'లక్ష్మీబాంబు' కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది | My next film will set a new trend in Tollywood: Lakshmi Manchu | Sakshi
Sakshi News home page

'లక్ష్మీబాంబు' కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది

Published Fri, Aug 5 2016 3:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

'లక్ష్మీబాంబు' కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది

'లక్ష్మీబాంబు' కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది

మంచు లక్ష్మి.. టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. విభిన్నమైన పాత్రలతో వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరిస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం 'లక్ష్మీ బాంబు' అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది లక్ష్మి. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

కార్తికేయ గోపాలకృష్ణ  దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మంచు లక్ష్మి ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనుందట. ఆమె ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా, లక్ష్మీ బాంబు టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్ను సెట్ చేయడం ఖాయం, ఈ సినిమాతో స్త్రీ ప్రధాన పాత్రలుగా వచ్చే సినిమాల పంథా మారుతుందని ఆమె అభిప్రాయపడింది. దీపావళి కానుకగా 'లక్ష్మీబాంబు'ను విడుదల చేయాలని ప్లాన్లో ఉంది చిత్ర యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement