
ఇతిహాసాన్ని శక్తివంతమైన కథగా చెప్పడం, సాంస్కృతిక నేపధ్యంతో దానిని సజీవంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కళాకారుడికి అత్యంత సాహసోపైతమైన చర్య. దీనిని థాయ్‌లాండ్ కళాకారులు మన ఇతిహాసాన్ని తమ సంప్రదాయ కళారూపంతో మన దేశ రాజధానిలో ప్రదర్శించనున్నారు.
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సహకారంతో రాయల్ థాయ్ ఎంబసీ ఖోన్ థాయ్ మాస్క్‌డ్ డ్యాన్స్ డ్రామాను న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఫిబ్రవరి 7, 2025న సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లోని భీమ్ హాల్‌లో జరుగుతుంది.
థాయిలాండ్ అత్యంత గౌరవనీయమైన కళారూపాలలో ఒకటైన ఖోన్, శాస్త్రీయ నృత్యం, లిరికల్ స్టోరీ టెల్లింగ్, ప్రత్యక్ష సాంప్రదాయ థాయ్ సంగీతాన్ని మిళితం చేస్తుంది. యునెస్కో చేత సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడింది. దుస్తులు, కొరియోగ్రఫీ, ఆధ్యాత్మిక వ్యక్తీకరణ ఈ నృత్యం ప్రత్యేకతలు.
వారియర్ హనుమాన్
ఈ ప్రదర్శనలో రామాయణం ఇతిహాసం నుండి హనుమాన్ ది మైటీ వారియర్ అనే ఎపిసోడ్ ఉంటుంది, ఇది హనుమంతుడి శౌర్యం, విధేయతను చూపే ఆకర్షణీయమైన కథ. ఈ కథ ఐదు దశలలో.. రావణుడిని ఓడించాలనే తపనతో రాముడికి సేవ చేయడానికి వాయు దేవుడు సృష్టించిన హనుమంతుడి దివ్య జననంతో ప్రారంభమవుతుంది.
కథ ముందుకు సాగుతున్న కొద్దీ, హనుమంతుడి బాల్య దుశ్చర్య, రాముడి ఆశీర్వాదంతో అతని బలం తిరిగి వస్తుంది. సీతను రక్షించడానికి అతని అచంచలమైన నిబద్ధతను ఇది అన్వేషిస్తుంది. హనుమంతుడు, రాముడు వారి మిత్రులు రావణుడిపై విజయం సాధించే యుద్ధంతో కథనం ముగుస్తుంది.
చారిత్రక సంబంధాలు
ఖోన్ థాయిలాండ్ రాజ ప్రాంగణాలలో భారతీయ ఇతిహాసం రామాయణంతో గల సంబంధం భారతదేశం– థాయిలాండ్ మధ్య గల లోతైన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. దీంతో పాటు తమ కళ ద్వారా వ్యక్తీకరణ హావభావాలు, శక్తివంతమైన కథ చెప్పడం తరతరాలుగా అందించిన గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది థాయ్ వారసత్వంలో ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారుతుంది.
భారతీయ ప్రేక్షకులకు థాయిలాండ్ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని చూపిస్తుంది. ఇది ఉమ్మడి వారసత్వం, కళాత్మకత, రామకీన్, రామాయణ ఇతిహాసాల ద్వారా ప్రతిధ్వనించే భక్తి, శౌర్యం, సార్వత్రిక ఇతివృత్తాల వేడుక. రాయల్ థాయ్ ఎంబసీ, ఐసీసీఆర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment