Lakshmi Manchu
-
ఆ హీరోయిన్ను చూశాక నా ఆలోచన మార్చుకున్నా: లక్ష్మీ మంచు
జిమ్‌లో శ్రీదేవిని అలా చూసినప్పటి నుంచి నా మనసు మార్చేసుకున్నాను అంటోంది సినీనటి మంచు లక్ష్మి (Lakshmi Manchu). తాజాగా ఆమె చేసే బ్యూటీ విత్ లక్ష్మి టాక్ షోకు బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ భార్య మహీపా కపూర్ హాజరైంది. వీరిద్దరూ అందం, ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.ట్రెడ్‌మిల్‌పై శ్రీదేవిశ్రీదేవి (Sridevi)ని ఓసారి జిమ్‌లో చూశాను. తను ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతోంది. అప్పుడు జిమ్ లోపలికి అడుగుపెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాను. శ్రీదేవి తన జుట్టుకు ఒత్తుగా నూనె పట్టించి ఉంది. అది చూసి షాకయ్యాను. దక్షిణ భారతదేశంలో తలకు నూనె పెట్టుకోవడం అనేది చాలా సాధారణ విషయం. ఎందుకో కానీ, జుట్టుకు నూనె పెట్టుకోవడాన్ని నేనసలు ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడైతే శ్రీదేవిని అలా చూశానో సడన్‌గా నా మనసు మారిపోయింది. శ్రీదేవికి అన్నీ తెలుసుఅంత గొప్ప నటి శ్రీదేవియే జుట్టుకు నూనె రాసుకుందంటే చాలా గొప్ప విషయం అనిపించింది. తనెప్పుడూ సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుంది అని చెప్పుకొచ్చింది. మహీరా కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవికి ఏం చేయాలి? ఏది తినాలి? అన్నీ తెలుసు. ఇలాంటి విషయాల్లో ఆమె జీనియస్ అని పేర్కొంది. ఇకపోతే లక్ష్మీ మంచు చివరగా ఆదిపర్వం సినిమాలో కనిపించింది.చదవండి: అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా! -
ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం
ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్ చేసింది. నా లగేజ్ బ్యాగేజ్‌ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.ఇండిగో సిబ్బంది వేధింపులుఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియో సైతం షేర్ చేసింది. This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025My bag pulled aside and @IndiGo6E and they won’t let me open my bag. They insist to do it or else my bag will be left in Goa, someone help!!! Flt 6e585.. this is ridiculous, and the staff is being extremely rude— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025 చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడుకన్నడ బిగ్‌బాస్ విన్నర్‌గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..? -
మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం.. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్!
మంచు ఫ్యామిలీ గొడవ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం మొదలైన వివాదం చివరికీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే మంగళవారం మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. మంచు మనోజ్ దంపతులను లోపలికి రాకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు.అయితే మంచు ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం ముంబయిలో ఉన్నారు. గొడవ విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే.. తాజాగా ఆమె చేసిన పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా తన కూతురి వీడియోను పోస్ట్ చేస్తూ పీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఈ పోస్ట్‌పై నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్‌ను చూస్తే శాంతించండి అంటూ ఇన్‌డైరెక్ట్‌గా మంచు లక్ష్మి సలహా ఇచ్చినట్లు అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి
మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. ఇక్కడ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. బలం, పలుకుబడి ఉన్నవారు.. మహిళా ఆర్టిస్టులను వేధించి వెంటాడుతున్నారని సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది.ఆడవాళ్లకు మంచి జీవితం ఎక్కడుంది?తెర వెనుక ఆర్టిస్టులు అత్యంత దుర్లభమైన జీవితం గడుపుతున్నారని అందులో నివేదించింది. ఈ రిపోర్టుపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. 'మీ అందరికీ ఓ విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా సరే అమ్మాయిలకు మంచి జీవితమే లేదు. దాన్ని మనం ఎలా మార్చగలం? ముందు మనకోసం మనం నిలబడాలి. ఒకానొక సమయంలో నన్ను కూడా పక్కకు నెట్టేయాలని చూశారు. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను.మీటూ ఎలా మొదలైంది?గళం విప్పుతున్న మహిళల్ని అణిచివేయాలనకున్నవారికి వ్యతిరేకంగా పోరాడతాను. మీటూ ఉద్యమం ఎలా మొదలైంది? వేధింపులు భరించలేక అలిసిపోయిన ఓ మహిళ గొంతెత్తి తన గోడు వెల్లబోసుకోవడం వల్లే కదా.. అప్పుడు ఆ గొంతుకు ఎన్ని గొంతులు తోడయ్యాయి..? ఎంతమంది తాము పడుతున్న మనోవేదనను నిర్భయంగా బయటపెట్టారు? అదీ.. అలా ధైర్యంగా ఐకమత్యంగా నిలబడాలి' అని పేర్కొంది.నా పరిస్థితి వేరుమంచు లక్ష్మి రెండేళ్లక్రితం మాన్స్టర్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. నా పరిస్థితి వేరు. ఎందుకంటే నాన్న (మోహన్‌బాబు), మోహన్‌లాల్ మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి వర్క్ చేశాను. అయితే అక్కడ ఉన్నవాళ్లందరూ నాన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఆ గౌరవం నాపై చూపించేవారు.తెలివిగా నో చెప్పాలిఇకపోతే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో కొందరు నన్ను అదేపనిగా కొడుతూ ఇబ్బందిపెట్టేవారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకునేదాన్ని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తర్వాత నేర్చుకున్నాను. ఏంటి? నేను అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నానా? కానీ నాకు పెళ్లయిపోయింది. ఆల్రెడీ కమిటెడ్.. అని చెప్పాను. అప్పటికీ అవతలివారు విసిగిస్తే మనం విజృంభించక తప్పదు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్‌బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే? -
నా కెరీర్‌కు కుటుంబమే అడ్డు పడుతోంది: మంచు లక్ష్మి
హీరోల సోదరీమణులకు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఇవ్వరంటోంది మంచు లక్ష్మి. అక్కడిదాకా ఎందుకు? అసలు తాను నటిగా మారడం కన్న తండ్రికే ఇష్టం లేదని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు మాట్లాడుతూ.. నా జీవితానికి, కెరీర్‌కు అడ్డుపడుతుంది ఎవరైనా ఉన్నారా? అంటే అది నా కుటుంబమే! మేమంతా కలిసే ఉంటాం. అందుకని నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. హైదరాబాద్ దాటి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు.. అసలు ఒప్పుకునేవారే కాదు. ముంబైకి వెళ్తానన్నప్పుడు ఎన్నో అపోహలు, భయాలు వారిని వెంటాడాయి. అదొక పెద్ద చెరువులాంటిది. అందులో చిన్న చేపపిల్లలా నువ్వు ఈదగలవా? అని భయపడ్డారు. ముంబైకి వచ్చిన కొత్తలో నా బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తనెప్పుడూ.. ముంబైకి వచ్చేయొచ్చుగా అని అంటూ ఉండేది. హీరో రానా కూడా.. నువ్వు ఎల్లకాలం హైదరాబాద్‌లోనే ఉండిపోలేవని అంటుండేవాడు. నాక్కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనిపించి ముంబైకి షిఫ్ట్ అయ్యాను.సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సోదరీమణులను సినిమాలో సెలక్ట్ చేసుకునేందుకు తెగ ఆలోచిస్తారు. మాలాంటివాళ్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు. నాన్న (మోహన్‌బాబు)కు కూడా నేను యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలినే! నా తమ్ముళ్లు ఈజీగా సాధించేవాటిని కూడా నేను కష్టపడి పొందాల్సి వచ్చేది. ఈ ధోరణి సౌత్‌లోనే కాదు దేశమంతటా ఉంది' అని చెప్పుకొచ్చింది. కాగా మంచు లక్ష్మి చివరగా మాన్స్టర్ అనే సినిమాలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆమె కీలక పాత్రలో నటించిన యక్షిణి సిరీస్ ఈ మధ్యే హాట్‌స్టార్‌లో విడుదలైంది.చదవండి: నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా? -
మంచు లక్ష్మి కూతురు యాపిల్‌కు 10 ఏళ్లు.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
Lakshmi Manchu: ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు.. ఎంత గ్రాండ్‌గా ఉందో! (ఫోటోలు)
-
ఆడపడుచు అంటే నీలా ఉండాలి.. మంచు లక్ష్మిపై ప్రశంసలు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు ఈ ఏడాది భలే కలిసొచ్చింది. ఉస్తాద్ గేమ్ షోతో స్క్రీన్‌పై మళ్లీ మెరిశాడు. వాట్ ద ఫిష్ అనే సినిమా కూడా ప్రకటించాడు. అతడి భార్య మౌనిక బొమ్మల బిజినెస్ ప్రారంభించింది. వినూత్నంగా పిల్లలు గీసే డ్రాయింగ్స్ ఆధారంగా బొమ్మలు తయారు చేసివ్వడమే ఈ బిజినెస్ వెరైటీ. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మౌనిక రెండు రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంలో మంచు లక్ష్మి పాపకు M.M. పులి అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పింది. అయితే డెలివరీ సమయంలో మంచు లక్ష్మి ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మౌనికకు ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉంది. మరోసారి మేనత్త అవుతున్నందుకు సంతోషంలో తేలియాడుతోంది. డెలివరీ అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మి, వైద్యులు అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీలా ఉండాలి.. ఇది చూసిన జనాలు మంచు లక్ష్మిని పొగిడేస్తున్నారు. 'పెళ్లి నీ ఇంట్లో నీ చేతుల మీదుగా జరిపించావు.. ఇప్పుడు డెలివరీ సమయంలో తనకు అండగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు.. ఆడపడుచు అంటే నీలా ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మనోజ్- మౌనికలది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే! మౌనికకు ఇదివరకే ధైరవ్ అనే కుమారుడున్నాడు. పెళ్లి తర్వాత మౌనికతో పాటు ధైరవ్ బాధ్యత కూడా తనే తీసుకున్నాడు మనోజ్. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్, మౌనిక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఏప్రిల్ 13న పండంటి పాపకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేవుడి దీవెనలతో చిన్ని దేవత వచ్చిందని మంచు ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆ పాపను ప్రేమతో ఎమ్.ఎమ్.పులి అని పిలుస్తామని కూడా ఆమె తెలిపింది. తాజాగా మంచు మనోజ్, మౌనిక దంపతులు తమ పాపను తీసుకుని ఫిలిం నగర్లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మౌనిక పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. తమ గారాల ముద్దు బిడ్డను తొలిసారి ఇంట్లోకి తీసుకునిపోతున్న సందర్భంలో హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పాపకు పెద్ద సోదరుడిగా ఉన్న ధైరవ్ చాలా సంతోషంగా ఉన్నాడు. View this post on Instagram A post shared by Dhanesh Babu ( Work ) (@endless_celebrity) -
ఇలా అవుతుందని ఊహించలేదు: చార్మీ, మంచు లక్ష్మి ఎమోషనల్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ భార్య, యోగా ట్రైనర్ రూహీ మరణవార్త అందరినీ కలిచివేస్తోంది. ఎంతోమంది తారలకు యోగా టీచర్‌గా పని చేసిన రూహి అనారోగ్యంతో గురువారం నాడు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. చార్మీ, మంచు లక్ష్మి.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనలయ్యారు. ఈ వార్త అబద్ధమైతే బాగుండు 'ప్రియమైన రూహి.. నీ కోసం ఇలాంటి పోస్ట్ వేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నిన్ను మిస్ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది చార్మీ. డ్యాన్స్, నవ్వులు.. అవన్నీ.. మంచు లక్ష్మి.. రూహితో తన చివరి చాట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్ ఇదే! ప్రతివారం తనను జిమ్‌లో కలుస్తూ ఉండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక నిష్కల్మషమైన నవ్వు కనిపిస్తూ ఉండేది. ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్ చేసేవాళ్లం.. దవడలు నొప్పిపుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. మేము అదృష్టవంతులం సెంథిల్, తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే మనసు కలుక్కుమంటోంది. కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయావు. నీతో కలిసి ప్రయాణం చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులం. ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ సర్ప్రైజ్ చేసేదానివి.. ఇప్పుడు స్వర్గంలో ఉన్న ఏంజెల్స్‌కు యోగాసనాలు నేర్పిస్తున్నావని ఆశిస్తున్నాను. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్ చేసుకుంటా.. ఇట్లు నీ స్నేహితురాలు లక్ష్మి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి -
Pragya Jaiswal Birthday Photos: ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి..ఫొటోలు వైరల్
-
బీచ్ లో పార్టీ చేసుకున్న రకుల్, ప్రజ్ఞా, లక్ష్మి, ఫోటోలు.. ఒక్క లుక్ వేయండి
-
ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు ఇంద్ర భవనమే.. ఎలా ఉందో చూశారా?
యాంకర్, నటి మంచు లక్ష్మి కొన్ని నెలల క్రితం ముంబైకి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. వృత్తిపరమైన పనుల రీత్యా అక్కడకు షిఫ్ట్ అయినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. మంచు లక్ష్మి ఎక్కడ ఉన్నా తన ఇంటిని చాలా యూనిక్‌గా ఉండేలా చూసుకుంటుంది. హైదరాబాద్‌లోని తన ఇంటితో పాటు మోహన్‌బాబు ఇంటిని కూడా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా ముంబైలో తాను ఉంటున్న ఇంటిని వీడియో తీసి అభిమానుల కోసం విడుదల చేసింది. ఎక్కడున్నా ఎవరికైనా ఇల్లే స్వర్గం.. ముంబైకి షిఫ్ట్ అయ్యాక తన అభిరుచులకు తగిన ఇంటి కోసం దాదాపు వారం రోజులపాటు 28 ఫ్లాట్స్ చూసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.. ఫైనల్‌గా ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఉద్దేశించి దీనిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పింది. కానీ అక్కడ వస్తువులన్నీ చాలావరకు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి తెచ్చుకున్నవే అని ఆమె తెలిపింది. ఎంతో అద్భుతంగా ఉన్న మంచు లక్ష్మీ ఇంటిని మీరూ చూసేయండి. ముంబైకి షిఫ్ట్ అయ్యాక లక్ష్మి ఏం చెప్పింది అంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. అని గతంలో తెలిపింది. -
Lakshmi Manchu 46th Birthday Celebrations: మంచు లక్ష్మి బర్త్‌డే పార్టీ.. బాలీవుడ్ స్టార్స్ సందడి (ఫోటోలు)
-
ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి, అవకాశాల కోసమే!
యాంకర్, నటి మంచు లక్ష్మి ముంబైకి చెక్కేసింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'ముంబై.. కొత్త నగరం, కొత్త ప్రపంచం.. ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు ఎంతో కృతజ్ఞతలు. నాపై నమ్మకముంచి నా మీద ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించే అభిమానులందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేసింది. అయితే టాలీవుడ్లో తనకు అవకాశాలు సన్నగిల్లాయని బాలీవుడ్‌కు మకాం మార్చేయలేదు. తన నటనా పరిధిని విస్తృతపరిచుకునేందుకే ముంబైకి షిఫ్ట్ అయినట్లు పేర్కొంది. ఆఫీసుకు రమ్మన్నా వస్తాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. నాన్న అలాగే భయపడ్డాడు కానీ మా అమ్మ ఒకరకంగా భయపడి బెంగపెట్టేసుకుంది. సరే, అయితే ముంబైకి షిఫ్ట్ అవుతానని చెప్పా.. అమ్మ సరేనంది. తను ఎప్పుడూ నా నిర్ణయాన్ని అంగీకరిస్తుంది. నాన్న మాత్రం ముంబై అనగానే అక్కడ మాఫియా ఉంటుంది.. అక్కడికి ఎందుకు? అని అడిగాడు. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటే ప్రతి తండ్రి ఎలా భయపడతాడో మా నాన్న కూడా అలాగే భయపడ్డాడు' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్లో మకాం పెట్టిన మంచు లక్ష్మి ఆదివారం నాడు తన స్నేహితులకు బర్త్‌డే పార్టీ ఇచ్చింది. చదవండి: సినిమా కోసం ఇల్లు కూడా అమ్మేశా, ఆయనను కలిసిన తెల్లారే హత్య.. అలా కేసులో ఇరుక్కున్నా -
సైమా వేడుక.. మంచు లక్ష్మికే కోపం తెప్పించాడు..!!
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి ప్రసన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఇటీవలే దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఫంక్షన్లో పాల్గొన్న మంచు లక్ష్మికి ఓ వ్యక్తి చేసిన పనికి కోపం తెప్పించింది. తాను మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాలకు అడ్డు రావడంతో అగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా 'నీ యవ్వా' వెనక్కి వెళ్లు అంటూ గట్టిగా ఓ దెబ్బ వేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దక్షిణాది నటీనటులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సైమా(SIIMA) అవార్డ్స్- 2023 ఈవెంట్ దుబాయ్‌లో నిర్వహించారు. సెప్టెంబర్ 15-16 తేదీలలో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లకు సినీ ప్రముఖులందరూ పాల్గొన్నారు. అయితే ఈ వేదికపైనే మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరాలకు అతను అడ్డుకోవడంతో కోపంతో కొట్టేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి అక్కడికి రావడంతో కెమెరా వెనకకు వెళ్లండి డ్యూడ్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ సమర్థించగా.. మరికొందరేమో తప్పుపడుతున్నారు. కాగా.. మంచు లక్ష్మి టాలీవుడ్లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా రంగప్రవేశం చేసింది. అంతే కాకుండా లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, పిట్ట కథలు, మాన్స్టర్, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో నటించింది. వీటితో పాటు లాస్ వెగాస్ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లో కనిపించింది. ఆమె డెస్పరేట్ హౌస్‌వైవ్స్, లేట్ నైట్స్ విత్ మై లవర్, మిస్టరీ ఈఆర్ లాంటి హాలీవుడ్ సిరీస్‌ల్లో నటించింది. ఎవడ్రా మా లచ్చక్క మాట్లాడే అప్పుడు మధ్యలో అడ్డం వస్తున్నారు ని అవ్వ 😁 హాల్లో డుర్ go behind the camera dude🤣@LakshmiManchu pic.twitter.com/Ry5FBNyN3A — 𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐡 𝐆𝐨𝐮𝐝 🇸𝐈𝐍𝐆𝐋𝐄 (@jayanthgoudK) September 21, 2023 -
మనోజ్‌కు రాఖీ కట్టిన మంచు లక్ష్మి.. మరి విష్ణు ఎక్కడ?
మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదంతా ఏమీ లేదని వాళ్లు చెప్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో వారి మధ్య ఉన్న గొడవలు, డిస్టబెన్స్ ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య మనోజ్ అనుచరుడిపై విష్ణు గొడవకు దిగిన వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మనోజ్ పెళ్లిలో విష్ణు కుటుంబం సందడే కనిపించలేదు. విష్ణు ఫ్యామిలీ సమయానికి వచ్చి నాలుగు అక్షింతలు వేసి అతిథిలా వచ్చి వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. అటు మంచు లక్ష్మి మాత్రం తమ్ముడి పెళ్లిని భుజాన వేసుకుని స్వయంగా తన ఇంట్లోనే జరిపించింది. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసి మంచు ఫ్యామిలీలో సఖ్యత లోపించిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటో మరోసారి ఈ ఊహాగానాలకు తెర లేపింది. మంచు మనోజ్‌కు రాఖీ కట్టిన లక్ష్మి వారితో కలిసి ఓ రెస్టారెంట్లో లంచ్ చేసింది. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ప్రేమ, సరదా, రుచికరమైన భోజనంతో రాఖీ లంచ్ జరిగింది' అని రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోల్లో మంచు విష్ణు లేడు. ఇది చూసిన జనాలు అంతా బానే ఉంది.. కానీ, మంచు విష్ణు ఎక్కడ? అని కామెంట్లు చేస్తున్నారు. విష్ణుకు రాఖీ కట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాఖీ లంచ్ అంటూ మనోజ్‌తో మాత్రమే దిగిన ఫోటోనే షేర్ చేసిందంటే విష్ణుకు రాఖీ కట్టనట్లుంది అని అభిప్రాయపడుతున్నారు. అక్కాతమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతోందని అనుమానిస్తున్నారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్‌కు వెళ్లాల్సి ఉండగా నటి ఇంట విషాదం -
నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్
టాలీవుడ్లో మంచు లక్ష్మీ పేరు అంటే అందరికి తెలిసే ఉంటుంది.. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ను అందుకుంది. నటన పరంగా మంచి గుర్తింపు దక్కించుకున్న లక్ష్మీ పలు సహాయక కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది. ఒకవైపు సినిమాల్లో కనిపిస్తూనే మరో వైపు పలు బుల్లితెర షోలలో కూడా మెప్పిస్తుంది. తాజాగా ఆమె టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: టీజర్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?) తెలుగు పరిశ్రమకు రాక ముందు పలు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు చెప్పింది. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్ని.. ఇక్కడికి ఎందుకొచ్చానో అని కూడా అనిపిస్తుందని ఆమె తెలిపింది. ఆ దేవుడు దయ తలచితే మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లేందుకు రెడీగా ఉన్నాని తెలిపింది. ఇక్కడి తెలుగు ఆడియన్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ వారి సొంత రాష్ట్రాలకు చెందిన వారిని మాత్రం ఆదరించరని మంచు లక్ష్మీ పేర్కొంది. ఇక్కడివారిని ఒక్కశాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారని తెలిపింది. (ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్) ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు.. బిందు మాధవి ఎందుకు చేయడం లేదు.. మధుశాలినితో పాటు శివాత్మిక,శివాని ఎందుకు చేయడం లేదు.. .. అని ఆమె ప్రశ్నించింది. వీరందరూ దేనిలో తక్కవ అందంతో పాటు టాలెంట్ ఉన్న వారే కదా అంటూ ఫైర్ అయింది. ఇక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్‌కు కూడా ముంబయి,పంజాబీ,కేరళ, తమిళ, కన్నడ హీరోయిన్లే కావాలి.. కానీ తెలుగు వారు మాత్రం వద్దంటారని ఫైర్ అయింది. మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ నిజమే కదా అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
నగల దుకాణంలో సినీ నటి మంచు లక్ష్మి సందడి (ఫోటోలు)
-
Lakshmi Manchu: ఘనంగా మంచు లక్ష్మీ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో మెరిసిన మంచు లక్ష్మి ( ఫొటోలు)
-
మనోజ్ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు మంచు లక్ష్మి ఏమందంటే?
జీవితంలో కొత్త మజిలీ ప్రారంభించబోతున్నా, త్వరలోనే కొత్త చాప్టర్ అన్‌లాక్ చేస్తున్నా అంటూ ఊరించిన మంచు మనోజ్ చివరికి తన సినిమా అప్డేట్ చెప్పి అభిమానులను ఉసూరుమనిపించిన విషయం తెలిసిందే! అతడు గుడ్‌న్యూస్ అన్న క్షణం నుంచి ఫ్యాన్స్ అంతా కచ్చితంగా అది పెళ్లి వార్తే అయి ఉంటుందని ఫిక్స్ అయ్యారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ వాట్ ద ఫిష్ మూవీని ప్రకటించాడు. అయినప్పటికీ మనోజ్ త్వరలో పెళ్లిపీటలెక్కడం ఖాయమంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయం మంచు లక్ష్మీ చెవిన పడింది. ఆదివారం నాడు మంచు లక్ష్మీ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె మాట్లాడుతూ.. 'నేను గుడికి వచ్చినప్పుడు పర్సనల్ విషయాలు అడగడం ఎంతవరకు కరెక్ట్? మనోజ్ పెళ్లి గురించి అతడినే అడగండి. నా సినిమాల గురించి అడిగితే చెప్తాను. అగ్ని నక్షత్రం సహా నాలుగు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. శివరాత్రికి ఓ పాట రిలీజ్ చేస్తున్నాను. టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవోలో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 40 మంది యాక్టర్స్ వస్తున్నారు. దాని ద్వారా 45వేల మందికి మంచి విద్య అందించగలుగుతున్నాం. ఇవన్నీ నా పరిధిలోవి కాబట్టి చెప్పాను. నా పరిధిలో లేనివి అడిగితే చెప్పలేను' అని పేర్కొంది మంచు లక్ష్మి. చదవండి: శంకర్ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్ -
సరిదిద్దుకోలేని తప్పులు చేశాను.. మళ్లీ అలాంటివి చేయను : మంచు లక్ష్మీ
నటి మంచు లక్ష్మీ మోహన్ బాబు కూతురిగానే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా దూసుకుపోతున్న లక్ష్మీ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. మొహమాటం లేకుండా తన ఓపీనియన్‌ని నిక్కచ్చిగా చెబుతుంటుంది. తాజాగా మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. అవి ఇప్పుడు మార్చలేను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. కాబట్టి మళ్లీ ఆ తప్పులు చేయను అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అయితే ఏ విషయంలో మంచు లక్ష్మీ తప్పు చేసింది అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. -
సోషల్ హల్చల్: హన్సిక సూఫీ నైట్, మూన్‌లైట్‌లో జాన్వి కపూర్
► ఒంగోలులో యాంకర్ అనసూయ సందడి ► ఎదపై టాటూ, ముక్కు పుడకతో అనుపమ, కొత్త లుక్ వైరల్ ► ప్యారిస్‌లో ఫరియా చక్కర్లు ► మంచులో తడుస్తున్న శృతి హాసన్ ► హన్సిక సూఫీ నైట్, ఆకట్టుకుంటున్న ఫొటోలు ► స్టార్ హోటల్లో బోల్డ్ బ్యూటీ అరియాన గ్లోరీ, గ్లామరస్ ఫొటోలు వైరల్ ► మూన్‌లైట్‌లో కలవమంటున్న బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ► హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి స్టన్నింగ్ లుక్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by YADAMMA RAJU (@yadamma_raju) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) -
ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మాన్స్టర్. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. ఉదయ్ కృష్ణ కథ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది మంచు లక్ష్మి. ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు. నేను చాలా ఎనర్జిటిక్‌గా సెట్స్‌కు వెళ్తే డల్‌గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది. మలయాళంలో నటిస్తున్నప్పుడు భాషాపరంగా కొంత ఇబ్బందులు పడ్డాను. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నందుకు మోహన్‌లాల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇలాంటి ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ మనకెందుకులే అనుకోకుండా ముందుకు వెళ్లారు. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలనుందని ఆయనతో చెప్పాను. నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నటిగానే కాకుండా టీవీ షోలు చేస్తున్నాను. ఇక్కడ నటించకుండా నాలా నేనుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాపై ట్రోల్స్, మీమ్స్ లేవు.. కానీ వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం లేచించి మహిళా లోకం, అగ్ని నక్షత్రం, గాంబ్లర్ సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో ముగినిపోయిన జంట విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే సింగర్ డేటింగ్ -
శ్రీకాకుళంలో మంచు లక్ష్మి సందడి.. చూసేందుకు ఎగబడిన జనం
శ్రీకాకుళం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ మోహన్‌బాబు అరసవల్లి క్షేత్రానికి వెళ్లాలని సూచించారని, అద్భుతంగా స్వామి దర్శనం జరిగిందన్నారు. ఇక తాము ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే ఎన్జీవో తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 475 ప్రభు త్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్‌ను నాణ్యంగా బోధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక జిల్లాలో కొరసవాడ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాసులను ప్రారంభించేందుకు తాను జిల్లాకు వచ్చినట్టు వివరించారు. అలాగే మరోవైపు నటనను కొనసాగిస్తున్నానని, త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే పూర్తి మహిళల చిత్రం విడుదల కానుందని, అలాగే తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి కుటుంబకథా చిత్రాన్ని కూడా చేయనున్నానని ప్రకటించారు. స్మార్ట్ క్లాస్రూమ్ ప్రారంభం పాతపట్నం: కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.3 లక్షలతో డిజిటల్ తరగతిని (స్మార్ట్ క్లాస్‌రూం)ను సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఆమె ముందుగా ఓపెన్ టాప్ జీపులో కొరసవాడ చేరుకున్నారు. ఊరివారితో పాటు సమీప గ్రామస్తులు కూడా ఆమెను చూడడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 20 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆమెతో పాటు జిల్లా డీఈఓ జి.పగడాలమ్మ, ఎంఈఓలు సీహెచ్ మణికుమార్, కె.రాంబాబు, ప్రధానోపాధ్యాయు డు సింహాచలం, సర్పంచ్ జక్కర ఉమా, ఎంపీటీసీ మడ్డు సుగుణ కుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే హిరమండలం మండలంలోని సవరచొర్లంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూంను కూడా ఆమె ప్రారంభించారు. -
మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా..
నటి మంచు లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. టీసీ కండ్లెర్ అనే మ్యాగజైన్లో ఆమె చోటు దక్కించుకుంది. ప్రతి ఏడాది ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉండే 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ సినీ ఉమెన్ జాబితాను విడుదల చేస్తుంది. అయితే ఈ ఏడాదికిగాను ఈ జాబితాలో మంచు లక్ష్మి స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా తనను నామినేట్ చేసిన కండ్లెర్ మ్యాగజైన్‌కు ధన్యవాదాలు తెలిపింది. కాగా టీసీ కండ్లెర్ అనే సంస్థ 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ సినిమా, టీవీ, పాప్ ఆర్టిస్ట్‌లకు ఈ జాబితాలో చోటు కల్పిస్తోంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు ఈ ఏడాదికిగాను తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి మంచు లక్ష్మి ఎన్నికవ్వడం విశేషం. ఇకపోతే విలక్షణ నటుడు మోహన్ బాబు నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మి చిత్రపరిశ్రమలో నటిగా, సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రెటీ సింగర్‌గా, నటిగా ఆమె పలు అవార్డులను కూడా అందుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు, వ్యాయమం వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తూ ఉంటుందీ మంచు లక్ష్మి. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
50 స్కూళ్లు దత్తత తీసుకున్న మంచు లక్ష్మి
సినీ నటి మంచు లక్ష్మి గొప్ప నిర్ణయం తీసుకుంది. 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని తెలిపింది. 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. పిల్లలు చదువు మధ్యలో ఆపేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మంచు లక్ష్మి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. పిల్లల చదువుకు పెద్దపీట వేసే ఈ ముందడుగు తప్పకుండా విజయవంతం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: 'నిప్పు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా? -
కాజల్ బాడీపై ట్రోల్స్.. స్పందించిన సమంత, లక్ష్మి మంచు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల తన శరీరంలో వచ్చిన మార్పులతో బాడీ షేమింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ 7నెలల గర్భవతి. ఈ నేపథ్యంలో తన సోదరి నిషా అగర్వాల్ తనయుడితో ఓ ప్రకటనలో నటించింది. ఇందులో కాజల్ బేబీ బంప్‌తో బోద్దుగా కనిపించింది. అయితే ఆడవాళ్లలో గర్భవతి సమయంలో వచ్చే సహజ మార్పులే కాజల్‌లో కూడా కనిపించాయి. అయితే తను హీరోయిన్ కావడంతో ఈ మార్పుల కారణంగా ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చదవండి: ఓటీటీకి రౌడీ బాయ్స్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!, ఎక్కడంటే.. కానీ కాజల్ మాత్రం వాటిని చూసి వదిలేయలేదు. తనపై అసభ్య కామెంట్స్ చేసిన నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘నా జీవితంలో, నా శరీరంలో, ఇంట్లో, పని ప్రదేశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాటన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్లు, మీమ్స్ వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి. మీరు బతకండి, ఇతరులనూ బతకనివ్వండి’ అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. చదవండి: Sudheer Babu: కెమెరామెన్ అలా అనడంతో గదిలోకి వెళ్లి ఏడ్చాను ఈ క్రమంలో కాజల్ పోస్ట్‌పై స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు.‘నువ్వు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ అందంగానే ఉన్నావ్’ సమంత కామెంట్స్ చేయగా.. నువ్వు ప్రతి దశలో పర్ఫెక్ట్, నీ చూట్టు చాలా ప్రేమ ఉంది బేబీ’ అని మంచు లక్ష్మీ కామెంట్ చేసింది. అలాగే రాశి ఖన్నా సైతం కాజల్‌కు మద్దతునిస్తూ తన పోస్టుపై స్పందించింది. వీరి కామెంట్స్‌పై కాజల్ సోదరి నిషా అగర్వాల్ స్పందిస్తూ.. ‘నిజమే.. ఇంతకంటే మాటల్లో చెప్పలేం! నా గార్జియస్’ అంటూ రిప్లై ఇచ్చింది. -
మంచు లక్ష్మిని ఎత్తిపడేసిన తండ్రీకొడుకులు
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండేవారిలో మంచు లక్ష్మి ఒకరు. నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే ఆమె తాజాగా ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మంచు విష్ణు తన కుటుంబ సభ్యులను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేస్తుంటే వీడియో తీస్తూ ఎంజాయ్ చేసింది లక్ష్మి. ఇంతలో విష్ణు అందరి వంతు అయిపోంది కానీ ఇంకా ఒక్కరు బ్యాలెన్స్ ఉన్నారనుకున్నాడు. వెంటనే లక్ష్మి దగ్గరకు వెళ్లి ఆమెను ఎత్తుకుని పూల్ వైపు నడిచాడు. దీంతో విషయం అర్థమైన లక్ష్మి వద్దంటూ కేకలు పెట్టింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ మోహన్‌బాబు సైతం విష్ణుకి సాయం చేస్తూ ఆమెను నీళ్లలో పడేశారు. తండ్రి కూడా తనకు సాయం చేయకుండా విష్ణుకే సపోర్ట్ చేసి పూల్‌లో ఎత్తేసినందుకు ఆమె కాస్త కోపంతో అరిచింది కూడా! అంతా నా కర్మ అంటూ సదరు వీడియోను పంచుకోగా మీ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది!: మంచు లక్ష్మి
మంచు లక్ష్మి.. అటు సినిమాలతో పాటు అడపాదడపా షోలలోనూ కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. ఈ మధ్యే కలరి విద్య కూడా నేర్చుకుంటోంది మంచువారమ్మాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు ఫ్యామిలీతో ఉన్నాను.. ఇక నాకోసం కొంత సమయం కేటాయించుకోవడానికి వెళ్తున్నాను అని ట్వీట్ చేసింది. అంటే ఒంటరిగా మంచు లక్ష్మి ఫారిన్ ట్రిప్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎక్కడికి వెళ్తుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 'ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఆకలి వేయకపోయినా తిన్నాను. ఎందుకంటే ఆ టికెట్ కొనేందుకు నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా తింటున్నా' అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'మంచక్క, నువ్వు కూడా మా బ్యాచేనా' అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం 'మీరు రిచ్ కదా.. మీరు కూడా ఇలా చేస్తారా?' అని అడిగారు. దీనికి లక్ష్మి స్పందిస్తూ 'మా నాన్న రిచ్ తమ్ముడు, నేను కాదు' అంటూ కౌంటర్ ఇచ్చింది. I’m not even hungry but I’m still eating in the lounge because I want to make the most for my buck since I had to sell a kidney to buy this flight ticket🙄 😝 — Lakshmi Manchu (@LakshmiManchu) December 26, 2021 Fully babu. My dad is rich not me … — Lakshmi Manchu (@LakshmiManchu) December 26, 2021 -
హాట్ వ్యూ చూస్తున్న చార్మీ..చెట్టు వెనుక దాక్కున్న దియా
► లైగర్ షూటింగ్లో చార్మీ కౌర్..హాట్ వ్యూ అంటూ పోస్ట్ ►యూట్యూబ్‌లో దూసుకుపోతున్న యాంకర్ హరితేజ ► గార్జియస్ లుక్‌లో మలైకా అరోరా ► ఇన్‌స్టా రీల్స్ చేసిన సోనాలీ బింద్రె ► చెట్టు వెనుక దాక్కున్న దియా మీర్జా ► వెనీలా డ్రెస్‌ను చుట్టేసుకున్న జాన్వీ కపూర్ ► ఫ్లోరల్ సారీలో యాంకర్ వర్షిణి View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
హల్చల్ : కొప్పు వేసుకున్న సమంత..జిమ్‌కు లేట్ అయిన లక్ష్మీ
► డిజైనర్ నీతా లుల్లా కాస్టూమ్స్‌లో సమంత ► 11ఏళ్ల రిలేషన్ షిప్ అంటున్న మహి ► పట్టు ఓణీలో టిక్‌టాక్ స్టార్ బన్నీ ► జిమ్‌కు లేట్ అయిందంటున్న మంచు లక్ష్మీ ► నీ మీద నువ్వు నమ్మకం ఉంచాలంటున్న అనసూయ ► భార్యతో కలిసి ఆట సందీప్ స్టెప్పులు ► ఇంకో రౌండ్ కాఫీ ఉందంటున్న కాజోల్ ► అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్న షెఫాలీ View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) ] View this post on Instagram A post shared by Bunny Vox (@bunnyvox) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Jyoti Raj (@jyoti_raj__sandeep_) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
హల్చల్ : రవితో అషూ సందడి..తెగ పొగిడేస్తున్న దియా
► బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న అషూ ► వరలక్ష్మి వ్రతం స్పెషల్ అంటున్న టిక్‌టాక్ స్టార్ బన్నీష ► బుల్లితెర నటులతో శివజ్యోతీ సందడి ► ఇది చూసి నా హృదయం నిండిపోయిందన్న లక్ష్మి ► సురేఖవాణితో యూట్యూబర్ నిఖిల్ చిట్‌చాట్ ► డాడీ డ్యూటీ అంటున్న సమీరా రెడ్డి ► భర్తను పొడగ్తలతో ముంచెత్తుతున్న దియా మీర్జా View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Bunny Vox (@bunnyvox) View this post on Instagram A post shared by Shiva Jyothi - Savithri (@iam.savithri) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by NIKHIL VIJAYENDRA SIMHA (@nikhiluuuuuuuuu) View this post on Instagram A post shared by Akshai Varde (@mr.vardenchi) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Shravya Varma (@shravyavarma) -
మంచు లక్ష్మీ ఇల్లు చూశారా? ఎంత బాగుందో.. ఇంద్ర భవనమే!
Lakshmi Manchu: మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ.. పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి. ఫన్నీ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తుంది. తాజాగా ఈ మంచు బ్యూటీ.. తన ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకుంది. ఇటీవల యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. తన ఇంటి అందాలు వీడియో చేసి ‘మై హోమ్ టూర్’విడుదల చేసింది. అందులో వంట గది, ఆఫీస్, తను సినిమాలు చూసే హాల్.. ఇలా ఇంట్లో ఉన్న ప్రత్యేక గదులన్నింటిని చూపించింది. ఇంద్ర భవనంగా మెరిసిపోతున్న మంచు వారసురాలి ఇంటిని మీరు కూడా చూసేయండి. -
హల్చల్ : పర్ఫెక్ట్ కాదంటున్న అనసూయ.. ఫేవరేట్ అంటున్న సురభి
♦ మహారాష్ట్ర ట్రెడిషనల్ లుక్‌లో సదా ♦ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సారా అలీ ఖాన్ ♦ హిమాచల్ అందాలను ఆస్వాదిస్తున్న అనితా రెడ్డి ♦ మంచు మోహన్ బాబు వివాహ వార్షికోత్సవం ♦ పెటల్ పింక్ కలర్ శారీలో శ్రద్ధాదాస్ ♦ ఎక్కడి నుంచైనా సంతోషాన్ని వెతుక్కోవచ్చంటున్న సోనమ్ ♦ తాను పర్ఫెక్ట్ కాదంటున్న అనసూయ ♦ బ్లాక్ కలర్ చీరలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ♦ ఫేవరేట్ మార్నింగ్స్ అంటున్న సురభి View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Surbhi Puranik (@surofficial) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Manchu Lakshmi: 'మంచు లక్ష్మి' మంచి మనసు..వారికి అండగా
కరోనా వైరస్ సెకండ్‌వేవ్ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. సకాలంలో వైద్యసదుపాయం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనా కాటుతో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలవుతున్నారు. అలాంటి చిన్నారులకు సాయం చేసేందుకు నటి మంచు లక్ష్మి ముందుకొచ్చారు. 'టీచ్ ఫర్ చేంజ్' అనే స్వచ్చంద సంస్థతో కలిసి 1000 మంది పిల్లలకు విద్య, వైద్యం ఇతర ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు సహాయం అందించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'కరోనా ప్రభావంతో ఎన్నో కుటుంబాలు తమ తల్లిదండ్రులను పోగొట్టుకున్నాయి. 'టీచ్ ఫర్ చేంజ్' అనే స్వచ్ఛంధ సంస్థతో కలిసి ఆదాయం తక్కువున్న కుటుంబాలను గుర్తించి వారిలో 1000మందికి విద్య, ట్యూషన్, బట్టలతో పాటు ఇతర సహాయం అందించబోతున్నాం. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. అప్పుడే వారు ఆరోగ్యంగా తమ బాల్యాన్ని గడుపుతారు. కానీ కరోనా వల్ల దురదృష్టవశాత్తూ కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులను పొగొట్టుకున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి సహాయం చేస్తాం. అదేవిధంగా లాక్డౌన్ సమయంలో చాలా మంది వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారు. అలాంటి వారికి ఆహారం దొరకడం కష్టంగా ఉంది. ఈ లాక్డౌన్ మొత్తం సమయంలో 1000 మందికి భోజనాలు పంపిణీ చేసేందుకు కొన్ని ఆసుపత్రులను ఎంచుకున్నాము. వారి కోసం టీచ్ ఫర్ చేంజ్ బృందం, మా వాలంటీర్స్ తో పాటు బృంద సభ్యులు ప్రతిరోజూ వారికి ఆహారం ఇచ్చి ఆకలిని తీర్చినందుకు ధన్యవాదాలు' అని మంచు లక్ష్మి తెలిపారు. Can you imagine the torment a child is going through when he/she loses a parent to covid-19? Do you know anyone who has lost their parents? Imagine the adverse effects that can be caused on child's growth and mental health because of Parental loss? pic.twitter.com/6uMPA1SXIE — Lakshmi Manchu (@LakshmiManchu) May 19, 2021 చదవండి : Manchu Lakshmi: పోలీసులకు ‘మంచు’ లంచ్ Manchu Manoj: 25 వేల కుటుంబాలను ఆదుకుంటా! -
పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు..
నాలుగు విభిన్న కథాంశాలతో రూపొందించిన పిట్ట కథలు వెబ్ సిరీస్ తెలుగులో ఈనెల 19 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఎంతగానో ఎదురుచూస్తున్న సిరీస్ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. పిట్టకథలు.. పేరుకు తగ్గట్లే నలుగురు మహిళలకు చెందిన నాలుగు చిన్న కథల సమూహారంగా తెరకెక్కించారు. ఇందులో శ్రుతీ హాసన్, ఈషా రెబ్బా, అమలాపాల్, సాన్వే మేఘన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నలుగురు అవార్డ్ విన్నింగ్ తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, లక్ష్మీ మంచు, సంజిత్ హెగ్డే, సత్యదేవ్, అశ్విన్ కాకుమను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాలుగు కథలు వేరే అయినప్పటికీ వీటిని నడిపించేది మాత్రం ప్రేమ, కామం, ద్రోహం, కన్నీళ్లు వంటి భావోద్వేగాలే. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. బోల్డ్ కథాంశంతో సాగుతున్న ట్రైలర్ రొమాంటిక్, కన్నీళ్లు, సీరియస్ సన్నివేశాల మేళవింపుతో కూడుకొని ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్రలు చాలా మేరకు ఎమోషనల్, బోల్డ్, రొమాంటిక్ కనిపిస్తున్నాయి. మొత్తానికి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ ఆధ్యంతం అద్భుతంగా, ఉత్కంఠంగా సాగింది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా ఈ పిట్ట కథలు ఓ కొత్త అనుభూతి ఇస్తుందన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. టేకింగ్‌లో.. మనం కొన్ని అడుగులు ముందుకేసి ‘నెట్ ఫ్లిక్స్’ స్థాయిని అందుకున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. నలుగురు దర్శకులు తొలిసారి పలు కథల సమాహారంతో తీస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఆర్ఎస్వీపీ, ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న పిట్టకథలు నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ప్రీమియర్ కానుంది. చదవండి: వీరిలో నా డార్లింగ్ ఎవరబ్బా: కాజల్ భర్త ఈ ట్రైలర్‌ను ట్విట్టర్లో మంచు లక్ష్మీ షేర్ చేశారు. ‘సమాజ నిబంధనలను సవాలు చేస్తూ నలుగురు విభిన్న మహిళల నాలుగు అసాధారణ ప్రయాణాలను తీసుకు వస్తోంది. ఈ సినిమాలో నేనూ భాగం అవ్వడం ఆనందంగా ఉంది. ‘స్వరూపక్క’ గా మీ ముందుకు రావడనికి ఇక ఆలస్యం చేయలేను.’ అంటూ ట్వీట్ చేశారు. మరి ఈ నాలుగు కథలూ ఎలా ఉంటాయో? నాలుగు కథల్లో ఏది అమితంగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే.. 19 వరకూ ఆగాల్సిందే. Love, betrayal and holograms? VR signing up for this right now.#PittaKathalu@TharunBhasckerD @LakshmiManchu @SaanveMegghana @bethiganti_ @nandureddy4u @IamJagguBhai @Amala_ams #AshwinKakamanu @nagashwin7 @shrutihaasan @TheSanjithhegde #SangeethShoban @anishkuruvilla pic.twitter.com/BfO0gItRr1 — Netflix India (@NetflixIndia) February 5, 2021 -
కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన యాంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’. నాలుగు కథలున్న ఈ యాంథాలజీను తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మీ మంచు, జగపతి బాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, ఈషా రెబ్బా, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ నలుగురు దర్శకులు. నందినీ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీలో ఎక్కువ శాతం వీక్షకులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అని సర్వేలో ఉంది. పెనం మీద నీళ్లు వేస్తే ఆవిరైపోయినట్టు అయిపోతుంది కంటెంట్. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ లేదు. ఆ డిమాండ్ చాలా ఉంది. ఓటీటీ అవకాశం వచ్చినప్పుడు ఆడియన్స్ చూస్తారా? చూడరా? అని ఆలోచించలేదు. కొత్త ఫార్మాట్లో కథ చెప్పగలుగుతున్నాం అని ఎగ్జయిట్ అయ్యాను. మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవచ్చు అనిపించింది. కొత్తదారిలో వెళ్లొచ్చు అనిపించింది. ఎంత సమయంలో కథ చెబుతున్నాం అనేది చాలెంజ్ కాదు అనిపించింది. యాడ్ ఫిల్మ్‌లోనూ ఒక కథ చెప్పొచ్చు. 30 నిమిషాల్లో కథ చెప్పడం బావుంది’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే సినిమా కథకు ఇది సరిపోతుందా? సరిపోదా అని ఆలోచించుకోవాలి. కానీ చాలా కథలు 20–30 నిమిషాల్లో చెప్పేవి ఉంటాయి. దాన్ని సినిమాగా చేయలేం. ఇలాంటి యాంథాలజీల్లో, డిజిటల్లో ఈ కథలు చెప్పొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది. ఈ యాంథాలజీ చేస్తూ దర్శకులుగా మమ్మల్ని మేం కనుగొన్నాం అనిపించింది. ఇది భారీ మార్పుకు దారి తీస్తుంది. మనం కథల్ని చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ధైర్యం చేసేయాలి. మేం చేశాం. ఇలా చేసినప్పుడు కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం. స్టార్స్ కూడా ఓటీటీలో చేయాలి. చిన్న తెరపై కనిపిస్తే స్టార్డమ్ తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రతీ స్క్రీన్‌కి వెళ్లి.. కథల్ని ఇంకా ఎంత కొత్తగా చెప్పగలం అని ప్రయత్నిస్తూనే ఉండాలి’’ అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘30 నిమిషాల్లో కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది. అందరి కంటే లాస్ట్ నా పార్ట్ షూట్ చేశాను. మార్చిలో షూట్ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత షూట్ చేయడం మరో చాలెంజ్. కోవిడ్ టెస్ట్ వల్ల కాస్త బడ్జెట్ యాడ్ అయింది (నవ్వుతూ). మారుతున్న టెక్నాలజీ మనకు బలం ఇస్తుందా? లేక దానికి మనం బలం ఇస్తున్నామా అనే ఆలోచనతో నా కథను తెరకెక్కించాను’’ అన్నారు నాగ్ అశ్విన్. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ –‘‘అన్ని కథలు థియేటర్‌కి సెట్ కావు. అలాంటి కథలు ఓటీటీలో ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు చూసుకోవచ్చు. ఈ పిట్ట కథలు అలాంటివే. చిన్న కథలోనూ సంపూర్ణంగా అనిపించే ఫీలింగ్ కలిగించొచ్చు. ఈ కొత్త ఫార్మాట్ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలు ఇంకా చెప్పాలనుంది’’ అన్నారు. -
మంచు లక్ష్మీ కూతురు వరల్డ్ రికార్డ్
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయ, ప్రముఖ నటి మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. డిసెంబర్ 19న నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిథి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.`చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను నమ్ముతాను. అందుకే విధ్యకి చిన్న వయసులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించాను. కాని రెండు వారాల్లోనే తన కోచ్ కార్తిక్ నా దగ్గరకు వచ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది ఈ రికార్డ్‌కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. ఇప్పుడే వద్దు సార్ ఇంకా కొన్ని రోజుల తర్వాత చూద్దాం అన్నాను. కానీ విధ్యా నిర్వాణ ఇంత చిన్న వయసులోనే `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తన తల్లిగా ఎంతో గర్వంగా ఉంద’ని లక్ష్మీ అన్నారు.‘సో ఫ్రౌడ్ ఆఫ్ యూ మై యాపిల్’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. `నాకు చెస్ ఆడడం ఇప్పటికీ తెలీదు. అటువంటిది మా మనవరాలు విధ్యా నిర్వాణ చెస్ నేర్చుకుంటుంది అని లక్ష్మీ చెప్పినప్పుడు ఎందుకమ్మా ఇవన్ని చక్కగా చదువుకోనివ్వు అని అన్నాను. లేదు డాడి తను చాలా ఆసక్తిగా ఉంది అని చెప్పింది. ఇంత చిన్న వయసులో నా మనవరాలు ఈ రికార్డు సాధించడం సంతోషాన్ని కలిగిస్తోంది’అని అన్నారు. -
దీపాల కాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలి
హిందూ సాంప్రదాయాల్లో అత్యంత కలర్ ఫుల్, అందరికి నచ్చే పండుగ దీపావళి. చెడుపై మంచి, చీకటిపై వెలుగు గెలిచిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా ప్రతి పండగ కళ తప్పింది. కరోనా ఇంకా పూర్తిగా అంతరించకపోవడంతో దీని ప్రభావం దీపావళి వేడుకపై కూడా పడింది. అయితే ఇక నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు తమ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ కుటుంబంతో వేడుక నిర్వహించుకోవాలని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సూచిస్తున్నారు. చదవండి: దీపావళి.. కొత్త సినిమాల సందడి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ బాధలన్నింటి నుంచి వెలుగు అందిస్తుందని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో ప్రేమలు విరజిల్లాలని కోరుకుంటున్నాను. ఆర్థిక, భావోద్వేగ కారణల వల్ల ప్రతి ఒక్కరు ఈ పండగను జరుపుకోలేరు. కాబట్టి మీరు ప్రార్థనలో వారిని తలుచుకోండి. - శ్రుతి హాసన్ Happy Diwali to everyone !! May this Diwali guide us into the light from this rather strange year !! Wishing you and your family all the love and light - a lot of people won’t be able to celebrate in the same way due to financial or emotional reasons so keep them in your prayers — shruti haasan (@shrutihaasan) November 14, 2020 Wishing you all a very happy Diwali! While we spread the light of love, hope and joy, let's remember to keep ourselves and the environment safe from pollution. Shine bright, always ✨🙏 pic.twitter.com/n1u0738A3j — Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2020 దీపాల కాంతి మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు - రాశీఖన్నా May the light of the diyas illuminate your life with joy and prosperity.. Wish you all a very #HappyDiwali 🪔☺️ pic.twitter.com/wSgAgWy9N3 — Raashi (@RaashiKhanna) November 14, 2020 ఇతరుల దీపావళిని సంతోషంగా జరుపండి. ఇదే దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు మంచి పద్దతి- సోనూసూద్ Make someone’s Diwali Happy, that’s the best way to wish Happy Diwali 🪔 — sonu sood (@SonuSood) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ శుభ దినాన అందరూ సంతోషంగా గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ప్రేమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుతూ జీవితాన్ని ప్రకాశింపజేయడంతో పండుగను నిజమైన అర్థంలో జరుపుకుందాం. లక్ష్మీ మంచు Rejoice on this blessed occasion and spread sparkles of peace and goodwill. Let’s celebrate the festival in the true sense by spreading joy, being safe and by illuminating each others life with love and happiness! ✨💥😍#LakshmiManchu #LakshmiUnfiltered #HappyDiwali pic.twitter.com/aIsLVHsh7M — Lakshmi Manchu (@LakshmiManchu) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగు మీ జీవతంలోని చీకటిని తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను- నాగార్జున Wishing you and your family a very #happyDiwali! May the light of this Diwali drive away the darkness in our lives and continue to do so!!🙏#BiggBossTelugu4 🥼 #sabyasachi #styledbysonybhupathiraju pic.twitter.com/KjOqofG6BR — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 14, 2020 దీపావళి శుభాకాంక్షలు, టపాసులు కాల్చకండి. స్వీట్స్ ఎంతైనా తినండి. కుటుంబంతో దీపావళి జరుపకోండి. ఎంజాయ్, ఈ బాధలన్నింటి నుంచి దేవుడు రక్షిస్తాడు. - రష్మిక మందన Happy Diwali / Deepavali you guys! ✨🤍 No crackers..🙅🏻♀️ have lots of sweets today..☺️🤤 stay with family.. 🤗 celebrate.. 🤗 enjoy!! 🪔✨ Stay safe. Stay happy. God bless us all with a safer and a better tomorrow.. ✨ — Rashmika Mandanna (@iamRashmika) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు,- వెంకటేష్ Extending my heartfelt greetings to you and your family! A very Happy Diwali to you and your loved ones.✨💥 Stay safe 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) November 14, 2020 వీరితోపాటు అనపమ పరమేశ్వరన్, చైతన్య అక్కినేని, కీర్తీ సురేష్, వరుణ్ తేజ్, విజయ్ సేతుపతి, రామ్ పోతినేని, రకుల్‌ప్రీత్ సింగ్, కూడా ప్రజలకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Happy Diwali 🪔 pic.twitter.com/YbtZPt9GMW — Anupama Parameswaran (@anupamahere) November 14, 2020 Wishing everyone a safe and happy Diwali ! #LoveStory @Sai_Pallavi92 @sekharkammula @SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic #NC19 pic.twitter.com/8pyaArr4ME — chaitanya akkineni (@chay_akkineni) November 14, 2020 -
లైఫ్ విత్ లక్ష్మీ
నటిగా, నిర్మాతగా, టాక్ షోకి హోస్ట్‌గా.. ఏం చేసినా లక్ష్మీ మంచు ఫుల్ మార్కులు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఓ కొత్త షోను ప్రకటించారు. గురువారం లక్ష్మీ మంచు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె తాజా షో ‘కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు’ని ప్రకటించారు. ఈ షోలో ఆమె íసినిమా, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్ తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇంటర్య్వూ చేయనున్నారు. ఈ షోకి సంబంధించి లక్ష్మీ విడుదల చేసిన ప్రోమోలో రాజమౌళి, తాప్సీ, సెంథిల్ రామమూర్తి, సానియా మీర్జా, ప్రకాశ్ అమృతరాజ్ తదితర ప్రముఖులు కనిపిస్తున్నారు. ఈ షో త్వరలోనే ప్రారంభం కానుందని లక్ష్మీ తెలిపారు. సౌత్ బే సమర్పణలో ఈ షో రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. లాక్డౌన్లో ‘లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు’ పేరుతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు లక్ష్మీ. ఈ లైవ్‌కి మంచి ఆదరణ లభించింది. అలాగే ఇప్పుడు ‘కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు’ షోని అందర్నీ అలరించేలా నిర్వహించడానికి లక్ష్మీ రెడీ అవుతున్నారు. -
రియాకు న్యాయం జరగాలి: మంచు లక్ష్మి
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం కేసులో అందరి వేళ్లు అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తి వైపే చూపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి రియాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగాలని వాదిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆదివారం #JusticeForSushantSinghRajput, #JusticeForRheaChakraborty అంటూ ఓ పోస్ట్ పెట్టారు. "రియా చక్రవర్తిని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఆ తర్వాత దీనిపై స్పందించాలా? వద్దా? అని చాలా ఆలోచించాను. కానీ ఇప్పటికే మీడియా ఆమెను రాక్షసిగా చిత్రీకరిస్తోంది. చాలామంది దీనిపై మౌనంగా ఉన్నారు. నాకు నిజం ఏంటో తెలీదు, కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అదే సమయంలో నిజం ఎలాగైనా బయటకు వస్తుందని నమ్ముతున్నా. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అన్ని రకాల దర్యాప్తు సంస్థలు సుశాంత్‌కు న్యాయం తీసుకువచ్చేందుకు పాటుపడుతున్నాయి. (ఆ రెండు ప్రశ్నలకు రియా సమాధానం?) @sardesairajdeep @Tweet2Rhea @itsSSR . Wake up my industry friends... stop this lynching. #letthetruthprevail pic.twitter.com/5SCEX8Un8H — Lakshmi Manchu (@LakshmiManchu) August 30, 2020 అప్పటివరకు మనమంతా సహనం పాటించాలి. ఇతరులను ద్వేషించడం మానుకోవాలి. నిజానిజాలు తెలుసుకోకుండా ఆమె కుటుంబానిపై నిందలు వేయడం తగదు. మీడియా వల్ల ఆమె కుటుంబం ఎంత బాధపడుతున్నారనేది నేను అర్థం చేసుకోగలను. నాకు కూడా ఇలాంటివి ఎదురైతే ఒక్కసారైనా నా సహచరులు నావైపు నిలబడాలి. నిజం బయట పడేంతవరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి. నేను ఆమెకు మద్దతు ఇస్తున్నాను" అని పేర్కొన్నారు. దీనికి రాజ్‌దీప్ సర్దేశాయ్ స్పందిస్తూ 'గొప్పగా చెప్పారు' అని ట్వీట్ చేశారు. అలాగే హీరోయిన్ తాప్సీ కూడా రిప్లై ఇచ్చారు. "నాకు వ్యక్తిగతంగా సుశాంత్ పెద్దగా పరిచయం లేదు, రియా కూడా అంతగా తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే.. నేరం నిరూపణ అవకముందే ఓ వ్యక్తిని దోషిగా నిలబట్టే ప్రయత్నం చేయడం తప్పు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించండి" అని ట్వీట్ చేశారు. (రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి సైక్లింగ్ ఫోటోలు) -
ఎన్నాళ్లు భయపడుతూ బతుకుతాం
‘‘కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ నాకు హోమ్ క్వారంటైన్‌లా అనిపించలేదు. బాధ్యత లేకుండా నాకు నచ్చినట్టు ఉన్నాను(నవ్వుతూ). మొదటి వారం కొంచెం బోరింగ్‌గా అనిపించింది. దీంతో నాన్న వద్దకు (మంచు మోహన్‌బాబు) వెళ్లిపోయాను. నాన్న స్ట్రిక్ట్.. అందుకే మళ్లీ బాధ్యతగా ఉంటున్నాను’’ అని నటి, నిర్మాత లక్ష్మీ మంచు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడిన విశేషాలు ఈ విధంగా... ► లాక్డౌన్ సమయంలో నాన్న వద్దే ఉన్నాను. కాలేజీ రోజుల తర్వాత నాన్న, అమ్మ, విష్ణులతో ఎక్కువ రోజులు కలిసి ఉన్నది ఇప్పుడే. నచ్చిన వంటలు చేసుకుని తినడం.. నచ్చిన సినిమా చూడటం.. ఇలా ఇంట్లో ఉండి కూడా ఇంత సంతోషంగా ఉండొచ్చా? అనిపించింది. నాన్న, నా కూతురు (విద్యా నిర్వాణ) బాగా అల్లరి చేశారు. నాన్న వద్ద నిర్వాణ ఉంటే నాకు వెంకటేశ్వరస్వామి వద్ద ఉన్నట్టు అనిపించింది. విష్ణు భార్య (విరానికా), పిల్లలు సింగపూర్‌లో చిక్కుకుపోవడం బాధగా అనిపించింది. ► మానవుడు ప్రకృతిని నాశనం చేయడం వల్లే కరోనాలాంటివి వచ్చి హెచ్చరిస్తున్నాయి. మనతో పాటు భూమిపై బతికే హక్కు సకల జీవరాశులకు ఉంది. ప్రపంచం మొత్తం ప్రతి ఏడాదీ ఓ 10 రోజులు పూర్తిస్థాయి లాక్డౌన్ పెట్టాలని కోరుకుంటున్నా. ► ఈ లాక్డౌన్లో స్నేహితుల్ని కలవడం కుదరలేదని మాత్రం అనిపించింది నాకు. అంతేకాదు.. షూటింగ్ సెట్‌ని బాగా మిస్ అయ్యాననిపించింది.. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు’ షో ఐడియా. ఈ షోకి తొలుత రానాని అడగ్గానే ఓకే అన్నాడు. పార్టీలంటే వచ్చే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. కానీ, నేను ఏది అడిగినా రానా కాదనడు. రామానాయుడుగారు చనిపోయిన 10వ రోజే నా ‘దొంగాట’ చిత్రం షూటింగ్లో పాల్గొన్నాడు. నా నిజమైన స్నేహితుడు తనే. ‘లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు’ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శశి థరూర్, రామ్‌గోపాల్ వర్మ, రకుల్... ఇలా చాలా మందితో మాట్లాడాను. ► కరోనా అంటే ముందు భయం ఉండేది.. కానీ ఇప్పుడు లేదు. ఎన్నాళ్లు భయపడుతూ బతుకుతాం. భయంతో జీవితాన్ని గడపాలనుకోవడం లేదు. ప్రతి రోజూ భయపడుతూ బతకొద్దని నాన్నకు చెప్పాను. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను ఎంత అదృష్ణవంతురాలో ఈ లాక్డౌన్ సమయంలో నాన్న వద్ద ఉన్నప్పుడు తెలిసొచ్చింది. ఏదైనా జరిగితే మాకు నాన్న ఉన్నారు? అనే భరోసా. ► లాక్డౌన్ సమయంలో మనం ఇంట్లో ఉన్నా కావాల్సినవి కొనుక్కుని తింటున్నాం. కానీ, చాలా మంది పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కపూట కూడా భోజనం లేకుండా ఇబ్బందులు పడ్డవారు కూడా చాలామంది ఉన్నారు. అది నా మనసును కదిలించింది. ఆ సమయంలో వారికి ఒక్కపూట భోజనం పెట్టినా చాలు అనిపించింది. ఈ సమయంలో మన పిల్లలు ఇంట్లో నుంచే ఆన్లైన్ తరగతులు వింటున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనిపించింది. విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలనే ‘టీచ్ ఫర్ చేంజ్’ కార్యక్రమం చేస్తున్నా. ► ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా తర్వాత ఓ తమిళ సినిమా చేశా. ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ నాకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో ఏ మూవీ ఒప్పుకోలేదు. నేను ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమే.. అయితే నాకు నచ్చిన పాత్రలు రావాలి. నేను చేశానంటే ఆ పాత్రని లక్ష్మి బాగా చేసిందనాలి. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్, సినిమాకి కథలు రెడీ చేసుకుంటున్నా. -
ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మనోజ్
దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేశారు. ఎక్కడైతే ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజు నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ స్పందించారు. ఈ రోజున దిశకు అసలైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..! #JusticeForDisha #Disha #justiceforpriyanakareddy pic.twitter.com/qQ05yD9mo3 — MM*🙏🏻❤️ (@HeroManoj1) December 6, 2019 I do NOT feel bad. I was always against capital punishment but I've changed my mind over the years. Rapists MUST hang! Thank you kcr garu for standing as an example to our nation and showing respect to women! @RaoKavitha @KTRTRS pic.twitter.com/DdXrDmyzSJ — Lakshmi Manchu (@LakshmiManchu) December 6, 2019 చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు దిశ కేసు ఎన్కౌంటర్: ట్రెండింగ్ చేయండి -
పారా అథ్లెట్ల విన్యాసాలు
-
వెబ్ లక్ష్మీ
‘‘మిసెస్. సుబ్బలక్ష్మి’ కథను రమణీగారు నా దగ్గరకు తీసుకొచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. సినిమాగా చేద్దాం అనుకున్నాం. కానీ వెబ్ సిరీస్‌గా తీసుకొస్తున్నాం. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ íసిరీస్‌కి స్త్రీలు, పురుషులు అందరూ సమానంగా కనెక్ట్ అవుతారు’’ అని లక్ష్మీ మంచు అన్నారు. లక్ష్మీ మంచు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వంశీ కృష్ణ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మిసెస్. సుబ్బలక్ష్మి’. రచయిత్రి బలభద్రపాత్రుని రమణి కథను అందించారు. ‘రావల్సినంత ప్రేమ, గుర్తింపు రావడంలేదని, తన లోటు భర్తకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చిన భార్య ప్రయాణంతో సాగే కథే ‘మిసెస్. సుబ్బలక్ష్మి’. ఉమెన్స్ డే సందర్భంగా పది ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ‘జీ5’ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో లక్ష్మీ మంచు మాట్లాడుతూ – ‘‘ సినిమా తీయడానికి సుమారు 150 మంది చాలా కష్టపడతాం. అది పూర్తయి థియేటర్‌కు వెళ్లేటప్పుడు భయమేస్తుంది. ఆ సినిమాను ఆడనిస్తారా? కొత్త సినిమా వస్తుందని తీసేస్తారా? తెలియదు. ఎందుకంటే సినిమా థియేటర్లు కొంతమంది ఆధీనంలోనే ఉంటున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆడియన్స్‌కు కావల్సిన వినోదాన్ని అందించవచ్చు. ఎలాంటి ప్రయోగం అయినా చేయొచ్చు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంట్లోనే ఇస్తున్నాం. వంశీ కృష్ణ మంచి సహకారం అందించాడు. వెబ్ సిరీస్‌లలో ఇది ఒక బెంచ్‌మార్క్ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘మంచు లక్ష్మిగారు చాలా రోజులుగా ఈ వెబ్ సిరీస్‌తో ట్రావెల్ అవుతున్నారు. ఈ సిరీస్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం’’ అన్నారు వంశీకృష్ణ. ‘‘అనుకున్న పాయింట్‌ను సరదాగా చెప్పాం. సీక్వెల్ ప్లాన్ కూడా ఉంది’’ అన్నారు బలభద్రపాత్రుని రమణి. -
పాటల్లేని సినిమాకు మ్యూజిక్ చేయమన్నారు..!
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో విజయ్ ఎలకంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రఘు తొలిసారిగా తెలుగు సినిమాకు సంగీతమిస్తుండటంపై తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. పెళ్లిచూపులు సినిమా నచ్చటంతో తరుణ్ భాస్కర్‌ను అభినందిస్తూ మెసేజ్ చేశాను. అలా తరుణ్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. తరుణ్ కామన్ ఫ్రెండ్ వల్ల వైఫ్ ఆఫ్ రామ్ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. వైఫ్ ఆఫ్ రామ్ సినిమాకు సంబంధించి తొలిసారిగా దర్శకుడు విజయ్ను కలిసినప్పుడు సినిమాలో పాటలు లేవు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఇస్తే చాలన్నారు. ఎక్కువగా మెలోడియస్, యూత్‌ఫుల్ సాంగ్స్ చేసే నాకు ఈ సినిమాకు వర్క్ చేయటం చాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా నాలుగు బాలీవుడ్ సినిమాలతో పాటు పలు కన్నడ, మలయాళ చిత్రాలకు పనిచేశాను. తెలుగులో గాయకుడిగా దేవీ శ్రీ ప్రసాద్, తమన్, హిప్ హాప్ తమిళ లాంటి సంగీత దర్శకులతో కలిసి ఆరు పాటలు పాడాను. భాషా పరంగా వర్కింగ్ స్టైల్లో మార్పేమి ఉండదు. కేవలం దర్శకుడి అభిరుచి మేరకే సంగీతమిస్తాం. విజయ్ నాతో చాలా డిఫరెంట్ మ్యూజిక్ చేయించారు. ఎక్కడా కమర్షియాలిటీ లేకుండా తక్కువ సౌండ్‌తో కొత్తగా ప్రయత్నించాం. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. సినిమాకు కథే మూలం. సంగీతానిది రెండో స్థానమే. కథ బాగుంటే అందుకు తగ్గ సంగీతం అదే వస్తుంది. నా వంతుగా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నించాను. తెలుగు నేటివిటీకి తగ్గ సంగీతాన్ని అందించేందుకు డైరెక్టర్ విజయ్ సహాయం చేశారు. ఎప్పుడూ సంగీత దర్శకుడిని అవుతాననుకోలేదు. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. చాలాఏళ్లు భరతనాట్యం నేర్చుకున్నా.. తరువాత సైంటిస్ట్ గా వర్క్ చేశా.. కానీ టైం నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌ను చేసింది. ప్రస్తుతం సంగీతం తప్ప మరో ఆలోచనే లేదు. గాయకుడిగా కంటే కంపోజర్‌గానే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను. ఇతర సంగీత దర్శకుల కోసం పాటలు పాడేప్పుడు పెద్దగా సలహాలేమి ఇవ్వను. కంపోజర్ ఆలోచనకు తగ్గట్టుగా పాడేందుకు ప్రయత్నిస్తా. చాలా కాలంగా టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా వైఫ్ ఆఫ్ రామ్ టాలీవుడ్లో నా తొలి చిత్రం. అందరికి నచ్చుతుందరని ఆశిస్తున్నాను. -
మంచుతో మనం..
-
మంచు లక్ష్మిపై రేణూ దేశాయ్ పోస్ట్.. వైరల్
సాక్షి, హైదరాబాద్: సేవా కార్యక్రమాలు చేసే నటి మంచు లక్ష్మిని మరోనటి, దర్శకురాలు రేణూ దేశాయ్ ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి లక్ష్మి చాలా కృషి చేస్తున్నారని రేణు కొనియాడారు. ఆమెతో కలిసి ఓ మంచి పనిలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్లో రేణు ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ‘మేము సైతం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ షోలో రేణు పాల్గొన్నారు. ఎలాంటి నగదు తీసుకోకుండా అవసరాల్లో ఉన్న వారి కోసం పనిచేయడం తృప్తి నిచ్చిందన్నారు. ‘బొమ్మలు అమ్మి 30 వేల రూపాయాలు సంపాదించా. వాటికి మరో 20 వేల రూపాయలు కలిపి ఇచ్చాను. ఆ నగదుకు మంచు లక్ష్మి మరో లక్ష రూపాయలు జత చేశారు. 35 మంది విద్యార్థుల చదువు కోసం 1.5 లక్షల రూపాయలు లక్ష్మి విరాళంగా ఇచ్చేశారు. అవసరాల్లో ఉన్న వారికి మీకు తోచినంతలో సాయం చేయండి. మహిళల చదువు, ఆహారం, వైద్య సదుపాయాల కోసం సాయం అందించాలి. మీరు ఇచ్చే చిన్నమొత్తం అయినా వేరొకరి జీవితాల్లో అది ఎంతో పెద్ద విషయమంటూ’ నటి రేణూ తన పోస్టులో పేర్కొన్నారు. హ్యుమానిటీ, రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబుల్ సిటిజన్, బీయింగ్ హ్యుమన్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో రేణు చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
'తారా'భరణం..
-
మంచులక్ష్మితో ఫైర్ సైడ్ చాట్ షో
డల్లాస్ : డల్లాస్ మహానగరంలో ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మంచులక్ష్మితో ఫైర్ సైడ్ చాట్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచులక్ష్మి తాను మేముసైతం ప్రోగ్రాం ద్వారా చేస్తున్న సమాజసేవని వివరించారు. ఒక మహిళ నేటి సమాజంలో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నా, ఒకనటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా నిలవడం ఎంత కష్టమో అని ఒకనటిగా, నిర్మాతగా, సంఘ సేవకురాలిగా చెప్పారు. మహిళకు అన్నిరంగాలలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని కాని వాటినన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవాలని అక్కడికి వచ్చిన మహిళలను లక్ష్మీ ఉత్తేజపరిచారు. మంచులక్ష్మి తన సమయాన్ని కేటాయించి మహిళను సమాజంలో వివిధ రంగాలలో రాణించాలని ప్రోత్సహించడంతో పాటుగా, తను చేస్తున్న సామాజిక సేవని గుర్తించి ఉత్తర టెక్సాస్‌లో తెలుగు సంఘం, నాటా వారు ఆమెను పుష్పగుచ్చాలు, పీఠికలు, సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి డల్లాస్‌లో తెలుగు వారు సుమారుగా 500 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు వారికి, మీడియా వారికి, ఆతిధ్యమిచ్చిన హిల్‌టాప్ ఇండియా న్రెస్టారెంట్వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాటాఎలెక్ట్ ప్రెసిడెంట్ కొర్సాపాటి శ్రీధర్ రెడ్డికి, మిగిలిన కార్యవర్గ, పాలక మండలి సభ్యులకు ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు. -
మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ సినీ నటుడు ఎం. మోహన్‌బాబు.. రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో రెండో రోజు శుక్రవారం ‘ఫాదర్ టు డాటర్: ది డీఎన్ఏ ఆఫ్ యాక్టింగ్’ పేరుతో జరిగిన సెషన్లో తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాలు, రాజకీయాలు వేర్వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. ‘నా స్నేహితుడు, నాకు అన్న అయిన ఎన్టీ రామారావు గారు మంచి వ్యక్తి. లంచం అంటే ఏమిటో కూడా ఆయనకు తెలియదు. ఆయన నన్ను రాజ్యసభకు పంపారు. ఎటువంటి మచ్చ లేకుండా నా పదవీ కాలాన్ని పూర్తిచేశాను. 95 శాతం మంది పొలిటీషియన్లు రాస్కెల్స్. ప్రజలకు ఎన్నో హామీలిస్తున్నారు. వీటిని నిలబెట్టుకునేవారెవరు? రాజకీయ నేతలు మాట నిలబెట్టుకునివుంటే ఇండియా ఇంకా మంచి స్థానంలో ఉండేద’ని మోహన్‌బాబు అన్నారు. కింగ్ కాదు.. కింగ్‌మేకర్: మంచు లక్ష్మీ తన తండ్రి కింగ్‌లా కాకుండా కింగ్మేకర్లా ఉండాలని కోరుకున్నారని మంచు లక్ష్మీ వెల్లడించారు. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఆయన నైజమని చెప్పారు. ‘ఆయన కింగ్‌మేకర్. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారి తరపున ప్రచారం చేసి గెలిపించారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో చాలా మంది ఆయనకు తెలియదు. అయినప్పటికీ భయపడకుండా తన మనసులో ఉన్నది వెల్లడించడానికి ఆయన సంకోచించలేద’ని లక్ష్మీ మంచు అన్నారు. -
వైఫ్ ఆఫ్ రామ్
వినూత్న క్యారెక్టర్లు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మీ మంచు. ప్రస్తుతం ‘వైఫ్ ఆఫ్ రామ్’ అనే సినిమాతో మరో కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో అబద్ధాన్ని నిజమని నమ్మే పాత్రలో కనిపిస్తారట లక్ష్మి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ‘ఈగ’, ‘బాహుబలి 1’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన విజయ్ యలకంటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంగీతం: రఘు దీక్షిత్, కెమెరా: సామల భార్గవ్, మాటలు: సందీప్ గుంటా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుహాసిని రాహుల్. -
లక్ష్మీస్ సెలబ్రేషన్
-
టెక్నాలజీని ఆమె బాగా వాడారు.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ అయిన ఓ వీడియో వైరల్ గా మారింది. పైగా సెలబ్రిటీల మనసు దోచుకుంటోంది. 'నాన్నకు ప్రేమతో' మూవీలో 'ఐ వాన్నా ఫాలో ఫాలో యూ..' అనే పాటలో హీరో ఎన్టీఆర్ ఓ హోవర్ బోర్డుపై కదలడం చూశారు కదూ. అయితే అంతగా ఈ టెక్నాలజీ మనకు అందుబాటులోకి రాకున్నా ఓ ప్రాంతంలో మాత్రం ఈ హోవర్ బోర్డును ఓ మహిళ వినూత్నంగా ఉపయోగించారు. అలాగని తారక్ లాగ రోడ్లపై ఆమె ముందుకు సాగిపోలేదు. ఓ మహిళ హోవర్డ్ బోర్డుపై కూర్చుని తన ఇంటి ఆవరణలో శుభ్రం చేస్తుంటే ఆమె సన్నిహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక క్షణాల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. 'టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించారు. భారత్ ముందుకెళ్తుంది, మాడ్రన్ టైమ్స్ అంటూ' నటి మంచు లక్ష్మీ కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు. డిజిటల్ ఇండియా అంటే ఇదేనేమో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో అంతగా ఆకట్టుకుంటోంది. Technology used at its best! 😎 Totally made my day.. 🤣 #ModernTimes #AageBadhRahaIndia pic.twitter.com/WU99DtgJaV — Lakshmi Manchu (@LakshmiManchu) 4 October 2017 -
టెక్నాలజీని ఆమె బాగా వాడారు.. వైరల్ వీడియో
-
నిజం అని నమ్మి..!
ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, దొంగాట’ వంటి చిత్రాల్లో నటించి, నిర్మాతగానూ వ్యవహరించారు లక్ష్మీ మంచు. తాజాగా మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆమె ప్రధానపాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న కొత్త సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా విజయ్ యలంకంటిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. హీరో మంచు మనోజ్, ఆయన భార్య ప్రణతి, మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ స్క్రిప్ట్‌ని లక్ష్మీ, విజయ్‌లకు అందించారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘నిజం కాని విషయాన్ని నిజమని భావించే ఓ యువతి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎమోషన్స్, రిలేషన్షిప్స్ చుట్టూనే కథంతా తిరుగుతుంది. ‘ఈగ, బాహుబలి–1’ సినిమాలకు రాజమౌళి గారి దగ్గర విజయ్ అసిస్టెంట్ డైరక్టర్‌గా చేశాడు. ఈ సినిమా కాకుండా ఓ వెబ్ సిరీస్‌ను కూడా మొదలుపెట్టబోతున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సుహాసిని, లత. -
మగాళ్లకూ కష్టాలున్నాయి
ఆడ, మగ తేడాలతో సమాజం వివక్ష చూపిస్తోంది. ఈ వివక్ష నచ్చడం లేదు. వంటింట్లో మహిళలు, బయట మగవాళ్లు కష్టపడుతున్నారు. భార్యకు నగలు, చీరలు, పిల్లల స్కూల్ ఫీజులు, పెట్రోల్ బిల్లు... మగాళ్లకూ ఎన్నో కష్టాలున్నాయి. మహిళల బాధలు వేరు, మగవాళ్ల బాధలు వేరు. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు ప్రతి సమస్యనూ రెండు కోణాల్లో చూడాలి. సమస్య ఉందని అమ్మాయిని బయటకు వెళ్లొద్దని చెప్పొద్దు. జాగ్రత్తగా ఉండమని చెప్పం . మహిళల పట్ల ఎలా మసలుకోవాలో మగవాళ్లకు అమ్మలే నేర్పించాలి. నిజానికి విమెన్స్ డే ఈజ్ క్రాప్. (ఈ మహిళా దినోత్సవం అనేది అనవసరమైన ఆలోచన). అన్ని రోజులూ మహిళలకు మంచి చేయాలనుకుంటే చాలు. -
మంచు లక్ష్మితో రాములమ్మ... - దాసరి
‘‘మంచు లక్ష్మి స్పాంటేనియస్ యాక్టర్. నటిగానే కాదు, సామాజిక సేవలోనూ ముందుంది. ‘ప్రేమమ్’ ప్రచార చిత్రాలు చూసి పెద్ద హిట్టవుతుందని చెప్పా. ఆ సినిమా రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడీ ‘లక్ష్మీబాంబ్’ ప్రచార చిత్రాలు చూస్తుంటే సేమ్ ఫీలింగ్. ఈ ట్రైలర్ చూడగానే లక్ష్మితో రాములమ్మ తరహా సినిమా చేయాలనిపించింది. దీపావళికి ‘లక్ష్మీబాంబ్’ పేలనుంది’’ అని దర్శకరత్న దాసరి అన్నారు. మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రధారిగా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మించిన సినిమా ‘లక్ష్మీబాంబ్’. సునీల్ కశ్యప్ స్వరపరచిన పాటల సీడీలను దాసరి విడుదల చేసి, నటుడు-నిర్మాత మోహన్‌బాబుకు అందజేశారు. ‘‘గుండెల్లో గోదారి’లో లక్ష్మి చక్కగా నటించింది. ఇందులో ఇంకా బాగా చేసింది’’ అని మోహన్‌బాబు అన్నారు. ‘‘ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌తో పాటు బాగా డ్యాన్సులు చేశా. టీమ్ అంతా కష్టపడి చేశారు. నిర్మాతలు రాజీ పడలేదు’’ అన్నారు మంచు లక్ష్మి. దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. చిత్ర సమర్పకులు గునపాటి సురేశ్‌రెడ్డి, దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ, సునీల్ కశ్యప్ పాల్గొన్నారు. -
విశాఖలో వైభవంగా...
నటుడిగా నలభై వసంతాల చరిత్ర మోహన్‌బాబుది. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు.నటనలోనూ, డైలాగులు చెప్పడంలోనూ మోహన్‌బాబుది ప్రత్యేకమైన శైలి. ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా, నిర్మాతగా పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. అంతకు మించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మోహన్‌బాబు నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి సెప్టెంబర్ 17న విశాఖలో ఘనంగా వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మోహన్‌బాబు వారసులు మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు ఆ మధ్య ఎంబిః40 పేరుతో నలభై వసంతాల తండ్రి నట జీవితాన్ని సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. -
'లక్ష్మీబాంబు' కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది
మంచు లక్ష్మి.. టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. విభిన్నమైన పాత్రలతో వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం 'లక్ష్మీ బాంబు' అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది లక్ష్మి. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మంచు లక్ష్మి ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనుందట. ఆమె ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా, లక్ష్మీ బాంబు టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం ఖాయం, ఈ సినిమాతో స్త్రీ ప్రధాన పాత్రలుగా వచ్చే సినిమాల పంథా మారుతుందని ఆమె అభిప్రాయపడింది. దీపావళి కానుకగా 'లక్ష్మీబాంబు'ను విడుదల చేయాలని ప్లాన్‌లో ఉంది చిత్ర యూనిట్. -
రెస్టారెంట్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మీ
హైదరాబాద్: నటిగా, యాంకర్ గా, వ్యాపారవేత్తగా ఆమె ఎన్నో రంగాలలో మంచు లక్ష్మీప్రసన్న తనదైన ముద్రవేశారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మీప్రసన్న నటనతో ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశారు. భర్త ఆండీ శ్రీనివాసన్‌తో కలిసి మంచు లక్ష్మీ ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. ఆండీ శ్రీనివాసన్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ దంపతులు ఓ రెస్టారెంట్ ను 'జూనియర్ కుప్పన్న' పేరుతో హైటెక్ సిటీలో స్టార్ట్ చేశారు. అయితే ఈ హోటల్స్ ఇప్పటికే గ్రూపులుగా ఉన్నాయని, తమిళనాడు, కర్ణాటకలో బ్రాంచులు ఉన్నట్లు సమాచారం. ప్రధాన బ్రాంచులు తమిళనాడులో ఉన్నాయి. మంచు మోహన్ బాబు తన కుటుంబంతో కలిసి రెస్టారెంటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. విష్ణు దంపతులు వారి పిల్లలు, మంచు మనోజ్ దంపతులు, లక్ష్మీ, ఆండీ ఇతర కుటుంబసభ్యులు మనకు ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. తమ సోదరి ఈ వ్యాపారంలో రాణించాలని సోదరులు విష్ణు, మనోజ్ లు లక్ష్మీ దంపతులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆండీ దంపతులను మోహన్ బాబు ఆశీర్వదించారు. పిల్లలతో సహా మంచు వారి కుటుంబసభ్యులు ఒకేచోట చేరడంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. -
'ముంబైలో నివసించడం మానేశారా?'
'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదం బాలీవుడ్, సెన్సార్ బోర్డు మధ్య చిచ్చు రాజేసింది. సెన్సార్ బోర్డు సినిమాలో మొత్తం 89 సీన్లను కట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు బాలీవుడ్ బాసటగా నిలిచింది. అలానే ఇటు టాలీవుడ్ లో కూడా పలువురు సినీ ప్రముఖులు సెన్సార్ బోర్డు తీరుపై మండి పడుతున్నారు. సినిమా పేరు మార్చాలన్న అంశంపై రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. 'నేను పంజాబీనే. మనం సినిమాని సినిమాలా చూడాలి. సినిమా విడుదల తర్వాత కూడా పంజాబీలు పంజాబ్ లోనే ఉంటారు, రాష్ట్రాన్ని ఇంతకు ముందులానే ప్రేమిస్తారు. ముంబై టెర్రరిజమ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతమాత్రాన ప్రజలు ముంబైలో నివసించడం మానేశారా' అంటూ ప్రశ్నించారు. నిజంగా సినిమాల్లో అలాంటివేమైనా చూపిస్తే.. అవి ప్రజలకు అవగాహనను కల్పిస్తాయన్నారు. వివాదంపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. సినిమాలు భావ వ్యక్తీకరణ మాధ్యమాలు. మన హక్కును కాపాడుకునేందుకు గొంతు ఎత్తాల్సిందేనన్నారు. సెన్సార్ కు ముందు, తర్వాత అంటూ ఓ హాస్యాస్పదమైన ఫొటోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీరితోపాటు రాఘవేంద్రరావు కోడలు, రచయిత కణిక, హీరో సిద్ధార్థ్, డైరెక్టర్ దేవా కట్ట తదితరులు సోషల్ మీడియా ద్వారా 'ఉడ్తా పంజాబ్' చిత్ర యూనిట్ కు మద్దతుగా నిలిచారు. వాస్తవానికి సినిమా ఈ నెల 17న విడుదల కావాల్సి ఉంది. సినిమాలో ముఖ్యమైన సీన్లను కట్ చేసి సెన్సార్ బోర్డు నియంతలా వ్యవహరిస్తోందని సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. మొత్తానికి బాలీవుడ్ లో ఈ వివాదం మరింత జటిలంగా మారుతుంది. -
హాలీవుడ్ చిత్రంలో..
‘లాస్ వెగాస్’, ‘బోస్టర్ లీగల్’, ‘డిస్పరేట్ హౌస్‌వైఫ్స్’ లాంటి అమెరికన్ టీవీ సిరీస్‌లలో నటించిన లక్ష్మీ ప్రసన్న ఆ తర్వాత నిర్మాతగా, నటిగా టాలీవుడ్లో బిజీ అయిపోయారు. కొంత గ్యాప్ తర్వాత ఆమె హాలీవుడ్‌కి వెళ్లారు. ‘బాస్మతి బ్లూస్’ టైటిల్‌తో రూపొందిన హాలీవుడ్ చిత్రంలో నటించారామె. ఇందులో సీత అనే అమ్మాయి పాత్ర చేశారు లక్ష్మీప్రసన్న. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకున్న బ్రీ లార్సెన్, డోనాల్డ్, స్కాట్ బకుల ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. డాన్ బ్యారెన్ దర్శకుడు. ఇండియాకు వచ్చిన ఓ సైంటిస్ట్ జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే జరుపుకుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. -
బూమ్ బూమ్... భలే గేమ్!
ఏ షో అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ప్రేక్షకులకి నచ్చే ఎలిమెంట్లు ఉన్నప్పుడు. అయితే ఎలిమెంట్లు ఉంటే సరిపోతుందా? లేదు... షోని అందంగా, ఆసక్తికరంగా నడిపించే హోస్ట్ ఉండాలి. మాటలను వరదలా పారించాలి. మాట్లాడే ప్రతి మాటా ప్రేక్షకుడికి నచ్చాలి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేయాలి. అలా చేయడంలో నూరుశాతం సక్సెస్ అయ్యారు మంచు లక్ష్మీప్రసన్న. ‘బూమ్ బూమ్’ అనే గేమ్‌షోని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారామె. వారానికో సెలెబ్రిటీని పిలిచి, వారిని ఆడించి, వారిచేత ఆసక్తికరమైన విషయాలు చెప్పించి, టెన్షన్ పెట్టి, సందడి చేసి... షోకి ఎన్ని రకాల ప్లస్సులు యాడ్ చేయగలరో అన్నీ చేస్తున్నారు. ‘బూమ్ బూమ్... ఇట్స్ ఎన్ ఎక్స్‌ప్లోజివ్ గేమ్ షో’ అని అనడంలోనే ఆమె స్టయిల్ అంతా కనిపిస్తోంది. షో నడిచినంతసేపూ ప్రేక్షకుడు చానెల్ మార్చడం లేదంటే ఆ ఘనత కచ్చితంగా లక్ష్మిదే. అందుకే అది ఆమె షో! -
తమ్ముడికి వెరైటీగా విషెస్ చెప్పిన మంచు లక్ష్మి
హైదరాబాద్: తన సోదరుడు మంచు విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సోదరి మంచు లక్ష్మి విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తమ్ముడి చంక ఎక్కి మరీ బర్త్ డే విషెస్ చెప్పారు. తమ్ముడిపై తనకున్న అపారమైన అనురాగాన్ని ఇలా వ్యక్తం చేశారామె. ఇక అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలను చూసి వారి తల్లి నిర్మల ఎంతో మురిసిపోయారు. ఈ ఫోటోను లక్ష్మి తన ట్విటర్ పేజీలో పోస్టు చేశారు. విష్ణు తనకు సోదరుడి కన్నా ఎక్కువని, తండ్రి లాంటివాడని ఆమె పేర్కొన్నారు. అతడు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. నేడు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త సినిమా 'సరదా'గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో విష్ణు సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు. -
లక్ష్మి మంచు 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు'
చెన్నై: లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి కార్యక్రమాలతో బుల్లితెరపై తన ప్రత్యేకతను నిలుపుకున్న నటి, నిర్మాత లక్ష్మి మంచు మళ్లీ మరో కొత్త టీవీషోతో మెరవనున్నారు. 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు' అనే కార్యక్రమంతో బుల్లితెర పునఃప్రవేశానికి సిద్ధమవుతున్నారు. బుల్లితెరపై పునఃప్రవేశానికి తాను ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు లక్ష్మి మంచు చెప్పారు. తన మునుపటి కార్యక్రమాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. అద్భుతమైన ఈ అవకాశం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఈ షోకు కావలసిన సెట్ పని జరుగుతోందన్నారు. ఈ నెల 25 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రముఖ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్లో జూన్ 1 నుంచి ఈ షో ప్రారంభమవుతుందని లక్ష్మి మంచు చెప్పారు. -
రామ్‌గోపాల్ వర్మను డెరైక్ట్ చేయమంటే కుదరదన్నారు!
‘‘ఈ చిత్రాన్ని రామ్‌గోపాల్ వర్మ డెరైక్షన్‌లో చేయాలనుకున్నాను. ఆయనను అడిగితే, ఇది తన జానర్ సినిమా కాదని నిరాకరించారు. ఆ తర్వాత వంశీకృష్ణను అడిగాను. ఎప్పట్నుంచో తను నాకు ఫ్రెండ్. దర్శకుడిగా మొదటి సినిమా నాతోనే చేస్తానన్నాడు. అలానే చేశాడు. ఈ చిత్రాన్ని వంశీ బాగా తీస్తాడననుకున్నాను కానీ, ఇంత బాగా తీస్తాడని మాత్రం అనుకోలేదు’’ అని మంచు లక్ష్మి అన్నారు. విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నటించి, నిర్మించిన చిత్రం ‘దొంగాట’. అడివి శేష్, మధు నందన్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ నెల 8న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ - నాగార్జున, రవితేజ, మనోజ్, నాని, రానా, సుశాంత్, సుదీప్, నవదీప్, శింబు, తాప్సీ నటించిన పాట ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా ద్వితీయార్ధంలో నా పుట్టినరోజు సందర్భంగా వచ్చే పాట ఇది. నేను పాడిన ‘ఏందిరో..’ పాటకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఓ హీరోయిన్ని కిడ్నాప్ చేస్తారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రం తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించబోతున్నాననీ, అతను దర్శకత్వం వహించిన ‘సైన్మా’ అనే లఘు చిత్రం చూసి, అవకాశం ఇస్తున్నాననీ లక్ష్మి తెలిపారు. -
ఇది ఓ నిజ జీవిత కథే : మన్మోహన్
‘‘ఎనిమది సంవత్సరాల అబ్బాయికీ, తన కుటుంబానికి జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకె క్కించాం. ట్రైలర్ చూసి చాలా మంది హార్రర్ చిత్రం అనుకున్నారు కానీ ఇదొక కుటుంబ కథాచిత్రం ’’ అని మన్మోహన్ అన్నారు. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో మన్మోహన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బుడుగు’. భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మాస్టర్ ప్రేమ్‌బాబుకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తల్లి పాత్రలో లక్ష్మి మంచు చాలా బాగా నటించారు. అనుకున్నదానికన్నా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది ’’ అన్నారు. -
శబ్దం... శక్తిమంత్రం
సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org నాదయోగం పాథమికంగా ఈ అస్థిత్వంలో మూడు శబ్దాలు ఉన్నాయి. ఏ ఇతర శబ్దాన్నైనా ఈ మూడు శబ్దాలతో సృష్టించవచ్చు. ఒక చిన్న ప్రయోగంతో మీరు దీన్ని గమనించవచ్చు. నాలుకను వాడకుండా మీరు చేయగలిగిన శబ్దాలను చేయండి. నాలుకను వాడకుండా మీరు చేయగలిగే శబ్దాలు మూడే అని మీరు గమనిస్తారు. అవే ఆ, ఊ,మ్లు. మీ నాలుకను కోసేసుకున్నా మీరు ఈ మూడు శబ్దాలు చేయగలరు. వేరే ఏ శబ్దం చేయాలన్నా మీకు నాలుక వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ మూడు శబ్దాలను మీరు మీ నాలుకతో అనేక విధాలుగా కలిపి ఇతర అన్ని శబ్దాలను సృష్టించగలుగుతున్నారు. మీరు మీ నోటితో మిలియన్ శబ్దాలను సృష్టించగలరు. కానీ ఒక మూగ వ్యక్తి ఆ, ఊ, మ్ శబ్దాలను మాత్రమే చేయగలడు. ఈ మూడు శబ్దాలను కలిపి ఉచ్ఛరిస్తే ఏమి వస్తుంది? ఆమ్ (ఓం) వస్తుంది. ఆమ్ (ఓం) ఒక మతం యొక్క ట్రేడ్ మార్క్ (వ్యాపార చిహ్నం) కాదు. అది ఈ అస్థిత్వపు ప్రాథమిక శబ్దం. శివుడు కేవలం మూడుసార్లు ‘ఆమ్ (ఓం)’ అని ఉచ్ఛరించి ఒక కొత్త ఉనికిని సృష్టించగలడని అంటారు. ఇది నిజం కాదు. కానీ సత్యం! సత్యానికి, నిజానికి మధ్య తేడా ఏమిటి? ఉదాహరణకు ఒక స్త్రీని తీసుకుందాం. ఒకరు శారీరకంగా ‘స్త్రీ’ అయినంత మాత్రాన, ఆమె తండ్రి ఆమె పుట్టుకలో పాలుపంచుకోలేదా? దానర్థం ఆమెలో తన తండ్రి అంశ లేదనా? కాదు. నిజం ఏమిటంటే ఆమె ఒక స్త్రీ. కానీ సత్యం ఏమిటంటే ఆమెలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉన్నారు. అలాగే శివుడు ఎక్కడో కూర్చుని ఆమ్ (ఓం) అని ఉనికిని సృష్టిస్తాడని కాదు. అది కాదు విషయం. విషయం ఏమిటంటే ప్రతిదీ ఒక ప్రకంపనే! మంత్రం అంటే ఒక శబ్దం. ఒక ఉచ్ఛారణ లేక ఒక అక్షర ధ్వని. నేడు ఆధునిక విజ్ఞానం ఈ అస్థిత్వం మొత్తాన్ని ఒక శక్తి ప్రకంపనగా, వివిధ స్థాయిల్లో ఉన్న ప్రకంపనగా చూస్తుంది. ఎక్కడైతే ప్రకంపనం ఉంటుందో అక్కడ శబ్దం ఉండి తీరుతుంది. అంటే ఈ మొత్తం అస్థిత్వం ఒక రకమైన శబ్దమని లేదా శబ్దాల సంక్లిష్ట సమ్మేళనమని లేక అనేక మంత్రాల సమ్మేళనమని అర్థం. వీటిలో కొన్ని మంత్రాలు లేక శబ్దాలు గుర్తించబడ్డాయి. వీటిని ఒక నిర్దిష్ట విధానంలో ఉపయోగిస్తే, అవి మీలోని ఒక భిన్న జీవిత పార్శ్వాన్ని తెరచి, మీకో భిన్న అనుభూతిని అందించగలిగే తాళంచెవిగా మారతాయి. మంత్రాలు చాలా మంచి సన్నాహక ప్రక్రియలు కాగలవు. కేవలం ఒక్క మంత్రమే మనుషులపై ఎంతో మహత్తరమైన ప్రభావాన్ని చూపగలదు. కానీ ఆ మంత్రం శబ్దాలన్నింటి గురించి, ఈ సృష్టినంతటి గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన ఒక మూలం నుంచి వచ్చినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. అటువంటి మూలం నుంచి, అటువంటి అవగాహన నుంచి ఒక మంత్రం వస్తే... దాంతో పాటు అది స్వచ్ఛంగా అందించబడినప్పుడు, అది ఒక సమర్ధవంతమైన శక్తి కాగలదు. ప్రేమాశీస్సులతో,సద్గురు -
కితకితలు పెట్టే పాత్ర నాది! - అడివి శేష్
కర్మ’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అడివి శేష్. ‘పంజా’ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత చాలా ‘బలుపు, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మన్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దొంగాట’. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘ నేను చేసిన వెంకట్ పాత్రలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి . చాలా కొత్తగా అనిపించింది. వెంటనే ఈ ఆఫర్‌కు ఒప్పుకున్నా. మొదట ఈ పాత్ర వేరే వాళ్ల కోసం అనుకున్నారు. కానీ ఫైనల్‌గా నాకే దక్కింది. కన్ఫ్యూజన్ లోంచి పుట్టే కామెడీ ప్రేక్షకులకు కితకితలు పెడుతుంది. మొదటి సినిమా అయినా వంశీ చాలా బాగా తీశారు. లక్ష్మీ మంచు నాకు మంచి స్నేహితురాలు. షూటింగ్ కూడా చాలా సరదా సరదాగా గడిచిపోయింది. ‘బాహుబలి’ సినిమా మొదటి భాగంలో కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటాను కానీ నా కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుందీ సినిమా. ప్రస్తుతం పీవీపీ బ్యానర్లో ‘క్షణం’ అనే సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నా’’ అని చెప్పారు. -
కడుపుబ్బా నవ్వించేలా.....!
ప్రతి క్షణం ప్రేక్షకులను కడుపుబ్బా న వ్వించేలా, కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. సూర్యతేజ, హర్షిక జంటగా జంపా క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్‌కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఆర్ విష్ణు దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీ మంచు ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ- ‘‘మొదటి సినిమా చేసేటప్పుడు ఎంత టెన్షన్‌గా ఉంటుందో నాకు తెలుసు. ఈ చిత్రం ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది. ఓ మంచి సినిమా తీస్తున్న చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్’’ అని చెప్పారు. ఈ సినిమాలో నరేశ్‌గారు ఫుల్ లెంగ్త్ కామెడీ చేయడం చాలా ఆనందంగా ఉందనీ, కచ్చితంగా అందరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉందని దర్శక , నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్, ఛాయాగ్రాహకుడు పీసీ ఖన్నా, కథా రచయిత బ్రహ్మారెడ్డి కమతం తదితరులు పాల్గొన్నారు. -
గొంతు సవరించుకున్నదోచ్!
నటి మంచు లక్ష్మీ ప్రసన్న మరోసారి వార్తల్లోకి వచ్చారు. టీవీలో, సినిమాలో నటన, చిత్ర నిర్మాణం తరువాత ఇప్పుడు ఆమె గాయని అవతారం ఎత్తారు. త్వరలో విడుదల కానున్న ‘దొంగాట’లో ఆమె ఒక పాట పాడారు. వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రంలో రఘు కుంచె సంగీతం అందించగా, వరికుప్పల యాదగిరి రాసిన పాటకు లక్ష్మీ ప్రసన్న గళమిచ్చారు. ‘‘ఆ పాట నేనే పాడాలని మా చిత్ర యూనిట్ అంతా అన్నారు. సంగీత దర్శకుడు రఘు కూడా నేనే పాడాలని పట్టుబట్టారు. నేను పాడగలనని బలంగా నమ్మారాయన’’ అని లక్ష్మీ ప్రసన్న ఆనందంగా చెప్పారు. నిజానికి, మూడేళ్ళ క్రితం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోనే ఈ బహుముఖ నటి పాడాల్సి ఉంది. ఆ చిత్రంలోని ‘డిస్ట్రబ్ చేస్తున్నాడే దేవుడు...’ పాట పాడించాలని రఘు ప్రయత్నించారట. కానీ, కుదరలేదు. కాగా, ఇప్పుడు ‘తీన్మార్’ తరహాలో సాగే ఈ పాటను నాలుగే నాలుగు గంటల్లో రికార్డింగ్ పూర్తి చేశారు లక్ష్మీ ప్రసన్న. అలా తొలిసారిగా సినిమాల కోసం గొంతు సవరించుకున్నారు. ‘‘నేను సినీ నేపథ్యగాయనిని అయితే చూడాలని మా నాన్న కోరిక. ఎన్నో ఏళ్ళ తరువాత ఇప్పుడాయన కోరిక నెరవేరింది’’ అని ఆమె చెప్పారు. నిజజీవితంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్న లక్ష్మీ ప్రసన్న తాజా సినీ గానం విని ఆమె కుటుంబమంతా సంగీత దర్శకుడికి ఫోన్ చేసి మరీ, ప్రత్యేకంగా అభినందిస్తున్నారట! -
కన్నీరు పెట్టిన మంచు లక్ష్మి!
మంచు వారి ఆడపడుచు లక్ష్మీప్రసన్నకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. బంధాలు, అనుబంధాలను ఆమె చక్కగా పాటిస్తుంటారు. అందులోనూ తన తమ్ముళ్లంటే ఆమెకు ఎనలేని అభిమానం. విష్ణుకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలను కూడా ఎక్కువగా ఆమే చూస్తుంటారు. అలాంటి లక్ష్మి.. తన తమ్ముడు మనోజ్ నిశ్చితార్థం జరుగుతుంటే.. సంతోషం పట్టలేక కన్నీరు పెట్టారట. తీవ్ర భావోద్వేగానికి గురైన లక్ష్మి.. తన ఆనందబాష్పాలను ఆపుకోలేకపోయారు. ప్రణతిరెడ్డితో తన తమ్ముడి నిశ్చితార్థం చూసి ఆనందం పట్టలేక ఆమె కంట కన్నీరు ఒలికింది. మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరిగింది. -
నిజజీవిత ఘటనలతో...
లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్, బేబీ డాలీ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బుడుగు’. వాస్తవ సంఘటనల ఆధారంగా మన్మోహన్ రూపొందించిన ఈ చిత్రానికి భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. సారికా శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘ఇది చైల్డ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్. పరిసరాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కీలకాంశం. జనవరి మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక సైకియాట్రిస్ట్ ద్వారా తెలిసిన విషయాల ఆధారంగా ఈ చిత్రం చేశాం. కథ బాగుందని లక్ష్మి ఒప్పుకున్నారు. ఇంద్రజ అతిథి పాత్ర చేశారు. సాయి కార్తీక్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘‘కథ వినగానే బాగా నచ్చింది. ప్రేమ్‌కీ, డాలీకీ, కుక్కపిల్లకీ మన్మోహన్ ఇచ్చిన శిక్షణ సూపర్. లాస్ ఏంజిల్స్‌లో ఎలా అయితే షూటింగ్‌కి సన్నాహాలు చేస్తారో.. ఈ చిత్రానికి అలానే చేశాం’’ అని చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, కెమెరా: సురేశ్ రఘుతు, సమర్పణ: సుధీర్. -
ఈ కథలోని కిక్ అలాంటిది!
‘‘నాకు కథలు ఒక పట్టాన నచ్చవు. కానీ... ఈ కథను మాత్రం సింగిల్ సిట్టింగ్‌లో ‘ఓకే’ చేశాను. ఈ కథలోని కిక్ అలాంటిది. అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్ర ఇందులో చేస్తున్నాను’’ అని మంచు లక్ష్మి అన్నారు. ఆమె ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘పిలవని పేరంటం’. వెంకన్నబాబు యేపుగంటి దర్శకుడు. నాలి సుబ్బారావు(సుబ్బు) నిర్మాత. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి మోహన్‌బాబు సతీమణి నిర్మల కెమేరా స్విచాన్ చేయగా, కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చి, గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘‘జగన్ నిర్దోషి’ చిత్ర దర్శకుడు వెంకన్నబాబు చెప్పిన ఈ కథ నా మనసును తాకింది. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు మంచు లక్ష్మి అయితేనే కరెక్ట్ అనుకున్నాం. ఆమె కూడా అడగ్గానే చేయడానికి అంగీకరించారు. నటుడు ధన్‌రాజ్ కూడా ఒక ఆర్టిస్ట్‌గానే కాక, వ్యక్తిగతంగా కూడా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. డిసెంబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ -‘‘ప్రేమకథాచిత్రమ్, గీతాంజలి, బూచమ్మ-బూచోడు చిత్రాల తరహాలో సాగే కామెడీ హారర్ చిత్రమిది. నాది చాలా మంచి పాత్ర. ఇందులో విలన్‌గా ఓ ప్రముఖ హీరో నటిస్తున్నారు’’ అని తెలిపారు. ఉత్కంఠకు గురిచేసేలా ఇందులో సన్నివేశాలుంటాయనీ, స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం కథ మొత్తం మంచు లక్ష్మి చుట్టూనే తిరుగుతుందనీ దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో ఓ మంచి పాత్ర పోషిస్తున్నానని ‘నేనింతే’ఫేం సియా గౌతమ్ తెలిపారు. కేష, కృష్ణుడు, పృథ్వీరాజ్, రఘు కారుమంచి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వెంకటేశ్ కిలారి, కెమెరా: జి.ఎల్.బాబు, సంగీతం: విజయ్ కురాకుల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఖాదర్ గోరి, దేవర శ్రీకాంత్‌రెడ్డి. -
ఓ జీవితకాలపు అనుభూతి!
మానస సరోవరం ‘‘నా జీవితంలో ఎన్నెన్నో దేశాలకు వెళ్ళాను. ప్రదేశాలు చూశాను. కానీ, మొన్న సెప్టెంబర్‌లో చేసిన కైలాస - మానస సరోవర ప్రయాణం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటున్నారు నటి - నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న. గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ పర్యాటక నిర్వాహకురాలు వైశాలీ షా పటేల్ ఈ పర్యటన ఏర్పాట్లలో ఆరితేరిన వ్యక్తి. పదిహేడేళ్ళుగా ఏటా ఎంతోమందితో ఆమె ఈ యాత్ర చేయిస్తున్నారు. ‘‘ఆమె ఏర్పాట్లతో అరవై మంది బృందంలో భాగంగా నేను, మా ఆయన ఆండీ (ఆనంద్ శ్రీనివాసన్) అక్కడకు వెళ్ళి వచ్చాం’’ అంటూ తన తాజా కైలాస - మానస సరోవర యాత్ర వివరాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకుంటున్నారు లక్ష్మీ ప్రసన్న. ధార్మికంగా చూస్తే, మన హిందువులకే కాదు... జైనులు, బౌద్ధులకు కూడా ఈ కైలాస - మానస సరోవర యాత్ర ముఖ్యమైనది, అతి పవిత్రమైనది. అదే సమయంలో క్లిష్టమైనది కూడా! సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉన్న ప్రదేశాలు కాబట్టి, అక్కడ ప్రయాణంలో ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది. ఆరోగ్య ఇబ్బందులన్నీ ఉంటాయి. అయినా సరే నేను, ఆండీ ధైర్యం చేశాం. పాప పుట్టినందుకు కృతజ్ఞతగా... చిన్నప్పటి నుంచి కైలాస పర్వతం ఫోటో చూసినప్పుడల్లా నాకెందుకో అక్కడకు వెళ్ళాలనీ, ఆ పర్వత పాదాలను తాకాలనీ అనిపించేది. పెరిగి పెద్దయ్యాక, పెళ్ళి చేసుకున్నాక చాలాకాలం సంతానం కోసం తపించా. చివరకు సరొగసీ విధానంలో నాకూ, ఆండీకీ పాప (విద్యా నిర్వాణ) పుట్టింది. మా ప్రార్థన మన్నించి, మా కోరిక తీర్చిన ఆ పరమేశ్వరుణ్ణి కళ్ళారా చూసి, కృతజ్ఞతగా మొక్కు చెల్లించాలనుకున్నా. అందుకే ఈ యాత్ర చేశా. ఆండీ కూడా తన కుటుంబ ధార్మిక విశ్వాసాలతో సంబంధం లేకుండా వచ్చేశారు. పాప పుట్టినప్పుడు మేము గుజరాత్లో తరుణా పటేల్, పయస్విన్ పటేల్ దంపతుల రిసార్ట్స్‌లో ఉన్నాం. తమ సమీప బంధువైన వైశాలీ షా పటేల్ అందరినీ తీసుకొని, ఈ యాత్ర చేయిస్తుంటారని మాటల సందర్భంలో వాళ్ళు చెప్పారు. వైశాలి ఇప్పటికి 60 - 70 సార్లు ఈ యాత్ర చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె ద్వారా వివరాలన్నీ తెలుసుకున్నాం. అయితే, అపాయకరమైన ఈ యాత్ర విషయం ముందుగా చెబితే వద్దంటారేమోనని డబ్బులు కట్టి, టికెట్లు బుక్ చేసుకొనే వరకు మా అమ్మా నాన్నలకు చెప్పలేదు. చెప్పగానే, మా నాన్న గారు వద్దన్నారు. కానీ, నేను పట్టుబట్టాను. చివరకు ఒప్పుకున్నారు. మా బృందంలో వైశాలితో పాటు తరుణ, ఆమె భర్త - మంచి ఫోటోగ్రాఫరైన ప్రయశ్విన్ కూడా వచ్చారు. చైనా నిఘా నేత్రాల నడుమ... భారతీయులకు అత్యంత పవిత్రమైనవీ, అఖండ భారతదేశంలో ఒకప్పుడు అంతర్భాగమైనవీ అయిన కైలాస - మానస సరోవర ప్రాంతాలు ఇప్పుడు టిబెట్‌లో ఉన్నాయి. టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడం వల్ల ఈ యాత్రకు వెళ్ళాలంటే, చైనా వీసా తప్పనిసరి. మేము ఈ యాత్రకు నేపాల్ వైపు నుంచి వెళ్ళాం. ముందుగా ఇక్కడ నుంచి విమానంలో నేపాల్‌లోని ఖాట్మండు చేరుకున్నాం. అక్కడ వైశాలి నేతృత్వంలో మా 60 మంది గ్రూప్ ఒక్కచోట చేరాం. అక్కడ నుంచి నేపాల్ సరిహద్దు పట్టణమైన కొదారి అనే ప్రాంతానికి ప్రయాణించాం. కొదారికి పక్కనే చైనా పరిధిలోకి వచ్చే టిబెట్ గ్రామం న్యాలమ్. ఈ రెండు పట్నాలనూ కలుపుతూ ‘ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్’ అని ఒక వంతెన ఉంది. వంతెనకు ఇటువైపు నేపాల్. అటు వైపు టిబెట్. కొదారి నుంచి న్యాలమ్కు వెళ్ళే దోవలో లెక్కలేనన్ని జలపాతాలు కనువిందు చేస్తాయి. న్యాలమ్ నుంచి ఇక పచ్చదనం పెద్దగా కనిపించదు. కైలాస యాత్రలో చైనా అధికారులు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తారు. అక్కడ వీసా ఇచ్చిన తరువాత కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే, మా బస్సుల్లో ఒక్కోదానిలో ఒక్కో పోలీసాఫీసర్ వచ్చి కూర్చున్నారు. మేము దిగి, మళ్ళీ బస్సు ఎక్కిన ప్రతిసారీ తలలు లెక్కపెట్టేవారు. సరోవర స్నానం, రుద్రాభిషేకం... మానస సరోవరం దగ్గర రెండు రోజులున్నాం. మొదటి రోజు అక్కడకు చేరేటప్పటికి సాయంత్రం అయింది. అప్పటికప్పుడే సరోవరంలో స్నానం చేసి, బస్సులోనే సరోవరం చుట్టూ తిరిగి, పరిక్రమ పూర్తి చేశాం. దేవతలందరికీ నిలయంగా మన పురాణాల్లో పేర్కొనే మానస సరోవరం ఒడ్డునే ఆ రాత్రికి బస. ఒకప్పుడు అక్కడ గుడారాల్లో ఉండాల్సి వచ్చేదట. ఋషీకేశ్కు చెందిన ఒక భారతీయ బాబాజీ ఒకాయన అక్కడ చిన్న ఆశ్రమం లాంటిది కట్టారు. చిన్న చిన్న గదులు. వసతులు ఫరవాలేదు. ఒక్కో గదికి అయిదారుగురు వంతున మా టూరిస్ట్ బృందమంతా రాత్రి ఆ ఆశ్రమంలోనే బస. తెల్లవారుజామున లేస్తూనే మానస సరోవర జలంతో స్నానం చేసి, సరోవరం ఒడ్డున రుద్రాభిషేకం, ‘హవనం’ చేసి, దేవుణ్ణి ప్రార్థించాం. మానస సరోవరం ఒడ్డు నుంచి చూస్తుంటే సుదూరంగా కైలాస పర్వతం స్పష్టంగా కనిపిస్తూ, ఆకర్షించింది. సాధారణంగా మబ్బులు, వాతావరణ పరిస్థితుల వల్ల కైలాస పర్వతం అంత స్పష్టంగా కనిపించదట! ఈ ఏడాది తాను జరిపిన 7 యాత్రల్లో కైలాసం ఇంత స్పష్టంగా కనిపించడం ఇదేనని యాత్రా నిర్వాహకురాలు వైశాలి చెప్పారు. మేమెంత అదృష్టవంతులమో అనిపించింది. అక్కడ నుంచి కైలాస పరిక్రమకు బయలుదేరాం. షెర్పాల సాయంతో... కైలాస పరిక్రమ మానస సరోవర్ దగ్గర నుంచి తార్చెన్కు ప్రయాణించాం. కైలాస పరిక్రమకు బేస్ క్యాంప్ అక్కడే. సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న అక్కడే ఆ రాత్రికి బస. మరునాడు ఉదయాన్నే అక్కడ నుంచి కైలాస పర్వత పాదాల చెంతకు బస్సులో ప్రయాణం. పర్వత పాదాల దగ్గర షెర్పాలు, గుర్రాలతో మనల్ని కలుస్తారు. చీటీల పద్ధతిలో ఒక్కో ప్రయాణికుడికి ఒక్కొక్క షెర్పాను కేటాయిస్తారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మనం నడవలేకపోతే, ఈ షెర్పా, గుర్రం మనకు అక్కరకొస్తాయి. రెండు రోజుల్లో అతి కష్టమైన పరిక్రమ పూర్తి చేసుకొని, మళ్ళీ తార్చెన్కు చేరాం. అక్కడ నుంచి వచ్చిన దారినే న్యాలవ్ు మీదుగా ఖాట్మండుకు పయనం. కష్టతరమైన ఈ యాత్రలో ఒక పక్క ఆక్సిజన్ అందదు, మరోపక్క ఒళ్ళు గట్ట కట్టించేసేంత చలి. ఆ పరిస్థితుల్లోనూ వైశాలి మా బృందం వెంట ఏర్పాటు చేసిన షెర్పాల జట్టు అద్భుతం. వాళ్ళు మా వెంటే ఉండి, అంత చలిలోనూ తెల్లవారుజామున, రాత్రి కూడా వేడి వేడి టీ, భోజనం లాంటివి సమకూర్చడం నిజంగా మరపురాని విషయం. ప్రతి రోజూ ఈ పూట ఏం వండుతున్నారో, భోజనంలోకి ఏం పెడుతున్నారో అని ఆసక్తిగా చూసేవాళ్ళమంటే నమ్మండి! సాక్షాత్తూ మానస సరోవరం దగ్గర కూడా షెర్పాలు సరస్సు మధ్యకు వెళ్ళి, అక్కడ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు తెచ్చి, కాచి, ఆ వేడి నీటిని మాకు స్నానానికి ఇచ్చారు. ఆ చలిలో తెల్లవారుజామున అక్కడ మానస సరోవర జలంతో స్నానం చేసి, సరస్సు ఒడ్డున ‘హవనం’ (యజ్ఞం) చేయడం మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఆ క్షణం నాకు భయమేసింది! ఈ యాత్ర సమయంలో ఒకానొక సందర్భంలో నాకు చిన్న భయం కలిగింది. ఒకవేళ ఊహించని కారణాలు, పరిస్థితులు ఎదురై, ఏదైనా జరిగితే ఇంటి దగ్గర అమ్మ దగ్గర వదిలి వచ్చిన నా నెలల పాప సంగతి ఏమిటన్న ఆలోచన నాలో ఆందోళన రేపింది. అంతే! ‘నాకు ఏదైనా జరిగితే, నా కూతురును ఫలానా స్కూల్లో చదివించండి’ అంటూ నా స్నేహితులు ఒకరికి మాత్రం ఎస్.ఎం.ఎస్. పంపాను. ఆ ఒక్క ఆలోచన తప్ప, ఆస్తిపాస్తుల ఆలోచనలే రాలేదంటే నమ్మండి. కానీ, నా మిత్రులు ధైర్యం చెప్పారు. దేవుడి దయ వల్ల యాత్ర సాఫీగా జరిగిపోయింది. నిజానికి, ఈ యాత్రకు మాకు ఖర్చయింది కూడా మిగతావాళ్ళతో పోలిస్తే తక్కువే. ఖాట్మండు దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఖాట్మండు దగ్గరకు తెచ్చి వదిలిపెట్టే దాకా ఒక్కో మనిషికి లక్షా పాతిక వేల రూపాయలతో ప్రయాణం, తిండీ తిప్పా, బస ఏర్పాట్లూ అన్నీ చేశారు. అంత ఎత్తై ప్రాంతంలో ఆక్సిజన్ అందక, పెదాలు నీలంగా మారిపోతూ, ‘ఎడీమా’కు గురైనప్పుడు వారిని గబగబా కిందకు పరిగెత్తుకుంటూ మోసుకురావాల్సి ఉంటుంది. లేదంటే, క్షణాల్లో ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. ప్రతి చోటా రోజుకు రెండు నుంచి మూడు గంటల పాటు నడిపించి, ఆ వాతావరణానికీ, శ్రమకూ సిద్ధపడేలా చేశారు వైశాలి. మా యాత్రలో 71 ఏళ్ళ ఒక మహిళను చూస్తే మాకెంతో స్ఫూర్తి కలిగింది. వయసు, ఆరోగ్యం సహకరించకున్నా, ఆమె అలాగే నడిచారు. పరిక్రమ చేశారు. అది చూస్తే, ఈ యాత్రకు మానసిక వైఖరి ముఖ్యమని అర్థమైంది. ఇలాంటి యాత్రల వల్ల మేలేమిటంటే, కులం, మతం, ప్రాంతం లాంటి సంకుచిత భావాలన్నీ పక్కకు పోయి, మానవత్వం బయటకు వస్తుంది. మన పక్కనున్నది ఎవరు, ఏమిటన్నది చూడకుండా ఒకరికొకరు సాయపడడం అలవాటవుతుంది. దాన్ని బయటకు తెచ్చుకొని, మానవత్వాన్ని పరిమళింపజేయగలిగితే అప్పుడు ఈ ప్రపంచమే ఆనందమయ ప్రాంతంగా మారిపోతుంది. యాత్ర చేసి వచ్చి పది రోజులవుతున్నా, ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు ఆ దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. గంభీరంగా, అంత ఎత్తున ఆ కైలాస పర్వతం, ప్రశాంతమైన మానస సరోవర ప్రాంతాలను మర్చిపోలేకపోతున్నాను. అందుకే, ఈ పర్యటన నాకూ, ఆండీకీ ఒక జీవితకాలపు అనుభవం, అనుభూతి! - సంభాషణ: రెంటాల జయదేవ ‘‘ఈ యాత్రను నా జీవితంలో మర్చిపోలేను. స్వతహాగా మాది వైష్ణవ కుటుంబమైనా, మా అమ్మానాన్నలను ఒప్పించి ఈ కైలాస - మానస సరోవర యాత్ర చేశాను. ఏ విధమైన ముందస్తు అభిప్రాయాలూ లేకుండా నిర్మలమైన మనస్సుతో వెళ్ళాను. అక్కడకు వెళ్ళిన తరువాత నాకు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. వెనక్కి తిరిగి వచ్చినా, ఇప్పటికీ మానసికంగా ఆ అనుభూతిలోనే ఉన్నా. అక్కడ కస్తూరి మృగం చూశా. అలాగే, జంటగా మాత్రమే బతికే పక్షులను చూశాం. గమ్మత్తేమిటంటే, ఆ జంటలో ఏ ఒక్కటి మరణించినా, రెండో పక్షి మరునాడే చనిపోతుంది. ఈ యాత్ర పుణ్యమా అని శ్వాసక్రియ మీద ఉండాల్సిన అదుపు గురించి తెలుసుకున్నా. ఆధ్యాత్మిక భావాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిన యాత్ర ఇది!’’ - ఆనంద్ శ్రీనివాసన్ (ఆండీ), మంచు లక్ష్మి భర్త వెళుతున్నారా? ఇది... మీ కోసమే! ఈ యాత్రకు వెళ్ళబోయేవారికి కొన్ని సలహాలు ఇవ్వదలిచాను. యాత్రికులు నాలుగు లేయర్లుగా (థర్మల్స్, టెక్నికల్స్, ఫ్లీస్ లేయర్, రెగ్యులర్ ప్యాంట్ - షర్ట్లు) దుస్తులు, వాటి పైన గాలి, వాన, చలి నుంచి కాపాడే ‘విండ్ బ్రేకర్’ వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నూలు దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే, కాటన్ దుస్తులకు చెమటను పీల్చుకొనే గుణం ఉంటుంది. ఇన్ని రోజుల పాటు కాటన్‌వి వేసుకుంటే, ఒంటి మీద తేమ చేరి, ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు, చెవులకు చలి గాలి తగలకుండా కప్పుకోని ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కొన్నిచోట్ల టాయిలెట్ల సౌకర్యం కూడా ఉండదు. కాబట్టి, అక్కడి పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుపోవాలి. ఆక్సిజన్ కోసం రోజూ కనీసం 5 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ‘ప్రపంచానికి పై కప్పు’ అంటూ ప్రస్తావించే టిబెట్‌లో ఒక్క సెకన్లో వాతావరణం మారిపోతుంటుంది. చటుక్కున జోరున వాన కురుస్తుంది. కాబట్టి, చలి, వాన లాంటి వాటి నుంచి రక్షణగా ఎప్పుడూ ‘పాంచో’ (తల నుంచి కింద దాకా కప్పుకొనే కోటు) వేసుకొనే ఉండాలి. దాదాపు 15 రోజులు సరైన స్నానం, రుచికరమైన భోజనం, సుఖనిద్రలను మర్చిపోవాల్సి ఉంటుంది. అలాగే, మేట్రిక్స్ అనే కంపెనీ వాళ్ళకు సంబంధించిన మొబైల్ ఫోన్ సిమ్ తీసుకుంటే, ఈ యాత్రలో ఉపకరిస్తుంది. దానికి ఇన్కమింగ్ కాల్ ఉచితమే కాకుండా, 3జి కూడా చాలా చోట్ల పనిచేస్తుంది. ఇంట్లోవాళ్ళకు మన యోగక్షేమాలను ఎస్.ఎం.ఎస్.ల రూపంలోనైనా పంపుకొనే వీలుంటుంది. దానివల్లే మా అమ్మకు రోజుకు ఒకసారైనా ‘మేము క్షేమం’ అంటూ మెసేజ్ పెట్టేందుకు వీలైంది. - మంచు లక్ష్మి విహారి, సాక్షి ఫ్యామిలీ మీరు పంపవలసిన చిరునామా: విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. e-mail:sakshivihari@gmail.com -
సానియాకు బాసటగా నిలిచిన మంచు లక్ష్మి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన టెన్నిస్ తార సానియా మీర్జాకు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి మద్దతు ప్రకటించారు. సానియా జాతీయత, స్థానికతపై విమర్శలు చేయడాన్ని లక్ష్మి తప్పుపట్టారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను నియమించడం వివాదమైన నేపథ్యంలో లక్ష్మి సోషల్ మీడియాలో స్పందించారు. 'జరిగిందేదో జరిగిపోయింది. మన క్రీడాకారులను మనం అగౌరవ పరచరాదు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా తన పాత్రకు న్యాయం చేయగలరు. టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా సానియా తన జీవితాన్ని ఆటకు అంకితం చేశారు. తద్వారా భారత టెన్నిస్‌కు పేరు తీసుకువచ్చారు. సానియాపై చేస్తున్న విమర్శలకు ఇక ముగింపు పలకండి. సానియాకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నా' అంటూ లక్ష్మి పోస్ట్ చేశారు. -
నాన్న ఆశీర్వాదమే లేకపోతే...బంగారు తల్లి నా జీవితంలోకి అడుగుపెట్టేది కాదు!
‘నా రూటే... సెపరేటు...’ ఇది మోహన్‌బాబు ఫేమస్ డైలాగ్. కానీ, లక్ష్మీ ప్రసన్నకు మాత్రం అది టైలర్ మేడ్ డైలాగ్. ఎస్... ఆమె రూటే సెపరేటు. హీరోల ఇంటి బిడ్డకీ, ఫిలిం ఫీల్డ్కీ... ఫ్రీక్వెన్సీ కలవదని ఆమెకు బాగా తెలుసు. అయినా... బ్రేక్ ది రూల్స్! ఫస్ట్ స్టెప్పే... హాలీవుడ్లో. నెక్ట్స్... ‘అనగనగా ఒక ధీరుడు’లో విలన్ వేషం! ఎన్ని గట్స్ ఉండాలి! మంచు లక్ష్మీ ప్రసన్న... సారీ... ధైర్యలక్ష్మీ ప్రసన్న ఏం చేసినా అంతే! ఆర్టిస్టుగా... ఫిలిం మేకర్‌గా... ఇంకా చాలా చాలా విషయాల్లో ఆమె... డేరింగ్.. డాషింగ్... డైనమిక్! లేటెస్ట్గా సరొగసీ ద్వారా మదర్‌హుడ్. సదరన్ సెలబ్రిటీస్‌లోనే సెన్సేషనల్ స్టెప్! అసలు ఈ స్టెప్ గురించి లక్ష్మి ఏం చెబుతారో వినాలని... అందరూ ఈగర్లీ వెయిటింగ్! లక్ష్మి ఫస్ట్ టాక్ ఎక్స్‌క్లూజివ్‌గా ‘సాక్షి’కే..! - ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్ ఇందిర: బిగ్ కంగ్రాచ్యులేషన్స్!! లక్ష్మి: థాంక్యూ వెరీ మచ్! ఇందిర: జూన్ 15న ప్రపంచమంతా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే, లక్ష్మి మంచు మదర్స్‌డేని చేసుకున్నారు. అంతేకాక, అదేరోజు మీ భర్త ఆండీ బర్త్‌డే కూడా అవడం... యాదృచ్చికమా, అలా వచ్చేలా ప్లాన్ చేసుకున్నారా? లక్ష్మి: యాదృచ్చికమే! అసలు బేబీ రెండు వారాల తర్వాత పుట్టాల్సుంది.. అయితే, మెడచుట్టూతా బొడ్డుతాడు చుట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందే సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఇందిర: ఒకసారి వెనక్కెళితే... పిల్లలు పుట్టకపోవడం వల్ల సహజంగా ఏ భార్యాభర్తల మధ్యయినా చికాకులు వస్తుంటాయి... మీ మధ్య కూడా ఏమైనా..? లక్ష్మి: అఫ్కోర్స్ వచ్చాయి! చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగాం... ఎన్నో కాంప్లికేషన్స్... వీటన్నిటి మధ్యలో నేనూ, ఆండీ గొడవపడడం మొదలెట్టాం.... ఇద్దరి మధ్యలో చికాకులు రావడం మొదలెట్టాయి. ఆయన వర్క్ వల్ల ఒక అపాయింట్మెంట్ మిస్సవడం, ఒక్కోసారి నా వల్ల! దానివల్ల ఇంట్లో కొంత స్ట్రెస్ఫుల్ వాతావరణం ఏర్పడింది. ఇది టెన్షన్‌తో కూడుకున్న విషయం కాబట్టి, ప్రతి చిన్న విషయం కూడా దానికి తోడయ్యేది. అప్పుడోసారి ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం - ‘‘చూడు.. మనం అనుకున్నట్టు జరగట్లేదు... వద్దు, పిల్లల గురించి ఇంక టెన్షన్ పడద్దు... మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం... పిల్లల కోసమని ఇద్దరి మధ్య స్ట్రెస్ రావడం బాలేదు.. ఏదైనా మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడం అందరూ శాపం అనుకుంటే, దీన్ని మనం వరంగా తీసుకుందాం. బాధ్యతలు లేవు కాబట్టి ఇద్దరం ఎవరి కెరీర్లలో వారు ముందుకు పోవచ్చు, దేశదేశాలు తిరగొచ్చు, లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకరికొకరం ఉన్నామనుకుని జీవితాన్ని హ్యాపీగా గడుపుదాం’’ అని! ఇందిర: మరి బేబీ కావాలనే ఆలోచన మళ్లీ ఎలా వచ్చింది? లక్ష్మి: విష్ణు పిల్లలు అరీ, వివీని చూశాక! ఎప్పుడైతే వాళ్లు మా జీవితాల్లోకి వచ్చారో అప్పుడు నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘అత్తా.. అత్తా’ అంటూ వాళ్లు ముద్దుగా నా వెనక తిరుగుతుంటే, నాకంటూ ఓ బిడ్డ ఉంటే బాగుంటుందనిపించింది. మళ్లీ ట్రై చెయ్యాలనుకున్నాను. అయితే, అప్పటికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్‌నూ ట్రై చేసేసరికి నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నేను అంత సిక్‌గా ఉండి, పిల్లల్ని కనడంలో ఏమైనా అర్థం ఉందా అని ఆలోచించి, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని నా గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గారావును సంప్రదించాను. అప్పుడావిడ సరొగెసీని ట్రై చేద్దామని సూచించారు. గూగుల్‌కు వెళ్లి కంప్లీట్‌గా రిసెర్చ్ చేశాను. ‘మెడిసిన్ మనకు కల్పిస్తున్న అత్యాధునిక వైద్యప్రక్రియను ఎందుకు వద్దనుకోవాలి. 9 నెలలు వేరేవాళ్ల గర్భంలో పెరిగిందనే కానీ, అన్ని విధాలా అది మన బేబీనే కదా... ఐయుఐ, ఐవీఎఫ్ ఎలాగో ఇది కూడా ఇంకొక ఆప్షన్’ అనిపించింది. అందుకే నాకేమీ అభ్యంతరంగా గానీ, ఇబ్బందిగా గానీ అనిపించలేదు. చాలా ధైర్యంగా ఉన్నాను. అయితే దీని గురించి సమాజంలో స్టిగ్మా (అపవాదు) ఉంటుందని తెలుసు కాబట్టి, మొదట ఆండీతో మాట్లాడాను. అప్పుడు తను అమెరికాలో ఉన్నారు. ‘‘ముందు మీ నాన్నతో మాట్లాడు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోలేము. అయినా, ఇది మన ఒక్కరి ఫ్యామిలీ విషయమే కాదు. నువ్వు పబ్లిక్ పర్సన్‌వి అవ్వడంతో మీడియాతో సహా అందరూ దీని గురించి ఏవేవో చర్చిస్తారు... నువ్వు దాన్ని హ్యాండిల్ చెయ్యగలవనుకుంటే ముందుకెళ్దాం. ఈ విషయంలో నేను నీతోనే...’’ అన్నారు. అప్పుడు నాన్న దగ్గరికెళ్లి - ‘‘నాన్నా, నాకు ఇప్పుడున్న ఆప్షన్ ఇది.. ఏం చెయ్యమంటారు’’ అని అడిగా! క్షణం కూడా ఆలోచించకుండా ఆయన - ‘నువ్వు ముందుకెళ్తున్నావు. అంతే! అమెరికాకు వెళ్దామంటే అమెరికాకు, లండన్ అంటే లండన్‌కు వెళ్దాం’’ అన్నారు. అప్పుడు నేను - ‘‘లేదు నాన్నా, ఇతర దేశాల కన్నా మనదేశంలోనే సరోగసీకి చట్టాలు అనుకూలంగా ఉన్నాయని విదేశీయులే ఇక్కడికొస్తున్నారు. మనం ఎందుకు విదేశాలకెళ్లడం... ఇక్కడే చేద్దాం’’ అన్నాను. ‘‘నాకివన్నీ అర్థం కావమ్మా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నువ్వు చూసుకో. మనింటికి బేబీ రావాలి అంతే!’’ అన్నారు. దాంతో సరొగసీతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అసలు నాన్న ఆశీర్వాదమే లేకపోతే ఈ బంగారు తల్లి నా జీవితంలోకి అడుగుపెట్టేది కాదు. ఇక్కడోమాట చెప్పాలి - అసలు నాన్న ఎక్కువ కూడా అనక్కర్లేదు.... ‘ఎందుకమ్మా టెన్షన్ నీకు, అరీ వివీ చాల్లే’ అని అన్నా నేను ముందుకెళ్లేదాన్ని కాదు. మేము దేశాలు తిరిగాము... చదివాము కానీ... ఆయన రాయలసీమ బిడ్డ... చాలా ట్రెడిషనల్! అయినా ఆయన అంత ఓపెన్ మైండెడ్‌గా, బ్రాడ్మైండెడ్గా ఆలోచిస్తారని నేననుకోలేదు! ఇందిర: మరి ఆ మార్పుకి కారణం ఏంటంటారు... కాలమా? కూతురా? లక్ష్మి: (నవ్వి) మొత్తం క్రెడిట్ నేను తీసుకోలేను... కొంత ఇది కొంత అది అయ్యుండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే పూర్తి మార్పుకు కారణం అరీ, వివీ అనుకుంటున్నాను. నాన్న మమ్మల్ని కూర్చోమంటే కూర్చునేవాళ్లం, లేవమంటే లేచేవాళ్లం. మమ్మల్ని ట్రైన్ చేయడం అయిపోయింది. ఇప్పుడవే మనవరాళ్ల దగ్గర పనిచేయడంలేదు. వాళ్లు కూర్చోమంటే ‘నో తాతా, మీరు కూర్చోండి’ అంటున్నారు. సో నాన్న ఇంతలా మారడానికి నాకన్నా క్రెడిట్ వాళ్ల ఇద్దరికే దక్కుతుందేమో! ఇందిర: ఇంతకీ మీది పార్షియల్ సరొగసీనా (అండం కూడా ఆమె (సరగసీ మామ్)ది)? ఫుల్ సరొగసీనా.. (అండం ఈమెది)? అసలు సరొగేట్ మామ్‌ని మీరు ఎంచుకున్నారా? డాక్టర్ ఎంపిక చేశారా? ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ, ఎలా జరిగింది? లక్ష్మి: ఇది పూర్తి సరొగసీనే.. ఈ ప్రక్రియ కొంతవరకు హైదరాబాద్‌లో జరిగాక, సరొగేట్ మామ్ గర్భంలో పెట్టడం కోసం గుజరాత్‌కి వెళ్లాం. మొదట ఇదంతా హైదరాబాద్‌లోనే చేయించుకోవాలనుకున్నా. కానీ, మీడియాకు తెలిసిపోతుందన్న భయంతో వద్దనుకున్నాను. ఇందిర: మామూలుగా మీరు చాలా బోల్డ్‌గా, ఓపెన్‌గా ఉండే వ్యక్తి. ప్రతి చిన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా పబ్లిక్‌కి చెప్తుంటారు. మరి ఇంత పెద్ద విషయాన్ని చివరిదాకా అంత సీక్రెటివ్గా ఎందుకు ఉంచారు? లక్ష్మి: కారణం ఉంది... చెప్పిన దగ్గర నుంచీ అందరూ బేబీ గురించి మరచిపోయి, ‘లక్ష్మి మంచు ఇలా... లక్ష్మి మంచు అలా’ అంటూ నా గురించే మాట్లాడేవారు. అది నాకు ఇష్టం లేదు. మొత్తం అటెన్షన్ అంతా బేబీ మీద ఉంటే బాగుంటుందనిపించింది. అంతేకాదు, ఇంతకుముందు చాలా ట్రై చేశాం. ఏదీ వర్కవుట్ కాలేదు. అందుకే ఈసారి చాలా సెలైంట్‌గా ఉండాలనుకున్నాం. బేబీ సేఫ్‌గా బయటికొచ్చేవరకు ఎవరికీ చెప్పకూడదనుకున్నాం. (నవ్వుతూ) నేనింత జాగ్రత్తగా ఉన్నా ఒకరోజు ముందు అందరూ దీని గురించి మాట్లాడడం మొదలెట్టారు. బేబీని తీసుకురావడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికే అందరికీ తెలిసిపోయింది. అందుకే ఎవరికీ చెప్పలేదు. మా ఫ్యామిలీకి, అత్తమామల ఫ్యామిలీకి తప్ప ఏ ఒక్కరికి చెప్పలేదు. కానీ, ఈ 9 నెలలు అమ్మానాన్నల్ని కంట్రోల్ చేసేసరికి నా పని అయిపోయింది. మీడియా సంగతి మరచిపోండి... మా నాన్నను కంట్రోల్ చేసినందుకే మీరు నాకొక అవార్డ్ ఇవ్వొచ్చు. మొదటి నుంచి నాన్న ఎంత ఎగ్జైట్ అయ్యారంటే... స్కాన్ చూసినప్పుడల్లా చెప్పేస్తాననేవారు. ఇందిర: కానీ ముందురోజు ఆయన చాలా ఎగ్జైటెడ్‌గా ‘రేపు మీకు ఒక వండర్ఫుల్ న్యూస్ చెప్పబోతున్నాను’ అని ట్విటర్లో మెసేజ్ పెట్టారు..? లక్ష్మి: అప్పుడు కూడా పూర్తిగా విషయం చెప్పేస్తాననే గోల! బేబీ చేతికి వచ్చాక చెప్తువు గాని అని గట్టిగా ఆపాను. ఇందిర: అవును... ఇండస్ట్రీలో కూడా ఎవరికీ తెలీదా? లక్ష్మి: తెలీదు! బేబీ బయటికొచ్చే 2-3 రోజుల ముందు మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్ ప్రకాష్‌కి, రాణాకి చెప్పాను. ఇందిర: ఇప్పుడు మాత్రం అన్నీ బోల్డ్‌గా, ఓపెన్‌గా చెప్తున్నారు..! లక్ష్మి: ఇప్పటికి కూడా నేను చెప్పకుండా ఉండొచ్చు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. మూడో రోజు చర్చించుకుంటారు. నాలుగో రోజు మర్చిపోతారు. చివరికది స్పెక్యులేషన్‌గానే ఉండిపోయేది. అయితే, ఇప్పుడు ఇంత ఓపెన్‌గా మాట్లాడడానికి కారణం... మన దేశంలో పిల్లలు పుట్టలేదంటే, లోపం ఎటువైపున్నా భార్యకు విడాకులివ్వడం లేదా భర్తకు రెండో పెళ్లి చేస్తుంటారు. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే... మీది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అయితే కేవలం పిల్లలు పుట్టలేదన్న కారణంతో దాన్ని బ్రేక్ చేయొద్దు. సమాజంలో ఎవరో ఏదో అనుకుంటారని, మీ జీవితాన్ని మీరు ఆస్వాదించని పరిస్థితి తెచ్చుకోవద్దు. సమస్య వచ్చినప్పుడు ఓపెన్‌గా ఉండండి... చెప్పుకోవాల్సిన వాళ్లతో చెప్పుకోండి... ధైర్యంగా ఫేస్ చెయ్యండి, సొల్యూషన్ కోసం వెతుక్కోండి! ఈ పర్టిక్యులర్ విషయంలో అయితే... పిల్లలు పుట్టకపోవడం అనే ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు, ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని తెలీక కొంత, తెలిసినా భయం వల్ల కొంత వెనకడుగు వేస్తుంటారు. నా లాంటి ఒక సెలబ్రిటీ ఈరోజు బయటికొచ్చి ఇలా చెప్పడం వల్ల కొందరైనా ఇలా చేయడానికి ధైర్యం చేస్తారని! నేనిలా ఓపెన్‌గా ఉండడం వల్ల నలుగురికి మేలు చేసినదాన్నవుతాననుకున్నాను. ఇందిర: ఇండియాలో కమర్షియల్ సరొగసీ లీగలే కదా..? అయినా ఇంకేమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా? లక్ష్మి: లీగలే కాదు.. అన్నిటికీ పక్కా పేపర్ వర్క్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇతర దేశాల కన్నా మనదేశంలోనే దీనికి చట్టాలు పక్కాగా ఉన్నాయి. ఇందిర: అసలు సరొగేట్ మదర్స్ మెడికల్ నీడ్స్, న్యూట్రిషన్ నీడ్స్... ఓవరాల్‌గా ఎవరు టేక్కేర్ చేస్తారు. డబ్బుపరంగా కానీ, దగ్గరుండి చూసుకోవడం కానీ..? లక్ష్మి: మామూలుగా అయితే అంతా డాక్టరే టేక్కేర్ చేస్తారు. మనం ఇన్వాల్వ్ అవ్వదల్చుకుంటే అవ్వచ్చు. ఇందిర: మామూలు వ్యక్తులను వదిలేస్తే... హిందీలో అమిర్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లు చేశారు... సౌత్ ఇండియన్ ఫిలిం సెలబ్రిటీస్‌లో మీరే మొదటి వ్యక్తి అనుకుంటా ఇలా చేసింది... లక్ష్మి: (నవ్వుతూ) అసలు నాకు ఆ ఆలోచనేదు! బేబీ సేఫ్‌గా బయటికి రావలనే ఆలోచన తప్ప ఇంకోటి రాలేదు నాకు. మీరు నమ్మరు... ఈ బేబీ కోసం నేను ఎన్ని మొక్కులు మొక్కి ఉంటానో, ఎన్ని గుళ్లకు వెళ్లి వుంటానో, ఎంతగా ఆధ్యాత్మికంగా తయారయ్యానో! ఇందిర: గుళ్లు గోపురాలతోపాటు, సరగసీ మదర్ని కూడా విజిట్ చేస్తూనే ఉన్నారా? లక్ష్మి: అవును... ఈ 9 నెలల కాలంలో ఆమెను ఆరేడుసార్లు కలిశాను. ఆ అమ్మాయికి నేనెవరో క్లియర్‌గా చెప్పాను... దాచలేదు. మామూలుగా అయితే సరొగేట్ మదర్‌తో డెలివరీ తర్వాత సంబంధాలు ఉండవు. కానీ నేను మాత్రం మానవీయ సంబంధాలను కొనసాగిస్తూ ఆమెతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాను. అంతేకాదు, నేను ఏదిచేసినా 100% చేస్తాను. అంతేకాదు, ప్రతి పనీ క్రియేటివ్‌గా, ఫన్‌గా, హెల్దీగా ఈజీయెస్ట్ పద్ధతిలో చూసుకుంటాను. అలాగే ఈ బేబీ విషయంలో కూడా ప్రతి ఒక్క స్టెప్‌ను ఎంజాయ్ చేశాను. ఇందిర: అవును, ఈ 9 నెలల్లో బేబీ ఎలా ఉండబోతుందనే ఆలోచనలు ఉండేవా? లక్ష్మి: నాకెప్పుడూ అందంగా ఉండాలని ఉంటుంది. ఏదున్నా లేకున్నా పిల్లకి నా ముక్కు రావాలని గట్టిగా ఉండేది. ఎందుకంటే మా ఫ్యామిలీలో నా ఒక్కదానికే నాన్న ముక్కు వచ్చిందని గర్వంగా ఫీలైపోతుంటాను. అయితే, స్కాన్‌లో పాపకి సొట్ట ముక్కు ఉన్నట్టు అనిపించింది. స్కాన్ రిపోర్ట్ చూసినప్పుడల్లా ‘‘నాన్నో, ఇది నా కూతురు కాదు నాన్నో... దీనికి విష్ణు, మనోజ్‌లా సొట్ట ముక్కు వచ్చింది నాన్నో’’ అంటూ గోల చేసేదాన్ని. ఇందిర: ఇప్పుడు పుట్టేసింది కదా... మరి ఎవరిలా ఉంది? ఇంతకీ మీ ముక్కు వచ్చిందా? రాలేదా? లక్ష్మి: (నవ్వుతూ) సొట్టముక్కు మాత్రం రాలేదు! పాప అచ్చు ఆండీలా ఉంది. అయినా రోజూ ముక్కుని నొక్కుతున్నాను... నా ముక్కులా సన్నగా చెయ్యాలని! అయితే కాళ్లు చేతులు నాలా ఉన్నాయి. మరచిపోయా... మా మంచు గడ్డం కూడా వచ్చింది దానికి! ఇందిర: ట్విటర్లో మీది, ఆండీది, పాపది ముగ్గురివి చేతులు పెట్టారు... అలా ఓ టీజర్ వదిలే బదులు పాప ఫుల్ ఫోటో పెట్టొచ్చు కదా? లక్ష్మి: ఓ వారం ఆగి పెట్టాలనుకున్నాను... కానీ ఫస్ట్ ఫోటో మాత్రం మీకే ఇస్తాను. ఇందిర: అవును, బేబీ పుట్టగానే అందరి ఫస్ట్ రియాక్షన్..? లక్ష్మి: ‘జూనియర్ ఆండీ పుట్టేసింది’ అని! ఇందిర: అరియానా, వివియానా ఎలా రియాక్టయ్యారు.? లక్ష్మి: ఇంట్లో వాళ్లందరూ ఒకెత్తయితే వీళ్లిద్దరిదీ ఒకెత్తు. వాళ్లిద్దరూ ‘సోప్‌తో చేతులు కడుక్కోకుండా డోంట్ టచ్ అత్తా’ అంటూ... వాళ్ల నాన్న దగ్గర్నుంచీ వాళ్ల తాతదాకా... ఎవ్వర్నీ లోపలికి రానివ్వట్లేదు. నాకసలు ‘జాయ్’ అంటే ఇంతలా ఉంటుందని వాళ్లను చూస్తే అనిపిస్తుంది. (నవ్వుతూ) ఇక పాపను నేను పెంచనక్కర్లేదు... అరీ, వివీ పెంచేస్తారు. ఇందిర: ఇంతకీ పేరేం పెట్టబోతున్నారు. అరియానా, వివియానాకు ప్రాస కలిసొచ్చేలానా? అమ్మ పేరు ‘విద్య’ కలిసొచ్చేలానా? లక్ష్మి: ఫ్యామిలీలో అందరి పేర్లూ కలిసొచ్చేలా పెట్టాలనుకుంటున్నాం. ఇందిర: ఫాదర్స్ డే రోజు పుట్టింది, ఫాదర్ బర్త్ డే రోజు పుట్టింది, పాదర్లా పుట్టింది... ఆండీ మస్ట్ బీ ద హ్యాపియెస్ట్ డాడ్? లక్ష్మి: ఆయనే కాదు, ఆమె కూడా హ్యాపీ డాటరే! పొద్దుటి నుంచి నేను చూసుకున్నా పట్టదు కానీ, వాళ్ల డాడీ వచ్చేసరికి ఇటునుంచి అటువరకు నవ్వుతుంది. అది చూస్తే నాకు కోపమొస్తుంది... గిల్లడమో, తొడపాశమో పెట్టాలనిపిస్తుంది! ఇందిర: మీరెలా మీ నాన్న కూచో, మీ పాప కూడా అంతేగా! లక్ష్మి: నిజమే... అందుకోసమే అబ్బాయి పుడితే బాగుండనుకున్నాను. పుట్టాలనుకున్నాను... ‘మమ్మీస్ బాయ్’గా ఉంటాడని, ఇంట్లో అటెన్షన్ అంతా నాకే ఉంటుందని! మీకో విషయం తెలుసా... విష్ణుకి కూడా అబ్బాయిలే పుట్టాలని చాలా కోరుకున్నా. అందరికీ కొడుకులు పుట్టేస్తే ఇంట్లో నేనే క్వీన్‌ని అని! కట్‌చేసి చూస్తే అందరూ అమ్మాయిలే పుడుతున్నారు. నాకు ఇప్పుడే భయమేస్తుంది... నన్ను ఇక లెక్కచేయరేమో అని! ఇప్పటికే నేను ఆండీని సతాయిస్తున్నాను - ‘డు యు లవ్ మి ఆర్ ద బేబీ’ అని! ‘నీ తర్వాతే బేబీ’ అని నన్ను బుజ్జగిస్తుంటాడు. తనే కాదు ఇంట్లో అందరూ! ఇప్పుడు నాన్న శంషాబాద్‌లో ఇల్లు కట్టిస్తున్నారు. పాప పుట్టాక మనోజ్ - ‘నాన్నా, ఆ ఇంటిపేరు శంషాబాద్ గర్ల్స్ హాస్టల్ అని పేరు పెట్టుకుందాం’ అని జోక్లేశాడు. దానికి నాన్న - ‘ఇంతమంది ఆడపిల్లలుంటే నేను ఇంటి బయట క్రికెట్ బ్యాట్ పట్టుకుని కాపలా ఉండాలి’ అని! ఇందిర: ఆండీయేమో అమెరికాలో... బేబీయేమో ఇక్కడ... ఉండగలరా? లక్ష్మి: లేదు.. లేదు... తను ఇప్పుడు పూర్తిగా ఇండియా వచ్చేశారుగా! ఇన్‌ఫ్యాక్ట్ బేబీకోసం డిసెంబర్ నుంచి ఇండియాలోనే ఉంటున్నారు. (నవ్వుతూ) మేమిద్దరం చాలా యాక్టివ్ అండ్ ఇన్వాల్డ్ పేరెంట్స్ అండీ! ఇందిర: మరి మీది బిజీ లైఫ్ కదా? ఎలా బ్యాలెన్స్ చేసుకోబోతున్నారు లైఫ్‌ని? లక్ష్మి: (నవ్వుతూ) మమ్మీ డాడీ పెంచేస్తారండీ. విష్ణు - విన్నీ అయితే మరీ... పాపను నా దగ్గర ఉంచరట... వాళ్లే పెంచుతారట! ఆన్ ఎ సీరియస్ నోట్... అంతదూరం ఆలోచించట్లేదు... వన్ డే ఎట్ ఎ టైం అండీ! ప్రస్తుతం బేబీకి 100% టైం ఇస్తున్నాను. నేను అబ్బాయి అని మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి, బట్టలు, షూలు... అన్నీ అబ్బాయికి తగ్గట్టు కొనేశాను. ఐషఫుల్లో బేబీకి కొన్ని బేబీ బుక్స్ స్వయంగా చదివి, రికార్డ్ చేసి పెట్టి, బేబీ బడ్స్ (పొట్టమీద పెట్టే హెడ్‌ఫోన్స్) సాయంతో ఆరు నెలలుగా బేబీకి నా గొంతు వినిపిస్తూనే ఉన్నాను. మొదటి మూడు రోజులు ఆడపిల్లంటే ఆడపిల్లలా జెంటిల్‌గా ఉంది. కట్‌చేసి చూస్తే అరుస్తోంది... మా మంచు గొంతు వచ్చేసింది! Follow @sakshinews -
'ఆమెకు సిగరెట్ కాల్చడం నేర్పా'
సినిమాల్లో హీరోలు సిగరెట్లు కాల్చే సన్నివేశాలు చాలానే ఉంటాయి. అయితే.. హీరోయిన్లు, ఇతర నటీమణులు సిగరెట్ కాల్చడం మాత్రం తక్కువ. అందులోనూ అప్పటివరకు ఏమాత్రం అలవటు లేకుండా కేవలం సినిమా కోసం, అందులో పాత్ర కోసం సిగరెట్ కాల్చాల్సి వస్తే? లక్ష్మీ మంచుకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 'చందమామ కథలు' సినిమాలో ఆమె ఒక మోడల్ పాత్ర పోషించారు. పాత్ర స్వరూప స్వభావాలను బట్టి సిగరెట్ కాల్చాల్సి ఉంటుంది. (చదవండి: సినిమా రివ్యూ) కానీ ఇంతవరకు లక్ష్మికి పొగతాగడం అలవాటు లేదు. అందుకే ఆమె కొంత తటపటాయించారు. కానీ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం ఆమెను సిగరెట్ కాల్చాల్సిందిగా కోరారు. కొంత నచ్చజెప్పిన తర్వాత ఆమె అర్థం చేసుకుని అంగీకరించారని, అలా తాను తొలిసారి లక్ష్మికి సిగరెట్ కాల్చడం నేర్పించానని ప్రవీణ్ చెప్పారు. అదంత సులభం కాకపోయినా.. పాత్రకోసం ఆమె అలా చేశారని అన్నారు. -
సినిమా రివ్యూ: చందమామ కథలు
నటీనటులు: లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషి సాంకేతిక వర్గం: మ్యూజిక్, రీరికార్డింగ్: మిక్కి జే మేయర్ సినిమాటోగ్రఫి: సురేశ్ రగుతు ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల నిర్మాత: చాణక్య బూనేటి దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు పాజిటివ్ పాయింట్స్: దర్శకత్వ పనితీరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫోటోగ్రఫి నటీనటుల పనితీరు మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్ నేరేషన్ ఎడిటింగ్ ఎల్ బీ డబ్య్లూ (లవ్ బిఫోర్ వెడ్డింగ్), రొటీన్ లవ్ స్టోరీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు మూడో చిత్రంగా చందమామ కథలు చిత్రాన్ని ఏప్రిల్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంచు లక్ష్మి, నరేశ్, ఆమని తదితర నటులతో మొత్తం ఎనిమిది కథలతో రూపొందిన ఈ చిత్రానికి విడుదలకు ముందు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఇంతకీ సినిమాలోని కథలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం... సారధి (కిషోర్) ఓ రచయిత. అతనికి కావేరి అనే కూతురు ఉంటుంది. కావేరికి లుకేమియా సోకడంతో సారథికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఆస్తిపాస్తులు అంతగా లేని సారథి కూతురు వైద్యానికి కావాల్సిన సొమ్మును ఎలా సంపాదించుకున్నారు? లుకేమియా నుంచి కావేరి బయటపడిందా? సారథి, కావేరి కథకు మరో ఏడు కథలకు సంబంధమేమిటనే ప్రశ్నలకు సమాదానమే 'చందమామ కథలు' చిత్రం. నటీనటుల ప్రదర్శన లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషిలవి కథపరంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలే. ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో రచయిత కృష్ణేశ్వరరావు నటనను ప్రశంసించాల్సిందే. ఇంకా లిసా స్మిత్‌గా ఓ మోడల్‌గా నటించిన మంచు లక్ష్మి ఓ డిఫెరెంట్ పాత్రతో ఆకట్టుకున్నారు. సారథిగా కిషోర్, కూతురు పాత్రలో కావేరి పూర్తిస్థాయి న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నింటికీ అందరూ పూర్తి న్యాయం చేకూర్చారు. సాంకేతిక వర్గం: ఎనిమిది కథల సంకలనం 'చందమామ కథలు' ఓ ఫీల్ గుడ్ చిత్రమనిపించడానికి ప్రధాన కారణం మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనికి తోడు సురేశ్ పోటోగ్రఫీ మ్యాజిక్ చేసింది. ధర్మేంద్ర కత్తెరకు మరింత పదును పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం కొంత డాక్యుమెంటరీ స్టైల్లో అనిపించడానికి పూర్ ఎడిటింగ్ కారణమని అనిపిస్తుంది. ఎనిమిది కథలకు తగినట్టుగా, సరిగ్గా అతికినట్టుగా నటీనటులను దర్శకుడు ఎంపిక చేసుకోవడంలో విజయం సాధించారు. ఇక ఎనిమిది కథలను సీన్ బై సీన్ ను పేర్చుకుంటూ రూపొందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. మల్టిప్లెక్స్ ఆడియెన్స్, బీ, సీ సెంటర్లను దృష్టిలో పెట్టుకుని కథల సంకలనంగా రూపొందిన 'చందమామ కథలు' టాలీవుడ్లో ఓ కొత్త ప్రయోగమే. -
జీవిత పాఠాలు...
‘‘అనుభవాన్ని మించిన గురువు మనిషికి వేరే ఉండరు. జీవనక్రమంలో ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలు వారికి పాఠాలు. ఆ పాఠాల పర్యవసానమే మా చందమామ కథలు’’ అన్నారు మంచు లక్ష్మి. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మంచు లక్ష్మి, చైతన్యకృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, కిశోర్ ప్రధాన పాత్రధారులుగా... చాణక్య బూనేటి నిర్మిస్తున్న చిత్రం ‘చందమామ కథలు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఏం తీయాలనుకున్నానో... అది క్లారిటీతో తీశాను. ఈ నెల ద్వితీయార్ధంలో లోగోను ఆవిష్కరించి, జనవరిలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్లో షూటింగ్‌ని పూర్తిచేయగలిగామని నిర్మాత సంతృిప్తి వ్యక్తం చేశారు. ఇంకా నరేష్, కృష్ణుడు, అభిజిత్, నాగశౌర్య కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల. -
సరికొత్త ‘రైటర్’
‘‘దర్శకత్వ శాఖలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి బాలు. తనలో మంచి రచయిత కూడా ఉన్నాడు. తను రూపొందించిన ఈ చిత్రం సరికొత్త రీతిలో ఉంటుంది’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. సూర్య, దీపు, శ్రుతి ముఖ్య తారలుగా యం. బాలు దర్శకత్వంలో అరుణ, బాలు నిర్మించిన చిత్రం ‘రైటర్’. రుంకీ గోస్వామి స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. మంచు లక్ష్మీప్రసన్న లోగోను, సీడీని ఆవిష్కరించారు. బాలు చాలా ప్రతిభావంతుడని, సినిమా బాగా తీసి ఉంటాడని నమ్ముతున్నానని ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ప్రతి రైటర్లోనూ మంచి ఫైటర్ ఉంటాడని, ఈ టైటిల్, పాటలు బాగున్నాయని మరుధూరి రాజా చెప్పారు. మా నాన్నగారి చిత్రాలకు బాలు పని చేశారని, ఆయన చేతుల మీదగా పెరిగిన నేను ఈ లోగోను, సీడీని విడుదల చేయడం ఆనందంగా ఉందని లక్ష్మీప్రసన్న అన్నారు. రచయిత కావాలనే తపనతో సినిమా పరిశ్రమకు వచ్చే యువకుడి పాత్రను ఇందులో చేశానని సూర్య చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పసుపులేటి లక్ష్మీనారాయణ. -
ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి
షిర్డీసాయి, ఇంటింటా అన్నమయ్య చిత్రాల పుణ్యమా అని కొన్నాళ్లుగా ఆధ్యాత్మికానందంలోనే ఉండిపోయిన దర్శకేంద్రుడు... మళ్లీ తన శైలిలోకి వచ్చేశారు. తనలోని మాస్ యాంగిల్ తడాకా ఏంటో చూపించే పనిలో ఉన్నారాయన. ఇంతకీ కె.రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తోంది ఏ సినిమాకు అనుకుంటున్నారా? మంచు విష్ణు కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో ‘దూసుకెళ్తా’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ మిగిలివున్న పాటను మంచు ఫ్యామిలీ రిక్వెస్ట్ మేరకు రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తున్నారు. ‘మాస్’ అనే పదానికి పర్యాయపదమైన దర్శకేంద్రుడు... ఈ పాటను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరో విషయం ఏంటంటే... ఈ ప్రత్యేకగీతంలో నర్తించే అవకాశాన్ని మంచు లక్ష్మి కొట్టేశారు. తమ్ముడి ఇంట్రడక్షన్ సాంగ్‌లో అక్క అడుగు కదపనున్నారన్నమాట. పాటలను తెరకెక్కించడంలో కె.రాఘవేంద్రరావు స్పెషలిస్ట్. అందుకే ఆయన తీసే పాటలో నర్తించడానికి కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఆ విధంగా మంచు లక్ష్మికి ఇది నిజంగా గొప్ప అవకాశమే. ‘ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా’ అనే ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మంచు విష్ణు చెబుతున్నారు. శనివారం పాటలను, అక్టోబర్ 11న సినిమాను విడుదల చేస్తామని విష్ణు చెప్పారు.