junior doctors
-
జూడాల సమ్మె విరమణ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
కోల్‌కతా: జూడాలకు మద్దతుగా.. ఐఎంఏ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశంలో సంచలనం రేపింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) అక్టోబర్ 15వ తేదీన 24 గంటల దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించింది.మరోవైపు.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకోగా.. ఇప్పటి వరకు ముగ్గురు డాక్టర్లు ఆసుపత్రి పాలయ్యారు. ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్), మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్(ఎంఎస్ఎన్) నేతృత్వంలో ఈ దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు ఐఎంఏ పేర్కొంది.‘‘తమ న్యాయమైన డిమాండ్ల కోసం కోల్‌కతా జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తొమ్మిదో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్ల డిమాండ్లను అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఐఎంఏ తెలిపింది.ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లు కలిశారని పేర్కొంది. వాళ్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చినట్లు తెలిపింది. ఐఎంఏ బెంగాల్ యూనిట్.. నిరాహార దీక్షలు చేపట్టిన జూనియర్ డాక్టర్ల సంఘాలకు సంఘీభావం ప్రకటించింది. దేశంలోని అన్ని ఆఫీస్ బేరర్లు, రెసిడెంట్ డాక్టర్లు కూడా నిరాహార దీక్షలో పాల్గొనాలని ఐఎంఏ కోరింది. ఇక.. నిరాహారదీక్ష/నిరసన వేదిక.. మెడికల్ కాలేజీ లేదా క్యాంపస్‌ల సమీపంలో ఆదర్శంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలోని పనిచేసే డాక్టర్లు.. తాము అక్టోబర్ 14 నుంచి 48 గంటల పాటు పాక్షికంగా విధలు నిర్వహిస్తామని ప్రకటించారు. -
ఫలించిన ‘దీదీ’ సెంటిమెంట్.. మమత ఇంటికి డాక్టర్లు
కోల్‌కతా: బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల చర్చల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు. ఈ క్రమంలో జూడాల బృందంలో మమతతో చర్చించేందుకు కాసేపటి క్రితమే ఆమె ఇంటికి వెళ్లారు.కాగా, సీఎం మమతా శనివారం అనూహ్యంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడారు. తమకు న్యాయం కావాలి అనే నినాదాల మధ్య వైద్యులను ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. ఈ క్రమంలో దీదీ..‘నేను ముక్కమంత్రిగా కాకుండా మీ సోదరిగా ఇక్కడికి వచ్చాను. నా పదవి పెద్దది కాదు, ప్రజలు పెద్దవారు. నిన్న మీరింతా ఈ భారీ వర్షంలో నిరసన వ్యక్తం చేసినందుకు, నేను కూడా నిద్రపోలేదు. దయచేసి మీ డిమాండ్లను నెరవేరస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను అని అన్నారు. ఇదే సమయంలో వైద్యులతో మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేసినట్లు బెనర్జీ ప్రకటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది నా చివరి ప్రయత్నం అని అన్నారు. #WATCH | Kolkata, West Bengal: A delegation of junior doctors protesting over the RG Kar Medical College and Hospital rape-murder case, arrive at the Chief Minister's residence to attend a meeting with CM Mamata Banerjee regarding their demands. pic.twitter.com/GMXiKWu1Zs— ANI (@ANI) September 14, 2024 అనంతరం, కొద్ది గంటల వ్యవధిలోనే సీఎం మమతా బెనర్జీతో చర్చలకు సిద్ధమేనని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్ పంపించారు. వైద్యుల మెయిల్‌కు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మనోజ్ పండిట్ స్పందించారు. అనంతరం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం ఆరు గంటలకు ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను ఆహ్వానించారు. దీంతో, మమతతో చర్చించేందుకు వైద్యులు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో వీరి సమావేశంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. డాక్టర్ల డిమాండ్లను దీదీ ఒప్పుకుంటారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. #WATCH | Kolkata, West Bengal: A delegation of junior doctors protesting over the RG Kar Medical College and Hospital rape-murder case, arrive at the Chief Minister's residence to attend a meeting with CM Mamata Banerjee regarding their demands. pic.twitter.com/XpD7KWrntt— ANI (@ANI) September 14, 2024ఇది కూడా చదవండి: భరతమాత బిడ్డకు విదేశీగడ్డపై అవమానం: ప్రధాని మోదీ -
ఇలా చేయటం సబబేనా!
లేవనెత్తిన సమస్యల తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించుకోవటానికి పట్టువిడుపులు ప్రదర్శించటం, గరిష్ఠంగా సాధించుకోవటం ఏ ఉద్యమానికైనా ఉండాల్సిన మౌలిక లక్షణాలు. పశ్చిమబెంగాల్లో జూనియర్ డాక్టర్లు నెల రోజులకుపైగా సాగిస్తున్న ఉద్యమం ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించాల్సి వుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో తమ సహచర వైద్యురాలు 36 గంటలు నిర్విరామంగా రోగులకు సేవలందించి సేదతీరిన నిశిరాత్రిలో దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి పొట్టనబెట్టుకున్న వైనం వెల్లడయ్యాక జూనియర్ డాక్టర్ల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆ ఉద్యమాన్ని తుంచేయడానికి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి గూండాలను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించిన తీరు వారిని మరింత రెచ్చగొట్టింది. ఉన్నతాదర్శాలతో ఈరంగంలో అడుగుపెట్టిన యువ వైద్యులను పాలనా నిర్వాహకులు వేధించుకు తినటం, మాఫియా లుగా మారటం, పాలకులు పట్టనట్టు వ్యవహరించటం వాస్తవం. తూట్లు పూడుస్తున్నట్టు కనబడు తూనే తూములు తెరిచిన చందంగా పాలకులు వ్యవహరించిన తీరు దాచేస్తే దాగని సత్యం. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు ఎటువంటివో, అవి ఎంత ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఇవాళ దేశమంతా తెలిసింది. కొంత హెచ్చుతగ్గులతో ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి దయనీయ స్థితిలోనే జూనియర్ డాక్టర్లు తమ వృత్తిని కొనసాగించాల్సి వస్తున్నదని కూడా అందరూ గ్రహించారు. ప్రజావైద్యరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవ్యవస్థ దళారీలనూ పెత్తందార్లనూ సృష్టించిందని, ఆ రంగాన్ని రోగగ్రస్తం చేసిందని జనంగుర్తించారు. దేన్నయినా రాజకీయ కోణంలోనే చూడటం అలవాటైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్నుంచి కూడా అవలీలగా బయటపడగలమని తొలుత భావించారు. పైపై చర్యలతో ఉద్యమాన్ని సద్దుమణగనీయొచ్చని ఆశించారు. పరిస్థితి చేయి దాటుతున్నదనిఆలస్యంగా గ్రహించారు. గురువారం ఉద్యమకారులతో చర్చించడానికి రాష్ట్ర సెక్రటేరియట్లోరెండు గంటలకు పైగా వేచిచూసి, వారు వచ్చే అవకాశం లేదని గ్రహించాక రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించారు. మొదట్లో సమస్య పరిష్కారానికి సిద్ధపడని ఆమె వైఖరివల్లనే సమస్య జటిలంగా మారిందన్నది వాస్తవం. వైద్య సాయం అందక, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేకపలువురు మరణించారు. ఈ పాపం నుంచి ఆమె తప్పించుకోలేరు. తన స్వభావానికి భిన్నంగా ఉద్యమం విరమించుకోవాలని ముకుళిత హస్తాలతో ఉద్యమకారులను వేడుకోవటం, వారితో చర్చించటానికి సుదీర్ఘ సమయం వేచిచూడటం ఇది గ్రహించబట్టే. చేతులు కాలాక ఆకులు పట్టు కోవటం లాంటిదే ఇది. అయితే ఉద్యమకారులుగా పట్టువిడుపులు ప్రదర్శించాలని జూనియర్ డాక్టర్లు కూడా గుర్తించాలి. ఉద్యమం విరమించి విధులకు హాజరు కావాలని ఇప్పటికి మూడుసార్లు సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అలా చేరితే ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోవని మొన్న పదో తేదీన వారికి చెప్పింది కూడా. జరిగిన దుస్సంఘటనపై దర్యాప్తు జరపాలని, పని పరిస్థితులు మెరుగు పర్చాలని, జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని, పని గంటల భారాన్ని తగ్గించాలని మొదట్లో కోరారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్‌ను, మరికొందరిని తొలగించారు. పలువురిని అరెస్టు చేశారు. జూనియర్ డాక్టర్లు లేవ నెత్తిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఉద్యమకారుల డిమాండ్లు పెరుగుతూ పోతున్నాయి. వైద్యరంగ ప్రక్షాళన కోసం వైద్య విద్యా డైరెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని తాజాగా వారు కోరుతున్నారు. అంతే కాదు... తమతో మమత జరపదల్చుకున్న చర్చలను చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలనిడిమాండ్ చేశారు. అందుకు ఒప్పలేదన్న కారణంతో గురువారం చర్చలను బహిష్కరించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే తన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు చర్చలు ప్రజలందరూ చూసేలా జరగటంలో తప్పేముందన్నది వారి ప్రశ్న. వినటానికి సబబే అనిపించవచ్చు. కానీ మమత అంటున్నట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగుతోంది. దానిపై బహిరంగ చర్చ మంచిదేనా? దుండగుల దాడిలో బలైపోయిన యువ వైద్యురాలి కుటుంబసభ్యుల గోప్యత ఏం కావాలి? ఉద్యమకారులు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. కానీ ఇప్పటికే తీసుకున్న చర్యలకు మించి వారేం ఆశిస్తున్నారనుకోవాలి?నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘవ్యాధులతో బాధపడేవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు లభించక తల్లడిల్లుతున్నారు. దాదాపు 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.8,000 మంది జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వైద్య సేవలు అందించలేమని సర్కారీ ఆస్పత్రులు చేతులెత్తేయటం వల్ల అంతంతమాత్రంగా బతుకీడుస్తున్నవారు సైతం రోగాలబారిన పడిన తమ ఆప్తుల్ని రక్షించుకోవటానికి అప్పులుచేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుకే జూనియర్ డాక్టర్లు తమ బాధ్యత గుర్తెరగాలి. పాలకులపై తమకున్న ఆగ్రహం దారితప్పి సామాన్యులను కాటేస్తున్న వైనాన్ని గమనించాలి. తమ డిమాండ్లకు సమాజం నుంచి సానుకూలత, సానుభూతి వ్యక్తమవుతున్న తరుణంలోనే విధుల్లో చేరాలి. తెగేదాకా లాగటం మంచిది కాదని తెలుసుకోవాలి. -
Mamata Banerjee: రాజీనామాకైనా సిద్ధం
కోల్‌కతా: బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ‘వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు’ అని సీఎం అన్నారు. ‘ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా’ అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా.. తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా వీరు విధులను బహిష్కరిస్తున్నారు. సెపె్టంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహా్వనించింది. అయితే ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. రెండుగంటలు వేచిచూశా సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్‌కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే.. చర్చల రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి. రాజకీయ ప్రేరేపితంచర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు. మమత రాజీనామా కోరలేదు: జూడాలు ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు. -
Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి
కోల్‌కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ జూనియర్ డాక్టర్లకు ఈ–మెయిల్ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్ మెయిల్లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్ పేర్కొన్నారు. దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. షరతులకు ఒప్పుకోం బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. -
వాళ్లనెప్పుడూ బెదిరించలేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలు తప్పుగా వక్రీకరించాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బుధవారం పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమంలో చేసిన ప్రసంగంపై కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశాయని ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారామె. తాను డాక్టర్లను బెందిరించలేదని బీజేపీ ఆరోపణలకు సీఎం మమత కౌంటర్ ఇచ్చారు. ‘నేను వైద్య విద్యార్థులు, ప్రజా సంఘాల ఉద్యమాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. వారి ఉద్యమానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. నాపై ఆరోపణలు చేసినవారిని నేను ఎప్పుడూ బెదిరించలేదు. నేను బెదింరించినట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం. నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నారు. అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించాను. నా ప్రసంగంలో ఉపయోగించిన పదాలు శ్రీ రామకృష్ణ పరమహంసకు సంబంధించినవి అని స్పష్టం చేశాను. సాధువు సైతం కొన్ని సమయాల్లో స్వరం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నేరాలు, నేరాలు జరిగినప్పుడు నిరసన గళం వినిపించాలని శ్రీరామకృష్ణ ప్రస్తావన తీసుకొని మాట్లాడాను’ అని మమత స్పష్టం చేశారు.I detect a malicious disinformation campaign in some print, electronic and digital media which has been unleashed with reference to a speech that I made in our students' programme yesterday. Let me most emphatically clarify that I have not uttered a single word against the…— Mamata Banerjee (@MamataOfficial) August 29, 2024 అయితే బుధవారం సీఎం మమత బెనర్జీ తన ప్రసంగం డాక్టర్లను బెదిస్తున్నట్లు ఉందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో టీఎంసీ విద్యార్థి విభాగంలోని విద్యార్థుల పని కుట్రదారుల ముసుగు విప్పడం, వారిని భయపెట్టడమని సీఎం మమత అన్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యతో ఆమె నిరసన తెలిపే డాక్టర్లను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. -
ఆ తల్లితండ్రుల ఆవేదన ఎవరికీ కనపడటం లేదా
-
విధిలేక విధులు!
ఆధునిక సదుపాయాలతో వైద్య రంగం ఎంత పురోగమిస్తున్నా జూనియర్ వైద్యుల (జూడా) వెట్టి చాకిరీకి మాత్రం తెర పడటం లేదు. ప్రాణం పోసే వైద్యులు ఒత్తిడితో ప్రాణాపాయ పరిస్థితిల్లో కూరుకుపోతున్నారు. తమతో యంత్రాలకన్నా ఘోరంగా పని చేయిస్తున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన రెసిడెంట్ వైద్యురాలు 36 గంటలుగా నిరంతరాయంగా విధుల్లో ఉన్నట్టు వెల్లడైంది. – సాక్షి, అమరావతిప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులతో ఏకదాటిగా రెండు, మూడు రోజులు పనిచేయించడంతో పనిభారం, మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్, ఇతర యూజీ కోర్సుల విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రతి ముగ్గురు పీజీ విద్యార్థుల్లో ఒకరు ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నట్లు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ఎంసీ (జాతీయ మెడికల్ కౌన్సిల్) ఆధ్వర్యంలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ మెంటల్ హెల్త్, వెల్ బీయింగ్ దేశవ్యాప్తంగా 25,590 మంది ఎంబీబీఎస్, 5,337 మంది పీజీ వైద్య విద్యార్థులు, 7,035 మంది ఫ్యాకల్టీని ఆన్లైన్ సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది. 28 శాతం మంది ఎంబీబీఎస్, 15 శాతం మంది పీజీ విద్యార్థులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో 16.2 శాతం మంది యూజీ, 31.2 శాతం మంది పీజీ విద్యార్థులు తమకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్టు తెలిపారు. 237 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొనడం నివ్వెరపరుస్తోంది. సర్వేలో పాల్గొన్న పీజీ విద్యార్థుల్లో 45 శాతం మంది తాము వారానికి 60 గంటలకు పైగానే పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 56 శాతం మంది వారాంతపు సెలవు లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. 9.7 శాతం మంది యూజీ, 18 శాతం పీజీ విద్యార్థులు ర్యాగింగ్ గురవుతున్నామన్నారు.ఎంఎన్సీ సూచనలివీ..» రెసిడెంట్ డాక్టర్లకు వారానికి 74 గంటల కంటే ఎక్కువ పని గంటలు వద్దు. వారాంతపు సెలవు ఇవ్వాలి. » వైద్య విద్యార్థులు మానసిక ఒత్తిడి, సమస్యలను అధిగమించేలా యోగా, క్రీడలు, ఇతర కార్యక్రమాలను కళాశాలలు నిర్వహించాలి. సంస్కరణలు చేపట్టాలి..ఎంబీబీఎస్‌తో సమానంగా పీజీ సీట్లు పెరుగుతున్నందున పీజీ వైద్యుల పని వేళలను కుదించాలి. 24 గంటల పాటు విధులు నిర్వహించిన జూడాలకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి. ఆస్పత్రుల్లో వసతులు పెంచాలి. – డాక్టర్ జయధీర్, అదనపు కార్యదర్శి, భారత ప్రభుత్వ వైద్యుల సంఘం వసతులు పెంచాలిఆర్జీకార్ ఘటన అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. ఆస్పత్రుల సిబ్బందిలో 60 నుంచి 70% మహిళలే ఉన్నా తగిన మౌలిక సదుపాయాలు లేవు. సీసీ కెమెరాలు పెంచాలి. సిబ్బందిపై చిన్న ఘటన జరిగినా వెంటనే గుర్తించే వ్యవస్థ ఉండాలి. – డాక్టర్ జాగృతి, జూనియర్ డాక్టర్, సిద్ధార్థ వైద్య కళాశాలదేశానికే దిశా నిర్దేశంహైదరాబాద్లోని ‘దిశ’ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి అసెంబ్లీలో ’దిశ’ బిల్లు ప్రవేశపెట్టి దేశానికే దిశా నిర్దేశం చేసింది. నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి దేశమంతా ప్రశంసలు లభించాయి. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల ఘటనల్లో కేసు దర్యాప్తు, విచారణ 21 రోజుల్లోపే పూర్తి చేసి దోషికి మరణదండన విధించేలా బిల్లు రూపొందించారు. సత్వర విచారణ, శిక్షలు విధించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దిశ యాప్ ప్రత్యేకంగా తెచ్చి బాధితులు సమాచారం ఇచ్చిన పది నిముషాల్లోనే పోలీసులు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద డాక్టర్ల ధర్నా..
-
కదం తొక్కిన జూడాలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. పలుచోట్ల విధులు బహిష్కరించారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగికదాడి, హత్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. హత్యకు గురైన వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలంటూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విచారణను సత్వరం పూర్తిచేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సెంట్రల్ ప్రాటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఆర్కేబీచ్ నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో వైద్య సంఘాలు, వైద్య సిబ్బంది, విద్యార్థి యూనియన్లు, ఇతర స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు. కర్నూలులో జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్‌విహార్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేసి, ర్యాలీగా మెడికల్ కాలేజిలోని ధర్నా శిబిరానికి చేరుకున్నారు. చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో పీజీ డాక్టర్లు అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి ఓపీ సేవల్ని బంద్ చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఆందోళనలో సిద్ధార్థ, నిమ్రా, పిన్నమనేని సిద్ధార్థ, ఎన్ఆర్ఐ, ఎయిమ్స్ మంగళగిరి వైద్య కళాశాలల జూనియర్ వైద్యులు, అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, మెడికల్ రిప్స్ అసోసియేషన్, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ వంటి సంఘాల నుంచి పెద్ద ఎత్తున వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. మరణించిన వైద్యురాలి ఆత్మకు శాంతికలగాలంటూ కొవ్వొత్తులతో ఎంజీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. వైద్యులపై జరుగుతున్న దాడులపై స్కిట్స్ ప్రదర్శించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర వైద్యసేవలను, క్యాజువాలిటీ, లేబర్‌రూమ్, ఐసీయూల్లో విధులను బహిష్కరించారు. దీంతో అత్యవసర కేసులను మాత్రమే చేర్చుకున్నారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న పెద్దాస్పత్రిలో జూనియర్ డాక్టర్లు వైద్యసేవలను నిలిపేశారు.రెండోరోజు శుక్రవారం కూడా జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థులు, మెడికల్ కళాశాల, పెద్దాస్పత్రి ప్రాంతంలో ర్యాలీ నిర్వహించి ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేశారు. రాత్రి మరోసారి జీటీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కడపలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్ వైద్యులు నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఒంగోలులో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ వైద్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. 24 గంటలు సాధారణ వైద్యసేవల బంద్ఆర్జీ కర్ ఘటనకు నిరసనగా ఐఎంఏ నిర్ణయం సాక్షి, అమరావతి: కోల్‌కతాలోని ఆర్జీ కర్ కళాశాలలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం వైద్యసేవల్ని బంద్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. దీనికి వివిధ వైద్యసంఘాలు మద్దతుగా నిలిచాయి. దీంతో అన్ని ఆస్పత్రుల్లో శనివారం వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు అత్యవసర వైద్యసేవలు మినహా మిగిలిన సేవలను బహిష్కరిస్తున్నట్టు ఐఎంఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఫణిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై విచారణను వేగవంతంగా పూర్తిచేయాలని, ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోను వైద్యసిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం ప్రభుత్వాలు తీసుకునే చర్యల ఆధారంగా తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లకు ప్రజలు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలకాలని ఆయన కోరారు. మహిళా ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎక్కువగా హింసకు గురవుతున్నారని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఏపీ చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె.శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. -
కోల్‌కతా ఘటన: విజయవాడలో జూడాల సంఘీభావం (ఫొటోలు)
-
హామీలు ఇచ్చే వరకు ధర్నా ఆగదు..
-
విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె
-
భారీ వర్షంలోనూ జూడాల నిరసన
గాంధీఆస్పత్రి: కోల్‌కతాలో విధినిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో జూడాలు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. గురువారం సాయంత్రం భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా వెయ్యి మంది జూడాలు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ సికింద్రాబాద్ ప్రధాన రహదారి, పద్మారావునగర్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా సీనియర్ రెసిడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
గాంధీలో జూడాల విధుల బహిష్కరణ
గాంధీ ఆస్పత్రి: కోల్‌కతాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై లైంగికదాడి, హత్యలకు నిరసనగా సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు నిరసన చేపట్టారు. బుధవారం అవుట్‌పేòÙంట్ విభాగ విధులను బహిష్కరించి, ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థుల ప్రధానమైన 9 డి మాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇవీ డిమాండ్లు రెసిడెంట్, మహిళ, పురుష వైద్యులకు వేర్వేరు గా హైజెనిక్ డ్యూటీరూమ్లను ఏర్పాటు చే యాలని, డాక్టర్స్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ కమిటీ ఏ ర్పాటు, వైద్యులు, వైద్యవిద్యార్థులు విధులు నిర్వహించే ప్రాంతాల్లో 24 గంటలూ సీసీ కెమె రాల పర్యవేక్షణ ఉండాలని, ఆస్పత్రి మెయిన్ ఎంట్రన్స్, అత్యవసర విభాగం, ఇతర ప్రదేశా ల్లో సెక్యూరిటీ గార్డులను నియమించి, పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కళాశాల మైదానంలో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని, ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం నుంచి బాయ్స్ హస్టల్, ఇతర చీకటి ప్రదేశాల్లో వీధిదీపాలను ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి ప్రాంగణంతోపాటు హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో వీధికుక్కలను నిరోధించాలని, పీజీ హాస్టల్‌కు సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపర్చాలని కోరుతూ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ పా లనాధికారులకు వి నతిపత్రం సమర్పించారు. జూడాల ఓపీ విధుల బహిష్కరణ ఫలితంగా వైద్యసేవల్లో జాప్యంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో బుధవారం ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గురు వారం కూడా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఐజాక్ న్యూటన్ తెలిపారు. వైద్యులకు అండగా మేమున్నాం: మంత్రి సీతక్క కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం అత్యంత హేయమైన చర్య అని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని పరామర్శించిన అనంతరం అక్కడ ఆందోళన చేస్తున్న జూడాల వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ వైద్యులకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, హత్యాయత్నాలు జరగకుండా కఠినమైన చట్టాలను తేవడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని హామీనిచ్చారు. -
స్టైపెండ్ పెంచకుంటే పోరుబాటే..
తిరుపతి సిటీ/లబ్బీపేట(విజయవాడతూర్పు) : వెటర్నరీ జూడాలకు స్టైఫండ్ పెంచకపోతే పోరుబాట తప్పదని వెటర్నరీ వర్సిటీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జూనపూడి ఎజ్రా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య కళాశాలలో శుక్రవారం జూడాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లుగా తమకు స్టైఫండ్ రూ.7 వేలే ఇస్తున్నారని.. అదీ సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వెటర్నరీ వర్సిటీల్లో రూ.23 వేలు ఇస్తున్నా.. తిరుపతి వర్సిటీలో మాత్రం పెంచకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ నిత్యావసరాలకు సరిపోవడం లేదని, వెంటనే రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వర్సిటీలో పాలన స్థంభించిపోయిందని, వర్సిటీకి పూర్తి స్థాయి వీసీ, రిజిస్ట్రార్లను నియమించాలని కోరారు. ప్రభుత్వానికి రెండు నెలలు గడువిస్తున్నామని, అప్పటికీ స్పందించకుంటే విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్చార్జి రిజిస్ట్రార్ చెంగల్రాయులుకు వినతి పత్రం ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో జూడాల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పవన్‌నాయక్, జనరల్ సెక్రటరీ ఆకాష్ పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. విజయవాడ జీజీహెచ్‌లో జూడాల నిరసనతమపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు శుక్రవారం మెరుపు ఆందోళనకు దిగారు. ఐదు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన రవి కలుపుమందు తాగి మెడిసిన్ వార్డులో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఈ సమయంలో మృతుడి బంధువులు, జూడాల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో మృతుడి బంధువులు జూడాలపై దాడి చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సమ్మె నోటీసు తీసుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.వెంకటేష్ వద్దకు వెళ్లగా.. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని, సమ్మె నోటీసు తీసుకోనని చెప్పినట్లు జూడాలు తెలిపారు. దీంతో ఉదయం 9 గంటలకు వందలాది మంది జూడాలు ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదుట ఆందోళనకు దిగారు.తమకు రక్షణ కల్పించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ప్రభుత్వాస్పత్రికి చేరుకుని జూడాలతో కలిసి సూపరింటెండెంట్ చాంబర్లో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో జూడాలు ఆందోళన విరమించారు. -
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
-
తెలంగాణలో జూడాల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలమయ్యాయి. మంత్రి దామోదర రాజనర్సింహ హామీతో జూడాలు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జూడాలతో తాను రెండు సార్లు చర్చించానని తెలిపారు. వైద్య శాఖలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 8లో ఆరు డిమాండ్లకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.కాగా, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి రూ.79.50 కోట్లు, కాకతీయ యూనివర్శిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. -
TG: తాత్కాలికంగా సమ్మె విరమించిన జూడాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది తాత్కాలిక విరమణ మాత్రమే తెలుస్తోంది. కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించినట్లు తెలుస్తోంది. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు.. ఈ రెండు జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది. అయితే ఈ సాయంత్రంలోపు జీవోలు విడుదల కాకుంటే.. రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు.మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్‌ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు. స్టైఫండ్స్, విద్యార్థుల సమస్యలతో పాటు ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం వెంటనే చేపట్టాలనే ఎనిమిది ప్రధాన డిమాండ్లతో జూన్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాలు సమ్మె ప్రారంభించారు. ఈ క్రమంలో విధులకు దూరంగా ఉంటూనే.. ఆస్పత్రుల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. -
జూనియర్ డాక్టర్ల సమ్మె
-
నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సమ్మె
-
TG: నేటి నుంచి జూడాల నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్‌జీ సాయిశ్రీ హర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఐజాక్ న్యూటన్, చైర్పర్సన్ డాక్టర్ డి.శ్రీనా«థ్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అంతా ఈ సమ్మెలో పాల్గొంటారని వారు ప్రకటించారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో అనేక చర్చలు జరిగినప్పటికీ, తమ డిమాండ్లకు తగిన పరిష్కారం దొరకలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ సమ్మెకు దిగాల్సి వస్తోందని, తమ సమస్యలు సమగ్రంగా పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. రోగులు, సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల తాము చింతిస్తున్నామని, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. స్టైపెండ్లను సకాలంలో విడుదల చేసేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని, ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. -
రేపట్నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: జూనియర్ డాక్లర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24 నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఏడు ప్రధాన డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌జీ సాయిశ్రీహర్ష, ఐజక్ న్యూటన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. శనివారం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో భోజ న విరామ సమయంలో జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. 24 నుంచి తలపెట్టే సమ్మెలో అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులు నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఔట్ పేషెంట్, వార్డు సర్వీసులు, ఎలక్టివ్ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి. కార్యక్రమంలో టీ–జూడా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీశ్లతోపాటు పీజీలు, హౌస్సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవీ డిమాండ్లు » ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెలా స్టైపెండ్ నిధులు విడుదల చేయాలి » సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.1.25 లక్షలు గౌరవ వేతనం చెల్లించాలి » ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలి ళీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15 శాతం కోటా తొలగించాలి ళీ నూతన మెడికల్ కాలేజీల్లో వసతిగృహాలు, రవాణా, పరిశోధనశాల సదుపాయాలు కల్పించాలి » బోధనాస్పత్రులు, కాలేజీల్లో సెక్యూరిటీ ఔట్‌పోస్టు బలోపేతం చేయాలి » సెక్యూరి టీ ఔట్‌పోస్టు లేనిచోట కొత్తగా ఏర్పాటు చేయాలి