Australian Bowler
-
కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ స్పిన్ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు
స్పిన్ మాంత్రికుడు, క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ (మార్చి 20) వార్న్ భౌతిక దేహానికి కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తుల నడుమ ప్రైవేట్ ఫ్యునరల్ నిర్వహించారు. మెల్బోర్న్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం 80 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో వార్న్ తల్లిదండ్రులు కీత్, బ్రిగెట్, అతడి ముగ్గురు పిల్లలు, వార్న్‌కు ఆన్ ఫీల్డ్‌లో అత్యంత ఆప్తులైన గ్లెన్ మెక్‌గ్రాత్, మార్క్ వా, ఆండ్రూ సైమండ్స్, మైకేల్ క్లార్క్, మార్క్ టేలర్, ఆసీస్ మాజీ పేసర్ మెర్వ్ హ్యూస్, ఆసీస్ మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తదితరులు ఉన్నారు. Shane Warne's family and friends bid the cricketing legend farewell at a private memorial service at the St Kilda Football Club in Melbourne — ESPNcricinfo (@ESPNcricinfo) March 20, 2022 ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధ్వర్యంలో వార్న్ అంత్యక్రియలు ఈనెల 30న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమం సుమారు లక్షల మంది అభిమానుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనుంది. ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు, వార్న్‌తో అనుబంధమున్న ఆటగాళ్లు ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశముంది. వార్న్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇదివరకే ఐపీఎల్ యాజమాన్యం నుంచి అనుమతి పొందాడు. కాగా, వార్న్ తన పదిహేనేళ్ల కెరీర్లో వెయ్యికి పైగా వికెట్లు పడగొట్టాడు. ఇందులో 708 టెస్ట్ వికెట్లు, 293 వన్డే వికెట్లు ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు -
వార్న్ చనిపోవడానికి నాలుగు గంటల ముందు రూంలో ఏం జరిగింది.. ఆ నలుగురు ఎవరు..?
స్పిన్ మాంత్రికుడు, లెజెండరీ బౌలర్ షేన్ వార్న్ ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. వార్న్‌ది సహజ మరణమేనని (గుండెపోటు) అటాప్సి రిపోర్టు సైతం దృవీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఫుటేజ్ రకరకాల అనుమానాలకు తావిస్తూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వార్న్ మృతి చెందడానికి నాలుగు గంటల ముందు నలుగురు యువతులు అతని రూమ్‌లో వెళ్లిన దృశ్యాలు విల్లాలోని సీసీ కెమరాల్లో రికార్డై ఉన్నాయి. వార్న్ బ్రతికుండగా చివరిసారిగా చూసింది ఈ నలుగురేనని స్థానిక పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ నలుగురు ఎవరు.. వార్న్ రూమ్‌లో వారు ఏం చేస్తున్నారని పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. చనిపోయిన రోజు మధ్యాహ్నం (1: 53 గంటల సమయం) వార్న్.. నలుగురు మసాజ్ చేసే అమ్మాయిలను రూంకు పిలిపించుకున్నాడని, వారిలో ఇద్దరు వార్న్ స్నేహితుల రూంలోకి వెళ్లగా మరో ఇద్దరు వార్న్‌తో గంటకు పైగా గడిపారని, అనంతరం వారంతా తిరిగి 2: 58 గంటల సమయంలో రూం నుంచి వెళ్లిపోయారని సీసీ కెమరాల్లో రికార్డైన టైమ్ ఆధారంగా తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనానికి వస్తానన్న వార్న్ ఎంతకీ రాకపోవడంతో అతని స్నేహితులు సాయంత్రం 5: 15 గంటలకు వార్న్ రూంకు వెళ్లారు. అయితే అప్పటికే వార్న్ ప్రాణాలు కోల్పోయి బెడ్‌పై నిర్జీవంగా పడి ఉన్నాడు. ఈ క్రమంలో స్నేహితులు వార్న్‌కు సీపీఆర్ చేస్తుండగా రక్తం కక్కుకున్నట్లు, అవే మరకలు టవల్‌పై, ఫ్లోర్‌పై పడ్డాయని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని వార్న్ స్నేహితులు కూడా అంగీకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసిన పోలీసులు.. వార్న్ అతని స్నేహితులు మసాజ్ కోసం అమ్మాయిలను పిలిపించుకున్న మాట వాస్తవమేనని, అయితే అప్పటికే వార్న్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని, ఈ కేసులో వార్న్ స్నేహితులకు కాని, మసాజ్ చేసిన అమ్మాయిలకు కాని ఎటువంటి సంబంధం లేదని, వార్న్ అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే మరణించాడని నిర్ధారించారు. వార్న్‌ను చివరిసారిగా చూసిన అమ్మాయిలను గుర్తించాల్సి ఉందని థాయ్ పోలీసులు పేర్కొన్నారు. చదవండి: షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు -
షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!
Shane Warne Had Been On Extreme Liquid Diet Before Death: స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణంపై థాయ్ పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనలో వార్న్ 14 రోజుల కఠినమైన లిక్విడ్ డైట్ (ద్రవ రూపంలో ఉన్న ఆహారం) ఫాలో అయ్యాడని, ఇదే అతని మరణానికి పరోక్షంగా కారణమైందని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మృతి చెందడానికి ఒక్క రోజు ముందే వార్న్ తన డైట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడని, గతంలో కూడా అతను ఇలాంటి అర్థం పర్థం లేని డైట్లు ఫాలో అయ్యేవాడని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు. థాయ్‌లాండ్ వెకేషన్‌కు బయల్దేరే ముందు ఛాతీలో నొప్పి వస్తుందని, విపరీతంగా చమటలు పడుతున్నాయని వార్న్ తనతో చెప్పాడని ఎర్స్కిన్ వెల్లడించాడు. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్‌ను కూడా కలిశాడని ఆయన పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, వార్న్ గుండెపోటుతోనే మరణించాడని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు థాయ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వార్న్ విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్స్‌పై రక్తపు మరకల్ని గుర్తించిన మాట వాస్తవమేనని, సీపీఆర్ చేసే క్రమంలో వార్న్ రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వార్న్ మరణానికి ముందు మద్యం తీసుకోలేదని, గత కొంతకాలంగా అతను మద్యం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పష్టం చేశారు. Operation shred has started (10 days in) & the goal by July is to get back to this shape from a few years ago ! Let’s go 💪🏻👏🏻 #heathy #fitness #feelgoodfriday pic.twitter.com/EokgT2Hyhz — Shane Warne (@ShaneWarne) February 28, 2022 వార్న్‌కు గుండెపోటు రావడానికి కఠినమైన డైట్‌తో పాటు తీవ్రమైన వర్కౌట్స్ కారణమయ్యాయని, ఫిబ్రవరి 28 వార్న్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తుందని వెల్లడించారు. వార్న్ చేసిన ట్వీట్లో తన ఫోటోను షేర్ చేసి మరికొద్ది రోజుల్లో ఇలా తయారవుతానని, ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుందని, జూలై కంతా ఫిట్‌గా తయారవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్‌కు వెళ్లిన వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. చదవండి: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!
స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ ఆకస్మిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన థాయ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వార్న్ మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్‌పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు సీపీఆర్ చేశామని, గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో అతను రక్తపు వాంతులు చేసుకున్నాడని వార్న్ స్నేహితులు ప్రాధమిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఆదివారం థాయ్ అధికారులు వార్న్ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ వార్న్‌ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆదివారమే వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం స్పిన్ దిగ్గజం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, 1992-2007 మధ్య 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు సేవలందించిన వార్న్..145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా వార్న్ రికార్డుల్లో నిలిచాడు. చదవండి: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు -
Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి
స్పిన్ మాంత్రికుడు, ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్(51) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే మెల్బోర్న్ క్రికెట్ మైదానం ముందు ఏర్పాటు చేసిన అతని కాంస్య విగ్రహం వద్దకు బారులు తీరిన అభిమానులు స్పిన్ మాంత్రికుడికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తున్నారు. రకరకాల పూలతో పాటు తమ ఆరాధ్య క్రికెటర్‌కు ఎంతో ప్రీతిపాత్రమైన మద్యం (బీర్), మాంసం, సిగరెట్లను విగ్రహం ముందు ఉంచి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే వారికి ఇష్టమైన వాటిని సమాధి ముందుంచడం ఆనవాయితీ. ఈ క్రమంలో వార్న్‌కు ఇష్టమైన బీర్‌ను, మాంసాన్ని, సిగరెట్లను అభిమానులు అతని విగ్రహం ముందుంచుతున్నారు. కాగా, క్రికెటింగ్ కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వార్నీ.. వ్యసనాలకు బానిసై వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన విషయం తెలిసిందే. మద్యం, సిగరెట్లతో పాటు స్త్రీ వ్యామోహం కూడా అధికంగా కలిగిన అతను.. చాలా సందర్బాల్లో వీటిని సేవిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం -
300 వికెట్ల క్లబ్ లో మిచెల్ జాన్సన్
బర్మింగ్ హామ్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ టెస్టులో 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అతడు ఈ ఘనత సాధించాడు. బారిస్టో వికెట్ పడగొట్టి టెస్టుల్లో 300 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో ఆస్ట్రేలియా బౌలర్ గా గుర్తింపు పొందాడు. మిచెల్ జాన్సన్ కంటే ముందు డెన్నీస్ లిల్లీ, షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్, బ్రెట్ లీ 300 వికెట్లు పడగొట్టిన ఘనత సాధించారు. టెస్టుల్లో 2 వేల పరుగులు, 300 వికెట్లు పడగొట్టిన రెండో ఆస్ట్రేలియన్ ప్లేయర్ జాన్సన్. అంతకుముందు షేన్ వార్న్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ జాన్సన్ కు 69వది.