Kiara Advani Gifts Herself Swanky New Mercedes Maybach Car - Sakshi
Sakshi News home page

Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?

Published Tue, May 30 2023 5:45 PM | Last Updated on Tue, May 30 2023 7:29 PM

Kiara Advani gifts herself swanky new Mercedes Maybach car - Sakshi

బాలీవుడ్ భామ కియారా అద్వానీ పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్‌గా అగ్ర హీరోలతో సినిమాల్లో నటించిది. కొద్ది నెలల క్రితమే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.  

(ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!)

కాగా.. కియారా సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును కొనుగోట్లు తెలుస్తోంది. కారు విలువ దాదాపు భారత మార్కెట్‌లో రూ.3 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఇటీవలే భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జపాన్‌ టూర్‌కు వెళ్లిన భామ ఇండియాకు తిరిగొచ్చింది. ఈ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది.

(ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి)

కాగా.. టాలీవుడ్‌లో మెగా తనయుడు రామ్ చరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్‌ చిత్రంలో కనిపించనుంది. కియారా నటించిన సత్యప్రేమ్ కి కథ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement