Shane Warne Death Case: 4 Masseuses Leaving Shane Warne Room Before His Death, Says Reports - Sakshi
Sakshi News home page

Shane Warne Death Case: వార్న్‌ చనిపోవడానికి నాలుగు గంటల ముందు రూంలో ఏం జరిగింది.. ఆ నలుగురు ఎవరు..?

Published Wed, Mar 9 2022 9:28 PM | Last Updated on Thu, Mar 10 2022 8:21 AM

4 Masseuses Leaving Shane Warne Room Hours Before His Death Says Reports - Sakshi

స్పిన్‌ మాంత్రికుడు, లెజెండరీ బౌలర్‌ షేన్‌ వార్న్‌ ఈనెల (మార్చి) 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. వార్న్‌ది సహజ మరణమేనని (గుండెపోటు) అటాప్సి రిపోర్టు సైతం దృవీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌ రకరకాల అనుమానాలకు తావిస్తూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వార్న్‌ మృతి చెందడానికి నాలుగు గంటల ముందు నలుగురు యువతులు అతని రూమ్‌లో వెళ్లిన దృశ్యాలు విల్లాలోని సీసీ కెమరాల్లో రికార్డై ఉన్నాయి. 


వార్న్‌ బ్రతికుండగా చివరిసారిగా చూసింది ఈ నలుగురేనని స్థానిక పోలీసులు కూడా కన్ఫర్మ్‌ చేశారు. అయితే ఆ నలుగురు ఎవరు.. వార్న్‌ రూమ్‌లో వారు ఏం చేస్తున్నారని పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. చనిపోయిన రోజు మధ్యాహ్నం (1: 53 గంటల సమయం) వార్న్‌.. నలుగురు మసాజ్‌ చేసే అమ్మాయిలను రూంకు పిలిపించుకున్నాడని, వారిలో ఇద్దరు వార్న్‌ స్నేహితుల రూంలోకి వెళ్లగా మరో ఇద్దరు వార్న్‌తో గంటకు పైగా గడిపారని, అనంతరం వారంతా తిరిగి 2: 58 గంటల సమయంలో రూం నుంచి వెళ్లిపోయారని సీసీ కెమరాల్లో రికార్డైన టైమ్‌ ఆధారంగా తెలుస్తోంది. 


ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనానికి వస్తానన్న వార్న్‌ ఎంతకీ రాకపోవడంతో అతని స్నేహితులు సాయంత్రం 5: 15 గంటలకు వార్న్‌ రూంకు వెళ్లారు. అయితే అప్పటికే వార్న్‌ ప్రాణాలు కోల్పోయి బెడ్‌పై నిర్జీవంగా పడి ఉన్నాడు. ఈ క్రమంలో స్నేహితులు వార్న్‌కు సీపీఆర్‌ చేస్తుండగా రక్తం కక్కుకున్నట్లు, అవే మరకలు టవల్‌పై, ఫ్లోర్‌పై పడ్డాయని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని వార్న్‌ స్నేహితులు కూడా అంగీకరించారు. 

ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసిన పోలీసులు.. వార్న్‌ అతని స్నేహితులు మసాజ్‌ కోసం అమ్మాయిలను పిలిపించుకున్న మాట వాస్తవమేనని, అయితే అప్పటికే వార్న్‌ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని, ఈ కేసులో వార్న్‌ స్నేహితులకు కాని, మసాజ్‌ చేసిన అమ్మాయిలకు కాని ఎటువంటి సంబంధం లేదని, వార్న్‌ అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే మరణించాడని నిర్ధారించారు. వార్న్‌ను చివరిసారిగా చూసిన అమ్మాయిలను గుర్తించాల్సి ఉందని థాయ్ పోలీసులు పేర్కొన్నారు.  
చదవండి: షేన్‌ వార్న్‌ అంత్యక్రియలకు తేదీ ఖరారు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement