
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఆ మధ్య కాస్త సైలెంట్ అయిపోయారనుకునేలోపే మరోసారి వీరి కుటుంబంలో చిచ్చు రాజుకుంది. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ మోహన్‌బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు మనోజ్ (Manchu Manoj). కూతురి బర్త్‌డే కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని ఆరోపించారు. అటువైపు మనోజ్, మోహన్‌బాబు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించనేలేదు.
కూతురితో ర్యాంప్ వాక్
ఇలా కుటుంబ గొడవలతో మంచు ఫ్యామిలీలో ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. మోహన్‌బాబు కూతురు లక్ష్మీ (Manchu Lakshmi Prasanna).. ఈ వివాదాలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు. తాజాగా ఆమె 'టీచ్ ఫర్ ఛేంజ్' వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కూతురితో కలిసి ర్యాంప్ వాక్ కూడా చేసింది.
మనసారా ఏడ్చేసిన మంచు లక్ష్మి
ఆమె స్టేజీపై నిలబడిన సమయంలో మనోజ్ దంపతులు వెనక నుంచి వచ్చి సర్‌ప్రైజ్ చేశారు. తమ్ముడిని చూసి లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు. స్టేజీపై ఉన్న సంగతి కూడా మర్చిపోయి అతడిని పట్టుకుని మనసారా ఏడ్చేసింది. దీంతో మనోజ్-మౌనిక దంపతులు ఆమెను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధం ఎంత గొప్పదో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్.. అమ్మ ఒప్పుకోవట్లే