Lakshmi Bomb
-
కలెక్షన్లు కురిపిస్తూ రికార్డు సృష్టిస్తోన్న 'లక్ష్మీ'
ఒకప్పుడు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ నడిచేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు బాలీవుడ్లో వరుసగా పట్టాలెక్కుతున్నాయి. ఒక్క తెలుగు మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండస్ట్రీ మీదనే బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను పడింది. ఇక్కడి సినిమాలను తిరిగి రూపొందిస్తూ ఒరిజినల్ కన్నా పెద్ద హిట్టు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'కాంచన' చిత్రం హిందీలో 'లక్ష్మీ'గా తెరకెక్కింది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. (చదవండి: నటిపై ట్రోలింగ్: దేవుళ్ల మీదే ఎగతాళా?) స్టార్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల ఓపెనింగ్ కోసం వేచి చూడకుండా నవంబర్ 9న ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజైంది. అదే రోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, పపువా న్యూగినియా, యూఏఈలో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే ఒకటిన్నర కోట్లు రాబట్టింది. ఫిజిలో 17, ఆస్ట్రేలియాలో 70, న్యూజిలాండ్‌లో 42 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక హాట్‌స్టార్ వీఐపీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కరోనా కాలంలో ఇలాంటి వసూళ్లు రావడం గొప్ప విషయమని విశ్లేషకులు అంటున్నారు కాగా మొదట్లో ఈ చిత్రానికి 'లక్ష్మీ బాంబ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే లక్ష్మీ అంటే పవిత్రమైన పేరు అని, టైటిల్ దాన్ని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన సినిమా యూనిట్‌కు నోటీసులు పంపింది. దీంతో చిత్ర యూనిట్ టైటిల్‌ను లక్ష్మీ అని మార్చక తప్పలేదు. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) -
ట్వింకిల్ బాంబ్: ట్రోలింగ్‌కు కౌంటర్
తెలుగు. తమిళ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'కాంచన' హిందీలో రీమేక్ అవుతున్న విషయం మీకు తెలిసిందేగా.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు తొలుత 'లక్ష్మీ బాంబ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు మా మనోభావాలను దెబ్బ తీస్తున్నాయంటూ కొందరు హిందూ పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. టైటిల్ కూడా లక్ష్మీ దేవిని అవమానించేలా ఉందని ఆరోపించారు. దీంతో అనవసర వివాదాలను నెత్తినెక్కించుకోవడం ఎందుకని తలచిన చిత్రయూనిట్ తమ సినిమా పేరును సవరించి "లక్ష్మీ"గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అయినా సరే లక్ష్మీ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. ఇందులోకి అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నాను సైతం లాగుతున్నారు. (చదవండి: ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ) ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి దానిపై ట్వింకిల్ బాంబ్ అని రాసుకొచ్చారు. ఇందులో ట్వింకిల్ శరీరాన్ని నీలి రంగులోకి మార్చి నుదుటిన ఎర్రటి బొట్టు పెట్టారు. ఈ ఫొటో కాస్త ట్వింకిల్ కంట పడగా, తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. తనే స్వయంగా ట్వింకిల్ బాంబ్ అని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. "ఒకరు ఈ ఫొటోకు నన్ను ట్యాగ్ చేసి థర్డ్ క్లాస్ పర్సన్. దేవుడి మీద జోకులేసి ఎగతాళి చేస్తారా?.. అంటూ కామెంట్ చేశారు. అవును, దేవుళ్లకు జోకులంటే చాలా ఇష్టం.. లేకపోతే నిన్నెందుకు భూమి మీదకు పంపిస్తాడు? పోనీలే.. ఈ ఫొటో సాయంతో నేను దీపావళికి పటాసులా రెడీ అవుతాను" అని రాసుకొచ్చారు. కాగా లక్ష్మీ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో రేపు(నవంబర్ 9న) రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వచించారు. (చదవండి: ‘కొత్త పంథాకు తెరలేపాను.. అందుకే ఇలా!’) View this post on Instagram The trolls are so helpful just when I was looking for the supporting image, here it is:) Crop rather than repost-you will see why in my column today. One tagged this picture with a comment, ‘Third class person. You make joke about God.’ I am almost tempted to reply, ‘God clearly likes a good joke, otherwise she would not have made you.’ By the way, I think I am going with the new skin tone and bindi look this Diwali like a true-blue bombshell :) click on link in bio to read more #DiwaliBombshell A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Nov 8, 2020 at 1:42am PST -
రికార్టు సృష్టించిన ‘లక్ష్మిబాంబ్’ మోషన్ పోస్టర్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం 'లక్ష్మీ బాంబ్' మోషన్ పోస్టర్‌ను గురువారం రాత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టర్ విడుదల చేసిన 24 గంటల్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను కలుపకుని 21 మిలియన్ల వ్యూస్ సంపాదించిన రికార్టు సృష్టించిన మోషన్ పోస్టరుగా నిలిచింది. అక్షయ్ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న ఈ హార్రర్ చిత్రంపై ఆయన అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: లక్ష్మీబాంబ్‌ని తీసుకొస్తున్నా) అక్కి ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ... ‘ఈ దీపావళికి ‘లక్ష్మీ బాంబ్’తో మీ ఇంటికి రాబోతున్న’ అంటూ షేర్ చేశాడు. అయితే తెలుగు బాక్సాఫిస్ వద్ద బ్టక్బస్టర్గా నిలిచిన కాంచనను హిందీ రిమేక్ ‘లక్ష్మిబాంబ్’తో అక్కి లీడ్ రోల్లో నటిస్తున్నాడు. రాఘవా లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కియార అద్వానీ నటిస్తోంది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 9న హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. -
లక్ష్మీబాంబ్‌ని తీసుకొస్తున్నా
‘ఈ దీపావళికి లక్ష్మితో పాటు ఓ బాంబ్ కూడా మీ ఇంటికి రాబోతోంది’ అన్నారు అక్షయ్ కుమార్. ఆయన హీరోగా రాఘవా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. కియారా అద్వానీ కథానాయిక. దక్షిణాదిన లారెన్స్ చేసిన ‘కాంచన’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. ‘భూల్ బులయ్య’ తర్వాత 13 ఏళ్లకు మళ్లీ అక్షయ్ చేసిన హారర్ కామెడీ చిత్రం ఇది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 9న నేరుగా హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. -
మీ సినిమాలు మాకొద్దు!
లాక్ డౌన్‌తో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి. రిలీజ్ కి రెడీ అయిన సినిమాల పరిస్థితి అయోమయంలో పడింది. తాజాగా తమిళంలో ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది. జ్యోతిక ముఖ్య పాత్రలో ఫ్రెడ్రిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్ మగళ్ వందాల్’. ఇందులో జ్యోతిక న్యాయవాదిగా కనిపించనున్నారు. ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. అప్పటికే దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. తాజాగా ఈ సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మే మొదటివారంలో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కానుందట. ఈ వార్తలకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతికూలంగా స్పందించింది. ‘‘థియేటర్ లో రిలీజ్ చేయడం కోసం తయారు చేసిన సినిమాలను నేరుగా డిజిటల్ లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు’’ అని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. ‘‘అలా చేస్తే ఆ నిర్మాణ సంస్థ (ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, హీరో సూర్య నిర్మించారు) నుంచి వచ్చే తదుపరి సినిమాలను థియేటర్స్ లో ప్రదర్శించం. వాళ్ల సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేసుకోవచ్చు. మా థియేటర్స్‌కి వాళ్ల సినిమాలు అక్కర్లేదు’’ అని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. అక్షయ్ సినిమా కూడా? బాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న టాపిక్ ఏంటంటే.. అక్షయ్ కొత్త చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ కూడా థియేటర్ లో కాకుండా డిజిటల్ గా రిలీజ్ కానుందట. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ ‘కాంచన’కి రీమేక్. జూన్‌లో ఈ సినిమా విడుదల కావాలి. మరి డిజిటల్ రిలీజ్ వార్తలు ఎంత వరకు నిజమో? తెలియాలి. -
ఆ ఇద్దరికీ కృతజ్ఞతలు
‘‘లక్ష్మీబాంబ్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను నాకు చెప్పకుండానే రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ డిజైన్ కూడా నచ్చలేదు.. దర్శకుడిగా నాకు సరైన గౌరవం లభించలేదు’’ అంటూ ‘లక్ష్మీబాంబ్’ సినిమా (‘కాంచన’ చిత్రం హిందీ రీమేక్) దర్శకత్వ బాధ్యతల నుంచి రాఘవలారెన్స్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘లక్ష్మీబాంబ్’. ఈ చిత్రాన్ని తిరిగీ తానే దర్శకత్వం వహించబోతున్నట్లు లారెన్స్ పేర్కొన్నారు. ‘‘అభిమానులు కోరుకున్నట్లే ‘లక్ష్మీబాంబ్’ చిత్రాన్ని నేనే డైరెక్ట్ చేయబోతున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నా మనోభావాలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన అక్షయ్కుమార్సార్కి, మా నిర్మాత షబీనాఖాన్కు ధన్యవాదాలు. నన్ను గౌరవించిన ఈ ఇద్దరికీ థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్‌తో మళ్లీ అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది’’ అని లారెన్స్ పేర్కొన్నారు. -
‘వివాదాలు పరిష్కారమయ్యాయి’
కాంచన 2 రీమేక్ లక్ష్మీ బాంబ్‌తో బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అయిన రాఘవ లారెన్స్, తరువాత చిత్రయూనిట్‌తో విబేధాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. తనకు చెప్పకుండా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయటంతో పాటు షూటింగ్ సమయంలో తనకు సరైన మర్యాద ఇవ్వటం లేదంటూ ఆరోపిస్తూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా బహిరంగ లేఖ విడుదల చేశారు. దీంతో కాంచన 2 బాలీవుడ్ రీమేక్‌పై అనుమానాలు మొదలయ్యాయి. ఒక దశలో మరో దర్శకుడితో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వివాదానికి తెరపడినట్టుగా తెలుస్తోంది. అక్షయ్ స్వయంగా మాట్లాడటంతో కన్విన్స్ అయిన లారెన్స్ తిరిగి దర్శకత్వం వహించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘మీరు అందరూ ఆశిస్తున్నట్టుగా తిరిగి లక్ష్మీబాంబ్ సినిమాకు దర్శకుడిగా కొనసాగనున్నాను. నా భావాలను అర్ధం చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరించినందుకు అక్షయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. నిర్మాత షబీనా ఖాన్‌కు కూడా కృతజ్ఞతలు. తిరిగి అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేయటం ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. Hi Dear Friends and Fans...! As you wished I would like to let you know that I am back on board as a director of #LaxmmiBomb with @akshaykumar pic.twitter.com/9HRHF5y2VV — Raghava Lawrence (@offl_Lawrence) 1 June 2019 -
బిగ్ బీ.. కబీ నహీ కియా
‘హోరుగాలిలాగ వచ్చెరా.. ఆడా మగా కలసి వచ్చెరా... నిన్ను నరికి పోగులెట్ట వచ్చెరా. రేయ్ రేయ్.. విళయప్రళయ మూర్తి వచ్చింది.. చూడు కాంచన..’ ఈ పాట వినగానే 2011 హారర్ కామెడీ ‘కాంచన ’సినిమా గుర్తురాక మానదు. ‘కాంచన’ సిరీస్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా కొనసాగటానికి ఈ సినిమా పెద్ద బూస్ట్. ఇప్పుడీ సూపర్ హిట్ హారర్ కామెడీను బాలీవుడ్‌కు తీసుకెళ్తున్నారు రాఘవ లారెన్స్. అక్షయ్ కుమార్ హీరోగా ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కియారా అద్వానీ కథానాయిక. ‘కాంచన’ సినిమాలో హిజ్రా పాత్ర చాలా కీలకం. తమిళ ‘కాంచన’లో శరత్‌కుమార్ ఈ పాత్ర చేయగా, హిందీలో ఈ పాత్రను ఎవరు చేయబోతున్నారంటే.. అమితాబ్ బచ్చన్ అని తెలిసింది. 50 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు అన్ని పాత్రలను టచ్ చేశారు బిగ్ బి. కానీ ఈ పాత్రను ఇప్పటి వరకు కబీ నహీ కియా (ఎప్పుడూ చేయలేదు). ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ∙షూటింగ్లో త్వరలోనే అమితాబ్ జాయిన్ అవుతారట. బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్‌కు మ్యాచ్ అయ్యే మార్పులు చేసి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారట లారెన్స్. -
న్యాయమూర్తిగా...
మంచు లక్ష్మీప్రసన్న టైటిల్ రోల్లో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మించిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. ఈ నెల 23న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ఇందులో శక్తిమంతమైన జడ్జ్ పాత్రలో కనిపిస్తా. ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించా’’ అని మంచు లక్ష్మి అన్నారు. ‘‘ఈ సినిమాలో శివకాశి లక్ష్మీబాంబ్ వంటి పవర్ఫుల్ మంచు లక్ష్మి కనిపిస్తారు. ఇప్పటికే ప్రచార చిత్రాలకు, సునీల్ కశ్యప్ పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. మురళి, సమర్పణ: గూనపాటి సురేశ్‌రెడ్డి. -
‘లక్ష్మీ బాంబ్’ వర్కింగ్ స్టిల్స్
-
ఆర్డర్.. ఆర్డర్... ఆర్డర్ !
న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతున్న సమయాల్లో హద్దు మీరి ఎవరైనా మాట్లాడితే జడ్జిగారు ఆర్డర్.. ఆర్డర్.. అంటారు. ఇప్పుడు మంచు లక్ష్మీప్రసన్న ఈ మాటలనే అన్నారు. దానికి కారణం ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంలో ఆమె జడ్జి పాత్ర చేయడమే. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో గునపాటి సురేశ్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్షీ్ష్మ నరసింహ నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ- ‘‘ ఈ చిత్రకథ నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఫస్ట్ టైం జడ్జిగా ఓ ఛాలెంజింగ్ పాత్ర చేశాను. దర్శకుడు ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తయ్యేలా చేశారు. తమ్ముడు మనోజ్ నేతృత్వంలో చేసిన క్లయిమ్యాక్స్ ఫైట్ అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. పాటలు, ఫైట్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ నెలలో పాటలు, దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని గునపాటి సురేశ్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: మల్హర్‌భట్ జోషి, కథ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సంగీతం: సునీల్ కశ్యప్, లైన్ ప్రొడ్యూసర్స్: సుబ్బారావు, ఆర్. సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి. -
అక్క.. తమ్ముడు...యాక్షన్!
సాధారణంగా తాను హీరోగా నటించే చిత్రాలకు అప్పు డప్పుడూ ఫైట్స్ కంపోజ్ చేసుకుంటుంటారు మంచు మనోజ్. కానీ, ఈసారి ఆయన బయటి చిత్రానికి పోరాట సన్నివేశాలు సమకూర్చడం.. అది కూడా తన అక్క మంచు లక్ష్మి చిత్రం కావడం విశేషం. మంచు లక్ష్మి లీడ్ రోల్లో కార్తికేయ గోపాలకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. గునపాటి సురేశ్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్షీ్ష్మ నరసింహ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లయిమాక్స్ ఫైట్‌ను మంచు మనోజ్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో క్లయిమాక్స్ ఫైట్‌కు చాలా ప్రాముఖ్యం ఉందట. లక్ష్మి మాట్లాడుతూ- ‘‘ఫస్ట్ టైం చాలెంజింగ్ పాత్ర చేస్తున్నా. ఇప్పటి వరకూ ఇటువంటి పాత్రలో నటించలేదు. రెండు రోజులు షూటింగ్ బ్యాలెన్స్ మినహా పూర్తయింది. దీపావళి పండుగకు ముందే ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘మనోజ్ సమకూర్చిన ఫైట్ హైలైట్‌గా ఉంటుంది’’ అని దర్శక- నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేశ్‌రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్, కెమేరా: మల్హర్‌భట్ జోషి, లైన్ ప్రొడ్యూసర్స్: సుబ్బారావు, ఆర్. సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి. -
'లక్ష్మీబాంబు' కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది
మంచు లక్ష్మి.. టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. విభిన్నమైన పాత్రలతో వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం 'లక్ష్మీ బాంబు' అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది లక్ష్మి. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మంచు లక్ష్మి ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనుందట. ఆమె ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా, లక్ష్మీ బాంబు టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం ఖాయం, ఈ సినిమాతో స్త్రీ ప్రధాన పాత్రలుగా వచ్చే సినిమాల పంథా మారుతుందని ఆమె అభిప్రాయపడింది. దీపావళి కానుకగా 'లక్ష్మీబాంబు'ను విడుదల చేయాలని ప్లాన్‌లో ఉంది చిత్ర యూనిట్. -
పవర్ఫుల్ బాంబ్
చట్టం ఎవరి చుట్టమూ కాదని ఆ న్యాయమూర్తి అభిప్రాయం. నీతికి, నిజాయితీకి కట్టుబడిన ఆ మహిళా మూర్తికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అప్పుడామె ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. ఫ్రమ్ శివకాశి.. అనేది ఉపశీర్షిక. మంచు లక్ష్మీప్రసన్న న్యాయమూర్తిగా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘మంచు లక్ష్మిగారి పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఇటీవల రెండు ఫైట్స్, రెండు పాటలు చిత్రీకరించాం. ఆగస్టు నెలాఖరు వరకూ కంటిన్యూస్‌గా జరిగే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’’ అన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న కామెడీ థ్రిల్లర్ ఇది’’ అని దర్శకుడు తెలిపారు. పోసాని, హేమ, ప్రభాకర్, జీవా తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: ‘డార్లింగ్’ స్వామి, కెమేరా: జోషి, సహ నిర్మాతలు : మురళి, సుబ్బారావ్, సమర్పణ: గూనపాటి సురేశ్ రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్. -
శివకాశి లక్ష్మీబాంబ్!
దీపావళి పండగంటే మనకు గుర్తొచ్చేది శివకాశీ టపాసులు. ఆ టపాసుల్లో లక్ష్మీబాంబ్ చాలా పవర్ఫుల్. అటువంటి ‘లక్ష్మీబాంబ్’ పేరుతో మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఆరంభమైంది. ఉపశీర్షిక- ‘ఫ్రమ్ శివకాశి’. ముహూర్తపు సన్నివేశానికి హీరో మంచు మనోజ్ కెమేరా స్విచ్చాన్ చేయగా, మరో హీరో మంచు విష్ణు క్లాప్ కొట్టారు. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ- ‘‘ఈ కథ విని, చాలా ఎగ్జయిట్ అయ్యా. ఇప్పటి వరకూ నేనెన్నో పాత్రలు చేశా. వాటన్నింటికీ భిన్నంగా తొలిసారి జడ్జి పాత్రలో కనిపించనున్నా’’ అని తెలిపారు. ‘‘కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. కథ కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ఈ చిత్రంలో లక్ష్మిది పవర్ఫుల్ రోల్’’ అని కథ-మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్, కెమేరా: అంజి.