
సాక్షి, హైదరాబాద్ : ఓ డాక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు చేపట్టిన ధర్నాఇంకా కొనసాగుతోంది. ఎమర్జెన్సీ తప్ప అన్ని విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపిస్తూ సీతాఫల్‌మండి రవీంద్రనగర్‌కు చెందిన సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు గాంధీ ఆస్పత్రికి చెందిన ఓ జూనియర్ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. వైద్య సిబ్బందిని దుర్భాషలాడుతూ ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చశారు. ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారి వెంబడి బైటాయించి ర్యాలీకి సిద్దమయ్యారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలోనే శాంతి ర్యాలీ నిర్వహించారు. జడాల ఆందోళనతో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వమే డాక్టర్లకు రక్షణ కల్పించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment