delivery boy
-
ఆలస్యంగా ఫుడ్ డెలివరీ.. ఆపై తీవ్ర దూషణలు!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సేవలపై ఓ మహిళా కస్టమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్ ఫుడ్ ఐటమ్‌ను ఆలస్యంగా అందించడమే కాకుండా దూర్భాషలాడినట్లు ఓ కస్టమర్ తెలిపారు. దీనిపై సంస్థ ప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్‌ను ట్యాగ్ చేశారు. అందుకు సంబంధించి తన ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించారు.మహారాష్ట్రకు చెందిన రాధిక బజాజ్ తన ఎక్స్ ఖాతాలో..‘జొమాటోలో ఫుట్ ఆర్డర్ పెట్టాను. నా తరఫు ఆర్డర్ రిసీవ్ చేసుకునేందుకు మా కంపెనీ ఆఫీస్బాయ్ను ఏర్పాటు చేశాను. ముందుగా నిర్ణయించిన సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేశాడు. ఆలస్యానికి కారణం అడిగిన మా ఆఫీస్ బాయ్‌ను తీవ్రంగా దూషించాడు. జొమాటో డెలివరీ బాయ్‌ల ప్రవర్తనను మెరుగుపరచడంపై కంపెనీ ప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టరు. ఇలా దుర్భాషలాడే హక్కు ఎవరికీ లేదు. డెలివరీ బాయ్‌కి అయినా.. లేదా కంపెనీ సీఈఓ అయినా గౌరవ మర్యాదలు ఒక్కటే విధంగా ఉంటాయి’ అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ వ్యవహారంపై జొమాటో సంస్థ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ‘ఇది ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. వెంటనే సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము త్వరలో మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాం’ అని స్పందించారు. -
సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..
చిరుద్యోగుల పట్ల సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బంది నిత్యం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా జొమాటో సీఈవో ఎదుర్కోవాల్సి ఉంది.విషయం ఏంటంటే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అప్పుడప్పుడూ డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు. అందులో భాగంగానే తన సతీమణి గ్రీసియా మునోజ్‌తో కలిసి తాజాగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా రెస్టారెంట్స్, మాల్స్ తిరిగారు.ఇలాగే ఆర్డర్ పికప్ చేసుకునేందుకు గురుగ్రామ్‌లోని ఓ మాల్‌కు వెళ్లగా డెలివరీ బాయ్ దుస్తుల్లో ఉన్న వారిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించేందుకు అనుమతి లేదని, మెట్లు ఎక్కి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక మూడో అంతస్తులోని రెస్టారెంట్‌కు మెట్లు ఎక్కి వెళ్లి ఆర్డర్ పికప్ చేసుకున్నారు.తమకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి దీపిందర్ గోయల్ ‘ఎక్స్’లో ప్టోస్ట్ చేశారు. వీడియోలను షేర్ చేశారు. డెలివరీ భాగస్వాములందరికీ పని పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ వారు కూడా డెలివరీ సిబ్బంది పట్ల మానవత్వం చూపించాలని కోరారు. గోయల్ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, మాల్స్ మాత్రమే కాదు.. చాలా సొసైటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని చాలా మంది వినియోగదారులు వాపోతూ కామెంట్లు పెట్టారు.During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners. What do you think? pic.twitter.com/vgccgyH8oE— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024 -
డెలివరీ ఏజెంట్లుగా దీపిందర్ గోయల్ దంపతులు
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఫుడ్ డెలివరీ ఏజెంట్ అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెలివరీ ఏజెంట్ యూనిఫామ్ వేసుకుని గురుగ్రామ్‌లో కస్టమర్లకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేశారు.దీపిందర్ గోయల్ ఆయన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి బైకుపై డెలివరీ ఏజెంట్లుగా వెళ్లడం ఇక్కడ చూడవచ్చు. అలా.. మోడ్ బై ఆకాంక్ష ఆఫీసులో గోయల్ ఫుడ్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అక్కడ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సరిగ్గా ఎలా చేయాలో బాస్ నుంచి నేర్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు.డెలివరీ ఏజెంట్‌గా తన రోజు గురించి గోయల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం గ్రేసియా మునోజ్‌తో ఆర్డర్లను డెలివరీ చేయడానికి బయలుదేరాను అని గోయల్ పేర్కొన్నారు. ఇందులో గోయల్ డెలివరీ బ్యాగ్ భుజాన వేసుకుని, తన భార్యతో కలిసి లొకేషన్ చూసుకుంటూ వెళ్లడం చూడవచ్చు.ఇదీ చదవండి: రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలుదీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ చేసిన తన అనుభవాలను పంచుకుంటూ.. మా కస్టమర్లకు ఆహారం అందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ రైడ్‌ను తాను ఎంతగానో ఆస్వాదించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Deepinder Goyal (@deepigoyal) -
ఐ ఫోన్ కోసం హత్య.. డబ్బులిస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లి..
డెలివరీ ఏజెంట్ల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సరుకులు సరఫరా చేసే డెలివరీ ఏజెంట్ల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలకు గిరాకీ పెరిగింది. దీంతో వేలాది మందికి ఇది ఉపాధి మార్గంగా మారింది. ఆన్లైన్లో బుక్ చేసిన వాటిని వినియోగదారులకు సరైన సమయంలో చేరవేయడం డెలివరీ ఏజెంట్ల పని. అయితే చెప్పినంత ఈజీ కాదు ఈ జాబ్ చేయడం.సవాళ్లు ఎన్నో..విధి నిర్వహణలో డెలివరీ ఏజెంట్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమయానికి సరుకులు చేరవేయడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నగరాల్లో అయితే తీవ్రమైన ట్రాఫిక్‌ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకోసారి అడ్రస్ వెతుకులాటలోనే సమయం గడిచిపోతుంటుంది. లేటుగా వెళితే కస్టమర్లు నెగెటివ్ రేటింగ్ ఇస్తారనే భయంతో వేగంగా వెళుతూ ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. వీటితో పాటు దాడులు కూడా పెరిగాయి.ఐ ఫోన్ కోసం హత్యతాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఐ ఫోన్ కోసం ఓ డెలివరీ ఏజెంట్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్‌హాట్‌కు చెందిన గజేంద్ర ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ సేల్‌లో లక్షన్నర రూపాయల ఐ ఫోన్ ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. సెప్టెంబర్ 23న ఆర్డర్ ఇవ్వడానికి డెలివరీ ఏజెంట్ భరత్ సాహు వచ్చాడు.ఫోన్ తీసుకున్న గజేంద్ర, డబ్బులిస్తానంటూ అతడిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఫ్రెండ్‌తో కలిసి సాహును చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని కాల్వలో పడేశారు. సాహు కనిపించకపోవడంతో అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాస్ట్ డెలివరీ గజేంద్రకు చేశాడని విచారణలో తేలింది. దీంతో ఫోన్ నంబర్ ఆధారంగా అతడి ఫ్రెండ్ ఆకాశ్‌ను పట్టుకున్నారు. అతన్ని విచారించగా ఈ దారుణం బయటపడింది.గతంలోనూ దాడులుకాగా, డెలివరీ ఏజెంట్లపై దాడులు గతంలోనూ పలుచోట్ల చోటుచేసుకున్నాయి. 2021లో బెంగళూరులో దోపిడీ యత్నంలో ఫుడ్‌డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. డబ్బుల విషయంలో కస్టమర్‌తో గొడవ జరగడంతో డెలివరీ ఏజెంట్ ఒకరు కత్తిపోట్లకు గురయిన ఘటన 2022లో నోయిడాలో కలకలం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా యూపీ ఘటన నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని చేయి చేసుకుంటే..
చెన్నై: ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడం..ఓ విద్యార్థి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చెన్నైకి చెందిన పవిత్రన్(19) బీకాం చదువుకుంటూ తీరిక వేళల్లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన కొరట్టూర్ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్డర్‌ను అందజేయడానికి పవిత్రన్ బయలుదేరాడు. లొకేషన్ గుర్తించి, చేరుకోవడంలో ఆలస్యమైంది. ఈ విషయంలో మహిళా కస్టమర్‌తో పవిత్రన్‌కు వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆమె అతనిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత పవిత్రన్ రాయి విసరడంతోనే తన ఇంటికి కిటికీ అద్దం పగిలిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పవిత్రన్ తన ఇంట్లో ఉరి వేసుకుని, తనువు చాలించాడు. ఫుడ్ డెలివరీ ఆలస్యమైనందుకు మహిళా కస్టమర్ తనను కొట్టడంతో తీవ్ర మనస్తాపంతో ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్..నేడు మోడల్‌గా..!
ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ స్థాయి నుంచి మోడల్‌గా ఎదిగి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన కలను సాకారంచేసుకునేందుకు అతను పడిన కష్టాలు, అవమానాలు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అతనెవరు? ఎలా తన కలను సాకారం చేసుకున్నాడంటే..ముంబైకి చెందిన సాహిల్ సింగ్ మోడల్‌గా తన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను రెండేళ్లు స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బర్గర్ కింగ్‌లో ఒక ఏడాది చెఫ్ పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మోడలింగ్ ప్రదర్శనకు ముందు ఎనిమిది నెలలు పాటు మ్యాంగో మార్ట్‌లో పనిచేసినట్లు వివరించాడు. అంతేగాదు పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత నుంచే పలు రకాల ఉద్యోగాలు చేసినట్లు తెలిపాడు. అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా నెలకు రూ. 18,000 నుంచి రూ. 22,000 సంపాదించినట్లు తెలిపాడు. 2009లో ఓ మోడల్ పోస్టర్ చూసిన తర్వాత తాను ఏం చేయాలనేది తెలిసిందన్నాడు. ఆ తర్వాత మోడల్ అయ్యేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై దృష్టిసారించినట్లు తెలిపాడు. అందుకోసం రోడ్డుపక్కనే వాలెట్లు వంటివి అమ్మేవాడినని కూడా చెప్పుకొచ్చాడు. అంతేగాదు దాదాపు 200 ఆడిషన్స్ చేసినట్లు తెలిపాడు. అలా ఈ ఏడాది చివరికి ర్యాంప్‌పై నడిచే అవకాశాన్ని దక్కించుకోగలిగాని ఆనందంగా చెప్పాడు. తనను మోడల్‌గా స్ట్రీక్స్ అనే ఫ్యాషన్ సంస్థ ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తనలోని లోపాలను గురించి కూడా నిజాయితీగా వివరించాడు. తన ఎత్తు కేవలం 5 అడుగుల 10 అంగుళాలని, ఇది బెస్ట్ మోడల్‌గా ఎంపికయ్యేందుకు కావాల్సిన అర్హత కాదని చెప్పాడు. తాను ర్యాంప్‌పై నడిచేలా అనుమతించమని పదేపదే అభ్యర్థించాల్సి వచ్చేదని అన్నారు. అయితే స్ట్రీక్స్ తనను హీల్స్ ధరించాలనే షరతుపై వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాదు మోడల్ అయ్యేందుకు ఎలాంటి టెక్నీక్స్ ఫాలో అవ్వాలో సూచించాడు. అంతేగాదు ఈ ఫీల్డ్‌లోకి కొత్తగా వెళ్తున్నవారికి మార్గదర్శకత్వం వహించేలా ఇన్‌స్టాగ్రాంలో కొత్త సిరిస్ ప్రారంభించాడు. అలాగే మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఫోటోగ్రాఫర్లు, స్టైలిస్ట్‌లు, డిజైనర్లు, మంచి స్టూడియో వ్యక్తులు వంటి నెట్వర్క్ ఉండాలి. అప్పుడే ఈజీగా మోడల్ అవ్వగలరని చెబుతున్నాడు. ఈ నెట్వర్క్ కోసం సోషల్ మీడియా వంటి సాయంతో అలాంటి వ్యక్తులకు టచ్‌లో ఉండేలా నేరుగా మెసేజ్‌లు పెట్టడం, ఇమెయిల్స్ పంపడం వంటివి చేయాలని సూచించాడు. నిజంగా ఇతడి కథ ఎందరికో స్పూర్తి కదూ..!. View this post on Instagram A post shared by Sahil Singh | fashion & grooming tips | (@fashiontipssahil) (చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
డెలివరీ ఏజెంట్‌కు సర్ప్రైజ్
బంధువులతో కలిసి పార్టీ.. ఆత్మ బంధువుల బర్త్‌డే.. వేడుక ఏదైనా మనకు టైమ్‌కు ఫుడ్ డెలివరీ చేసి మన సంతోషంలో భాగస్వాములవుతారు డెలివరీ ఏజెంట్. వాళ్ల కష్టాన్ని చాలాసార్లు గుర్తించం. కానీ.. తమకోసం ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసి అతని సంతోషాన్ని రెట్టింపు చేశారు కొందరు యువకులు. వారం కిందట అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరానికి చెందిన యశ్ షా జొమాటోలో ఫుడ్ ఆర్డర్చేశాడు. ఆర్డర్ డీటెయిల్స్ చూస్తుండగా.. భారీ వర్షం వల్ల డెలివరీ లేట్ అవుతుందని ఉంది. దాంతో పాటు.. డెలివరీ బాయ్ అయిన షేక్ ఆకిబ్ బర్త్‌డే అని కూడా కనిపించింది. డెలివరీ ఏజెంట్ తన బర్త్‌డే రోజు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నాడని గ్రహించి, ఏజెంట్‌ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ఆర్డర్‌తో వచ్చిన అతడికి ఫ్రెండ్స్‌తో కలిసి ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ విష్ చేశారు. అంతేకాదు చిన్న కానుకను కూడా అందజేశారు. ఊహించని ఈ వేడుకకు డెలివరీ ఏజెంట్ చలించిపోయాడు. చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దృశ్యం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యశ్.. ‘మీకు చేతనైనంత వరకు ఆనందాన్ని పంచండి. మాకు అవకాశం ఇచ్చినందుకు జొమాటోకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూస్, లెక్కలేనన్ని లైక్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, డెలివరీ ఏజెంట్ షేక్ ఆకిబ్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. – అహ్మదాబాద్ -
గ్యాస్ దొంగ ను ఎప్పుడైనా చూసారా..!
-
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన డెలివరీ బోయ్, వైరల్ వీడియో
అసలే వర్షాకాలం.. ఆపైన నక నకలాడే ఆకలి. ఉందిగా ఆన్లైన్ ఫుడ్ అంటూ ఆర్డర్ చేసుకొని తినేయడం చాలామందికి అలవాటు. అలాగే నోయిడాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా ఫుడ్స్ నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కానీ అతని ఆకలి తీరలేదు సరికదా కడుపు రగిలిపోయే చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టిజనుల ఆగ్రహానికి గురవుతోంది. విషయం ఏమిటంటే... వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. డెలివరీ ఏజెంట్ ఫోన్ చేసి అదనంగా పది రూపాయిలివ్వాలని డిమాండ్ చేశాడు.దీనికి తొలుత నిరాకరించిన జైస్వాల్ ఆ తరువాత సరే అన్నాడు. ఆసగా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా 45 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదుగానీ తన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేస్తున్న దృశ్యాన్ని షాక్ అయ్యాడు. అంతేకాదు హాన్ తో కర్తే రహో జో కర్నా హై" (ఏం చేసుకుంటావో చేస్కో) అన్న అతగాడి సమాధానం విని మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన ఫుడ్ ఎందుకు తిన్నారని ప్రశ్నించగా మరి ఏం చేయాలి అంటూ ఉదాసీనంగా సమాధానం చెప్పాడు. మోటార్‌సైకిల్‌పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్‌ను భోంజేస్తున్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆ వీడియోను జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Aman Birendra Jaiswal (@amanbjaiswal)దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్ ప్లేస్ అవుతుంది. డెలివరీ బోయ్ జాడ ఉండదు. కాల్కి సమాధానం ఉండదు. ఓలా ఫుడ్స్‌కి ఫిర్యాదు లేదా పరిష్కార వ్యవస్థ లేదని తరువాత తెలిసిందే. చివరికి ఫుడ్ కేన్సిల్ అయింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఒక యూజర్. ఈ ప్లాట్‌పాంలో సీవోడీ(క్యాష్ అన్ డెలివరీ) అప్షన్లేదని మరొకరు ఆరోపించారు. రెండు సార్లు ఓటీపీ షేర్ చేయకుండానే ఫుడ్ డెలివరీ అయిందని వచ్చింది. రెండు సార్లు ఇలా జరిగిందని, ఓలాలోనే ఇలా జరగుతుందని ఒకరు, ఓలాలో మాత్రమే కాదు, స్విగ్గీలో కూడా ఇంతే అని మరొక వినియోగదారు తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఈ ఉదంతంపై ఓలా ఫుడ్ ఇంకా స్పందించలేదు. -
జొమాటో డెలివరీ బోయ్ హోం టూర్ వీడియో వైరల్
దేశ వాణిజ్య రాజధాని ముంబై మురికివాడలో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో గతంలో చాలా సినిమాల్లో చూశాం. తాజాగా జొమాటో డెలివరీ ఏజెంట్ షేర్ చేసిన అతని హోం టూర్ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. ప్రంజయ్ బోర్గోయరీ ఇన్‌స్టాలో రూ. 500 అద్దెతో జీవిస్తున్న తన గదికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇప్పటికే 50 లక్షలకు పైగా మిలియన్స్‌తో ఇది వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by qb_07 (@qb__.07) ఈశాన్య భారతదేశానికి చెందిన ప్రంజయ్ బోర్గోయరీ అనే యువకుడు ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చాడు. మహానగరాల్లో ఉద్యోగంలో వెతుక్కునే సమయంలో అందరికీ కనిపించే తొలి ఆప్షన్. డెలివరీ బాయ్ లేదా, క్యాబ్, బైక్ రైడింగ్. ఇతను కూడా జొమాటో డెలివరీ బాయ్ పనే ఎంచుకున్నాడు. సోనూ అనే స్నేహితుడితో కలిసి ఇరుకు గదిలో ఉంటున్నాడు.ఈ క్రమంలో తన కఠినమైన జీవన పరిస్థితులను గురించి ‘స్ట్రగులింగ్ ఆర్టిస్ట్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ చేశాడు. తన కుటుంబ నేపథ్యం, నిరుపేదలైన తల్లిదండ్రులను కష్టాలను ఈ వీడియోలో పంచుకున్నాడు. ఇప్పటికే తన కోసం వారు చాలా ఖర్చుచేశారని, ముఖ్యంగా తాను అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్లు ఎంతో ఇబ్బంది పడి వైద్యం చేయించారని గుర్తు చేసుకున్నాడు. అందుకే ఇకపై వాళ్లపై ఆధారపడి జీవించడం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. అలాగే టాయిలెట్ రూం కష్టాలను కూడా కళ్ళకు కట్టినట్టు మరో వీడియోలో చూపించాడు. అన్నట్టు వీళ్లకి ఒక పిల్లి పిల్ల కూడా ఉంది. సింగర్‌గా ఫుట్ బాయల్ ప్లేయర్‌గా రాణించాలనే ఇతని డ్రీమ్.త్వరలోనే ఈ పరిస్థితులనుంచి బయటపడేలా కృషి చేస్తా అన్నాడు. ముంబై మురికివాడల్లో జీవితం ఎంత దుర్బరంగా ఉంటుందో తెలిసింది అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. బోర్గోయరీకి ఆన్లైన్లో భారీ మద్దతు లభిస్తోంది. అతడి వీడియో చూసిన స్పందించిన ఖుషీ యూజర్ మూడు నెలల అద్దె చెల్లించాడు. మంచి రోజులు వస్తాయంటూ శుభాకాంక్షలందించారు మరికొంతమంది. ఇతనికి ప్రస్తుతం ఇన్‌స్టాలో 1.45 లక్షల మంది ఫాలోయర్లు ఉండటం విశేషం. -
డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్నర్స్ సేద తీరేందుకు ఫుడ్ డెలివరీ, ఈ–కామర్స్ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్నర్స్ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. 250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్నర్స్కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్ వంటి 5 లక్షల ప్యాక్‌లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్ వేదికగా విన్నవించింది. బీమా కవరేజ్ సైతం.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 900లకుపైగా రీచార్జ్ జోన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ తన యాప్‌లో ఎస్‌వోఎస్ సపోర్ట్ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్నర్స్ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్ కూలర్స్‌ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్ పేషెంట్ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్ ఆఫర్ చేస్తోంది. గ్లూకోస్ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫెసిలిటీస్ వద్ద ఫ్యాన్స్, కూలర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది. -
స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్ టాపిక్‌గా మారిందో తెలుసుకుందాం.తాజాగా ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు. దీంతో ఆ డెలివరీ బాయ్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂pic.twitter.com/8MM6RfDZ2V— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024 -
దొంగతనం చేసిన డెలివరీ బాయ్‌కు సపోర్ట్.. సోనూసూద్‌పై ట్రోలింగ్
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి.. సదరు ఇంటి ముందు షూ దొంగిలించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 9న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూసూద్ పాజిటివ్‌గా స్పందించాడు. 'మీకు ఫుడ్ తీసుకొచ్చే క్రమంలో డెలివరీ బాయ్ షూలు ఎత్తుకెళ్లిపోతే తిట్టుకోకండి.. దయచేసి తనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వీలైతే అతడికి కొత్త షూలు కొనివ్వండి. బహుశా అతడికి అవి ఎంతో అవసరమయి ఉండొచ్చు. దయతో ప్రవర్తించండి' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్‌ను విమర్శిస్తున్నారు. 'దొంగతనం చేస్తే ఏమీ అనకూడదా? పేదరికం, అవసరం ఉన్నంతమాత్రాన దొంగిలిస్తే తప్పు ఒప్పయిపోతుందా? ఈ డెలివరీ బాయ్ కంటే పేదవాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ తమ కష్టార్జితంతో బతుకుతున్నారే తప్ప ఇలా పక్కవాళ్ల వస్తువులు దొంగలించిట్లేదు' అని ఓ వ్యక్తి నటుడిపై విరుచుకుపడ్డాడు. 'ఎవరైనా బంగారు గొలుసు దొంగిలించినా ఏం పర్లేదని వదిలేయాలా? అతడికి కారు అవసరమనుకోండి.. ఎవరిదో ఒకరిది ఎత్తుకుపోతే సరిపోతుందా? పేదరికంలో ఉన్నంతమాత్రాన దొంగతనం తప్పు కాకుండా పోతుందా?' అని ట్రోల్ చేస్తున్నారు. If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏 — sonu sood (@SonuSood) April 12, 2024 If an actor tried to be a saviour, don't take him seriously. He might running a different business using his skill. — Bodhan Biswas 🇮🇳 (@bodhan11) April 12, 2024 So if I need anything, am I allowed to steal anything from anyone’s house? This is one of the weirdest posts I have ever read. — Naveen (@_naveenish) April 12, 2024 Swiggy's drop and PICK up service. A delivery boy just took my friend's shoes (@Nike) and they won't even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx — Rohit Arora (@_arorarohit_) April 11, 2024 చదవండి: సల్మాన్ చెల్లితో పెళ్లి.. నా దగ్గర పైసా లేదు! నాన్నే పోషించాలని చెప్పా! -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్‌లో ఓ సెమినార్‌కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్‌పై తీసుకుని బంజారాహిల్స్‌లోని ఓయో రూమ్‌కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
డెలివరీ బాయ్‌గా దిగ్గజ కంపెనీ సీఈఓ!
కరోనా... రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కోట్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. అయినవారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో కుటుంబాలు రూ.కోట్లు కుమ్మరించడం, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కోకొల్లలు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చాలామంది భయంతో వణికిపోతుంటారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంతటి మానసిక క్షోభ అనుభవించాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి డెలివరీ బాయ్‌గా పనిచేసినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖస్రోషాహి ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయేది. అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకున్నాను. వెంటనే ఈబైక్ సాయంతో ఉబర్ ఈట్స్ లో డెలివరీగా బాయ్‌గా చేరాను. ఫుడ్ డెలివరీ చేయడం, కస్టమర్లను రేటింగ్స్ అడిగినట్లు చెప్పారు. మాస్క్ పెట్టుకుని విధులు నిర్వహించడంతో తాను డెలివరీ డెలివరీ బాయ్‌గా పనిచేయడం మరింత సులభమైందని అన్నారు. View this post on Instagram A post shared by CNBC-TV18 (@cnbctv18india) కోవిడ్ ముగిసిన తర్వాత టెస్లా కారు ఉబెర్ డ్రైవర్ గా పనిచేశారంటూ నందన్ నిలేకనితో తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా, ఉబర సీఈఓ భారత్ లో తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. -
కుటుంబం దివాళా.. ఓ కుర్రాడి అష్టకష్టాలు! ప్రముఖ సీఈవో ‘ఫిలాసఫీ’ కథ
అప్పటివరకూ విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాళా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్‌గా, డీటీపీ ఆపరేటర్‌గా ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. ఏదో సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఇది రియల్ స్టోరీనే.. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ (CRED) సీఈవో ‘ఫిలాసఫీ’ కథ ఇది.. క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా (Kunal Shah) తన కుటుంబం దివాళా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయవలసి వచ్చింది. తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో ఇటీవల కలుసుకున్నప్పుడు కునాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిఖ్‌చందానీ తెలుసుకున్నారు. ఆసక్తికర ‘ఫిలాసఫీ’! సంజీవ్ బిఖ్‌చందానీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఇలా షేర్ చేశారు.. “ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో కునాల్ షాతో కలిసి కూర్చున్నాను. ఐఐటీ, ఐఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్. అతను ఫిలాసఫీనే ఎందుకు చదివాడు.. 12వ తరగతిలో వచ్చిన మార్కులు అతనికి ఆ సబ్జెక్ట్‌లో మాత్రమే అడ్మిషన్ ఇచ్చాయా లేదా ఫిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందా అని అడిగాను. కానీ ఇవేం కాదని, కుటుంబం దివాళా తీయడంతో డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు. సెల్యూట్.” Sitting with Kunal Shah at a coffee shop in Delhi. In a world of IIT IIM Founders he stands out as a philosophy graduate from Wilson College in Mumbai. I asked him why he studied philosophy - is it that his marks in Class 12 only gave him admission in that subject or was it out… — Sanjeev Bikhchandani (@sbikh) February 2, 2024 తన కుటుంబం క్లిష్ట ఆర్థిక పరిస్థితి గురించి కునాల్ షా ఇదివరకే తెలియజేశారు. కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం, సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. 16 సంవత్సరాల వయసు నుంచే తాను చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టానని, సీడీలను పైరసీ చేయడం, సైబర్ కేఫ్ నడపడం వంటి పనులు సైతం చేసినట్లు కునాల్ షా వెల్లడించారు. తన కంపెనీ ఫిన్‌టెక్ లాభదాయకంగా మారే వరకు తాను నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటానని కూడా చెప్పారు. -
గుడుగుడుమనీ గుర్రమెక్కి నేనొత్త పా నేనొత్త పా
ఫుడ్ డెలివరీ బాయ్ అనగానే బైక్ మీద సర్రున దూసుకుపోయే కుర్రాళ్ల దృశ్యమే కళ్లముందు ఉంటుంది. గుర్రం మీద వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే దృశ్యం ఊహకు కూడా అందదు. ట్రక్కు డైవర్ల సమ్మె, పెట్రోల్ బంక్‌ల ముందు ‘నో స్టాక్’లు కనిపిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో హైదరాబాద్‌లో జొమాటో బాయ్ ఒకరు హార్స్ రైడింగ్ చేస్తూ ఫుడ్ డెలివరీ చేశాడు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘దిస్ ఈజ్ అన్బిలీవబుల్... ఇట్స్ జస్ట్ సూపర్బ్’ ‘అలనాటి రవాణా వ్యవ్యస్థను గుర్తుతెస్తోంది. కాలుష్య నివారణకు ఇది తిరుగులేని మార్గం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
పెట్రోల్ తిప్పలు..గుర్రం మీద ఫుడ్ డెలివరీ
-
అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి
హైదరాబాద్:నగరంలో మంగళవారం పెట్రోలు కొరత కారణంగా...ఓ జొమాటో డెలివరీ బాయ్ ఏకంగా గుర్రాన్ని అద్దెకు తీసుకుని ఫుడ్ డెలివరీ చేశాడు. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రోజుమాదిరిగానే జొమాటోలో ఆర్డర్లు స్వీకరించగా..బైకులో పెట్రోల్ అయిపోయింది. బంకులు మూతపడడంతో సమీపంలోని ఓ వ్యక్తి వద్ద రూ.500 అద్దెకు ఓ అశ్వాన్ని తీసుకుని ఆర్డర్లు డెలివరీ చేశాడు. సైదాబాద్‌లోని ఇంపీరియల్ హోటల్లో పార్శిల్ తీసుకుని చంచల్‌గూడలో కస్టమర్‌కు అందించేందుకు వెళ్తుండగా ‘సాక్షి’ ప్రతినిధి పలకరించగా..పై విషయాలు వెల్లడించాడు. #Zomato Agent Delivers Food On Horse after the pumps ran out of petrol#TruckDriversProtest #HitandRunLaw #petrolpump pic.twitter.com/wqbfbAqaUo — rajni singh (@imrajni_singh) January 3, 2024 -
Zomato Jobs: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో ఉద్యోగాల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులను తమ కంపెనీలో ఇకపై ఉద్యోగాలు ఇవ్వబోమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. సంస్థ ఉద్యోగ నియామకం భిన్నమైందని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వమని, ఎలాంటి పనిగురించి వెతకకుండా, నమ్మకంగా పని చేసే స్వభావం ఉన్న వారికే తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జొమాటో ప్రారంభించి 15 ఏళ్లు అయిందన్నారు. సంస్థలో గత 5-6 ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీ అవసరాలకు సరిపడా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొత్తవారిని నియమించుకోవాలంటే మాత్రం వారి నైపుణ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘కొత్తవారిని నియమించాలంటే ఇంటర్వ్యూకు మూడు నెలలు సమయం అయిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పాసైతే పాత సంస్థలో మరో మూడు నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత సమయం పడుతుంది. అభ్యర్థి పనితనం గురించి తెలియాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మొత్తం దాదాపు 2 ఏళ్లు వృథా అవుతాయి’అని గోయల్ అభిప్రాయపడ్డారు. దానికిబదులుగా సంస్థలోని వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతస్థానంలో నియమిస్తే కంపెనీ విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి పెద్దగా సమస్య ఉండదని చెప్పారు. -
రూ.16 లక్షల బైకుపై ఫుడ్ డెలివరీ - వీడియో వైరల్
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్ఎస్బీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన 'సుజుకి హయబుసా' (Suzuki Hayabusa) బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు. వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బైక్ రైడర్ నిజంగా డెలివరీ బాయ్ అవునా? కాదా? అనేది తెలియదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇలాంటి వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గత వారం ఇండోర్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇందులో రోడ్డుపై జొమాటో బ్రాండింగ్ టీ-షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి యమహా ఆర్15 మోటార్‌సైకిల్ రైడ్ చేసింది. ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.. ఆ సంఘటనకు, జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by HARPREET SINGH (@hsbofficial) -
పిస్టల్‌తో పారిపోయిన రేపిస్టు... ఎట్టకేలకు అదుపులోకి
నోయిడా: ఒక కస్టమర్‌పై ఆమె ఫ్లాట్‌లో అత్యాచారానికి పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్ ఆదివారం ఎట్టకేలకు మళ్లీ చిక్కాడు. నోయిడాకు చెందిన డెలివరీ బాయ్ సుమిత్ శర్మ శుక్రవారం ఒక స్థానిక అపార్ట్మెంట్లో పార్సిల్ డెలివరీ సందర్భంగా ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు శనివారం అతన్ని ఖరీపుర్లో అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే దారిలో అతను పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయాడు. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి అతనికోసం వేట సాగించారు. ఎట్టకేలకు వారి కంటబడ్డ సుమిత్ కాల్పులకు దిగాడు. పోలీసుల కాల్పుల్లో కాలికి తూటా దిగి పట్టుబడ్డాడు. అతనికి, సోదరునికి నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
బెంగుళూరు ట్రాఫిక్ జామ్‌లో టైమ్‌కి పిజ్జా డెలివరీ..
బెంగళూరు: లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి. ఆన్‌టైమ్ డెలివరీ.. ఎలాగూ ట్రాఫిక్ జామ్ అయ్యింది కాబట్టి ఇప్పట్లో గమ్యానికి చేరుకోలేమని భావించి రిషివత్స అనే వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా ప్రామిస్ చేసినట్టుగా ట్రాఫిక్ ఉండగానే అర్ధగంటలో డెలివరీ చేశాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు విశేష స్పందన రాగా కామెంట్లలో నెటిజన్లు డామినోస్పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz — Rishivaths (@rishivaths) September 27, 2023 బారులు తీరిన వాహనాలు.. ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, తర్వా ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. This is every day before a long weekend in Bangalore, it's same 3-8pm today. Karnataka taking highest tax on liquor (83%) if can utilize even 10% of that can make proper roads and infra. #BangaloreTraffic #bangalore #longweekendhttps://t.co/XlOarOY6hj pic.twitter.com/goU6PIR9ae — nsrivastava.eth (@nitinkr1991) September 27, 2023 #bangaloretraffic Yesterday I saw most my friends in bangalore tweet about massive traffic jam. 2 hours for 8-10 kms and even more..when we are gonna diversify companies to other parts of KA? Bangalore has almost choked bec of political greed,ppl are suffering..feels sorry!! pic.twitter.com/caOvvfTRx7 — North karnataka Rises (@NorthKA_Rises) September 28, 2023 ఇది కూడా చదవండి: లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు.. -
డెలివరీ బాయ్‌కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్
జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్‌కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ. 45,000.. వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్‌కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. View this post on Instagram A post shared by Raj Gothankar (@raj_official_2151) -
డెలివరీ బాయ్‌గా మారిన జొమాటో సీఈవో! బైక్‌పై ఫుడ్ డెలివరీ
ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిపోయారు. ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్ లాగా రెడ్ టీ షర్ట్ ధరించి బైక్‌పై ఫుడ్ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్ వేసుకున్న దీపిందర్ గోయల్ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్నర్స్కు, రెస్టారెంట్ పార్ట్నర్స్కు ఫుడ్ పార్సిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అందించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై బయలుదేరారు. ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో 'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్నర్స్కు ఆహారం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్ గోయాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్షిప్ డే చార్జ్లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX — Deepinder Goyal (@deepigoyal) August 6, 2023