సోషల్ మీడియాకు వాడుతున్న యూజర్ల సంఖ్య పెరగడంతో కొందరు తమ ఫోటోలను, వీడియోలను నెట్టింట పోస్ట్ చేయడం అందులో కొన్ని వైరల్‌గా మారి హల్‌చల్ చేయడం షరా మామూలే. అయితే కొన్ని మాత్రం నెటిజన్లకు విపరీతంగా నచ్చడంతో అందులోని వారు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది తమ పైత్యాన్ని సోషల్‌మీడియాలో కూడా చూపెడుతూ నెటిజన్ల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా యూఎస్‌లోని ఫ్లోరిడాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓ అమ్మాయి తండ్రి కొద్దిరోజుల క్రితం మరణించాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శవపేటికలో పెట్టి శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంతలో ఆ యువతి తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా ఓ ఫొటోలో తన బాధను పక్కన పెట్టి చిరునవ్వు కూడా చిందించింది. తరువాత వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు.. తండ్రి శవం పక్కన ఆ ఫొటోలకు ఫోజులు ఏంటని మండిపడుతున్నారు. దీంతో వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది ఆ యువతి. కానీ.. తను ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడానికి ముందే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Have I mentioned the problem of a narcissistic and performative culture https://t.co/l7U7ZqdQKO— Tom Nichols (@RadioFreeTom) October 27, 2021
Comments
Please login to add a commentAdd a comment