జూడాల కోర్సు రెండు నెలల పొడిగింపు | Two-month extension junior doctors course | Sakshi
Sakshi News home page

జూడాల కోర్సు రెండు నెలల పొడిగింపు

Published Wed, Dec 24 2014 3:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

జూడాల కోర్సు రెండు నెలల పొడిగింపు - Sakshi

జూడాల కోర్సు రెండు నెలల పొడిగింపు

 సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల(జూడాల)కు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. రెండు నెలలపాటు (62 రోజులు) చేసిన సమ్మె కాలా న్ని.. వారి కోర్సు కాలానికి కలుపుతూ ఉత్తర్వు లు ఇచ్చింది. సమ్మెను హాజరుగా గుర్తించకుండా.. కోర్సును రెండు నెలలపాటు పొడిగిం చడం పట్ల జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల హౌస్‌సర్జన్, పీజీ చదువుతున్న విద్యార్థులందరి కోర్సు కాలం రెండు నెలల పాటు పెరగనుంది. ‘జూడాల సమ్మెను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. కోర్టులు కలుగజేసుకునేంత వరకు మా విన్నపాన్ని వారు పెడచెవిన పెట్టారు. అసలే కొత్త రాష్ట్రం.. అయినా చీటికీమాటికీ నెలల పాటు సమ్మె చేయ డం ఎక్కడా లేదు. అందుకే రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అనవసరంగా సమ్మె చేయడానికి వారు వెనకాడతారు’ అని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పొడిగింపు ఉన్నా కోర్సు పరీక్షలు రాసుకోవడానికి ఇబ్బంది ఉండదని పొడిగింపు కాలంలో జూడాలు వైద్య సేవలు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
 
 ప్రవేశ పరీక్షలకు ఇబ్బంది?
 రెండు నెలల పొడిగింపు వల్ల కోర్సు ఆలస్యంగా పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా హౌస్ సర్జన్ చేస్తున్న వారికి, పీజీ చివరి సంవత్సరం వారికి నష్టం జరుగుతుందని జూడా నేతలు పేర్కొంటున్నారు. పీజీ వచ్చే ఏడాది మే నెలలో పూర్తి కావాలి. ప్రభుత్వ నిర్ణయంతో జూలైలో పూర్తవుతుంది. పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. పొడిగింపు వల్ల ఆ పరీక్షకు అర్హత కోల్పోతామన్న భయాందోళనలు జూడాల్లో వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎంబీబీఎస్ పూర్తయి హౌస్ సర్జన్‌లో ఉన్న విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్ష రాయాలి. వారూ ప్రవేశ పరీక్ష రాయని పరిస్థితి రానుందని అంటున్నారు. పైగా ఉమ్మడి రాష్ట్రాలకు కలిపి ప్రవేశ పరీక్ష ఉంటున్నందున సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు, ప్రై వేటు కాలేజీ విద్యార్థులు ముందుకు వెళ్తారని.. తాము వెనుకబడే అవకాశం ఉందని జూడా నేతలు ఆందోళన చెందుతున్నారు. పీజీ చేస్తున్న మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా ఇదే పొడిగింపు వర్తించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, సమ్మె కాలాన్ని హాజరుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు జూడాల రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి చెప్పారు.
 
 సై ్టపెండ్ బకాయిలపై అస్పష్టత...
 జూడాల ఐదు కీలక డిమాండ్లలో నాలుగింటికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ డిమాండ్లకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖ నుంచి సీఎం వద్దకు వెళ్లింది. దీనిపై ఆయన నిర్ణయం తీసుకోగానే జీవో వెలువడుతుంది. ప్రభుత్వం అంగీకరించినవాటిలో 15 శాతం సై ్టపెండ్ పెంచాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే ఎప్పటినుంచి దాన్ని వర్తింపజేస్తారన్న విషయంలో కొంత అస్పష్టత ఉన్నట్లు సమాచారం. సహజంగా ప్రతీ రెండేళ్లకోమారు సై ్టపెండ్ 15 శాతం పెంచాలి. ఆ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి 15 శాతం పెంపుతో సై ్టపెండ్ రావాలి. అప్పటినుంచి  ఏరియర్స్ ఇవ్వాలి. అయితే.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అంటే జూన్ నుంచే ఎరియర్స్‌ను ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీనిపై సీఎం నిర్ణయం తీసుకోలేనందున తాము స్పష్టంగా చెప్పలేమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement