assault case
-
బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
నెల్లూరు (లీగల్): బాలికతో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు పోతురాజు మీరయ్యకు జీవిత ఖైదు, రూ.20 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు మనుబోలు మండలం పిడూరుమిట్ట గ్రామానికి చెందిన పోతురాజు మీరయ్య చిల్లర అంగడి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన బాలిక అంగడికి వెళ్తున్నప్పుడు మాయమాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. బాధిత బాలిక 2022 జనవరి పన్నెండో తేదీన మనుబోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పోతురాజు మీరయ్యను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీïÙటు దాఖలు చేశారు. విచారణలో మీరయ్య నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?
ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు. -
కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. నెల్లిమర్ల ఎస్ఐ బి.గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండవెలగాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న బయాలజీ ఉపాధ్యాయుడు ఎం. వెంకటరావు అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత శనివారం విద్యార్థినీని అసభ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌పై తాకాడు. దీంతో మూడు రోజులుగా బాలిక ముభావంగా ఉంటూ తిండితినడం మానేసింది.తల్లి ఏమైందంటూ బాలికను ప్రశ్నించగా, ఉపాధ్యాయుడు తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని బయటకు చెప్పింది. ఆదివారం సెలవు కావడం, సోమవారం సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరు కావడంతో తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడితో పాటు హెచ్ఎంను ప్రశ్నించారు. అనంతరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కీచక ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గణేష్, సిబ్బంది పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఉండడం గమనార్హం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో కుమార్తెపై తండ్రి లైంగిక దాడిపెద్దముడియం: కూటమి ప్రభుత్వ విచ్చలవిడి మద్యం విధానం వావివరసలను మర్చిపోయేలా చేస్తోంది. బంధాలను, అనుబంధాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతురి మీదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె (16) పదో తరగతి వరకూ చదివి తల్లితో పాటు కూలి పనులకు వెళుతోంది. ఆమె తండ్రి హమాలీ పనికి వెళుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య లేకపోవడంతో కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు రోజులుగా కూతురు అనారోగ్యంగా ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో తండ్రి చేసిన అకృత్యాన్ని కూతురు బయటపెట్టింది. వెంటనే భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. బాలికలపై లైంగిక దాడి చేసిన యువకుడికి పాతికేళ్లు జైలుపోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు విశాఖ లీగల్: బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనంది మంగళవారం తీర్పు చెప్పారు. బాలికలకు నిందితుడు రూ.లక్ష చొప్పున చెల్లించాలని, ప్రభుత్వం చెరో రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు.. వివాహితుడైన అమరాపల్లి అరవింద్(25) పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర వుడా కాలనీలో నివసిస్తున్నాడు. బాధిత బాలికలు(15, 13), వారి తల్లి.. పాత పెందుర్తి దగ్గర బీసీ కాలనీలో నిందితుడి ఇంటికి సమీపంలో ఉండేవారు. నిందితుడు బాలికలతో చాలా చనువుగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలో ముందుగా పెద్ద బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2019 జూలైలో తల్లికి తెలియకుండా ఇద్దరు బాలికలనూ తన కారులో ఒంగోలు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరిపైనా లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు నేరాభి యోగపత్రంలో పేర్కొ న్నారు. విషయం తెలియడంతో బాలికల తల్లి 2019 నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ స్వరూపరాణి దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. -
జానీ మాస్టర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో నార్సింగి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేర కు జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలిస్తామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376 (2) (ఎ¯Œ), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు. భార్య ఇచి్చన సమాచారంతోనే.. జానీ మాస్టర్‌తో పాటు ఆయన భార్య కూడా పలుమార్లు తనపై శారీరకంగా దాడికి పాల్పడిందంటూ మైనర్ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ భార్యను నార్సింగి పోలీసులు స్టేషన్ లో విచారించారు. ఈనెల 15 నుంచే పరారీ లో ఉన్న జానీ మాస్టర్ తన ఫోన్‌ను స్విఛాఫ్ చేసుకున్నా డు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. జానీ భార్యను విచారిస్తున్న క్రమంలో ఆయన ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులు రాబట్టారు.ఆ సమాచారం ఆధారంగా గోవాకు వెళ్లిన ప్రత్యేక బృందం జానీని అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి పాస్ పోర్ట్, సెల్ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. బాధితురాలితో జానీ మాస్టర్ జరిపిన కాల్స్, వాట్సాప్ చాటింగ్, ఇతరత్రా ఆధారాలను సేకరించేందుకు సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తదుపరి విచారణ నిమిత్తం జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు.. ఈమేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైనర్‌పై లైంగిక వేధింపులు! ఓ డ్యాన్స్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచి్చన బాధితురాలికి జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జానీ 2019లో తన నృత్య బృందంలో సహాయ కొరియోగ్రాఫర్‌గా ఆమెను నియమించుకున్నాడు. ఓ డ్యాన్స్ ప్రాజెక్టు నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు ముంబై వెళ్లిన బాధితురాలిపై అక్కడి ఓ హోటల్లో జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అప్పటికి బాధితురాలు వయసు 17 ఏళ్లే కావడం గమనార్హం. కాగా జానీ ఆ తర్వాత కూడా తనపై పలుమార్లు వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. -
లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై మూడో ఛార్జ్‌షీట్
బెంగుళూరు: హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన అత్యాచారం కేసులో.. సిట్ పోలీసులు మూడవ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. జేడీఎస్ పార్టీకి చెందిన ఓ మహిళపై తుపాకీతో బెదిరించి పలుమార్లు లైంగింకంగా వేధింపులకు పాల్పడినట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.2020 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఓ మహిళపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు తెలిపారు. 1691 పేజీలు ఉన్న ఛార్జ్‌షీట్ లో 120 మంది సాక్ష్యుల వాంగ్మూలం కూడా ఉంది. లైంగిక చర్యకు చెందిన వీడియోలు తీసి, దాంట్లో ముఖం కనబడకుండా చేసి బెదిరింపులకు పాల్పడినట్లు సిట్ తెలిపింది. వీడియోల ఆధారంగా మళ్లీ మళ్లీ ఆ మహిళను లైంగికంగా వేధించినట్లు ఛార్జీషీట్లో పేర్కొన్నారు.కాగా తన కేసు విచారణ గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ప్రజ్వల్ తన న్యాయవాదుల సహకారంతో వేసుకున్న అర్జీని జస్టిస్ ఎం.నాగప్రసన్న తోసిపుచ్చారు. బాధిత మహిళల విచారణలో గోప్యత పాటించవలసి ఉంటుందని, ప్రజ్వల్ విషయంలో విచారణ ఎలా ఉండాలో న్యాయస్థానం తీర్మానిస్తుందని ప్రకటించి.. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు. -
బిభవ్ కుమార్‌కు బెయిల్.. ఘాటుగా స్పందించిన మలివాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో తనపై భౌతిక దాడికి దిగిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్‌పై మంగళవారం విడుదల కావడాన్ని బాధితురాలు, ఆప్ రాజ్యసభ సభ్యు రాలు స్వాతి మలివార్ తీవ్రంగా విమర్శించారు. తనకు ఘోర పరాభవం జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ ద్రౌపది వస్త్రాపహరణం పోస్టర్‌ను ఆమె 'ఎక్స్'లో పోస్ట్' చేశారు. మహాభారతంలో కౌరవులు జూదంలో గెలవడం ద్రౌపది వస్త్రాపహరణం వేళ కృష్ణుడు ద్రౌపదిని కాపాడటం వంటి సన్నివేశాలున్న పోస్టర్లు ఆమె షేర్ చేశారు.pic.twitter.com/7vgyFuRvqK— Swati Maliwal (@SwatiJaiHind) September 3, 2024 -
Karnataka: బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత అరుణ్ కుమార్ పుతిల పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 47 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసులు వివరాల ప్రకారం.. 2023 జూన్‌లో బెంగళూరు హోటల్లో బీజేపీ నాయకుడు అరుణ్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసి వాటిని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు.మహిళ ఫిర్యాదు మేరకు దక్షిణ కన్నడ జిల్లాలో అరుణ్ కుమార్‌పై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, బెదిరింపులు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా పుత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన పుతిల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన కాషాయ పార్టీలో చేరారు. -
ఆడబిడ్డలపై ఆగని ఆకృత్యాలు.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస ఆకృత్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటు చేసుకోవడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. మహిళల భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో వరుసగా ఇలాంటి ఘటలను చోటు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం,పోలీసులు పట్టించుకోక పోవడంపై మండిపడ్డారు.తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటు. ఈ క్రూరమైన చర్యలు మహిళలకు తీవ్రమైన భద్రత లేకపోవడం, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ఎత్తి చూపుతున్నాయి.ఎనిమిది నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, నేరాలు పెరగడం ప్రత్యక్ష ఫలితమే. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. సత్వర న్యాయం, దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. The recent spate of sexual assaults against women in Telangana is deeply alarmingIt's a disgrace that in just 48 hours, four heinous incidents occurred, including gang rapes and assaults. These gruesome acts highlight a severe lack of security for women and a deteriorating law… pic.twitter.com/2XlZLyivZL— KTR (@KTRBRS) August 1, 2024 -
సూరజ్‌కు త్వరలో పటుత్వ పరీక్షలు
శివాజీనగర: లైంగిక దాడుల కేసులో గతంలో అన్న ప్రజ్వల్ రేవణ్ణకు పోలీసులు, వైద్యులు లైంగిక పటుత్వ పరీక్షలను నిర్వహించారు. ఇప్పుడు తమ్ముడు సూరజ్‌కు కూడా ఇవే పరీక్షలు చేయడానికి సీఐడీ ప్రత్యేక తనిఖీ బృందం సిద్దమైంది. యువకున్ని బెదిరించి అసహజ లైంగిక దాడి చేశారనే కేసులో ఈ నెల 23వ తేదీన సూరజ్‌ని హాసన్‌లో అరెస్టు చేయడం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా అతి త్వరలోనే అతనికి బౌరింగ్ ఆస్పత్రిలో పురుషత్వ పరీక్షలు చేయించే అవకాశముంది. అలాగే స్వలింగ కామం సహజమైందా అనేదానికి మరికొన్ని పరీక్షలు చేయవచ్చని పోలీసులు తెలిపారు. అన్న ప్రజ్వల్‌కు జరిపిన పరీక్షల కంటే కొంతవరకు భిన్నంగా ఉంటాయని తెలిసింది. సూరజ్ ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్నాడు. మూడు కేసుల్లో ప్రజ్వల్‌కు మూడుసార్లు పరీక్షలు చేశారు. ఇదేం బాగాలేదని అతడు కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు సూరజ్ ఆప్తుడు శివకుమార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతన్ని అరెస్టు చేస్తే కేసులో మరిన్ని అంశాలు బయటకు వస్తాయంటున్నారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్
బెంగళూరు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో హాసన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీసు స్టేషన్లో జేడీఎస్ కార్యకర్త చేతన్.. సూరజ్ రేవణ్ణపై లౌంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తిరస్కరించటంతో పోలీసులు సూరజ్‌ను బెంగళూరు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనకు పొటెన్సీ పరీక్ష నిర్వహించనున్నారు.తనపై సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ కార్యకర్త చేతన్, మరోవ్యక్తి హోలెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘సూరజ్ ఫామ్ హైజ్‌లో జూన్ 16 తేదీన నాపై లైంగికంగా దాడి చేశాడు. బదులుగా నాకు రాజకీయంగా ఎదగటానికి సాయం చేస్తాననని బలవంతంగా లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్‌కు మెసెజ్ చేస్తే.. ‘ఏం కాదు. అంతా సర్దుకుంటుంది’అని రిప్లై ఇచ్చాడు’అని కార్యకర్త చేతన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఫిర్యాదుపై స్పందించిన సూరజ్, అతని స్నేహితుడు శివకుమార్ తమను బ్లాక్మెయిల్ చేయడానికే చేతన్, మరోవ్యక్తి అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. చేతన్ అనే వ్యక్తి తమతో స్నేహంగా ఉంటూ ఉద్యోగం కావాలని కోరితే.. ఉద్యోగం కోసమనే తాను సూరజ్‌ను పరిచయం చేశానని శివకుమార్ తెలిపారు. -
బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
న్యూడిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఇప్పటల్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 6 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 16న కేసు నమోదు చేయగా.. మే 18న కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు అదే రోజు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఆయన అరెస్టు కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్లో అర్థం లేదని కోర్టు పేర్కొంది. మే 24న అతడిని నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.తరువాత జూన్ 1న14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం జూన్ 22న వరకు కస్టడీ పొడిగించగా.. తాజాగా కస్టడీ గడువు ముగియడంతో జులై 6 వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జూన్ 13 న కుమార్ మరొక బెయిల్ పిటిషన్ వేయగా, దానిని కోర్టు కొట్టివేసింది. బిభవ్ కుమార్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో ప్రధాననిందితుడైన బిభవ్కుమార్కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇటీవల తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని స్వాతిమలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ తనను కింద పడేసి తన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మలివాల్‌పై దాడి ఘటనపై రాజకీయ దుమారం పెద్దదవుతూనే ఉంది. -
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన తనపై విభవ్ దాడికి పాల్పడ్డాడని స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీ సీఎం నివాసం నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కు ఇంటరాగేషన్ కోసం తరలించారు. అంతకు ముందు సీఎం కేజ్రీవాల్ నివాసంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు. అయితే.. ఈ కేసులో పూర్తిగా సహకరిస్తామని అధికారులకు తాము మెయిల్ పంపించామని, అయినా కూడా పోలీసుల నుంచి బదులేం లేదని విభవ్ లాయర్ మీడియాకు వెల్లడించారు. -
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూంలో సీఎం కోసం ఆప్ ఎంపీ ఎదురుచూస్తుండగా.. బిభవ్ కుమార్ అక్కడికి వెళ్లి, ఆమెతో అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు స్వాతి మలీవాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బిభవ్ కుమార్‌ను నిందితుడిగా చేర్చి దర్యాప్తు జరుపుతున్నారు.దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు మలీవాల్‌ను ఆమెపై దాడి జరిగిన సీఎం కేజ్రీవాల్ నివాసానికి శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లారు. మే 13న జరిగిన క్రైం సీన్‌ను రీక్రియెట్ చేయడానికి సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఆప్ ఎంపీని కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లే ముందు అయిదుగురు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) అంజిత చెప్యాల నాయకత్వంలో నలుగురు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సీఎం ఇంటి నుంచి పలు ఆధారాలను సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం కేజ్రీవాల్ నివాసం నుంచి తిరిగి వెళ్లిపోయింది.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Arvind Kejriwal's residence as police is expected to recreate what happened with her here on 13th May pic.twitter.com/bM7w8kygO3— ANI (@ANI) May 17, 2024 కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలుదాడి ఆరోపణల నేపథ్యంలో మలీవాల్‌కు నేడు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముఖంపై అంతర్గత గాయాలు అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు దాడికి ముందు కేజ్రీవాల్ నివాసంలో మలీవాల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.Analysing the #SwatiMaliwal case through this video:If this video was recorded before the alleged assault, there's no way she could have been assaulted the way she has written in the FIR after this, in presence of so many security staff including a female staff. If this video… pic.twitter.com/RNnmzYkC04— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 17, 2024దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని విమర్శించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు..? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే.. నిజం వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆప్ అధినేత ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. దీంతో కేజ్రీవాల్ మౌనంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.#WATCH | AAP MP Swati Maliwal leaves from Delhi CM Arvind Kejriwal's residence after recreation of May 13 incident by Police pic.twitter.com/8n3K6sAbZ5— ANI (@ANI) May 17, 2024 -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్‌లో ఓ సెమినార్‌కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్‌పై తీసుకుని బంజారాహిల్స్‌లోని ఓయో రూమ్‌కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
షాజహాన్ షేక్ ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్‌కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో బహిష్కృత టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. దాడికి సంబంధించిన ఆధారాల కోసం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలిలోని షాజహాన్ షేక్ నివాసం సమీప ప్రాంతాలను కూడా పరిశీలించారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 5వ తేదీన షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలకు వెళ్లిన 14 మంది అధికారుల బృందంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీబీకి చెందిన ఆరుగురు, సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు ఆరుగురు, ఈడీ అధికారులు ఇద్దరు గాయపడ్డారు. ఘటనతో సంబంధముందన్న ఆరోపణలపై టీఎంసీ నుంచి షాజహాన్ షేక్ సస్పెండయ్యాడు. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో గురువారం షాజహాన్ షేక్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, సందేశ్‌ఖాలిలోని అతడి నివాసం, కార్యాలయాలకు సీల్ వేశారు. -
పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్
బంజారాహిల్స్: హైదరాబాద్‌లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్‌గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్‌కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్‌ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
లైంగిక దాడి కేసులో టీడీపీ కార్యకర్త అరెస్టు
చిత్తూరు: మహిళపై లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు కల్లూరు సీఐ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. సీఐ కథనం మేరకు.. సదుం మండలం బ్రాహ్మణవీధికి చెందిన ముస్లిం మహిళ (39) ఆదివారం సాయంత్రం సదుం నుంచి రొంపిచెర్లకు వచ్చి, తిరిగి రాత్రి 7 గంటల స మయంలో ఆటోలో పీలేరుకు బయలుదేరింది. పెద్దగొట్టిగల్లు పంచాయతీ బోనంవారిపల్లెకు చెందిన డ్రైవర్ గుర్రప్ప(45) (టీడీపీ కార్యకర్త) ఆటో లో మహిళ ఒక్కటే ఉందని, బండకిందపల్లె–బోనంవారిపల్లెకు మధ్యలో ఉన్న చెరువులోకి ఆటోను వేగంగా తీసుకుని వెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈమేరకు ఆరోజు రాత్రే బాధితురాలు పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నిందితుడు గుర్రప్ప బండకిందపల్లె సమీపంలో ఉండగా పోలీసులు అరెస్టు చేసి, ఆటోను సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా, జడ్జి రిమాండ్‌కు అదేశించినట్లు సీఐ తెలిపారు. -
ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ దాడి
కృష్ణరాజపురం: బెంగళూరులో ఉబర్ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు, ప్రయాణికురాలపై దాడి చేసిన ఘటన నగరంలోని బెళ్లండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగనహళ్లిలో చోటు చేసుకుంది. బాధిత మహిళ తన కుమారున్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. అంతలోనే కుమారుడు మరో క్యాబ్‌ను బుక్ చేశాడు. ముందు వచ్చిన క్యాబ్లోకి ఎక్కారు, అయితే కుమారుడు ఇది మనం బుక్ చేసిన క్యాబ్ కాదని చెప్పాడు. క్యాబ్ డ్రైవర్ వారిని దించి ఆమెతో గొడవ పడ్డాడు. ఆమైపె చేయి చేసుకోవడంతో సమీపంలోని అపార్టుమెంట్ వాసులు వచ్చి కాపాడారు. ఇంతలో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
చౌదరి ఎక్కడ..?
ఒంగోలు టౌన్: గిరిజన యువకుడు మోటా నవీన్‌పై అత్యంత క్రూరంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు మన్నెం రామాంజనేయులు చౌదరి ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉండగా వారిలో ఆరుగురికి ఇప్పటికే పోలీసులు సంకెళ్లు వేశారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దురాగతంలో కీలక పాత్ర పోషించిన రామాంజనేయులు చౌదరి మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడి కోసం రెండు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు.. హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నా ఆచూకీ లభించక పోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత నెల 19న నవీన్‌పై దాడి చేసిన తర్వాత చౌదరి నగరంలోని శివారు ప్రాంతంలో ఓ చర్చి వెనక ఉన్నట్లు సమాచారం. అవివాహితుడైన చౌదరి వెంట ఓ మహిళ, పదేళ్ల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన తర్వాత నవీన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన మీద కేసు పెడితే చంపేస్తానని, తనకు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయని బెదిరించినట్లు స్థానికంగా చెప్పుకుంటున్నారు. గతేడాది కూడా నవీన్‌పై దాడి చేసి తల పగులగొట్టాడని బాధితుడు పోలీసులు, ఎస్టీ కమీషన్ సభ్యుడు వడితే శంకర్ నాయక్ ఎదుట చెప్పాడు. అప్పుడు కూడా చౌదరి రాజకీయ, సామాజిక అండ చూసి భయపడిన నవీన్ కేసు పెట్టలేదని తెలుస్తోంది. తాజాగా గత నెల దాడి జరిగినప్పుడు కూడా నవీన్ పోలీసులకు అసలు ఏం జరిగిందన్నది చెప్పక పోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా చికిత్స పూర్తి కాకుండానే రిమ్స్ నుంచి వెళ్లిపోయాడు. ఇది మామూలు దాడిగానే పోలీసులు భావించారు. వీడియో బయట పడిన తర్వాత కానీ అసలు నిజం వెల్లడి కాలేదు. ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడితో సన్నిహిత సంబంధాలు కలిగిన రామాంజనేయ చౌదరి అతడి సూచనలు, సలహాల మేరకే ఘటన జరిగిన నెల రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడి సంరక్షణలోనే తలదాచుకున్న రామాంజనేయులు చౌదరి.. పోలీసులకు చిక్కకుండా వారిని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడని నగరంలో ప్రచారం జరుగుతోంది. -
మత్తు మాత్రలు ఇచ్చి హిజ్రాపై లైంగిక దాడి
తమిళనాడు: మత్తుమాత్రులు మింగించి హిజ్రాపై లైంగిక దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పెరంబూరు ప్రాంతానికి చెందిన జన్నీ, బ్లసికా హిజ్రాలు. వీరిద్దరూ సోమవారం రాత్రి మధురవాయిల్ పూందమల్లి హైవే రోడ్లు జీసస్ కాల్స్ వద్ద నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆటోలో వచ్చిన మద్యం మత్తులో వున్న ఇద్దరు బ్లసికాతో మాటలు కలిపారు. తర్వాత హఠాత్తుగా కత్తిని చూపెట్టి బ్లసికాను ఆటోలు బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇది చూసి జన్నీ వెంటనే మధురవాయిలు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఇన్స్పెక్టర్ సుబ్రమని సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా సెట్టియార్ అగరం ప్రాంతంలో వున్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి మద్యం మత్తులో ఉన్న ఆవడికి చెందిన జగన్, రామాపురానికి చెందిన దినేష్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బ్లసికాను విడిపించారు. ఆ సమయంలో మత్తు మధ్యలో యువకులు సబ్ ఇన్స్పెక్టర్ మహారాజాపై దాడి చేసి తప్పించుకుని పోవడానికి ప్రయతి్నంచారు. పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. బ్లసికాను చికిత్స కోసం కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు. -
నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!
ఎంతపెద్ద సెలబ్రిటీ అయినాసరే కొన్నిసార్లు కష్టాలు తప్పవు. తాజాగా ఓ సీనియర్ నటికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ విషయమై క్లారిటీ తెచ్చుకునేందుకు సొంతూరికి వెళ్లగా.. పలువురు ఈమెపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో సదరు నటిని ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈమె.. అసలేం జరిగింది? ఎందుకు కొట్టారనే విషయాన్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ప్రేమలో ప్రతిసారీ నేనే మోసపోయాను: యంగ్ హీరోయిన్) నటి అనుగౌడ.. కన్నడలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని హోస్ నగర్ ఈమె సొంతూరు. అయితే సాగర్ తాలుకాలోని కస్పాడిలో ఈమెకి భూమి ఉంది. అనుగౌడ తల్లిదండ్రులు అందులో వ్యవసాయం చేసేవారు. దీంతో బెంగళూరు నుంచి తరుచూ ఇక్కడి వచ్చి వెళ్తుండేది. మరోవైపు ఇదే భూమిపై వివాదం నడుస్తూ ఉండేది. ఈ ల్యాండ్ తమదంటూ అనుతో కొందరు గొడవపడేవారు. రీసెంట్ గా అను గౌడ.. కస్పాడి వెళ్లగా, ఈసారి గొడవ పడటం పక్కనబెట్టి ఏకంగా ఈమెపై దాడి చేశారు. స్థానికులైన నీలమ్మ, మోహన్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు నటి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఈమెని ఆస్పత్రిలో చేర్పించారు. అనుగౌడ గతంలో సుదీప్ 'కెంపెగౌడ', విష్ణువర్ధన్ 'స్కూల్ మాస్టర్', శివరాజ్ కుమార్ 'సుగ్రీవ', పునీత్ రాజ్ కుమార్ 'బాయ్స్' సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!) -
19 ఏళ్ల యువతి వాహనం కోసం ఎదురుచూస్తుండగా... బలవంతంగా లాక్కెళ్లి
అనకాపల్లి : మండలంలోని నరసింగబిల్లి వద్ద 19 ఏళ్ల యువతి లైంగిక దాడికి గురైంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగు చూసింది. మంగళవారం నిందితుడిని పట్టుకుని కోర్టుకు తరలించారు. అనకాపల్లి రూరల్ సీఐ ఎ.రవికుమార్ విలేకరులకు అందించిన వివరాలు. మండలంలోని నరసింగబిల్లి వద్ద తమ గ్రామానికి వెళ్లేందుకు 19 ఏళ్ల యువతి వాహనం కోసం ఎదురుచూస్తుండగా, సోమవరం గ్రామానికి చెందిన కరణం వెంకట నాగేంద్రబాబు(23) సోమవారం సాయంత్రం బైక్‌పై ఆమె వద్దకు వెళ్లి ఆగి మాట్లాడాడు. ఆమె తనతో రావడానికి నిరాకరించడంతో బలవంతంగా బైక్ ఎక్కించుకొని నరసింగబిల్లి రైల్వే గేటు వద్దకు బయల్దేరి, అక్కడి నుంచి పక్క మార్గంలో తీసుకెళ్లాడు. అక్కడ రైల్వే అండర్ పాసు వద్ద బైక్ నిలిపి ఆమెను లోపలికి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ఎ.ఆదినారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. మంగళవారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోమవరంలో తన ఇంటి వద్దనున్న నిందితుడు నాగేంద్రబాబును అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అనకాపల్లి కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరు పరచినట్లు తెలిపారు. -
ఫీజు కోసం బతిమిలాడితే.. హోటల్‌కు తీసుకెళ్లి..
తమిళనాడు: నీలగిరి జిల్లాకు చెందిన విద్యార్థినిని (21)ని స్నేహితులు బంధించి మూడు రోజులు లైంగిక దాడి చేశారు. కోయంబత్తూరులోని ఓ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి శరవణం పట్టి ప్రాంతానికి చెందిన రవీంద్రన్ (24), జర్మన్ రాజేష్ (25)తో పరిచయం ఏర్పడింది. రవీంద్రన్ రెండేళ్లుగా కాలేజీకి వెళ్లకుండా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. జర్మన్ రాజేష్ కూలీ పనిచేస్తున్నాడు. విద్యార్థినికి కళాశాల ఫీజు చెల్లించాల్సిన అవసరం వచ్చింది. ఆమె రవీంద్రన్ వద్దకు వెళ్లి నగదు సాయం చేయాలని కోరింది. అతను రెండు రోజుల క్రితమే డబ్బులు సిద్ధం చేశానని, శరవణంపట్టిలోని రెస్టారెంట్ వద్దకు వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఆమెను రవీంద్రన్ హోటల్లోని గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలో జర్మన్ రాజేష్ ఉన్నాడు. ఇద్దరూ తలుపులు వేసి విద్యార్థినిని బెదిరించి లైంగిక దాడి చేశారు. అనంతరం గదిలో బంధించారు. 3 రోజులు లైంగిక దాడి చేశారు. ఈ విషయాలను ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి పంపించారు. ఆమె శనివారం కోయంబత్తూరు ఈస్ట్ ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి రవీంద్రన్, జర్మన్ రాజేష్‌ను అరెస్టు చేశారు. -
ఇంజనీరింగ్ విద్యార్థిని బంధించి.. బలాత్కరించి.. చంపబోయాడు
ఏలూరు టౌన్:ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఇంజనీరింగ్ విద్యార్థినిని నిర్బంధించి.. ఆమె వంటిపై వేడి నూనె పోసి గాయపర్చి.. ఆపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎస్పీ డీ.మేరీప్రశాంతి ఆదేశాలతో 24 గంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక త్రీటౌన్ స్టేషన్లో ఏలూరు దిశ డీఎస్పీ కేవీ సత్యనారాయణ మీడియాతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 12 రోజులు నిర్బంధించి లైంగిక దాడి దుగ్గిరాల గ్రామానికి చెందిన బాధితురాలు కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. నిందితుడు సదర్ల అనుదీప్ అదే గ్రా మానికి చెందిన వ్యక్తి. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న అనుదీప్ కాకినాడ వెళ్లి బాధితురాలిని కలుసుకున్నాడు. ఇద్దరూ చెన్నై వెళ్లి వేలంగిణి మాత చర్చికి వెళ్లారు. నిందితుడు అనుదీప్ తాను వేసుకున్న క్రీస్తు మాలను ఈస్టర్ రోజున తీశాడు. కాగా, బాధితురాలిని 10వ తేదీ రాత్రి ఏలూరులోని దుగ్గిరాల జోసఫ్ నగర్లో గల నాన్నమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. అదేరోజు రాత్రి తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదు. మరుసటి రోజు మరోసారి కోరిక తీర్చాలంటూ బలవంతం చేసేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అనుదీప్ వేడిగా మరిగించిన నూనెను ఆమె వంటిపై పోయటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 12 రోజుల పాటు ఆమెను ఇంట్లోనే బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు చంపేందుకు ప్రయత్నించటంతో బాధితురాలు అతని నుంచి తప్పించుకుని అతని ఫోన్ లాక్కొని తండ్రికి ఫోన్ చేయగా.. వారు వచ్చి ఆమెను ఏలూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో చేర్పించారు. నిందితుడిపై హిస్టరీ షీట్ బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా అనుదీప్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని దిశ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం నిందితుడు అనుదీప్‌ను ఏలూరు కొత్త బస్టాండ్ సమీ పంలో అరెస్ట్ చేశామని చెప్పారు. నేరం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేయటంతో పాటు, ఆధారాలను సేకరించి ల్యాబ్‌కు పంపామని తెలిపారు. బాధితురాలికి సత్వర న్యాయం చేసే దిశగా త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఎస్పీ మేరీప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడు అనుదీప్ పై హిస్టరీ షీట్ తెరుస్తున్నట్టు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని, మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక దాడులకు పాల్ప డినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చిక్కుల్లో నటుడు దిలీప్.. హైకోర్టు షాక్
మలయాళ స్టార్ నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన హత్య కుట్ర కేసును కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను మంగళవారం కొట్టేసింది. మలయాళ ప్రముఖ నటి లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ తాజా అభ్యర్థనను హైకోర్టు జస్టిస్ జియాద్ రెహమాన్ తోసిపుచ్చారు. ఈ కేసులో విచారణ జరిపిన ఓ అధికారి ఫిర్యాదు మేరకు.. క్రైమ్ బ్రాంచ్ ఈ ఏడాది జనవరి 9వ తేదీన మరో కేసు నమోదు చేసింది. విచారణ అధికారులను హత్య చేయాలని దిలీప్ కుట్ర పన్నాడంటూ అందులో అభియోగం నమోదు చేశారు. హత్య చేయాలనే.. దిలీప్ గొంతుగా భావిస్తున్న ఆడియో క్లిప్ ఒకటి ఆ మధ్య ఓ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దానిని ఆయన సన్నిహితుడు బాలచంద్ర కుమార్ బయటపెట్టడం విశేషం. అందులో ఈ కేసులో విచారణ చేపట్టిన అధికారులకు హాని తలపెట్టాలన్న ఆలోచనతో దిలీప్ ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో క్రైమ్ బ్రాంచ్ హత్య కుట్ర నేరం మీద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. దిలీప్ మాజీ భార్య, నటి మంజు వారియర్‌ను సైతం క్రైమ్ బ్రాంచ్ వాయిస్ కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించింది. ఆ ఫోన్ సంభాషణల్లో దిలీప్‌తో పాటు దిలీప్ కుటుంబ సభ్యులకు చెందిన మరో ఇద్దరి గొంతులను మంజు గుర్తుపట్టింది. ఈ తరుణంలో ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. హత్య కుట్ర కేసు కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థనను కొట్టేసింది. మరోవైపు దిలీప్ బెయిల్ రద్దు చేయాలని, దిలీప్ బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేరళ క్రైమ్ బ్రాంచ్, కేరళ పోలీసులు కోర్టును కోరుతున్నారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 2017 కేరళ నటి దాడి కేసు 2017, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రిపూట మలయాళంతో పాటు సౌత్‌లోని పలు భాషల్లో నటించిన ఓ హీరోయిన్ను బలవంతంగా ఎత్తుకెళ్లి, కారులోనే రెండు గంటలపాటు వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆపై ఆ వేధింపుల పర్వాన్ని ఫోన్లలో రికార్డు చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడాలని చూశారు. ఈ కేసులో దిలీప్‌తో పాటు పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. -
కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు : 5ఏళ్ల తర్వాత స్పందించిన హీరోయిన్
Actress Bhavana Menon Opens Up On Assalut Case After 5 Years: ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ సూపర్‌స్టార్ దిలీప్ కుమార్‌పై కేరళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ భావన స్పందించింది. తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకొని సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్టును షేర్ చేసింది. 'బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి, నా పేరు, నా గుర్తింపు అణచివేయబడ్డాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానా అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకు మద్ధతుగా నిలిబడిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది. కాగా హీరోయిన్ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, నిప్పు వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bhavana Menon 🧚🏻♀️ (@bhavzmenon) -
2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు
మహబూబ్‌నగర్ క్రైం: రెండు వారాల్లో పెళ్లి కాబోతున్న యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేయడమేగాక.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సదరు పెళ్లికొడుకుకి పంపారు. ఈ నెల 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్‌కి చెందిన ఓ అమ్మాయి(20) ప్రతిరోజూ మహబూబ్‌నగర్‌కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాపూర్కి చెందిన రాజేందర్‌రెడ్డి అలియాస్ రాజు కొత్లాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: (దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు) ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్ నుంచి బైక్‌పై మహబూబ్‌నగర్‌కు వచ్చి పెయింటింగ్ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలాసార్లు బైక్‌పై ఎక్కించుకుని రావడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈనెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆరోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని ఫతేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు అత్యాచారం చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా, ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఫొటోలు, వీడియోలను సదరు పెళ్లికొడుకు వాట్సాప్‌కు పంపారు. చదవండి: (సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి) ఆ ఫొటోలను పెళ్లికొడుకు అమ్మాయి తల్లిదండ్రులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై 2 రోజుల క్రితం అమ్మాయి, తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి శుక్రవారం రాజు, ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. -
కరోనాపై గెలిచినా కామాంధులకు బలైన మహిళ
డిస్పూర్: మాయదారి కరోనా వైరస్‌ను జయించింది. కానీ కామాంధులకు బలయ్యింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించి తేయాకు తోటలో అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా ఆ ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దుండగుల బారి నుంచి ఆమె కుమార్తె తప్పించుకుంది. ఈ ఘటన అసోంలో హాట్ టాపిక్‌గా మారింది. చారడియో జిల్లాకు తల్లి (54)తో పాటు కూతురి (17)కి కూడా కరోనా సోకింది. సపేకాతి మోడల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకోవడంతో మే 29వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. అయితే వారు అంబులెన్స్ పెట్టుకోలేని పేదవారు. దీంతో తేయాకు తోటల మీదుగా తల్లీకూతురు ఇంటికి వెళ్తుండగా చీకటి పడింది. 30 కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బొర్హట్ టీ ఎస్టేట్ సమీపంలో ఇద్దరు దుండగులు వచ్చారు. తల్లికూతురిని వెంబడించారు. యుక్త వయసు ఉన్న కూతురు వారి నుంచి తప్పించుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో నీరసంగా ఉండడంతో ఆ తల్లి వారికి చిక్కింది. వారు ఆమెను తేయాకు తోటల సమీపంలో అత్యాచారానికి ఒడిగట్టారు. (చదవండి: ప్రేయసి ముందు అనుమానం గెలిచి.. స్నేహం ఓడింది) అయితే పరుగెత్తుకుంటూ వెళ్లిన కుమార్తె సమీప గ్రామస్తులకు విషయం తెలిపింది. దీంతో ఆ గ్రామస్తులు తల్లి కోసం గాలించారు అయితే దుండగులు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె ఓ పొదల చాటున నిస్సహాయంగా పడింది. వెంటనే గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంబులెన్స్‌ఏర్పాటు చేయకపోవడంతోనే ఆమెపై అఘాయిత్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంత ‘నెగటివ్ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి ఇంటి వద్ద చేర్చేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు. -
చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ
-
ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి!
సాక్షి, తూర్పుగోదావరి : భార్యలపై అనుమానంతో శాడిస్టు భర్త వారిని అంతమొందించేందుకు అమానుషంగా ప్రవర్తించాడు. మొదటి భార్యను ముక్కు, చెవులు కోసి హతమార్చాలని ప్రయత్నించగా, రెండో భార్యపై ఏకంగా పెట్రోల్ పోసి నిప్పటించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టిలో ఈ దారుణం వెలుగుచూసింది. చింతూరు ఎస్ఐ సురేష్ బాబు కథనం ప్రకారం.. చట్టిలో నివసముంటున్న కళ్యాణం వెంకన్నకు ఇద్దరు బార్యలు. వారిద్దరికిపై అనుమానం పెంచుకున్న అతను వారిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈనెల 3న రెండో భార్యను గ్రామంలోని దేవతా విగ్రహం వద్దకు తీసుకువెళ్లి వేడి నూనెలో చేతిని ముంచి ప్రయాణం చేయించాడు. ఈ నెల 5న మొదటి భార్యను ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేసి, ముక్కు, చెవులు కోసేందుకు యత్నించాడు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మహిళ తన పుట్టింటికి పారిపోయింది. అదే రోజు రెండో భార్యను మండలంలోని నర్సింపురం సమీపంలోని ఆటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోలీస నిప్పంటించడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె కూడా భద్రాయలంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తనను చంపేస్తాడనే భయంతో ఆమె ఈ నెల 16న చింతూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, మొదటి భార్యను వేధింపులకు గురి చేస్తున్న సమయంలో నిందితుడు స్వయంగా సెల్ఫీ వీడియో తీశాడు. అది కాస్తా బయటకు రావడంతో ఈ అమానుష ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ -
చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి ఘటనను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు. మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్నను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె ఆదేశించారు. బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ నయీం హస్మీతో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. తన ఇద్దరు భార్యలు సుమతి, జయమ్మలపై భర్త కళ్యాణం వెంకన్న చేసిన పాశవిక దాడి అమానుషమన్నారు. ఇద్దరిని పెళ్లాడటం తప్పు అని.. అనుమానాలతో భార్యలపై మృగంలా ప్రవర్తించి అత్యంత క్రూరంగా చిత్రహింసలకు గురిచేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భార్యలను చిత్రహింసలు పెడుతూ మరో వ్యక్తితో సెల్లో వీడియో తీయించడం మరీ దారుణమన్నారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చదవండి: ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి! చదవండి: చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం? -
వీడియో వైరల్: ప్రియుడిని కలిసేందుకు వెళ్తుండగా..
జయపురం(ఒడిశా): తాను ప్రేమించిన వ్యక్తిని కలిసేందుకు వెళ్లిన ఓ యువతిపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడిన సంఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండున్నర నెలల క్రితం ఈ ఘటన జరగగా, దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ కావడంతో గుట్టురట్టయింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో దినేష్ గోండ్, నరసింగ గోండ్, శిశుపాల్ గోండ్లు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. (చదవండి: సీసీ కెమెరాలో దృశ్యాలు: ఆ ఘటన వెనుక కుట్ర) కుందై కోటపర గ్రామానికి చెందిన ఓ యువతి.. ఝుడుకు గ్రామ పంచాయతీలోని పూజారిపర గ్రామానికి చెందిన జగదీష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే జూలై 16వ తేదీన ఆ యువతి తన ప్రేమికుడు జగదీష్‌ను కలిసేందుకు అతడి గ్రామానికి బయలుదేరింది. ఈ విషయం యువతికి వరసకు సోదరుడైన శిశుపాల్ గోండ్‌కు తెలిసింది. దీంతో అతడు తన స్నేహితులతో కలిసి, ఆ యువతిని వెంబండించాడు. సరిగ్గా అక్కడి అటవీ ప్రాంతంలో ఆ యువతి నడిచి వెళ్తుండగా.. శిశుపాల్ తన స్నేహితులతో కలిసి ఆమెను చుట్టుముట్టి చితకబాదారు. ఈ క్రమంలో ఆ యువతి ప్రాణ భయంతో పరుగులు తీసినా విడిచిపెట్టకుండా ఆ యువతిని చేతులు, కర్రలతో కొట్టారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో టిక్‌టాక్ స్టార్ మృతి) అనంతరం ఆ యువతిని గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో నిర్వహించిన రచ్చబండలో నిలబెట్టారు. యువతి ప్రేమించిన వ్యక్తి జగదీష్‌ను కూడా రచ్చబండకు పిలిపించి, నష్టపరిహారం కింద రూ.60 వేలు కట్టాలని పెద్దలు ఆదేశించారు. ఇరువర్గాలవి వేర్వేరు కులాలు కావడంతో విషయం బయటకుపోతే తమ పరువు పోతుందని భావించిన జగదీష్ కుటుంబ సభ్యులు పెద్దల తీర్పును అంగీకరించారు. అప్పట్లో జగదీష్ వద్ద ఉన్న రూ.20 వేలు నష్టపరిహారం కింద చెల్లించగా, మిగతా సొమ్ము తర్వాత ఇస్తానని చెప్పి, వలస పనుల నిమిత్తం జగదీష్ మహారాష్ట్రకు బయలుదేరాడు. అయితే అకస్మాత్తుగా ఆ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ముఖంపై పిడికిలితో గుద్దాడు.. జుట్టు పట్టుకొని!
ముంబై: పెళ్లి అయి పట్టుమని నెల రోజులు కాలేదు అప్పుడే భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టి రచ్చకెక్కారు నటి, మోడల్ పూనమ్ పాండే. కొంత కాలంగా తన భాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేను గాఢంగా ప్రేమించిన పూనమ్ పామ్ ఈనెల 1వ తేదిన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తన భర్త వేధిస్తున్నాడని, శారీరక దాడికి పాల్పడుతున్నాడని పూనమ్ సామ్‌పై గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే స్థానిక పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు భర్త సామ్ బాంబేను గోవా పోలీసులు సెప్టెంబర్ 22న అరెస్టు చేశారు. అయితే ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 23న బాంబేకు గోవా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్తపై ఫిర్యాదు చేయడంపై వివరణ ఇచ్చారు పూనమ్. (పూనమ్ భర్తకు బెయిల్ మంజూరు) సామ్‌తో బంధం ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేదని. అయితే పెళ్లి చేసుకోవడం వల్ల అతనిలో మార్పు వస్తుందేమోనని భావించినట్లు వెల్లడించారు. సామ్ తన విషయంలో ఆధిపత్యం చేలాయించేవాడని, చిన్న విషయాలకే ఆవేశపడుతుంటాడని పేర్కొన్నారు. గోవాలో జరిగిన విషయాల గురించి పూనమ్ మాట్లాడుతూ.. ‘సామ్‌కు నాకు ఓ విషయంలో వాదన మొదలైంది. అది మెల్లమెల్లగా పెరిగి గొడవలా మారింది. ఈ క్రమంలో అతను నన్ను కొట్టడం ప్రారంభించాడు. నన్ను అనేక రకాలుగా హింసించాడు. నా ముఖంపై పిడికిలితో గుద్దాడు. నా జుట్టు పట్టుకొని లాకెళ్లి మంచం మూలపై తలతో కొట్టాడు. ఆ సమయంలో నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ ఏదో విధంగా అక్కడి నుంచి బయటపడగలిగాను. హోటల్ సిబ్బంది సహాయంతో పోలీసులను సంప్రదించాను. అప్పుడు అతన్ని తీసుకెళ్లాను. నేను సామ్‌పై కేసు పెట్టాన’ని తెలిపారు. (పెళ్లి విషయం దాచాలనుకోలేదు) తనను ఓ జంతువులా కొట్టడంతో ఇక తన వైవాహిక జీవితాన్ని ముగించుకుంటానని ఆమె తెలిపారు. ఇక తన దగ్గరకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘నన్ను జంతువులాగా కొట్టిన వ్యక్తి దగ్గరికి తిరిగి వెళ్లాలన్న ఆలోచన లేదు. మా బంధాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి రిలేషన్లో ఉండటం కంటే నేను ఒంటరిగా ఉండటం మేలు. ఇక్కడితో మా పెళ్లికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను’ అని వెల్లడించారు. కాగా మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో ‘నాషా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. ఈ ఏడాది జూలై 27న బాయ్‌ప్రెండ్ సామ్‌తో పూనమ్ నిశ్చితార్థం చేసుకున్నారు. సుమారు రెండేళ్లుగా సామ్‌తో సహజీవనం చేసి పూనమ్ బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు. (ఏడడుగులు వేసిన వేళ) -
పూనమ్ భర్తకు బెయిల్ మంజూరు
పనాజీ: పూనమ్ పాండే భర్త సామ్ బాంబేకు కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన గోవా కోర్టు.. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కాగా, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే పూనమ్ పాండే ప్రేమించి పెళ్లి చేసుకున్న మూన్నాళ్లకే పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చంపుతానంటూ బెదిరింపులకు దిగాడని భర్త సామ్ బాంబేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని సోమవారం సాయత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ గోవాలోని కానకోన గ్రామంలో పూనమ్ ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లిన క్రమంలో వేధించాడని, లైంగికంగా దాడికి చేశాడని పూనమ్ తన పిర్యాదులో పేర్కొంది. (చదవండి: ఏడడుగులు వేసిన వేళ) కాగా, కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్ పాండే పెళ్లి చేసుకున్నారు. మోడల్ నుంచి నటిగా ఎదిగిన పూనం ఈనెల 10న తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిస్టర్ అండ్ మిసెస్ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చిన పూనం ఇంతలోనే భర్తపై ఫిర్యాదు చేయడం, సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో ఇమేజ్ సంపాదించారు. (చదవండి: బన్నీని కలిసేందుకు అభిమాని పాదయాత్ర) -
పోలీసులపై దాడి.. ఇద్దరు రిపోర్టర్లు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విధి నిర్వాహణలో ఉన్న పోలీస్ సిబ్బందిపై మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని డీసీపీ (క్రైం) సురేష్‌బాబు తెలిపారు. హార్బర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం గోవిందరావు (45), రమణారావు (43) మద్యం సేవించి వేగంగా గాజువాక నుంచి కాన్వెంట్ కూడలి వైపు వస్తున్నారు. కాన్వెంట్ కూడలి వద్ద సిగ్నల్ పడడంతో వాహనాలు నిలిపి ఉండగా... వేగంగా వస్తున్న వీరిద్దరూ ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. దీంతో ఆ కూడలిలో విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రకాష్, హోంగార్డు రవి సంఘటన స్థలానికి వెళ్లి కారును ఎందుకు గుద్దారని ప్రశ్నించారు. దీంతో వారిద్దరిపై గోవిందరావు, రమణారావు దాడి చేసి దుర్భాషలాడారు. ఒకరు పీపుల్ వాయిస్ రిపోర్టర్ని అని, మరో వ్యక్తి మహాన్యూస్ రిపోర్టర్ని అని చెప్పారు. దీంతో వారిద్దరిపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామని సురేష్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో ఏడీసీపీ (ట్రాఫిక్) ఆదినారాయణ, ఏసీపీలు ఎంఆర్కే రాజు, టి.మోహన్‌రావు, సీఐ శ్యామలారావు పాల్గొన్నారు. -
మహిళా ఉద్యోగికి మంత్రి అనిల్ పరామర్శ
నెల్లూరు : డిప్యూటీ మేనేజర్ చేతిలో దాడికి గురైన మహిళా ఉద్యోగి ఉషారాణిని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె జరిగిన దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సాయం అందజేస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. కాగా, నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉషారాణిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దివ్యాంగురాలన్న కనీస కనికరం లేకుండా ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాదితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు భాస్కర్‌ను డిప్యూటీ మేనేజర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.(చదవండి : దివ్యాంగురాలిపై పాశవిక దాడి) -
మాజీ మంత్రి ఆది సోదరులపై కేసు నమోదు
జమ్మలమడుగు రూరల్: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, రామాంజనేయరెడ్డి, కుమారుడు గోవర్థన్‌రెడ్డి, మరో 80మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన రావు తెలిపారు. తమపై దాడి చేసినట్లు బాధితులు రెడ్డయ్య, రామాంజనేయులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా దేవగుడి గ్రామంలో 30 యాక్టు చట్టాన్ని ఉల్లంఘించి సమావేశాన్ని నిర్వహించారన్నారు. శనివారం అర్ధరాత్రి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 324, 307,147,148,188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భారీ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు ఛేదించారు. సుమారు 10 సభ్యుల గల ఈ ముఠా 5 వందలమందికి పైగా అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తోంది. వారిపై అత్యాచారాలు చేసి, వీడియోలు చిత్రీకరించి వారిపై బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతోంది. గత ఏడేళ్లుగా వీళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. అయితే ఓ విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. విచారణలో నిందితులు చెప్పిన వివరాలు విని పోలీసులే నివ్వెర పోయారు. ఈ రాకెట్‌ను నడిపించిన ముఠాలోని ఒకరు అధికార పార్టీకి చెందిన ఓ యువనేత కావడం రాజకీయాల్లో కలకలం రేపింది. ఫేస్బుక్లో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ వారిని నమ్మించి అత్యాచారాలకు తెగబడటం, ఈ దృశ్యాలను వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడటం వీరి మోడస్ ఒపరాండీ. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పొల్లాచిలో జ్యోతి నగరలో ఉండే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌తో శబరీ రాజన్ (25) అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా స్నేహం చేశాడు. మొబైల్నంబరు తీసుకుని..బాగానమ్మబలికి..తనతో బయటికి రావాలని కోరాడు. అలా ఆ అమ్మాయిని తన స్నేహితులు సతీష్, వసంతకుమార్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్ని వీడియో కూడా తీశారు. అనంతరం కారులో ఆమెను తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసి పారిపోయారు. అక్కడితో ఆగకుండా, డబ్బులు ఇవ్వాలని లేదంటే.. వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ ఫోన్ ద్వారా వేధింపులకు దిగారు. ఈ టార్చర్‌తో ప్రియా తొలుత తన సోదరుడికి విషయాన్ని చెప్పింది. అతను నిందితులతో ఘర్షణకు దిగాడు. దీంతో నిందితులు అతనిపై తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక విసిగిపోయి బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే చంపేస్తామంటూ మరింత బెదిరింపులకు పాల్పడింది నాగరాజు బృందం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన కూపీ లాగగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. పదిమందికి పైగా ఉన్న ముఠా ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేస్తారు. చిన్నాపాలయం దగ్గర ఉన్న ఫామ్‌హౌస్‌కు తరలించి అక్కడ వారిని లైంగికంగా వేధించడం, వీడియోలు తీయడం, బెదిరించడం చేసేవారు. ఈ ఫాం హౌస్ "బార్" నాగరాజన్ గా పిలిచే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఇతను ఎఐడీఎంకే యువనేతగా ఉన్నాడు. బాధితులు బయటికొచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో ఏడేళ్లుగా ఈ రాకెట్ యథేచ్ఛగా సాగించినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన శబరి రాజన్, సతీష్, వసంతకుమార్ అనే కీచకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. అంతేకాదు నిందితుల వద్ద ఉన్న సెల్ఫోన్లలో వెయ్యికిపైగా అసభ్యకర వీడియోలు గుర్తించారు పోలీసులు. సోదరుడిని చంపేస్తామంటూ బాధితురాలిని కొందరు బెదిరించారని..ఈ వ్యవహారంలో శబరి రాజన్, సతీష్, నాగరాజ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా కీలక నిందితుడు తిరువునక్కరసును నిన్న తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఈ గ్యాంగ్‌పై తొలిసారి స్పందించారు. అధికార పార్టీ అండ ఉండటంతో ఈ ముఠా చెలరేగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని డీఎంకె ఛీప్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. కీలక నిందితులను ఏఐడీఎంకె పార్టీ వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధితురాలికి రక్షణ కల్పించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. అటు దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సీబీసీఐడీ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏఐడీఎంకే స్పందించింది. బార్ నాగరాజును పార్టీలోని అన్ని పదవులనుంచి తొలగిస్తున్నట్టు అన్నాడీఎంకే అధిష్ఠానం సోమవారం ప్రకటించింది. కాగా కేవలం నలుగురు మాత్రమే నిందితులుగా ఉన్నారనీ, నాలుగు వీడియోలు మాత్రమే లభించాయని జిల్లా ఎస్పీ తాజాగా ప్రకటించారు. నిందితులపై గూండా యాక్ట్ ప్రయోగించినట్టు చెప్పారు. -
గిరిజన మహిళపై అఘాయిత్యం..!
కామారెడ్డి క్రైం: ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం కామారెడ్డికి సమీపంలోని ముత్యంపేట రోడ్డులో వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మండలంలోని ఓ తండాకు చెందిన ఓ మహిళ తండాకు కొద్ది దూరంలోని ఓ రైస్‌మిల్ వద్ద చిన్న హోటల్ నడుపుతోంది. మంగళవారం ఉదయం హోటల్ నిర్వహిస్తున్న సదరు మహిళ తలకు బలమైన గాయాలతో అపస్మారక స్థితిలో హోటల్‌కు కొద్దిదూరంలో పడి ఉండడాన్ని గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న కామారెడ్డి రూరల్ పోలీసులు విచారించి వైద్య చికిత్సల నిమిత్తం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మహిళ ఒంటరిగా ఉండడం గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి 7 గంటలకు ఆమెపై దాడి చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒంటిపై దుస్తులు సరిగ్గా లేక లైంగికదాడికి ఒడిగట్టి ఉంటారని, ఆమె ప్రతిఘటించినట్లు ఇక్కడ విషయం తెలుస్తుందని హత్యాయత్నానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై కామారెడ్డి రూరల్ పోలీసులను సంప్రదించగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. గాయపడిన మహిళ స్పృహలోకి వస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు. -
‘అదంతా మాజీ ఎంపీ పనే... పోలీసుల ఎదుటే జరిగింది’
లక్నో : తనను బెదిరించి ఓ మాజీ ఎంపీ తన ఆస్తి మొత్తం రాయించుకున్నాడని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైస్వాల్ ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా పోలీసుల ఎదుటే ఈ తతంగమంతా జరిగిందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు... మోహిత్ జైస్వాల్ అనే వ్యాపారవేత్త డిసెంబరు 26న కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చి.. వ్యాపారం గురించి మాట్లాడాలని చెప్పి.. ఆ తర్వాత తన కారులోనే కిడ్నాప్ చేశారని పేర్కొన్నాడు. లక్నో నుంచి దాదాపు 316 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోరియా జైలుకు తీసుకుని వెళ్లారని తెలిపాడు. ఆ తర్వాత జైలు కాంప్లెక్స్‌లో... సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్‌తో మాట్లాడాల్సిందిగా తనకు సూచించారన్నాడు. అయితే ఆ సమయంలో జైలు సిబ్బంది మొత్తం అక్కడే ఉన్నారని... అయినప్పటికీ అతీఖ్ అహ్మద్, ఆయన కొడుకులు దాడి చేసి బలవంతంగా తన ఆస్తి మొత్తం వారి పేరిట రాయించుకున్నారని ఆరోపించాడు. కాగా మోహిత్ జైస్వాల్ అనే వ్యక్తి జైలు కాంప్లెక్స్ లోపలికి వచ్చిన మాట వాస్తమేనని జైలు సిబ్బంది తెలిపారు. అయితే అతడు కిడ్నాప్ అయినట్టుగానీ, వారి మధ్య జరిగిన ఘర్షణ గురించి గానీ తమకు తెలియదని పేర్కొన్నారు. ఈ క్రమంలో మోహిత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, మీడియాతో గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా యోగి ప్రభుత్వం డియోరియా జైలు ప్రధాన అధికారిని ఆదేశించింది. కాగా ఓ కేసులో అరెస్టైన మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ ప్రస్తుతం డియోరియా జైలులో ఉన్నారు. గతంలో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం 70 కేసుల్లో అతీఖ్‌కు, ఆయన అనుచరులకు సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. -
కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిని..
ముంబై: వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్ మాజీ పోటీదారు అర్మాన్ కోహ్లిపై కేసు నమోదైంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, పారిపోయిన అతని కోసం ముంబై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శాంతాక్రజ్ పోలీసుల కథనం ప్రకారం... ప్రాధేయపడ్డా వినిపించుకోకుండా ఉన్మాదిలా..: స్టైలిస్ట్ నీరూ, నటుడు అర్మాన్ కోహ్లిలు గడిచిన మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇద్దరూ తరచూ కీచులాడుకునేవారు. ఇటీవల గోవాలోని ఓ విల్లా విక్రయానికి సంబంధించి గొడవ తారాస్థాయికి చేరింది. ఇదే విషయమై ఆదివారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. ఒకదశలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా అతను వినలేదు. కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. కాగా, కోహ్లి అప్పటికే అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బడా దర్శకుడి సుపుత్రుడు: బాలీవుడ్లో 70,80వ దశకాల్లో ‘నాగిన్’, ‘జానీ దుష్మన్’, ‘రాజ్ తిలక్’, లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన దర్శకుడు రాజ్‌కుమార్ కోహ్లి తనయుడే అర్మాన్ కోహ్లి. కొడుకును హీరోగా నిలబెట్టేందుకు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలం కావడంతో రాజ్‌కుమార్ మిన్నకుండిపోయారు. మొదట్లో హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగిన అర్మాన్.. బిగ్‌బాస్ షోతో ఒక్కసారే బడా సెలబ్రిటీ అయిపోయాడు. బిగ్‌బాస్-7 షో జరుగుతుండగానే కో-పార్టిసిపెంట్ తనీషా ముఖర్జీతో అర్మాన్ రొమాన్స్ చేయడం, మరో నటి సోఫియాతో గొడవపడటం, పోలీసులు ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిమరీ అర్మాన్‌ను అరెస్టు చేయడం అప్పట్లో పెనుదుమారం రేపింది. -
‘ఉనావో’ కేసు: శశి కొడుకు అరెస్ట్
లక్నో: ఉనావో అత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ మంగళవారం మరో వ్యక్తిపై కేసు నమోదు చేసింది. తన ఎఫ్ఐఆర్లో శశి సింగ్ కుమారుడు శుభం సింగ్‌ను నిందితునిగా చేర్చింది. శశి సింగ్ బాధిత యువతిని ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ నివాసానికి తీసుకెళ్లిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె కుమారుడు శుభం సింగ్‌కు ఈ ఘటనతో సంబంధం ఉందని సీబీఐ అభియోగాలు మోపింది. అత్యాచార బాధితురాలిని ఘటనా స్థలానికి చేర్చడంలో శుభం సింగ్ ప్రమేయం కూడా ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. విచారణ నిమిత్తం మంగళవారం శుభం సింగ్‌ను అరెస్టు చేసింది. ‘ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ఇంటికి శశి సింగ్ నా కూతురుని తీసుకెళ్లింది. ఎమ్మెల్యే అఘాయిత్యం చేస్తున్న సమయంలో శశి గేటు కాపలాగా ఉంద’ని అత్యాచార బాధిత యువతి తల్లి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సీబీఐ ఆదివారం శశి సింగ్‌కు 4 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. బాధిత యువతి మైనర్ కాదనే గందరగోళం తలెత్తడంతో మరోసారి ఆమె వయసు నిర్ధారణకు యువతిని శనివారం లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఘటన చోటుచేసుకునే నాటికి ఆమె మైనర్ కాదని తేలితే.. పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కింద ఎమ్మెల్యేపై మోపిన కేసుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. -
గోల్డ్‌కోస్ట్ లో అథ్లెట్‌పై అసభ్యకర ప్రవర్తన
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ క్రీడా గ్రామంలో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేశారని మారిషస్ అథ్లెట్ ఒకరు ఆరోపించారు. మారిషస్ చెఫ్ డి మిషన్ కయాసీ టీరోవెంగడమ్ తనను అసభ్యకర రీతిలో తాకుతూ దాడి చేశారని అథ్లెట్ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల ప్రారంభ కార్యక్రమానికి ముందే ఘటన జరిగినట్లు అథ్లెట్ ఫిర్యాదులో పేర్కొన్నారని, ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని క్వీన్స్లాండ్ డీసీపీ స్టీవ్ గోలెచ్స్కీ పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన గేమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రీమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు 6600 మంది క్రీడాకారులు గోల్డ్‌కోస్ట్‌కు చేరుకున్నారు. వీరంతా క్రీడాగ్రామంలో బస చేస్తున్నారు. వారి రక్షణ పట్ల బాధ్యతగా ఉంటామని, ఇలాంటి దాడులను తాము సహించబోమని’ స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై మారిషస్ టీమ్ స్పందించలేదు. కాగా దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చెఫ్‌ని బాధ్యతల నుంచి తప్పించినట్లు మారిషస్ మీడియా పేర్కొంది. -
బుల్లితెర నటుడి అరెస్టు..!
సాక్షి, బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మోడల్‌ను మోసం చేసిన కేసులో బుల్లితెర నటుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలివి.. బుల్లితెర నటుడు కిరణ్ రాజ్, ముంబైకి చెందిన మోడల్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా రాజరాజేశ్వరి నగర్లో సహ జీవనం చేశారు. పెళ్లి విషయం మాట్లాడినప్పటి నుంచి కిరణ్ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో తను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ముంబై వెళ్లిపోయింది. అయితే మార్చి 24న ముంబైలో ఉన్న తన ప్రేయసిని కిరణ్ రాజ్ ఫోన్ చేసి బెంగళూరు రావాలని కోరాడు. దీంతో బెంగళూరు వచ్చిన ఆమెను ఓ ప్రాంతంలో నిర్భంధించి చిత్ర హింసలకు గురిచేశాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఆమె ముంబై పారిపోయింది. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, సంఘటన జరిగిన ప్రాంతం బెంగళూరు కావడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు. దీంతో బాధితురాలు రాజ రాజేశ్వరి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
బీజేపీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
డెహ్రాడూన్ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒకరిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు అయ్యింది. దళిత మహిళలపై చెయ్యి చేసుకోవటం.. వారిని కులం పేరుతో దూషించిన ఘటనలో ఎమ్మెల్యే రాజ్‌కుమార్ థూక్రాల్ పై అభియోగాలు నమోదయ్యాయి. విషయం ఏంటంటే... స్థానికంగా ఉండే దళిత కుటుంబాలకు చెందిన ఒక యువతి, యువకుడు ప్రేమించుకుని పారిపోయారు. దీంతో ఆ ఇంటి పెద్దలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. అయితే తన నియోజకవర్గం(రుద్రాపూర్) పరిధిలోనే ఈ ఘటన చేసుకోవటంతో సంధి కోసం థూక్రల్ ఆ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించారు. ఈ క్రమంలో వారు ఆయన ముందే వాదులాడుకోగా.. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే మహిళలను దూషిస్తూ చెయ్యి చేసుకున్నారు. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుండటంతో పోలీసులు ఆదివారం రాజ్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నాదేం తప్పు లేదు... ‘ఆ మహిళలిద్దరికీ సర్దిచెప్పేందుకు రెండు గంటలు శ్రమించా. అంతా సరే అనుకుని ఇంటి బయటకు వెళ్లాక వారు గొడవకు దిగారు. ఈ క్రమంలో వారిని నియంత్రించేందుకు ఎంతో ప్రయత్నించా. వీలు కాకపోవటంతోనే దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. వారిని దూషించిన మాట అవాస్తవం’ అని రాజ్‌కుమార్ మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనలో రాజ్‌కుమార్‌ను వివరణ కోరుతు నోటీసులు జారీ చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ తెలిపారు. In a video that has gone viral, #Uttarakhand #BJP MLA from Rudrapur seat, Rajkumar Thukral, can be spotted abusing & beating up Dalit women @IndianExpress pic.twitter.com/COzwiCmNGg — Kavita (@Cavieta) 11 March 2018 -
గుంతకల్లు కమిషనర్ పై దాడి కేసు
-
లైంగిక వేధింపుల కేసులో టీచర్ అరెస్ట్
సేలం: ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు ఇచ్చి ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా వాళపాడి సమీపం వెల్లకుండం ప్రాంతానికి చెందిన ఓ దంపతుల కుమార్తె లిద్దరు తిరుమనూరులోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో ఒకరు ఒకటో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో గురువారం పాఠశాల వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన బాలిక ఏడుస్తూ పాఠశాలలో జరిగిన సంగతిని తల్లికి చెప్పింది. దీంతో బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించి లైంగికంగా చిన్నారికి వేధింపులు ఇచ్చినట్టు తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు వాళప్పాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దీనిగురించి మొదట బాలిక వద్ద విచారణ చేశారు. విచారణలో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వాళప్పాడి సమీపం కోనండవు గ్రామానికి చెందిన ఇ.మణిరాజ్ (27) అనే అతను చిన్నారికి లైంగిక వేధింపులు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అతన్ని అరెస్టు చేశారు. బాలిక చిన్నారికి సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీనిపై చిన్నారి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె వద్ద అసభ్యంగా నడుచుకున్న ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. -
'ఆమెను ఎప్పుడూ చూడలేదు'
ముంబై: మహిళపై దాడి చేశారని తనపై వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తోసిపుచ్చాడు. తనపై ఫిర్యాదు చేసిన హీనా షేక్ అనే మహిళ గురించి తనకు తెలియదని, ఆమెనెప్పుడూ హౌసింగ్ సొసైటీలో చూడలేదని తెలిపాడు. ఫిర్యాదుపై జోహ్రా అగధి నగర్ హౌసింగ్ సొసైటీ సభ్యులెవరూ సంతకాలు చేయలేదని వెల్లడించాడు. తాను ఈజీ టార్గెట్ గా మారినట్టు భావిస్తున్నానని, వాస్తవాలు వెల్లడించేందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. మహిళను దూషించి, చేయి చేసుకున్నానని తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కుట్రపూరితంగా ఇదంతా చేశారని ఆరోపించారు. జోహ్రా అగధి నగర్ హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వివాదం తలెత్తడంతో సిద్దిఖీ తమపై దౌర్జన్యం చేశాడని వెర్సోవా పోలీసుస్టేషన్ లో హీనా షేక్ ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా నవాజుద్దీన్ భార్య ఆలియా రెండు రోజుల తర్వాత అదే పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. తనపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.