బిగ్‌ బీ.. కబీ నహీ కియా | Amitabh Bachchan to play transgender person in Kanchana Hindi remake | Sakshi
Sakshi News home page

బిగ్‌ బీ.. కబీ నహీ కియా

Published Sun, Apr 28 2019 2:13 AM | Last Updated on Sun, Apr 28 2019 2:13 AM

Amitabh Bachchan to play transgender person in Kanchana Hindi remake - Sakshi

అమితాబ్‌ బచ్చన్‌

‘హోరుగాలిలాగ వచ్చెరా.. ఆడా మగా కలసి వచ్చెరా... నిన్ను నరికి పోగులెట్ట వచ్చెరా. రేయ్‌ రేయ్‌.. విళయప్రళయ మూర్తి వచ్చింది.. చూడు కాంచన..’ ఈ పాట వినగానే 2011 హారర్‌ కామెడీ ‘కాంచన ’సినిమా గుర్తురాక మానదు. ‘కాంచన’ సిరీస్‌ ఇంత సక్సెస్‌ఫుల్‌గా కొనసాగటానికి ఈ సినిమా పెద్ద బూస్ట్‌. ఇప్పుడీ సూపర్‌ హిట్‌ హారర్‌ కామెడీను బాలీవుడ్‌కు తీసుకెళ్తున్నారు రాఘవ లారెన్స్‌. అక్షయ్‌ కుమార్‌ హీరోగా ‘లక్ష్మీ బాంబ్‌’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కియారా అద్వానీ కథానాయిక. ‘కాంచన’ సినిమాలో హిజ్రా పాత్ర చాలా కీలకం. తమిళ ‘కాంచన’లో శరత్‌కుమార్‌ ఈ పాత్ర చేయగా, హిందీలో ఈ పాత్రను ఎవరు చేయబోతున్నారంటే.. అమితాబ్‌ బచ్చన్‌ అని తెలిసింది. 50 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు అన్ని పాత్రలను టచ్‌ చేశారు బిగ్‌ బి. కానీ ఈ పాత్రను ఇప్పటి వరకు కబీ నహీ కియా (ఎప్పుడూ చేయలేదు). ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ∙షూటింగ్‌లో త్వరలోనే అమితాబ్‌ జాయిన్‌ అవుతారట. బాలీవుడ్‌ ఆడియన్స్‌ టేస్ట్‌కు మ్యాచ్‌ అయ్యే మార్పులు చేసి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారట లారెన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement