►గతంలో నెలకు రూ. 5 లక్షలు
►ఈ ఏప్రిల్ మాసంలోనే రూ. 1.50 కోట్లు
► ఏపీ వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌తో
►భారీగా పెరిగిన ఆదాయం
కోదాడ అర్బన్ : కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం సమీపాన ఉన్న సరిహద్దు ఆర్టీఏ చెక్‌పోస్టుకు ఒక నెలలోనే రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి ఏపీ రాష్ట్ర వాహనాల నుంచి పన్నులు వసూలు ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వాహనాలే కాకుండా ఇతర రాష్ట్రాల వాహనాలను కూడా కలుపుకొని ఒక్క నెలలోనే మొత్తం రూ. 1.5కోట్ల ఆదాయం రావడం గమనార్హం. గతంలో నెలకు రూ. 5లక్షలు ఉన్న ఈ చెక్‌పోస్టు ఆదాయం ఏపీ వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌తో 30 రెట్లు పెరిగింది.
ట్యాక్ వసూళ్లలో ప్రైవేట్ వ్యక్తులు
కాగా ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ట్యాక్స్ వసూళ్లలో ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు సిబ్బంది మామూళ్ల వసూలుకు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని పనికానిస్తున్నట్లు సమాచారం. సమీప గ్రామాలకు వెళ్లే వాహనాలనుంచి ట్యాక్స్ కాకుండా మామూళ్లు తీసుకొని వదులుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై చెక్‌పోస్టు ఎంవీఐ షౌకత్‌అలీని వివ రణ కోరగా.. తమ వద్ద ప్రైవేట్ వ్యక్తులెవరూ విధులు నిర్వర్తించడం లేదని తెలిపారు. ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ చెక్‌పోస్టులకు మొత్తం ఎనిమిది సిబ్బంది ఉన్నారని, రోజుకు నలుగురు చొప్పున చెక్‌పోస్టులో విధులు నిర్వరిస్తున్నట్లు తెలిపారు.
సరిహద్దు చెక్‌పోస్టు ఆదాయం 30 రెట్లు పెరిగింది
Published Wed, May 6 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement