ఆడబిడ్డలపై ఆగని ఆకృత్యాలు.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం | Ktr Slams On Telangana Government About Assault Incidents On Women | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డలపై ఆగని ఆకృత్యాలు.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

Published Thu, Aug 1 2024 3:35 PM | Last Updated on Thu, Aug 1 2024 4:37 PM

Ktr Slams On Telangana Government About Assault Incidents On Women

సాక్షి,హైదరాబాద్‌ : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస ఆకృత్యాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.  48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటు చేసుకోవడంపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. మహిళల భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో వరుసగా ఇలాంటి ఘటలను చోటు చేసుకుంటున్నా  
రాష్ట్ర ప్రభుత్వం,పోలీసులు పట్టించుకోక పోవడంపై మండిపడ్డారు.

తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటు. ఈ క్రూరమైన చర్యలు మహిళలకు తీవ్రమైన భద్రత లేకపోవడం, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ఎత్తి చూపుతున్నాయి.

ఎనిమిది నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, నేరాలు పెరగడం ప్రత్యక్ష ఫలితమే. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలి.  సత్వర న్యాయం, దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement