Students pursuing MBBS need to complete course within 9 years from date of admission: NMC - Sakshi
Sakshi News home page

కొత్త నిబంధనలు వచ్చేశాయ్‌.. ఎంబీబీఎస్‌ 9 ఏళ్లలో పూర్తి చేయాలి

Published Tue, Jun 13 2023 9:11 AM | Last Updated on Tue, Jun 13 2023 10:20 AM

Students Pursuing Mbbs Need To Complete Course Within 9 Years Says Nmc - Sakshi

న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌ కోర్సును విద్యార్థులు తొమ్మిదేళ్లలోగా పూర్తి చేయాలని, ఫస్టియర్‌ను నాలుగు ప్రయత్నాల్లో పూర్తి చేయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) తాజాగా నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈ నెల 2న గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌–2023(జీఎంఈఆర్‌–23) గెజిట్‌ను విడుదల చేసింది. అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులో అడ్మిషన్‌ పొందిన తేదీ నుంచి తొమ్మిదేళ్లలోగా ఆ కోర్సును విద్యార్థులు పూర్తి చేయాలి.

ఎంబీబీఎస్‌ కోర్సులో మొదటి సంవత్సరం పూర్తి చేసేందుకు విద్యార్థులకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగుకు మించి ప్రయత్నాలకు అవకాశమివ్వరు. వైద్య సంస్థల్లో గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నీట్‌–యూజీ మెరిట్‌ లిస్ట్‌ ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్‌ ఉండాలి.

చదవండి: రూ.10 అడిగితే ప్రాణం తీశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement