్కడో మాట్లాడుతున్నారు.దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, సభలోనే చర్చిద్దాం.గన్‌పార్క్ దగ్గర జూపల్లి ఉంటే, మేం అక్కడికే చర్చకు వస్తాం.మేం గన్‌పార్క్ వెళ్తే చార్మినార్ రమ్మంటారు.చార్మినార్ వెళ్తే కొల్లాపూర్ రమ్మంటారు.అసలు తన శాఖలో ఏం జరుగుతుందో జూపల్లికే తెలియదు.లేదంటే మా వాళ్లను కంచన్‌బాగ్‌కు పంపించారు కదా..అక్కడికే రండి అక్కడే చర్చిద్దాం.సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తే.. అక్కడ చర్చకు మేం రెడీ.ముఖ్యమంత్రి రేవంత్.. సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలి.హరీష్‌రావు చర్చలకు వస్తే అరెస్ట్ చేయిస్తారు. కంచన్‌బాగ్ పీఎస్‌కు బీఆర్ఎస్ నేతలుతెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. హరీష్ సహా గులాబీ పార్టీలను కంచన్‌బాగ్ పీఎస్‌కు తరలింపుపోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర బీఆర్ఎస్ నేతల బృందాన్ని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో సిటీ చుట్టూ తిప్పుతున్న పోలీసులుపోలీసుల వాహనం వెంబడి వందలాది వాహనాల్లో బయల్దేరిన బీఆర్ఎస్ శ్రేణులుహరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వరకు వెంటే వస్తామంటున్న బీఆర్ఎస్ శ్రేణులు https://t.co/BwNMKhesLv pic.twitter.com/Z8VfKmNEG8— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026 జూపల్లి కోసం కేటీఆర్ వెయిటింగ్..మంత్రి జూపల్లి కోసం తెలంగాణభవన్‌లో ఎదురుచూస్తున్న కేటీఆర్తెలంగాణభవన్లో చర్చ కోసం జూపల్లికి కుర్చీ ఏర్పాటు.సవాల్ చేయడం కాదు.. జూపల్లి రావాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..హరీష్, కేటీఆర్ కోసం రెండు గంటల పాటు ఎదురుచూశాంముగ్గురం మంత్రులం అమర వీరుల స్తూపం దగ్గరకి వచ్చి వెయిట్ చేశాంహరీష్, కేటీఆర్ చర్చకు రాలేదుబీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధంపోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? అంటూ ప్రశ్నలు. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే..హరీష్ రావు సహా బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.హరీష్‌ను అరెస్ట్ చేసి వాహనం ఎక్కించిన పోలీసులు. హరీష్ కామెంట్స్..మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు వస్తానన్నారు.. తోక ముడిచారు.గురుకులాలపై చర్చలకు గన్‌పార్క్‌కు రమ్మన్నారు.మేము వస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారు.చర్చకు రావాలని పిలిచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?.అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే.పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.ప్రభుత్వ అవినీతిని ప్రజలు, అసెంబ్లీ ముందు పెడతాం. మరోవైపు.. మంత్రి పొంగులేటి సీఎల్పీకి చేరుకున్నారు. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోవద్దు..గన్‌పార్క్ బయలుదేరిన హరీష్‌రావును అడ్డుకున్న పోలీసులు.పాదయాత్రగా గన్‌పార్క్ వెళ్లేందుకు సిద్దమైన హరీష్.హరీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు.పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని హరీష్ ఆగ్రహం.ప్రభుత్వానికి దమ్ముంటే తమను అడ్డుకోవద్దని సవాల్మంత్రి జూపల్లి కామెంట్స్గాంధీ భవన్లో మంత్రి జూపల్లిహరీష్ రావు గన్ పార్క్ వస్తున్నానని చెప్పారుబావ బామ్మర్దులు ఇద్దరు రండినేను సైతం గన్ పార్క్ దగ్గరికి వస్తున్నానువారి సవాల్‌కు సమాధానం అక్కడే ఇస్తానుబావ ఒక దగ్గర బామ్మర్ది ఒక దగ్గర ఎందుకు?.ఇద్దరూ గన్ పార్క్ రండి ఇద్దరికీ అక్కడే సమాధానం ఇస్తాను.హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధం అంటున్న మంత్రులు..ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించండి అంటూ మంత్రుల వ్యాఖ్యలు... తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా..కారులో నుంచే మంత్రి పొన్నంకు హరీష్ ఫోన్ కాల్.మంత్రి పొన్నం తన కాల్ లిఫ్ట్ చేయడం లేదన్న హరీష్.పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీష్ సీరియస్.మంత్రులకు ఫోన్ చేసినా తీయడం లేదని వ్యాఖ్యలు..పోలీసులతో హరీష్ వాగ్వాదం..పోలీసుల అదుపులో హరీష్. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. హరీష్‌రావు అడ్డగింత.. గన్‌పార్క్‌కు బయలుదేరిన హరీష్‌రావును అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదంమంత్రులే గన్‌పార్క్ వద్దకు తనను రమ్మనారంటూ హరీష్ వాగ్వాదంమా కోసం మంత్రులు ఎదురుచూస్తున్నారు. గన్‌పార్క్‌కు బయలుదేరిన హరీష్మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులతో చర్చకోసం అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలుమంత్రి జూపల్లితో చర్చ కోసం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎదురుచూస్తున్న మరో బృందంతెలంగాణభవన్లోనే కేటీఆర్ ఉంటారు.ఎక్కడైనా మేం చర్చకు సిద్దం.గురుకులాలపై అన్ని ఆధారాలతో మేము వస్తున్నాం.చర్చకు మేం సిద్ధం.మంత్రులు అక్కడే ఉండాలి.మీ చాలెంజ్‌లు, బహిరంగ సవాళ్లకు మేం భయపడం: మంత్రి అడ్లూరిఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వద్ద ఆధారాలుంటే చూపించాలి: మంత్రి పొన్నంఅవినీతి చేసినట్టు నిరూపిస్తే మేం రాజీనామా చేస్తాం: పొన్నం తెలంగాణలో పొలిటికల్ హీట్.. తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపుకాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్గురుకులాల్లో అవినీతి జరిగిందంటోన్న బీఆర్ఎస్మంత్రులు అడ్లూరి, అజహారుద్దీన్, పొన్నం చర్చకు రావాలంటోన్న బీఆర్ఎస్దీంతో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపు గన్‌పార్క్ చేరుకున్న మంత్రులు..గన్ పార్క్‌కి చేరుకున్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలుచర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్..కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ.. తెలంగాణ భవన్ వద్ద మోహరించిన పోలీసులు లు.తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలుమినిస్టర్ క్వార్టర్స్ నుంచి గన్ పార్క్‌కి బయలుదేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్రాష్ట్ర అప్పులపై సవాళ్లు..రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు.10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.చర్చకు సిద్ధమైతే తెలంగాణ భవన్‌కు వస్తానన్న జూపల్లి.రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమంటున్న బీఆర్ఎస్కాసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్న కేటీఆర్ , హరీష్ రావు.మంత్రులు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధమా అంటూ మంత్రులకు సవాల్ విసిరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు బయలుదేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.అమరవీరుల స్థూపం వద్దకు కేటీఆర్, హరీష్ రావు రావాలంటున్న మంత్రులు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ , అమరవీరుల స్థూపం వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బలగాలు.మంత్రి అడ్లూరి కౌంటర్.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్.ఆరోపణలు చేసి తొక ముడవడం కాదు.. నిరూపించాలని డిమాండ్.ఆర్ఎస్ ప్రవీణ్ చిట్టా మా దగ్గర ఉందిఅందరి లెక్కలు తేలుస్తాం. -
నేను రెడీ.. మీరు రెడీనా?
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చకు వరంగల్ చౌరస్తానా? అశోక్‌నగర్ చౌరస్తానా? అసెంబ్లీ, ప్రెస్‌క్లబ్, కొత్తగా రూ.200 కోట్లతో కట్టుకున్న సీఎం ఇంద్రభవనంలో అయినా చర్చకు సిద్ధమని అందుకు తేదీ, సమయం, ప్రాంతం సీఎం చెప్పాలని ఏ టాపిక్ అయినా సరే చర్చకు సిద్ధమని, ప్రభుత్వం వైఫల్యాలను గణాంకాలతో నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, వివేకానంద తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి నల్లగొండ సభ, శిల్పకళావేదిక సభలో బీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శించడంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పులకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పే సంఖ్యలో తేడాలున్నాయని, వీరిద్దరూ చెప్పే దానికి పార్లమెంట్లో వీరి చీకటి మిత్రుడు రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్రం కాగ్, ఆర్బీఐ నుంచి తీసుకొని ఇచ్చిన లెక్కలకు చాలా తేడాలున్నాయన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.72 వేల కోట్లు అయితే.. తాము దిగిపోయేనాటికి ఉన్న అప్పులు మొత్తం రూ.3.5 లక్షల కోట్లు అని, తమ పదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.2.78 లక్షల కోట్లు అని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతులకు రూ.1.75 లక్షల కోట్లు వ్యయం చేశారంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.1.56 లక్షల కోట్లు వ్యయం చేశారంటున్నారని, ఇద్దరి మధ్య ఐదు నిమిషాల వ్యవధిలోనే రూ.20 వేల కోట్ల తేడా చెబితే ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. నెలకు అప్పులు, అసలు కింద ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.2,500 కోట్లలోపు ఉంటుందని కాగ్ నివేదిక చెబుతుంటే.. వీరు బయట మాత్రం రూ.6,000 కోట్లు చెల్లిస్తున్నారని అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కుటుంబం, మంత్రుల దోపిడీతోనే... సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాలా తీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి భావదారి్రద్యంతో మాట్లాడుతూ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దివాలా, ఎయిడ్స్ రోగి, కేన్సర్ పేషెంట్ అంటూ తాను పాలించే రాష్ట్రం గురించి ఏ ముఖ్యమంత్రి ఇంత నీచంగా మాట్లాడరన్నారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి, మరి 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు మానసిక జబ్బు ఉందేమో అన్న అనుమానం వస్తుందని కేటీఆర్ అన్నారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో.. కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, అట్లాంటి పరిపాలనకు సంబరాల పేరిట బలవంతపు కార్యక్రమాలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. మొన్నటికి మొన్ననే సంపూర్ణంగా రైతుబంధు వేస్తాను..అందరికీ ఇస్తాను అని చెప్పి కేవలం ఒక ఎకరానికి ఇచ్చి, ఒక్కొక్క ఎకరానికి డబ్బులు వేసిన ప్రతిసారి సంబరాలు చేసుకుంటూ ఉత్త మాటలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎవరికీ డబ్బులు లేవు కానీ... రాహుల్‌గాంధీకి మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటూ రేవంత్ చెబుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డి పాలన మాత్రం పాతాళానికి పడిపోతుందని చెప్పారు. అది రాష్ట్ర ఆదాయం అయినా కావొచ్చు...రియల్ ఎస్టేట్ రంగం కావొచ్చు...చివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జీఎస్టీ వసూలు ఇలా ప్రతి ఒక్క రంగంలో మందగమనం ఉందన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో మిగిలింది మందగమనం, మందు గమనం తప్పించి ఇంకేమీ లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారన్నారు. నిజంగానే రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని కేటీఆర్ సవాలు విసిరారు. నాలుక మడత తిప్పిన రేవంత్‌రెడ్డి ధాన్యం ప్రతి గింజా కొంటాం..తాము సేకరించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాడుతాం అన్న సీఎం రేవంత్‌రెడ్డి..ఇప్పుడు కేంద్రం ఎంత కోటా ఇస్తే అంతే కొంటాం అంటూ నాలుక మడత తిప్పారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ అంగుష్ట మాత్రుడని, ఆయన నోరు మూసీ కంపుకంటే ఘోరం అని వ్యాఖ్యానించారుం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేబినెట్ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎత్తు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 18,500 కోట్లకు ఆదాయం పెంచాం రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు వచ్చే నెలసరి ఆదాయం రూ.4 వేల కోట్లు అయితే, తాము దిగిపోయేనాటికి ఆ ఆదాయాన్ని రూ.18,500 కోట్లకు పెంచామని కేటీఆర్ అన్నారు. జీఎస్డీపీని రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు గడిచిన 30 నెలల్లోనే రూ.1.13 లక్షల కోట్ల బకాయి పడిందన్నారు. రైతుబంధు కింద రూ.30 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.22వేల కోట్లు, రుణమాఫీ రూ.29 వేల కోట్లు, ధాన్యానికి బోనస్ రూ.16 వేల కోట్లు, కూలీలకు రూ.15 వేల కోట్లు బకాయిపడ్డారని చెప్పారు. -
రాజీనామా చేస్తానంటూ.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్
హైదరాబాద్: కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు అప్పులే కాదా? అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మిషన్ భగీరథ పేరుతోనే రూ.40 వేల కోట్ల అప్పు తెచ్చారని అన్నారు. జూపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కార్పొరేషన్ల అప్పును నేను నిరూపిస్తా.. నేను చెప్పిన లెక్క తప్పు అయితే రాజీనామా చేస్తా.. చర్చకు మీ బీఆర్ఎస్ భవన్‌కు రావడానికి సిద్ధం. నేను చెప్పిన లెక్క తప్పు అయితే ఈ రోజే రాజీనామా చేస్తాను. నేను చెప్పింది అబద్దం అయితే స్పీకర్‌కు నా రాజీనామాను ఇస్తాను. అప్పుల గురించి ఇజ్జత్ పోతుందని మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ గమనించే మిమ్మల్ని గద్దె దించారు. తెలంగాణ రాష్టం ఇచ్చింది సోనియా గాంధీ. తామే తెచ్చామని చెప్పుకోవడం బీఆర్ఎస్ వాళ్ల భ్రమ. బీజేపీ మూడు నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కావడానికి కారణం కూడా బీజేపీనే. తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాల వల్ల రాష్టం ఏర్పడింది’’ అని విమర్శించారు.పాత ముచ్చట్లు చెబుతున్నారు.. కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పాత ముచ్చట్లు చెబుతున్నారని జూపల్లి చెప్పారు. ‘‘50 శాతం ఈ ప్రభుత్వం టర్మ్ అయిపోయింది.. ఏం చేసిందో ప్రభుత్వం చెప్పుకోవడం లేదంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తీరు దేశం మొత్తం చూసింది. త్యాగాలతో ఏర్పడింది తెలంగాణ రాష్టం. మిగులు బడ్జెట్, ధనిక రాష్టం, తర్వాత రూ.8 లక్షల కోట్లు అప్పు.. ఇది బీఆర్ఎస్ పరిపాలన తీరు. తాము చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నారు కేటీఆర్.కేసీఆర్‌కు, కేటీఆర్‌కు చిన్న మెదడు, పెద్ద మెదడుకు చిల్లు పడి రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టారు. ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న రూ.2 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి? రూ.20 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ నుంచి రూ.40 వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇది ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలా? బీఆర్ఎస్ నేతలు మాట్లాడేవి అన్ని అబద్ధాలు’’ అని అన్నారు. -
టాపిక్.. ప్లేస్.. డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమ పాలనలో కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామని.. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కట్టడాలను చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టామన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారంటూ ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం రేవంత్ రూ.29 వేల కోట్లు ఎగ్గొట్టారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ జన్మహక్కు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘సీఎం రేవంత్, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. డబ్బులు లేవంటూనే రూ.200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీఎం రేవంత్‌తో చర్చకు నేను సిద్ధం. టాపిక్.. ప్లేస్, డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి. సవాల్ విసిరి పారిపోయే అలవాటు సీఎం రేవంత్‌దే. మీ తప్పులను బయటపెట్టకపోతే రాజకీయాలను నుంచి తప్పుకుంటా. ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్.. దేనిపైనైనా చర్చకు రెడీ’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. -
కేటీఆర్ ర్యాలీలో జగనన్న ఫ్లెక్సీ
వికారాబాద్: సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఓ అభిమాని కేటీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోలో కూడిన ఫ్లెక్సీని పట్టుకుని ర్యాలీలో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నాడు. వికారాబాద్ కేటీఆర్ పర్యటనలో కేసీఆర్, వైఎస్ఆర్, కేటీఆర్, జగన్ ఫ్లెక్సీ 🔥@KTRBRS, @ysjagan 🔥 pic.twitter.com/RYsIyWUysQ— ShashanKTR1🚗 (@Shashanktrs8) June 28, 2026 -
మోదీ అంటే రేవంత్‌కు భయం: కేటీఆర్
వికారాబాద్/మొయినాబాద్: స్పీకర్.. సీఎం..ఇక్కడి ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల పేరిట రైతుల భూములు కొల్లగొడుతున్నారని, బాధిత రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అధ్యక్షతన సర్, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ ‘స్పీకర్ పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు... పోలీసులారా ఖబడ్దార్.. వచ్చేది మేమే.. మా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మేము మిమ్మల్ని గుర్తు బెట్టుకుంటం.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం’అన్నారు. సీఎంను ప్రశ్నిస్తే ‘ఎంత మొగోడైనా మూడు నెలల్లో పిల్లలు పుట్టిస్తరా అంటడు.. మూడు నెలల్లో పుట్టరు.. ముప్పై నెలలు అయినా పుట్టకపోతే ఏమనాలో మీరే చెప్పాలి’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ అంటే భయమని, బడేభాయ్ ఏది చెప్తే.. చోటా భాయ్ జీ హుజూర్ అంటారని, అందుకే బడేబాయ్ అడగ్గానే దామగుండం అడవిలో 2,700 ఎకరాలు నేవీకి రాసిచ్చిండని, నాడు తమకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అడవి జోలికి రాకుండా మోదీని అడ్డుకున్నామన్నారు. ప్రతి ఒక్కరు బూత్ స్థాయినుంచి గట్టిగా పనిచేయాలని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనే నినాదంతో ముందుకు వెళితే అధికారంలోకి వచ్చేది మనమే అన్నారు. లోక్‌సభకు ఎన్నికకు నామినేట్ చేసిన మీనాక్షినటరాజన్ అభ్యర్థిత్వాన్ని నాశనం చేసింది ముమ్మాటికి సీఎం రేవంత్‌రెడ్డే అని, బీజేపీ కాంగ్రెస్‌ది అక్రమ పొత్తులని అందరికి అర్థం అవుతోందన్నారు. ఓట్లు తొలగించి పశ్చింబెంగాల్లో మమతను బీజేపీ ఓడించిందని, ఏపీలోనూ చంద్రబాబు ఇదే చేయించి వైసీపీని ఓడించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబ సభ్యులు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎనికేపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త డప్పు కరంచంద్ కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. పార్టీ పరంగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం
పరిగి: ‘మోసపోతే గోస పడుతామని పరిగి గడ్డపై నిలబడి కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు నరకం చూస్తున్నారు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగిలో ‘సర్’పై నిర్వహించిన శిక్షణ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ రైతులకు పట్టాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్.. ఇప్పుడు పారిశ్రామిక పార్కుల పేరిట వేలాది ఎకరాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ధాన్యం కూడా పూర్తిగా కొనలేకపోతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరిపోయే దీపం లాంటివారని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. కమీషన్ల కోసమే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి చేశామని.. కానీ రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్ నిలదీశారు. ఉద్దండాపూర్ నుంచి గ్రావిటీ ద్వారా వికారాబాద్ జిల్లాకు కాల్వల ద్వారా నీటిని తీసుకురావచ్చని సిద్ధం చేస్తే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కమీషన్లు, కుటుంబ సంపాదన కోసం రూ. 440 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టారని దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని.. రైతులకు పరిగితోపాటు కొడంగల్, జిల్లా మొత్తానికి సాగు నీరు అందించే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పార్టీ నేతలు అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, శివనోళ్ల భాస్కర్, రాజిరెడ్డి, సురేందర్, అశోక్‌కుమార్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
72 సార్లు ఢిల్లీకి పోయి 72 పైసలు కూడా తేలేదు: కేటీఆర్
సాక్షి, చేవెళ్ల: రైతులు సహా అన్నివర్గాలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చి.. అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. గురువారం చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ‘సర్’ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు సాయాన్ని వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. అలాంటి రేవంత్‌ను ఏమనాలో రైతులే చెప్పాలన్నారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు పలికిన భూముల ధరలు ప్రస్తుతం భారీగా పడిపోయాయని అన్నారు. పెట్టుబడులు తగ్గడంతో పాటు నిర్మాణ రంగం కూడా మందగించిందని చెప్పారు.రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. ప్రజల సమస్యల పరిష్కారం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. "72 సార్లు ఢిల్లీకి వెళ్లి 72 పైసలు కూడా తీసుకురాలేకపోయారు" అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. "హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు. -
మెట్రో పేరుతో డ్రామాలు
గచ్చిబౌలి/మియాపూర్: సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో విషయంలో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కేంద్రాన్ని రేవంత్‌రెడ్డి ఏదో అడిగినట్లు, కిషన్‌రెడ్డి ఏదో తీసుకొస్తున్నట్లుగా ఢిల్లీలో మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ సభ్యత్వ, ‘సర్’శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తులపై సీఎం రేవంత్ కన్నేశారని.. అందుకే అధికారులను బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. 250 ఎకరాలను కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి మెట్రో రైళ్లను దివాలా తేయించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. కిషన్‌రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్డీకాపూల్ నుంచి పటాన్చెరు వరకు గతంలో తాము ప్రతిపాధించిన మెట్రో రైలు అలైన్‌మెంట్‌కు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. జనసాంద్రత ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే రేవంత్‌రెడ్డి రద్దు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. శేరిలింగంపల్లిని రూ. 9,500 కోట్లతో అభివృద్ధి చేశాం.. శేరిలింగంపల్లిలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 9,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని కేటీఆర్ చెప్పారు. సినీహీరో రజనీకాంత్ శేరిలింగంపల్లి ప్రాంతాన్ని చూసి హైదరాబాద్‌లో ఉన్నానా లేక అమెరికాలో ఉన్నానా అనే సందేహం కలుగుతోందని అన్నారంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో అందరూ గుర్తుచేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ముందు వారిని లక్షాధికారులను చేయాలని సూచించారు. ఒక్కో మహిళకు రూ. లక్షన్నర ఇస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. కార్యకర్తలే డ్రైవర్లు.. ‘కారు’కు కార్యకర్తలే డ్రైవర్లని, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతి ఒక్కరూ కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం అహారి్నశలూ శ్రమిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ కేటీఆర్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, నాయకులు రాగడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబ, బొబ్జానవతా రెడ్డి, రోజా రంగారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంక్షోభం తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో పంటలు కొనే నాథుడే లేడని.. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రజల కోసం ఒక్క మంచి పని చేసిన దాఖలా లేదన్నారు. -
అర్జున్‌రెడ్డి హిట్.. రేవంత్‌రెడ్డి ఫట్
శంషాబాద్: ‘‘ఆమధ్య విడుదలైన అర్జున్‌రెడ్డి అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కానీ మన రాష్ట్రంలో ఇంటర్వెల్ వరకు వచ్చిన రేవంత్‌రెడ్డి సినిమా మాత్రం ఫట్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్‌రెడ్డి సినిమాతో రాష్ట్రంలో 4 కోట్ల మంది నష్టపోతున్నారు’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు.రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన ‘సర్’ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి... ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో రూ. లక్షన్నర చొప్పున జమ చేస్తే రాజకీయాలను మానేస్తానని సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 4 వేలతోపాటు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాహుల్‌బంధు మాత్రమే : రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు లేదని.. రాహుల్ బంధు మా త్రమే ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు యురియా లేదని.. కనీసం వాటిని దాచుకోవడానికి సంచులు ఇక్కడ ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని సంచులు ముట్టజెప్పి రెన్యూవల్ చేయించు కుంటున్న సీఎం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియను బూత్ స్థాయి కార్యకర్తలు నిశితంగా పరిశీలించి దొంగ ఓట్లను తీయించి అసలు ఓట్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణీదేవి తదితరులున్నారు. -
గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం అధికార పీఠానికి దూరమైన బీఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం సాధించాలని భావిస్తోంది. ఇందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్న బీఆర్ఎస్ మరోవైపు సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపైనా దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది పార్టీ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాదయాత్ర ఉంటుందని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో నాయకత్వలేమి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేష్కిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. చురుగ్గా యువనేతలు...2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఇతర పార్విల్లోకి వలసపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు అటు పార్టీ అధినాయకత్వం, ఇటు కేడర్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరితో పార్వికి చెడ్డపేరు వచ్చిందనే ఆరోపణలున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓటమి పాలయ్యామనే అభిప్రాయాన్ని కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో కొత్త తరానికి అవకాశమివ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. అదీగాక, గతంలో విద్యార్థి, యువజన విభాగాలతోపాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలే ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా అవకాశం దక్కుతుందనే ఆశావహ దృక్పథం వీరిలో కనిపిస్తోంది. మరోవైపు పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు సందడి చేస్తున్నారు. పార్విలో అనేక మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులతో అరంగేట్రం చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేటగిరీలకు చెందిన వారు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్వైపు చూస్తున్నట్లు సమాచారం. నిష్క్రమణలు.. చేరికలు.. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పొసగక తిరిగి బీఆర్ఎస్ గూటికి తిరిగి చేరుకుని క్రియాశీలమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరి నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేసి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. నిర్మల్‌లో ఓటమి అనంతరం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా క్రియాశీలంగా పనిచేయడం లేదు. ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ స్థానికంగా బలమైన నాయకుడి కోసం అన్వేష్కిస్తోంది. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడిపై కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితయ్యారు. ⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కాంగ్రెస్‌లో చేరడంతో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని పార్విలో ఆయన ప్రత్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా వారి వయసు, ఆరోగ్య కారణాలతో కొత్త ముఖాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్ బీజేపీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ ఘనపూర్‌లో పార్టీని వీడిన కడియం శ్రీహరి స్థానంలో మాజీ మంత్రి రాజయ్య తిరిగి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ డాక్టర్ వినోద్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో పార్టీ కేడర్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమన్వయం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం (ఎస్టీ) ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ సాగుతోంది. కొత్తగూడెంలోనూ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్థానంలో వెతుకులాట సాగుతోంది. ⇒ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరడంతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కాంగ్రెస్‌కు చేరువ కావడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తాండూరు తన కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ⇒ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గతంలో ఎంఐఎంతో దోస్తీ మూలంగా ఏడు చోట్ల స్నేహపూర్వక పోటీకి బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాతబస్తీలోనూ బలమైన అభ్యర్థులను పోటీ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారు. -
ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్
ఆదిలాబాద్: ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. సిరికొండ మండలం పొన్నలో శనివారం కేటీఆర్ పర్యటించారు. రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించారు. ‘‘రైతులు పండించిన ప్రతి పంటను తప్పకుండా ప్రభుత్వం కొనాల్సిందే. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎంతమంది రైతులు చనిపోయారో అంతమంది రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే. మెడలు వంచి నష్టపరిహారం వచ్చేలా చేస్తాం. వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబానికి అండగా మేమున్నామని ధైర్యాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాము. రెండు సంవత్సరాల్లో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పటివరకు రైతులు ధైర్యంగా ఉండాలని కేసీఆర్ చెప్పమన్నారు’’ అని కేటీఆర్ తెలిపారు.రైతులు భయపడుతున్నారువ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. వారం రోజులు కల్లాల్లో పంట కొనుగోలు కోసం ఎదురుచూసి ఎవరూ కొనకపోవడం వల్ల అప్పుల వాళ్ల బాధ భరించలేక పాండురంగ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.‘‘ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పక్కనే ఉన్న మహారాష్ట్ర కన్నా ఆదిలాబాద్ పత్తి పంటలు సాగులో మొదటి స్థానంలో ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు ఎంతోమంది రైతులకు ఆసరా అయింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. మా పార్టీ తరఫున వారి కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. కానీ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలి. రైతు బీమా ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎలక్షన్లకు రాజకీయాలు చేద్దాం.. ఎలక్షన్లప్పుడు కొట్టుకుందాం.. ప్రజలు ఎవరికీ ఓటు వేస్తే వాళ్లు కుర్చీలో కూర్చుంటారు.. కానీ మా మీద కోపం రైతుల మీద తీయొద్దు. మీరు ప్రాణాలు తీసుకోవద్దు.. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎక్కడ రూ.500 బోనస్? అని ఎందుకు కొనరు? అని ప్రభుత్వాన్ని నిలదీయండి. మీకు అండగా మేముంటాం.. ఎవరూ బలిదానాలు చేసుకోవద్దు’’ అని కేటీఆర్ చెప్పారు. -
పీవీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
సనత్‌నగర్ (హైదరాబాద్): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు సూచించారు. గురువారం బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ స్కూల్‌ను సందర్శించి ఆయన విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ చేశారు. అలాగే తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు.ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్ధులు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 2023లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా ర్ధులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.స్వామి రామానందతీర్థ మెమోరియల్ స్కూల్‌కు అవసరమైన అదనపు తరగతి గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్సీ వాణీదేవి సేవలను ప్రశంసించారు. ఇది సామాజిక బాధ్యత: ఎమ్మెల్యే తలసాని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్ధులకు చేయూత అందించడం సమాజ బాధ్యత అని తల సాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ట్రస్ట్ కార్యక లాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యా సేవలను విస్తరింపజేస్తున్న ఎమ్మెల్సీ వాణీదేవిని ఆయన అభినందించారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి నాణ్యమైన విద్యతో పాటు సరైన పోషకాహారం కూడా అవసరమని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. పిల్లలకు సమతుల్య పోషకాహారం అందించినప్పుడే వారి మేధస్సు వికసిస్తుందన్నారు. -
కాంగ్రెస్ పాలన డిజాస్టర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్ హయాంలో సంక్షేమం దారి తప్పి అభివృద్ధి కుంటుపడి పాలన డిజాస్టర్‌గా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు హిట్లర్ స్ఫూర్తి అంటాడు. ఎవడన్నా బుద్ధి ఉన్నోడు రావణాసురుడు, నరకాసుడు స్ఫూర్తి అంటాడా? ఆ వ్యాఖ్యలతోనే ఆయన నిజస్వరూపం బయటపడింది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఎస్ఆర్ఐపై బుధవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా కేటీఆర్ తన ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మలపై ధ్వజమెత్తారు. మంత్రుల అనుచరుల దందా కోసం..ఖమ్మం వెలుగుమట్లలో పేదలు కట్టుకున్న వేయి ఇళ్లను రాత్రికి రాత్రి ప్రభుత్వం రాక్షసంగా కూల్చేసిందని తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అనుచరుల రియల్ ఎస్టేట్ దందా, సీఎం పైశాచికానందం కోసం ఆడబిడ్డలను రోడ్డున పడేశారన్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అవినీతి సామ్రాజ్యం మాత్రం వేల రెట్లు పెరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి ములుగు జిల్లాలో రూ.4 వేల కోట్ల విలువైన ఇసుక దోచుకుంటున్నారని విమర్శించారు.సంక్షోభంలో వ్యవసాయ రంగంవ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో ఉందని.. పంట చేతికొచ్చి 60 రోజులు దాటినా ధాన్యం కొనే దిక్కులేదని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ మంత్రి తుమ్మల రైతుల శ్రేయస్సును గాలికొదిలేస్తే.. డిప్యూటీ సీఎం కమీషన్ల దందాల్లో జోరుగా ఉన్నారని ఆరోపించారు. ‘ప్రభుత్వానికి ఇంటర్వెల్ (రెండున్నరేళ్లు) అయిపోయింది.. ఫస్ట్ హాఫ్ మొత్తం అట్టర్ డిజాస్టర్‘అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘హౌసింగ్ మంత్రిగా ఉన్న పొంగులేటి.. 20 లక్షల ఇళ్లు కట్టించాకే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం‘అని అంటున్నారని.. ఆ మాట మీద నిలబడే దమ్ము ఉందా అని కేటీఆర్ సవాల్ విసిరారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాండ్ పేపర్లు రాసి ఆరు గ్యారంటీల కార్డులను 99 రోజులు భద్రంగా దాచుకోమన్నారని.. ఇప్పుడు ఆ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. పేదల కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం నాడు సీఎంగా కేసీఆర్ అప్పు చేశారని కేటీఆర్ అన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు తెస్తే, ఖమ్మం జిల్లా రైతుల కోసం సీతారామ ప్రాజెక్టును 80 శాతం కట్టించి, భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేశారన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు లింగాల కమల్‌రాజ్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్
సాక్షి, ఖమ్మం: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం వెంకటగిరిలో ఈ రోజు (బుధవారం) నిర్వహించిన ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెలుగుమట్లలో సీఎం రాక్షసుడు లాగా అర్ధరాత్రి వెయ్యి ఇళ్ళు కూలగొట్టాడని పేదలు రోడ్డున పడితే ముఖ్యమంత్రి కి పైశాచిక ఆనందంగా అనిపిస్తుందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దండుపాళ్యం నాయకులలా ప్రవర్థిస్తున్నారని తెలిపారు.కేటీఆర్ మాట్లాడుతూ.."ఖమ్మం లో ఉన్నది ముగ్గురు మొనగాళ్ళు కాదు, ముగ్గురు మోసగాళ్ళు, రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం పెరిగిపోతోంది. కాంగ్రెస్ మళ్ళీ గెలవదని ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు పాలేరు నియోజకవర్గం లో ప్రతి ఒక్కరికి తెలియాలి. కోటి ఎకరాల భూములు 22A కింద పెట్టారు. రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే శ్రీనివాస రెడ్డి గజదొంగ రెండున్నర సంవత్సరాలలో శ్రీనివాసరెడ్డి చేసింది ఏమీలేదు ఎమ్మెల్యేలు, మంత్రులపై అహంకారం చూపిస్తున్నారు. అధికారం అడ్డంపెట్టుకుని వట్టినాగులపల్లి లో రైతులపై దాడులు చేసారు" అని అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటిన తరువాత కూడా ప్రజలంతా కేసీఆర్ రావాలని కోరుతున్నారని పాలేరు లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎగిరేది గులాబీ జెండేనని స్పష్టం చేశారు. ఈ రోజు రైతుబంధు రావడం లేదు, దేవుని మీద ఒట్టేసి రుణమాఫీ ఎగ్గొట్టారు, యూరియా దుకాణం ముందు రైతులు నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు. కేసీఆర్ రద్దు చేసిన భూమి శిస్తూ మళ్లీ పెడతా అంటున్నారని తెలిపారు. ఆరు గ్యారెంటీ కార్డులు ఏమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.కేసీఆర్ అప్పుల పాలు చేశాడని మాట్లాడుతున్నారని.. ఆయన లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారు. సీతారామా 80 శాతం పూర్తి చేశారు. ఖమ్మం లో రెండు నర్సింగ్ కాలేజ్, రెండు మెడికల్ కాలేజ్ కట్టించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశారని 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు హామీ ఇచ్చారని ఇప్పుడు అర్థమైందన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ లిస్టు వడపోత కార్యక్రమం జరుగుతుందని SIR ను పట్టించుకోకపోతే తీవ్రంగా నష్ట పోతామన్నారు. రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు,35,985 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ కు BRS పార్టీ నుంచి కూడా ఒక BLA ను ఏర్పాటు చేసుకోవాలి. అర్హులైన వారివి ఒక్క ఓటు పోకుండా చూసుకోవాల్సిన పార్టీ BLA లదన్నారు. పాలేరు నియోజకవర్గంలో అనుమానాస్పదం గా 10 వేల ఓట్లు ఉన్నాయని ,జాగ్రత్తగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. -
మెట్రోకు అనుమతి లేకపోవడం సీఎం అసమర్థతకు నిదర్శనం.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే మెట్లో ఫేజ్-2కు అనుమతులు లభించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మెట్రో ఫేజ్-2 అనుమతులు దక్కకపోవడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. మెట్రో విషయంలో సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు (సోమవారం) కేటీఆర్ కౌంటరిచ్చారు. అధికారం పొందిన నాటి నుంచి 71 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లినా బజెపి రేవంత్‌ను పట్టించుకోవడం లేదన్నారు.ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించలేక పోతున్నారని, ప్రధానిని ప్రశ్నించే ధైర్యం లేక ప్రతిపక్షంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని... 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును కాంగ్రెస్ చిక్కుల్లో వదిలేస్తే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని గుర్తుచేశారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతుందని ఆరోపించారు.అంతకు ముందు మెట్రో ఫేజ్-2 అనుమతుల విషయంలో సీఎం రేవంత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్‌లపై మండిపడ్డారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా కేటీఆర్ దానికి కౌంటరిచ్చారు. -
సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు
బంజారాహిల్స్(హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి సొంతపార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మీనాక్షీ నటరాజన్‌కు పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉన్న కొంతమందిలో మీనాక్షి నటరాజన్ నిజాయతీ గల మనిషి అని, రాహుల్‌గాందీకి నమ్మిన బంటు కావడంతోనే రేవంత్‌రెడ్డి ఆమె పైనే కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటూ అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్‌గాందీకి చెప్పినందుకే రేవంత్‌రెడ్డి ఆమెపై పగపట్టారని చెప్పారు. అందుకే మీనాక్షి నటరాజన్ మీద రేవంత్‌రెడ్డి దొంగ కేసు పెట్టించారన్నారు. ఆ కేసు వివరాలు కూడా బీజేపీకి ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంతపార్టీ వారికే గుండుకొట్టి శఠగోపం పెట్టిన దొంగ రేవంత్‌రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రేవంత్‌రెడ్డి పాలనను అట్టర్ఫ్లాఫ్గా అభివర్ణించారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్టేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందన్నారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి..? నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని హామీఇచ్చిన రేవంత్‌రెడ్డి అది నెరవేరితే నిరూపించాలన్నారు. అదే జరిగితే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. జీఓ నంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. నగరంలో ఇటుక కూడా వేయని కాంగ్రెస్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. నగరంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఖైరతాబాద్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్‌రెడ్డి పక్కన కూర్చున్నారన్నారు. త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. ‘సర్’విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలి జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే ‘సర్’నమోదులో ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నామని, టికెట్ ఆశించేవారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవర్దన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు జేజోళ్ల రాజుముదిరాజ్, మహేశ్‌యాదవ్, హేమలతాయాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
‘మీనాక్షికి సీఎం రేవంత్ వెన్నుపోటు పొడిచారు’
సాక్షి, హైదరాబాద్: మీనాక్షి నటరాజన్‌కు రేవంత్ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ దొంగ కేసులుపెట్టించారని.. ఇక్కడి కేసు విషయాలు రేవంత్.. బీజేపీ నేతలకు చెప్పారంటూ ఆరోపించారు.‘‘రేవంత్ పాలనకు సగం సమయం ముగిసింది. రేవంత్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయింది. ఇక శుభం కార్డే. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. త్వరలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవి పోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్దే విజయం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘శనివారం, ఆదివారం వస్తే హైడ్రా పేరుతో వందలాది ఇళ్లు కూలగొడుతున్నారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వచ్చి చాయ్ తాగుతూ ఫోజులు కొట్టి నిరుద్యోగుల ముందు చెప్పారు. రేవంత్ సర్కార్.. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు. రేవంత్‌రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్‌కి చెప్పింది.’’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
ఫస్ట్ హాఫ్ ఫెయిల్
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలన మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) విఫలమైందని చెప్పారు. సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయినప్పుడు సెకండ్ హాఫ్‌పై ఎలాంటి ఆశలు ఉండవో.. ప్రభుత్వ ప్రస్తుత పనితీరు కూడా అలాగే ఉందని అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడల్లో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై బూత్ లెవల్ ఏజెంట్లతో బీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యంలో తరుగు పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. ఎరువుల దుకాణాల వద్ద మళ్లీ క్యూలైన్లో నిలబడే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, రాహుల్‌గాందీకి మాత్రం సంచుల కొద్దీ డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్‌బంధు’మొదలుపెట్టారని విమర్శించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికలకు ముందు బాండ్ పేపర్ రాసిస్తానన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పుతో చేసిందేమిటో చెప్పాలి హిట్లర్ స్ఫూర్తి అయితే పాలన గిట్లనే ఉంటదని కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్‌కు అవమానం జరిగేలా వ్యవహరించిన వ్యక్తి రేవంత్‌రెడ్డేనని ఆరోపించారు. ప్రజలు పాలు ఇచ్చే బర్రెను వదిలి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు అధికారం మాత్రమే పోయిందని, కేసీఆర్‌పై ప్రజల అభిమానం తగ్గలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రతిసారీ కేసీఆర్ అప్పు చేశారంటుంటారని..అయితే కేసీఆర్ అప్పు చేసినా అభివృద్ధి చేశారని, రైతుల ఖాతాల్లో రూ.77వేల కోట్లు వేశారని, 15 లక్షల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ ఇచ్చారని, కొత్త జిల్లాలు, కొత్త కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టారని వివరించారు. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. సభ్యత్వ నమోదు, ‘సర్’పై పాఠాలు ‘నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే. ఒక్క రూపాయి.. చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచినందుకు గర్వపడుతున్నా..’అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్లను జిల్లా చేసి రూపురేఖలు మార్చామని, ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 25 తర్వాత వేములవాడలోని ప్రతి మండలాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని ప్రకటించారు. కాగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్పై పాఠం మాదిరి అవగాహన కల్పించారు. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి, నేతలు చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కేటీఆర్‌కే స్థానం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆయనకే స్థానం లేదని, ఇక మా స్థానం గురించి కేటీఆర్ ఏం మాట్లా డతారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు. వాళ్లు మూడో స్థానంలో ఉన్నారని, అందుకే మేం మూడో స్థానంలోకి వెళ్తామని అంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పోటీనే లేదని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. శనివారం గాం«దీభవన్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర చేస్తామంటున్నారు. యాత్రలు చేయడంలో తప్పులేదు.వైఎస్సార్ పాదయాత్ర, రాహుల్‌గాంధీ భార త్ జోడో యాత్రలు దేశ చరిత్రను మలుపు తిప్పా యి. కానీ వీళ్లు ఏమని యాత్రలు చేస్తారు? యాత్ర లో ప్రజలకు ఏం చెప్తారు? అయినా వీళ్లు యాత్రలు చేస్తే ఆదరించేవారు ఎవరు? అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన ఆర్థిక విధ్వంసం, భూదోపిడీ, అస్తవ్యస్త పాలన, రైతుల ఆత్మహత్యలపై ప్రజలకు వివరణ ఇచ్చి వీళ్లు యాత్రలు చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, బీజేపీ ఫాసిస్టు విధా నాలపై కేటీఆర్ స్పందించాలి’అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు 8 మందీ ఓడిపోతారు.. రూ.వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్‌రెడ్డి అంటున్నారు. ఆయనే కేంద్ర బొగ్గు మంత్రి కదా? ఏం కుంభకోణం జరిగిందో విచారణ చేసి దోషులెవరో తేల్చవచ్చు కదా. ఈసారి బీజేపీకి ఉన్న 8 మంది ఎంపీలు ఓడిపోతారు. అసలు వీళ్లు రాష్ట్రానికి ఏం చేశారని మళ్లీ గెలుస్తారు? బీజేపీ అనే దుష్టసంహారం కోసమే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు జాతీయ స్థాయిలో పార్టీలు ముందుకొస్తున్నాయి. దేశ ప్రజల హక్కుల రక్షణ కోసం ఏం చేయాలన్నదానిపై ఇటీవల ఏఐసీసీ సమావేశంలో చర్చించారు. ఆ మేరకు ఈ నెల 24 నుంచి దేశవ్యాప్త కార్యాచరణ ఉంటుంది.’అని మహేశ్‌గౌడ్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం సరైంది కాదు. అసలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి కదా? రాష్ట్రం ఇవ్వాలని అడిగింది, ఇచ్చింది మేమే. అయినా ఏ రోజూ ప్రాంతీయ తత్వాలను ఉసిగొల్పి అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదు. లీకు వీరులెవరో సీఎం తేలుస్తారు పీసీసీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలో నాకు తెలుసు. 40 ఏళ్లలో నేను నేర్చుకుంది అదే. తప్పు చేయనంతవరకు నేను భయపడేది లేదు. మీనాక్షీ నటరాజన్ విషయంలో బీజేపీ దిగజారి ప్రవర్తించింది. రిటర్నింగ్ అధికారి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలా వ్యవహరించి ఇలా చేశారు. ఆయన్ను ఉరితీసినా తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ వారే సమాచారం ఇచ్చారని అనడంలో వాస్తవం లేదు. అయినా లీకు వీరులు, గ్రీకు వీరులెవరైనా ఉంటే సీఎం విచారణ జరిపి తేలుస్తారు. మీనాక్షి విషయంలో కోర్టుకు వెళతాం..’అని పీసీసీ చీఫ్ తెలిపారు. -
కేసీఆర్ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి దగ్గరిగా ఉన్న వాళ్ళే మీనాక్షి నటరాజన్ వ్యవహారం బయటపెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘‘ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వాళ్లే ఓడ గొట్టారు. కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ విషయం బయట పెట్టిన బ్లాక్ షిఫ్ ఎవరో తేల్చండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్‌కి పరిమితమవుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.‘‘వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రత్యర్థి బీజేపీనే. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయడం మాకు కలిసొచ్చింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి నాకు పంచాయితీలు లేవు. విధానపరమైన నిర్ణయాలపై మాత్రమే పంచాయతీ. రేవంత్‌రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా చేస్తుంది. రేవంత్ నిర్ణయాలు బీఆర్ఎస్కు మంచిది...అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు మెట్రో రద్దు చేశారు. మెట్రో పూర్తయి ఉంటే ట్రాఫిక్ చిక్కులు తగ్గేవి. హైడ్రాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తున్నారు. మేము నగరంలో వంద చెరువులు బాగుచేశాం.. కానీ చెప్పుకోలేదు. రెండు చెరువులు బాగు చేసి ఉదరగుడుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది సమయం కేసీఆర్ డిసైడ్ చేస్తారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సర్ సభ్యత్వ నమోదుపై సమావేశాలు నిర్వహించాము. మిగతా 59 నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.‘‘రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడు.. ఫ్యూచర్ సిటీ అంతకంటే లేదు. జులై లో డీలిమిటెషన్ బిల్లు చేస్తారని సమాచారం ఉంది. దేశంలో డీలిమిటేషన్ చేయక పోయినా రాష్ట్ర విభజన అంశంలోనే పొందుపరిచారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ చేయాలని ఉంది. డీలిమిటేషన్ తర్వాతనే సీట్లు ఎవరికి అనేది ఆలోచిస్తాం. అమ్మిన భూముల డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు కొత్త పథకాలు అమలు చేయడం లేదు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్ ఆదర్శం కాబట్టే రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచకాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ’ది హిందూ’ సదస్సులో (ది హిందూ కాన్క్లేవ్) సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆదివారం స్పందించారు. రేవంత్‌రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. ‘మీకు స్ఫూర్తి హిట్లర్ ముమ్మాటికి నిజమేం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఒక అస్సాసినేషన్ ఏజెన్సీ (హంతక ముఠా) లాంటిది! మీరు నియంతలను పూజిస్తారు, పేదల ఇళ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతారు.తెలంగాణ ప్రజలకు మీ నియంత నైజం ముందే తెలుసు.. ఇప్పుడు మీ నోటితోనే మీ ఫాసిస్ట్ ఆలోచనలను దేశం మొత్తానికి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు రేవంత్‌రెడ్డి’అని కేటీఆర్ తన ట్వీట్లో విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి.. మీలాంటి హిట్లర్ ఆలోచనలు చేసేంత మేధావులం మేము కాదు. అందుకే, మా పదేళ్ల పరిపాలనను మేము డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మాగాంధీ చూపిన అహింసామార్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల ఆశయాల ప్రాతిపదికన నడిపించాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
2028లో మళ్లీ కేసీఆరే సీఎం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘా తం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ధ్వజమెత్తారు. అలాంటి విషనాగులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. తెలంగాణపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న నాయకులను ప్రజలు నమ్మబోరని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. 2028లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మలేసియా తెలుగు అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ ఎన్నారై మలేసియా శాఖ కౌలాలంపూర్‌లో సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర సాధన ఉద్యమం, బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై ప్రసంగించారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని, వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, పోరాటాల వారసత్వాన్ని మోస్తున్న జాతి అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణవాసులమని గర్వపడే స్థాయికి రాష్ట్రం ‘నాది తెలంగాణ.. నాది తెలంగాణ జాతి.. నేను తెలంగాణ బిడ్డను’అని ప్రతి తెలంగాణవాసి గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరిందని కేటీఆర్ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మను జరుపుకునే ప్రత్యేక జాతి తెలంగాణ జాతి మాత్రమేనని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితమని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన మలిదశ ఉద్యమమే రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైందన్నారు. అన్ని వర్గాలను ఏకం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమం ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఒకప్పుడు కరువులు, వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, విద్యుత్, తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వంటి రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వేదికపై గౌరవప్రదంగా నిలబెట్టిన నాయకుడు కూడా కేసీఆరేనని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏఐ వంటి రంగాలు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. వచ్చే 25 ఏళ్ల తెలంగాణ కోసం బీఆర్ఎస్కు స్పష్టమైన విజన్ ఉందన్నారు. 24 గంటల నాణ్యమైన తాగునీటి సరఫరా, బలోపేతమైన ప్రజారవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక వసతుల కల్పన తమ లక్ష్యాలని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని.. అనుభవం, సూచనలతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు. -
సీఎం బామ్మర్దిది రూ.15 వేల కోట్ల కుంభకోణం
చంచల్‌గూడ: సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి రూ.15 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఆయన గురువారం చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. సోలార్ టెండర్ల అంశం, నైనీ బొగ్గు టెండర్ల అవకతవకలను మాజీమంత్రి హరీశ్‌రావు వెలుగులోకి తెచ్చారని చెప్పారు.సింగరేణిలో ఉద్యోగ నియామకాలపై విజిలెన్స్ విచారణ చేపిస్తామన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలతో కార్మికులు కలత చెందారన్నారు. కుంభకోణాలను కప్పిపుచ్చేందుకే సుమన్‌ను జైల్లో పెట్టారని చెప్పారు. బాంబులు పెట్టి సీఎం అధికారిక భవనం ప్రగతి భవన్‌ను లేపేస్తామని గతంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారని, అది కూడా శిక్షార్హమేనన్నారు. హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి తగులబెడతానని మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. ఇతరులకో న్యాయం, బీఆర్ఎస్ పార్టీ నాయకులకో న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో సుమన్‌పై 220 కేసులు పెట్టారని, ఇప్పుడు ఇంకా అక్రమ కేసులు పెట్టి రికార్డు బ్రేక్ చేసేలా ఉన్నారని చెప్పారు. తీయని 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును తీసినట్టు అవకతవకలకు పాల్పడి రూ.1,600 కోట్ల గోల్‌మాల్‌కు తెరలేపారన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌యాదవ్, సుధీర్‌రెడ్డి ఉన్నారు.పాతబస్తీలో సందడి చేసిన కేటీఆర్..చార్మినార్ (హైదరాబాద్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం పాతబస్తీలో పర్యటించారు. చంచల్‌గూడ జైల్లో తమ పార్టీ నాయకుడు బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన నేరుగా చార్మినార్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు అలీ మస్కతీ తదితరులతో కలిసి అక్కడి నిమ్రా కేఫ్‌లో ఉస్మానియా బిస్కెట్లు తిని ఇరానీ చాయ్ తాగారు. తర్వాత ఆయన చార్మినార్ వద్ద పర్యాటకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు. చార్మినార్ పక్కనే ఉన్న నిమ్రా కేఫ్‌ను సందర్శించి, ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించాను’అని పేర్కొన్నారు. తమకు ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు కేఫ్ సిబ్బందికి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
రేవంత్‌ను ప్రజలపై రుద్దింది కాంగ్రెస్సే: కేటీఆర్
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై హరీశ్‌రావు చేసిన విమర్శల్లో తప్పేమీ లేదు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీపై తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాం. రేవంత్ సీఎం కాగానే తెలంగాణ తల్లి రూపం మార్చి, సెక్రటేరియట్ ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ విగ్రహాలను గాందీభవన్‌కు పంపుతాం. సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాల తరబడి మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన, తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలపై రుద్దింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని తిరిగి తిరోగమనంలోకి నెడుతోంది. మోదీ– రేవంత్ భాగస్వామ్య ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. మోదీ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది. పైన మోదీ ప్రభుత్వం ఇక్కడ జోడీ ప్రభుత్వం సాగుతోంది. మొదటి అర్ధభాగం ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ పాలనలో ట్రైలర్ కాదు, ఇంటర్వెల్ కూడా పూర్తయింది. మిగతా అర్ధభాగం మరింత అధ్వానంగా ఉంటుంది. ఆయన తెలంగాణను పాతాళంలోకి తొక్కుతున్నారు. మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీని రేవంత్ బొంద పెడతారు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా రవికాంత్‌రెడ్డి వ్యవహరించగా.. ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, వరికుప్పల రమేష్ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే.. పదేళ్లలో సాధించిన ప్రగతి క్షీణించింది.. తెలంగాణ రైజింగ్ నినాదం పేరుతో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఫాలింగ్ జరుగుతోంది. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో సాధించిన పురోగతి ప్రస్తుతం క్షీణించింది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు కాంగ్రెస్ హామీలతో మోసపోయారు. రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. ఉచిత విద్యుత్ రైతన్నలకు ఇవ్వకూడదు అన్నదే రేవంత్‌రెడ్డి సిద్ధాంతం. లేని అప్పులను ఉన్నదిగా చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆర్బీఐ తన నివేదికతో చెంపదెబ్బ కొట్టింది. తెలంగాణాకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్ మాకు పొలిటికల్ గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 90కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఓడిపోతారు. దుమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ ఉప ఎన్నికలకు రావాలి. 2027లో పాదయాత్ర చేద్దామనే ఆలోచనలో ఉన్నా. బీజేపీతో పొత్తు ఉంటుందన్నది పూర్తిగా ఊహాజనిత ప్రచారం. బీఆర్ఎస్కు కేసీఆర్ ట్రంప్ కార్డు. ఆయన నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్. ఆయనే తెలంగాణను కాపాడుకుంటారు. పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? తెలంగాణ ఖచ్ఛితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ భూమి పుత్రుల జాగీరు అనడంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదు. ఈ నేల.. పోరాటాలు, త్యాగాలు చేసిన వారి నెత్తురుతో తడిచింది. మీరు వచ్చి మీ కుటుంబాలతో ఉండండి. మీ భూములు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం ప్రమాదం అని ఏపీ డిప్యూటీ సీఎం అంటున్నాడు. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయేందుకు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? మోదీ ఆర్థిక ప్రాంతీయ వాదం సరైనదేనా? ప్రధాని మోదీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ మీద ఉన్న అభిమానంతో తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తీసుకెళ్తున్నారు. జాతీయ వాదం ముసుగులో మోదీ చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం, గుజరాత్‌కు ప్రధానమంత్రి మాదిరి వ్యహరిస్తున్న తీరు సరైనదేనా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. జనగణమన మాకు నేర్పాల్సిన అవసరం లేదు. దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల. మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదు. మాకు జాతీయ భావన, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. పవన్ కళ్యాణ్‌ను నటుడిగా అభిమానిస్తాం, సోదరుడిగా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతాం. కానీ మా సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం. పవన్ వ్యాఖ్యల వెనుక రేవంత్ ఉన్నట్టు అనుమానం ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో 2018లో చంద్రబాబు టీడీపీ, 2023లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసింది. తెలంగాణలో కొత్తగా జనసేన పోటీ చేసేదేం ఉంది? తెలంగాణ ఆషామాషీగా, అనాయాసంగా ఏర్పడిన రాష్ట్రం కాదు. ఇక్కడకి వచ్చి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుమార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం రోజు వచ్చి ఇక్కడ సభ పెట్టి విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. మరొకాయన ంతల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు. జనసేన సభకు అనుమతి నిరాకరించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారనే అనుమానం వస్తోంది. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చట్టం చేయాలి ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డికి దమ్ముంటే.. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని అసెంబ్లీలో చట్టం చేయాలి. ఒకవేళ అలాంటి చట్టం ఏదైనా తీసుకువచ్చేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తాం. రేవంత్‌రెడ్డి హయాంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి మొదలుకొని అన్ని కాంట్రాక్టులు ఆంధ్రా వాళ్లకే దక్కుతున్నాయి. సుంకిశాల నిర్మాణం కూలిన ఘటనలో కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టు చేయాలని జలమండలి కోరితే.. చేయలేని దమ్ములేని సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు. సెక్షన్ 8ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న కుట్ర గతంలో కొంత జరిగింది. మరోసారి అలాంటి ప్రయోగాలు చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ నేతృత్వంలో మరో బలమైన ఉద్యమం వస్తుంది. -
రేవంత్ కు KTR ఓపెన్ ఛాలెంజ్..నేను సిద్ధం నువ్వు సిద్దమా?
-
పవన్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్‌ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ..‘దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి పోటీ చేసుకోవచ్చు. ఎక్కడ పోటీ చేస్తారో ఆ ప్రాంత పరిస్థితులు తెలుసుకోవాలి. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ ను ఎవరు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రజలు మాత్రమే పవన్‌ను అడ్డుకున్నారు. ఓటమిని చూపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ మీటింగ్ పెట్టి విభజన సరిగా జరగలేదని అంటున్నారు. మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి. తెలంగాణలోనే ఉన్నాయి కదా.తెలంగాణ నాలుగు కోట్ల భూమి పుత్రులది. తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్న పవన్ ఇప్పుడు తెలంగాణ గురించి ప్రేమగా మాట్లాడుతున్నారు. మోదీ జాతీయ వాదం ముసుగులో ఆర్ధిక ప్రాంతీయ వాదం చేయడం లేదా?. ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా?. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు కదం తొక్కిన నేల తెలంగాణ. ప్రాంతీయవాదం అంటున్న పవన్.. మరి మద్రాసు నుంచి వేరుపడటం కోసం పొట్టి శ్రీరాములు చేసింది ఏంటి?. దేశభక్తి గురించి పవన్ మాకు చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ సోదరుడిగా వస్తే ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోము. పవన్ సినిమా పేరు ఓజీ.. కానీ తెలంగాణ ఓజీ కేసీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అవుతుంటే మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడాము అని గుర్తు చేశారు. -
కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
సాక్షి, సోమాజిగూడ: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి సాధించినట్టు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లోని తప్పుకుంటానని సవాల్ చేశారు. ముఖ్యమంతి రేవంత్ రెడ్డి.. అందరినీ తొక్కేస్తా అంటూ నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా సోమాజిగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘ఎన్నో పోరాటాలు, బలి దానాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ పుట్టింది. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం పూర్తి అయ్యింది. తెలంగాణ పోరాట, త్యాగాలను స్మరించుకోవాలి. అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టేలా చేశాం. గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులను నిర్మించాం. 2014కు ముందు వలసలు, ఆత్మహత్యలు ఉండేవి. తెలంగాణ వచ్చాక వలసలను అరికట్టాం, ఆత్మహత్యలను నిర్మూలించాం. రైతుల ఆత్మహత్యలు నివారించాం. తెలంగాణను టాస్క్‌గా తీసుకున్నాం. కేసీఆర్ తెచ్చిన పథకాలను కేంద్రం సైతం కాపీ కొట్టింది. చివరకు మాపైనే అహంకారం అనే ముద్ర వేశారు. అధికారం పోయింది అనే బాధ మాకు లేదు. తెలంగాణ ద్రోహిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ మనపై రుద్దింది. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకుని వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో 300 మంది అమరులను బలిగొన్నది కాంగ్రెస్. 2004లో కాంగ్రెస్ పార్టీ మాతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ కథలో నంబర్-1 విలన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ ఆమరణ దీక్ష లేకపోతే తెలంగాణ లేదు. 2001లో పార్టీ పెట్టి ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టి చంపండి అన్న గుండె ధైర్యం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడవచ్చు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాంతాలుగా విడిపోయినా కలిసి ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా కేసీఆర్ పాలన సాగింది. బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రాజెక్ట్‌లను నిర్మించాం. తెలంగాణలో నాయకత్వ కెపాసిటీ ఉందా? అని అడిగిన వాళ్ళు మాకు కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే బాగుండేది అనే పరిస్థితి వచ్చింది.కేసీఆర్ తెలంగాణలో అమోఘమైన ఆర్థిక విప్లవం తీసుకొచ్చారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి జరిగిందా?. కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసురుతున్నా. ఇతర రాష్ట్రాల్లో ప్రగతి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ఇస్తామన్నారు. మళ్లీ మూడు నెలల్లో పిల్లలు పుడతారా? అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. 30 నెలలు అయినా హామీలు నెరవేరకపోతే మిమ్మల్ని ఏమనాలి?. ఢిల్లీకి కప్పం కట్టడం ఒక్కటే రేవంత్ రెడ్డికి తెలుసు. కేసీఆర్ నామస్మరణ తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏంటి?. తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. మోదీ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది’ అని ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొక్కేస్తా.. తొక్కేస్తా అని నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశాడు. మా పదేళ్ల పాలనలో మేము రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. అప్పులపై ఒక్కో మంత్రి.. ఒక్కో లెక్క చెబుతున్నారు. మంత్రులు పది లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేబినెట్లో మంత్రులకు శృతి, లయ లేదు. కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. రెండేళ్లలో కాంగ్రెస్ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బంతా ఏం చేశారు. దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కం ఇక్కడే ఎందుకు? అని ప్రశ్నించారు. -
ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన పోరాటం అధికారం కోసం కాదు.. తెలంగాణ కోసం. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడం కోసం.. తెలంగాణ తల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం. తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలవుతోంది. తెలంగాణ తల్లి కిరీటాన్ని, వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగిలించుకు పోతోంది. అందుకే మరోసారి ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. విష ప్రచారాలతో అధికారంలోకి కాంగ్రెస్ ‘గత ప్రభుత్వం పైనా, కేసీఆర్ పైనా చిల్లర ప్రచారాలు చేశారు. అబద్ధాలతో కూడిన విష ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 420 హామీలతో ప్రజలను మోసం చేసింది. దేశమంతా వదిలించుకున్న కాంగ్రెస్ దరిద్రం తెలంగాణకు వచ్చింది. అడ్డదారిలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టింది. రైతుబంధు లేదు..ఎరువుల్లేవు ⇒ సంతోషంగా సాగిన తెలంగాణ వ్యవసాయం ఈ రోజు సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుబంధు లేదు.. ఎరువులు ఇచ్చేవాళ్లు లేరు.. పండించిన పంట రెండు నెలలైనా కొనేవాళ్లు లేరు. ప్రభుత్వం కాళ్లు పట్టుకున్నా కనికరం లేదు. నాలుగు సార్లు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశారు. 70 లక్షల మంది రైతన్నలు బాధతో, ఆవేదనతో రేవంత్‌రెడ్డిని తిడుతున్నారు. గురువు గారికి నదీజలాల సమర్పణ ⇒ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. కేసీఆర్‌ను బద్నామ్ చేయాలనే పగతో ప్రాజెక్టులపై దాడి చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ హక్కులుగా కాపాడాల్సింది పోయి గురువు గారికి సంతర్పణ చేసే పరిస్థితి తీసుకొచ్చారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి.. ⇒ ‘నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసింది. అశోక్‌నగర్‌లో యువతను కూర్చోబెట్టి ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టారు. రెండున్నరేళ్లలో కనీసం నాలుగు వేల కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాహుల్‌గాం«దీకి ఇప్పుడు తెలంగాణకు రావడానికి మొహం చెల్లడం లేదా? దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్‌నగర్ చౌరస్తాకు పోలీసుల్లేకుండా రావాలి. క్షీణించిన శాంతి భద్రతలు తెలంగాణను మేం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చాం. కానీ ఈరోజు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. గనుల పేరుతో దోపిడీలు సాగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ మొత్తం ఒక ధర్నా చౌక్ అయిపోయింది. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా ప్రతి వర్గం రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదు. వేలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి. ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల్లో వినిపిస్తున్న నినాదం ఒక్కటే. అదే కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అది రైతులను చంపేసే డిస్కమ్!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో రైతుల మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అంతే ప్రేమ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంటును ఎగ్గొట్టేందుకే ఇప్పుడు రైతు డిస్కమ్ అంటూ పాటపాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం చెప్పే రైతు డిస్కమ్ రైతు మెడకు ఉరిపెట్టే డిస్కమ్ అని, అది రైతులను చంపేసే డిస్కమని ఘాటుగా విమర్శించారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని మిల్లీనియం గార్డెన్లో కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్‌రెడ్డి బయటి దేశానికి వెళ్లినపుడు రైతులకు 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందన్నారని, దాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు రైతు డిస్కమ్ పాట అందుకున్నారన్నారు. రైతులకు ఇచ్చే రైతు బంధు రైతుల ఖాతాలో పడటం లేదు కానీ.. రాహుల్ బంధుకు మాత్రం నెలనెలా పడుతున్నాయని దుయ్యబట్టారు. రైతులకు ధాన్యం సంచులు ఇవ్వడం పట్టించుకోకున్నా, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద ముఖ్యమంత్రికి బాగా మోజుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించే ధైర్యముందా? కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లలో ఆరు ఇళ్లయినా కట్టించారా, కనీసం ఆరు ఇటుకలైనా పెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరిచ్చిన 420 హామీలు నెరవేరుస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని నిలదీశారు. ముఖ్యమంత్రి చిన్న పిల్లల దగ్గరకు వెళ్లినా బూతు పురాణాలు మాట్లాడుతున్నారని, పేగులు మెడలో వేసుకుంటానని, గుడ్లు పీకుతానని, లాగులో తొండలు వేస్తానని అంటున్నారని మండిపడ్డారు.అందుకే ఆయన తమ్ముడు కొండల్‌రెడ్డి లాగే ఈయనను తొండలరెడ్డి పేరుతో పిలవాలని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చమంటే కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశాడని అంటున్నారని.. అదే నిజమని కానీ అప్పులు చేసి లక్ష డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని, రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేశారని, రెండుమార్లు రూ.30 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాడని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయలేనిది కేసీఆర్ 6 నెలల్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ వ్యవస్థను మార్చి 24 గంటలు కరెంటు ఇచ్చాడన్నారు.కాంగ్రెస్ దరిద్రాన్ని దేశం మొత్తం వదిలించుకుందని కానీ తెలంగాణలో ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరగనున్న ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలని, బూత్‌స్థాయి నాయకులు బీఎల్వోలతో ఉంటూ అర్హులది ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్ ప్రారంభమవుతుందని.. సర్’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. 65 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయని పని ఆరు నెలల్లో కేసీఆర్ చేసి చూపించారు. 24 గంటల పాటు రైతులకు, పరిశ్రమలకు కేసీఆర్ నాణ్యమైన కరెంటు ఇచ్చారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.‘‘వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అన్నా రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 35 వేల ఓటర్లు డిఫెన్స్ ల్యాండ్‌లో ఇల్లు కట్టుకున్నారు. వారి ఓటు హక్కు ఉండాలంటే సర్‌లో నమోదు చేసుకోవాలి. హైదరాబాద్‌లో మొత్తం బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించారు. గ్రామాల్లో రేవంత్ 420 మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం నెత్తి మీద పెట్టుకున్నాం...సుమారు 2 లక్షల పట్టాలు కేసీఆర్ ఇచ్చారు.. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇండ్ల పట్టాలు అయినా రేవంత్ ఇచ్చారా?. స్కూటీ లేదు లూటీ మాత్రం నడుస్తుంది. రైతుబంధు లేదు రాహుల్ బంధు నడుస్తుంది. రైతులకు యూరియా ఇచ్చే దిక్కు లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు కానీ.. రైతులకు రైతు డిస్కం తెస్తారంటా?. రైతులకు ఊరి వేయడానికే రైతు డిస్కం తెస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో 95 లక్షల ఓట్లు సర్ పేరుతో తీసేశారు.. కోర్టుకు వెళ్లారు.. కోర్టులో ఉండగానే ఎన్నికలు జరిగాయి బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు. అందరూ సర్‌లో పాల్గొని.. మన ఓట్లు తొలగించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని కేటీఆర్ సూచించారు -
రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం..
కవాడిగూడ/ముషీరాబాద్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం గద్దెనెక్కారని, ఆయన రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధుల టెండర్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి జీవో 17తో చిన్న చిన్న కాంట్రాక్టర్లను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 17ను రద్దు చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టులు సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు, బీజేపీ నేతలకు దక్కుతున్నాయని ఆరోపించారు. 2028లో బీఆర్ఎస్ వస్తుందని, 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ మందా శ్యామ్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఒక్క ఇళ్లయినా కట్టావా? జీహెచ్ఎంసీలో ఒక్క ఇళ్లయినా కట్టావా అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ ఎంత మంది ఇళ్లు కూల్చి వారి ఉసురుపోసుకున్నారో తెలుసా అంటూ ఘాటుగా మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన జరిగిన బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్ఏ) సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నిస్తే కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లోనే పిల్లలను పుట్టిస్తారా... అన్న సీఎం రేవంత్‌రెడ్డి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలి?’అని సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి.. మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అదే నిరుద్యోగులు సెక్యూరిటీ లేకుండా రాహుల్, రేవంత్ ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, సురభివాణిదేవి, దామోదర్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ భారీ వ్యూహం.. కేసీఆర్ దూకుడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న రాజకీయ పోరుకు మరింత పదును పెట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలనలో అవినీతి, అధికార పార్టీ నేతల అక్రమాలపై ఆరోపణలను ప్రధాన అ్రస్తాలుగా మలుచుకోవాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన కార్మికుల మద్దతు కూడగట్టేలా ప్రభుత్వాన్ని నిరంతరం ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే కసరత్తు ప్రారంభించింది.అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ వైపు మళ్లకుండా రాజకీయంగా అడ్డుకట్ట వేసే వ్యూహం కూడా అవసరమని భావిస్తోంది. యువతను ఆకర్షించే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగంలో చురుకుదనం పెంచడం, భవిష్యత్‌లో కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్రల వంటి భారీ ప్రజా కార్యక్రమాలతో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.హామీల అమలుపై నిరంతర ఒత్తిడి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్‌లో రైతు సదస్సు నిర్వహించిన బీఆర్ఎస్ త్వరలో తెలంగాణ భవన్లో యువజన, విద్యార్థి నేతలతో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతుభరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు హామీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతర రాజకీయ ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నిర్ణయించింది.అక్రమాలు, అవినీతి ఆరోపణలను ప్రజల ముందుంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రజల్లో నిరంతరం చర్చ జరిగేలా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావులతోపాటు పార్టీ ముఖ్య నేతలు రేవంత్ ప్రభుత్వంపై రోజుకో ఆరోపణ, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికే అసెంబ్లీతోపాటు ప్రజా వేదికలు, సామాజిక మాధ్యమాలు, జిల్లా స్థాయిలో కార్యక్రమాల ద్వారా ఈ అంశాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సంస్థాగత బలోపేతమే ప్రధాన లక్ష్యం సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, క్రియాశీల కార్యకర్తల గుర్తింపు, యువ నాయకత్వానికి ప్రాధాన్యం వంటి అంశాలపై కార్యాచరణ ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఇప్పటి నుంచే బూత్ స్థాయి నుంచే పార్టీ వ్యవస్థను పటిష్టం చేసే పనులు ప్రారంభమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌పై ఫోకస్.. యువతను చేరుకునే ప్రయత్నం గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కూడా బీఆర్ఎస్ అత్యంత కీలకంగా చూస్తోంది. ‘సర్’పై అవగాహన కార్యక్రమాల పేరిట నగర ఓటర్లతో మరింత సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని పార్టీ యోచిస్తోంది. సర్‌పై కేటీఆర్ గ్రేటర్ పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిజిటల్ యుగంలో కీలకంగా మారుతున్న ‘జెన్ జీ’యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక ముఖాముఖి సమావేశాలు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. -
ఒక్కటైనా కట్టారా?
కూకట్పల్లి (హైదరాబాద్): అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా..హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి అవగాహన ఉంది కాబట్టే నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక ఫ్లై ఓవర్లు మొదలుకుని టిమ్స్ ఆసుపత్రి దాకా ప్రతి ఒక్కటీ తామే నిర్మించామని, ప్రస్తుతం వాటికే సీఎం రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేస్తూ తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. సోమవారం కూకట్‌పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మోసం చేసింది.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం. తెలంగాణకు 24 గంటల కరెంటు, తాగునీటిని అందించింది కేసీఆరే. కానీ అసెంబ్లీ ఎన్నిలప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ, సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తాం. ఈ బాధ్యత నేనే తీసుకుంటా..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. దొంగ ఓట్లపై జాగ్రత్తగా ఉండాలి ‘ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పారీ్టకి అండగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ తగిన అవకాశం, గౌరవం కల్పిస్తాం. ‘సర్’విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ విధానంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ తరఫున కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘సర్’పై కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆదివారం అంబర్‌పేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఉన్న నగరాన్నే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాడంటే నమ్మాలా?. బీఆర్ఎస్లో పనిచేసే వారికే గుర్తింపు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు. బీఆర్ఎస్లో పని చేసేవారికే గుర్తింపు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్దే గెలుపు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ఎస్ఐఆర్పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై పోటారం చేసిన వాళ్లకే టికెట్లు. కొందరి ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది’అని ఆరోపించారు. -
అది నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ చెప్పినట్లు రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కేవలం 30-35 శాతానికి మించి ధాన్యం కొనుగోలు చేయలేదని తెలిపారు. మంత్రులు 50 శాతం కొనుగోలు చేశామంటే సీఎం రేవంత్ ఏకంగా 80 శాతం ధాన్యం కొనుగోలు చేశామంటూ అసత్యాలు పలుకుతున్నారు. ప్రభుత్వ నిర్లక్షంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఎద్దు ఏడ్చిన వ్యవసాయం. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆఖరుకు సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో కూడా రైతులు ధర్నాలు చేస్తున్నారని దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్టంలో గన్నీ బ్యాగ్స్ దొరకడం లేదు కానీ గన్స్ మాత్రం బాగా దొరుకుతున్నాయని ప్రభుత్వాన్ని కేటీఆర్ దుయ్యబట్టారు. -
రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతు మరణించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారని మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా మరణించలేదన్నారు. రాజకీయ లాభాల కోసం బురదచల్లే ప్రయత్నమే తప్ప.. కేటీఆర్ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగాన్ని కుంభకోణాల కూపంగా మార్చిన నాయకులు ఇప్పుడు రైతు సంక్షేమంపై మాట్లాడడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కూడా సరికొత్త రికార్డులు నమోదయ్యాయని చెప్పారు. 2025–26 రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటివరకు 54.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరిందన్నారు. అందులో 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇందుకుగాను 6.3 లక్షల మంది రైతులకు రూ.7,841 కోట్ల చెల్లింపులు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 18.3 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేశామని, రవాణా కోసం 13 వేల వాహనాలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతుండటాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. -
కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను కొనే దిక్కులేక రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్‌లోనైనా పంట కొనుగోళ్లలో నెలకొన్న సంక్షోభంపై ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడి పరిష్కారం చూపాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. ‘ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రతీ రోజూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. పంట అమ్ముకుందామనే కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతులు గుండె పగిలి కుప్ప కూలుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో దైర్యంతో బతికిన అన్నదాత కాంగ్రెస్ పాలనలో ఆత్మ విశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడు. రైతులకు రక్షణగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ ఒక్కొక్కటిగా పాతరేసి రైతుల వెన్ను విరించారు. రైతుభరోసా ఎగవేసినా, యూరియా కష్టాలు అధిగమించి రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు’అని కేటీఆర్ మండిపడ్డారు. పంటలు తగులబెట్టుకుంటున్నారు ‘పంట కొనుగోలు చేసే నాథుడు లేక రైతులు తమ పంటలను తగుల పెట్టుకుంటున్నారు. రెండు నెలలుగా నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోరో జరగని రహదారి లేదు. పగలూరాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప పరిపాలనపై సీఎంకు పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మారింది. రోడ్లపై జరుగుతున్న నిరసనల నుంచి తప్పించుకునేందుకు మంత్రులు హెలికాప్టర్లో షికార్లు కొడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ రైతులు రోడెక్కి నిరసన తెలపడం రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభానికి అద్దం పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత, క్వింటాల్‌కు పది కిలోల తరుగు, గన్నీ బ్యాగులకు రూ.50 డిపాజిట్ వంటి సమస్యలను తీర్చేవారే లేరు. పంట కొనుగోలు కూడా చేయడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు సీఎం క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి రైతుల పంటను కాపాడుకునేందుకు చివరకు టార్పాలిన్లు కూడా సమకూర్చలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కాంగ్రెస్‌కు మరణ శాసనం రాసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని ఆ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు. -
ఈ శాడిజం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలి. జీరో ఎఫ్ఐఆర్ చేసి పద్ధతి ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేశాం. అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్లి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ ఇప్పించాం. మా చర్యలను ప్రజలు గానీ, కోర్టులు గానీ తప్పుబట్టలేదు. పోక్సో కేసు వివరాలు చెప్పకూడదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దర్యాప్తు అధికారి (ఐఓ) లాగా విచారణ చేసిండు. కేటీఆర్ జడ్జీలాగా శిక్ష వేసిండు. వారిలాగా రోడ్లపై పడి మాట్లాడితే ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది? ఆ అమ్మాయి, తల్లిదండ్రుల ఫొటోలు పెట్టారు (సోషల్ మీడియాలో). రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. ఎన్నికల్లో ఓడించు. ఒక మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు? ఒక మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో ఏదో సాధించినట్టు ఈ శాడిజం ఏమిటి? ఇది శాడిస్టిక్ ఆనందం కాదా?..’అని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో విలేకరుల సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ‘అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడానికి ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో అమ్మాయి మేజర్ అనే వివాదానికి తెరలేపారు. అమ్మాయి మైనరా? మేజరా? అనే ప్రభుత్వ రికార్డులు సేకరించాం. అమ్మాయి ఏజ్ ఎంత అని ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ప్రవీణ్‌కుమార్ ఐఓనా? ఐఓ వెళ్లి స్కూల్లో ఆమె బర్త్ సర్టిఫికెట్, టెన్త్ సర్టిఫికెట్, హాస్పిటల్లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకుని మైనర్ అని తక్షణమే నిర్ధారించారు. ప్రవీణ్‌కుమార్‌కు ఉద్యోగం లేదు.. ప్రధాని పర్యటన ఉన్నప్పుడు వారి (బండి సంజయ్) ఇంటిపైకి వెయ్యి మంది పోలీసులను పంపితే తమ పార్టీ (బీజేపీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిందని, తెలంగాణలో గెలుస్తుందని, దీనితో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆయన చెçప్పుకుంటాడు. సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించాం. ఎక్కడైనా సెక్షన్లలో, అరెస్టులో, రిమాండ్‌లో, కోర్టులో వాదనల్లో లోపం ఉందా? కేటీఆర్, బండి సంజయ్‌కి ఏదో పంచాయితీ ఉంది. ఆ పంచాయితీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటున్నడు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉద్యోగం లేక గాలికి తిరుగుతూ నేనే విచారణాధికారి అనే భ్రమల్లో ఉన్నడు.’అని సీఎం ధ్వజమెత్తారు. కేటీఆర్ బావమరిదికి ఇంకో న్యాయమా? ‘కేటీఆర్ బావమరిదికి కూడా డ్రగ్స్ కేసులో విచారణకు నోటీసులు ఇచ్చాం. పోక్సో కేసులో బండి భగీరథ్‌కి నోటీసులు ఇచ్చాం. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుని తన బావమరిది దొరికితే అతడిని వంగబెట్టి గొట్టండి..కోదండం ఎక్కించండి అని కేటీఆర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎందుకు చెప్పలేదు. మా బామ్మర్ది దీపావళి పండుగ చేసుకుంటున్నడు. చిచ్చుబుడ్లకు బదులు సారాయి బూత్ పెట్టుకున్నడు. బంతిపూలకి బదులు గంజాయి పూలు లేకపోతే కొకైన్ పెట్టుకున్నడు. మీరు ఎట్ల అరెస్ట్ చేస్తరు అని బయటకి వచ్చి మాట్లాడిండు కదా. బామ్మర్ది డ్రగ్స్‌తో ఫామ్‌హౌస్‌లో పట్టుబడితే కేసు కాదట. ఇంకో ఎమ్మెల్సీ కోడిపందాల్లో దొరికితే కేసు లేదట. దుబాయ్‌లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు..ఆర్థిక లావాదేవీలు, వాళ్ల ఎక్స్ ఎమ్మెల్యే గురించి ఇవాళ చెప్తున్న. వాళ్ల ఫామ్‌హౌస్‌లో పోలీసులపై కాల్పులు జరిపి (ఓ వ్యాపారి) డ్రగ్స్‌తో దొరికిండు. మరి ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ యాడ పండుకుండు? ఎందుకు పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయలేదు ? వాడికి నోటీసు ఇవ్వలేదు. నీతులు చెప్పడానికే ఉన్నయా?. కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ‘కేటీఆర్ ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ప్రతిపక్ష నేత యాడ నిద్రపోతుండు? బయటకి వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకుంటే ప్రెస్‌నోట్ అయినా ఇవ్వొచ్చు కదా? పక్క పార్టీ వాడు పార్టీలోకి వస్తే జగిత్యాల పోయివస్తడు. ఇంత మేజర్ ఘటన రాష్ట్రంలో జరిగితే ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయిండు? ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవాలి కదా. అధికారం ఉంటనే బయటకి వస్తావా?..’అని రేవంత్ ప్రశ్నించారు. మా పోలీసులు చెప్పిందే నమ్ముతా.. ‘బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని మా పోలీసు సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతా. పిల్లవాడిని వారి ఇంట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి సరెండర్ చేయాలి. రోడ్డుపై నాకాబందీ చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ వద్ద పోలీసులకు బండి భగీరథ్ చిక్కిండు. రోడ్డు మధ్యలో పోలీసులు కస్టడీలో తీసుకుంటే సరెండర్ చేశామని చెప్పే రాజకీయ నాయకుల మాటలు నమ్మాలా? పోలీసుల మాటలా? బండి సంజయ్ దగ్గరుండే పంపించవచ్చు. ఐదు రోజులు పరారీలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా? లేరా?..’అని సీఎం నిలదీశారు. రైతు ఆత్మహత్యపై విచారణకు ఆదేశం మెదక్‌లో రైతు ఆత్మహత్యపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశించినట్టు రేవంత్ తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చనిపోయిన రైతు కుటుంబానికి గతంలో కొల్లగొట్టిన ధనం నుంచి రూ.2 లక్షలో రూ.5 లక్షలో ఇస్తారనుకుంటే శవం చూసి పళ్లు ఇకిలిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.కొంతమంది బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు ఉన్నారని, వారి మిల్లులకు లారీల్లో ధాన్యం పంపితే దించనీయకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శవాల మీద పేలాలు ఏరడం ఏమిటి? అని ప్రశ్నించారు. కులగణనను సుప్రీంకోర్టు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో మోదీ సర్కార్ కుయుక్తులు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో మళ్లీ ఆ బిల్లు పెట్టాలి: సీఎం రేవంత్‌రెడ్డి లక్డీకాపూల్(హైదరాబాద్): మహిళా రిజర్వేషన్ల బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు మహిళా బిల్లుకు డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సచివాలయం వద్ద ఉన్న విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాజీవ్‌గాంధీ సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప దార్శనికుడన్నారు. రాజీవ్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. సోనియాగాంధీ సాహసోపేత నిర్ణ యంతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలోఎంపీ అనిల్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు..విమర్శలు గుప్పించిన ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన రైతుల సంక్షేమంపై లేఖలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో పది మంది రైతులు మృతి చెందారని చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా చనిపోలేదు’ అని స్పష్టం చేశారు.రికార్డు స్థాయి కొనుగోళ్లుఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 5429 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు చేరగా, ప్రభుత్వం 46.21 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రైతులకు ఇప్పటి వరకు 7,841 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. మొత్తం 6.3 లక్షల మంది రైతులు ఈ ప్రక్రియలో లాభం పొందారు. ధాన్యం తరలింపుకు 13,000 వాహనాలు, నిల్వకు 18.3 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు.బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలుఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, మిల్లర్లతో లాలూచీ, చెల్లింపుల ఆలస్యం జరిగిందని ఆరోపించారు. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పరిస్థితి వారి అవినీతి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతూ, నీటి వనరులను రైతుల భవిష్యత్ కోసం వినియోగించే విధానాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీటి సరఫరా పై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. -
బండి భగీరథ్ కేసుపై స్పందించిన బండి సంజయ్
సాక్షి,హైదరాబాద్: తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బండి భగీరథ్ కేసు వివాదం తర్వాత తొలిసారి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. నేనేంటో ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు నాకు లేవు. ఎవరెవరో ఏదో రాస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బండి భగీరథ్ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఏదైనా సందర్భంగా కొడుకును తండ్రి పోలీసులకు అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా?. విచారణ నిమిత్తం నేనే స్వయంగా భగీరథ్‌ను పోలీసులకు అప్పగించా’నని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ చచ్చుడో..’అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మహానాయకుడు కేసీఆర్ పోరాట పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 8 రోజులుగా కొడుకును దాచిపెట్టి, బాలిక కుటుంబసభ్యులను బెదిరించి, మీడియా నోరు నొక్కిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆదివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ‘గతంలో నిజాం ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు ఆసుపత్రుల నిర్మాణం జరిగితే, బీఆర్ఎస్ హయాంలో 4 ఆసుపత్రుల నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తే, రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోంది. మైనర్ బాలిక విషయమై బీఆర్ఎస్ మహిళా విభాగం, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోరాడుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న బాలిక తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్నాం. బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వైఫల్యాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసు కెళ్ళాలి..’అని కేటీఆర్ చెప్పారు. ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి ‘దేశంలో బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా బెంగాల్, కేరళ రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఏ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పార్టీ సభ్యత్వం, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నవారికే అవకాశం వస్తుంది. ఎల్బీనగర్లో ఉన్న 18 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, దేశ్‌పతి శ్రీనివాస్, దేవీప్రసాద్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్ఔట్ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు. -
పేద ప్రజల ఆరోగ్యం కోసమే టిమ్స్ ఆసుపత్రులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో AIIMS స్థాయి వైద్యం అందించేలా టిమ్స్‌ను ఆలోచించి రూపకల్పన చేశామన్నారు.సనత్‌నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఇందులో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని 300 ICU బెడ్స్‌తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదన్నారు. -
ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు
సిటీ కోర్టులు, (హైదరాబాద్): ఫార్ములా–ఈ రేస్ కేసులో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేటీఆర్ (ఏ–1)తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ (ఏ–2), హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి (ఏ–3)కి గురువారం నోటీసులు జారీ చేసింది.జూలై 31న కోర్టులో హాజరుకావాలని తెలిపింది. స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు (ఏ–4), యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థ (ఏ–5)లను కూడా ఏసీబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. హెచ్ఎండీఏకు చెందిన రూ.55 కోట్లకు పైగా నిధులను విదేశీ సంస్థలకు నిందితులు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఆర్థిక లావాదేవీలు, తదితరాలకు సంబంధించి దాదాపు వెయ్యికి పైగా పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు చార్జిషిట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పత్రాల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. రూ. 54.89 కోట్ల మళ్లింపు ఆరోపణలు కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గత గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండీఏకు చెందిన రూ. 54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నిధుల విషయంలో ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికే కేటీఆర్ తదితరులు విచారించింది. -
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈకారు రేసు కేసులో ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్రెడ్డికి సైతం సమన్లు పంపింది. జులై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. -
అధికారం దక్కలేదనే కేటీఆర్ ఆక్రోశం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్‌లో కూడా అధికారం దక్కదనే భయంతోనే కేటీఆర్ తీవ్ర నిరాశ, అసహనంలో తెలంగాణ ప్రజానీకం అసహ్యించుకునేలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమాన్ని విస్మరించి, ఇప్పుడు రాజకీయ మైలేజీ కోసం మాటల దాడులకు దిగడం వారి నిస్సహాయతకు నిదర్శనమని మంత్రి విమర్శించారు. వరంగల్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రైతు సంక్షేమంపై చింత కాదు..పూర్తిగా రాజకీయ నిరాశ, ఆక్రోశానికి ప్రతిబింబమని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై, వారిపై ఈగ వాలనివ్వకుండా కాపాడుతూం అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం..బీఆర్ఎస్ అసలు రాజకీయ స్వరూపాన్ని బయటపెడుతోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వరంగల్‌లో నిర్వహించిన సభ రైతు సంగ్రామ సదస్సుగా చెప్పడం పూర్తిగా అసత్యమని, అది బీఆర్ఎస్ ఆక్రోశ సభ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఆ సమావేశానికి రైతులు రాలేదని కేవలం పార్టీ కార్యకర్తలే హాజరయ్యారని విమర్శించారు. రైతుల ప్రాణాలతో ఆటలాడినవారే ఇప్పుడు రైతు మిత్రులమంటూ మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పంటల బీమా ఎత్తివేసి, వరదలు–వర్షాలతో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి అప్పుల బారినుంచి బయటపడే అవకాశం లేకుండా చేసిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు. అందుకే రైతులే వారిని అధికారానికి దూరం చేశారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తోందన్నారు. పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నామని, నెలకు సగటున రూ.5,500 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రూ.2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రెండేళ్లలోనే రైతుల కోసం లక్షా 5 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి, రైతు భరోసా, రుణమాఫీ, బీమా వంటి పథకాలతో రైతులకు నిజమైన అండగా నిలిచామని పేర్కొన్నారు. రైతు పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని, తెలంగాణ రైతులు నిజాన్ని గుర్తించి తగిన సమాధానం ఇస్తారని మంత్రి స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని హామీలను నెరవేర్చిందన్నారు. -
లైవ్ లో రేవంత్ పరువు తీసిన కేటీఆర్
-
వాళ్లను పెద్దలు అనేకంటే.. దొంగలు అనొచ్చు
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ అనేది మోసాలకు, కుట్రలకు కేరాఫ్ అని.. ఆ విషయం తెలిసి కూడా నమ్మి తెలంగాణ రైతులు దారుణంగా మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట ఒక్క హామీ అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ చురకలు అంటించారు. బుధవారం వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేటితో నయవంచనకు నాలుగేళ్లు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు పెద్దలు వరంగల్‌కు వచ్చారు. వాళ్లను పెద్దలు అనేకంటే దొంగలు అనొచ్చు. రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు గాలం వేశారు. రైతుల రక్తం తాగిన పార్టీ.. రైతుల నెత్తినకిరీటం పెడతుందని మభ్యపెట్టింది. కాంగ్రెస్ కుట్రలు తెలిసి కూడా ఆ హామీలను నమ్మారు. కానీ, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక పంపేందుకే ఇవాళ రైతు సంగ్రామ సభ పెట్టాం.. .. రైతుల డిక్లరేషన్ పేరిట లక్షల మంది రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పి.. రెండున్నరేళ్లు గడిచింది. రైతు డిక్లరేషన్ గురించి అడిగితే ఎవరూ మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ ఎక్కడున్నావ్?.. రైతు డిక్లరేషన్ ఏమైంది? అని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. రాహుల్ గాంధీ ఫొటోలను బస్టాండ్లలో.. రైల్వే స్టేషన్లలో అంటించాలి. దాని కింద దొంగలున్నారు జాగ్రత్త అని రాయలాలి. కాంగ్రెస్ హయాంలో పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో క్రమం తప్పకుండా పథకాలు అందేవి. తెలంగాణ తెచ్చిన రైతు భరోసాను 12 రాష్ట్రాల్లో అమలు చేశారు. 11 విడతల్లో కేసీఆర్ రూ.73 వేల కోట్లు ఇచ్చారు. కానీ, మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ నేతలు చెడ్డీగ్యాంగ్ కంటే డేంజర్....రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం. 34 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి అమలు చేయలేదు. రైతులకు నాగలితో దున్నడం తెలుసు.. మోసం చేసిన కాంగ్రెస్ వాళ్లను ఉరికించి కొట్టడమూ తెలుసు. ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి. హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ ఉద్ఘాటించారు. -
ఆరేళ్ల నాటి సాయానికి కేటీఆర్‌కు ఓ బాలిక కృతజ్ఞత
హైదరాబాద్: ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమి ట్టాడుతున్న ఓ బాలిక నాటి మంత్రి కె. తారక రామారావు అందించిన సాయంతో కోలు కొని ప్రస్తుతం కొత్త జీవితం అనుభవిస్తోంది. హైదరాబాద్‌లోని ప్యారడైజ్ బాలంరాయ్ ప్రాంతానికి చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడగా ప్రైవేటు ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు రూ. లక్షల వైద్య ఖర్చు భరించడం సాధ్యంకాలేదు. ఆ కష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి శరణ్యకు ఖరీదైన చికిత్సను ఉచితంగా అందేలా చర్యలు తీసుకున్నారు. కాలక్రమంలో శరణ్య పూర్తిగా కోలుకొని ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 384 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఈ నేపథ్యంలో తన ప్రాణాలను కాపాడిన కేటీఆర్‌ను తల్లిదండ్రులతో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగించగలగడం నా అదృష్టం. శరణ్య ఆరోగ్యంగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు.. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబంఆరేళ్ల క్రితం ఎక్స్ వేదికగా.. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న తమ కుమార్తె శరణ్యను కాపాడాలని కేటీఆర్‌ను కోరిన ఫ్యామిలీఈ ట్వీట్‌కు వెంటనే స్పందించడమే కాదు.. ఆపరేషన్‌కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించిన… pic.twitter.com/KHdO3ONe2I— PulseNewsBreaking (@pulsenewsbreak) May 3, 2026 -
14 లక్షల మంది విద్యార్థులకు రేవంత్ వెన్నుపోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెన్నుపోటు పొడిచేందుకే ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేసేలా చీకటి జీఓ నం.7ను తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. విద్యను విధ్వంసం చేసేందుకే ఆ శాఖను నీ దగ్గర పెట్టుకున్నావా?.. కేసీఆర్ స్కీంలకే కాదు.. వైఎస్ఆర్ పథకాలకు పాతరేస్తావా..? అంటూ రేవంత్‌ను నిలదీశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. దుర్మార్గమైన జీఓను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 7ను వెనక్కి తీసుకోకుంటే 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద విద్యార్థులతో దండుకట్టి సర్కారుపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. క్షమించరాని పాపం ‘రెండున్నరేళ్ల అసమర్థ పాలనలో విద్యావ్యవస్థను కుప్పకూల్చి క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా? రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేసేలా మీరు కుట్ర చేస్తున్నారు. జీఓ 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ అనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. పిల్లల భవిష్యత్తు కోసం కలలుగంటున్న తల్లిదండ్రుల ఆశలపై మీ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రాజకీయాలకతీతంగా కేసీఆర్ కూడా కొనసాగించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గ్రహణం పట్టింది. జీఓ 7 వెనక్కి తీసుకుని, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. గత 30 నెలల్లో మూడు పైసలు కూడా విడుదల చేయని మీ ప్రభుత్వం.. ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమవేస్తామంటే ఎవరు నమ్ముతారు’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌కు మళ్లీ అధికారం కల్ల
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో భూ కుంభకోణాలు, అరాచకాలు మినహా ప్రజలకు చేసిందేమీ లేదు. ఆ పార్టీ అరాచకాలు చూసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసే అవకాశం లేదు. ఆ పార్టీ మరో 20 ఏళ్ల వరకు అధికారంలోకి రావడం కల్ల’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమిషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తుంది. మంత్రులే స్వయంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ఆక్రమణతోపాటు మైనింగ్ కుంభకోణాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసింది’అని దుయ్యబట్టారు. శనివారం నందినగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నేతలతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ నిరసనలు: ‘ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.వెయ్యి పెంచింది. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. మరోసారి ఈ ధరలు పెంచకుండా ఉండేందుకు ప్రజలను జాగృతం చేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేటీఆర్ పార్టీ నేతలకు వివరించారు. ‘రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించబోతోంది. కాంగ్రెస్, బీజేపీ చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ప్రతీ ఒక్క యువతీ, యువకుడికి ఓటు హక్కు కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలి. కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు త్వరలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ ఎన్నికలకు సమాయత్తం కావాలి’అని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
ఇది మోదీ మేడే గిఫ్ట్, కుంభకర్ణుడిలా రేవంత్..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ డిక్లరేషన్లపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల ద్వారా సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన బీఆర్ఎస్.. మరో వైపు క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలను తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఇటీవల జగిత్యాల బహిరంగ సభతోపాటు, రెండు రోజుల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొని ఇచ్చిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ‘డిక్లరేషన్ల’పై సమర భేరి మోగించనుంది. కాంగ్రెస్ డిక్లరేషన్ సభలు నిర్వహించిన చోటే పోటీ సభలను నిర్వహించి వాటి అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మే 6న వరంగల్‌లో ‘రైతు డిక్లరేషన్’ అమలు వైఫల్యంపై సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మే 9న హైదరాబాద్‌లో ‘యూత్ డిక్లరేషన్’అమల్లో డొల్లతనాన్ని బయట పెట్టేందుకు సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇదే తరహాలో ఏడాది పాటు కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించిన తేదీల్లో, ఆ పార్టీ సభలు నిర్వహించిన చోటే పోటీ సభలు లేదా సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఆరు డిక్లరేషన్లు.. ఆరు చోట్ల సభలు 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2022 మే మొదలుకొని 2023 నవంబర్ వరకు ఆరు డిక్లరేషన్లు విడుదల చేసింది. – వరంగల్‌లో 2022 మే 6న జరిగిన ‘రైతు డిక్లరేషన్’సభకు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. – హైదరాబాద్‌లో 2023 మే 9న జరిగిన ‘యూత్ డిక్లరేషన్ ’సభకు ప్రియాంకగాంధీ వచ్చారు. –చేవెళ్లలో 2023 ఆగస్టు 26న జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. – 2023 నవంబర్ 9న హైదరాబాద్‌లో జరిగిన ‘మైనారిటీ డిక్లరేషన్’సభకు కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, మరుసటి రోజు నవంబర్ 10న కామారెడ్డిలో జరిగిన ‘బీసీ డిక్లరేషన్’సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరయ్యారు. ఈ సభల్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది భారీ బహిరంగ సభలు కాంగ్రెస్ డిక్లరేషన్ల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేలా బీఆర్ఎస్ ప్రస్తుతం మినీ సభలు లేదా సమావేశాలకే పరిమితం కావాలని భావిస్తోంది. కేటీఆర్ ఈ సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2028లో కాంగ్రెస్ డిక్లరేషన్ సభలు నిర్వహించిన చోట పోటీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు. డిక్లరేషన్ల వారీగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పేలా ప్రచార సామగ్రిని కూడా బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. వచ్చే నెల 6న వరంగల్‌లో జరిగే ‘రైతు డిక్లరేషన్’పై నిరసన సభను హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానం లేదా సమీపంలోని ఏదైనా హాల్లో నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. ఆ లోపే మే 2, 3, 4, 5 తేదీల్లో పార్టీ నేతలు జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల ఇబ్బందులపై ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. కార్పొరేషణ్ల ఎన్నికల నేపథ్యంలో... గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు మణుగూరు, మందమర్రి, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సభ్యత్వ నమోదుపైనా కసరత్తు గతంలో 60లక్షలకు పైగా సభ్యతాన్ని నమోదు చేసిన బీఆర్ఎస్ ఈసారి రాశి కన్నా వాసి ముఖ్యమని భావిస్తోంది. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల జాబితాను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. సర్ పర్యవేక్షణకు బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలను ఇవ్వాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను ఆదేశించింది. -
అన్ని కమిటీలు రద్దు త్వరలో BRS మెంబర్ మెంబర్షిప్ డ్రైవ్


