funeral program
-
బుద్ధదేవ్‌కు అంతిమ వీడ్కోలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్యకు సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం వీడ్కోలు పలికారు. కోల్‌కతాలో సీపీఎం ప్రధాన కార్యాలయంలో బుద్ధదేవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. అంతిమయాత్రలో పారీ్టలకు అతీతంగా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. లాల్ సలామ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. సాయంత్రం బుద్ధదేవ్ పారి్థవ దేహాన్ని ఆయన కోరిక ప్రకారమే ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం తన ఇంట్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
అన్సారీ అంత్యక్రియలు పూర్తి
లక్నో: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు శనివారం యూపీలోని గాజీపూర్‌లో ముగిశాయి. వేలాది మంది అన్సారీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. కొందరు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్యక అఖౌరీ మధ్య ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
Russia: ఆంక్షల మధ్య నవాల్నీ అంత్యక్రియలు
మాస్కో: రష్యా విపక్ష నేత అలెక్సీ నవాల్నీ అంత్యక్రియలు శుక్రవారం ఆంక్షల నడుమ ముగిశాయి. జైల్లో అనుమానాస్పద రీతిలో మరణించిన ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు పుతిన్ సర్కారు ఒక పట్టాన అంగీకరించని విషయం తెలిసిందే. అనంతరం సర్కారు భయంతో అంత్యక్రియ నిర్వహణకు చర్చిలు కూడా వెనకడుగు వేశాయి. ఎట్టకేలకు మాస్కోలోని ఓ చర్చి ఒప్పుకున్నా శ్మశానవాటికకు పార్థివదేహాన్ని తరలించేందుకు వాహనం దొరకడమూ గగనమే అయింది. మృతదేహాన్ని తరలించేందుకు ముందుకొచ్చిన వారికి బెదిరింపులు వచ్చినట్టు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్ చెప్పారు. చివరకు మాస్కో పరిధిలోని మేరినో జిల్లా బోరిసోవస్కోయీ శ్మశానవాటికలో నవాల్నీ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. జనం గుమికూడొద్దన్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరుచేస్తూ వేలాదిగా వేలాదిగా మద్దతుదారులు, ఉద్యమకారులు, అభిమానులు హాజరయ్యారు. మృతదేహాన్ని ఉంచిన మదర్ ఆఫ్ గాడ్ సూథీ మై సారోస్ చర్చిలో వేలాదిగా నివాళులర్పించారు. నవాల్నీ నవాల్నీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అమెరికా, ఫ్రాన్స్ రాయబారులు తదితరులు పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. అంత్యక్రియల్లో ఆంక్షలు అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవని ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. -
పోలీసు లాంఛనాలతో స్వామినాథన్ అంత్యక్రియలు
సాక్షి, చెన్నై: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పారి్థవ దేహానికి శనివారం చెన్నైలో తమిళనాడు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వయో సంబంధ ఆరోగ్య సమస్యలతో స్వామినాథన్ (98) చెన్నైలో గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి తరమణిలోని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్‌కు భౌతిక కాయాన్ని తరలించారు. శనివారం ఉదయం 11 గంటలకు తరమణి నుంచి ప్రత్యేక వాహనంలో పారి్థవదేహాన్ని బీసెంట్ నగర్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపిన అనంతరం స్వామినాథన్ పారి్థవ దేహాన్ని విద్యుత్ శ్మశాన వాటికలో దహనం చేశారు. -
Colonel Manpreet Singh Funeral: జై హింద్ పాపా!
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...! చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్‌తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే. గుండెలవిసేలా రోదించిన భార్య మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు. మూడో తరం సైనిక వీరుడు మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది! -
ఛత్తీస్‌గఢ్ అమరులకు ఘన నివాళులు
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో బుధవారం మావోయిస్టుల మందుపాతర పేల్చిన ఘటనలో అమరులైన 10 మంది పోలీసు సిబ్బంది, ఒక డ్రైవర్‌కు ఘనంగా నివాళులర్పించారు. కర్లి ప్రాంతంలోని పోలీస్‌లైన్స్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం రోదనలు, భారత్ మాతా కీ జై నినాదాలతో ప్రతిధ్వనించింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తదితరులు హాజరై మృతులకు పూలతో నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను బఘేల్ ఓదార్చారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను వాహనాల్లో సొంతూళ్లకు తరలించారు. సీఎం బఘేల్ కూడా భుజం కలిపి ఒక జవాను మృతదేహాన్ని వాహనం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలు వృథా కావని, మావోయిస్టులపై పోరు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. దంతెవాడ జిల్లా అరన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసుల వాహనాన్ని నక్సల్స్ మందుపాతరతో పేల్చిన ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్జీ) విభాగానికి చెందిన 10 మంది జవాన్లు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. శవపేటికను మోస్తున్న సీఎం బఘేల్ -
అశ్రునయనాల మధ్య ముగిసిన జయలక్ష్మి అంత్యక్రియలు
దివంగత దర్శకుడు కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. విశ్వనాథ్ రెండో కొడుకు రవీంద్ర నాథ్ జయలక్ష్మీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట స్మశాన వాటిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కె.విశ్వనాథ్‌తో 75 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు జయలక్ష్మి. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె తీవ్ర మనో వేదనకు గురై, ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడం గమనార్హం. -
HYD: ఆగిపోయిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న అంత్యక్రియల సందర్భంగా స్మశానవాటిక వద్ద ఆయన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరపాలని డిమాండ్ చేశారు. వివరాల ప్రకారం.. సాయన్న అంత్యక్రియలు సోమవారం మారేడుపల్లిలోని హిందు స్మశానవాటికలో జరగాల్సి ఉంది. అయితే, సాయన్న అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో జరపకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాద్ యాదవ్, మల్లారెడ్డి స్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. దీంతో, సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇక, సాయన్న అంత్యక్రియల అంశంపై పద్మారావు గౌడ్.. రంగంలోకి దిగి అనుచరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున, కానీ..
తెలుగువారి సత్యభామగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన జమున (86) ఇకలేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 7.30 ని‘‘లకు తుదిశ్వాస విడిచారామె. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ హైదరాబాద్ చేరడానికి ఆలస్యం కావడంతో కుమార్తె స్రవంతి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పాణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించారు జమున. తండ్రికి గుంటూరులో పొగాకు, పసుపు వ్యాపారాలుండేవి. శ్రీనివాసరావు వ్యాపార రీత్యా జమున బాల్యమంతా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో గడిచింది. చక్కని సంగీత విద్వాంసురాలు అయిన కౌసల్యాదేవి జమునకి శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. దుగ్గిరాల గ్రామస్తులు వేసిన ‘ఛలో ఢిల్లీ’ నాటకంలో తొలిసారి వసుంధర అనే పాత్ర వేశారు జమున. ఆ తర్వాత ‘మా భూమి, ఖిల్జీ రాజ్యపతనం..’ ఇలా పలు నాటకాలు వేశారు జమున. దుగ్గిరాలకు చెందిన శ్రీమన్నారాయణమూర్తి అనే నటుడు జమున గురించి నిర్మాత బీవీ రామానందంకు (‘వరూధిని’ సినిమా తీశారు) చెప్పారు. దీంతో ఆయన నిర్మిస్తున్న తర్వాతి చిత్రం ‘జై వీర భేతాళ’(1952 మార్చిలో స్టార్ట్ అయింది) అనే సినిమాలో హీరోయిన్గా జమునకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో గుమ్మడి హీరోగా ఎంపికయ్యారు. అయితే ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ (1953) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు జమున. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య వంటి అగ్రహీరోల సరసన కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించి భేష్ అనిపించుకున్నారామె. దాదాపు 200 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో జమున నటించినా బాగా పేరు తెచ్చినవాటిలో సత్యభామ పాత్రని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో ఆమెను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం అన్నట్టుగా జీవించారు జమున. ‘సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్, భాగ్యరేఖ, గుండమ్మకథ’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమున. ‘తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారామె. లెక్చరర్‌తో పెళ్లి... హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోని వారిని కాకుండా ఇతర రంగంలోని వారిని వివాహం చేసుకోవడం నటి పద్మినీతో ఆరంభమైంది. అలా వివాహం చేసుకున్న రెండో హీరోయిన్ జమున. దూరపు బంధువైన రమణారావుతో 1965లో జమున వివాహం తిరుపతిలో జరిగింది. రమణారావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ, జువాలజీ లెక్చరర్‌గా చేసేవారు. డాక్టరేట్ అందుకున్న తర్వాత ఉస్మానియా విశ్వ విద్యాలయానికి బదిలీ అయ్యారాయన.. దీంతో కాపురాన్ని హైదరాబాద్‌కి మార్చారు. జమున కూడా మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. 1976లో బంజారాహిల్స్‌లో సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారామె. రమణారావు–జమునలకు వంశీకృష్ణ, స్రవంతి సంతానం. తొలి సంతానం వంశీకృష్ణ పుట్టిన తర్వాత కూడా పదేళ్లపాటు హీరోయిన్గా బిజీగానే కొనసాగారు జమున. వంశీకృష్ణ శాన్ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. బర్కిలీలోని స్టెయిన్డ్ గ్లాస్ గార్డెన్లో గ్లాస్ పెయింటింగ్‌లో శిక్షణ పొంది, అదే రంగంలో స్రవంతి స్థిరపడ్డారు. స్రవంతిని హీరోయిన్ చేయాలనుకున్నారు జమున. అయితే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారామె. కాగా ఓ నవల ఆధారంగా సినిమా తీయాలని, దానికి తనే దర్శకత్వం వహించాలని సంకల్పించారు జమున. నాలుగు పాటలు రికార్డు చేసిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. అయితే దర్శకత్వంపై తనకున్న మమకారంతో ‘డాక్టర్ మమత’ అనే సీరియల్‌ని తెరకెక్కించారామె. దూరదర్శన్‌లో 15 ఎపిసోడ్స్‌గా ఆ సీరియల్ ప్రసారం అయింది కూడా! రాజకీయ రంగంలో... 1980లలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు జమున. పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికై 1983లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేశారామె. తర్వాత రాజీవ్ గాంధీ సపోర్ట్‌తో 1989లో రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు జమున. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొన్నాళ్లు చేసిన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యవహార శైలి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు.. 1990వ దశకంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పర్యటించి, పదివేల మంది కళాకారుల వివరాలు సేకరించారామె. అంతేకాదు.. ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’కు 26 శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు, పెన్షన్లు మంజూరు చేయించి పెద్ద మనసు చాటుకున్నారు జమున. అవార్డులు... 1964లో విడుదలైన ‘మూగమనసులు’ (తెలుగు), 1968లో రిలీజైన ‘మిలన్’ (హిందీ) చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 2008లో ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ అందుకున్నారామె. అలాగే 2021 సంవత్సరానికిగాను ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు జమున. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో అద్వితీయమైన పాత్రలు చేసిన జమునకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే‘పద్మ’ పురస్కారం వరించలేదు. అయినా అవార్డులకు అతీతంగా ‘సత్యభామ’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ అద్భుత నటి చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. కూతురే కుమారుడై... 2014 నవంబరు 10న జమున భర్త రమణారావు గుండెపోటుతో మృతి చెందారు. అప్పటినుంచి కుమార్తె స్రవంతి దగ్గరే ఉంటున్నారు జమున. తల్లికి అన్నీ తానయ్యారు స్రవంతి. శుక్రవారం ఉదయం జమున మరణించగా, మధ్యాహ్నం ఆమె పార్థివ∙దేహాన్ని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ సాయంత్రం 4.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి జమున అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరింది. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ నేడు (శనివారం) హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో అన్నీ తానై అశ్రునయనాల మధ్య తల్లికి స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజాతోపాటు పలువురు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు. గాయం చేసిన లేత మనసులు... ‘లేత మనసులు’ సినిమా తమిళ వెర్షన్ చేస్తుండగా జరిగిన ఓ ప్రమాదం వల్ల జమున మెడ బాగా దెబ్బతింది. ‘అందాల ఓ చిలుకా..’ పాట తమిళంలో తీస్తున్నారు. హీరో గడ్డిమేట మీద నుంచి జారుకుంటూ వచ్చి జమున పక్కన చేరాలి. అయితే కొత్తవాడైన ఆ చిత్ర హీరో జయశంకర్.. సీనియర్ హీరోయిన్ జమునతో చేస్తున్నాననే కంగారుతో అడ్డదిడ్డంగా వచ్చి జమున తలపై పడ్డారు.. దీంతో ఆమె మెడ విరిగినంత పనయింది. షూటింగ్ నిలిచిపోయింది. సున్నితమైన మెడ నరాలు దెబ్బతినడంతో కొన్నాళ్లు చికిత్స తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు జమున. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.. దీంతో ఆమె మెడ ఎక్కువగా ఊగిపోయేది. ‘రాజపుత్ర రహస్యం’ సినిమాలో ఈ ఇబ్బంది ఆమెలో బాగా కనిపించేది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా తల ఊగడం తగ్గలేదు. 1978లో విడుదలైన ‘శ్రీరామ పట్టాభిషేకం’ తర్వాత సినిమాల నుంచి గౌరవంగా తప్పుకున్నారు జమున. ఆ తర్వాత ‘బంగారు కొడుకు’(1982), ‘జల్సా రాయుడు’(1983), ‘రాజకీయ చదరంగం’(1989) వంచి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు చేశారు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ 2021 జనవరి 29న విడుదలైంది. నటి జమునతో తన అనుబంధాన్ని ‘సాక్షి’తో నటి కాంచన ప్రత్యేకంగా పంచుకున్నారు. నన్ను ఏడిపించేశావ్ కాంచీ అన్నారు – కాంచన ► వారానికి మూడు నాలుగు సార్లు జమున అక్క, నేను మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈ నెల నాకు తీరిక లేకపోవడం, అక్క కూడా ఫోన్ చేయకపోవడంతో మాట్లాడుకోలేదు. మామూలుగా ఫోన్ చేసి, అప్పటి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. ‘భోజనం చేశావా.. వంట ఏంటి?’.. ఇవన్నీ కూడా చెప్పుకునేవాళ్లం. ► జమున అక్క నా సీనియర్. నేను కాలేజీ డేస్ నుంచే సీనియర్లతో జూనియర్లు మాట్లాడకూడదా అనుకునేదాన్ని. ఆ ఫీలింగ్‌తో సీనియర్లతో కూడా బాగా మాట్లాడేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక కూడా అంతే. పైగా మేం చిన్నవాళ్లం అనే ఫీలింగ్ ఏమీ పెట్టుకోకుండా జమునక్క, సావిత్రక్క బాగా మాట్లాడేవారు. ► ఇక దసరా వచ్చిందంటే చాలు... బొమ్మల కొలువు సందడి ఉండేది. ఒకరింటికి ఒకరు వెళ్లడం.. సుండల్ (శెనగలు) తినడం... అంతా బాగుండేది. పైగా జమున అక్క భలే డ్రెస్ చేసుకునేవారు. ఆవిడకు బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. నా డ్రెస్సింగ్ డిఫరెంట్‌గా ఉండేది. సింపుల్‌గా రెడీ అయ్యేదాన్ని. బాగున్నావని మెచ్చుకునేవారు. ► అట్లతద్దిని అయితే ఎప్పటికీ మరచిపోలేను. అప్పట్లో అందరం మదరాసు (చెన్నై)లో ఉండేవాళ్లం కదా. అట్లతద్ది నాడు ఒకళ్లు అట్లు వేసేవాళ్లం. ఇంకొకరు చట్నీ చేసేవాళ్లం. ఇంకొకరు పులుసు.. జమున అక్క, నేను అందరం మెరీనా బీచ్‌కి వెళ్లిపోయేవాళ్లం. అక్కడ ఉయ్యాల కుదరదు కదా. పరుగు పందేలు పెట్టుకుని, చాలా హ్యాపీగా గడిపేవాళ్లం. ► ఆ మధ్య ఒకసారి జమున అక్క ఫోన్ చేసి, ‘నన్ను ఇవాళ బాగా ఏడిపించేశావ్..’ అంటే, నాకేం అర్థం కాలేదు. ‘నేనేం ఏడిపించాను అక్కా...’ అంటే... నువ్వు యాక్ట్ చేసిన ‘కల్యాణ మంటపం’ సినిమా చూశాను. ‘ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశావ్. ఎమోషనల్ సీన్స్‌లో ఏడిపించావ్’ అంటే నాకు పట్టరానంత ఆనందం కలిగింది. ► జమునక్క యాక్ట్ చేసినవాటిలో నాకు ‘మూగ మనసులు’ చాలా ఇష్టం. ఇక ‘మిస్సమ్మ’లో ‘బృందావనమది అందరిదీ..’ పాటకి ఎంతో నాజూకుగా డ్యాన్స్ చేసింది. మనకు ఏమీ తెలియనప్పుడు టీచర్ చెప్పింది చెప్పినట్లు చేస్తాం... ఆ సినిమాలో డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్‌గా టీచర్ చెప్పింది చెప్పినట్లు చేసే క్యారెక్టర్ని అక్క అద్భుతంగా చేసింది. ► మేం కలిసి నాటకాలు కూడా వేసేవాళ్లం. ముఖ్యంగా ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకం చాలాసార్లు వేశాం. అందరూ ఆడవాళ్లే నటించాలన్నది అక్క ఆశ. అలానే ఆడవాళ్లందరం కలిసి నటించాం. సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. నాటకంలో ఆ పాత్ర నాది. సత్యభామగా జమున అక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది కృష్ణుడిగా నా నటనను మెచ్చుకునేది. ► మేమంతా సత్య సాయిబాబా భక్తులం. జీవితం అనేది పోరాటం. ఈ పోరాటంలో గెలిచి నిలబడటం చాలా కష్టమైన విషయం. జమున అక్క నిలబడింది. ఈ గెలుపు కన్నా కూడా బతికున్నంతవరకూ పోరాటం చేసే మనిషి పోయేటప్పుడు ప్రశాంతంగా పోవడమనేది ముఖ్యం. ఆ ప్రశాంతత అక్కకు దక్కింది. ‘దేవుడా.. ఆస్పత్రిపాలు కాకుండా ప్రశాంతంగా తీసుకెళ్లు’ అని కోరుకుంటాం. ఆ సత్య సాయిబాబా ఆశీస్సులతో అక్క ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్లిపోయింది. ఆ జీవుడు చివరి నిమిషంలో ఎలాంటి బాధ పడకుండా నిష్క్రమించింది. ప్రశాంతమైన మనిషికి ప్రశాంతమైన నిష్క్రమణ దక్కింది. ఇది కదా కావాల్సింది (గద్గద కంఠంతో..) పేరు మారిందిలా... జమున పేరు వెనక ఓ విశేషం ఉంది. ఆమె తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేస్తూ, పండరీపురంలోని పాండురంగని దర్శనం చేసుకున్న తర్వాతే కౌసల్య కడుపులో పడ్డారట జమున. ఈ కారణం చేత ‘జనాబాయి’ అని పేరు పెట్టుకోవాలనుకున్నారు జమున తల్లిదండ్రులు. కానీ జన్మరాశి ప్రకారం ఏదైనా నది పేరు రావాలని పెద్దలు చెప్పడంతో ‘జ’కి ‘న’కు మధ్యలో ‘ము’ అక్షరాన్ని చేర్చి ‘జనాబాయి’ పేరును ‘జమున’గా మార్చారు. ఉత్తరాదిలో ‘యుమున’ నదిని ‘జమున’ అంటారు. ‘ఇంత నాజుకైన పేరు పెట్టి సినిమారంగం కోసం మళ్లీ పేరు మార్చుకునే అవసరం లేకుండా చేసిన మా అమ్మను నిజంగా అభినందించాల్సిందే’ అని పలు సందర్భాల్లో జమున గుర్తుచేసుకుని హ్యాపీ ఫీలయ్యేవారు. సావిత్రితో ప్రత్యేక అనుబంధం ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘గుండమ్మకథ’ వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సావిత్రి, జమునల మధ్య మంచి అనుబంధం ఉంది. అక్కాచెల్లెళ్లుగా అన్ని విషయాలను అరమరికలు లేకుండా చర్చించుకునేవారు. అయితే కొందరు వ్యక్తులు కావాలని వీరిద్దరి మధ్యలో తగువులు పెట్టడంతో ఏడాది పాటు సావిత్రి, జమున మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి మునుపటిలానే ఉండసాగారు. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు.. తన కొడుకు బారసాల వేడుకకు సావిత్రి వచ్చారని, ఆ సమయంలో ఆమె (సావిత్రి) జీవితం సజావుగా సాగనందుకు చాలా బాధపడి ఏడ్చారని, అప్పుడు తానే సావిత్రిని ఓదార్చినట్లుగా కూడా జమున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే ఒకానొక స్థితిలో సావిత్రి పరిస్థితిని చూసి తనకు చాలా బాధకలిగిందని కూడా జమున పేర్కొన్నారు. నటన–డైరెక్షన్–మ్యూజిక్: జమున! చిన్నతనం నుంచే జమునకు కళల పట్ల మక్కువ ఎక్కువ. అందుకే తొమ్మిదేళ్లు వచ్చేలోపే నాటకాల్లో నటించారు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో తిరునగరి రామాంజనేయులు, బుర్రకథ పితామహుడు నాజర్ తదితరుల నాయకత్వంలో ‘మా భూమి’, ‘ముందడుగు’ ‘దిల్లీ’, ‘ఛలో’, ‘విందు’ వంటి నాటకాల్లో నటించారు జమున. ముఖ్యంగా ‘మా భూమి’ నాటికలోని జమున నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరో విశేషం ఏంటంటే... ‘విందు’ అనే నాటికలో యశోదగా నటించడమే కాదు.. ఆ నాటికకు దర్శకత్వం వహించడంతో పాటు, మ్యూజిక్‌ను కూడా కంపోజ్ చేశారట జమున. ఇలా నటనలో ఎదగడానికి సరిపడా ఓనమాలు నేర్చుకున్నది నాటక రంగం నుంచేనని చెబుతారు జమున. ఆ తర్వాత ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకంతో జమున పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చి, తొలి సినిమా ‘పుట్టిల్లు’లో అవకాశం వచ్చేలా చేసింది. ఎస్వీరంగారావు సలహా సినిమా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్న సమయంలో ఓ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారట జమున. కానీ ఓ సందర్భంలో అప్పటి సీనియర్ నటులు ఎస్వీ రంగారావు జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పి, అన్నీ ఆలోచించుకుని ముందడుగు వేయాలన్నట్లుగా హితబోధ చేశారట. దీంతో అప్పటి ఆ హీరోతో వివాహాన్ని వద్దనుకున్నారట జమున. ఆ తర్వాత రమణారావును పెళ్లి చేసుకున్నారు జమున. తల్లి స్ఫూర్తితో... ఇండస్ట్రీలో జమున చాలా ధైర్యంగా, ఆత్మాభిమానంతో ఉండేవారు. ఈ లక్షణాలతో పాటుగా ఆత్మవిశ్వాసం, వ్యక్తితాన్ని నిలబెట్టుకోవడం వంటి వాటిని తన తల్లి కౌసల్యాదేవి నుంచే అలవరచుకున్నారట జమున. విశేషం ఏంటంటే.. జమున తల్లి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రెండు రోజులు జైల్లోనే ఉన్నారట. ప్రముఖుల నివాళి జమున మృతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. 70ఏళ్ల నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆమె చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. జమున కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటి తరం నటీమణుల్లో అగ్రనాయికగా వెలుగొందిన సీనియర్ నటి జమున తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆమె మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. నటి జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. తొలి తరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళా సేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ హీరోయిన్ జమునగారు స్వర్గస్తులయ్యారనే వార్త విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్రవేశారు. మహానటి సావిత్రిగారితో జమునగారి అనుబంధం ఎంతో గొప్పది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – చిరంజీవి అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమునగారు. చిన్ననాటి నుంచే నాటకాల అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారామె. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమునగారు. – బాలకృష్ణ జమునగారు మహానటి. ఆవిడతో కలిసి నేను ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఆ మహానటి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు సన్నిహితురాలు. మేం కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేవారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – మంచు మోహన్‌బాబు భారతీయ సినీ పరిశ్రమకు జమునగారి మరణం తీరని లోటు. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక మహానటి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేశన్.. వంటి ఎంతోమంది మహానటులతో నటించి మెప్పించారామె. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని పోరాడారు. జమునగారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించాలని కోరుతున్నాను. – ఆర్. నారాయణమూర్తి జమునగారు దివంగతులు కావడం బాధాకరం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారామె. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన జమునగారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారామె. ఠీవి, గడుసు పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు. – పవన్ కల్యాణ్ జమునగారి మరణవార్త విని తీవ్రంగా కలత చెందాను. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు, పోషించిన వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – మహేశ్‌బాబు దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిగా కొనసాగారు జమునగారు. ‘గుండమ్మకథ’, ‘మిస్సమ్మ’లాంటి ఎన్నో మరపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. – ఎన్టీఆర్ జమునగారి మరణవార్త విని నా హృదయం ముక్కలైంది. క్లాసికల్ తెలుగు సినిమాకు ఆమె సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. – అల్లు అర్జున్ జమునగారు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ‘మూగమనసులు’ సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమాలతోపాటుగా రాజకీయాల్లోనూ ముందున్నారామె. జమునగారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఉంటే బాగుండేది. – అలీ -
ముందుకు సాగడమే జీవితం.. సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని..
కిన్నెర నాగ చంద్రికాదేవి పుట్టింది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం (కడప జిల్లా). పెరిగింది కడప జిల్లా ఎర్రగుంట్లలో. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన నాగచంద్రాదేవికి పదో తరగతితోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. అలాగే రెండు వందల తులాల బంగారంతో మొదలైన ఆమె జీవితంలో కాలంతోపాటు బంగారం కరిగిపోవడమూ ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, సమాజ సేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుందని కూడా ఊహించని సంఘటనలే. అలాగే సోదరులున్నప్పటికీ తల్లిదండ్రుల దహన సంస్కారాలు తన చేతులతో చేయాల్సి వస్తుందని కూడా ఊహించని పరిణామమే. అలాగే తన హోమ్‌లో కాలధర్మం చెందిన ఆరు వందల మందికి స్వయంగా అంత్యక్రియలు చేయడం కూడా ఊహించని సంఘటనలే. తన సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారామె. ‘జీవితం అంటేనే గమ్యం ఏమిటో తెలియకనే మొదలు పెట్టే ప్రయాణం. ఊహకందని మలుపులతో సాగే ఈ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లుంటాయి, గతుకులుంటాయి, వాహనం మొరాయిస్తుంది, మరమ్మతులు చేసి ముందుకు సాగబోతే ఇంధనం నిండుకోనూవచ్చు. ఇన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది. వృద్ధుల సేవలో నా జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారామె. నైరాశ్యం– నేను– నా బిడ్డ ‘‘మా నాన్న మెడికల్ ఆఫీసర్. అమ్మానాన్నలకు తొలి సంతానం నేను. నన్ను మా మేనత్తకు దత్తత ఇచ్చారు. అత్త, మామ ఇద్దరూ హైస్కూల్ టీచర్లు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ టెన్త్ క్లాస్‌తోనే పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కాలేజ్‌కెళ్లే అవకాశం ఉండింది. ఇంటర్ తర్వాత విద్యుత్‌సౌధలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. ఈ లోపు బాబుకి తల్లి కావడం... బిడ్డనెత్తుకుని ఇంటి నుంచి బయటపడడం వరకు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిన్నవయసుకే పూర్తయిపోయాయి.. ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే నాలుగ్గోడల మధ్య నేను, నా కొడుకు. నైరాశ్యం ఆవరించినట్లయ్యేది. దాని నుంచి బయటపడడానికి వేసిన ఒక్కో అడుగూ నన్ను ఇవాళ ఇలా సేవకు ప్రతీకగా నిలబెట్టాయి. నా పనిని గుర్తించి అవార్డులు వరించాయి. నన్ను అంటిపెట్టుకుని నేడో రేపో అన్నట్లు కళ్లలో ప్రాణాలు నిలుపుకుని రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను కనిపించగానే వాళ్ల కళ్లలో కనిపించే వెలుగు నన్ను నడిపిస్తోంది. ఒకరికి ఒకరు తోడు మగవాడి మోసానికి గురయి ఒంటరైన మహిళలకు నా ఇంట్లో ఉంచుకుని వాళ్లు ఏదో ఒక పని నేర్చుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు ఆసరా ఇస్తూ వచ్చాను. అలాగే ఏ దిక్కూలేని వృద్ధులను ఇంటికి తీసుకురావడం కూడా. ఏ బంధుత్వం లేని వాళ్లను అలా ఇంట్లో ఉంచుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని తెలిసి 2003లో మా ఇంటి పేరుతోనే కిన్నెర ఫౌండేషన్ స్థాపించాను. అక్కడి నుంచి నా సర్వీస్ విస్తరణ కూడా మొదలైంది. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు వీథుల్లో ఉంటే వారిని సమీకరించి కౌన్సెలింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉండేవారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల్లా అనిపించేవారు. సామాజిక చైతన్యం మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ప్రభుత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో షీ టీమ్‌తో కలిసి పని చేశాను. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట దగ్గర జప్తేసద్గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లోరోసిస్ బాధితులకు మంచి నీటి ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయగలిగాను. వృద్ధుల సేవనే ప్రధానంగా తీసుకోవడానికి కారణం మా అమ్మమ్మ, అత్త మంచం పట్టిన రోజులను దగ్గరగా చూడడమే. వాళ్ల మీద మనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల బాధను పంచుకోలేం. మనం చేయగలిగింది వారికి తోడుగా ఉంటూ భరోసా ఇవ్వడం మాత్రమే. అందుకే మా హోమ్‌లో హాస్పిస్ సేవలే ప్రధానంగా ఉంటాయి. హోమ్ నిర్వహణకు నెలకు మూడు లక్షల ఖర్చు వస్తుంది. ఒక కంపెనీ నుంచి అద్దెలో కొంత ఆర్థిక సహాయం, మరో కంపెనీ నుంచి బియ్యం నెలనెలా అందుతున్నాయి. పుట్టినరోజులు హోమ్‌లో చేసుకోవడానికి కొంతమంది వస్తారు. మిగిలిన ఖర్చుల కోసం ... ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో సంపాదించుకున్న ఇల్లు, రెండు ప్లాట్లు అమ్ముకున్నాను. బంగారం బ్యాంకులో తాకట్టు పెడుతూ విడిపిస్తూ, పెద్ద అవసరంలో అమ్ముకుంటూ అలా 30 తులాలు ఖర్చయింది. మాసాబ్ ట్యాంకులో అద్దె ఇంట్లో హోమ్ నిర్వహిస్తున్నాను. నా శక్తి తగ్గిపోతోందనే సమయం వచ్చిందని కాబోలు భగవంతుడు హోమ్ కోసం సొంత భవనాన్ని నిర్మించే మార్గం చూపించాడు. చిన్న జీయర్ స్వామి సూచనతో ముచ్చింతల్‌లో హోమ్ నిర్మాణం పూర్తయితే మా హోమ్ అక్కడికి మారుతుంది’’ అని వివరించారు నాగ చంద్రికాదేవి. సేవలోనే సాంత్వన నా సర్వీస్‌కి గుర్తింపుగా స్టేట్ అవార్డు, ఉత్తమ మహిళ అవార్డు, సేవాధార్మిక, గవర్నర్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకున్నాను.ఈ పనుల్లో నన్ను నేను ఎంగేజ్ చేసుకున్నాను. ఈ సేవలో నాకు సాంత్వన లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీలో గుణదలలో పోస్టింగ్ వచ్చింది. నేను హైదరాబాద్ వదిలి వెళ్లాలంటే హోమ్‌లో ఉన్న వాళ్ల సంరక్షణ ప్రశ్నార్థకమైంది. వాళ్లను ఎవరి మీద వదలాలి? తాత్కాలికంగా బాధ్యత అందుకోవడానికి కూడా ఏ ఆసరా లభించలేదు. దాంతో 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. – నాగ చంద్రికాదేవి, ఫౌండర్, కిన్నెర ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
Pele: తల్లి కంటే ముందుగానే వెళ్లిపోయిన పీలే.. కడసారి చూసేందుకు
Pele Funeral: ప్రపంచానికి తన సత్తా చాటిన విలా బెల్మిరా స్టేడియంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే పార్థీవదేహాన్ని ఉంచుతారు. సావోపాలో శివారులో ఉన్న ఈ స్టేడియంలో సోమవారం అభిమానులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత సాంటోస్లోని మెమోరియల్ నెక్రొపోలె ఎక్యుమెనికలో జనవరి 3న అంత్యక్రియలు పూర్తవుతాయి. కేవలం పీలే కుటుంబసభ్యులే దీనికి హాజరవుతారు. మాతృమూర్తి చూసేందుకు వీలుగా ఇక మంచానికి పరిమితమైన పీలే మాతృమూర్తి సెలెస్టె అరాంట్స్ చూసేందుకు వీలుగా ఆయన అంతిమయాత్రను పీలే ఇంటిముందు నుంచి తీసుకెళ్తారు. కాగా ఈ ఏడాది నవంబరు 20లో తల్లి 100వ పడిలో అడుగుపెట్టిన సందర్భంగా పీలే భావోద్వేగ నోట్ షేర్ చేస్తూ ఆమెకు విషెస్ తెలియజేశాడు. కానీ.. ఆమెను ఒంటరిని చేస్తూ తల్లి కంటే పీలే నిష్క్రమించడం బాధాకరం. ఇదిలా ఉంటే.. పీలే మరణం నేపథ్యంలో ఈ దిగ్గజానికి నివాళిగా బ్రెజిల్ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అవయవాలన్నీ పాడైపోయి మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్‌ను గెలిపించిన బ్రెజిలియన్ సాకర్ కింగ్ పీలే గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సావోపాలోలోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో 82 ఏళ్ల పీలే కన్నుమూశాడు. గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడిన అతను అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు. గతనెల ఆరోగ్యం విషమించడంతో అతన్ని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అవయవాలన్నీ క్రమంగా పాడైపోవడంతో అతని శరీరం చికిత్సకు స్పందించ లేదు. చివరకు గురువారం క్యాన్సర్‌తో పోరాటాన్ని విరమించి లోకాన్ని వీడాడు. పీలే అసలు పేరు ఇదే పీలే అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్ నాసిమియాంటో. పెళ్లిళ్లు 3: రోజ్మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి) సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె. చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. Rishabh Pant: తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ View this post on Instagram A post shared by Pelé (@pele) -
సాయుధ పోరాట యోధుడు జైని మల్లయ్యగుప్తా అంత్యక్రియలు పూర్తి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటవీరుడు జైని మల్లయ్యగుప్తా(97) బుధవారంరాత్రి కన్నుమూశారు. కొద్దికాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్యగుప్తా హైదరాబాద్ నాగోల్‌లోని తన కుమారుడు మధుసూదన్ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. అనంతరం భౌతికకాయాన్ని బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లోని పెద్ద కుమారుడి ఇంటికి తరలించారు. మల్లయ్యగుప్తా సతీమణి సునంద 10 ఏళ్ల క్రితమే మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన జైని మల్లయ్యగుప్తా 1945లో తెలంగాణ సాయుధపోరాటంలో కమ్యూనిస్టు నేత ఆరుట్ల రాంచంద్రారెడ్డి దళంలో పనిచేశారు. మల్లయ్య గుప్తా 1942లో క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబైకి వెళ్లారు. నిజాం రాచరిక వ్యవస్థ, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి నేతృత్వంలో సాగిన మహోద్యమంలో మల్లయ్యగుప్తా పాల్గొన్నారు. 1946 అక్టోబర్‌లో నిజాం ప్రభుత్వం మల్లయ్యతోపాటు పలువురిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించింది. అయితే 1948లో జైలు నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకొని అజ్ఞాతంలో ఉండి పోరాటం కొనసాగించారు. ఆయనను పట్టించినవారికి ఇనాం ఇస్తామని కూడా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఆ తరువాత పోరాటకాలంలో రావినారాయణ రెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి తదితరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. 1942లో భువనగిరి పురపాలక సంఘానికి మల్లయ్య గుప్తా తొలి వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. మొదటి నుంచి ఆయనకు సాహిత్యం, గ్రంథాలయోద్యమంపట్ల మక్కువ ఎక్కువ. అనేక గ్రంథాలయాల ఏర్పాటుకు ఆయన తోడ్పాటు అందించారు. పలువురు ప్రముఖుల సంతాపం జైని మల్లయ్యగుప్తా భౌతికకాయాన్ని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్, పాశం యాదగిరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, ఎస్వీ సత్యనారాయణ, సీపీఎం నేత ఎం.శ్రీనివాస్ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు అంబర్‌పేట శ్మశాన వాటికలో మల్లయ్యగుప్తా అంత్యక్రియలు నిర్వహించారు. -
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు దూరంగా ఉన్న నాగార్జున.. కారణమిదేనా?
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం యావత్తు సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. కృష్ణ ఇక లేరనే వార్త తెలియగానే పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థివదేహాన్ని చివరిసారి చూసి ఆయనకు నివాళులు అర్పించారు. వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల దగ్గర్నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అయితే నాగార్జున మాత్రం చివరి చూపుకు హాజరుకాకపోవడంపై పెద్ద చర్చే నడిచింది. కృష్ణ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న నాగార్జున.. అంత్యక్రియలకు వెళ్లవడపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ సందేహాలను ఓ సీనియర్ జర్నలిస్ట్ తెరదించారు. ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాగార్జున హాజరు కాకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గతంలో ఈవీవీ, దాసరి వంటి ప్రముఖులు కన్నుమూసినప్పుడు కూడా నాగార్జున అక్కడికి వెళ్లలేదు.సాధారణంగా మనకు దగ్గరివారిని కోల్పోయినప్పుడు కొంతమంది ఆ బాధను తట్టుకోలేరు. ఎంతో సాన్నిహిత్యం ఉన్నవారిని అలా నిర్జీవంగా చూడలేరు. అందుకే నాగార్జున కూడా పలు సందర్భాల్లో అంత్యక్రియలకు హాజరు కాకపోయినా ఆ తర్వాత వెంటనే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ కారణంగానే కృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు నాగార్జున వెళ్లి ఉండకపోవచ్చు' అంటూ పేర్కొన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని, పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశారని ప్రస్తావించారు. మంచి మిత్రుడుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా సార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Mahesh Babu-Krishna Death: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ -
ముగిసిన ఇందిరాదేవి అంత్యక్రియలు
సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో మహేష్ బాబు తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన హీరో తల్లిని కడసారి చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఇందిరాదేవి పార్థివ దేహాన్ని చూసి కృష్ణ, మహేశ్ బాబు చలించిపోయారు. ఇద్దరూ కన్నీంటి పర్యంతమయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి.. బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలోకి తరలించారు. అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారమైన హృదయాలతో... రాణికి వీడ్కోలు
లండన్: అసంఖ్యాక అభిమానుల అశ్రు నివాళుల నడుమ బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. కార్యక్రమం ఆసాంతం పూర్తి ప్రభుత్వ లాంఛనాల నడుమ సాగింది. రాచ కుటుంబీకుల అంతిమయాత్రకు ఉపయోగించే ప్రత్యేక వాహనంలో రాణి పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటలకు వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలించారు. రాజు చార్లెస్–3తో పాటు ఆయన తోబుట్టువులు, కొడుకులు, కోడళ్లు, మనవడు, మనవరాలు, ఇతర రాజకుటుంబీకులు వెంట నడిచారు. అబేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులతో పాటు 2,000 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు చివరిసారిగా నివాళులర్పించారు. నేపథ్యంలో విషాద సంగీతం వినిపిస్తుండగా గంటకు పైగా ప్రార్థనలు కొనసాగాయి. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తదితరులంతా బైబిల్ వాక్యాలు పఠించారు. ఈ సందర్భంగా రాణికి నివాళిగా బ్రిటన్వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ తదితరులు శోక సందేశం వినిపించారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేస్తానంటూ రాణి తన 21వ పుట్టినరోజున చేసిన ప్రతిజ్ఞను ఆసాంతం నిలబెట్టుకున్నారంటూ కొనియాడారు. అనంతరం ఎలిజబెత్–2 వివాహ, పట్టాభిషేక వేడుకలకు వేదికగా నిలిచిన వెస్ట్‌మినిస్టర్ అబే నుంచే ఆమె అంతిమయాత్ర మొదలైంది. చారిత్రక లండన్ వీధుల గుండా భారంగా సాగింది. ఈ సందర్భంగా ఇరువైపులా అభిమానులు అసంఖ్యాకంగా బారులు తీరారు. తమ అభిమాన రాణికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. రాణికి తుది నివాళులర్పిస్తున్నరాష్ట్రపతి ముర్ము, పలు దేశాధినేతలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై లక్షలాది మంది అంతిమయాత్రను వీక్షిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 96 ఏళ్లు జీవించిన రాణికి నివాళిగా లండన్‌లోని చారిత్రక బిగ్‌బెన్ గడియారం నిమిషానికోసారి చొప్పున 96 సార్లు మోగింది. హైడ్ పార్కులో రాయల్ గన్ సెల్యూట్ నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం రాణి పార్థివ దేహాన్ని జాతీయ గీతాలాపన నడుమ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని చారిత్రక విండ్సర్ కోటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. శవపేటికపై ఉంచిన రాజ చిహ్నాలైన కిరీటం తదితరాలను తొలగించారు. సంప్రదాయ ప్రార్థనల అనంతరం సెయింట్ జార్జి చాపెల్‌కు తరలించారు. రాజ కుటుంబీకుల సమక్షంలో రాణి తల్లిదండ్రులు, భర్త, సోదరి సమాధుల పక్కనే ఖననం చేశారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణి పవిత్రాత్మ పరలోకంలోని ప్రభువును చేరాలంటూ బైబిల్ వాక్యాల పఠనం తర్వాత మరోసారి జాతీయ గీతాలాపనతో అంత్యక్రియలు ముగిశాయి. క్వీన్ విక్టోరియా మెమొరియల్ మార్గం గుండా సాగుతున్న రాణి అంతిమయాత్ర ఇదీ చదవండి: బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం -
వెస్ట్మిన్స్టర్ హాల్లోనే రాణి శవపేటిక ఎందుకంటే..
వెస్ట్మిన్స్టర్ హాల్ తలుపులు మూసుకుపోయాయి. భారత కాలమానం ప్రకారం.. వేకువఝామున నాలుగు గంటల సమయంలో క్యూ లైన్లను అనుమతించడం ఆపేశారు. అంటే.. సుదీర్ఘకాలం యునైటెడ్ కింగ్డమ్ను పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంతిమయాత్రలో కీలక ఘట్టం ముగిసిందన్నమాట. ఇక మిగిలింది అంత్యక్రియలే.. బ్రిటన్ సార్వభౌమాధికారులకు, గత.. ప్రస్తుత రాణి కాన్సోర్ట్‌లకు ఇచ్చే గౌరవం ఇదంతా. వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. పార్లమెంటరీ ఎస్టేట్‌లో అత్యంత పురాతనమైన బిల్డింగ్ ఇది. ► అత్యంత సువిశాలమైన భవనం మాత్రమే కాదు.. మిరుమిట్లు గొలిపే డిజైన్లతో గోడలు, అద్దాలు, పైకప్పు.. ఆకర్షనీయంగా ఉంటుంది. ► గతంలో కోర్టులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను సైతం ఇందులో నిర్వహించేవాళ్లు. ► 1910లో కింగ్ ఎడ్వర్డ్-7 మరణాంతరం ఆయన భౌతికాయాన్ని వెస్ట్మిన్స్టర్ హాల్లో ప్రజాసందర్శనార్థం ఉంచారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ► ఇంతకు ముందు.. 2002, మార్చి 30వ తేదీన క్వీన్ ఎలిజబెత్(క్వీన్ ఎలిజబెత్-2 తల్లి) మరణించగా.. అంత్యక్రియలకు పదిరోజుల ముందు నుంచి వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉంచారు. ► ఇప్పుడు.. గత బుధవారం నుంచి క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాన్ని ప్రజా సందర్శనార్థం ఉంచారు. ► థేమ్స్ నది ఒడ్డున్న కిలోమీటర్ల మేర బారులు తీరి నిల్చున్నారు ఆమె అభిమానులు. రాణి గౌరవార్థం ప్రముఖులు సైతం ఒపికగా క్యూలో వచ్చారు. ► రాణి అంత్యక్రియల కార్యక్రమాన్ని బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న 125 సినిమా థియేటర్లు ప్రసారం చేయనున్నాయి. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఆమెకు నివాళులర్పించారు. ► క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాంతో ఉన్న శవపేటికను వెస్ట్మిన్స్టర్ అబేను తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► అక్కడ 2000 మంది అతిథులు(అందులో 500 మంది ప్రపంచ నేతలు) ఉంటారు. ► అబే నుంచి సెయింట్ జార్జిస్ చాపెల్ వద్ద క్రతువు కోసం రాణి శవపేటికను తరలిస్తారు. అక్కడ 800 మంది అతిథులకు స్థానం ఉంటుంది. ► కింగ్ జార్జి- మెమోరియల్ చాపెల్ వద్ద.. రాణి శవపేటికను ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి చెంతకు బ్రిటన్ రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యుల సమక్షంలో చేరుస్తారు. ► చివర్లో శవపేటిక వెంట రాజు, రాణి, రాజవంశీయులు మాత్రమే ఉంటారు. సాయంత్రం శవపేటికను.. రాయల్ వాల్ట్‌లోకి దించుతారు. అక్కడ విండ్సర్ డీన్ కీర్తన ఉంటుంది. కాంటెర్బరీ ఆర్చిబిషప్ దీవెనలు, జాతీయ గీతాలాపతో అంత్యక్రియల కార్యక్రమం లాంఛనంగా(ప్రభుత్వ) ముగుస్తుంది. అయితే.. ఆపై విండ్సర్ డీన్ ఆధ్వర్యంలో రాజవంశీయులకు మాత్రమే పరిమితమైన తుది అంత్యక్రియల ప్రక్రియతో మొత్తం కార్యక్రమం ముగుస్తుంది. రాజవంశంలో రాజు/రాణిలకు దాదాపుగా ఇదే తరహాలో అంత్యక్రియలు జరుగుతుంటాయి. -
ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అధికారిక అంత్యక్రియలు సోమవారం(19వ తేదీన) జరుగనున్నాయి. రాణి మృతదేహాన్ని లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్లో సోమవారం ఉదయం 6.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరరం.. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. ఇందులో భాగంగానే.. భారత ప్రభుత్వం తరఫున బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం లండన్ చేరుకున్నారు. President Droupadi Murmu arrives in London to attend the State Funeral of Her Majesty Queen Elizabeth II. pic.twitter.com/T6zWlJGkYB — President of India (@rashtrapatibhvn) September 17, 2022 ఇక, రాణి అంత్యక్రియల కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలారస్ దేశాల నేతలు మాత్రం హాజరు కావడం లేదు. వారికి రాజ కుటుంబం ఆహ్వానం పంపించలేదు. -
రాణి తుది వీడ్కోలు.. ఆహ్వానం లేనిది వీళ్లకే!
లండన్: రాణి ఎలిజబెత్-2 మృతదేహం లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంది. సోమవారం(19న) ఉదయం 6.30 గంటల వరకు ఉంటుందని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. అయితే.. రాణి అంత్యక్రియలకు అధికారిక ఆహ్వానం అందనిది ఎవరికో తెలుసా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు. అవును.. ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో ఆయనపై యూకే కూడా ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ విధించింది. అందుకే ఆయనకు క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు ఆహ్వానం అందించలేదు. అయితే రష్యా నుంచి ఏ ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై ఆ దేశ విదేశాంగ శాఖ నొచ్చుకుంది. ఈ చర్య అనైతికమంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక సిరియా, వెనిజులా, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్‌కు అసలు ఆహ్వానం పంపలేదు. బెలారస్, మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్‌కు ఆహ్వానం పంపించలేదు యూకే. అలాగే కొన్ని చిన్నచిన్న దేశాలనూ కూడా మినహాయించింది. నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ పాలనలోని ఉత్తరకొరియా, నికారాగువా, ఇరాన్‌ల నుంచి దౌత్యవేత్త స్థాయి వాళ్లకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేసింది. భర్త సమాధి పక్కనే.. ఇక సోమవారం జరగబోయే అంత్యక్రియల కార్యక్రమం.. బ్రిటన్ వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించడంతో ముగుస్తుంది. అనంతరం రాణి పార్ధివ దేహం ఉంచిన శవపేటికను వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు వెస్ట్‌మినిస్టర్ అబే తలుపులు తెరుస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు 500 మంది హాజరవుతారు. రాణి శవపేటికను వెస్ట్ మినిస్టర్ అబే నుంచి విండ్సర్ క్యాజిల్ సమీపంలోని సెయింట్ జార్జ్ చాపెల్ వద్ద జరిగే కార్యక్రమం కోసం తరలిస్తారు. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు రాయల్ వాల్ట్‌లోకి శవపేటికను దించుతారు. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెర్బరీ జస్టిన్ ఆశీర్వచనాల మధ్య అక్కడ చేరిన వారంతా ‘గాడ్ సేవ్ ది కింగ్’గీతాన్ని ఆలపిస్తారు. రాత్రి 7.30 గంటలకు జరిగే కార్యక్రమంలో భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. ఇదీ చదవండి: చావు నుంచి మళ్లీ పుట్టుక వైపు! -
రాణి కడసారి చూపునకు... మెగన్‌ను రానివ్వలేదు!
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్‌లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్ రావడానికి వీల్లేదని చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్‌లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్ మిడిల్టన్ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్‌కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్ లండన్‌లోనే ఉండిపోయారు. ముందునుంచీ విభేదాలే విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది. రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్ ఫిలిప్ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్‌ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది. -
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘వెళ్లే వివరాలు ఇంకా తెలియవు. కానీ నేను తప్పకుండా వెళ్తాను’ అని శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. రాణి ఎలిజబెత్ అంత్యక్రియల తేదీ ఇప్పటి వరకు నిర్ణయించలేదు. అయితే సెప్టెంబర్ 19న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఒహియోలోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బిడెన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలిజబెత్ కుమారుడు, ప్రస్తుత బ్రిటన్ కింగ్ చార్లెస్-3 తనకు తెలుసని అన్నారు. కానీ ఆయనకు ఎలాంటి కాల్ చేయలేదన్నారు. కాగా బ్రిటన్ను 70 ఏళ్లపాటు పాలించిన రాణి ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఏడు రోజుల వరకూ రాజ కుటుంబం సంతాప దినాలు పాటిస్తుందని బకింగ్‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే, అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. ఎలిజబెత్ మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. ఇక ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు. -
యాభై ఏళ్ల తర్వాత.. ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌కు అంత్యక్రియలు
లండన్: బ్రిటన్‌లో దాదాపు అర్థ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలను రాజరిక సంప్రదాయంలో కాకుండా.. ప్రభుత్వా లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1965లో మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ఈ గౌరవాన్ని పొందిన చివరి నేత. సుదీర్ఘకాలం రాణిగా పనిచేసిన క్వీన్ ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐతే ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్క్యారేజీపై క్వీన్ ఎలిజబెత్ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వెస్ట్మిన్స్టర్ అబ్బే లేదంటే సెయింట్ పాల్స్ కేథడ్రల్ వరకు ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు సందర్శనార్ధం రాణి భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంటుంది. ఆ తదనంతరం దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు. ఐతే బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 జ్ఞాపకార్థం డెత్ గన్‌సెల్యూట్ సందర్భంగా శుక్రవారం యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల్లో ఫిరంగా కాల్పలు నిర్వహించారు బ్రిటన్ అధికారులు. ఇలా ప్రతి ఏడాది 96 రౌండ్ల గన్ షాట్లతో క్విన్ ఎలిజబెత్‌కి గౌరవ వందనం ఇవ్వాలని బ్రిటన్ అధికారలు నిర్ణయించారు. ఈ మేరకు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ కోట, నార్తర్న్ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో కోట, వేల్స్‌లోని కార్డిఫ్ కోట నుంచి కాల్పులు నిర్వహించారు. (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్) -
మితిమీరిన వేగం వల్లే... మిస్త్రీ మృతి
ముంబై: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) అంత్యక్రియలు మంగళవారం ముంబైలో జరగనున్నాయి. మృతదేహానికి సోమవారం అటాప్సీ పూర్తయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఆదివారం మధ్యాహ్నం ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. వెనక సీట్లో ఉన్న మిస్త్రీ, ఆయన మిత్రుడు జహంగీర్ పండోలే అక్కడికక్కడే మరణించారు. వాళ్లిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమన్నారు. చరోటీ చెక్ పోస్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి కారు 9 నిమిషాల్లో చేరుకుందని వివరించారు. జర్మనీ నుంచి వచ్చిన బెంజ్ సంస్థ బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. -
గోర్బచెవ్కు నిరాడంబరంగా తుదివీడ్కోలు
సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ (91) మృతదేహం వద్ద విలపిస్తున్న కుమార్తె ఇరినా. అనారోగ్యంతో మంగళవారం మరణించిన గోర్బచెవ్ అంత్యక్రియలు శనివారం మాస్కోలో నిరాడంబరంగా ముగిశాయి. భార్య రైసా సమాధి పక్కనే ఆయన పార్థివ దేహాన్ని ఖననంచేశారు. అభిమాన నేతను కడసారి చూసుకునేందుకు రష్యా పౌరులు భారీగా పోటెత్తారు. అంత్యక్రియల్లో అధ్యక్షుడు పుతిన్ పాల్గొనలేదు. సోవియట్ కుప్పకూలడానికి గోర్బచెవే కారకుడనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను పాల్గొనాల్సి వస్తుందనే అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపలేదని కూడా చెబుతున్నారు. -
బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు
సుల్తాన్‌బజార్: నగరంలోని గోడేకబర్ నుంచి గోవాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదంలో మృతిచెందిన శివకుమార్, రవళి, దీక్షిత్‌ల మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం శనివారం ఉదయం 11 గంటలకు గోడేకబర్ కామటిపురాలోని వారి ఇళ్లకు చేరుకున్నాయి. దీంతో గోడేకబర్ పరిసర ప్రాంతాల్లో విషాదం అలముకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, స్థానిక కార్పొరేటర్ లాల్‌సింగ్, మాజీ కార్పొరేటర్ ముఖేష్ సింగ్‌లు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం పురానాపూల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. (చదవండి: కాన్పూర్ హింస..800 మందిపై కేసులు) -
ఓర్నీ ఇదేందయ్యా ఇది.. నివాళి సభలో ‘పోకిరీ’ పాటకు బెల్లి డ్యాన్స్‌లు
Belly Dance.. పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అంటారు కదా.. ఈ సామెతను న్యాయం చేశారు. ఒకరి చావు మరొకరికి ఆనందం అంటే ఇదేనేమో.. ఎవరైనా ఆనందంలో పెళ్లిలోనో లేక ఏదైనా పార్టీలోనే జోష్‌తో డ్యాన్స్ స్టెప్పులు వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించిన తర్వాత సంతాప సభలో బెల్లి డ్యాన్స్‌లు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. చనిపోయిన ఓ వ్యక్తికి నివాళి సభ జరుగుతోంది. మరణించిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు సభను ఏర్పాటు చేశారు. ఈ నివాళి సభకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు విచ్చేశారు. ఇంతలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యేలా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పోకిరీ(హిందీ రీమేక్) సినిమాలోని ఐటెమ్ సాంగ్‌ను ప్లే చేశారు. ఇంతవరకు బాగానే.. పాట ప్లే అయిన వెంటనే కొందరు యువతులు స్టేజ్ మీదకు వచ్చి బెల్లీ డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో సభలో ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. సంతాప సభలో ఇదేం పని రా నాయనా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కోరిక మేరకు ఇలా వైరటీగా ప్లాన్ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Meemlogy (@meemlogy) ఇది కూడా చదవండి: వైరల్ చాయ్వాలీ ప్రియాంక.. దుకాణం బంద్! కారణం ఉందండోయ్.. -
కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ స్పిన్ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు
స్పిన్ మాంత్రికుడు, క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ (మార్చి 20) వార్న్ భౌతిక దేహానికి కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తుల నడుమ ప్రైవేట్ ఫ్యునరల్ నిర్వహించారు. మెల్బోర్న్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం 80 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో వార్న్ తల్లిదండ్రులు కీత్, బ్రిగెట్, అతడి ముగ్గురు పిల్లలు, వార్న్‌కు ఆన్ ఫీల్డ్‌లో అత్యంత ఆప్తులైన గ్లెన్ మెక్‌గ్రాత్, మార్క్ వా, ఆండ్రూ సైమండ్స్, మైకేల్ క్లార్క్, మార్క్ టేలర్, ఆసీస్ మాజీ పేసర్ మెర్వ్ హ్యూస్, ఆసీస్ మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తదితరులు ఉన్నారు. Shane Warne's family and friends bid the cricketing legend farewell at a private memorial service at the St Kilda Football Club in Melbourne — ESPNcricinfo (@ESPNcricinfo) March 20, 2022 ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధ్వర్యంలో వార్న్ అంత్యక్రియలు ఈనెల 30న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమం సుమారు లక్షల మంది అభిమానుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనుంది. ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు, వార్న్‌తో అనుబంధమున్న ఆటగాళ్లు ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశముంది. వార్న్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇదివరకే ఐపీఎల్ యాజమాన్యం నుంచి అనుమతి పొందాడు. కాగా, వార్న్ తన పదిహేనేళ్ల కెరీర్లో వెయ్యికి పైగా వికెట్లు పడగొట్టాడు. ఇందులో 708 టెస్ట్ వికెట్లు, 293 వన్డే వికెట్లు ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు -
షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు
Shane Warne Funeral: ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు ఘనంగా జరపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ సాయంత్రం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య వార్న్ తుది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. There's nowhere in the world more appropriate to farewell Warnie than the 'G. Victorians will be able to pay tribute to Shane and his contribution our state, and his sport, at a memorial service at the MCG on the evening of March 30th. Info and tickets will be available soon. — Dan Andrews (@DanielAndrewsMP) March 9, 2022 ఎంసీజీతో వార్న్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించాలనుకున్నామని విక్టోరియా రాష్ట్ర సర్వోన్నతాధికారి డేనియల్ ఆండ్రూస్ బుధవారం వెల్లడించారు. వార్న్ విగ్రహం కూడా ఎంసీజీ బయటే ఉండటంతో అభిమానులంతా అక్కడే నివాళులర్పిస్తున్నారు. వార్న్ పార్ధివ దేహం థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంది. కాగా, 1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించిన వార్న్.. అండర్-19 విభాగంలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వార్న్.. తన స్పిన్ మాయాజాలంతో పదిహేనేళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాశించాడు. ఈ క్రమంలో 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి -
రమేశ్ బాబు అంతిమ సంస్కారాలకు మహేశ్ వస్తాడా?
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు(56)మృతితో టాలీవుడ్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఈ రోజు (జనవరి9) మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రమేశ్ బాబు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం కూడా ఉంచేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంత్యక్రియలు త్వరగా ముగించాలని భావిస్తున్నారు. రమేశ్ బాబు అంతిమ కార్యక్రమాలకు ఎక్కువమంది హాజరు కాకపోవడమే మంచిదని కృష్ణ ఫ్యామిలీ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. సోదరుడి కడసారి చూసేందుకు మహేశ్ బాబు వస్తాడా రాడా అనే సందేహం అందరిలో నెలకొంది. ఇటీవల మహేశ్ బాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఆయన అంతిమ కార్యక్రమాలకు హాజరుకాకపోవచ్చుననే సంకేతాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా.. మరోవైపు సోదరుడి మరణంతో మహేశ్‌బాబుకు మరింత బాధపడుతున్నారు. (చదవండి: హీరో మహేశ్ బాబు ఇంట్లో విషాదం.. రమేశ్‌బాబు కన్నుమూత) -
మరణాన్ని తట్టుకోలేకపోయింది.. కడదాకా వెంటపడింది
మనుషులకు మల్లే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. పిల్లల కోసం అల్లలాడిపోవడం, ఆపదలో అవసరమైతే పోరాడడం, యజమానుల పట్ల విశ్వాసం, ఆప్యాయత-ప్రేమల్ని ప్రదర్శించడం ఈ కోవలోకే చెందుతాయి కూడా. అయితే మృతి చెందిన తన నేస్తాన్ని పూడ్చడానికి వెళ్తుంటే.. ఆ బాధను తట్టుకోలేక ఓ పక్షి చేసిన పని నెటిజనుల హృదయాన్ని కరిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని కుచేర ప్రాంతంలో రామస్వరూప్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇంటి వద్ద రెండు నెమళ్లు సందడి చేసేవి. ఎక్కడి నుంచో వచ్చిన వాటికి రోజూ ధాన్యం గింజలు వేస్తున్నాడాయన. అలా నాలుగేళ్లు గడిచిపోయింది. అయితే అందులో ఓ నెమలి మృతి చెందింది. దీంతో ఇద్దరు వ్యక్తులను పురమాయించి ఆ నెమలిని పూడ్చమని చెప్పాడు రామస్వరూప్. నెమలి మృతదేహాన్ని పూడ్చడానికి తీసుకువెళ్లున్న క్రమంలో.. పాపం మరో నెమలి దాని వెంట పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నెమలి తన సహచర నెమలిని విడిచి ఉండలేకపోతోంది. హృదయాన్ని కదిలించే వీడియో’ అని కామెంట్ జతచేశారు. అలా పరుగులు తీసిన నెమలి.. ఖననం చేసేదాకా ఆ నెమలి అక్కడే ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఆ నెమలి పరుగులు తీసిన వీడియోను 1.26 లక్షల మంది వీక్షించారు. నెమలి వీడియో వీక్షించిన నెటిజనులు హార్ట్ టచింగ్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘మనుషుల కంటే పక్షులు, పశువులకే ప్రేమ అధికంగా ఉంటుంది!’, ‘ఆ నెమలి ఎంత బాధ అనుభవిస్తోందో.. పక్షి ప్రేమికులకు తెలుస్తుంది’, ‘దేవుడి సృష్టి చాలా గొప్పదని.. ప్రేమ, అనుబంధాలకు సంబంధించి ఆ నెమలి ఆధునిక మానవుని కళ్లు తెరిపిస్తోంది’, ‘నువ్వు లేక నేనుండలేను నేస్తం.. నువ్వు ఎక్కడికి పోతున్నావ్!’ అని నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb — Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022 -
కానరాని కొడుకులు.. అమ్మలే.. ఆ నలుగురై
సాక్షి, భువనేశ్వర్/పూరీ: కాటి వరకు భుజాన మోసుకుని వెళ్లాల్సిన కన్న కొడుకులు కానరాలేదు. తోడబుట్టిన అన్నదమ్ములు తల్లి అంతిమయాత్రకు రాకపోవడంతో నలుగురు అక్కచెల్లెళ్లు ఓ ముందడుగు వేశారు. సామాజిక ఆంక్షలు తెంచుకుని, తమ తల్లి పాడిని భుజనా ఎత్తుకున్నారు. 4 కిలోమీటర్ల దూరం మోసి, అమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. పూరీ పట్టణంలో ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానిక మంగళా ఘాట్ ప్రాంతంలో జతి(80) అనే వృద్ధురాలు కన్నుమూసింది. ఈమెకి ఇద్దరు కొడుకులు ఉన్నా ఒక్కరూ ఆమెను కడసారి చూసేందుకు రాలేదు. దీంతో ఈమె నలుగురు కుమార్తెలు కన్న తల్లి రుణం తీర్చుకున్నారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మంగళాఘాట్ నుంచి స్వర్గ ద్వార్ వరకు తల్లి మృతదేహాన్ని మోసుకుని వెళ్లి, దహన సంస్కారాలు చేయించారు. ఈ స్మశాన వాటికలో అంత్యక్రియలు స్వర్గలోక ప్రాప్తికి సోపానంగా స్థానికులు భావిస్తారు. కని, పెంచిన తల్లికి స్వర్గ లోకం ప్రాప్తించాలని ఆ నలుగురు కుమార్తెలు తమ తల్లికి కడపటి వీడ్కోలు పలికారు. -
బోయకొండ బతికొచ్చాడు.. మరి ఆ శవమెవరిది ?
భిక్షాటనకు వెళ్లిన కొడుకు ఏదో జరిగి చనిపోయాడనుకుని గుక్క పట్టి ఏడ్చారు ఆ తల్లిదండ్రులు.. యాచక వృత్తి చేసుకునే తమ వద్ద అంత్యక్రియలు జరపడానికి కూడా స్థోమత లేదనడంతో మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో శవాన్ని పూడ్చారు. అంత్యక్రియలు నిర్వహించిన ఆ పోలీసులను స్థానికులు ఘనంగా సన్మానించారు. ఇంతవరకు ఓకే.. సీన్ కట్ చేస్తే.. చనిపోయాడనుకున్న వ్యక్తి నేను బతికే ఉన్నా అని ప్రత్యక్షమయ్యాడు. దీంతో కంగారు పడడం పోలీసుల వంతు అయింది. మరి చనిపోయిందెవరా ! అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇంతకీ మ్యాటర్‌ఏంటంటే.. పలమనేరు పట్టణంలో చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళ్లాల్సిందే. సాక్షి, చిత్తూరు: తల్లిదండ్రుల సమక్షంలో ఈనెల 7న అంత్యక్రియలు నిర్వహించిన పోలీసుల సాక్షిగా మృతి చెందిన వ్యక్తి తాను బతికే ఉన్నానంటూ ఇంటికి చేరిన సంఘటన ఆదివారం పలమనేరులో సంచలనం సృష్టించింది. 15 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలో ఫిట్స్‌తో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పది రోజులుగా చికిత్స పొందుతూ ఈనెల 7న ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనాథ శవం కావడంతో వారు మున్సిపల్ అధికారుల ద్వారా అంత్యక్రియలను ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా మృతదేహాన్ని గమనించిన కొందరు గంగవరం మండలం చిన్నూరుకు చెందిన బోయకొండగా గుర్తుపట్టారు. దీంతో పోలీసులు చిన్నూరులోని బోయకొండ తల్లిదండ్రులు వెంకటరమణ, ఎల్లమ్మకు సమాచారం ఇచ్చి ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన వారు తమబిడ్డేనని యాచనకు ఎక్కడో వెళ్లి చనిపోయాడని అనుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లమంటే భిక్షాటన చేసుకునే తమకు అంత్యక్రియలు చేసేందుకు స్థోమత లేదని వాపోయారు. దీంతో పోలీసులు, స్థానిక లారీవర్కర్ యూనియన్‌తో కలసి పట్టణ సమీపంలోని వడ్డోనికుంట శ్మశానవాటికలో ఈనెల 8న అంత్యక్రియలను నిర్వహించారు. పోలీసుల సేవలపై ‘మానవత్వం చాటుకున్న పోలీసులంటూ’ జనం మెచ్చుకున్నారు. బతికే ఉన్నానంటూ వచ్చిన బోయకొండ ఇలా ఉండగా భిక్షాటనకు వెళ్లిన వెంకటరమణ కుమారుడు బోయకొండ ఆదివారం గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. తాను బయటకు వెళ్లానని కుటుంబీకులకు తెలపడంతో చనిపోయిన కొడుకు తిరిగొచ్చాడంటూ సంబరపడ్డారు. మృతిచెందిన వ్యక్తి మొహం కూడా తమ కొడుకులాగే ఉండడంతో తమ బిడ్డేననుకున్నామని చెబుతున్నారు. ఇంతకీ ఆ శవమెవరిది ? బోయకొండ బతికే ఉండడంతో తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలిస్తే గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు అయింది. వెంకటరమణ మాట నమ్మి మృతుడెవడో తెలుసుకోకుండానే తొందర పడ్డామేమోనని పోలీసులు భావిస్తున్నారు. ఇలాఉండగా కొందరు ఆదివారం సైతం మానవత్వం చూపిన పోలీసులను సన్మానించడం కొసమెరుపు. ఈ విషయమై ఆస్పత్రి ఆర్ఎంఓ శారదను వివరణ కోరగా తాము గుర్తుతెలియని వ్యక్తి గనుకే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్‌ను వివరణ కోరగా బోయకొండ బతికున్నప్పుడు మృతిచెందిన వ్యక్తి ఎవరో తెలియడం లేదన్నారు. దీనిపై విచారిస్తామన్నారు. -
AP: సాయంత్రం స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం
సాక్షి, చిత్తూరు: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వస్తామని ఆయన సోదరుడు మహేశ్‌బాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సాయతేజ భౌతికకాయం బెంగళూరుకు చేరుతుందని, అనంతరం బెంగళూరు నుంచి తమ స్వగ్రామానికి రావడానికి సాయంత్రమవుతందని పేర్కొన్నారు. దీంతో సాయితేజ అంత్యక్రియలు రేపు ఉదయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదవండి: Sai Teja: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం నేడు సాయి తేజ భౌతికకాయాన్ని ఆర్మీ బేస్ హాస్పిటల్లో ఉంచాలని అధికారులను కోరామని, దానికి అధికారులు అంగీకరించారని చెప్పారు. ఆదివారం ఉదయం 5 గంటలకు బయలుదేరి తమ స్వగ్రామనికి ఉదయం 10గంటల లోపు సాయ తేజ భౌతికకాయం చేరుతుందని తెలిపారు. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించిన విషయం తెలిసిందే. -
వీరుడా.. వీడ్కోలు
న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. రావత్ దంపతుల పార్థివ దేహాలకు ఢిల్లీలోని కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో శుక్రవారం సాయంత్రం వారి కుమార్తెలు కృతికా, తరిణి దహన సంస్కారాలు నిర్వహించారు. రావత్ దంపతుల పార్థివదేహాలను పక్కపక్కనే ఉంచి చితి పేర్చారు. మత గురువు సంస్కృత శ్లోకాలు పఠిస్తుండగా, కుమార్తెలిద్దరూ తల్లిదండ్రుల చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొంది. ప్రజలు భావోద్వేగానికి గురై కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అంతకుముందు రావత్, మధులికకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు, ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్, బ్రిటష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్‌తోపాటు పలు దేశాల రక్షణశాఖ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. రావత్‌కు సైనికులు 17 శతఘ్నులతో గన్ సెల్యూట్ సమర్పించారు. రావత్ అమర్ రహే.. తొలుత శుక్రవారం ఉదయం రావత్, మధులిక భౌతికకాయాలకు వారి అధికారిక నివాసంలో అధికారులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. నివాసం ఎదుట భారీగా జనం గుమికూడారు. భారత్ మాతా కీ జై, జనరల్ రావత్ అమర్ రహే, ఉత్తరాఖండ్ కా హీరా అమర్ రహే అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ, హరియాణా సీఎం ఖట్టర్, రాజ్యసభ సభ్యుడుఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, మత గురువులు రావత్ దంపతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు అంతిమ యాత్ర మొదలైంది. వందలాది మంది యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో త్రివిధ దళాల నుంచి 800 మంది సీనియర్ సైనికులు పాల్గొన్నారు. జవాన్ల కవాతు మధ్య అంతిమ యాత్ర 10 కిలోమీటర్ల మేర కొనసాగి, శ్మశాన వాటికకు చేరుకుంది. ఈ యాత్ర పొడవునా జనం రావత్ దంపతుల భౌతిక కాయాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంత్యక్రియలను దేశవ్యాప్తంగా లక్షలాది మంది టీవీల్లో వీక్షించారు. నేడు హరిద్వార్‌కు చితాభస్మం రావత్ దంపతుల చితాభస్మాన్ని శనివారం ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు తీసుకెళ్లనున్నట్లు వారి కుమార్తె తరిణి చెప్పారు. చితాభస్మాన్ని హరిద్వార్‌లో గంగానదిలో నిమజ్జనం చేస్తామని అన్నారు. నా భర్తను నవ్వుతూ సాగనంపాలి బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్ న్యూఢిల్లీ: ‘‘నా భర్తకు ఘనమైన వీడ్కోలు పలకాలి. నవ్వుతూ సాగనంపాలి’’ అని బ్రిగేడియర్ లఖ్వీందర్‌సింగ్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్ వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ నేలకూలిన ఘటనలో జనరల్ రావత్ దంపతులతోపాటు మృతిచెందిన బ్రిగేడియర్ లిడ్డర్ అంత్యక్రియలను శుక్రవారం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హరియాణా సీఎం ఖట్టర్‌తోపాటు సీనియర్ సైనికాధికారులు అంతకుముందు లిడ్డర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతికా లిడ్డర్ మాట్లాడుతూ.. విధులకు వెళ్లిన తన భర్త ఇలా నిర్జీవంగా తిరిగి వస్తారని ఊహించలేదని చెప్పారు. ఆయన మరణం తమ కుటుంబానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుడి భార్యనని, చెదరని నవ్వుతో తన భర్తకు వీడ్కోలు పలుకుతానన్నారు. తన తండ్రి ఒక హీరో, గొప్ప స్ఫూర్తి ప్రదాత అని లిడ్డర్ కుమార్తె ఆష్నా(17) చెప్పారు. తండ్రి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. 17 గన్ సెల్యూట్ ఎవరికి? రాష్ట్రపతి, అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల అంతిమ వీడ్కోలు సందర్భంగా 21 గన్ సెల్యూట్ సమర్పిస్తుంటారు. నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మరణిస్తే 17 గన్ సెల్యూట్ సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. భారత తొలి డీసీఎస్ జనరల్ రావత్ ర్యాంక్.. ఆర్మీ చీఫ్, వాయుసేనాధిపతి, నావికా దళాధిపతిల ర్యాంక్‌లతో సమానం. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో సమానంగా అంత్యక్రియల్లో 17 గన్ సెల్యూట్ సమర్పించారు. ‘2233 ఫీల్డ్ రెజిమెంట్’కు చెందిన 17 శతఘ్నులతో రావత్‌కు గన్ సెల్యూట్ చేయించారు. ఇతర దేశాల అధినేతలు, అతిథులు భారత్‌కు వచ్చినప్పుడు 19 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించడం ఆనవాయితీ. హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: 13 మందిని బలిగొన్న హెలికాప్టర్ దుర్ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజ్ఞప్తి చేసింది. కచ్చితమైన సమాచారం లేకుండా అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకురావొద్దని శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రమాదంవెనుక కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమంటూ కొందరు నేతలు చెబుతున్న నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాఉండగా,హెలికాప్టర్ ప్రమాదంపై ఎలాంటి అనుమానాలకు తావులేదని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు శుక్రవారం చెప్పారు. నీలగిరి ప్రాంతంలో ఎల్లప్పుడూ కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని తెలిపారు. -
వీరుడికి వీడ్కోలు....
-
కన్నీరు పెట్టిస్తోన్న సైనిక వీరుడి వీడ్కోలు దృశ్యాలు..
-
బిపిన్ రావత్ మృతి.. ‘దయచేసి ఆ ఊహాగానాలకు చెక్ పెట్టండి’
న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13మంది ప్రాణాలు కోల్పోయిన హెలికాఫ్టర్ ప్రమాదంపై వదంతులు ప్రచారం చేయొద్దని భారతీయ వాయుసేన విజ్ఞప్తిచేసింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరింది. ఘటనపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తునకు ఆదేశించామని.. దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని పేర్కొంది. విచారణను త్వరితగతిన పూర్తిచేసి.. ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తుందని ట్విట్టర్లో వెల్లడించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. అప్పటివరకూ ఎలాంటి వదంతులు వ్యాప్తిచేయవద్దని విజ్ఞప్తిచేసింది. మరణించినవారి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. బుధవారం తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో సీడీఎస్ రావత్ దంపతులు సహా 13మంది మరణించారు. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
పూర్తయిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
05:18PM బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. సీడీఎస్ రావత్‌కు 17 గన్ సెల్యూట్‌తో ఘనంగా నివాళులు అర్పించింది భారత సైన్యం. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99మంది సైనికాధికారులు.. 33 మందితో కూడిన ట్రై సర్వీస్ బ్యాండ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800మంది సేవా సిబ్బంది అంత్యక్రియాల్లో పాలుపంచుకున్నారు. శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ మిలటరీ కమాండర్లు జనరల్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. 03:30PM ►దారిపొడవునా జనరల్ రావత్‌కు జననీరాజనం 03:15PM కన్నీటి వీడ్కోలు ►సైనిక వీరుడికి తుది వీడ్కోలు పలుకుతున్న ఢిల్లీ ప్రజలు ►కొనసాగుతున్న జనరల్ బిపిన్ రావత్ అంతిమయాత్ర ►భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతున్న ఢిల్లీ 02:10PM ►మధ్యాహ్నం 2 గంటలకు రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో రావత్ దంపతులు అంత్యక్రియలు జరుగుతాయి. సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శన కోసం రావత్ దంపతుల పార్థివదేహాలను ఢిల్లీలోని కామరాజ్ మార్గ్ నివాసంలో ఉంచారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బజాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తదితరలు శుక్రవారం రావత్ ఇంటికి చేరుకుని.. దంపతులకు నివాళులర్పించారు. (చదవండి: హెలికాప్టర్ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు) చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు -
సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు
నీరాక కోసం పురిటిగడ్డ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. భరత మాత ఒడిలో ఒదిగిపోయిన తన బిడ్డను చూడాలని ఆ తల్లి కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తోంది. నేనున్నా నాన్నా.. అంటూ ధైర్యం చెప్పిన కుమారుడి రాకకోసం ఆ తండ్రి కంటి రెప్పవాల్చకపోవడం అందరి హృదయాలను బరువెక్కిస్తోంది. తన పెనిమిటిని చూడాలని వీరనారి కన్నీటిపర్యంతమవుతున్న తీరుకు ఊరంతా శోకసంద్రమవుతోంది. అందరితో కలివిడిగా ఉంటూ.. దేశసేవకు ప్రాణాలర్పించిన వీరజవాన్ ఎక్కడొస్తున్నాడోనని ఆ ఊరి జనం పరితపిస్తున్న తీరు చలింపజేస్తోంది. ఇప్పుడు కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరినోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. వీధులన్నీ వీరజవాన్‌ను తలుచుకుని కన్నీళ్లు పెడుతున్నాయి. దేశసేవకు అంకితమైన ఆ యువ ‘తేజ’ం ధైర్యసాహసాలకు ఉప్పొంగిపోతున్నాయి. జైజవాన్.. అమర్ రహే అంటూ కీర్తిస్తున్నాయి. సాక్షి, చిత్తూరు: కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే సమాధానం అవుతున్నాయి. తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో సీఎస్డీ బిపిన్‌రావత్‌తో పాటు మరణించిన లాన్స్‌నాయక్ సాయి తేజ మృతదేహం కోసం జనం ఎదురు చూస్తున్నారు. భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు గురువారం ఎగువరేగడవారిపల్లెకు చేరుకున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్చార్జ్ తహసీల్దార్ సయ్యద్ అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’) అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారి నుంచి ఎగువరేగడకు వెళ్లే దారిని వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీతో జంగిల్‌క్లియరెన్స్ చేయించారు. లాన్స్‌నాయక్ సాయితేజకు సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సి ఉన్నందున అందుకు తగ్గట్టుగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయితేజ పార్థివదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఖననం చేస్తామని చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. (చదవండి: సాయితేజ బిడ్డల చదువు బాధ్యత తీసుకుంటా: మంచు విష్ణు) అందరికీ ఆదర్శప్రాయుడు సాయితేజ 8వ తరగతిలోనే సైన్యం చేరాలని నిర్ణయించుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. గొర్రెల పెంపకం జీవనవృత్తి కలిగిన తమ కుటుంబాల్లో చదువు ప్రాముఖ్యతను వివరించేవాడని గుర్తుచేసుకున్నారు. ఆర్మీలో చేరితే దేశ సేవ చేయవచ్చంటూ గ్రామస్తులను ప్రోత్సహించేవాడని చెబుతున్నారు. అతని తమ్ముడు సైన్యంలో చేరేందుకు ప్రేరణగా నిలిచాడని, మరెందరో సైన్యంలో చేరడానికి కారకుడయ్యాడని కీర్తించారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా తమతోపాటుగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ సరదాగా గడిపేవారన్నారు. ఆర్మీలో చేరి దేశసేవ చేస్తే ఆ తృప్తే వేరంటూ చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు -
రోశయ్య మృతి: 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోశయ్య అంత్యక్రియలుకు ప్రభుత్వం తరఫున ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. వారు బొత్స సత్యనారాయణ, బాలినేని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు రోశయ్య అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. (చదవండి: రోశయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం) రోశయ్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొంపల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో ఆదివారం రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: Konijeti Rosaiah: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా.. -
తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు
సోషల్ మీడియాకు వాడుతున్న యూజర్ల సంఖ్య పెరగడంతో కొందరు తమ ఫోటోలను, వీడియోలను నెట్టింట పోస్ట్ చేయడం అందులో కొన్ని వైరల్‌గా మారి హల్చల్ చేయడం షరా మామూలే. అయితే కొన్ని మాత్రం నెటిజన్లకు విపరీతంగా నచ్చడంతో అందులోని వారు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది తమ పైత్యాన్ని సోషల్‌మీడియాలో కూడా చూపెడుతూ నెటిజన్ల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా యూఎస్‌లోని ఫ్లోరిడాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓ అమ్మాయి తండ్రి కొద్దిరోజుల క్రితం మరణించాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శవపేటికలో పెట్టి శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంతలో ఆ యువతి తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా ఓ ఫొటోలో తన బాధను పక్కన పెట్టి చిరునవ్వు కూడా చిందించింది. తరువాత వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు.. తండ్రి శవం పక్కన ఆ ఫొటోలకు ఫోజులు ఏంటని మండిపడుతున్నారు. దీంతో వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది ఆ యువతి. కానీ.. తను ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడానికి ముందే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Have I mentioned the problem of a narcissistic and performative culture https://t.co/l7U7ZqdQKO— Tom Nichols (@RadioFreeTom) October 27, 2021 -
అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని..
హయత్‌నగర్: దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దుప్పట్లో చుట్టి బయట పడేసే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. హయత్‌నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి శ్రీను మేస్త్రీ పని చేస్తుండగా, లక్ష్మి(35) కూలి పని చేసేది. ఆమె అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా శ్రీను పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లికి కూతురు భవాని మంచి నీళ్ళు ఇవ్వగా కొద్దిసేపటికి లక్ష్మీ మృతి చెందింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళుతున్నాడు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన ఇది గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకుని నిలదీశారు. చంపి శవాన్ని పడేసేందుకు వచ్చారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించి శ్రీను, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన
వేంసూరు (ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని వేంసూరులో అమానుష సంఘటన జరిగింది. కాలనీలో ఇళ్ల సమీపాన దహన సంస్కారాలు నిర్వహించవద్దంటూ స్థానికులు ఆందోళన చేశారు. అయితే మరీ చితిపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన దౌర్భాగ్య పరిస్థితి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో అంత్యక్రియలు జరిపేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొద్దికాలంగా కాలనీ సమీపాన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆ తర్వాత మరోచోట ప్రభుత్వం వైకుంఠధామాన్ని నిర్మించింది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం అయినా గురువారం ఓ వ్యక్తి మృతి చెందగా ఆ మృతదేహానికి కాలనీ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీసుకెళ్లారు. అయితే కాలనీవాసులు అడ్డుకున్నారు. దహన సంస్కారాలతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ మృతదేహాన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అప్పటికే సిద్ధం చేసిన చితిపై కూర్చుని నిరసన తెలిపారు. చివరకు మృతుడి బంధువులు నచ్చచెప్పగా, దహన సంస్కారాలకు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
ఎంత ఏడ్వాలో మనకు ఇంకా ఎంతకాలం చెబుతారు
ఎంత ఏడ్చినా ఇంటి దగ్గరే ఏడ్వాలి. ఎంత మొత్తుకున్నా హాస్పిటల్ దగ్గరే మొత్తుకోవాలి. చివరి యాత్ర మొదలుకాక ముందే స్త్రీల అనుబంధం ముగుస్తుంది మన సమాజంలో. అంతిమ సంస్కారాలలో పాల్గొనే హక్కు ఆమెకు లేదా? నటి మందిరా బేడీ తన భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. దానికి జవాబూ చెబుతున్నారు. అంతిమ వీడ్కోలు చెప్పే హక్కు స్త్రీలకు ఎందుకు లేదు అనేది ఇప్పుడు ప్రశ్న. 2018లో వారణాసిలో ఒక ఘటన జరిగింది. ఆ ఊళ్లో నివాసం ఉండే 95 ఏళ్ల సంతోరి దేవి కొన ఊపిరితో ఉండగా తాను మరణించాక అంతిమ సంస్కారాలు కుమార్తె పుష్పవతి పాటిల్ చేయాలని కోరింది. అంతే కాదు తన బంధువుల్లోని స్త్రీలే అంతిమ సంస్కారాల్లో పాల్గొనాలని చెప్పింది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక్క కూతురు పుష్పవతి పాటిల్. ఇద్దరు కొడుకులు ఉన్నా కూతురే ఎందుకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలి అనంటే ‘మగవాళ్లకే ఆ హక్కు ఉండటం నాకు ఇష్టం లేదు’ అని ఆ పెద్దావిడ చెప్పింది. ఆమె పిల్లలను అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా పెంచింది. అందుకే మరణించాక కూతురే దహన కర్మలు నిర్వహించింది. సోదరులు అందుకు మద్దతుగా నిలిచారు. ఈ వార్త గొప్ప ప్రచారం పొందింది. దక్షణాదిలో కూడా రెండు మూడు సందర్భాలలో కూతుళ్లే చితి మంట పెట్టడం వంటి వార్తలు వచ్చాయి. ఇటీవల కరోనా సమయంలో తండ్రి పాడెను మోసిన కుమార్తెల చిత్రాలు వచ్చాయి. దుఃఖ సమయంలో ఎవరి దుఃఖ ప్రకటన వారిదిగా ఉంటుంది. కొందరు తమ వారిని చిట్టచివరి క్షణం వరకూ చూసుకోవాలని అనుకోవచ్చు. దగ్గరగా ఉండి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారి ఆత్మలు సంతృప్తి పడతాయి అనుకోవచ్చు. లేదా తమకు శాంతి అనుకోవచ్చు. అది వ్యక్తిగతం. కాని అది సామాజికం అని ఇతరుల స్పందన వల్ల తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మందిరా బేడి విషయంలో అదే అయ్యింది. భర్త అంతిమ సంస్కారాల సమయంలో .. నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది... నటి మందిరా బేడీ భర్త, దర్శకుడు అయిన రాజ్ కౌశల్ జూన్ 30న 49 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించాడు. ఇలాంటి సంఘటన ఎవరికైనా చాలా పెద్ద విషాదమే. మందిరా బేడికి ఇద్దరు సంతానం. ఆ దంపతులు ఆ సంతానంతో దిగే ఫొటోలు, పిల్లల గురించి మందిరా చెప్పే విశేషాలు సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూస్తూనే వచ్చారు. అలాంటిది సడన్‌గా భర్త చనిపోవడం చాలా పెద్ద షాక్‌కు గురి చేసి ఉంటుంది మందిరాకు. ఆమె భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొంది. పాడె ముందు నిప్పుకుండ పట్టుకుని నడిచింది. చితి మండే వరకూ దహనవాటికలోనే ఉంది. అయితే ఈ ఫొటోలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చాయో విమర్శలు మొదలయ్యాయి నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది అని. ఆ బట్టలు ఏమిటి? ‘స్త్రీలు దుఃఖాన్ని నిభాయించుకోలేరు... అంతిమ సంస్కారాలు చూడలేరు... ఆ సమయంలో వారు పాల్గొంటే చనిపోయిన వారి ఆత్మకు సద్గతి లభించదు’... అని కామెంట్లు వచ్చాయి. సరే.. అవి సంప్రదాయవాదుల కామెంట్లు అనుకున్నా కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఆ బట్టలేమిటి అని కూడా అన్నారు. ఆ సమయంలో మందిర జీన్స్ ప్యాంట్, వైట్ టాప్ వేసుకుని ఉండటమే ఇందుకు కారణం అట. స్త్రీలు వెళ్లడానికి అనుమతి లేని చోట వెళ్లకపోవడమే కరెక్ట్ అని విమర్శలు వచ్చాయి. ఆ మాట చెప్పడానికి మీరెవరు? అయితే మందిరా మీద ఇలాంటి అటాక్ మొదలైన వెంటనే మహిళా వాదులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. స్త్రీలు ఎలా దుఃఖపడాలో, ఏ మేరకు దుఃఖ పడాలో, ఆప్తుల మరణంలో ఏ చర్యలు చేయాలో చేయకూడదో మగవాళ్లు ఎంత కాలం డిసైడ్ చేస్తారు అని వారు ప్రశ్నిస్తున్నారు. గాయని సోనా మహాపాత్ర, టీవీ యాంకర్ మిని మాథుర్ వీరిలో ఉన్నారు. ‘దుఃఖంలో ఉన్న స్త్రీని అనడానికి వీరెంత బుద్ధిలేనివారో అనిపిస్తోంది’ అని వారు అన్నారు. టెలివిజన్ నటి శ్వేతా తివారి అయితే ‘మందిరా... మేము నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని వ్యాఖ్యానించింది. డాన్సర్ ముక్తి మోహన్ ‘మానవాళిలో సగం మనం. కాని ఇప్పటి వరకూ ఈ సగానికి సరైన మర్యాద, గౌరవం దక్కలేదు. మనల్ని మనమే దెబ్బ తీసుకున్నాం. అందరూ ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి. మనం ఎంత ఏడ్వాలో మనకు ఇంకా ఎంతకాలం చెబుతారు’ అని వ్యాఖ్యానించింది. కొరివి పెట్టే కొడుకు పుట్టాలనుకునే రోజులు పోయి ఒక్క అమ్మాయి పుడితే సంతోషపడి బాగా పెంచుకుందాం అనుకుని ఆపరేషన్ చేయించుకున్నవారు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక్క అమ్మాయి ఉన్న ఇంటికి ఉన్న అంగీకారం ఆ ఒక్క అమ్మాయో లేదా భార్యో ఇటువంటి సందర్భాల్లో ఇది తన కర్తవ్యం అనుకుంటే అంగీకరించాల్సిన వాతావరణం ఏర్పడాల్సి ఉంది. స్త్రీలు ఏర్పరిచేలానే ఉన్నారు. -
‘అంత్యక్రియలు అయ్యాక ప్రత్యక్షం.. దెయ్యమా ఏంటి?’
జైపూర్: ఓంకార్ గుడిలియ అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. లివర్ చెడిపోయింది. దాంతో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆస్పత్రిలో చేరాడు. నాలుగైదు రోజులు గడిచినా ఇంటికి రాలేదు. ఈ లోపు పోలీసులు గుర్తు తెలియని మృతదేహం గురించి అంటించిన పోస్టర్లు చూసి.. పొరపాటున ఓంకార్ గుడిలియాదిగా భావించి ఆ గుర్తు తెలియని మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వమించారు. అయితే వారం రోజుల తర్వాత ఓంకార్ గుడిలియ ప్రత్యక్షం అయ్యాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దెయ్యం అయ్యాడా ఏంటి అని భయపడసాగారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ వివారలు.. రాజస్తాన్‌లోని రాజ్సమండ్ జిల్లాకు చెందిన ఓంకార్ గుడిలియ ఈ నెల 11న ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉదయ్‌పూర్ వెళ్లాడు. లివర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న అతడు ఆర్కే ఆస్పత్రిలో చేరాడు. లాక్డౌన్ విధించడంతో గుడిలియా కుటుంబం అతడి సోదరుడి ఇంట్లో ఉండిపోయింది. మరోవైపు సరిగా ఓంకార్ ఆస్పత్రిలో చేరిన నాడే గోవర్థన్ ప్రజాపత్ అనే వ్యక్తిని కొందరు హెల్త్ వర్కర్స్ ఆర్కే ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అతడు మరణించడంతో ఆస్పత్రి వర్గాలు గుర్తుతెలియని మృతదేంగా మార్చురీలో ఉంచారు. ఆ తర్వాత ఈ గుర్తు తెలియని మృతదేహం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డెడ్‌బాడీని అనేక యాంగిల్స్‌లో ఫోటో తీసి.. ఆస్పత్రి చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు అంటించారు. మరోవైపు ఓంకార్ గుడలియ ఇంటి నుంచి వెళ్లిపోయి మూడు నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి అతడి ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో తమ ఊరిలో అంటించిన గుర్తు తెలియని మృతదేహం పోస్టర్లు వారిలో అనుమానం రేకేత్తించాయి. దాంతో ఓంకార్ గుడిలియ కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి పదిహేను మందికి పైగా ఆర్కే ఆస్పత్రికి వెళ్లారు. గుర్తు తెలియన మృతదేహాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఓంకార్ కుడి చేతి మీద ఉన్న మచ్చలాంటిదే గోవర్ధన్ చేతి మీద కూడా ఉండటంతో వారు పోరపాటున గోవర్థన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఓ వారం రోజుల తర్వాత ఓంకార్ గుడిలియ తిరిగి రావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘దీనిలో మా తప్పేం లేదు. అతడి కుటుంబ సభ్యులే పొరపాటున గోవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు’’ అని తెలిపారు. చదవండి: మా నాన్న అంత్యక్రియలు మీరే చేయండి -
మా నాన్న అంత్యక్రియలు మీరే చేయండి
జవహర్‌నగర్: కరోనా మహమ్మారి మిగిల్చిన ఓ విషాదకర ఘటన జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కుడిపూడి గున్నయ్య (75) కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వచ్చి సంతోష్‌నగర్‌లో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. గున్నయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీనివాస్ చిన్నతనం నుంచే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుమార్తెలకు వివాహమై ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం గున్నయ్య భార్య అనారోగ్యంతో చనిపోయారు. వారం రోజులుగా గున్నయ్య, కుమారుడు శ్రీనివాస్ కరోనా బారిన పడి నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గున్నయ్య మంగళవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో వైద్యులు తూర్పు గోదావరిలో ఉన్న ఆయన కుమార్తెలకు తండ్రి మరణ వార్త చెప్పారు. లాక్డౌన్ కారణంగా అక్కడికి రాలేకపోతున్నామని, పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు నాగ శ్రీదేవి వాట్సాప్ ద్వారా వేడుకున్నారు. స్పందించిన పోలీసులు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం గున్నయ్య కుమారుడు శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి మరణించిన విషయం అతనికి తెలియదు. చదవండి: దైవ దర్శనానికి వెళ్లొస్తామంటూ.. ముగ్గురి బలవన్మరణం -
నాన్న మృతదేహం నాకొద్దు.. వాటిని మాత్రం నాకు పంపండి
మైసూరు: కరోనా రక్కసి అనుబంధాలను తుడిచేస్తోంది. మరణించిన తండ్రి మృతదేహం తనకు వద్దని, మీరే తగులబెట్టుకోండి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల విలువైన డబ్బులు, డాక్యుమెంట్లను తెచ్చి ఇవ్వండంటూ ఒక కుమారుడు చాలా పరుషంగా మాట్లాడాడు. మైసూరు హెబ్బాళలో ఉన్న సూర్య బేకరి వద్ద ఒక ఇంట్లో వృద్ధుడు కరోనాతో మరణించాడు. అతని కొడుకు కువెంపు నగర శాంతి సాగర్ కాంప్లెక్స్ వద్ద నివసిస్తుంటాడు. కుమారుడు స్థానిక కార్పొరేటర్ కేవీ శ్రీధర్‌కు ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియలను మీరే పూర్తి చేసి, అతని వద్ద ఉన్న రూ. 6 లక్షల డబ్బులు, ఆస్తి పత్రాలను మాత్రం తనకు తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. కొడుకు వైఖరికి విస్తుపోయిన కార్పొరేటర్ పాలికె సిబ్బందితో అంత్యక్రియలు చేయించారు. చదవండి: Lockdown: వందలాది మంది ఒక్కచోట చేరి -
‘నిప్పు’లాంటి మనిషి ఒక్క నేస్తం చాలంటాను
ఇంట్లో ముగ్గురూ ఆడపిల్లలే. హర్షళ పెద్దమ్మాయి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయినప్పుడు తనే అంత్యక్రియలు నిర్వహించింది. ఇప్పుడు తండ్రి! కరోనా తో మే 9 న ఆయన హాస్పిటల్లో చనిపోయారు. హర్షళకు, చెల్లెళ్లకు కరోనా! లేచే పరిస్థితి లేదు. హర్షళ తన స్నేహితురాలికి ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగలవా అని అడిగింది. ఆయేషా ఆ సమయంలో రంజాన్ ఉపవాసాల్లో ఉంది. ‘అలాగే హర్షా..’ అంది. మరి ఆ ‘తుది’ కార్యం?! హర్షళకు ఒక మాట చెప్పి ఆ కార్యాన్నీ తనే సంప్రదాయబద్ధంగా పూర్తి చేసింది! మతాల అంతరాలను చితాభస్మం చేసిన ఆయేషా ఇప్పుడు స్నేహమయిగా సర్వమత దీవెనలకు పాత్రమవుతోంది. కొల్హాపూర్‌లోని ఆస్టర్ ఆధార్ హాస్పిటల్లో సీనియర్ మేనేజర్ ఆయేషా. మహారాష్ట్ర ఇప్పుడు ఎలా ఉందో ఎవరూ వినంది కాదు. ఆస్టర్ ఆసుపత్రి కూడా అలానే ఉంది! డాక్టర్లు, నర్సులతో సమానంగా ఆసుపత్రి సీనియర్ మేనేజర్‌గా ఆయేషా మీద పడుతున్న ఒత్తిడి కూడా సాధారణంగా ఏమీ లేదు. ఆప్తుల్ని కోల్పోయిన వారికి ఓదార్పు నివ్వడం, కొన్నిసార్లు ఆ ఆప్తులకు ‘చివరి’ ఏర్పాట్లు చూడటం కూడా ఆమె పనే అవుతోంది. ప్రస్తుతం ఆమె రంజాన్ ఉపవాసంలో కూడా ఉన్నారు. నిజానికి ఈ పవిత్ర మాసం ప్రారంభం అయిన నాటినుంచే ఆయేషా, ఆమె కుటుంబ సభ్యులు కొల్హాపూర్ నగరంలోని సమాధిస్థలులు, దహన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నవారికి ఉచితంగా పి.పి.ఇ. కిట్లు పంచి పెడుతున్నారు. ఆ పని మీదే ఈ నెల 9న ఆయేషా పంచగంగ శవ దహనశాలలో ఉన్నప్పుడు డాక్టర్ హర్షళావేదక్ నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ఆయేషా.. నాన్నగారు పోయారు’’ అని చెప్పారు హర్షళ. ఆయన పోయింది ఆయేషా పని చేస్తున్న ఆస్టర్ ఆధార్ ఆసుపత్రిలోనే. ఆ ముందు రోజే ఆయన్ని కరోనాకు చికిత్సకోసం అక్కడ చేర్పించారు. ఆయేషా, హర్షళ స్నేహితులు. ఒకే వృత్తిలో ఉన్నవారు. హర్షళ కొల్హాపూర్‌లోనే ఛత్రపతి ప్రమీలారాజే ప్రభుత్వ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయేషాకు ఆమె ఫోన్ చేసే సమయానికి హర్షళ కూడా కరోనాతో బాధపడుతున్నారు. ఆమె ఒక్కరే కాదు, ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా. పైకి లేచే పరిస్థితి లేదు. ఆ సంగతి ఆయేషాకు తెలుసు. ‘‘ఆయేషా.. నాన్నగారికి ఏర్పాట్లు చేయించగలవా?’’ అని అడిగారు హర్షళ. ‘‘తప్పకుండా’’ అని చెప్పారు ఆయేషా. చనిపోయిన హర్ష తండ్రి సుధాకర్ వేదక్ వయసు 81 ఏళ్లు. మూడేళ్ల క్రితమే ఆయన భార్య కన్ను మూశారు. ఇక ఆయనకున్నది ముగ్గురు కూతుళ్లు. ఆ సంగతీ ఆయేషాకు తెలుసు. తనే ఆయన భౌతికకాయాన్ని ‘పంచగంగ’కు తెప్పించి దగ్గరుండి మరీ దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయించారు. అయితే మరింత దగ్గరగా ఉండవలసిన ప్రధాన కార్యం ఒకటి ఉంటుంది కదా. అక్కడ ఆమె ఆగిపోయారు. అది చేయించవలసిన కార్యం కాదు. చేయవలసిన కార్యం. చితికి నిప్పు పెట్టడం. పెడితే కొడుకు పెట్టాలి. కొడుకు లేకుంటే కూతురు. కానీ ఆయన ముగ్గురు కూతుళ్లు కరోనా బెడ్ మీద ఉన్నారు. హర్షళకు ఫోన్ చేశారు ఆయేషా. ‘‘హర్షా, ఎలా?’’ అని. ‘‘నీ చేతుల మీదే కానివ్వు’’ అని హర్షళ అన్నారు. ఆయేషా అప్పటికప్పుడు పి.పి.ఇ. గౌన్ ధరించారు. పురోహితుడు దూరంగా ఉండి.. ఆమె చేతుల మీదుగా ‘జరగవలసిన పని’ని జరిపించారు. ‘‘ఇలా చేసినందుకు మీ ‘వాళ్లు’ , మీ ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదా?!’ అనే ప్రశ్న ఆయేషాకు.. ‘‘అలా ఎలా చేయించావ్, మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుందా?!’’ అనే ప్రశ్న హర్షళకు.. ఎదురైంది! ‘‘మేము చేయలేని స్థితిలో ఆయేషాను మా తోబుట్టువనే అనుకున్నాం’’ అని చెప్పారు హర్షళ. ‘‘ఇందులో అనడానికి, అనుకోడానికి ఏముంది?! మనిషికి మనిషి సాయపడటం అన్నది దేవుని ఆదేశమే కదా..’’ అని అన్నారు ఆయేషా. మూడేళ్ల క్రితం ముంబైలో హర్షళ తల్లి క్యాన్సర్‌తో చనిపోయినప్పుడు హర్షళే ఆమెకు అంతిమ సంస్కారాలు జరిపారు. తండ్రి విషయంలో ఆ అవకాశం లేకుండా పోయింది. ‘‘మా అమ్మానాన్న మమ్మల్ని ఆడపిల్లలమన్న వివక్షతో, పాతకాలపు కట్టుబాట్లతో పెంచలేదు. ఆయేషా మా నాన్నగారికి దహన క్రియలు నిర్వహించినంత మాత్రాన ఆయన ఆత్మకు శాంతి కలగకుండా పోదు’’ అని హర్షళ అంటుంటే.. ‘‘నేను స్వీకరించిన నా స్నేహితురాలి బాధ్యతను ఎవరూ హర్షించకుండా లేరు. అలాగైతే మరి కొల్హాపూర్ చరిత్రలో ఎన్ని సామాజిక సంస్కరణల ఉద్యమాలు జరగలేదూ..’’ అంటున్నారు ఆయేషా. -
ప్రియుడి మోసం.. వెరైటీగా పగ తీర్చుకున్న గర్ల్‌ఫ్రెండ్
సాధారణంగా లవ్‌లో అమ్మాయిలు మోసం చేస్తే.. అబ్బాయిలు అస్సలు కామ్‌గా ఉండరు. తన మాజీ ప్రియురాలి గురించి అడ్డమైన చెత్తంతా ప్రచారం చేసి.. వారి పరువు తీసి సంతోషిస్తారు కొందరు. మరి కొందరు ఏకంగా ప్రియురాలి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడరు. అదే అమ్మాయి ప్రియుడి చేతిలో మోసపోతే.. ఎవరికి చెప్పుకోలేదు. తనలో తానే బాధపడుతుంది. ఏం చేయలేక మౌనంగా రోదిస్తుంది. అయితే అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటు. కొందరు తమను మోసం చేసిన వాడిని జైలుకు లాగుతారు. మరికొందరు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ తరహా వార్తనే. మోసం చేసిన ప్రియుడికి ఓ మహిళ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అతడిని జైలుకు పంపడంతోనే ఆగిపోలేదు. ఏకంగా అతడు చనిపోయినట్లు ప్రచారం చేసి.. అంత్యక్రియలు కూడా నిర్వహించింది. సదరు మహిళ చేసిన పనికి నెటిజనులు అభినందిస్తున్నారు. ఆ వివరాలు.. థేయా లోవరిడ్జ్ అనే మహిళ, ఓ వ్యక్తిని మూడేళ్లుగా ప్రేమిస్తుంది. వివాహం కానప్పటికి ఇద్దరు కలిసే ఉంటున్నారు. మొదట బాగానే ఉన్న థేయా బాయ్‌ఫ్రెండ్ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మరో మహిళను ప్రేమించాడు. దీని గురించి థేయాకు తెలియకుండా.. కొత్త ప్రియురాలితో కలిసి ఏంజాయ్ చేయసాగాడు. అయితే తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేసి.. వేరే యువతితో తిరుగుతున్నాడని.. థేయాకు తెలిసింది. ఈ మోసాన్ని తట్టుకోలేకపోయింది. తనని మోసం చేసినందుకు ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఓ మంచి ప్లాన్ సిద్ధం చేసుకుంది. తన ప్రియుడి చెల్లెలని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సాయం చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆ యువతి కూడా అంగీకరించింది. ఈ క్రమంలో థేయా మొదట తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని జైలుకు పంపింది. ఇక ఈ విషయాలు ఏవి తెలియని థేయా మాజీ ప్రియుడి కొత్త లవర్, అతడి మొబైల్‌కు అనేక సార్లు కాల్ చేసింది.. మెసేజ్‌లు పంపంది. కానీ ఎలాంటి రిప్లై రాలేదు. కొద్ది రోజుల పాటు ఆమెను ఇలా కంగారు పెట్టిన థేయా ఓ రోజు బాంబ్ పేల్చింది. ‘‘మీ బాయ్‌ఫ్రెండ్ చనిపోయాడు. ఈ రోజు అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి మెసేజ్ చేసింది. ఆమెను నమ్మించడం కోసం ఉత్తుత్తి అంత్యక్రియలు నిర్వహించింది థేయా. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది. తన మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి అతడు జైలులో ఉన్నట్లు ఇప్పటికి తెలియదు. ఆమె ఇంకా అతడు చనిపోయాడనే భావిస్తుంది. ప్రతి ఏటా అతడి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తుందని తెలిపింది థేయా. తనను మోసి చేసినందుకు అతడికి ఇలా జరగాల్సిందే అంటుంది. ఇక ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చదివిన నెటిజనులు థేయాను అభినందిస్తున్నారు. మోసం చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టకుండా తగిన బుద్ది చెప్పారు. మీరు చాలా మంది ఆడవారికి ఆదర్శం అని కామెంట్ చేస్తుండగా.. కొందరు మాత్రం మీ మాజీ ప్రియుడి కొత్త గర్ల్ ఫ్రెండ్ అతడు చనిపోయాడని నమ్ముతుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంటే.. భవిష్యత్తులో చచ్చిపోయాడని భావించిన ఆమె లవర్ కళ్ల ముందు ప్రత్యక్షం అయితే ఆ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: నోముల ఆడియో దుమారం -
Anantapur: ఒక్కడే.. ఆ నలుగురై!
కరోనా.. మనషులను కర్కశంగా మార్చేసింది. సాటి మనిషి ప్రాణంపోయే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా.. సాయం చేసే ధైర్యం ఎవరికీ ఉండటం లేదు. ఇక కరోనాతో మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలకూ కుటుంబీకులే ముందుకురాని దుస్థితి. ఇలాంటి వారి కోసమే తానున్నానంటూ రమణారెడ్డి ముందుకొచ్చారు. వైరస్ సోకి మృత్యువాత పడిన వారికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. సంజీవని సంస్థ ద్వారా ఆపదలో ఉన్న వారికి తనవంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల పాతూరులో 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృత్యువాత పడ్డాడు. ఆయన భార్య కుటుంబీకులు, బంధువులందరికీ సమాచారమిచ్చినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. పోలీసులు వెంటనే ‘సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్’ను సంప్రదించగా.. రమణారెడ్డి అతని మిత్ర బృందం కదిలివచ్చారు. శాస్త్రోక్తంగా ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో మృత్యువాత పడి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాని ఎందరినో సంజీవిని సంస్థ సగౌరవంగా సాగనంపుతోంది. సాక్షి, అనంతపురం: అనంతపురానికి చెందిన రమణారెడ్డికి మొదటి నుంచీ సేవాభావం ఎక్కువ. వృద్ధులు, అనాథలపై అవ్యాజమైన ప్రేమ చూపుతుంటాడు. 2005లో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పించడానికి ‘సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట సేవా ప్రస్థానం ప్రారంభమైంది. తలసీమియా వ్యాధి బాధిత చిన్నారులకు స్వచ్ఛంద రక్త దాతల సహకారంతో అతను అందించిన సేవలు ఎందరికో స్ఫూర్తి. ఆర్థిక స్థోమత లేక నిస్సహాయంగా ఉండేపోయే వారికి నిత్యం ఖరీదైన మందులను అందించడం, ఆకలి దప్పులతో అలమటించే వారి కోసం నిత్యాన్నదానం చేయడం, వేసవి వచ్చిందంటే వృద్ధులకు పాదరక్షలందివ్వడం వంటివి ఆయన నిత్యం చేస్తున్న సేవా కార్యక్రమాలలో కొన్ని మాత్రమే. అన్నార్థుల కడుపు నింపుతూ.. నగరంలో రోజూ ఎక్కడోచోట కదల్లేని స్థితిలో వృద్ధులు కనిపిస్తుంటారు. వీరంతా ఆ దారి వెంట వెళ్లే వారి దయపై బతుకుతుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జనం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడం లేదు. ఒకవేళ బయటకు వచ్చిన ప్రక్కన ఉన్న మనిషిని తాకే ధైర్యం ఎవరికీ ఉండటం లేదు. దీంతో అనాథల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి వారెందరికో రమణారెడ్డి ఆకలిదప్పులు తీరుస్తున్నారు. దాతల సాయంతో భోజనం సమకూర్చుకుని నగరమంతా తిరుగుతూ అనాథల కడుపునింపుతున్నాడు. చదవండి: ‘ఆ నలుగురూ’.. స్నేహితులే అన్నీ తానై అంత్యక్రియలు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండగా.. ఎందరో ఈ వైరస్ బారిన పడుతున్నారు. కొందరు కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉంటున్నారు. ఇలాంటి వారి గురించి తెలిసిన వెంటనే.. రమణారెడ్డి మందులు తీసుకెళ్లి బాధితులకు అందజేస్తున్నారు. ఇక కరోనాతో కొందరు మృత్యువాత పడి బంధువులెవరూ ముందుకురాక అంతిమసంస్కారాలకు నోచుకోని వారిని రమణారెడ్డి అన్నీ తానై సాగనంపుతున్నాడు. వారివారి మతానుసారం సంజీవని సంస్థ ద్వారా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 20మందికి పైగా అనాథలకు అంతిమ వీడ్కోలు పలికారు. ఏ జన్మలోనో ఉండే రుణాన్ని తీర్చుకుంటున్నారు. అతనితో పాటు రామాంజనేయులు, జగదీశ్వరరెడ్డి, శ్రవణ్, సోహెల్, ఆది తదితరులతో కలిసి కరోనా సమయంలో సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేస్తున్న సేవలు ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నాయి. నా బాధ్యత అనుకున్నా.. వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందితే అంతిమ సంస్కారాలకు చాలా మంది ముందుకు రాని పరిస్థితి. సమాచారం తెలిసిన వెంటనే వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ఇందుకు కొంత ఖర్చు అవుతున్నప్పటికీ.. నా స్నేహితులు, తెలిసిన వారు సాయం చేస్తున్నారు. అలాగే చాలా మంది ఇళ్లలో ఆహార పదార్థాలను వృథాగా పారవేస్తుంటారు. 94404 76651 నంబర్‌కు సమాచారం ఇస్తే ఎక్కడికైనా వచ్చి ఆహారాన్ని తీసుకువెళ్లి అవసరం ఉన్నవారికి అందిస్తాం. – రమణారెడ్డి, సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకుడు చదవండి: అబ్బాయి అబద్ధం చెప్పాడు.. ‘ఈ పెళ్లి నాకొద్దు’ -
మధ్యప్రదేశ్ కోవిడ్ మరణాలు దాస్తోందా ?
ఒకవైపు చూస్తుంటే ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. అంత్యక్రియల కోసం కిలో మీటర్ల కొద్దీ క్యూ లైన్లు.. అయినవారికి ఆఖరి వీడ్కోలు పలకడానికి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఎదురుచూపులు.. భోపాల్, రాయ్‌పూర్, అహ్మదాబాద్, ముంబై ఎక్కడ చూసినా ఇదే దుస్థితి.. ప్రభుత్వాల అధికార లెక్కలకి, చితి మంటలపై కాలుతున్న శవాల సంఖ్యకి పొంతన లేదు. భోపాల్: భోపాల్ గ్యాస్ దుర్ఘటన గుర్తుంది కదా? వేలాది మంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న విషవాయువు కల్లోలం. ఇప్పుడు కరోనా అదే విధంగా మధ్యప్రదేశ్‌లో ప్రజల ప్రాణాల్ని తీస్తోంది. అప్పట్లో ఏ స్థాయిలో శ్మశానాల దగ్గర అంత్యక్రియల కోసం క్యూలు ఉండేవో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భడ్‌భాడా శ్మశాన వాటిక దగ్గర కోవిడ్ –19 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఇక్కడకి గంటకి 30–40 మృతదేహాలను తీసుకువస్తున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంబులెన్స్‌లు రోడ్డు మీదకి కొన్ని కిలోమీటర్ల వరకు లైనులో ఉన్నాయి. ‘‘మా బావగారు కరోనా మరణించడంతో ఇక్కడికి వచ్చాం. నాలుగైదు గంటలు వేచి చూసినా అంత్యక్రియలకు జాగా దొరకలేదు’’అని సంతోష్ రఘువంశి చెప్పారు. లెక్కల్లో ఎంతో తేడా ..! మధ్యప్రదేశ్‌లో నమోదవుతున్న మరణాలను ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదనే అనుమానాలున్నాయి. సోమవారం కరోనాతో రాష్ట్రంలో 37 మంది మరణించారని అధికారిక లెక్కలు చెబుతూ ఉంటే, భోపాల్‌లో భడ్‌భాడా శ్మశానవాటికలోనే 37 మంది కోవిడ్ రోగులకి అంత్యక్రియలు జరిగాయి.. ఏప్రిల్ 8న 41 మంది కోవిడ్ రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తే, రాష్ట్రవ్యాప్తంగా 27 మందే మరణించారని ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా ఏప్రిల్ 10న భోపాల్‌లో 56 మృతదేహాలకు అంతిమ సంస్కారం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 24 మందే మరణించారని ప్రభుత్వ గఱాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 11న 68 కి అంత్యక్రియలు జరిగితే ప్రభుత్వం 24 అని, ఏప్రిల్ 12న 59ని దహనం చేస్తే ప్రభుత్వం 37 మరణించారని వెల్లడించింది. కోవిడ్ మృతుల అంశంలో తాము అన్నీ నిజాలే చెబుతున్నామని ప్రభుత్వం అంటోంది. అంత్యక్రియల కోసం క్యూలు పెరగడానికి కలప దొరకకపోవడమే కారణమని రాష్ట్ర వైద్య విద్య మంత్రి విశ్వాస్ సారంగ్ చెప్పారు. రోజుకి 40 నుంచి 45 మృతదేహాలను దహనం చేయాల్సి రావడంతో తాము చాలా ఒత్తిడికి లోనవుతున్నామని శ్మశాన వాటికలో పని చేసే ప్రదీప్ కానోజియా చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్ ,ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ శ్మశాన వాటికలకు ఇస్తున్న సమాచారానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గణాంకాలకి పొంతన కుదరడం లేదు. ప్రభుత్వాలు కరోనా మరణాలను దాచి పెడుతున్నాయన్న సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క కరోనా రోగుల అవస్థలు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరాలనుకునే వారు బెడ్స్ దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ, పాట్నా, బెంగుళూరు, అహ్మదాబాద్, ముంబై, పుణెలలో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. సామర్థ్యానికి మించి కోవిడ్ పేషెంట్లు వచ్చి చేరుతున్నారు. పట్నా ఎయిమ్స్ ఆస్పత్రిలో 112 బెడ్స్ నిండిపోయాయి. రుబాన్ ఆస్పత్రుల్లో 95 బెడ్స్ నిండిపోవడంతో కొత్త పేషెంట్లకు అవకాశం లేదు. ఫోర్డ్ ఆస్పత్రిలో 55 పడకలు, పరాస్ ఆస్పత్రిలో 48 పడకలు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఢిల్లీలోని కోవిడ్ రోగుల ప్రత్యేక ఆస్పత్రి లోక్‌నాయక్ ఆస్పత్రి, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక్క బెడ్ కూడా ఖాళీగా లేదు. ఢిల్లీ ఆస్పత్రుల్లో 1177 బెడ్స్‌కి గాను 79 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులు అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపడా సిబ్బంది కూడా లేరు. బెంగళూరులోని కొన్ని ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకకపోవడంతో ఆస్పత్రి బయట ఉన్న బెంచీలపైనే రోగులు పడుకుంటున్నారు. పుణేలో కారిడార్లలోనే పేషెంట్లకు చికిత్స చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్‌లోని జహగిరిపురా శ్మశాన వాటిక ముందు బారులు తీరిన మృతదేహాలతో కూడిన అంబులెన్స్‌లు గుజరాత్లో రేయింబగళ్లు అంత్యక్రియలు సాధారణ పరిస్థితుల్లో హిందువులు సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరు. కానీ కోవిడ్‌తో అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లలో చేసేదేమీ లేక రాత్రి పూట కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కేవలం సూరత్‌లోనే రాత్రిళ్లు 25 వరకు శవాలను దహనాలు చేస్తున్నారు. వడోదరాలో కూడా అదే పరిస్థితి నెలకొందని మున్సిపల్ చైర్మన్ హితేంద్ర పటేల్ చెప్పారు. రాయపూర్‌లో కొత్తగా క్రిమేషన్ సెంటర్లు కోవిడ్–19 మృతదేహాలకు అంత్య క్రియలు నిర్వహించలేక ఆస్పత్రులోనే గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్న వీడియో వైరల్ కావడంతో ఆ రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రిక్ క్రిమేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కేవలం రాయపూర్‌లోనే ఒకేరోజు 150 మంది వరకు కరోనాతో మరణించారు. మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో కొత్తగా 14 ఎలక్ట్రిక్ క్రిమేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. -
అనాథకు తలకొరివి పెట్టిన ముస్లిం మహిళ
కాజీపేట: బంధుమిత్రుల నిరాదరణకు గురై అనాథ ఆశ్రమంలో ఉంటూ బతుకు వెళ్లదీస్తున్న ఓ వృద్ధుడు శుక్రవారం గుండెపోటుతో తనువు చాలించాడు. దీంతో సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్‌బీ కట్టుబాట్లను పక్కనబెట్టి తలకొరివి పెట్టింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన కోమాండ్ల వీరస్వామి, శోభ దంపతులు. వీరికి పిల్లలతో పాటు ఆస్తిపాస్తులు లేవు. ఈ క్రమంలో జీవిత చరమాంకంలోకి అడుగిడిన ఈ దంపతుల దీనగాథను 2017లో ‘సాక్షి’వెలుగులోకి తీసుకురాగా, కాజీపేటలోని సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్‌బీ, చోటు దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఇందులో వీరస్వామి శుక్రవారం మృతి చెందగా.. యాకూబ్‌బీ హిందూ సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించింది. చదవండి: ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి.. బాలికకు కరోనా తెచ్చిన కష్టం! -
ప్రిన్స్ ఫిలిప్ మృతి: అంత్యక్రియలకైనా వస్తాడా.. లేదా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శుక్రవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకుంటుంబాన్ని అభిమానించే వారి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. ప్రిన్స్ ఫిలిప్ మనవడు ప్రిన్స్ హ్యారి తాతను కడసారి చూడటానికి అయినా వస్తాడా.. లేదా అనే దాని మీదే చర్చ జరుగుతోంది. అంతరంగిక విబేధాల వల్ల ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు గత కొద్ది కాలంగా రాచ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే టాక్ షోలో ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు తాము అంతఃపురంలో అనుభవించిన కష్ట నష్టాల గురించి ప్రపంచానికి వెల్లడించారు. జాతి వివక్షను ఎదుర్కొన్నానని.. మీడియా తనపై తప్పుడు కథల ప్రచారం చేసిందని.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మేఘన్ తెలిపారు. ఇక వీరి ఇంటర్వ్యూ ప్రసారానికి ముందే ప్రిన్స్ ఫిలిప్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాతను పరామర్శించాల్సిందిగా బకింగ్‌హామ్ ప్యాలేస్ హ్యారీకి సందేశం పంపింది. కారణాలు తెలియదు కానీ ప్రిన్స్ హ్యారీ మాత్రం తాతగారిని చూడటానికి రాలేదని సమాచారం. మరి ఇప్పుడు అంత్యక్రియలకు అయినా హాజరవుతాడా లేదా అనే ప్రశ్న బ్రిటన్ జనాలను తొలచివేస్తుంది. అయితే దీని గురించి రెండు నెలల క్రితమే ది రాయల్ అజ్బర్వర్ అనే పత్రిక ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ప్రచురించడం గమనార్హం. ప్రస్తుతం హ్యారీ-మేఘన్ మార్కెల్లు అమెరికాలో నివాసం ఉంటున్నారు. చదవండి: వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ -
అయ్యో తాతా: రోడ్డుపైనే మృతదేహం... చివరికి
దొడ్డబళ్లాపురం: దళితుడి అంత్యక్రియలకు ఆటంకం కలగడంతో బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. కర్ణాటకలోని చెన్నపట్టణ తాలూకా హనుమాపురదొడ్డి గ్రామానికి చెందిన నాథయ్య(75)అనే దళితుడు అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామ శివారులోని శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో దళితుడి శవం ఉన్న వాహనాన్ని రోడ్డుపైనే నిలిపి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా, దళితుల కోసం శ్మశానం భూమి కేటాయించాలని డిమాండు చేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి శవ సంస్కారానికి వేరే చోట అవకాశం కల్పించారు. శ్మశానానికి 60 ఏళ్ల క్రితం గ్రామ పెద్ద స్థలం దానం చేశారని, ఆ భూమి తమకు కావాలని వారసులు న్యాయ పోరాటం ప్రారంభించడం వల్ల శ్మశానంలో శవ సంస్కారానికి వారు అనుమతించడంలేదని అధికారులు పేర్కొన్నారు. చదవండి: ఇక్కడ పాతిపెట్టొద్దు.. అయ్యో బిడ్డా.. -
వీర జవాన్ మురళీకృష్ణ అంత్యక్రియలు
-
అధికార లాంఛనాలతో అమర జవాన్లకు అంత్యక్రియలు
-
అధికార లాంఛనాలతో అమర జవాన్లకు అంత్యక్రియలు
సాక్షి, విజయనగరం/గుంటూరు: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల కాల్పుల్లో వీర మరణం పొందిన అమర జవాన్లు రౌతు జగదీష్, మురళీకృష్ణ పార్థివ దేహాలకు స్వగ్రామాల్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. విజయనగరం జిల్లా గాజులరేగలో జగదీష్ స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు నివాళర్పించారు. జోహార్ జగదీష్ అంటూ నినాదాలు చేస్తూ.. స్థానికులు పూల వర్షం కురిపించారు. వీర జవాన్ మురళీకృష్ణ అంత్యక్రియలు ఛత్తీస్‌గఢ్ వద్ద మావోయిస్టుల దురాగతానికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను శాఖమూరి మురళీకృష్ణ భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన శాఖమూరి రవీంద్రబాబు, విజయకుమారి దంపతుల చిన్నకుమారుడైన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సీఆర్పీఎఫ్ జవానుగా ఉద్యోగంలో చేరి భరతమాత సేవకు అంకితమయ్యాడు. కోబ్రా–210 విభాగానికి చెందిన మురళీకృష్ణ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్నారు మురళీకృష్ణకు గత ఏడాది ఆగస్ట్ 13న వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ దగ్గరి బంధువు చనిపోవటంతో వాయిదా పడింది. ఈ ఏడాది మే 22న వివాహం జరుప తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన మురళీకృష్ణ తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. సెలవు మంజూరైందని, మే 15న ఇంటికివస్తానని చెప్పాడు. అలా చెప్పిన మూడో రోజే శాశ్వతంగా సెలవు తీసుకుని ఎవరికీ అందని లోకాలకు వెళ్లిపోయారు. -
ముగిసిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు
వైఎస్సార్ కడప: బద్వేల్ శాసన సభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే నివాసం ఉంటున్న కో ఆపరేటివ్ కాలనీలోని వందన అపార్ట్మెంట్ నుంచి అంతిమయాత్ర మొదలైంది. ఈ అంతిమయాత్ర ఇందిరానగర్ సమీపంలోని నర్సింగ్ కాలేజీ పక్కనున్న ఎమ్మెల్యే వ్యవసాయ పొలం వరకు సాగింది. ఎమ్మెల్యే మృతికి సంతాపంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు నిర్వహించారు. ఎమ్యెల్యే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, సుధీర్ రెడ్డి, అన్నా రాంబాబు, మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. చదవండి: విశాఖ మహిళా కార్పొరేటర్ కారుపై దాడి -
తల్లీకొడుకుల కన్నీటి చితి
సాక్షి, కొత్తూరు: కొత్తూరు గ్రామ ప్రజలు తీవ్ర విషాదానికి గురయ్యారు. ప్రతీ ఒక్కరూ కన్నీంటి పర్యంతమయ్యారు. గ్రామంలోని కొత్తకోటపేట కాలనీకి చెందిన తల్లీ, కుమారుడు కనపాకల చిన్మమ్ముడు (65), కొడుకు శ్రీనివాసరావు (32) శనివారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో చిన్నమ్ముడు అదే రోజు మధ్యాహ్నం మృతి చెందగా.. శ్రీనివాసరావు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తరువాత తనువుచాలించిన విషయం విదితమే. తల్లి మృతదేహానికి పాలకొండ ఏరియా ఆస్పత్రిలో, కొడుకుకు రిమ్స్‌లో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వేర్వేరు వాహనాల్లో మృతదేహాలను కొతూర్తు శ్మశానవాటికకు నేరుగా తీసుకొచ్చారు. దీంతో చిన్నమ్ముడు, శ్రీనివాసరావు మృతదేహాలను కడసారి చూసేందుకు కొత్తూరు గ్రామస్తులంతా అక్కడకు చేరుకొని కన్నీరు పెట్టారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. ఇద్దరి మృతదేహాలకు పక్కపక్కనే చితిలు ఏర్పాటు చేసి ఏకకాలంలో దహన కార్యక్రమాలు పూర్తిచేశారు. చిన్నమ్ముడు భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందడం, కొడుకు కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో ఎవరూలేరు దీంతో ఆమెకు పెద్ద అల్లుడు, శ్రీనివాసరావుకు మామయ్య తలకొరివి పెట్టారు. పక్కపక్కనే తల్లీకొడుకుల మృతదేహాలు దహనం అవుతుండడాన్ని చూసిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. కొత్తూరు ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పలువురు చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ ప్రతినిధి పడాల లక్ష్మణరావు తల్లీకొడుకుల అంతిమ సంస్కారాలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. చదవండి: నాన్న ఇక రాడు -
అంత్యక్రియలను అడ్డుకున్న ‘పంచాయతీ’
బుచ్చినాయుడుకండ్రిగ (చిత్తూరు జిల్లా): ‘పంచాయతీ’ ఎన్నికల సంగ్రామం ముగిసినప్పటికీ.. ఇంకా గ్రామాల్లో ఆ నిప్పుల కుంపటి చల్లారలేదు. ఎన్నికల సందర్భంగా తనకిచ్చిన మాట తప్పారనే కారణంతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను అడ్డుకుంది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కొత్తపాళెం గ్రామంలో శ్మశానం పంట పొలాల మధ్యలో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పొలాల్లో నుంచే మృతదేహాలను శ్మశానానికి తీసుకెళుతున్నారు. బుధవారం ముత్యాలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బంధువులు ఆమె మృతదేహాన్ని తీసుకుని శ్మశానానికి బయలు దేరారు. అయితే పొలాల దారి మొదట్లో కాపురం ఉంటున్న బుజ్జమ్మ తన పొలం దారి నుంచి శవాన్ని తీసుకెళ్లవద్దంటూ దారికి అడ్డంగా కంచెను ఏర్పాటు చేసింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఏకగ్రీవంగా తమను ఎన్నుకుంటా మని, గ్రామానికి రూ.10 లక్షలు ఇవ్వాలని గ్రామ పెద్దలు తీర్మానం చేసి..అనంతరం మాట తప్పి పోటీ పెట్టి మోసం చేశారని, కాబట్టి తన భూముల నుంచి శవాన్ని తీసుకుపోయేందుకు వీల్లేదని బుజ్జ మ్మ అడ్డుకుంది. దీంతో వృద్ధురాలి శవంతో మూడు గంటల పాటు ఎండలో రోడ్డుపైనే బంధువులు నిరీ క్షించాల్సి వచ్చింది. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడం తో ఆయన ఆదేశాల మేరకు తహసీల్దారు గణేష్, ఎస్ఐ ధర్మారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని బుజ్జ మ్మకు నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. -
శ్మశానంలో ప్రమాదం.. 23 మంది మృతి
ఘజియాబాద్: బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశానవాటికకు వెళ్లిన 23 మందిని మృత్యువు కబళించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మురాద్‌నగర్‌లోని ఉఖ్లార్సికి చెందిన జైరామ్ అంత్యక్రియలు స్థానిక శ్మశానవాటికలో జరుగుతున్నాయి. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో హాజరైన చాలామంది అక్కడే ఉన్న భవనంలోకి చేరుకున్నారు. అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి వారిపై పడింది. దీంతో అక్కడికక్కడే 23 మంది చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. డాగ్‌స్క్వాడ్ సాయంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆదివారం సాయంత్రం వరకు మృతుల్లో 18 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇటీవలే నిర్మించిన ఈ కట్టడం కూలి, అనూహ్యంగా ప్రాణ నష్టం సంభవించడంపై సీఎం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం -
నోముల ఆడియో దుమారం
నకిరేకల్: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణ వాంగ్మూలం పేరుతో ‘నన్ను ఎర్రజెండాతో సాగనంపండి’ అంటూ ఆయన వాయిస్‌తో వచ్చిన ఓ ఆడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద దుమారాన్ని లేపింది. అయితే చివరికి ఫేక్ అని తేలింది. నోముల నర్సింహయ్య రాజకీయ అరంగేట్రం చేసింది సీపీఎం నుంచే. ఆ పార్టీ తరఫున నకిరేకల్ నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి మరణవాంగ్మూలం అంటూ ఆయన వాయిస్‌తో ఓ ఆడియో వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ ఆడియో వాస్తవమని కొందరు, ఫేక్ అని మరికొందరు చెప్పుకొచ్చారు. చివరికి కుటుంబ సభ్యులు దీనిపై స్పందించి ఫేక్ అని కొట్టిపారేశారు. ‘మా నాన్న వాయిస్‌తో మిమిక్రీ చేసి, ఆడియోను వైరల్ చేయడం మా కుటుంబానికి ఎంతో బాధ కలిగించింది’ అంటూ ఆయన కుమారుడు భగత్ ఖండించారు. ఆడియో వైరల్‌పై ఎస్పీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అభిమానంతోనే ఆడియో చేశా.. ఇదిలా ఉండగా, తాను నర్సింహయ్యతో కలిసి పనిచేశానని, ఆయనపై అభిమానంతోనే ఈ ఆడియో చేసినట్లు కోదాడకు చెందిన ప్రజానాట్య మండలి కళాకారుడు కొండల్ ఓ వీడియోలో స్పష్టం చేశాడు. కానీ కొందరు దీనిని స్వార్థానికి వాడుకుని వైరల్ చేసి ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేశారని చెప్పాడు. నర్సింహయ్య కుటుంబానికి వీడియోలో క్షమాపణ తెలిపాడు. నేడు నోముల అంత్యక్రియలు హాజరుకానున్న సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో జరగనున్నాయి. నోముల కుటుంబానికి చెందిన రెండు ఎకరాల స్థలంలో వారి తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఈ మేరకు అధికారులు, కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం హెలికాప్టర్లో నేరుగా పాలెంకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం స్థలం చదును చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్‌లు బుధవారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి తగిన సూచనలు చేశారు. నకిరేకల్ నుంచి పాలెంకు భౌతికకాయం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపరిచిన నోముల నర్సింహయ్య భౌతికకాయాన్ని గురువారం ఉదయం 7.30 గంటలకు మొదట నకిరేకల్‌కు తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 10.30 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత స్వగ్రామమైన పాలెం తీసుకెళ్తారు. కాగా, అమెరికాలో ఉన్న నోముల కుమార్తె బుధవారం రాత్రి 8 గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. -
గుడ్‌బై మారడోనా
మారడోనా... నీవిక రావని, ఇకపై లేవనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేమంటూ దివికెగిన సాకర్స్టార్కు ఫుట్‌బాల్ ప్రపంచం, జనవాహిని, అభిమానులు తుదివీడ్కోలు పలికారు. ముఖ్యంగా అర్జెంటీనా అంతటా విషాదం అలుముకుంది. అభిమానజనం దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. పూల చేతితో, కన్నీటి కళ్లతో నివాళి అర్పించింది. బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): సాకర్ లోకం కన్నీటి సంద్రమైంది. యావత్ అర్జెంటీనా విలపించింది. అభిమాన హీరో ఇక లేడనే వార్తని జీర్ణించుకోలేకపోయింది. గుండెపోటుతో బుధవారం మృతి చెందిన డీగో మారడోనాను కడసారి చూసిన కనులన్నీ నీళ్లతో నిండిపోయాయి. అంతిమ వీడ్కోలు పలికే చేతులు అచేతనమయ్యాయి. బరువెక్కిన హృదయాలు, బాధాతప్త మనసులు మౌనంగానే రోదిస్తే... నిలువెత్తు అభిమానం నింపుకున్న జనం బోరుమంది. ఆఖరిసారి దిగ్గజాన్ని చూసుకోవాలని పోటీపడిన అభిమానులతో పరిస్థితి కూడా మారిపోయింది. వెంటనే పరిస్థితి చేజారకుండా స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేశారు. అయిన ఆ లాఠీల దెబ్బలు, పోలీసు జాగిలాల దాడులు అభిమాన లోకాన్ని ఏమాత్రం నియంత్రించలేకపోయాయి. గురువారం ఉదయమే సాధారణ జనానికి నివాళి అర్పించేందుకు అర్జెంటీనా అధ్యక్ష నివాసంలో ఏర్పాటు చేశారు. కానీ రాత్రి నుంచే ‘కరోనా కాలాన్ని’ లెక్కచేయని అభిమానులు వేలసంఖ్యలో వరుస కట్టారు. అనంతరం లాంఛనాలతో అతనికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. అభిమానం... ఆగ్రహం వేల సంఖ్యలో గుమిగూడిన అభిమానులు, ప్రజలు తమ దేశానికి ప్రపంచకప్ అందించిన దిగ్గజాన్ని ఆఖరిసారిగా చూసేందుకు క్యూ కట్టేందుకు ఎగబడ్డారు. వీరిని నియంత్రించడం బాడీగార్డులు, భద్రతా సిబ్బంది తరం కాలేకపోయింది. అనుమతించడం లేదంటూ ఊగిపోయిన జనాలు ఒక్కసారిగా సహనం కోల్పోయారు. చేతిలో ఉన్న వాటర్ బాటిళ్లు, శ్రద్ధాంజలి ఘటించేందుకు తెచ్చిన పూల బొకేలతో పోలీసులపై విసిరికొట్టారు. దీంతో విషాదంతో బరువెక్కిన అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అది... ఇప్పుడు మారడోనా స్టేడియం ఇటలీలోని సాన్ పాలో స్టేడియం ఇకపై మారడోనా స్టేడియంగా మారుతోంది. నేపుల్స్ నగరం మేయర్ లూగి డి మాగిస్ట్రిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. నేపుల్స్లో ఉన్న ఈ మైదానంలో మారడోనా నేతృత్వంలోని నపోలి జట్టు ఇటాలియన్ ఫుట్‌బాల్ లీగ్ (సెరియా ‘ఎ’)లో రెండు సార్లు (1987, 1990) విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నపోలి క్లబ్ విజేతగా నిలువలేదు. అందుకే అతని సారథ్య విజయానికి ఈ స్టేడియాన్ని అంకితమిస్తున్నట్లు మేయర్ మాగిస్ట్రిస్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పేరు మార్పు ప్రక్రియను వెంటనే ప్రారంభించినట్లు చెప్పారు. ఫుట్‌బాల్‌ను కట్ చేయను గ్రేటెస్ట్ సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా ఆట తనకెంత ప్రాణప్రదమో మైదానంలో చేతల్లో చూపినట్లే... వెలుపల చేష్టల్లోనూ చూపాడు. కేక్‌పై ఫుట్‌బాల్ లోగోను కోయనంటే కోయనని చెప్పాడు. ఈ విషయాన్ని భారత దిగ్గజ ఫుట్‌బాలర్ ఎం. విజయన్ తాజాగా వివరించారు. 2012లో భారత్‌కు విచ్చేసిన డీగో కోసం కన్నుర్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ స్టేడియం ఆకారంలో కేక్‌ను తయారు చేశారు. దానిపై ఫుట్‌బాల్ లోగోను తీర్చిదిద్దారు. మారడోనాను కట్ చేయమంటే తిరస్కరించాడు. తను ప్రేమించే సాకర్ బంతిని కోయనన్నాడు. ఫుట్‌బాల్ భాగాన్ని కాకుండా మిగత కేక్ కోసి ఆటపై తనకున్న మమకారాన్ని గుర్తుచేశాడని విజయన్ చెప్పారు. ‘నిస్సందేహంగా మారడోనా దేవుడు. దేవుడికి మరణం లేదు. సాకర్ ఆరాధించే గుండెల్లో అతను చిరస్థాయిగా ఉంటాడు’ అని విజయ్ నివాళులు అర్పించాడు. అర్జెంటీనా జెండా... జెర్సీ జననివాళికి ముందుగా మారడోనా పార్థివ దేహాన్ని కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో ఏకాంతంగా ఉంచారు. వారంతా కన్నీటి నివాళులు అర్పించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అతని శవపేటికపై జాతీయ పతాకాన్ని కప్పారు. దానిపైనే అతను బరిలోకి దిగిన 10 నంబర్ జెర్సీని ఉంచారు. అందరికంటే ముందుగా డీగో కుమార్తె తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించింది. తర్వాత కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా తమ తుది వీడ్కోలు పలికారు. ఆ తర్వాత 1986 ప్రపంచకప్ విజేత సభ్యులు, అర్జెంటీనా ఫుట్‌బాలర్లు, బోకా జూనియర్స్ ఆటగాళ్లు తమ ఆత్మీయ సూపర్ హీరోను కడసారి చూసుకున్నారు. -
భారత్ వెళ్లేందుకు బోర్డు అవకాశం ఇచ్చినా...
ముంబై: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను హైదరాబాద్ పంపించేందుకు బీసీసీఐ సన్నద్ధమైనా... అతను అంగీకరించలేదు. టూర్ మధ్యలో వెనక్కి రాకుండా సిడ్నీలోనే ఉండిపోవాలని అతను నిర్ణయించుకున్నాడని బోర్డు వెల్లడించింది. ‘తండ్రి మరణవార్త అనంతరం సిరాజ్‌తో బీసీసీఐ అధికారులు మాట్లాడారు. ఇలాంటి బాధాకర సమయంలో కుటుంబంతో ఉండే విధంగా భారత్‌కు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే అతను హైదరాబాద్‌కు వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. జట్టుతోపాటు ప్రాక్టీస్ కొనసాగిస్తానని సిరాజ్ అన్నాడు. అతని బాధను పంచుకుంటూ బోర్డు ఈ స్థితిలో సిరాజ్‌కు అండగా నిలుస్తుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు సిరాజ్‌కు ధైర్యం చెబుతూ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘ఈ బాధను అధిగమించే శక్తి అతనికిప్పుడు కావాలి. ఆసీస్ పర్యటనలో అతను రాణించాలని కోరుకుంటున్నా. అతని మనోధైర్యానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశాడు. భారత్ తరఫున 1 వన్డే, 3 టి20లు ఆడిన సిరాజ్ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఆసీస్ పర్యటనలో అతను టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపికయ్యాడు. -
ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అతైయా ఇక లేరు
భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా (91) ఇక లేరు. గురువారం ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా భాను అతైయా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్లు భాను కుమార్తె రాధికా గుప్తా తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మెదడులో ఓ ట్యూమర్ ఉన్నట్టు కనుగొన్నారు. మూడేళ్లుగా ఆమె శరీరంలో సగభాగం చచ్చుబడిపోవడంతో మంచానికే పరిమితం అయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించారు భాను అతైయా. 1983లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారామె. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అందుకున్నారు భాను. గురుదత్ తెరకెక్కించిన ‘సీఐడీ’ (1956)తో కెరీర్ ప్రారంభించి సుమారు వంద సినిమాలకు పైనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘ఆమ్రపాలి’ చిత్రానికి వైజయంతి మాలకు, ‘గైడ్’లో వహీదా రెహమాన్‌కు, ‘సత్యం శివం సుందరం’లో జీనత్ అమన్‌కు ఆమె చేసిన కాస్ట్యూమ్స్‌కి బాగా పేరొచ్చింది. ‘లేకిన్, లగాన్’ చిత్రాలకు జాతీయ అవార్డులను అందుకున్నారు భాను. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడారామె... ‘‘ఆస్కార్ వేడుకలో కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లు ‘అవార్డు మీకే వస్తుంది’ అన్నారు. కానీ నేను మాత్రం నా పని నేను సరిగ్గా చేశాను. గాంధీజీ పేరుకి, స్వాతంత్య్ర ఉద్యమానికి న్యాయం చేశాను. అది చాలు అని మాత్రమే అనుకున్నాను. అవార్డు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి’’ అని ఆ ఇంటర్వ్యూల్లో చెప్పారు భాను. 2012లో అవార్డును భద్రపరచడానికి ఆస్కార్ అవార్డు అకాడమీకే అవార్డును తిరిగి ఇచ్చారు భాను. ఆమె రచించిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్’ పుస్తకం విడుదల సమయంలో ‘‘సినిమాకు కాస్ట్యూమ్స్ చాలా ప్రధానం. కానీ భారతీయ సినిమా కాస్ట్యూమ్స్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అన్నారు భాను. దాదాపు 50 ఏళ్ల పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వందకు పైగా సినిమాలు చేశారు భాను అతైయా. 2004లో ‘స్వదేశ్’ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. భాను మృతి పట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భాను అతైయా అంత్యక్రియలు ముంబైలోని చందన్ వాడీ స్మశాన వాటికలో జరిగాయి. -
పాశ్వాన్‌కు కన్నీటి వీడ్కోలు
పట్నా: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం బిహార్ రాజధాని పట్నాలో ముగిశాయి. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న జనార్దన్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్ అంత్య క్రియలు నిర్వహించారు. పాశ్వాన్ చితికి ఆయన కుమారుడు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నిప్పంటించారు. బిహార్ సీఎం నితీశ్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, అధిక సంఖ్యలో పాశ్వాన్ అభిమానులు తరలివచ్చారు. పాశ్వాన్ స్వస్థలం హాజీపూర్ నుంచి జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. చితికి నిప్పపెట్టాక చిరాగ్ తీవ్ర భావోద్వేగానికి గురై కుప్పకూ లిపోయాడు. కొంతసేపు అచేతన స్థితికి చేరుకున్నాడు. చిరాగ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని సమీప బంధువులు తెలిపారు. -
ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలు ఫొటోలు
-
పేదల డాక్టర్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, పులివెందుల: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలు కార్యక్రమం ముగిసింది. అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. సమాధుల తోట వద్దకు అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి పేదల డాక్టర్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. -
యూపీ నిర్భయ పట్ల అమానవీయం
హథ్రాస్/లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ‘నిర్భయ’ ఘటన బాధితురాలి పట్ల అధికార యంత్రాంగం మరోసారి అమానవీయంగా వ్యవహరించింది. ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన ఆ దళిత యువతి(19)కి అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించింది. అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ పోలీసులు తమను బలవంతపెట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. తాజా పరిణామంపై రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ క్రూరంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా హడావుడిగా అంత్యక్రియలు ముగించడంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. కుటుంబసభ్యుల కోరిక మేరకే అంత్యక్రియలు జరిపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారంలోగా దర్యాప్తు పూర్తి చేయించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ యూపీ సీఎంకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సీఎం యోగి బుధవారం ఉదయం బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. అర్థరాత్రి జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రాస్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన దళిత యువతిపై 15 రోజుల క్రితం అగ్ర వర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, పాశవికంగా వ్యవహరించారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయింది. రాత్రి సమయంలో ఆస్పత్రి నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు వెంటరాగా బాధితురాలి మృతదేహాన్ని తీసుకుని కుటుంబసభ్యులు అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న హథ్రాస్ జిల్లాలోని సొంతూరుకు చేరుకున్నారు. అప్పటికి అర్ధరాత్రి 2.30 గంటలైంది. అధికారులు, పోలీసుల సమక్షంలో అప్పటికప్పుడే దహన సంస్కారాలు జరిపించారు. ఆ సమయంలో మృతురాలి తండ్రితోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిపి సుమారు 40 మంది శ్మశానవాటికలో ఉన్నారని ఆమె కుటుంబసభ్యుడొకరు చెప్పారు. మీడియా సభ్యులు దరిదాపుల్లోకి రాకుండా ప్రత్యేక పోలీసు దళాన్ని కూడా రంగంలోకి దించారు. ‘నా కూతురికి అర్థరాత్రి దాటిన తర్వాత 2.30–3 గంటల సమయంలో అంత్యక్రియలు జరిగాయి’ అని ఆమె తండ్రి తెలిపారు. ‘మా నాన్న ఢిల్లీ ఆస్పత్రి నుంచి హథ్రాస్‌కు చేరుకున్న వెంటనే పోలీసులు మా ఇంటికి వచ్చారు. మా నాన్నను బలవంతంగా తమతోపాటు శ్మశానవాటికకు తీసుకెళ్లారు’ అని బాధితురాలి సోదరుడు తెలిపారు. తాము గ్రామానికి చేరుకోకమునుపే పోలీసులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారని ఓ కుటుంబసభ్యుడు ఆరోపించారు. తీవ్ర విమర్శలు హత్యాచారానికి దారి తీసిన పరిస్థితులు, అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు జరిపించడంపై వివిధ ప్రతిపక్షపార్టీలు, వామపక్షాలు, కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఖరిపై ఢిల్లీలోని యూపీ భవన్ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తెలిపారు. తన కూతురికి న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. ‘బాధితురాలికి, ఆమె కుటుంబానికి మీ ప్రభుత్వం భద్రత కల్పించలేక పోయింది. మరణంతో సహా ఆమెకున్న అన్ని హక్కులను హరించింది. ముఖ్యమంత్రిగా కొనసాగడానికి మీకు ఎలాంటి నైతిక హక్కు లేదు. రాజీనామా చేయండి’ అంటూ ప్రియాంక ట్విట్టర్లో సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. సాక్ష్యాలను చెరిపేసేందుకు పోలీసులు అర్థరాత్రి అంత్యక్రియలు జరిపారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ ఆరోపించారు. కోల్‌కతాలో యూపీ సీఎం కటౌట్ దహనం -
చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఉన్న ఈస్ట్ దీనదయాళ్నగర్ ఓపెన్ ప్రమాదవశాత్తు నాలాలో పడి శుక్రవారం మృతి చెందిన పన్నెండేళ్ల చిన్నారి సుమేధ కపూరియా అంత్యక్రియలు శనివారం జరిగాయి. మల్కాజిగిరిలోని పటేల్ నగర్ స్మశాన వాటికలో దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. దహన సంస్కారాలకు సమేధ మృత దేహాన్ని తరలించిన తల్లిదండ్రులు, కుంటుంబ సభ్యులు శోకసంద్రంతో ఉన్నారు. శుక్రవారం సరదాగా సైకిల్ తొక్కుదామని బయటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయి దాదాపు పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో విగతజీవిగా లభించింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. (ఉసురు తీసిన నాలా) సుమేధ మృతికి జీహెచ్ఎంసీ అధికారులే కారణం: తమ కూతురు సుమేధ మృతి చెందడానికి పరోక్షంగా జీహెచ్ఎంసీ అధికారులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులపై బాలిక తల్లిదండ్రులు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అగ్నివేశ్‌కు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ మృతి పట్ల పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. వెట్టి కార్మికులు, స్త్రీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన నిజమైన సెక్యులర్ నేతగా ఆయనను కొనియాడారు. అగ్నివేశ్ భౌతికకాయానికి శనివారం ఆర్యసమాజ్ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. సమాజంలో అల్పసంఖ్యాకుల తరఫున ఆయన జీవితాంతం పోరాడారని, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల పక్షాన ఆయన తన గొంతు వినిపించారని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నివాళులు అర్పించారు. దేశంలో మతసామరస్యం నెలకొల్పేందుకు ఆయన కృషి మరువలేనిదని మాజీ ప్రధాని మన్మోహన్ కొనియాడారు. వామపక్ష పోరాటాలకు ఆయన గొప్ప స్నేహితుడని, పైకి కాషాయం ధరించినా లోపల నిజమైన సెక్యులర్ అని సీపీఐ లీడర్ డి రాజా ప్రశంసించారు. డీఎంకే నేత స్టాలిన్, పీఎంకే నేత రామ్‌దాస్ సైతం అగ్నివేశ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తన సిద్ధాంతాలతో విభేదించేవారు ఆయనపై అనేకమార్లు దాడులకు దిగినా, నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డారని లాయర్ మహమూద్ ప్రాచా ప్రశంసించారు. -
కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు
మానవత్వాన్ని కరోనా మంట గలిపేసింది. రోగంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి కుటుంబ సభ్యులే వెళ్లలేని పరిస్థితిని తీసుకొచ్చింది. తాకితే కరోనా వచ్చేస్తుందేమోనన్న భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. మాయదారి మహమ్మారి ప్రాణంతోపాటు అయిన వారిని దూరం చేస్తోంది. అసువులు బాస్తే భయంతో బంధువులూ సైతం రావడం లేదు. కనీసం కడసారి చూపునకు నోచుకోలేకపోతున్నారు. చివరకు అంత్యక్రియలకు అడుగడుగునా ఆటంకాలే. మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిద్దామంటే... అయిన వాళ్లే అడ్డు పడుతున్నారు. అంతిమ సంస్కారాలకు ఆ నలుగురు కూడా రాని పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో మేమున్నామంటూ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో కొందరు యువకులు ముందుకొచ్చి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సాక్షి, శ్రీకాకుళం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మానవ సంబంధాలను ప్రశ్నిస్తోంది. అక్కడెక్కడో కాదు మన దగ్గర మచ్చుకైనా మానవత్వం లేకుండా చేస్తోంది. కుటుంబంలో ఒకరికి కరోనా సోకితే ఇంట్లో వాళ్లందరికీ వచ్చేస్తుందన్న భయం పట్టుకుంది. కరోనా వచ్చిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సైతం వణుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇక చనిపోయిన రోగుల మృతదేహాల వద్దకు వెళితే కరోనా చుట్టేస్తుందన్న అభద్రతా భావాన్ని సృష్టించింది. వాస్తవంగా కరోనాతో చనిపోయిన ఆరు గంటల తర్వాత మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. ఈ విషయాన్ని అధికారులు, వైద్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం భయపడిపోతున్నారు. కరోనాతో చనిపోతే దగ్గరకు రావడం లేదు. అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో తరలింపు ఆ మృతదేహాన్ని ముట్టు కోవడానికి సాహసించడం లేదు. కరోనా మృతుల వద్దకే కాదు సాధారణంగా చనిపోయిన వారి దగ్గరికి సైతం వెళ్లడం లేదు. కరోనా వలన చనిపోయారేమోనన్న భయంతో మృతదేహాలను తాకడం లేదు. దీనితో అంతిమ సంస్కారాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ అవగాహనతో కొందరు యువకులు ఆ మృతదేహాలకు దహన కార్యక్రమాలు చేపట్టేందుకు మేమున్నా మంటూ ముందుకొస్తున్నారు. మృతి చెందిన 6 గంటల తర్వాత కరోనా వ్యాపించదని నిరూపిస్తున్నారు. రెడ్‌క్రాస్ తరపున జిల్లాకు చెందిన పి.తవుడు, ఎన్.ఉమాశంకర్, జి.సత్యసుందర్, ఎల్.రవికుమార్, పి.సూర్య ప్రకాష్, పి.చైత న్య, సిహెచ్ కృష్ణంరాజు, జి.విజయబాబు, బి.శ్రీధర్, కె.సత్యనారాయణ, జి.పవన్‌కుమార్ (డ్రైవర్), ఎన్.కోటీశ్వరరావు తదితరులు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 20 కోవిడ్ మృతదేహాలకు, నాలుగు సాధారణ మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. కరోనాతో మృతి చెందినా, సాధారణ మృతులకైనా ఎక్కడైనా అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే 8333941444కు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తామని స్వర్గధామం రథం కో ఆర్డినేటర్ ఎన్.కోటీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కరోనా మృతదేహాలపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదని, దహన సంస్కారాలు చేసేందుకు తాము సిద్ధమని తెలిపారు. -
ప్రియనేతకు తుదివీడ్కోలు
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరుల అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ఆయనకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికారు. లోధి రోడ్‌లోని విద్యుత్ దహన వాటికలో మంగళవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాల మధ్య ప్రణబ్ ముఖర్జీకి ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఇతరులు పీపీఈ కిట్స్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతికి ఆర్మీ దళం గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించింది. అంతకుముందు ప్రణబ్ మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో త్రివర్ణ పతాకం కప్పి దహనవాటికకు తీసుకువచ్చారు. పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న అదే ఆసుపత్రిలో ప్రణబ్‌కు వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స సైతం నిర్వహించారు. అదే సమయంలో ఆయనకు కరోనా కూడా సోకింది. భారత రత్న పురస్కార గ్రహీత అయిన ప్రణబ్ మృతికి సంతాప సూచకంగా కేంద్రం సోమవారం నుంచి 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖుల నివాళి ప్రణబ్ నివాసంలో ఆయన భౌతిక కాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ (నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా (ఎయిర్‌ఫోర్స్), సీనియర్ కాంగ్రెస్ నేతలు, పార్టీలకతీతంగా సీనియర్ నేతలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాజీ ప్రధాని, చిరకాల సహచరుడు మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తదితరులు ప్రణబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రణబ్ నివాసంలోని ఒక గదిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా, ప్రముఖుల సందర్శనార్థం మరో గదిలో ఏర్పాటు చేసిన ప్రణబ్ చిత్రపటానికి నాయకులు పుష్పాంజలి సమర్పించారు. ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసానికి తరలివచ్చారు. వారంతా క్రమశిక్షణతో అభిమాన నేతకు అశ్రు నివాళి అర్పించారు. కొందరు అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ముఖాన్ని కప్పి ఉంచే ఫేస్ షీల్డ్‌ను సైతం ధరించారు. కోవిడ్ ముప్పు నేపథ్యంలో అంతిమయాత్రకు అధికారికంగా ఉపయోగించే వాహనంలో కాకుండా, మరో వాహనంలో ప్రణబ్ భౌతిక కాయాన్ని లోధి రోడ్‌లోని శ్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్స్ ధరించిన సిబ్బంది మృతదేహాన్ని వాహనంలోకి చేర్చారు. ప్రణబ్ చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వగృహంలో మ్యూజియం పశ్చిమబెంగాల్లోని జంగీపూర్‌లో ఉన్న తమ స్వగృహంలో ఒక అంతస్తును తమ తండ్రి జ్ఞాపికలతో ఒక మ్యూజియంగా రూపొందిస్తామని, ఒక గ్రం«థాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి స్మృత్యర్థం ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని అభిజిత్ కోరారు. తన తండ్రి కోసం ఆగస్టు 4న జంగీపూర్‌లోని తమ వ్యవసాయ క్షేత్రం నుంచి ఒక పనస పండును తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘అవి ఇక్కడ కూడా లభిస్తాయి. కానీ మా సొంత క్షేత్రం నుంచి ఆయన కోసం తీసుకురావాలనిపించింది. ఆయన ఆ పండును సంతోషంగా స్వీకరించారు. అప్పుడు అదృష్టవశాత్తూ ఆయన షుగర్ లెవల్స్ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ఆయన కోరికను తీర్చినందుకు చాలా సంతోషించాను’అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో కావచ్చు, జీవితంలో కావచ్చు.. ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఉండవద్దు’అని తన తండ్రి పలుమార్లు తనతో చెప్పారన్నారు. ప్రణబ్‌కు శాయశక్తులా చికిత్స అందించిన వైద్యులకు అభిజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ లోకంలో ఆయన పోషించాల్సిన పాత్ర ముగిసిందనుకుంటా. ఒక సాధారణ వ్యక్తి కోరుకునే అన్నింటినీ ఆయన పొందారు’అని వ్యాఖ్యానించారు. చైనా, యూఎస్‌ల్లో.. పశ్చిమబెంగాల్లోని ప్రణబ్ స్వగ్రామం మిరాటీలో గ్రామస్తులు ప్రియతమ నేతకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘దాదాపు ప్రతీ దుర్గాపూజ ఉత్సవానికి కచ్చితంగా స్వగ్రామానికి వచ్చేలా ప్రణబ్ ప్రయత్నించేవారు. ఆయన లేకుండా దుర్గాపూజ ఉత్సవం ఎప్పటిలా ఎన్నటికీ జరగబోదు’అని గ్రామంలోని ఆలయ పూజారి బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనా విదేశాంగ కార్యాలయం ప్రణబ్ చిత్రపటానికి నివాళులర్పించింది. అమెరికా, భారత్ కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రణబ్ విశేష కృషి చేశారని అమెరికా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తెలిపారు. గొప్ప నేతను దేశం కోల్పోయింది ప్రణబ్ ముఖర్జీ మృతికి మంగళవారం కేంద్ర కేబినెట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక గొప్ప నాయకుడిని, అద్భుతమైన పార్లమెంటేరియన్‌ను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించింది. ‘పాలనలో అనితరసాధ్యమైన అనుభవం ఉన్న నేత. దేశ విదేశాంగ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక మంత్రిగా గొప్ప సేవలందించారు’అని కేబినెట్ ఒక తీర్మానంలో ప్రశంసించింది. జాతిజీవనంపై తనదైన ముద్రను వదిలివెళ్లారని, ఆయన మృతితో శిఖరాయమాన దార్శనిక నేతను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి ప్రణబ్ అందించిన సేవలను భారతీయులు తరతరాలు గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ప్రణబ్ నివాసం వద్ద సెల్యూట్ చేస్తున్న సైనిక జవాన్లు -
కూతురు ఆత్మహత్య.. భర్తతో అంత్యక్రియలు
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పెళ్లి చేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య(25) తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోన్న శరణ్య భర్త వేధింపులు తాళలేక ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు కూతురు మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకువచ్చి ఆమె భర్త చేత అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా సమయంలో బెంగళూరు నుంచి తమ కూతురి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఎలాంటి బేషజాలకు పోకుండా భర్త రోహిత్ చేత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. శరణ్య మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో.. అల్లుడు రోహిత్ వేధింపుల వల్లనే శరణ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ గొడవలన్నీ పెట్టి సంప్రదాయం ప్రకారం అల్లుడితో కూతురికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ప్రేమ పెళ్లి: టెకీ అనునామానాస్పద మృతి) -
అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదు
సాక్షి, పాలమూరు : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ వైరస్‌పై భయపడుతున్న వారందరికీ భరోసా కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో మృత్యువాత పడిన వారి అంతిమ సంస్కారాలకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం నిర్వహించినంత మాత్రాన కరోనా సోకదన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ తదితర ఆస్పత్రుల్లో మృతి చెందిన రోగులను వారి పిల్లలే తీసుకెళ్లడానికి ముందుకు రాకపోవడం చూస్తుంటే మానవత్వం మంటగలుస్తోందన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఐదుగురి నుంచి పది మంది వరకు పీపీఈ కిట్లు వేసుకుని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరయ్యానన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నారు. -
22 గంటలపాటు ఇంట్లోనే మృతదేహం
సాక్షి, పాల్వంచ: కరోనా మహమ్మారి మనుషుల మధ్య మానవత్వాన్ని కూడా దూరం చేస్తోంది. ఓ వృద్ధుడు గుండెపోటుతో చనిపోతే.. కరోనా వైరస్ సోకి చనిపోయాడని భయపడి, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ సహకరించలేదు. ఈ సంఘటన పాల్వంచ మండలం నాగారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్య(56)కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా శనివారం సాయంత్రం మృతిచెందాడు. అయితే కరోనా కారణంగా మృతి చెంది ఉంటాడని భావించిన స్థానికులు భయంతో అంతిమ సంస్కారాలకు హాజరుకాకుండా దూరంగా ఉన్నారు. మృతుడి ఇరుగు పొరుగు, గ్రామస్తులెవరూ కనీసం చూసేందుకు కూడా రాలేదు. దీంతో మృతదేహం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 22 గంటలపాటు ఇంట్లోనే ఉంచారు. స్థానికులు సహకరించకపోవడంతో పాల్వంచలోని మున్సిపాల్ కార్మికులను ముగ్గుర్ని పిలిపించి, స్థానిక రైతు రంజిత్ ట్రాక్టర్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో నివాసం ఉండే వారు కూడా మృతదేహాన్ని తమ వీధి నుంచి తీసుకెళ్లొద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. పంచాయతీలు బాధ్యత తీసుకోవాలి నాగారం గ్రామంలో మల్లాది వెంకయ్య మృతి చెందితే అంత్యక్రియలు చేయడానికి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఇచ్చేందుకు సర్పంచ్, కార్యదర్శి నిరాకరించారని సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు. అదే గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి ట్రాక్టర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే పంచాయతీలు బాధ్యత తీసుకుని దహన సంస్కారాలు నిర్వహించాలని కోరారు. -
ఫొటోగ్రాఫర్ నుంచి మంత్రి స్థాయికి..
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు (60) కన్నుమూశారు. విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనాతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహంతో కొన్నిరోజులుగా బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా ఆరోగ్యంలో మార్పు రావడంతో ప్రాణాలు విడిచారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ఇతర సమస్యలు ఆయనను ఇబ్బంది పెట్టడంతో ఆరోగ్యం క్షీణించింది. బీజేపీ అగ్రనేతల ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ బృందం వెంటిలేటర్‌పై ఉన్న మాణిక్యాలరావుకు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె గట్టిం సింధు, అల్లుడు నవీన్‌కిషోర్ ఉన్నారు. గతనెల 3న కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిరోజుల్లో కరోనా నెగెటివ్ వచ్చినా ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రాణాలు వదిలారు. మాణిక్యాలరావు పార్థివదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న దృశ్యం అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు పైడికొండల సుబ్బారావు, రంగనాయకమ్మ దంపతుల తొలి సంతానం మాణిక్యాలరావు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. మాణిక్యాలరావు సామాన్య ఫొటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలోని కేఎన్ రోడ్డులో ప్రభాతా టాకీస్ వద్ద సారథి స్టూడియోను ప్రారంభించారు. తర్వాత స్టూడియోను కుమార్తె సింధు పేరిట సింధు స్టూడియోగా మార్చారు. అనంతర కాలంలో బస్ డిపో ఎదురుగా సింధు షూమార్టును ప్రారంభించారు. బాల్యంలోనే రాష్ట్రియ స్వయం సేవక్ సిద్ధాంతాలకు ఆకర్షితులై సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 7వ తరగతి చదువుతుండగా జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. హైసూ్కల్ విద్యార్థి దశలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం చేశారు. బీజేపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా పనిచేసిన ఆయన పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన నరసాపురం ఎంపీగా యూవీ కృష్ణంరాజును గెలిపించడంలో విశేష కృషి చేశారు. 13వ వార్డు శివాలయం వీధిలో కౌన్సిలర్‌గా పోటీచేసి విజయం పొందలేకపోయారు. 2019లో నరసాపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పైడికొండల పోటీచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం వచ్చినా, తల్లి మరణం కారణంగా ఆ పదవిని స్వీకరించలేదు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ ఉపాధ్యక్షుడిగా సీమాంధ్ర అవసరాలను కేంద్ర నాయకుల వద్దకు తీసుకెళ్లారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడిగా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, 30 మండలాల్లో శీతల శవపేటికల ఏర్పాటు వంటివి చేశారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య కరసేవలో పాల్గొన్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేబినెట్లో ఆయన దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిట్ తెచ్చిన ఘనత ఆయనిదే రాష్ట్ర విభజన అనంతరం జాతీయ విద్యాసంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేయడంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు నిట్ ఇక్కడికి రాకుండా మోకాలడ్డిన సమయంలో కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి, బీజేపీ అగ్రనాయకుల ఆశీస్సులతో జాతీయ విద్యాసంస్థను ఇక్కడకు తీసుకువచ్చారు. మంత్రిగా రాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేశారు. పట్టణంలో బలుసులమ్మ, ముత్యాలమ్మ, నందికొమ్మ రామాలయ నూతన నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి. ధైర్యం చెప్పి వెళ్లి.. ‘కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్ వచ్చింది. కరోనా వస్తే రహస్యంగా దాయవద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి కాదు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, ఆరోగ్యంపై సాధ్యమైనంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది లేదు’ అంటూ ఆయన గతనెల 4న వాట్సాప్‌లో వీడియో సందేశం ఇచ్చి కరోనా చికిత్సకు విజయవాడ వెళ్లారు. చిరునవ్వు చిరునామా చెరిగిపోయింది వెండిలాంటి జుట్టు, ముఖంపై చిరునవ్వు చిరునామా, రండి, కూర్చోండి అంటూ ఆప్యాయత నిండిన పిలుపు కలబోతగా మాణిక్యాలరావు జనంతో ఉన్నారు. ఆనందం వచ్చినా, కోపం వచ్చినా దాచుకోని వ్యక్తిగా మాణిక్యాలరావు మెలిగారు. ఆయన మరణంతో జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో మాణిక్యాలరావు సత్సంబంధాలు కొనసాగించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, అగ్రనేతలు అమిత్‌షా వంటి వారితో పాటు జేవీఎల్ నరసింహారావు, కిషన్‌రెడ్డి, సోము వీర్రాజు వంటి వారితో స్నేహసంబంధాలు కొనసాగించారు. ఆయనకు కర్ణాటక పార్టీ నేతలతోనూ సంబంధాలు ఉన్నాయి. వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వివిధ వర్గాలతో కలిసిమెలిసి పనిచేశారు. నిట్ పైడికొండలను మరువదు తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్ స్థాపనలో కీలకపాత్ర పోషించినందుకు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును నిట్ ఎన్నటికీ మరువదని డైరెక్టర్ సీఎస్పీ రావు అన్నారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మాణిక్యాలరావు మరణం ఊహించలేదని, కరోనా నుంచి కోలుకుని తిరిగి వస్తారనుకుంటున్న దశలో ఆయన మరణం విషాదకరం అని పేర్కొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు దేవదాయ, ధర్మాదాయశాఖ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు పార్థివదేహానికి అధికార లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు జరిగాయి. స్థానిక 6వ వార్డులోని శ్మశాన వాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత పట్టణానికి చేరుకున్న మాణిక్యాలరావు పార్థివదేహాన్ని స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆయన కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు ఉంచారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు 20 మందిని మాత్రమే శ్మశాన వాటికలోకి అనుమతినిచ్చారు. శ్మశాన వాటిక ప్రాంగణం వద్ద మాణిక్యాలరావు చిత్రపటాన్ని సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వచ్చిన పోలీసు దళం గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమరి్పంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, నాయకులు ఈతకోట తాతాజీ, అయినం బాలకృష్ణ, కంచుమర్తి నాగేశ్వరావు, నల్లకంచు రాంబాబు, తాడికొండ వాసు తదితరులు హాజరయ్యారు. సోము వీర్రాజు కన్నీటి పర్యంతం మాణిక్యాలరావు అంత్యక్రియల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారాన్ని పంచుకున్న వ్యక్తిని అధికార లాంఛనాలతో పంపించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. 1981లో తన ఆ«ధ్వర్యంలో మాణిక్యాలరావు బీజేపీలో చేరారన్నారు. మాణిక్యాలరావు శాసనసభ్యులుగా, మంత్రిగా ఉత్సాహంగా పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిని ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదన్నారు. మాణిక్యాలరావు కుటుంబానికి పార్టీ తరఫున సానుభూతి తెలిపారు. మాణిక్యాలరావు మరణం పారీ్టకి, వ్యక్తిగతంగా తనకు తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని కోల్పోయా వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం పట్ల రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంతాపం తెలిపారు. దేవదాయ మంత్రిగా జీర్ణావస్థలో ఉన్న పలు ఆలయాలను ఆయన పునరుద్ధరించారన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారన్నారు. నిట్‌ను తాడేపల్లిగూడెం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడానని, ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా వస్తారని తాను భావించానని, ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. చాలా బాధ కలిగించింది కరోనా మహమ్మారికి మాజీ మంత్రి మాణిక్యాలరావు బలి కావడం చాలా బాధ కలిగించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు క్రమశిక్షణ, నిబద్ధత గల నేత అని అన్నారు. ఉదయం ఆయన అల్లుడుతో ఫోన్లో మాట్లాడి యోగ క్షేమాలు కనుక్కుంటే బాగానే ఉందని చెప్పగానే ఎంతో సంతోషించానన్నారు. బీజేపీలో పేరున్న నాయకుడు ఇలాంటి పరిస్థితుల్లో దూరమవ్వడం చాలా బాధాకరం అన్నారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని ఎమ్మెల్యే కొట్టు అన్నారు. మంత్రి నాని దిగ్భ్రాంతి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు ఆయన తెలిపారు. సౌమ్యులు, ప్రజల నాయకుడు మూడున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో నిబద్ధత, నిజాయతీ, అంకితభావంతో పనిచేసిన నేత అని కొనియాడారు. దేవదాయశాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారని, బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో నిట్ విద్యాసంస్థ నెలకొల్పటంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఆప్యాయంగా పలకరించే ఆయన మృతి బీజేపీకి తీరని లోటన్నారు. -
కరోనా మృతుడికి అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే
కర్నూలు(సెంట్రల్): కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కరోనా కారణంగా మరణించిన ఓ వ్యక్తికి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. కర్నూలు పాతబస్తీకి చెందిన వ్యక్తి శుక్రవారం కరోనాతో స్థానిక పెద్దాసుపత్రిలో మృతిచెందాడు. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆసుపత్రి, మున్సిపల్ సిబ్బందితో కలిసి పీపీఈ కిట్లు ధరించి నగరంలోని సంతోష్‌నగర్ శ్మశాన వాటికలో శుక్రవారం రాత్రి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. వైరస్‌పై ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకే తాను స్వయంగా అంత్యక్రియల్లో పాలుపంచుకున్నట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు. -
సైనికుల అంత్యక్రియలు.. చైనా అభ్యంతరం!
బీజింగ్: గల్వాన్ వ్యాలీ ఘటనపై చైనా ఇప్పటికి కూడా వాస్తవాలను వెల్లడించడం లేదు. ఈ క్రమంలో నాటి ఘర్షణలో మరణించిన సైనికులకు ప్రభుత్వ లాంఛనాలు కాదు కదా.. కనీసం సాంప్రదాయపద్దతిలో అంత్యక్రియలు కూడా నిర్వహించకూడదంటూ చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు అమెరికా ఇంటిలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు సదరు సైనిక కుటుంబాలపై చైనా ఒత్తిడి తెచ్చినట్లు ఇంటిలిజెన్స్ వెల్లడించింది. గత నెల 15న గల్వాన్ వ్యాలీ ఘర్షణలో ఇరు దేశాలు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో అమరులైన భారత సైనిక వీరులకు యావత్ దేశప్రజలు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. కేంద్రం అమరులైన సైనికుల వివరాలు వెల్లడించడమే కాక వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఇదే కాక జూన్ నెల మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సైనికులు కుటుంబాలకు సంతాపం తెలిపారు. (గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!) అయితే గల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగి నెలరోజులు కావస్తున్నప్పటికి చైనా మాత్రం ఇంకా తన మరణించిన సైనికులు వివరాలు వెల్లడించలేదు. ఆ కుటుంబాలను ఓదార్చడం కాదు కదా కనీసం ధైర్యం కూడా చెప్పలేదని అమెరికా ఇంటిలిజెన్స్ అభిప్రాయపడింది. నాటి ఘర్షణలో సుమారు 35 చైనా సైనికులు మరణించినట్లు తెలిపింది. అయితే చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరికి ఒక్కొక్కొరికి సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించకూడదని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాక.. అందరిని ఒకేసారి ఖననం చేయాల్సిందిగా ఆదేశించినట్లు అభిప్రాయపడింది. దీనిపై సదరు సైనికుల కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆదేశించినట్లు చైనా ప్రభుత్వం సమాధానమిచ్చినట్లు సమాచారం. (గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?) -
అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి పాజిటివ్
పట్నా: ఏమాత్రం అజాగ్రత్తపడ్డా మనుషుల్ని పీడించేందుకు కరోనా రక్కసి సిద్ధంగా ఉంటుంది. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా కరోనాకు మరింత చేరువ చేస్తుందనడానికి ఇక్కడ జరిగిన సంఘటనే నిదర్శనం. అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి పాజిటివ్ వచ్చిన ఘటన బిహార్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లో వ్యాపారవేత్త రాజ్ కుమార్ గుప్తా జూలై 10న అనారోగ్యంతో మరణించాడు. అయితే అంత్యక్రియల్లో పాల్గొన్న అతని మేనల్లుడితో పాటు కుటుంబంలో మరొకరికి కరోనా సోకినట్లు తేలింది. (నితీష్ కుమార్‌కు కరోనా పరీక్షలు) దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్న 37 మందికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 20 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. బిహ్త ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు, ఆ ప్రాంతాన్ని పూర్తిగా నిర్బంధించి శానిటైజ్ చేస్తున్నారు. కాగా బిహార్‌లో 16642 కేసులు నమోదవగా 5001 యాక్టివ్ కేసులున్నాయి. 143 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. (పాడె మోసేందుకూ ముందుకు రాలేదు) -
అంత్యక్రియలకు 10 వేల మంది
గువాహటి: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలోనే.. మత ప్రబోధకుడి అంత్యక్రియలకు వేలాదిగా జనం హాజరుకావడంతో అస్సాం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ఘటన జరిగిన చుట్టుపక్కల మూడు గ్రామాల్లో లాక్డౌన్ ప్రకటించింది. ఆల్ ఇండియా జమాయిత్ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల అమిర్–ఇ–షరియత్ అయిన ఖైరుల్ ఇస్లాం(87)అంత్యక్రియలు ఈ నెల 2వ తేదీన జరిగాయి. ఖైరుల్ ఇస్లాం కుమారుడు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన అమినుల్ ఇస్లాం నగౌన్ జిల్లా ధింగ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా. తన తండ్రి అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లాక్డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా అంత్యక్రియలకు 10 వేల మందికి పైగా హాజరుకావడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ పరిసరాల్లో ఉన్న 3 గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించారు. కేరళలో కోవిడ్–19 ఆంక్షలు మరో ఏడాది తిరువనంతపురం: కోవిడ్–19కు సంబంధిం చిన ఆంక్షలు మరో ఏడాది పాటు అమల య్యేలా కేరళ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి అమలవుతున్న ఆదేశాలకు తోడుగా మరో ఏడాది పాటు కొనసాగేందుకు వీలు కల్పించేలా కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్– 2020కి అదనపు నిబంధనలను జోడించింది. అవి.. మరో ఏడాది పాటు పెద్ద సంఖ్యలో జనం గుమికూడటంపై నిషేధం కొనసాగు తుంది. బహిరంగ ప్రదేశాల్లో అన్ని సమ యాల్లో ఆరడుగుల భౌతికదూరం పాటిం చాలి. రహదారులు, కాలిబాటలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. -
పెద్ద మనసు చాటుకున్న పోలీసులు
సాక్షి, నగరి(చిత్తూరు) : కుమారుడికి కరోనా వైరస్ సోకిందనే మనోవ్యధతో గుండెపోటుకు గురై 68 ఏళ్ల వృద్ధుడు మరణించగా ఆ తర్వాత కొంతసేపటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని కుమారుడు సైతం ప్రాణాలొదిలిన ఘటన నగరి ఏకాంబరకుప్పంలో మంగళవారం చోటుచేసుకుంది. చుట్టుపక్కలే బంధువులున్నా కరోనా భయంతో కనీ సం చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులే ముందుకొచ్చి వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. వివరాలివీ.. కో–ఆప్టెక్స్ సంస్థలో పనిచేసి రిటైరైన 68ఏళ్ల వృద్ధుడు ఏకాంబర కుప్పంలో చిన్నపాటి జిరాక్స్ షాపు నడుపుకుంటూ షాపు పైభాగాన గల గదిలో ఒంటరిగా ఉంటున్నారు. అతని భార్య గతంలోనే మరణించగా కుమారుడు, కోడలు పక్క వీధిలో నివాసముంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేసే కుమారుడికి వారం రోజుల క్రితం కరోనా సోకడంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసి తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు చేస్తున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ప్రాణాలొదిలాడు. ఆ తరువాత కొంతసేపటికి కుమారుడు కూడా ఆస్పత్రిలో మరణించాడు. కరోనా భయంతో వృద్ధుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా బంధువులెవరూ రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్క డికి చేరుకున్నారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలని వృద్ధుడి బంధువులకు పోలీసులు సూచించగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఆత్మబంధువులయ్యారు. సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలో మృతదేహాన్ని కిందకు దించి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కరోనాతో మరణించిన కుమారుడి మృతదేహం రుయా ఆస్ప త్రిలోనే ఉంచారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి మృతదేహాన్ని ఖననం చేయాల్సి ఉంది. ఈ ఘటనపై సీఐ మద్ద య్య ఆచారి మాట్లాడుతూ కరోనా ఆస్పత్రిలో మృతిచెందిన యువకునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పారు. వారికి కరోనా పరీక్షలు చేయించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
బెంగాల్: 150 మంది బీజేపీ నేతలపై కేసు
కోల్‌కతా : లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారన్న కారణంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సహా 150 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. టీఎంసీ కార్యకర్తల దాడిలో పశ్చిమ బెంగాల్‌లోని డాంటాన్ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడికి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు హాజరయ్యారు. అంతేకాకుండా అంత్యక్రియల సమయంలో టీఎంసీ కార్యకర్తలపై ఆరోపణలు చేస్తూ బీజేపీ నేతలు ప్రసంగించారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ప్రధాన కార్యదర్శి సయంతన్ బసుతో పాటు మరో 150 మంది బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా పలువురు నేతలు కనీసం మాస్కులు కూడా ధరించలేదని, వ్యక్తిగత దూరం పాటించకుండా పెద్ద సంఖ్యలో హాజరయ్యారని పోలీసులు తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 120, 150 కింద కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. (కరోనాకు ఇందులో ఏది సరైన మందు? ) దీనిపై ఇరువర్గాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తుకున్నాయి. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ టీఎంసీ నాయకుడు మాట్లాడుతూ.. బీజేపీ ఉగ్రవాద భాష మాట్లాడుతుందని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు హింసను ప్రోత్సహించేలా ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతియుత డాంటన్ ప్రాంతంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి మృతదేహాన్ని టీఎంసీ కార్యకర్తల ఇళ్ల మీదుగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరువర్గాలు తీవ్రంగా గాయపడగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ మెర్చా అధ్యక్షుడు సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి మొదలైంది. (చైనా నిర్మించినదానికంటే 10 రెట్లు పెద్దది! ) -
వీరుడా.. వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు జనం అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ‘జై జవాన్, వందేమాతరం, భారత్ మాతాకీ జై, చైనా ఖబడ్దార్’ అంటూ పెద్దపెట్టున నినదిస్తూ, జాతీయ పతాకాలు చేతబట్టి అంతిమయాత్రలో కదిలారు. ‘వీరుడా నీ త్యాగం ఎప్పటికీ మరువం’అంటూ సూర్యాపేట పట్టణమంతా గొంతెత్తి స్మరించుకుంది. గురువారం ఉదయం 9.40 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై పట్టణ సమీపంలోని కేసారం గ్రామం వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రానికి 11.30 గంటలకు చేరుకుంది. 5.5 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు సాగిన అంతిమయాత్ర జనసంద్రమైంది. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు, ప్రజలు, ప్రభుత్వ ప్రముఖుల అశ్రునయనాలు, బాధాతప్తహృదయాల మధ్య సంతోష్‌బాబు అంత్యక్రియల్ని సైనిక లాంఛనాలతో చేపట్టారు. బిహార్ రెజిమెంట్ 1వ బెటాలియన్ సైనికులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలు ముగిశాయి. భర్త పార్థివదేహానికి కుమారుడు అనిరుద్‌తో కలిసి సెల్యూట్ చేస్తున్న సంతోషి కడచూపు వేళ జనమంతా కన్నీటిపర్యంతం బుధవారం రాత్రి 11.40కి కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహం సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. అప్పటికే అమర జవానుకు నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి కల్నల్‌ను కడసారి చూసేందుకు మరింత పెద్దసంఖ్యలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ.. నివాళులర్పించారు. సంతోష్‌బాబు పార్థివదేహాన్ని ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఉంచారు. సైనిక లాంఛనాలతో ఆర్మీ, నేవీ అధికారులు, సిబ్బందితో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 10 నిమిషాల పాటు పార్థివదేహానికి గౌరవ వందనం సమర్పించారు. 9.40 గంటలకు బిహార్ రెజిమెంట్ ఫస్ట్ బెటాలియన్‌కు చెందిన పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర ప్రారంభమైంది. విద్యానగర్ నుంచి కేసారంలోని కుటుంబ వ్యవసాయ క్షేత్రంలోని అంత్యక్రియల ప్రాంగణం వరకు ఉన్న 5.5 కిలోమీటర్ల దూరానికి చేరుకునేందుకు 2 గంటలు పట్టింది. 11.30 గంటలకు అంతిమయాత్ర వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. దారిపొడవునా ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది కల్నల్ పార్థివదేహం ఉన్న వాహనంపై పూలవర్షం కురిపించారు. జాతీయ పతాకాలతో, జైహింద్ నినాదాలతో ముందు నడిచారు. కల్నల్ సంతోష్‌బాబు చితికి మధ్యాహ్నం 12.05 గంటలకు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, కుమారుడు అనిరుధ్ కలిసి నిప్పంటించారు. భార్య సంతోషి, తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల కడచూపు వేళ కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబసభ్యులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. కూతురు అభిజ్ఞ తండ్రి చితిలో కట్టె వేయగానే.. ‘అయ్యో బిడ్డా’అంటూ కుటుంబసభ్యులు విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. సంతోష్‌బాబు భౌతికకాయం వద్ద గౌరవ వందనం చేస్తున్న ఆర్మీ అధికారులు, జవాన్లు బిహార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో.. సంతోష్‌బాబు 2004లో బిహార్ 16వ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఫస్ట్ బెటాలియన్ అంత్యక్రియల్ని చేపట్టింది. ఈ బెటాలియన్‌కు చెందిన 50 మంది జవాన్లు, పదిమంది మేజర్, కల్నల్, కెప్టెన్ ర్యాంకు అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్య అధికారులుగా 54 బెటాలియన్ బ్రిగే డియర్ అగర్వాల్, మేజర్ ఫరీద్, కల్నల్స్ విజయ్, అభినవ్, జాద వ్, లెఫ్ట్‌నెంట్ కల్నల్స్ శ్రీనివాసరావు, మథి, ప్రత్యేక అధికారి దినేష్‌కుమార్ హాజరయ్యారు. 12 గంటలకు మూడురౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలను పూర్తిచేశారు. అంతకుముందు సంతోష్‌బాబు ఆర్మీడ్రెస్, క్యాప్, జాతీయ పతాకాన్ని ఆయన సతీమణి సంతోషికి ఆర్మీ అధికారి అందించారు. గాలిలోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పిస్తున్న జవాన్లు ప్రముఖుల శ్రద్ధాంజలి.. వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలకు రాష్ట్ర ప్రముఖులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ప్రతినిధిగా విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బుధవారం రాత్రి నుంచి అంత్యక్రియలు ముగిసే వరకు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, వివేక్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి ఉత్తమ్‌కుమార్, సంకినేని వెంకటేశ్వర్రావు, జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మిలటరీ అధికారులు అందజేసిన భర్త ఆర్మీ దుస్తులను గుండెలకు హత్తుకొని కన్నీటిపర్యంతమవుతున్న సంతోష్‌బాబు భార్య సంతోషి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి. చిత్రంలో బడుగుల, బూర నర్సయ్యగౌడ్ -
సూర్యాపేట: ముగిసిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు
-
సైనిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు
సాక్షి, సూర్యాపేట : లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి. ప్రోటోకాల్ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కార్యక్రమాలు నిర్వహించారు. సంతోష్ మిలటరీకి చేసిన సేవలకు గుర్తుగా అధికారులు సంతోష్ యునిఫామ్, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. సంతోష్‌బాబు పార్థివ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు. అనంతరం తండ్రి ఉపేందర్ సంతోష్ పార్థివదేహాం ఉన్న చితికి నిప్పంటించారు. సంతోష్ అంత్యక్రియలకు హాజరైన వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. (బలిదానం వృథా కాదు!) కాగా, కల్నల్ సంతోష్ ఇంటి నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్లు మేర మిలటరీ వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. సంతోష్ అంతిమయాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులతో పాటు భారీగా ప్రజలు హాజరయ్యారు. (వీరుడా.. వందనం) కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహాన్ని కడచూపు చూసేందుకు బారులు తీరిన బంధువులు, ప్రజలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు
హ్యూస్టన్/వాటికన్ సిటీ: పోలీస్ అధికారుల దాష్టీకానికి బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు మంగళవారం ఘనంగా ముగిశాయి. వందలాది మంది మద్దతుదారులు ముఖానికి మాస్కులు ధరించి మరీ హ్యూస్టన్‌లోని ఓ చర్చిలో ఫ్లాయిడ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఫ్లాయిడ్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం కాగా.. అమెరికాలో జాతివివక్షకు ఇకనైనా చరమగీతం పాడాల్సిందేనని పిలుపునిచ్చారు. గత నెల 25న మినియాపోలిస్‌లో డెరెక్ ఛావెన్ అనే శ్వేతజాతీయుడైన పోలీస్ అధికారి అరెస్ట్ చేసే క్రమంలో గొంతుపై మోకాలిని ఉంచడం.. దీంతో ఊపిరిఆడక ఫ్లాయిడ్ మరణించడం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఒక రోజంత ఉంచిన తరువాత మంగళవారం తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్‌ను ఖననం చేశారు. ఫ్లాయిడ్ హత్యపై స్పందించిన పోప్: ఫ్లాయిడ్ హత్య అనంతరం జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఆందోళనల్లో అమెరికా బిషప్ ఒకరు పాల్గొని, ప్రార్థనలు చేయడాన్ని పోప్ ఫ్రాన్సిస్ సమర్ధించారు. ఈ సందర్భంగా జార్జ్ ఫ్లాయిడ్ పేరును రెండు సార్లు ప్రస్తావించారు. సాధారణ పరిస్థితుల్లో శ్వేతజాతి పోలీసు అధికారి చేతుల్లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురవడం, దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తదితర ఘటనలపై వాటికన్ అంతగా స్పందించదు. కానీ, ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల సంవత్సరం నడుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ మరోసారి బరిలో నిలిచారు. ఈ సమయంలో జాత్యహంకార వ్యతిరేక ప్రదర్శలకు పోప్ తదితరులు మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సారి అమెరికన్ కేథలిక్స్ ఎవరికి మద్దతివ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. (అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు) -
‘అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు’
వాషింగ్టన్: శ్వేత జాతీ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురయిన ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ స్వస్థలమైన హ్యూస్టన్‌లో మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తన తల్లి సమాధి పక్కనే ఆయన మృతదేహాన్ని కూడా ఖననం చేశారు. ఆరు రోజుల సంతాప దినాల తర్వాత మూడు నగరాల్లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రదర్శించారు. ఫ్లాయిడ్ పుట్టిన నార్త్ కరోలినాలోని రేఫోర్డ్, అతను పెరిగిన హ్యూస్టన్, అతడు మరణించిన మిన్నియాపాలిస్ నగరాల్లో ప్రదర్శించారు. వేలాది మంది ఫ్లాయిడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు తరలి వచ్చారు. వీరిలో నటులు జామీ ఫాక్స్, చాన్నింగ్ టాటమ్, రాపర్ ట్రే థా ట్రూత్, రిపబ్లిక్ షీలా జాక్సన్ లీ, హూస్టన్ పోలీస్ చీఫ్ ఆర్ట్ అసేవెడో, హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్, గ్రామీ విజేత నే-యో కూడా ఉన్నారు. మాజీ వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్, ఫ్లాయిడ్ ఆరేళ్ల కుమార్తెను ఉద్దేశిస్తూ.. ‘ఏ పిల్లలు అడగలేని చాలా ప్రశ్నలు నీ మదిలో తలెత్తుతున్నాయని నాకు తెలుసు. తరాలుగా నల్ల జాతి పిల్లలంతా ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. జాత్యాంహకారాన్ని రూపమాపడానికి.. సమ న్యాయం చేయడానికి. భవిష్యత్తులో మన పిల్లలు ఎందుకు ఇలా జరిగింది అంటే మనం సమాధానం చెప్పగలగాలి’ అన్నారు. అయితే ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఎలాంటి విమర్శలు చేయలేదు. మరి కొందరు మాత్రం ట్రంప్‌పై విమర్శల వర్షం కురిపించారు. ‘అధ్యక్షుడు మిలిటరీని తీసుకురావడం గురించి మాట్లాడుతుంటాడు. కాని 8 నిమిషాల 46 సెకన్ల పాటు జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య గురించి అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని పౌర హక్కుల కార్యకర్త రెవ. అల్ షార్ప్టన్ అన్నారు. ట్రంప్ మానవ హక్కుల గురించి చైనాను సవాలు చేస్తాడు. కానీ జార్జ్ ఫ్లాయిడ్ మానవ హక్కు గురించి మాట్లడడు అన్నారు. (బంకర్ బాయ్) -
విమానం కూలి 5 మంది మృతి
-
జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి
జార్జియా : అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో విమాన ప్రమాదం సంభవించింది. వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్(41) తన కుటుంబసభ్యులతో కలిసి ఇండియానాలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పీఏ-31టి అనే చిన్న విమానంలో పైలట్‌తో సహా బయలుదేరాడు. అయితే జార్జియాలోని ఈటన్టన్‌కు ఈశాన్యంగా ఆరు మైళ్ల దూరంలో టాన్వార్డ్ రోడ్ సమీపంలోని దట్టమైన అడవుల్లో విమానం కూలిపోయింది. కాగా విమానం కూలిపోతున్న దృశ్యాలను ఒకరు తన ఫోన్లో బంధించారు. విమానం కూలడానికి ముందు ఆకాశంలోనే విమానానికి మంటలంటుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత విమానం కూలిపోవడం వీడియోలో కనిపించింది. ఈ ప్రమాదంలో షాన్ చార్ల్స్ సహా భార్య జోడిరే మోంట్, పిల్లలు జేస్ లామోంట్(6), ఎలిస్ లామోంట్(4)లతో పాటు పైలట్ లారీ రే ప్రూట్ (67) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ' రెండు ఇంజిన్లు గల టర్బో విమానం విల్స్టన్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే అకస్మాత్తుగా వచ్చిన తుఫానే ప్రమాదానికి కారణమై ఉండవచ్చు' అంటూ పోలీసులు పేర్కొన్నారు. -
చిరంజీవిపై తేనేటీగల దాడి
-
దోమకొండలో చిరంజీవిపై తేనేటీగల దాడి
సాక్షి, కామారెడ్డి: దోమకొండ సంస్థాన వారసులు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు చిరంజీవి, రామ్‌చరణ్ తేజ్, ఉమాపతిరావు మనవరాలు ఉపాసన హాజరయ్యారు. కాగా.. ఆయన బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భౌతికదేహాన్ని గడికోటలో ప్రజల సందర్శనార్థం ఉంచి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. 11 నుంచి 11:45 గంటల వరకు సంబంధిత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక లక్ష్మీబాగ్‌కు తరలించి మధ్యాహ్నం 12 గంటలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు గడికోట ట్రస్టు సీనియర్ మేనేజర్ బాబ్జీ తెలిపారు. అంత్యక్రియలకు కామినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరు అయ్యారు. అంతకు ముందు ఉమాపతిరావు పార్థివదేహానికి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే పూలమాల వేసి నివాళులర్పించారు. తేనేటీగల దాడి కాగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో చిరంజీవితో సహా పలువురిపై తేనేటీగలు దాడి చేశాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉమాపతిరావుకు కుమారుడు అనిల్‌కుమార్ కామినేనితో పాటు కూతురు శోభ ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన కూతురు శోభ, అల్లుడు రావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. (తాతయ్య కన్నుమూత.. ఉపాసన ట్వీట్) -
కన్నీళ్లు లేని కరోనా కథలు
హడావుడిగా అంతిమ వీడ్కోలు.. కన్నబిడ్డలు పక్కన ఉండరు.. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు.. కాడె మోసే వాళ్లు కనిపిం చరు.. శ్మశానం దాకా ఎవరూ వెంట రారు.. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి.. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది.కన్నబిడ్డలు పక్కన ఉండరు. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు. పాడె మోసే వాళ్లు కనిపించరు. శ్మశానం దాకా ఎవరూ వెంటరారు. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది. చెన్నై, ముంబై: దేవాలయాలన్నీ వెలవెలబోతున్నాయెందుకు? దేవుళ్లందరూ వైద్యుల రూపంలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇదీ ఈ మధ్యకాలంలో వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక సందేశం మరి అలాంటి దేవుళ్లనే కరోనా కాటేస్తూ ఉంటే వారికి తుది వీడ్కోలు చెప్పే దిక్కు కూడా లేదు. మొన్నటికి మొన్న నెల్లూరుకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్–19తో పోరాడి చెన్నై ఆస్పత్రిలో మరణిస్తే స్థానికుల నిరసనల మధ్య ఆదరాబాదరాగా అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వచ్చింది. అదే వారంలో మేఘాలయలో వైద్యుడు కోవిడ్–19 బాధితులకు చికిత్స చేసి తాను కూడా ప్రాణాలు కోల్పోతే మున్సిపాల్టీ కార్మికులే దహన ప్రక్రియలు పూర్తి చేశారు. వైద్యులే కాదు ఇప్పటివరకు భారత్‌లో కరోనాతో 775 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వారి అంతిమ సంస్కారాలన్నీ ఇలాగే జరుగుతున్నాయి. కరోనా మృతదేహం దగ్గరకి వెళ్లాలంటే అయినవారు కూడా హడలెత్తిపోతున్నారు. స్థానిక ప్రజలు మృతదేహాన్ని తీసుకువెళుతున్నా అడ్డుకుంటున్నారు. రాళ్లతో దాడులకూ దిగుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య వారికి అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వస్తోంది. వాస్తవానికి కోవిడ్‌తో మరణించినప్పటికీ మృతదేహం నుంచి వైరస్ సోకదు. అయినా ప్రజల్లో నెలకొన్న భయం, అవగాహనారాహిత్యం వారిలో సున్నితత్వాన్ని కూడా చంపేస్తోంది. దహనమా? ఖననమా? పంజాబ్ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోవిడ్–19తో మృతి చెందితే ఆయన మృతదేహాన్ని దహనం చేయడానికి ఆయన ఊరి ప్రజలే అంగీకరించలేదు. దహనం చేస్తే అందులోంచి వచ్చే పొగ వల్ల వైరస్ సోకుతుందని అంతిమ సంస్కారాన్ని అడ్డుకున్నారు. శ్మశానవాటికకు తాళాలు కూడా వేశారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఊరి శివారు ప్రాంతాలకు తరలించి దహనం చేశారు. పంజాబ్‌లో కపుర్తాలాకు చెందిన ఒక మహిళ మరణిస్తే చివరి చూపు చూడడానికి కూడా కన్న కొడుకు రాలేదు. కరోనా భయంతో రావడానికి నిరాకరిస్తే మున్సిపాల్టీ సిబ్బందే మృతదేహాన్ని అంతిమ వీడ్కోలు పలికారు. మరోవైపు ముంబై కార్పొరేషన్ కోవిడ్‌తో మరణించే వారు ఎవరైనా, మతంతో సంబంధం లేకుండా దహనం చేస్తామంటూ నోటీసులు ఇచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆ నోటీసులు వెనక్కి తీసుకునేలా చేసింది. దీంతో మృతదేహాన్ని ఖననం చేయడానికి యంత్రాంగం అనుమతిచ్చినా స్థానికులు అడ్డుకుంటున్నారు. మృత దేహాలను దహనమే చేయాలని, లేకపోతే వైరస్ సోకుతుందని అంటున్నారు. భౌతిక దూరం నిబంధనల కారణంగా అయిన వారు మరణించినా అయిదారుగురి కంటే ఎక్కువ మంది హాజరవడానికి ఎక్కడా అనుమతులివ్వడం లేదు. కోవిడ్‌తో మరణిస్తే పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడమే తప్ప, కన్నీళ్లు రాల్చేవారూ కరువయ్యారు. ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న వైద్యుడి భార్య ఇదో వైద్యుడి భార్య వ్యథ. చెన్నైకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్ రోగులకి అలుపెరుగకుండా చికిత్స చేశారు. దీంతో ఆ మహమ్మారి ఆయనకీ అంటుకుంది. కొద్ది రోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. ఆ డాక్టర్ మృతదేహం నుంచి వైరస్ తమకు ఎక్కడ అంటుకుంటుందోనని స్థానికులు ఆయన మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్‌ని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో వెలంగాడు శ్మశాన వాటికలో మున్సిపల్ అధికారులు హడావుడిగా పూడ్చి పెట్టేశారు. అయితే ఆయన భార్య ఆనంది సైమన్ తన భర్త చివరి కోరిక మేరకు కిల్పాకలోనే మతపరమైన ప్రార్థనలు నిర్వహించాకే అంతిమ సంస్కారం చేయాలని పట్టుపడుతోంది. మృతదేహం నుంచి వైరస్ సోకదని డబ్ల్యూహెచ్ఓ చెప్పినా ప్రజల్లో అవగాహన లేకపోవడం విచారకరమని కన్నీరు మున్నీరవుతోంది. దీనిపై ఎంత దూరమైనా వెళతానని న్యాయపోరాటానికైనా సిద్ధమని చెబుతోంది. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది ? కరోనా వైరస్‌తో కన్నుమూస్తే ఆ మృతదేహం నుంచి వైరస్ సోకే అవకాశం లేదు. రోగి ప్రాణాలు కోల్పోయిన రెండు, మూడు గంటల్లో వైరస్ కూడా చచ్చిపోతుంది. అందుకే అంతిమ సంస్కారాలు వారి కోరిక మేరకు నిర్వహించుకోవచ్చు. -
ఆ నలుగురు..కరువయ్యారు!
సాక్షి, కామారెడ్డి: ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం విధిలీల.. తుదివేళ ఏ బంధమూ వెంట రాదు. బంధువులు, బలగం ఎంతమందున్నా.. వెంట నడిచేది కాటివరకే.. కానీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ‘కరోనా’ నీడలో చావు కూడా భారంగా మారింది. పార్థివదేహాన్ని శ్మశానానికి మోసుకెళ్లేందుకు ఆ నలుగురు కూడా రాని పరిస్థితి దాపురించింది. రక్తసంబంధీకులు, ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు, బంధువులు ఎవరూ అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆంక్షలు అమలు అవుతున్నాయి. గుంపులుగా ఒకేచోటుకు చేరితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో అంత్యక్రియలపైనా ఆంక్షలున్నాయి. కరోనా వైరస్ గురించి అవగాహన పెరగడంతో ప్రజలు సైతం చావులకు వెళ్లడం లేదు. బంధువో, స్నేహితుడో చనిపోయాడని తెలిస్తే పరుగున వెళ్లేవారంతా ఇప్పుడు వెనకాముందవుతున్నారు. కొందరు ఏదైతే అది జరగని అంటూ చివరి చూపు చూడాలనే ఆరాటం ఉన్నా వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. లాక్డౌన్ మూలంగా రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. రోడ్లపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రోడ్లపై వాహనాలు తిరిగితే చాలు పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ఒక్క వైద్యం కోసం తప్ప మరే దానికీ పోలీసులు అనుమతించడం లేదు. దీంతో చావులకు కూడా వెళ్లలేకపోతున్నారు. రక్త సంబంధీకుడు చనిపోయినా సరే వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కనీసం పరామర్శలకు వెళ్లడానికీ సాహసించడం లేదు. చివరి చూపు చూడాలన్న ఆవేదనను దిగమింగుకుని ఇంటి దగ్గరే నాలుగు కన్నీటిబొట్లు రాలుస్తున్నారు. పాడె మోసే వారు లేరు.. ఎవరైనా చనిపోయినపుడు డప్పు చప్పుళ్ల మధ్య పాడెను సిద్ధం చేస్తారు. నలుగురు ఆ పాడెను మోస్తారు. రక్త సంబంధీకులు, స్నేహితులు, బంధువులు కూడా తలా ఓ చేయి వేస్తారు. దారిపొడవునా పాడె చేతులు మారుతూ ఉంటుంది. తొలుత పాడె ఎత్తిన చేతులు తిరిగి దించే సమయంలోనూ ఉండాలి. అయితే ఇప్పుడు పాడె మోసేవారు లేకుండాపోయారు. ఎవరు చనిపోయినా దగ్గరి వాళ్లు కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది వైకుంఠ రథాలలోనే తీసుకెళ్తున్నారు. కుటుంబ సభ్యులే పాడెను లేపి రథంలో ఉంచుతున్నారు. రథం వెనుకా, ముందూ ఎవరూ కనిపించడం లేదు. డప్పు కొట్టే వారూ రావట్లేదు! చావు డప్పు కొట్టడానికి చాలా ప్రాంతాల్లో ఎవరూ ముందుకు రావడం లేదు. అలాగే ఖననం చేసేందుకు గుంత తీయడం, కాడి పేర్చడానికి కూడా మనుషులు దొరకడం లేదు. ఎందుకంటే చావుకు వెళితే కరోనా ఎక్కడ తమను అంటుకుంటుందోనన్న భయం వారిని వృత్తికి దూరం చేస్తోంది. కొన్ని గ్రామాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో చావు డప్పుకు వెళ్తున్నా, చాలా చోట్ల నిరాకరిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లోనైతే పాడె కట్టెవారు కూడా రావడం లేదని తెలుస్తోంది.‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అని ఆకలిరాజ్యం సినిమాలో సినీ గేయ రచయిత రాసినట్లుగా శుభకార్యాల్లోలాగానే అంతిమ యాత్రల్లోనూ ఆ ర్భాటాలు చేయడం సాధారణమైపోయింది. అయితే కరోనాతో పరిస్థితి మారిపోయింది. బలగం, బంధువులు ఉన్నా.. లాక్డౌన్ ఆంక్షల కారణంగా అంత్యక్రియలకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంతిమ యాత్రలో పాడె మోసేందుకు ఆ నలుగురూ కరువవుతున్నారు. -
కడచూపునకు ముగ్గురే !
సాక్షి, హైదరాబాద్: కరోనా అనుమానిత/నిర్ధారిత మృతుల అంత్యక్రియలకు ముందు కేవలం ముగ్గురు లేదా ఐదు మంది కుటుంబసభ్యులు, బంధువులకు మాత్రమే కడచూపు అవకాశం లభించనుంది. ఆస్పత్రిలో అయితే సురక్షితమైన గ్లాసు కిటికీ నుంచి మృతదేహాన్ని చూసేందుకు ముగ్గురు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమ తిస్తారు. కుటుంబ సభ్యులను మార్చురీ లోపలికి అనుమతించడం కానీ మృతదేహాన్ని ముట్టుకోవ డానికిగానీ అనుమతి ఉండదు. ముఖం కనిపించే విధంగా మృతదేహాన్ని ప్లాస్టిక్ షీట్లో చుట్టి, లీక్ ప్రూఫ్ జిప్ బ్యాగులో ప్యాక్ చేస్తారు. మృతుడి ముఖం కనిపించేలా బ్యాగు ముందటి భాగం పారదర్శకంగా ఉంటుంది. అంత్యక్రియల్లో పాల్గొనడానికి కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు వస్తే ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. వారందరూ తమ సొంత రవాణా సదు పాయం ఏర్పాట్లు చేసుకోవాలి. ఆస్పత్రి కోవిడ్ లైసన్ అధికారి అందించిన మాస్కులు, గ్లౌజులు ధరించాలి. 4 మీటర్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ హిందూ/ముస్లిం సాంప్రదాయం ప్రకారం ప్రదక్షిణ/ నమాజ్–ఏ–జనాజ నిర్వహించేందుకు అనుమతిస్తారు. హిందువులైతే 3 మీటర్ల పొడవైన కట్టెతో కాష్టానికి నిప్పుపెట్టాలి. మృతదేహానికి చుట్టూ 4 మీటర్ల దూరం వరకు రోప్ బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తారు. మిగిలిన అన్ని పనులను ప్రభుత్వం నియమించిన బాడీ హ్యాండ్లర్లు పూర్తి చేయనున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ∙అంత్యక్రియల కోసం ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి కోవిడ్ లైసన్ ఆఫీసర్‌ను నియమించు కోవాలి. ∙అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు, బాడీ హ్యాండ్లర్లు తమ శరీరాన్ని లిక్విడ్ సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. డ్రైవర్‌తో సహా అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తులం దరూ తమ పీపీఈలను ప్రత్యేక కవర్లో ప్యాక్ చేయాలి. బాడీ హ్యాండ్లర్లు పీపీఈతో పాటు వాహనంపై సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి. హిందువులైతే... ∙కరోనా మృతుడి దేహాన్ని హిందూ సాంప్ర దాయం ప్రకారం అంత్యక్రియలకు సిద్ధం చేయాలి. మృతదేహాన్ని శుభ్రపరచడం, వస్త్రం చుట్టడం వంటివి చేయాలి. ∙అంత్యక్రియలు నిర్వహించే సంస్థలు/ బాడీ హ్యాండ్లర్ల కోసం రవాణా ఏర్పాట్లతో పాటు ఆ వాహనంలో పీపీఈ/కోవిడ్ రక్షణ పరికరాలు/పవర్ స్ప్రేయింగ్ క్యాన్లను జీహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో ఉంచుతారు. ∙ఆస్పత్రి స్థాయిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, స్థానిక పోలీసు అదనపు కమిషనర్, ఆస్పత్రి కోవిడ్ లైసన్ అధికారితో కూడిన కమిటీ రోజూ సమావేశమై మృతదేహాలకు సాఫీగా అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ∙శ్మశానవాటికకు మృతదేహం చేరడానికి ముందే కుటుంబ సభ్యులు అక్కడ ఎలక్ట్రిక్/ కట్టెలతో దహనసంస్కారం నిర్వహించడానికి అవసరమైన కర్రలు, ఇతర అంత్యక్రియల సామాగ్రిని సమకూ ర్చాలి. శ్మశానవాటికలో అంత్యక్రియలకు సంబందించిన టైం స్లాట్‌ను కుటుంబ సభ్యులు ముందే తీసుకోవాలి. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఆస్పత్రి సీఎల్ఓ నిర్ధారించుకున్నాకే మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి బయటకి పంపాలి. ∙మృత దేహాన్ని ఆస్పత్రి నుంచి పంపినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తి చేసే వరకు మొత్తం ప్రక్రియను పోలీసులు వీడియో తీయాలి. క్రైస్తవులకు ఇలా.. ∙కుటుంబ సభ్యులు సూచించిన స్మశానంలోనే అంత్యక్రియలు నిర్వహించాలి. ఆయా స్మశాన వాటికలో స్థలం లభించని పక్షంలో అందుబాటులో ఉన్న స్థలాల్లో మృతదేహాలకు జీహెచ్ఎంసీ అంత్యక్రియలు నిర్వహించాలి. ∙మృతుడి కుటుంబసభ్యులే కఫిన్ (మృతదేహాన్ని ఉంచే పెట్టె)ను సమకూర్చాలి. కఫిన్‌ను తయారీదారు నుంచి ఆస్పత్రికి పోలీసులు, పురపాలక అధికారులు తరలించాలి. కఫిన్‌లో మృతదేహాన్ని ఉంచి కరోనా ప్రత్యేక అంబులెన్స్‌లో స్మశానవాటికకు తరలించాలి. ∙కఫిన్ బాక్సు మూతను కొద్దిగా జరిపి కేవలం ఐదు మంది కుటుంబ సభ్యులకు మాత్రమే కడచూపు అవకాశం కల్పించాలి. ముస్లింలైతే... ∙మృతుడి ముక్కు రంధ్రాలని దూదితో మూసివేయడంతో పాటు నోరు తెరుచుకొని ఉండకుండా మూసివేస్తారు. ప్లాస్టిక్ షీట్లో మృతదేహాన్ని చుట్టడానికి ముందు రసాయన, క్రిమిసంహరక మందులు కలిగిన నీటి మిశ్రమాన్ని మృతదేహంపై చల్లుతారు. అనంతరం శరీరాన్ని ప్లాస్టిక్ షీట్లో చుట్టి ఆపై తెల్లటి కాటన్ వస్త్రంతో చుడతారు. -
కుమార్తెలే..కుమారులై!
ప్రకాశం, పర్చూరు: ఇద్దరూ ఆడ బిడ్డలే.. అయితేనేం ఆ తండ్రి వారిని రెండు కళ్లనుకున్నారు. ఏ బిడ్డకు చిన్న కష్టమొచ్చినా తట్టుకునే వాడు కాదు. చిన్న తనంలో ఆడుకుంటూ బిడ్డలకు ఎదురుదెబ్బ తగిలితే ఆయన విలవిల్లాడిపోయేవారు. ‘హనుమంతురావు ఇద్దరూ ఆడపిల్లలే కదరా..అని ఎవరైనా అంటే’..అయితేనేం రా..అంటూ గట్టిగా సమాధానం చెప్పేవారు. ఇలా తండ్రి ప్రేమను నిండుగా కలిగిన ఆ కుమార్తెలు.. పెరిగేకొద్దీ ఆయన ఆకాంక్షలు గుర్తించారు. నాన్న కలలను రూపమిస్తూ ఇద్దరూ విద్యావంతులై ఆయన కళ్లలో ఆనందబాష్పాలు నింపారు. వృద్ధాప్యంలోకి వెళ్లిన ఆ తండ్రి ఊపిరి సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు అర్ధంతరంగా ఆగిపోయింది. కర్మకాండలు పూర్తి చేయాలంటే వారసుడు లేరే అంటూ బంధువులు నసుగుతున్నారు. ఆ సమయంలో తండ్రిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కన్న బిడ్డలిద్దరూ ముందుకొచ్చారు. తండ్రికి తామే అంత్యక్రియలు చేస్తామంటూ నడుం కట్టారు. శ్మశాన వాటికలో తండ్రికి తలకొరివి పెడుతున్న కుమార్తె స్పందన ఒక్కొక్క అడుగు పడే కొద్దీ తమను గుండెలపై పెట్టుకుని పెంచిన నాన్న జ్ఞాపకాలు కన్నీటి బొట్లయి రాలుతుండగా.. కుమార్తెలిద్దరూ ఆయన మృతదేహంతో నడిచారు. చివరకు తండ్రికి తలకొరివి పెట్టుకుని జన్మనిచ్చిన రుణం తీర్చుకున్నారు. కొడుకులైనా, కుమార్తెలైనా తల్లిదండ్రుల కన్నపేగు మమకారాన్ని మరువకూడదనే సత్యాన్ని చాటి చెప్పారు. వివరాలు.. పర్చూరు జూనియర్ కళాశాలలో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందిన అడపాల హనుమంతురావు (64) సోమవారం తన స్వగృహంలో మృతి చెందాడు. ఆయనకు సృజన, స్పందన ఇద్దరు కుమార్తెలు. వీరిని తల్లిదండ్రులు వామపక్ష భావజాలంతో పెంచారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె సృజన వివాహమై యూఎస్ఏలో ఉంటుండగా చిన్న కుమార్తె స్పందన ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకుంటున్నది. తండ్రి మరణవార్త విని ఇద్దరూ పర్చూరుకు చేరుకున్నారు. తండ్రికి తలకొరివి పెట్టేందుకు కొడుకుల లేకపోవడంతో తలకొరివి పెట్టడానికి కుమార్తెలు ముందుకొచ్చారు. పెద్ద కుమార్తె దహనక్రియకు ఉపయోగించే నిప్పుల కుంపటి పట్టుకోగా చిన్న కుమార్తె స్పందన పిండం పట్టుకొని తండ్రి పాడె వెంట నడిచారు. అనంతరం స్థానిక శ్మాశాన వాటికలో హనుమంతురావు భౌతిక కాయాన్ని కట్టెల పాడెపై ఉంచగా చిన్న కుమార్తె స్పందన తన తండ్రికి తలకొరివి పెట్టి కొడుకు లేని లోటును తీర్చుతూ తండ్రి రుణం తీర్చుకుంది. -
అధికార లాంఛనాలతో నారాయణ రెడ్డి అంత్యక్రియలు
సాక్షి, డిచ్పల్లి: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, న్యాయవాది నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ ఎం నారాయణరెడ్డి పారి్థవ దేహానికి అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులోని కృషి దర్శన్ కేంద్రంలో (నారాయణరెడ్డి వ్యవసాయ క్షేత్రం)అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం నుంచి స్వర్గ రథయాత్ర వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని కృషి దర్శన్ కేంద్ర వరకు ర్యాలీ నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, జీవన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త, నగర మేయర్ నీతూకిరణ్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు నారాయణరెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్ అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తూ గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులరి్పంచారు. నారాయణరెడ్డి కుమారుడు అరుణ్‌రెడ్డి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరెడ్డి కుమార్తెలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, సీపీ, మేయర్ ఉద్యమకారుడు.. అభ్యుదయవాది అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, అభ్యుదయ వాది, మాజీ ఎంపీ నారాయణరెడ్డి మృతి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై ఆనాడే పార్లమెంట్లో గళం విప్పి 45 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించిన నాయకుడని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని విషయాలు తెలుసుకుని సభలలో సుదీర్ఘంగా తెలంగాణ వాణి విని్పంచే వారని అలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు నారాయణరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. అంత్యక్రియల్లో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీవో వెంకటయ్య, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్, నాయకులు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. -
అభిమానం అంటే ఇదేనేమో..
బెంగుళూరు : కర్టాటకలోని దేవన్‌గిరి ప్రాంతంలోని చెన్నగిరి తలాక్‌లోని ఎస్వీఆర్ కాలనీవాసులు చనిపోయిన కోతికి గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం ఒక కోతుల గుంపు చెన్నగిరి తలాక్ ప్రాంతంలోకి వలస వచ్చాయి. అయితే సాధారణంగా కోతులు ఒక ప్రాంతానికి వస్తే తమ కోతి చేష్టలతో అందరినీ ఇబ్బందిపెడుతుంటాయి. అయితే ఈ కోతులు మాత్రం అలా ప్రవర్తించలేదు. ఎవరికి ఏ హానీ తలపెట్టకుండా కాలనీ వాసులతో కలిసిపోయి ఎంచక్కా వారి పిలల్లతో కలిసి ఆడుకునేవి. అయితే బుధవారం ఆ గుంపులోని ఒక మగ కోతి ఆకస్మాత్తుగా చనిపోయింది. దీంతో హిందూ సంప్రదాయ పద్దతిలో ఆ కోతికి అంత్యక్రియలు నిర్వహించడమే గాక దాని పేరు మీద ఒక గుడి కట్టాలని కాలనీవాసులు నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై ఆ ఊరి సర్పంచ్‌ను కలిసి కోతి అంత్యక్రియలకు, గుడి కట్టేందుకు అనుమతి తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఆ కోతి అంత్యక్రియలు జరిపారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే కోతికి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో మిగతా కోతులు తమ ప్రియ నేస్తానికి నివాళి అర్పించడం అక్కడున్న అందరినీ కలిచివేసింది. కోతికి అంత్యక్రియలు జరిపిన స్థలంలోనే గుడి కట్టనున్నట్లు కాలనీవాసులు ప్రకటించారు. -
లేచిన శవం.. జనం పరుగోపరుగు
కరాచీ: మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో కదలికలు ఏర్పడినట్లు వార్తలు రావడం సహజం. అనేకసార్లు ఈ తరహా వార్తలు మనం వింటూ వచ్చాం. డాక్టర్లు సరిగ్గా పరీక్షించకుండా రోగి మృతిచెందినట్లు ద్రువీకరించడమే ఇలాంటి వార్తలకు కారణంగా మనం భావించవచ్చు. తాజాగా ఇలాంటి సంఘటనే పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళను అబ్బాసీ షాహిద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎన్నివిధాలుగా వైద్యులు చికిత్సనందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రషీదా మృతిచెందినట్లు ఆమె కుటుంబసభ్యులకు మరణ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. తదనంతరం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా రషీదా బీబీ మృతదేహానికి శవాల గదిలో స్నానం చేయిస్తుండగా.. ఒక్కసారిగా రషీదా లేచి నిలబడింది. దీంతో స్నానం చేయిస్తున్న మహిళ, ఆ గదిలో ఉన్నవారు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. వారు జరిగిన విషయాన్ని రషీదా కుటుంబసభ్యులకు చెప్పడంతో అంతా షాకయ్యారు. డాక్టర్లు వచ్చి ఆమె పల్స్ చెక్ చేసి ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంత్యక్రియల సమయంలో శవం లేచి నిలబడిందనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
ఖాసీం అంత్యక్రియలు.. హోరెత్తిన నినాదాలు
టెహరాన్: బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడి చేయటంతో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం సులేమానీకి వేలాది మంది ప్రజలు అశ్రు నివాళులర్పించారు. అదేవిధంగా సులేమానీ అంత్యక్రియల్లో పాల్గొన్న ఇరాక్ దేశ ప్రజలు పెద్ద ఎత్తున అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘డెత్ టూ అమెరికా’ అంటూ గర్జించారు. అమెరికాపై ప్రతీకార్య చర్య తప్పదని హెచ్చరించారు. కాగా, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ, లండన్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల వెనుక అతని హస్తముందన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాది సులేమానీని తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం మట్టుబెట్టిందని, దీంతో అతని శకం అంతమైందని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సులేమానీ హత్యపై ఐరాసలోని ఇరాన్ రాయబారి మజీద్ తఖ్త్ రవంచి స్పందిస్తూ.. తమ బద్ధ విరోధి పాల్పడిన యుద్ధచర్యగా అమెరికానుద్దేశించి పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: అమాయకులను చంపినందుకే.. చదవండి: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక చదవండి: ఎప్పుడో చంపేయాల్సింది -
బతికి ఉండగానే ‘అంత్యక్రియలు’!!
సియోల్ : జీవిత పరమార్థాన్ని తెలిపేందుకు, బతుకు మీద తీపిని పెంచేందుకు దక్షిణ కొరియా హీలింగ్ సెంటర్లు సరికొత్త విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రాణాలతో ఉండగానే ‘సామూహిక అంత్యక్రియలు’ నిర్వహించుకునే వీలు కల్పిస్తున్నాయి. తద్వారా నిరాశలో కూరుకుపోయిన వారు జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెలువరించిన నివేదికల ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే దక్షిణా కొరియాలో ఆత్మహత్యలు రెండింతలు ఎక్కువ. ప్రతీ లక్ష మంది పౌరులకు సగటున 20 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో 2012 నుంచే ఆ దేశంలో అధిక సంఖ్యలో హీలింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. బతికి ఉండగానే శవపేటికలోకి పంపి.. చనిపోయామన్న భావన కల్పిస్తూ జీవితంపై ఆశ కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో హైవోన్ అనే హీలింగ్ సెంటర్ మంగళవారం ‘డైయింగ్ వెల్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. టీనేజర్లు మొదలు వృద్ధుల దాకా పదుల సంఖ్యలో ఈ ‘లివింగ్ ఫర్నియల్’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంత్యక్రియలకు ముందు చేసే కార్యక్రమాలు పూర్తి చేసి.. అనంతరం పది నిమిషాల పాటు శవపేటికలో పడుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘చావుపై ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో.. చావు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో బతికి ఉండగానే మనకు బోధపడతాయో అప్పుడు జీవితాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. సరికొత్త పంథాలో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుంది అని పేర్కొన్నాడు. మరో టీనేజర్ తన అనుభవం గురించి వివరిస్తూ... ‘శవ పేటికను చూడగానే ముందు భయం వేసింది. ఆ తర్వాత ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకు ముందు ఎవరిని చూసినా నాకు పోటీదార్లే అంటూ ఒత్తిడికి గురయ్యేవాడిని. అందుకే చచ్చిపోవాలనిపించేది. కానీ ఇప్పుడు నా ఆలోచన మారింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తా’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకుడు జోయింగ్ మాట్లాడుతూ... ‘ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పిన ఎంతో మంది నిర్ణయాన్ని నేను మార్చగలిగాను. మేము 2012నుంచి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి నేటిదాకా దాదాపు 25 వేల మంది ఇందులో పాల్గొన్నారు. సామూహిక అంత్యక్రియల కార్యక్రమానికి ఏడ్చేవాళ్లను కూడా పిలవాలనుకున్నాం. కానీ ఈసారి కుదరలేదు. శవపేటికలో ఉన్నపుడు మన కోసం ఏడ్చేవారి స్వరం విన్నపుడు బలవన్మరణానికి పాల్పడి వారిని ఎంత వేదనకు గురిచేశామో అన్న విషయం అర్థమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
ఆర్టీసీ డ్రైవర్ అంత్యక్రియలపై ఉత్కంఠ
-
కేసీఆర్ చర్చలు జరిపేవరకు అంత్యక్రియలు చేయం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం బుధవారం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు వెళ్లి మృతి చెందిన డ్రైవర్ నంగునూరి బాబు అంత్యక్రియలపై ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని గురువారం మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. మృతుడి ఇంటివద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడంతో.. జిల్లాలోని ఆరెపల్లి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపేవరకూ.. మృతదేహాన్ని కదలనివ్వబోమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం -
ఇక్కడి మట్టిలో కలిసిపోవాలని ..
లంచగొండితనం తనను అమెరికా విమానమెక్కించినా, సొంతూరు, తెలుగు రాష్ట్రాన్ని ఆమె విస్మరించలేదు. క్యాన్సర్ రోగులకు చికిత్స కోసం హైదరాబాద్‌లో ఇండో ఆమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు వ్యవస్థాపక ట్రస్టీగా అవసరమైన నిధులు, అధునాతన యంత్ర పరికరాలను సమకూర్చారు. ఎన్నో సేవలతో పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. తాను కన్నుమూశాక అంత్యక్రియలు ఇక్కడే జరగాలన్న ఆమె మనోభావాన్ని ఇప్పుడా కుటుంబ సభ్యులు నెరవేర్చనున్నారు. న్యూయార్క్‌లో ఈ నెల 12వ తేదీ గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డాక్టర్ పోలవరపు తులసీపార్వతి భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలింపు సన్నాహాల్లో ఉన్నారు. సాక్షి, తెనాలి : డాక్టర్ పోలవరపు తులసీపార్వతి దుగ్గిరాల మండలంలోని కంఠంరాజుకొండూరులో 1941లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో ఊళ్లో రోడ్డే కాదు, బడి కూడా లేదు. బిడ్డను చదివించాలన్న కోర్కెతో ఆమె తండ్రి ఇంట్లోనే టీచరును పెట్టారు. 8వ తరగతికి 3 కి.మీ. దూరంలోని దుగ్గిరాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకు న్నారు. కొండపల్లిలోని మేనత్త ఇంట్లో ఉండి 10వ తరగతి పూర్తిచేసింది. గుంటూరు మహి ళా కళాశాలలో ఇంటర్ ఉత్తీర్ణురాలయ్యాక, మెరిట్లో అదే నగరంలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేరారు. అప్పట్లో ఆ కాలేజీలో కొత్తగా వచ్చిన ఎండీ కోర్సులోని రెండు సీట్లలో ఒకటి తనకు లభించింది. 1966లో గైనకాలజీలో ఎండీగా బయటకొచ్చారు. లంచమడిగారని తిక్కరేగి అమెరికాకు.. అమెరికా వెళ్దామని స్నేహితులు సూచించినా, సొంతూరులో ఆస్పత్రిని స్థాపించాలన్న ఉద్దేశంతో తులసీపార్వతి అంగీకరించలేదు. కొద్దికాలం ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసినా, కొన్ని కారణాలతో అమెరికాకు పయనమయ్యారు. ఈవిషయమై సన్నిహితులు అడిగినపుడు, ‘గుంటూరు లేదా తెనాలి బదిలీ చేయమని కోరితే దిగువ సిబ్బంది లంచంగా అడగటంతో తిక్కరేగింది.. అమెరికాకు ప్రయాణం కట్టా’నని తులసీపార్వతి చెప్పేవారు. ఆ విధంగా 1972 జూలైలో తాను అమెరికాకు బయలుదేరిన విమానంలోనే ఇరవై మంది తెలుగు డాక్టర్లు ఉన్నారని చెబుతుండేవారు. 1978 నుంచి ప్రాక్టీస్ ఆరంభించారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ హాస్పటల్లో డాక్టర్ తులసీపార్వతి సీనియర్ గైనకాలజిస్ట్ కాగా, తన భర్త డాక్టర్ పోలవరపు రాఘవరావు ఆర్థోపెడిక్. కుమార్తె శైలజ కూడా గైనకాలజిస్టే. కొడుకు హరికిషన్ ఎండీ ఫిజీషియన్. ఆ ఇంట్లో నలుగురూ వైద్యులే. ‘కార్పొరేట్’ స్థాయి ఉన్నత పాఠశాల.. చిన్నతనంలో చదువుకు పడిన కష్టాలను గుర్తుచేసుకుని, గ్రామంలో మరెవరికీ ఆ కష్టాలు ఉండరాదని తలచారు. తలిదండ్రుల పేర్లతో కారుమంచి రత్తమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి, కంఠంరాజుకొండూరులో ‘కారుమంచి గోవిందయ్య ఉన్నత పాఠశాల’ను 1992లో ప్రారంభించారు. ఇక్కడ ఇప్పుడు ఏటా 400–450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ చదివినవారు విదేశాల్లో, ఇతర చోట్ల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. -
శవ పంచాయితీ
చిలకలగూడ : తమకు తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించారని బంధువుల ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన లక్ష్మీనారాయణ ఈశ్వర్‌చంద్‌కు ముగ్గురు అక్కలు, ఒక సోదరుడు ఉన్నారు. పెద్ద సోదరి తారాబాయి భర్త మనోహర్‌రెడ్డి (70) అస్వస్తతకు గురికావడంతో ఈనెల 1న ముషీరాబాద్ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ 5న మృతి చెందాడు. అదేరోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని సీతాఫల్మండి శ్మశానవాటికకు తీసుకురాగా, మృతుడి సమీప బంధువైన అయుష్‌రెడ్డి అక్కడికి వచ్చి అంత్యక్రియలు చేయరాదంటూ అడ్డుకున్నాడు. మృతుని సోదరి ఉషారాణి బోపాల్ నుంచి వచ్చేవరకు దహన సంస్కారాలు చేయరాదని మరుసటి రోజు ( 6వ తేదీ) అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతూ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించాడు. 6న ఉదయం బంధువులు సీతాఫల్మండి స్మశానవాటికకు రాగా ఆయుష్‌రెడ్డి ఎంతకూ రాకపోయేసరికి బంధువులంతా గాంధీ మార్చురీకి వెళ్లారు. అక్కడ ఆయుష్‌రెడ్డి మరోమారు అసభ్యపదజాలంతో దూషించడమేగాక ఎవరికీ చెప్పకుండా మృతదేహాన్ని మరో స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాడు. దీంతో మృతుని బావమరిది లక్ష్మీనారాయణ ఈశ్వర్‌చంద్ పోలీసులను ఆశ్రయించడంతో ఆయుష్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చెరుకు ముత్యంరెడ్డి అంత్యక్రియలు పూర్తి
సాక్షి, సిద్దిపేట: మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యియి. ముత్యంరెడ్డి స్వస్థలం తొగుట మండలంలోని తిక్కాపూర్ గ్రామంలో జరిగిన ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ముత్యంరెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్, మాజీమంత్రి సునీతా లక్ష్మా రెడ్డి, కార్పోరేషన్ ఛైర్మన్లు ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలెటి రాధాకృష్ణ శర్మ, బక్కి వెంకటయ్య తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, ముత్యం రెడ్డి అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముత్యం రెడ్డికి సంతాప సూచకంగా గౌరవ వందనం సమర్పించి పోలీసులు 3 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. కాగా ముత్యంరెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. -
జైట్లీకి కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న జైట్లీ(66) శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా తీరంలోని నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని కైలాస్ కాలనీలోని స్వగృహం నుంచి దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు అక్కడే అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హర్ష్‌వర్థన్, ప్రకాశ్ జవడేకర్, పీయూష్ గోయెల్, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. అరుణ్ జైట్లీతో సన్నిహిత సంబంధాలున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. చేతులు జోడించి కొన్ని నిమిషాలపాటు పార్థివ దేహం వద్ద మౌనంగా నిలుచుండి పోయారు. మధ్యాహ్నం ప్రత్యేక శకటంలో జైట్లీ పార్థివ దేహాన్ని నిగమ్‌బోధ్ శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అంతిమయాత్రలో ఉప రాష్ట్రపతి వెంకయ్య, లోక్‌సభ స్పీకర్ బిర్లా, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కపిల్ సిబల్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులుసహా అశేష సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు పఠిస్తుండగా జైట్లీ కుమారుడు రోహన్ చితికి నిప్పంటించారు. సంతాప సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ..జైట్లీకి ఉద్వేగపూరిత నివాళులర్పించిన విషయం తెలిసిందే. బ్రాండెడ్ వస్తువులపై మక్కువ కుర్తా పైజామాతో అందరికీ ఆత్మీయుడిగా కనిపించే అరుణ్ జైట్లీకి లండన్‌లో తయారయ్యే షర్టులు, జాన్ కాబ్ షూస్ వంటి బ్రాండెడ్ వస్తువులంటే విపరీతమైన మక్కువనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయ వేత్తగా, ప్రముఖ లాయర్‌గా అందరికీ సుపరిచితుడైన జైట్లీకి బ్రాండెడ్ వాచీలు, పెన్నులు, శాలువాలు, షర్టులు, ఇంకా షూలు సేకరించడం హాబీ. ఆయన వాడే వాటిల్లో ప్రఖ్యాత పటేక్ ఫిలిప్స్(వాచీలు), మాంట్ బ్లాంక్ (పెన్నులు) ఉన్నాయి. జైట్లీ అభిరుచులపై కుంకుమ్ చద్దా రాసిన ‘ది మారిగోల్డ్ స్టోరీ’ పుస్తకంలోని అరుణ్‌జైట్లీ: ది పైడ్ పైపర్ అనే చాప్టర్లో వివరంగా ఉంది. ‘చాలా మంది భారతీయులకు ఒమెగా వాచీలకు మించి తెలియని రోజుల్లోనే జైట్లీ చాలా ఖరీదైన పటేక్ ఫిలిప్స్ వాచీలను కొనేవారు. మాంట్ బ్లాంక్ పెన్నులు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ప్రతి మోడల్‌నూ కొనేవారు. ఇంకా జమవార్ షాల్స్‌ను సేకరించేవారు. ఆయన తన కుమారుడికి కొని పెట్టిన మొదటి షూ జత ఇటాలియన్ బ్రాండ్ సల్వటోర్ ఫెర్రాగమో’ అని చద్దా పేర్కొన్నారు. అలాగే, ఆయన వ్యక్తిగత జీవితంలోనూ తనకంటూ కొన్ని నియమాలను విధించుకున్నారు. లాయర్‌గా తను తీసుకునే ఫీజు కాకుండా క్లర్కులకు ‘మున్షియానా’(ఫీజు)కూడా అందేలా చూసేవారు. ఈ విధానం ఆయన తోటి వారికి నచ్చకపోయినా అరుణ్ తన విధానానికే కట్టుబడి ఉన్నారు’ అని జైట్లీ సతీమణి సంగీత తెలిపారని చద్దా తన పుస్తకంలో పేర్కొన్నారు. అధికారిక పర్యటనల్లోనూ వెంట ఉండే వారి ఖర్చులు తనే భరించేవారని ఆమె తెలిపారన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనల సందర్భంగా రాకపోకల కోసం విదేశీ కంపెనీల ప్రతినిధులు కార్లు, ఇతర వాహనాలను సమకూరుస్తామన్నా అంగీకరించేవారు కాదని పేర్కొన్నారు. -
వరద నీటిలో దహన సంస్కారాలు
సాక్షి, కాకినాడ: గోదావరి వరద బతికున్నోళ్లనే కాదు చనిపోయిన వాళ్లను కూడా ఇబ్బంది పెడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధ గౌతమీ నదికి వరద నీరు పోటెత్తడంతో మురమళ్ల గ్రామ స్మశాన వాటిక మునిగిపోయింది. గ్రామంలో నాగమణి అనే వృద్ధురాలు చనిపోవడంతో వరద నీటిలోనే అంతిమ యాత్ర నిర్వహించారు గ్రామ ప్రజలు. దహన సంస్కారాలు చేసినప్పుడు నీటితో తడిసిన కట్టెలు మండకపోవడంతో టైర్లు, కొబ్బరి మట్టలు వేసి అతికష్టం మీద కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగారు. మరోవైపు ఆంధ్ర, చత్తీస్గడ్ జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చింతూరు మండలంలో 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం విలీన మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. -
బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు
భోపాల్: కని పెంచిన కుమార్తె.. తనకు ఇష్టం లేని వ్యక్తితో వెళ్లి పోయిందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అల్లారుముద్దగా పెంచిన కుమార్తెకు బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించాడు. వివరాలు.. మండసోర్ సమీప గ్రామం కుచ్రోడ్కు చెందిన గోపాల్ మండోర కుమార్తె, శారద మండోర(19) గత నెల 25న ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లి పోయింది. దాంతో ఆగ్రహించిన గోపాల్, కుమార్తె బతికుండగానే.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ మేరకు గ్రామస్తులకు, బంధువులకు పత్రికలు ఇచ్చి మరి ఆహ్వానించాడు. అనంతరం గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాడు. -
షీలాకు కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ముగిశాయి. ఇక్కడి నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. షీలాకు నివాళులర్పించిన వారిలో బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎంలు అశోక్ గహ్లోత్, కమల్‌నాథ్ తదితరులు ఉన్నారు. ఆమె నివాసం నుంచి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంతోపాటు, చివరగా బాధ్యతలు నిర్వహించిన ఢిల్లీ కాంగ్రెస్ విభాగం కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా అనేక రంగాలకు చెందిన ప్రజలు ఆమెకు నివాళులర్పించారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
సాక్షి, వేములవాడ : కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రిని విధి గుండె సంబంధిత వ్యాధి రూపంలో బలి తీసుకుంది. పుట్టెడు దుఃఖంతో తండ్రికి చిన్నకూతురు తలకొరివి పెట్టింది. ఈ హృదయ విదారకర ఘటనతో గ్రామస్తులు కంటతడిపెట్టారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చందుర్తి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి బాబు ఆర్నెళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి గుండె వీక్‌గా ఉందని చెప్పారు. కూలీ పని చేస్తేనే పూటగడిచే ఆ కుటుంబానికి వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లి గవ్వ లేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బాబు అస్వస్థతకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుళ్లు స్రవంతి, స్యౌమ ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతికి వివాహం కాగా, చిన్న కూతరు సౌమ్య పుట్టెడు దుఃఖంతో తండ్రి చితికి నిప్పు పెట్టింది. కాగా నిరుపేద కుటుంబానికి గ్రామస్తులు రూ.30 వేలు, రెండు క్వింటాళ్ల బియ్యం విరాళంగా అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా కృషి చేసి ఆదుకుంటామని ఎంపీటీసీ సభ్యుడు పులి రేణుకాసత్యం హామీ ఇచ్చారు. -
తల్లికి తలకొరివి పెట్టిన మాజీ స్పీకర్
సాక్షి, శ్రీకాకుళం : శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకురాలు కావలి ప్రతిభా భారతి మాతృమూర్తి కొత్తపల్లి లీలావతమ్మ(85) అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. తల్లి పార్థివదేహానికి ప్రతిభా భారతి తలకొరివి పెట్టారు. మనుమరాలు గ్రీష్మాప్రసాద్, కుటుంబ పెద్దలు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాజ్జీ), రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొళ్ల అప్పలనాయుడు, కేసరి తదితరులు ప్రతిభా భారతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతిభా భారతి 1999-2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా పనిచేశారు. -
గట్టు భీముడికి కన్నీటి వీడ్కోలు
గట్టు: టీఆర్ఎస్ నేత, గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడికి టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరలో నిర్వహించిన గట్టు భీముడి అంత్యక్రియలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నివాళులర్పించారు. గట్టు భీముడి కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అండగా ఉంటా మని హామీనిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మంచి బీసీ నాయకుడిని కోల్పోయిందన్నారు. గట్టు భీముడి సతీమణి భువనేశ్వరి తమ కుటుంబానికి తీరని అన్యా యం జరిగిందని, మాకు న్యాయం చేయాలని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత మంత్రి నిరంజన్‌రెడ్డిని కలవాలని, ఆయన ద్వారా మీకు న్యాయం చేస్తామని కేటీఆర్ చెప్పారు. అంత్యక్రియల్లో భాగంగా మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయగౌడ్ గట్టు భీముడి పాడెను మోశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథ«ం, తదితరులు గట్టు భీముడికి నివాళులు అర్పించారు. -
తండ్రి రుణం తీర్చుకున్న కుమార్తె
విశాఖపట్నం ,మల్కాపురం(విశాఖ పశ్చిమ): జన్మనిచ్చిన తండ్రికి సేవ చేసింది... ఆ తండ్రి మరణించడంతో తలకొరివి పెట్టి రుణాన్ని తీర్చుకుంది ఓ మహిళ. జీవీఎంసీ 47వ వార్డు హిమచల్‌నగర్ ప్రాంతానికి చెందిన పి.వి.వి.సూర్యనారాయణ(50), అతని భార్య సత్యకు ముగ్గురు కుమార్తెలు. సూర్యనారాయణ హోమ్‌గార్డుగా విధులు నిర్వాహిస్తున్నాడు. ఇతనికి అనారోగ్య సమస్య తలెత్తింది. తండ్రికి తలెత్తిన అనారోగ్య సమస్యపై చలించిన పెద్దకుమార్తె శ్రావణి ఆయనకు సేవలు చేసేది. శ్రావణి మాదిరిగానే మిగిలిన ఇద్దరు కుమార్తెలు తండ్రికి ఏ కష్టమోచ్చినా అండగా నిలిచేవారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యతో సూర్యనారాయణ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో పెద్ద కుమార్తె శ్రావణి ముందుకొచ్చి తండ్రి శవయాత్రలో పాల్గొని తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. -
‘స్వయంగా హనుమంతుడే వచ్చి ఓదార్చాడు’
బెంగళూరు : సాధరణంగా కోతి నుంచి మనిషి పుట్టాడని సైన్స్ చెబుతుంది. అందుకే అప్పుడప్పుడు మనషి కోతిలా.. కోతి మనిషిలా ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే.. బంధువులు, సన్నిహితులు వచ్చి ఓదార్చడం సహజం. కానీ కర్ణాటకలో మాత్రం ఓ వానరం.. చావింటికి వెళ్లి బంధువులను ఓదార్చింది. వినడానికి వింతగా ఉన్న ఇది వాస్తవం. వివరాలు.. శుక్రవారం(నిన్న) కర్ణాటకలోని నార్గుండ్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దాంతో అతని బంధువులంతా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి.. సంతాపం తెలిపారు. ఆ సమయంలో అనుకోని అతిథిలా ఓ కోతి అక్కడకు వచ్చి ఏడుస్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి.. తల నిమిరి ఓదార్చింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మరి కొందరైతే ఏకంగా హనుమాన్ జయంతి రోజే ఇలా జరిగింది.. స్వయంగా ఆ హనుమంతుడే వచ్చి ఓదార్చడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వానరం గతంలో కూడా ఇలా కొందరి ఇళ్లకు వెళ్లి ఓదార్చిందని చెప్తున్నారు స్థానికులు. గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తే చాలు ఈ కోతి అక్కడ తప్పక ప్రత్యక్షమవుతుందంటున్నారు స్థానికులు. మనుషులు ఒకర్ని ఒకరు ఎలా ఓదార్చుకుంటారో.. కోతి కూడా అలాగే చేస్తుందని తెలిపారు. ఇలా గత కొన్ని నెలలుగా జరుగుతుందన్నారు. ప్రస్తుతం చావింటికి కోతి రావడం ఒక ఆనవాయితీగా మారిందన్నారు. ఒకవేళ వానరం రాకపోతే అంత్యక్రియలు పూర్తికానట్లే భావిస్తున్నామన్నారు స్థానికులు. -
పరీకర్‌కు తుది వీడ్కోలు
పణజి: క్లోమగ్రంథి కేన్సర్‌తో మృతిచెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అంత్యక్రియలు సోమవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు, పణాజి వచ్చిన ప్రధాని మోదీ పరీకర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆ తరువాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకుని పరామర్శించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరీకర్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. నూతన ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఆదివారం రాత్రే గోవా చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా పరీకర్‌కు చివరిసారి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. పరీకర్ పెద్ద కొడుకు ఉత్పల్ ఆయన చితికి నిప్పంటించారు. తరలివచ్చిన అభిమానులు పణజిలోని కళా అకాడమీ నుంచి దహనసంస్కారాలు నిర్వహించిన మీరామర్ బీచ్ వరకు సాగిన అంతిమయాత్రలో వేలాది మంది పరీకర్ మద్దతుదారులు, అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు, బీజేపీ కార్యాలయంలో ఉంచిన ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు సామాన్య ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అశేష సంఖ్యలో తరలివచ్చారు. త్రివర్ణ పతాకంలో చుట్టిన పరీకర్ పార్థివ దేహాన్ని చూడగానే ఆయన అభిమానలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రకు ముందు బీజేపీ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలు జనంతో రద్దీగా మారాయి. కళా అకాడమీ ముందు కూడా ప్రజలు మత విశ్వాసాలకు అతీతంగా బారులు తీరి పరీకర్‌కు నివాళులర్పించారు. ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పరీకర్ మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరీకర్ కొడుకు గోవా కొత్త సీఎంపై ఉత్కంఠ! రాత్రి 11 గంటలకు సీఎంగా ప్రమోద్ ప్రమాణం చేస్తారన్న బీజేపీ అంతలోనే ఆ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటన మిత్రపక్షాలతో ఇంకా చర్చలు సాగుతున్నాయని వెల్లడి పణజి: గోవాకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కానున్నారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ సోమవారం రాత్రే 11 గంటలకు ప్రమాణంచేస్తారని బీజేపీ ప్రకటించింది. కొద్దిసేపటికే ప్రమాణస్వీకారాన్ని విరమించుకుంటున్నామని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున నుంచి కేంద్రమంత్రి గడ్కరీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు సంకీర్ణ ప్రభుత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)లతో చర్చలు జరిపారు. సీఎం ఎవరనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని గడ్కరీ చెప్పారు. సోమవారం సాయంత్రం తర్వాత కొద్దిసేపటికే తదుపరి సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఎంపికయ్యారనీ, జీఎఫ్‌పీ చీఫ్ విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నామని బీజేపీ వెల్లడించింది. ఈ ఒప్పందానికి కూటమి పార్టీలు ఒప్పుకున్నందున రాత్రి 11 గంటలకు ప్రమోద్ చేత గవర్నర్ మృదులా సిన్హా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారంది. మళ్లీ ఏమైందోగానీ, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. మిత్రపక్షాలతో ఇంకా చర్చలు జరుగుతున్నందున రాత్రి 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండదని డిప్యూటీ స్పీకర్ మైఖేల్ ప్రకటించారు. అంతకుముందు సోమవారం తెల్లవారుజామున గోవాకు చేరుకున్న నితిన్ గడ్కరీ, కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు, ఎంజీపీ, జీఎఫ్‌పీ నేతలతోనూ చర్చించారు. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్లు 40 కాగా, 14 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవాకు నూతన ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించగా, మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం గోవా అసెంబ్లీలో తమదే అతిపెద్ద పార్టీ అయినందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ మృదులా సిన్హాను సోమవారం కోరారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావెల్కర్ నేతృత్వంలోని 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యల బృందం సోమవారం గవర్నర్‌ను కలిసింది. ఈ విషయంపై తర్వాత సంప్రదిస్తానని గవర్నర్ తమతో చెప్పారని చంద్రకాంత్ చెప్పారు. -
‘ఆ చెప్పులు ధరించడం ఇబ్బందే’
పణజి : నిరాడంబర సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడంబరాలకు దూరంగా ఉండే పరీకర్ గురించి పలు ఆసక్తికర అంశాలు ప్రచారంలో ఉన్నాయి. పరీకర్ ఇతర మంత్రుల లాగా సూటు బూటు ధరించేవారు కారు. కొల్హాపూర్ చెప్పులు, సాధరణ వస్త్రధారణనే ఇష్టపడేవారు. సీఎం పదవిలో ఉండి కూడా స్కూటర్ మీదనే తిరిగేవారు. రక్షణశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాజ్‌దీప్ సర్దేశాయ్కిచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాల గురించి మాట్లాడుతూ.. ‘పాశ్చత్య వస్త్ర ధారణ నాకు అంతగా నప్పదు. కానీ గత రక్షణశాఖ మంత్రలు కంటే నా వస్త్రధారణ బాగానే ఉంటుంది. ఇకపోతే డిఫెన్స్ మినిస్టర్‌గా ఉంటూ కొల్హాపూర్ చెప్పులు ధరించడమే కాస్తా ఇబ్బందికరంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక గోవా సీఎంగా ఉన్నప్పుడు స్కూటర్ మీదనే తిరుగుతుండేవారు పరీకర్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీరు ఎప్పుడూ స్కూటర్ మీదనే తిరుగుతారా’ అని జనాలు నన్ను అడుగుతారు. కానీ ఎల్లకాలం ఇలానే తిరగలేను. ఎందకంటే నా మైండ్‌లో ఎప్పడు పని గురించిన ఆలోచనలే ఉంటాయి. నేను స్కూటర్ నడిపేటప్పుడు నా మైండ్ మరో చోట ఉంటుందనుకొండి.. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. అందుకే స్కూటర్ నడపాలంటే నాకు భయం’ అని తెలిపారు పరీకర్. మనోహర్ పరీకర్ అంత్యక్రియలను పణజిలోని మిరమార్ బీచ్‌లో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహిస్తారని సీఎంఓ ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం పరీకర్ మృత దేహాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పణజీ కళా అకాడమీకి తరలించారు. -
చివరిచూపు కోసం..
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల) : ఆస్ట్రేలియాలో హత్యకు గురైన డాక్టర్ ప్రీతిరెడ్డి చివరి చూపైన మాకు దక్కెనా అంటూ మండలంలోని గురుకుంట గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో జరిగిన దురాఘతానికి తమ పల్లె యువ డాక్టరమ్మ హత్యకు గురవడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. కాగా ప్రీతిరెడ్డి హత్య విషయంలో అక్కడికి వెళ్లేందుకు రెండు రోజులుగా ప్రయత్నించిన బంధువులు ఎట్టకేలకు గురువారం బయలుదేరి వెళ్లారు. గ్రామానికి నర్సింహరెడ్డి గత 36 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే íస్థిరపడ్డారు. వీరికి ఆస్ట్రేలియాలో గ్రీన్ కార్డు ఉంది. ఆయన కూతురు ప్రీతిరెడ్డి అక్కడే డాక్టర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో తనతోపాటు డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి (మాజీ ప్రీయుడి) చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో ప్రీతిరెడ్డి బాబాయిలు హైదరాబాద్‌కు చెందిన దామోదర్‌రెడ్డి, అమెరికాలో స్థిరపడిన హరికృష్ణరెడ్డి ఆస్ట్రేలియాకు బయలుదేరారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తారా.. అక్కడే ఖననం చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ప్రీతిరెడ్డి గురుకుంట గ్రామానికి ఒకేసారి వచ్చిందని, స్వగ్రామంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బుధవారం ఆమె మృతికి అక్కడి వైద్య బృందం ఆస్పత్రిలో శ్రద్ధాంజలి ఘటించారు. -
దేశ సేవలోనే తుది శ్వాస
శ్రీకాకుళం , నరసన్నపేట రూరల్: విధి నిర్వహణలో భాగంగా గాయపడిన ఆర్మీ ఉద్యోగి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామం వీఎన్‌పురం తీసుకురావడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు సైనిక లాంఛనాలతో గురువారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.మండలంలోని వీఎన్‌పురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి చల్ల రమేష్ (34) 16వ మద్రాస్ ఇంజినీర్ రెజిమెంట్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట బరువైన వస్తువు తగిలి అతడి కాలికి గాయమైంది. ఆ తర్వాత గాయానికి ఇన్ఫెక్షన్ సోకడంతో ఢిల్లీలోని ఎంహెచ్ఆర్ఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు మృతి చెందారని సుబేదర్ భాస్కరరావు తెలిపారు. తల్లడిల్లిన చిన్నారి స్వగ్రామానికి శవపేటికలో రమేష్ మృతదేహాన్ని సైనిక సిబ్బంది తీసుకొచ్చారు. ఇక్కడ్నుంచి వెళ్లిన భర్త విగతజీవిగా కనిపించడంతో భార్య అరుణ జీర్ణించుకోలేకపోయింది. గండెలవిసేలా రోదించింది. ఈమెతోపాటు అతడి తల్లి నరసమ్మను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చిన్నారి అభిషేక్(9) తన తండ్రి పార్థివదేహానికి వందనం చేస్తూ కన్నీటి పర్యంతయ్యాడు. ఇంతలో అక్కడవారు ఓదార్చుతుండగా ‘డాడీ..రా..డాడీ’ అంటూ బోరుమని ఏడుస్తున్న ఘటన చూపరులను కలచివేసింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు హూటహుటిన ఇక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సైనిక సిబ్బంది ఘన నివాళి ఈ సందర్భంగా రమేష్ పార్థివదేహంపై సైనిక అధికారులు జాతీయ పతాకాన్ని కప్పారు. సుబేదర్ భాస్కరరావు, సైనిక సిబ్బంది సోమేశ్వరరావు, పీటీరావు, శ్రీనివాసరావు, శంకరరావు, సిగ్ననల్మేన్ శ్రీనివాసరావు శోకతప్త హృదయాలతో గౌరవ వందనం చేస్తూ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పార్థివదేహానికి అంతిమయాత్ర నిర్వహించి, స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంతిమ యాత్రలో వైఎస్సార్ సీపీ మండల యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య, మాజీ సర్పంచ్ పుట్ట ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
విధి వింత పరీక్ష
శ్రీకాకుళం, సోంపేట: విధి ఆ కుటుంబంతో ఆడుకుంటూనే ఉంది. విధిరాతను ఎదిరించి నిలిచిన ప్రతిసారీ ఏదో పరీక్ష పెడుతూనే వచ్చింది. అఖరికి మరణంలోనూ మరో పరీక్ష పెట్టి చెల్లితో తలకొరివి పెట్టించింది. మండలంలోని సిరిమామిడి గ్రామానికి చెందిన పొట్టి రామారావుకు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమార్తులు, ఇద్దరు కుమారులు. కుమార్తెలు కుసుమ, కుమారికి చెవిటి, మూగ. కుమారులు రామకృష్ణ, హరికృష్ణ దివ్యాంగులు. రామకృష్ణ(40) కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ శివరాత్రి రోజు సోమవారం ఉదయం మృతి చెందారు. తండ్రి అనారోగ్యంతో ఉండటం, దగ్గర బంధువులు ఎవరూ తలకొరివి పెట్టడానికి ముందుకు రావకపోవడంతో దివ్యాంగురాలైన రామకృష్ణ సోదరి కుమారి తల కొరివి పెట్టి అన్న రుణం తీర్చుకుంది. హరికృష్ణ ప్రస్తుతం అండమాన్‌లో ఉన్నారు. వీరు నలుగురూ ఏరోజు బాధపడకుండా ఉన్నంతలో ఆనందంగా గడిపారు. తల్లి 25 ఏళ్ల కిందటే మృతి చెందారు. -
పాడె కట్టాడు... అంతలోనే...
సాక్షి, మునుగోడు : మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాల నిమిత్తం పాడె కట్టిన మరో వ్యక్తి వెంటనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మండలంలోని చీకటిమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన సిరగమళ్ల క్రిష్ణయ్య (50) అనే వ్యక్తి వృత్తి రీత్యా మరణించిన వారికి దహన సంస్కరణ ఏర్పాట్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఆయన దహన సంస్కారాలకు అవసరమైన పాడెను కట్టి శవయాత్ర వెంట వెళ్తున్నాడు. అయితే అంతలోనే అతడికి గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. అది గమనించిన గ్రామస్తులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. -
భర్తకు భార్య తలకొరివి
విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం: కన్నవాళ్లు, బంధువులు ఉన్నా అక్కరకురాలేదు. భర్త చనిపోతే కనీసం తలకొరివి పెట్టడానికి ఎవ్వరూ ముందుకురాని దుస్థితి. కనీసం ఖర్మకాండలు చేపట్టడానికి కూడా బంధువులు కనికరం చూపకపోవడంతో భర్తకు భార్యే తలకొరివి పెట్టింది. జీవీఎంసీ 59వ వార్డు నాతయ్యపాలెంలో ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. శ్రీకాకుళం నుంచి బతుకు తెరువుకోసం యర్రా మోహన్ (40), భార్య హేమ, కుమార్తె గౌతమి (5)తో వలస వచ్చి 59వ వార్డు నాతయ్యపాలెంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కొద్దికాలంగా మోహన్ అనారోగ్యానికి గురయ్యాడు. ఐదు రోజుల క్రితం గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. అయితే గ్రామంలో కొందరు బంధువులు ఉన్నా వీరిని పట్టించుకోలేదు. కనీసం ఖర్మకాండలకు సహకరించలేదు. దీంతో స్థానికులు కొంత సహాయం చేయడంతో మృతుని భార్య హేమ భర్త పార్థివదేహానికి నాతయ్యపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసింది. -
అమర జవాన్లకు సెల్యూట్
న్యూఢిల్లీ/లక్నో/జైపూర్: ఉద్వేగం ఉప్పొంగింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. మాతృ దేశ సేవలో నేలకొరిగిన అమర జవాన్లకు తుది వీడ్కోలు పలికేందుకు దేశమంతా కదిలొచ్చింది. మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది. పుల్వామా దాడిలో అసువులు బాసిన ధీశాలుల అంత్యక్రియలు శనివారం దేశవ్యాప్తంగా వారివారి స్వస్థలాల్లో అధికార లాంఛనాలతో జరిగాయి. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ వారి పట్ల గర్వం ఓ వైపు, తమలో ఒకరు ఇక లేరని వేదన మరోవైపు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ..ఒక్కో వ్యథ. ఇంతటి విషాద సమయంలో జాతి అంతా ఒక్కటై ముష్కరుల కుట్రకు బలైన భరతమాత ముద్దు బిడ్డల సేవలను శ్లాఘిస్తూ ఘనంగా నివాళులర్పించింది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాల్ని మూసేశారు. తమ గ్రామానికి చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాల్ని కడసారి చూసేందుకు ప్రజలు వీధుల్లో రోడ్లకు ఇరు వైపులా నిలబడ్డారు. పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి తమ స్వరాష్ట్రాలకు వెళ్లి అక్కడి మంత్రులతో కలసి వీర జవాన్ల అంతిమ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం కప్పిన జవాన్ల భౌతిక కాయాలను ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు సమీపంలోని విమానాశ్రయాలకు తరలించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారివారి స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి చితికి నిప్పంటించగా, రాజస్తాన్‌లో రెండు నెలల పసిగుడ్డుతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం కంటతడిపెట్టించింది. రాజస్తాన్‌లో... రోషితాష్ లాంబా(జైపూర్), నారాయణ్‌లాల్ గుర్జార్(రాజసమంద్), జీత్‌రామ్(భరత్పూర్), భగీరథ్‌సింగ్(ధోల్పూర్), హేమరాజ్ మీనా(కోట)ల అంతిమయాత్రలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’, ‘భారత్ మాతాకీ జై’నినాదాలు మిన్నంటాయి. ఉత్తరాఖండ్‌లో.. ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి వీరేంద్రసింగ్ చితికి నిప్పు పెట్టిన దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ సహచరుడికి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఇక డెహ్రాడూన్‌లో జరిగిన మోహన్‌లాల్ అంత్యక్రియలకు అశేష జనం హాజరయ్యారు. పంజాబ్‌లో.. మోగా జిల్లాలోని గలౌటీ కుర్ద్ గ్రామంలో అమర జవాను జైమల్ సింగ్ మృతదేహానికి ఐదేళ్ల ఆయన కొడుకు గురుప్రకాశ్ నిప్పు అంటించాడు. గురుదాస్‌పూర్‌లో మణిందర్ సింగ్ భౌతికకాయానికి ఆయన తమ్ముడు, సీఆర్పీఎఫ్ జవాన్ అయిన లక్వీర్ సింగ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇక రూప్‌నగర్‌లో 26 ఏళ్ల కుల్వీందర్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల్వీందర్ సింగ్ భౌతికకాయాన్ని చూసి ఆయనకు కాబోయే భార్య సొమ్మసిల్లిపడిపోవడం అక్కడున్న వారిని కలచివేసింది. ఒడిశాలో.. పుల్వామా దాడిలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్ సాహూ, కటక్‌కు చెందిన మనోజ్కుమార్ల భౌతికకాయాలను స్వీకరించేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి వేలాది మంది తరలివచ్చారు. మహారాష్ట్రలో.. అమర జవాన్లు నితిన్ శివాజీ రాథోడ్(36), సంజయ్ సింగ్ దీక్షిత్(47)ల భౌతికకాయాలను శనివారం ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాలకు పంపించారు. తమిళనాడులో.. అమర జవాన్లు జి.సుబ్రమణ్యం, సి.శివచంద్రన్ భౌతికకాయాలకు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. కర్ణాటకలో.. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న అమర జవాన్ 33 ఏళ్ల హెచ్. గురు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్‌లో.. కానౌజ్ జిల్లాలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ యాదవ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన పదేళ్ల కూతురు సుప్రియ సొమ్మసిల్లింది. ఆయన రెండో కూతురు రెండున్నరేళ్ల చిన్నారిది అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోలేని పరిస్థితి. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్, ఆగ్రా, మేన్పురి, ఉన్నావ్, కాన్పూర్, దెహాట్, చందౌళి జిల్లాల్లోనూ అమర జవాన్ల అంత్యక్రియల్లో ఇలాంటి గంభీర వాతావరణమే కనిపించింది. మాతృదేశ సేవలో నేలకొరిగిన సైనికుల సాహసాలను కీర్తిస్తూ వేలాది మంది ప్రజలు నినాదాలు చేశారు. పుల్వామా దాడికి కారకులను శిక్షించాలని అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, అధికారుల్ని డిమాండ్ చేశారు. దియోరియా జిల్లాలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తేనే తన భర్త విజయ్ మౌర్య అంత్యక్రియలకు అంగీకరిస్తానని ఆయన భార్య విజయ్ లక్ష్మి పట్టుపట్టారు. మంత్రి అనుపమా జైస్వాల్, ఇతర నాయకులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చందౌళిలో అవధేశ్ యాదవ్ అంత్యక్రియలు గంగా నదీ తీరంలో నిర్వహించారు. మహరాజ్‌గంజ్‌లోని ఓ పాఠశాలకు అమర జవాను పంకజ్ త్రిపాఠి పేరు పెడతామని కేంద్ర మంత్రి శివప్రతాప్ శుక్లా ప్రకటించారు. తుదిహార్లో మహేశ్ యాదవ్ భౌతికకాయం వద్ద రోదిస్తున్న బంధువు.. కర్ణాటకలోని దొడ్డి గ్రామంలో విలపిస్తున్న హెచ్ గురు కుటుంబసభ్యులు ఆగ్రాలో కుశల్‌కుమార్ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యుల రోదన.. కోల్‌కతాలో సుదీప్బిశ్వాస్ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు -
పరిమళించిన మానవత్వం
శ్రీకాకుళం, కొత్తూరు: కన్నవారినే కనికరం లేకుండా రోడ్డున పడేస్తున్న ఈ రోజుల్లో ఊరికాని ఊరు వచ్చిన ఓ అనాథ వృద్ధురాలిని సాకడమే కాదు, అంతిమ దహన సంస్కారాలు కూడా చేసిన పాడలి నిర్వాసితులు తమ మానవత్వం చాటుకున్నారు. పదేళ్ల క్రితం హిరమండలం మండలం పరిధి పాడలి నిర్వాసిత గ్రామానికి ఒడిశా నుంచి ఓ వృద్ధురాలు (70) వచ్చింది. అప్పట్నుంచి నిర్వాసిత గ్రామంలోనే ఉండిపోయింది. ఈమెకు తెలుగు రాకపోవడంతో ముసలమ్మ, బుడి అని పిలిచుకునేవారు. గ్రామస్తులు రోజూ భోజనం పెడుతూ ఆదరించేవారు. ఆ తర్వాత తమతోపాటు మెట్టూరు బిట్–2 పునరావాస కాలనీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మతిస్థిమితం లేకపోవడంతో రోడ్లుపై తిరుగుతూ అనారోగ్యం పాలైంది. చివరకు బుధవారం మృతి చెందగా నిర్వాసితులైన ప్రశాంత్, పీ రమేష్, పెద్దకోట శ్రీనివాసరావు, ఆదినారాయణ, కాంతారావు, వైకుంఠరావు, తదితరులు దహన సంస్కారాలు చేశారు. కాలనీకి చెందిన పొడ్డిన ఉమ తలకొరివి పెట్టారు. అదేవిధంగా కర్మకాండలు చేశారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
విజయనగరం, జలుమూరు: సాధారణంగా ఎవరైనా మృతి చెందితే అతనికి దహన సంస్కారాలు పురుషులు చేస్తారు. మృతి చెందిన వ్యక్తి తండ్రి అయితే ఇంటి పెద్ద కొడుకు, తల్లి అయితే చిన్న కొడుకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు ముందు తలకొరివి(ముఖాగ్ని) పెట్టడం సంప్రదాయం. కాని జలుమూరు మండలంలో చెన్నయవలసలో కావాటి పొట్టయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందగా అతని కుమార్తె బండి భాగ్యం తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది. పొట్టయ్య భార్య రమణమ్మ చాలాఏళ్ల క్రితం శనిపోయింది. వీళ్లకు కుమారులు లేరు, కుమార్తె ఉంది. పొట్టయ్య మరో వివాహం చేసుకోకుండా కుమార్తె భాగ్యంను కొడుకులా పెంచి పెద్ద చేసి వివాహం చేశాడు. తాను మృతి చెందితే అల్లుడుతో కాకుండా నీవే నాకు తలకొరివి పెట్టాలని తరచూ చెప్పేవాడు. తన తండ్రి కోరికపై తాను ఇలా తలకొరివి పెట్టినట్లు భాగ్యం తెలిపింది. -
నేడు ఫెర్నాండెజ్ అంత్యక్రియలు
న్యూఢిల్లీ: మాజీ రక్షణమంత్రి, సోషలిస్ట్ దిగ్గజం జార్జి ఫెర్నాండెజ్(88) అంత్యక్రియలు గు రువారం ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఫెర్నాం డెజ్ కోరిక మేరకు తొలుత ఆయన పార్థివదేహాన్ని దహనంచేసి, అస్థికలను పృథ్వీరాజ్ రోడ్డులోని క్రైస్తవ శ్మశానవాటికలో ఖననం చేయనున్నట్లు ఆయన భార్య లీలా కబీర్ వెల్ల డించారు. గురువారం ఉదయం వరకు ప్రముఖుల, అభిమానుల సందర్శనలు, నివాళుల తర్వాత మధ్యాహ్నం మూడింటికి స్వగృహం శాంతినివాస్ నుంచి అంతిమయాత్ర మొదలవుతుందని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న ఫెర్నాండెజ్ ఏకైక కుమారుడు సియాన్ ఈరాత్రికల్లా ఢిల్లీ చేరుకోనున్నాడు. -
అశ్రునయనాలతో అంతిమయాత్ర
ముగ్గురు విద్యార్థులకు కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజలు, క్రిస్టియన్ మత పెద్దలు, పలువురు ప్రముఖులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్, సుజాత పిల్లలు సాత్విక(18) జై సుచిత(14) సుహాస్‌నాయక్(16) అమెరికాలోని టెన్నిస్ రాష్ట్రం కొలిరివిల్లేలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి వారి మృతదేహాలు గుర్రపుతండాకు చేరుకోగా, శనివారం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. చందంపేట (దేవరకొండ) : డిసెంబరులో అమెరికాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల మృతదేహాలు శనివారం స్వగ్రామం చేరాయి. నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన పాస్టర్, అలైఖ్య బంజార ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌నాయక్, సుజాత దంపతుల కుమార్తెలు సాత్విక(18) జై సుచిత(14) కుమారుడు సుహాస్‌నాయక్(16) అమెరికాలోని టెన్నిస్ రాష్ట్రం కొలిరివిల్లేలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సుమారు 25 రోజుల పాటు అక్కడే ఉండడంతో సొంత గ్రామమైన గుర్రపుతండాకు తీసుకురావాలని గ్రామస్తులు కోరారు. దీంతో శుక్రవారం రాత్రి స్వగ్రామానికి మూడు ప్రత్యేక అంబులెన్స్‌లలో చిన్నారుల మృతదేహాలు తరలించారు. శనివారం గుర్రపుతండాలోని అలేఖ్య బంజార పాఠశాలలో పెద్ద సంఖ్యలో జనం రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన భూస్థాపన ఆరాధన కార్యక్రమంలో క్రిస్టియన్ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రిస్టియన్ మతపెద్దలు, క్రైస్తవ సోదరులు, ప్రముఖులు, స్నేహితులు హాజరై శ్రీని వాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో అక్కడున్న వారు కన్నీ రు పెట్టుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌నాయక్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ముగ్గురి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్ కుటుంబాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నిజామాబాద్ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, బి ల్యానాయక్, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వైస్ చైర్మన్ శంకర్లుకి, బిఎండబ్ల్యూవో వెంకటేశ్వర్లు, ఆర్డీఓ లింగ్యానాయక్, ఫ్రెండ్ క్యాంపస్ అకాడమి ప్రెసిడెంట్ అస్టోబిట్, హుమేల్, ఎలెక్స్ కోబర్ట్, మేరిమిహోలో, కొబిలి కిల్ హాజరయ్యారు. అండగా ఉంటా : ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు నా చిన్ననాటి నుంచి శ్రీనివాస్‌నాయక్ మంచిమిత్రుడు. వీరికుటుంబం చాలా మంచిది. ముగ్గురు చిన్నారులను కోల్పోవడం చాలా బాధగా ఉంది. నాతో కూడా ఎప్పుడు ఫోన్ చేసి ముగ్గురు చిన్నారులు మాట్లాడే వారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం : రవీంద్రకుమార్ అలైఖ్య బంజార సంస్థను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను చెబుతున్న శ్రీనివాస్, సుజాత దంపతుల ము గ్గురు చిన్నారులు ఉన్నత చదువులకు వెళ్లి మృతిచెందడం చాలా బాధాకరం. నా, ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి అందుబాటులో ఉంటా. కుటుంబానికి ప్రభుత్వ అండ : ఎంపీ గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్, సుజాత దంపతుల ముగ్గురు చిన్నారులు చనిపోవడం బాధాకరం. ఇంత మంది ప్రజలు రావడం చూస్తే శ్రీనివాస్‌నాయక్‌పై ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తుంది. శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. తోడుగా ఉంటాం : జెడ్పీచైర్మన్, బాలునాయక్ నా చిన్నతనం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తెలుసు. సొంత గ్రామం కోసం పాఠశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న శ్రీనివాస్‌నాయక్ ముగ్గురు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం. పాటతో కన్నీరుపెట్టిన తల్లి తనకున్న ముగ్గురు చిన్నారులు ఉన్నత చదువుల కోసం వెళ్లి అగ్ని ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి సుజాత కన్నీరుమున్నీరైంది. ఎవరు నన్ను చెయ్యి విడిచినా... అనే పాటతో చిన్నారుల జ్ఞాపకాలను తల్లి నెమరువేసుకుంది. పాట పాడినంత సేపు అక్కడున్న జనం కన్నీరును ఆపలేకపోయారు. -
మృతదేహం అంత్యక్రియల్లో హైడ్రామా
విజయనగరం, పూసపాటిరేగ: పక్క గ్రామానికి చెందిన మృతదేహానికి తమ గ్రామ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు వీల్లేదని గ్రామస్తులు అడ్డుపడడంతో వివాదం నెలకొంది. దీంతో మృతదేహం సుమారు గంట పాటు గ్రామ సరిహద్దులోనే ఉండిపోయింది. చివరకు మాజీ సర్పంచ్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే...గోవిందపురం గ్రామానికి చెందిన బంగారు రాముడు(70) శుక్రవారం మృతి చెందాడు. గోవిందపురం గ్రామస్తులు కూడా భరిణికాం శ్మశాన వాటికనే దశాబ్దాల తరబడి వినియోగిస్తున్నారు. బంగారురాముడు ఎస్సీ కులానికి చెందినవాడు కావడంతో తమ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేదని భరిణికాం మహిళలు మృతదేహాన్ని అడ్డుకున్నారు. వెనక్కి తీసుకువెళ్లాలని చెప్పడంతో సుమారు గంట పాటు మృతదేహం మార్గమధ్యలోనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న గోవిందపురం మాజీ సర్పంచ్ విక్రం జగన్నాధం భరిణికాం గ్రామస్తులతో చర్చించారు. మృతదేహాన్ని అడ్డుకోవద్దని గట్టిగా చెప్పడంతో భరిణికాం గ్రామస్తులు అడ్డు తొలగారు. దీంతో బంగారురాముడు మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. -
తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన తనయ
కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు (పామర్రు) : కన్నతండ్రికి కుమార్తె అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన మండలంలోని బొడ్డపాడులో చోటు చేసుకుంది. తండ్రి తరఫున వారసులు ఉన్నా ఎవరూ ముందుకు రాకపోవటంతో కన్న కూతురే అన్నీ తానై జరిపించి పితృ రుణం తీర్చుకుంది. గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీనివాసరావు (53) టైలరింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య శివపార్వతి, కుమార్తెలు జ్యోత్స్న, శ్రీలక్ష్మి ఉన్నారు. శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఈ నెల 25వ తేదీ రాత్రి మృతి చెందాడు. అతనికి తలకొరివి పెట్టేందుకు వారసులు ముందుకు రాలేదు. దీంతో పెద్ద కుమార్తె జ్యోత్స్న కొడుకు పాత్ర పోషించింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించి గ్రామస్తులతో శభాష్ అనిపించుకుంది. -
కన్నీటి వీడ్కోలు
అంతవరకూ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న బాధ కన్నీళ్లరూపంలో ఎగసిపడింది... దు:ఖాన్ని దిగమింగుకుని అంతవరకూ నిశ్శబ్దంగా లోలోపల కుమిలికుమిలి పోయిన వారు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. విగతజీవులుగా మారిన తమ ఆప్తులను చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఏడుగురి మృతదేహాలకు మంగళవారం జి.వెంకటాపురంలో సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి చూపు కోసం వేలాదిగా తరలివచ్చిన వారితో శ్మశానవాటిక కిక్కిరిసి పోయింది. స్థానికులే కాకుండా మండల వ్యాప్తంగా ప్రజలు చేరుకున్నారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలతో శ్మశాన వాటిక మార్మోగింది. విశాఖపట్నం, మాకవరపాలెం(నర్సీపట్నం): కాకినాడలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జి.వెంకటాపురం గ్రామానికి చెందిన సబ్బవరపు నూకరత్నం(35), సబ్బవరపు అచ్చియ్యమ్మ(50), పైల లక్ష్మి(45), సబ్బవరపు మహాలక్ష్మి(54), సబ్బవరపు పైడితల్లి(42), సబ్బవరపు వరహాలు(45), గవిరెడ్డి రాము(40)తోపాటు ఇ.కోడూరుకు చెందిన ఆళ్ల సంతోష్(34) మరణించిన సంగతి తెలిసిందే. వీరి మృత దేహాలకు పిఠాపురంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి, మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామం తీసుకొచ్చారు. మృతదేహాలు పోస్టు మార్టం పూర్తయిన అనంతరం బయలుదేరాయన్న సంగతి తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు వేలాదిగా శ్మశాన వాటికకు తరలివచ్చారు. దీంతో శ్మశాన వాటిక కిక్కిరిసిపోయింది. మృతదేహాల వాహనాలు చేరుకోవడంతో ఒక్కసారిగా వారంతా ఈ వాహనాల వద్దకు చేరకుని భోరున విలపించారు. తమ వారి మృతదేహం ఎక్కడ ఉందోనంటూ చూస్తూ వెక్కివెక్కి ఏడ్చారు. అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన టెంటుల్లోకి ఏడు దేహాలను తీసుకువచ్చి ఉంచారు. దీంతో వాటిని గుర్తించిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలకు అవధుల్లేకుండాపోయింది. ఒకే చోట దహనం.. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఒకే చోట పేర్చిన చితులపై ఉంచి మృతదేహాలను దహనం చేశారు. ఎన్నడూ ఇలాంటి ఘటనను చూడలేందటూ అందరూ గుండెలవిసేలా రోదించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఎన్నడూ చూడని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఈ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు. శోకసంద్రంలో సబ్బవరపు వీధి.. మాకవరపాలెం(నర్సీపట్నం): స్థానిక సబ్బవరపు వీధి శోకసంద్రంలో మునిగిపోయింది. కాకినాడలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తూ చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జి.వెంకటాపురం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే మృతుల్లో ఒకే ఇంటిపేరుతో ఉన్న సబ్బవరపు వరహాలు, నూకరత్నం, మహాలక్ష్మి, అచ్చియ్యమ్మ, పైడితల్లి ఉన్నారు. వీరంతా ఆ గ్రామంలో ఒకే వీధిలో ఉంటున్నారు. దగ్గర బంధువులు కూడా. నూకరత్నం, పైడితల్లి తోటికోడళ్లు. ఈ ఇంటిలో ఇద్దరు, మిగిలిన ఇళ్లల్లో ఒక్కొక్క మహిళ మరణించడం సబ్బవరపు వారి వీధి వాసులు విషాదంలో మునిగిపోయారు. మాకు దిక్కెవరమ్మా.. మాకవరపాలెం(నర్సీపట్నం): తనకు పుట్టి న కుమార్తెకే కాదు తనను కనిపెంచిన తల్లి దండ్రులు కూడా ఆమె సమానంగా సపర్యలు చేస్తూ సాకుతోంది. పుట్టుకతోనే కుమా ర్తె మానసిక వికలాంగురాలు. తల్లిదండ్రులు కూడా వయసు మీదపడి చివరి క్షణాల్లో ఉండడంతో వారిని కూడా చిన్న పిల్లల్లాగే సాకుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గవిరెడ్డి రాము మృతి చెందడంతో తమకు దిక్కెవరంటూ అటు ఆమె కుమార్తె, ఇటు తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రాముకు 18 ఏళ్ల క్రితం గంగతల్లి జన్మించింది. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు కావడంతో ఏమీ చేసుకోలేని కుమార్తెను అన్నీ తానై చూసుకుంటోంది. ఇక తల్లిదండ్రులు లాలం తాతారావు, కొండమ్మ తనే పోషిస్తోంది. భర్తకు ఒక కన్ను కనిపించక పోవడంతో కూలి పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదంలో రాము మృతి చెందిందని తెలిసిన వీరంతా ఇక మాకు దిక్కెవరంటూ రోదిస్తున్నారు. రోదనలతో దద్దరిల్లిన ఆస్పత్రి పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎనిమిది మృతదేహాలకు మంగళవారం పిఠాపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు విజయశేఖర్, పద్మశ్రీ పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులు మాకవరపాలెం మండలం జి.వెంకటాపురం, భీముకోటపాలెం, జి.కోడూరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. తమ వారిని కడసారి చూసేందుకు ప్రయత్నించి వారి కోసం కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలతో ఆస్పత్రి మార్మోగిపోయింది. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే అధికారులు మృతదేహాలను వారి బంధువులకు అప్పగించి ప్రత్యేక ప్రభుత్వ వాహనాల్లో వారి స్వగ్రామాలకు పంపించారు. గౌరెడ్డి రాము(35), సబ్బారపు పైడితల్లి (42), సబ్బారపు అచ్చిరాజు(50), పైలాలక్ష్మి (45), సబ్బారపు పాప (30) సబ్బారపు మహాలక్ష్మి(54) వ్యాన్ డ్రైవరు ఆళ్ల సంతోష్ (30) తో పాటు సబ్బారపు వరహాలు(45) మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతల ఓదార్పు : చేబ్రోలు ప్రమాద ఘటనలోని బాధిత కుటుంబీకులను వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మంగళవారం పరామర్శించారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావుతో కలిసి ఆయన పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
కూతురే కొడుకయ్యింది !
గుంటూరు, తాడేపల్లిరూరల్: కూతుళ్లే కొడుకులయ్యారు.. కన్నవారికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకున్నారు. పున్నామనరకం నుంచి కాపాడే పుత్రుడు ఫోనెత్తకపోవడంతో కనిపెంచిన తల్లిదండ్రులకు కూతుళ్లే కడసారి వీడ్కోలు పలికారు. వివరాల్లోకి వెళ్లితే.. సీతానగరంలో నివాసం ఉండే పేద కుటుంబం పారేపల్లి నారాయణ, సరోజిని దంపతులకు ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు పదేళ్ల కిందట వివాహం చేసుకొని వేరే ఊరు వెళ్లిపోయాడు. పెద్దకూతురుకు, చిన్నకూతురుకు వివాహమైంది. రెండవ కూతురు, మూడవ కూతురు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తల్లి సరోజిని మృతి చెందడంతో మూడవ కూమార్తె పార్వతి అంత్యక్రియలను నిర్వహించింది. 2011లో తండ్రి నారాయణ మరణించినప్పుడు రెండవ కూతురు దేవి తలకొరివి పెట్టగా, ప్రస్తుతం తల్లికి మూడవ కూతురు అంత్యక్రియలు చేసింది. ఉన్న ఒక్క కుమారుడు ఫోన్లో స్పందించకపోవడంతో కూతుళ్లే తలకొరివి పెట్టారని, సమాజంలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునేది కూతుళ్లేనని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. -
విద్యాప్రదాతకు అశ్రు నివాళి
ఆరిలోవ/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/గోపాల పట్నం(విశాఖ పశ్చిమ): గీతం వర్సిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తికి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, అధ్యాపకులు కన్నీటి నివాళి అర్పించారు. ఆయన నివాసం, టీడీపీ కార్యాలయం, గీతం వర్సిటీలో మూర్తి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమ గురువు కడసారి చూపుల కోసం శిష్యులు తరలివచ్చారు. కాగా.. మూర్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివా రం జరిగాయి. గీతం విద్యా సంస్థల వెనుక భాగంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయ న పెద్ద కుమారుడు రామారావు శాస్త్రోక్తంగా మూర్తి చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు అక్కడ∙మూర్తి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా సిరిపురంలోని వాల్తేరు అప్‌ల్యాండ్‌లోని ఆయన నివాసానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజలు, కుటుంబ సభ్యులు సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం మూర్తి మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తరలించి కాసేపు అక్కడ ఉంచారు. పలువురు పార్టీ నాయకులు అంజలి ఘటించారు. అక్కడ నుంచి గీతం విద్యా సంస్థల వరకు అంతిమయాత్ర కొనసాగింది. వర్సిటీ ప్రధాన ద్వారం నుంచి లోపలకు తీసుకెళ్లి వెనుక ద్వారం నుంచి అంత్యక్రియలు నిర్వహించే స్థలానికి తరలించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నివాళులర్పించారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు సీహెచ్ అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్, ఎంపీలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కె.హరిబాబు, మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, కంభంపాటి రామ్మోహనరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యేలు బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్‌బాబు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాక మూర్తి పెద్ద కుమారుడు రామారావు తండ్రి చితికి నిప్పంటించారు. చిన్న కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె భారతి, కుటుంబసభ్యులు నివాళులర్పించారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామాహేశ్వరరావు, కింజరపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరావు, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత దగ్గుపాటి సురేష్, సినీ నటుడు తొట్టెంపూడి వేణు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు అనిత, వాసుపల్లి గణేష్‌కుమార్, పీలా గోవింద్, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొండ్రు మురళీ, వైఎస్సార్సీపీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, వంశీకష్ణ శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, నాగిరెడ్డి, కొయ్య ప్రసాద్‌రెడ్డి, జేసీ సృజన, పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, వుడా వీసీ బసంత్ కుమార్, ఏయూ వీసీ నాగేశ్వరరావు, సెంచూరియన్ వీసీ జీఎస్ఎన్ రాజు, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఈపీడీసీఎల్ సీఎండీ దొర, నందమూరి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు, ఎంఎస్ రామయ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ మొగ్గా సీతారామయ్య, సీనియర్ నేత లాలంభాస్కరరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్కుమార్, పీసీసీ కార్యదర్శి సోడదాసు సుధాకర్ తదితరులు మూర్తికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మూర్తితో పాటు మరణించిన వీవీఎస్ చౌదరి మృతదేహాన్ని ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా జొన్నాడకు పంపించారు. -
అంత్యక్రియల్లో నవ్వినందుకు..
సాక్షి, ముంబై : ఇటీవల కన్నుమూసిన లెజెండరీ నటుడు రాజ్‌కపూర్ భార్య కృష్ణరాజ్ కపూర్‌కు బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచన్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్, అలియా భట్ వంటి ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా కృష్ణరాజ్ కపూర్ ప్రేయర్ మీట్లో కరణ్ జోహార్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీలు నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు వీరు ప్రార్ధనా సమావేశంలో ఎందుకు నవ్వుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నటుల తీరును తప్పుపడుతూ పెద్దసంఖ్యలో కామెంట్లు పోటెత్తాయి. వీరు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారా లేక పార్టీలోనా..? అని కామెంట్ చేశారు. మిస్టర్ ఫర్పెక్షనిస్ట్ నుంచి ఇలాంటి దిగజారుడు చర్యను ఊహించలేమని.. షేమ్ అంటూ మరొక నెటిజన్ ఆమిర్‌ఖాన్‌ను ఉద్దేశించి ట్రోల్ చేశారు. రాణీ, కరణ్ జోహార్లు సిగ్గుమాలిన పని చేశారు. రాణీ ముఖర్జీ.. ఆదిత్యా చోప్రాను పెళ్లాడటం ఘనంగా భావిస్తోందని..తాము ఆమెను ద్వేషిస్తున్నామని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
మొయినాబాద్‌తో హరికృష్ణకు ప్రత్యేక అనుబంధం
మొయినాబాద్(చేవెళ్ల) వికారాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఎన్టీఆర్ తనయుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు మొయినాబాద్ మండలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఉన్న గండిపేట కుటీరం వద్ద నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ఆయన తన తండ్రి నందమూరి తారక రామారావుతో కలిసి వచ్చేవారు. హైదరాబాద్ నగరానికి చేరువలో జంటజలాశయాల చెంత పచ్చని వాతావరణంతో ఉండే ముర్తూజగూడ రెవెన్యూ పరిధిలో హరికృష్ణ తన కొడుకు పేరున 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన సమయంలో ‘తెలుగు విజయం’ పేరుతో మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే గండిపేట చెరువు సమీపంలో నివాసం ఉండేందుకు శాంతి కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగించేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఎన్టీఆర్ కుటీరం కేంద్ర బిందువుగా మారింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులకు కుటీరంలోనే రాజకీయ శిక్షణ ఇచ్చేవారు. ఆ సమయంలో హరికృష్ణ పార్టీ నాయకులతోపాటు ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. ఏ కార్యక్రమం జరిగినా తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి ఆయన ఇక్కడికి వచ్చేవారని సీనియర్ నాయకులు తెలిపారు. హరికృష్ణ ఎక్కువగా ఎన్టీఆర్ ప్రచార రథాన్ని నడుపుతూ కుటీరానికి వచ్చేవారని అన్నారు. ఎన్టీఆర్ పాఠశాలగా.. కుటీరం ఎన్టీఆర్ మరణం తర్వాత కుటీరం పాఠశాలగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. అయితే, టీడీపీ నిర్వహించే మహానాడును సైతం ఇక్కడే నిర్వహించేవారు. 2009, 2010, 2011, 2013, 2014లో ఎన్టీఆర్ కుటీరంలో నిర్వహించిన మహానాడుల్లో హరికృష్ణ పాల్గొన్నారు. పదిహేనేళ్ల క్రితం భూమి కొనుగోలు.. హరికృష్ణ తన చిన్న కొడుకు కల్యాణ్‌రామ్ పేరు మీద గతంలో మొయినాబాద్ మండలం ముర్తూజగూడ రెవెన్యూలో 4 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో రాళ్లతో ఉన్న భూమిని చదును చేయించారు. అందులో ఎలాంటి నిర్మాణాలుగాని, పంటలు సాగుగాని చేయకుండా బీడుగానే వదిలేశారు. నాలుగేళ్ల క్రితం 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్దకొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయన అంత్యక్రియలు మరుసటి రోజు ఇక్కడే నిర్వహించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం చెక్కును కల్యాణ్‌రామ్‌కు అందజేసింది. అయితే, హరికృష్ణ అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. ఇతర కారణాలతో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. హరికృష్ణ మృతితో కుటీరంలో బుధవారం శ్రద్ధాంజలి ఘటించారు. అనుబంధం మరువలేనిది: పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి చేవెళ్ల : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధకరమని పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. చేవెళ్లలో ఆయన మాట్లాడుతూ నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, సినీ హీరోగా నేను ఎక్కువ అనే గర్వం అనేది ఆయనలో ఎప్పుడు కనిపించేది కాదు అన్నారు. అందరితో కలివిడిగా చాలా సాధారణంగా ఉండేవారన్నారు. తాను దేవునిఎర్రవల్లి సర్పంచ్‌గా, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తన గ్రామానికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ నుంచి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కోసం రూ.5లక్షల నిధులను ఇచ్చారన్నారు. టీడీపీలో పనిచేసే సమయంలో చాలా దగ్గర సంబంధం ఉండేదన్నారు. ఇలాంటి నాయకులు ఉండటం చాలా అరుదు అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఆయన మరణం ఆయన కుటుంబానికి, పార్టీకి తీరని లోటన్నారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వారు : కంజర్ల శేఖర్ నందమూరి హరికృష్ణ మృతిచెందడం బాధాకారం. ఆయన ఎన్టీఆర్ కుటీరానికి వచ్చినప్పుడల్లా స్థానికులు, నాయకులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఎన్టీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు శిక్షణ ఇచ్చేటప్పుడు హరి కృష్ణ సైతం క్రమం తప్పకుండా వచ్చేవారు. హరికృష్ణ అంత్యక్రియల కోసం స్థల పరిశీలన వీఐపీలు, సినీ ప్రముఖుల తాకిడి దృష్ట్యా మార్పిడి మొయినాబాద్ రూరల్(చేవెళ్ల) : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలను మొదటగా తన వ్యవసాయ పొలంలో నిర్వహించాలని భావించడంతో బుధవారం చేవెళ్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నాగయ్య, టీడీపీ నాయకులు పరిశీలించారు. మొయినాబాద్ మండలంలోని ముర్తూజగూడ రెవెన్యూ పరిధిలో ఉన్న 133 సర్వే నంబర్లో హరికృష్ణకు నాలుగెకరాల పొలం ఉంది. ఆయన ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడ భూమిని కొనుగోలు చేశారు. 2014లో హరికృష్ణ కుమారుడు జానకీరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు అతని అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు. తాజాగా హరికృష్ణ మృతి చెందడంతో ఆయన అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించాలని కుటుంబీకులు మొదటగా నిర్ణయం తీసుకున్నారు. వీఐపీలు, సినీ ప్రముఖులకు తాకిడి, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించాల్సిన అంత్యక్రియల స్థలాన్ని మార్చినట్లు తెలుస్తోంది. చివరకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవిషయాన్ని అధికారులు సైతం ధృవీకరించారు. -
శోకసంద్రమైన కౌడిపల్లి
కౌడిపల్లి(నర్సాపూర్) : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిలుముల కిషన్‌రెడ్డి అంత్యక్రియలతో సోమవారం ఆ యన స్వగ్రామం కౌడిపల్లి శోకసంద్రంగా మారిం ది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. కిషన్‌రెడ్డి శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య సుహాసినిరెడ్డి అస్వస్థతగా ఉండటం, కోడలు, అల్లుడు అమెరికాలు ఉన్నందున సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు ప్రజలు అంత్యక్రియలకు భారీగా తరలివచ్చారు. మృతి చెందిన మూడు రోజులకు అంత్యక్రియలు జరగగా ఎప్పుడెప్పుడు చూస్తామా అని గ్రామస్తులు ఎదురు చూశారు. నర్సాపూర్ నుంచి కౌడిపల్లి వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. కౌడిపల్లిలోని రెడ్డి శ్మశాన వాటికలో ఆయన మృతదేహాన్ని దహనం చేశారు. అతని కొడుకు శేషసాయిరెడ్డి చితికి నిప్పంటించారు. ఈ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ రాజమణిమురళీధర్‌యాదవ్, ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి మృతదేహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అంతిమయాత్ర సందర్భంగా అతని సోదరుడు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పార్థివదేహం పక్కన కూర్చొని కంటతడి పెట్టడం పలువురిని కలిచివేసింది. కిషన్‌రెడ్డి స్వగ్రామం కౌడిపల్లి కాగా ఆయన నర్సాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన పార్థివ దేహాన్ని నర్సాపూర్ తీసుకువచ్చారు. సోమవారం నర్సాపూర్ నుంచి ర్యాలీగా కౌడిపల్లికి అంతిమ యాత్ర సాగింది. దారి పొడవున పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అస్వస్థతతో అంబులెన్స్‌లో.. కిషన్‌రెడ్డికి లివర్ చెడిపోవడంతో అతనికి భార్య సుహాసినిరెడ్డి లివర్ డొనేట్ చేశారు. కాగా దీంతో అమె అస్వస్థతతో ఉండగా అంత్యక్రియలకు ఆమెను అంబులెన్స్‌లోనే తీసుకువచ్చారు. అంత్యక్రియలు జరుగుతుండగా అంబులెన్స్‌లో నుంచి ఆమె వీక్షించారు. కొడుకు, కోడలు కాళ్లుకడగటం, చితికి నిప్పు అంటించడం కార్యక్రమాలను చేశారు. అంత్యక్రియలలో ఎంపీపీలు పద్మనరసింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ సారా యాదమ్మరామాగౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులకు దుర్గారెడ్డి, శివాంజనేయులు, చం ద్రందుర్గాగౌడ్, పిశ్కె శెట్టయ్యా, పుండరీకం గౌడ్, కృష్ణగౌడ్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మాజీ స ర్పంచ్‌లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు. -
విల్లు వీరుడికి కన్నీటి వీడ్కోలు!
కన్నా..బంగారుకొండ వంశీ పైకి లేవరా.. ప్రతి నెలా నన్ను ఎవరు హాస్పటల్‌కి తీసుకెళ్తారురా? మేము ఎవరి కోసం బతకాలిరా..’ అంటూ తల్లి లక్ష్మీ ఎస్ఐ వంశీధర్ మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మాకు దిక్కెవరయ్యా..! అంటూ తండ్రి హరిప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్న ఏకైక సోదరుడిని పొగొట్టుకున్న బాధలో అన్న శైలకుమార్ విలపించిన తీరు కలిచివేసింది. పేదరికాన్ని సైతం తన తెలివితేటలు, విలువిద్యతో జయించి లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న వంశీధర్ కేఈబీ కెనాల్లో గల్లంతయి శవమై తేలడంతో ఇస్మాయిల్‌బేగ్‌పేట బోరుమన్నది. వేలాది మంది ప్రజలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు విల్లు వీరుడు వంశీధర్‌కు కన్నీటివీడ్కోలు పలికారు. కోడూరు (అవనిగడ్డ) : కోడూరుకు చెందిన ఎస్ఐ కోట వంశీధర్ ఆదివారం కేఈబీ కెనాల్లో శవమై తెలడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఇస్మాయిల్‌బేగ్‌పేట గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం మధ్యాహ్నం తన తల్లి లక్ష్మికి విజయవాడలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోడూరుకు వస్తున్న వంశీధర్ ఘంటసాల మండల పాపవినాశనం దగ్గరకు రాగానే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి పల్టీ కొట్టిన సంగతి విదితమే. ఈ ఘటనలో తల్లి లక్ష్మి ప్రాణాలతో బయటపడగా ఎస్ఐ మాత్రం కాలువ ప్రవాహంలో గల్లంతయ్యారు. అయితే వంశీధర్ కోసం 15 గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ శాఖాధికారులకు ఆదివారం ఉదయం 7 గంటల సమీపంలో అన్నవరం–మంగళాపురం కాలువలో వంశీధర్ మృతదేహాన్ని గుర్తించారు. ఎస్ఐ గల్లంతైన ప్రాంతానికి మృతదేహం లభ్యమైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ శవపంచనామ అనంతరం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన ఇస్మాయిల్‌బేగ్‌పేటకు తీసుకెళ్లారు. ‘బంగారు కొండా పైకి లేవరా’..కలచివేసిన తల్లి రోదన కళ్ల ముందే కాలువలో కొట్టుకుపోయిన కుమారుడు శవమై ఇంటికి రావడంతో తల్లి లక్ష్మి రోదనను ఎవరూ ఆపలేకపోయారు. ‘బంగారుకొండా వంశీ.. పైకి లేవరా.. ప్రతి నెలా నన్ను ఎవరు ఆస్పత్రికి తీసుకెళ్తారురా.. ఇంకా మేము ఎవరి కోసం బతకాలిరా..’ అంటూ లక్ష్మి కుమారుడు వంశీధర్ మృతదేహంపై పడి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఎస్ఐగా చేరిన తరువాత నిన్ను చూసి చాలా మంది గొప్ప కొడుకును కన్నావంటూ నన్ను మెచ్చుకున్నారు రా.. ఇప్పుడు హఠాత్తుగా మముల్ని వదిలి వెళ్లిపోతే మాకు దిక్కెవరు..’ అంటూ తండ్రి హరిప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్న ఏకైక సోదరుడిని పోగొట్టుకున్న బాధలో అన్న శైలకుమార్ మృతదేహం ముందు కూర్చొని విలపించిన తీరు కలచివేసింది. గ్రామం నుంచి ఏకైక ఎస్ఐ.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా కుమారులిద్దరికి ఉన్నత చదువులు చెప్పించారు. అయితే వంశీధర్‌కు చిన్నప్పటి నుంచి ఎస్ఐ అవ్వాలని ఆసక్తి ఉండడంతో దానిని జయించేందుకు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాడు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించాడు. అర్చరీ క్రీడతో పాటు గజఈ తగాళ్లకు పోటీగా ఈదేవాడు. ఇవన్నీ వంశీధర్‌కు ఎస్ఐ ఉద్యోగం వచ్చేందుకు దోహదపడ్డాయి. 2012లో ఎస్ఐగా విధుల్లో చేరిన వంశీధర్ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఇస్మాయిల్‌బేగ్‌పేట గ్రామం నుంచి ఎస్ఐ ఉద్యోగం సాధించిన ఏకైక వ్యక్తి వంశీధర్ మాత్రమే కావడంతో గ్రామస్తులు సైతం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఉద్యోగంలో చేరిన ఆరేళ్లకే వంశీధర్ ఇలా మరణించడం గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారిగా వం శీధర్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. కోడూరు : ఎస్ఐ కోట వంశీధర్ అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం కోడూరులో పోలీసు లాంఛనాల మధ్య నిర్వహించారు. మచిలీపట్నానికి చెందిన ప్రత్యేక పోలీస్ దళం ఇంటి వద్ద శాఖాపరమైన నివాళులర్పించింది. చివరి వరకు అక్కడే ఉన్నవైఎస్సార్సీపీ నేత రమేష్‌బాబు.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబుకు వంశీధర్ వరుసకు మేనల్లుడు కావడంతో గల్లంతైన దగ్గర నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యుల వెన్నంటే ఉన్నారు. తల్లిదండ్రులను ఓదారుస్తూ, వంశీధర్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, విజయనగరం ఏఆర్ డీఎస్పీ బి.మెహర్, అవనిగడ్డ, రామచంద్రాపురం సీఐలు జేవీవీఎస్ మూర్తి, శ్రీధర్‌కుమార్, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, పెద్దాపురం, ఐనవోలు ఎస్ఐలు మణికుమార్, రాజారెడ్డి, ప్రియకుమార్, షణ్ముఖసాయి, భగవాన్, జాన్బాషాతో పాటు వివిధ స్టేషన్ల సిబ్బంది మృతదేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కడవకొల్లు నరసింహరావు, పూతబోయిన చినవెంకటేశ్వరరావు, యూత్, టౌన్ కన్వీనర్లు యాదవరెడ్డి సత్యనారాయణ, బడే గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరా వు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం నారాయణరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల బసవయ్య, మాజీ సర్పంచి దాసరి విమల, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించినవారిలో ఉన్నారు. వంశీధర్‌కు ప్రత్యేక పోలీసు దళం నివాళి -
అశ్రునయనాల మధ్య ప్రభాకర్ అంత్యక్రియలు
కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ అంత్యక్రియలు గురువారం అశ్రునయనాల మధ్య సప్తగిరికాలనీ శివారులో ఉన్న మానేరుతీరం స్వర్గధామంలో ముగిశాయి. అంతిమయాత్ర మొదలవుతుండగానే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన సోదరుడు ప్రభాకర్ మృతదేహం వద్ద బోరున విలపించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు దంపతులు, మేయర్ రవీందర్‌సింగ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, సుడా చైర్మన్ జీవి రామక్రిష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ వాసాల రమేశ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్నాయకులు ఆది శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, టీజేఎస్ నాయకులు నరహరి జగ్గారెడ్డితో టీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, గంగుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన ఆయా పార్టీల కార్యకర్తలు, అధికారులు, గ్రానైట్ క్వారీలల్లో పనిచేసే కార్మికులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్ద కుమారుడు రోహిత్ ప్రభాకర్ చితికి నిప్పంటించారు. మంత్రి హరీష్, ఎంపీల పరామర్శ ‘గంగుల’ కుటుంబాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సిద్దిపేట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌బాబు పరామర్శించారు. -
చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిని చేసింది ఆయనే!
జోగిపేట(అందోల్) : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి (77) ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన అందోలు మండలం డాకూరు గ్రామంలో నిర్వహించారు. సీఎం కే.చంద్రశేఖర్‌రావు మాణిక్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం డాకూరుకు రోడ్డు మార్గంలో వస్తున్నట్లు ముందుగానే సమాచారం రావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖమంత్రి టీ.హరీష్‌రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు íపీ.బాబూమోహన్, చింతాప్రభాకర్, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, భూపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదొద్దిన్, భూపాల్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ నిఖిలారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ, ఎంపీలు బీబీ పాటిల్, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్లు సుభాష్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి బీ.సంజీవరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర టీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు బక్కి వెంకటయ్య, సపానదేవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి, సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వర్షంలోనే అంత్యక్రియలు మాణిక్‌రెడ్డి మృతదేహాన్ని అంత్యక్రియలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వర్షంలోనే అంత్యక్రియలు జరిపారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అలాగే ముందుకు కదిలారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అక్కడే ఉన్నారు. అంత్యక్రియలకు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది తరలి వచ్చారు. మాణిక్‌రెడ్డి మరణం తీరనిలోటు : వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు జోగిపేట(అందోల్): మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి ఆకస్మిక మరణం జిల్లాకు తీరనిలోటని రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సంజీవరావు అన్నారు. ఆదివారం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు డాకూరు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 38 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని, మంచి అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయామన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ పదవి వరకు ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాట్లు తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు పరిపూర్ణ, రాజు, నరేష్, బాగయ్యలతో పాటు పలువురు ఉన్నారు.జిల్లా రాజకీయాల్లో కీలక పాత్రజోగిపేట(అందోల్): మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంపాదించారు. ఒకస్థాయిలో జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు ఎదిగారు. మాజీ మంత్రి రాజనర్సింహ శిష్యుడిగా రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పంచాయతీ సమితి అధ్యక్ష పదవి కోసం నియోజవర్గంలో ఎంతో మంది ఆశ పడ్డ ఆయన మాణిక్‌రెడ్డికే మద్దతు ఇవ్వడంతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఆ పదవి దోహదపడిందని చెప్పవచ్చు. యూత్ కాంగ్రేస్ జిల్లా నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక పదవిలో ఉండి అధికారంలో ఉన్నారు. అప్పటి కేంద్రమంత్రి శివశంకర్‌పై పోటీ చేసి గెలుపొందడంతో ఢిల్లీలో మంచి గుర్తింపు పొందారు. రాజీవ్ గాంధీపై భూఫోర్స్ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో ఏడాది కాలం మిగిలి ఉండగానే ఎన్టీరామారావు ఆదేశానుసారం తన రాజీనామా లేఖను అందరి కంటే ముందుగానే లోకసభ స్పీకర్‌కు అందజేసి దేశ స్థాయిలో గుర్తింపు పొందారు. కేసీఆర్‌తో అనుబంధం ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో మాణిక్‌రెడ్డికి చాలా దగ్గరి అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలకుపైగా కలిసి పని చేశారు. ఉమ్మడి జిల్లాకు కూడా టీడీపీ అధ్యక్షుడిగా మాణిక్‌రెడ్డి పని చేశారు. 1998లో జరిగిన అందోలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బాబూమోహన్ గెలుపు బాధ్యతను చేపట్టిన కేసీఆర్ అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో 26 రోజుల పాటు మాణిక్‌రెడ్డి స్వగ్రామమైన డాకూర్లోనే మకాం ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిని చేసింది మాణిక్రెడ్డియే.. రాష్ట్రంలో 1994వ సంవత్సరంలో తిరిగి టీడీపీ అధికారాన్ని చేపట్టిన తర్వాత కొంత కాలానికే పార్టీలో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాణిక్‌రెడ్డి రాష్ట్ర కమిటీలో కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఆయన రెవెన్యూ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు. అప్పటికప్పుడు మాణిక్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు నాయుడిను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు. రాష్ట్ర ఏర్పాటు సంబరాలు అందోలులోనే.. తెలంగాణ రాష్ట్రం కోసం సుధీర్ఘంగా పోరాటం చేసిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబరాలను మొదటగా అందోలు నియోజకవర్గంలోనే చేపట్టారు. ఈ సభకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ హజరయ్యారు. ఈ సభ విజయవంతం చేసే బాధ్యతను మాజీ ఎంపీ మాణిక్రెడ్డియే తీసుకున్నారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఈ సభ విజయవంతం కావడంతో కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేసి మాణిక్‌రెడ్డిని అభినందించారు. ఈ సభలోనే ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. -
సంస్కారం.. దహనం
అమ్మ..కనిపెంచి లాలించి, పాలిస్తే..నాన్న నడక, నడత నేర్పుతాడు. కొడుకు బుడిబుడి నడకలు వేసేటప్పుడు తప్పటడుగులు వేస్తాడేమోనని.. నీడలా తోడుగా వెన్నంటే ఉంటాడు. ఎదుగుదలకు ఊతమవుతాడు.. సంపాదనంతా కొడుకులకే అనుకుంటాడు. కోరింది తెచ్చి తినిపిస్తాడు. పస్తులుండి పైసా పైసా కూడబెట్టిందల్లాకొడుక్కే ఇస్తాడు. కొడుకులు చల్లగ ఉంటే అదే చాలనుకుంటాడు. కొడుకు కోసం ఇన్ని చేసిన నాన్న.. వెంట ఏమీ తీసుకుపోడు. హైటెక్ కాలంలో ‘తండ్రి’ని తండ్రిలా కాకుండా కొడుకులా చూసుకునే కొడుకులు ఎందరున్నారు.. అవసాన దశలోనూ కాళ్లు కదలకపోయినా చేతులు ఆడకపోయినా.. అవసరాలు తీర్చమని నోరు తెరిచి అడగడు. ఇన్ని చేసిన నాన్నకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. నాన్నపై ప్రేమంతా హైటెక్ మాయ. ఆస్తిపాస్తుల కోసం వ్యామోహం తప్ప..నాన్నపై మోహం ఎక్కడిది? కాలం చెల్లినంక గుమ్మం ముంగిట శవం ఉంచి ఆస్తి కోసం ఆలోచించే కొడుకులూ ఉన్నారని ఈసడించుకుంటున్నా..దహన సంస్కారాలు చేయడానికి బేరసారాలు ఆడుతూ ‘సంస్కారం’లేని వాడనిపించుకుంటున్న కొడుకులే అధికం. బతికినంత కాలం నాన్న దగ్గర ఆస్తి ఉందని.. ఊపిరిపోయిన వెంటనే నాన్నకంటే ఆస్తే మిన్న అని శవాన్ని ముంగిట ఉంచి, దహన సంస్కారాలు చేయకుండా కొడుకు పారిపోయిన ఘటన ధర్మవరంలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది. అనంతపురం, ధర్మవరం అర్బన్ : ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో నివసిస్తున్న యర్రజిన్నె అంకిరెడ్డి(86)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట్రామిరెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. రెండో కుమారుడు గోవిందరెడ్డి. శాంతినగర్‌లో అంకిరెడ్డికి రెండు ఇళ్లు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం అనారోగ్యంతో అంకిరెడ్డి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు వెంకట్రామిరెడ్డి భార్య ప్రమీల, మనవళ్లు అజయ్‌కుమార్‌రెడ్డి, ఆనంద్కుమార్రెడ్డిలు కడసారి చూపు చూసేందుకు వచ్చారు. దీంతో కులస్తులు ఉన్న రెండు ఇళ్లను అన్నదమ్ములు ఇద్దరూ ఒక్కో ఇంటిని పంచుకోవాలని సలహా ఇచ్చారు. పెద్ద కుమారుడు వెంకట్రామిరెడ్డి మూడేళ్ల క్రితమే మృతిచెందడంతో మనవళ్లకు ఒక ఇల్లు ఇవ్వాలని పెద్దలు సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన రెండో కుమారుడు గోవిందరెడ్డి ‘నాకు రెండేళ్ల క్రితమే రెండు ఇళ్లనూ మా నాన్న రాయించాడు. ఇప్పుడు ఇంటిని ఇవ్వాలని చెబితే నేను నివ్వను’ అంటూ సమాధానం చెప్పాడు. కులస్తులు అందరూ రెండు ఇళ్లలో ఒక ఇంటిని పెద్ద కుమారుడి పిల్లలకు ఇవ్వాలని చెప్పడంతో శుక్రవారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు ఫోన్ చేసి దహనసంస్కారాలు చేసేందుకు రావాలని కోరగా.. ‘నేను అక్కడికి వస్తే నాతో ఆస్తిని రాయించుకుంటారు. నేను రాను. శవాన్ని పూడ్చుకుంటారో.. పారేసుకుంటారో.. లేక మున్సిపాలిటీ వారికి అప్పగిస్తారో మీ ఇష్టం. ఏమైనా చేసుకోండి’ అంటూ సమాధానం చెప్పి పెట్టేశాడు. మనవళ్లు అజయ్‌కుమార్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి వరకు చూసి తాత శవానికి దహన సంస్కారాలు చేశారు. -
కరుణ అంత్యక్రియలు ఎక్కడ?
సాక్షి, చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే అంశంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరపాలని డీఎంకే పట్టుబడుతోంది. ఇందుకోసం ఏకంగా స్టాలినే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే.. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరీనా బీచ్‌లో స్మారకానికి న్యాయపరమైన చిక్కులున్నాయని అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ వివాదంపై విచారణ ప్రారంభించింది. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినా ఎటూ తేలలేదు. దీంతో విచారణ బుధవారం ఉదయం 8 గంటలకు వాయిదా పడింది. మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు డిమాండ్ చేశారు. ప్రజాజీవితాన్ని మరిచారా?: స్టాలిన్ కరుణానిధి ప్రజా జీవితం, ఆయన రాజకీయాలకు చేసిన సేవలను గుర్తుంచుకుని మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతివ్వాలని స్టాలిన్ లేఖ రాశారు. సీఎం పళనిస్వామికి రాసిన ఈ లేఖలో.. కరుణానిధి రాజకీయ గురువైన అన్నాదురై స్మారకం పక్కన మౌజోలియం కాంప్లెక్స్ లోపల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలన్నారు. కరుణ మృతికి కొద్ది గంటల ముందు సీఎంను స్టాలిన్ కలిశారు. అటు, ప్రభుత్వం పేర్కొంటున్నట్లుగా మెరీనా బీచ్‌లో కరుణ స్మారకానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందుల్లేవని న్యాయమూర్తికి డీఎంకే తరఫు లాయర్ వెల్లడించారు. సీఆర్‌జెడ్ (కోస్ట్ రెగ్యులేషన్ జోన్) పరిధిలోకి వస్తుందని తమిళనాడు ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదని న్యాయమూర్తికి ఆయన తెలిపారు. అన్నా సమాధి ఉన్న స్థలం కోస్టల్ జోన్ పరిధిలో లేదని, అది కూవం నదీ తీరంలో ఉన్నట్టు వివరించారు. అన్నా సమాధి వద్ద కరుణానిధి సమాధి ఏర్పాటుకు అవకాశం ఉందని, అయితే, తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా తీరంలోని అన్నా సమాధి పక్కనే కేటాయించాలని కోరారు. అయితే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలుచేసిన పిటిషన్‌తో చిక్కులున్న కారణంగా న్యాయమూర్తి ముందు వాదనలు జోరుగా సాగాయి. (మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు తమిళసర్కారు నో చెప్పడంతో బీభత్సం సృష్టిస్తున్న కార్యకర్తలు) చిక్కులు తొలగిపోలేదు: ప్రభుత్వం మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం కుదరదని.. మాజీ ముఖ్యమంత్రులైన చక్రవర్తి రాజగోపాలచారి, కే కామరాజ్‌ల స్మారకాలున్న గిండీ ప్రాంతంలోని గాంధీ మండపంలో రెండెకరాల స్థలం కేటాయిస్తామని ప్రభుతవం వెల్లడించింది. కరుణానిధి సిట్టింగ్ సీఎం కానందునే మెరీనాబీచ్‌లో అంత్యక్రియలకు అనుమతిచ్చేందుకు పళనిస్వామి నిరాకరించారని తెలిసింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు సీఎంలుగా ఉంటూ కన్నుమూసినందుకే వారికి సముద్రం ఒడ్డున స్మారకం నిర్మించారు. ఎంజీఆర్, జయలలితలు కరుణానిధికి రాజకీయంగా బద్ధ శత్రువులు. ప్రభుత్వ నిర్ణయం తెలియడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వద్ద ఉన్న కార్యకర్తలు ఆగ్రహంతో బారికేడ్లు తెంచుకుని రోడ్లపైకి పరిగెత్తారు. పరిస్థితి చేయిదాటుతుందని ఊహించిన పోలీసులు డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టారు. మెరీనాలోనే కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కార్యకర్తలు చెన్నై నగరంలో పలుచోట్ల వాహనాలను తగులబెట్టారు. మమతా బెనర్జీ నివాళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాత్రి గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి చేరుకుని కరుణ భౌతికకాయానికి అంజలి ఘటించారు. సినీనటుడు రజనీకాంత్ కూడా కరుణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కరుణ మృతికి సంతాపం తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బుధవారం చెన్నైకి రానున్నారు. ప్రముఖుల సంతాపాలు ‘కరుణానిధి మరణం చాలా బాధించింది. ప్రజానేతగా, తమిళనాడు అభివృద్ధిలో భాగస్వామిగా కీలకపాత్ర పోషించారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డీఎంకే కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయాభివృద్ధికి కరుణ తన జీవితాన్ని అంకితం చేశారు’ –రాష్ట్రపతి కోవింద్ ‘దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ప్రముఖ నాయకుడు కరుణానిధి. ఆయన మరణం తీవ్ర విచారకరం. మొత్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి 56 ఏళ్లపాటు ఆయన తమిళనాడు శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు. ఐదుపర్యాయాలు ముఖ్యమంత్రిగా తమిళనాడుకు సేవలందించారు’. –ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘కలైజ్ఞర్ కరుణానిధి ఇక లేరనే వార్త బాధాకరం. దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నేతల్లో ఆయనొకరు. ఓ బలమైన మాస్‌లీడర్, గొప్ప ఆలోచనాపరుడు, మంచి రచయిత, పేదలు, అణగారిన వర్గాలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతను కోల్పోయాం’ –ప్రధాని మోదీ ‘తమిళ ప్రజలకు కరుణానిధి అంటే ఎంతో ప్రేమ. ఆరు దశాబ్దాలపాటు ఆయన తమిళ, దేశ రాజకీయాలకు విశేష సేవలందించారు. ఆయన మరణంతో దేశం ఓ గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఆయన మరణానికి చింతిస్తున్న కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ –కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘కరుణానిధి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. డీఎంకే నేతలు, కార్యకర్తలు, కలైజ్ఞర్ అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. పాఠశాలలో చదివే రోజుల నుంచే ఆయన కళా రంగంలోనూ రాణిస్తూ, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు’ – తమిళనాడు సీఎం పళనిస్వామి ‘కలైజ్ఞర్ మృతి మరచిపోలేనిది. నా జీవితంలో ఇదో చీకటి రోజు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’.–ప్రముఖ నటుడు రజనీకాంత్ గొప్ప మానవతావాది: గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: కరుణానిధి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు గొప్ప పరిపాలనా దక్షుడిని కోల్పోయిందని అన్నారు. కరుణానిధి గొప్ప మానవతావాది అని నరసింహన్ పేర్కొన్నారు. భారత రాజకీయ రంగానికి తీరని లోటు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కరుణానిధి మృతి పట్ల తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా, క్రియాశీల నాయకుడిగా సేవలందించారన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన కొద్ది మందిలో ఒకరిగా కరుణానిధి దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. కరుణానిధి మరణం భారతదేశ రాజకీయ రంగానికి తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయాం: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌కు కరుణానిధి మరణం వార్త తెలియగానే సంతాపం ప్రకటించారు. ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధిది ఒక విశిష్ట స్థానమని, సినిమా రచయితగానే కాకుండా ద్రవిడ రాజకీయాలను శాసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణ అని జగన్ కొనియాడారు. -
అనారోగ్యంతో నాయీబ్రాహ్మణుడు మృతి
బెళుగుప్ప: నిరుపేద నాయీబ్రాహ్మణుడు అనారోగ్యంతో మృతి చెందాడు. నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులే ముందుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాలిలా ఉన్నాయి. బెళుగుప్పకు చెందిన మంగళి కృష్ణమూర్తి (52) బ్యాండ్‌సెట్ వాయిస్తూ వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈయనకు మూగ/మానసిక రోగి అయిన భార్య, ఏడు, ఐదు, మూడు తరగతులు చదువుతున్న కుమార్తెలు ప్రీతి, కీర్తి, దీప్తి ఉన్నారు. ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జ్వరం తీవ్రంగా ఉండింది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. సోమవారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో కుమార్తెలు సమీపంలోని బంధువులకు తెలిపారు. వారు వచ్చి వైద్యులతో చూపించగా.. అప్పటికే కృష్ణమూర్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య స్థిమితంగా లేకపోవడంతో అన్నీ తానై కుమార్తెలను చూసుకునే కృష్ణమూర్తి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న నాయీబ్రాహ్మణులు సెలూన్‌షాపులు బంద్ చేసి.. సంక్షేమ సంఘం సభ్యుల సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. దాతలు ముందుకొచ్చి కృష్ణమూర్తి కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి కూడా సాధారణ బీమా సొమ్ముతో పాటు పిల్లల చదువులకు సహకారం అందించాలని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు ధనుంజయ, సభ్యులు ఋషేంద్ర, రామాంజినేయులు, శంకరయ్య, శివానంద కోరారు. -
‘పెండెం’కు కన్నీటి వీడ్కోలు
రామన్నపేట(నకిరేకల్) : బాల కథారచయిత, కా ర్టూనిస్టు పెండెం జగదీశ్వర్ అంత్యక్రియలు బుధవారం అతని స్వగ్రామం రామన్నపేట మండలకేంద్రంలో జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పెద్దసంఖ్యలో తరలివచ్చి జగదీశ్వర్‌కు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. మునిపంపుల, కొమ్మాయిగూడెం, చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించా రు. అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న జగదీశ్వర్ శిష్యులు గురువుగారితో తమకున్న సాన్నిహిత్యాన్ని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సాహితీవేత్తలు జగదీశ్వర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోరున విలపించా రు. చెరుగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, స్ఫూర్తిదాయకంగా ఉండే జగదీశ్వర్ ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. జగదీశ్వర్ కుమారుడు వికాష్తేజ తం డ్రికి తలకొరివిపెట్టాడు. రోదిస్తున్న కొడుకును ఆపడం ఎవరితరం కాలేదు. రాజకీయ, సాహితీవేత్తల నివాళులు జగదీశ్వర్ భౌతికకాయాన్ని పలువురు రాజకీయ నాయకులు సాహితీవేత్తలు, ఉపాధ్యాయ సంఘా ల నాయకులు సందర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. కు టుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్వాయి రజనీకుమారి, కాంగ్రెస్ నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, ఎన్. వెంకటరమణారెడ్డి, స్వాతం త్య్ర సమరయోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేమవరం మనోహర్‌పంతులు, మధురకవి డాక్టర్ కూరెల్ల విఠలాచార్య, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య, నేషనల్ బుక్ హౌస్ సహసంపాదకుడు పత్తిపాక మోహన్, సాహితీ మి త్రమండలి అధ్యక్షుడు తండు క్రిష్ణకౌండిన్య, కార్యదర్శి బాసరాజు యాదగిరి, నకిరేకంటి మొగుల య్య, వెంకటేశ్వరాచారి, జెల్ల వెంకటేశం, వనం చం ద్రశేఖర్, రాజశేఖర్, రాములమ్మ, రాపోలు శివరంజని, నర్సింహ, ఏబూషి నర్సింహ, ఆనం ద్, నర్సింహ, రమేష్, సిలువేరు అనిల్‌కుమార్, కోట విజయవెంకన్న తదితరులు ఉన్నారు. -
మైలారంలో దేవుని ఆవుకు స్వర్గయాత్ర
నస్రుల్లాబాద్ నిజామాబాద్ : హిందువులు పవిత్రంగా కొలిచి గోమాతగా పిలుచుకునే పశువు ఆవు. మండలంలోని మైలారంలో ఎనిమిదేళ్లుగా ఇంటింటికి తిరిగిన ఆవు సోమవారం అకస్మాత్తుగా మృతి చెందింది. గ్రామంలోని శ్రీరాజరాజేశ్వరుని ప్ర తి రూపంగా గ్రామస్తులు కొలిచేవారు. అలాం టి మరణంతో కనుమరుగవుతుందని మైలారం వాసులు శోక సంద్రంలో మునిగారు. ఆ గోవు కు సోమవారం ఆరోగ్యం క్షీణించింది. దీంతో గ్రామపెద్దలు వెటర్నరీ డాక్టర్‌ను పిలిచి చికిత్స చేయించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు చెప్పడంతో అదేరోజు సాయంత్రం గోమాత తనువు చాలించింది. తమ మధ్య ఇన్నేళ్లు ఉన్న గోవు ఇక కానరాదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. రెండు దూడలు తల్లి ఆవు మళ్లి తిరిగి రాదని తెలియక బిక్కుబిక్కుమంటున్నాయని గ్రామస్తులు ఏడ్చారు. గ్రామస్తులు గోమాతను సకల లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించి మంగళవారం స్వర్గయాత్ర నిర్వహించారు. బాజాభజంత్రీలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటల మధ్య ఊరేగించారు. గ్రామంలోని ఇంటింటి ముందు ఆపి గోమాతకు అశ్రు నివాళులు అర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తీసుకెళ్లి శ్రీ రాజరాజేశ్వరుని గుట్ట కిందిభాగంలో పూడ్చి పెట్టారు. గ్రామ సర్పంచ్ సాయిరాం యాదవ్, ఎంపీటీసీ మహేందర్, ప్రభాకర్‌రెడ్డి, చంద్రా గౌడ్, బొట్టె రాములు యాదవ్, సుభాష్ గౌడ్, వడ్ల వెంకటి యువకులు ప్రశాంత్‌గౌడ్, లక్కియాదవ్, ఆనంద్, మహేందర్ గౌడ్, సాయాగౌడ్, వడ్ల సతీష్, గ్రామస్తులుభారీగాపాల్గొన్నారు. -
కూతురే కొడుకై..
మనుబోలు: కొడుకులు లేని ఆ తండ్రికి మరణానంతరం కూతురే అన్నీ తానై అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన సోమవారం మండల కేంద్రం మనుబోలులో చోటుచేసుకుంది. మనుబోలు చంద్రమౌళినగర్‌కు చెందిన సాలాపక్షి శంకరయ్య–రమణమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు లేడన్న ఆలోచన లేకుండా చిన్నతనం నుంచి ముగ్గురు కుమార్తెలను శంకరయ్య అల్లారుమద్దుగా పెంచుకున్నాడు. వీరిలో పెద్ద కుమార్తె మునెమ్మకు తండ్రితో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. చిన్నతనం నుంచి ఇంటికి అన్నీ తానై కొడుకు లేనిలోటు తెలియకుండా తండ్రికి చేదోడువాదోడుగా ఉండేది. ఈమె ప్రస్తుతం మనుబోలు బీసీకాలనీలో అంగన్వాడీ ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. కాగా ఆదివారం శంకరయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఆచారం ప్రకారం కొడుకులు లేని వారికి అల్లుళ్లు కర్మకాండలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఇందుకు భిన్నంగా మునెమ్మ తండ్రికి అంతిమ సంస్కారాలు, కర్మ క్రతువులు నిర్వహించి అందరిని అబ్బురపరచింది. తన తం డ్రికి తనంటే ఎంతో ఇష్టమని బతికి ఉన్నప్పుడే తన చేతులతోనే కర్మకాండలు చేస్తానని చెప్పానని ఇచ్చిన మాట ప్రకారం అంతమ సంస్కారాలు నిర్వహించానని మునెమ్మ తెలిపింది. -
ముగిసిన ఎమ్మెల్యే సతీమణి అంత్యక్రియలు
వికారాబాద్ అర్బన్ : వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు సతీమణి తార (రెండోభార్య) అంత్యక్రియలు గంగారం సమీపంలోని శ్మశాన వాటికలో మంగళవారం పూర్తిచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే నివాసం నుంచి నేరుగా మెథడిస్టు చర్చికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడ క్రిష్టియన్ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లఎమ్మెల్యే కాలె యాదయ్య, విద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్‌గౌడ్, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
దొరకని ఆచూకీ
పటాన్చెరు టౌన్ : ఇద్దరు గుర్తుతెలియని వృద్ధులు.. ఇద్దరూ 60 ఏళ్లు పైబడినవారే.. విగత జీవులుగా కనిపించారు. వారి కోసం బంధువుల ఆచూకీ కోసం ఎదురు చూసిన పోలీసులు చివరికి అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. రాంచంద్రాపురం మండలం వెలమెల్ల గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇద్దరు వృద్ధులు మృతదేహాలు ఈ నెల 5న వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ వృద్ధులు ఇద్దరు మృతిచెందిన చోటు కొల్లూరు సర్వీసు రోడ్డుకు కిలో మీటర్ దూరంలో, పటాన్చెరు మండలంలోని ముత్తంగి టోల్గేట్ నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్రమంలో వృద్ధురాలి బోదకాలు ఉండటం, మరో వృద్ధుడు.. ఇద్దరు కలిసి కిలో మీటర్ల దూరం నడిచే అవకాశం లేదు. దీంతో ఇద్దరు వృద్ధులు రింగ్‌రోడ్డు పైకి ఎలా వచ్చారు. వీరు హత్యకు గురయ్యారా, లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయం తెలియరాలేదు. సంఘటన స్థలానికి క్లూస్ టీం వచ్చినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఆచూకీకోసం యత్నించిన బీడీఎల్ పోలీసులు వృద్ధురాలి మెడలో పుస్తెలను, నడుముకు మొలతాడు చూసి వీరు కర్ణాటక, మహారాష్ట్ర చెందిన వారై ఉండవచ్చని ఆ రాష్ట్రాల్లో సమాచారం కోసం ప్రయత్నించినా ఆచూకీ లభించలేదని బీడీఎల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మహేశ్వర్ నాయుడు తెలిపారు. ఇద్దరు గుర్తుతెలియని వృద్ధుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే వృద్ధులు ఎలా మృతిచెందారో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఐదు రోజులు వేచిచూసి.. ఈ నెల 5న కేసు నమోదు చేసిన బీడీఎల్ పోలీసులు వృద్ధుల మృతదేహాలకు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. వీరికి సంబంధించిన వారు ఎవరైనా వస్తారని 5 రోజుల పాటు చూసి 5వ రోజు ఇద్దరు గుర్తు తెలియని వృద్ధులకు బీడీఎల్ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంచంద్రాపురం మండలంలోని వెలమెల్ల గ్రామ శివారులో పంచాయతీ సిబ్బందితో కలిసి ఎస్ఐ మహేశ్వర్ నాయుడు వృద్ధుల మృతదేహాలను పూడ్చి పెట్టి అంత్యక్రియలు చేశారు. -
అలేఖ్యకు కన్నీటి వీడ్కోలు
రాయికల్(జగిత్యాల): రాయికల్‌లో మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందిన అయిత అలేఖ్య(27)కు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబసభ్యులు, వందలాది మంది గ్రామస్తులు తరలివచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన మృతురాలి కుటుంబసభ్యుల ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. రాత్రి ఒంటి గంట సమయంలో డీఎస్పీ భద్రయ్య హామీతో నాటకీయ పరిణామాల మధ్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వివరాలు బంధువులు, స్థానికుల కథనం ప్రకారం. రాయికల్ మండలం కట్కాపూర్‌కు చెందిన అలేఖ్య వివాహం ఐదేళ్ల క్రితం మండల కేంద్రానికి చెందిన అయిత నరేందర్‌తో జరిగింది. వివాహ సమయంలో సుమారు రూ.10 లక్షల కట్నకానుకలు అప్పజెప్పారు. కాగా అదనపు కట్నం కోసం మామ, అత్త, మరిది తరచూ వేదించేవారు. ఈక్రమంలోనే కుటుంబసభ్యులే మంగళవారం అలేఖ్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి బంధువులు, స్థానికులు ధర్నాకు దిగారు. హంతకులను శిక్షించాలని, ఆస్తిపాస్తులను అనాథాశ్రమానికి రాయాలని కోరుతూ వందలాది మంది మంగళవారం రాత్రి ఒంటి గంట వరకు ఆందోళనకు దిగారు. జగిత్యాల డీఎస్పీ భద్రయ్య అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. డీఎస్పీ హామీతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లారు. బుధవారం అలేఖ్య అంత్యక్రియలు నేపథ్యంలో కట్కాపూర్, తాట్లవాయికి చెందిన సుమారు వెయ్యి మంది తండావాసులు తరలివస్తున్నారనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు. జిల్లాలోని 8 మంది ఎస్సైలు మండలంలోని రామాజీపేట, తాట్లవాయి, ఆలూరు, రాయికల్‌లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జగిత్యాల నుంచి అలేఖ్య మృతదేహాన్ని పోలీసుల బందోబస్తు మధ్య నేరుగా శ్మశానవాటికకు తీసుకొచ్చారు. మృతురాలి తండ్రి భూమన్న చితికి నిప్పంటించగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆశ్రునివాళి మధ్య అలేఖ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఐదుగురిపై కేసు అలేఖ్య భర్త అయిత నరేందర్, అత్త అయిత రమ, మామ అయిత రాజన్న, మరిది అయిత నాగరాజు, చిన్నమామ అయిత శివకుమార్‌పై హత్య, అదనపు కట్నం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు. వీరు పోలీసుల అదుపులో ఉన్నారు. -
జాతివైరం మరిచి.. ప్రేమను చాటి...
కేసముద్రం(మహబూబాబాద్): ఓ కొండెంగ.. మరో కొండెంగ పిల్లపై దాడి చేసి చంపగా.. గతంలో దానితో జాతి వైరం మరిచి స్నేహం చేసిన శునకం గ్రామస్తులు నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని గ్రామ శివారులో ఖననం చేసే సమయంలో కొండెంగ కలేబరాన్ని ఆత్మీయంగా తాకుతూ.. తాన స్నేహాన్ని చాటిన సంఘటన కేసముద్రం మండలం కల్వల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం. కల్వల గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్ అనే రైతు పంటపొలాల్లో, గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో రెండు కొండెంగలను తీసుకువచ్చి సాకుతున్నాడు. కొండెంగలకు ఆరునెలల క్రితం పిల్ల జన్మించింది. ఈ మేరకు తల్లికొండెంగను చెట్టుకు కట్టేయగా, పిల్ల కొండెంగ అటుఇటూ తిరుగుతుండగా, ఇదే గ్రామంలో గుట్టయ్య అనే రైతు పెంచుకుంటున్న కుక్క జాతివైరాన్ని మరచి ఆ కొండెంగ పిల్లతో స్నేహం చేస్తూ వచ్చింది. కొండెంగ పిల్ల ఎక్కడుంటే ఆ శునకం అక్కడే ఉంటూ, దాన్ని నిమురుతూ స్నేహంగా మెదలాడాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యపోయేవారు. ఊళ్లో కొండెంగలు ఉండటం వలన గ్రామానికి కోతులు రాకపోవడంతో, గ్రామస్తులు నిత్యం ఆ కొండెంగలకు పండ్లు, కూరగాయలు పెడుతూ వచ్చారు. ఈక్రమంలో అటవీ ప్రాంతం నుంచి ఊళ్లోకి చేరుకున్న మరో కొండెంగ గత కొద్దిరోజులుగా , పెంచుకునే కొండెంగలపై దాడిచేసే ప్రయత్నం చేస్తుండగా, గమనించిన గ్రామస్తులు ఆ కొండెంగను బెదిరించి పంపించేవారు. ఈ క్రమంలో సోమవారం తల్లి కొండెంగను గొలుసుతో చెట్టుకు కట్టేయగా, పిల్ల కొండెంగ చెట్టు ఎక్కడాన్ని గమనించిన అడవి కొండెంగ మెడకొరికి దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు ఆ కొండెంగకు మేళతాళాల నడుమ, పాడెను కట్టి, ఊరి చివర వరకు తీసుకెళ్లి, ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా ఇన్ని రోజులుగా జాతివైరాన్ని మరిచి స్నేహం చేసిన శునకం మృత్యువాతపడిన కొండెంగ వద్దకు వచ్చి నిమురుతూ, ఆ తర్వాత పాడెకట్టి తీసుకెళ్తుంటే దానివెంటే వెళ్లి, చివరకు ఖననం చేసే ప్రాంతానికి చేరుకుని దానిచుట్టూ తిరిగింది. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా మరో జంతువుపై ఇంత ప్రేమ ఉంటుందా.. అని గ్రామస్తులు ఆశ్చార్యానికి లోనయ్యారు. పైగా ఒకే జాతి కొండెంగ చంపగా, మరో జాతికి చెందిన శునకం మాత్రం స్నేహభావాన్ని చాటింది. -
అంత్యక్రియల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్
దుబ్బాక: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మేనమామ దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొత్త గాలిరెడ్డి(71) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించాడు. బుధవారం ఉదయం జరిగిన గాలిరెడ్డి అంత్యక్రియల్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి పాల్గొన్నారు. గాలిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తలచారు. గాలిరెడ్డి గంభీర్పూర్ గ్రామ పంచాయతీకి 15 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. -
పెళ్లి రోజే చావు డప్పు
తాడేపల్లిరూరల్: పెళ్లి రోజు సందర్భంగా కొత్త దుస్తులు తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబాన్ని ఇసుక లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. ఆ ప్రమాదంలో మరణించిన శ్రీకాంత్, అతని భార్య సరిత, కూతురు అక్షర అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులు భారీగా తరలివచ్చారు. 2015లో ఇదే తేదీన శ్రీకాంత్, సరితల వివాహమైంది. అంత్యక్రియల సందర్భంగా తాడేపల్లి పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు.