Model
-
అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటి..?
మోడల్స్, ప్రముఖులు, సెలబ్రిటీలు మంచి తీరైన శరీరాకృతి కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుంటుంటారు. శరీర ఒంపు సొంపులు పొందికగా శిల్పాంలా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలో అత్యంత ప్రసిద్ధిగాంచింది బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ (బీబీఎల్). బొటాకస్, ఫిల్లర్, ఫేస్ లిఫ్ట్‌లు వంటి కాస్మెటిక్ విధానాలు గురించి విన్నాం. కానీ ఇలా తీరైన ఆకృతి కోసం చేసే ఈ బీబీఎల్ సర్జరీ అంటే ఏంటీ..?. నిజంగానే మంచి విల్లు లాంటి ఆకృతిని పొందగలమా అంటే..విదేశాల్లోని మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, హీరోయిన్లు ఎక్కువుగా ఈ బీబీఎల్ కాస్మొటిక్ సర్జరీని చేయించుకుంటుంటారు. ఇది అక్కడ అత్యంత సర్వసాధారణం. అయితే దీనితో అందంగా కనిపించడం ఎలా ఉన్నా..వికటిస్తే మాత్రం ప్రాణాలే కోల్పోతాం. అలానే ఇటీవల 26 ఏళ్ల బ్రిటిష్ మహిళ ఈ ప్రక్రియతో ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో ఈ బీబీఎల్ సౌందర్య ప్రక్రియ గురించి విని టర్కీకి వెళ్లి మరీ చేయించుకుంది. అయితే ఆపరేషన్ చేసిన మూడు రోజుల్లోనే మరణించింది. ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే..లైపోసెక్షన్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఇందులో కొవ్వుని అంటుకట్టుట చేస్తారు. ఇందేంటి అనుకోకండి. యవ్వనంగా, వంపుగా కనిపించేలా ఆయా ప్రాంతాల్లో కొవ్వుని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో శరీరంలోని తొడలు లేదా పార్శ్వాలు వంటి భాగాల్లో అదనపు కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత లైపోసెక్షన్ టెక్నిక్ ఉపయోగించి శుద్ది చేయబడిన కొవ్వుని ఇంజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే..ఈ ఇంజెక్ట్ చేసిన కొవ్వు రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తనాళాలను అడ్డుకుంటే మాత్రం అప్పుడే పరిస్థితి ప్రాణాంతకంగా మారింది. అదీగాక ఈ సర్జరీకి అందరి శరీరాలు ఒకవిధంగా స్పందించవు. ఇక ఆ బ్రిటిష్ మహిళ సర్జరీ చేయించుకున్న తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంత మరణించిందన సమాచారం. నిజానికి ఇలాంటి.. సౌందర్యానికి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీలు చేయిచుకునేటప్పుడు అనుభవజ్ఞుడైన వైద్యుడి పర్యవేక్షణలోనే చేయించుకోవడం అనేది ఎంద ముఖ్యమో, అలానే ఆ తదుపరి కూడా అంతే కేర్‌ఫుల్‌గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ బీబీఎల్ శస్త్ర చికిత్స 1960లలో బ్రెజిలియన్ సర్జన్ ఐవో పిటాంగి పరిచయం చేశారు. అయితే 2010 నుంచి ఈ శస్త్ర చికిత్స అత్యంత ప్రజాదరణ పొందింది.(చదవండి: హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!) -
చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన నటి, మోడల్ కృతిక అవస్థి (ఫొటోలు)
-
మోడల్ని పెళ్లి చేసుకున్న నటుడు జయరామ్ కొడుకు (ఫొటోలు)
-
స్లిమ్‌గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!
చాలామంది వెయిట్ లాస్ జర్నీలో అంత ఈజీగా విజయవంతం కాలేరు. ఎన్నో డైట్లు, వర్కౌట్ల అనంతరం స్లిమ్‌గా మారతారు. అయితే కొందరు మాత్రం ఏదో మాయ చేసినట్లుగా తక్కువ వ్యవధిలోనే స్లిమ్‌గా అయ్యిపోతారు. అంత సింపుల్‌గా ఎలా బరువు తగ్గించుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతుంటే..వాళ్లు మాత్రం తాము ఏం చేయలేదని ఇంట్లో వండిన భోజనమే తిన్నమని సింపుల్‌గా చెబుతారు. అలాంటి కోవకు చెందిందే ఈ పంజాబీ నటి, మోడల్, గాయని అయిన హిమాన్షి ఖురానా. ఆమె వెయిట్‌లాస్ స్టోరీ తెలిస్తే కంగుతింటారు. ఆమె ఏం చేసిందంటే..హిమాన్షి ఖురానా ఒక హెల్త్ ప్రోగ్రామ్‌లో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. మానసిక ఆర్యోగానికి ప్రాధాన్యత ఇస్తేనే సత్ఫలితాలను పొందగలమని నమ్మకంగా చెబుతుంది. అయితే తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి జిమ్‌కి వెళ్లలేదని తెలిపింది. వారానికి రెండు సార్లు మాత్రం పైలేట్స్ వర్కౌట్లు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. సాధారణ ఆహారంతోనే తాను 11 కేజీల వరకు బరువు తగ్గినట్లు వెల్లడించింది. అలాగే ఇష్టమైన ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోనని చెబుతోంది. ఇంట్లో వండేవన్నీ తింటుందట. ముఖ్యంగా పరాఠాలంటే మహా ఇష్టమట. ప్రతిరోజు అవి తినకుండా రోజు ప్రారంభమవ్వదని అంటోంది. అయితే ఇటీవల బరువు తగ్గడం అనేది ఓ ట్రెండ్‌గా మారిందని అందుకోసం అనారోగ్యకరమైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇది అస్సలు సరైనది కాదని అంటోంది. బరువు తగ్గడం కంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండటం ప్రధానం అని నొక్కి చెప్పింది. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తే ఆటోమేటిగ్గా బరువు తగ్గడం జరుగుతుందని అంటోంది. అలాగే ఒత్తిడి, ఆందోళన ఎలా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో కూడా వివరించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు దారితీసేలా ఒత్తిడికి గురవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తే.. మొత్తం ఆరోగ్యం తోపాటు అధిక బరువు సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని చాలా సింపుల్‌గా చెప్పేసింది నటి, మోడల్ హిమాన్షి ఖురానా. View this post on Instagram A post shared by 𝓗𝓲𝓶𝓪𝓷𝓼𝓱𝓲 𝓴𝓱𝓾𝓻𝓪𝓷𝓪 (@himanshian_) (చదవండి: నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!) -
బికినీలో మోడల్ ర్యాంప్ వాక్.. మండిపడుతున్న నెటిజన్లు
పాకిస్తానీ మోడల్ రోమా మైఖేల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 అందాల పోటీలో భాగంగా బికినీలో ర్యాంప్ వాక్ చేయడంతో ఆమెకు ఈ పరిస్థితి తలెత్తింది. అంతేగాదు ఆమె బికినీలో ర్యాంప్ వాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఆమె ఆ వీడియోని తన ఖాతా నుంచి తొలగించక తప్పలేదు. ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో రోమా పాకిస్తాన్‌కి ప్రాతినిధ్యం వహించడంతోనే ఇంతలా వ్యతిరేకత ఎదురయ్యింది. పాకిస్తాన్లో మహిళలు ధరించే దుస్తుల విషయమై కొన్ని కఠిన నియమాలు ఉంటాయి. అందులోనూ రోమా బికినీ ధరించి ర్యాంప్‌వాక్ చేయడమే గాక తాను పాకిస్తానీని ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఊపందుకున్నాయి.రోమా మైఖేల్ ఎవరు?లాహోర్‌కు చెందిన రోమా మైఖేల్ దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఒక ప్రొఫెషనల్ మోడల్‌గా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్లు, ప్రసిద్ధ బ్రాండ్లతో కూడా పనిచేస్తుందామె. అంతేగాదు రోమా కేన్స్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ షోతో సహా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఇన్‌స్టాలో రోమాకు ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో దాదాపు 69 మంది అందాల భామలు పాల్గొన్నారు. అక్టోబర్ 25న ఫైనల్ ఈవెంట్ జరుగనుంది. అప్పుడే టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారు. అందులో భాగంగా వారందరికీ వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పాకిస్తానీ మోడల్ రోమా (Roma Michael) బికినీలో ర్యాంప్ వాక్ చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమె వస్త్రాధారణను తప్పపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించారు. కానీ అప్పటికే ఈ వీడియో పలు ఖాతాల్లో షేర్ కావడంతో ఆ పోస్టును తొలగించినా ఆమెపై కామెంట్ల వెల్లువ ఆగడం లేదు. View this post on Instagram A post shared by Roma Michael Official (@romamichael78) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
గ్రామాలకు సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/మధిర: గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. పర్యావరణ హితమైన సౌర విద్యుత్‌ను అందరూ వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు గ్రామాలను పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గృహాలు ఎన్ని, జనాభా ఎంత, గృహ, వ్యవసాయ కనెక్షన్లు ఎన్ని, సోలార్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూఫ్‌టాప్‌లు అనుకూలంగా ఉన్నాయా.. తదితర అంశాలపై విద్యుత్ శాఖ ద్వారా సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. టెండర్లు పిలిచిన అనంతరం టీజీ రెడ్కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. మోడల్ సోలార్ విలేజ్..గత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రం మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని తీసుకుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతీ ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా అన్నింటికీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెలగనూరు, ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మండలం సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఈ మూడు గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారుల సర్వే పూర్తయింది.అంతా సోలార్మయంపైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు గ్రామాల్లో గృహ, వ్యవసాయ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ అందించనున్నారు. ఉదయం సమయంలో సౌర విద్యుత్, రాత్రి సమయాన సాధారణ విద్యుత్‌ను వినియోగిస్తారు. గృహాలపై సోలార్ రూఫ్ టాప్‌లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో వీటి ఏర్పాటులో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంతేకాక మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు యజమానులే విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక్కో ఇంటిపై 2 నుంచి 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు.. వ్యవసాయ పంపుసెట్లకు 5 హెచ్‌పీ మోటారుకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానల్‌ను అమరుస్తారు. బహుళ ప్రయోజనాలు..సోలార్ విద్యుత్ వినియోగంతో బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి వీలవుతుంది. మిగులు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా స్థానికులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు తదితర శిలాజ ఇంధనాల వినియోగం ద్వారా పర్యావరణానికి హాని కలగడమే కాకుండా.. ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఇలాంటి దుష్పరిణామాలను నివారించడానికి సౌరవిద్యుత్ దోహదం చేస్తుంది. సిరిపురంలో సర్వే పూర్తిమధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంలో ఈనెల 4న సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలు నిమిత్తం విద్యుత్‌శాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అంతేకాక గ్రామస్తులు, రైతులకు పైలట్ ప్రాజెక్టు గురించి వివరించారు. సర్వే అనంతరం సిరిపురం వచ్చిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోలార్ విద్యుత్‌పై అవగాహన కల్పించారు. ఈ గ్రామంలో మొత్తం 5,428 మంది జనాభా ఉండగా, 1,024 గృహ సర్వీసులు, 510 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. గృహ విద్యుత్‌ను 1,007 మంది 200 యూనిట్లలోపు వినియోగిస్తున్నారు.సోలార్ విద్యుత్.. రైతులకు ఉపయోగంమా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటుతో వ్యవసాయ పంపు సెట్లు ఉన్న రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అవగాహన కల్పించారు. అధికారులు కూడా బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. మిగులు విద్యుత్‌కు డబ్బు చెల్లిస్తారని తెలిసింది. విద్యుత్ ఉన్నా, లేకున్నా సోలార్ విద్యుత్ పంపుసెట్లతోపంట సాగుకు ఇబ్బంది ఉండదు. – వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, రైతు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లాబిల్లుల భారం తగ్గి, ఆదాయం వస్తుంది..ప్రభుత్వం 200 యూనిట్లలోపు గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువైనా బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు సోలార్ విద్యుత్ వల్ల బాధలు తప్పుతాయి. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. సోలార్ విద్యుత్‌తో బిల్లుల భారం తగ్గి, ఆదాయం కూడా వస్తుంది. – చీదిరాల వెంకటేశ్వరరావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లారుణపడి ఉంటాం..మా గ్రామంలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉంటాయి. సోలార్ విద్యుత్‌ను గృహ, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకో వడం వల్ల ఆర్థికంగా కలిసొస్తుంది. మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకునే అవకాశం ఉండటం సంతోషంగా ఉంది. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రుణపడి ఉంటాం. ఇప్పటికే రోడ్లు, వైరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. – నండ్రు విజయారావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మంజిల్లా -
మరోసారి హాట్‌టాపిక్‌గా మార్లిన్ మన్రో జీవితం..!
పదహారు సంవత్సరాల వయసులో ఫ్యాక్టరీ కార్మికుడైన జేమ్స్ డొమెర్టీని పెళ్లి చేసుకుంది మార్లిన్ మన్రో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భర్త సీరియస్‌గా ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.సినిమాల్లోకి అడుగు పెట్టాక, కెరీర్లో పైకి వెళుతున్న కొద్దీ మన్రో వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న మన్రో బేస్ బాల్ స్టార్ జో డిమాజియోతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవ లేదు. కెరీర్‌పై దృష్టి పెట్టిన మన్రో వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోలేదు. మత్తు పదార్థాలకు దగ్గర అయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వ్యసనం మరింత తీవ్రమైంది. ఆ తీవ్ర వ్యసనమే ఆమె పాలిట మృత్యువుగా మారింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మార్లిన్ మన్రో బర్త్ డే సాంగ్ పాడింది. వీరిద్దరు కలిసి ఉన్న ‘ఫోటో’ ఆధారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన్రోకెనడీల గురించి రకరకాల కోణాలలో కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మూడు నెలలకే మన్రో చనిపోయింది.తన మరణానికి కొన్ని గంటల ముందు మన్రోకు అప్పటి అమెరికా అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెనడీతో తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయని, అతడే ఆమెకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఉండొచ్చనే వెర్షన్ కూడా వినిపించింది. కెనడీ సోదరులు, వారి సర్కిల్ తాలూకు ప్రైవేట్ ప్రపంచంపై ‘ది ఫిక్సర్’ పుస్తకం దృష్టి సారిస్తుంది. మళ్లీ కెనడీ సోదరుల దగ్గరికి వస్తే....మార్లిన్ రెండవ భర్త జో డిమాజియో చెప్పిన దాని ప్రకారం మన్రో అంత్యక్రియలకు హాజరు కాకుండా కెనడీ సోదరులను నిషేధించారు.‘కెనెడీలంతా లేడీ కిల్లర్లే’ అంటూ ఘాటుగా తిట్టేవాడు జో డిమాజియో. ఫ్రెడ్ ఒటాస్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ మాత్రమే కాకుండా ‘డెయిలీ మెయిల్’ పత్రికలో వన్స్ అపాన్ ఏ టైమ్ వచ్చిన ‘ఆస్క్ నాట్’ సీరియల్లోని సమాచారాన్ని కూడా ‘ది ఫిక్సర్’ రచయితలు జోష్ యంగ్, మాన్ఫ్రెడ్లు వాడుకున్నారు. మార్లిన్ మన్రోపై ఎన్నో సినిమాలు, వందలాది పుస్తకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా, ఎప్పుడు వచ్చినా.... మార్లిన్ మన్రో జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే.(చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?) -
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్..నేడు మోడల్‌గా..!
ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ స్థాయి నుంచి మోడల్‌గా ఎదిగి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన కలను సాకారంచేసుకునేందుకు అతను పడిన కష్టాలు, అవమానాలు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అతనెవరు? ఎలా తన కలను సాకారం చేసుకున్నాడంటే..ముంబైకి చెందిన సాహిల్ సింగ్ మోడల్‌గా తన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను రెండేళ్లు స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బర్గర్ కింగ్‌లో ఒక ఏడాది చెఫ్ పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి మోడలింగ్ ప్రదర్శనకు ముందు ఎనిమిది నెలలు పాటు మ్యాంగో మార్ట్‌లో పనిచేసినట్లు వివరించాడు. అంతేగాదు పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత నుంచే పలు రకాల ఉద్యోగాలు చేసినట్లు తెలిపాడు. అయితే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా నెలకు రూ. 18,000 నుంచి రూ. 22,000 సంపాదించినట్లు తెలిపాడు. 2009లో ఓ మోడల్ పోస్టర్ చూసిన తర్వాత తాను ఏం చేయాలనేది తెలిసిందన్నాడు. ఆ తర్వాత మోడల్ అయ్యేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై దృష్టిసారించినట్లు తెలిపాడు. అందుకోసం రోడ్డుపక్కనే వాలెట్లు వంటివి అమ్మేవాడినని కూడా చెప్పుకొచ్చాడు. అంతేగాదు దాదాపు 200 ఆడిషన్స్ చేసినట్లు తెలిపాడు. అలా ఈ ఏడాది చివరికి ర్యాంప్‌పై నడిచే అవకాశాన్ని దక్కించుకోగలిగాని ఆనందంగా చెప్పాడు. తనను మోడల్‌గా స్ట్రీక్స్ అనే ఫ్యాషన్ సంస్థ ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తనలోని లోపాలను గురించి కూడా నిజాయితీగా వివరించాడు. తన ఎత్తు కేవలం 5 అడుగుల 10 అంగుళాలని, ఇది బెస్ట్ మోడల్‌గా ఎంపికయ్యేందుకు కావాల్సిన అర్హత కాదని చెప్పాడు. తాను ర్యాంప్‌పై నడిచేలా అనుమతించమని పదేపదే అభ్యర్థించాల్సి వచ్చేదని అన్నారు. అయితే స్ట్రీక్స్ తనను హీల్స్ ధరించాలనే షరతుపై వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాదు మోడల్ అయ్యేందుకు ఎలాంటి టెక్నీక్స్ ఫాలో అవ్వాలో సూచించాడు. అంతేగాదు ఈ ఫీల్డ్‌లోకి కొత్తగా వెళ్తున్నవారికి మార్గదర్శకత్వం వహించేలా ఇన్‌స్టాగ్రాంలో కొత్త సిరిస్ ప్రారంభించాడు. అలాగే మోడలింగ్ రంగంలో రాణించాలంటే ఫోటోగ్రాఫర్లు, స్టైలిస్ట్‌లు, డిజైనర్లు, మంచి స్టూడియో వ్యక్తులు వంటి నెట్వర్క్ ఉండాలి. అప్పుడే ఈజీగా మోడల్ అవ్వగలరని చెబుతున్నాడు. ఈ నెట్వర్క్ కోసం సోషల్ మీడియా వంటి సాయంతో అలాంటి వ్యక్తులకు టచ్‌లో ఉండేలా నేరుగా మెసేజ్‌లు పెట్టడం, ఇమెయిల్స్ పంపడం వంటివి చేయాలని సూచించాడు. నిజంగా ఇతడి కథ ఎందరికో స్పూర్తి కదూ..!. View this post on Instagram A post shared by Sahil Singh | fashion & grooming tips | (@fashiontipssahil) (చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
డయానాలా కనిపించే ప్రముఖ ప్యాషన్ ఐకాన్ ఆమె..!
కొన్ని రకాల నైపుణ్యాలు, తెలివితేటల జీన్స్ రీత్యా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. ఆ కుటుంబంలో అత్యంత ప్రతిభావంతుడు ఉంటే. ఆ పరంపర అతని తర్వాత తరంలో ఎవరో ఒకరు కొనసాగిస్తుంటారు. వెంటనే అతన్ని అంతకు ముందు జనరేషన్ వ్యక్తితో పోల్చుకుంటూ..ఆ వ్యక్తి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం సహజం. అలానే ఓ ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ని చూడగానే నాటి అందాల యువ రాణి దివంగత డయానాని గుర్తు తెచ్చుకుంటారు అంతా. ఇంతకీ ఎవరా మోడల్ అంటే..?ఆ మోడల్ పేరు కేథరిన్ కిట్టి ఎలియనోర్ స్పెన్సర్. ఆమె గ్లామర్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. చూడటానికి దివంగత యువరాణి డయానాలా అందంగా ఉంటుంది. కిట్టి ఎర్ల్ స్పెన్సర్-విక్టోరియా ఐట్కెన్ల పెద్ద కుమార్తె. ఇక్కడ కిట్టి తండ్రికి స్వయనా అక్కే వేల్స్ దివంగత యవరాణి డయానా. అంటే కిట్టి స్వయానా.. డయాన మేనగోడలు. బహుశా ఆ జీన్స్ ఆమెలో కూడా ఉంటాయి కాబట్టి కిట్టి డయానాలా ఉండి ఉండొచ్చు. ఇక కిట్టీ 2015 నుంచి మోడల్‌గా మారింది. ఎస్టీ లాడర్, బల్గారి, వోగ్, రాల్ఫ్ లారెన్, జిమ్మెర్మాన్లతో సహా ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక బ్రాండ్లతో కలిసి పనిచేశారామె. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మార్క్లేల వివాహంలో తొలిసారిగా కిట్టీ పేరు మారు మ్రోగిపోయింది. మరో డయానాలా ఉందే అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత టాట్లర్ కవర్‌పై మోడల్‌గా కనిపించిన ఆమెనే కిట్టి అని ప్రపంచమంతా గుర్తించడం ప్రారంభించింది. ఈ గుర్తింపే కిట్టిని ఫ్యాషన్ కెరియర్ మకుటం లేని రాణిని చేసింది. అయితే కిట్టీ తల్లి విక్టోరియా ఐట్కెన్ కూడా మాజీ బ్రిటిష్ మోడలే కావడం విశేషం. ఇక కిట్టి మోడలింగ్ ఏజెన్సీ స్టార్మ్ మేనేజ్మెంట్కు సంతకం చేయడమే గాక ఇటాలియన్ లగ్జరీ పవర్‌హౌస్ డోల్స్ అండ్ గబ్బానాకు గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా ఉంది.వ్యక్తిగత జీవితం..బిలియనీర్ మైఖేల్ లూయిస్‌ని పరిణయమాడింది. అంతేగాదు తన వివాహ సమయంలో లగ్జరీ బ్రాండ్ ఫ్యాషన్ హౌస్ నుంచి డికాడెంట్ గౌనుని ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక కెరీర్ పరంగా.. ఆమె లండన్ రీజెంట్స్ యూనివర్శిటీలో లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత కలిగిన యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. కాగా, 33 ఏళ్ల కిట్టి ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత తన బిడ్డ పేరుని, ఫోటోని షేర్ చేసుకుంది.(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!) -
వైద్యురాలు కమ్ మోడల్: తొలి మిస్ యూనివర్స్ పెటిట్గా కన్నడ బ్యూటీ!
అమెరికాలో పొట్టి మహిళల కోసం నిర్వహించే అందాల పోటీల్లో విజయకేతనం ఎగురవేసింది కన్నడ బ్యూటీ. భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో ఉండే ఈ మోడల్ అతిపెద్ద కలను సాకారం చేసుకుంది. ప్రతి అమ్మాయి తాను అందాల రాణిని కావాలని ఆకాంక్షిస్తుంటది. అది సాధ్యం కానీ లక్ష్యమే అయినా పట్టుదలగా దాన్ని సాకారం చేసుకుని మరీ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ కన్నడ మోడల్. ఆమె పేరు శృతి హెగ్డే. ఎవరీమె..? ఎలా ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొన కలిగిందంటే..బెంగళూరుకు చెందిన శృతి హెగ్డే అనే వైద్యురాలు మోడల్‌గా మారి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈ అందాల పోటీ అంత సులభమైనది కాదు. ఇది పొట్టి మహిళలకు అవకాశం కల్పించేందుకు 2009లో ప్రారంభించిన అందాల పోటీ. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్లంతా అమేజనోనియన్ ప్రమాణాల ప్రకారం మరుగుజ్జుగా ఉంటారు. ప్రతి ఏడాది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపాలో ఈ పోటీలు నిర్వహిస్తారు.నిజానికి శృతి డాక్టర్‌గా పనిచేస్తూ మరోవైపు మోడల్‌గా ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రిపేరయ్యేది. ఆస్పత్రిలో 36 గంటల షిఫ్ట్‌ల తోపాటు విశ్రాంతి తీసుకొని మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఎదుర్కోంది. అందాల రాణి కావాలన్నది ప్రతి అమ్మాయి కల..అయితే తాను జస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా, దీనికి తన అమ్మ అందించిన సపోర్టు కూడా ఎంతో ఉపయోగపడిందని అంటోంది హెగ్డే. తాను 2018 మిస్ ధార్వాడ్ పోటీకి సైన్ అప్ చేసింది. ఈ పోటీలో గెలిచేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో తాను చాలా పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ముందుగా తన వైద్య రంగాన్ని, మోడలింగ్ కెరీర్‌ని బ్యాలెన్స్ చేయడం చాలా సవాలుగా ఉండేది. ఒక్కోసారి విశ్రాంతి తీసుకునేంత తీరిక లేని పనులతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేదని చెబుతోంది. ఇంతలో 2019లో తనకు గర్భాశయ కణితులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది. దీంతో ఓ రెండేళ్లు ట్రీట్‌మెంట్‌తోనే గడిచిపోయింది. ఇక కెరీర్ ముగిసిపోయింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనలేను అనుకున్న సమయాన్ని ఆమె తల్లి అందించిన మద్దతుతో తిరిగా మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. అలా మిస్ ఆసియా ఇంటర్నేషనల్ ఇండియా 2023 రెండో రన్నరప్‌గా టైటిల్‌ని దక్కించుకుంది. ఎప్పుడైతే ఈ టైటిల్ గెలిచిందో అప్పుడు ఆమె మీద ఆర్థిక ఒత్తిడి తగ్గింది. అంతకమునుపు ఓ పక్క ట్రీట్మెంట్ మరోవైపు పోటీల ప్రీపరేషన్తో ఆర్థిక భారం ఎక్కువగా ఉండేది. దీంతో పోటీల్లో ప్రదర్శని ఇచ్చేందుకు కేవలం రెండు దుస్తులే ఉండేవి. వాటినే వేర్వురు ప్రదర్శనల్లో ధరించేదాన్ని అని చెబుతోంది. ఇప్పుడు ఆమెకు స్పాన్సర్లు లభించడంతో ఈ ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం పొందింది. ఆమె కష్టానికి ఫలితమే దక్కి గత నెల జూన్ 10న భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్‌గా కిరీటాన్ని గెలుచుకుంది. (చదవండి: స్పేస్‌లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!) -
సివిల్స్‌లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఓ మోడల్ గ్లామర్ రంగంలో రాణిస్తూ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఎగ్జామ్ వైపుకి అడుగులు వేసింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గ్లామరస్ రోల్‌కి విభిన్నమైన రంగంలోకి అడుగుపెట్టడమే గాక ఎలాంటి కోచింగ్ లేకుండా విజయ సాధించి అందరికీ స్పూర్తిగా నిలిచింది ఈ మోడల్. ఆమె ఎవరంటే..రాజస్థాన్‌కు చెందిన ఐశ్వర్య షియోరాన్ సైనిక నేపథ్య కుటుంబానికి చెందింది. అందువల్లే ఆమె దేశానికి సేవ చేసే ఈ సివిల్స్ వైపుకి మళ్లింది. ఆమె తన ప్రాథమిక విద్యనంతా చాణక్యపురిలోని సంస్కతి పాఠశాల్లో పూర్తి చేసింది. ఇంటర్లో ఏకంగా 97.5 శాతం మార్కులతో పాసయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మోడలింగ్ పోటీల్లో పాల్గొంది. అలా మొదలైన ఆమె ప్రస్థానం పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొనడంతో సాగిపోయింది. ఆ విధంగా ఆమె 2015లో మిస్ ఢిల్లీ కిరీటం, 2014లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్, 2016లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ మోడలింగ్ అనేది ఆమె అమ్మకల అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది ఐశ్వర్య. ఆ తర్వాత కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2018లో ఐఐఎం ఇండోర్‌కు ఎంపికైన తాను సివిల్స్ వైపే దృష్టి సారించినట్లు తెలిపారు. అలా 2018-2019లో సివిల్స్ ప్రిపరేషన్లో మునిగిపోయింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తనకు తానుగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నలోనే సివిల్స్ 2019లో విజయం సాధించి..93వ ర్యాంక్ సాధించారు. తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ..ఇక తాను ఈ సివిల్స్ ప్రిపరేషన్ కోసం 10+8+6 టెక్నిక్ ఫాలో అయ్యానని చెప్పారు. అంటే పదిగంటలు నిద్ర, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర కార్యకలాపాలు. ఇక కోచింగ్ దగ్గర కొచ్చేటప్పటికీ వారి వ్యక్తిగత అభిరుచికి సంబధించింది అని అన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు సాధించగలమా లేదా అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే దిగాలి అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. ఇక ఆమె తండ్రి విజయ్ కుమార్ ఆర్మీలో కల్నల్. ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి. రాజస్థాన్‌లో జన్మించిన ఐశ్వర్య ఢిల్లీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈ మధ్యే తెలంగాణలో రాష్ట్రం కరీంనగర్‌కు బదిలీ అయ్యింది. కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ప్రస్తుతం ఐశ్వర్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. మోడల్ నుంచి ప్రజలకు సేవ చేసే అత్యున్నత రంగంలోకి రావడమే గాక కేవలంలో ఇంట్లోనే జస్ట్ పదినెల్లలో ప్రిపేర్ అయ్యి సివిల్స్‌లో విజయం సాధించింది. తపన ఉంటే ఎలాగైనా సాధించొచ్చు అనేందుకు స్ఫూర్తి ఐశ్వర్యనే అని చెప్పొచ్చు కదూ..!(చదవండి: కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!) -
మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!
అందం అంటే నాజుగ్గా, శిల్పంలా ఉండటమే కాదని ప్రూవ్ చేసిందామె. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం ఉంటే..ప్లస్ సైజులో ఉన్నా బ్యూటీగా గెలవొచ్చని చాటి చెప్పింది. అందం అంటే ఆకృతికి సంబంధించింది కాదని మానసిక సౌందర్యమే నిజమైన అందమని తెలియజెప్పింది. అంతేగాదు బాడీ షేమర్ల చెంపచెళ్లుమనేలా అందాల పోటీల్లో గెలిచి చూపించింది. సోషల్ మీడియా, సినిమాల పుణ్యామా అని అందం మీద మోజు ఎక్కువయ్యింది. కేవలం నాజుగ్గా, చెక్కిన శిల్పంలా ఉంటేనే అందం అన్నట్లుగా భావిస్తున్నారు చాలామంది. ఆఖరికి రంగు విషయంలో కూడా అవహేళనలే. తెల్ల తోలు ఉన్న వాళ్లు తప్ప మిగతా వాళ్లెవరూ కంటికి ఆనరు అనేంతగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ముఖ్యంగా యువతలో ఇది మరీ ఎక్కువగా ఉంది. దీంతో జన్యు పరంగానో లేదా అనారోగ్య కారణాల వల్లనో లావుగా ఉన్నవాళ్లు సమాజం నుంచి పలు చిత్కారాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అవమానాలనే ఎదుర్కొంది సారా మిల్లికెన్. సారా మెంటల్ హెల్త్ లాయర్(మానసిక ఆరోగ్య న్యాయవాది). చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు బాడీ షేమింగ్‌కి గురయ్యింది. సోషల్‌మీడియాలో కూడా తన ఆకృతి విషయమై ట్రోల్స్ బారిన పడింది. అయినా సరే తనలాంటి వాళ్లు కూడా అందాల పోటీల్లో విజేతలవ్వగలరు అని చెప్పాలన్న సంకల్పంతో మిస్ అలబామా అందాల పోటీల్లో పాల్గొంది. రెండు సార్లు కిరీటం కోసం పోటీపడి త్రుటిలో చేజారిపోయింది. ఆ టైంలో కూడా ఆమె విశ్వాసాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ఎదుర్కొంది. దీంతో మళ్లీ ఈ పోటీల్లో పాల్గొనకూడదు అని వెనక్కి వచ్చేసింది. అలా ఏడేళ్ల పాటు ర్యాపింగ్కి దూరంగా ఉంది. మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనకపోవడం అంటే..ఆ వ్యక్తి అన్న మాటను తాను అంగీకరించి వచ్చేసినట్లే కదా అన్న బాధ వెంటాడింది సారాని. తనలో ఎలాగైన ఆ అవహేళనలు, బాడీ షేమర్లను తిప్పికొట్టేలా ఈ పోటీల్లో గెలవాలన్న కసి పెరిగింది. ఆ పట్టుదలే సారాని మిస్ అలబామా 2024లో కిరీటాన్ని దక్కించుకునేలా చేసింది. అంతేగాదు ఆ వేదికపైనే తన ఆకృతి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విరుచుకుపడింది. తన గెలుపుతో హేళన చేసే వారి చెంప చెళ్లుమనిపించేలా చేసింది. అంతేగాదు దయచేసి ఎవ్వరూ మరొకరి శరీరాన్ని అగౌరవపరచొద్దు, మానసిక సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వండి అని కోరింది సారా. మహిళలు మనసు పెట్టి సాధించాలనుకుంటే కచ్చితంగా సాధించగలరని సోషల్ మీడియా వేదికగా తనలాంటి వాళ్లను మోటీవేట్ చేస్తుంటుంది సారా. అంతేగాదు సోషల్ మీడీయా ట్రోల్స్‌కి చాలా వ్యూహాత్మకంగా కౌంటర్లు ఇచ్చేది. దీంతో సారాకు అనూహ్యంగా వేలాది మంది నెటిజన్ల మద్దతు లభించేది. అదే ఆమెకు ఎక్కవ మంది ఫాలోవర్స్‌ని తెచ్చిపెట్టింది. అంతేగాదు ఇలా ఆన్లైన్లో టైప్ చేసే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ప్రజల్లో అనుచిత ముద్ర వేస్తాయంటూ.. అంటించే చురకలు అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చేలా చేసింది. ఈ వైఖరే సారానీ మిస్ అలబామాగా అందాల పోటీలో విజేతగా నిలబెట్టింది. ఇప్పుడామెకు ఈ విజయానికి గానూ సోషల్ మీడియా నుంచి వేలాదిగా ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. (చదవండి: వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత) -
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
Siksha Das IPL 2024 Photos: ఐపీఎల్‌కు హీట్ పెంచుతున్న బెంగాలీ భామ.. ఎవరీ బ్యూటీ?(ఫోటోలు)
-
Anjali Lavania: పంజా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..! (ఫోటోలు)
-
డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!
ఏదైనా రుగ్మతతో పోరాడుతున్న లేదా వైకల్యంతో బాధపడుతున్న అక్కడితో ఆగిపోకూడదని ప్రూవ్ చేసిందో ఈ యువతి. రుగ్మత గమ్యానికి అడ్డంకి కాదు. అదే నిన్ను పదిమంది ముందు విలక్షణంగా నిలబడేలా మలుచుకునే ఓ గొప్ప అవకాశం అంటోంది ఈమె. అంత పెద్ద సమస్యను ఫేస్ చేస్తూ కూడా..నలుగురు శభాష్ అనేలా తలెత్తుకుని జీవిస్తోంది. తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పేరే జైనికా జగసియా. ఆమె డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. డౌన్‌సిండ్రోమ్ అంటే తెలిసిందే. మానసికలోపంతో బాధపడే చిన్నారులని చెప్పొచ్చు. శారీరక పెరుగుదల ఉన్న మానసిక పెరుగుదల ఉండదు. పైగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి చిన్నారుల ఆయుర్ధాయం కూడా తక్కువే. అంతటి పెను సమస్యతో బాధపడుతున్నప్పటికీ మోడల్, అడ్వకేట్, లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా దూసుకుపోతోంది. ఇంకోవైపు పాకశాస్త్ర నైపుణ్యంతో హోమ్బ్రెడ్ బై అనే బ్రాండ్‌తో ప్రముఖ బేకర్‌గా గుర్తింపుతెచ్చుకుంది. అంతేగాదు జైనికాకి ఫిట్నెస్ ఔత్సాహికురాలిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలో చక్కగా చెబుతుంది. అక్కడితో ఆమె విజయ ప్రస్థానం ఆగలేదు..గూచీ వంటి ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించి డౌన్ సిండ్రోమ్‌తో ఉన్నవాళ్లు అన్ని రంగాల్లో చురుగ్గా రాణించగలరని చూపించాలని ప్రగాఢంగా కోరుకుంటోంది. ఇక ఆమె ఇలా అన్ని విభ్ని రంగాల్లో రాణించగలగడానికి ప్రధాన కారణం అమ్మనాన్నల సహకారం తోపాటు తన సమస్యను అంగీకరించడం అంటోంది జైనికా. "మన బాధ ఏదైనా అంగీకరించాలి. యస్ నా సమస్య ఇది కాబట్టి నేనే చేయగలిగేదేమిటీ..? నా ఐడెంటీటీని ఎలా సంపాదించుకోవాలి అనే దానిపైకి ఫోకస్‌ని పోనివ్వాలి. అంతే తప్ప! మానసిక వైకల్యురాలిని కాబట్టి చేయలేను అనే ఆలోచన రాకూడదు. ఎలా చేస్తే బెటర్‌గా అవ్వగలను అనేది ఆలోచించాలే తప్ప ఆగిపోకూడు. అది పిడుగులాంటి సమస్య అయినా పక్కకు నెట్టి మరీ సాగిపోవాలి. చిన్నప్పటి నుంచి భాష దగ్గర నుంచి చదవడం, రాయడం అన్ని నాతోటి వాళ్ల కన్న వెనుక ఉండేదాన్ని. ప్రతీది లాస్ట్.. లాస్ట్.. ఆ లాస్ట్ని ఫస్ట్ ఎలా చేయగలననే ఆలోచనే అన్నింటిని అలవోకగా నేర్చుకునే శక్తి ఇచ్చింది. లాస్ట్.. లాస్ట్ అంటూ వేస్ట్‌గా కూర్చొండిపోలే. లాస్ట్ని ఫస్ట్‌గా మార్చే ప్రయత్నం చేశా అంతే!. అలాగే బేకింగ్ వంటకాలంటే మొదట్లో కాస్త అయిష్టత ఉండేది. అయితే నా సోదరి ఇవి తయారు చేయడంతో నాకు ఊహించనివిధంగా దానిపై అభిరుచి ఏర్పడింది. తెలియకుండానే ఆ కళలో ప్రావీణ్యం సాధించాను. వాస్తవానికి హెల్తీగా ఉన్నవాళ్లకైనా సరే..ముందగా ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక నా బోటి వాళ్లకు మరింత సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇద్దరికీ సమస్య..సమస్యే అనే విషయం గ్రహించాలి. కాకపోతే.. ఇక్కడ నేను తొందరగా నేర్చుకోలేనన్న భయం నన్ను మరింత శ్రద్ధ పెట్టి నేర్చుకునేలా చేస్తోందని చెబుతోంది జైనికా. అంతేగాదు సవాలు ఎవ్వరికైనా సవాలే కాకపోతే ఇక్కడ నాకు రుగ్మత లేదా వైకల్యం ఉందన్న ఆలోచన ఆ సవాలును అత్యంత కఠినమైనదిగా మారుస్తుంది. జస్ట్ ఇలా ఉండి కూడా సాధించి గ్రేట్‌గా ఉండాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఎంతటి కఠిన సవాలునైనా చేధించొచ్చు అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది." జైనికా. నిజానికి సమాజం అలాంటి పిల్లలను చూసి జాలిపడుతుంది. కానీ ఆ అవసరం లేదు, నేర్చుకోవడానికి టైం తీసుకుంటామే తప్ప మాలాంటి వాళ్లు కూడా సాధించగలరు అని చాటి చెప్పింది జైనికా. (చదవండి: భారత అత్యున్నత న్యాయమూర్తి ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!
ఏపీ రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. కరువును తట్టుకునే ప్రత్యేక పద్ధతి (డ్రాట్ ప్రూఫింగ్ మోడల్)లో పంటలు సాగు జరుగుతోంది. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, బీడు భూముల్లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని పలువురు చిన్న, సన్నకారు రైతులు నిరూపిస్తున్నారు. పొలం మొత్తాన్నీ దుక్కి చేయకుండా.. ప్రతి 3 అడుగుల దూరంలో ఒక అడుగు భూమిని తవ్వి 5 రకాల పంట విత్తనాలను విత్తుతున్నారు. 2023 ఆగస్టులోప్రారంభమైన ఈ సరికొత్త పద్ధతిలో అనేక జిల్లాలకు చెందిన 56 మంది రైతులు 20 సెంట్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫ్ సాగు చేస్తున్నారు. ఇద్దరు రైతుల అనుభవాలతో కూడిన కథనం.. కాలువ రాకపోయినా పంట వచ్చింది.. రైతు ఆదిలక్ష్మి ఇలా చెప్పారు.. ‘‘మాకు అరెకరం పొలం ఉంది. ఇక్కడ అందరూ మిరపే వేస్తారు. మేమూ మిరపే వేసేవాళ్లం. రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మిరపలో అంతరపంటలు కూడా సాగు చేశాం. సాగర్ కాలువ నుంచి ఇంజన్‌తో తోడుకొని తడి పెట్టేవాళ్లం. గత ఏడాది 7 క్వింటాళ్లు ఎండు మిరప పండింది. రూ. 50 వేల నికారాదాయం వచ్చింది. వర్షాలు లేక ఈ సంవత్సరం కాలువ ఒక్కసారే వచ్చింది. అందుకని మిరప వేయలేదు. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు.. కరువును తట్టుకొని పండే డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు పెట్టాం. ఈ పంటలకు ముందు మేలో నవధాన్య (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) పంటలు చల్లాం. వర్షం లేక సరిగ్గా మొలవలేదు. మళ్లీ జూలైలో వేశాం. వర్షానికి మొలిచింది. పెరిగినాక కోసి, గొడ్లకు మేతగా వాడుకున్నాం. వరుసగా మూడేళ్లుగా నవధాన్య పంటలు వేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే.. భూమి బాగా గుల్లబారింది. నవధాన్య పంటలు వేయని పక్క పొలంలోకి వెళ్లి మట్టి చేత్తో తీయాలంటే చాలా కష్టపడాలి. మా పొలంలో సులువుగానే మట్టి తీయొచ్చు. పొలం దున్నకుండానే, 3 అడుగులకు ఒక చోట అడుగు నేలను గుల్లగా తవ్వి, గత ఏడాది అక్టోబర్ 27న 5 రకాల విత్తనాలు నాటుకున్నాం. ప్రధాన పంటగా మధ్యలో ఆముదం లేదా కందిని నాటాం. దానికి నాలుగు వైపులా చిక్కుడు, అలసంద, అనుములు, సజ్జలు విత్తుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తన గుళికలు తయారు చేసుకొని నాటుకున్నాం. సీడ్ పెల్లటైజేషన్ చేయటం వల్ల భూమిలో విత్తుకున్న తర్వాత మొలక శాతం బాగుంటుంది. ఒకవేళ వర్షం రాకపోయినా లేదా మనం నీళ్లు పెట్టటం లేటైనా ఆ విత్తనం చెడిపోకుండా ఉంటుందని పెల్లటైజేషన్ చేశాం. విత్తనం పెట్టిన కొద్ది రోజులకు తుపాను వానకు విత్తనాలు మొలిచాయి. విత్తనం పెట్టేటప్పుడు అరెకరంలో 200 కిలోల ఘనజీవామృతం వేశాం. రెండుసార్లు ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. తర్వాత మరో రెండు సార్లు వాన వచ్చింది. అదే వాన సరిపోయింది. మిరపకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. మిరపకు రెండు రోజులు నీరు లేకపోతే వడపడిపోయి ఎండిపోతుంది. డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు అలా కాదు. నీరు లేకపోయినా చాలా వరకు జీవ కళ ఉంటుంది. అదీకాక, మేం చేసిన విత్తన గుళికలుగా చేసి వేసినందు వల్ల, భూమిలో వేసిన ఘనజీవామృతం వల్ల, ద్రవ జీవామృతం పిచికారీ వల్ల పంటలు ఎదిగాయి. ప్రధాన పంటతో పాటు పెట్టిన అనుములు, చిక్కుళ్ల వల్ల ఉపయోగం ఏమిటంటే.. ఈ తీగలు పాకి నేలపై ఎండపడకుండా కప్పి ఉంచి కాపాడటం, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడింది. సజ్జ ద్వారా రూ. 8,000లు వచ్చాయి. సజ్జ ఇంకా తీయాల్సి ఉంది. చిక్కుళ్లు,సొర కాయలు, దోసకాయల ద్వారా మరో ఆరేడు వేలు ఆదాయం వచ్చింది. సజ్జ బాగా పెరగటంతో నీరు లేక కంది సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికి అన్నీ కలిపి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఆముదాలు ఒక బస్తా వరకు వస్తాయి. పనులు మేమే చేసుకుంటాం. ఖాళీ ఉన్న రోజుల్లో కూలికి వెళ్తాం. బెట్టను తట్టుకొని పంట పండించుకోవచ్చని, ఎంతో కొంత దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది..’’ – ఎం. ఆదిలక్ష్మి (83091 18867), ఈపూరు, పల్నాడు జిల్లా బీడులోనూ పంటలు.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాళ్ళ గ్రామానికి చెందిన రంగస్వామి బిఎస్సీ బీఈడీ చదువుకొని తమ రెండెకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్వవసాయం చేస్తున్నారు. ఒక ఎకరంలో సపోట, మామిడి చెట్లు ఉన్నాయి. మరో ఎకరంలో టొమాటో, మిర్చి, వంగ, గోరుచిక్కుడు పంటలను బోరు నీటితో సాగు చేశారు. రెండో పంటగా వేరుశనగ, కంది, ముల్లంగి తదితర పంటలు వేశారు. రెండెకరాల్లో సగటున ఏడాదికి రూ. లక్షా 70 వేల వరకు నికరాదాయం పొందుతున్నట్లు తెలిపారు. సపోట, మామిడి తోటలో మూడు ఏళ్లుగా దుక్కి చేయని 30 సెంట్ల విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫింగ్ మోడల్లో 2023 డిసెంబర్లో ప్రయోగాత్మకంగా సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద, కంది, ఆముదం పంటలను సాగు చేశారు. 3 అడుగుల దూరంలో ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి, ఘనజీవామృతం వేసి విత్తనాలు విత్తారు. మామిడి ఆకులతో ఆచ్ఛాదన చేశారు. వారానికోసారి బక్కెట్లతో పాదికి 2,3 లీటర్ల నీరు పోశారు. మూడు నెలల వ్యవధిలో అలసంద, అనుములు అమ్మితే రూ. 2 వేల దాకా ఆదాయం వచ్చింది. పశుగ్రాసం రూపంలో మరో రూ. 3 వేల ఆదాయం వచ్చింది. రూ. 2 వేల గోరుచిక్కుళ్లు పండాయి. తమ ఇంటి కోసం, బంధువులకు వినియోగించారు. సజ్జ పక్షులు తిన్నాయి. కంది, ఆముదం పంటలు కోయాల్సి ఉంది. పంటలకు నీరు పోస్తున్నందున మొక్కల మధ్యన 3 అడుగుల ఖాళీలో గడ్డి పెరుగుతోంది. ఆ గడ్డిని కోసి ఆవులు, గేదెలకు వేస్తున్నారు. డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ పంటలతో వదిలేసిన భూమిని దుక్కి చేయకుండానే.. పంటలు పెట్టుకునే చోట తవ్వి విత్తనాలు పెట్టుకొని తిరిగి సాగులోకి తెచ్చుకోవచ్చని, ఎంతో కొంత పంట దిగుబడి తీసుకోవచ్చని రంగస్వామి అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రంగస్వామి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో వర్షాలు తగ్గినా పంట పెరగుదల బాగా కనిపిస్తోంది. రంగస్వామి ప్రకృతి వ్యవసాయం చూసి రంగస్వామి (88869 60609) తండ్రి కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. -
యోగి బాటలో థామీ సర్కార్.. డ్యామేజ్ రికవరీ బిల్లు అమలు?
ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లకు, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అవలంబిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచారు. ఆందోళనకారుల కారణంగా ప్రభుత్వానికి వాటిల్లే నష్టాలను రికవరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సీఎం యోగిని అనుసరించనున్నారని సమాచారం. హల్ద్వానీ హింసాకాండలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచి వసూలు చేసేందుకు థామీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరసనల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఆందోళనకారుల నుండి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. నిరసనల కారణంగా సంభవించే ఆస్తి నష్టాల పరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 8న నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో అక్రమాస్తుల వ్యతిరేక ప్రచారంలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బంబుల్‌పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చివేశారు. అంతటితో ఆగక స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా నిప్పంటించారు. ఈ ఘటనలో ధ్వంసమైన ఆస్తుల విలువ మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ టేబుల్‌పైకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి గతంలోనే ప్రకటించారు. కాగా ఈ హింసాకాండలో పాల్గొన్నవారి సమాచారం అందించాలని మీడియాను జిల్లా యంత్రాంగం కోరింది. హల్ద్వానీ హింసాకాండలో ప్రధాన నిందితుడైన అబ్దుల్ మాలిక్‌ను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. -
లండన్ వీధుల్లో లెహెంగాతో హల్చల్ చేసిన మహిళ!
మన దేశంలో అమ్మాయిలు చీరకట్టులో లేదా లెహెంగాలో కనిపించని అంత స్పెషల్‌గా ఏం ఉండదు. బహుశా ఈ రోజు ఏదైనా పండుగ లేదా వేడుక అయ్యి ఉండొచ్చు అనే అనుకుంటారు. అదే విదేశాల్లో మన దేశీ సంప్రదాయ దుస్తులు ధరించి వీధుల్లో హల్చల్ చేస్తే..పరిస్థితి ఓ రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా అందరీ ముఖాల్లో వివిధ రకాల ఎక్స్ప్రెషన్లు కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే స్టన్నింగ్ లుక్స్‌తో ఒక్కసారిగా అటెన్షన్ అయ్యిపోతారు. అలానే ఇక్కడొక మహిళ లెహంగాతో లండన్ వీధుల్లో షికారు చేసింది. అంతే వారి అటెన్షన్ అంతా ఆమెపైనే నిలిపి నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో శ్రద్ధ అనే భారత సంతతి స్పానిష్ మోడల్ ఎరుపు రంగు ఎంబ్రాయిడర్‌తో కూడిన లెహెంగా ధరించి, నిండుగా ఆభరణాలతో ధగ ధగ మెరిసిపోయింది. లండన్‌లోని మెట్రో రైలు ఎక్కగానే అందరి చూపు ఆమెపైనే ఉంది. ఇక ఆమె తన గమ్యాన్ని చేరుకుని, అక్కడ వీధుల్లో కాసేపు షికారు చేసింది. అయితే అక్కడ ఉన్న కొందరూ ఆమె చిత్రాలను క్లిక్‌మనిపించగా కొందరూ ఆసక్తికరమైన రీతీలో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ మేరకు శ్రద్ధ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తూ..ఈ వీడియోకి 'లండన్ దేశీ టాప్ అండ్ స్కర్ట్‌కి వచ్చిన విశేష స్పందన' అనే క్యాప్షన్ ఇచ్చి మరీ పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లు ఆమె ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరూ భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం మీరు అని మరోకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shraddha✨ (@shr9ddha) (చదవండి: ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..!) -
వ్యవసాయం చేస్తూ మోడలింగ్ చేస్తున్న మహిళ!
వ్యవసాయం చేసే రైతులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అది మగవాళ్లైనా, మహిళలైన వ్యవసాయం చేస్తే వాళ్లు చూడటానికి కష్టజీవుల్లా కనిపిస్తారు. వ్యవసాయం మాటలు కాదు. చెమటోడ్చి కష్టపడినా పంట పండుతుందని చెప్పలేం, ఒకవేళ పండినా గిట్టుబాటు ధర లేదంటే.. చేతికొస్తుందనేది కూడా డౌటే. అలాంటి వ్యవసాయాన్ని సునాయాసంగా చేస్తూ స్టైయిలిష్‌గా ఫోటోలు తీసుకుంటుంది. పైగా ఆమె చూడటానికి చాలా స్టైలిష్ లుక్‌లో ఉండే మోడల్లా కనిపిస్తుంది. అంతేగాదు ఆమెను చూస్తే ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా! అని షాకవ్వుతారు!. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్‌కి చెందిన 29 ఏళ్ల బ్రిట్నీ వుడ్స్ అనే మహిళ వ్యవసాయం చేస్తోంది. నిజానికి ఎంత చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేసిన వెంటనే ఆహర్యం మారిపోతుంది. ఎందుకంటే మట్టిలో చేసేపని కాబట్టి అందుకుతగ్గా వస్త్రాధారణ లేకపోతే వర్క్అవుట్ అవ్వద్దు. కానీ ఈ మహిళ మోడ్రన్ దుస్తుల్లోనే వ్యవసాయం చేస్తూ ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఆమె స్వయంగా ఆవుల్ని గేదెల్ని మేపుతుంది, పాలు పితుకుతుంది కూడా. అలాగే వ్యవసాయం పనుల్లో విత్తనాలు విత్తడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడపడం వరకు అన్ని ఆమే చేస్తుంది. అందుకోసం తన శైలిని మార్చుకోలేదు. ఆధునిక అమ్మాయి మాదిరిగా డ్రస్సింగ్ స్టైల్లోనే వ్యవసాయం చేస్తూ ప్రేరణ ఇస్తుంది. తాను ఆవుల్ని,గేదెల్ని మేపుతున్న ఫోటోలను, వ్యవసాయం చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు అచ్చం మోడలింగ్ చేసే గర్ల్‌లా డ్రస్‌లు వేసుకుని ఫోజులిస్తుంది. పైగా ఆన్లైన్లో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇచ్చేస్తోంది. మరోవైపు ఆన్లైన్లో కంటంట్ క్రియటర్గా డబ్బులు కూడా సంపాదిస్తోంది. వ్యవసాయం చేయడాన్ని ఇలా మోడలింగ్‌గా కూడా వాడుకోవచ్చా అనేలా వెరైటీగా వ్యవసాయం చేస్తోంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలకు ప్రజలు అట్రాక్ట్ అవ్వడమే గాక ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రాంలోనూ టిక్‌టాక్‌లోనూ వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇక బ్రిట్నీ హైస్కూల్ విద్య పూర్తి అయ్యిన వెంటనే బిజినెస్‌లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అటువైపుకి వెళ్లి ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవడంతో వ్యవసాయం చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఏదో ఒకరోజుకు తాను సొంతంగా పొలాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అయితే బ్రిట్నీ అందరిలా మాములు దుస్తులు కాకుండా ట్రెండీ దుస్తులు వేసుకుంటూనే వ్యవసాయం చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మోడల్ మాదిరిగా దుస్తులు ధరించి, హుందాగా చెయ్యొచ్చు అనే ట్రెండ్ సెట్ చేసింది బ్రిట్నీ. అంతేగాదు నెటిజన్లు ఆమెను మోడల్ రైతుగా పిలుస్తారు. ఈ వ్యవసాయం కూడా పురుషాధిక్య ప్రపంచం కావడంతో ఆమె పలు విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు. ముఖ్యంగా ఆమె అలా మోడ్రన్ దుస్తులు ధరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శులు వస్తున్నాయని బ్రిట్నీ చెబుతోంది. అయితే వాటిని తాను పట్టించుకోనని, తన లక్ష్యం వైపుగానే సాగిపోతానని ధీమాగా చెబుతోంది. అదేసయంలో తనకు తోటి పురుష రైతుల నుంచి కొంత మద్దతు కూడా లభించడం విశేషం. అయితే ఎవ్వరూ ఎన్ని కామెంట్లు చేసినా సంప్రదాయ దుస్తుల్లో వ్యవసాయం చేసేది లేదని తేగేసి చెబుతుంది. బ్రిట్నీ తాను కొన్నిసార్లు అన్నింటినీ వదులుకుని పూర్తి సమయం వ్యవసాయం చేయడానికే కేటాయిస్తాను, అయితే డబ్బు సంపాదించడానికి కంటెంట్‌ను కూడా సృష్టిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఐతే పొలం పనుల్లో ఆమెకు సహాయం చేసే మగవాళ్లు కూడా ఆమె పనిని చూసి మెచ్చుకుంటారట. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
మిస్ జపాన్‌గా ‘ఉక్రెయిన్’ యువతి!
టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్ (జపాన్ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్ వీడి జపాన్ వచ్చేసింది. గతేడాదే షినోకు జపాన్ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్ జపాన్ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్ జపాన్ కిరీటం నెగ్గారు. -
Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం
గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి, మాజీ మోడల్ దివ్యా పహుజా మృతదేహాం లభించింది.హర్యానాలోని పటియాలో భాక్రా కెనాలో ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం కనుగొన్నారు. భాక్రా కాలువ నుంచి గురుగ్రామ్, తోహ్నా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. ఆమెను గుర్తించేందుకు తన ఫోటోలను పహుజా కుటుంబ సభ్యులకు పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా జనవరి 1న దివ్యా పహుజా గురుగ్రామ్‌లోని టీ పాయింట్ హోటల్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. యువతిని అయిదుగురు వ్యక్తులు హోటల్ గదిలోకి తీసుకెళ్లడం, అనంతరం హోటల్ యాజమాని మరికొందరు సాయంతో ఆమెను చంపేసి మృతదేహాన్ని లాక్కెళ్లి కారులోకి ఎక్కంచడం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. అయితే హోటల్ ఓనర్ అభిజిత్ సింగ్‌కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను దివ్య తన వద్ద ఉంచుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసినట్లు తేలింది. వాటిని డిలీట్ చేయాలని కోరినా.. దివ్య అంగీకరించలేదని, ఈ క్రమంలోనే ఆమెను తలపై కాల్చి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా నిందితుల్లో ఒకరైన బాల్‌రాజ్ గిల్ విదేశాలకు పారిపోతుంటే కలకత్తా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. మృతదేహాన్ని పటియాలాలోని భాక్రా కాలువలో పడేసినట్లు అంగీకరించాడు. ఇది హత్య జరిగిన గురుగ్రామ్‌లో 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ముంబై పోలీసులు దివ్యా పాహుజాతోపాటు ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది. -
Divya Pahuja: అశ్లీల ఫొటోలతో బెదిరిస్తోందనే చంపేశాడా?
మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు దివ్య పహుజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య అనంతరం గురుగ్రామ్ హోట్ల నుంచి మృతదేహాన్ని తరలించిన బీఎండబ్ల్యూ కారును పోలీసులు తాజాగా పంజాబ్‌లోని పటియాలాలో గుర్తించారు. అయితే ఆ కారులో దివ్య మృతదేహం ఉందా, లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. పటియాలాలోని బస్ స్టేషన్లో బీఎండబ్ల్యూ కారు పార్క్ చేసి ఉందని గురుగ్రామ్ పోలీస్, క్రైమ్ డిప్యూటీ కమిషనర్ విజయ ప్రతాప్ సింగ్ తెలిపారు. దివ్య మృతదేహాన్ని పంజాబ్‌కు తరలించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు నిందితులు బాల్‌రాజ్, రవి బంగర్ పరారీలో ఉన్నారని, వీరికోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యతోపాటు ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్‌కు చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, దివ్య వద్ద మరో ఫోన్ ఉందని ఆమె సోదరి చెప్పిందని, దాని కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు. కాగా పహుజా తన ప్రియుడు, గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీ హత్య కేసులో ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించి గతేడాది జూన్‌లో బెయిల్‌పై విదుదల అయ్యారు. బుధవారం గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో విగత జీవిగా కనిపించారు. హోటల్ యజమాని అభిజీత్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజీత్ సింగ్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. దివ్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వార్త: మాజీ మోడల్ దారుణ హత్య నిందితుడు అభిజీత్ మంగళవారం రాత్రి దివ్యను హోటల్ రూముకు తీసుకెళ్లి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలు దివ్య ఫోన్లో ఉన్నాయని.. వాటిని డిలీట్ చేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోటోలతో అనేక సార్లు బ్లాక్ మెయిల్‌కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం వల్లే ఆమెను హతమార్చినట్టు అభిజీత్ అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దివ్య సోదరి నైనా పహుజా వాదన మరోలా ఉంది. సందీప్ గడోలీ సోదరి సుదేశ్ కటారియా, సోదరుడు బ్రహ్మ ప్రకాశ్‌లే కలిసి అభిజీత్‌తో హత్య చేయించారని ఆరోపించింది. గడోలీ హత్య విషయానికి వస్తే.. 6 ఫిబ్రవరి 2016లో ముంబైలో పోలీసులు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లో గడోలీ మరణించాడు. అతడి గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఏడేళ్లపాటు జైలులో ఉన్న దివ్య ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చింది. అంతలోనే ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది. -
నలుగురితో ప్రేమాయణం.. అదే చెత్త రిలేషన్ అంటున్న బ్యూటీ
లవ్ చేయాలా? వద్దా? అని యూత్ ఎక్కువగా ఆలోచించడం లేదు. నచ్చితే కంటిన్యూ అవుదాం.. లేదంటే బ్రేకప్ చెప్పేద్దాం.. అని సులువుగా లవ్ జర్నీ మొదలుపెడుతున్నారు. అంతే సులువుగా విడిపోతున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ ధోరణి విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కోవలోకే వస్తుంది మాజీ ప్రేమ జంట బషీర్ అషీ-నిఖిత భమిడిపాటి! తాజాగా నిఖిత తన బ్రేకప్‌కు గల కారణాల్ని బయటపెట్టింది. చెత్త రిలేషన్.. ప్రియుడి మాటలు, చేష్టలు నచ్చకే విడిపోయానంటోంది నటి. ఓ పాడ్‌క్యాస్ట్‌లో నిఖిత మాట్లాడుతూ.. 'నా జీవితంలోనే అది అత్యంత చెత్త రిలేషన్షిప్. పనికిమాలిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది. మా సంబంధం చాలా విషపూరితమైంది. కానీ అప్పుడు మా జీవితాల్లో చాలామందిని దూరం చేసుకున్నాం. అలా చేయకుండా ఉండాల్సింది! ఇప్పుడు కూడా అతడు బయట నా గురించి మాట్లాడుతున్నాడంటే అది పబ్లిసిటీ కోసమే అనిపిస్తోంది. అయినా మాదసలు రిలేషనే కాదు, జస్ట్ టైం వేస్ట్ చేశాం. ఎమోషన్స్‌ను కూడా వృథాం చేశాం. అసభ్యంగా మాట్లాడేవాడు అయితే ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. అతడు నన్ను మోసం చేయలేదు, నేను తనని మోసం చేయలేదు. కాకపోతే మా బంధం ప్రేమానురాగాలతో కాకుండా రాగద్వేషాలతోనే సాగింది. అసలు మేమిద్దరం ఎందుకు కలిసున్నామో కూడా అర్థం కావడం లేదు. బషీర్ నోటికొచ్చింది మాట్లాడేవాడు. అసభ్య పదజాలంతో దూషించేవాడు. నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నించాడు. అప్పుడు నేనూ ఎదురుతిరిగాను' అని చెప్పుకొచ్చింది నిఖిత. నలుగురితో లవ్వాయణం కాగా నిఖిత.. స్ప్లిట్స్‌విల్లా 13వ సీజన్లో పాల్గొన్నప్పుడు సామర్థ్య గుప్తాతో ప్రేమలో పడింది. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం సాగలేదు. ఆ తర్వాత నటుడు బషీర్ అలీని ప్రేమించింది. ఏడాది తిరిగేలోపే ఈ ప్రేమబంధం కూడా ముక్కలైంది. ఆ తర్వాత ఈ మోడల్.. టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఇందులో తనకు జోడీగా వచ్చిన ప్రియుడు తాన్యేతో కొంతకాలం పాటు డేటింగ్ చేసి అదే షోలో బ్రేకప్ చెప్పేసింది. అదే షోలో హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండవ సీజన్ కంటెస్టెంట్ జద్ హదీద్‌తో లవ్‌లో పడ్డట్లు పేర్కొంది. చదవండి: టాలీవుడ్లో ఒక్క సినిమా లేదు.. బుట్టబొమ్మకు లక్కీ ఛాన్స్! -
Huma Qureshi: అయిదు పడవల ప్రయాణం
రెండు పడవల మీద ప్రయాణం చాలామందికి కష్టమేమోగానీ కొద్దిమందికి మాత్రం చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, హీరోయిన్, ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న హుమా ఖురేషి ‘జేబా: యాన్ యాక్సిడెంటల్ సూపర్‌హీరో’ పుస్తకంతో రైటర్‌గా మారింది. రైటర్‌గా తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రపంచాన్ని కాపాడిన మహిళ కథ ఇది. సామాజిక కట్టుబాట్లకు అతీతంగా అన్ని వర్గాల వారికోసం రాసిన పుస్తకం’ అంటుంది ఖురేషి. నవరసాలలో హాస్యరసం తనకు కష్టం అంటుంది ఖురేషి. ‘నేను రాసిన హ్యూమర్ నాకు విపరీతంగా నవ్వు తెప్పించవచ్చు. ఇతరులు అసలే నవ్వకపోవచ్చు. అందుకే హ్యూమర్ రాయడం చాలా కష్టం’ అంటుంది ఖురేషి. ఈ పుస్తకంలో కథానాయిక ‘జేబా’తో పాటు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు తనకు ఇష్టమే అని చెబుతున్న హుమా ఖురేషి రైటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.