kiara advani
-
Game Changer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇదేదో ముందే చెప్పొచ్చుగా!
ఈ సారి సంక్రాంతికి మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. అందులో మొదటగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer Movie) నేడే (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, జనవరి 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రాబోతున్నాయి. శుక్రవారం రిలీజైన గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్ వస్తోంది.ఆ కారణం వల్లే..డైరెక్టర్ శంకర్ పాత ఫార్ములానే వాడారని కొందరు అంటుంటే.. ఇండియన్ 2 కంటే బెటర్‌గానే ఉందని మరికొందరు అంటున్నారు. ఇకపోతే థియేటర్లో నానా హైరానా పాట (#NaanaaHyraanaaSong) కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. సినిమాలో ఆ పాటనే కనిపించలేదట! దీనిపై గేమ్ ఛేంజర్ టీమ్ స్పందించింది. సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను మూవీలో యాడ్ చేయలేకపోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, జనవరి 14 నుంచి నానా హైరానా సాంగ్‌ను థియేటర్లో ప్లే చేస్తామని పేర్కొంది. కోట్లు పెట్టి తీసింది ఇందుకేనా?చిత్రయూనిట్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టింది ఇలా ఎడిటింగ్‌లో తీసేయడానికేనా? చెత్త నిర్ణయాలు.., ఇదేదో ముందే చెప్పొచ్చుగా.. ఈ పాట కోసమే టికెట్ బుక్ చేసుకున్నా.., కనీసం ఆ పాట పెట్టుంటే గేమ్ ఛేంజర్‌పై నెగెటివిటీ కాస్త తగ్గేదేమో.. ఈ ఒక్కటైనా బాగుందని సంతృప్తి చెందేవారేమో అని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రం.. ఏం పర్లేదు, జనవరి 14 తర్వాత మరోసారి టికెట్లు కొని సినిమా చూస్తామని కామెంట్లు చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విశేషాలు..ఈ ఏడాది రిలీజవుతున్న మొదటి భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. రామ్‌చరణ్, కియారా అద్వానీ (Kiara Advani), అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్జే సూర్య విలన్‌గా నటించాడు. తమన్ సంగీతం అందించాడు. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారతీయుడు 2 డిజాస్టర్ తర్వాత శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫస్ట్ డే ఫస్ట్ ఫోనే సినిమా బాలేదంటూ ఎక్కువ నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇదే టాక్ కొనసాగితే సినిమా గట్టెక్కడం కష్టమే!పాటల కోసమే రూ.75 కోట్లుఅసలే సినిమాలోని ఐదు పాటల కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టానని గర్వంగా చెప్పుకున్నాడు నిర్మాత దిల్‌రాజు. తీరా థియేటర్లో చూస్తే మెలోడీ సాంగ్ నానా హైరానా వేయనేలేదు. సాంకేతిక సమస్యలంటూ ఏదో సాకు చెప్పారు. నాలుగు రోజుల తర్వాతే థియేటర్లో నానా హైరానా పాట వినిపిస్తుందని సమాధానం చెప్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సాంగ్‌ను ఇంత లైట్ తీసుకోవడం ఏమీ బాగోలేదంటున్నారు చరణ్ ఫ్యాన్స్కథేంటంటే?ఓ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే గేమ్ చేంజర్. గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Everyone's favorite, #NaanaaHyraanaa | #Lyraanaa | #JaanaHairaanSa from #GameChanger has been edited out due to technical challenges encountered during the processing of infrared images in the initial prints. Rest assured, we are diligently working towards adding the song back… pic.twitter.com/N1mQO2GAG6— Game Changer (@GameChangerOffl) January 9, 2025 చదవండి: Game Changer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
రాజమౌళి, శంకర్ ఇద్దరూ టాస్క్ మాస్టర్లే : రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు.జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్(Ram Charan) మాట్లాడుతూ.. ‘శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్ణం. ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెబుతారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతీ దాన్ని ఎంతో పర్ఫెక్ట్గా చేయాలని చూస్తుంటారు. (చదవండి: 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. ఐదు నిమిషాలే వృథా!)రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరూ కూడా టాస్క్ మాస్టర్లే. సెట్లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్‌ను చూశారు. ఆయన అనుకున్న దాని కంటే ఓ ఐదు శాతం తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. కియారా(kiara advani)తో నేను చేసిన డ్యాన్సులు, పాటలు అందరినీ అలరిస్తాయి. మేం డల్లాస్‌లో చేసిన ఈవెంట్‌కు అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. డల్లాస్‌లో మాకు అపరమితమైన ప్రేమ లభించింది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డల్లాస్‌లో ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. డల్లాస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ చిత్రంలో ఐదు పాటలుంటాయి. ఈ పాటలకు 75 కోట్లు ఖర్చు అయ్యాయి. ఒక్కో పాట పది రోజులకు పైగా చిత్రీకరించారు. అన్నీ కూడా శంకర్ మార్క్‌లోనే ఉంటాయి. నా బ్యానర్లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్‌కు అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కు థాంక్స్’ అని అన్నారు.ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. శంకర్ గారు, రామ్ చరణ్ గారితో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్‌గా ఎదిగారు. చాలా మంచి యాక్టర్. ఈ చిత్రంలో ఐఏఎస్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. కియారా, రామ్ చరణ్ చేసిన పాటలు, డ్యాన్సులు అదిరిపోతాయి. ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మేం సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. జనవరి 10న ఈ సినిమా ఏంటో మీకు తెలుస్తుంది’ అని అన్నారు. -
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie) వచ్చేవారమే రిలీజ్ కానుంది. సంక్రాంతి కంటే ముందుగానే జనవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. శనివారం (జనవరి 4న) ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు చరణ్, ఎస్జే సూర్య, దిల్ రాజు ఇలా అందరూ విచ్చేశారు. కానీ హీరోయిన్ కియారా మాత్రం ఎక్కడా కనిపించలేదు.ఈవెంట్‌కు డుమ్మా.. ఎందుకంటే?తను ఆస్పత్రిపాలైందని, అందుకే ఈవెంట్‌కు రాలేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై కియారా టీమ్ క్లారిటీ ఇచ్చింది. తను బాగానే ఉందని తెలిపింది. నాన్‌స్టాప్‌గా పని చేస్తుండటం వల్ల కియారాను విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని, అందుకే తను ఈవెంట్‌కు హాజరవలేదని వివరణ ఇచ్చింది.ఐదు పాటల కోసం..ఇదిలా ఉంటే ఈ సమావేశంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర విషయం బయటపెట్టాడు. 'ఈ సినిమాలో ఐదు పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. నానా హైరానా పాట కోసం న్యూజిలాండ్‌లో పదిరోజులు షూట్ చేశాం. రా మచ్చా రా పాట కోసం వైజాగ్, అమృత్సర్ వెళ్లాం. రిహార్సల్స్ అన్నీ కలిపితే రూ.75 కోట్ల కన్నా ఇంకా ఎక్కువే అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.వీరి కాంబినేషన్లో రెండో మూవీశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అంజలి, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రెండు గంటల 45 నిమిషాల నిడివితో రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. ఇదిలా ఉంటే విజయవాడలో 256 అడుగులతో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. దేశంలో అతి పెద్ద కటౌట్‌గా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో ఇది చోటు దక్కించుకుంది. After #Prabhas #Yash Now #Ramcharan Entered SIMPLE and HUMBLE in NORTH Event [#GameChanger] 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/BgDeNDIf4k— GetsCinema (@GetsCinema) January 4, 2025 చదవండి: గోవిందాను పెళ్లి చేసుకోవాల్సిందన్న హీరోయిన్.. నటుడి భార్య ఏమందంటే? -
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్ ట్రెండింగ్ లో ‘కియారా అద్వానీ’ (ఫొటోలు)
-
డల్లాస్‌లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. హ్యాపీ లైఫ్‌కి మైక్రో మంత్ర!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ఈనెల 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజైన ప్రోమో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. తమన్ సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. -
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ 'నానా హైరానా'
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పిస్తే.. టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించిన సీన్స్‌ను చిత్రీకరించారు. అక్కడ ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునే సీన్స్‌తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే ఈ సన్నివేశాల్లో కేవలం జూనియర్ ఆర్టిస్ట్‌లు మాత్రమే పాల్గొన్నారు. -
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
అందంతో టెంపరేచర్ పెంచేస్తున్న 'గేమ్ ఛేంజర్' హీరోయిన్ (ఫొటోలు)
-
బంగారపు టూత్‌బ్రష్‌తో గేమ్ ఛేంజర్ హీరోయిన్
సింధులోయ నాగరికతలో బంగారాన్ని ఆభరణాలుగానే కాకుండా వ్యాపారం కోసం ఉపయోగించారు. అందుకే సింధు ప్రజలు బంగారాన్ని అపురూపమైనదిగా కాకుండా నిరంతర వస్తువుగానే చూసేవారు. ఇకపోతే హీరోయిన్ కియారా అద్వాణీ కూడా సింధి అమ్మాయే!నోటితో మాట్లాడకుండా తాను సింధి అమ్మాయినని ఎలా చెప్తానో చూడు అంటూ కియారా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె వాష్‌రూమ్‌లో అద్దం ముందు బ్రష్ పట్టుకుని ఉంది. అది మామూలు బ్రష్ కాదు, బంగారపు టూత్ బ్రష్. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'బ్రష్ చూస్తుంటే తోముకున్నట్లే లేదు.. అది ఊరికే షో ఆఫ్కేనా?', 'మూడునెలలకోసారి బ్రష్ మార్చాలంటారు.. మరి ఈ గోల్డ్ బ్రష్‌ను నువ్వు మారుస్తావా? లేదా ఏళ్లతరబడి ఇదే వాడుతున్నావా?' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కియారా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
‘తిర ఫ్లాగ్షిప్’ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ కి పోటీ గా చిన్న సినిమాలు సిద్ధం..
-
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
భర్త క్షేమం కోసం...
డిజైనర్ చీరలు, చుడీదార్లు, గౌనులు, నగలు, నుదుట ఎర్రని సింధూరం, చేతులకు మెహిందీతో కొందరు బాలీవుడ్ తారలు చాలా అందంగా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ తారలు ఇలా కళకళలాడారు. ఈ పండగకు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలోంచి చూసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉత్తరాదినపాటించే ఆచారం ఇది. ఈ కర్వా చౌత్‌కి బాలీవుడ్లో ఇలా భర్త క్షేమం కోసం ఉపవాసం ఆచరించి, పూజ చేశారు కొందరు తారలు. ఆ విశేషాల్లోకి...‘‘నీ ఆయురారోగ్యాల కోసం ఈరోజు మాత్రమే కాదు.. ప్రతి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను... కర్వా చౌత్ శుభాకాంక్షలు. మన శాశ్వతమైన ప్రేమకు, మన బలమైన బంధానికి చిహ్నంగా ఈ మంగళసూత్రం ఓ గుర్తు’’ అంటూ భర్త జహీర్ ఇక్బాల్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు సోనాక్షీ సిన్హా. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షీ వివాహం ఈ ఏడాది జూన్‌లో జరిగింది. తొలి కర్వా చౌత్‌ను ఇష్టంగా జరుపుకున్నారు సోనాక్షి. ఇక ఈ ఏడాది తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో రకుల్ ప్రీత్‌సింగ్ ఉన్నారు. నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కాగా ఇటీవల వర్కౌట్ చేస్తుండగా రకుల్‌కి గాయమైంది. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. అయితే కర్వా చౌత్ సందర్భంగా చేతికి భర్త పేరులోని ‘జె’ అక్షరం, ఒక పువ్వు డిజైన్‌తో మెహిందీ పెట్టించుకుని, ‘బెడ్ రెస్ట్వాలా ఫస్ట్ కర్వా చౌత్’ అంటూ ఆ ఫొటోను షేర్ చేశారు రకుల్. అలాగే అదితీ రావ్ హైదరీకి కూడా ఇది తొలి కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ తో అదితి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. ఇంకా తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో కృతీ కర్భందా ఉన్నారు. నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో ఆమె పెళ్లి ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఇక కియారా అద్వానీకి ఇది రెండో కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహం జరిగింది.రెండో కర్వా చౌత్‌కి భర్త పేరులోని ‘ఎస్ఎమ్’ అక్షరాలను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను, జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తున్న ఫొటోలను షేర్ చేశారు కియారా. పరిణీతీ చో్ర΄ాకి కూడా ఇది రెండో కర్వా చౌత్. గత ఏడాది సెప్టెంబర్‌లో రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరిగింది. చేతి వెనకాల రెండు హార్ట్ సింబల్స్‌తో మెహిందీ పెట్టించుకున్న ఫొటోను షేర్ చేశారు పరిణీతి. మరోవైపు సోనమ్ కపూర్ కూడా భర్త ఆనంద్, కుమారుడు వాయు పేర్లను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను షేర్ చేశారు. 2018లో ఆనంద్, సోనమ్‌ల వివాహం జరిగింది.అయితే ఫాస్టింగ్ ఉండనని, ఈ పండగ సందర్భంగా మెహిందీ పెట్టించుకోవడం, రుచికరమైన వంటకాలు తినడం ఇష్టం అని పేర్కొన్నారు సోనమ్. కాగా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ ప్రతి ఏడాదీ ఘనంగా కర్వా చౌత్ జరుపుకుంటారు. అందర్నీ ఆహ్వానిస్తుంటారు కూడా. ఈ ఏడాది శిల్పా శెట్టి, రవీనా టాండన్ వంటివారు సునీతతో కలిసి ఆమె ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇలా కర్వా చౌత్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల సందడి జోరుగా కనిపించింది. -
గేమ్ చేంజ్
గేమ్ డేట్ చేంజ్ అయింది. ఎందుకంటే ఆడే ఆటని అందరూ చూడాలంటే సరైన తేదీ ఉండాలి కదా. అందుకే ఆటని సంక్రాంతికి మార్చారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ గురించే ఇదంతా. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నప్పుడు క్రిస్మస్ కన్నా సంక్రాంతి అయితే బాగుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్సీస్లోని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం.అయితే సంక్రాంతికి చిరంజీవిగారి ‘విశ్వంభర’ కూడా ఉంది. ‘విశ్వంభర’ భారీ బడ్జెట్ చిత్రమే. అయితే ‘గేమ్ చేంజర్’ మూడేళ్లుగా నిర్మాణంలో ఉందని, సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారిని, యూవీ సంస్థని కోరడంతో ‘విశ్వంభర’ దాదాపు పూర్తి కావచ్చినప్పటికీ సానుకూలంగా స్పందించారు. మా సినిమా కోసం వాళ్ల సినిమాను వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి ధన్యవాదాలు’’ అన్నారు. -
సంక్రాంతి బరిలో..?
‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ‘గేమ్ చేంజర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరులో విడుదల చేయనున్నట్లుగా ఇటీవల ‘దిల్’ రాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ‘గేమ్ చేంజర్’ వాయిదా పడిందా? ఒకవేళ పడితే వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
#IIFAUtsavam2024 : ఐఫా అవార్డుల వేడుక మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
జాబిలమ్మ వచ్చెనండి
రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. బుధవారం కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా ‘గేమ్ చేంజర్’లో ‘జాబిలమ్మ..’ అంటూ యూనిట్ ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఇప్పటికే ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మిగిలిన ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. -
గేమ్ ఛేంజర్ భామ బర్త్ డే.. భర్త స్పెషల్ పోస్ట్!
బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ కియారా బర్త్ డే కావడంతో పలువురు సినీతారలు, ఫ్యాన్స్ విషెస్ తెలిపారు.తాజాగా ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భార్యకు స్పెషల్‌గా విష్ చేశారు. కియారా ఫోటోను షేర్ చేస్తూ రొమాంటిక్ నోట్ రాసుకొచ్చారు. హ్యాపీ బర్త్ డే మై లవ్.. యూ ఆర్ మై సోల్‌మేట్.. ఇక్కడ మరెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి." అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా.. కియారా, సిద్ధార్థ్ ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో వివాహం చేసుకున్నారు.కాగా.. 2014లో 'ఫగ్లీ' అనే కామెడీ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన కియారా అద్వానీ.. ఆ తర్వాత స్పోర్ట్స్ బయోపిక్ 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోనూ కనిపించింది. అంతేకాకుండా భరత్ అనే నేను, వినయ విధేయ రామ, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూజ్, భూల్ భూలయ్యా 2, సత్యప్రేమ్ కి కథ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌తో పాటు వార్- 2 చిత్రంలోనూ నటిస్తోంది.కియారా తదుపరి తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్', ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆమె కిట్టిలో 'వార్ 2' కూడా ఉంది. మరోవైపు సిద్ధార్థ్ చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ 'యోధ'లో కనిపించాడు. అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కూడా నటించాడు. View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
హీరోయిన్ బర్త్ డే.. 'గేమ్ ఛేంజర్' టీమ్‌కి తప్పని ట్రోల్స్!
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ పుట్టినరోజు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఈమె హీరోయిన్గా చేస్తున్న 'గేమ్ ఛేంజర్' టీమ్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. నార్మల్‌గా అయితే ఇదేమంత పెద్దగా పట్టించుకునే విషయం కాదు. కానీ కియారాకు విషెస్ చెప్పడం కోసం వేసిన పోస్టర్ వల్ల ట్రోల్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని విజయ్ సేతుపతి.. ఇప్పుడేమో జాక్‌పాట్!)'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెడితే ఇప్పటికీ ఇంకా అలా నడుస్తూనే ఉంది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ మూవీ నుంచి 'జరగండి జరగండి' అనే పాట తప్పితే మరో కంటెంట్ బయటకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కియారా పుట్టినరోజని చెప్పి అదే పాటలోని లుక్ రిలీజ్ చేశారు. ఇదే ట్రోల్స్‌కి కారణమైంది.సినిమాలో మరో కంటెంటే లేనట్లే అదే పాటలోని ఫొటోలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్గా 'భారతీయుడు 2'తో ఘోరమైన డిజాస్టర్ అందుకున్న శంకర్.. దీనికి దర్శకుడు. మరి ఏం చేస్తాడో ఏంటో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికైనా సరే వేరే కంటెంట్ తీసుకొస్తే 'గేమ్ ఛేంజర్'పై బజ్ పెరగొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
పేరు మార్చుకుని.. స్టార్ హీరోతో పెళ్లి.. కియారా గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
వింబుల్డన్ మ్యాచ్‌లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు