ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ స్థాయి నుంచి మోడల్‌గా ఎదిగి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన కలను సాకారంచేసుకునేందుకు అతను పడిన కష్టాలు, అవమానాలు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అతనెవరు? ఎలా తన కలను సాకారం చేసుకున్నాడంటే..
ముంబైకి చెందిన సాహిల్ సింగ్ మోడల్‌గా తన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను రెండేళ్లు స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బర్గర్ కింగ్‌లో ఒక ఏడాది చెఫ్ పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మోడలింగ్ ప్రదర్శనకు ముందు ఎనిమిది నెలలు పాటు మ్యాంగో మార్ట్‌లో పనిచేసినట్లు వివరించాడు. అంతేగాదు పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత నుంచే పలు రకాల ఉద్యోగాలు చేసినట్లు తెలిపాడు. అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా నెలకు రూ. 18,000 నుంచి రూ. 22,000 సంపాదించినట్లు తెలిపాడు.
2009లో ఓ మోడల్ పోస్టర్ చూసిన తర్వాత తాను ఏం చేయాలనేది తెలిసిందన్నాడు. ఆ తర్వాత మోడల్ అయ్యేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై దృష్టిసారించినట్లు తెలిపాడు. అందుకోసం రోడ్డుపక్కనే వాలెట్‌లు వంటివి అమ్మేవాడినని కూడా చెప్పుకొచ్చాడు. అంతేగాదు దాదాపు 200 ఆడిషన్స్ చేసినట్లు తెలిపాడు. అలా ఈ ఏడాది చివరికి ర్యాంప్‌పై నడిచే అవకాశాన్ని దక్కించుకోగలిగాని ఆనందంగా చెప్పాడు.
తనను మోడల్‌గా స్ట్రీక్స్ అనే ఫ్యాషన్ సంస్థ ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తనలోని లోపాలను గురించి కూడా నిజాయితీగా వివరించాడు. తన ఎత్తు కేవలం 5 అడుగుల 10 అంగుళాలని, ఇది బెస్ట్ మోడల్‌గా ఎంపికయ్యేందుకు కావాల్సిన అర్హత కాదని చెప్పాడు. తాను ర్యాంప్‌పై నడిచేలా అనుమతించమని పదేపదే అభ్యర్థించాల్సి వచ్చేదని అన్నారు. అయితే స్ట్రీక్స్ తనను హీల్స్ ధరించాలనే షరతుపై వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాదు మోడల్ అయ్యేందుకు ఎలాంటి టెక్నీక్స్ ఫాలో అవ్వాలో సూచించాడు.
అంతేగాదు ఈ ఫీల్డ్‌లోకి కొత్తగా వెళ్తున్నవారికి మార్గదర్శకత్వం వహించేలా ఇన్‌స్టాగ్రాంలో కొత్త సిరిస్ ప్రారంభించాడు. అలాగే మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఫోటోగ్రాఫర్‌లు, స్టైలిస్ట్‌లు, డిజైనర్లు, మంచి స్టూడియో వ్యక్తులు వంటి నెట్‌వర్క్ ఉండాలి. అప్పుడే ఈజీగా మోడల్ అవ్వగలరని చెబుతున్నాడు. ఈ నెట్‌వర్క్ కోసం సోషల్ మీడియా వంటి సాయంతో అలాంటి వ్యక్తులకు టచ్‌లో ఉండేలా నేరుగా మెసేజ్‌లు పెట్టడం, ఇమెయిల్స్ పంపడం వంటివి చేయాలని సూచించాడు. నిజంగా ఇతడి కథ ఎందరికో స్పూర్తి కదూ..!.
(చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!)
Comments
Please login to add a commentAdd a comment