Telangana state government
-
‘లగచర్ల’ ఘటన ఆందోళనకరం
సాక్షి, న్యూఢిల్లీ: ‘లగచర్ల’అరెస్టుల ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులు షెడ్యూల్డ్ కులాల వారని, వారిపై జరిగిన దాడి ఆందోళన కలిగించే ఘట న అని పేర్కొంది. ఈ అంశంలో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో పూర్తి నివేది క ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు గురువారం నోటీసులు జారీ చేసింది. లగచర్లలో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం పర్యటించి పరిశీలిస్తుందని పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన సమస్య.. లగచర్ల బాధిత కుటుంబాల మహిళలు 12 మంది ఈ నెల 18న బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావులతో కలిసి ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘‘ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరింపుల కు పాల్పడుతున్నారు. మా జీవనాధారమైన భూ ములను ఇవ్వలేమని తేల్చి చెప్పినవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు’’అని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం సేకరించిన 16 వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ.. ఇక్కడ 1,374 ఎకరాలు సేకరించి ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. ఈ అంశాలను ఎన్హెచ్ఆర్సీ పరిగణనలోకి తీసుకుంది. ఫిర్యాదులోని అంశాలు నిజ మైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొంది. ‘‘బాధితులు తమపై పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించారని, తప్పుడు నేరారోపణలు మోపారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ పరిగణనలోకి తీసుకుంది. సరైన విధానాలను అనుసరించకుండా ప్రతిపాదిత ‘ఫార్మా విలేజ్’కోసం భూసేకరణ చేయడం, వ్యతిరేకించిన గ్రామస్తులపై దాడి చేయడం సరికా దు. తమపై దాడి జరిగిందని చెప్పివారిలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. పైగా బలవంతంగా భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయతి్నంచారని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామస్తులపై దాడి చేశారని.. గర్భిణులను కూడా వదల్లేదని.. సాయం కోసం ఎవరినైనా అడిగే పరిస్థితి లేదని.. ఇంటర్నెట్, విద్యుత్ సేవలు సైతం నిలిపేశారని ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులు భయంతో ఇళ్లు వదిలి అడవులు, సాగుభూముల్లో తలదాచుకుంటున్నారని ఫిర్యాదు చేశారు..’’అంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి‘లగచర్ల’ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తోపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న గ్రామస్తుల వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. భయంతో అటవీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో దాక్కున్న గ్రామస్తుల స్థితిగతులను నివేదికలో పొందుపరచాలని సూచించింది. బాధిత మహిళలకు ఏవైనా వైద్య పరీక్షలు చేశారా?, గాయపడిన గ్రామస్తులకు వైద్యం అందించారా? అని కమిషన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో నివేదిక సమరి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
వ్యాధుల నివారణ, చికిత్స హెల్త్ ప్రొఫైల్‌తోనే సాధ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సంబంధించి కనీస ఆరోగ్య సమాచారాన్ని సేకరించడం ద్వారా వివిధ శాఖల పరిధిలో మెరుగైన ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం ద్వారా వివిధ జిల్లాల్లో ఉన్న వ్యాధులు, సీజనల్ వ్యాధుల తీరుతెన్నులను గుర్తించే వీలు కలుగుతుందని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి గురువారం ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమీక్షించారు. వైద్య, ఆరోగ్య, ఐటీ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా చికిత్స, నివారణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు ప్రజారోగ్యంపై సేకరించే ప్రాథమిక సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోని వైద్య, ఆరోగ్య సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యంగా రక్తపోటు, మూత్ర, రక్త పరీక్షలను ప్రజల ఇళ్ల వద్దే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎవరికైనా అదనంగా ఇతర వైద్య పరీక్షలు అవసరమైతే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ల సేవలను వినియోగించుకుంటామని వెల్లడించారు. ఆరోగ్య పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హెల్త్ ప్రొఫైల్‌ను రికార్డు చేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను కూడా అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం మారుమూల ములుగు జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయడంపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. -
వైన్స్, బార్ల వల్ల కరోనా వ్యాప్తి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండవచ్చని, కానీ కరోనా వ్యాప్తికి ఈ కేంద్రాలు అడ్డాగా మారుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలు పాటించని బార్లు, మద్యం దుకాణాలు, పబ్బులు, క్లబ్బులు, ఫంక్షన్ హాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి లైసెన్సులు, అనుమతులు రద్దు చేయాలని తేల్చిచెప్పింది. ఆయా సంస్థల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన లేఖలను ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిపై గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పరీక్షలు ఇంతేనా? ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని తాము ఆదేశించినా ప్రభుత్వం వాటి సంఖ్యను ఆశించిన స్థాయిలో పెంచలేదని ధర్మాసనం ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పరీక్షల్లో 20 శాతంలోపే ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా గ్రామీణ జిల్లాల్లో వాటి సంఖ్య 5 శాతానికి మించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను 70 శాతానికి పెంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదిక సమర్పించారు. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మాస్క్ ధరించని 1,16,467 మందికి జరిమానా విధించినట్లు డీజీపీ నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితితో పోలిస్తే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, పాతబస్తీకి వెళ్తే 2 రోజుల్లో లక్షల మంది మాస్క్ లేకుండా దొరుకుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. బార్లు, వైన్స్, పబ్బులు, క్లబ్బులు, మాల్స్, థియేటర్ల దగ్గర ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ఆదేశించింది. వైద్య నిపుణులతో కమిటీ... రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని తాము చెప్పట్లేదని, అయితే కరోనా కేసుల ఆధారంగా మైక్రో, కంటైన్మెంట్ జోన్లను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరయ్యేలా చూడాలని, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్–17 కింద వెంటనే వైద్య నిపుణులతో అడ్వయిజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ఉంటే వారికి కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సీరో సర్వేలెన్స్ నివేదికతోపాటు కంటైన్మెంట్ జోన్ల వివరాలను తదుపరి విచారణలోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక్క డోసు టీకా కూడా వృథా కాకుండా చూడాలని సూచించింది. రాష్ట్రానికి అందిన టీకా డోసుల సంఖ్య, వృథా అయిన వ్యాక్సిన్ల సంఖ్య, టీకా అందుకున్న లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే... పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలనే నిబంధన పెట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 14లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. చదవండి: 10 మందిలో ఒకరిపై కరోనా దీర్ఘకాల ప్రభావం -
‘ఉస్మానియా’ను ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రికి మరమ్మతులు చేస్తారా? లేక నూతన భవనాలను నిర్మిస్తారా? ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఆరేళ్లు గడిచినా ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను 4 వారాల్లో సమర్పించాలని, ఉస్మానియా ఆసుపత్రి స్థలంతో పాటు భవనాలకు సంబంధించిన సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. చారిత్రక కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చకుండా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేయాలా లేదా భవనాలు కూల్చేసి కొత్త భవనాలు నిర్మించాలా అన్న దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ పిల్ 2015లో దాఖలైందని, ఆరేళ్లయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా సైట్‌మ్యాప్, గూగుల్ మ్యాప్‌లను సమర్పించాలని ఆదేశించినా ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. చారిత్రక భవనాలను హెరిటేజ్ భవనాల జాబితా నుంచి తొలగించి వాటిని కూల్చేసేందుకు ప్రభుత్వం జీవో–183 జారీ చేసిందని, ఈ జీవో చట్ట విరుద్ధమని ఇటీవల ఎర్రమంజిల్ భవనాల పరిరక్షణలో భాగంగా ఇచ్చిన తీర్పులో హైకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. హెరిటేజ్ భవనాలను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. -
కేంద్ర సాయమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి నిధుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకొనే స్థాయిలో నిధులివ్వని కేంద్రం... గత ఆరేళ్లుగా ఇదే వైఖరి అవలంబిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రం రూ. 1.12 లక్షల కోట్లు అడిగితే కేంద్రం మాత్రం రూ. 50.93 వేల కోట్లు (అడిగిన దాంట్లో 45.1 శాతం) మాత్రమే ఇచ్చింది. తొలి ఏడాది నుంచీ ఇదే తీరు... గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సాయం చేయడంలో రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది నుంచే కేంద్రానికి మనసు రావడం లేదని కాగ్ లెక్కలు పరిశీలిస్తే అర్థమవుతుంది. 2014–15 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 21,720 కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేసింది. అయితే కారణమేదైనా రాష్ట్ర అంచనాలో 30 శాతానికి అటుఇటూగా రూ. 6,487.72 కోట్లే వచ్చాయి. అప్పటి నుంచి ఏటా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద రాష్ట్రానికి అంచనా కంటే తక్కువ నిధులు వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్ అంచనా ప్రకారం 2015–16లో 60.89 శాతం, 2016–17లో 62.34 శాతం, 2017–18లో 29.94 శాతం, 2018–19లో 28.16 శాతం నిధులు అందాయి. అంటే రాష్ట్రం ఏర్పాటై ఆరేళ్లవగా అందులో మూడేళ్లు రాష్ట్ర అంచనాల్లో కేవలం 30 శాతం అంతకంటే తక్కువ మాత్రమే కేంద్ర సాయం అందిందన్న మాట. 2019–20లో పరిస్థితి భిన్నం... తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,177.75 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వస్తుందని రాష్ట్రం అంచనా వేయగా అందులో 148 శాతం అంటే 11,450.85 కోట్లు విడుదల అయ్యాయి. అయితే ఇందులో కూడా కేంద్రం తిరకాసు పెట్టిందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. అంతకుముందు ఏడాది రూ. 29 వేల కోట్లకుపైగా ఉన్న అంచనా గతేడాదికి వచ్చేసరికి రూ. 8,177 కోట్లకు తగ్గిందని, అయినా కేంద్రం ఇచ్చింది రూ. 11 వేల కోట్లేనని వారంటున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అంచనా కంటే రూ. 3,300 కోట్లు ఎక్కువ వచ్చినా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో రూ. 2,900 కోట్లు తగ్గిందని చెబుతున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రూ. 14,338.9 కోట్ల వాటా వస్తుందని అంచనా వేస్తే కేంద్రం ఇచ్చింది రూ. 11,450.85 కోట్లు మాత్రమేనని కాగ్ ఇటీవల వెల్లడించిన లెక్కలు కూడా స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలపట్ల ఉదారంగా వ్యవహరించి నిధులివ్వాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఇతోధికంగా సాయం చేయకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనుగడ కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, వారి సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రైతు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావో’ఆందోళన శనివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించింది. తెలంగాణ నుంచి 4 వేల మంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ విభజించి పాలించు తరహాలో దేశంలో వ్యవస్థలను నాశనం చేశారు. ఆర్థిక మాంద్యం దేశాభివృద్ధిని తిరోగమనంలో తీసుకెళ్తోంది. శాంతి భద్రతలు కరువయ్యాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయింది’అని విమర్శించారు. ‘సీఎం కేసీఆర్ నియంతృత్వ, రాచరిక పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయింది. కేసీఆర్ దోపిడీ ఆపేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మిగులు రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారు. రాష్ట్రం మాత్రం దివాలా తీసింది’అని ఆరోపించారు. ‘కేసీఆర్ సే తెలంగాణ బచావో’: జాతీయ స్థాయిలో ఏఐసీసీ ‘భారత్ బచావో’ఆందోళన స్ఫూర్తిగా తెలంగాణలో సైతం ప్రభుత్వ వైఫల్యాలపై ‘కేసీఆర్ సే తెలంగాణ బచావో’ఆందోళన నిర్వహించాలని టీపీసీసీ కోర్ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. శనివారం ఢిల్లీలో ‘భారత్ బచావో’ ఆందోళనకు వచ్చిన కోర్ కమిటీ నేతలు సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ‘భారత్ బచావో’సభకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ప్రజాప్రతినిధులు జానారెడ్డి, గీతారెడ్డి, సురేష్ షెట్కార్, సిరిసిల్ల రాజయ్య తదితరులు హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు. -
ప్రఖ్యాత సంస్థలన్నీ రాష్ట్రానికి క్యూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక సంస్థలు పెట్టుబడులతో రాష్ట్రానికి తరలివచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐదేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం కేటీఆర్‌తో భేటీ అయింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కేటీఆర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, సింగపూర్ నడుమ మరింత బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయని సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్‌కు కేటీఆర్ వివరించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించేం దుకు సింగపూర్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు. ఐటీ, పరిశ్రమల మంత్రితో జరిగిన భేటీ ద్వారా తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై మరింత స్పష్టత వచ్చిందని సింగపూర్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణంపై తమ దేశంలోని పారిశ్రామికవర్గాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని హామీనిచ్చారు. -
ఇప్పుడైనా మోక్షం కలిగేనా?
కలగానే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిఏటా పెరుగుతున్న నేరాల సంఖ్య శాంతిభద్రతల పరిరక్షణకు సరిపోని సిబ్బంది అమలుకు నోచని నేతల హామీలు సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించింది. సూర్యాపేట జిల్లా హైదరాబాద్, విజయవాడ మహానగరాలకు మధ్యలో ఉండి అన్నిరంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సూర్యాపేట పట్టణంలో 1952లో పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి పట్టణంలో శాంతిభద్రతల కోసం పోలీసులు పాటుపడుతున్నారు. 40 సంవత్సరాల క్రితం సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నియమించిన సిబ్బంది సంఖ్యే ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. 30 ఏళ్ల క్రితం పట్టణ జనాభా సుమారు 50 వేలు ఉండేది. ప్రస్తుతం లక్షా 70 వేలకు చేరింది. దీనికితోడు గతంకంటే ప్రస్తుతం బైక్‌లు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాల సంఖ్య, పట్టణ విస్తీర్ణం కూడా పెరిగింది. అంతేగాక సూర్యాపేట హైదరాబాద్, విజయవాడ నగరాలకు మధ్య, ఇటు జనగామ, వరంగల్, మిర్యాలగూడ ప్రాంతాలకు మధ్య కేంద్రంగా ఉండడంతో నిత్యం ఇక్కడకు వివిధ పనుల నిమిత్తం వేలసంఖ్యలో జనం వచ్చివెళ్తుంటారు. సరిపడా లేని సిబ్బంది.. పేటలో ఏర్పాటుచేసిన పోలీస్‌స్టేషన్‌కు 40 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన సిబ్బంది సంఖ్యే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు ఏఎస్ఐలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 45 మంది కానిస్టేబుళ్లతోపాటు 36 మంది హోంగార్డులను పట్టణపోలీస్స్టేషన్కు కేటాయించారు. కాగా వీరిలో సుమారు 30 మంది వివిధ లూప్‌లైన్ డ్యూటీల్లో విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం బందోబస్తులతో ఉన్న సిబ్బంది వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఉన్న సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకు సరిపోవడం లేదు. పోలీస్ మ్యాన్వల్ ప్రకారం.. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పోలీస్‌ను నియమించాల్సి ఉంది. ఆ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. కాగా జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట పట్టణాలు గ్రేడ్-1 మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నల్లగొండలో రెండు పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయ గా గ్రేడ్-2 మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో రెండు పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఆ విధంగా చూసుకుంటే సూర్యాపేటలో మిర్యాలగూడ కంటే ముందుగానే టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. గత హోంమంత్రి జానారెడ్డి ‘పేట’లో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. నేరాల సంఖ్య పెరుగుతున్నా.. పట్టణంలో ఆస్తి తగాదాలు, ఈవ్‌టీజింగ్, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, భార్యాభర్తల ఘర్షణలు, మిస్సింగ్ కేసులు ఇతర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాదిలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వంద నుంచి 200 కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం 560 కేసులు తగ్గకుండా నమోదవుతున్నాయి. వాటిని అదుపుచేసేందుకు ఒక్కటే పోలీస్‌స్టేషన్ ఉండడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. పేటలో రెండు పోలీస్స్టేషన్లు ఉంటే నేరాలను అదుపుచేయడం పోలీసులకు సులువుగా ఉంటుంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు పేటలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం సూర్యాపేట జిల్లా కేంద్రం అవుతున్న తరుణంలో టూటౌన్ స్టేషన్‌తోపాటు మహిళా, సీసీఎస్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. నివేదికలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రం కాబట్టి ఈ స్టేషన్లు తప్పనిసరిగా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ట్రాఫిక్ స్టేషన్‌కు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అవసరం ఉండటంతో అట్టి ప్రతిపాదనలను కూడా పంపించాం. - వి.సునితామోహన్, డీఎస్పీ, సూర్యాపేట -
..డెల్టా ఎడారే..!
గోదావరిపై 9 ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ సన్నాహాలు బడ్జెట్లో రూ.9,636.81 కోట్ల కేటాయింపు మన రాష్ర్ట ప్రభుత్వం స్పందించాలంటున్న రైతులు పోలవరం సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ అమలాపురం :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నీటిపారుదల రంగానికి ఏకంగా రూ.25 వేల కోట్లు కేటాయించింది. గతంలో ఉమ్మడి రాష్ర్టంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే సాగునీటి ప్రాజెక్టులకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. గోదావరి, దాని ఉపనదులపై సుమారు తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.9,636.81 కోట్లు కేటాయించింది. ఇందులో కాళేశ్వరానికి రికార్డు స్థాయిలో రూ.6,286 కోట్లు, మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఖమ్మంలో నిర్మించే సీతారామ, భక్తరామదాసు ఎత్తిపోతలకు ఏకంగా రూ.1,151.59 కోట్లు, దేవాదులకు రూ.695 కోట్లు, ప్రాణహితకు రూ.685 కోట్లు కేటాయించారు. వీటితోపాటు చిన్నచిన్న పథకాలకు సైతం అధికంగా నిధులు కేటాయించారు. డెల్టా ఎడారేనా? తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే ఆ పథకాలు తొందరలోనే పూర్తవుతాయని గోదావరి డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే డెల్టాలో రెండో పంట అసాధ్యమే అవుతుంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు వరదల సీజన్లో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సగటున 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతారు. ఉధృతంగా వరద వచ్చినప్పుడు 25 లక్షల క్యూసెక్కుల వరకూ సముద్రంలోకి వదలడం సర్వసాధారణం. ఇది అక్టోబరు వచ్చేనాటికి 40 వేల క్యూసెక్కులకు, నవంబరులో 20 వేల క్యూసెక్కులకు పడిపోతుంది. డిసెంబర్ 15 నాటికి సహజ జలాల రాక బాగా తగ్గడంతో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదల దాదాపు నిలిచిపోతుంది. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే వరదలు లేని అక్టోబర్, నవంబర్ నెలల్లో బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో భారీగా పడిపోవడం ఖాయం. చాలా ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు గోదావరిలో ఉపనదులు కలిసే ప్రాంతంలోనే జరుగుతున్నాయి. దీనివల్ల వరదల సీజన్ పూర్తయ్యాక నీరు దిగువకు వచ్చే అవకాశం ఉండదు. అదే జరిగితే ప్రస్తుతం డిసెంబర్లో నెలకొంటున్న నీటి ఎద్దడిని డెల్టా రైతులు ఆక్టోబర్‌లోనే చూడాల్సి వస్తుంది. ఇదే జరిగితే డెల్టాలో రెండో పంటకే కాదు.. తొలి పంట చివరి దశలో కూడా నీటి ఇబ్బంది తప్పదు. రబీకి సీలేరే శరణ్యం గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో సుమారు 8.69 లక్షల ఎకరాల్లో ఖరీఫ్, రబీ సాగు జరుగుతోంది. రబీసాగు ఇటీవల మూడొంతులు సీలేరు నీటిమీదే ఆధారపడాల్సి వస్తోంది. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు పూర్తయితే.. రబీలో సీలేరు నుంచి వచ్చే సుమారు 45 టీఎంసీలపైనే గోదావరి డెల్టా రైతులు ఆధారపడాల్సి వస్తుంది. దీనినిబట్టి ఒక టీఎంసీకి 10,800 ఎకరాల చొప్పున 4.86 లక్షల ఎకరాలు మాత్రమే పండించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే గోదావరి డెల్టాలో సగం మంది రైతులు బ్యారేజ్ నిర్మాణానికి ముందు పండించినట్టుగా రెండో పంటగా అపరాలు, ఆముదం పండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం..అత్యవసరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు రామపాదసాగర్ పేరుతో అంకురార్పణ జరిగింది. అయితే దీని నిర్మాణానికి ఏ ముఖ్యమంత్రీ సాహసించలేదు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన మృతి అనంతరం దీని పనులు సాగడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించింది. ఆ తరువాత కూడా గడచిన రెండు బడ్జెట్లలో కేంద్రం రూ.100 కోట్ల చొప్పున ఇప్పటివరకూ రూ.200 కోట్లు మాత్రమే విదిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి రూ.3,660 కోట్లు కేటాయించింది. రూ.30 వేల కోట్లు ఖర్చయ్యే ఈ బహుళార్థసాధక ప్రాజెక్టుకు ఇంత తక్కువ నిధులు కేటాయించడంపై రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ పథకాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని కోరుతున్నారు. -
తెలంగాణకు కర్నూలు ఉల్లి
కర్నూలు: రోజురోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలు మధ్య తరగతి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో కర్నూలు ఉల్లిని సబ్సిడీపై పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ మార్కెటింగ్ శాఖ అధికారులు వేలంపాట ద్వారా ఉల్లి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు కర్నూలు జిల్లా మార్కెటింగ్ అధికారులతో ఆదివారం చర్చించారు. అక్కడ కొన్న ఉల్లిని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా కర్నూలు మార్కెట్లో ఉల్లిని కొనుగోలు చేసి కిలో రూ. 20 ప్రకారం 13 జిల్లాలకు సరఫరా చేస్తోంది. -
‘రెండో’ సగానికి గ్రీన్‌సిగ్నల్
రెండో విడత రుణమాఫీపై తెలంగాణ సర్కారు నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో బ్యాంకుల్లో జమ రూ.2,043 కోట్లు లెక్కతేల్చిన ప్రభుత్వం మొత్తం రూ.4,086 కోట్లకు చేరనున్న రెండో విడత రూ.5వేల కోట్లకే పరిమితమైన ఖరీఫ్ పంట రుణాలు హైదరాబాద్: పంట రుణాల మాఫీకి సంబంధించి రెండో విడతలోని మిగతా సగం నిధుల విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో రూ.2,043 కోట్లను బ్యాంకుల్లో జమ చేయనుంది. ఈ సొమ్ము విడుదలైతే రెండో విడత సొమ్ము మొత్తం రూ.4,086 కోట్లకు చేరనుంది. సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సర్కారు ఈ మేరకు హామీ ఇచ్చింది. అర్హులకే రుణమాఫీ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సొమ్ము విడుదలైతే రైతులకు కొత్త రుణాలు ఇచ్చే ప్రక్రియను బ్యాంకులు వేగవంతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రెండు సార్లు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం మొత్తంగా 35.82 లక్షల రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయనున్నట్లు సర్కారు గత ఏడాది తెలిపింది. మొదటి విడతగా గత ఏడాది రూ.4,230 కోట్లను జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో రూ.4,086.22 కోట్లను రైతుల ఖాతాల్లోంచి మాఫీ చేసిన బ్యాంకులు.. మిగతా సుమారు రూ.143 కోట్లను వెనక్కి ఇస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతనే ప్రామాణికంగా తీసుకొని రెండో విడత సొమ్ము విడుదలకు ఏర్పాట్లు చేసింది. రెండో విడతకు సంబంధించి సగం రూ.2,043 కోట్లను గత నెలలో విడుదల చేసింది కూడా. కానీ మిగతా సగం నిధులను విడుదల చేయకపోవడంతో.. రైతుల ఖాతాల్లోంచి రెండో విడత రుణమాఫీ కాలేదు. దీంతో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు తిరస్కరించాయి. దీనిపై ఆందోళన చెలరేగడంతో రెండో విడత రుణమాఫీలోని మిగతా సగం రూ.2,043కోట్లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. సంబంధిత ఫైలు ఆర్థికశాఖకు చేరినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. మూడో వంతుకే పరిమితం ఈ ఏడాది ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ.15,087కోట్లుకాగా బ్యాంకులు ఇప్పటివరకు రూ.5వేల కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. అయితే ఖరీఫ్ పంటల సాగు 60 శాతానికి చేరగా.. కొత్త రుణాల మంజూరు మాత్రం 33 శాతానికే పరిమితమైంది. మరోవైపు మొదటి విడత రుణమాఫీలో అక్రమాలు, బోగస్ రైతులు, బినామీలకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం విచారణ పూర్తయినట్లు తెలిసింది. అయితే ఎందరు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని సర్కారు బయటకు వెల్లడించలేదు. -
ఐటీ శాఖ తీరుపై రాష్ట్ర సర్కార్ సీరియస్
రూ. 1,200 కోట్లు పన్నుకింద లాక్కోవడంపై కన్నెర్ర తప్పు ఎక్కడ జరిగిందో తేల్చే ప్రక్రియలో సీఎస్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్‌తో చర్చలు.. సరిగా స్పందించలేదని ఆగ్రహం టీఎస్‌బీసీఎల్ రద్దుకు యోచన? సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారం నుంచి ఆదాయపన్ను బకాయి వసూలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 1,274.21 కోట్లను ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ లాక్కోవడంపై రాష్ట్ర సర్కారు కన్నెర్ర చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ అసంతృప్తిని రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద మొత్తాన్ని కనీస సమాచారం ఇవ్వకుండా ఐటీ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే అటాచ్ చేసుకోవడానికి గల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం వ్యాపారానికి ఏపీబీసీఎల్దే బాధ్యత అని, రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ జూన్ 2, 2014 నుంచే ఏర్పాటైందని న్యాయ స్థానాన్ని ఒప్పించినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని సర్కార్ సీరియస్‌గా పరిగణిస్తోంది. రూ. 1,274.21 కోట్ల అటాచ్మెంట్... వీటన్నింటికి గల కారణాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాఖా పరమైన విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఐటీ శాఖ అటాచ్మెంట్ నోటీసులు జారీ చేసినట్లు చెపుతున్నా.. అవి ప్రభుత్వానికి చేరకపోవడానికి గల కారణాలను ఆరా తీస్తోంది. లోపం ఎక్కడ జరిగిందనే విషయంపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్తోప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. సరైన సమాచారం ఇవ్వలేదని కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వివాదాల నేపథ్యంలో టీఎస్‌బీసీఎల్‌ను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏపీకి లేనిది తెలంగాణకు ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన మద్యం వ్యాపారానికి రూ. 2,939.53 కోట్లు ఆదాయపు పన్నుగా చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు గత ఫిబ్రవరి 28న ఏపీబీసీఎల్, టీఎస్బీసీఎల్లకు నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ రెండు రాష్ట్రాల్లోని కొన్ని మద్యం డిపోలనుసీజ్ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు జరిగిన మద్యం వ్యాపారం ఏపీబీసీఎల్ నేతృత్వంలోనే కాబట్టి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు సంబంధం లేదని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. కోర్టు టీఎస్‌బీసీఎల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కాగా, ఐటీ శాఖ పన్ను కింద సర్కారు సొమ్మును అటాచ్ చేసుకోవలసి వస్తే ముందు ఏపీ ప్రభుత్వం నుంచి రావలసిన వాటా రూ.1,665.34 కోట్లు తీసుకోవాలి. కానీ ఏపీబీసీఎల్ ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించి గానీ, ఆ రాష్ట్రం నుంచి రావలసిన సొమ్ము గురించి కానీ ఆలోచించకుండా రాష్ట్ర సొమ్ములను అటాచ్ చేయడం ఏంటని ప్రభుత్వం మండిపడుతోంది. ఐటీ శాఖ తీసుకున్న అటాచ్మెంట్ నిర్ణయాన్ని సవాల్ చేసే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంటే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రం తాజాగా పన్ను చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో జూన్ 2 , 2014 నుంచి టీఎస్‌బీసీఎల్ ద్వారానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2014-15 ఆర్థిక సంవత్సరం కింద కనీసం రూ. 500 కోట్లు ఆదాయపు పన్నుగా ఉండొచ్చని అంచనా. -
తెలంగాణలో అవినీతి అంతమే ధ్యేయం
‘ఆప్’ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి సోమనాథ్ కవాడిగూడ: కేసీఆర్ కుటుంబ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తయారు చేయడమే ఆప్ ప్రధాన ధ్యేయమని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భార్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగింది. పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నా ప్రజలకు సరైనా న్యాయం జరగడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోనూ అవినీతి విచ్చలవిడిగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి, ఆయన మాత్రం రూ.10 లక్షల విలువ చేసే కోట్లు ధరిస్తున్నాడని విమర్శించారు. ఆప్ కార్యకర్తలు ఉత్తమ క్రమశిక్షణతో సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తే వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు నమ్రతా జైస్వాల్, సిలివేరు శ్రీశైలం, ఖాలిబ్, నసీమా బేగం, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మసీదుల మరమ్మతులకు రూ.కోటి కేటాయించండి’
సాక్షి, సిటీ బ్యూరో : మహా నగరంలో పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకొని మసీదుల మరమ్మతులు,పెయింటింగ్ తదితర ఏర్పాట్లకు రూ. కోటి నిధుల కేటాయించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. చారిత్రాత్మకమైన మక్కా మసీదు, నాంపల్లిలోని రాయల్ మసీదుల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ప్రత్యేక నిధుల కోసం మరోక ప్రతిపాదన సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ గ్రాంట్ కింద ఐదు కోట్లు కేటాయిస్తామని ప్రకటించడంతో జంట జిల్లాల పరిధిలోని మసీదుల వాట కిందరూ.కోటి నిధుల దక్కనున్నాయి. మరోవైపు పాతబస్తీలోని మక్కా మసీదులో వివిధ సదుపాయల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉమర్ జలీల్, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్ లతో కలిసి మక్కామసీదును పరిశీలించారు. సకాలంలో నిధులు ప్రశ్నార్ధకమే... మసీదుల మరమ్మత్తులకు సకాలంలో రంజాన్ గ్రాంట్ విడుదల కావడం ప్రశ్నార్థకమే. మరో ఐదు రోజుల్లో పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కానుంది. పక్షం రోజుల క్రితమే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులతో రంజాన్ నెల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు ప్రకటన చేశారు.అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి జీవో జారీ కాలేదు. గత ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం రూ.2.79 కోట్లు కేటాయించినప్పటికి నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ఫలితం లేకుండా పోయింది. అధికారికంగా జీవో జారీ చేయండి : రంజాన్ పురస్కరించుకొని మసీదుల మరమత్తులు ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేస్తూ తక్షణమే జీవో జారీ చేయాలని జమియతుల్ ముషాయఖ్ కార్యదర్శి ఆబుల్ ఫతహ్ సయ్యద్ బందగీ బాద్షా ఖాద్రీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిధుల మంజూరు చేస్తే విడుదల అలస్యంతో మరమ్మత్తు పనులకు అటంకం ఏర్పడుతుందన్నారు. -
త్వరలో నగర వ్యాప్తంగా వై-ఫై సేవలు
యాకుత్‌పురా : హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆరు నెలల్లో వై-ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఆయన చార్మినార్ వద్ద వై-ఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ర్టంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రతీకైన చార్మినార్‌ను చూసేందుకు వచ్చే పర్యాటకుల సౌకర్యార ్థం వై-ఫై సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఆరు నెలల్లో వీటని నగరమంతటా విస్తరిస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ... పాతబస్తీలో వై-ఫై సేవలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, బీఎస్ఎన్ఎల్ జీఎం దామోదర్ రావు, మాజీ కార్పొరేటర్లు మీర్ జుల్ఫీకర్ అలీ, మోసీన్ బలాల, మహ్మద్ ముఖరం అలీ, సున్నం రాజ్‌మోహన్, మీర్జా రియాజుల్ హసన్ హఫందీ తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు ఇళ్లస్థలాలిస్తాం
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బహదూర్‌పురా : నిరుపేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం పాతబస్తీలో నాలుగెకరాల స్థలాన్ని కేటాయించేలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ హలై మెమోన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బహదూర్‌పురా తాడ్బన్ చౌరస్తాలో నిరుపేద ప్రజల కోసం నిర్మించిన 147 గృహాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.... మైనార్టీ నిరుపేదల కోసం స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఇళ్లు కట్టించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీఇళ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రణాళికలను రూపొందించిందని తెలిపారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.... పాతబస్తీలో ఇప్పటికీ అనేక ముస్లిం కుటుంబాలు సొంత ఇళ్లు లేక, అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హలై మెమోన్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అషఫ్ ్రమాట్లాడుతూ.... రూ.10 కోట్లతో... ఎకరా స్థలంలో నిరుపేదలకు 147 ఇళ్లను జి ప్లస్ 3 పద్ధతిలో నిర్మించామన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే మరిన్ని ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల వంతున డిపాజిట్‌గా తీసుకొని ఇళ్లు కేటాయించామన్నారు. ఈ డబ్బును మున్ముందు ఇళ్ల మరమ్మతులకు వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ మోజంఖాన్, మాజీ కార్పొరేటర్లు మొబీన్ అలీ, మహ్మద్ సలీం, మహ్మద్ ఆరీఫ్ జైన్, మహ్మద్గఫార్, హైదరాబాద్ హలై మెమోన్ స్వచ్ఛంద సంస్థ ఆలిండియా అధ్యక్షుడు ఎక్బాల్ తౌఫిక్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికుల్ని మరవొద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికుల మీద శీతకన్ను వేసింది. దేశ రక్షణ కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే వీర సైనికులు కాశ్మీర్ సరిహద్దులలో ఎముకలు కొరికే చలిని, ఎడారి ప్రాంతంలో ఒళ్లు కాలే వేడిని తట్టుకొని నిలబడతారు. తమ కుటుంబాలకు, పుట్టినగడ్డకు దూరంగా ఉంటూ, రక్షణ నిమిత్తమై తమ ప్రాణాలను సైతం లెక్క చేయక నిరంతరం సరిహద్దులలో కాపలాకాస్తూ ఉంటారు. దేశమంతా నిద్రిస్తుంటే, తాము రాత్రులంతా మేల్కొని తమ కర్త వ్యం నిర్వహిస్తూ దేశాన్నీ దేశ ప్రజలను కాపాడుతూ ఉం టారు. సైన్యంలోకి వెళ్లిన వాళ్లు కొద్ది కాలమే ఉంటారు. ఆ కాలంలో ఎప్పుడు ఎలాంటి విపత్తును ఎదుర్కోవాలో తెలియదు. అయినా అదంతా దేశం కోసమే. అలాంటి సైనికులు సర్వీసు నియమావళిని అనుసరించి చిన్న వయసులోనే పదవీ విరమణ చేస్తుంటారు. వారికి ప్రభుత్వం తరఫున సేద్యయోగ్యమైన భూమి, ఇంటి నిర్మాణానికి 200 చ॥స్థలంతోపాటు పునరావా సంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 3 శాతం ఉద్యోగాలు (పునర్నియామకం) జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటి అమలు గురిం చి ఏమాత్రం పట్టించు కోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై దృష్టిసారించి పునర్నియామకాలను సక్రమంగా అమలు చేసి మాజీ సైనికులను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం. - డా॥ఎ.సిద్ధన్న (మాజీ సైనికులు) కొల్లాపూర్, మహబూబ్‌నగర్ -
చురుగ్గా ‘థర్మల్’పైలాన్ నిర్మాణం
వీర్లపాలెం (దామరచర్ల) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా మండల పరిధిలోని వీర్లపాలెం గ్రామ శివారులో జెన్కో సంస్థ నిర్మిస్తున్న పైలాన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో 5 ఎకరాల స్థలంలో పైలాన్‌ను నిర్మిస్తున్నారు. పనులను ఖమ్మం కేవీ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. పనుల పరిశీలనకు జెన్కో ఈఈ సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. ఆదిలో అడ్డంకులను అధిగమించి.. ఆదిలో అడ్డంకులను అధిగమించి....థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలంలోని అటవీభూములు 10,500 ఎకరాలు సర్వే చేయించి క్లియరెన్స్ కోసం కేంద్రానికి నివేదిక పంపింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ నిర్మాణానికి 4676 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్యులు జారీ చేసింది. దీంతో జెన్కో అధికారులు స్థానిక అధికారులకుగానీ, నాయకులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పైలాన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఇటీవల తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామస్తులు తమకు నష్టపరిహారం విషయంలో హామీ ఇవ్వకుండా పైలాన్ పనులు ఎలా చేపట్టారని కార్యాలయాన్ని ముట్టడించి ఫర్నిచర్‌ను తగులబెట్టిన విషయం విదితమే. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో కదలికవచ్చి ఆర్టీఓ కిషన్‌రావు, డీఎస్పీ గోనె సందీప్‌ను గ్రామస్తులతో సమావేశపరిచి వారికి నచ్చజెప్పి ఆటంకాలను అధిగమించేలా చేశారు. రోజూ మూడు టీంలు దీంతో నాలుగు రోజులుగా పనులు వేగవంతం చేశారు. నిర్మాణానికి రోజూ మూడు టీంల తాపీ మేస్త్రీలు, కూలీలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చకచకా కొనసాగిస్తున్నారు. రోజుకు సుమారు 18 గంటలు, సుమారు వంద మంది కూలీలతో పైలాన్ పనులను నిర్వహిస్తున్నారు. పరిశీలనకు జెన్కో ఈఈతో పాటు ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి జెన్కో డీఈ దాస్, ఏఈ నాగరాజును డిప్టేషన్పై ఇక్కడ నియమించారు. ఈ నెల చివరిలోగా నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, అన్ని అనుకూలిస్తే అనుకున్న సమయంలో పూర్తిచేస్తామని ఈఈ సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. -
సదస్సు విఫలం
- ముందస్తు సమాచారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం - పూర్తి స్థాయిలో హాజరు కాని బీసీ సంచార జాతులు ఇందూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల కోసం ఏర్పాటు చేస్తున్న సమీక్షలు, సమావేశాలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. సమీక్షలు, సదస్సులే ఇలా ఉంటే ఇక సంచార జాతుల స్వావలంబన ఎలా ఉంటుందో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో చేపట్టిన సదస్సును చూస్తే తెలుస్తుంది. సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సదస్సు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ బాధ్యతను జిల్లా స్థాయి అధికారి తీసుకుని, సంచార జాతుల వారికి, సంబంధిత అధికారులకు, ముఖ్య అతిథులకు ఒకటి రెండు రోజుల ముందు సమాచారం అందించాలి. ఒక రోజు ముందే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అరుుతే మంగళవారం నిర్వహించిన సదస్సు గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. దీంతో సదస్సు విషయం తెలియక జిల్లాలోని బీసీ సంచార జాతుల వారికి తెలియక చాలా మంది సదస్సుకు హాజరు కాలేదు. దాదాపు 36 బీసీ సంచార జాతుల కుస్తులుంటే పది జాతుల లోపే హాజరయ్యారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా బోసిపోయి కనిపించాయి. బ్యానరు లేదు... ముఖ్య అతిథికి గౌరవం లేదు ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభం కావాలి. కాని సమాచారం లేకపోవడంతో చాల మంది సమయానికి హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని 1 గంటకు వాయిదా వేశారు. ఏజేసీ రాజారాంకు కూడా ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో సదస్సు చాల ఆలస్యంగా ప్రారంభమయింది. అలాగే ప్రభుత్వం తరపున సదస్సు నిర్వహిస్తున్నట్లు కనీసం బ్యానరు కూడా ఏర్పాటు చేయలేదు.కనీసం ప్రభుత్వ పథకాలు తెలిపే విధంగా కర పత్రాలు పంచకుండా సదస్సులో చేతులు దులుపుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సంచార జాతుల వారికి ప్రత్యేక పథకాలు సంచార జాతుల వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం సూచించారు. ఆర్థికాభివృద్ధికి బీసీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. బీసీలకు కళ్యాణ లక్ష్మి, సబ్‌ప్లాన్ విషయంలో ప్రభుత్వం ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సంచార జాతుల కులస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దు చెక్‌పోస్టు ఆదాయం 30 రెట్లు పెరిగింది
►గతంలో నెలకు రూ. 5 లక్షలు ►ఈ ఏప్రిల్ మాసంలోనే రూ. 1.50 కోట్లు ► ఏపీ వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌తో ►భారీగా పెరిగిన ఆదాయం కోదాడ అర్బన్ : కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం సమీపాన ఉన్న సరిహద్దు ఆర్టీఏ చెక్‌పోస్టుకు ఒక నెలలోనే రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి ఏపీ రాష్ట్ర వాహనాల నుంచి పన్నులు వసూలు ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వాహనాలే కాకుండా ఇతర రాష్ట్రాల వాహనాలను కూడా కలుపుకొని ఒక్క నెలలోనే మొత్తం రూ. 1.5కోట్ల ఆదాయం రావడం గమనార్హం. గతంలో నెలకు రూ. 5లక్షలు ఉన్న ఈ చెక్‌పోస్టు ఆదాయం ఏపీ వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌తో 30 రెట్లు పెరిగింది. ట్యాక్ వసూళ్లలో ప్రైవేట్ వ్యక్తులు కాగా ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ట్యాక్స్ వసూళ్లలో ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు సిబ్బంది మామూళ్ల వసూలుకు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని పనికానిస్తున్నట్లు సమాచారం. సమీప గ్రామాలకు వెళ్లే వాహనాలనుంచి ట్యాక్స్ కాకుండా మామూళ్లు తీసుకొని వదులుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై చెక్‌పోస్టు ఎంవీఐ షౌకత్‌అలీని వివ రణ కోరగా.. తమ వద్ద ప్రైవేట్ వ్యక్తులెవరూ విధులు నిర్వర్తించడం లేదని తెలిపారు. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ చెక్‌పోస్టులకు మొత్తం ఎనిమిది సిబ్బంది ఉన్నారని, రోజుకు నలుగురు చొప్పున చెక్‌పోస్టులో విధులు నిర్వరిస్తున్నట్లు తెలిపారు. -
తాండూరుకు కృష్ణమ్మ!
► వాటర్‌గ్రిడ్‌తో తరలిరానున్న జలాలు ► ప్రభుత్వానికి రూ.53 కోట్లతో ప్రతిపాదనలు ► ఇంటింటికీ నల్లా కనెక్షన్లు తాండూరు : తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌లో భాగంగా తాండూరువాసులకు కృష్ణాజలాలు అందనున్నాయి. దాంతో వచ్చే రెండు, మూడేళ్లలో అందరికీ ఫిల్టర్ వాటర్ అందుబాటులోకి రానున్నది. వాటర్ గ్రిడ్‌తో పైప్‌లైన్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వాటర్‌గ్రిడ్ కోసం తాండూరు మున్సిపల్ అధికారులు సుమారు రూ.53కోట్ల నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి షాద్‌నగర్, పరిగి, యాలాల మీదుగా తాండూరు పట్టణానికి, ఇక్కడి నుంచి చివరి పాయింట్ పెద్దేముల్‌కు కృష్ణాజాలలు పైప్‌లైన్ ద్వారా సరఫరా (గ్రావిటీ) కానున్నాయి. పట్టణంలో 65వేలకుపైగా జనాభా ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీకి చెందిన ఆరు రిజర్వాయర్లు ద్వారా ప్రతి రోజు 6 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 14వేలకుపైగా గృహాలు ఉన్నాయి. ఇందులో 7వేల గృహాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటర్‌గ్రిడ్ ద్వారా పట్టణ శివారులోని ఖాంజాపూర్ గుట్టపై 10లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇక్కడనే ఒక సంపు కూడా నిర్మిస్తారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఖాంజాపూర్ గుట్టపై నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరతాయి. ప్రస్తుతం ఉన్న ఆరు రిజర్వాయర్లకు అదనంగా రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఖాంజాపూర్ గుట్ట సంపు నుంచి రిజర్వాయర్ల ద్వారా కృష్ణాజలాలు సరఫరా జరుగుతుంది. 6 ఎంఎల్డీ నుంచి 11ఎంఎల్డీకి తాగునీటి సామర్థ్యం పెరగనున్నది. దాంతోపాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వడానికి ఆస్కారం కలుగుతుంది. రెండు, మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ద్వారా తాండూరుకు కృష్ణాజలాలు అందుబాటులోకి రానున్నట్టు చెబుతున్నారు. 15ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా డిజైన్ చేసినట్టు తాండూరు మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ తెలిపారు. -
'కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల్లో లబ్ధి కోసమే'
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం హైదరాబాద్‌లో స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రంతోపాటు తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్కు గుణపాఠం కావాలని దత్తాత్రేయ అన్నారు. -
నాణ్యత లేని జవాబు పత్రాలు
మంచిర్యాల సిటీ : మార్చి 25 తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత లేని జవాబు పత్రాలు సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాణ్యతలేని జవాబు పత్రాలను ఉపయోగించడం ద్వారా పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. విద్యార్థికి నాలుగు పేజీల జవాబు పత్రాలు సరఫరా చేస్తున్నామని చెప్పుకోడానికి గొప్పగా ఉంటుంది. నాలుగు పేజీల్లో కేవలం రెండు పేజీలు మాత్రమే సద్వినియోగం అవుతాయి. దీంతో విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్‌కు సైతం ఇబ్బందులు తప్పవు. పరీక్ష రుసుమును రూ.125 వసూలు చేసిన విద్యాశాఖ నాణ్యతతోపాటు, విద్యార్థికి ఇబ్బందులు లేకుండా జవాబు పత్రాలు ఇవ్వడంలో విఫలమైందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాణ్యత, ఎక్కువ పేజీలు ఉన్న జవాబు పత్రాలను సరఫరా చేసి విద్యార్థుల ఇబ్బందులను దూరం చేయూల్సిన అవసరం ఉంది. కేవలం రెండు పేజీలే... సరఫరా చేసిన నాలుగు పేజీల జవాబు పత్రాల్లో కేవలం మూడు పేజీల్లోనే విద్యార్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. మొదటి పేజీలో పరీక్ష వివరాలు నమోదు చేయనున్న నేపథ్యంలో అధిక శాతం విద్యార్థులు కోడింగ్, డీ కోడింగ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో పేజీలో జవాబులు రాయలేరు. కేవలం రెండు పేజీలను మాత్రమే సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. వంద మార్కుల ప్రశ్న పత్రానికి రెండు పేజీలు సరిపోవు. దీంతో విద్యార్థులు అదన పు పత్రాల కోసం తిప్పలు పడక తప్పదు. అదనపు జవాబు పత్రంలో సైతం నాలుగు పేజీలే ఉంటాయి. అడిగినన్ని జవాబు పత్రాలు ఇచ్చినా ప్రతిభ గల విద్యార్థికి సమయం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్విజిలేటర్‌కు సైతం పని పెరుగుతుంది. నాణ్యత విద్యార్థికి సరఫరా చేసిన జవాబు పత్రం నాణ్యత లేనివి కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగితంపై జవాబులు ఒక వైపు రాసిన తరువాత రెండో వైపు రాయడం వలన చినిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. జవాబు పత్రము చించుట గాని, వేరు చేయుటగాని చేయరాదని జవాబు పత్రం మొదటి పేజీలో విద్యాశాఖ అధికారులు పొందుపరిచారు. రాయడం ద్వారా చినిగిన నేపథ్యంలో అందుకు ఎవరు బాధ్యులు అవుతారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌కు... దూర విద్య ద్వారా పది, ఇంటర్ చదివి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పన్నెండు పేజీలతో ఉన్న నాణ్యమైన బుక్‌లెట్‌ను విద్యాశాఖ అధికారులు సరఫరా చేస్తారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులకు కూడ నాణ్యత కలిగిన 24 పేజీల బుక్‌లెట్‌ను ఇంటర్ బోర్డు అధికారులు సరఫరా చేస్తారు. కానీ రెగ్యులర్ పదో తరగతి విద్యార్థులకు మాత్రం మూడు పేజీల సమాధాన పత్రాలే ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సమయం ఎక్కువ పేజీలు ఉన్న సమాధాన పత్రాలను విద్యార్థికి సరఫరా చేసినట్లరుుతే విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. అదనపు పత్రాల కోసం పలుమార్లు ఇన్విజిలేటరు వద్దకు వెళ్లడం ద్వారా విద్యార్థి ఏకాగ్రత దెబ్బతింటుంది. నష్టం పలు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న అనారోగ్యకరమైన పోటీ వలన కూడా ప్రతిభ గల విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిభ గల విద్యార్థి రాసిన అదనపు పత్రాల్లోంచి కొన్నింటిని తొలగించినచో ఆ విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. -
రసామృతం..
-
చిందేసిన యక్షగానం
-
తెలంగాణకు ‘అసోచామ్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ‘అసోచామ్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో మూడున్నర లక్షల మం దికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏడు లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపికైంది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ చేతులమీదుగా కార్మిక శాఖ కార్యదర్శి అవార్డు అందుకోనున్నారు. -
ఐదురోజులు దాటినా నో పోస్టింగ్స్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఆంధ్రకు వెళ్లాల్సిన అధికారులను రిలీవ్ చేయడంలోనూ ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఆదివారం రిలీవ్ చేయడంతో సోమవారం సాయంత్రంలోగా సీనియర్ అధికారులంతా తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్టు చేశారు. ఆల స్యం అవుతున్న తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 7వ తేదీన వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందు పోస్టింగుల ఉత్తర్వులపై సంతకం చేసి వెళ్తారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం ఆ ఫైలుపై సంతకం చేయలేదు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న దాదాపు 22 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేశారు. అలాగే 22 మంది ఐపీఎస్‌లను కూడా రిలీవ్ చేశారు. ఇప్పుడా పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. తెలంగాణకు తక్కువ మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారంటూ ఒక్కో అధికారికి ఐదారు శాఖలు కేటాయించడంతో.. ఏడు నెలలుగా పాలన కుంటినడక నడుస్తోంది. ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న అధికారులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకే నగరంలో ఉన్నవారు 24 గంటల్లోగా విధుల్లో చేరాలన్న నిబంధనతో అఖిల భారత సర్వీసు అధికారులు విధుల్లో చేరినా.. వారంతా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తుండడం గమనార్హం. దరఖాస్తులకు నేటితో గడువు ముగింపు గతనెల 26వ తేదీన అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన తరువాత అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. శనివారంతో ఆ గడువు ముగియనుంది. కొత్తగా రెండేళ్లలో పదవీ విరమణ చేసే అధికారులు తమకు కావాల్సినచోట పనిచేయడానికి విజ్ఞప్తి చేసుకోవచ్చని పేర్కొనడంతో టి.రాధ తెలంగాణలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అలాగే శాలినిమిశ్రా, జ్యోతి బుద్ధప్రకాశ్ సతీమణి ఐఎఫ్ ఎస్ అధికారి తెలంగాణకు రావడానికి దరఖాస్తు చేసుకున్నారు. క్యాట్‌ను ఆశ్రయించిన ఐఎఫ్ఎస్ కిషన్ తనను తెలంగాణకు కేటాయించినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సస్పెన్షన్‌కు గురయ్యానన్న కారణంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయడం లేదంటూ ఐఎఫ్ఎస్ అధికారి ఎ.కిషన్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు క్యాట్ సభ్యులు కాంతారావు, మిన్నీమాథ్యూలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారిం చింది. తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో తనపై క్రమశిక్షణాచర్యలు తీసుకునే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని నివేదించారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాట్ సభ్యులు నోటీసులు జారీ చేస్తూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
తెలంగాణకు ‘బస్సు ప్రాజెక్టు’
* జేఎన్ఎన్యూఆర్ఎం కింద రూ.267.86 కోట్లు మంజూరు * 4 నగరాలకు 552 బస్సులు.. హైదరాబాద్‌కు 80 ఏసీబస్సులు * కరీంనగర్ నగరానికి బస్సు డిపో సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కిం ద కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని నాలుగు నగరాలకు 552 కొత్త బస్సులతో పాటు ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఐటీఎస్)లను మంజూరు చేసింది. వీటికి తోడు కరీంనగర్ జిల్లాకు ఓ బస్సు డిపోను సైతం కేటాయించింది. మంజూరైన బస్సుల్లో 80 అధునాతన ఏసీ బస్సులున్నాయి. రూ.267.86 కోట్ల విలువజేసే ఈ ‘బస్సు ప్రాజెక్టు’ వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.113.02 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.52.44 కోట్లు, టీఎస్ఆర్టీసీ రూ. 102.40 కోట్లను భరించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేసిన నేపథ్యంలో ఈ మేరకు పరిపాలనాపర అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం తనను కలవడానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్‌కు 422 బస్సులు రాష్ట్రానికి మంజూరైన 552 బస్సుల్లో 422 బస్సులు హైదరాబాద్‌కు మంజూరయ్యాయి. వీటిలో 80 ఏసీ బస్సులు, 342 నాన్ ఏసీ బస్సులున్నాయి. ఖమ్మంకు 30, మహబూబ్‌నగర్‌కు 30, కరీంనగర్‌కు 70బస్సులు మంజూరయ్యా యి. బస్సులతోపాటే ఐటీఎస్లను కేంద్రం మంజూరు చేసింది. ఐటీఎస్‌లో భాగంగా జీపీఎస్ సహాయంతో బస్సుల ఉనికిని తెలుసుకుని ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. కరీంనగర్లో రూ.4.95 కోట్లతో బస్సు డిపోను నిర్మించనున్నారు. -
అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్‌కు నిధుల విడుదల
సాక్షి, హైదరాబాద్: అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తన వంతు వాటా మొత్తం నుంచి రూ.35.26 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. రూ. 25.26 కోట్లను భూసేకరణ కోసం, మిగతా రూ.10 కోట్లను లైన్ నిర్మాణంలో తన వంతు వాటా కింద విడుదల చేస్తున్నట్టు అందులో పేర్కొంది. 17.20 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త లైన్ కోసం రైల్వేశాఖ 2012-13 బడ్జెట్లో మంజూరీ ఇచ్చింది. ఇందుకు రూ.117.74 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో 50 శాతం ఖర్చు (రూ.58.87కోట్ల)ను రాష్టప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పటి వరకు రైల్వేశాఖ దీనికోసం కేవలం రూ.12.10 కోట్లను మాత్రమే మూడు విడతల్లో విడుదల చేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వం కూడా కేవలం రూ.1.75 కోట్లను మాత్రమే రైల్వేకు డిపాజిట్ చేసింది. నిధుల్లేక పోవడంతో రాష్ట్రప్రభుత్వం రూ.35.26 కోట్లను అందజేయాలని నిర్ణయించింది. నిధుల విడుదలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. -
ఎట్టకేలకు బీసీలకు రాయితీ!
ప్రగతినగర్ : గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఎంపిక చేసిన బీసీ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తూ జీఓ నెం 165 ను విడుదల చేసింది. స్వయం ఉపాధి పథకం కింద ఎంపికైన 1890 మందికి, వృత్తి పనిదారుల సహకార సంఘాలకు రాయితీ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల మార్చి వరకు లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాధ ఆదేశించారు. దీంతో జిల్లాలో ఎన్నో నెలలుగా రాయితీకోసం ఎదురుచూస్తున్న వెనుకబడిన తరగతుల వారికి మేలు జరుగనుంది. జిల్లాలో రాజీవ్ అభ్యుదయ యోజన కింద నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, మూడు మున్సిపాలిటీలలో 248 మందికిగాను రూ. 6 కోట్ల 86 లక్షలు, 1608 మంది గ్రామీణులకు గాను రూ. 4కోట్ల 65 లక్షలు రాయితీ విడుదల అవుతుంది. 34 వృత్తి పనిదారుల సహకార సంఘాలకుగాను రూ. 6 కోట్ల 49 లక్షల 15 వేల రాయితీ వస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1890 మంది ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ద్వారా సబ్సిడీ పొందనున్నారు. కాగా 2013 -14 ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ జీఓలో తిరిగి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. లబ్ధిదారులు తిరిగి తమ తమ బ్యాంకులకు వెళ్లి డ్యుయెల్ అకౌంట్‌ను (లోన్ అకౌంట్,జీరో బ్యాలెన్స్ అకౌంట్)సంబందిత శాఖలో అప్పగించాల్సిఉంటుంది. అనంతరం ఈ శాఖాధికారులు ముఖ్య కార్యాదర్శి ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితా, వివరాలను తిరిగి కొత్త డ్యుయెల్ నెంబర్‌తో కలిపి జిల్లా కలెక్టర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. పోరాట ఫలితంగానే : నరాల సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జనాభాలో 56 శాతంపైగా ఉన్నా బీసీల పొరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయితీని విడుదల చేసింది. ఉమ్మడి రాష్టంలో అయితే ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వంపై నమ్మకముంది : పొదిల శోభ, బీసీ మహిళ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు తెలంగాణ ప్రభుత్వంపై మాకు పూర్తిగా నమ్మకముంది. రాయితీ విడుదలలో జాప్యం వల్ల వేల మంది వెనుకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారులకు తిప్పలు తప్పలేదు. ఏది ఏమైన్పటికీ ప్రభుత్వం తీసుకున్నా నిర్ణయానికి బీసీల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే 2014-15 సంవత్సరంలో బీసీ లబ్ధిదారుల సంఖ్య , రాయితీ పెంచాలి. వెనుకబడిన తరగతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేయాలి. -
నాలుగు వాటర్ గ్రిడ్ల అంచనా వ్యయం
రూ.4,390 కోట్లు ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమినిస్తున్న వాటర్ గ్రిడ్ పథకం కింద జిల్లాలోని నాలుగు గ్రిడ్లకు రూ.4,390 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఎస్సారెస్పీ, కడెం, కొమురంభీమ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌ల కోసం ఈ అంచనా వేశారు. మొదట జిల్లాలో ఐదు వాటర్‌గ్రిడ్‌ల కోసం అంచనాలు రూపొందించినా గడ్డెన్న వాగును తప్పించారు. ముథోల్ నియోజకవర్గం కోసం గడ్డెన్నవాగు నుంచి తాగునీటి సరఫరా కోసం రూ.163 కోట్లతో పనులు నడుస్తుండటంతో వాటర్‌గ్రిడ్‌లో దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. కాగా.. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 26 వాటర్‌గ్రిడ్‌లు నిర్మిస్తుండగా అందులో ఆరు గ్రిడ్లను ప్రభుత్వం పైలేట్ ప్రాజెక్టులుగా తీసుకుంది. వాటిలో జిల్లాలోని కడెం కూడా ఉంది. కడెం సర్వే మొదలు.. కడెం ప్రాజెక్టు వద్ద వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి సర్వే మొదలైంది. 862 కిలో మీటర్లలో పైపులైన్ వేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రధాన పైపులైన్, గ్రామాలకు వెళ్లే సెకండరీ పైపులైన్ పైన పేర్కొన్న కిలో మీటర్లలో విస్తరించి ఉంటుంది. ప్రధానంగా సర్వేలో మొదట అంచనా వేసిన విధంగా ఎన్ని కిలో మీటర్ల మేర పైపులైన్ వేయాల్సి ఉంటుంది, పైపులైన్ కోసం ఎంత ప్రభుత్వ, ప్రైవేటు భూములు సేకరించాల్సి వస్తుంది, మార్గమధ్యలో ఎన్ని కల్వర్టులు అవసరం, ఆఫ్టికల్ ఫైబర్‌లైన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందనేది అంచనా వేస్తారు. సర్వే ఆధారంగా గ్రిడ్ డిజైన్‌కు టెండర్ పిలుస్తారు. తదుపరి గ్రిడ్ అంచనా వ్యయాన్ని రూపొందిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు వాటర్‌గ్రిడ్‌లకు సంబంధించి ప్రాథమికంగా ఎన్ని కిలో మీటర్లలో పైపులైన్, అంచనా వ్యయాన్ని రూపొందించారు. సర్వే తర్వాత ఇందులో స్వల్పంగా మార్పులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వెనువెంటనే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు వాటర్గ్రిడ్లను పైలేట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రస్తుతం సర్వే పనులు ప్రారంభించింది. జిల్లాలో కడెం సర్వే పనులు మొదలయ్యాయి. డిసెంబర్లో సర్వే పూర్తిచేసి జనవరిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చిలో పనులు ప్రారంభించాలని తలుస్తున్నారు. పైలేట్ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు కాగానే జనవరిలో మిగితా గ్రిడ్ల సర్వే కోసం టెండర్లు నిర్వహించి ఫిబ్రవరిలో సర్వే పూర్తి చేసి, మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సారెస్పీ, కొమురంభీమ్, ఎల్లంపల్లి సర్వే పనులు వెనువెంటనే ఉంటాయని చెబుతున్నారు. వాటర్‌గ్రిడ్ స్వరూపం.. తాగునీటి, ఇతర అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక మనిషికి రోజుకు వంద లీటర్లు, అర్బన్‌లో 135 లీటర్ల నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రెండు నెలల కిందట ఏయే ప్రాజెక్టుల నుంచి నియోజకవర్గాలు, మండలాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుందనేది ప్రాథమికంగా అంచనా వేశారు. 2030 సంవత్సరం జనాభాకు అనుగుణంగా తాగునీటి అసవరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు అవసరమవుతాయో కూడా నిర్ధారించారు. ఎస్సారెస్పీ నుంచి నిర్మల్‌లోని ఐదు మండలాలు, బోథ్‌లో ఏడు, ఆదిలాబాద్‌లోని మూడు మండలాలకు కలిపి 2.8 టీఎంసీలు, ఎల్లంపల్లి కింద మంచిర్యాలలోని మూడు, చెన్నూర్‌లోని నాలుగు, బెల్లంపల్లిలోని ఆరు మండలాలు కలిపి 1.673 టీఎంసీలు, కొమురంభీమ్ కింద సిర్పూర్(టి) నియోజకవర్గంలో ని ఐదు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు కలిపి 1.011 టీఎంసీల నీరు అవసరమని గుర్తించారు. ఎస్సారెస్పీ నుంచి ఆదిలాబాద్‌కు పైపులైన్‌ను జాతీయ రహదారి మీదుగా వేయాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మహెబూబ్ఘాట్ మీదు గా పైపులైన్‌ను వేయడం భారంతో కూడింద ని, అదేవిధంగా నిర్మాణంలో కూడా ఖర్చు అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ రహదారి మీదుగా దూరం పెరిగినా పైపులైన్ అక్కడి నుంచే వేయాలని అనుకుంటున్నారు. కాగా.. ప్రాజెక్టు వద్ద గ్రిడ్ నుంచి మండల కేంద్రాలు, పట్టణాల వరకు మెయిన్ పైపులైన్ వేస్తుండగా, మండల కేంద్రాలు, పట్టణాల నుంచి గ్రామాలకు సెకండరి పైపులైన్ కిలో మీటర్లను ప్రాథమికంగా గుర్తించారు. సర్వే అనంతరం ఇది కొంత మారే అవకాశం ఉంటుంది. జిల్లాలో నాలుగు కార్యాలయాలు.. రానున్న రోజుల్లో గ్రామీణ నీటి సరఫరా శాఖను వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ల కోసం నాలుగు కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఎస్సారెస్పీకి సంబంధించి నిర్మల్‌లో, కడెంకు సంబంధించి కడెంలోనే, కొమురంభీమ్‌కు సంబంధించి 20 కి.మీ.ల దూరంలో ఉండే ఆసిఫాబాద్‌లో, ఎల్లంపల్లికి సంబంధించి మంచిర్యాలలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రిడ్‌కు ఈఈలను నియమించనున్నారు. అదేవిధంగా నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏఈల ఆవశ్యకత ఉంది. ఈ దృష్ట్యా సుమారు 50 మంది ఏఈలను నియమించే అవకాశాలు ఉన్నాయి. -
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
-
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్ : ఎట్టకేలకు జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. హైకోర్టు ఆదేశాలతో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించుకున్నారు. దాంతో 64 రోజుల సమ్మెకు తెర పడింది. కోర్టు ఆదేశాలను గౌరమిస్తూ సమ్మెను విరమించినట్లు జూడాలు తెలిపారు. జూనియర్ డాక్టర్లు ఇవాళ నుంచే విధులకు హాజరు కానున్నారు. జూనియర్ డాక్టర్లు విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కేసీఆర్ సర్కార్ జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అత్యవసర సేవలను కూడా జూడాలు బహిష్కరించటంతో వైద్యం అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వయోపరిమితి ఐదేళ్లు సడలింపు
ఆదిలాబాద్ టౌన్/రిమ్స్ : నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ కొలువుల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ వార్తతో నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు. ఆయా కేటగిరీలకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి కూడా ఐదేళ్లు సడలింపునిస్తూ పెంచడంతో వారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో యువత ఉద్యోగాలు వస్తాయన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో నిరుద్యోగులు 65 వేలకు పైనే.. డిగ్రీలు, పీజీలు పట్టాలు పొంది ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు జిల్లాలో 66,346 మంది ఉన్నారు. కేవలం విద్యా, పోలీసు శా ఖల్లో మాత్రమే పోస్టులను భర్తీ చేస్తూ మిగతా శా ఖల్లో పోస్టులను గత ప్రభుత్వాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తూ వచ్చింది. ఉన్నత చదువులు చదివిన వారు సై తం చిన్నచిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా అరకొరగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో ఈ పరిస్థితి నెల కొం ది. ప్రతినెలా ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండడంతో ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడుతున్నా యి. కొత్త వారిని నియమించకపోవడంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకే ఇన్చార్జి బాధ్యత లు అప్పగిస్తున్నారు. దీంతో వారికి కూడా పనిభారం పెరిగి విధులకు న్యాయం చేయలేకపోతున్నారు. వయోపరిమితి పెంపు వరం.. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల అర్హతకు వయసు పరిమితి ముగియడంతో చాలా మంది నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం కోసం తప్ప.. ప్రభుత్వ కొలువు పొందే అవకాశం కోల్పోతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగాలకు వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉద్యోగాలకు అర్హత సాధించనున్నారు. దీంతో వారు పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్.. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి ఇది వరకే ప్రకటించిన విషయం విధితమే. తాజాగా మరోసారి అసెంబ్లీలో దీనిపై స్పష్టత ఇచ్చి ఉద్యోగులకు భరోసా కల్పించారు. దీంతో జిల్లాలో సుమారు వెయ్యికి పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. -
ఇంకా ఆర్టీసీని విభజించకపోతే ఎలా?: కోదండరామ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతను విడనాడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తక్షణమే ఆర్టీసీని విభజించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ విడిపోయినప్పటికీ ఆర్టీసీని ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్ సమీపంలోని బస్ భవన్ నుంచి ఇందిరాపార్కు వరకూ భారీ ర్యాలీ, అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ నిజాం కాలంనుంచే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సంస్థకు చెందిన స్థిరాస్తుల్లో ఏపీ ప్రభుత్వం వాటా అడగడం అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీలో నియామకమైన ఏపీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే తెలంగాణ ఇంక్రిమెంట్లను ఆర్టీసీ కార్మికులకు సైతం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్ కె. రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఆర్టీసీని వెంటనే విభజించి, తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జేఏసీ చైర్మన్ నరేందర్, కో చైర్మన్ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తాం
నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వేల పేరుతో వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తామని వికలాంగులహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేరిపోతుల పరుశరాం హెచ్చరించారు. గురువారం స్థానిక టౌన్హాల్లో నిర్వహించిన.. సమితి నల్లగొండ డివిజన్ సదస్సులో ఆయన మాట్లాడారు. పింఛన్లను పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులను విభజించి 40 శాతం నుంచి 79 శాతం వికలత్వం ఉన్నవారికి రూ.1000, 80 శాతం నుంచి 100 శాతం వికలత్వం ఉన్నవారికి రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. శాతాలతో సంబంధంలేకుండా అర్హులైన వికలాంగులందరికీ రూ.1500 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా గతంలో ఉన్న వృద్ధులు,వితంతువులు, ఒంటరి స్త్రీల పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలన్నారు. కలెక్టర్ బంగ్లా ఎదుట ధర్నా సమావేశం అనంతరం వికలాంగులు, వితంతువులు, వృద్ధులు కలిసి కలెక్టర్ బంగ్లా ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. హైదరాబాద్‌లో ఉన్న కలెక్టర్ చిరంజీవులు ఫోన్‌ద్వారా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో మాట్లాడారు. అర్హులైన వికలాంగుల పెన్షన్లను ఒక్కటి కూడా తొలగించమని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శి పువ్వాల్ వెంకట్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు చింతల సైదులు, గడ్డం కాశీం, బొల్లెపల్లి గోపరాజు, సైదులు, జలందర్, ఇందిర, సుధాకర్, యాదగిరి, బోగరి రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కృషి
అభినందన సభలో బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రి హోదాలో తొలిసారి నగరానికి రాక శంషాబాద్ విమానాశ్రయం నుంచి కార్యకర్తల ఘనస్వాగతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి పద్మారావు సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషిచేస్తామని తెలిపారు.మోదీ కేబినెట్లో కార్మిక,ఉపాధి శాఖ లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... దత్తాత్రేయకు కీలక శాఖను కేటాయించినందుకు తెలంగాణ ప్రజలు, కార్యకర్తల తరఫున ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. బీజేఎల్పీనేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు దత్తాత్రేయకు ప్రధాని మోదీ అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, నేతలు ఎస్వీ శేషగిరిరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘విశ్వ’మంత సంబరం..
ఆదిలాబాద్ టౌన్ : జిల్లా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఏళ్ల కల సాకారం కాబోతోంది. జిల్లాలో యూనివర్సిటీ లేక ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాల్సిన పరిస్థితికి ఇక ఫుల్స్టాప్ పడనుంది. చదువుల కోసం ఇక హైదరాబాద్, వరంగల్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలను అప్‌గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. మరో నెల రోజుల్లో ఈ కల సాకారం కానున్నట్లు కళాశాల యాజమాన్యం, మేధావులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధుల కోసం రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ (రూసా)కు ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం. సాకారం కానున్న కల.. 1957లో ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువులు కొనసాగేవి. ఆ తర్వాత ఇంటర్ కళాశాలను వేరు చేసి పూర్తిస్థాయిలో డిగ్రీ తరగతులు బోధిస్తున్నారు. కళాశాలకు 15 ఎకరాల స్థలం ఉంది. దీంతోపాటు యూనివర్సిటీ కోసం పట్టణ సమీపంలోని సర్వే నెం.72లో 25 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల మండలాల వారు ఆదిలాబాద్‌లోనే పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్, డిప్లొమా కోర్సు లు చదివే అవకాశం ఉంది. ప్రస్తుతం యూనివర్సిటీ లేకపోవడంతో వరంగల్‌లోని కాకతీయ, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు, కొంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లలను దూర ప్రాంతాలకు పంపలేక డిగ్రీకే పరిమితం చేస్తున్నారు. మరికొంత మంది మహారాష్ట్రలోని నాందేడ్, యవత్మాల్ జిల్లాలో పీజీ చదువులు కొనసాగిస్తున్నారు. ఇక్కడే యూనివర్సిటీ ఏర్పడుతుండడంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రూ.55 కోట్లు.. యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్రీయ ఉచ్చ తర్ శిక్ష అభియాన్ (రూసా) ద్వారా రూ.55 కోట్లు మంజూరు కానున్నట్లు సమాచారం. దీంతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలను మోడల్ డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనికి రూ.12 కోట్లు కేటాయింపు ఉంటుందని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ నిధులతో యూనివర్సిటీ అభివృద్ధి జరగనుంది. మౌలిక వసతులు, తరగతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 15 శాఖలు ఏర్పాటవుతాయని కళాశాల యాజమాన్యం పేర్కొంటోంది. -
కబ్జా భూముల క్రమబద్ధీకరణ!
ఇదివరకే నిర్మాణాలున్న భూములను గుర్తించేందుకు సర్కార్ కసరత్తు భూముల క్రమబద్ధీకరణ, విక్రయంతో ఖజానా నింపే యత్నం భూముల విక్రయంతో రూ.6,500 కోట్ల రాబడికి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ చేసే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భూముల విక్రయంతో రూ.6500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. దీన్ని బడ్జెట్లోనూ పొందుపర్చింది. అయితే ఇప్పటికిప్పుడు కొత్త భూములను వేలం వేయడం వల్ల.. ఆశిం చిన ఆదాయం వచ్చే అవకాశం లేదన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు ఉన్నతాధికార వర్గాలు వివరించాయి. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన స్థలాలైతే క్రమబద్ధీకరణతో బడ్జెట్లో పేర్కొన్న మేరకు కాకపోయినా.. కొంతమేరకు ఆదాయం సమకూరుతుందన్న అభిప్రాయాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై ఆక్రమణలకు గురైన భూములను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు వివరించారు. హైదరాబాద్ పరిసరాల్లోనే పెద్దఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయం విదితమే. అనుమతి లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిర్మాణాలు భారీగా కొనసాగినట్లు ప్రభుత్వం భావిస్తోంది, గురుకుల్ ట్రస్ట్ భూములు, అస్సైన్డ్ భూములు, నగరం చుట్టూరా ఉన్న ప్రభుత్వ భూములు పెద్దసంఖ్యలో అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అయితే దీనికి గతంలో అనుసరించిన విధానాన్నే అమలు చేయాలా.. లేక మరే విధంగా ముందుకు సాగాలా? అన్న దానిపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. అలాగే అర్బన్‌ల్యాండ్ సీలింగ్ భూములను కొనుగోలు చేసిన వారికి కూడా ఆ భూములను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇప్పటికిప్పుడు విక్రయించడం వల్ల ఆశించిన మేరకు ఆదాయం సమకూరదనే అభిప్రాయంలో అధికారులు కూడా ఉన్నారు. హుడాకు అప్పగించిన భూములను కూడా విక్రయించాలని నిర్ణయించింది. భూముల విక్రయంలో ఎంత చేసినా రూ.6500 కోట్ల నిధులు ఖజానాకు జమ చేయడం సాధ్యమయ్యేది కాద న్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. అయి తే ఒక ప్రయత్నం చేస్తున్నామని, ఎంతవరకు సఫలీకృతం అవుతామన్నది చూడాల్సిన అవసరం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
జీవో 421ను అపహాస్యం చేస్తున్న ప్రభుత్వం
మానవహక్కుల వేదిక ప్రతినిధులు రెంజల్/కోటగిరి: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు విడుదల చేసిన జీవో నం. 421ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం వారు నిజామాబాద్ జిల్లాలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. రెంజల్ మండలం నీలాలో మృతి చెందిన రైతు జింక భూమన్న, కోటగిరి మండలంలోని కొల్లూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు శంకర్ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం సాటాపూర్‌లో వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణ, రాష్ట్ర ఉపాద్యక్షుడు గోర్రెపాటి మాధవరావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 530 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. జీవో నం. 421 ప్రకారం ఆర్డీఓ నేతృత్వంలో ముగ్గురు డివిజన్‌స్థాయి అధికారుల బృందం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలసి విచారణ చేపట్టాల్సి ఉన్నా, ఎక్కడా అమలుకావడం లేదని ఆరోపించారు. పరిహారాన్ని రూ. ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
మిశ్రమ స్పందన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేటాయింపులు చేసిందని అధికార పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజా ఆలోచనలకు, ఆశలకు వ్యతిరేకంగా బడ్జెట్ కేటాయింపులు చేశారని వామపక్షాలు విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదని, రైతాంగానికి ఊరటనిచ్చేవిధంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదని పేర్కొన్నాయి. జిల్లాకు మొండిచేయి జిల్లా ప్రజలకు ఆరోగ్య వరప్రదాయిని అయిన నిమ్స్‌కు బడ్జెట్లో నయాపైసా కేటాయించకపోవడం విచారకరం. అలాగే తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం, బీ.వెల్లంల ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదు. అర్హత పేరిట సంక్షేమ పథకాలైన రేషన్‌కార్డులు, ఫించన్లకు కోత పెడుతున్నారు. -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ ఉపనేత ప్రజలు ఆశించిన స్థాయిలో లేదు బడ్జెట్‌ను నిశితంగా పరిశీలిస్తే ఉత్పాదక రంగాలపై తక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అలాగని సంక్షేమ రంగాలపై కూడా వరాల జల్లేమీ కురిపించలేకపోయారు. తెలంగాణ ప్రజలకు తక్షణ అవసరమైన విద్యుత్ రంగానికి కూడా ప్రత్యేక కేటాయింపులు కనిపించలేదు. ప్రణాళికేతర వ్యయాన్ని మాత్రం భారీగా చూపించారు. అయితే, 50శాతం కన్నా ఎక్కువగా నాన్‌ప్లాన్ బడ్జెట్‌ను చూపించేందుకు గల కారణాలను మాత్రం ఎక్కడా చెప్పలేకపోయారు. జిల్లా విషయానికి వస్తే ఎప్పటిలాగే సాగునీటి ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులే జరిగాయి. ఎన్నెస్పీ, ఎస్ఎల్బీసీ, ఎస్సారెస్పీ రెండో దశ ప్రాజెక్టులకు పెద్దగా ప్రాధాన్యమిచ్చినట్టేమి కనిపించలేదు. నక్కలగం డి లాంటి ప్రాజెక్టుల ఊసు లేకపోవడం జిల్లాకు నష్టం కలిగించేదే. పిలాయిపల్లి, కోటప్పమత్తడి, బునాదిగాని కాల్వ, శేషులేటి వాగులాంటి చిన్న ప్రాజె క్టులకు కూడా నిధులివ్వలేదు. యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిం చడం స్వాగతించదగిందే. అయితే, రైతాంగంపై శ్రద్ధ పెట్టి బడ్జెట్‌ను కూరిస్తే బాగుండేది. -గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బంగారు తెలంగాణకు నాంది ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవిధంగా బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్ బంగారు తెలంగాణకు నాంది పలకనుంది. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేశారు. హామీ ఇవ్వని క ల్యాణి లక్ష్మి వంటి పథకాలకు కూడా నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ వచ్చే ఐదేళ్లలో బంగారు తెలంగాణకు అద్ధంపట్టే విధంగా ఉంది. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి కొత్తగా ఒరిగిందేమీ లేదు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు సరిపోయే పరిస్థితి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం అంతంత మాత్రమే. జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ నివారణకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదు. బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజ లను ప్రభుత్వం అంకెల గారడితో మోసం చేసింది. సమస్యలను పట్టించుకోలేదు బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను వమ్ము చేసింది ప్రభుత్వం. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే వాటిని ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించడం దారుణం. ప్రజల ఆశలకనుగుణంగా బడ్జెట్ లేదు. బడ్జెట్ ప్రసంగంలో రైతుల గోసపై కనీస ప్రస్తావన లేదు. విద్యుత్‌కు కేవలం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తగిన బడ్జెట్ కేటాయింపుల్లేవు. - నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి దళితులకు నిరాశ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్న ఆశాభావంతో ఉ న్న దళితులకు బడ్జెట్ తీవ్ర నిరాశ పర్చింది. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూ మి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యతను పొందుపర్చలేదు. అదేవిధంగా సబ్‌ప్లాన్ కోసం కేటాయించిన నిధులు దళితులకే ఖర్చు చేస్తారన్న నమ్మకం లేకుండా చేశారు. -కత్తుల మల్లేశం, షెడ్యూల్డ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశలే తప్ప.. కేటాయింపుల్లేవ్ బడ్జెట్లో కోటి ఆశలు రేకత్తించారు తప్పా ఆ స్థాయిలో కేటాయింపు లు చేయలేదు. రైతాం గం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు లేవు. విద్యుత్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పేదల ఇళ్లకు డబుల్ బెడ్ రూం కటిస్తామని చెప్పారు కానీ బడ్జెట్లో కేటాయింంచలేదు. - తూడి దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేంద్రం ఇచ్చే సబ్సిడీలకే కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకాలకే ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించింది. నిరుద్యోగులు, యువకులు, రైతులకు బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు. ఉద్యోగాల కల్పన పూర్తిగా విస్మరించారు. మౌలిక సదుపాయాలు, ఖాయాల పడ్డ పరిశ్రమల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను చిన్నచూపు చూసింది. సీఎం, మం త్రులు ఎన్నికల్లో గుప్పించిన హామీలకు ప్రతిబిం బించే విధంగా బడ్జెట్ లేదు. - వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గిరిజనులకు అధిక ప్రాధాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గిరిజనులకు అధిక ప్రాధాన్యం లభించింది. గిరిజనులకు మూడు ఎకరాలు, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా తమకు చేయూత అందనుంది. తండాలను ప్రత్యేక గ్రామ పంచాతీలు చేయడం ద్వారా అభివృద్ధికి మార్గం సుగమమైంది. సబ్‌ప్లాన్ నిధులతో తండాలకు మహార్ధశ పట్టనుంది. గతం లో గిరిజనులకు ఇంత ఉపయోగకర మైన బడ్జెట్ ఏ ప్రభుత్వం కేటాయించలేదు. - లకావత్ రవినాయక్, తెలంగాణ గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీల పట్ల వివక్ష రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించారు. దీంట్లో బీసీ విద్యార్థుల ఫీజు బకాయిల కిందనే రూ.3వేల కోట్లు చెల్లిం చాల్సి ఉంది. అది మినహాయిస్తే బీసీలకు మిగిలేది శూన్యం. ఇక కార్పోరేషన్లు, సంక్షేమ శాఖకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు బీసీలకు వర్తింపజేయాలి. - వైద్యుల సత్యనారాయణ, జిల్లా బీసీ సంఘం ప్రధానకార్యదర్శి రైతు వ్యతిరేక బడ్జెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల తరహాలోనే అంకెల గారడీల బడ్జెట్ ఉంది. ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఐదు నెలల్లో ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేయలేరు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఎస్ఎల్బీసీకి బడ్జెట్లో అత్తెసరు నిధులు కేటాయించి అన్ని వర్గాల ప్రజలు విస్మరించారు. - బిల్యానాయక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఖర్చు చేస్తేనే ప్రయోజనం ఏపీ బడ్జెట్ రూ.లక్షా 15వేల కోట్లు అయితే.. తెలంగాణ ప్రభుత్వం 10జిల్లాలకు లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షణీయం. కేటాయించిన బడ్జెట్ నిధులన్నీ 5నెలల్లో ఖర్చు చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉండాలి. లోటు బడ్జెట్ రూ.17వేల కోట్లు ఉంది. దీన్ని పూడ్చేం దుకు ప్రభుత్వం అప్పుతేవడం కానీ, ప్రజలపై పన్నుల రూపంలో భారం మోపాల్సి ఉంటుంది. ఎక్కువశాతం జనాభా ఉన్న బీసీలకు బడ్జెట్లో కేవలం రూ.2వేల కోట్లు కేటాయించడం విచారకరం. విద్యుత్, రుణమాఫీ, ఉన్నతవిద్యకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత రావాల్సి ఉంది. - డాక్టర్ అంజిరెడ్డి, ఎంజీయూ అర్థశాస్త్ర విభాగాధిపతి -
కలల మెట్రోకు రూ.416 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో రూ.416 కోట్ల మేర నిధులు కేటాయించడంతో ప్రధాన నగరంలో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం నాగోలు-మెట్టుగూడ, ఎస్.ఆర్.నగర్-మియాపూర్ రూట్లో పనులు శరవేగంగా జరుగుతున్న విషయం విదితమే. ఇదే తరహాలో ప్రధాన నగరంలోని నాంపల్లి, బేగంపేట్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఆస్తుల సేకరణ వంటి ప్రక్రియలను వేగవంతం చేయడం. బాధితులకు పరిహారం పంపిణీ, మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాల కల్పన, విద్యుత్, మంచినీరు వంటి సౌకర్యాల కల్పన, మెట్రో కారిడార్లలో హరితహారం నెలకొల్పడం తదితర పనులకు తాజా బడ్జెటరీ నిధులు ఉపయోగపడనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు వేగవంతమవుతాయని హెచ్ఎంఆర్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న తెలంగాణా రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధి బడ్జెట్ కేటాయింపుల ద్వారా తేటతెల్లమైంది. -
జూడాల సమ్మెపై వాదనలు పూర్తి, రిజర్వ్‌లో తీర్పు
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు హైకోర్టు జూనియర్ డాక్టర్లకు మొట్టికాయలు వేసింది. కోర్టుకు రాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించింది. రాజకీయాలు చేస్తున్నారా? సమ్మె చేస్తున్నారా అని ప్రశ్నలు సంధించింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో నాలుగింటిని అంగీకరించామని, వాటిపై జీవో కూడా జారీ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. జూనియర్ డాక్టర్లు వైద్య సేవలు అందించాల్సిందేనని, సమ్మె రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. -
జూడాల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా
-
జూడాల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సమ్మె విరమిస్తేనే కేసు విచారిస్తామని న్యాయస్థానం మరోసారి జూడాలకు స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, జూనియర్ డాక్టర్ల వాదనలతో తాము ఏకీభవించటం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.. జూనియర్ డాక్టర్లు ఇంకా పరిణితి చెందాల్సి ఉందని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. కాగా సమ్మె కొనసాగించేందుకే జూనియర్ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని జూడాల తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. -
జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సమ్మె విరమించాలని జూడాలను న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా చేసే హక్కు ఉంటుందని, కోర్టు చెప్పిన తర్వాత కూడా వినకుంటే ఎలా? అని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. సమ్మె విరమిస్తేనే కేసు విచారణ చేపడతామని, ఆదేశాలు పాటించకుంటే చర్యలకు సిద్ధమేనా అని జూనియర్ డాక్టర్ల తరపు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా సమ్మెపై జూనియర్ డాక్టర్లతో చర్చించేందుకు సమయం కావాలని వారి తరపు న్యాయవాది ...కోర్టును కోరారు. దాంతో హైకోర్టు విచారణను అరగంటపాటు వాయిదా వేసింది. మరోవైపు సమ్మెపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని జూనియర్ డాక్టర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలపగా, సమ్మె అంశం కోర్టు పరిశీలనలో ఉండగా ప్రభుత్వంతో ఎలా చర్చిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. -
సమ్మైపై హైకోర్టు వ్యాఖ్యలు మాకు తెలియదు:జూడాలు
హైదరాబాద్: సమ్మెకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. దీనిపై పూర్తి సమాచారం అందిన వెంటనే స్పందిస్తామని జూడాలు తెలిపారు. జూనియర్ వైద్యులు సమ్మెను వెంటనే విరమించాలని సోమవారం హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ సమ్మె విరమించకపోతే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని విచారణ సందర్భంగా పేర్కొంది. పారిశ్రామిక, దుకాణాల చట్టం జూనియర్ డాక్టర్లకు వర్తించదని, సమ్మె చేయడానికి జూనియర్ వైద్యులు రోజువారీ కూలీలు కాదని పేర్కొంది. సమ్మె చేసే హక్కు జూడాలకు లేదని పేర్కొన్న హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. వారు అత్యవసర సేవలనూ బహిష్కరించటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వ్యాఖ్యలు నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు సమ్మెపై జూడాలు ప్రకటన చేసే అవకాశం ఉంది. -
సమ్మె చేసే హక్కు జూడాలకు లేదు:హైకోర్టు
హైదరాబాద్: జూనియర్ వైద్యులు సమ్మెను వెంటనే విరమించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ సమ్మె విరమించకపోతే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని తెలిపింది. దీనిపై సోమవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పారిశ్రామిక, దుకాణాల చట్టం జూనియర్ డాక్టర్లకు వర్తించదని, సమ్మె చేయడానికి జూనియర్ వైద్యులు రోజువారీ కూలీలు కాదని పేర్కొంది. సమ్మె చేసే హక్కు జూడాలకు లేదని పేర్కొన్న హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. వారు అత్యవసర సేవలనూ బహిష్కరించటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మెకు పలువురు సంఘీభావం ప్రకటించారు. -
సమ్మె చేసే హక్కు జూడాలకు లేదు:హైకోర్టు
-
తెలంగాణ పత్రిక చీఫ్ ఎడిటర్‌గా రామమోహన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రానున్న ‘తెలంగాణ’ జర్నల్‌కు చీఫ్ ఎడిటర్‌గా అష్టకళ రామమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సిబ్బందిని సమాచార, పౌర సంబంధాల శాఖ నియమించుకోవాలని సమాచార శాఖ కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శిక్షణపై చంద్రవదన్: వారంపాటు శిక్షణ కోసం హర్యానాలోని సోనెపట్‌కు కార్మికశాఖ కార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ వెళ్తున్నారు. ఆయన స్థానంలో ఈ బాధ్యతలను పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి నిర్వహిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. -
కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మె శుక్రవారం కూడా కొనసాగుతోంది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. వారు అత్యవసర సేవలనూ బహిష్కరించటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు ప్రకటించింది. కాగా జూనియర్ డాక్టర్లు బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని, వారిని చర్చలకు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం, వెద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. చట్టానికి అనుగుణంగా, గతంలో వారు ఒప్పుకున్న విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సిందేనన్నారు. అలా జరగని పక్షంలో చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. -
'పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది'
హైదరాబాద్: తమ చేపట్టిన దీక్ష కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు (జూడాలు) గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ న్యాయమైన ఆందోళనను పోలీసులతో అణచివేయాలని చూస్తోందని వారు ఆరోపించారు. దీక్ష చేస్తున్న తమను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారని విమర్శించారు. త్వరలో ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని జూడాలు హెచ్చరించారు. తమ ఆందోళనకు ప్రజల మద్దతు ఉందని జూడాలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలవాలని జూడాలు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. -
ఎన్నారైలకు చెరువుల దత్తత!
పునరుద్ధరణ కోసం సహకారం తీసుకోవాలని టీ సర్కార్ నిర్ణయం ఆర్థిక సహకారం కోసం విజ్ఞప్తి చేయనున్న సీఎం కేసీఆర్! హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యమ స్థాయిలో చేపట్టదలచిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వాములను చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఎన్నారైలు సంపూర్ణ సహకారం అందించిన తరహాలో చెరువుల పునరుద్ధరణకూ తోడ్పడాల్సిం దిగా కోరాలని భావిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎవరైనా ఎన్నారైలు ముందుకొస్తే... వారికి చెరువులను దత్తత ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో చెరువుల అభివృద్ధిపై ఇప్పటికే పాలనాపరమైన ఏర్పాట్లను పూర్తిచేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం తొలివిడతలో పునరుద్ధరించే చెరువుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. దీనిని వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేసి, ఆ తర్వాత టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టాలని భావిస్తోంది. ‘భాగస్వామ్యం’పై కసరత్తు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా అందరి భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ఎన్నారైల సహకారాన్ని తీసుకోవాలని.. వారు కోరిన చెరువులను దత్తతకు ఇచ్చి, ప్రభుత్వపరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని నిర్ణయించి నట్లు తెలుస్తోంది. పునరుద్ధరణ కింద చేపట్టే కట్టల పటిష్టం, పూడికతీత, ప్రధాన చెరువుల కాల్వల కింద ముళ్లపొదల తొలగింపు వంటి కార్యక్రమాలకు... మానవ వనరులతో పాటు జేసీబీలు, ట్రాక్టర్లు, పారలు, తట్టలు, గడ్డపారలు వంటివి భారీగా అవసరమవుతాయి. జేసీబీలు, ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చుతో పాటు మిగతా సామగ్రి కొనుగోలుకు నిధులు అవసరం. అయితే వీటిల్లో ఏ పనికోసం ఎన్నారైల నుంచి ఆర్థిక సహకారం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. చెరువుల పునరుద్ధరణకు ఎన్నారైల మద్దతు కోరుతూ.. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. అంతేగాకుండా చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ మొదలవడానికి ముందే ‘మన ఊరు-మన చెరువు’ పేరిట పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేగంగా టెండర్ల ప్రక్రియ చెరువుల పునరుద్ధరణ కింద ఇచ్చే పనులకు టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా టెండర్ ప్రకటన వచ్చాక పద్నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్లు దరఖాస్తులు సమర్పించాలి. దీనిని ఏడు రోజులకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టెండర్ల మదింపును కూడా ఒక్క రోజులోనే పూర్తిచేయాలని భావిస్తోంది. -
మీ రుణానికి మాది ‘హామీ’
మాఫీపై రైతులకు రుణ హామీ పత్రాలు తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయం {పభుత్వం తరఫున పత్రాలపై మండల తహశీల్దారు సంతకం ఈ పత్రం బ్యాంకులకు చూపిస్తే.. కొత్త రుణాలు మంజూరు సమస్యలుంటే మండల, జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేయాలని సూచన హైదరాబాద్: రైతులకు రుణ మాఫీ కింద ఇప్పటికే 25 శాతం నిధులు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. వారిలో మరింత ఆత్మవిశ్వాసం నింపడానికి వీలుగా రుణ హామీ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. రుణమాఫీ వల్ల లబ్ధి పొందే ప్రతీ రైతుకు ఈ మేరకు హామీ పత్రాలు ఇవ్వనుంది. తద్వారా రైతులకు ప్రభుత్వంపై భరోసా కల్పించడమేకాక రుణ మాఫీ అమలు అవుతున్న విషయానికి విస్తృతంగా ప్రచారం కల్పించవచ్చని సర్కారు భావిస్తోంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాల్లో 25 శాతం మొత్తాన్ని వారి పేరుతో బ్యాంకుల్లో జమ చేశామని, మిగిలిన 75 శాతం రుణాన్ని కూడా ప్రభుత్వమే వడ్డీ సహా బ్యాంకులకు చెల్లిస్తుందని, దీనిపై అధైర్యపడవద్దని పేర్కొంటూ ఈ హామీ పత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హామీ పత్రాలను బ్యాంకులకు చూపించి రుణాలు పొందాలని, బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఏవైనా ఇబ్బందులు సృష్టిస్తే.. మండల, జిల్లా గ్రీవెన్స్ సెల్స్‌కు ఫిర్యాదు చేయాలని కూడా అందులో పేర్కొననున్నారు. ఒక్కో మండలంలో దాదాపు ఆరేడువేల మంది రైతులకు ఈ విధమైన హామీ పత్రాలపై మండల తహశీల్దార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతకాలు చేసి ఇస్తారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ హామీ పత్రాలు ఇవ్వడం వల్ల తమ రుణాల్లో కొంతమొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిందన్న విషయం రైతుల దృష్టికి వెళ్తుందని, ఇదివరకు ఉన్న రుణాలను రెన్యూవల్ చేసుకోవడానికి, కొత్త రుణాలు తీసుకోవడానికి వారు ముందుకు వస్తారని సర్కారు ఆశిస్తోంది. ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి.. ప్రజాప్రతినిధులతో వీటిని రైతులకు అందించడం వల్ల రుణమాఫీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న విషయం కూడా విస్తృతంగా రైతుల్లోకి వెళ్లుందని భావిస్తోంది. బ్యాంకులకు చేరిన రుణ మాఫీ నిధులు.. రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 4,250 కోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి వివరించారు. ఈ మొత్తంతో బ్యాంకులు రైతుల రుణాల్లో 25 శాతాన్ని మాఫీ చేస్తాయని ఆ అధికారి వివరించారు. కలెక్టర్ నియమించిన మండల నోడల్ ఆఫీసర్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అక్షర క్రమంలో రోజుకు కొన్ని గ్రామాల చొప్పున రుణమాఫీకి అర్హులైన రైతులను ఆయా బ్యాంకులకు పిలిపిస్తారు. వారి రుణాన్ని మరోసారి పరిశీలించి... కొత్త రుణాలను అప్పటికప్పుడే ఇచ్చేస్తారు. ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభమైందని అధికారులు చె బుతున్నారు. రైతులకు గతంలో వచ్చిన మాదిరిగా పూర్తిస్థాయి రుణం వచ్చే అవకాశాలు లేవని, ప్రభుత్వం చెల్లించిన రుణానికి సంబంధించిన మొత్తంతోపాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఐదు నుంచి పదిశాతం అదనంగా, అలాగే వినియోగ రుణం కింద 20 నుంచి 30 శాతం అదనంగా రుణం లభించే అవకాశం ఉందని సదరు అధికారి వ్యాఖ్యానించారు. ‘అర్బన్’ బంగారు రుణాలకు మాఫీ లేనట్టే! పట్టణ, మెట్రో నగరాల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు ప్రస్తుతానికి రుణమాఫీ వర్తింప చేయబోమని బ్యాంకు వర్గాలు తెలిపాయి. అర్బన్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్లో చాలామటుకు పంట కోసం కాకుండా ఇతరత్రా వ్యక్తిగత అవసరాల కోసమే తీసుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిపై మరింత పరిశీలన చేశాకే రుణామాఫీని వర్తింప చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం విడుదల చేసిన పావు వంతు రుణమాఫీ సొమ్ము అర్బన్, మెట్రో నగరాల్లో బంగారంపై రుణం తీసుకున్న రైతుల ఖాతాలోకి వెళ్లే అవకాశం లేదు. ‘అర్బన్, మెట్రో నగరాల్లో కొన్ని ప్రైవేటు, చిన్న బ్యాంకులు ఒక ఎకరా ఉన్న రైతుకు కూడా బంగారంపై ఐదారు లక్షల రూపాయల రుణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంతంత రుణాలు ఇవ్వడంలో ఔచిత్యం ఏంటో బోధపడడంలేదు. ఇలాంటి రుణాలపై మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ రుణాలను మాఫీ చేయడంలేదు’ అని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. లక్ష జనాభా దాటిన పట్టణాలను అర్బన్లుగా రిజర్వుబ్యాంకు నిర్వచించింది. ఆ ప్రకారం తెలంగాణలో ఉన్న అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో తీసుకున్న బంగారు రుణాలకు మాఫీ వర్తించే అవకాశం ప్రస్తుతానికి లేనట్టే. -
20 లక్షల ఎకరాలకు నీరు వచ్చేది....
-
వాటర్ గ్రిడ్ @ఃరూ.2070 కోట్లు
నీలగిరి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించాలనుకుంటున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు ఓ కొలిక్కివచ్చాయి. జిల్లావ్యాప్తంగా 24 గంటలూ అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు తాగునీటిని సరఫరా చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రిడ్ ప్రతిపాదనలు తయారుచేయడంలో జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అహర్నిశలు శ్రమించింది. గ్రిడ్ అమలుకు అవసరమయ్యే నీటి వనరులు, పనుల అంచనాలు, పైప్లైన్ల డిజైన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జిల్లావ్యాప్తంగా నెలకొన్న తాగునీటి సమస్య తీరుతుంది. ప్రధానంగా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కలుషిత నీటిని తాగుతూ జీవచ్ఛవాల్లా మారుతున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు కృష్ణా జలాలతో కళకళలాడుతాయి. తీవ్ర వర్షాభావంతో కొట్టుమిట్టాడుతూ ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు తాగునీటి గండం నుంచి గట్టెక్కుతాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కొరత లేకుండా కేటాయిస్తే నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ ఫలాలు ప్రజలకు అందుతాయి. కృష్ణాజలాలు...మంచినీటి చెరువులు అధికారులు రూపొందించిన ప్రణాళికల ప్రకారం నాలుగుచోట్ల గ్రిడ్లు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుకు రూ.2070 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొదటి గ్రిడ్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్మిస్తారు. దీని పరిధిలో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు ఉంటాయి. 2, 3 గ్రిడ్లు పానగల్లులోని ఉదయసముద్రం రిజ్వరాయర్ వద్ద నిర్మిస్తారు. ఈ రెండు గ్రిడ్ల పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాలు ఉం టాయి. నకిరేకల్ నియోజకవర్గంలోని నాలు గు మండలాలు గ్రిడ్-2 పరిధిలోకి, రెండు మండలాలు గ్రిడ్-3లో కలిపారు. 4వ గ్రిడ్ నాగార్జునసాగర్ ఎడమ కా ల్వ ప్రవహించే ప్రాంతాల్లో నిర్మిస్తారు. దీని పరిధిలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులకు కృష్ణాజలాలతోపాటు, ముప్పారం, వాయిలసింగారం, మంచినీటి చెరువులను వినియోగిస్తారు. సమృద్ధిగా నీటి వనరులు... వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు అవసమయ్యే నీటి వనరులు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణాజలాలు, మంచినీటి చెరువులను వినియోగించనున్నారు. జిల్లాలో హ్యాబిటేషన్లు 3591లు దాకాఉన్నాయి. దీంట్లో ప్రస్తుతం 1541 హ్యాబిటేషన్లకు 2.5 టీఎంసీల తాగునీరు సరఫరా అవుతోంది. మిగిలిన 2050 హ్యాబిటేషన్లు, మున్సిపాలిటీలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావాలంటే 7.08 టీఎంసీల నీరు అవసరమవుతుంది. మొత్తంగా అన్ని గ్రామాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని అందించాలంటే 9.58 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు నుంచి తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం ఉదయసముద్రానికి 1.5 టీఎంసీలు విడుదల అవుతుంది. కాబట్టి గ్రిడ్లకు నీటి సమస్య అనేది ఉండదు. అయితే అన్ని సందర్భాల్లో ఐకేబీఆర్ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల సాధ్యం కానందున అక్కడినుంచి ఉదయ సముద్రానికి నేరుగా కొత్త పైప్‌లైన్ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఐకేబీఆర్ ద్వారా మూడు గ్రిడ్లకు, సాగర్ ఎడమ కాల్వల ద్వారా నాలుగో గ్రిడ్‌కు నీటిని అందిస్తారు. నాలుగు దశల్లో... ప్రభుత్వం నిధుల మంజూరులో వెనకడుగు వేయకుం డా శరవేగంగా పనులు చేపడితే నాలుగు దశల్లో పూర్తయ్యే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలను కూడా ఈ గ్రిడ్లను అనుసంధానం చేస్తారు. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను కూడా గ్రిడ్లకు కలుపుతారు. అదేవిధంగా ప్రస్తుతం గ్రామా ల్లో 8 గంటలపాటు నీటిని సరఫరా చేసే పైపులైన్లు ఉన్నాయి. గ్రిడ్ ఏర్పాటైతే 24గంటల పాటు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. కాబట్టి లూప్ డిజైన్ ద్వారా ప్రస్తుతం ఉన్న పైప్‌లకు లింక్ చేస్తారు. దీంతో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయమూ ఏర్పడదు. జిల్లాకు ఎంతో ప్రయోజనం : రాజేశ్వరారవు, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు లైన్ ఎస్టిమేట్లు రూపొందించి ఈఎన్సీకి సమర్పించాం. జిల్లాలో నాలుగు గ్రిడ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. గ్రిడ్ల నిర్మాణం జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరం. ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగునీరు, వర్షాభావ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరుతుంది. గ్రిడ్-2లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల, కట్టంగూరు, నార్కట్‌పల్లి, రామన్నపేట మండలాలు కలిపారు. 3లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి, నకిరేకల్ మండలాలు కలిపారు. 4లో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాలు కలిపారు. ఆలేరు నుంచి వరంగల్ జిల్లాలో జనగామ నియోజకవర్గానికి తాగునీరు అందిస్తారు. తిరుమలగిరి నుంచి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి తాగునీరు అందిస్తారు. గ్రిడ్ అంచనా వ్యయం కావాల్సిన నీరు సంఖ్య (కోట్లలో) (టీఎంసీలలో) గ్రిడ్-1 రూ.470 2.00 గ్రిడ్-2 రూ.800 2.33 గ్రిడ్-3 రూ.400 1.77 గ్రిడ్-4 రూ.400 3.48 -
రైతులకే రీయింబర్స్ చేస్తాం
రుణ మాఫీపై బ్యాంకర్లకు స్పష్టం చేసిన ప్రభుత్వం రుణాలు రెన్యువల్ చేసి.. కొత్త రుణాలు ఇవ్వండి రెన్యువల్ కాకుంటే పంటల బీమా కోల్పోయే ప్రమాదం రేపటిలోగా బకాయిల విషయమై స్పష్టత ఇవ్వాలని సూచన రిజర్వుబ్యాంక్ అనుమతించిన వంద మండలాల్లో రీషెడ్యూల్‌ను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి ఒక్కో బ్యాంకు అధికారులతో ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారుల భేటీలు హైదరాబాద్: రుణ మాఫీ కింద నిధులను నేరుగా రైతులకే రీయింబర్స్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసిం ది. రుణమాఫీ కింద అందించే నిధులను బ్యాం కులకు ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన రుణాల మంజూ రు వేగం పెంచాలని, మాఫీ వర్తించే రుణాలను రెన్యువల్ చేసి, రైతులకు కొత్త రుణాలు అందజేయాలని కోరింది. ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు తదితర ప్రధాన బ్యాంకుల అధికారులతో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులు గురువారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఒక్కో బ్యాంకు అధికారులతో అరగంటకుపైగా జరిగిన ఈ భేటీల్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుణ మాఫీ, ఖరీఫ్ రుణాల పంపిణీ అంశాలను వేర్వేరుగా పరిగణించాలని అధికారులు బ్యాంకర్లను కోరారు. ఖరీఫ్ సీజన్ లో దాదాపు సగం కాలం పూర్తవుతున్న తరుణంలో ఇంకా రుణాలు అందకపోతే.. రైతులు మరింతగా రుణాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వివరించారు. అయితే ఈ ఖరీఫ్‌లో రూ. 27 వేల కోట్లకుపైగా పంట రుణా లు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించినా... ఇప్పటివరకు పదిశాతం రుణాలు కూడా ఇవ్వలేదు. రుణ మాఫీ ఆశతో రైతులు బకాయిలు చెల్లించకపోవడంతో.. బ్యాం కులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రైతులెవరైనా బకాయిలు చెల్లిస్తే... వారికి అదేరోజు లేదా మరుసటి రోజున కొత్త రుణాలు ఇస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో రైతులను మరింత జాగృతం చేయాలని.. రుణాలు రెన్యువల్ చేసుకునే విధంగా చూడాలని అధికారులు కోరారు. రుణాల రెన్యువల్లో వేగం పెంచితే తప్ప.. కొత్త రుణా లు ఇవ్వడం సాధ్యం కాదని అందుకే దీనిపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. అలాగే రిజర్వుబ్యాంక్ అనుమతించిన మేరకు మూడు జిల్లాల్లోని వంద మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి బ్యాంకర్ల ను కోరారు. రీషెడ్యూల్ అయ్యే రుణాల మొత్తం ఎంతనే వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. అలాగే రైతులు రెన్యువల్ చేసుకుంటే తప్ప, వారికి పంటల బీమా వర్తించే అవకాశం లేనందున దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. రుణమాఫీకి సంబంధించి శనివారం వరకు మొత్తం బకాయిలు ఎంతనే విషయంలో స్పష్టత ఇవ్వాలని సూచించారు. కాగా.. శుక్రవారం కూడా మరికొన్ని బ్యాంకుల అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశం కానున్నారు. మాఫీపై వీడియో కాన్ఫరెన్స్.. రైతుల రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రుణ మాఫీ అమలుకు ఇదివరకు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న అంశంపై ఆయన సమీక్షించనున్నారు. -
పొదుపే పెట్టుబడి
* నయా పైసా ఖర్చు లేకుండానే వీధుల్లో ఎల్ఈడీ దీపాలు * విద్యుత్ పొదుపుతో మిగిలే నిధులే పెట్టుబడి * రుణ సాయం, పథకం అవులుకు అంగీకరించిన ఈఈఎస్ఎల్... త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం సాక్షి, హైదరాబాద్: నయా పైసా ఖర్చు లేకుండానే వీధుల్లో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) భాగస్వామ్యంతో పైలట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని సంప్రదాయ వీధి దీపాలను తొలగించి తక్కువ విద్యుత్‌తో అధిక వెలుగులు ఇచ్చే ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయూలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెలైట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 12 నగరాలు, పురపాలక సంస్థలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ నగరాలు, పట్టణాల్లో నిర్ణీత పరిధిలోని ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడి పాత వీధి దీపాలను తొలగించి ఎల్ఈడీ దీపాలను అమర్చనున్నారు. దీనికి రూ.2 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఎల్ఈడీ దీపాల విద్యుత్ లైన్‌కు ప్రత్యేక మీటర్‌ను బిగించి.. గతంతో పోల్చితే వీటి వినియోగం వల్ల జరిగిన విద్యుత్ పొదుపును ప్రతి నెలా సమీక్షిస్తారు. విద్యుత్ పొదుపునకు అనుగుణంగా కరెంటు చార్జీలూ తగ్గనున్నాయి. ఇలా ప్రతి నెలా పొదుపు చేసే నిధులనే రుణ వారుుదాలుగా ఈఈఎస్ఎల్ సంస్థ స్థానిక నగర/పురపాలక సంస్థల నుంచి స్వీకరించనుంది. మొత్తం పెట్టుబడి తిరిగి వచ్చిన తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించనుంది. అప్పటి వరకు ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా ఈఈఎస్ఎల్ పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ఈఈఎస్ఎల్ అధికారులు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపారు. త్వరలో ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈఈఎస్ఎల్.. విద్యుత్ పొదుపును ప్రోత్సహించడానికి లాభాపేక్ష లేకుండా ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. ఇది చేపట్టే ప్రాజెక్టులకు వడ్డీ లేకుండా రుణ సహాయాన్ని అందిస్తోంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే విడతల వారీగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ ప్రాజెక్టును ఇదే తరహాలో అమలు చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 9న మేయుర్లు, చైర్మన్లతో భేటీ ఎల్ఈడీ వీధి దీపాల పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికైన నగరాలు, పట్టణాల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో ఈఈఎస్ఎల్ అధికారులు ఈ నెల 9న పురపాలక శాఖ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ప్రాజెక్టు అమలు చేయనున్న ప్రాంతంలో గత ఏడాది కాలంలో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులతో ఈ సమావేశానికి హాజరు కావాలని సంబంధిత కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కాళోజీ కళాక్షేత్రం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘ఉదయంకానే కాదనుకోవడం నిరాశ... ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ’ అంటూ గొప్ప సత్యాన్ని సులభంగా వివరించారు కాళోజీ నారాయణరావు. అన్యాయాన్ని ఎదిరించాలని రాయడమే కాకుండా చేసి చూపించిన కాళోజీ.. ప్రజా కవిగా మాత్రమే కాకుండా ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి చిరునామాగా నిలిచిన కాళోజీ నారాయణరావుకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1914, సెప్టెంబరు 9న జన్మించిన కాళోజీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 9న కాళోజీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగం గా హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం(కల్చరల్ సెం టర్) ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం హయగ్రీవాచారి మైదానంగా పిలుస్తున్న ప్రాంతంలోని మూడు ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న ఉదయం వరంగల్ నగరానికి వస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొలిసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాగం, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాళోజీకి పెద్దపీట... పోరాటాలు, రచనలతో సామాజిక, తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి నడిచిన కాళోజీ నారాయణరావుకు గుర్తింపుగా ఆయన సొంత ప్రాంతమైన జిల్లా కేంద్రంలో కళా క్షేత్రం ఏర్పాటు చేస్తున్నారు. కళలకు, కళా ప్రదర్శనలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న హైదరాబాద్ రవీంద్రభారతికి దీటుగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించనున్నారు. కాళోజీ రచనలను, ఆయన జ్ఞాపకాలకు సంబంధించిన అంశాలను ఈ క్షేత్రంలో పెట్టనున్నారు. మొదటి నుంచీ కళా, సాంస్కృతిక రంగాలకు చిరునామాగా ఉన్న వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేస్తే ఈ రంగాలకు మరింత గుర్తింపు రానుంది. కళా క్షేత్రం నిర్మాణం తీరు ఎలా ఉండాలనే అంశంపై నిర్మాణ నిపుణులకు బాధ్యతలు అప్పగించారు. కళాక్షేత్రం నిర్మాణ ప్రక్రియను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చేపడుతోంది. -
మా వాదనలూ వినండి!
{బిజేష్ ట్రిబ్యునల్‌పై సుప్రీంలో తెలంగాణ ఇంప్లీడ్ పిటిషన్ {sిబ్యునల్ తీర్పుపై రేపు విచారణ.. ఇంప్లీడ్ పిటిషన్‌పైనా కోర్టు నిర్ణయం హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై గతంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై జరుగుతున్న విచారణలో తమ వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు బుధవారం ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం నీటి కేటాయింపులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరింది. కాగా ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరుగనుంది. ఇదే సమయంలో ఇంప్లీడ్ పిటిషన్‌పైనా కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కృష్ణానది జలాల కేటాయింపుపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమిం చింది. నీటి లభ్యత, కేటాయింపులు, వినియో గం విషయాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే ప్రస్తుత ట్రిబ్యునల్ పరిధిని విస్తరించాలని, లేదంటే కొత్త ట్రిబ్యునల్ వేయాలని సుప్రీంను కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ పంపిణీ చేయాలి.. తెలంగాణ వాదన వినకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అవార్డును అమలు చేస్తే తీరని అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ వాదనగా ఉంది. దీంతోపాటు ట్రిబ్యునల్ ఇప్పటివరకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపలేదన్న అంశాన్ని కోర్టు దృష్టికి తేనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జల వివాదాలకు ఉద్దేశించిన బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో నాలుగు రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుని నీటిని కేటాయించాలని ఇప్పటికే కోరిన అంశాన్ని కోర్టు దృష్టికి తేవాలని నిర్ణయిం చింది. ఈ కేసు విషయమై ప్రభు త్వ సలహా దారు విద్యాసాగర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘బుధవారమే ఈ కేసుకు సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి తమ వాదనలకు అవకాశమివ్వాలని కోరాం. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు, ట్రిబ్యునల్ పరిధి పెంపుపై ప్రస్తావన చేయలేదు.’’ అని తెలిపారు. -
కొత్తగా ఐదు తాగునీటి పథకాలు
ఏపీఎండీపీ మిగులు నిధులు రూ.300 కోట్లతో వీటి పనులు గజ్వేల్, మెదక్, కొల్లాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ ఎంపిక ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఐదు భారీ తాగునీటి పథకాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎండీపీ)లోని మిగులు నిధులతో ఈ కొత్త పథకాలను నిర్మిం చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రం లోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు 2010 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఏపీఎండీపీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రూ.1,670 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య పరస్పర అంగీకార ఒప్పందం జరిగింది. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలోని ఆరు పట్టణాలు, తెలంగాణలోని మూడు పట్టణాలను ఈ ప్రాజెక్టు కింద అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టులోని మిగులు నిధుల్లో తమ రాష్ట్ర వాటా రూ. 300 కోట్లతో మరో ఐదు తాగునీటి సరఫరా పథకాలు నిర్మిం చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాతి నిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాల్టీతో పాటు మెదక్, కొల్లాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాల్టీలను అధికారులు ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు అసంతృప్తి.. ఏపీఎండీపీ కింద విజయనగరం, గుంటూరు, కాకినాడ, బద్వెల్, అనంతపురం, మార్కాపూర్, మణుగూరు, ఆర్మూరు, మాల్కాజిగిరి పట్టణాల్లో తాగునీటి సరఫరా పథకాల నిర్మాణాన్ని అప్పట్లో చేపట్టారు. నాలుగేళ్లు గడిచినా ఇంకా పనులు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ బ్యాంకు రూ.1,670 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి ముందుకొస్తే ఇప్పటి వరకు రూ.80 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోవడంపై ప్రపంచ బ్యాంకు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధులిచ్చినా వినియోగించుకోలేరా అని ఘాటుగా స్పందించిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం మేరకు 2015 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసిపోతే నిధులు మురిగిపోయే ప్రమాదముంది. ఉమ్మడిగానే ఏపీఎండీపీ.. కాగా, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీఎండీపీ విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రపంచ బ్యాం కు ఆమోదంతో ప్రాజెక్టు విభజన చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. -
ఫోన్ చేస్తారు..సమాచారం సేకరిస్తారు
సాక్షి, మంచిర్యాల :తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైన నేపథ్యంలో తదుపరి దశల్లోనూ సర్కారు అదే స్పష్టతతో ముందుకెళ్తోంది. ఒక్కరోజే సర్వే చేయడం ద్వారా అక్రమాలకు తావు లేని విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా సర్వే ఫారాల క ంప్యూటరీకరణకు ముందు సైతం వివరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ మార్కుతో ఉన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు ఓ అధికారి వివరించారు. నోడల్ అధికారులుగా సర్వే బాధ్యతలు నిర్వర్తించిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, అగ్రికల్చర్ అధికారులు, ఎంఈవోలపై ఈ గురుతర బాధ్యత పెట ్టనున్నట్లు సమాచారం. ఈ నోడల్ అధికారులు సర్వే నమూనాలో నింపకుండా వదిలివేసిన వివరాలను లబ్ధిదారులు ఇచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా సేకరించనున్నారు. స్టార్.. స్టార్.. గ్యాస్ కనెక్షన్, విద్యుత్ మీటరు కనెక్షన్ నంబరు వంటి ‘స్టార్’ గుర్తు గల విషయాలను ప్రాధాన్య అంశాలుగా తీసుకోనున్నారు. స్టార్ గుర్తున్న వివరాలు పూర్తి చేయని పక్షంలో సర్వే ఫామ్‌లో పేర్కొన్న సెల్‌ఫోన్‌కు కాల్ చేసి వాటిని తెలుసుకొని పెన్సిల్ ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ విధంగా సర్వే జరిగిన అన్ని కుటుంబాల వివరాల విషయమై నోడల్ అధికారి పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్‌లోని అన్ని వివరాలు సమగ్రంగా ఉంటేనే ఆ కుటుంబ వివరాలను అప్డేట్ చేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. ఈ వివరాలను కంప్యూటరీకరణ చేసిన తర్వాత సైతం థర్డ్‌పార్టీ తనిఖీ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిల్లాస్థాయి అధికారి ఒకరు వివరించారు. ఈ క్రమంలోనే సర్వే ఫామ్‌లోని వివరాలను క్షేత్రస్థాయి తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఫామ్‌ల కంప్యూటరీకరణ ప్రక్రియను సైతం పరిశీలించే అవకాశాలున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. -
తెలంగాణలోనూ మైనారిటీస్ కమిషన్ చట్టం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చట్టం-1998 ఇకపై తెలంగాణ రాష్ట్రంలో సైతం అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 101లో సూచించిన నిబంధనల ప్రకారం ఈ చట్టాన్ని అడాప్ట్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆ ఐదు శాతాన్నీ వదలం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే -2014 కార్యక్రమాన్ని సంపూర్ణం గావించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారంనాటి సర్వేతో జిల్లాలోని 8.59 లక్షల కుటుంబాలలో 95 శాతం మేర వివరాలు సేకరించినట్టు అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో దాదాపు 40 వేల కుటుంబాల వివ రాలు ఇంకా రాలేదని అధికారుల అంచనా. మొత్తం కుటుంబాల సంఖ్యలో ఇది కేవలం 5 శాతమే అయినా.. ఆ వివరాలను కూడా సేకరించాల్సిందేనని కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి భావిస్తున్నారు. వదిలివేసిన ఇళ్లపై ప్రత్యేక చొరవ తీసుకుని మాపప్ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఇళ్లంటినీ మళ్లీ ఒకేరోజు సర్వే చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, మాపప్ సర్వే పరిమితంగా నిర్వహించనున్నట్టు సమాచారం. కేవలం స్టిక్కర్లు వేసి.. సర్వే చేయని ఇళ్లకు మాత్రమే మళ్లీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తారని చెపుతున్నారు. మరోవైపు సర్వేలో భాగంగా సేకరించిన వివరాలను నిక్షిప్తం చేసే ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్లైన్ ఫార్మాట్లో డేటా ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం కళాశాలల విద్యార్థులు, కొందరు ప్రభుత్వ సిబ్బంది, అధికారులను కూడా వినియోగించుకోనున్నారు. కొనసాగిన ఆందోళనలు.. సర్వేలో భాగంగా తమ కుటుంబ వివరాలు సేకరించలేదని, స్టిక్కర్లు ఇచ్చి కూడా సర్వేకు రాలేదని వేలాది మంది ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. బుధవారం ఉదయం కొందరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అయితే, వారి వద్దకు వచ్చిన కలెక్టర్ సావధానంగా వారి మాటలు విని, స్టిక్కర్లు వేసిన ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని చెప్పారు. ఈ ఫిర్యాదులు పరంపర సాయంత్రం వరకూ కొనసాగింది. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రజలు వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించిన జిల్లా యంత్రాంగం జిల్లాలో ఇంకా 5 శాతం కుటుంబాల వారిని సర్వే చేయకుండా మిగిలిపోయినట్టు గుర్తించింది. వీరందరికీ ప్రత్యేకంగా ఒక రోజు సర్వే చేస్తామని, సర్వే సమాచారాన్ని వారి మొబైల్ఫోన్లకు పంపుతామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా యంత్రాంగం చెపుతోంది. -
‘సర్వే’కు వేళాయె..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే - 2014ను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 8,59, 260 కుటుంబాలను సర్వే చేసేందుకు 28,642 మంది ఎన్యూమరేటర్లను (వీరికి అందనంగా మూడువేల సిబ్బందిని) నియమించారు. సిబ్బందికి తగిన వైద్యసౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాల వివరాలను సేకరిస్తారు. గ్రామాలు, కార్పొరేషన్, మున్సిపల్ వార్డులు కలిపి 758 ప్రాంతాల్లో సర్వే చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 30 కుటుంబాల వివరాలు సేకరించేంత వరకు కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లాలోని 46 మండలాల్లో సర్వే నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు చివరి నిమిషంలో దానిని 39 మండలాలకే పరిమితం చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు కింద ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాలను సర్వే నుంచి మినహాయించారు. జిల్లావ్యాప్తంగా 39 మండలాల్లోనే సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి సోమవారం అధికారికంగా ప్రకటించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని, తమకు సంబంధించిన అన్ని వివరాలూ ఎన్యూమరేటర్లకు చెప్పడం ద్వారా అధికారిక గణాంకాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. సర్వేలో ఏ సమస్య తలెత్తినా..సందేహాలున్నా సంబంధిత తహశీల్దార్లకు ఫోన్ చేయాలన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంకు ఫోన్ చేయాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. అందరూ ఉండండి...అన్నీ చెప్పండి సర్వేలో పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తే మంచిదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ సర్వే సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు కాదని, అర్హులైన అదనపు లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను వర్తింపజేయడం కోసమే అని కలెక్టర్ అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన గణాంకాలను సేకరించేందుకు మాత్రమేనని చెప్పారు. సర్వే కాగితాలను ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐలుగా విభజించి ఉన్న తొమ్మిది విభాగాల సమాచారం మాత్రమే చెప్పాలని, అవసరమైతే వివరాలన్నీ చెప్పిన తర్వాత సర్వే కాగితాన్ని సరిచూసుకొని సంతకం పెట్టాలని అధికారులు చెబుతున్నారు. బంగారు ఆభరణాలతో పాటు సర్వే కాగితంలో లేని ఏ ఇతర వివరాలనూ చెప్పాల్సిన అవసరం లేదని కూడా వారు చెపుతున్నారు. సర్వే వివరాలు చెపుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులందరూ ఉంటే మంచిదని, సర్వే సందర్భంగా ఎన్యూమరేటర్లకు ఎలాంటి రుజువులు ఇవ్వాల్సిన పనిలేదని, కేవలం కార్డులు చూపిస్తే చాలని చెపుతున్నారు. ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు... తదితర ఒరిజినల్ కార్డులను చూపించాలని, ఎలాంటి కాగితాలు ఎన్యూమరేటర్లకు ఇవ్వాల్సిన పనిలేదని చెపుతున్నారు. విద్యార్థులు, ఆసుపత్రులలో చేరిన వారు, సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్న వారిని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. వారు లేకపోయినా వారి వివరాలను చెపితే సంబంధిత ఎన్యూమరేటర్లు నమెదు చేసుకుంటారు. కుటుంబానికి ఉన్న భూముల వివరాలు చెప్పాలా? వద్దా? అనే సందేహం ప్రజల్లో ఉంది. భూములకు సంబంధించి కాగితాలుంటే వివరాలు చెపితే మంచిదని, చెప్పకపోయినా ఫర్వాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వేలో వివరాలు చెప్పడం ద్వారా ఆ భూమిపై హక్కు రావడం గానీ, చెప్పకపోవడం వల్ల హక్కు కోల్పోవడం కానీ జరగదని అంటున్నారు. వృద్ధాశ్రమమో యూనిట్ జిల్లాలోని 39 మండలాల్లో ప్రజలందరి వివరాలు సేకరించేందుకు ఆవాసాల్లో నివాసముంటున్న వారి తో పాటు ఇతరుల కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వృద్ధాశ్రమాలు, జైళ్లు, పోలీసు క్యాంపుల్లో కూడా సర్వే జరపనున్నారు. వృద్ధాశ్రమాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా ఎన్యూమరేటర్లను నియమించి వృద్ధాశ్రమమో యూనిట్‌గా వివరాలు సేకరించనున్నారు. ఫ్లాట్‌ఫారంలపై నివసించే వారి వివరాలను కూడా సేకరిస్తారు. ఎవరి వివరాలనైనా సేకరించలేదని తెలిస్తే వెంటనే సంబంధిత తహశీల్దార్‌కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు వచ్చి సర్వే నిర్వహిస్తారని అధికారులు చెపుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్లో వార్డుల వారీగా నియమించిన అధికారులకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన మున్సిపాలిటీలలో సంబంధిత కమిషనర్లకు ఫోన్ చేయాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే జిల్లా కేంద్రంలో ఉన్న కంట్రోల్ రూం నెంబర్‌కు ఫోన్ చేయాలి. ముంపులో లేదు.. పోలవరం ముంపు ప్రాంతాలు కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం రూరల్, బూర్గంపాడులోని ఆరు గ్రామాలను సర్వే నుంచి మినహాయించారు. తొలుత ఈ మండలాల్లో సర్వే నిర్వహించాలని అధికారులు భావించారు. ఇప్పటికే ముంపు మండలాలను ఆంధ్రలో విలీనం చేసే ఆర్డినెన్స్‌కు ఆమోదం రావడం, కొన్ని న్యాయపరమైన అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉండడం, ఉభయగోదావరి జిల్లాల అధికారులు ఆ ఏడు మండలాలను కలుపుకునేందుకు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడం, ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీచైర్‌పర్సన్ ఎన్నికలలో కూడా ఆయా మండలాలను మినహాయించడంతో చివరి నిమిషంలో ఈ మండలాలను సర్వే నుంచి తొలగించారు. స్టిక్కరింగ్ గందరగోళం సర్వేలో భాగంగా కుటుంబాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన స్టిక్కరింగ్ అంశం కొంతమేర గందరగోళానికి దారి తీసింది. ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ సమస్య తలెత్తింది. వాస్తవానికి ఖమ్మంలో 55వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 95వేలకు పైగా స్టిక్కర్లు పంపిణీ చేసినా ఇంకా తమకు స్టిక్కర్లు రాలేదంటూ.. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఖమ్మంతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. వీలున్నంత మేర స్టిక్కర్ల పంపిణీ చేస్తున్నామని, కొన్ని కుటుం బాల్లో యజమానితో పాటు వారి పిల్లలు కూడా ప్రత్యేకంగా నమోదు చేయించుకోవాలని స్టి క్కర్లు అడుగుతుండటంతో గందరగోళం ఏర్పడుతోందని అధికారులు చెపుతున్నారు. ఏ ఇం టినైనా పొయ్యి ప్రాతిపదికన కుటుంబాలుగా గుర్తిస్తామని, ఒకే ఇంటిలో రెండు పొయ్యిలుంటే రెండు కుటుంబాలుగా పరిగణిస్తారు. వెంటనే డాటా ఎంట్రీ.. ఈ సర్వే పూర్తయిన వెంటనే సంబంధిత ఎన్యూమరేటర్లు ఆ కాగితాలను మండల కేంద్రాలకు తీసుకెళ్లి తహశీల్దార్‌కు అప్పగిస్తారు. ఈ కాగితాల్లో నిక్షిప్తమై ఉన్న సమస్త సమాచారాన్ని ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేసేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని పలు కళాశాలల నుంచి మొత్తం రెండువేల కంప్యూటర్లను తీసుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎవరైనా డాటా ఎంట్రీకి ఆసక్తికనబరిస్తే..వారితో పాటు ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న వారిని డాటా ఎంట్రీకి వినియోగించుకుంటారు. ఈనెల 20న కళాశాలల వారీగా వివరాలు సేకరించి, 21న సూపర్వైజర్లకు శిక్షణ నిచ్చి, ఆ తర్వాత డాటా ఎంట్రీ చేసే వారికి శిక్షణనిస్తామని, ఈనెల 23 నుంచి డాటా ఎంట్రీ ప్రారంభం అవుతుందని అధికారులు చెపుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 20 డాటా ఎంట్రీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేందుకు కనీసం నెలరోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ఆయా విభాగాల వారీగా తెలపాల్సిన వివరాలు... విభాగం (ఏ) : పేరు, చిరునామా విభాగం (బీ) : కుటుంబ వివరాలు, మతం, సామాజికవర్గం, రేషన్‌కార్డు ఉందా? ఉంటే ఎలాంటిది?బ్యాంకు ఖాతా ఉందా? వితంతువులు, విడిపోయిన వారు తదితర వివరాలు నమోదు చేస్తారు. విభాగం (సీ) : కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు, పుట్టిన తేదీ, విద్యార్హత, ఉపాధి పొందుతున్న మార్గాలు, ఆధార్ నంబర్, పెన్షన్ వివరాలు నమోదు చేస్తారు విభాగం (డీ) : ఇంటికి సంబంధించిన వివరాలు, స్వంత ఇల్లు ఉందా? లేదా అద్దె ఇంట్లో ఉంటున్నారా? స్వంత ఇళ్ళయితే పక్కా ఇళ్ళా? కాదా? మొత్తం గదులెన్ని? ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉన్నాయా?గతంలో హౌసింగ్ పథకంలో ఇల్లు పొంది ఉన్నారా? తదితర అంశాలుంటాయి. విభాగం (ఈ) : ఇంటికి ఉన్న విద్యుత్ సదుపాయానికి సంబంధించిన వివరాలు విభాగం (ఎఫ్) : వికలాంగులకు సంబంధించిన అంశాలు. ఎంత మంది ఉన్నారు. వారి వైకల్యం ఏమిటీ? సంబంధిత సర్టిఫికెట్ ఉందా? ఉంటే దాని నంబర్‌ను నమోదు చేసుకుంటారు. విభాగం (జీ) : కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు నమోదు చేస్తారు. విభాగం (హెచ్) : వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు ఉంటాయి. భూమి వంశపారంపర్యంగా వచ్చిందా? కొనుగోలు చేసిందా? అసెన్డ్ భూమా? శిఖం పట్టానా? కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారా? విభాగం (ఐ) : పశు సంపదకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మేకలు, గొర్రెలు, గేదెలు, ఆవులు, ఎడ్లు, కోళ్ళు, పందులు ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తారు. విభాగం (జే) : స్థిర, చర ఆస్తులు వివరాలుంటాయి. ద్విచక్ర వాహనం, కారు, ఆటో, జీపు, బస్సు తదితర వాటితో పాటు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్, పొలం దున్నే యంత్రం, కల్టివేటర్లు తదితర వాటిని కూడా నమోదు చేస్తారు. -
‘సర్వే’పై సవాలక్ష అనుమానాలు!
చర్చావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేపై తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పలు అనుమానాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫిలింనగర్ ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా భవన్లో శుక్రవారం చర్చావేదికను నిర్వహించారు. స్థానిక ఇంటింటి సమగ్ర సర్వే క్లస్టర్ ఆఫీసర్లు మల్లెల గిరి, జయకృష్ణతో పాటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ లక్ష్మీబాయి, ఫిలింనగర్ 18 బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగరావుతో పాటు 32 స్వయం సహాయక బృందాల అధ్యక్షురాళ్లు ఇందులో పాల్గొన్నారు. పలు అనుమానాలను వ్యక్తం చేయగా... వాటిని అధికారులు నివృత్తి చేశారు. బంజారాహిల్స్: ఇంటింటి సర్వే నిమిత్తం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లు పూర్తి స్నేహభావంతో మెలుగుతూ వివరాలు నమోదు చేసుకోవడమే కాకుండా వారికి వచ్చే అపోహలు కూడా తొలగిస్తారని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరూ అందుబాటులో లేకపోయినా వారికి సంక్షేమ పథకాలు అందవని అంటున్నారని ప్రజ్వల గ్రూప్ అధ్యక్షురాలు సాంబమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. యజమాని సరైన వివరాలు ఇస్తే చాలని క్లస్టర్ ఆఫీసర్ జయకృష్ణ వెల్లడించారు. సర్వే చేసే ఎన్యూమరేటర్లు అణువనువూ సోదా చేస్తారని వదంతులు వినిపిస్తున్నాయని సరస్వతి మహిళా గ్రూప్ అధ్యక్షురాలు సుగుణ, మహాలక్ష్మి గ్రూప్ అధ్యక్షురాలు చంద్రమ్మ, గంగ గ్రూప్ అధ్యక్షురాలు పద్మమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకున్నామని రెక్కాడితో డొక్కాడని స్థితిలో ఉన్నామని ఈ పరిస్థితిలో తెల్లరేషన్ కార్డు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నామని ధనలక్ష్మి గ్రూపు అధ్యక్షురాలు ధనలక్ష్మి, కనకదుర్గ గ్రూప్ అధ్యక్షురాలు పద్మ, తేజస్విని గ్రూప్ అధ్యక్షురాలు గోవిందమ్మ, జ్యోతి గ్రూపు అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, కుందన గ్రూప్ అధ్యక్షురాలు కౌసల్య వాపోయారు. తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఎన్నడూ లేని విధంగా ఈ సర్వే ఏంటంటూ పలువురు మహిళలు దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతా నంబర్లు ఇస్తే ప్రమాదం కదా అని శ్రీ రాజరాజేశ్వరి గ్రూప్ అధ్యక్షురాలు రమ్య ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద వారిని వదిలేసి మాలాంటి వాళ్లను లక్ష్యంగా పెట్టుకుంటారా అని బీజేఆర్ నగర్ సమాఖ్య అధ్యక్షురాలు మల్లీశ్వరి, బసవతారకం నగర్ సమాఖ్య అధ్యక్షురాలు యాదీశ్వరి అన్నారు. బడుగులకు వేధింపులా? సర్వే రోజున కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ సర్వే ఎందుకో తెలియడం లేదు. మా కార్డులు తొలగిస్తారని భయంగా ఉంది. బడుగులను వేధించకుండా బడాబాబులను లక్ష్యంగా పెట్టుకుంటే మంచిది. - ఆర్.విజయరత్నం, శ్రీ రాజరాజేశ్వరి మహిళా గ్రూపు ఆందోళన వద్దు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితమైన సమాచారం ప్రజల నుంచి స్వీకరించడానికే సర్వే జరుగుతున్నది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్ అంచనా వేయడానికి సర్వే చేస్తున్నాం. - మల్లెల గిరి, సర్వే క్లస్టర్ అధికారి -
తెలంగాణ పోలీసులకు బ్యాడ్జీలు రెడీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పోలీసు యంత్రాంగానికి కొత్తబ్యాడ్జీలను ప్రకటించింది. రాష్ట్ర పోలీసు శాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయం వివిధ విభాగాల పోలీసు అధికారులు, సిబ్బంది ధరించాల్సిన క్యాప్(టోపీ), షోల్డర్(భుజం), బెల్టులకు సంబంధించిన కొత్త బ్యాడ్జీలను రూపొందించింది. గురువారం రాత్రి పొద్దుపోయాక ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విభాగం, హోదాను బట్టి అధికారులను గుర్తించేలా ఈ బ్యాడ్జీలను రూపొందించారు. బ్యాడ్జీలన్నింటిపై ఇత్తడి పూత పూశారు. క్యాప్, బెల్టు బ్యాడ్జీలు ఆకృతిలో దాదాపు ఒకేలా ఉన్నాయి. టోపీకి బిగించుకునే విధంగా బ్యాడ్జీ వెనక భాగంలో పిన్ను ఉండడమే క్యాప్ బ్యాడ్జీ ప్రత్యేకత. క్యాప్, బెల్టు బ్యాడ్జీల పైభాగంలో జాతీయ చిహ్నంతో పాటు మధ్యలో టీఎస్పీఎస్(తెలంగాణ స్టేట్ పోలీసు సర్వీసు) అనే ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు. షోల్డర్ బ్యాడ్జీలను కూడా ఇత్తడిపూతతో తయారు చేశారు.అన్ని విభాగాలకు చెందిన డిఐజీ(నాన్ కేడర్), ఎస్పీ(నాన్ కేడర్), ఏఎస్పీ, డీఎస్పీలు ధరించాల్సిన బ్యాడ్జీలు ఏ) క్యాప్బ్యాడీ/ బెల్టుబ్యాడ్జి: టీఎస్పీఎస్ అనే చిన్న(స్మాల్) ఆంగ్ల అక్షరాలుంటాయి. బి)షోల్డర్ బ్యాడ్జీ: బ్యాడ్జీపై ‘టీ.ఎస్.పీ.ఎస్’ అనే పెద్ద(క్యాపిటల్) ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు. అన్ని విభాగాలకు చెందిన ఇన్స్పెక్టర్/ రిజర్వ్ ఇన్స్పెక్టర్, సబ్- ఇన్స్పెక్టర్/ రిజర్వు సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ -ఇన్సెక్టర్/ రిజర్వ్ అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్ల బ్యాడ్జీలు: ఏ) క్యాప్/ బెల్టు బ్యాడ్జీ: బ్యాడ్జీ మధ్యలో టీఎస్పీ (తెలంగాణ స్టేట్ పోలీస్) అనే పెద్ద ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు. బి)షోల్డర్ బ్యాడ్జీ: టీఎస్పీ అనే క్యాపిటల్ ఆంగ్ల అక్షరాలతో బ్యాడ్జీని రూపొందించారు. పైన పేర్కొన్న రిజర్వ్ విభాగం అధికారుల కోసం ప్రత్యేక షోల్డర్ బ్యాడ్జీని తయారు చేశారు. ‘రిజర్వ్’ షోల్డర్ బ్యాడ్జీ: టీఎస్ఎస్పీఎస్(తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు సర్వీసు) అనే ఆంగ్ల అక్షరాలతో బ్యాడ్జీని రూపొందించారు. ఇందులో పోలీసు కానిస్టేబుల్ నుంచిఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు వీటిని ధరించనున్నారు.అన్ని విభాగాలకు చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి అధికారులు: క్యాప్/బెల్టు బ్యాడ్జీ: బ్యాడ్జీల మధ్యలో టీఎస్పీ అనే క్యాపిటల్ ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు. హోంగార్డులు: హోంగార్డులకు ప్రత్యేకంగా క్యాప్, బెల్టు బ్యాడ్జీలుండవు. వీరి కోసం టీఎస్హెచ్జీ (తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్) అనే క్యాపిటల్ ఆంగ్ల అక్షరాలతో షోల్డర్ బ్యాడ్జీని రూపొందించారు. -
‘సర్వే’ నిష్పక్షపాతంగా నిర్వహించాలి
కామారెడ్డి రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న ఇంటింటి సర్వేను ప్రతి ఉద్యోగి నిష్పక్షపాతంగా వ్యవహరించి పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఆర్కే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ, కర్షక్ బీఈడీ కళాశాలల్లో ఎన్యూమరేటర్లకు ఒక రోజు శిక్షణ ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై సర్వే వివరాల నమోదు కోసం ప్రభుత్వం నిర్ధేశించిన పట్టికలోని ప్రతి అంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడానికి ఈ సర్వే ఎంతో ముఖ్యమైందన్నారు. అభివృద్ధి పథకాలు రూపొందించి అర్హులైన వారికి అందాలంటే డాటా బేస్‌లైన్ సమాచారం ఎంతో ము ఖ్యమన్నారు. అందుకే ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతుందన్నారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుందన్నారు. సర్వే అధికారులకు ప్రజలు పూర్తిగా సరైన వివరాలను అందించాలని సూచించారు. వంట గ దులను బట్టే కుటుంబాల సర్వే చేపట్టాల న్నారు. గల్ఫ్ వెళ్లిన వారి విషయాలు, ఇంట్లో లే ని వారి వివరాలు నమోదు చేయకూడదన్నారు. హాస్టళ్లో ఉన్న విద్యార్థులు, ఆస్పత్రుల్లో ఉన్న వారు ఆధారాలు చూపిస్తేనే వివరాలు నమోదు చేయాలన్నారు. సమగ్ర సర్వేలో ఎలాంటి త ప్పులు లేకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్వే సమయంలో ఇంటిపైనున్న స్టిక్కర్లను చూ సి ఈవీ నెంబర్ నమోదు చేసుకోవాలని సూ చించారు. ఒక్కో ఉద్యోగి సగటున 20 నుంచి 30 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళికలు రూ పొందించమన్నారు. జిల్లా వ్యాప్తంగా 27,500 మంది ఎన్యూమరేటర్లను నియమిం చినట్లు చెప్పారు. సర్వే అనంతరం ఎంతమంది ఏయే పథకాలకు అర్హులనే విషయాలతో స మగ్ర సర్వేను బట్టి ప్రణాళికలు తయారు చేయాడానికే ఈ సర్వే చేపడుతున్నట్లు వివరిం చారు. సమావేశంలో ఐకేపీ పీడీ వెంకటేశం, నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ రామేశ్వర్రావు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ పాల్గొన్నారు. -
అద్దె బస్సులో.. పల్లెకు చలో..
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు అనేక మంది బస్సులు, కార్లు, ఇతర వాహనాలను అద్దెకు తీసుకుని ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ మేరకు గోరేగావ్‌లో నివసించే కరీంనగర్ వాసి అయిన మైలారపు శంకర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము 16వ తేదీ రాత్రి లేదా 17వ తేదీ ఉదయం ఊరికి వెళ్లేందుకు ప్రైవేట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 50కిపైగా కుటుంబాలు పశ్చిమ గోరేగావ్‌లోని తీన్డోంగ్రీ ప్రాంతంలో స్థిరపడ్డాయని, తామంతా కలిసి ఒకేసారి ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్ కోసం యత్నిస్తే దొరకలేదని, అందుకే ఒక ఊరివారమంతా ఒకే బస్సులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన యశ్వంత్రావ్పేట్తోపాటు ఇతర గ్రామాలకు చెందిన వారు కూడా బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.. ఒక్కరు చాలు : కరీంనగర్ జేసీ సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వలసబిడ్డలందరూ ఊళ్లకు రావల్సిన అవసరంలేదని, ఒక్కరు ఉంటే చాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫ్రాజ్ అహ్మద్ తెలిపారు. సర్వేపై ముంబైతోపాటు మహారాష్ట్రలో నివసించే ప్రజల్లో నెలకొన్న అయోమయ పరిస్థితి గురించి ‘సాక్షి’ ఆయనకు ఫోన్లో వివరించింది. దీనిపై స్పందించిన ఆయన ముంబై, భివండీతోపాటు మహారాష్ట్రలో నివసించే జిల్లా ప్రజలందరూ స్వగ్రామాలకు రావల్సిన అవసరం లేదన్నారు. కుటుంబసభ్యుల అన్ని వివరాలు చెప్పగలిగే ఒక్కరు వస్తే చాలని, అయితే అక్కడి వివరాలను ఆధారాలతోపాటు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. -
‘ఆధార్’తో అన్నీ అవస్థలే !
బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డునే కీలకంగా భావించి, దీని ఆధారంగానే ఈనెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే చేపడుతుండడంతో ఇప్పటి వరకూ ఆధార్ కార్డును పొందని వారు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఆధార్ నమోదు కేంద్రాలను ప్రభుత్వం నిర్వహించకుండా ఎంపిక చేసిన మీ సేవ కేంద్రాలకు అప్పగించడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుత రోజుల్లో అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమైంది. చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరుకుల నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత పింఛన్లు, పీఎఫ్, బీమా సౌకర్యం, విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రాలకు ఇలా రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా ఏదైనా ప్రభుత్వ లావాదేవీలకు ఆధార్ కార్డు, అందులో పొందుపర్చే ఆధార్ నెంబర్ అత్యంత ప్రాముఖ్యమైంది. కుల, మత, ధనిక, పేద వర్గం భేదం లేకుండా అందరూ ఈ కార్డుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆధార్ కార్డు ప్రాధాన్యత పెరగడంతో ఈ కార్డును పొందేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో మీ సేవ ఆధార్ కేంద్రాల వద్ద జనం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కేంద్రానికి 3,4 మండలాలు జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లోనే ప్రస్తుతం ఆధార్ కార్డు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క కేంద్రం ద్వారా 3,4 మండలాల ప్రజలకు సేవలందిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డుల కోసం ప్రజలు తిప్పలు పడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలంలో మీసేవకు ఆధార్ నమోదు కేంద్రం ఇచ్చినప్పటికీ, దీని కోసం ప్రత్యేకంగా ఐరిష్ కెమెరాలు, వేలిముద్రల సేకరణ పరికరాలు, కంప్యూటర్లు అవసరముండడంతో పలువురు మీసేవ నిర్వాహకులు వీటిని తీసుకోవడం లేదు. దీంతో పక్క మండలాలకు ప్రజలు వెళ్ళాల్సి వస్తోంది. జనాభా ప్రాతిపదికన కేంద్రాలను ఏర్పాటు చేయకుండా, ఒకటీ రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల రద్దీ బాగా పెరిగిపోతోంది. సుమారు 40వేల జనాభా గల బాన్సువాడ పట్టణంలో కేవలం ఒకే మీ సేవ కేంద్రంలో ఆధార్ కార్డు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో రెండు కంప్యూటర్ల ద్వారా ప్రతి రోజు సుమారు 60 మంది వివరాలను నమోదు చేస్తున్నారు. దీనికి తోడు నిజాంసాగర్, పిట్లం, బీర్కూర్, బిచ్కుంద తదితర మండలాలకు చెందిన ప్రజలు సైతం వస్తున్నారు. ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందునే ప్రస్తుతం ఆధార్ కార్డు నమోదు కేంద్రానికి డిమాండ్ పెరిగింది. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్ : ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం రాత్రి ఆసిఫాబాద్‌లోని ఏపీటీడబ్ల్యూ(జి) బాలికల గురుకుల కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్నకు కళాశాల విద్యార్థులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆదివాసీల వెనుకబాటుకు గత పాలక ప్రభుత్వాలే కారణమన్నారు. గత ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాలరాసిందని, 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మన ఊరు-మన ప్రణాళిక చేపట్టిందని గుర్తు చేశారు. గిరిజన యూనివర్సిటీని జిల్లాలోని ఉట్నూర్‌లో నెలకొల్పుతామని, దీనిపై జిల్లా ప్రజలకు ఎలాంటి ఆందోళన వద్దని అన్నారు. దీనిని సంబంధించిన ఫైల్ ఢిల్లీకి పంపినట్లు పేర్కొన్నారు. ఆదివాసీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీలకు 6 నుంచి 12 శాతం రిజర్వేషన్ పెంచిందని, దీంతో ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ధీమా వ్యక్తం చేశారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదివాసీలకు అందేలా కృషి చేస్తానన్నారు. త్వరలో గోండు లిపిలో విద్య ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నార్నూర్ మండలం గుంజాలలో గోండు లిపిని ప్రారంభించామని, త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని 15 పాఠశాలల్లో గోండి లిపి విద్యా విధానాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి రామన్న, అధికారులు, ప్రజా ప్రతినిధులను పాఠశాల విద్యార్థినులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు, పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఆటల్లో రాణించిన విద్యార్థినులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ పురాణం రాజేశ్వర శర్మ, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్, జెడ్పీటీసీ కొయ్యల హేమాజీ, ఎంపీపీ బదావత్ తారాబాయి, సర్పంచ్ గోవిందు, గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, మడావి శ్రీనివాస్, సంకె కిష్టయ్య, సిడాం శంకర్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మంత్రికి వినతులు గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని మంత్రి రామన్నకు వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చెర్ల మురళి, గిరిజన నాయకుడు కిషన్‌రావు వినతిపత్రం ఇచ్చారు. -
19న ఇంటింటా వివరాల నమోదు
డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని కుటుంబాలకు చెందిన పూర్తి చరిత్రను అధికారులు నమోదు చేయనున్నారు. ఇలాంటి సర్వే ఇంతవరకు దేశంలోని ఏ రాష్ట్రంలో జరిగిన దాఖలాలు లేవని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రం మొత్తంలో ఒకే రో జు ఈనెల 19న సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు సర్వేకు సంబంధించి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఇతర జిల్లా స్థాయి అధికారులు మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల్లో న మూనా కుటుంబ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయి లో సరే ్వ నిర్వహించినప్పుడు ఎలాంటి సమస్యలు వ స్తాయి, వాటిని ఎలా అధిగమించాలనే విషయమై న మూనా సర్వే చేశారు. సర్వే జరిగే రోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే పలుమార్లు కోరారు. ఆ రోజు ప్ర భుత్వం సెలవు దినం గా ప్రకటించింది. ఇంట్లో లేని వారి పేర్లు నమోదు చేయబోరని, చివరకు శుభకార్యాలను సైతం వాయిదా వేసుకోవాలని సీఎం సూచించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ రోజు ఇంటికి తాళం వేసి ఉండకుండా చూసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. విభాగం ఏ : గుర్తింపు వివరములు 1. జిల్లా పేరు: 2. మండలం పేరు: 3.గ్రామ పంచాయతీ పేరు/ మున్సిపాలిటీ పేరు: 4. రెవెన్యూ గ్రామం పేరు: 5.ఆవాసం పేరు/డివిజన్ పేరు/వార్డు పేరు: 6. నివశిస్తున్న ప్రదేశం/వాడ/కాలనీపేరు: 7. ఇంటి నెంబరు: 8. ఈ ఇంట్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య: విభాగం బి: కుటుంబ వివరములు: 1. కుటుంబ యజమాని పేరు: ఇంటి పేరు.. పూర్తి పేరు 2. తండ్రి/భర్త పేరు: 3. కుటుంబ సభ్యుల సంఖ్య: 4.మతం: హిందూ.. ముస్లిం.. క్రైస్తవ .. సిక్కు.. జైన.. బౌద్ధ.. ఇతరులు 5. సామాజిక వర్గం/కులం పేరు: ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. ఓసీ.. 6. గ్యాస్(ఎల్పీజీ )కనెక్షన్ ఉందా?: ఉంది.. లేదు.. 7. వినియోగదారుని సంఖ్య: 8. మొబైల్ ఫోన్ నెం.(ఆప్షనల్) 9. ఆదాయం పన్ను చెల్లించే కుటుంబమా?: అవును.. కాదు అనాథల వివరాలు (ఉన్నట్లయితే) 10. అనాథలు ఎక్కడ నివశిస్తున్నారు (సొంత ఇంట్లో.. బంధువుల ఇంట్లో.. బహిరంగ ప్రదేశాల్లో.. పాడుబడ్డ ఇంట్లో.. అనాథాశ్రమంలో) 11. అనాథాశ్రమంలో ఉంటే ఆశ్రమం పేరు: 12. ఆశ్రమం ఉన్న గ్రామం: 13. ఆశ్రమం ఉన్న మండలం: 14. అనాథ స్థితి (తల్లిదండ్రులు చనిపోయారు.. తల్లి/తండ్రి వదిలేశారు.. కొడుకులు/కూతుళ్లు వదిలేశారు) విభాగం సి: 1.క్రమ సంఖ్య 2. వ్యక్తిపేరు(కుటుంబ యజమానితో మొదలుకొని): 3. కుటుంబ యజమానికి సంబంధం: 4. లింగం(ఆడ.. మగ.. ఇతరులు): 5. పుట్టిన తేదీ.. తెలియనట్లయితే వయసు: 6. వైవాహిక స్థితి 7. పూర్తయిన విద్యార్హత 8. బ్యాంకు/పోస్టాఫీసు అకౌంటు ఉన్నదా ?.. లేదా? 9. పోస్టాఫీసు అకౌంట్ ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ శాఖ పేరు: 10. ’’ ’’ అకౌంట్ నెంబరు: 11.బ్యాంకు అకౌంట్ ఉన్నట్లయితే బ్యాంకు పేరు: 12. ’’ ’’ బ్యాంకు బ్రాంచి పేరు: 13. ‘‘ ’’ బ్యాంకు అకౌంట్ నెంబరు: 14. ఉద్యోగం: ఉన్నది.. లేదు 15. ఉద్యోగం ఉన్నట్లయితే ఉద్యోగం రకం: 16. ప్రభుత్వ పెన్షన్‌దారు అయితే (1.కేంద్ర ప్రభుత్వ పెన్షన్ 2. రాష్ట్రప్రభుత్వ పెన్షన్ 3. ప్రభుత్వరంగ సంస్థల పెన్షన్ 17. ప్రధానమైన వృత్తి: 18. సామాజిక పింఛన్‌దారులైతే పింఛన్ రకం 19. ఎస్‌హెచ్‌జీ సంఘ సభ్యత్వం:1 ఉన్నది 2. లేదు 20. ఆధార్ కార్డు(యుఐడి) నెంబర్: విభాగం డి: వికలాంగుల వివరాలు 1.క్రమ సంఖ్య 2. వికలాంగుల పేరు: 3. ఎలాంటి వైకల్యం: 4. సదరం సర్టిఫికెట్ ఉందా: 1 ఉన్నది 2.లేదు 5. సదరం సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఐడీ నెంబరు 6. వైకల్యశాతం సర్టిఫికెట్ విభాగం ఇ: దీర్ఘకాలిక వ్యాధులు 1. క్రమ సంఖ్య 2. దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి పేరు: 3. వ్యాధి రకం విభాగం ఎఫ్: ఇంటి వివరములు 1. నివాస స్థితి: సొంతం.. కిరాయి.. తాత్కాలిక గూడు(ప్లాస్టిక్ కప్పు మొదలైనవి) 2. ఇంటి కప్పు రకం(1.గుడిసె 2. పెంకులు /రేకులు/బండలు 3. కాంక్రీట్ శ్లాబ్ 3. గదుల సంఖ్య (వంట గది కాకుండా) 4. కిరాయి.. తాత్కాలిక గూడుల్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందా? 5. కిరాయి.. తాత్కాలిక గూడుల్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంటి స్థలం ఉందా (1.అవును 2.కాదు) 6. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ బలహీనవర్గాల గృహ నిర్మాణ కార్యక్రమంలో లబ్ధి పొందారా?(1.అవును 2.కాదు) 7. 8.9.10.11.12 క్రమసంఖ్యల్లో మరుగుదొడ్డి, విద్యుత్, మీటర్ ఉందా? తదితర వివరాలు భర్తీ చేయాలి. విభాగం జి .. హెచ్‌లలో వ్యవసాయం.. పశు సంపదలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విభాగం ఐ : కుటుంబ సొంత చరాస్తుల వివరములు: చరాస్తి రకం: 1. మోటార్ సైకిల్/స్కూటర్ 2. మూడుచక్రాల మోటార్ వాహనం/ఆటో 3. కారు/జీపు/జేసీబీ/నాలుగు చక్రాల మోటార్ వాహనం, ఇతర భారీ వాహనాలు 4. ట్రాక్టర్/ దున్నే యంత్రం/కోత కోసే యంత్రం/ ఇతర వ్యవసాయ యంత్రాలు 5. ఎయిర్ కండిషనర్ (పైవి ఉన్నది.. లేదు వివరాలు రాయాలి. ఉన్నట్లయితే వాహన రిజిస్ట్రేషన్ నెంబర్. ఒకే రకమైన వాహనాలు రెండు ఉన్నట్లయితే ఒకదాని రిజిస్ట్రేషన్ నెంబరు రాస్తే చాలు. తాత్కాలిక సంచార కుటుంబాలు/జాతుల వారికి సంబంధించిన వివరాలు: శాశ్వత నివాసం.. ఎంతకాలంగా ఉంటున్నారు తదితర వివరాలు: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారి వివరాలు: ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.. మాట్లాడే భాష.. వచ్చిన సంవత్సరం క్రమ సంఖ్యలో భర్తీ చేయాల్సిన వాటికి సంబంధించిన కోడ్ నెంబర్లు విడిగా ఇచ్చారు. వాటిని చూసి భర్తీ చేస్తారు. ధ్రువీకరణ.. పైన తెలిపినసమాచారం వాస్తవమని..యదార్థమని నేను ధ్రువీకరిస్తున్నాను. పై సమాచారం తప్పుగా తేలినచో ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిని రద్దుపరచి ప్రభుత్వ పథకాలకు అనర్హుడు/అనర్హురాలిగా ప్రకటించగలరు. ఇట్టి విషయం దైవ సాక్షిగా/ఆత్మసాక్షిగా ధ్రువీకరిస్తున్నాను. కుటుంబ యజమాని/సభ్యుల యొక్క సంతకం లేదా ఎడమచేతి బొటనవేలి ముద్ర. ఎన్యూమరేటర్ సంతకం.. వివరాలు పర్యవే క్షక అధికారి సంతకం.. వివరాలు అవసరమైన సందర్భాల్లో కుటుంబ యజమాని/ సభ్యుల సంతకం తీసుకునేముందు ధ్రవీకరణ చదివి వినిపించాలి -
సర్వే సందడి 19న ఊరికి పోవాలె!
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై అటు స్వరాష్ట్రంలోనే కాకుండా ఇటు ముంబైలోనూ సందడి మొదలైంది. సర్వేరోజున కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ముంబైలోని తెలంగాణ ప్రజలకు స్వగ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. 19వ తేదీ రోజున ఇంట్లో ఉండేలా బయలుదేరి రావాలని సదరు ఫోన్ల సారాంశం. నాలుగు రాళ్ల కోసం పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చిన తెలంగాణ ప్రజలు ముంబై, ఠాణే, పుణే నగరాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఇప్పుడు తెలంగాణకు పయనమయ్యే యోచనలో ఉన్నారు. అయితే సర్వే అధికారులకు వివరాలు చెప్పేందుకు కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా? లేక సభ్యులంతా ఆరోజు ఇంట్లో ఉండాల్సిందేనా? ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చినవారి పరిస్థితి ఏంటి? ఏవైనా కారణాలవల్ల ఆ రోజు సొంత ఊరికి వెళ్లలేకపోతే కుటుంబంలో వారి పేరు గల్లంతవుతుందా? ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి సెలవు దొరకకపోతే ఎలా వెళ్లేది? ఇలా సవాలక్ష సమస్యలు ప్రవాస తెలంగాణ ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నాయి. న్యూస్ చానళ్లు, దినపత్రికల్లో వస్తున్న కథనాలను చదివి మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నఫలంగా స్వగ్రామాలకు బయలుదేరాలంటే వేల రూపాయల ఖర్చు ఓ వైపు, మరోవైపు వెళ్లలేని పరిస్థితి తెలంగాణ ప్రజలకు సంకటంగా మారింది. సర్వే గురించి స్థానిక తెలంగాణ ప్రజలు ‘సాక్షి’ కార్యాలయానికి, ప్రతినిధులకు ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఊరిబాట పట్టిన జనం... ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారన్న ప్రకటనతో అనేక మంది ఊరిబాట పట్టారు. దీంతో తెలంగాణవైపు వెళ్లే బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రైళ్లతోపాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ తేదీల మధ్య టికెట్లు కావాలన్నా దొరకడంలేదు. దీంతో అనేక మంది ఇప్పటి నుంచే ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. పరిణామంగా రైళ్లు, బస్సులలో పెద్దసంఖ్యలో తెలంగాణ ప్రజలు కనిపిస్తున్నారు. ఆధార్ తర్వాత మళ్లీ ఇప్పుడు....! ఆధార్ కార్డుల కోసం స్వగ్రామాల బాటపట్టిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే కారణంగా సొంత ఊరికి వెళ్తున్నారని భారత్ ట్రావెల్స్ యజమాని కె. జనార్ధన్, కుమార్ ట్రావెల్స్ యజమాని గుర్రపు నర్సింహస్వామి, ఆరెంజె ట్రావెల్స్ యజమాని మర్రి జనార్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. సర్వే ప్రకటన తర్వాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దీంతో 15వ తేదీ నుంచి దాదాపు తెలంగాణకు వెళ్లే బస్సులన్నీ ఫుల్ అయ్యాయని చెప్పారు. చాలా మంది టిక్కెట్లు కావాలంటు ఫోన్లు చేస్తున్నారని, గతంలో ఆధార్‌కార్డు సమయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. వలస బిడ్డలను మరిచారా...? ఎన్నికలకు ముందు వలస బిడ్డలకు న్యాయం చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్, నేడు ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం వలసబిడ్డలను మరిచిపోయిందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఇక్కడి వలస బిడ్డలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన పోరాటాం గుర్తు లేదా? అని నిలదీస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ముంబైతోపాటు రాష్ట్రంలో నివసించే వలస బిడ్డలను తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పరాయి రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణ వలస బిడ్డల కోసం కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, ఉన్నఫలంగా బయల్దేరి రావడం కష్టమనే ఆవేధన ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలే అత్యధికం.... ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది తెలుగు ప్రజలున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడే స్థిరపడిన వారున్నారు. దీంతో ఇలా స్థిరపడినవారిలో సమగ్ర కుటుంబ సర్వే విషయంపై పెద్దగా ఎలాంటి కనిపించడంలేదు. అయితే స్వగ్రామాలతో సంబందాలు కలిగి, ఉద్యోగరీత్యా ఇక్కడ ఉంటున్నవారు, తాత్కాలికం గా కూలి, ఇతర పనులపై కొన్ని మాసాలపాటు వచ్చిపోయే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వలస కూలీల సంఖ్య లక్షల్లో ఉంటుందని, ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది కూలీ పనులకోసం వచ్చి, మళ్లీ స్వగ్రామాలకు వెళ్తుంటారు. -
‘కోట’లో కవాతు
-
కామన్వెల్త్ విజేతలకు కాసుల పంట
కశ్యప్‌కు రూ. 50 లక్షలు కోచ్‌లకు కూడా నగదు ప్రోత్సాహకం తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్‌లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాన్ని బహుమతిగా ప్రకటించింది. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలుచుకున్న పారుపల్లి కశ్యప్‌కు రూ. 50 లక్షలు ప్రభుత్వం అందజేయనుంది. డబుల్స్‌లో రజతం సాధించిన గుత్తా జ్వాలకు రూ. 25 లక్షలు నగదు పురస్కారం దక్కనుంది. కాంస్యాలు సాధించిన ఆటగాళ్లకు రూ. 15 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. కామన్వెల్త్లో రాష్ట్రానికి చెందిన గురుసాయిదత్, పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాలు సాధించగా... షూటర్ గగన్ నారంగ్ ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకున్నాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌లను కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాతో గుర్తించింది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జ్వాల వ్యక్తిగత కోచ్ ఎస్ఎం ఆరిఫ్‌లకు కూడా చెరో రూ. 50 లక్షలు ప్రభుత్వం ప్రకటించింది. గ్లాస్గో క్రీడల్లో పాల్గొన్న జిమ్నాస్ట్ అరుణకు కూడా రూ. 3 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. మరో వైపు ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అనంతరం ప్రకటించిన మొత్తం ఇప్పటికీ అందుకోని సైనా నెహ్వాల్‌కు కూడా త్వరలో దానిని ఇస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ క్రీడాకారులను సన్మానించడంతో పాటు ప్రకటించిన నగదు మొత్తాలను అందజేస్తారు. స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తాం: సీఎం కామన్వెల్త్లో విజేతలుగా నిలిచిన ఆటగాళ్లు బుధవారం సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)ను కలిశారు. వీరితో పాటు కామన్వెల్త్లో పాల్గొనని సైనా నెహ్వాల్ కూడా సీఎంను కలిసింది. దాదాపు గంట పాటు ఆయన ఆటగాళ్లతో సుదీర్ఘంగా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో ప్రత్యేకంగా స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు. కనీసం ప్రతీ రెండు నెలలకు ఒక జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ నిర్వహించగలిగి... ఏదో ఒక రోజు ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చే స్థాయిలో ఈ స్పోర్ట్స్ సిటీ ఉంటుందని సీఎం అన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలతో రావాలని ఈ సందర్భంగా ఆయన క్రీడా కార్యదర్శికి సూచించారు. ఈ సందర్భంగా కొత్త క్రీడా విధానం రూపొందించడానికి సంబంధించి ఈ ఆటగాళ్లు కొన్ని సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న స్టేడియాల్లో అకాడమీలను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిభ గల ఆటగాళ్లకు ఇవ్వాలనే సూచనను కూడా సీఎం పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఇంటింటి సర్వే కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఈ ఆటగాళ్లను కేసీఆర్ కోరారు. రాష్ట్ర క్రీడాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న క్రీడాకారులు.... ఈ అంశంపై ఆయన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటీ, పంచాయతిరాజ్ శాఖ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కె. తారక రామారావు (కేటీఆర్) కూడా ఇందులో పాల్గొన్నారు. -
ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ!
మున్సిపాల్టీలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ సిద్దిపేట జోన్: జిల్లాలోని మున్సిపాల్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొండి బకాయిల వసూళ్లు తలకు మించిన భారంగా పరిగణించే మున్సిపల్ యంత్రాంగానికి సర్కార్ కల్పించిన అవకాశం సత్ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు. గత ప్రభుత్వాలు ప్రతి యేటా మార్చి నెలాఖరులో కేవలం పది హేను రోజుల గడువును వడ్డీ మాఫీ కోసం విధిస్తూ బకాయిదారులకు కొంత మేర వెసులు బాటు కల్పించేవి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల చివరి వారంలో మాసం రోజుల పాటు ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని ఏడు మున్సిపాల్టీలో సుమారు రూ. 3 కోట్ల వడ్డీ మాఫీ కానుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా పేరొందిన సిద్దిపేటలో సుమారు 50 లక్షలు మాఫీ కానున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, సదాశివపేట పురపాలక సంఘాలతో పాటు గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జోగిపేట నగర పంచాయతీలు ఉన్నాయి. ప్రతి యేటా మున్సిపల్ పరిధిలో అర్థవార్షిక, నగర పంచాయతీల్లో వార్షిక ఆస్తి పన్ను డిమాండ్‌ను అధికారులు అమలు చేస్తుంటారు. అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలో, రెండు నగర పంచాయతీల్లో సుమారు పది కోట్ల వరకు ప్రతి యేటా ఆస్తి పన్ను రూపంలో వసూలవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలోనే 19, 310 నివాస, నివాసేతర గృహాల నుంచి ప్రతి అర్థవార్షికంలో రూ. 2.67 కోట్ల ఆస్తి పన్ను వసూలు నిర్దేశిత లక్ష్యంగా ప్రణాళికను రూపొందించారు. గత ఐదేండ్లుగా సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను బకాయిలు మున్సిపల్‌కు గుదిబండగా మారాయి. ఈ క్రమంలో మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రభుత్వం వడ్డీ మాఫీ పేరిట వినూత్న ప్రక్రియకు తెరలేపింది. అందులో భాగంగానే గత మూడేళ్ల క్రితం మార్చి నెలలో బకాయి దారుల డిమాండ్‌పై ఉన్న ఆస్తి పన్ను బకాయిలను నిర్ణీత సమయంలో చెల్లిస్తే వాటిపై ఉన్న వడ్డీని పూర్తి స్థాయిలో మాఫీ చేయనున్నట్లు జీఓ వెలువరిచింది. దీంతో అప్పట్లో అనూహ్య స్పందన వచ్చింది. మరోవైపు ప్రతి యేటా మున్సిపల్ పరిధిలోని మొండి బకాయిలపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ల పేరిట విస్తృతంగా క్యాంప్‌లను నిర్వహించి మొండి బకాయిల గుట్టను సాధ్యమైనంత వరకు తగ్గించిందనే చెప్పాలి. అయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దుకాణ సముదాయాలు, నివాస గృహాలకు సంబంధించి మొండి బకాయిలు పెరిగిపోతునే ఉన్నాయి. ప్రతి యేటా సిబ్బందికి బకాయిల వసూళ్లు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం పేరుకు పోయిన బకాయిలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. -
ఈ- కనుసన్నల్లో... ‘నెట్టింట్లో’ గ్రామం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘మీ గ్రామానికి ఎంత ఆదాయం వస్తోంది? కేంద్రప్రభుత్వం ఎన్ని నిధులిస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు పంపుతోంది? వీటిలో ఎన్ని రూపాయలు ఖర్చయ్యాయి? వేసిన రోడ్లెన్ని? కల్పించిన మౌలిక సౌకర్యాలేంటి? ఊర్లో ఎంతమంది పుట్టారు? ఎంతమంది చనిపోయారు? తదితర వివరాలన్నీ ఇక నుంచి కంప్యూటర్లలో నిక్షిప్తం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ-పంచాయతీ కార్యక్రమానికి జిల్లాలోని 17 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలను తొలిదశలో ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మలిదశలో, తదుపరి దశల్లో జిల్లాలో కంప్యూటర్లున్న 365 పంచాయతీలను ఈ -పంచాయతీలుగా చేయాలని యోచిస్తున్నారు. ఏదైనా కంప్యూటర్ ద్వారానే.. ఈ-పంచాయతీ ప్రాజెక్టు ద్వారా క్షేత్రస్థాయి సమాచారాన్నంతటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. ఒక గ్రామంలో పన్ను వసూలు ద్వారా ఎంత ఆదాయం వస్తోంది? ఆ గ్రామానికి వివిధ పన్నుల ద్వారా స్థానికంగా వస్తున్న ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు అవుతోంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం గ్రామానికి ఎంత కేటాయిస్తున్నారు? అందులో ఎంత ఖర్చు అవుతోంది? ఈ ఖర్చు ద్వారా గ్రామానికి కలుగుతున్న ప్రయోజనమేంటి? మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గ్రామంలో వేసిన రోడ్లెన్ని? కట్టిన డ్రైనేజిలెన్ని? ఎన్ని నల్లాలు, బోర్లు, చేతిపంపులు ఏర్పాటు చేశారు?లాంటి వివరాలన్నీ ఆన్లైన్ చేస్తారు. వీటితో పాటు గ్రామంలో జనన, మరణాలను కూడా ఆన్లైన్లోనే రికార్డు చేయనున్నారు. గ్రామంలో ఎవరైనా పుట్టినా, చనిపోయినా.. వివరాలన్నీ కంప్యూటర్లోకి ఎక్కించనున్నారు. జనన, మరణాల నమోదుకు సంబంధించిన బాధ్యతను పంచాయతీ కార్యదర్శికి అప్పగించి, జనన, మరణాలు సంభవించిన వారం రోజుల్లో కంప్యూటర్లో నమోదు చేయిస్తామని అధికారులు చెపుతున్నారు. జిల్లాలో ఈ-పంచాయతీలుగా ఎంపికైన పంచాయతీలివే.. జిల్లాలో ఈ పంచాయతీలుగా ఎంపికైన పంచాయతీల్లో నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, వైరా, అశ్వారావుపేట, పెదతండా, సారపాక, బూర్గంపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, బయ్యారం, గార్ల, భద్రాచలం, కూనవరం, చర్ల, మోతుగూడెం (మోతుగూడెం ముంపు గ్రామం కింద ఆంధ్రలో కలవనుంది) ఉన్నాయి. -
‘బోగస్’ ఏరివేత వేగవంతం
- వారం రోజుల్లో పదివేల కార్డులు స్వాధీనం - డీలర్లదే ముఖ్య పాత్రగా గుర్తించిన సివిల్ సప్లయ్ అధికారులు - అక్రమ డీలర్ల వివరాలు రహస్యంగా ఉంచిన అధికారులు ప్రగతినగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులపై ఉక్కుపాదం మోపింది. బోగస్ కార్డుల ఏరివేతను వేగవంతం చేసిం ది. అర్హత లేకున్నా తెల్ల రేషన్ కార్డులను పొంది ప్రభుత్వ సొమ్మును అప్పనంగా పొం దుతున్న వారి భరతం పట్టడానికి చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో బోగస్ కార్డులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిం ది.ఈ దిశగా బోగస్ కార్డులు కలిగి ఉన్న కొంత మంది రేషన్ డీలర్ల వివరాలు సివిల్ సప్లయ్ ఎండీకి అధికారులు పంపించారు.వారి వివరాలను రహస్యంగా దాచిపెట్టారు. బోగస్ కార్డుల కోసం అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సరెండర్ బాక్సులను ఏర్పాటుచేశారు. అప్రమత్తమైన డీలర్లు బోగస్ రేషన్ కార్డుల విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించడంతో బోగస్ కార్డులు కలిగి ఉన్న డీలర్లు ముందుగా అప్రమత్తమయ్యారు. దళారులను తహశీల్దార్ కార్యాలయాలకు పంపించి వారి దగ్గర ఉన్న కార్డులను సరెండర్ బాక్స్ లో వేసి జారుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 7,06,451 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 43,726,అన్నపూర్ణ కార్డులు 1106,ఆర్ఏపీ కార్డులు 90,390 రచ్చబండ మూడో విడతలో అం దించిన 63,458 కార్డులు, తెల్లరేషన్ కార్డులు 5,54 ,301, గులాబీ కార్డులు 40 వేల వరకు ఉన్నాయి. ప్రభుత్వం కూడా బోగస్ కార్డుల ఏరివేతలో డీలర్లను భాగస్వామ్యం చేద్దామని భావిస్తోంది. డీలరైతేనే షాపు పరిధిలో ఉన్న బోగస్ లబ్ధిదారులను గుర్తిస్తాడని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మొత్తం ఆయనకే అవగాహన ఉంటుందని భావిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా డీలర్‌పై ఒత్తిడి తీసుకువస్తే బోగస్ కార్డులను సులువుగా ఏరివేయచ్చనే ఆలోచన కూడా ఉంది. నిజామాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 8 వేల కార్డులు,కామారెడ్డి డివిజన్ పరిధిలో 1200, బోధన్ డివిజన్ పరిధిలో 880 బోగస్ కార్డులు స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సరెండర్ బాక్సులో వేశారు. నేటి నుంచి జిల్లాలోటాగింగ్ సిస్టమ్ అమలు బోగస్‌కార్డులు కలిగి ఉన్నవారిని గుర్తించడానికి ప్రభుత్వం టాగింగ్ సిస్టిమ్ ఉపయోగించనుంది. జిల్లాలో సోమవారం నుంచి దీనిని ప్రారంభించనున్నా రు. ఈ టెక్నాలజీ ప్రస్తుతం తమిళనాడులో అం దుబాటులో ఉండగా, తెలంగాణ ప్రభుత్వం దీనిని ఇక్కడ కూడా అమలుచేయనుంది. ఈ టాగింగ్ సిస్టమ్ ద్వారా బోగస్ కార్డులే కాదు బినామీ షాపులు, డీలర్ల ఆటకట్టించనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ముందుగా బోగస్ డీలర్ల భరతం పట్టనున్నారు. -
ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే టీ ఇంక్రిమెంట్
* ఇంకా తేలని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు * వేచి చూస్తున్న తెలంగాణ సర్కారు * ఉద్యోగుల సంఖ్య తేలకపోవడంతో ఇంక్రిమెంట్‌పై అస్పష్టత * ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోయాకే దృష్టి సారించాలని యోచన * రూ. 200 కోట్ల భారం పడవచ్చని ఆర్థిక శాఖ అంచనా * మౌనంగా ఉండిపోయిన ఉద్యోగ సంఘాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్‌కు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. ఉద్యోగుల విభజన పూర్తయితే తప్ప దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కన్పించడం లేదు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో, ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. ఇంక్రిమెంట్లను ప్రకటించడం వల్ల ఆంధ్రాలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందన్న భావన ప్రభుత్వంలో ఉంది. అంతేకాక ఇక్కడ పనిచేస్తున్న అక్కడి వారికి ఇంక్రిమెంటు ఇవ్వడం ఎందుకన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వం ఇంక్రిమెంట్ ప్రకటనను జాప్యం చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల విభజనకు సంబంధించి నియమించిన కమలనాథన్ కమిటీ ఇప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో.. ఇది ఇంకెంత కాలం సాగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర కేడర్‌లోని ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమలనాథన్ కమిటీ కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. గతవారంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన కమలనాథన్ ఒక నివేదిక రూపొందించారు. ఆ నివేదికపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఇంకా సంతకం చేయలేదు. ఆ నివేదికలోని పలు అంశాలపై ఆయన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ మార్గదర్శకాల ఖరారు ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. అదీకాక సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడంతో.. తెలంగాణకు ఆప్షన్ ఇవ్వాలనుకున్న ఉద్యోగులు సైతం తిరిగి ఆంధ్రకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇక్కడకు రావడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఉద్యోగుల విభజనపై పూర్తి స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే తెలంగాణ ఇంక్రిమెంట్‌తో దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగుల విభజన కసరత్తు పూర్తయితే తప్ప.. పూర్తి భారం కచ్చితంగా తెలియదని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఇంక్రిమెంట్ కోసం గట్టిగా పట్టుపట్టలేని పరిస్థితి ఉంది. తమ సహచరులు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు డిమాండ్ చేస్తే.. ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు కూడా మౌనంగా ఉంటున్నాయి. -
గ్రేటర్ ‘ప్రత్యేకం’
‘అదనం’గా ముగ్గురు ఐఏఎస్‌లు జీహెచ్ఎంసీలో నియామకం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు కొత్తగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు వస్తున్నారు. ఎ.బాబు, పీఎస్ ప్రద్యుమ్న, డాక్టర్ ఎన్.సత్యనారాయణలను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో స్పెషల్ కమిషనర్‌గా ఉన్న రాహుల్ బొజ్జాను గిరిజన సంక్షేమ శాఖ డెరైక్టర్‌గా బదిలీ చేసింది. 625 చ.కి.మీ.ల విస్తీర్ణంతో ఉన్న జీహెచ్ఎంసీలో ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటు న్నాయి. ముఖ్యంగా చెత్త తరలింపు, వ్యర్థాల నిర్వహణ, రహదారులు, వరద నీటి కాలువల పనులు నిత్య సమస్యలుగా మారాయి. జీహెచ్ఎంసీలో ఐదు జోన్లు ఉన్నప్పటికీ అన్ని పనులనూ ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న ఐఏఎస్‌లకు జోన్లకు సంబంధించిన పూర్తి బాధ్యతలు, లేదా ఆరోగ్యం-పారిశుద్ధ్యం, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ప్లానింగ్ వంటి విభాగాలు అప్పగిస్తే పరిస్థితులు మెరుగవుతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం- పారిశుద్ధ్య విభాగానికి ఐఏఎస్ అవసరం ఎంతో ఉంది. రహదారులు, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్, భూసేకరణ తదితర అంశాలు ప్లానింగ్ పరిధిలో ఉంటాయి. ఎంతో కాలంగా మందకొడిగా సాగుతున్న వరద నీటి కాలువలు, ఫ్లైఓవర్ల పనులకు అవసరమైన భూసేకరణ తదితరమైనవి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ ఉంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐదు జోన్లలో ప్రస్తుతం సెంట్రల్, నార్త్జోన్లలో ఐఏఎస్‌లు ఉన్నారు. మిగతా మూడు జోన్లకు కొత్తగా వచ్చే ముగ్గురు ఐఏఎస్‌లను నియమిస్తారా? లేక ఆరోగ్యం- పారిశుద్ధ్యం వంటి పెద్ద విభాగాల బాధ్యతలు అప్పగిస్తారా? అనేది కమిషనర్ సోమేశ్ కుమార్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. మొత్తమ్మీద ఐఏఎస్‌ల రాకతో జీహెచ్ఎంసీ పరిస్థితులు మెరుగు పడతాయని పలువురు భావిస్తున్నారు.