హైదరాబాద్ : ఎట్టకేలకు జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. హైకోర్టు ఆదేశాలతో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించుకున్నారు. దాంతో 64 రోజుల సమ్మెకు తెర పడింది. కోర్టు ఆదేశాలను గౌరమిస్తూ సమ్మెను విరమించినట్లు జూడాలు తెలిపారు. జూనియర్ డాక్టర్లు ఇవాళ నుంచే విధులకు హాజరు కానున్నారు.
జూనియర్ డాక్టర్లు విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కేసీఆర్ సర్కార్ జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అత్యవసర సేవలను కూడా జూడాలు బహిష్కరించటంతో వైద్యం అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
Published Sat, Nov 29 2014 11:28 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
Advertisement