Shane Warne Farewell in Private Melbourne Service - Sakshi
Sakshi News home page

Shane Warne Private Funeral: కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య  స్పిన్‌ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు.. 

Published Sun, Mar 20 2022 5:02 PM | Last Updated on Sun, Mar 20 2022 7:04 PM

Shane Warne Farewell In Private Melbourne Service - Sakshi

స్పిన్ మాంత్రికుడు, క్రికెట్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ (మార్చి 20) వార్న్‌ భౌతిక దేహానికి కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తుల నడుమ ప్రైవేట్ ఫ్యునరల్ నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం 80 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో వార్న్ తల్లిదండ్రులు కీత్, బ్రిగెట్‌, అతడి ముగ్గురు పిల్లలు, వార్న్‌కు ఆన్‌ ఫీల్డ్‌లో అత్యంత ఆప్తులైన గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, మార్క్‌ వా, ఆండ్రూ సైమండ్స్‌, మైకేల్‌ క్లార్క్‌, మార్క్‌ టేలర్‌, ఆసీస్‌ మాజీ పేసర్‌ మెర్వ్‌ హ్యూస్‌, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ అలన్‌ బోర్డర్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్ వాన్‌ తదితరులు ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధ్వర్యంలో వార్న్‌ అంత్యక్రియలు ఈనెల 30న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమం సుమారు లక్షల మంది అభిమానుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనుంది. ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు, వార్న్‌తో అనుబంధమున్న ఆటగాళ్లు ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశముంది. వార్న్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇదివరకే ఐపీఎల్ యాజమాన్యం నుంచి అనుమతి పొందాడు. కాగా, వార్న్‌ తన పదిహేనేళ్ల కెరీర్‌లో వెయ్యికి పైగా వికెట్లు పడగొట్టాడు. ఇందులో 708 టెస్ట్‌ వికెట్లు, 293 వన్డే వికెట్లు ఉన్నాయి.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: షేన్‌ వార్న్‌ అంత్యక్రియలకు తేదీ ఖరారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement