New Delhi
-
నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం
న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్‌పుట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఎక్స్ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు. -
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్‌లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్‌తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్‌యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్‌లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్‌ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
నేను దేవుణ్ని కాను...
న్యూఢిల్లీ: ‘‘తప్పులు చేయడం మానవ సహజం. తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తారు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నేను దేవుడిని కాదు. సామాన్య మానవుడినే. కాబట్టి నేను కూడా తప్పులు చేశా’’ అని అంగీకరించారు. అయితే తాను చేసిన తప్పుల్లో చెడు ఉద్దేశం ఏనాడూ లేదని స్పష్టం చేశారు. మనుషులు చేసే తప్పుల వెనుక ప్రమాదకరమైన ఉద్దేశాలు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. ‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు మోదీ ఆదివారం తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. తన రాజకీయ ప్రస్థానంతో సహా పలు అంశాలపై మనసు విప్పారు. తన జీవితంలోని అనేక దృక్కోణాలను ప్రస్తావించారు. తప్పులు చేస్తానని తాను తొలిసారి సీఎం అయినప్పుడే ప్రజలకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ తప్పుల్లో చెడు ఉద్దేశం మాత్రం ఉండదని వివరించానన్నారు. పాడ్‌కాస్ట్‌లో మోదీ ఏం చెప్పారంటే... గోద్రాలో భావోద్వేగాలు అదుపు చేసుకున్నా ‘‘గుజరాత్ సీఎం అయిన తొలినాళ్లలో ఓ సభలో మాట్లాడుతూ మూడు విషయాలు ప్రజలతో పంచుకున్నా. ‘‘నా కృషిలో ఏ లోపమూ లేకుండా జాగ్రత్త పడతా. నాకోసం ఏదీ చేసుకోను. మనిషిని కాబట్టి తప్పులు చేస్తా, కానీ వాటిలో చెడుద్దేశం ఉండబోదు’’ అని వివరించా. ఆ మూడూ నాకు జీవన మంత్రాలు! 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైలు దహనం గురించి తెలియగానే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. చూస్తే హెలికాప్టర్ అందుబాటులో లేదు. చివరకు బహుశా ఓఎన్జీసీకి చెందిన సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ సమకూర్చినా, అది వీఐపీలకు ఉద్దేశించింది కాదంటూ భద్రతా సిబ్బంది అభ్యంతరపెట్టారు. ‘నేను వీఐపీని కాను, మామూలు పౌరుడినే’నని బదులిచ్చి అందులోనే గోద్రా చేరుకున్నా. అందుకోసం ఎంతో వాదించాల్సి వచ్చింది. చివరికి, ఏం జరిగినా నాదే బాధ్యత అని రాసివ్వడానికి కూడా సిద్ధపడ్డా. అంతే తప్ప రిస్క్ చేయడానికి వెనకాడలేదు. తీరా వెళ్లాక గోద్రాలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. నేనూ మనిషినే. నాకూ భావోద్వేగాలుంటాయి. కానీ సీఎంను గనుక వాటికి దూరంగా ఉండాలని నాకు తెలుసు. అందుకే భావోద్వేగాలను అదుపు చేసుకున్నా. అందుకోసం మానసికంగా చేయగలిగిందంతా చేశా. ఆ ఫలితాల రోజు నాలో ఆదుర్దా కలగలేదని చెప్పలేను. కానీ దాన్ని అధిగమించాలని గట్టిగా అనుకున్నా. అందుకే మధ్యాహ్నం దాకా ఫలితాల గురించి నాకు చెప్పొద్దని సిబ్బందికి సూచించా. ఆ రోజు టీవీ కూడా చూడలేదు. మధ్యాహ్నానికల్లా నా ఇంటిముందు ఆనందోత్సాహాలు మిన్నంటాయి. చూస్తే మాకు మూడింట రెండొంతుల మెజారిటీ దక్కింది. మిత్రులు నన్ను సీఎంగానే చూసేవారు నా చిన్నప్పుడు అప్పుడప్పుడు మా కుటుంబ సభ్యుల బట్టలు ఉతికేందుకు ఇష్టపడేవాడిని. అలాగైతే చెరువు దగ్గరికి వెళ్లనిస్తారు కదా! సీఎం అయ్యాక కూడా చిన్నప్పటి మిత్రులను అధికారిక నివాసానికి ఆహా్వనిస్తూ ఉండేవాడిని. కానీ వారు నన్ను సీఎంగానే చూసేవారు. దాంతో నన్ను ‘నీవు’ అని పిలిచేవారే కరువయ్యారు. రాజకీయాల్లో సొంత లాభం కూడదు వ్యాపారానికి, రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. వ్యాపారంలో వ్యక్తిగత, ఆర్థిక అభివృద్ధే ముఖ్యం. రాజకీయాల్లో మాత్రం సమాజ సంక్షేమానికే ప్రాధాన్యమివ్వాలి. అందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సొంత లాభం మానుకోవాలి. వ్యాపారంలో ఎలా పైకి ఎదగాలన్నదే కీలకం. రాజకీయాల్లో త్యాగాలెలా చేయాలన్నది కీలకం. వ్యాపారంలో కంపెనీని నంబర్‌వన్‌గా ఎలా మార్చాలో ఆలోచించాలి. రాజకీయాల్లో మాత్రం దేశమే తొలి ప్రాధాన్యం కావాలి. దేశాన్ని నంబర్‌వన్‌గా మార్చే ఆలోచన చేయాలి. రాజకీయాలంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కాదు. అది ప్రజాసేవకు సంబంధించిన అంశం. వ్యక్తిగత ఆశల కంటే ప్రజాసేవే పరమావధి కావాలి. అంతేతప్ప రాజకీయాలంటే ‘లేనా, పానా, బనానా (దండుకోవడం)’ కాదు. అలాంటివారు దీర్ఘకాలం కొనసాగలేరు.కంఫర్ట్ జోన్లో ఉండలేను నేనెప్పుడూ కంఫర్ట్ జోన్లో జీవించలేదు. అలా ఉండిపోయేవారు విజయాలు సాధించలేరు. కంఫర్ట్ జోన్ బయట ఉన్నా గనుక ఏం చేయాలో నాకు తెలిసింది. సురక్షిత స్థానంలో ఉండిపోవడానికి నేను సరిపోనేమో! రిస్క్ తీసుకొనే మనస్తత్వమే మనల్ని ముందుకు నడుపుతుంది. అయితే రిస్క్ తీసుకొనే సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వాడుకోలేదు. చిన్నచిన్న విషయాలే నాకు సంతృప్తినిచ్చాయి. పాత ఆలోచనలు వదిలేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. నాది సాధారణ నేపథ్యంనేను అతి సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చా. నేను ప్రాథమిక పాఠశాల టీచర్నయినా నా తల్లి ఆనందంతో అందరికీ స్వీట్లు పంచేదేమో! అలాంటి నేపథ్యం నాది. చిన్నప్పుడు స్కూల్లో సాధారణ విద్యార్థినే. కేవలం పాసయ్యేందుకు చదివేవాడిని. ఇతర కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. సైనిక్ స్కూల్లో చేరేందుకు దరఖాస్తు చేయడానికి నా తండ్రి అంగీకరించలేదు. డబ్బు లేకపోవడమే అందుకు కారణం. అయినా నేనెప్పుడూ అసంతృప్తి చెందలేదు. జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులే నాకు యూనివర్సిటీ. అవే నాకెన్నో పాఠాలు నేర్పాయి. పుట్టుక, చావు గురించి నేనేనాడూ ఆలోచించలేదు. సీఎం అయినప్పుడు నేనెలా అయ్యానని ఆశ్చర్యపోయా’’. గాంధీ ఎన్నడూ టోపీ ధరించకున్నా.. ‘‘మహాత్మా గాంధీ తన జీవితంలో ఎన్నడూ టోపీ ధరించలేదు. కానీ గాంధీ టోపీని ప్రపంచమంతా నేటికీ గుర్తుంచుకుందంటే ఆయన నాయకత్వ పటిమే కారణం. గాంధీ గొప్ప వక్త కాకపోయినా ప్రజలతో మమేకమయ్యే విషయంలో ఆయనకు ఆయనే సాటి! తన వ్యక్తిత్వం, పనితీరుతో దేశమంతటినీ ఒక్కటి చేసి చూపాడు! రాజకీయాల్లో ప్రవేశించడం సులువే. కానీ రాణించడమే కష్టం. అందుకు తిరుగులేని అంకితభావం, ప్రజలతో మమేకమవడం, వారి మంచి చెడుల్లో అండగా నిలవడం, చక్కని భావ వ్యక్తీకరణ వంటి లక్షణాలు చాలా అవసరం. అందుకే వ్యక్తిగత ఆకాంక్షలు లేని, నిస్వార్థంగా దేశ సేవ చేయాలన్న భావన నరనరానా నింపుకున్న కనీసం లక్షమంది యువకులు కావాలిప్పుడు’’.‘మెలోడీ’ మీమ్స్‌పై.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో తన పేరును కలిపి మెలోడీ అంటూ సాగిన మీమ్స్ వెల్లువను ప్రస్తావించగా మోదీ సరదాగా స్పందించారు. ‘‘అలాంటివి నడుస్తూనే ఉంటాయి (వోతో చల్తా హీ రహేగా)’’ అన్నారు. అలాంటి వాటిపై సమ యం వృథా చేసుకోనన్నారు. ‘‘నేను భోజనప్రియుణ్ని కాదు. పర్యటనలప్పుడు అందుబాటులో ఉన్నది తింటా. రెస్టారెంట్‌కు తీసుకెళ్లి మెనూ చేతికిస్తే ఏం కావాలో ఆర్డర్ కూడా ఇవ్వలేను. అలాంటప్పుడు దివంగత అరణ్ జైట్లీ నన్ను ఆదుకునేవారు’’ అని చెప్పుకొచ్చారు.జిన్‌పింగ్‌తో ప్రత్యేక బంధం చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో తన తొలి సంభాషణను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘2014లో నేను ప్రధాని అయ్యాక ఎందరో దేశాధినేతలు అభినందనలు తెలియజేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా మాట్లాడారు. ఇండియాలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘తప్పకుండా రండి, మీకు స్వాగతం’ అని చెప్పాను. ‘‘గుజరాత్లో మీ సొంతూరు వాద్‌నగర్‌ను సందర్శించాలని ఉంది. ఎందుకంటే మనిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉంది. అలనాటి ప్రఖ్యాత చైనా తత్వవేత్త, పర్యాటకుడు హుయాన్‌త్సాంగ్ వాద్నగర్లో చాలాకాలం నివసించారు. చైనాకు తిరిగొచ్చాక నా స్వగ్రామంలో నివసించారు’ అని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు’’ అంటూ మోదీ గుర్తు చేసుకున్నారు.An enjoyable conversation with @nikhilkamathcio, covering various subjects. Do watch... https://t.co/5Q2RltbnRW— Narendra Modi (@narendramodi) January 10, 2025 ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ -
న్యూఢిల్లీ నుంచి మాత్రమే పోటీ చేస్తా
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తానని ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటమి భయంతో తాను న్యూఢిల్లీతోపాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో స్పందించారు. గత ఎన్నికల్లో పోటీ చేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా న్యూఢిల్లీ సీటు నుంచి మాత్రమే మళ్లీ ఉంటానన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈసారి పోటీ ఆప్, బీజేపీల మధ్యే ప్రధానంగా ఉండనుందన్నారు. కేజ్రీవాల్‌కు ఈ దఫా ఓటమి తప్పదు, అందుకే మరో చోటు నుంచి పోటీ చేస్తారంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలకు పైవిధంగా బదులిచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ బీజేపీ నుంచి, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తుండటం తెలిసిందే. -
ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
-
డ్యూటీ... డ్యాన్సుల్లో ట్రాక్ రికార్డ్
విశిష్ట రైల్వే సేవా పురస్కారానికి ఎంపికైన ఉద్యోగిగా గుంటూరుకు చెందిన జవ్వాది వెంకట అనూష వార్తల్లో నిలిచింది. దిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగిన 69వ రైల్వే సేవా పురస్కారాల కార్యక్రమంలో అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారాన్ని అందుకున్న అనూష కూచిపూడి నృత్యకారిణి కూడా. మనసు ఉంటే మార్గం ఉన్నట్టే... ఒక్క పడవ అని ఏమిటి ఎన్ని పడవల మీద అయినా ప్రయాణం అద్భుతంగా సాధ్యం అవుతుంది!నేర్చుకోవడానికి వ్యక్తులకు మించిన పాఠశాలలు ఉంటాయా?అనూషకు నాన్న ఒక పాఠశాల. ఆయన రైల్వేలో ఇంజినీర్. వృత్తిపట్ల అంకితభావం తండ్రి నుంచే నేర్చుకుంది. తాను కూడా నాన్నలాగే రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంది. జవ్వాది వెంకట నాగ సుబ్రమణ్యంతో అనూషకు వివాహం జరిగింది. ఆయన అప్పుడు కేరళ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. 2008లో మళ్లీ సివిల్స్ రాసి ఐఎఎస్‌కు ఎంపిక అయ్యారు. ‘మరింత కష్టపడాలి’ అనే పాఠాన్ని భర్త నుంచి నేర్చుకున్న అనూష ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్ (ఐఆర్ఎస్ఈ)గా ఎంపిక అయింది.ఇక కళలకు సంబంధించి అమ్మ తనకు పాఠశాల.తల్లి స్ఫూరితో కూచిపూడి నేర్చుకుంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగశాస్త్రి శిష్యురాలైన అనూష యూరోపియన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలలో చిన్నప్పుడే ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది.నృత్యంలో ‘భేష్’ అనిపించుకున్న అనూష ఉద్యోగ జీవితంలో ‘ది బెస్ట్’ అనిపించుకుంది.‘గుంటూరు డివిజన్ కు 2022లో వచ్చాను. కృష్ణకెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నదివైపు ఉన్న ట్రాక్ వీక్‌గా ఉండేది. దీనికోసం ప్రతి ఏటా 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. జియో టైల్స్, జియో బ్రిడ్జెస్ వేసి కొత్త తరహాలో ట్రాక్‌ను పటిష్టపరిచాము. దీనివల్ల ఇప్పుడు ఏడాదికి రెండు లక్షలు కూడా ఖర్చు అవ్వడం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు వాడకుండా ఎన్నో పనులను వినూత్న రీతిలో పూర్తి చేశాము. దీనికి కూడా జీఎం నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఈ ప్రయోగాలు గుంటూరు డివిజన్ కు బోలెడంత పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేబోర్డు నన్ను గుర్తించింది. అతి విశిష్ట రైలు సేవా పురస్కారం దక్కింది. మన కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసినప్పుడు వృత్తిపట్ల అంకితభావం మరింతగా పెరుగుతుంది’ అంటుంది అనూష. వృత్తి జీవితంలో, కూచిపూడి నృత్యకారిణిగా ఆమె మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.ఎన్నో అడ్డంకులు... అయినా సరే ముందుకు వెళ్లాం!నా భర్త అస్సాం కేడర్ ఐఏఎస్ కావడంతో నాకు కూడా నార్త్ ఈస్ట్ రైల్వేలో పోస్టింగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా వచ్చింది. అక్కడ తీవ్రవాదంతో పాటు బ్రహ్మపుత్ర వరదల సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా ఏడాదిలో ఎనిమిది నెలలు ΄్లానింగ్, నాలుగు నెలలు మాత్రమే ఎగ్జిక్యూషన్ ఉండేది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో రైలు నడిచేలా చర్యలు తీసుకోవడంతోపాటు సిబ్బందిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్‌లా ఉండేది. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాము. రెండు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో రైల్వే కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. మేం కూడా వారితో కలిసి ప్రశాంతత నెలకొల్పే విషయంలో గట్టిగా పనిచేశాం. గౌరీపూర్ నుంచి బిలాస్పూర్ వరకూ కొత్త రైల్వేలైన్ వేసిన సమయంలో బ్రహ్మపుత్రపై పెద్ద పెద్ద బ్రిడ్జీల నిర్మాణం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. భూసేకరణ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అన్నింటిని అధిగమించి రైల్వే లైన్ పూర్తి చేయడం పెద్ద అచీవ్మెంట్. దీనికి గుర్తింపుగా రైల్వే జీఎం అవార్డు వచ్చింది.– జవ్వాది వెంకట అనూష– దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి గుంటూరుఫోటోలు: షేక్ సుభానీ, లక్ష్మీపురం -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
-
భారత‘రత్న’ వాజ్‌పేయి శతజయంతి.. ప్రముఖుల నివాళి (చిత్రాలు)
-
ఢిల్లీకి విశాఖ ఉక్కు పోరాటం
-
మోడువారిన జీవితం గోరింట సాక్షిగా!
న్యూఢిల్లీ: అరచేతిలో గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడన్నది తెలుగిళ్లలో అనాదిగా ఉన్న నమ్మకం. కానీ తన సంసారం చట్టుబండలైన వైనాన్ని ఎర్రగా పండిన గోరింటాకు సాక్షిగా వినూత్నంగా చెప్పిందో మహిళ. తన వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలను, అనుభవించిన బాధలను మెహందీ ద్వారానే విడమరచి చెప్పింది. ‘విఫల వివాహ విషాద గాథ’ను వివరిస్తూ ఆ మహిళ తన చేతిపై వేసుకున్న మెహందీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు మహిళకు ‘విడాకుల మెహందీ’ వేసిన కళాకారిణి ఊర్వశీ ఓరా ఆ వీడియోను షేర్చేశారు. పెళ్లయ్యాక అత్తగారింట అడుగుపెట్టింది మొదలు ఇంట్లో బట్టలుతకడం, అత్తగారి దృష్టిలో పనిమనిషిలా పనులన్నీ చేయడం, భర్త నుంచి దేనికీ మద్దతు లేక దిగాలు పడటం, తరచూ మనస్పర్ధలు, గొడవలు, ఒంటరితనం... ఇలా చివరకు విడాకుల దాకా తన వ్యథను మెహందీ ద్వారా వ్యక్తీకరించారు. ప్రేమ, ఆనందమయ క్షణాల్లో సంబరాలకు ప్రతీకగా నిలిచే మెహందీ ద్వారా ఇలా అంతులేని బాధను వ్యక్తం చేయొచ్చని నిరూపించారు. Divorce Mehndi Design: महिला ने मेहंदी डिजाइन से बतायी शादी से लेकर तलाक तक की कहानी, pic.twitter.com/ZuYdTlT9Bl— Vikash Kashyap (@VikashK41710193) December 14, 2024 -
భారత్‌కు టెస్లా.. ఢిల్లీలో షోరూం కోసం అన్వేషణ!
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్ ఇచ్చిన టెస్లా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.భారత్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను టెస్లా గతంలో విరమించుకుంది. గత ఏప్రిల్‌లో మస్క్ పర్యటించాల్సి ఉండగా అది రద్దయింది. ఆ పర్యటనలో ఆయన 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని భావించారు. అదే సమయంలో అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది.రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. టెస్లా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో షోరూమ్, ఆపరేషనల్ స్పేస్ కోసం దేశంలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డీఎల్ఎఫ్ అవెన్యూ మాల్, గురుగ్రామ్‌లోని సైబర్ హబ్‌తో సహా పలు ప్రదేశాలను అన్వేషిస్తోంది.వాహన డెలివరీలు, సర్వీసింగ్ సదుపాయంతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందు కోసం కంపెనీ ఇతర డెవలపర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.భారత్‌లోకి టెస్లా ప్రవేశం సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా.. 100 శాతం వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా లేదా నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15 శాతం తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. -
ఢిల్లీలో రైతుల పోరుబాట
-
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
విఖ్యాత ఆటగాడిగా ఎదిగిన స్క్వాష్ దిగ్గజం ఇకలేరు
భారత దిగ్గజ స్క్వాష్ క్రీడాకారుడు బ్రిగేడియర్ రాజ్‌కుమార్ మన్‌చందా కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు కాగా... అనారోగ్య కారణాలతో ఢిల్లీలో మృతి చెందినట్లు మంగళవారం కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రాజ్ మన్‌చందా మృతిపట్ల క్రీడాభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విశేషంగా రాణించి భారత్‌కు పతకాలు అందించిన ఆయన స్క్వాష్‌లో విఖ్యాత ఆటగాడిగా ఎదిగారు. 33 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఆయన 1977 నుంచి 1982 వరకు వరుసగా టైటిళ్లను నిలబెట్టుకున్నారు.రాజ్ తన కెరీర్లో ఓవరాల్‌గా 11 టైటిళ్లు సాధించారు. ఆసియా చాంపియన్‌షిప్ సహా పలు అంతర్జాతీయ టోర్నీలలో సత్తా చాటుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1983లో ‘అర్జున అవార్డు’ను అందజేసింది. 1980 దశకాన్ని శాసించిన జహంగీర్ ఖాన్‌ను 1981లో ఎదుర్కొన్న ఆయన పలు అంతర్జాతీయ టోర్నీలకు భారత స్క్వాష్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. కరాచీలో 1981లో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రజత పతకం సాధించింది. 1984 ఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలవడం ఆయన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కాగా... ఆ ఈవెంట్లో టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. ఆస్ట్రేలియాతోన్ టెన్నిస్ గ్రేట్ ఫ్రేజర్ మృతి మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టెన్నిస్ దిగ్గజం నీల్ ఫ్రేజర్ మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో 91 ఏళ్ల ఫ్రేజర్ మృతి చెందారు. తమ దేశం ఓ మేటి దిగ్గజాన్ని కోల్పోయిందని టెన్నిస్ ఆ్రస్టేలియా (టీఏ) తెలిపింది. 24 ఏళ్ల సుదీర్ఘ టెన్నిస్ కెరీర్లో ఫ్రేజర్ మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లతో పాటు ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టోర్నీలో వరుసగా నాలుగుసార్లు ఆస్ట్రేలియాను గెలిపించాడు. 1960లో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో తమ దేశానికే చెందిన దిగ్గజం రాడ్ లేవర్ను ఓడించి టైటిల్ చేజిక్కించుకున్నారు. ఆ ఏడాది ఏకంగా 11 మేజర్ టైటిల్స్ (పురుషుల డబుల్స్) సాధించారు. అంతకుముందు ఏడాది (1959) యూఎస్ ఓపెన్‌లో టైటిళ్ల క్లీన్‌స్వీప్ చేశారు. సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మూడు ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. టెన్నిస్‌లో విజయవంతమైన, విశేష కృషి చేసిన ఆయన్ని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 1984లో ‘టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చింది. 2008లో టెన్నిస్‌లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా అభివరి్ణంచే ‘ఫిలిప్ చాట్రియెర్’ అవార్డును ఫ్రేజర్‌కు ప్రదానం చేసింది. -
వెండి మిలమిల..
న్యూఢిల్లీ: వెండి కేజీ ధర న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో ఒకేరోజు రూ.5,200 పెరిగి రూ.95,800కు చేరింది. వెండి ధర ఒకేరోజు ఈ స్థాయిలో ఎగియడం ఒక రికార్డు. తద్వారా ఈ మెటల్ ధర రెండు వారాల తర్వాత తిరిగి రూ.95,000పైకి చేరింది. కాగా, ఇంతక్రితం అక్టోబర్ 21న వెండి ధర ఒకేరోజు రూ.5,000 పెరగడం ఒక రికార్డు. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, స్థానిక ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ దీనికి కారణం. రెండు రోజుల తర్వాత పసిడి ఇక గడచిన రెండు రోజుల్లో రూ.2,250 పడిపోయిన బంగారం ధర బుధవారం తిరిగి పుంజుకుంది. 99.9 ప్యూరిటీ పసిడి ధర రూ.650 ఎగసి రూ.78,800కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.5 శాతం స్వచ్ఛత ధర రూ.950 ఎగసి రూ.78,700కు ఎగసింది. డాలర్ విలువలో ఒడిదుడుకులు తాజా పసిడి పరుగుకు కారణం. అబాన్స్ హోల్డింగ్స్ సీఈఓ చింతన్ మెహతా పసిడి భవిష్యత్ ధరలపై మాట్లాడుతూ, బులియన్ ధరలకు మరింత దిశానిర్దేశం చేసే రష్యా–ఉక్రెయిన్ వివాదం, పరిణామాలను మార్కెట్లు నిశితంగా గమనిస్తాయని అన్నారు. ఫ్యూచర్స్‌లో పరుగు.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రాములు) ధర ఒక దశలో 1% పెగా (32 డాలర్లు) పెరిగి 2,679 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ ఇటీవలే పసిడి 52 వారాల గరిష్టం 2,826 డాలర్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ, ట్రంప్ గెలుపు, డాలర్ స్థిరత్వం వంటి పరిణామాలతో ఎల్లో మెటల్ కొంత వెనక్కు తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు రూ. 900 లాభంతో రూ. 76,870 వద్ద ట్రేడవుతోంది. -
జాతికి కరదీపిక మన రాజ్యాంగం: మోదీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని జాతికి దారి చూపే కరదీపికగా ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. కీలకమైన పరివర్తన దశలో మన రాజ్యాంగం దేశానికి అన్ని విషయాల్లోనూ దారి చూపుతూ చుక్కానిలా వ్యవహరిస్తోందన్నారు. ‘‘మన రాజ్యాంగం కేవలం నిబంధనల పుస్తకం కాదు. అదో సజీవ స్రవంతి. కోట్లాది మంది భారతీయుల అవసరాలు, ఆశలను తీర్చడంలోనే గాక వారి ఆకాంక్షలు, అంచనాలను అందుకోవడంలో ఏనాడూ విఫలం కాలేదు. చివరికి ఎమర్జెన్సీ వంటి అతి పెద్ద సవాలును కూడా తట్టుకుని సమున్నతంగా నిలిచింది’’ అంటూ కొనియాడారు. మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దిన వేడుకల్లో ప్రధాని ప్రసంగించారు. దేశమే ముందన్న భావన పౌరులందరిలో నిండుగా ఉండాలని హితవు పలికారు.ఆ భావనే మన రాజ్యాంగాన్ని మరిన్ని శతాబ్దాల పాటు సజీవంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు. స్వీయ అవసరాల కంటే దేశ ప్రయోజనాలను మిన్నగా భావించే కొద్దిమంది నిజాయతీపరులు దేశానికి చాలని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ తొలి భేటీలో బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని గుర్తు చేశారు. ‘‘కాలానుగుణంగా వచ్చే మార్పులను రాజ్యాంగం తనలో ఇముడ్చుకునేలా దాని నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.స్వతంత్ర భారత ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, పౌరుల అవసరాలు, సవాళ్లు కాలంతో పాటు ఎంతగానో మారతాయని వారికి బాగా తెలుసు’’ అని అన్నారు. జమ్మూ కశ్మీర్లో తొలిసారి రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతుండటం ఆనందకరమన్నారు. ‘‘పౌరుల్లో మానవీయ విలువలను పాదుగొల్పాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. అందుకే రాజ్యాంగపు తొలి హస్తలిఖిత ప్రతిలో రాముడు, సీత, గురు నానక్, బుద్ధుడు, మహావీరుడు తదితరుల చిత్రాలను చేర్చారు’’ అని గుర్తు చేశారు.ఎన్నడూ పరిధి దాటలేదు: మోదీరాజ్యాంగ పరిధులను తానెన్నడూ దాటలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానిగా ఎప్పుడూ రాజ్యాంగం నిర్దేశించిన సరిహద్దులకు లోబడి పని చేసేందుకే ప్రయతి్నంచానని స్పష్టం చేశారు. ‘‘ఇతర వ్యవస్థల్లో చొరబాట్లకూ నేనెన్నడూ ప్రయత్నించలేదు. నా దృక్కోణాన్ని, అభిప్రాయాలను కూడా పరిధులకు లోబడే వెల్లడించేందుకే శాయశక్తులా ప్రయతి్నంచా. ఈ వేదికపై ఇంతమాత్రం చెబితే చాలనుకుంటా. వివరించి చెప్పాల్సిన అవసరం లేదనే ఆశిస్తున్నా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.మోదీకి ముందు మాట్లాడిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘తామే సర్వోన్నతులమనే భావనతో అవి అప్పుడప్పుడు అతి చేస్తున్నాయి. చట్టాలను వ్యక్తిగత, రాజకీయ అజెండాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి’’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే పై విధంగా మోదీ స్పందించారని భావిస్తున్నారు.నడిపించే శక్తి రాజ్యాంగం: సీజేఐ‘‘ప్రభుత్వ వ్యవస్థలన్నీ తమకు దఖలుపడ్డ రాజ్యాంగపరమైన బాధ్యతలను గౌరవించాలి. వాటికి లోబడే నడుచుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. ఎన్నికల ప్రక్రియ తాలూకు పర్యవసానాలతో న్యాయవ్యవస్థ ప్రభావితం కాకుండా ఉండేందుకు దానికి స్వతంత్ర ప్రతిపత్తి వంటి రక్షణలను రాజ్యాంగం కలి్పంచిందని గుర్తు చేశారు. అయితే, ‘‘ఏ వ్యవస్థా దానికదే స్వతంత్ర విభాగం కాదు. అవన్నీ పరస్పరం ఆధారితాలే. కనుక దేశ శ్రేయస్సే లక్ష్యంగా పరస్పర సమతుల్యతతో సమైక్యంగా సాగాలి’’ అని హితవు పలికారు.‘‘భారత్‌ను ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దడంలో రాజ్యాంగం అతి కీలక పాత్ర పోషించింది. ఫలితంగా దేశ విభజన, నిరక్షరాస్యత, పేదరికం తదితర పెను సవాళ్లను అధిగమించగలిగాం. అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంగా, అంతర్జాతీయంగా బలమైన శక్తిగా భారత్ నిలిచింది. వీటన్నింటి వెనకాల అడుగడుగునా రాజ్యాంగపు వెన్నుదన్ను ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. -
దేశ రాజధాని మార్పు అవసరమేనా?
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికిచేరింది. తాజాగా అక్కడ గాలి నాణ్యతా సూచి 500 మార్క్ చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో కాలుష్య మయమైన ఢిల్లీని భారతదేశ రాజధానిగా కొన సాగించడం అవసరమా అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లేవనెత్తిన అంశం చర్చకు దారి తీస్తోంది.మొఘల్ చక్రవర్తుల రాజధానిగా ఒక వెలుగు వెలిగిన ఢిల్లీ... బ్రిటిష్ రాణి పాలనా కాలంలోనూ, స్వాతంత్య్రం తరువాత కూడా రాజధాని హోదాతోనే ఉంది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్ట్, ప్రధాన మంత్రి కార్యా లయం వంటి అత్యున్నత సంస్థలు ఢిల్లీలో ఉన్నాయి. ఇతర నగరాలతో పోటీ పడుతూ వాణిజ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందింది. అంతర్జాతీయసంబంధాల రీత్యానూ ఢిల్లీ కీలకమైన స్థానం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజధాని మార్పుఅంశం తెర మీదకు వచ్చింది.ప్రపంచంలో కొన్ని దేశాలు తమ తమ రాజధానులను అవసరం మేరకు మార్చుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. నైజీరియా పాత రాజధాని లాగోస్ నుంచి 1991లో ‘అబుజా’కు మార్చుకుంది. లాగోస్‌లో అధిక జనసాంద్రత సమస్య, ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. అందుకే దేశానికి భౌగోళికంగా మధ్యలో ఉన్న అబుజాను కొత్త రాజ ధానిగా ఎంచుకున్నారు. ఇక 2006లో యాంగోన్ (రంగూన్) నుంచి నైపిటావ్కు మయన్మార్ తన రాజధానిని మార్చుకుంది. భద్రత, పరిపాలన సామర్థ్యం పెంపొందించుకోవడం వంటి కార ణాలుఇందుకు కారణాలు. 1918లో రష్యా కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి మాస్కోకు రాజధానిని మార్చింది.వ్యూహాత్మకంగా మాస్కో మరింత ప్రాముఖ్యం ఉన్న ప్రాంతమని రష్యా భావించింది. ఇక పొరుగు దేశం పాకిస్తాన్ 1963లో కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు రాజధానిని మార్చుకుంది. కరాచీ నగరానికి భద్రతా సమస్యలు ఉండటం, అక్కడ అధిక జనాభా ఉండడం వంటి కారణాలతో దేశానికి కేంద్ర స్థానంలో ఉన్న ఇస్లామాబాద్‌కు రాజధానిని తరలించు కున్నారు. బ్రెజిల్,, కజకిస్తాన్, టాంజానియా వంటివీ రాజధానులను మార్చుకున్నాయి. ఇక ప్రస్తుతం మన విషయానికి వస్తే... పుణే, హైదరాబాద్, నాగపూర్ వంటి నగరాలు దేశానికి మధ్యలో ఉండటం వల్ల వీటిలో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా ఎంచుకోవాలని కొందరు సూచిస్తు న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో కొన్ని తక్షణ చర్యలు చేపట్టాలి. గ్రీన్ బెల్ట్స్ అభివృద్ధి చేయాలి. పునఃవిని యోగ ఇంధన వనరులన వాడకాన్ని అధికం చేయాలి. పరిపాలనా కార్యా లయాలను ఇతర నగరాలకు విస్తరించాలి. ఈ క్రమంలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే అంశం మరో సారి తెరపైకి వస్తోంది. ఇక్కడి మౌలిక వసతుల నేపథ్యంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయా లని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బాబా సాహెబ్ అంబేడ్కర్ అప్పట్లోనే అన్నారని, ఆ అర్హత హైదరాబాద్‌కు ఉందని కొందరు గుర్తు చేస్తు న్నారు. హైదరాబాద్‌లో కూడా కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుందని, భాగ్యనగరంతో పాటు తెలంగాణలో వివిధ ప్రదేశాల్లో పరిపా లనా కేంద్రాలను నిర్మిస్తే బాగుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.శశిథరూర్ లేవనెత్తిన అంశంపై మరింత చర్చ జరగాలి. ఢిల్లీవంటి నగరంలో పెరుగుతున్న కాలుష్యం, జనాభా, మౌలిక సదు పాయాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. రాజధానిని మార్చడం అనేది తక్షణావసరం కాకపోయినా, భవిష్యత్తులో పరిశీల నార్హమైన అంశం. అదే సమయంలో ఢిల్లీని కాలుష్యం బారి నుంచి రక్షించడం తక్షణ అవసరం.– ఎక్కులూరి నాగార్జున్ రెడ్డిఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 90320 42014 -
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ
-
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు..
-
కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ (ఫొటోలు)
-
Big Question: ఢిల్లీలో డీసీఎం పాలిటిక్స్.. టెన్షన్ లో బాబు
-
విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ కనిపించడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ్ల చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. నంబర్ ఏఐ 916 ఎయిరిండియా విమానం అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వి మానాశ్రయంలో ల్యాండయ్యింది. ప్ర యాణికులంతా సురక్షితంగా కిందికి దిగి న తర్వాత ఒక సీటుపైనున్న బుల్లెట్ల కాట్రిడ్జ్‌ను సిబ్బంది గమనించారు. దీనిపై వెంటనే వారు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి వాటిని విమానంలోకి తీసుకురావడం పూర్తి నిషేధం ఉంది. ఇప్పటికే 400కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడం..అవన్నీ ఉత్తుత్తివేనని తేలడం తెలిసిందే. భద్రతా చర్యలను తనిఖీలను ముమ్మరం చేసినా పేలుడు సామగ్రి కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా, సోమవారం నేపాల్‌లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది. విమానాశ్రయం అధికారులు వెంటనే సిబ్బందిని కిందికి దించి పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో కొద్ది సేపటికి విమానం టేకాఫ్ తీసుకుంది. -
బంగారం రూ.80,000 పైకి..
న్యూఢిల్లీ: అటు బంగారం, ఇటు వెండి.. రెండు విలువైన మెటల్స్ ధరలు సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆల్‌టైమ్ రికార్డును తాకాయి. 99.9 స్వచ్ఛత 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపు రూ.79,900తో పోల్చితే సోమవారం రూ.750 పెరిగి రూ. 80,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర రూ.750 ఎగసి, రూ.80,250కి చేరింది. ఇక కేజీ వెండి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.5,000 పెరిగి రూ99,500కి ఎగసింది. కారణాలు ఇవీ... అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, డాలర్ బలహీనత, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీన ధోరణి విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ వెండికి కలిసి వస్తున్న అంశం. అంతర్జాతీయంగా రికార్డులు పశి్చమ దేశాల సెంట్రల్ బ్యాంకుల సరళతర ఆర్థిక విధానాల నేపథ్యంలో సోమవారం యూరోపియన్ ట్రేడింగ్ గంటల్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 2,730 డాలర్ల స్థాయికి చేరింది. వెండి సైతం 3 శాతం పెరిగి 12 సంవత్సరాల గరిష్ట స్థాయి 34.20 డాలర్లకు ఎగసింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ ధర రికార్డు ధర వద్ద 2,752 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,755 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకింది. గత ముగింపుకన్నా ఇది 25 డాలర్లు అధికం. దేశీయ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.650 లాభంతో రూ. 78,380 రికార్డు ధర వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.2,500 లాభంతో రూ.98,000 వద్ద ట్రేడవుతోంది. -
ఢిల్లీ పోలీస్ అలర్ట్.. CRPF స్కూల్ వద్ద ఫోరెన్సిక్ బృందం తనిఖీలు
-
70 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్ సీఈఓలతో భేటీ
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.