Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అరెస్ట్‌ | Food Delivery Boy Arrested By Jubilee Hills Police For Molesting Young Woman, Details Inside - Sakshi
Sakshi News home page

Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అరెస్ట్‌

Published Sat, Mar 30 2024 7:43 AM | Last Updated on Sat, Mar 30 2024 10:20 AM

Food Delivery Boy Arrested For Molesting - Sakshi

హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్‌ (23) ఫుడ్‌ డెలివరీ బాయ్‌. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్‌లో ఓ సెమినార్‌కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్‌ ఆర్డర్‌ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్‌ పే చేయడంతో ఆ నంబర్‌ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. 

కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్‌పై తీసుకుని బంజారాహిల్స్‌లోని ఓయో రూమ్‌కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement