Thailand
-
స్వదేశానికి చేరుకున్న థాయ్ బందీలు
బ్యాంకాక్: 500 రోజులపాటు హమాస్ చెరలో ఉన్న థాయ్‌లాండ్ వ్యవసాయ కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. 2023 అక్టోబర్‌లో జరిగిన దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న పొంగ్సాక్ థేన్నా, సతియాన్ సువన్నాఖమ్, వాచరా శ్రీవూన్, బన్నావత్ సేథావో, సురసాక్ లామ్నావోలను కూడా హమాస్ అపహరించింది. ఎట్టకేలకు వారు ఆదివారం ఉదయం బ్యాంకాక్‌కు చేరకున్నారు. సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో దిగిన ఐదుగురు కుటుంబాలను కలుసుకోవడంతో విమానాశ్రయంలో భావోద్వేగ వాతావావరణ నెలకొంది. కాగా, వారు మళ్లీ తిరిగి ఇజ్రాయెల్‌కు వెళ్లకుండా ఉండేందుకు నెలకు 725 పౌండ్ల వేతనంతో పాటు సుమారు 14,510 పౌండ్లను ఒకేసారి ఇవ్వనున్నట్లు థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. ఒక థాయ్ బందీ ఆచూకీ లభించలేదు. గాజాలో ఇంకా ఉన్న ఆరో థాయ్ బందీ విడుదల కోసం ప్రయత్నిస్తామని, గెలుస్తామనే ఆశ ఉందని విదేశాంగ మంత్రి సంగియంపోంగ్సా అన్నారు. అక్టోబర్ 2023 నుంచి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో, కొందరు హెజ్బొల్లా ప్రయోగించిన క్షిపణుల వల్ల మరణించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 30న విడుదలయ్యారు. అయితే 10 రోజులపాటు వారికి ఇజ్రాయెల్ ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం స్వస్థలాలకు పంపించారు. బ్యాంకాక్ చేరుకున్న అనంతరం బందీలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మేం ఇక్కడ నిలబడానికి సహాయం చేసిన అధికారులందరికీ కృతజ్ఞతలు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం’’అని చెప్పారు. తమవారిని మళ్లీ ఇంటికి దూరంగా పంపించాలనుకోవడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
థాయ్‌లాండ్ మాస్టర్స్.. ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
థాయ్ వెర్షన్ రామాయణం
ఇతిహాసాన్ని శక్తివంతమైన కథగా చెప్పడం, సాంస్కృతిక నేపధ్యంతో దానిని సజీవంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కళాకారుడికి అత్యంత సాహసోపైతమైన చర్య. దీనిని థాయ్‌లాండ్ కళాకారులు మన ఇతిహాసాన్ని తమ సంప్రదాయ కళారూపంతో మన దేశ రాజధానిలో ప్రదర్శించనున్నారు. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సహకారంతో రాయల్ థాయ్ ఎంబసీ ఖోన్ థాయ్ మాస్క్డ్ డ్యాన్స్ డ్రామాను న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఫిబ్రవరి 7, 2025న సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లోని భీమ్ హాల్లో జరుగుతుంది.థాయిలాండ్ అత్యంత గౌరవనీయమైన కళారూపాలలో ఒకటైన ఖోన్, శాస్త్రీయ నృత్యం, లిరికల్ స్టోరీ టెల్లింగ్, ప్రత్యక్ష సాంప్రదాయ థాయ్ సంగీతాన్ని మిళితం చేస్తుంది. యునెస్కో చేత సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడింది. దుస్తులు, కొరియోగ్రఫీ, ఆధ్యాత్మిక వ్యక్తీకరణ ఈ నృత్యం ప్రత్యేకతలు. వారియర్ హనుమాన్ఈ ప్రదర్శనలో రామాయణం ఇతిహాసం నుండి హనుమాన్ ది మైటీ వారియర్ అనే ఎపిసోడ్ ఉంటుంది, ఇది హనుమంతుడి శౌర్యం, విధేయతను చూపే ఆకర్షణీయమైన కథ. ఈ కథ ఐదు దశలలో.. రావణుడిని ఓడించాలనే తపనతో రాముడికి సేవ చేయడానికి వాయు దేవుడు సృష్టించిన హనుమంతుడి దివ్య జననంతో ప్రారంభమవుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, హనుమంతుడి బాల్య దుశ్చర్య, రాముడి ఆశీర్వాదంతో అతని బలం తిరిగి వస్తుంది. సీతను రక్షించడానికి అతని అచంచలమైన నిబద్ధతను ఇది అన్వేషిస్తుంది. హనుమంతుడు, రాముడు వారి మిత్రులు రావణుడిపై విజయం సాధించే యుద్ధంతో కథనం ముగుస్తుంది. చారిత్రక సంబంధాలుఖోన్ థాయిలాండ్ రాజ ప్రాంగణాలలో భారతీయ ఇతిహాసం రామాయణంతో గల సంబంధం భారతదేశం– థాయిలాండ్ మధ్య గల లోతైన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. దీంతో పాటు తమ కళ ద్వారా వ్యక్తీకరణ హావభావాలు, శక్తివంతమైన కథ చెప్పడం తరతరాలుగా అందించిన గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది థాయ్ వారసత్వంలో ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారుతుంది. భారతీయ ప్రేక్షకులకు థాయిలాండ్ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని చూపిస్తుంది. ఇది ఉమ్మడి వారసత్వం, కళాత్మకత, రామకీన్, రామాయణ ఇతిహాసాల ద్వారా ప్రతిధ్వనించే భక్తి, శౌర్యం, సార్వత్రిక ఇతివృత్తాల వేడుక. రాయల్ థాయ్ ఎంబసీ, ఐసీసీఆర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేస్తుంది. -
స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత
బ్యాంకాక్: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే చట్టం థాయిలాండ్‌లో గురువారం అమల్లోకి వచ్చింది. దీంతో, మొదటిరోజే వందలాదిగా జంటలు ఒక్కటయ్యాయి. రాజధాని బ్యాంకాక్‌లోని ఓ షాపింగ్ మాల్లో ఏర్పాటైన ఈ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్లికి నిర్వచనం మారుస్తూ థాయ్ ప్రభుత్వం పౌర స్మృతిలోని కీలకమైన 1448 నిబంధనను ఆమోదించగా, దేశవ్యాప్తంగా ఒక్క రోజే నమోదైన వివాహాలు 1,448 మార్కును దాటే అవకాశముందని అధికా రులు తెలిపారు. దావోస్‌లో ఉన్న ప్రధానమంత్రి షినవత్రా ఈ సందర్భంగా స్వలింగ జంటలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎల్జీబీటీక్యూ వర్గం ఇంద్ర ధనస్సు జెండా థాయ్‌లాండ్‌పై రెపరెపలాడుతోంది’అంటూ ఫేస్బుక్ పేజీలో కామెంట్ పెట్టారు. జిల్లా మ్యారేజీ కార్యాలయాల్లో అధికారులు కొత్త జంటల కోసం పార్టీలు, ఫొటో బూత్‌లను ఏర్పాటు చేశారు. కప్ కేక్‌లను పంచిపెట్టారు. మొదటిగా పెళ్లి రిజిస్టర్ చేసుకున్న వారికి విమాన ప్రయాణ టిక్కెట్లను సైతం ఆఫర్ చేశాయి కొన్ని కంపెనీలు. ఇలాంటి మధుర క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు కొన్ని జంటలు సంతోషం వ్యక్తం చేశాయి. స్వలింగ వివాహం చట్టం ద్వారా ఏకమయ్యే వారు ఇకపై ఆస్తులను నిర్వహించుకోవచ్చు, వారసత్వంగా పొందొచ్చు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. తమ జీవిత భాగస్వామి అనారోగ్య పాలైతే వైద్య సదుపాయాలను వర్తింప జేసుకోవచ్చు, ఆర్థిక ప్రయోజనాలను పంచుకోవచ్చు. గతేడాది జూన్‌లో ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఉభయ సభలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సెప్టెంబర్‌లో థాయ్ రాజు దీనిపై సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో ఆసియా దేశం థాయ్‌ల్యాండ్. ఇప్పటి వరకు ఇలాంటి వివాహాలను నేపాల్, తైవాన్ చట్టాలు మాత్రమే గుర్తించాయి. థాయ్ పౌరస్మృతిలోని 70 సెక్షన్లు మార్చారు. మగ, ఆడ, భర్త, భార్య వంటి లింగ సూచక పదాలకు బదులుగా వ్యక్తి, భాగస్వామి అనే వాటిని చేర్చారు. అయితే, స్వలింగ జంటలు సరోగసీ ద్వారా కుటుంబాలను కలిగి ఉండాలంటే చట్టాల్లో మరో డజను వరకు మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
ఫ్రెండ్స్‌తో థాయ్‌లాండ్ బీచ్‌లో చిల్ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
-
‘‘వావ్.. బ్యూటీఫుల్!’’.. థాయ్‌లాండ్‌లో అత్యంత అందమైన ప్రాంతాలివిగో (చిత్రాలు)
-
థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రకు రూ.3,431 కోట్ల ఆస్తులు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెటాంగ్‌తర్న్ షినవత్ర తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. తనకు 400 మిలియన్ డాలర్ల (రూ.3,431 కోట్లు) ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు థాయ్‌లాండ్ జాతీయ అవినీతి నిరోధక కమిషన్(ఎన్‌ఏసీసీ)కు శుక్రవారం డిక్లరేషన్ సమర్పించారు. షినవత్రకు దేశ విదేశాల్లో పెద్ద సంఖ్యలో స్థిరచరాస్తులతోపాటు అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, చేతి గడియారాలు, విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద 200కుపైగా డిజైనర్ హ్యాంగ్బ్యాగ్లు ఉన్నాయి. వీటి విలువ 2 మిలియన్ డాలర్లు(రూ.17.15 కోట్లు). అలాగే 75 లగ్జరీ చేతి గడియారాల విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.42.88 కోట్లు). షినవత్ర 2023 సెప్టెంబర్‌లో 37 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో అత్యంత పిన్నవయసు్కరాలైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆమె తండ్రి థక్సిన్ షినవత్ర సహా కుటుంబంలో నలుగురు ప్రధానమంత్రులుగా పనిచేశారు. థక్సిన్ థాయ్‌లాండ్‌లో అత్యంత సంపన్నుడిగా రికార్డుకెక్కారు. -
వీసా లేకున్నా 60 రోజుల అనుమతి
న్యూఢిల్లీ: భారతీయ పర్యాటకులను ఆకర్షించే నిమిత్తం థాయిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వీసాలేకున్నా థాయిలాండ్‌లో గరిష్టంగా 60 రోజులపాటు ఉండేందుకు అనుమతి మంజూరుచేసింది. పర్యాటకం, చిన్నపాటి వ్యాపారాల నిమిత్తం థాయిలాండ్‌ను సందర్శించే భారతీయులకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని థాయిలాండ్ పేర్కొంది. ఇందుకోసం 2025 జనవరి ఒకటో తేదీ నుంచి భారత్‌లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)(ఈ–వీసా) విధానం అమల్లోకి తెస్తామని పేర్కొంది. థాయిలాండ్యేతర జాతీయులు https:// www. thaievisa. go. th వెబ్సైట్లో సంబంధిత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని థాయిలాండ్ ఎంబసీ బుధవారం ప్రకటించింది. ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ దరఖాస్తులను స్వీకరిస్తామని ఢిల్లీలోని థాయిలాండ్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ విషయంలో ఎంబసీ, కాన్సులేట్ జనరల్స్ నుంచి పూర్తి సహయసహకారాలు అందుతాయని వెల్లడించింది. దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైనా వీసా దరఖాస్తు ఫీజు అనేది తిరిగి ఇవ్వరు. వీసా ఫీజు చెల్లించిన 14 రోజుల్లోపు ఈ–వీసా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తారు. సాధారణ వీసా కోసం డిసెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలి. దౌత్య, అధికారిక వీసా కోసం డిసెంబర్ 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈటీఏలో పలు ప్రయోజనాలున్నాయి. ఒకసారి ఈ–వీసా తీసుకుంటే గరిష్టంగా 60 రోజులపాటు అక్కడే ఉండొచ్చు. అత్యయిక, అవసరమైన సందర్భాల్లో సందర్శకులు మరో 30 రోజులు అక్కడే ఉండొచ్చు. ఈటీఏ అనుమతులు సాధించిన ప్రయాణికులు చెక్పాయిట్ల వద్ద ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీ తదితర సోదా తంతు అత్యంత వేగంగా పూర్తవుతుంది. ఈటీఏపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు పూర్తి వివరాలు అక్కడే అధికారులకు త్వరగా అందుబాటులోకి వచ్చి ప్రయాణికుడికీ సమయం చాలా కలసి వస్తుంది. వీసా మినహాయింపు పొందిన విదేశీయులు తమ దేశంలో ఎన్నాళ్ల నుంచి సక్రమంగా, అక్రమంగా ఉంటున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు థాయ్ ప్రభుత్వానికి అందుతాయి. గడువు దాటి అక్కడే ఉంటే రోజుల లెక్కన జరిమానా విధిస్తారు. -
థాయ్ యువతుల స్పెషల్! మసాజ్ ముసుగులో..
లక్ష్మీపురం: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ సుప్రజ, అరండల్ పేట సీఐ వీరాస్వామి ప్రత్యేక బృందాలుగా శుక్రవారం దాడులు నిర్వహించారు. నలుగురు థాయిలాండ్‌కు చెందిన వారితోపాటు ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కేపీహెచ్‌బీ మెట్రో: పది మంది మహిళల అరెస్ట్ -
థాయ్‌లాండ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా థాయ్‌లాండ్‌లో అసెంబ్లీ ప్లాంటును ప్రారంభించినట్లు ఐషర్ మోటార్స్ బుధవారం తెలిపింది. విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో వాహనాల అసెంబుల్ చేస్తారు.‘అపారమైన వృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ విస్తరణ వ్యూహాన్ని కలిగి ఉండటమే మా వ్యూహాత్మక ఉద్దేశం. థాయ్‌లాండ్ అసెంబ్లీ ప్లాంట్ ఈ విజన్‌ను అందిస్తుంది’ అని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో బి.గోవిందరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్కు ఇటువంటి అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. నూతన ఫెసిలిటీ థాయ్‌లాండ్‌లో మిడ్–సెగ్మెంట్ మార్కెట్‌ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ సీసీవో యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌ను సమర్ధవంతంగా తీర్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్లాంట్ సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను అసెంబుల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. థాయ్‌లాండ్ మార్కెట్‌తో ప్రారంభించి దశలవారీగా ఈ ప్రాంతంలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. -
ఎంజాయ్ చేయడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నటి
చావు అనేది ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో చెప్పడం కష్టం, ఊహించడం అంతకంటే అసాధ్యం. ఓ నటి కూడా సరదాగా ఎంజాయ్ చేద్దామని తనకు బాగా అచొచ్చిన ఓ టూరిస్ట్ ప్లేసుకి వెళ్లింది. కానీ విధిని మార్చలేక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ విషయం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)రష్యన్ నటి కమిల్లా బెల్యట్సకయా.. రీసెంట్గా థాయ్‌లాండ్‌లోని కోహ్ సముయి అనే టూరిస్ట్ ప్రాంతానికి ప్రియుడితో కలిసి వెళ్లింది. ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్లడం ఈమెకు అలవాటు. కాకపోతే ఈసారి అలా యోగా చేస్తుండగా.. భారీ రాకాసి అలలు వచ్చాయి. అవి ఈమెని సముద్రంలోకి లాక్కుపోయాయి. 15 నిమిషాల్లో రెస్క్యూ టీమ్ వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఫలితం లేకుండా పోయింది. చాలా కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం లభ్యమైంది.గతంలో ఇదే ప్రాంతాన్ని తన ఇల్లు, భూమ్మీదే బెస్ట్ ప్లేస్ అని సదరు నటి కమిల్లా చెప్పుకొచ్చింది. ఇప్పుడే అదే చోటులో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?) View this post on Instagram A post shared by Daily Mail (@dailymail) -
థాయ్‌లాండ్‌లో కోతులకు ఒక రోజు
-
భారీ విజయంతో భారత్ బోణీ
మస్కట్ (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 11–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ (2వ, 24వ నిమిషాల్లో), గుర్జోత్ సింగ్ (18వ, 45వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుశ్వాహ (19వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు.దిల్‌రాజ్ సింగ్ (21వ నిమిషంలో), ముకేశ్ టొప్పో (59వ నిమిషంలో), శారదానంద్ తివారీ (10వ నిమిషంలో), రోహిత్ (29వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (8వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. -
ఆ స్కూల్లో ఫీజు తీసుకోరు
మామూలుగా అయితే స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. హోంవర్క్ రాసుకురమ్మని చెప్తారు. పరీక్షలు పెట్టి మార్కులు వేస్తారు. పైగా ఇవన్నీ చేసినందుకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తీసుకుంటారు. అయితే థాయ్‌లాండ్‌లో ఉన్న ‘మెషై పట్టానా స్కూల్’(mechai pattana school) లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ బడినే ప్రపంచవ్యాప్తంగా "Bamboo Sc-hool' అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలకు పాఠాలతోపాటు సేవ చేయడం నేర్పిస్తాను. సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. తోటివారిని ఎలా గౌరవించాలో, వృద్ధులతో ఎలా నడుచుకోవాలో, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పినందుకు వారు ఫీజేమీ తీసుకోరు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 400 చెట్లు నాటితే చాలు. థాయ్‌లాండ్‌కు చెందిన మెషై విరవైద్య అనే ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది 2008లో ఈ పాఠశాలను ్రపారంభించారు. స్కూళ్లలో పెరుగుతున్న పేద, ధనిక తారతమ్యం, పాఠశాలలు కేవలం పుస్తకాలు బట్టీ వేసే ప్రదేశాలుగా మారిపోవడం వంటివి గమనించి తాను ఈ స్కూల్‌ని స్థాపించినట్లు ఆయన వివరిస్తారు. బడిలో అందరూ ఒకచోట చేరి సంస్కారాన్ని, సామాజిక సేవనీ, పౌరబాధ్యతలనూ నేర్చుకోవాలని అంటారు. దానికి తగ్గట్టే ఈ పాఠశాల విధివిధానాలను ఆయన రూపొందించారు. ఇక్కడ మామూలు తరగతులతోపాటు కూరగాయలు పండించడం, పశువుల్ని పెంచడం, కళాకృతులు తయారు చేయడం, వంటలు చేయడం వంటివి నేర్పిస్తారు. దీంతోపాటు విద్యార్థులను బృందాలుగా ఏర్పరిచి, వారికొక నాయకుణ్ని నియమిస్తారు. వారిని సమన్వయం చేసుకుంటూ, వారిలో స్ఫూర్తి నింపుతూ సాగేలా అతనికి తర్ఫీదు ఇస్తారు. ఇక్కడ బాధ్యతలన్నీ విద్యార్థులే తీసుకుంటారు. కొత్తవారిని స్కూల్లో చేర్చుకోవడం, కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవడం వంటి పనుల కోసం ‘స్టూడెంట్ బోర్డ్’ పని చేస్తుంది. స్కూల్‌కి కావాల్సిన వస్తువులు కొనడం, ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చుచేయడం కూడా వారి బాధ్యతే. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే పాఠశాలల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి విద్యార్థి ఏడాదిలో 400 గంటలు సమాజ సేవ చేయాలి. అది ఇక్కడ కచ్చితమైన నిబంధన. స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలి, వారి మానసిక పరిస్థితి, శారీరక ఇబ్బందులేమిటనే అంశాలపై ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. దీనివల్ల వారిలో తోటివారి పట్ల అవగాహన, ఆత్మీయత పెరుగుతాయని మెషై విరవైద్య వివరిస్తున్నారు. -
నవజంట కలల పంట..థాయ్‌లాండ్!
సాక్షి, అమరావతి : ఇంతకాలం బ్యాచిలర్స్ డెస్టినేషన్‌గా పేరొందిన థాయిలాండ్ ఇప్పుడు పెళ్లయిన కొత్త జంటలకు హానీమూన్ స్పాట్‌గా మారింది. ఇప్పటి వరకు హానీమూన్ డెస్టినీగా ఉన్న మాల్దీవుల కంటే అత్యధికంగా థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు మేక్ మై ట్రిప్ హానీమూన్–2024 నివేదిక వెల్లడించింది. గడిచిన ఏడాది కాలం(అక్టోబర్ 23 నుంచి సెప్టెంబర్–24)లో కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు పేర్కొంది. ఈ ఏడాదిలో థాయ్‌లాండ్ కు వెళ్లిన కొత్త జంటల్లో 5.2 శాతం వృద్ధి నమోదయితే.. అదే సమయంలో మాల్దీవుల బుకింగ్స్ 16.2 శాతం పడిపోయినట్లు పేర్కొంది. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇండియన్ బీచ్‌లను కించపరుస్తూ మాట్లాడటం, ఆ తర్వాత బ్యాన్ మాల్దీవ్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. థాయ్‌లాండ్, మాల్దీవుల తర్వాత ఇండోనేషియా, మారిషస్, వియత్నాంలకు ఎక్కువ మంది జంటలు వెళుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇండియా నుంచి అత్యధికంగా వెళ్లే ఐదు దేశాల్లో ఒక్క మాల్దీవులు తప్ప మిగిలిన నాలుగు దేశాలు వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుత యువత హానీమూన్ కోసం దగ్గర ప్రాంతాలనే కాకుండా ఎక్కువ రోజులు గడిపేలా సుదీర్ఘ ప్రాంతాలైన జపాన్, స్కాండినేవియా, యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జపాన్ బుకింగ్స్‌లో ఏకంగా 388 శాతం వృద్ధి నమోదైంది. కేరళను అధిగమించిన అండమాన్ ఇక దేశీయంగా చూస్తే కొత్త జంటలు అండమాన్ నికోబార్ దీవుల్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. తొలిసారిగా హానీమూన్ ప్యాకేజీల్లో కేరళను అధిగమించి అండమాన్ ముందుకొచ్చినట్టు నివేదిక పేర్కొంది. అండమాన్‌లో నీలి రంగు సముద్రంతో బీచ్‌లు పరిశుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే అండమాన్ బుకింగ్స్‌లో 6.9 శాతం వృద్ధి నమోదైంది. అండమాన్, కేరళ తర్వాత కశ్మీర్, గోవా, హిమాచల్ ప్రదేశ్లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా హనీమూన్ పర్యాటక ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు ఎదుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అస్సలు తగ్గడం లేదు.. హనీమూన్ ఖర్చు విషయంలో యువత వెనుకాడటం లేదు. హానీమూన్ ప్యాకేజీల్లో అత్యధికంగా ఫోర్స్టార్, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనే బస చేసేందుకే ఇష్టపడుతున్నారట. గతేడాది మొత్తం జంటల్లో 68 శాతం మంది స్టార్ హోటల్స్‌లోనే బస చేయడమే కాకుండా, సగటు ఖర్చులో 13 శాతం వృద్ధి నమోదైంది. కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రెండు మూడు ప్రాంతాలు తిరగడానికి జంటలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అంతర్జాతీయంగా రెండు మూడు దేశాలకు వెళ్లే వారి సంఖ్య 32 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే, దేశంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ నగరాలను సందర్శించే జంటల సంఖ్య 35 శాతం నుంచి 39 శాతానికి పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. -
ఎలి.. ఎంత తెలివైన స్టూడెంటో కదా!
థాయ్‌తో పాటు అమెరికాకు చెందిన కుస్తీ వీరులు.. పదునైన పళ్ళతో ఉన్న మొసళ్ళ దవడ మధ్య వాళ్ల తలను దూరుస్తూ కనిపించారు. “ఖచ్చితంగా ఆ జంతువులు శిక్షణ పొందినవి కదూ?” అని నేను రోమిని అడిగా నమ్మలేకపోతూ. అయితే ఆ విన్యాసంలో వారిని అవి నమిలేయకుండా ఉండేంతగా కుస్తీ వస్తాదులు మొసళ్ళని భయపెడతారని రోమ్ అనుకున్నారు. మనం అంగీకరించాల్సింది ఏమిటంటే?.. మొసళ్లకి శిక్షణ ఇవ్వలేము కానీ మచ్చిక చేసుకోవచ్చు. ఇండోనేషియా పడమర పపువాలో రోమ్ ఒక న్యూ గిని మంచినీటీ మొసలి ఒక చెక్క ఇంట్లో ఉండటం చూసాడు. ఆ మొసలి పొదిగిన పిల్లగా ఉన్నప్పటి నుంచి పిల్లల, మనుషులతో ఓ పెంపుడుకుక్కలా పెరిగి ఇప్పుడు ఐదడుగుల పొడుగయ్యింది. చల్లటి వర్షాకాలం రాత్రులలో అక్కడి సభ్యులతో కలిసి అది చలికాచుకుంటూ ఉంటుంది కూడా.మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ డైరెక్టర్‌గా 2008వ సంవత్సరం మధ్యలో కొద్దికాలం పాటు పనిచేసిన రాల్ఫ్ సామెర్లడ్.. జర్మనీలో ఓ తోటమాలి దక్షిణ అమెరికా రకమైన కెమన్ అనే మొసలిని పెంచుకున్నట్లు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆ తోటమాలి మోకాళ్లపై కూర్చున్నప్పుడు, కుక్క పిల్లలా ఆ మొసలి అతని తలకూ, భుజాలకూ రాసుకునేదట. రాల్ఫ్ మద్రాస్ మొసళ్లకి శిక్షణ ఇచ్చే ఒక కార్యక్రమానికి నాంది పలికాడు. అప్పట్లో అసిస్టెంట్ క్యూరేటర్ అయిన సోహం ముఖర్జీ.. మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించేలా, ఆ ఆలోచనను రాను రాను ఎంతో సరదాగా, ఆకర్షణీయమైన కార్యక్రమంగా అభివృద్ధి చేశారు.ఎలి చిన్నపిల్లగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వడం జరిగింది, కానీ, అది పెద్దయినప్పటి నుంచి ఆ అభ్యాసం ఇవ్వడం తగ్గించేశారు. ఎలికి తన పేరు ఇంకా గుర్తుంది. శిక్షణ పునః ప్రారంభించాడానికి ఇది ఒక మంచి విషయం. తను ఒక ఆదేశం పాటించిన ప్రతీసారి ఒక మాంసం ముక్క బహుకరించేవారు. అచ్చం ఒక కుక్కకి శిక్షణ ఇచ్చినట్లుగా. ఏటొచ్చి ఇది ఒక పెద్ద పోలుసులు కలది. అంతే. ఒక వారం తరువాత, ఎలికి శిక్షణ ఇస్తున్నప్పుడు, వెనుకన ఉన్న ఒక మగ్గర్ మొసలి ఆదేశాలకి చక్కగా స్పందించడం సోహం గమనించారు. ఆ మొసలి ఏ బహుమతి సహాయం లేకుండా, చూసి నేర్చుకుంటోంది. సోహం దానికి పింటూ అని పేరు పెట్టాడు. ఆ మొసలి వెంటనే ఆ కార్యక్రమంలో భాగమైంది. కాలక్రమేణా మరి నాలుగు మొసళ్లు చేరాయి. ప్రతీ మధ్యాహ్నం మూడింటికి శిక్షణ మొదలయ్యేది. దానికి పది నిముషాల ముందే ఆ ఆరుగురు శిష్యులు కొలను అంచున, సోహం గొంతు నుంచి విలువడే అతి చిన్న శబ్దం కోసం ఆత్రంగా ఎంతో అప్రమత్తతతో వేచి చూసేవి. అతను వచ్చాక వాటి ఆనందం మాములుగా లేదు. ఆ మొసలి శిష్యులకి వాటిని ఏ వరుసలో పిలుస్తారో తెలుసు. ఇక వారి వంతు కోసం ఎంతో సహనంతో వేచి ఉండేవి. ఆచ్చం నా కుక్కలలాగే వాటికి ఆదేశల వరుస ఎంత బాగా తెలుసంటే, అవి ముందస్తుగానే ఆ విన్యాసాలు చేసేసేవి. కనుక సోహం ఆదేశాలను తారుమారు చేయాల్సొచ్చేది. ఆ మొసలి శిష్యులు వారంలో ఏ రోజు శిక్షణ నుంచి సెలవు వస్తుందో కూడా తెలుసుకున్నాయి. పింటూ లాగే, వేరే మోసళ్లు కూడా శిక్షకుడి ఆదేశాల పట్ల ఎంతో శ్రద్ధ వహించి, చూసి నేర్చుకున్నాయి. త్వరలోనే కొమోడో, థాయ్ సాయమీస్, ఉప్పు నీటి మొసలి మిక్, మారియు నైల్ మొసలి అబూ, అన్ని జాతుల రంగురంగుల మొసళ్ళ కలగంపగా ఆ శిక్షణ పాఠశాలకు హాజరు అయ్యాయి. ఆఖరికి వయసులో పెద్దదైన మగ్గర్ రాంబో కూడా ఆ కార్యక్రమంలో చేరి, కొత్త విన్యాసాలు నేర్చుకోవడానికి వయసు అవరోధం కాదని నిరూపించింది. కానీ గారాల కూచి ఎలి మాత్రం రా, ఉండు, పైకి, కూర్చో, తిరుగు, నోరు తెరు వంటి పన్నెండు ఆదేశాలు తెలిసిన అత్యుత్తమ విద్యార్థి. ఒకసారి ఎలి శిక్షణ రాంప్ పై సగం దూరం వెళ్ళాక, సోహం తనని ‘గెంతు’ అని ఆదేశించారు. ఒక జారెడు బల్ల వంటి రాంప్ పైనుంచి గెంతటం ఎంత కష్టమో మీరు ఊహించగలరు, కానీ ఎలి బహుమతి పొందే అవకాశం వదులదలచలేదు. రాంప్ వదలకుండా ఎలి తన కాలివేళ్లపై నుంచుని పొట్ట కిందకి ఆంచి, మెల్లగా గెంతడానికి సిద్ధమవుతున్నట్టు అనుకరించింది. ఎంతో ఆశ్చర్యకరం. ఆ పాఠశాల, ఎనిమిది నెలల నుంచి నలభై ఏళ్లు ఉన్న వేర్వేరు జాతులకు చెందిన ముప్పై మొసళ్ళ ఉండేంతగా పెరిగి పెద్దదయ్యింది.కెమన్ బల్లులు, అల్డబ్రా తాబేళ్లను కూడా శిష్యులుగా చేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ఆ పాఠశాల పేరును రెప్టైల్ పాఠశాలగా మార్చారు. పాములు, మానిటర్ బల్లులు, తాబేళ్ళు పాఠశాలలో చేరడానికి వేచి ఉన్న జాబితాలో ఉన్నాయి. మరి స్పష్టంగా, గవర్నమెంట్ నిబంధనలకు కట్టుబడి, విద్యార్థులు చేరడానికి నిర్ణీత రుసుము కూడా లేదు! ::జానకి లెనిన్ రాసిన దానికి రోహిణి చింత అనువాదం(చదవండి: యంగ్ టాలెంట్: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు) -
దీపిక ఐదు గోల్స్... సెమీస్‌లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్ జట్టుతో గురువారం జరిగిన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 13–0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ తరఫున దీపిక అత్యధికంగా ఐదు గోల్స్ (3వ, 19వ, 43వ, 45వ, 45వ నిమిషంలో) చేయగా ... ప్రీతి దూబే (9వ, 40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (12వ, 56వ నిమిషంలో), మనీషా చౌహాన్ (55వ, 58వ నిమిషంలో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. బ్యూటీ డుంగ్‌డుంగ్ (30వ నిమిషంలో), నవ్‌నీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఆరు జట్లు మూడేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, భారత్ 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే గోల్స్ అంతరం కారణంగా చైనా (చేసిన గోల్స్ 22; ఇచ్చిన గోల్స్ 1) టాప్ ర్యాంక్‌లో, భారత్ (చేసిన గోల్స్ 20; ఇచ్చిన గోల్స్ 2) రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. 3 పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, 2 పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో, 1 పాయింట్‌తో కొరియా ఐదో స్థానంలో, 1 పాయింట్‌తో థాయ్‌లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. నిర్ణీత ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్తాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా చైనా, భారత జట్ల తొమ్మిది పాయింట్లను మిగతా జట్లు దాటే పరిస్థితి లేదు. దాంతో ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. మూడో నిమిషంలో మొదలై... గత పదేళ్లలో ఏడోసారి థాయ్‌లాండ్‌తో తలపడిన భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌కు ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని 39 గోల్స్ సాధించిన భారత జట్టు ఏడోసారీ అదే దూకుడును కొనసాగించింది. మూడో నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అటునుంచి టీమిండియా వెనుదిరిగి చూడలేదు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో ఐదింటిని మాత్రమే భారత్ గోల్స్‌గా మలిచింది. లేదంటే విజయాధిక్యం మరింతగా ఉండేది. గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనా 2–1 గోల్స్‌తో జపాన్‌పై, మలేసియా 2–1 గోల్స్‌తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియాతో జపాన్; కొరియాతో థాయ్‌లాండ్; చైనాతో భారత్ తలపడతాయి. -
బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఓరీ.. థాయ్‌లాండ్‌లో రచ్చ (ఫొటోలు)
-
సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించిన 'థాయిలాండ్' ప్రభుత్వం
బాలీవుడ్ నుంచి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడు సోనూసూద్.. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు వేసినప్పటికీ రియల్ లైఫ్‌లో హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే నెటజన్ల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆయనకు తాజాగా థాయిలాండ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. దీంతో సోనూసూద్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.థాయ్‌ల్యాండ్ పేరు వింటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి గుర్తుకొచ్చేది టూరిజం. సీజన్ ఏదైనా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రేదేశాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో భారత్ నుంచి కూడా చాలామంది థాయిలాండ్‌కు వెల్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం సోనూసూద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించింది. తమ దేశ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ను నియమించింది. ఇదే సమయంలో ఆయనను టూరిజం అడ్వైజర్గాను ఆ దేశం ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా సోనూసూద్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.2000 సంవత్సరంలో హ్యాండ్సప్ అనే చిన్న సినిమా ద్వారా సోనూసూద్ తెలుగువారికి పరిచయం అయ్యారు. అయితే, సూపర్,అతడు,అరుంధతి చిత్రాలతో భారీగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా కరోనా వల్ల ఏర్పడిన లాక్డౌన్ సమయంలో వేలాది మందికి తన వంతుగా సాయం చేసి అండగా నిలిచారు. తన అమ్మగారి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి చదువుకోవాలని తపించే పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు.Honoured and humbled at being appointed as the Brand Ambassador and Advisor for Tourism , Thailand 🇹🇭. My first international trip was to this beautiful country with my family and in my new role I am excited to advise and promote the country’s stunning landscapes & rich cultural… pic.twitter.com/0slsWp9efd— sonu sood (@SonuSood) November 10, 2024 -
థాయ్‌లాండ్ ట్రిప్‌లో ధోని కుటుంబం.. బీచ్ ఒడ్డున అలా (ఫొటోలు)
-
థాయ్‌లాండ్‌లో దీపావళి వేడుక వేరే లెవల్! చూసి తరించాల్సిందే!
వెలుగుల పండుగ దివాలీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాటు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో దీపావళిని వేడుకగా నిర్వహించు కుంటారు. ముఖ్యంగా మిరుమిట్లు కొలిపే దీపకాంతులతో థాయ్‌లాండ్ మెరిసి పోతుంది. నింగిలోనూ, నీటిలోనూ లాంతర్ల వెలుగు, దీపాలతో థాయలాండ్‌లో దీపావళి వేడుక ఒక రేంజ్లో జరుగుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!థాయ్‌లాండ్‌లో నవంబర్ నెలలో లాయ్ క్రాథోంగ్, యి పెంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు . అరటి ఆకులతో చేసిన దియాలు (దీపాలు) ప్రత్యేక ఆకర్షణ. ఈ దీపాలు తామరపువ్వు ఆకారాల్లొ నదిపై తేలియాడుతూ అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ దీపాలపై ఒక నాణెం, ధూపంతో పాటు కొవ్వొత్తులనూ ఉంచుతారు. దీపావళి రోజున మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు .లాయ్ క్రాథోంగ్ (లాంతర్ల పండుగ)దీన్నే "ఫ్లోటింగ్ బాస్కెట్ ఫెస్టివల్" అని పిలుస్తారు. loi అంటే 'ఫ్లోట్' అని, క్రాథాంగ్ అనేది పూలతో అలంకరించబడిన బుట్ట అని అర్థం. థాయ్‌లాండ్ లైట్స్ ఫెస్టివల్ అని పిలువబడే లాయ్ క్రాథాంగ్ ఫెస్టివల్, థాయ్ చంద్ర క్యాలెండర్‌లోని 12వ నెల పౌర్ణమి రాత్రి జరుగుతుంది. కొవ్వొత్తులు , పువ్వులతో అలంకరించిన తామరపువ్వు ఆకారంలో ఉన్న బుట్టలను నదులు మరియు జలమార్గాలపై విడుదల చేయడం ద్వారా నీటి దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపుకు గుర్తుగా , శీతాకాలాన్ని స్వాగతించే వార్షిక వేడుకగా కూడా భావిస్తారు. మంత్రముగ్ధం చేసే ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనలు , నదులు, కాలువలు, సరస్సులలో తేలియాడే బుట్టలు నిజంగా అద్భుతంగా ఉంటుంది. లాయ్ క్రాథాంగ్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటే, ఉత్తర థాయిలాండ్‌లో, యి పెంగ్ అని చియాంగ్ మాయిలో ఈ లాంతరు పండుగ నిర్వహస్తారు. యి పెంగ్స్కై లాంతర్ ఫెస్టివల్ యి పెంగ్: రాత్రివేళ ఆకాశంలో వేల సంఖ్యలో కొవ్వొత్తుల లాంతర్లను ఎగువేవేస్తారు. చియాంగ్ మాయిలో మాత్రమే ఈ రెండు పండుగలను ఒకే రోజు జరుపు కుంటారు.దురదృష్టాన్ని గాల్లోకి వదిలి, అదృష్టాన్ని స్వాగతించడానికి ప్రతీకగా ఈ వేడుక ఉంటుంది. ఈ కార్యక్రమంలో బౌద్ధసన్యాసులు, స్థానికులు, పర్యాటకులు వేలాదిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాములతో సందడిగా ఉంటుంది. వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. -
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్‌ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్'ను మించిన సినిమా.. క్షణక్షణం ఉత్కంఠ
యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే 2018లో థాయ్‌లాండ్‌లో జరిగింది. 12మంది ఫుట్‌బాల్ టీమ్ పిల్లలతో 'థామ్ లువాంగ్' గుహలోకి కోచ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనతో వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 'థర్టీన్ లైవ్స్' పేరుతో సినిమాగా వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యథార్థ ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈచిత్రం కథ తెలుసుకుందాం.కథేంటంటేథాయ్లాండ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన 'థామ్ లువాంగ్' గుహలను చూసేందుకు 12 మంది ఫుట్‌బాల్ జూనియర్ టీమ్ సభ్యులతోపాటు కోచ్ కూడా వెళ్తాడు. వారు గుహ లోపలికి వెళ్లిన కొంత సమయం గడిచాక ఆ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. దీంతో గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. తిరిగి బయటకొచ్చే దారి వారికి కనిపించదు. అలా వారందరూ అక్కడ చిక్కుకుపోతారు. భారీ వర్షం వల్ల గుహ లోపలికి వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది. ఇదే సమయంలో చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతుంటారు. బయటి ప్రంపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేని ఆ ప్రాంతంలో చిన్నారులు చిక్కుకుపోయారని అందరికీ ఎలా తెలిసింది..? సుమారు 18 రోజుల పాటు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందా..? పది కిలోమీటర్ల పొడవైన గుహ మొత్తం నిళ్లతో నిండిపోతే ఆ రెస్క్యూ టీమ్ ఎలా వెళ్లింది..? చిన్నారులందరూ అన్నిరోజుల పాటు సజీవంగా ఎలా ఉండగలిగారు..? అన్నది తెలియాలంటే 'థర్టీన్ లైవ్స్' సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే..2018లో థాయ్ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారులను కాపాడేందుకు దాదాపు పదిహేడు దేశాలకు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆపరేషన్ కోసం థాయ్‌లాండ్ చేరుకుంటారు. ఈ ఆపరేషన్‌లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్ ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడటానికి ఎలా ప్రయత్నాలు చేశారనేది చాలా సాహసంతో కూడుకొని ఉంటుంది. సుమారు 18 రోజుల తర్వాత ఆ చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చాలా ఉద్వేగంతో ఫీల్ అయ్యారు. ఆ సమయంలో పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు. అవన్నీ ఫలించాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ ఘటనను తెరకెక్కించడంలో దర్శకుడు రాన్ హోవర్డ్ విజయం సాధించారు.సినిమా ప్రారభంమే కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని అక్కడికి చేరుకోవడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే భారీ వర్షం.. చిన్నారుల్లో భయం.. అలా ఒక్కో సీన్ ప్రేక్షకులకు చూపుతూ దర్శకుడు ఆసక్తి పెంచుతాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ గుహ మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల వారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే, వారిని ఎలా కనిపెడుతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమారు 9 రోజుల తర్వాత సీడైవింగ్లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు (రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్) ఎంతో శ్రమించి చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు బయట జోరు వాన.. పిల్లలను రక్షించుకొందామనుకుంటే ఆ నీరు అంతా మళ్లీ గుహలోకే వెళ్తుంది. దీంతో ఆ నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తారు. అక్కడి రైతులు కూడా అందుకు సహకరిస్తారు. ఆ సీన్ అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్లు అన్నీ చాలా ఉద్విగ్నంగా ఉంటాయి.పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు సరే.. సుమారు 10 కిలోమీటర్లు దూరం పాటు చాలా లోతుగా ఉన్న నీటిలో నుంచి వారిని ఎలా రక్షించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎదురుగా నీటి ప్రవాహం వస్తుంటే.. దానిని అదిగమించి చిన్నారులను బయటకు చేర్చాలి. అప్పటికే 18 రోజులు కావడంతో వారందరూ మరణించి ఉంటారని కనీసం తమ బిడ్డల శవాలు అయినా తీసుకొస్తే చాలు అని వారి తల్లిదండ్రులు గుహ బయటే కన్నీటితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సీన్లు ప్రేక్షకుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ కథ ఎలా ముగిసిందో తెలుసుకున్నాక ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి మజానే ఈ 'థర్టీన్ లైవ్స్' తప్పకుండా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.ఎవరెలా చేశారంటేసినిమా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక విభాగం ప్రధాన్ ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ చాలా చక్కగా తీశారు. రియల్ ఇన్సిడెంట్ కళ్ల తెరపైన చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా సినిమా సాగుతుంది. ఇందులో ఫైట్స్ వంటివి లేకున్నా చాలా సన్నివేశాల్లో విజిల్స్ వేసేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాన్ హోవర్డ్.. ఈ కథను ఉత్కంఠభరితంగా చెప్పడమే కాకుండా.. ఎంతో భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించారు. -
బీచ్ వెడ్డింగ్, అందమైన లవ్‌స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్
భారతదేశంలో పెళ్లిళ్లు అంటే వేదమంత్రాలు, బాజా భజంత్రీలు, మూడు ముళ్లు,ఏడడగులు మాత్రమే కాదు. అంతకుమించి పెద్ద సందడే ఉండాలి. విశాలమైన వెడ్డింగ్ హాల్స్, జిగేల్ మనిపించే డెకరేషన్, నోరూరించే వంటకాలు, మెహిందీ, సంగీత్, బారాత్..నాచ్గానా మినిమం ఉండలి. ఇక వీటన్నింటికి మంచి వధువు డిజైనర్ దుస్తులు, ధగధగలాడే ఆభరణాలతో అదిరిపోవాలి. ఇదీ లేటెస్ట్ ట్రెండ్. తాజాగా బీచ్ వెడ్డింగ్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.విశేషం ఏమిటంటే.. ఈ పెళ్లిలో వధువు తన లహంగాను స్వయంగా తానే డిజైన్ చేసింది. ఆమె పేరే కాశీష్ అగర్వాల్. పారిశ్రామికవేత్త అసీమ్ ఛబ్రాతో థాయ్‌లాండ్‌లోని ఒక బీచ్‌లో వీరిపెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్ బాగా వైరల్అవుతున్నాయి. ముఖ్యంగా వైట్ లెహంగా స్కర్ట్‌లో రాధా-కృష్ణల ప్రేమకథను పిచ్వాయ్ పెయింటింగ్స్‌తో తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటోంది. తన పిన్ని, వృత్తిరీత్యా డిజైనర్ షాగున్ పాఠక్ సహాయంతో దీన్ని అద్భుతంగా అపురూపంగా తయారు చేసిందట కాశీష్. ఇక భారీ చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ చెవిపోగులు, చూడామణి, చేతి నిండా గాజులు, అంగుళీయంతో మెరిసిపోతున్న పెళ్లికూతురు వైపునుంచి చూపు తిప్పుకోలేకపోయారట అతిథులు వీరి లవ్స్టోరీకరోనా సమయంలో పెద్దల ద్వారా వీరి పరిచయం సాగింది. కరోనాతో తమ్ముడిని కోల్పోయిన బాధలో కాశీష్, వ్యాపార నష్టాలతో ఉన్న అసీమ్ మానసికంగా బాగా దగ్గరయ్యారు. ఇద్దరివీ భిన్నమైన వ్యక్తిత్వాలైనప్పటికీ ఒకర్ని ఒకరు గౌరవించుకుంటూ వీర ప్రేమికులుగా మారి పోయారు. ఎట్టకేలకు పెళ్లికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. మెహందీ, సంగీత్, ఇలా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు గ్రాండ్‌గా నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కాబోయే వధూవరులను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. -
స్కూల్ బస్సుకు మంటలు..
బ్యాంకాక్: విహార యాత్రకు పాఠశాల విద్యార్థులు, టీచర్లతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ విషాద ఘటనలో 20 మంది విద్యార్థులు సహా 23 మంది సజీవ దహనమయ్యారు. థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సెంట్రల్ ఉథ్థాయ్ థని ప్రావిన్స్‌కు చెందిన స్కూల్ విద్యార్థులు, టీచర్లు కలిపి మొత్తం 44 మందితో అయుథ్థయ, నొంతబురి ప్రావిన్స్‌ల్లో విహారయాత్రకు బస్సులో బయలుదేరారు.నొంతబురి వైపు వెళ్తుండగా బస్సు ముందు టైరు పగిలి, అదుపుతప్పి రోడ్డుపక్క రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని 20 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ఆహుతయ్యారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఘటనపై దర్యాప్తు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. -
125 మొసళ్లను షాకిచ్చి చంపేశాడు..!
బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్‌కు చెందిన మొసళ్ల పెంపకందారు ప్రజల హితం కోరి ఎవరూ ఊహించని సాహసం చేశారు. ఇటీవల సంభవించిన వరదలతో మొసళ్లను పెంచుతున్న ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతిని, బలహీనపడింది. ఆ గోడ ఏ క్షణాన్నైనా కూలొచ్చని, అదే జరిగితే అందులోని ప్రమాదకర మొసళ్లన్నీ జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని ఆయన ఊహించారు. జరగబోయే ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చారు. వారు చెప్పిన సూచనల ప్రకారం 125కు పైగా మొసళ్లను కరెంటుషాకిచ్చి చంపేశారు. జనం కోసం తన సొంతలాభాన్ని త్యాగం చేసిన నత్థపక్ ఖుంకడ్(37)ను అందరూ ‘కోకడైల్ ఎక్స్’గా పిలుచుకుంటారు. లుంఫున్ ప్రాంతంలో 17 ఏళ్లుగా సియామీస్ అనే అరుదైన రకం మొసళ్లను ఈయన పెంచుతున్నారు. వీటిని చర్మాన్ని పరిశ్రమలకు, మాంసాన్ని థాయ్‌ల్యాండ్‌తోపాటు ఇతరదేశాలకు పంపిస్తుంటారు. ఏమైందంటే.. సెప్టెంబర్ 21వ తేదీన థాయ్‌ల్యాండ్ ఉత్తర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. నత్థపక్ ఫాంను కూడా వరద తాకింది. ఆ తీవ్రతకు మొసళ్ల ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతింది. అది పూర్తిగా కూలితే మొసళ్లు సమీపంలోని ఆవాసాల్లోకి, పొలాల్లో ప్రవేశించి, జనాన్ని చంపేస్తాయని నత్థపక్ ఆందోళన చెందారు. మొసళ్లను వేరే చోటుకు తరలించాలని ప్రయత్నించినా వీలు పడలేదు. కుటుంబసభ్యులతో ఆలోచించిన మీదట..ప్రజలకు హాని కలిగించకుండా తామే వాటిని చంపేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై స్థానిక అధికారుల సలహా మేరకు మర్నాడు మొత్తం 125 మొసళ్లను విద్యుత్ షాకిచ్చి చంపేశారు. ఇందులో అతిపెద్దదైన నాలుగు మీటర్ల పొడవుండే బ్రీడర్ మొసలి ‘అయి హర్న్’కూడా ఉంది. నత్థపక్ నిర్ణయం ధైర్యంతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయమని అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. నత్థపక్ వద్ద ఇంకా అడుగు నుంచి నాలుగుడుగుల వరకు పొడవైన 500 దాకా పిల్ల మొసళ్లున్నాయి. పిల్ల మొసళ్లతో కలిసి ఎన్‌క్లోజర్‌లో గడపటం వంటి మొసళ్లతో చేసే విన్యాసాలతో ఈయన వీడియోలు ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయ్యాయి కూడా. థాయ్‌ల్యాండ్‌లో మొసళ్ల పెంపకం ఆకర్షణీయమైన పరిశ్రమగా భారీ ఎత్తున సాగుతోంది. దేశంలో 1,100 మొసళ్ల పెంపకందారులున్నారు. -
స్వలింగ వివాహాలకు థాయ్‌లాండ్ చట్టబద్ధత
బ్యాంకాక్: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్ నిర్ణయించింది. ఇందుకు వీలు కలి్పంచే చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్కర్ణ్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచి్చన తొలి దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. 2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త వంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు వాడతారు. స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కు (ఎల్జీబీటీక్యూ)లకు థాయ్‌లాండ్‌లో మొదటినుంచీ స్వేచ్ఛ ఎక్కువే. అయితే పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్లు 20 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత బిల్లు జూన్‌లో సెనేట్ ఆమోదం పొందింది. రాజు ఆమోదంతో మంగళవారం చట్టరూపు దాల్చింది. ఇది చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు ప్రశంసించారు. ‘‘చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నాం. సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయమిది’’అని ఎల్జీబీటిక్యూ హక్కుల కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్న చుమాపోన్ అన్నారు. చట్టం అమల్లోకి రానున్న జనవరి 22న 1,000కి పైగా ఎల్జీబీటీక్యూ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించే యోచన ఉన్నట్టు ఆమె తెలిపారు.ఆసియాలో మూడో దేశం తైవాన్, నేపాల్ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కలి్పంచిన మూడో దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. తైవాన్ 2019లో తొలిసారి ఈ చర్య తీసుకుంది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. -
నెట్టింట్లో తెగ వైరల్.. ఈ బుజ్జి హిప్పోకు ఎందుకందరూ ఫిదా!
మూ డెంగ్.. రెండు నెలల వయసున్న ఆడ పిగ్మీ హిప్పో అదరినీ అలరిస్తోంది. థాయ్‌లాండ్‌లో చోన్ బురిలోని జంతుప్రదర్శనశాలలో ఇది నివసిస్తోంది. దీని ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ ప్రత్యేకమైన హిప్పో కాస్త బొద్దుగా, చాలా చిన్నగా ఉండటంతో ఆన్‌లైన్‌లోనూ చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు.మూ డెంగ్’ అంటే థాయ్‌లో ఎగిరిపడే పంది మాంసం అని అర్ధం. ఇది స్థానికంగా ప్రసిద్ధి చెందిన చిరుతిండి. ఇప్పుడు అంతరించిపోతున్న పిగ్మీ హిప్పోకు ఈ పేరు పెట్టారు. ఇది పశ్చిమ ఆఫ్రికాకు చెందినది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం.. ప్రపంచంలో 2,000 నుంచి 2,500 మాత్రమే మిగిలి ఉన్నాయి.กินคลีน ☘️#hippo #PygmyHippo #ขาหมูแอนด์เดอะแก๊ง #หมูเด้งจะเด้งกี่โมง pic.twitter.com/gOn2s5Fb57— Khamoo.andthegang (@and_khamoo) September 10, 2024 ఈ బుజ్జి హిప్పోను చూసేందుకు పట్టాయాకు సమీపంలోని ఒక జంతు ప్రదర్శనశాల (జూ)కు జనాలు పోటెత్తుతున్నారు. వందలాది మంది సందర్శకులు ఐదు నిమిషాల పాటు ఎన్‌క్లోజర్ క్యూలో ఉండి దీనిని చూస్తున్నారు. కొంతమంది అయితే రెండు గంటల ప్రయాణి చేసి మరి దానిని సందర్శించేందుకు వస్తున్నారు. జులైలో ఈ హిప్పో పుట్టినప్పటి నుంచి జూకు వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయిందని ఖ్యావ్ ఖ్యూ ఓపెన్ జూ నిర్వాహకులు వెల్లడించారు.pic.twitter.com/SSUHf775RW— X (@X) September 15, 2024 అయితే బుజ్జి హిప్పోను సందర్శకులు ఇబ్బంది పెడుతున్నట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో మూ డెంగ్‌ను చూడటానికి వచ్చే వారు పద్ధతిగా వ్యవహరించాలని జూ డైరెక్టర్ కోరారు. ఈ జంతువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, వాటికి సురక్షితమైన, సౌకర్యమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కాగా ఈ హిప్పోను లేపడానికి కొంతమంది సందర్శకులు దానిపై నీళ్లు చల్లడం, వస్తువులు విసిరేస్తున్నట్లుగా నెట్టింట్లో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి. దీంతో మూ డెంగ్ స్థావరం చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, బుజ్జి హిప్పో పట్ల తప్పుగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. అది మేల్కొని ఉన్నప్పుడే దానిని చూడాలని ఆయన కోరారు. -
థాయ్‌ల్యాండ్‌కు ఎయిర్ ఏషియా మరిన్ని సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా భారత్ నుంచి థాయ్‌ల్యాండ్‌కు డైరెక్ట్ ఫ్లయిట్ సరీ్వసులను విస్తరించింది. కొత్త రూట్లలో హైదరాబాద్–బ్యాంకాక్, చెన్నై–ఫుకెట్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సరీ్వసులు అక్టోబర్ 27న, చెన్నై నుంచి ఫ్లయిట్స్ అక్టోబర్ 30న ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్ కింద హైదరాబాద్–బ్యాంకాక్ రూట్లో వన్–వే టికెట్ చార్జీ రూ. 7,390గా ఉంటుంది. వచ్చే నెల 27 నుంచి 2025 మార్చి 29 వరకు ప్రయాణాల కోసం సెపె్టంబర్ 22 వరకు ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద బుక్ చేసుకోవచ్చు. కొత్తగా 2 సర్వీసుల చేరికతో భారతీయ మార్కెట్లో తాము సరీ్వసులు నిర్వహించే రూట్ల సంఖ్య 14కి చేరుతుందని థాయ్ ఎయిర్ఏషియా హెడ్ (కమర్షియల్) తన్సితా అక్రారిత్పిరోమ్ తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే!
128 feet tall, the World’s Tallest standing Ganesha Murti at Khlong Khuean Ganesh International Park, Thailand. pic.twitter.com/ARzvHQNpEq— Lost Temples™ (@LostTemple7) September 9, 2024వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలు కూడా ప్రారంభ మైనాయి. గణేష్ బప్పా మోరియా అంటూ పూజించిన భక్తులు జై బోలో గణేష్మహారాజ్ కీ అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు పలు ఆకృతుల్లో కొలువుదీరిని బొజ్జ గణపయ్య విద్యుత్ కాంతుల శోభతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఊరా, వాడా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి ముఖ్యంగా 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి, గాజువాకలో 89 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాలు ప్రత్యేక విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? మన దేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ ఉంది? ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ కథనంలో..! గణపతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా నిర్వహిస్తుంటారు. థాయిలాండ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గణనాథుడు కొలువై ఉన్నాయి. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో విశేషంగా నిలుస్తోంది. విగ్రహం ప్రత్యేకతలుథాయిలాండ్లోని ఖ్లోంగ్ ఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని చాచోయింగ్షావో నగరం సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందిది. ఈ పెద్ద విగ్రహాన్ని 2012లో స్థాపించారు. కాంస్యంతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 2008 నుంచి 2012 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందట దీని తయారీకి. తల భాగంలో కమలం, మధ్యలో ఓం చిహ్నం నాలుగు చేతులు ఉంటడం ఈ భారీ విగ్రహం యొక్క ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. అలాగే ఒక చేతిల్లో పనస, రెండో చేతిలో చెరకు, మూడో చేతిలో అరటిపండు, నాలుగో చేతిలో మామిడ పండు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మరో మూడు పెద్ద గణేష్ విగ్రహాలు ఉన్నాయి.ఈ విస్మయం కలిగించే విగ్రహం ఆధునిక ఇంజినీరింగ్‌కు నిదర్శనం మాత్రమే కాదు. అనేక దైవిక, వైజ్ఞానికి అంశాలను కూగా గమనించవచ్చు. ఎగువ కుడిచేతి పనస పండు సమృద్ధి , శ్రేయస్సుకు చిహ్నంగా, ఎగువ ఎడమ చేతిలో చెరకు తీపి,ఆనందం కలయికను, దిగువ కుడి చేయి అరటిపండు పోషణ, జీవనోపాధికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక దిగువ ఎడమ చేతి మామిడి పండు, దైవిక జ్ఞానం, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది.ఎత్తైన గణేశ విగ్రహం కేవలం అద్భుతమైన కళాకృతి మాత్రమే కాదు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం విశ్వాసం, ఐక్యత, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దీని గొప్పతనం మానవ సృజనాత్మకత, భక్తితో సాధించే ఉన్నతితోపాటు, సరిహద్దులు, నమ్మకాలకు అతీతంగా ఉన్న గణేశుని విశ్వవ్యాప్త ఆకర్షణకు, ప్రజలను ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. -
ఏ దేశమేగినా... బొజ్జ గణపయ్యే!
నేడు వినాయక చవితి. విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాల్లో విజయం సిద్ధించాలని కోరుకుంటూ గణనాథుడికి పూజలు చేస్తాం. ఆసేతుహిమాచలం మాత్రమే కాదు భారతదేశానికి ఆవల సైతం పూజలందుకుంటున్న అతికొద్ది మంది దేవుళ్లలో వినాయకుడు సైతం ఉన్నాడు. థాయిలాండ్ మొదలు కాంబోడియా, జపాన్, చైనా ఇలా ఎన్నో దేశాల్లో బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా గణేష్ చతురి్థని జరుపుకుంటూ మహదానందం పొందుతున్నాడు ఆయా దేశాల ప్రజలు. వాణిజ్య, ధారి్మక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతలను పూజించడం పరిపాటి. భారత్‌లో మాదిరే వరసిద్ధి వినాయకుడు విదేశాల్లోనూ చక్కని పూజలందుకుంటున్నాడు. అయితే గణపతిని ఆయా దేశాలు వివిధ రూపాల్లో కొలుస్తుండటం విశేషం. విఘ్ననాయకుడిని విశేష రూపాల్లో ఏ దేశం? ఎలా ఆరాధిస్తుందో ఓసారి పరికిద్దాం.. థాయిలాండ్‌లో.. థాయిలాండ్ బౌద్ధులకు వినాయకుడూ ఆరాధ్య దైవమే. క్రీ.శ 550–600 ప్రాంతంలో థాయిలాండ్‌లో లంబోదరుని విగ్రహాలు వెలిశాయి. థాయిలాండ్‌లో మన మోదకప్రియుడిని ఫిరా ఫికానెట్గా కొలుస్తారు. విజయానికి చిహ్నంగా, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, వివాహం సందర్భంగా మహాగణపతిని పూజిస్తారు. గజాననుడి ప్రభావం థాయ్ కళ, వాస్తుశిల్పంలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గణపతి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కాంబోడియాలో ఆగ్నేయాసియా అంతటా మన విఘ్నరాజును పూజిస్తారు. ఈ సంప్రదాయ ఈ ప్రాంతానికి ఎలా వచి్చందనేది మాత్రం తెలియడం లేదు. ఐదు, ఆరో శతాబ్దాలకు చెందిన గణాధ్యక్షుడి శాసనాలు, చిత్రాలు ఆగ్నేయాసియాలో ఉన్నాయి. కంబోడియాలో గణా«దీశుడు ప్రధాన దైవం. ఏడో శతాబ్దం నుంచి ఆయనను దేవాలయాలలో పూజించారు. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ దేవుడికి ఉందని ఇక్కడ నమ్ముతారు. టిబెట్‌లో టిబెట్‌లోనూ మన మంగళప్రదాయుడిని బౌద్ధ దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ మహారక్త గణపతిగా, వజ్ర వినాయకుడిగా విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. భారతీయ బౌద్ధ మత నాయకులు అతిసా దీపంకర శ్రీజ్ఞ, గాయధర వంటివారు క్రీస్తుశకం 11వ శతాబ్దంలో టిబెట్ బౌద్ధమతానికి వినాయకుడిని పరిచయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. గణేశుడిని టిబెట్, మంగోలియాలో ఉద్భవించిన బౌద్ధమత రూపమైన లామాయిజం పుట్టుకతో ఈ దేశ పురాణాలు ముడిపడి ఉన్నాయి. ధర్మ రక్షకుడిగా, చెడును నాశనం చేసే శక్తిగా, అడ్డంకులను తొలగించే మూర్తిగా వినాయకుడిని బౌద్ధం బోధిస్తోంది. అందుకే ఇక్కడి గణపతి విగ్రహం దృఢంగా, బలమైన కండరాలు, కవచం, దంతాలు, ఆయుధాలతో అలరారుతుంటాయి. ఇతర టిబెటన్ దేవతల మాదిరిగా కోపం కొట్టొచి్చనట్లు ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో విగ్రహాలు కనిపిస్తాయి. ఇండోనేసియాలో.. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో కృతనాగర మహారాజు మాంత్రిక కర్మలలో అడ్డంకులను తొలగించే తాంత్రిక దేవతగా వినాయకుడిని పూజించారు. ఇది క్రీ.శ 14–15 వ శతాబ్దాల నాటికి ఇక్కడ అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధం, శైవ మతాల కలయికగా గణపతిని ఇక్కడ ఆరాధిస్తారు. పుర్రెలు ధరించి పుర్రెల సింహాసనంపై కూర్చున్న రూపంలో వినాయకుడు పూజలందుకుంటున్నారు. భారత్‌లో సాధారణంగా కనిపించే విగ్రహరూపాల్లోనూ గణపతిని ఇక్కడ పూజిస్తారు. తూర్పు జావా ప్రాంతంలోని తెన్గెర్ సెమెరూ జాతీయ వనంలోని బ్రోమో పర్వతం ముఖ ద్వారం వద్ద 700 సంవత్సరాలనాటి గణనాథుని విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని పేరు మీద ఈ పర్వతానికి బ్రోమో పేరు వచి్చంది. అగి్నపర్వతాల విస్ఫోటం నుంచి ఈ విగ్రహం తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.చైనా, అఫ్గానిస్తాన్‌లలో.. చైనాలో లంబోదరుడిని ‘హువాంగ్ సీ టియాన్’అని పిలుస్తారు. ఆయనను ఒక విఘ్నంగా భావిస్తారు. అఫ్గానిస్తాన్ రాజధా ని కాబూల్ సమీపంలోని గార్డెజ్‌లో క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దంలో చెక్కిన ప్రసిద్ధ వినాయ క విగ్రహం బయలి్పంది. గార్డెజ్ గణేశుడుగా పిలువబడే ఆయనను జ్ఞానం, శ్రేయస్సునందించే దేవుడిగా స్థానికులు ఆరాధిస్తారు. జపాన్‌లో.. గణాలకు అధిపతి అయిన వినాయకుడిని జపాన్‌లో కంగిటెన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడి వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, జూదగాళ్ళు, నటులు, ‘గీషా’లుగా పిలవబడే కళాకారి ణులు ఎక్కువగా గణేషుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ కొందరు ప్రత్యేకమైన రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తారు. ఈ వినాయక విగ్ర హంలో స్త్రీ, పురుష రూపాలు ఆలింగనం చేసుకు ని ఉంటాయి. జపనీస్ వినాయక రూపాల్లో ఒక రూపం నాలుగు చేతులతో, ముల్లంగి, మిఠాయి పట్టుకొని ఉండటం విచిత్రం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హాలీడే టూర్ : బుద్ధుని చెంత ప్రశాంతంగా బిగ్‌బాస్ ఫేమ్ వితికా షేరు (ఫోటోలు)
-
చేపపై యుద్ధం
ఎక్కడి జీవి అక్కడ ఉంటేనే ప్రకృతి సమతుల్యత సజావుగా ఉంటుంది. ఆఫ్రికా జలాశయాల్లో జీవించే చిన్నపాటి బ్లాక్చిన్ తిలాపియా చేప ఇప్పుడు థాయిలాండ్‌కు చుక్కలు చూపుతోంది. అక్కడి చిన్న చేపలు, రొయ్యలు, నత్త లార్వాలను గుటకాయ స్వాహా చేస్తోంది. అలా దేశ మత్స్య పరిశ్రమకు భారీ నష్టాలు తెచి్చపెడుతోంది. దాంతో వాటిపై థాయ్‌లాండ్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తిలాపియా చేప అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. వాటిని పట్టుకుంటే కేజీకి రూ.35 చొప్పున ఇస్తామంటూ జనాన్నీ భాగస్వాములను చేసింది. దాంతో జనం సైతమంతా తిలాపియా వేటలో పడ్డారు. గ్రామీణులు ప్టాస్టిక్ కవర్లు, వలలు చేతబట్టుకుని మోకాలి లోతు జలాశయాల్లో తిలాపియా వేటలో మునిగిపోయారు. దీనికి తోడు చెరువులు, కుంటలు, సరస్సుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసిన తిలాపియా చేపలను తినే ఆసియాన్ సీబాస్, క్యాట్ఫి‹Ùలనూ ప్రభుత్వం వదులుతోంది. ఆడ తిలాపియా చేప ఒకేసారి 500 పిల్లలను పెడుతుంది. దాంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఘనా నుంచి దిగుమతి! జంతువుల దాణా, రొయ్యలు, పౌల్ట్రీ, పంది మాంసం వ్యాపారం చేసే ఓ సంస్థ దిగుమతి చేసుకున్న తిలాపియా చేపలు చివరికిలా దేశమంతటినీ ముంచెత్తినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఏం చేసినా ఒక చేప జాతిని సమూలంగా అంతం చేయడం దాదాపు అసాధ్యమని స్థానిక జలచరాల శాస్త్రవేత్త డాక్టర్ సువిత్ వుథిసుథిమెథవే అంటున్నారు. ‘‘వేగవంతమైన పునరుత్పత్తి వ్యవస్థ ఉన్న చేపలను పూర్తిగా అంతం చేయడం మరీ కష్టం. బాగా ప్రయతి్నస్తే మహా అయితే వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అని అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!
హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అలకరించింది. అంతేగాదు జస్ట్ 37 ఏళ్లకే ప్రధాని అయిన మహిళగా చరిత్ర సృష్టించింది కూడా. ఎవరామె? ఆమె సక్సెస్ జర్నీ ఏంటంటే..ఆమె పేరు పేటోంగ్టార్న్ షినవత్రా. అతి పిన్న వయస్కురాలైన థాయి రెండో ప్రధానిగా చరిత్ర సృష్టించింది. గత ప్రధాని స్రెట్టా థావిసిన్ నైతిక ఉల్లంఘనలపై పదవీచ్యతుడు కావడంతో థాయ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె కొత్త ప్రధానిగా నామినేట్ అయ్యారు. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ముందు తమ కుటుంబ హోటల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత ఫ్యూ థాయ్ ఇన్‌క్లూజన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కమిటీ చీఫ్‌గా 2021లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉంగ్ ఇంగ్ అనే మారుపేరుతో పిలువబడే షినవత్రా తన కుటుంబంలో ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన మూడొవ కుటుంబ సభ్యుడు. అంతేగాదు ఆమె పార్టీ, దాని మిత్రపక్షాలు 493 సీట్లలో 319 కైవసం చేసుకోవడంతో పార్లమెంటులో భారీ విజయం సాధించారు. ఆమె 2023లో కూడా ప్రధాని మంత్రి పదవికి పోటీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా రవాణా ఛార్జీలను తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరింపజేయడం , కనీస రోజువారీ వేతనాన్ని రెట్టింపు చేస్తాం వంటి హామీలు ఇచ్చింది. అంతేగాదు తన తండ్రి పాలనలో అనుసరించిన విధానాలకు కొన్ని మార్పులు తీసుకురావాలనే దృక్పథంతో పనిచేయాలనుకుంటోంది షినవత్రా. ఆమె రిలాక్స్డ్ వ్యయ విధానాలతో వృద్ధిని పెంచి దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయనున్నట్లు తెలిపింది. ఇక ఆమె వాణిజ్య పైలట్ అయిన పిడోక్ సూక్సావాస్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ షినవత్రా అంకితభావంతో తన కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలన్నా ఆకాంక్ష ఆమెను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఆ క్రమంలో కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా పలు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!) -
థాయిలాండ్ ప్రధాని పీఠంపై పేటోంగ్టార్న్!
బ్యాంకాక్: థాయిలాండ్ రాజకీయాల్లో షనవత్రల మరో కుటుంబ వారసురాలు ప్రధాని పీఠాన్ని అధిష్టించడానికి రంగం సిద్ధమైంది. నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తరఫున అభ్యరి్థగా నిలబడిన నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర ఓటింగ్‌లో సాధారణ మెజారిటీకి కావాల్సిన 247 ఓట్లను దాటేశారు. దీంతో పేటోంగ్టార్న్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. దీంతో షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర ప్రధానమంత్రులుగా చేశారు. 37 ఏళ్లకే ప్రధాని పదవి చేపడుతున్న నేపథ్యంలో థాయిలాండ్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అతి పిన్క వయసు్కరాలిగా, రెండో మహిళగా రికార్డ్నెలకొల్పనున్నారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి బుధవారం థాయిలాండ్‌లోని రాజ్యాంగ ధర్మాసనం తప్పించిన విషయం విదితమే. -
థాయ్‌లాండ్ ప్రధానిగా పేటోంగ్టార్న్ ఖరారు!
బ్యాంకాక్: థాయిలాండ్ నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తమ అభ్యర్థిగా నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర పేరును నామినేట్ చేసింది. కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పత్రికా సమావేశంలో ఫ్యూ థాయ్ ప్రకటించింది. శుక్రవారం జరగబోయే పార్లమెంటరీ ఓటింగ్‌లో ఆమె గెలిస్తే షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర దేశ ప్రధాన మంత్రులుగా చేశారు. పేటోంగ్టార్న్ను ఏకగ్రీవంగా నామినేట్ చేశామని ప్యూ పార్టీ ప్రధాన కార్యదర్శి సొరవాంగ్ థియేన్థాంగ్ చెప్పారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి థాయిలాండ్ రాజ్యాంగ ధర్మాసనం తప్పించడం విదితమే. -
నైతిక ఉల్లంఘన: థాయ్‌లాండ్ ప్రధాని తొలగింపు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రిపై వేటు వేస్తూ.. రాజ్యాంగ న్యాయ స్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. నైతిక ఉల్లంఘన కేసులో స్రెత్తా తవిసిన్‌ను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. గతంలో జైలు శిక్ష అనుభవించిన న్యాయవాదిని మంత్రివర్గంలో నియమించటంతో థావిసిన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కోర్టు న్యాయమూర్తి పుణ్య ఉద్చాచోన్ అన్నారు. విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు తవిసిన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు.. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దేశ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పిచిత్ చుయెన్‌బాన్‌ను ప్రధాని కార్యాలయ మంత్రిగా తవిసిన్ నియమించారు. అయితే ఆయన 2008లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు సంబంధించిన న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఏప్రిల్‌లో పిచిత్ మంత్రిగా నియామకం జరిగిన నెల రోజుల తర్వాత దేశ మిలిటరీ నియమించి 40 మంది మాజీ సెనేటర్ల బృందం నైతిక ఉల్లంఘిన కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని తొలిగించిన అనంతరం కేబినెట్ తక్షణమే రద్దు చేయబడదని, థాయ్‌లాండ్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కేర్ టేకర్ ప్రధాని ఉంటారని అధికారులు పేర్కొన్నారు. -
Asia Cup 2024: బంగ్లా బౌలర్ల విజృంభణ.. తొలి విజయం నమోదు
మహిళల ఆసియా కప్ 2024లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్‌తో నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓటమి అనంతరం బంగ్లాదేశ్‌కు లభించిన తొలి విజయం ఇది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.బంగ్లా బౌలర్ల విజృంభణటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్.. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రబేయా ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టగా.. రీతూ మోనీ, సబికున్ నహార్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. థాయ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బూచాథమ్ (40), లవోమీ (17), రోస్నన్ కనో (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. దిలార అక్తెర్ 17, ఇష్మా తంజిమ్ 16 పరుగులు చేశారు. థాయ్ బౌలర్లలో పుత్తావాంగ్, ఫన్నిట మాయా తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లా తమ తదుపరి మ్యాచ్‌లో మలేషియాతో తలపడనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. శ్రీలంక చేతుల్లో ఓడింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా వరుస స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుండగా.. పాకిస్తాన్, నేపాల్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా ఇవాళ (జులై 23) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. -
శ్రీలంక, థాయిలాండ్ విజయం
దంబుల్లా: మహిళల ఆసియా కప్ టోరీ్నలో శనివారం శ్రీలంక, థాయిలాండ్ జట్లు విజయాలు నమోదు చేశాయి. మాజీ చాంపియన్ బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం లంక 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విష్మీ గుణరత్నే (48 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా...హర్షిత సమరవిక్రమ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించింది. మరో మ్యాచ్‌లో థాయిలాండ్ 22 పరుగుల తేడాతో మలేసియాపై విజయం సాధించింది. ముందుగా థాయిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ననపట్ కొంచరోంకయ్ (35 బంతుల్లో 40; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించింది. ఆ తర్వాత మలేసియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేయగలిగింది. వాన్ జూలియా (53 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించినా మిగతావారంతా విఫలమయ్యారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నేడు జరిగే తమ రెండో మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తమ తొలి పోరులో పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. -
థాయ్‌లాండ్‌లో పాట
హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ థాయ్‌లాండ్‌లో చిందేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై అక్కడ ఓ పాటని చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ మూవీ ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్‌ని థాయ్‌లాండ్‌లో ప్లాన్ చేశారు కొరటాల శివ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై ఓ సాంగ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్, ఈ నెల 16న ముంబై నుంచి జాన్వీ కపూర్ థాయ్‌లాండ్‌కి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ‘పఠాన్, వార్, ఫైటర్’ వంటి చిత్రాల్లో మంచి స్టెప్స్‌ను కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకి నృత్యరీతులు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు బాస్కో మార్టిస్. హై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరు«ద్. -
చలో థాయ్‌లాండ్
హీరో ఎన్టీఆర్ థాయ్‌లాండ్‌కి పయనమయ్యారు. ‘దేవర’ మూవీ తాజా షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్‌ను గోవాలో పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్ చేరుకుంది చిత్రబృందం. తర్వాతి షెడ్యూల్ కోసం సోమవారం ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ ప్రయాణం అయ్యారు.ఆయనతోపాటు భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్, భార్గవ్ కూడా ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘దేవర’ షూటింగ్లో పాల్గొనేందుకు జాన్వీ కపూర్ కూడా ఆదివారం సాయంత్రం థాయ్‌లాండ్‌కు బయలుదేరారు. అక్కడ ఎన్టీఆర్, జాన్వీలపై ఓ పాటతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట కొరటాల శివ. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ తొలి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
థాయిలాండ్‌లో అద్భుతం
అయూథలా: గజరాజును అత్యంత పవిత్రంగా భావించే థాయిలాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. అరుదుగా సంభవించే కవలల జననానికి వేదికైంది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. థాయిలాండ్‌లోని అయూథలా ప్రావిన్స్‌లోని అయూథలా ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల ఛామ్చూరీ శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్చూరీ మళ్లీ నొప్పులు పడటం అక్కడి మావటి, సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది. అతి కష్టమ్మీద ఆడ గున్న బయటకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడ గున్నను కింద నుంచి తీయలేదు. ‘‘పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా?. అందుకే వెంటనే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లిఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశా. కానీ అంతలోనే ఏనుగు పడిపోవడంతో నా కాలు విరిగింది. పసికూనను కాపాడాను అన్న ఆనందంలో నాకు కాలు విరిగిన బాధ కూడా తెలీలేదు. ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసింది’ అని 31 ఏళ్ల మావటి చరిన్ సోమ్‌వాంగ్ నవ్వుతూ చెప్పారు. ‘‘ నేనూ ఇదే ఏనుగుల ప్యాలెస్, రాయల్ ప్రాంగణంలో పుట్టి పెరిగా. కవలల జననాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇంతకాలానికి ఇలా కుదిరింది. ఏనుగుల్లో కవలల జననం కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇక ఆడ,మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయం’’ అని అక్కడి వెటర్నరీ మహిళా డాక్టర్ లార్డ్థోంగ్టేర్ మీపాన్ చెప్పారు. డాక్టర్ మీపాన్కు కూడా కవల పిల్లలున్నారు. కవల గున్నల జననం వార్త తెలిశాక స్థానికులు తండోపతండాలుగా ఏనుగుల పార్క్‌కు క్యూ కట్టారు. 60 కేజీల మగ, 55 కేజీల ఆడ గున్నలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. -
హనుమాన్ నటి పెళ్లి.. ఆ దేశంలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం నికోలాయ్ సచ్దేవ్ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇటీవల కోలీవుడ్ ప్రముఖలను కలిసి వెడ్డింగ్ కార్డ్స్ సైతం పంపిణీ చేస్తోంది. రజినీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.వరలక్ష్మి, నికోలాయ్ సచ్దేవ్ వివాహం థాయ్‌లాండ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. జూలై 2న ఈ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్‌ను చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది. -
భారత్‌లో జెన్‌జెడ్‌లు..థాయ్‌లాండ్‌ను చుట్టేస్తున్నారు
భారత్ యువత అవకాశం దొరికినప్పుడల్లా థాయ్‌లాండ్‌కు క్యూకడుతున్నారంటూ పాపులర్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎయిర్‌బీఎన్‌బీ డేటా ప్రకారం.. 2022- 2023లో భారతీయులు 60 శాతం కంటే ఎక్కువ మంది టూరిస్ట్‌లు థాయ్‌లాండ్‌లో తమ సంస్థ రూముల్ని బుక్ చేసుకున్నారని తెలిపింది.హోలీ,ఈస్టర్ సమయంలో భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. వారం రోజుల పొడువున జరిగిన ఈ ఫెస్టివల్లో థాయ్‌లాండ్‌కు వచ్చే భారతీయులు 200 శాతం కంటే ఎక్కువ పెరిగారని ఎయిర్‌బీఎన్‌బీ డేటా హైలెట్ చేసింది.భారతీయులు థాయ్‌లాండ్ ఆకర్షితులయ్యేందుకు పెరిగిపోతున్న జనాభ, ప్రయాణలపై మక్కువతో పాటు ఇతర కారణాలున్నాయని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో జెన్‌జెడ్ యువత ఎక్కువగా ఉందని, కాబట్టే వారికి థాయ్‌లాండ్‌తో పాటు ఇతర ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనే ధోరణి పెరిగినట్లు వెల్లడించింది.దీనికి తోడు రెండు దేశాల పౌరులకు థాయ్ ప్రభుత్వం వీసా మినహాయింపును పొడిగింపు టూరిజంకు ఊతం ఇచ్చినట్లైందని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ అన్నారు.a ఇక థాయ్‌లాండ్‌లో భారతీయలు బ్యాంకాక్,ఫుకెట్,చియాంగ్ మై,క్రాబి,స్యామ్యూయి ప్రాంతాలున్నాయి.ఎయిర్బీఎన్బీఅమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలందిస్తోంది.జెన్‌జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిని జనరేషన్ జెడ్ (జెన్ జెడ్)గా పరిగణిస్తారు. -
థాయ్‌లాండ్ వీసా నిబంధనల్లో మార్పులు
పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రభుత్వ ప్రతినిధి చాయ్ వాచరోంకే మాట్లాడుతూ..‘పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్ వీసా గడువు పెంచాం. దాంతోపాటు ఇతర దేశాలనుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్ వర్కర్లు, పదవీవిరమణ పొందిన వారికి సంబంధించి వీసాలో మార్పులు చేశాం. జూన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. గతంలో థాయ్‌లాంట్ వచ్చే పర్యాటక దేశాల సంఖ్యను 57 నుంచి 93కు పెంచాం. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలి. ఆన్-అరైవల్ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించాం. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను సడలించాం. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఒక సంవత్సరం అదనంగా ఉండవచ్చు. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేకవీసాలు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ సంవత్సరం జనవరి నుంచి మే 26 వరకు 14.3 మిలియన్ల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌ను సందర్శించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 పూర్తి ఏడాదికిగాను రికార్డు స్థాయిలో 40 మిలియన్ల విదేశీ రాకపోకలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో 3.5 ట్రిలియన్ భాట్లు (రూ.7.9లక్షల కోట్లు) దేశఖజానాకు చేరుతుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో థాయ్‌లాండ్‌కు 39.9 మిలియన్ల మంది రాకపోకలు సాగించారు. -
మహిళ ముక్కులో వందలకొద్ది పురుగులు!కంగుతిన్న వైద్యులు
ఇటీవల కంటి నుంచి పురుగులు పడటం, పొట్టలో పురుగులును గుర్తించి తీయడం విన్నాం. అంతవరకు బాగానే ఉంది. కలుషిత ఆహారం లేదా శుభ్రత పాటించకపోవడం వచ్చిందని అన్నారు వైద్యులు. కొందరూ కొన్ని రకాల జంతువులను తినడం వల్ల కూడా ఇలా జరుగుతుందని చెప్పారు. కానీ ఇక్కడొక మహిళ ముక్కులో ఒకటి రెండు కాదు ఏకంగా వందలకొద్ది పురుగులు బయటపడ్డాయి. వైద్యులు సైతం విస్తుపోయారు. ఈ భయానక ఘటన థాయిలాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..థాయిలాండ్‌కి చెందిని 59 ఏళ్ల మహిళ ముక్కు మూసుకుపోయి విపరీతమైన బాధని అనుభవించింది. ఒక వారం రోజుల నుంచి ముక్కు నుంచి రక్త కారడంతో భయపడి థాయిలాండ్‌లోని చియాంగ్ మాయిలోని నాకోర్న్సింగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు దుమ్ముకు సంబంధించిన ఎలర్జీగా భావించి సైనసైటిస్‌కు చికిత్స ఇవ్వడం జరిగింది. అక్కడ నివాసితలు అలెర్జీలు, రినిటిస్ వంటి శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల ఆ సమస్యగానే భావించి చికిత్స అందించారు. అందులో భాగంగానే ముక్కుకి స్కానింగ్ చేయగా..వందలకొద్ది పురుగులు కనిపించాయి. ఒక్కసారిగా వైద్యులు సైతం కంగుతిన్నారు. వెంటనే సదరు మహిళకు ఎండోస్కోపి ద్వారా ఆ పురుగులన్నింటిని తీసేశారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. ఒక వేళ వీటిని సకాలంలో గుర్తించి తొలగించనట్లయితే మెదడు వరకు ఈ పురుగులు వలసపోయి తీవ్రమైన సమస్యలు తలెత్తి మరణానికి దారితీస్తుందని అన్నారు. ఇలాంటి సమస్య సరైన శుభ్రత పాటింకపోవడం వల్లే వస్తుందని అన్నారుఆమె రెండు నాసికా కుహరాల్లో వందలకొద్ది పురుగులు ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. ఎక్స్‌రే తీసినప్పుడూ ఆమె ఎడమ జెగోమాటిక్ సైనస్లో తెల్లటి మచ్చ ఉండటంతోనే పురుగులు ఉన్నాయన్న అనుమానం వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, ఇలాంటి అరుదైన కేసు 2022లో పోర్చుగల్‌లో నమోదయ్యింది. అక్కడ ఒక వృద్ధుడి చెవిలో మాంసంతినే పురుగులును గుర్తించి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. (చదవండి: అత్యధిక మిలియనీర్స్ ఉన్న భారతీయ నగరం ఇదే..!) -
కరుడుగట్టిన స్క్రాప్ మాఫియా డాన్, ప్రియురాలి అరెస్ట్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా డాన్ రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాను పోలీసులు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని కోసం నోయిడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు రవి కానా, కాజల్ ఝా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు.నోయిడా పోలీసులు థాయ్‌లాండ్ పోలీసులతో నిత్యం టచ్‌లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రవీంద్రనగర్‌లో 16 మంది గ్యాంగ్స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్ మెటీరియల్ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్ మెటీరియల్ డీలర్ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి అనాతి కాలంలోనే కోట్లు సంపాదించాడు. దొంగతనం, కిడ్నాపింగ్‌కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్ గోడౌన్లను గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్‌లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్ అయ్యారు.ఇటీవల రవి కానా, అతని భాగస్వాములకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. రవి తన గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాకు బహుమతిగా ఇచ్చిన రు.100 కోట్ల బంగాళాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దక్షిణ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉంది. దీనిని కాజల్ ఝా పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. గౌతంబుద్ధనగర్, బులంద్ షహర్లలో కూడా దాదాపు రూ.350 కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.ఉద్యోగం కోసం గ్యాంగ్‌స్టర్ రవిని సంప్రదించిన కాజల్ ఝా తర్వాత అదే గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా మారారు. ఇక.. ఈ గ్యాంగ్, రవికి సంబంధించిన అన్ని బినామీ ఆస్తులకు ఆమె ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. -
కోతి... కొబ్బరి కాయ!
కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా? అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా! కానీ మీరోసారి థాయ్‌లాండ్, మరీ ముఖ్యంగా... దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి... మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!! విషయం ఏమిటంటే... థాయ్‌ల్యాండ్‌లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం. థాయ్‌ల్యాండ్ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి. నాణేనికి మరోవైపు... కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్‌లాండ్ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ. పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతులకు పెట్టింది పేరు... థాయ్‌లాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్‌లాండ్ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా? -
థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!
థాయిలాండ్‌లో ఒక రామరాజ్యం ఉంది అనేది మనలో చాలామందికి తెలియదు. మన దేశంలో ఉన్నట్లే అక్కడ ఒక అయోధ్య ఉంది. అక్కడ అడుగడుగున రామరాజ్యమే కనిపిస్తుంది. వారి జాతీయగ్రంథం కూడా రామాయణమే. ఇవన్నీ వింటుంటే అది థాయిలాండ్ దేశమేనా..? అని ఆశ్యర్యంగా ఉంటుంది. అస్సలు మన రాముడితో వారికి సంబంధం ఎలా ఏర్పడింది?. మన రాముడి గొప్పతనం అక్కడ వరకు ఎలా వెళ్లింది..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం!. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండలోని 70, 71 & 73 సర్గలలో రాముని వివాహాన్ని, తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే. మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీ నది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా సీతారాములకు లవ కుశులు, ఊర్మిళా లక్ష్మణులకు అంగద చంద్రకేతులు, మాండవీభరతులకు పుష్కరుడు, తక్షుడనే వాళ్ళు, శృతకీర్తి శతృఘ్నులకు సుబాహువు, శతృఘాతకుడనే వాళ్ళు జన్మించారు. శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.. పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి, తక్షునకు తక్షశిల, అంగదునకు అంగదనగరం, చంద్రకేతునకు చంద్రావతిలను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగ వంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్‌లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణు భగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా! అందువలన వీళ్ళు తమ పేర్లచివర రామ్ అన్న పేరు తగిలించుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్అతుల్యతేజ్. థాయిలాండ్‌లోని మరో అయోధ్య.. థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో బ్యాంకాక్ అని అంటున్నాము కదా! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి. "క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి" థాయి భాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకో విశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. అంటే అర్థం..ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోధ్యలోనే నివసిస్తారు. థాయిలాండ్‌లో నేటికి రామరాజ్యం .. థాయిలాండ్‌లో 192 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వాళ్లనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులుగా భవించి గౌరవప్రదంగా చూస్తారు . రాజవంశం వారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూ ధర్మశాస్త్ర పరిజ్ఞానముంది. థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణ శక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మన దేశంలో లాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం. అంతేగదు రామాయణంలోని సన్నివేశాలతో నాటకాలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. ఇక ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు, హిందువులు అల్పసంఖ్యల్లో ఉన్నారు. అయితే బౌద్ధులు హిందూ దేవీ దేవితలను ఆరాధించటం విశేషం. థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి లుప్తమై పోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite ) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షి శాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణు భగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతే కాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు. థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి.. మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ, థాయిలాండ్ రారాజధానిలోని ఎయిర్ పోర్ట్‌కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణ భూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 5,63,000 స్క్వేర్ మీటర్. ఎయిర్ పోర్టు ముందు "సముద్ర మథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగర మథనాన్ని చూపిస్తుంది. మన పిల్లలకు, రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి. (చదవండి: రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?) -
బ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే..
ఒక్కోసారి ఆకాశాన్ని అందుకునే గొప్ప విజయాన్ని అందుకుంటాం. అందరిచేతే ఆహా ఓహో అనిపించుకుంటాం. ఇక్కడ గెలిస్తే సరిపోదు..ఆ విజయాన్ని నిలబెట్టుకునేలా మనం బిహేవ్ చేయాల్సి కూడా ఉంటుంది. లేదంటే ఈ బ్యూటీ క్వీన్‌లా అందరిముందే అబాసుపాలయ్యే గెలుపు కూడా నీరుగారిపోతుంది. అసలేం జరిగిందంటే..మలేషియాకు చెందిన అందాల భామ వీరూ నికా టెరిన్సిప్ 2023లో ఉండక్ న్గడౌ జోహోర్ టైటిల్‌ని గెలుచుకుంది. అయితే ఆమె ఇటీవల సెలవులకు ధాయ్‌లాండ్‌లో గడపడానికి వెళ్లింది. అక్కడకు వెళ్లడమే శాపమై టైటిల్‌ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే..అక్కడ ఆమె కొంతమంది మగవాళ్లతో కలిసి కురచ దుస్తులు ధరించి డ్యాన్సులు చేసింది. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో వివాదాస్పదంగా మారి సదరు బ్యూటీ క్వీన్ విమర్శలపాలయ్యింది. ఈ వార్త కాస్త కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్‌కి చేరండంతో.. ఈ వీడియోపై సీరియస్ అవ్వుతూ ఆమె ఆ టైటిల్‌ను అందుకునే అర్హత లేదని స్పష్టం చేసింది. వెంటనే కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు సదరు కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ పైరిన్ కిటింగన్ మాట్లాడుతూ..అందాల రాణి ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఏ మాత్ర సబబు కాదని అన్నారు. హుమినోడున్ రాష్ట్రానికి చెందిన అందాల రాణిగా టైటిల్ గెలుచుకుంది. అంటే.. ఆమె అపారమైన జ్ఞానానికి, సంస్కారానికి ప్రసిద్ధి అని అర్థం. పైగా పబ్లిక్ ఫిగర్. అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది. అలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడూ పద్ధతిగా నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆమె సాధారణ వ్యక్తి అయితే ఇదేం అంత పెద్ద సమస్యగా ఉండేది కాదని కూడా కిటింగన్ అన్నారు. అంతేగాదు ఆమె తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్రకు వెళ్లిందని మాకు అర్థమయ్యింది. కానీ ఇలాంటివి సహించేవి మాత్రం కావని అన్నారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కాకుండా ఉంటే ఆమెకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు అయినా అందరికీ ఇదొక హెచ్చరికలా ఉంటుందన్నారు. మళ్లీ ఇలాంటి దుస్సాహసాలకు ఎవ్వరూ యత్నించరని కిటింగన్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బ్యూటీ క్వీన్.. నా స్వంత ఇష్టంతోనే ఈ ఉండుక్ న్గడౌ అందాల పోటీలకు వెళ్లాను. అయినా ఈ టైటిల్ ఏమి ఒక వ్యక్తి పరిపూర్ణ విజయాన్ని నిర్ణయిస్తుందని భావించను. అయినప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి ఇచ్చేస్తాను ఈ టైటిల్‌ని. అలాగే ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగిందని ఒప్పుకుంటున్నా. అందుకు నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను నుంచి చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నా. అయినా ఈ విషయాన్ని భూతద్దంలా చూడొద్దు. దయచేసి ఇతర సమస్యలపై దృష్టిసారించండి. అలాగే ఈ ఘటనకు పూర్తి బాధ్యత నాదే, దీనికి నా స్నేహితులు, తల్లిదండ్రులను బాధ్యులుగా చెయ్యొద్దు. నా వివరణను యాక్సెప్ట్ చెయ్యడం, చెయ్యకపోవడం మీ ఇష్టం. గుండెల్లోంచి వస్తున్న మాటలు ఇవి. అయినా ఇంతవరకు ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. అని పోస్ట్‌లో పేర్కొంది. అందాల భామ వీరూ నికా టెరిన్సిప్. (చదవండి: రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!) -
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘థాయ్‌లాండ్’.. బీజేపీ విమర్శల దాడి
న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో న్యూయార్క్, థాయ్‌లాండ్‌ల ఫోటోలను ఉపయోగించారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు. 'రాహుల్ గాంధీకి ఇష్టమైన గమ్యస్థానం థాయిలాండ్' “కాంగ్రెస్ మేనిఫెస్టోలో నీటి నిర్వహణపై ఓ చిత్రం ఉంది. ఈ చిత్రం న్యూయార్క్‌లోని బఫెలో నదికి సంబంధించినది. తమ సోషల్ మీడియా ఛైర్పర్సన్ ట్విటర్ నుండి ఎవరు ట్వీట్ చేస్తున్నారో వారు ఇప్పటి వరకు దీన్ని గుర్తించలేకపోయారు. కానీ వారికి ఈ చిత్రాన్ని ఎవరు పంపారు? పర్యావరణ విభాగం కింద, రాహుల్ గాంధీకి ఇష్టమైన గమ్యస్థానమైన థాయ్‌లాండ్ నుండి ఒక చిత్రాన్ని పెట్టారు. వీటన్నింటినీ తమ మేనిఫెస్టోలో ఎవరు పెడుతున్నారు?’’ అని సుధాన్షు త్రివేది అన్నారు. 'విదేశీ ఫొటోలను అరువు తెచ్చుకుంటున్నారు' “తప్పు ఫోటోలు ఉపయోగించడం పెద్ద సమస్య కాదు. అయితే ఈ ఫోటోలు విదేశీ సంస్థలకు సంబంధించినవి. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి భారత్, ప్రధాని నరేంద్ర మోదీ పరువు తీస్తున్నారు. కానీ ఇప్పుడు వారు తమ మేనిఫెస్టో కోసం విదేశీ ఫోటోలను అరువు తెచ్చుకుంటున్నారు" అని విమర్శించారు. Looks like the Congress forgot that it is preparing a manifesto for India and not putting together a holiday itinerary for Rahul Gandhi! What else explains using picture of Thailand under the Environment section? It shouldn’t be a surprise if Rahul Gandhi dashes off to Thailand,… pic.twitter.com/5MsNTCjFuc — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 5, 2024 'రాహుల్ గాంధీ హాలిడే టూర్లా ఉంది' రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ మరో నేత అమిత్ మాల్వియా విరుచుకుపడ్డారు. "భారతదేశం కోసం మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని, రాహుల్ గాంధీ కోసం హాలిడే టూర్ షెడ్యూల్‌ను రూపొందించడం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది" అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ మరో హాలిడే ట్రిప్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని మాల్వియా ‘ఎక్స్’ పోస్ట్‌లో రాశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. మేనిఫెస్టోను రూపొందించడానికి విదేశీ ఏజెన్సీని నియమించారా అని ప్రశ్నించారు. -
బుద్ధుడి అవశేషాల ప్రదర్శన థాయ్‌లాండ్‌లో..
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్‌లాండ్‌లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్‌లాండ్‌లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్‌లాండ్‌కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శిష్యుల అస్థికలు కూడా.. బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్లో అస్థికలను కూడా థాయ్‌లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్‌లాండ్‌కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్‌కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్‌లాండ్‌కు పంపుతున్నారు. రెండోసారి థాయ్‌లాండ్‌కు.. బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్‌లాండ్‌కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్‌లాండ్‌కు పంపారు. -
థాయ్ మాజీ ప్రధానికి పెరోల్
బ్యాంకాక్: జైలు శిక్ష అనుభవిస్తున్న థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర(76) పెరోల్ మీద విడుదలయ్యారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వం అతడిని పెరోల్‌పై విడుదల చేసింది. మరో ఆరు నెలల్లో షినవత్ర శిక్ష ముగియనుంది. 15 ఏళ్ల ప్రవాసం వీడి గతేడాది దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి వెంటనే పోలీస్ ఆస్పత్రికి తరలించి నిర్బంధంలో ఉంచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షినవత్రకు అవినీతి ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో షినవత్ర కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 70 ఏళ్లు దాటి అనారోగ్యం బారిన పడినందున మిగిలిఉన్న జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి.. కనీసం చివరిచూపు చూసుకోనువ్వండి -
కొంపముంచిన స్టంట్: ఏకంగా 29వ అంతస్థు నుంచి
సోషల్ మీడియాకోసం చేసిన ఒక యువ స్కైడైవర్ సాహసం విషాదాంతమైంది. 29 అంతస్తుల అపార్ట్మెంట్ బ్లాక్ పైకప్పు నుండి డైవింగ్ చేస్తూన్న క్రమంలో 33 ఏళ్ల బ్రిటీష్ బేస్ జంపర్ ప్రాణాలను కోల్పోయాడు. థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంబ్రిడ్జ్‌షైర్‌కు చెందిన నాథీ ఓడిన్సన్ (33) శనివారం రాత్రి 29 అంతస్తుల భవనంపై నుంచి దూకాడు. ఈ సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో ముందు చెట్టును బలంగా ఢీకొట్టి, ఆ తరువాత నేలపై పడి దుర్మరణం పాలయ్యాడు. సోషల్ మీడియా కోసం చేసిన ఈ స్కై డైవింగ్ వీడియో స్టంట్ తీరని విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు ఈ ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. నేథన్ మృతి గురించి పోలీసులు బాంకాక్‌లోని బ్రిటన్ ఎంబసీకి సమాచారం అందించారు. నేథన్ కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి సాహసోపేత వీడియోలను నాతీస్ స్కై ఫోటోగ్రఫీ పేరుతో ఇన్‌స్టా, ఫేస్బుక్ పేజీల్లో గతంలో చాలానే షేర్ చేశాడు. అంతేకాదు ఇలాంటి సాహసాలు చేయాలనుకునే వారికి సాయపడుతూ ఉంటాడు కూడా. స్కైడైవింగ్‌లో ఎన్నోఏళ్ల అనుభవం ఉన్న ఓడిన్సన్ దుర్మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేశారు. నిబంధనల్లో నిర్లక్ష్యం వహిస్తే.. జరిగేది రామోజీ ఫిలిం సిటీ ఘటనే ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రమాదం తీవ్ర నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో దుర్మరణం పాలయ్యారు. లైమ్లైట్ గార్డెన్లో విస్టెక్స్ ఆసియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, భద్రతా ఏర్పాట్ల కొరత కారణంగా టెక్ సంస్థ సీఈవో సంజయ్ షా ప్రాణాలు పోయాయి. అలాగే ఈ సంస్ధ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథ్ అలియాస్ ఆసుపత్రి పాలైనారు. సమయానికి అంబులెన్స్ కూడా అందుబాటులోలేదని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి : రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు) View this post on Instagram A post shared by Nathy (@nathyskyphotography) -
థాయ్ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు
బ్యాంకాక్: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్‌ల్యాండ్ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌కు చెందిన మొంగ్కొల్ తిరఖోట్(30) ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్‌ల్యాండ్‌లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. -
థాయ్‌లాండ్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని సుప్రాన్ బురీ ప్రావిన్స్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కారి్మకుల మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఘటన జరిగినపుడు ఫ్యాక్టరీలో దాదాపు 30 మంది కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం వరిపొలాలకు పెట్టిందిపేరు. పచ్చని పొలాల మధ్య బుధవారం మధ్యాహ్నంవేళ దట్టమైన నల్లని పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌చేసింది. చైనీయుల నూతన సంవత్సరం వచ్చే నెలలో థాయిలాండ్‌లోనూ ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాణసంచాకు భారీగా డిమాండ్ పెరగడంతో పెద్దమొత్తంలో బాణసంచాను హడావుడిగా తయారుచేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. 18 మంది మృతి
బ్యాంకాక్: సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని తెలుస్తోంది. పేలుడు కారణమేంటన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది. ఇదీచదవండి.. కెనడానకు తగ్గిన భారత యువత -
విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో చెట్టును ఢీకొట్టిన బస్సు రెండుగా విడిపోయింది. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందారు. శిథిలాల్లో చిక్కుకున్న భాధితులను బయటకు తీశారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
థాయ్‌లాండ్‌లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మాదిరిగానే థాయ్‌లాండ్‌లో కూడా అయోధ్య ఉంది. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాకుండా ఇక్కడి రాజులను రాముని అవతారంగా భావిస్తారు. థాయ్‌లాండ్‌లోని ‘అయుతయ’ నగరానికి ప్రాచీన భారతీయ నగరమైన అయోధ్య పేరు పెట్టారు. ఇక్కడి రాజవంశంలోని ప్రతి రాజును రాముని అవతారంగా భావిస్తారు. థాయ్‌లాండ్ ‘అయోధ్య’కు సంబంధించిన వివరాలను 22 ఏళ్లుగా బోధనావృత్తి సాగిస్తున్న డాక్టర్ సురేష్ పాల్ గిరి వివరించారు. తాను థాయ్‌లాండ్‌లోని మతపరమైన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. థాయ్‌లాండ్ ఒకప్పుడు భారతదేశంలో భాగమని అన్నారు. మొదట్లో హిందూ ప్రాబల్యం ఉన్న ఈ దేశంలో కాలక్రమేణా బౌద్ధం ప్రవేశించి, దానిలోని అంశాలు హిందూమతంతో కలిసిపోయాయన్నారు. భారతదేశంలోని అయోధ్య , థాయ్‌లాండ్‌లోని అయోధ్య మధ్య గల పోలికల గురించి సురేష్ తెలియజేస్తూ.. భారత పూర్వీకుల సంప్రదాయాలు మరచిపోలేనివి అని అన్నారు. ఇప్పటికీ థాయ్‌లాండ్ ప్రజలు శ్రీరాముని పూజిస్తారన్నారు. ఇక్కడి రాజు ఈ నగరంలో కొన్ని హిందూ దేవాలయాలను కూడా నిర్మించారని తెలిపారు. ‘అయుతయ’కు 35 కిలోమీటర్ల దూరంలో విష్ణువు, బ్రహ్మ, శంకరుని ఆలయం ఉంది. ‘అయుతయ’ రాజు 'రామతిబోధి' (రాముడు) అనే బిరుదును కలిగి ఉండేవాడు. అయోధ్య రామాయణంలో శ్రీరాముని రాజధాని వర్ణనలో ‘అయుతయ’ పేరు కూడా కనిపిస్తుంది. అయుతయను 1767లో బర్మీస్ దళాలు దోచుకుని ఆ ప్రాంతాన్ని నాశనం చేశాయి. ఇది కూడా చదవండి: ‘ఆ భారతీయుడే న్యూయార్క్‌లో హత్యకు కుట్రపన్నాడు’ थाईलैंड के 'अयुत्या' शहर का नाम प्राचीन भारतीय शहर अयोध्या के नाम पर रखा गया है। यहां एक ऐसा राजवंश है जिसके हर राजा को राम का अवतार माना जाता है।(29.11) (वीडियो 'अयुत्या' शहर से है।) pic.twitter.com/h8zY64JzJ7 — ANI_HindiNews (@AHindinews) November 29, 2023 -
వీసా లేకుండానే వియత్నాంకి: టూరిస్టులకు బంపర్ ఆఫర్
థాయ్‌లాండ్, శ్రీలంక తరువాత వియత్నాం కూడా త్వరలోనే భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పనేంది. వీసా లేకుండా ఆ దేశంలో పర్యటించేందుకు భారతీయులకు అవకాశం కలగనుంది. టూరిస్టులను ఆకర్షించే పథకంలో భాగంగా ఈ యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే శ్రీలంక, థాయ్‌లాండ్ తర్వాత భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్న మూడో దేశంగా వియత్నాం అవతరించనుంది. వియత్నాం సంస్కృతి, క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి న్గుయిన్ వాన్ జంగ్, చైనా, భారత్ వంటి ప్రధాన మార్కెట్లకు స్వల్పకాలిక వీసా మినహాయింపులపై కీలక సూచన చేశారు. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చిన ఆయన కొంతకాలం పాటు ఈ మినహాయింపు నిచ్చేందుకు యోచిస్తోందని వియత్నాం వార్తా సంస్థ VnExpress నివేదించింది. 2023 ఏడాదిలో తొలి పది నెలల్లో, వియత్నాంను సందర్శించిన అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య దాదాపు 10 మిలియన్ల దాటింది. 2022 నుండి 4.6 రెట్లు పెరిగింది.కోవిడ్‌కు ముందు, వియత్నాంను సందర్శించిన ఇండియా టూరిస్టలు సుమారు 1,70,000 మంది . ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్ , ఫిన్లాండ్ జాతీయులు ప్రస్తుతం వీసా లేకుండా వియత్నాంలో ప్రయాణించవచ్చు. కాగా అక్టోబర్‌లో, థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 10 నుండి మే 10, 2024 వరకు ఆరు నెలల పాటు భారతదేశం, తైవాన్ నుండి పర్యాటకులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
‘వీలైతే నేను మలాల అవుతా’
72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం దక్కించుకోగా ఫస్ట్ రన్నరప్‌గా థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ నిలిచింది. అయితే ఈ పోటీల్లో ఆఖరి రౌండ్ ప్రశ్నలు చాలా ఆసక్తికరంగానూ గమ్మత్తుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అందాల భామలు తమదైన శైలిలో చెప్పి జడ్జిలను మత్రముగ్గుల్ని చేసి కీరిటాన్ని దక్కించుకుంటారు. ఇక్కడ ఈ ముగ్గుర్నీ ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఆ ప్రశ్నకు థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఊహించిన రీతిలో ఆమె నుంచి వచ్చిన సమాధానం అక్కడున్న వారిని షాక్ గురి చేయడమే గాక సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఇంతకీ పోర్సిల్డ్ ఏం చెప్పిందంటే..మిమ్మల్ని ఒక ఏడాది వేరొక మహిళల ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జిలు ప్రశ్నించగా..అందుకు పోర్సిల్డ్ తాను మలాలా యూసఫ్‌జాయ్‌ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది. ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఫేస్ చేసిందో మనకు తెలుసు. మహిళల విద్యకోసం పోరాడింది. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత బలంగా పోరాడింది మలాలా. అందువల్ల నేను ఎంచుకోవాల్సి వస్దే ఆమెను సెలక్ట్ చేసుకుంటానని సగర్వంగా చెప్పింది. ఐతే ఇదే ప్రశ్నకు కిరీటం దక్కించుకున్న నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ పోర్సిల్డ్ మాదిరిగానే మహిళల హక్కుల కోసం పాటుపడిన మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌ను ఎంచుకుంటాను చెప్పగా, మరో విశ్వసుందరి ఆస్ట్రేలియన్ మోరయా విల్సన్ మాత్రం తన తల్లిని ఎంచుకుంటానని చెప్పింది. ఆమె వల్ల ఈ రోజు ఇక్కడ వరకు రాగలిగానని, అందువల్ల తన తల్లిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇక్కడ థాయిలాండ్ భామ పోర్సిల్డ్ పాక్‌కి చెందిన ఐకానిక్ మహిళ, నోబెల్ శాంతి గ్రహిత మలాలా యూసుఫ్ జాయ్‌ని చెప్పడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఆమె సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించింది, ఆలోచింప చేసేలా ఉందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా సెంట్రల్ అమెరికా 1975 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించింది. FINAL Q&A starting with Thailand! @porxild#72ndMISSUNIVERSE #MissUniverse2023 @TheRokuChannel pic.twitter.com/w71IH4kEvY — Miss Universe (@MissUniverse) November 19, 2023 (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
టూరిస్టులకు థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్
పర్యాటకులకు థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని నిర్ణయించింది. సీజన్ సమీపిస్తున్నందున ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు థాయ్ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు. తాజా నిర్ణయంతో భారత్ తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చని అధికార ప్రతినిధి చై వచరోంకే తెలిపారు. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సీజన్లో 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ప్రయాణ రంగం ద్వారా వచ్చే ఆదాయంతో ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారిన బలహీన ఎగుమతులను లోటును భర్తీ చేయాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. కాగా థాయ్‌లాండ్‌కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్నుంచే ఎక్కువ పర్యాటకుల తాకిడి ఉంటుంది. జనవరి -అక్టోబర్ 29 మధ్య, థాయ్‌లాండ్‌కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు. తద్వారా దేశానికి భారీ ఆదాయమే సమకూరింది. 2019లో రికార్డు స్థాయిలో వచ్చిన 39 మిలియన్ల టూరిస్టుల్లో 11 మిలియన్లతో టాప్‌లోని లిచింది చైనా.ఈ నేపథ్యంలోనే అయిన కోవిడ్ తరువాత టూరిజం మార్కెట్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన చైనీస్ టూరిస్టుల కోసం సెప్టెంబరులో వీసా అవసరం లేకుండానే పరిమిత కాల పర్యటనకు అవకాశం కల్పించింది. -
భారీ విజయంతో భారత్ శుభారంభం
రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్‌లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 7–1తో నెగ్గింది. భారత్ తరఫున సంగీత కుమారి (29వ, 45వ, 45వ ని.లో) మూడు గోల్స్ చేయగా... మోనిక (7వ ని.లో), లాల్రెమ్సియామి (52వ ని.లో), సలీమా టెటె (15వ ని.లో), దీపిక (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. -
నేటి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ
స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు రాంచీలో మొదలవుతుంది. తొలి రోజు థాయ్‌లాండ్ జట్టుతో సవితా పూనియా కెపె్టన్సీలోని భారత జట్టు ఆడనుంది. మ్యాచ్ రాత్రి గం. 8:30 నుంచి జరుగుతుంది. చైనా, జపాన్, కొరియా, మలేసియా జట్లు కూడా ఈ టోరీ్నలో పోటీపడుతున్నాయి. థాయ్‌లాండ్‌తో మ్యాచ్ తర్వాత భారత్ 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్‌తో, నవంబర్ 2న కొరియాతో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు నవంబర్ 4న సెమీఫైనల్లో తలపడతాయి. నవంబర్ 5న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్–5 చానెల్లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
థాయిలాండ్‌లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్, హోటళ్లలో ఓన్లీ వెజ్!
మనకు దసరా నవరాత్రులు జరిగే సమయంలోనే థాయ్‌లాండ్‌లో ఏటా శాకాహార సంబరాలు జరుగుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 15న మొదలైన ఈ సంబరాలు అక్టోబర్ 24న ముగుస్తాయి. ఈ సంబరాలను ‘జయ్’ ఉత్సవాలు అని పిలుస్తారు. ఒకానొకప్పుడు మలయ్ సమ్రాజ్యాన్ని పరిపాలించిన తొమ్మిదిమంది చక్రవర్తుల పేరిట ఈ ఉత్సవాలను తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే ఆచారం మొదలైనట్లు చెబుతారు. థాయ్‌లాండ్‌లోని మిగిలిన ప్రాంతాల కంటే ఫుకేత్ నగరంలో ఈ సంబరాలు భారీ స్థాయిలో జరుగుతాయి. థాయ్లాండ్లోనే కాకుండా మలేసియా, ఇండోనేసియా, సింగపూర్లలో పెరనాకన్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనూ ఈ సంబరాలు జరుగుతాయి. తావో మత ఆచారాల ప్రకారం తొమ్మిదిరోజుల పాటు ఈ సంబరాలను ఘనంగా జరుపుకొంటారు. ఈ తొమ్మిదిరోజులూ మాంసాహారాన్ని ముట్టరు. పూర్తిగా శాకాహారమే భుజిస్తారు. ఈ సందర్భంగా దీక్షపూనే వారిలో కొందరు నాలుకకు, బుగ్గల్లోను పదునైన సూదులు, కత్తులు వంటి ఆయుధాలను గుచ్చుకుని ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఊరేగింపులు జరిగే వీథుల్లోను, ప్రార్థన మందిరాల వద్ద ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆహారశాలలను ఏర్పాటు చేస్తారు. ఈ ఆహారశాలల్లో చైనీస్ సంప్రదాయ శాకాహార వంటకాలను విక్రయిస్తారు. ఈ సంబరాలు జరిగే తొమ్మిదిరోజుల్లోనూ థాయ్‌లాండ్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు కూడా శాకాహార వంటకాలనే విక్రయిస్తాయి. పూర్తి శాకాహారమే విక్రయిస్తున్నట్లుగా హోటళ్లు, రెస్టారెంట్లపై పసుపు రంగు జెండాలను ఎగురవేస్తాయి. (చదవండి: తుమ్మెదల సైన్యంతో రాక్షసుడుని అంతమొందించింది కాబట్టే..) -
ఏషియన్ గేమ్స్‌లో మరో విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత
ఏషియన్ గేమ్స్ 2023లో మరో విధ్వంసకర సెంచరీ నమోదైంది. ఈసారి మలేషియా ఆటగాడు ప్రత్యర్ధి థాయ్‌లాండ్ బౌలర్లేను ఊచకోత కోసి శతక్కొట్టాడు. కొద్ది రోజుల ముందు మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఆటగాడు కుషాల్ మల్లా టీ20ల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (34 బంతుల్లో) బాదగా.. తాజాగా మలేషియా ఆటగాడు సయ్యద్ అజీజ్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శివాలెత్తి 126 పరుగులు చేశాడు. అజీజ్‌తో పాటు ముహమ్మద్ అమీర్ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విరన్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో మలేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అజీజ్ చేసిన సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో 12వ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. మలేషియా చేసిన స్కోర్ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మలేషియా రికార్డు స్కోర్ సాధించగా.. ఛేదనలో చేతులెత్తేసిన థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో థాయ్‌పై మలేషియా 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మలేషియా బౌలర్లలో అహ్మద్ ఫయాజ్, విజయ్ ఉన్ని, విరన్దీప్సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముహమ్మద్ అమిర్ అజిమ్ ఓ వికెట్ దక్కించుకుని థాయ్‌లాండ్‌ను దెబ్బకొట్టారు. థాయ్‌లాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రం అతికష్టం మీద రెండంకెల స్కోర్ చేయగా.. నొప్పొన్ సేనమోంత్రి చేసిన 15 పరుగులు ఇన్నింగ్స్ టాప్ స్కోర్‌గా నిలిచింది. ఈ క్రీడల్లో భారత్ మ్యాచ్ రేపు జరుగనుంది. టీమిండియా రేపు క్వార్టర్ ఫైనల్-1లో నేపాల్‌తో తలపడనుంది. -
థాయ్‌లాండ్‌తో భారత్ తొలి పోరు
రాంచీ: భారత్ వేదికగా తొలిసారి జరగనున్న మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జరిగే ఈ టోర్నీకి రాంచీ ఆతిథ్యమివ్వనుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలేసియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అక్టోబర్ 27న థాయ్‌లాండ్ జట్టుతో భారత్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. అనంతరం 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్‌తో, నవంబర్ 2న కొరియాతో భారత్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ నవంబర్ 4న, ఫైనల్స్ నవంబర్ 5న జరుగుతాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఆరుసార్లు జరిగింది. భారత్ 2016లో టైటిల్ గెలిచింది. 2010లో మూడో స్థానం పొందగా.. 2013, 2018లో రన్నరప్‌గా నిలిచింది. -
షినవత్రకు థాయ్‌లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
భారత మహిళల హాకీ జట్టుకు టైటిల్
సలాలా (ఒమన్): మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్ (ఐదుగురు ఆడే) టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. తద్వారా 2024 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7–2 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున జ్యోతి, మరియానా కుజుర్ రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ నవ్‌జ్యోత్ కౌర్, మోనికా టొప్పో, మహిమా చౌదరీ ఒక్కో గోల్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన జట్లు తలపడే తొలి హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ వచ్చే జనవరి 24 నుంచి 27 వరకు మస్కట్‌లో జరుగనుంది. -
థాయిలాండ్‌లో.. ‘సహకారం’లోనే మార్కెటింగ్
హన్మకొండ : థాయిలాండ్ దేశంలో సహకార రంగంలోనే వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ కొనసాగుతోందని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. సహకార రంగంలో స్థిరమైన ఫైనాన్సింగ్ వ్యూహాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అంశంపై థాయిలాండ్‌కు స్టడీ టూర్‌కు వెళ్లి వచ్చిన మార్నేని సోమవారం ‘సాక్షి’తో అక్కడి విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మన దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ ప్రత్యేక వ్యవస్థగా కొనసాగుతుంటే థాయిలాండ్‌లో సహకార రంగంలోనే కొనసాగుతుంది. మన దేశంలో చిన్నచిన్న కమతాల్లో వ్యవసాయం చేస్తుంటే థాయిలాండ్‌లో కమతాలు చాలా విశాలంగా ఉంటాయి. ఒక్కో వ్యవసాయ క్షేత్రం 30 నుంచి 50 ఎకరాల వరకు ఉంటుంది. కుటుంబం మొత్తం వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. ఆ దేశంలో పంట ఉత్పత్తులకు విలువ జోడింపు చేస్తారు. దీంతో రైతులకు అధిక ఆదాయం వస్తుంది. వరితోపాటు పండ్లు, కూరగాయలు వరితో పాటు, పండ్లు, కూరగాయల పంటలు సాగు చేస్తారు. పండ్లు, కూరగాయల సాగు పాలీ హౌజ్‌ల్లోనే చేస్తారు. పంట ఉత్పత్తులను రైతులే ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తారు. ప్రతి వ్యవసాయ క్షేత్రం కంపెనీని తలపిస్తుంది. భారత్‌లో 80 శాతం ఆధారపడితే థాయిలాండ్‌లో 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడుతారు. అక్కడ సాగునీటి వనరులు తక్కువ. మార్కెటింగ్ మన దగ్గర అంత సానుకూలంగా ఉండదు. అదే థాయిలాండ్‌లో సులువుగా ఉంటుంది. థాయిలాండ్ ప్రధానంగా పర్యాటక ప్రాంతంగా ప్రఖ్యాతి గాంచింది. మన దేశంలోనే కేంద్ర సహకారం పెరిగితే సహకార రంగం పురోభివృద్ధి సాధిస్తుంది. అధ్యయనానికి వస్తామన్నారు.. తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా గురించి చెప్పితే ఇలా కూడా ఉంటుందా అని థాయిలాండ్ దేశస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విష యం విన్న వారు తెలంగాణకు వచ్చి అధ్యయ నం చేస్తామని చెప్పారు. సహకార వ్యవస్థలో నూ తన విధానాలు తీసుకురావడానికి ఈ స్టడీ టూర్ కు వెళ్లాం. 22వ తేదీన బ్యాంకాక్‌లోని హోటల్ సెంట్రో వాటర్గేట్లో సమావేశమై వివిధ సహకార సంఘాల పనితీరు.. వ్యవస్థ విధి విధానాల పై చర్చించాం. రెండో రోజు బ్యాంకాక్‌లోని సహకార శాఖ కార్యాలయాలు, వాటి పనితీరును అఽ ద్యయనం చేశాం. మూడోరోజు బోతాంగ్ జిల్లా థాట్తంగ్లో గల పంటలను పరిశీలించాం. -
ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!
ఎన్నో గొప్పగొప్ప కళాఖండాల్ని చూశాం. ఎంతో వైవిధ్యభరితమైన కళాఖండాలతో తీర్చిన రాజభవనాలు, అలానాటి పూర్వీకుల ప్యాలెస్‌లు ఎన్నో మనల్ని మంత్రముగ్దుల్ని చేశాయి. అలానే ఇక్కడొక గొప్ప ప్యాలెస్ మనల్ని కట్టిపడేసేంత ఆకర్షణగా ఉంది. కన్నులు తిప్పుకోలేనంతా ఆకర్షణీయంగా ఉంది కూడా. కానీ అదేంటో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి ఇలాంటివి కూడా అత్యంత విలాసంగా కడతారు. అదీకూడా కేవలం దానికోసం ప్యాలస్ లాంటి భవనమా! అని నోరెళ్లబెట్టడం ఖాయం!. ఇంతకీ ఈ ప్యాలెస్‌ని పోలిన భవనం థాయ్‌లాండ్‌లో ఉంది. మనం ముందు బయట నుంచి చూడగానే..వావ్ భలే కట్టారు. ఏదో గుడి లేదా మహల్ అనే అనకుంటారు. లోపలికి వెళ్లి చేసేంత వరకు కూడా అదేంటో తెలియదు. తీరా వెళ్లాక ఓస్ దీని కోసమా అని ఒక్కసారిగా మనలోని హుషార్ అంతా ఆవిరైపోతుంది. అదే సమయంలో ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అయితే అదేంటంటే.. ఓ వాష్ రూమ్. దీన్ని అసాధారణ రీతిలో చాలా విలాసవంతంగా నిర్మించారు. ఆ ప్యాలస్ ఓ విలాసవంతంగా డిజైన్ చేసిన బాత్రూమ్. బంగారు రంగు డిజైన్‌తో ధగధగలాడిపోతున్న ఆభవనం ఓ భారీ బాత్రూమ్ అనే చెప్పాలి. బాత్రూం వెలుపల నిర్మాణ శైలి, తోట అన్ని అద్భుతంగా ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు వాహ్ చాలా అందంగా ఉందని ఒకరూ, మాటల్లో వివరించ లేనంత అద్భుతంగా ఉందని మరోకరూ ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఎలాగైన ఈ రాయల్ బాత్రూమ్ని సందర్శించాల్సిదేనని పలువురు నెటిజన్లు అనడం విశేషం. View this post on Instagram A post shared by 𝘒𝘳𝘪𝘴𝘩𝘢𝘯𝘨𝘪 || 𝘛𝘖𝘐𝘔𝘖𝘐 𝘛𝘈𝘓𝘌𝘚 (@krishangiisaikia) (చదవండి: ఆ ఊరిలో మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు!పుట్టిన మూడు నెలలకే..) -
పర్యాటకులతో సందడిగా ఉండే ఆ బీచ్..హఠాత్తుగా మూతపడింది!
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్‌గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్‌లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే.. థాయ్‌లాండ్‌లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్‌గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్‌గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది. రూ. 100 కోట్లకు పైగా ఆదాయం నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్‌ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్‌లాండ్‌కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్లో ప్రమాదం.. సంజయ్ దత్‌కు గాయాలు!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్) అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లో సంజయ్ దత్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా.. రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్‌కి తిరిగి వచ్చి షూటింగ్‌ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. (ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్) -
థాయ్‌లాండ్‌లో డబుల్
‘ఇస్మార్ట్ శంకర్’ (2019) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో రామ్ పొతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభించాం. ఈ షెడ్యూల్లో రామ్, నటుడు సంజయ్ దత్‌పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న మహా శివరాత్రికి విడుదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, కెమెరా: జియాని గియాన్నెల్లి. -
27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా?
బ్యాంకాక్: థాయ్ మహారాజు వజిరాలాంగ్కార్న్(71) రెండో కుమారుడు యువరాజు వచరేసార్న్ వైవాచారవాంగ్సే(42) సుమారు 27 ఏళ్ల తర్వాత రాజయానికి తిరిగొచ్చారు. ఆయనకు రాకను పురస్కరించుకుని స్వాగతం పలికేందుకు బ్యాంకాక్ సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీగా శ్రేయోభిలాషులు తరలి వచ్చారు. Vacharaesorn Vivacharawongse, a son of His Royal Highness King Vajiralongkorn who has been living in New York, has reportedly returned to Thailand. This was a video posted and widely shared on social media. pic.twitter.com/vYPNOdUBjs — Thai Enquirer (@ThaiEnquirer) August 6, 2023 న్యూయార్క్ లో ఒక న్యాయ సంస్థలో పనిచేస్తున్న వచరేసార్న్ వైవాచారవాంగ్సే చాలా కాలం తర్వాత తిరిగి రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతేడాది డిసెంబరులో థాయ్ మహారాజు పెద్ద కుమార్తె యువరాణి బజ్రకితీయాబా మహిడాల్(44)మైకో ప్లాసం ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ కోమాలో ఉన్నారు. ఆమెను పరామర్శించడానికి వచ్చారా లేక రాజా కుటుంబం వారసత్వాన్ని కొనసాగించడానికి వచ్చారా అన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. Vacharaesorn Vivacharawongse, a son of His Royal Highness King Vajiralongkorn, expressed during his visit to the 2infamily Foundation, a foundation for child care in Khlong Toei, that returning to #Thailand after 27 years of living abroad was like a dream come true. He stated… pic.twitter.com/lZ4h4WLCIV — Thai Enquirer (@ThaiEnquirer) August 8, 2023 ఇదిలా ఉండగా యువరాజు థాయ్‌లాండ్ వస్తూనే ఓ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొని నిర్భాగ్యులైన పిల్లలను, నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మరుసటి రోజున ఆయన దేశం(రాజ్యం)లోని ఎమరాల్డ్ బుద్ధుడి దేవాలయం తోపాటు అనేక దేవాలయాలను సందర్శించారు. రాత్రి ఒక ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ ఫోటో తీసుకున్న ఆయన దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కింద 'బ్యాంకాక్ టుక్ టుక్' అని క్యాప్షన్ కూడా రాశారు. థాయ్‌లాండ్ మహారాజు వజిరాలాంగ్కార్న్ కు నలుగురు భార్యలు ఏడుగురు సంతానం. 2016లో పట్టాభిషక్తుడైన ఆయన రెండో భార్య సుజరిణీ వైవాచారవాంగ్సేకు కలిగిన కుమారుడే వచరేసార్న్ వైవాచారవాంగ్సే. యువరాణి చాలాకాలంగా కోమాలో ఉండటంతో దుఃఖసాగరంలో ఉన్న రాజకుటుంబంలో యువరాజు రాకతో ఒక్కసారిగా సంతోషాలు వెల్లివిరిశాయి. ఇది కూడా చదవండి: భారత్‌లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్ -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి
World Richest Thailand King: ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న సంపన్నులను గురించి.. ప్రపంచంలోని కుబేరుల గురించి కూడా కొంత వరకు తెలుసుకున్నాం. అయితే ఈ రోజు అపారమైన సంపదను మాత్రమే కాకుండా వేల ఎకరాల భూమిని కలిగి, లెక్కకు మించిన వాహనాలను కలిగిన ఒక సంపన్న రాజును గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేల ఎకరాల భూమి.. నివేదికల ప్రకారం.. థాయ్‌లాండ్‌కు చెందిన మహారాజు 'మహా వజిరాలాంగ్కార్న్' (Maha Vajiralongkorn) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడని తెలుస్తోంది. ఈయన ఆస్తి సుమారు రూ. 3.2 లక్షల కోట్లు. అంతే కాకుండా వజ్రాలు, రత్నాలు వంటి వాటితో పాటు.. 16 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి కూడా వజిరాలాంగ్కార్న్ అధీనంలో ఉండేదని సమాచారం. ఖరీదైన డైమండ్.. భూముల విషయం పక్కనపెడితే మహా వజిరాలాంగ్కార్న్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన 545.67 క్యారెట్ బ్రయోన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఉండేదని.. దీని విలువ 12 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ (రూ. 98 కోట్లు) ఉంటుందని అంచనా, ఇది రాజు కిరీటంలో పొందుపరిచారు. వీటితో పాటు అపురూపమైన రాజ వాయిద్యాలు కూడా ఆయన వద్ద ఉండేవని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! విమానాలు, హెలికాఫ్టర్లు & కార్లు.. బంగారం, వజ్రాలు మాత్రమే కాకుండా.. వజిరాలాంగ్కార్న్ దగ్గర ఏకంగా 38 విమానాలు, లెక్కకు మించిన హెలికాఫ్టర్లు ఉండేవి. ఇందులో నాలుగు బోయిన్, మూడు ఎయిర్‌బస్ విమానాలు. వీటితో పాటు 300 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు వీరి గ్యారేజిలో ఉండేవి. కేవలం వాహనాలకు వినియోగించే ఫ్యూయెల్ ఖర్చు మాత్రం సంవత్సరానికి రూ. 524 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ రాజు ఎంత సంపన్నుడో ఇట్టే తెలిసిపోతుంది. ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు.. విశాలమైన ప్యాలెస్.. థాయ్‌లాండ్‌లోని గ్రాండ్ ప్యాలెస్ విస్తీర్ణం ఏకంగా 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1782లో నిర్మించినట్లు సమాచారం. ఇది వారి వారసత్వానికి చిహ్నంగా చారిత్రాత్మక కట్టడంగా నిలిచింది. వజిరాలాంగ్కార్న్ రాజుని 'కింగ్ రామ ఎక్స్' అని కూడా పిలుస్తారు. -
జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన జ్యోతి యర్రాజీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. థాయిలాండ్ వేదికగా గురువారం జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ''వైజాగ్‌కు చెందిన జ్యోతి యర్రాజీకి నా శుభాకాంక్షలు. 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో అందరినీ గర్వపడేలా చేశారు.. కంగ్రాట్స్ జ్యోతి యర్రాజీ'' అంటూ ట్వీట్ చేశారు. ఇక థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. My congratulations and best wishes to our very own @JyothiYarraji from Vizag, on winning gold at the 25th Asian Athletics Championships held in Thailand. You’ve made us all very proud Jyothi! pic.twitter.com/mMvq0afPjG — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 చదవండి: జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?
బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
వీడెవండి బాబు! యవ్వనం కోసం.. రక్తం తాగేస్తున్నాడు!
అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ, వాటి కోసం పడే పాట్లు, ఎంచుకునే దారులే వేరు. కొంతమంది వ్యాయామం చేస్తే, మరికొంతమంది కాస్మోటిక్స్ ట్రై చేస్తుంటారు. అయితే, థాయ్‌లాండ్‌కు చెందిన రోజాకోర్న్ నైనోన్ మాత్రం రక్తపిపాసిగా మారాడు. అలాగని డ్రాకులా మాదిరిగా మనుషుల రక్తాన్ని పీల్చేయడం లేదు గాని, మొసళ్ల రక్తాన్ని మద్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు. నవయవ్వన రూపాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనికి సుమారు 12 లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫారమ్ ఉంది. వాటి చర్మం, రక్తం, మాంసాలతో వ్యాపారం చేస్తుంటాడు. అయితే, ఒకరోజు శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉన్న, తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసిందట. ఇక అప్పటి నుంచి రోజూ ఉదయం, రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు. అది కూడా కేవలం మూడు, నాలుగు ఏళ్ల మొసళ్ల రక్తం మాత్రమే! ‘మొసళ్లు బలంగా ఉన్నప్పుడే వాటి రక్తం అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుంది. పైగా, మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం. అందుకే, మొసలి రక్తంలో ‘లావోఖానో’ అనే థాయ్ మద్యాన్ని కలిపి కాక్టెయిల్ చేసుకొని రెండు పూటలా సేవిస్తాను’ అని కోర్న్ చెప్పాడు. ఈ మధ్యనే ఈ కాక్టెయిల్ను ఒక పెగ్ ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడు కోర్న్. చదవండి: బామ్మ వయసు 73.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది! -
ప్రజాతీర్పుకు పట్టం కట్టాలి!
అణిచివేత ఎక్కువైనప్పుడు ఆగ్రహం వస్తుంది. ఎన్నికలు జరిగినప్పుడు మార్పును కోరుతూ ప్రజా సందేశాన్ని మోసుకొస్తుంది. ఆదివారం థాయిలాండ్‌లో జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళి అందుకు తాజా ఉదాహరణ. సైన్యం కనుసన్నల్లో నడుస్తున్న, మరోమాటలో సైన్యమే తొమ్మిదేళ్ళుగా నడుపుతున్న ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి, ఆగ్రహం స్పష్టంగా బయటపడింది. మార్పు కోరుతూ థాయిలాండ్ ఓటర్లు తీర్పునిచ్చారు. అలా 2020లో విద్యార్థుల నేతృత్వంలో సాగిన ప్రజాస్వామ్య అను కూల భారీ నిరసన ఉద్యమాల తర్వాత జరిగిన తొలి జనరల్ ఎలక్షన్ ఫలితం అపూర్వం. దేశ రాజకీయాల్లో మిలటరీ, రాయల్టీ ప్రాబల్యాన్ని సామాన్యులు నిరసించడం అక్కడి ప్రజాస్వామ్యవాద శక్తులకు సంతోషకరమే. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ పాలకులందరికీ గుణపాఠమే. 6.5 కోట్ల జనాభా గల థాయిలాండ్‌లో 5.2 కోట్ల మందికి ఓటు హక్కుంది. రానున్న నాలుగేళ్ళ కాలానికి 500 స్థానాల ప్రజా ప్రతినిధుల సభకు సభ్యులను ఎన్నుకొనేందుకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. సుమారు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఛాయిస్ ఏమిటో చెప్పేశారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలైన ఫ్యూథాయ్, మూవ్ ఫార్వర్డ్ పార్టీలు రెండూ అధికార పార్టీని మట్టి కరిపించాయి. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల శిబిరాలు విజయం సాధిస్తాయని ముందస్తు ప్రజాభిప్రాయ సేకరణల నుంచి ఊహిస్తున్నదే. కానీ, ఈ స్థాయి విజయం అనూహ్యం, అద్భుతమే. పట్టణప్రాంతాల్లో పట్టున్న, ప్రగతిశీల ‘మూవ్ ఫార్వర్డ్’ 151 స్థానాలతో అగ్రపీఠిన నిలుస్తుందని అంచనా. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పదవీచ్యుత ప్రధానమంత్రి తక్షిణ్ శినవాత్ర తరఫున జనాకర్షక రాజకీయ పక్షమైన ‘ఫ్యూథాయ్’కి 141 స్థానాలు రావచ్చని లెక్క. అయితే, అధికార శక్తులు ఈ ఫలితాలను అంగీకరించి, ఈ సంస్కరణవాద పార్టీలు ప్రభుత్వం ఏర్పరిచేలా గద్దెను అప్పగిస్తాయా అన్నదే ప్రశ్న. గత∙రెండు దశాబ్దాల్లో స్వేచ్ఛగా ఎన్నికలైన ప్రతిసారీ తక్షిణ్ నేతృత్వంలోని పార్టీలు గెలుస్తూ వచ్చాయి. సైన్యం మాత్రం కోర్టు జోక్యంతోనో, తిరుగుబాట్లతోనో వారిని పదే పదే అధికారానికి దూరం పెడుతూ వచ్చింది. నిండా 36 ఏళ్ళ తక్షిణ్ కుమార్తె ఇంగ్లక్ ఇప్పుడు ‘ఫ్యూథాయ్’ పార్టీని నడుపుతున్నారు. అయితే, వారసత్వ రాజకీయాలతో విసిగిన లక్షలాది తొలి యువ ఓటర్లు ‘మూవ్ ఫార్వర్డ్’ వైపు మొగ్గడంతో, ఆ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కుతున్నాయి. విదేశాల్లో చదివి, వ్యాపార నిమిత్తం తిరిగొచ్చి, సైనికపాలన, రాజరికానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న 42 ఏళ్ళ పిటా లిమ్జాయోన్రత్కు ఎన్నికల్లో జనం జై కొట్టారు. ఈ నేతలిద్దరూ సైన్యానికి ఎదురొడ్డిన ధనిక వ్యాపార కుటుంబాల వారే కావడం గమనార్హం. ఇక, చిన్నాచితకా ప్రతిపక్షాలు సైతం ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం విశేషమే. ఈ ప్రజాస్వామ్య అనుకూల పార్టీలన్నీ కలసి సంకీర్ణ సర్కార్‌గా పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాయట. అలా అన్నీ ఒక తాటిపైకొస్తే సైనిక పాలన, రాచరికపు అపరిమిత అధికారాలకు చరమగీతం పాడాలన్న జనం కోరిక నెరవేరుతుంది. కానీ, పార్టీలు అనుకున్నంత మాత్రాన జరగాలని లేదు. 2019 ఎన్నికల్లో నేటి ‘మూవ్ ఫార్వర్డ్’ పార్టీ ముందస్తు రూపం ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ మూడోస్థానంలో నిలిచింది. తీరా పార్టీ సారథిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించారు. పార్టీ రద్దయింది. ఇప్పుడు ప్రధాని కావాలని ఆశిస్తున్న ‘మూవ్ ఫార్వర్డ్’ నేత పిటాకు సైతం ఎన్నికైన ఎంపీల మద్దతుతో పాటు సైన్యం నియమించిన సెనేటర్ల మద్దతు అవసరం. ఎన్నికల్లో గెలిచినా సరే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు అవసరం కావడమే థాయ్ లోని విచిత్రం. ఇదంతా ఎన్నికల్లో గెలిచిన పార్టీల అధికారాన్ని సైతం తటస్థీకరించేలా, సెనేట్ను నియమిస్తూ 2017లో రాజ్యాంగాన్ని సైన్యం తిరగరాసిన ఫలితం. 2014లో జనరల్ ప్రయూత్ చాన్ – ఓచా అప్పటి పౌరప్రభుత్వాన్ని పడదోసి, సైన్యం, రాయలిస్ట్ పార్టీలు, రాచరికపు అండతో తనను తాను ప్రధానిగా నియమించుకున్నారు. న్యాయవ్యవస్థ సహా అన్నిటినీ విధేయులతో నింపేశారు. ఇటు నిరుపేద థాయ్లను ఆకర్షించే ఫ్యూథాయ్ పార్టీ అన్నా... అటు నిర్బంధ సైనిక శిక్షణ, రాజు – రాణులను పల్లెత్తు మాటన్నా 15 ఏళ్ళ దాకా జైల్లోకి నెట్టే కఠినమైన ‘లెస్–మాజెస్టీ’ చట్టాలకు చరమగీతం పాడతానంటున్న మూవ్ ఫార్వడ్ పార్టీ అన్నా... సహజంగానే సైన్యానికి గిట్టదు. కానీ, రాచరిక అనుకూల చట్టాలను మారుస్తానంటున్న పార్టీకి నవతరం థాయ్ ప్రజలు జేజేలు పలకడం ఈ ఆగ్నేయాసియా దేశంలో ప్రజాస్వామ్య మార్పు పవనాలకు సూచన. ఇది గ్రహించి సంప్రదాయ శక్తులు పట్టు సడలిస్తాయా? జనం ఎన్నుకున్న 500 సభ్యుల ప్రతినిధుల సభతో పాటు పాలక సైనిక వర్గమే నియమించిన 250 మంది సభ్యుల సెనేట్కూ ప్రధాని ఎంపికలో ఓటు ఉండడమే విషాదం. అంటే ఎన్నికల్లో పెల్లుబికిన ప్రజాస్వామ్య వెల్లువను సైతం సైన్యం పరోక్షంగా తొక్కేసే ముప్పుంది. ఇన్నేళ్ళుగా దేశాన్ని తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్న సైనిక జనరల్స్ తాజా ప్రజా తీర్పును గౌరవించాలి. అధికారాన్ని గెలిచిన పార్టీలకు అప్పగించి, సైనిక విధులకు పరిమితం కావాలి. ఆ పని చేయక, ప్రజాకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది థాయిలాండ్‌కే మంచిది కాదు. పొరుగునే మయన్మార్‌లో 2020 నవంబర్ ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూక్యీ అఖండ విజయం సాధించినా, మూడునెలల్లో సైన్యం అధికారం హస్తగతం చేసుకొని, ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఆ దేశంలా థాయ్‌లాండ్ తయారు కాకుండా ప్రపంచ దేశాలూ జాగరూకత వహించాలి. అప్పుడే థాయ్ ప్రజలు గెలిచినట్టు, అక్కడ ప్రజాస్వామ్యం నిలిచినట్టు!