course
-
ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫీజు పెంపు
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ రాష్ట్రాల వారీగా ప్రారంభమయ్యింది. జాతీయ స్థాయిలో ఆగస్టు 14న ఇది ప్రారంభం కానుంది. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేయాలంటే భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.పంజాబ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ కోర్సు ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. అడ్మిషన్లను నియంత్రించేందుకే మెడికల్ ఫీజులను ఐదు శాతం మేరకు పెంచినట్లు అధికారిక నోటిఫికేషన్లో తెలియజేశారు.బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో 1,550 సీట్లలో ప్రవేశాలు ఉంటాయని, వీటిలో 750 సీట్లు రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీలలో, 800 సీట్లు మైనారిటీ రాష్ట్రాల్లోని నాలుగు ప్రైవేట్, రెండు మెడికల్ ఇన్స్టిట్యూట్లలో ఉన్నాయనిమెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ తెలిపింది. పంజాబ్‌లో ఇప్పటికే నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం అమృత్సర్, ఫరీద్కోట్, పటియాలా, మొహాలీలలోని నాలుగు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజును రూ.9.50 లక్షలకు పెంచారు. గతంలో ఇక్కడ ఫీజు రూ.9.05 లక్షలుగా ఉండేది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని అన్ని మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఎంబీబీఎస్ కోర్సుకు గతంలో రూ.55.28 లక్షలుగా ఉన్న పూర్తి ఫీజును రూ.58.02 లక్షలు చేశారు. కాగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ కోటాలోని ఎంబీబీఎస్ సీట్ల ఫీజు గతంలో రూ.21.48 లక్షలుగా ఉండగా, దానిని ఇప్పుటు రూ.22.54 లక్షలకు పెంచారు. -
ఫీజులు.. గుండెలు గుభిల్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్‌కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్‌కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది. మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు. ⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్‌లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే. భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్‌డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలుప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. భారీగా ఫీజుల భారం.. దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది. 44 శాతం మంది చదువులకు దూరం నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు -
ఏడీసెట్–2024 రద్దు
ఏఎఫ్‌యూ: వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సి ఉన్న ఏడీసెట్–2024 (ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏడీసెట్–24 చైర్మన్ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్, కన్వీనర్ ఆచార్య ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వర్సిటీలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్స్‌లో భాగంగా పెయింటింగ్, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, బి.డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు తగినంత సమయం ఇచ్చామన్నారు. కొన్ని విభాగాల్లో ఆశించిన మేర దరఖాస్తులు రాకపోవడంతో, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏడీసెట్–24ని రద్దు చేసి, డైరెక్ట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయాన్ని ఏపీ ఉన్నతవిద్యామండలి దృష్టికి తీసుకువెళ్లగా ఏడీసెట్–24ని రద్దుచేసేందుకు అనుమతించారన్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ వారి అర్హత మార్కులు (ఇంటర్/డిప్లొమా), రోస్టర్, మెరిట్ ఆధారంగా నేరుగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును వచ్చేవారంలో విడుదల చేసి పదిరోజుల్లోపు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఏడీసెట్–24కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి అభ్యరి్థకి సంబంధిత సమాచారాన్ని ఫోన్ ద్వారా, పత్రికల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. -
చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి
మార్కులు రాలేదని తల్లి పెద్ద ర్యాంకు రాలేదని తండ్రి ఫలానా కోర్సు చదవాలని తల్లి ఆ కాలేజీలోనే చేర్పిస్తానని తండ్రి టీనేజ్ పిల్లలకు ఇది కీలక సమయం. వారు ఇంటర్లో, డిగ్రీలో చేరాలి. కాని పిల్లల మాట వింటున్నారా? మీరే గెలవాలని పట్టుబడుతున్నారా? అప్పుడు పిల్లలు లోలోపల నలిగి పోవడం కన్నా ఏం చేయలేరు. పత్రికల్లో వస్తున్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి.‘నువ్వు ఆ కోర్సు చేయాలనేది మా కల’ అనే మాట తల్లిదండ్రుల నుంచి వెలువడితే అది పిల్లల నెత్తిమీద ఎంత బరువుగా మారుతుందో పిల్లలకే తెలుసు. టీనేజ్ మొదలయ్యి టెన్త్ క్లాస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ‘కలలు వ్యక్తపరచడం’ తల్లిదండ్రులు మొదలెడతారు. టెన్త్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో, ఇంటర్లో ఏ స్ట్రీమ్‌లోకి వెళ్లాలో, అందుకు ఏ కాలేజీలో చేరాలో, ఆ కాలేజీ ఏ ఊళ్లో ఉంటే బాగుంటుందో ఇన్ని డిసైడ్ చేసి పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు వినాలి. వారికి ఏ అభిప్రాయం లేకుండా ఆ కోర్సు పట్ల ఆసక్తి ఉంటే మంచిదే. వారికి మరేదో ఇంటరెస్ట్ ఉండి, ఇంకేదో చదవాలని ఉంటే... ఆ సంగతి చెప్పలేకపోతే ఇబ్బంది. అది భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టగలదు.ఏంటి... ఆ కోర్సా?ఆ ఇంట్లో తండ్రి అడ్వకేట్, తల్లి గవర్నమెంట్ ఉద్యోగి. కుమార్తెకు మేథ్స్గాని, బయాలజీగాని చదవాలని లేదు. హాయిగా టీచర్‌గా సెటిల్ అవ్వాలని ఉంది. తన స్కూల్లో చక్కగా తయారై వచ్చే టీచర్ పిల్లల పేపర్లు దిద్దే సన్నివేశం ఆ అమ్మాయికి ఇష్టం. తాను కూడా టీచరయ్యి పేపర్లు దిద్దాలని అనుకుంటుంది. టెన్త్ అవుతున్న సమయంలో ‘టీచర్ అవుతాను’ అని కూతురు అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ‘మన హోదాకు టీచర్ కావడం ఏం బాగుంటుంది... మన ఇళ్లల్లో టీచర్లు ఎవరూ లేరే’ లాంటి మాటలు చెప్పి ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చేయలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. డిప్రెషన్ తెచ్చుకుంది. అదే ‘టీచర్ కావాలనుకుంటున్నావా? వెరీగుడ్. అక్కడితో ఆగకు. నువ్వు హార్వర్డ్‌లో ప్రోఫెసర్ అవ్వాలి. అంత ఎదగాలి’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే హార్వర్డ్‌కు వెళ్లకపోయినా ఒక మంచి యూనివర్సిటీలో లెక్చరర్ అయినా అయ్యేది కదా.అన్నీ మాకు తెలుసుతల్లిదండ్రులకు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి ఉంటుంది. నిజమే. కాని వాళ్లు ఇప్పుడున్న స్థితి రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల దారుల్లో ప్రయత్నించి ఒక మార్గంలో సెటిల్ అయి ఉంటారు. తమ లాగే తమ పిల్లలు కూడా కొన్ని దారుల్లో నడవాలని అనుకోవచ్చు అని భావించరు. అన్నీ తమ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు, ఓవర్ కన్సర్న్ చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఉదాహరణకు ఒకబ్బాయికి ‘నీట్’లో మెడిసిన్ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. కాని డెంటిస్ట్రీ సీటు వచ్చే ర్యాంకైతే వచ్చింది. అబ్బాయికి ఆ కోర్సు ఇష్టమే. కాని తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలాగైనా ఎంబిబిఎస్ మాత్రమే చదవాలనేది ‘కల’. ‘లాంగ్ టర్మ్ తీసుకో’ అని సూచించారు. లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం వృథా అవుతుంది... పైగా ఈసారి ఎంట్రన్స్‌లో కూడా మంచి ర్యాంక్ వస్తుందో రాదో అనే భయం ఆ అబ్బాయికి ఉన్నా బలవంతం చేస్తే ఎంత చెప్పినా వినకపోతే ఆ అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అవ్వడా?ప్రతిదీ నిర్ణయించడమేతల్లిదండ్రుల స్తోమత పిల్లలకు తెలుసు. వారు చదివించ దగ్గ చదువులోనే తమకు ఇష్టం, ఆసక్తి, ప్రవేశం ఉన్న సబ్జక్టును చదవాలని కోరుకుంటారు. పైగా తమ స్నేహితుల ద్వారా వారూ కొంత సమాచారం సేకరించి ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు చదవాలని నిశ్చయించుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికి ఏ మాత్రం విలువ లేకుండా ఎలాగైనా చేసి రికమండేషన్లు పట్టి తాము ఎంపిక చేసిన కాలేజీలోనే చదవాలని శాసిస్తారు. ఇది అన్నివేళలా సమంజసం కాదు. ఒత్తిడి వద్దుటీనేజ్ సమయంలో పిల్లల భావోద్వేగాలు పరిపక్వంగా ఉండవు. కొంత తెలిసీ కొంత తెలియనితనం ఉంటుంది. ఆసక్తులు కూడా పూర్తిగా షేప్ కావు. ఇంటర్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి వారికి ఎన్నో సందేహాలుంటాయి. ఎంపికలు ఉంటాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ‘తాము చదివించాలనుకున్న కోర్సు’ కోసం ఏకంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇంట్లో ఉండి చదివే వీలున్నా రెసిడెన్షియల్ కాలేజీల్లో పడేస్తున్నారు. అంతంత మాత్రం చదువు చెప్పినా పర్లేదని మెడిసన్ పట్టా ఉంటే చాలని ఆసియా దేశాలకు సాగనంపుతున్నారు. పిల్లలతో ఎంతో మాట్లాడి, కౌన్సెలింగ్ చేసి, మంచి చెడ్డలన్నీ చర్చించి, వారికి సంపూర్ణ అవగాహన కలిగించి రెండు ఆప్షన్లు ఇచ్చి వారి ఆప్షన్లు కూడా పరిగణించి సానుకూలంగా ఒక ఎంపిక చేయడం ఎప్పుడూ మంచిది. లేదంటే ‘కోటా’ లాంటి కోచింగ్ ఊర్లలో జరుగుతున్న విషాదాలు, హైదరాబాద్‌లాంటి చోట్ల ఇల్లు విడిచి పోతున్న సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది. -
అక్కడో రీతి.. ఇక్కడో తీరు
సాక్షి, హైదరాబాద్: విద్యావిధానంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య భిన్నమైన ధోరణుల నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు పాఠ్య ప్రణాళికలు అవసరమని ఉన్నత విద్యా మండలి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ భావిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో భిన్న కోర్సులను రూపొందించేందుకు కసరత్తు చేపట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని యూనివర్శిటీలతో కలిసి మానవ వనరుల అభివృద్ధికి కార్యాచరణను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక్కడ టెక్‌లు, సాఫ్ట్వేర్లు.. అక్కడ సివిల్స్ టార్గెట్ వయా డిగ్రీలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. సగానికి పైగా ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాదికే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 3,39,405 సీట్లు ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, ఆరేళ్లలో అవి 5.3 శాతం మాత్రమే పెరిగాయని మండలి గుర్తించింది. స్కిల్.. పాలన నైపుణ్యంపై దృష్టి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న పాలనాపరమైన మార్పులు, ప్రైవేటు రంగంలో వస్తున్న సరికొత్త డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠ్యాంశాలు రూపొందించాలని ఏఐసీటీఈ, యూజీసీ భావిస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టాలని గుర్తించింది. పారిశ్రామిక భాగస్వామ్యంతో ఇంజనీరింగ్ విద్యను ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలపై ఫోకస్ చేయాలని భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలో విధివి«దానాలు వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
భళా.. కైవల్య!
నిడదవోలు: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల కైవల్యరెడ్డి (15) వ్యోమగామి కావాలన్న కలను నెరవేర్చుకునే దిశగా ఓ అడుగు ముందుకేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్పీ (ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్‌స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం (ఐఏఎస్పీ) శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు 10 రోజుల పాటు వ్యోమగావిుకి సంబంధించిన పలు ఆంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 మందికే ఈ అవకాశం లభిస్తోంది. 2023లో భారత్ నుంచి ఎంపికైన వారిలో కైవల్యరెడ్డి ఒకరు. ఆమె ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అతి చిన్న వయసులో ఐఏఎస్‌పీకి ఎంపికై శిక్షణ పూర్తి చేస్తున్న భారతీయురాలిగా రికార్డు సైతం నమోదు చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ముందస్తుగా ఇచ్చే శిక్షణను నాసా ద్వారా అందించారు. ఇందులో భాగంగా సొంతంగా విమానం నడపడం, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్ తదితర ఆంశాలల్లో కైవల్య శిక్షణ తీసుకుంది. కైవల్య సాధించిన విజయాలివీ ► ఆస్టరాయిడ్‌ను గుర్తించి.. స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ (న్యూఢిల్లీ) అంబాసిడర్ బృంద సభ్యురాలిగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికైంది. ► అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరఫున చిన్నప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్న కైవల్యరెడ్డిని 2023లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతి అందించారు. ► కైవల్య ఇటీవల అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు సొంతం చేసుకుంది. ► జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ అస్ట్రానమి, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీలలో కైవల్యరెడ్డి మూడు రౌండ్లలో ప్రతిభ కనబరిచి సిల్వర్ ఆనర్‌ను సాధించింది. వ్యోమగామి కావాలన్నదే లక్ష్యం వ్యోమగామి కావడమే లక్ష్యంగా నాసా ఐఏఎస్పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేశాను. నా లక్ష్యానికి ఇది తొలి మెట్టు. ఈ స్ఫూర్తితో భవిష్యత్‌లో ఖగోళ శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే నా లక్ష్యం. ప్రభుత్వం నుంచి రూ.6.70 లక్షలు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – కుంచాల కైవల్యరెడ్డి -
వ్యోమగావిునవుతా
తిరుపతి సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో తిరుపతికి చెందిన ఓ విద్యార్థిని వ్యోమగామి కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా ఓ అడుగు ముందుకేసింది. ‘నాసా’ అందిస్తున్న ఐఏఎస్పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నవంబర్ నెలలో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ) అందిస్తోంది. విద్యార్థులకు పది రోజులపాటు వ్యోమ గావిుకి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 మందికే ఈ అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది భారత్ నుంచి కేవలం నలుగురే ఎంపికయ్యారు. ఇందులో తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో బీటెక్ ఈసీఈ సెకండియర్ చదువుతున్న కాలువ జోషితారెడ్డికి అవకాశం దక్కింది. కానీ తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. ఎంపీ మిథున్‌రెడ్డి ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. రూ.25 లక్షల ఆర్థిక సాయం చేయడంతో జోషితా అమెరికా వెళ్లింది. ఈనెల 11 నుంచి ప్రారంభమైన ఐఏఎస్పీ శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నాసా నుంచి ధ్రువపత్రంతో పాటు శిక్షణలో ప్రతిభ కనబరిచినందుకు యూఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్ ప్రతినిధుల నుంచి బెస్ట్ ట్రైనర్ అవార్డు కూడా అందుకుంది. అమెరికా నుంచి తిరుపతికి వచ్చిన ఆమె ఆదివారం తల్లి శ్రీలతారెడ్డితో కలసి ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా ‘నాకు చిన్న వయసు నుంచి వ్యోమగామి కావాలని కోరిక ఉంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ చదువుతూ ఉండేదాన్ని. యూఎస్ స్పేస్ సెంటర్, నాసా ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 మందిని ఐఏఎస్పీ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేస్తుందని తెలియడంతో దరఖాస్తు చేశాను. అన్ని ఇంటర్వూ్యల్లో సెలెక్ట్ అయ్యాను. కానీ తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో అమ్మతో పాటు స్థానిక నాయకుడు ప్రతాప్‌రెడ్డి సహకారంతో ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి నా సమస్య తీసుకెళ్లాను. ఆ తర్వాత నాకు సీఎం జగన్ రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారు. దీంతో అమెరికా స్పేస్ సెంటర్లో శిక్షణ పూర్తి చేశాను. శిక్షణ పూర్తిగా వ్యోమగాములు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో జరిగింది. ఇందులో ముఖ్యంగా పైలెట్ డ్రైవింగ్, మూన్ గ్రావిటీ, స్కూబా డైవింగ్, మల్టీయాక్సిస్ చైర్, స్పేస్ రిలేటెడ్ వర్క్‌షాప్ తదితరాలపై శిక్షణలిచ్చారు. ఈ అరుదైన అవకాశం కల్పించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా. భవిష్యత్‌లో వ్యోమగామిగా ప్రపంచానికి సేవలందించాలని ఉంది’ అని జోషిత చెప్పారు. ప్రభుత్వ సాయం మరువలేనిది.. జోషితా తల్లి శ్రీలతారెడ్డి మాట్లాడుతూ.. ‘మా స్వస్థలం అన్నమయ్య జిల్లా కలికిరి. భర్త లేకున్నా.. పిల్లల చదువు కోసం తిరుపతిలో ఉంటున్నాం. చిన్నప్పటి నుంచి జోషితకు స్పేస్‌పై ఆసక్తిగా ఉండడంతో ప్రోత్సహించాను. నాసా ఐఏఎస్పీ ప్రొగ్రామ్‌కు పాప ఎంపికైన విషయం తెలియగానే.. ఖర్చు విషయాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఆ వెంటనే సీఎం జగన్మోహన్రెడ్డి పెద్ద మనస్సుతో రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆయన అందించిన సాయం మరువలేనిది. చదువులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం’ అని చెప్పారు. -
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్‌కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్‌లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్‌్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
సహజ జీవన గమనం! అదే అత్యంత శుభదాయకం
మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఏవిధంగా ప్రవర్తించాలి అని తెలిపే జైన్ కథలు మానావళి ఓ గోప్ప వరం. అవి మనిషి బుద్ధిని వికసింప చేసి ఆలోచింప చేసేవిగా ఉంటాయి. ధర్మా ధర్మాలని చాలా చక్కగా విపులీకరించి ఎంతటి చిన్నపిల్లవాడికైన సులభంగా అర్థమవుతాయి. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ కథలు మనస్సు ప్రశాంతతకు ఓ చక్కటి ఔషధంలా ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈ జైన్ కథలు. ఈ రోజు చెప్పే జైన్ కథ దేని గురించి తెలుసా..! అసలైన మహత్యం అంటే.. జెన్ గురువు ‘బన్‌కెయి’ ఓ నాడు బౌద్ధ విహారంలో ప్రవచనం చేస్తుండగా వేరే బౌద్ధ శాఖకు చెందిన ఒకాయన అక్కడకు వచ్చి సభలో పెద్దగా మాట్లాడుతూ అలజడి సృష్టించాడు. బన్కెయికి వచ్చిన మంచిపేరంటే అతడికి అసూయ. బన్‌కెయి మాట్లాడటం ఆపి గొడవకు కారణం ఏమిటని అడిగాడు. వచ్చిన ఆ ఆగంతకుడు అన్నాడు: ‘మా శాఖను స్థాపించిన గురువు ఎటువంటి గొప్ప మాహాత్మ్యాలు చెయ్యగలడంటే, నదికి ఇవతల గట్టు మీద కుంచె పుచ్చుకొని ఉండి, అవతల గట్టుమీద ఎవరైనా అట్ట పుచ్చుకొని ఉంటే, దానిమీద ఆ కుంచెతో బొమ్మ గీయగలడు. నీవు అలాంటి మహత్తు చెయ్య గలవా?’ బన్‌కెయి సమాధానం చెప్పాడు: ‘అలాంటి తంత్రం మీ గురువు చెయ్యగలడేమో కాని, అది జెన్ పద్ధతి కాదు. నేను చేసే మహత్తు ఏమిటంటే, నాకు ఆకలైనప్పుడు తింటాను. దాహమైనప్పుడు తాగుతాను.’ అదే అత్యంత శుభదాయకం ఓ ధనవంతుడు, జెన్ గురువు ‘సెన్‌గయి’ని అడిగాడు, తన వంశాభివృద్ధికి శుభదాయకమైన వాక్యం ఒకటి వ్రాసివ్వమనీ, దాన్ని తరతరాలుగా దాచి ఉంచుకొంటామనీ! సెన్‌గయి పెద్ద కాగితం ఒక దాన్ని తెప్పించుకొని, దాని మీద ఇలా రాశాడు: ‘తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మన వడు చనిపోతాడు. ’ధనవంతుడికి కోపం వచ్చింది. ‘నేను నిన్ను నా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఏదైనా రాసివ్వమని అడిగాను. నీవేంటి ఇలా నన్ను ఎగతాళి పట్టిస్తున్నావు?’ ‘ఇందులో ఎగతాళి ఏం లేదు’ వివరించాడు సెన్‌గయి. ‘నీవు చనిపోకముందే నీ కొడుకు చనిపోయినాడనుకో. అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. నీకంటే, నీ కొడుకు కంటే ముందే, నీ మనవడు చనిపోయినాడనుకో, మీ ఇద్దరి గుండె పగిలిపోతుంది. అలా కాకుండా, నీ కుటుంబం తరతరాలుగా నేను పేర్కొన్న వరుసలో గతించినారనుకో, అది సహజమైన జీవన గమనం అవుతుంది. దీన్ని నేను శుభదాయకం అంటాను.’ – దీవి సుబ్బారావు -
2012లో ఇంజినీరింగ్ .. 2023లో ఎంబీబీఎస్.. తీరని కల నెరవేరుతోందిలా..
ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఒక విద్యార్థి మెడికల్ కోర్సు చేసేందుకు జార్ఖండ్‌లోని ధన్బాద్లో గల షహీద్ నిర్మల మెహతో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. విద్యార్థి చందన్ కుమార్ ఎడ్మిషన్ ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఎంబీబీఎస్‌లో చేరడమనేది ఈ కాలేజీలో ఇదే మెదటిసారి. చందన్ ఎంబీబీఎస్ చేసేందుకు రూ.18 లక్షల శాలరీ ప్యాకేజీని కూడా వదులుకోవడం విశేషం. ఎన్ఐసీ వరంగల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చందన్ కుమార్ తల్లి ఐఐటీ ఐఎస్‌ఎంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ తీసుకునేందుకు వచ్చిన చందన్ మాట్లాడుతూ వైద్యుడు కావాలన్నది తన చిరకాల స్వప్నం అని అన్నారు. ఐఎస్ఎం ఎనెక్సీ నుంచి 2008లో ప్లస్ టూ పూర్తి చేసిన అనంతరం చందన్ అటు మెడికల్, ఇటు ఇంజినీరింగ్ రెండింటిలో ఎడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. అయితే మెడికల్‌లో అతనికి సీటు లభ్యం కాలేదు. దీంతో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. ఎన్ఐసీ వరంగల్(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో బయోటెక్నాలజీలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తరువాత ఉద్యోగంలో చేరాడు. ప్రత్యేక శిక్షణ లేకుండానే.. అయితే ఎంబీబీఎస్ చేయాలన్న కల అతన్ని నిద్రపోనివ్వలేదు. దీంతో 2015లో మెడికల్ ఎంట్రన్స్ రాసి విజయం సాధించాడు. అయితే తగిన ర్యాంకు రాకపోవడంతో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ దొరకలేదు. అయితే ఈసారి మెడికల్ ఎంట్రన్స్‌లో 2,650వ ర్యాంకు దక్కించుకున్నాడు. దీంతో ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్‌లో సీటు కోసం తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, తాను గతంలో 12వ తరగతిలో చదుకున్న దానినే తిరిగి అధ్యయనం చేశానన్నారు. భార్య ఎస్బీఐలో మేనేజర్ ఏఎన్‌ఎంఎంసీహెచ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేశాక డాక్టర్ కావాలనుకోవడం గొప్ప విషయం అని అన్నారు. తమ కాలేజీలో ఈ విధమైన అడ్మిషన్లలో ఇది మొదటిదని అన్నారు. చందన్ కుమార్ భార్య అపర్ణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే చందన్ సోదరి గౌరి కుమారి బీహార్ విద్యాశాఖలో పనిచేస్తున్నారు. మరో సోదరి ఎంఏ చేస్తున్నారు. ఆమెకు కూడా వివాహం అయ్యింది. ఇది కూడా చదవండి: ‘ఇండియా జేమ్స్ బాండ్’ సౌదీలో ఏం చేస్తున్నారు? -
కొత్త నిబంధనలు వచ్చేశాయ్.. ఎంబీబీఎస్ 9 ఏళ్లలో పూర్తి చేయాలి
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సును విద్యార్థులు తొమ్మిదేళ్లలోగా పూర్తి చేయాలని, ఫస్టియర్‌ను నాలుగు ప్రయత్నాల్లో పూర్తి చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తాజాగా నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈ నెల 2న గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్–2023(జీఎంఈఆర్–23) గెజిట్‌ను విడుదల చేసింది. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ పొందిన తేదీ నుంచి తొమ్మిదేళ్లలోగా ఆ కోర్సును విద్యార్థులు పూర్తి చేయాలి. ఎంబీబీఎస్ కోర్సులో మొదటి సంవత్సరం పూర్తి చేసేందుకు విద్యార్థులకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగుకు మించి ప్రయత్నాలకు అవకాశమివ్వరు. వైద్య సంస్థల్లో గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్–యూజీ మెరిట్ లిస్ట్ ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్ ఉండాలి. చదవండి: రూ.10 అడిగితే ప్రాణం తీశాడు -
ఎంఎల్టీ చదువు.. ఉద్యోగం పట్టు
నెల్లిమర్ల: పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ తదితర ఉన్నత విద్యనభ్యసించినా ఉద్యోగం దొరకని రోజులివి. ప్రభుత్వ ఉద్యోగం లభించాలంటే అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి, లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ఉద్యోగాలకు సైతం సిఫారసులు తెచ్చుకోవాల్సిన దుస్థితి. అయితే పదోతరగతి అర్హతతో రెండేళ్ల పాటు చదివే ఆ కోర్సుకు మాత్రం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇంటర్ మీడియట్ స్థాయిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ కోర్సుతో ఉన్నత చదువులకు సైతం అవకాశం ఉంటుందంటున్నారు. అదే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుబాటులో నున్న మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) కోర్సు. అందుబాటులో ఉన్న సీట్లు ఉమ్మడి జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్‌కోట, సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అందుబాటులో ఉంది. ఒక్కో కళాశాలలో 40 చొప్పున సీట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీవరకు ప్రవేశాలకు అవకాశముంది. ఇవి కాకండా మరో 18 ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఎంఎల్టీ కోర్సు అందుబాటులో ఉంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అవకాశముంది. కోర్సులో చేరే విద్యార్థులు రెండేళ్ల పాటు చదవాల్సి ఉంటుంది. థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఉన్నత చదువులకు అవకాశం ఇంటర్మీడియట్‌తో సమానమైన ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బీఎస్సీలో ఎంఎల్టీ చదవడానికి అవకాశముంది. అలాగే బీఎస్సీలో మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ కోర్సులు చదవవచ్చు. అంతేకాకుండా ఎంసెట్ ప్రవేశపరీక్ష రాయడానికి అవకాశముంటుంది. బీఎస్సీలో బీజెడ్సీ బ్రిడ్జి కోర్సుగా చదివే వీలుంది. ఉద్యోగాలు పొందిన విద్యార్థులు వీరే నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వి.భవాని ఎస్‌కోట మండలం పీఎం పాలెం పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం సాధించారు. కోరాడ ఉమామహేశ్వరరావు పూసపాటిరేగ మండలం గోవిందపురం పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఎం శ్రీదేవి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో, జె.ప్రణతి, ఎస్ భారతి, బి.అక్షిత, జె.శైలజ, బి.తేజసాయి, బి.అజయ్‌కుమార్ న్యూ లైఫ్ బ్లాడ్ బ్యాంకులోనూ ఉద్యోగాలు సాధించారు. ఈ కోర్సు చదివిన అందరూ ఏదో విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మిగిలిన వారంతా స్వయంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకుని, స్వయం ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగం గ్యారంటీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) కోర్సుతో ఉద్యోగం కచ్చితంగా లభిస్తుంది. ప్రతిభ ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు. నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట, సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూప్ అందుబాటులో ఉంది. వచ్చేనెల 20వ తేదీవరకు ప్రవేశాలకు అవకాశముంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలి. – మజ్జి ఆదినారాయణ, ఆర్ఐఓ -
ఫైటర్ పైలట్ కోర్సుకు గురుకుల విద్యార్థి ఎంపిక
సాక్షి, హైదరాబాద్: భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ కోర్సుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థి అశోక్ సాయి ఎంపికయ్యాడు. కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్ సైనిక గురుకుల పాఠశాలలో అశోక్ సాయి చదివాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి అతని స్వగ్రామం. అశోక్ తండ్రి వికలాంగుడు. కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపిక కావడం పట్ల అశోక్‌సాయి, అతని తల్లిదండ్రులు సంతోషంవ్యక్తంచేశారు. దీనిపై ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందిస్తూ పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపిక కావడం పట్ల తెలంగాణ రాష్ట్రం గర్వపడుతుందని కొనియాడారు. -
చదువులకు ‘బ్రిడ్జి’ వేద్దాం.. నష్టాన్ని అధిగమిద్దాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కాలంలో విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చటంపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా విద్యాబోధన సరిగ్గా సాగే పరిస్థితి లేకపోవడం, అయినప్పటికీ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారి కోసం బ్రిడ్జి కోర్సు తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై త్వరలో సమీక్షించి వచ్చే విద్యా సంవత్సరంలో చర్యలు తీసుకోనుంది. లోపించిన ఏకాగ్రత: గత రెండేళ్లుగా రాష్ట్రంలో 17,27,892 మంది విద్యార్థులు ఆన్లైన్ విద్యకే పరిమితమయ్యారు. అయితే వారిలో 1,17,570 మంది పేద విద్యార్థులు డిజిటల్ ఉపకరణాలు లేని కారణంగా ఆన్లైన్ పాఠాలు సైతం వినలేక పోయినట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేలు వెల్లడించాయి. డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఎంతో కొంత విద్య అందు బాటులోకి వచ్చినా విద్యార్థుల అభ్యసన, పరిశీలన, ఆచరణలో పూర్తిగా మార్పులొచ్చాయనేది అనేక సర్వేలు నిరూపించాయి. కరోనా తర్వాత జాతీయ స్థాయిలో ‘నిసా’ అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం 30% మంది విద్యార్థులు మాతృభాషలో చదవ డంలో ఇబ్బందిపడుతున్నారు. 3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం పిల్లలు మాతృభాషలో రాయడంలోనూ వెనుకబడ్డారు. ఆంగ్ల భాషలో 35 శాతం మంది విద్యార్థులు పట్టుకోల్పోయారు. 19 శాతం మంది విద్యార్థులకు ఆంగ్లం చదవడం కష్టంగా కన్పిస్తోంది. 40 శాతం మంది గణితంలో సాధారణ సూత్రాలను కూడా గుర్తుతెచ్చుకోలేకపోతున్నారు. మొత్తంగా చూస్తే బేసిక్స్‌పై దెబ్బకొట్టిన కరోనా వల్ల పైతరగతుల్లో విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. పునాది గట్టిగా లేకపోవడం వల్ల హోంవర్క్ ఇచ్చినా చెయ్యలేని స్థితిలో ఉన్నారు. క్లాసుల్లో పాఠాలు అర్థం కావడం లేదని చెబుతున్నారు. దీనివల్ల సామర్థ్యం దెబ్బతింటోంది. సలహాలు స్వీకరిస్తున్న ఎస్సీఈఆర్టీ.. విద్యాభ్యాసంలో గత రెండేళ్లుగా విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, ఉన్నతాధికారులు, సూచిస్తున్నారు. అన్ని కోణాల్లోంచి వస్తున్న సర్వేల నేపథ్యంలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) కూడా దృష్టి పెట్టింది. నష్టాన్ని పూడ్చడంపై అన్నివైపుల నుంచి సలహాలు తీసుకుంటోంది. ఆచరణీయమైన ఆలోచన తేవాలి.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులను ఆకర్షించేలా వారు మర్చిపోయిన పాఠ్యాంశాలను బోధించే ప్రయత్నం చేయాలి. దీన్నో సామాజిక బాధ్యతగా చేపట్టాలి. ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఇది సాధ్యం. కరోనా వల్ల మూలసూత్రాల అధ్యయనంలో నష్టం వాటిల్లింది. దీన్నే ప్రధానంగా బ్రిడ్జి కోర్సులో చేరిస్తే బాగుంటుంది. – ఎస్.ఎన్.రెడ్డి, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి -
అదిరిపోయే ఆఫర్! క్రిప్టో కరెన్సీపై ఉచిత కోర్సు
న్యూఢిల్లీ: హరిద్వార్ కేంద్రంగా నడిచే ప్రముఖ విద్యా సంస్థ గురుకుల కంగ్రి.. క్రిప్టో ఎక్సేంజ్ వాజిర్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఉచిత కోర్సును ఆఫర్ చేయనుంది. కోర్సు పూర్తయిన తర్వాత గురుకుల కంగ్రి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తుంది. గురుకుల కంగ్రికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది. మల్లగుల్లాలు ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలు క్రిప్టో కరెన్సీకి భవిష్యత్తు ఉందని చెబుతున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ వంటి వారు ఇప్పటికే ఇందులో భారీ ఎత్తు పెట్టబడులు పెడుతున్నారు. అమెరికా తర్వాత అత్యధికంగా క్రిప్టో వైపు చూస్తున్న యువత ఇండియాలోనే ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీకి చట్టపరమైన అనుమతులు ఇచ్చే అంశాన్ని ఇటీవల కేంద్ర కేబినేట్ పరిశీలించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డిజిటల్ కాయిన్ తేవాలనే డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు క్రిప్టోకి వ్యతిరేకంగా వద్దంటూ గళం విప్పాయి. దీంతో క్రిప్టో అనుమతుల విషయంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం.. 2021–22 విద్యాసంవత్సరానికి వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివరాలు ► పీజీ ప్లొమా ఇన్ జర్నలిజం(పీజీడీజే)– కోర్సు కాల వ్యవధి 12 నెలలు. ► డిప్లొమా ఇన్ జర్నలిజం(డీజే)–కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ► డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం(డీటీవీజే)–కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ► సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం(సీజే)–కోర్సు కాల వ్యవధి మూడు నెలలు. ► విద్యార్హత: సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం కోర్సుకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా కోర్సులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ► ప్రవేశ విధానం: ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్ని రెగ్యులర్ గాను, కరస్పాండెన్స్ (దూర విద్య) విధానంలోనూ చేయొచ్చు. ఆన్లైన్ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి నుంచే పాఠ్యాంశాలు లైవ్‌లో వినొచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో కళాశాల వెబ్సైట్ (www.apcj.in) ద్వారా పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ► దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021 ► అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 14.08.2021 ► వెబ్సైట్: www.apcj.in -
క్రీడా రంగంలో అద్భుతమైన కెరీర్.. ముఖ్యమైన సమాచారం మీకోసం
ప్రపంచ క్రీడా వేదిక టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు చక్కటి ప్రతిభ చూపుతున్నారు. అంతర్జాతీయంగా పలు అంశాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారు. అయినప్పటికీ నేటికీ చాలామంది తల్లిదండ్రులు ఆటలతో కెరీర్ కష్టమనుకుంటారు. అందుకే పిల్లలను ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి కోర్సుల వైపు పోత్సహించినట్టుగా.. క్రీడల వైపు ప్రోత్సహించడం లేదు. వాస్తవానికి ప్రతిభ ఉంటే.. స్పోర్ట్స్ రంగంలోనూ అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో స్పోర్ట్స్ కోర్సులను అందించేందుకు ప్రత్యేకంగా ‘నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(ఇంపాల్)’ని∙ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరెన్నో పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్, స్పోర్ట్స్ కాలేజీలు పలు కోర్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో స్పోర్ట్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... మన యువత జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ.. క్రీడలను కూడా కెరీర్‌గా మలచుకోవచ్చని నిరూపిస్తోంది. పలువురు స్పోర్ట్స్‌తో పేరు ప్రఖ్యాతులతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకుంటున్నారు. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. క్రికెట్ ఒక్కటే కాదు.. హాకీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, సైక్లింగ్, చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ వంటి క్రీడలపైనా ఆసక్తి ఎక్కువే. ఆయా క్రీడాకారులకు అంతర్జాతీయంగా అద్భుతమైన గుర్తింపు లభిస్తోంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కోహ్లీ, సానియా మీర్జా, పీవీ సింధు, అభినవ్ బింద్రా, సుశీల్ కుమార్, విశ్వనాథ్ ఆనంద్, మేరీకోమ్ వంటి వారే అందుకు నిదర్శనం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు క్రీడాకారుడిగా రాణించాలంటే.. ఎంచుకున్న క్రీడలో ప్రతిభతోపాటు బలమైన సంకల్పం, పట్టుదల చాలా అవసరం. ⇔ ఒక వయసు దాటాక స్పోర్ట్స్ కెరీర్ ముగిసినట్టే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. క్రీడాకారుడిగా కెరీర్ ముగిసిన తర్వాత కూడా అద్భుతమై రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోచింగ్, అథ్లెటిక్ అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ ప్రమోషన్, స్పోర్ట్స్ సెకాలజీ, స్పోర్ట్స్ మార్కెటింగ్ వంటి అనుబంధ రంగాల్లో ప్రవేశించవచ్చు. ⇔ స్పోర్ట్స్ ప్లేయర్, స్పోర్ట్స్ టీచర్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ కోచ్ అండ్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్, పర్సనల్ ట్రైనర్, ప్రొఫెషనల్ అథ్లెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, హెల్త్ అడ్వైజ్ ఆఫీసర్ వంటి విభాగాల్లో రాణించవచ్చు. ⇔ స్కూల్ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపినవారికి ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలోని వివిధ స్పోర్ట్స్ సంస్థలు, అకాడమీలు శిక్షణనిస్తున్నాయి. చురుకైన యువతకు చక్కటి శిక్షణ ఇచ్చి.. ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకూ క్రీడలకు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు పలు స్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా » బీఎస్సీ–స్పోర్ట్స్ కోచింగ్ » బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్) » ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్(రెండేళ్లు) » ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ(రెండేళ్లు) » ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ, ఎంఎస్సీ/ఎంఫీల్/పీహెచ్డీ స్పోర్ట్స్ సైకాలజీ తదితర కోర్సుల్లో చేరే అవకాశముంది. ప్రవేశం–అర్హతలు స్పోర్ట్స్ కోర్సుల్లో ప్రవేశానికి పలు అర్హతలు నిర్దేశించారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సుల్లో చేరవచ్చు. యూజీ కోర్సులు పూర్తిచేసినవారు పీజీ కోర్సులకు వెళ్లవచ్చు. ఎంబీబీఎస్ తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా చేయవచ్చు. అభ్యర్థుల అకడెమిక్ మెరిట్ ,టెస్టులు, క్రీడా ప్రతిభ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. పలు స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లు ⇔ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఇంపాల్); ⇔ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(పటియాలా); ⇔ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ (న్యూఢిల్లీ); ⇔లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (గ్వాలియర్); ⇔లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (తిరువనంతపురం); ⇔టాటా ఫుట్‌బాల్ అకాడమీ (జంషెడ్పూర్); ⇔ నేషనల్ క్రికెట్ అకాడమీ (బెంగళూరు); ⇔ ఢిల్లీ యూనివర్సిటీ. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంలోని యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఇది. ఈ వర్సిటీ 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ యూజీ/పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది. ► బీఎస్సీ–స్పోర్ట్స్ కోచింగ్: నాలుగేళ్ల కాలపరిమితి గల బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ కోర్సులో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 50 శాతం, అభ్యర్థి క్రీడా ప్రతిభకు మరో 50 శాతం మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్): బీపీఈఎస్ కోర్సు కాలపరిమితి మూడేళ్లు. ఇంటర్మీడియెట్(10+2)లేదా తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌లో 70 శాతం, క్రీడల్లో చూపిన ప్రతిభకు 30 శాతం వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్(రెండేళ్లు): బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్/గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, బీపీఈఎస్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్/ బీపీఈడీ లేదా తత్సమాన కోర్సుల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 100 మార్కులు, క్రీడా ప్రతిభకు 30 మార్కులు, వైవాకు 20 మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ(రెండేళ్లు): ఈ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి బీపీఈఎస్/ బీపీఈడీ/బీఏ(హానర్స్), బీఏ సైకాలజీ/స్పోర్ట్స్ సైకాలజీలో 50 మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 100 మార్కులు, వైవాకు 30 మార్కులు, క్రీడా ప్రతిభకు 20 మార్కుల వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ముఖ్య సమాచారం ► ఎన్ఎస్యూ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఆగస్టు 2021 ► ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్: 10 సెప్టెంబర్ 2021 ► ఫిజికల్ ఫిట్నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్: సెప్టెంబర్ 22–24 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nsu.ac.in స్సోర్ట్స్ సైకాలజీకి క్రేజ్ క్రీడాకారుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో సుశిక్షుతులైన స్పోర్ట్స్ సైకాలజిస్టులు కొరత నెలకొంది. దాంతో మన దేశ క్రీడా సంఘాలు అమెరికా,ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ సైకాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎంఏ,ఎంఎస్సీ సైకాలజీ కోర్సులు అందిస్తున్నా.. స్పోర్ట్స్ సైకాలజీ కోర్సు మాత్రం చాలా తక్కువ యూనివర్సిటీల్లో ఉంది.వాటిలో చెప్పుకోదగ్గవి.. ►గురునానక్‌దేవ్ యూనివర్సిటీ(అమృత్సర్): ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ. ►తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(చెన్నై): ఎంఎస్సీ/ ఎంఫిల్/ పీహెచ్డీ స్పోర్ట్స్ సైకాలజీ. ► రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ: ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ. ►లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(గ్వాలియర్):ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ. -
రోజూ 60 వేల మంది వీక్షణ
సాక్షి, హైదరాబాద్: ‘టి సాట్’ఇంజనీరింగ్ పాఠ్యాంశ ప్రసారాలపై విద్యార్థులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. జూలై 26న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమాలు 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 8.15 నుంచి 10.30 వరకు ‘టి సాట్ యాప్, విద్య, నిపుణ చానళ్లు, టి సాట్ ఫేస్బుక్ పేజీ, యూ ట్యూబ్ చానళ్ల ద్వారా విద్యార్థులు వీక్షిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటి వరకు రోజూ సుమారు 60 వేల మంది ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను వీక్షిస్తున్నట్లు ‘టి సాట్’లెక్కలు వేస్తోంది. ‘వెరీ లార్జ్‌స్కేల్ ఇంటిగ్రేషన్’(వీఎల్ఎస్ఐ) ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ అనే అంశంపై ఇప్పటి వరకు 12 పాఠ్యాంశాలను ‘టి సాట్’ప్రసారం చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు తరగతి గదులు, ఆఫ్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతున్నా తమ కెరీర్ నిర్మాణంలో అత్యం త కీలకమైన నైపుణ్యాలను విద్యార్థి దశలో సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ (టాస్క్) ఇతర సంస్థల భాగస్వామ్యంతో పాఠ్యాం శాలను రూపొందిస్తోంది. ఫొటోనిక్స్ వాలీ కార్పొరేషన్, వేద ఐఐటీ పాఠ్యాంశాల రూపకల్పనలో పా లుపంచుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలు, నైపుణ్యాల పెంపు, ఉద్యోగ అవకాశాలు, సంస్థాగత సాంకేతికత, ఇతర అంశాలపై ‘వీఎల్ఎస్ఐ’ప్రత్యేక్ష శిక్షణ కార్యక్రమాలు రూపొందుతున్నాయి. -
దేశంలో మొదటిసారిగా ‘ప్రెగ్నెన్సీ’ కోర్సు
దేశంలో మొదటిసారిగా ‘ప్రెగ్నెన్సీ’ కోర్సు మొదలవబోతోంది. అయితే ప్రెగ్నెంట్ అవడం ఎలా అనే సెక్స్ ఎడ్యుకేషన్ కోర్సు కాదు అది. గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సిలబస్‌లో ఉంటుంది. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అనేవి కూడా ఉంటాయి. లక్నో విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన ఈ కోర్సు పేరు ‘గర్భ సంస్కారం’. ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలకు ఉపకరించే ఈ కోర్సును మగవాళ్లు కూడా చేయవచ్చా అనే సందేహం అక్కర్లేదు. గర్భిణి జాగ్రత్త గర్భిణిది మాత్రమే కాదు కదా. కోర్సుకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. అబ్బాయిలూ మీరూ దర ఖాస్తు చేసుకోవచ్చు. -
లక్నో వర్సిటీలో గర్భ్ సంస్కార్ కోర్సు..
లక్నో : గర్భం దాల్చినప్పుడు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భ్ సంస్కార్ పేరిట లక్నో యూనివర్సిటీ దేశంలోనే తొలిసారిగా సర్టిఫికెట్, డిప్లమో కోర్సును ప్రారంభించనుంది. ఈ కోర్సులో భాగంగా గర్భిణులు ఎలాంటి దుస్తులు ధరించాలి, వారు తీసుకునే ఆహారం, ప్రవర్తనాశైలి, ఫిట్నెస్ సహా ఎలాంటి సంగీతం వినాలి వంటి పలు పాఠ్యాంశాల్లో తర్ఫీదు ఇస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్ధులకు ఉపాథి సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. గర్భ్ సంస్కార్ కోర్సు అభ్యసించేందుకు పురుష విద్యార్థులకూ అవకాశం కల్పిస్తామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్ధినులు భవిష్యత్‌లో తల్లులుగా మారే క్రమంలో ఆయా బాధ్యతలను చేపట్టేలా వారికి తగిన తర్ఫీదు ఇవ్వాలన్న రాష్ట్ర గవర్నర్, వర్సిటీల ఛాన్స్లర్ కూడా అయిన ఆనందిబెన్ పటేల్ సూచనలకు అనుగుణంగా అధికారులు ఈ తరహా కోర్సులకు రూపకల్పన చేశారని లక్నో వర్సిటీ ప్రతినిధి దుర్గేష్ శ్రీవాస్తవ తెలిపారు. గత ఏడాది వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఆనందిబెన్ మాట్లాడుతూ మహా భారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలోనే యుద్ధ నైపుణ్యాలను అందిపుచ్చుకున్న తీరును వివరించారు. జర్మనీలోని ఓ వర్సిటీలో ఈ తరహా కోర్సు ఉన్నట్టు కూడా ఆమె వెల్లడించారు. చదవండి : ఓయూ పీజీ హాస్టల్లో విద్యార్థి మృతి -
ఈ యూనివర్సిటీలో హ్యారీ పోటర్ పాఠాలు
కోల్‌కతా : హ్యారీ పోటర్ సిరిస్ సినిమాలకు, పుస్తకాలుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతేకాక ఈ నవలా రచయిత జేకే రోలింగ్‌కి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అభిమానులున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాసిన ఈ పుస్తకాలు చదువరులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు. అందుకే నిరంతరం ఒకే రకమైన సబ్జెక్ట్ చదువుతూ బోర్‌గా ఫీలయ్యే విద్యార్థుల కోసం ఈ సైన్స్ ఫిక్షన్ నవలని పాఠ్యాంశాలుగా చేర్చనుంది కోల్‌కతాలోని ఓ యూనివర్సిటీ. వివారాలు.. కోల్‌కతాలోని ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్’లో ఈ వినూత్న ప్రయోగం జరగనుంది. ‘యాన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఫాంటసీ ఫిక్షన్ లిటరేచర్ అండ్ లా : స్పెషల్ ఫోకస్ అన్ రోలింగ్స్ పోట్టర్వర్స్’ అనే పేరుతో ఈ కోర్స్‌ను ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇది ఈ ఏడాది వింటర్ సెమిస్టర్ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. నాలుగో సంవత్సరం, ఐదో సంవత్సరం బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ చదువుతున్న విద్యార్థులకు దీన్ని ఓ ఎలక్టివ్‌గా ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి యూనివర్సిటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘లా కాలేజ్‌లో విద్యార్థులకు వేర్వేరు అంశాలను బోధిస్తుంటాము. దాంతో పాటు ఇక్కడ నేర్చుకున్న లీగల్ అంశాలు బయట ప్రపంచంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి అనే పరిస్థితుల గురించి కూడా వారికి అవగాహన కల్పిస్తాము. ఆయా చట్టాలను నిజజీవితంలో ఎలా అన్వయించుకోవాలనే అంశాల గురించి మరింత బాగా నేర్పించడం కోసం ఇలాంటి వినూత్న అంశాలను చేర్చాము. వీటి వల్ల విద్యార్థులకు కూడా తమ కోర్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది’ అన్నారు. -
వ్యవసాయ వర్సిటీలో పలు కోర్సులకు కౌన్సెలింగ్
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ఏర్పడిన ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. వర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 24న ఉదయం 10కి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల్లో బైపీసీ స్ట్రీమ్ డిగ్రీ కోర్సుల్లో దివ్యాంగుల కేటగిరీ సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి 25న వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఠీఠీఠీ.p్జ్టట్చu.్చఛి.జీn లో చూడాలని ఆయన సూచించారు. వచ్చేనెల 21 నుంచి ప్రీప్రైమరీ శిక్షణ కోర్సు.. జయశంకర్ వర్సిటీ పరిధిలో హోంసైన్స్ కళాశాల.. మానవ అభివృద్ధి, కుటుంబ అధ్యయన విభాగం 21 రోజుల ప్రీప్రైమరీ శిక్షణ కోర్సును వచ్చే నెల 21 నుంచి నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ అసోసియేట్ డీన్ విజయలక్ష్మి తెలిపారు. సైఫాబాద్‌లోని గృహ విజ్ఞాన కాలేజీ ప్రాంగణంలో ఈ కోర్సు నిర్వహిస్తామని, అభ్యర్థులు 8019115363/ 9059320689 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
‘డెంటల్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ’
సాక్షి, హైదరాబాద్: డెంటల్ అసిస్టెంట్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గలవారు ఈ నెల 25లోగా మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. శిక్షణలో చేరాలంటే అభ్యర్థుల వయసు 21–45 ఏళ్లలోపు ఉండి ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలని, హైదరాబాద్ జిల్లా వాసి అయి ఉండాలని వెల్లడించింది. వివరాలకు 040–23319313ను సంప్రదించాలని సూచించింది. -
కెరీర్ కౌన్సెలింగ్..
పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో అందుబా టులో ఉన్న కోర్సులు, ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? – రామ్ కుమార్, హైదరాబాద్. ♦ సావిత్రిబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం.. ఎంఎస్సీ (పెట్రోలియం టెక్నాలజీ) కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ♦ వివరాలకు: www.unipune.ac.in ♦ రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ–రాయ్‌బరేలీ, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తుంది. ♦ అర్హత: పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు) నాలుగేళ్ల వ్యవధితో బీటెక్/బీఈ. తగిన గేట్ స్కోర్ కూడా ఉండాలి. ♦ వివరాలకు: www.rgipt.ac.in ♦ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)–డెహ్రాడూన్, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును అందిస్తోంది. ♦ అర్హత: హయ్యర్ అండ్ సెకండరీ లెవెల్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. 60 శాతం మార్కులతో పెట్రోలియం ఇంజనీరింగ్/అప్లైడ్ పెట్రోలియం ఇంజనీరింగ్/గ్యాస్ ఇంజనీరింగ్/పెట్రోలియం రిఫైనింగ్/పెట్రోకెమికల్ ఇంజనీరింగ్/జియోసైన్సెస్లో బీటెక్/బీఈ. తగిన గేట్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ♦ వివరాలకు: www.upes.ac.in -
బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సులో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ) 2017–18 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఫారెస్ట్రీ) నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు గుర్తించిన ఇంటర్మీడియెట్ లేదా తత్సమానమైన విద్యలో బయోలజీ (వృక్ష, జంతుశాస్త్రం), భౌతిక, రసాయనశాస్త్రాల ప్రయోగాల్లో పొందిన మార్కులను ఆధారంగా చేసుకొని మెరిట్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. అలాగే కళాశాల రూపొందించిన దరఖాస్తు ఫారంను వెబ్సైట్ ఠీఠీఠీ.జఛిటజ్టీట.జీnలో నింపి కావలసిన సర్టిఫికెట్ కాపీలు అప్‌లోడ్‌చేయాలని, జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్ అభ్యర్థులు రూ.250 రుసుం ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 15 కాగా, రూ.1000 ఫైన్‌తో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ ఫోన్ 8332975516/8333924137 లేదా ఈ మెయిల్ ్టటజఛిటజీ2016ఃజఝ్చజీl. ఛిౌఝను సంప్రదించవచ్చని ఎఫ్సీఆర్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఆర్‌యూలో మరో కొత్త కోర్సు
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్న 15 కోర్సులతో పాటు మరో కొత్త కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ తెలిపారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ఖనిజాల గనిగా పేరుగాంచిందని ఈ నేపథ్యంలో మైనింగ్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశలు అందిపుచ్చుకునేందుకు ఎర్త్ సైన్స్(భూ ఖనిజ శాస్త్రం) అనే కొత్త కోర్సు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో సున్నపురాయి, ఇనుము, యురేనియం, వజ్రాలు, బంగారం తదితర ఖనిజాల వెలికితీతలో మైనింగ్, కార్పొరేట్ కంపెనీలు ఎర్త్సైన్్స పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఇస్తాయన్నారు. ఈకోర్సుకు సైన్స్ లేదా మ్యాథ్స్ చదివిన డిగ్రీ విద్యార్థులు అర్హులు అని తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా పరిగణించి ఫీజు నిర్ణయిస్తామని, ఇందులో మొత్తం 30 సీట్లు ఉంటాయని వెల్లడించారు. -
‘సాక్షి మైత్రి’ ఆధ్వర్యంలో అడ్వాన్ డ్ బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
హన్మకొండ చౌరస్తా : సాక్షి మైత్రి ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 31 వరకు(ఆదివారాలు మినహా) అడ్వాన్ సడ్ బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తరగుతులను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా అడ్వాన్ సడ్ మెనిక్యూర్, బాత్ పౌడర్, పెడిక్యూర్, హెన్నా, ఫేస్ లిఫ్టింగ్ ఫేషియల్, పీల్ ఆఫ్ ఫేషియల్, ఐ ట్రీట్మెంట్, పింపుల్ ట్రీట్మెంట్లపై శిక్షణ అందిస్తారు. వీటితో పాటు ఆక్నే, స్కార్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్, పిగ్మెంటేషన్ ,హెయిర్‌స్పా, లైస్, అలోఫీషియా(పేను కొరుకుడు) ట్రీట్మెంట్లపై అవగాహన కల్పిస్తారు. హేయిర్ కలరింగ్, స్టెయ్రిటనింగ్, స్టైల్స్, శారీ వేరింగ్, గన్ షాట్, బాడీ మసాజ్, అల్టాస్రోనిక్, గాల్వానిక్ అంశాల గురించి అభ్యర్థులకు వివరించేందుకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. ఆసక్తి గల మహిళలు ఈ నెల 23 నుంచి 30 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పేర్లను నమోదు చేసుకోవచ్చు. శిక్షణ కోసం పేర్లను రిజిసే్ట్రషన్ చేసుకోవాల్సిన చిరునామా శ్రీ భరణి బ్యూటీ పార్లర్, లేబర్ ఆఫీసు కాంపౌండ్, ఇండో కిడ్స్ స్కూల్ పక్కన, బాలసముద్రం, హన్మకొండలో సంప్రదించాలి. పూర్తి వివరాలకు సెల్‌నంబర్ 95055 55020కి కాల్ చేయొచ్చు. శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. -
కెరీర్ కోర్సులకు బోధకులు కావాలి
నగర పాలక పాఠశాలల్లో పోస్టులు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పాఠశాలల్లో నిర్వహిస్తున్న కేరీర్ ఫౌండేషన్ కోర్సులను బోధించేందుకు అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని అదనపు కమిషనర్ పి.అరుణ్‌బాబు సూచించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ బోధించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో పీరియడ్‌కు రూ.250 గౌరవ వేతనమని తెలిపారు. బీఎస్సి, బీఈడీ, ఎంఎస్సీ, బీటెక్ అర్హత కల్గినవారు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. నగరపాలక సంస్థ ఉప విద్యాశాఖ అధికారి 98665 14224, జిల్లా కన్వీనర్ 81421 16699 లేదా దగ్గర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్ని సంప్రదించాలని సూచించారు. -
పీపీఓ.. కొలువుకు మార్గం
కోర్సు మధ్యలోనే క్షేత్ర నైపుణ్యం..రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌కు మార్గం.. ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతిభ చూపితే కొలువు ఖాయం.. వీటన్నిటికీ మార్గంగా నిలుస్తున్నాయి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్(పీపీవో). ముఖ్యంగా మేనేజ్మెంట్ విద్యార్థులు పీపీవోల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. కలల కెరీర్‌ను, కళ్లు చెదిరే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. త్వరలో ఐఐఎంలు, ఇతర బి-స్కూల్స్‌లో పీపీఓ డ్రైవ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కథనం.. విద్యార్థులు క్షేత్ర స్థాయి నైపుణ్యాలను అందుకునేందుకు మార్గం.. ఇంటర్న్షిప్స్. ఐఐఎంలు, ఇతర బీస్కూల్స్ స్థాయిలో.. ఇంటర్న్షిప్స్నే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ (పీపీవో)గా పేర్కొంటారు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్‌ను సొంతం చేసుకొని ఇంటర్న్‌గా కంపెనీలో అడుగుపెట్టి ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తే.. ఫైనల్ ప్లేస్‌మెంట్‌లోనూ అవకాశం అందుకోవచ్చు. పీపీఓలు పొందిన విద్యార్థులకు కంపెనీలు స్టైపెండ్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహం సైతం అందిస్తాయి. క్షేత్ర నైపుణ్యాలు.. ఆర్థిక చేయూత.. వీలుంటే కొలువు.. ఇలా అన్ని రకాలుగా బీస్కూల్స్ విద్యార్థులకు మేలు చేసేవే పీపీఓలు. నాలుగైదేళ్ల క్రితం వరకు ఐఐఎంలకే పరిమితమైన ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు.. ఇటీవలి కాలంలో ఇతర బి-స్కూల్స్‌కు సైతం విస్తరిస్తున్నాయి. 2016-18 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఆయా సంస్థలు ప్రీ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు.. దాదాపు అన్ని ఐఐఎంలలో, ఇతర బీస్కూల్స్‌లో సంబంధిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ఇటు క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రతినిధులు సైతం విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. పీపీఓలు ఎంత ఎక్కువగా లభిస్తే.. బీస్కూల్కు గుర్తింపు అంత ఎక్కువ అనే భావనతో ఇన్స్టిట్యూట్లు అడుగులు వేస్తున్నాయి. పీపీఓలు ఇద్దరికీ ఉపయుక్తం ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇటు కంపెనీలు.. అటు విద్యార్థులకు ఉపయుక్తంగా మారుతున్నాయి. విద్యార్థుల కోణంలో.. నిర్ణీత వ్యవధిలో కంపెనీలో పని చేసే అవకాశం లభిస్తుంది. కోర్సు చదువుతున్నప్పుడే క్షేత్ర నైపుణ్యాలు లభిస్తాయి. సీనియర్ల సలహాలు, సూచనలు అందుకోవచ్చు. కంపెనీల కోణంలో.. ప్రతిభావంతులను, సృజనాత్మకత, నిర్వహణ నైపుణ్యాలున్న మానవ వనరులను ఒడిసిపట్టుకునే అవకాశం ఉంటుంది. పీపీఓ ప్రక్రియ ఇలా ప్రస్తుతం ఐఐఎంలు, ఇతర బి-స్కూల్స్‌లో అమలవుతున్న ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ప్రక్రియకు నిర్దిష్ట విధానం అమలవుతోంది. పీపీవో పేరుతో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేయాలనుకునే కంపెనీలు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఇన్స్టిట్యూట్లలో అడుగుపెడతాయి. రెండేళ్ల మేనేజ్మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న అభ్యర్థుల కోసం ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ డ్రైవ్స్ నిర్వహిస్తాయి. ఔత్సాహిక అభ్యర్థులు ఈ ఎంపిక ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో కంపెనీలు ఫైనల్ ప్లేస్మెంట్ మాదిరిగానే వ్యవహరిస్తాయి. గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వీటిలో విజయం సాధించిన అభ్యర్థులకు పీపీఓలను ఖరారు చేస్తాయి. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఎంపిక ప్రక్రియ మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలో ముగుస్తోంది. గతేడాది ఐఐఎం కోజికోడ్‌లో కేవలం మూడు రోజుల్లోనే మూడు వందలకు పైగా విద్యార్థులకు పీపీఓలు ఖరారవడం విశేషం. తాజా టాలెంట్ కోసం కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయని చెప్పడానికి ఇదో నిదర్శనం. ఆరు నుంచి 8 వారాల వ్యవధి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అందుకున్న అభ్యర్థులు తమ కోర్సు మొదటి సంవత్సరం తర్వాత తమకు ఆఫర్ ఇచ్చిన కంపెనీలో నిర్ణీత వ్యవధిలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. దీన్నే సమ్మర్ ఇంటర్న్షిప్గానూ పేర్కొంటున్నారు. కనిష్టంగా ఆరు వారాలు.. గరిష్టంగా ఎనిమిది వారాల వ్యవధిలో పీపీఓల ద్వారా లభించే ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు సదరు సంస్థలో రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో సంస్థ సిబ్బందితో కలిసి పని చేయాలి. అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక టాస్క్‌ను కేటాయించడమో లేదా అప్పటికే ఒక టాస్క్‌కు సంబంధించి విధులు నిర్వహిస్తున్న టీంలో సభ్యుడిగా నియమించడమో జరుగుతుంది. ఫైనల్ ప్లేస్మెంట్ ఖరారు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ పొందిన విద్యార్థులు తమ డొమైన్ ఏరియా, లేదా ప్రత్యేక టాస్క్ నిర్వహణలో ప్రతిభ చూపితే కోర్సు పూర్తయ్యాక కొలువును సైతం అందుకోవచ్చు. ఐఐఎంలలో గత మూడు, నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఫైనల్ ప్లేస్మెంట్ ఆఫర్స్ సొంతం చేసుకున్న వారిలో పీపీఓ అభ్యర్థుల సంఖ్య యాభై శాతం వరకూ ఉంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించి తమ సంస్థలో భవిష్యత్తులో కొనసాగే ఆసక్తి ఉందో? లేదో? కూడా అడుగుతున్నాయి. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉంటేనే కొలువు ఆఫర్‌కు ఆమోదం తెలపొచ్చు. పీపీఓ డ్రైవ్స్ నిర్వహించే కంపెనీల విషయంలో అన్ని రంగాల కంపెనీలు పోటీ పడుతున్నాయి. మేనేజ్మెంట్ విద్యార్థులు కీలకంగా భావించే కన్సల్టింగ్ నుంచి టెక్నాలజీ సంస్థల వరకు పీపీఓ డ్రైవ్స్‌లో పాల్గొంటున్నాయి. కంపెనీల పరంగా చూస్తే కన్సల్టింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ సంస్థలు ముందంజలో నిలుస్తున్నాయి. ఆర్థిక చేయూత గతేడాది జాతీయ స్థాయిలో అన్ని ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీస్కూల్స్‌లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ వెల్లువెత్తాయి. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే యాభై శాతం మేరకు ఇవి పెరగడమే కాకుండా.. సమ్మర్ ఇంటర్న్ సమయంలో ఇచ్చే స్టైపెండ్ కూడా 30 నుంచి 40 శాతం పెరిగింది. గతేడాది కొత్తగా ఏర్పాటైన ఐఐఎం- విశాఖపట్నంలో సైతం 99 శాతం మంది విద్యార్థులకు పీపీఓలు లభించాయి. ఆ విద్యార్థులంతా గత వేసవి సెలవుల్లో ఇంటర్న్ పూర్తి చేసుకున్నారు. త్వరలో జరగనున్న ఫైనల్ ప్లేస్మెంట్ డ్రైవ్స్‌కు సిద్ధమవుతున్నారు. ఆరు నుంచి 8 వారాల వ్యవధిలో ఉండే సమ్మర్ ఇంటర్న్ సమయంలో సగటున రూ.50 వేల స్టైపెండ్ అందిస్తున్నాయి. గతేడాది ఐఐఎం- కోల్‌కతాలో 2015-17 బ్యాచ్‌కు సంబంధించి.. మొదటి సంవత్సర విద్యార్థుల(2015-16)కు నిర్వహించిన ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంస్థ గరిష్టంగా 3 లక్షల స్టైపెండ్ ఆఫర్ చేయడం విశేషం. పీపీఓలు... ముఖ్య సమాచారం సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం. కనిష్టంగా ఆరు వారాలు.. గరిష్టంగా 8 నుంచి 12 వారాల వ్యవధిలో ఇంటర్న్షిప్స్. ఇంటర్న్‌షిప్ సమయంలో స్టైపెండ్ గతేడాది జాతీయ స్థాయిలో కనిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు స్టైపెండ్ ఐఐఎంల నుంచి ఇతర ప్రముఖ బీస్కూల్స్ వైపు కూడా దృష్టి సారిస్తున్న సంస్థలు. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో పీపీఓ డ్రైవ్స్. ఫైనల్ ప్లేస్‌మెంట్స్ మాదిరిగానే సమ్మర్ ఇంటర్న్స్‌ను ఎంపిక చేసేందుకు నిర్వహించే ప్రీ ప్లేస్మెంట్ డ్రైవ్స్‌లో కంపెనీలు ఫైనల్ ప్లేస్మెంట్ ప్రక్రియనే అనుసరిస్తాయి. పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించడం, ప్రీ ప్లేస్మెంట్ టాక్స్ పేరుతో కంపెనీల ప్రతినిధులతో అభ్యర్థులు నేరుగా సంప్రదించే అవకాశం సైతం కల్పిస్తాయి. విద్యార్థులు సదరు సంస్థ గురించి, వాటి కార్యకలాపాల గురించి, తమకు ఇంటర్న్‌షిప్ సమయంలో ఇచ్చే జాబ్ ప్రొఫైల్ గురించి అడగొచ్చు. నాకు లెనోవో సంస్థలో సమ్మర్ ఇంటర్న్ అవకాశం లభించింది. అప్పటికే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసిన అనుభవం ఉండటంతో ఇంటర్న్‌షిప్‌లో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇంటర్న్‌షిప్ సమయంలో సంస్థ ప్రతినిధులు ప్రధానంగా అభ్యర్థుల్లోని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, స్పందించే తీరుపై దృష్టి పెడతాయి. టీం లీడర్ నుంచి ఎప్పటికప్పుడు అభ్యర్థి పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాయి. ఇవన్నీ సంతృప్తి కరంగా ఉంటే ఫైనల్ ప్లేస్మెంట్ ఖాయం.ఈ ఫైనల్ ప్లేస్మెంట్ ఆఫర్ విషయంలో నిర్ణయం విద్యార్థిదే. ఇంటర్న్‌షిప్ చేసిన సంస్థ ఫైనల్ ప్లేస్మెంట్నే ఆమోదించాలనే నిబంధన లేదు. టి.శ్రీనివాస్ కార్తీక్, ఐఐఎం-బీ (2015-17 బ్యాచ్) -
బీకాం కంప్యూటర్స్ కోర్సు యధాతథం
-సిలబస్ మార్పుతో గందరగోళం -కాలేజీల నిరసనతో సిలబస్‌లో మార్పులకు కమిటీ -పునరాలోచనలో ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న బీకాం కంప్యూటర్స్ కోర్సుకు సంబంధించి ఉన్నత విద్యామండలి చేసిన మార్పులు, చేర్పులపై కాలేజీలనుంచి నిరసన వ్యక్తం అవుతోంది. మంగళవారం పలు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకులు ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న బీకాం కంప్యూటర్స్ కోర్సులో మండలి చేసిన మార్పుల వల్ల నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా పాత విధానంలో ఫస్టియర్నుంచి మూడేళ్ల పాటు కంప్యూటర్ సిలబస్‌ను విద్యార్ధులు నేర్చుకొనే వారు. దీనివల్ల ఆయా కంపెనీలు ఈ కోర్సు చదివిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అయితే ఉన్నత విద్యామండలి ఈ ఏడాదినుంచి బీకాం కంప్యూటర్స్ కోర్సులో చేసిన మార్పులు, చేర్పులతో వివాదం ఏర్పడింది. బీకాం కోర్సులో మొదటి రెండేళ్లు కామన్‌గా అందరికీ ఒకే సిలబస్‌ను ఏర్పాటుచేసి మూడో సంవత్సరంలో స్పెషలైజేషన్ సిలబస్‌ను రూపొందించింది. మూడో సంవత్సరంలో ఆయా విద్యార్ధులు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అధ్యయనం చేయాలి. అలా నచ్చిన సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ మూడో సంవత్సరంలో మాత్రమే పెట్టారు. బీకాం కంప్యూటర్స్ కోర్సులో మూడో సంవత్సరంలోనే మొత్తం సిలబస్ ఉందని, ఒకే సంవత్సరం మొత్తం అన్ని పేపర్లను చదవడం విద్యార్ధులకు భారంగా మారుతుందని కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొదటి రెండు సంవత్సరాల్లో కంప్యూటర్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాధమికంగా పెట్టిన సిలబస్ చాలా స్వల్పంగా ఉందని పేర్కొంటున్నారు. వివిధ కంపెనీలు మొదటి రెండేళ్ల సిలబస్‌ను చూశాక కంపెనీలు ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వచ్చే అవకాశం లేదని వివరించారు. పాత విధానంలోనే మొదటి సంవత్సరం నుంచే కంప్యూటర్ సిలబస్‌ను పక్కాగా పెట్టి మూడో సంవత్సరంలో పూర్తిస్థాయి సిలబస్‌ను పొందుపర్చడం వల్ల ఫలితాలుంటాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు విన్నవించారు. దీంతో మండలి ఇంతకు ముందు తాను తీసుకున్న నిర్ణయంపై పునరాలోచనలో పడింది. బీకాం కంప్యూటర్ కోర్సుకు ఉన్న ఆదరణను పరిగణనలోకి తీసుకొని దాన్ని యథాతథంగా కొనసాగించడానికి, కాలేజీల విన్నపం మేరకు సిలబస్‌లో మార్పులు చేయడానికి నిర్ణయించింది. సిలబస్ మార్పులపై నిపుణుల కమిటీని ఏర్పాటుచేశామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఉపకులపతులు కేవీ రావు, వెంకయ్య, ప్రొఫెసర్ చలం, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సూర్యచంద్రరావులతో ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు వివరించారు. మూడో సంవత్సరంలోని సిలబస్నుంచే కొన్ని చాప్టర్లను మినహాయించి మొదటి, రెండో సంవత్సరం బీకాం కంప్యూటర్ తరగతులకు సిలబస్‌గా మార్పు చేయనున్నారు. -
మంచి కోర్సులున్నాయ్...రండి!
బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల ప్రచారం హిమాయత్ నగర్: నారాయణగూడలోని బాబూ జగ్జీవన్ రామ్ (బీజేఆర్) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్పించేందుకు అక్కడి అధ్యాపకులు ప్రచారబాట పట్టారు. ప్రైవేటుకు దీటుగా సౌకర్యాలు...అందుబాటులో ఉన్నా... విద్యార్థులు ఈ కళాశాల వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటింటా తిరుగుతూ కళాశాల ప్రాముఖ్యం, ఫలితాల సరళి, సౌకర్యాల వంటివివరాలను ప్రజలకు వివరిస్తూ.. విద్యార్థులను ఆకట్టుకునేందుకు అధ్యాపకులు యత్నిస్తున్నారు. గతంలో ఖైరతాబాద్‌లోని చింతలబస్తీ, నాంపల్లిలోని బజార్‌ఘాట్ వద్ద ఈ కళాశాల అద్దె భవనాల్లో నడి చింది. 2015 అక్టోబర్ లో రూ.1.40 కోట్లతో నారాయణగూడ విఠల్‌వాడిలో శాశ్వత భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. కళాశాలలో జిమ్, కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్, లైబ్రరీలో ఈ-కార్నర్ వ్యవస్థ ద్వారా సుమారు 5 లక్షల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించే సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధ్యాపకులు... ‘మా కళాశాలలో మీ పిల్లలను చేర్పించండి. అత్యుత్తమ బోధన అందిస్తాం. కార్పొరేట్ విద్యా సంస్థలలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.’ అంటూ ప్రచారం సాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న కోర్సులివే... బీఏ (హెచ్ఈపీ, హెచ్‌పీపీ, మాస్ కమ్యూనికేషన్), బీకాం (ఇంగ్లిష్ మీడియంలో జనరల్, కంప్యూటర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ (బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్) కోర్సులను కళాశాల ఆఫర్ చేస్తోంది. మొత్తం 450 సీట్లు ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ఆటోమోటివ్ సర్వీసింగ్, బేసిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వెబ్ డిజైనింగ్, అకౌంటింగ్ ప్యాకేజ్ (టాలీ), టాక్సేషన్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, బ్యూటీషియన్, గార్డెనర్, డెయిరీ ఫార్మింగ్‌తో పాటు మల్టీమీడియా, ఫొటోషాప్, నెయిల్ ఆర్ట్ పెయింటింగ్, వాటర్ అన లైసిస్ తదితర సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. పోటీ పరీక్షలైన గ్రూప్స్‌కు కోచింగ్ అందిస్తున్నారు. ప్రత్యేక కోర్సులు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ‘స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్’ కింద ‘గార్డెనర్, బ్యుటీషియన్, అకౌంట్స్ అండ్ టాలీ, వెబ్ డిజైనింగ్’ లాంటి కోర్సులను నేర్పిస్తున్నాం. వీటిలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ‘ఇంటర్మీడియట్ బోర్డు’ సర్టిఫికెట్లను అందిస్తుంది. - డాక్టర్ కె.పద్మావతి, బీజేఆర్ కళాశాల ప్రిన్సిపల్ పెట్రోల్ తీసిన హోంగార్డుపై చర్యలు బహదూర్‌పురా: బహదూర్‌పురా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న ఖదీర్‌ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ వాహనంలోనుంచి ఖదీర్ పెట్రోల్ తీసిన వీడియో బయటికి రావడంతో చర్యల్లో భాగంగా అటాచ్ చేశామన్నారు. దీనిపై హోంగార్డు ఖదీర్‌ను వివరణ కోరగా వాహనం నుంచి పెట్రోల్ లీకవడంతో రిపేర్ చేసేందుకు పెట్రోల్‌ను బయటికి తీశానని పేర్కొన్నారు. పెట్రోల్ లీకవుతున్న సమస్యను వీడియో తీస్తున్న వ్యక్తికి చెప్పేందుకు భయపడి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లానని పేర్కొన్నారు. -
ప్రత్యేక కోర్సుగా ఆ కళ!
భారతీయ కళా సంపదకు పట్టుకొమ్మలు మన జానపద కళా సంస్కృతులు. మన దేశ పురాతన కళారూపాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తోలుబొమ్మలాట నేటికీ కొన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాల్లో పలు రూపాల్లో బొమ్మలాటల ప్రదర్శన జరుగుతోంది. అయితే ఆ కళారూపాలు మరుగున పడిపోకుండా ఉండేందుకు, వాటి ప్రచారానికి ముంబై విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. దేశంలోనే తొలి అధికారిక వృత్తి విద్యా కోర్సుగా తొలుబొమ్మలాటలో ఓ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది. పురాతన కళారూపాలు కనుమరుగు కాకుండా ఉండేందుకు, కళాకారులను ప్రోత్సహించేందుకు ముంబై విశ్వవిద్యాలయం నడుం బిగించింది. ప్రాచీన జానపద కళగా గుర్తింపు పొందిన తోలుబొమ్మలాటలో వృత్తి విద్యా కోర్సును అధికారికంగా ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో అనేక శైలుల్లో ప్రదర్శించే తోలుబొమ్మలాటను ఔత్సాహికులకోసం ఓ సర్టిఫికేట్ కోర్సుగా రూపొందించింది. మొదట్లో కర్నాటక రాష్ట్రంలోనే ఈ కళారూపం పుట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రదర్శనలో తెరపై సినిమా వీక్షించినట్లుగానే, తెరవెనుకనుంచి కళాకారులు పౌరాణిక గాధలను తోలు బొమ్మలతో ఆడించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటారు. ప్రాచీన గాథల్ని గానం చేస్తూ, అందులోని దేవతా మూర్తుల చిత్రాలను చర్మాలపై అందంగా తీర్చి దిద్ది, ఆయా పాత్రల్లో ఒదిగిపోయేట్లు మలుస్తారు. పద్యాలు, సంభాషణలకు అనుగుణంగా వాయిద్యాన్ని జోడించి, కళాత్మక దృశ్యరూపాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తారు. ఒక్క పురాణ గాథలే కాక, హాస్య పాత్రలను సైతం జోడించి చూపరులకు ఆనందాన్ని అందిస్తారు. అన్ని ప్రత్యేకతలున్న ప్రాచీన కళారూపం మరుగున పడిపోకుండా ఉండేందుకు ముంబై విశ్వవిద్యాలయం ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది. -
అసలేమైంది..
కాకినాడలో విద్యార్థి ఆత్మహత్య కాకినాడ సిటీ : ఆరునెలల సీపీటీ (కామన్ ప్రొఫిసియన్సీ టెస్ట్) కోర్సు చదువుతున్న విద్యార్థి రెడ్డి సాయికుమార్(20) హాస్టల్ రూమ్‌లో ప్యాన్‌కు ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం కొత్త గాజువాకకు చెందిన రెడ్డి సాయికుమార్ ఈ ఏడాది జనవరిలో కాకినాడ భాస్కర్‌నగర్‌లోని ప్రిజమ్ అకాడమీలో సీపీటీ కోచింగ్‌కు చేరాడు. తండ్రి వెంకటరమణ కొత్త గాజువాకలో ఫాస్ట్‌పుడ్ వ్యాపారం చేస్తుంటాడు. గతనెలలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఇంటికి వెళ్లి పదిరోజులక్రితం తిరిగి కాకినాడ వచ్చాడు. అప్పటి నుంచి అకాడమీ తరగతులకు వెళ్లకుండా రూమ్‌లోనే ముభావంగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం హాస్టల్ రూమ్‌లోని తోటి విద్యార్థులు తరగతులకు వెళ్లగా.. సాయికుమార్ రూమ్‌లోనే ఉండిపోయాడు. తిరిగి మధ్యాహ్నం రూమ్‌కు వచ్చిన విద్యార్థులు తలుపులు మూసి ఉండడంతో వెనుక వైపునకు వెళ్లి చూడగా ప్యాన్‌కు వేలాడుతూ సాయికుమార్ కనిపించాడు. తలుపులు బద్దలు కొట్టి స్థానిక ప్రైవేటు హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పడంతో విద్యార్థులు తిరిగి రూమ్‌కు తీసుకువచ్చినట్టు పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలమై.. డిగ్రీ పరీక్షలు సరిగా రాయక.. రూమ్‌లో ఉండే ఫ్రెండ్స్‌తో తాను ప్రేమించిన అమ్మాయి ప్రేమను తిరస్కరిస్తోందని, డిగ్రీ పరీక్షలు కూడా సరిగా రాయలేక పోయానని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే సెల్‌ఫోన్ మెసేజ్‌ల ఆధారంగా ప్రేమ విఫలంతో మన స్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సాయికుమార్ బంధువులు మాత్రం అకాడ మీ యాజమాన్యం సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. ప్రేమ విషయం తమకు తెలియదని, అటువంటి వాటికి ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం తమ కుమారుడిది కాదని తండ్రి వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడ టూటౌన్ ఎస్సై వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైటెక్ కెరీర్‌కు.. బీటెక్
ఇంజనీరింగ్ స్పెషల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం క్రేజ్ ఉన్న కోర్సు. ఇంటర్ పూర్తిచేసిన వారిలో చాలా మంది ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటారు. కానీ వారికి కోర్సు, కాలేజీ ఎంపిక, అందులో ఉన్న కష్టనష్టాలు, నాలుగేళ్లు పూర్తయ్యాక ఏం చేయాలి అనే విషయాలపై స్పష్టత అవగాహన కల్పించేందుకు ఈ కథనం. ప్రవేశ పరీక్షలు ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో చేరాలనుకుంటే ఐఐటీ-జేఈఈ, బిట్ శాట్...వంటి ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోవాలి. స్థానిక కాలేజీల్లో చేరాలనుకున్న వారు ఎంసెట్ రాయడం ఉత్తమం. బ్రాంచ్ ఎంపికలో జాగ్రత్త పూర్వ విద్యార్థులు, పెద్దల సలహా తీసుకుని మనకిష్టమైన బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తరువాత వేరే ఆలోచన లేకుండా దాని గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. కాలేజీ ఎంపిక ఇలా... కాలేజీ ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఫ్యాకల్టీ(అనుభవం, అర్హతలు), అక్రిడేషన్స్(నాక్, ఎన్బీఏ), పూర్వ విద్యార్థుల ప్రతిభ, కాలేజీ ఉన్న ప్రాంతం, ప్లేస్మెంట్ సెల్, ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం, క్లోజింగ్ ర్యాంక్స్, క్యాంపస్, హాస్టల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.* బీటెక్ తర్వాత విద్యార్థుల ముందున్న అవకాశాలు.. * ఇండియాలో ఉన్నత విద్య చదవాలనుకున్నవారు ఎంటెక్, ఎంఈ చేయవచ్చు. * విదేశాల్లో పీజీ చేయాలనుకుంటే..టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్టీఈటీఎస్ వంటి పరీక్షలు రాసి ఎంఎస్ చేయవచ్చు. * ఐసెట్, క్యాట్, మ్యాట్, ఎన్‌మ్యాట్, ఐఐఎఫ్‌టీ వంటి పరీక్షలు రాసి బిజినెస్ స్కూళ్లల్లో ఎంబీఏ చేయవచ్చు. * ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేయవచ్చు. న్యూ కోర్స్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ ఫుల్ టైం కోర్సుల పరంగా ఐఐఎం-బెంగళూరు, కోల్‌కతలు తాజాగా ప్రారంభించిన ప్రోగ్రామ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్. ఈ కోర్సు ప్రధానంగా హెల్త్‌కేర్ రంగంలో ఎగ్జిక్యూటివ్స్ కెరీర్ పరంగా మరింత రాణించేందుకు దోహదపడుతుంది. ఐఐఎం కోల్‌కత కూడా ఇదే బాటలో ఏడాది వ్యవధి గల హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సును ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి మూడేళ్ల అనుభవం ఉన్నవారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. -
గోల్ఫ్ కోర్స్‌లో 'మిల్కీ బ్యూటీ'
-
'చంచల్‌గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి'
-
నోటీసులతోనే సరా..!?
నల్లగొండ టుటౌన్ : మెప్మా..కింద నిరుద్యోగులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన శిక్షణ సంస్థలు భంక్షణ సంస్థలుగా మారి అందినకాడికి వెనకేసుకున్నాయి. దీనిపై మెప్మా రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ జరిపి 14 లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్లు తేల్చారు. ఈ అక్రమాలకు ఓ రెగ్యులర్ ఉద్యోగి, ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 16 శిక్షణా సం స్థలు బాధ్యులని నివేదికలో చూపారు. వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది..ఆ తర్వాత చర్యలు తీసుకోవడం మానేశారు. నోటీసులు ఇచ్చి నాలుగు నెలలైంది. నేటికీ దాని ఊసే లేదు. ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా మున్సిపల్ పట్టణాలు, నగర పంచాయతీలలో ఏర్పాటుచేసిన కొన్ని శిక్షణ సంస్థలు ఎలాంటి శిక్షణలు ఇవ్వకుండానే నిధులను బొక్కారనే ఆరోపణలు తీవ్రంగానే వచ్చాయి. దీంతో 2012-13 సంవత్సరంలో విచారణ జరిపారు. మొత్తం 16 సంస్థలకు అక్రమాలలో భాగస్వామ్యం ఉందని తేల్చారు. ఏకంగా 14లక్షల రూపాయల అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. వీటిపై సంబంధిత శిక్షణా సంస్థలకు మెప్మా అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే నోటీసులు ఇచ్చి నాలుగు నెలలైంది. కొన్ని సంస్థలు మాత్రమే వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మిగతావి చడీచప్పుడు లేకుండా ఉన్నాయి. కాగా, అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత సంస్థల నుంచి డబ్బులు రికవరీ చేయకుండా నోటీసులతోనే సరిపెట్టడం ఏమిటనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు నోరు మెదపడంలేదు. 14 లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడిన సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంత ర్యమేమిటో అధికారులకే తెలియాలి. కేవలం ఇద్దరిపైనే చర్యలు తీసుకోని మిగతా వారిని వదిలేయడంపై అనుమానాలకు తావిస్తోంది. అధికారుల చోద్యం.. జిల్లాలోని నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన మెప్మా సిబ్బంది, శిక్షణా సంస్థలు అడ్డదారిలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయినా ఈ తతంగాన్ని కొంతకాలం పాటు మెప్మా పీడీలు తొక్కిపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత వచ్చిన ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తించిన అధికారి ఆ ద స్త్రం దుమ్ము దులిపి ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల విధుల నుంచి తప్పించారు. కానీ దుర్వినియోగం అయిన ప్రభుత్వ నిధులను రికవరీ చేయడంలో సంబంధితశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పై స్థాయి అధికారుల పాత్రపైనా..? మెప్మా ద్వారా ఇచ్చే శిక్షణలో జరిగిన అవినీతి అక్రమాలలో కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారా.. లేక పై స్థాయి అధికారుల పాత్రలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అప్పడు ఇక్కడ పనిచేసిన (ఇప్పుడు బదిలీపై వెళ్లాడు) ఓ అధికారి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చినా దాని గురించి మాత్రం అంత లోతుగా వెళ్లనట్లు తెలుస్తోంది. 2011-12 సంవత్సరంలో ఇచ్చిన శిక్షణల మీద కూడా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయట బడే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. కాగా పై స్థాయి వారిని కాపాడడానికే ఇద్దరిని తొలగించి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైనా దుర్వినియోగం అయిన డబ్బులను రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంస్థల నుంచి సమాధానం రాలేదు అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న సంస్థలకు నోటీసులు జారీ చేశాం. కానీ వారిలో కొంతమంది మాత్రమే సమాధానం ఇచ్చారు. మెజార్టీ వారు ఎలాంటి సమాధానం పంపలేదు. వీరిపై కలెక్టర్‌కు నివేదిక పంపిస్తాం. ఆ తరువాత వారిపై చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాసరాజు, మెప్మా ఏఓ -
జూడాల కోర్సు రెండు నెలల పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల(జూడాల)కు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. రెండు నెలలపాటు (62 రోజులు) చేసిన సమ్మె కాలా న్ని.. వారి కోర్సు కాలానికి కలుపుతూ ఉత్తర్వు లు ఇచ్చింది. సమ్మెను హాజరుగా గుర్తించకుండా.. కోర్సును రెండు నెలలపాటు పొడిగిం చడం పట్ల జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల హౌస్‌సర్జన్, పీజీ చదువుతున్న విద్యార్థులందరి కోర్సు కాలం రెండు నెలల పాటు పెరగనుంది. ‘జూడాల సమ్మెను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. కోర్టులు కలుగజేసుకునేంత వరకు మా విన్నపాన్ని వారు పెడచెవిన పెట్టారు. అసలే కొత్త రాష్ట్రం.. అయినా చీటికీమాటికీ నెలల పాటు సమ్మె చేయ డం ఎక్కడా లేదు. అందుకే రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అనవసరంగా సమ్మె చేయడానికి వారు వెనకాడతారు’ అని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పొడిగింపు ఉన్నా కోర్సు పరీక్షలు రాసుకోవడానికి ఇబ్బంది ఉండదని పొడిగింపు కాలంలో జూడాలు వైద్య సేవలు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ప్రవేశ పరీక్షలకు ఇబ్బంది? రెండు నెలల పొడిగింపు వల్ల కోర్సు ఆలస్యంగా పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా హౌస్ సర్జన్ చేస్తున్న వారికి, పీజీ చివరి సంవత్సరం వారికి నష్టం జరుగుతుందని జూడా నేతలు పేర్కొంటున్నారు. పీజీ వచ్చే ఏడాది మే నెలలో పూర్తి కావాలి. ప్రభుత్వ నిర్ణయంతో జూలైలో పూర్తవుతుంది. పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. పొడిగింపు వల్ల ఆ పరీక్షకు అర్హత కోల్పోతామన్న భయాందోళనలు జూడాల్లో వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎంబీబీఎస్ పూర్తయి హౌస్ సర్జన్లో ఉన్న విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్ష రాయాలి. వారూ ప్రవేశ పరీక్ష రాయని పరిస్థితి రానుందని అంటున్నారు. పైగా ఉమ్మడి రాష్ట్రాలకు కలిపి ప్రవేశ పరీక్ష ఉంటున్నందున సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు, ప్రై వేటు కాలేజీ విద్యార్థులు ముందుకు వెళ్తారని.. తాము వెనుకబడే అవకాశం ఉందని జూడా నేతలు ఆందోళన చెందుతున్నారు. పీజీ చేస్తున్న మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా ఇదే పొడిగింపు వర్తించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, సమ్మె కాలాన్ని హాజరుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు జూడాల రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి చెప్పారు. సై ్టపెండ్ బకాయిలపై అస్పష్టత... జూడాల ఐదు కీలక డిమాండ్లలో నాలుగింటికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ డిమాండ్లకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖ నుంచి సీఎం వద్దకు వెళ్లింది. దీనిపై ఆయన నిర్ణయం తీసుకోగానే జీవో వెలువడుతుంది. ప్రభుత్వం అంగీకరించినవాటిలో 15 శాతం సై ్టపెండ్ పెంచాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే ఎప్పటినుంచి దాన్ని వర్తింపజేస్తారన్న విషయంలో కొంత అస్పష్టత ఉన్నట్లు సమాచారం. సహజంగా ప్రతీ రెండేళ్లకోమారు సై ్టపెండ్ 15 శాతం పెంచాలి. ఆ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి 15 శాతం పెంపుతో సై ్టపెండ్ రావాలి. అప్పటినుంచి ఏరియర్స్ ఇవ్వాలి. అయితే.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అంటే జూన్ నుంచే ఎరియర్స్‌ను ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీనిపై సీఎం నిర్ణయం తీసుకోలేనందున తాము స్పష్టంగా చెప్పలేమన్నారు. -
డీఎస్సీ కష్టాలు
ఏలూరు సిటీ :ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియలో జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)-14 అనుసరిస్తున్న విధానాలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల పేరుతో దరఖాస్తుదారుల ఆశలకు విద్యాశాఖ కళ్లెం వేస్తోంది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా.. లేదా.. అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మొన్నటివరకూ దూర విద్యా విధానంలో డిగ్రీ చదివిన వారు డీఎస్సీకి అనర్హులంటూ ఇబ్బంది పెట్టిన సర్కారు తాజాగా బీకాం అభ్యర్థులతో ఆటలాడుతోంది. విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు ప్రవేశపెట్టిన కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు డీఎస్సీలో దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్శిటీ చేసిన తప్పునకు తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు అంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ దరఖాస్తుకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో చోటుచేసుకున్న తప్పులకు వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీఎస్సీకి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 2,500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయంటే సర్కారు పెడుతున్న ఇబ్బందులు ఎంత దారుణంగా ఉన్నాయో అవగతమవుతోంది. బీకాం విద్యార్థుల గోడు డీఎస్సీకి బీకాం విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు. వారిచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు విద్యాశాఖ నిరాకరిస్తోంది. ఇంతకాలం డీఎస్సీ కోసం వేచిచూస్తే ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదని చెప్పడం దారుణమంటూ బీకాం చదివిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము యూనివర్శిటీ ప్రవేశపెట్టిన కోర్సునే చదివామని, ఇప్పుడు దానికి అర్హత లేదంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. 2008 వరకు బీకాంలో ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ సబ్జెక్టు ఉండేదని, దాన్ని చదివిన పాపానికి ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. డీఎస్సీలో దరఖాస్తు చేసేందుకు నాలుగు సబ్జెక్టులు ఆప్షనల్‌గా ఉండాలని చెప్పారని, అందులో ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, బిజినెస్ ఎకానమిక్స్, క్వాంటిటీ టెక్నిక్స్ సబ్జెక్టులు ఉండగా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ సబ్జెక్టు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. కేవలం పేరులో మాత్రమే బిజినెస్, ఇండస్ట్రియల్ అనే తేడా కనిపిస్తుందని, సబ్జెక్టులో మాత్రం ఒకేవిధంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై విశ్వవిద్యాలయ అధికారులు చర్యలు చేపట్టాలని, చేసిన తప్పును సరిదిద్దుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో బీకాం, బీఎడ్ చేసిన అభ్యర్థులు సుమారు 3 వేల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. గడువు పెంచాలి డీఎస్సీలో దరఖాస్తు చేసే అభ్యర్థులది ఒక్కొక్కరిది ఒక్కో సమస్యగా ఉంది. డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్)అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని కోరుతున్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసినా ప్రొవిజినల్ సర్టిఫికెట్లు తమకు రావడానికి నెల రోజులు పడుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 27నుంచి పరీక్షలు నిర్వహిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగానే తమకు పరీక్షలు ఆలస్యమయ్యాయని ఇప్పుడు సర్టిఫికెట్ల పేరుతో దరఖాస్తుకు అవకాశం ఇవ్వకుంటే మరో డీఎస్సీ వరకు వేచిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 2500 మంది డీఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేయకుండా ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు దరఖాస్తుకు అవకాశం కల్పించి సర్టిఫికెట్లు సమర్పించేందుకు నెల రోజులు గడువు ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. అధికారుల తీరుతో ఇబ్బందులు డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణలో విద్యాశాఖ అధికారుల తీరుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మాటెలా ఉన్నా, దరఖాస్తులు స్వీకరించే అధికారులు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో అభ్యర్థులను దరఖాస్తు చేయకుండా ఇంటికి పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తును స్వీకరించినా డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లల్లో మాత్రం దరఖాస్తులను స్వీకరించేందుకు నిరాకరించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై అధికారులను ప్రశ్నించగా తాము నిబంధనలు పాటిస్తున్నామని సమాధానమిస్తున్నారు. -
ఐఐఎస్ఈఆర్లో పీహెచ్డీ...
ఎంబీఏ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -చంద్రా, జడ్చర్ల. అవస్థాపన (ఇన్ఫ్రాస్ట్రక్చర్) రంగంలోని సౌకర్యాలు, వాటిని నిర్వహించడం సంబంధిత అంశాలను వివరించే కోర్సు ఎంబీఏ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్). సివిల్ ఇంజనీర్లకు లేదా నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగకరం. ఈ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: వెబ్సైట్: www.teriuniversity.ac.in సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్-పుణే వెబ్సైట్: www.scmhrd.edu సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ-అహ్మదాబాద్ వెబ్సైట్: www.cept.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)-పుణే నుంచి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలియజేయగలరు? - రక్షిత్, కోదాడ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుణే.. బేసిక్ సెన్సైస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తుంది. ఇందులో బయలాజికల్/ లైఫ్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కెమికల్ సెన్సైస్‌లో పీహెచ్డీ చేయాలనుకుంటే ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ విభాగాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అర్హత: కెమిస్ట్రీ/ఫిజిక్స్/బయోకెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్/ బయోఇన్ఫర్మాటిక్స్/ఫార్మసీలో ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. కింది అర్హతల్లో తప్పనిసరిగా ఏదో ఒకటి ఉండాలి. సీఎస్ఐఆర్ నెట్-జేఆర్ఎఫ్ లేదా డీబీటీ-జేఆర్ఎఫ్-ఏ లేదా ఐసీఎంఆర్-జేఆర్ఎఫ్. సీఎస్ఐఆర్-ఎల్ఎస్ లేదా డీఏఈ-జెస్ట్ లేదా గేట్లో తగిన స్కోర్. ఐఐఎస్ఈఆర్ బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు. వెబ్సైట్: www.iiserpune.ac.in ఐఐటీ-ఖరగ్‌పూర్ అందిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ లా (ఆనర్స్-ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) కోర్సు వివరాలను తెలపండి? -మధు, మహబూబాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్‌పూర్‌లోని రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, బ్యాచిలర్ ఆఫ్ లా (ఆనర్స్- ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) కోర్సును అందిస్తుంది. ఇది మూడేళ్ల కోర్సు. ఇందులో సెమిస్టర్ విధానాన్ని అనురిస్తారు. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ మెడిసిన్/తత్సమానం లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్/ఫార్మసీ/తత్సమానం లేదా ఎంబీఏ (బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్/ మెడిసిన్/ తత్సమానం లేదా మాస్టర్స్ స్టాయిలో సైన్స్/ ఫార్మసీ/ తత్సమానం కోర్సులను చదివి ఉండాలి). ప్రవేశ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ముందుగా ఇన్స్టిట్యూట్ జాతీయ స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష/ఎల్సాట్ ఇండియా/ ఎల్సాట్ గ్లోబల్ పరీక్షల స్కోర్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి తర్వాతి దశలో వరుసగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఇన్స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్షలో ఇంగ్లిష్ (40 మార్కులు), లాజికల్ రీజనింగ్ (20 మార్కులు), మ్యాథమెటికల్ ఎబిలిటీ (15 మార్కులు), బేసిక్ సైన్స్ (35 మార్కులు), లీగల్ ఆప్టిట్యూడ్ (60 మార్కులు), ఎస్సే (30 మార్కులు) అంశాలు ఉంటాయి. ఈ తరహా కోర్సును అందిస్తున్న ఇతర సంస్థలు: నల్సార్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.nalsarpro.org నేషనల్ లా యూనివర్సిటీ-న్యూఢిల్లీ వెబ్సైట్: www.nludelhi.ac.in నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా-బెంగళూరు వెబ్సైట్: www.nls.ac.in ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే ఆసక్తి. ఈ సబ్జెక్టులో పీజీ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి? - -సురేష్, మెదక్. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వివరిస్తుంది. కోర్సులో కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ ప్రణాళిక, మోడలింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీ, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి. కోర్సుల వివరాలు: ఆంధ్రా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం.. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఎంఈ కోర్సును అందిస్తుంది.అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు ఏఎంఐఈ. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుపతి.. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తుంది.అర్హత: బీఈ/ బీటెక్/ సివిల్ ఇంజనీరింగ్‌లో ఏఎంఐఈ. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.వెబ్సైట్: www.svuniversity.in కెరీర్: ఎన్విరాన్‌మెంటల్‌లో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తిచేసినవారు పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలను పొందొచ్చు. స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు సంస్థల సీఎస్ఆర్ విభాగాల్లోనూ అవకాశాలుంటాయి. -
కుటుంబ నేపథ్యమే... స్ఫూర్తి
అక్క చార్టర్ అకౌంటెంట్.. నాన్న ఆడిటర్.. ఇలా కుటుంబ నేపథ్యం ఇచ్చిన స్ఫూర్తితో.. లక్ష్యం దిశగా కదిలింది.. లెక్కలు, పద్దులు అంటూ అంకెల సముద్రాన్ని తలపించే చార్టర్‌డ అకౌంటెన్సీ కోర్సును సులువుగా పూర్తి చేయడమేకాకుండా జాతీయ స్థాయిలో 42వ ర్యాంక్ సాధించింది.. అరవపల్లి హరిప్రియ.. ఈ దిశగా చేసిన కృషి, సీఏ ఔత్సాహికులకు విలువైన సూచనలతో హరిప్రియ సక్సెస్ స్పీక్.. స్వస్థలం గుంటూరు. నాన్న అరవపల్లి వెంకటేశ్వర్లు ట్యాక్స్ కన్సల్టెంట్లో ఆడిటర్. అమ్మ శశికళ గృహిణి. అక్క పుష్ప శిరీష చార్టర్‌డ అకౌంటెంట్. ప్రస్తుతం కరీంనగర్లో సొంతంగా సంస్థను నిర్వహిస్తుంది. కుటుంబమే స్ఫూర్తి: మొదటి నుంచి సైన్స్ సబ్జెక్ట్ అంటే ఆసక్తి. కాకపోతే పదో తరగతిలో ఉన్నప్పుడే అందరిలా మెడిసిన్, ఇంజనీరింగ్ కాకుండా భిన్నమైన కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్నా. అదే సమయంలో నాన్న, అక్కల వృత్తి, విద్యా నేపథ్యం స్ఫూర్తిగా నిలిచింది. దాంతో చార్టర్‌డ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును చదవాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా సీఏ కోర్సుకు ఉన్న డిమాండ్ ఈ దిశగా నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించింది. ఇంటర్మీడియెట్ ఎంఈసీ గ్రూపులో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ వచ్చింది. దాంతో ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యా. ఫైనల్ పరీక్షలకు: ఆర్టికల్‌షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్ సాగించాను. ఇందుకోసం కోచిం గ్ కూడా తీసుకున్నా. సీఏ ఫైనల్లో మొత్తం 8 సబ్జెక్టులు ఉంటాయి. వీటిని గ్రూప్-1, గ్రూప్-2గా విభజించారు. గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కార్పోరేట్ అండ్ అలైడ్ లాస్ వంటి సబ్జెక్ట్‌లు ఉంటాయి. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్, డెరైక్ట్ ట్యాక్స్ లాస్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ సబ్జెక్ట్‌లను చదవాలి. వీటిలో కాస్టింగ్ సబ్జెక్ట్ కొద్దిగా కష్టమనిపించింది. దాంతో ఆ సబ్జెక్‌కు మిగతా వాటి కంటే ఎక్కువ సమయం కేటాయించా. ఈ విషయంలో అక్క ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా ఉపకరించాయి. గ్రూప్-1, గ్రూప్-2 సబ్జెక్టులను ఒకే సారి ప్రణాళిక ప్రకారం చదివా. 63.25శాతం మార్కులు వచ్చాయి. కారణాలనేకం: సీఏ పూర్తి చేయడం చాలా కష్టమని అందరూ భావిస్తుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదు. ఎందుకంటే చాలా మంది కీలక సమయాల్లో కొన్ని మౌలిక తప్పులను చేస్తుంటారు. ఉదాహరణకు ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు చాలా మంది సీఏ ఫైనల్ పరీక్షలపై అంతగా శ్రద్ధ చూపకపోడం, తొలుత ఓ గ్రూపు, ఆ తర్వాత మరో గ్రూపు పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వడం, కేవలం మెటీరియల్ మీద మాత్రమే ఆధారపడి ప్రిపరేషన్ సాగించడం వంటివి. వీటికి తోడు నిరంతరం సాధన చేయరు. కాబట్టి ఈ అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సీఏలో ఉత్తీర్ణత సాధించడం సులువే. నిరంతర మార్పులపై: చార్టర్‌డ అకౌంటెన్సీ కోర్సులో ఉండే సబ్జెక్టులంతా ఆర్థిక వ్యవస్థకు అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థలో ఎప్పటికప్పుడు పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వస్తుంటాయి. దాంతో నూతన ఆర్థిక పోకడలు చోటు చేసుకుంటుంటాయి. అంటే మనం చదివే పుస్తకాల్లో అప్పటికున్న సబ్జెక్టుకు అదనంగా సమాచారాన్ని జోడించాలి. వీటిని పట్టించుకోకుండా ఎంత చదివినా వృథానే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను నోట్స్‌గా రాసుకోవడం, వాటిని సిలబస్ దృష్టి కోణంలో విశ్లేషించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతీ రోజూ చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కో సబ్జెక్టుకు రోజుకు గంట సమయాన్ని కేటాయిస్తే తొలి ప్రయత్నంలోనే సీఏలో ఉత్తీర్ణత సాధించవచ్చు. లక్ష్యం: మంచి అవకాశాలు వస్తే ఉద్యోగంలో చేరతాను. లేకపోతే సివిల్స్ దిశగా దృష్టి సారిస్త. అకడెమిక్ ప్రొఫైల్ 10వ తరగతి (2008): 550/600 ఇంటర్ (ఎంఈసీ-2010): 968/1000 సీఏసీపీటీ: 6వ ర్యాంక్ (జాతీయ స్థాయి) ఐపీసీసీ: 24వ ర్యాంక్ (జాతీయ స్థాయి) సీఏ ఫైనల్: 42వ ర్యాంక్ (జాతీయ స్థాయి) -
సాక్షి గ్రూప్ ఆధ్వర్యంలో కెరీర్ ఫెయిర్
హైదరాబాద్: పదో తరగతి పూర్తయింది.. ఇంటర్ పాసయ్యారు.. ఆ తర్వాత ఏమిటి..? ఏ కోర్సు ఎంచుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది..? వాటికి కావాల్సిన అర్హతలేమిటి..? భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండే రంగం ఏది..? ఇలాంటి గందరగోళంలో మునిగిపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ సూచనలు అందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో.. ‘సాక్షి కెరీర్ ఫెయిర్-2014’ మీ ముందుకు వస్తోంది. త్వరలో జరుగనున్న ఈ ఫెయిర్‌లో బుక్లెట్లు, డిస్ప్లే బోర్డులు, ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో పాటు ప్రముఖ యూనివర్సిటీలు, కళాశాలల ప్రతినిధులు తమ సూచనలు, సలహాలతో విద్యార్థుల సందేహాలను తీర్చడంతోపాటు, మార్గనిర్దేశనం చేస్తారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతగానో తోడ్పడుతున్న సాక్షి ‘భవిత’లో విస్తృత సమాచారాన్ని ఇచ్చే ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు ఈ ఫెయిర్‌లో పాల్గొని కెరీర్ ఆప్షన్లు, ఉన్నత విద్య, అర్హతలు వంటి వాటిపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి.. సూచనలు ఇస్తారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ ఫెయిర్‌లోకి ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఈ ఫెయిర్‌లో స్టాల్లు ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీలు, కాలేజీలు, ఇనిస్టిట్యూట్లు, కెరీర్ అకాడమీలను ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆహ్వానిస్తోంది. ఈ స్టాల్లను బుక్ చేసుకొనేందుకు 9505551099 నంబర్‌పై సంప్రదించవచ్చు.