Sidharth Malhotra
-
గొప్ప బహుమతి
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు శుభవార్త చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన భర్త సిద్ధార్థ్‌తో కలిసి బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది’ అని వెల్లడించారు కియారా.విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ‘షేర్షా’(2021) సినిమాలో తొలిసారి కలిసి నటించారు సిద్ధార్థ్ – కియారా. ఆ మూవీ షూటింగ్లో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడంతో 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు కాబోతున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు సమంత, రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉంటే .. తెలుగులో మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ సినిమాల్లో నటించారు కియారా అద్వానీ. -
తల్లి కాబోతున్న కియారా : తొలి మెటర్నిటీ ఫ్యాషన్ లుక్ అదుర్స్!
హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్‌తో ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా త్వరలోనే ఒక బిడ్డకు జన్వనివ్వబోతోందన్న వార్త ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కియారా భర్త సిద్దార్థ్ (Sidharth Malhotra)కూడా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కియారా అద్వానీ ఫ్యాషన్ మాస్ట్రో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఫ్యాషన్‌షోలో బాలెన్సియాగా బ్లాక్ దుస్తులను ప్రదర్శించింది. అది ట్రెడిషనల్ దుస్తులైనా, లేదా హై-ఫ్యాషన్ వెస్ట్రన్ అయినా ఆమె లుక్ స్పెషల్‌గా ఉంటుంది. ఇటీవల, తీరా ఈవెంట్లో, కియారా క్లాసిక్ బ్లాక్ దుస్తులు, బంగార ఆభరణాలతో ఒక బోల్డ్ స్టేట్మెంట్ లుక్‌తో అదరగొట్టింది. బ్రాండ్ సిగ్నేచర్ లోగోను పోలీ ఉన్న లూజ్‌గా ఉండేశాటిన్ జాక్వర్డ్ టాప్ ఎంచుకుంది బాలెన్సియాటూ-పీసెస్ ఎటైర్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆమె తొలి పబ్లిక్ మెటర్నిటీ ఫ్యాషన్ లుక్. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే చోకర్ ,ఆకర్షించే సింహం పంజా పెండెంట్‌తో సహా చంకీ స్టేట్మెంట్ నెక్లెస్‌లను ధరించింది కియారా. భారీ చెవిపోగులు, ఉంగరాలు బ్రాస్లెట్ల స్టాక్‌ను కూడా జోడించింది. అంతేకాదు లౌబౌటిన్ హీల్స్‌లో అసలే పొడగరి అయిన కియారా మరింత సొగసరిలా అందర్నీ మెస్మరైజ్ చేసింది. -
కేరళ కాలింగ్
కేరళ కాలింగ్ అంటున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ ఇద్దరూ జంటగా హిందీలో ‘పరమ్ సుందరి’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తుషార్ జలోటా దర్శకత్వంలో దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. కాగా నెల రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ కోసం సిద్ధార్థ్, జాన్వీ అండ్ టీమ్ కేరళ వెళ్లారని బాలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్లో మేజర్ టాకీ పార్ట్, యాక్షన్ సీక్వెన్స్, ఓ లవ్ సాంగ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.ఇక ఈ సినిమాలో నార్త్ అబ్బాయి పరమ్ పాత్రలో సిద్ధార్థ్, సౌత్ అమ్మాయి సుందరి పాత్రలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కనిపిస్తారు. రెండు విభిన్న సాంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ అని బాలీవుడ్ టాక్. ‘పరమ్ సుందరి’ సినిమాను ఈ ఏడాది జూలై 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. -
నిజమేనా?
తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ గురించి అప్పడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుణ్ ధావన్, ఇబ్రహీం అలీ ఖాన్ (సైఫ్ అలీఖాన్ తనయుడు) హీరోలుగా రూపొందుతున్న హిందీ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. కానీ ఈ విషయాలపై ఆయా చిత్రబృందాలు ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు. కాగా శ్రీలీలకు మరో హిందీ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం లభించిందట.హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, దర్శకుడు బల్వీందర్ సింగ్ కాంబినేషన్లో ఓ హిందీ సినిమా రానుందని సమాచారం. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారని, త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుందని టాక్. మరి.. సిద్ధార్థ్ మల్హోత్రాతో శ్రీలీల జోడీ కట్టనున్నారనే వార్త నిజమేనా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
గేమ్ ఛేంజర్ భామ బర్త్ డే.. భర్త స్పెషల్ పోస్ట్!
బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ కియారా బర్త్ డే కావడంతో పలువురు సినీతారలు, ఫ్యాన్స్ విషెస్ తెలిపారు.తాజాగా ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భార్యకు స్పెషల్‌గా విష్ చేశారు. కియారా ఫోటోను షేర్ చేస్తూ రొమాంటిక్ నోట్ రాసుకొచ్చారు. హ్యాపీ బర్త్ డే మై లవ్.. యూ ఆర్ మై సోల్‌మేట్.. ఇక్కడ మరెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి." అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా.. కియారా, సిద్ధార్థ్ ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో వివాహం చేసుకున్నారు.కాగా.. 2014లో 'ఫగ్లీ' అనే కామెడీ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన కియారా అద్వానీ.. ఆ తర్వాత స్పోర్ట్స్ బయోపిక్ 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోనూ కనిపించింది. అంతేకాకుండా భరత్ అనే నేను, వినయ విధేయ రామ, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూజ్, భూల్ భూలయ్యా 2, సత్యప్రేమ్ కి కథ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌తో పాటు వార్- 2 చిత్రంలోనూ నటిస్తోంది.కియారా తదుపరి తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్', ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆమె కిట్టిలో 'వార్ 2' కూడా ఉంది. మరోవైపు సిద్ధార్థ్ చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ 'యోధ'లో కనిపించాడు. అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కూడా నటించాడు. View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
వింబుల్డన్ మ్యాచ్‌లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు
-
ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ కావాలంటూ డిమాండ్
బాలీవుడ్లో పోలీస్ కథలతో సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు రోహిత్ శెట్టికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వచ్చినవే సింగం సీరిస్, సింబా, సూర్యవంశీ ఈ మూడు సినిమాలో బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి అవన్నీ మంచి వినోదాన్ని పంచాయి. తాజాగా ఇదే కాన్సెప్ట్‌తో ఆయన తొలిసారిగా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుందని వారు ప్రకటించారు. దేశ ప్రజలను సంరక్షించడం కోసం నిరంతరం శ్రమిస్తున్న భారతీయ పోలీసు అధికారుల నిస్వార్థ సేవలకు అద్దం పట్టేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 'ఈ పోరాటం ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరి కోసం.. ఈ వార్‌లో మన కుటుంబ సభ్యుల రక్తం చిందినా యుద్ధం ఆగదు' అంటూ కబీర్ పాత్రలో సిద్ధార్థ్ చెప్పిన డైలాగులు హైలెట్‌గా నిలుస్తున్నాయి. దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో సిద్ధమైన ఈ సిరీస్‌కు రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ఈ సిరీస్ హీందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది. దీంతో రీజనల్ లాగ్వేజ్ల నుంచి కూడా మేకర్స్‌కు ఒత్తిడి పెరుగుతుంది. అన్నీ భాషల్లో విడుదల చేయాలంటూ పలువురు నెటిజన్లు ఇప్పటికే పోస్ట్‌లు చేయడం గమనర్హం. హిందీలో అయితే జనవరి 19 నుంచి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌ను అమెజాన్‌లో చూడొచ్చు. -
ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ రిలీజ్.. బిగ్ అప్డేట్
బాలీవుడ్లో పలు పోలీస్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ఈసారి తెలుగుతో సహా పలు భాషల్లో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన తర్వాత ఎలాంటి అప్డేట్లు ఇవ్వని మేకర్స్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 జనవరి 19న అమెజాన్ ప్రైమ్ వేదికగా పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ వెబ్ సిరీస్‌పై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. సిద్దార్త్ మల్హోత్రా, శిల్పాశెట్టిలతో పాటు వివేక్ ఒబెరాయ్, శ్వేతా తివారీ, నికితిన్ ధీర్, రితురాజ్ సింగ్, లలిత్‌లు పోలీసు అధికారులుగా ఈ సిరీస్‌లో కనిపించనున్నారు. భారత పోలీసుల నిబద్ధతను, పరాక్రమాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. 7భాగాలుగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను ముందుగా దీపావళి 8న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరికి పోస్ట్ పోన్ చేశారు. Lights, Siren, Action!🚨 Amazon Original Indian Police Force, a larger than life series to release Worldwide on Jan 19, 2024! Thrilled to be bringing this high-octane action entertainer from the incredible Rohit Shetty to audiences. Paying an ode to our Indian Police on… pic.twitter.com/vIbFKqQzL4 — prime video IN (@PrimeVideoIN) October 21, 2023 -
పెళ్లి గేమ్ లాంటిది.. నా భార్య ఏమో: హీరో సిద్ధార్థ్
Sidharth Malhotra Kiara Advani: బాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల లిస్ట్ తీస్తే బోలెడంతమంది ఉంటారు. కానీ వీళ్లందరిలో కియారా-సిద్ధార్థ్ జోడీ సమ్‌థింగ్ డిఫరెంట్. ఎందుకంటే బయట ఎక్కడ కనిపించినా సరే ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఓ ఈవెంట్లో భాగంగా తన భార్యపై హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?) పెళ్లి అనేది గేమ్ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సిద్ధార్థ్ మల్హోత్రాకు యాంకర్ నుంచి 'పెళ్లి లైఫ్ ఎలా ఉంది?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'పెళ్లి అనేది గేమ్ లాంటిది. ఇందులో నేను అనేది ఉండదు. మనం అనేది మాత్రమే ఉంటుంది. ఈ ఆటలో ఇద్దరం కలిసి గెలుస్తాం, ఓడుతాం.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి.' అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. భార్య బంగారం భార్య కియారా అడ్వానీ గురించి అడగ్గా.. 'నా లైఫ్ లో దొరికిన అత్యంత విలువైన సంపద ఆమె(కియారా)' అని సిద్ధార్థ్ మల్హోత్రా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే 'షేర్ షా' సినిమాలో కలిసిన నటించిన వీళ్లిద్దరూ.. షూటింగ్ సమయంలో లవ్ లో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధార్థ్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) -
Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ కియారా అద్వానీ పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోలతో సినిమాల్లో నటించిది. కొద్ది నెలల క్రితమే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) కాగా.. కియారా సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోట్లు తెలుస్తోంది. కారు విలువ దాదాపు భారత మార్కెట్లో రూ.3 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఇటీవలే భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జపాన్ టూర్‌కు వెళ్లిన భామ ఇండియాకు తిరిగొచ్చింది. ఈ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది. (ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి) కాగా.. టాలీవుడ్లో మెగా తనయుడు రామ్ చరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించనుంది. కియారా నటించిన సత్యప్రేమ్ కి కథ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. -
భర్తతో కలిసి షాపింగ్ చేసిన కియారా అద్వానీ
-
రొమాంటిక్ హోలీ.. సిద్ధార్థ్ బుగ్గలపై రంగులు అద్దిన కియారా!
కులమతాలకతీతంగా ప్రజలందరూ ఆనందంగా జరుపుకునే పండగల్లో హోలీ ఒకటి. నేడు, రేపు దేశవ్యాప్తంగా ఈ రంగుల పండగ జరగనుంది. ఇప్పటికే చాలా చోట్ల హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త వసంతానికి స్వాగతం పలుకుతూ జనాలు సంతోషంగా హోలీ ఆడుతున్నారు. చిన్నా, పెద్దా.. పేద , ధనిక తారతమ్యం లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. సినీ తారలు సైతం హోలీ పండగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ తన భర్త సిద్దార్థ్ మల్హొత్రతో కలిసి తొలిసారి హోలీ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకుంది. పండగ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. భర్త సిద్ధార్థ్ ముఖానికి కియారా స్వయంగా రంగులు పూశారు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు అనన్య పాండే, మల్లికా షెరావత్, కరణ్ జోహార్ తదితర బాలీవుడ్ సినీ ప్రముఖులు ‘రొమాంటిక్’గా హోలీ పండను సెలబ్రేట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) बुरा न मानो होली है।❤️🔫 हैप्पी होली।❤️💛💚 . .#holihai #holifestival #holi #HappyHoli2023 pic.twitter.com/vKmyg0b0Na — Soundarya Sharma (@soundarya_20) March 7, 2023 Wishing everyone a very happy Holi ♥️🎨 #Holi pic.twitter.com/siGxrpdjIm — SONAL CHAUHAN (@sonalchauhan7) March 7, 2023 Holi is the day of colour.. It is the day good wins over evil. It is the day we let our inner child out… today let us tell our adult selves also to believe in the goodness of humanity. When we believe it will be so. 🙏 ❤️🧡💛💚💙💜🤍#HappyHoli #Holi #Colours pic.twitter.com/unhlSrOsXu — Kajol (@itsKajolD) March 7, 2023 View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. ఫోటో పోస్ట్ చేసిన కియారా
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న సిద్-కియారాలు భార్యభర్తలుగా ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ఇప్పుడు పనిలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం కియారా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి నేపథ్యంలో సుమారు 20రోజులు బ్రేక్ తీసుకున్న కియారా ఇప్పుడు బ్యాక్ టూ వర్క్ అంటూ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇక సిద్ కూడా తన నెక్ట్స్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నాడు. తాజాగా ఇద్దరూ కలిసి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో సందడి చేశారు. చదవండి: కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా? -
కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హొత్ర ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్-కియారాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రీసెంట్గా పెళ్లి, మెహందీ, సంగీత్.. ఇలా ఒక్కో వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తుంది. తాజాగా సంగీత్ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో కియారా అవుట్‌ఫిట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ రంగులో ఉన్న ఈ లెహంగాకు 98,000కు పైగా క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సుమారు 4,000 గంటలు (దాదాపు 24 వారాలు)కష్టపడి ఈ లెహంగాను తీర్చిదిద్దారు మనీష్ మల్హోత్రా అండ్ టీం.ప్రస్తుతం కియారా సంగీత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఆ రాత్రి సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్.. కియరా పోస్ట్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హొత్రను ఫిబ్రవరి 7న ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్లిన ఈ జంట తాజాగా తిరిగి ముంబైకి చేరింది. ఇప్పుడు కాస్త ఫ్రీ అవ్వడంతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది కియరా. సంగీత్ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెసల్’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోలు సంగీత్ వేడుకలోని అని ఆమె మెన్షన్ చేయకపోవడంతో కియరా తన తొలి రాత్రి గురించి చెప్పిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కామెంట్ బాక్సులో ఫైర్ ఎమోజీలు, లవ్ సింబల్స్‌తో నింపేశారు. మరికొంత మంది మాత్రం 'కబీర్ సింగ్' డైలాగులు పెడుతున్నారు. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కియారా హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాకి హిందీ రీమేక్ అది. అందులో హీరోయిన్ తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. హీరో గడ్డం పెంచి సైకోలా తయారవుతాడు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ఏంటి కియరా ఇంత పని చేశావు.. ’అని కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
సెట్లో ప్రేమించుకున్నారు.. పెళ్లి సెట్ చేసుకున్నారు
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డేకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రేమ తర్వాత పెళ్లి వరకు చేరిన జంటలు మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. కానీ బాలీవుడ్లో అలాంటి ప్రేమజంటలు ఎక్కువగానే ఉన్నాయి. తెరపై చూసిన ప్రేమ కథలే నిజ జీవితంలో ఒక్కటయ్యాయి. ప్రేమ పెళ్లిళ్లతో బాలీవుడ్ జంటలు అభిమానులకు సర్ప్రైజ్లు కూడా ఇచ్చాయి. కొన్ని జంటలు ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లడంలో విఫలమైనా.. మరికొన్ని జంటలు మాత్రం పెళ్లి బంధంలో అడుగుపెట్టాయి. బాలీవుడ్లో ఇటీవలే పెళ్లి చేసుకున్న కియారా-సిద్ధార్థ్ జంట నుంచి ఇప్పటిదాకా ఒక్కటైనా జంటలు ఏవో తెలుసుకుందాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెట్లో ప్రేమించి పెళ్లి సెట్ చేసుకున్న బాలీవుడ్ ప్రేమ జంటలపై ఓ లుక్కేద్దాం పదండి. కాజోల్, అజయ్ దేవగన్ : కాజోల్, అజయ్ దేవగన్ 1995 చిత్రం హల్చల్ షూటింగ్ సెట్లో కలుసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత 1999లో పెళ్లి చేసుకున్నారు. కాజోల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజయ్‌ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించికున్నప్పుడు నెలల తరబడి తన తండ్రి తనతో మాట్లాడలేదని ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత సంతోషంగా వివాహం చేసుకున్నారు. కాగా వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందిన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ జంట 1970లో మొదటిసారి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కలుసుకున్నారు. అయితే ఆ గుడ్డి సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఏక్ నాజర్ సెట్స్‌లో ఉన్నప్పుడు వారి బంధం మరింత బలపడింది. చివరికి జూన్ 3, 1973న వివాహం చేసుకున్నారు. జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ సెట్లో పరిచయమై పెళ్లిదాకా వెళ్లిన జంటల్లో జెనీలియా డిసౌజా, రితీష్ దేశ్‌ముఖ్. ఈ జంట2003లో తుజే మేరీ కసమ్ సెట్స్‌లో మొదటిసారి పరిచయంతోనే మంచి స్నేహితులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రేమ జంట ఫిబ్రవరి 3, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తేరే నాల్ లవ్ హో గయా, మస్తీ, లై భారీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ట్వింకిల్ కన్నా, అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్లో పరిచయంతో ఒక్కటైన జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా. మొదటిసారి ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ షూటింగ్లో ఈ జంట కలుసుకున్నారు. ఆ తర్వాత అక్షయ్‌కి ట్వింకిల్‌పై ప్రేమ ఏర్పడింది. ఈ జంట ప్రేమ వ్యవహారం 1999లో ఇంటర్నేషనల్ ఖిలాడీ మేకింగ్ సమయంలో మొదలైంది. రెండేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన బాలీవుడ్ జంట చివరికి జనవరి 17, 2001న వివాహం చేసుకున్నారు. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ జంటల్లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఒకరు. వీరి ప్రేమ 2013లో గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా సెట్స్‌లో చిగురించింది. దాదాపు ఆరేళ్ల పాటు కలిసి ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత పద్మావత్, ఫైండింగ్ ఫ్యానీ, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో కనిపించారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ బాలీవుడ్లో మరో పవర్ ఫుల్ కపుల్ ఎవరంటే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. ఈ జంట డిసెంబర్ 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్లో జరిగిన అతిపెద్ద వివాహాలలో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్. దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఏప్రిల్ 2022లో ఒక్కటైంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ జోడికి నవంబర్‌లో ఓ పాప కూడా జన్మించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మణిరత్నం చిత్రం గురు షూటింగ్ సమయంలో కలుసుకున్న జంట ఐశ్వర్య అభిషేక్. ఈ జంట సెట్లోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటచు ప్రేమలో ఉన్న జంట ఏప్రిల్ 10, 2007న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు ఉమ్రావ్ జాన్, ధూమ్ 2 వంటి చిత్రాలలో పనిచేశారు. ఈ జంట 2011లో ఆరాధ్య జన్మించింది కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో మరో ప్రేమజంట షాహిద్ కపూర్, కరీనా కపూర్. మొదట ఆమె తాషాన్ సెట్లో సైఫ్‌ను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సైఫ్, కరీనా రెండేళ్ల పాటు డేటింగ్ అనంతరం అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఈ ఏడాదిలో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. రాజస్థాన్‌లో సూర్యగడ్లో ఫిబ్రవరి 7న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమకథ మొదటి చిత్రం షేర్షా సెట్స్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా పుట్టినరోజు సందర్భంగా కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా తెలియజేసింది. -
ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్
బాలీవుడ్ క్రిటిక్, నటుడు కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) గురించి తెలిసిందే. సినీ సెలబ్రెటీలు టార్గెట్‌గా తరచూ వారిని విమర్శిస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలు, బి-టౌన్ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు, ఎఫైర్స్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు ఎన్నోసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఈక్రమంలో అతడిపై పలుమార్లు పోలీసు కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ కమల్ ఆర్ ఖాన్ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పటికే ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో పడ్డాడు. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అయితే తాజాగా అతడు ఓ బాలీవుడ్ కొత్త జంటను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం కమల్ ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. ‘ప్రస్తుతం బాలీవుడ్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే! ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాకే ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ ఆ జంట ఎవరనేది మాత్రం చెప్పలేదు. దీంతో కొత్తగా పెళ్లి చేసుకుంది కియారా-సిద్ధార్థ్ కదే! అంటే కేఆర్కే వారిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడా? అని నెటిజన్లంతా ఆలోచనపడ్డారు. చదవండి: శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే ఆలియా భట్ బాటలోనే కియారా కూడా వెళ్లిందా? కియారా గర్భవతి అయినందువల్లే వారు సడెన్‌గా చేసుకున్నారా? అని కొందరూ అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కేఆర్కే కామెంట్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ఇకనైనా ఆపమంటూ అతడిపై మండిపడుతున్నారు. ‘మీ పని మీరు చూసుకోండి.. ఎప్పుడూ పక్కవాళ్లపై పడుతుంటారు’ అంటూ కేఆర్కేకు చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు. కాగా కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్లో ఉన్న కియారా-సిద్ధార్థ్ రీసెంట్గా గుట్టుచప్పుడుగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఫిబ్రవరి 7న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. Bollywood’s new trend is, that first get pregnant and then get married. According to sources, Bollywood Ki recently Huyee Marriage Ka Bhi Yahi Formula Hai. Accha Hai. — KRK (@kamaalrkhan) February 12, 2023 -
కియారా దంపతులకు RC15 సర్ప్రైజ్.. వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హొత్రతో ఆమె ఈనెల7న ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని జైసల్మైర్లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా రామ్‌చరణ్ సరసన ‘RC15’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితేపెళ్లి కారణంగా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన కియారాకు మూవీ టీం క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది. సిద్-కియారాలకు వెడ్డింగ్ విషెస్ చెబుతూ మూవీ టీం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. దీనిపై స్పందించిన కియారా ఈ సర్ప్రూజ్ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. Team #RC15 #SVC50 wishes @SidMalhotra and @advani_kiara a very happy married life! Wishing you a lifetime of happiness, love and light❤ Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/GsppqJ8sgI — Sri Venkateswara Creations (@SVC_official) February 13, 2023 -
ముంబైలో సిద్ధార్థ్-కియారా గ్రాండ్ రిసెప్షెన్, బాలీవుడ్ తారల సందడి.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, కొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. ఇక ప్రేమ, పెళ్లి విషయంలో గొప్యత పాటించిన ఈ జంట బి-టౌన్ సెలబ్రెటీల కోసం సిద్ధార్థ్-కియారాలు ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. నిన్న ఆదివారం (ఫిబ్రవరి 12) ముంబైలోని ఓ స్టార్ హోటల్లో సాయంత్రం 8:30 గంటలకు ఫంక్షన్ ఏర్పాటు చేసి సెలబ్రెటీలకు ఆహ్వానం ఇచ్చారు. చదవండి: మేము మనుషులమే.. ట్రోల్స్‌పై ‘సీతారామం’ బ్యూటీ ఆవేదన ఈ కార్యక్రమంలో సినీ తారలంత సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. షారుక్ ఖాన్, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, హిద్ కపూర్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, విద్యా బాలన్, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్ కపూర్, ఆయుష్ శర్మ, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, శిల్పాశెట్టి, కరీనా కపూర్, దిశా పటాని, ఆదిత్య కపూర్‌తో సహా పలువురు సినీ సెలబ్రెటీలు కుటుంబసమేతంగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది? That back hug ❤️✨️#SidKiaraReception #sidkiara pic.twitter.com/0gnOU6w9Df — 𝐌𝐫.&𝐌𝐫𝐬.𝐌𝐚𝐥𝐡𝐨𝐭𝐫𝐚 (@loveSidkiara1) February 12, 2023 Untagged Video: Picture Perfect 👌🥹🫶 The Malhotra's and Advani's family clicked together at #SidKiaraReception 💞 🧿@SidMalhotra @advani_kiara #SidharthMalhotra #KiaraAdvani #SidKiara pic.twitter.com/9lydmMzB7r — Sidharth Malhotra FC (@SidharthFC_) February 12, 2023 Vidya balan is here too I'm loving this big fat Bollywood reception 😍#SidKiaraReception pic.twitter.com/PbeWysvTFf — Nˢᶦᵈʷᵃˡᵉ🫶🏻 (@narmadakrystle) February 12, 2023 Alia and neetu kapoor 😍#SidKiaraReception pic.twitter.com/miCvAqLQwj — Nˢᶦᵈʷᵃˡᵉ🫶🏻 (@narmadakrystle) February 12, 2023 The diva miss #KareenaKapoorKhan blessed my eyes with her gorgeous pink saree 💓🥵 #SidKiaraReception pic.twitter.com/7YZeSyzc7F — JacquelinexsalmanFAN (@Lindaxlove) February 12, 2023 -
గ్రాండ్‌గా కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
కియారాకు సిద్ధార్థ్ మ్యారేజ్ గిఫ్ట్ అదే..!
బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి7న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్ ప్యాలెస్‌లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. బాలీవుడ్లో ఇప్పటికి వరకు జరిగిన పెళ్లిల్లలో ఖరీదైన వాటిలో ఒకటిగా నిలిచింది. కాగా.. షేర్షా మూవీలో తొలిసారి కలిసి నటించిన సిద్-కియారాలు ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమ రిలేషన్‌పై ఎక్కడా నోరు విప్పని ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే రాజస్థాన్, దిల్లీ పర్యటన తర్వాత ప్రస్తుతం ముంబయికి చేరుకుంది కొత్త జంట. తాజాగా వీరి ఇంటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఇంటి విలువ దాదాపు రూ.70 కోట్లు అని బీ టౌన్లో చర్చ నుడుస్తోంది. త్వరలోనే నూతన వధూవరులు ఆ ఇంటిలోకి మారనున్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఈ భవనం.. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ తన భార్య కియారా కోసం ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. జైసల్మీర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత శనివారం ముంబయికి తిరిగి వచ్చింది జంట. ఆదివారం సాయంత్రం బాలీవుడ్ నటులు, స్నేహితుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
మాజీ బాయ్‌ఫ్రెండ్ రిసెప్షన్‌కు రానున్న ఆలియా భట్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక రిసెప్షన్‌ను ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రేపు(ఆదివారం)ముంబైలోని ఓ స్టార్ హోటల్లో సాయంత్రం 8:30 గంటలకు సిద్-కియారాలు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇక ఈ రిసెప్షన్‌కు వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ కూడా నెట్టింట లీక్ అయ్యింది. షారుక్ ఖాన్, ఆలియా భట్,రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, హిద్ కపూర్, కరణ్ జోహార్,వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మీడియాకు చెందిన పలువురు హాజరు కానున్నారు. కాగా ఈ లిస్ట్‌లో ఆలియా దంపతుల పేర్లు కూడా ఉండటం విశేషం. గతంలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీ షూటింగ్లో ఆలియా- సిద్దార్థ్‌లు ప్రేమలో పడి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు. తర్వాత ఆలియా రణ్‌బీర్‌ను పెళ్లాడగా,సిద్-కియారాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. -
పెళ్లి వీడియోను షేర్ చేసిన సిద్-కియారా.. నెట్టింట వైరల్
బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హొత్రలు ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్యాలెస్‌లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తమ పెళ్లి వీడియోను షేర్ చేసుకున్నారు. వేదికపైకి 'షేర్షా' సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ వచ్చిన కియారా సిద్దార్థ్‌ను చూస్తూ మురిసిపోయింది. పెళ్లి కాస్ట్యూమ్‌లో అద్భుతంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ పూలదండలు మార్చుకొని ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. ఇక కియారా లేత గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోగా, సిద్దార్థ్ క్రీమ్ షేర్వాణీలో కనిపించాడు. కాగా షేర్షా మూవీలో తొలిసారి కలిసి నటించిన సిద్-కియారాలు ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమ రిలేషన్‌పై ఎక్కడా నోరు విప్పని ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
కొత్త పెళ్లి కూతురు కియారాకు అత్తింటి వారి ఘనస్వాగతం, వీడియో వైరల్
కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్లో ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు పిబ్రవరి 7తో ముగిశాయి. చదవండి: ‘యశోద’ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు! పెళ్లి అనంతరం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కియారా-సిద్దార్థ్‌లు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం బుధవారం(ఫిబ్రవరి 8న) దంపతులుగా ఢిల్లీ చేరుకున్నారు. మొదటి సారి కోడలిగా అత్తింట్లోకి అడుగుపెడుతున్న కియారాకు సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పంజాబీ సాంప్రదాయ ప్రకారం డోలు, సన్నాయిలతో ఈ కొత్త జంటను ఇంట్లోకి ఆహ్వానించారు. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. తప్పు చేశానంటూ శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు! ఈ సందర్భంగా సిద్ధార్థ్-కియారాలు పంజాబీ డోలుకు డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం మీడియాకు ఫోజులు ఇచ్చిన ఈ కొత్త జంట పాపరాజిలకు స్వీట్స్ పంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక ఈరోజు (ఫిబ్రవరి 9) రాత్రి ఢిల్లీలో ఫ్యామిలీ రిసెప్షన్ నిర్వహించారు. ఇక ఫిబ్రవరి 10న ముంబైలో ఫ్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ల కోసం మరో రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) View this post on Instagram A post shared by @varindertchawla View this post on Instagram A post shared by @varindertchawla View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) -
కియారా-సిద్ధార్థ్‌ల సీక్రెట్ డేటింగ్, పెళ్లిపై కంగనా షాకింగ్ రియాక్షన్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం. ఆమె పేరు వినిపిస్తే చాలు ఏ వివాదానికి తెరలేపిందా! అని అంతా ఆశ్చర్యపోతుంటారు. ఇక ఆమె మాట్లాడితే బాలీవుడ్ స్టార్ కిడ్స్, నెపోటిజంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు బి-టౌన్ సెలబ్రెటీలపై ఆరోపణలు చేస్తూ వారిని విమర్శిస్తూ ఉంటుంది కంగనా. చదవండి: సుమంత్‌తో విడాకుల అనంతరం నటనకు బ్రేక్ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అలాంటి కంగనా తాజాగా కొత్త జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల డేటింగ్, పెళ్లిపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఆమె స్పందన చూసి కొందరు సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు మంగళవారం(ఫిబ్రవరి 7న) ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో ఓ ట్విటర్ యూజర్ అయితే వీరు డేటింగ్లో ఉంది నిజమేనా? అని ట్వీట్ చేశాడు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరో తెలుసా? దీనికి కంగానా ఆసక్తికర రీతిలో స్పందించింది. ‘అవును వారు డేటింగ్లో ఉన్నారు. కానీ బ్రాండ్ల కోసం, సినిమాల ప్రమోషన్ల కోసం కాదు. ఈ జంట లైమ్ టైట్లో ఉండేందుకు, ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పడు ప్రయత్నించలేదు. చాలా చిత్తశుద్ధితో, నిజమైన ప్రేమ కలిగిన చూడముచ్చటైన జంట వీరిద్దరిది’ అని కంగనా రనౌత్ బదులిచ్చింది. కియారా, సిద్ధార్థ్ జంటను గతంలోనూ కంగనా పలు సందర్భాల్లో ప్రశంసించిన సంగతి తెలిసిందే. ‘ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉంది.. సినిమా పరిశ్రమలో నిజమైన ప్రేమను అరుదుగా చూస్తుంటాం. వీరిద్దరూ కలసి చూడ్డానికి దేవతల మాదిరిగా ఉన్నారు’’ అని కియారా, సిద్ధార్థ్ వివాహానికి ముందు కంగనా రనౌత్ ట్వీట్ చేయడం గమనార్హం. They were dating? pic.twitter.com/msnnsYKSHu — Aniruddha Guha (@AniGuha) February 7, 2023 -
వైభవంగా కియారా-సిద్ధార్థ్ పెళ్లి.. హనీమూన్‌కు నో ఛాన్స్..!
బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు బీటాన్ క్యూట్ కపుల్ కియారా, సిద్ధార్థ్. ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు ఇవాల్టితో ముగియనున్నాయి. వివాహానికి విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖలను కోసం దాదాపు 70 లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు. వీరికి వండి వడ్డించడానికి 500 మంది దాకా వెయిటర్లను ముంబయి, దిల్లీ నుంచి ప్రత్యేకంగా రప్పించారు. అయితే నూతన వధూవరులు మాత్రం హనీమూన్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వారి కెరీర్ ప్రణాళికల్లో భాగంగా మరికొన్ని వాయిదా వేసుకుంటారని సమాచారం. అయితే వీరి వివాహా ఆచారాల కారణంగా పెళ్లి చేసుకున్న వెంటనే హానీమూన్‌కు వెళ్లరట. జైసల్మీర్ నుంచి ఇంటికి తిరిగొచ్చాక పంజాబీ, సింధు కుటుంబ ఆచారాల ప్రకారం వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతే కాకుండా సిద్ధార్థ్.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే కియారాకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇద్దరూ తమ వర్క్ కమిట్మెంట్ పూర్తి చేసిన తర్వాతే హనీమూన్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై సిద్ధార్థ్, కియారా స్పందించలేదు. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంట అతియా శెట్టి-కేఎల్ రాహుల్ సైతం హనీమూన్ వేడుకను వాయిదా వేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ రెండు గ్రాండ్‌గా రిసెప్షన్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 12న ముంబైలోని తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం, ఫిబ్రవరి 9న దిల్లీలోని వరుడి కుటుంబ సభ్యుల కోసం మరో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పెళ్లిలో బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, రామ్ చరణ్, మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్‌తో పాటు వ్యాపార దిగ్గజం ఇషా అంబానీతో సహా అనేక మంది స్నేహితులను హాజరయ్యారు. -
కియారా -సిద్ధార్థ్ పెళ్లి.. మూడు రోజుల ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
కొత్త ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన బాలీవుడ్ ప్రేమజంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వనుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యయి. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో పాల్గొనే అతిథుల కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. ముంబయికి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అతిథులతో పాటు దాదాపు 150 మంది వీవీఐపీల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం 70 లగ్జరీ వాహనాలైన మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారు. అతిథులకు రాజస్థానీ వంటకాలను సిద్ధం చేయనున్నారు. సూర్యగఢ్ ప్యాలెస్ కియారా- సిద్ధార్థ్ రాయల్ వెడ్డింగ్‌కు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యగఢ్ ప్యాలెస్ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్స్‌కు నిలయం. అతిథులకు విలాసవంతమైన హోటల్ గదులు, బెడ్రూమ్లు, పెద్ద తోటలు, ఒక కృత్రిమ సరస్సు, ఒక వ్యాయామశాల, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, 2 పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లో వెడ్డింగ్‌కు ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలల్లో మద్యం లేకుండా ఒక్కరోజు ఖరీదు రూ.1.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అక్టోబరు నుంచి మార్చి వరకైతే రోజుకు దాదాపు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నారు. రూ.8 నుంచి 10 కోట్ల ఖర్చు సిద్ధార్థ్- కియారాల వివాహం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వేడుక ఖర్చు దాదాపు రూ. 6 కోట్లకు పైనే ఉండనుంది. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ఖర్చులు కలుపితే పెళ్లి ఖర్చు దాదాపు రూ.8 నుంచి 10 కోట్ల వరకు కానుంది. వీరి పెళ్లి బాలీవుడ్లో అత్యంత ఖరీదైన వేడుకల్లో ఒకటిగా నిలవనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. -
ఆ హీరోతో పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్!.. రాయల్ వెడ్డింగ్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 6న సిద్-కియారాల వివాహం జరగనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ, రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఫోర్ట్‌లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని, ఓ ప్రైవేట్ జెట్‌లో వీరు రాజస్థాన్ చేరుకుంటారని సమాచారం. కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హొత్రా సహా సిద్-కియారాల పెళ్లికి వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. కాగా షేర్షా మూవీలో తొలిసారి నటించిన ఈ జంట ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. -
ఆలియా భట్ సినిమాతో రూ.20 కోట్లు నష్టపోయా: కరణ్ జోహార్
బాలీవుడ్ దర్శకుడు, చిత్రనిర్మాత కరణ్ జోహార్ గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2012లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆ సినిమాతో దాదాపు రూ.20 కోట్లు నష్టపోయామని కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అయినప్పటికీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కరణ్ దర్శకత్వం వహించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కంటే ముందు ఆలియా, వరుణ్, సిద్ధార్థ్‌లతో మరో 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మిగిలిన చిత్రాలను తక్కువ బడ్జెట్‌తో చేయడంతో నష్టం తిరిగి వచ్చిందని చిత్రనిర్మాత వెల్లడించాడు. సిద్ధార్థ్ 'హసీతో ఫసీ'లో నటించగా, అలియా, వరుణ్ 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రంలో నటించారు. కరణ్ నిర్మించిన '2 స్టేట్స్'లో ఆలియా కథానాయికగా నటించిందని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లు కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్, అలియా నటిస్తోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రెండుసార్లు పెళ్లి తేదీలు విన్నా.. కానీ ఎవరూ పిలవలేదు: సిద్దార్థ్ మల్హోత్రా
ఈ ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన జంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీలెక్కనున్నట్లు రూమర్స్ హల్చల్ చేశాయి. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని.. ఫిబ్రవరి 6న పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నట్లు తెగ వైరలయ్యాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్యాలేస్ వివాహ వేదిక కానుందనీ.. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలను ఈ జంట ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. (ఇది చదవండి: కియారా అద్వానీ పెళ్లికి ముహూర్తం కుదిరిందా?) కానీ ఈ వార్తలపై తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా నోరు విప్పారు. ఇప్పటికీ నా పెళ్లికి ఇంకా నన్ను ఎవరూ ఆహ్వానించలేదు. ప్రజలు కూడా ఎవరు పిలవలేదు. ఇప్పటికే రెండుసార్లు పెళ్లి తేదీలు కూడా విన్నా. అభిమానులు తన వ్యక్తిగత జీవితంపై వచ్చే ఊహగానాల కంటే.. నా సినిమాలపై దృష్టి సారిస్తే మంచిది. అదే నాకు నచ్చుతుంది.' అని అన్నారు. ఇటీవల కియారా అద్వానీ, సిద్ధార్త్ మల్హోత్రా పెళ్లి గురించి రూమర్స్ పెద్దఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. షేర్షా సినిమా తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి మిషన్ మజ్నుతో ఓటీటీలో అలరించనున్నారు. జనవరి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. చివరిసారిగా సిద్ధార్థ్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో నటించిన థ్యాంక్ గాడ్లో కనిపించాడు. -
ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న రష్మిక మందన్నా!
సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా జంటగా నటించిన 'మిషన్ మజ్ను'. పీరియాడిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్లో డెబ్యూ ఇవ్వనుంది. శాంతను భగ్చీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 20న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నిమిషమున్నర నిడివితో కట్ చేసిన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య 1971 నేపధ్యంలో జరిగిన యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపైనే రష్మిక అన్ని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే హిందీలో వరుస ఛాన్సులు దక్కించుకోనుంది. మరి మిషన్ మజ్నుతో నేషనల్ క్రష్ బీటౌన్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
కియారా అద్వానీ పెళ్లికి ముహూర్తం కుదిరిందా?
ఈ కొత్త సంవత్సరం తొలిరోజు వార్తల్లో నిలిచినవారిలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ జంట ఒకటి. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘షేర్షా’ చిత్రంలో నటించినప్పుడు ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని సమాచారం. ఫిబ్రవరి 6న పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్ టాక్. మెహందీ, సంగీత్, పెళ్లి.. ఈ మూడు వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయట. మెహందీ, సంగీత్ ఒకే రోజున, ఆ మర్నాడు వివాహ వేడుకను ప్లాన్ చేశారని భోగట్టా. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్యాలేస్ వివాహ వేదిక కానుందనీ, పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, సినీ ప్రముఖులకు ముంబయ్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని సిద్ధార్థ్, కియారా అనుకున్నారట. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. -
పెళ్లికి రెడీ అవుతున్న హీరో, హీరోయిన్.. డేట్ ఫిక్స్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ నడుస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న వీరి వివాహం ఘనంగా జరగనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట.పెళ్లివేడుక కోసం రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఫోర్ట్‌ను ఇప్పటికే ఖరారు చేశారని టాక్ వినిపిస్తుంది. కుటుంబసభ్యులు,సన్నిహితులతో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు సిధ్, కియారా పెళ్లికి హాజరుకానున్నారట. జనవరిలో తమ పెళ్లి గురించి సిద్ధార్థ్, కియారాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానున్న రష్మిక మందన్నా మూవీ.. ఎప్పుడంటే?
దక్షిణాదిలో ఓ రేంజ్లో స్టార్డమ్ సంపాదించుకున్ననటి రష్మిక మందన్నా. ఈ భామ బాలీవుడ్లో మిషన్ మజ్ను అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. షంతను బాగ్చీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. 1970ల నాటి కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రా ఏజెంట్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించనున్నారు. ఈ సినిమాను రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడుతూ వచ్చింది. And now it’s Mission Majnu time ❤️ Are y’all ready my loves ? 😚❤️#MissionMajnu #DeshKeLiyeMajnu #NetflixIndia pic.twitter.com/hKYRx2B2DI — Rashmika Mandanna (@iamRashmika) December 13, 2022 -
రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ లవ్‌బర్డ్స్..
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే!..ఈ ఇద్దరూ సమయం దొరికితే చాలు ఒక్కచోట చేరిపోతారు.అలా వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ పలుమార్లు కెమెరాలకు చిక్కారు. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పుడీ లవ్ బర్డ్స్ పెళ్లిపీటలు ఎక్కనున్నారని బీటౌన్ టాక్. 2023 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చకచకా పూర్తి చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ల తరహాలోనే సీక్రెట్ వేడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారట. కేవలం బంధువులు, సన్నిహితులు సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. అయితే ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సిద్దార్థ్.. తాను ఎంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నా ఎలాగైనా అది బయటికొస్తుందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. -
ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వైరల్ వీడియో
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే! తరచూ డిన్నర్ పార్టీలని, హాలీడే ట్రిప్లని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా సిద్దార్థ్, కియారా ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. ఇందులో ప్రేమ పక్షులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు. అయితే అన్‌సీన్ వీడియోలో కియారా తన ప్రియుడి కళ్లల్లో నలక పడితే తీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సిద్ అంటే ఎంత ప్రేమో, వీరిని చూస్తుంటే ఆల్రెడీ పెళ్లైన జంటలాగే ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by 𝐊𝐢𝐚𝐫𝐚 𝐒𝐢𝐝𝐡𝐚𝐫𝐭𝐡 𝐌𝐚𝐥𝐡𝐨𝐭𝐫𝐚 💘🇮🇩 (@sidkiara.world30) చదవండి: -
'థ్యాంక్ గాడ్' సాంగ్ రిలీజ్.. నోరా అందానికి నోరెళ్లబెట్టాల్సిందే..!
సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం'థ్యాంక్ గాడ్'. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలంక సింగర్ యోహాని పాడిన 'మనికే మాగే హితే' సాంగ్‌ను హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ పాటలోనూ యోహానీ తనదైన వాయిస్‌తో అలరించింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా చిత్రగుప్తగా అజయ్ దేవగణ్ కనిపించనుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనుంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ యూపీలోని జాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది. (చదవండి: చిక్కులు తెచ్చిన ట్రైలర్.. నటులపై కేసు నమోదు) -
చిక్కుల్లో 'థ్యాంక్ గాడ్'.. కేసు నమోదు.. ట్రైలర్లో ఏముంది?
బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన చిత్రం 'థ్యాంగ్ గాడ్' చిక్కుల్లో పడింది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా.. అదే ఇప్పుడు సమస్యను తెచ్చిపెట్టింది. దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కిస్తున్న ‘థ్యాంక్ గాడ్’ సినిమాపై న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ యూపీలోని జాన్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసు నమోదైంది. నవంబర్ 18న పిటిషనర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. (చదవండి: అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు) ఇటీవల విడుదలైన 'థ్యాంక్ గాడ్' ట్రైలర్ ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ హిమాన్షు శ్రీవాస్తవ కోర్టుకు వివరించారు. ఓ సన్నివేశంలో అజయ్ దేవగణ్ సూటు ధరించి చిత్రగుప్తుని పాత్రలో జోకులు పేల్చడం, అభ్యంతరకరమైన పదజాలం కనిపించిందని శ్రీవాస్తవ తన పిటిషన్లో పేర్కొన్నారు. చిత్రగుప్తుడు మంచి, చెడులను లెక్కిస్తాడు. దేవుళ్లను ఇలా వర్ణించడం వల్ల ఓ మతం మనోభావాలను దెబ్బతీస్తుందని న్యాయవాది పిటిషన్లో వివరించారు. దీంతో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది. ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది. -
బ్రేకప్ కాదు.. బ్రేక్ ఇచ్చారంతే.. జంటగా కియారా-సిద్ధార్థ్.. వీడియో వైరల్
Sidharth Malhotra Kiara Advani Back Together After A Break: బీటౌన్‌లో అప్పటిదాగా జంటగా కలిసి కనిపించిన లవ్ బర్డ్స్, దంపతులు ఒక్కసారిగా విడిపోతున్నారని రూమర్స్ రావడం పరిపాటే. ఇలాంటి సంఘటన ఇటీవల బీటౌన్‌లో జరిగింది. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు స్పందించలేదు. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కియారా-సిద్ధార్థ్ విడిపోయారని వార్తలు వచ్చి ఫ్యాన్స్‌ను షాక్ గురి చేయగా వారు కలిసి చెట్టాపట్టాలేసుకుని కనిపించిన వీడియో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నిర్వహించిన ఓ వేడుకలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియరా అద్వానీ తళుక్కుమన్నారు. ఒకరొకరు నవ్వుకుంటూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇది చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఒకవైపు రొహిత్ శెట్టి పోలీస్ సిరీస్ కోసం సిద్ధార్థ్ ఇస్తాంబుల్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు భూల్ భులయా 2 ప్రమోషన్లలో కియరా బిజీగా మారింది. ఈ టైట్ షెడ్యూల్స్ వల్ల వారి మధ్య కొంత బ్రేక్ వచ్చినట్లయింది. ఈ బ్రేక్ వల్లే వారు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయని వారి సన్నిహితులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియోతో వారు చెప్పిందే నిజమని తెలుస్తోంది. చదవండి: సౌత్ ఇండస్ట్రీపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ షేర్షాలో కలిసి నటించారు. ప్రమోషన్ల సమయంలో వారి మధ్య సన్నిహిత్యం చూసి వారు లవ్‌లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్. తర్వాత వచ్చిన బ్రేకప్ పుకార్లు అభిమానులను అసంతృప్తికి గురిచేశాయి. చదవండి: ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
షూటింగ్లో యంగ్ హీరోకు గాయాలు
బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో పోలీస్ ఫోర్స్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ యాక్షన్ సీన్‌కు సంబంధించిన గ్లింప్స్ షేర్ చేశాడు హీరో. ఇందులో ప్రత్యర్థిని చితకబాదుడుతున్నాడు సిద్దార్థ్. ఈ రియల్ ఫైటింగ్లో నిజంగానే హీరో చేతికి గాయాలయ్యాయి. మోచేతికి చిన్నచిన్న గాయాలై రక్తాలు కారాయి. ఈ ఫొటోను అతడు అభిమానులతో పంచుకోగా ఇది చూసిన ఫ్యాన్స్ కొందరు సిద్దార్థ్‌పై పొగడ్తలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం ఇలాంటి దెబ్బలు మాకు చాలానే తగిలాయిలే అని సెటైర్లు వేస్తున్నారు. కాగా పోలీస్ ఫోర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) చదవండి: సీక్రెట్‌గా సినిమా చూసిన సాయిపల్లవి, వీడియో వైరల్ తండ్రి ముందే బికినీలో కేక్ కటింగా? అంటూ ట్రోలింగ్.. గట్టి కౌంటరిచ్చిన ఐరా -
ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే..
Is Sidharth Malhotra, Kiara Advani Broken Up: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల బ్రేకప్ బి-టౌన్లో హాట్‌టాపిక్ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే ఇలా ఎవరి దారి వారదే అని విడిపోవటం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది స్పష్టత లేదు. చదవండి: అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ కానీ, బ్రేకప్ రూమర్స్‌పై ఈ జంట ఇంతవరకు స్పందించకపోవడంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారందరికి ఊరటనిస్తూ ఈ జంట విడిపోలేదని వారి సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కియారా, సిద్ధార్థ్‌లు కలిసి లేరనేది వాస్తవమే కానీ, అది గొడవల వల్ల కాదని చెబుతున్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉండటం కారణంగా కొద్ది రోజులు ఈ జంట విడిగా ఉంటున్నారని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ షూటింగ్లో భాగంగా టర్కిలో ఉండగా.. కియారా తన తాజా చిత్రం ‘భూల్ భులయ్యా-2’ మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉందట. చదవండి: పిల్లలతో వెకేషన్లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్ అందువల్లే వీరిద్దరు కలుసుకోవడం లేదని, సిద్ధార్థ్ టర్కి నుంచి రాగానే మీకే క్లారిటీ వస్తుందని కియారా, సిద్ధార్థ్‌ల మ్యూచువల్ ఫ్రెండ్స్ నుంచి సమాచారం. కాగా వీరిద్దరు తొలిసారి జంటగా నటించిన షేర్షా మూవీ షూటింగ్ సమయంలో కియారా, సిద్ధార్థ్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్‌బీర్‌ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్‌లో ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్‌లు విడిపోయినట్లు ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. -
ఓటీటీలో ఎంట్రి ఇస్తున్న శిల్పాశెట్టి.. పోస్టర్ విడుదల
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై సందడి చేస్తోంది. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌తో కలసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్ ద్వారా శిల్పా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్ని శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పోలీస్ డ్రెస్‌లో గన్ పట్టుకొని ఉన్న శిల్పాశెట్టి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్లో స్పెషల్ సెల్ ఆఫీసర్‌గా సిద్ధార్థ్ మల్హోత్ర కనిపించనుండగా, అదే టీమ్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా శిల్పా శెట్టి నటిస్తోంది. కాగా ఈ వెబ్‌సిరీస్ 8భాగాలుగా తెరకెక్కనుంది. Ready to set the OTT platform on fire for the first time🔥Superrr Thrilled to join The Action King #RohitShetty in his Cop Universe! #IndianPoliceForceOnPrime, now filming!🇮🇳👮♀️🚔💪 @SidMalhotra @PrimeVideoIN @RSPicturez #ShilpaShettyJoinsIndianPoliceForce #IndianPoliceForce pic.twitter.com/1JwOODKFZb — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) April 23, 2022 -
బాలీవుడ్లో మరో బ్రేకప్.. పెళ్లిదాకా వచ్చి విడిపోయిన స్టార్ కపుల్
బాలీవుడ్లో మరో జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే లైగర్ బ్యూటీ అనన్య ప్రియుడు ఇషాన్ ఖట్టర్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీఫుల్ కపుల్ తమ రిలేషన్‌కి ఎండ్ కార్డ్ వేసేశారు. బాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హ్రోత్రా బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ సడెన్‌గా ఏం జరిగిందో తెలియదు.. వీరు తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా షేర్షా మూవీతో కలిసి తొలిసారి కలిసి నటించిన కియారా- సిద్దార్థ్‌లు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్‌బీర్‌ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్‌లు విడిపోయినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. -
బాలీవుడ్ హీరోతో పని చేయడం సరదాగా ఉంది: రష్మిక
Rashmika Mandanna Tells About Working With Sidharth Malhotra: క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో నేషనల్ క్రష్‌గా స్థానం సంపాదించుకుంది రష్మిక మందన్నా. తన అల్లరి చేష్టలతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల పాన్ ఇండియాగా విడుదలైన 'పుష్ప' చిత్రంలో శ్రీవల్లిగా ప్రేక్షకుల మదిని దోచిందీ చిన్నది. సినిమాలతో బిజీగా ఉండే రష్మిక చుట్టూ రూమర్స్ కూడా బిజీగానే గింగిరాలు తిరుగుతున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్లు టాలీవుడ్లో పుకార్లు చెలరేగిపోతున్నాయి. ఇటీవల గోవాలో దిగిన ఫొటోలు లీక్ కావడంతో పుకార్లు నిజమే అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక ఒక హీరోతో పని చేయడం సరదాగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది ప్రేక్షకులు, అభిమానులను అలరించిన రష్మిక మందన్న బాలీవుడ్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. బీటౌన్‌లో 'మిషన్ మజ్నూ' సినిమాతో తెరంగ్రేటం చేయనుంది. ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించాడు. ఇటీవల ఎన్ఐతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ చిత్రం విశేషాలు, హీరోతో పనిచేయడం వంటి అనుభవాలను పంచుకుంది రష్మిక. ఇందులో 'సిద్ధార్థ్‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. మేము చాలా విషయాలపై మాట్లాడుకున్నాం. మేము సెట్లో కలిసి చాలా సార్లు భోజనం చేశాం. వర్క్ అవుట్ చేశాం. సిద్ధార్థ్ అద్భుతమైన నటుడు, మంచి వ్యక్తి. మిషన్ మజ్నూ చిత్రం ఎప్పుడూ నా హృదయానికి సన్నిహితంగా ఉంటుంది.' అని తెలిపింది రష్మిక. 'మిషన్ మజ్నూ' చిత్రానికి శాంతను బాగ్చి దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా ఒక ఇండియన్ ఆపరేషన్‌కు నాయకత్వం వహించే 'రా' ఏజెంట్ పాత్ర పోషిస్తున్నాడు. 1970 కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా వంటి ప్రముఖ తారలతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది రష్మిక మందన్నా. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఇదీ చదవండి: కాబోయే భర్తపై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇల్లరికం వస్తేనే పెళ్లి -
రిలేషన్ షిప్ స్టేటస్‌ను బయటపెట్టనున్న కియారా..
Kiara Advani And Sidharth Malhotra Relationship: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి ప్రేమాయణాన్ని గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం,ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రేమజంట తమ రిలేషన్ షిప్‌ను బయటపెట్టాలని చూస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా ఇద్దరూ తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అంతేకాకుండా త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. కాగా కాగా సిద్దార్థ్, కియారాలు తొలిసారి జంటగా‘షెర్షా’మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని బీటౌన్ టాక్. -
సిద్ధార్థ్‌తో అదిరిపోయిన రొమాన్స్.. కియారా ఇంటీలిజెంట్ రిప్లై
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటి కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. అయితే ఈ భామ, తను డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘షేర్షా’ మూవీలో నటించింది. ఇటీవల ఓటీటీ విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలో ఆ సినిమాలో హీరో సిద్ధార్థ్‌తో తెరపై పండిన రొమాన్స్ గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడింది కియారా. ‘బిగ్ స్క్రీన్‌పై కెమీస్ట్రీని ఎవరూ పండించలేరు. డైరెక్టర్ చెప్పింది మాత్రమే చేయగలం. ఈ మూవీలో నేను, సిద్ అదే చేశాం. అంతేకానీ ఏ ఇద్దరూ నటులు కూడా కథలో లేని దాన్ని చేసి చూపించలేరు’ అని ఈ బ్యూటీ తెలిపింది. విక్రమ్ బత్రా, ఆయన గర్ల్‌ఫ్రెండ్ డింపుల్ మధ్య జరిగిన విషయాలను డింపుల్ చెప్పింది కాబట్టే వారిద్దరూ చేయగలిగినట్లు నటి చెప్పింది. అయితే ఈ భామ ప్రస్తుతం హిందీలో ‘జగ్ జగ్ జీయో’,‘భుల్ భులయ్యా 2’, తెలుగులో రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’లో నటిస్తోంది. చదవండి: ఇబ్బందుల్లో ‘షేర్షా’ మూవీ.. బ్రాడ్ క్యాస్టింగ్ ఆపాలంటూ కేసు -
రియల్ హీరో.. యే దిల్ మాంగే మోర్!
నాయకుడంటే.. ఏదో ముందుండి నడిపిస్తున్నాడనే పేరుంటే సరిపోదు. లక్ష్యసాధనలో తన వెనకున్న వాళ్లకు సరైన దిశానిర్దేశం చేయాలి. విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలి. అవసరమైతే తెగువను ప్రదర్శించాలి.. త్యాగానికి సిద్ధపడాలి. ఇది మిగతా వాళ్ల గుండెల్లో ధైర్యం నింపుతుంది. గెలుపు కోసం చివరిదాకా పోరాడాలనే స్ఫూర్తిని కలగజేస్తుంది. కార్గిల్ వార్‌లో అసువులు బాసిన వీరులెందరో. అందులో కెప్టెన్ విక్రమ్ బాత్రా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కారణం.. పైన చెప్పిన లక్షణాలన్నీ ఆయన ప్రతిబింబించారు కాబట్టి. అన్నట్లు ఇవాళ ఈ కార్గిల్ అమరవీరుడి జయంతి. ఈ సందర్భంగా ఆ రియల్ హీరోను స్మరించుకుంటూ... ►హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్ జిల్లా ఘుగ్గర్ గ్రామంలో 1974 సెప్టెంబర్ 9న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు. ► చదవులోనే కాదు.. ఆటపాటల్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నారు. ► విక్రమ్ బాత్రా చిన్నప్పటి నుంచే ధైర్యశాలి. కరాటేలో గ్రీన్ బెల్ట్ హోల్డర్. టేబుల్ టెన్నిస్ నేషనల్ లెవల్లో ఆడారు. ► నార్త్ ఇండియా ఎన్సీసీ కాడెట్(ఎయిర్ వింగ్) నుంచి ఉత్తమ ప్రదర్శన అవార్డు సైతం అందుకున్నారు ► డిగ్రీ అయిపోగానే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అయ్యారు. ► 1996లో ఆయన కల నెరవేరింది. ఇండియన్ మిలిటరీ ఆకాడమీలో చేరారు. ► విక్రమ్ బాత్రా.. మన్నెక్షా బెటాలియన్‌కి చెందిన జెస్సోర్ కంపెనీ(డెహ్రాడూన్)లో చేరి, ఆపై లెఫ్టినెంట్‌గా, అటుపై కెప్టెన్ హోదాలో కార్గిల్ హోదాలో అడుగుపెట్టారు. ► డేరింగ్ అండ్ డాషింగ్ ఆటిట్యూడ్ ఉన్న విక్రమ్‌ను తోటి సభ్యులుగా ముద్దుగా షేర్షా అని పిల్చుకునేవాళ్లు ► గాంభీర్యంగా పైకి కనిపించే బాత్రా చాలా సరదా మనిషి. ఆయన చిరునవ్వే ఆయనకు అందమని చుట్టుపక్కల వాళ్లు చెప్తుంటారు ► ఆయన నోటి నుంచి ఓ ఇంటర్వ్యూలో వచ్చిన ‘యే దిల్ మాంగే మోర్’ డైలాగ్.. తర్వాతి కాలంలో పెద్ద బ్రాండ్‌కి ప్రచార గేయం అయ్యిందని చెప్తుంటారు కొందరు. అందులో నిజమెంతో గానీ.. ఆయన నుంచి మాత్రం ఆ మాట వచ్చిన విషయం వాస్తవం. ► కార్గిల్ వార్‌లో వేల అడుగుల ఎత్తున శత్రువులు సైతం ఊహించని మెరుపుదాడికి సిద్ధమయ్యారు ► దాడిలో తీవ్రంగా గాయపడ్డా కూడా శత్రువులకు వెన్నుచూపెట్టలేదు ఆయన. ముగ్గురు శత్రువుల్ని మట్టుబెట్టిన మరీ 24 ఏళ్లకు దేశం కోసం వీరమరణం పొందారు. ఆ పోరాటం మిగతా వాళ్లలో స్ఫూర్తిని విజయ బావుటా ఎగరేయించింది. ► మరణాంతరం పరమ వీర చక్రతో పాటు రియల్ హీరోల జాబితాలో చోటుసంపాదించుకుని యావత్ దేశం నుంచి గౌరవం అందుకున్నారాయన. ► డిగ్రీ టైంలో డింపుల్ ఛీమాతో నడిచిన ప్రేమ కథ.. విక్రమ్ వీరమరణంతో పెళ్లి పీటలు ఎక్కకుండానే విషాదంగా ముగిసింది. అంతా బలవంతం పెట్టినా విక్రమ్ జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుని ఆమె వివాహం చేసుకోలేదు. ‘రక్త్ సింధూర్’ ప్రేమ కథగా విక్రమ్-డింపుల్ కథ చరిత్రలో నిలిచిపోయింది. విక్రమ్ పుట్టినరోజు, మరణించిన రోజు డింపుల్ తప్పకుండా విక్రమ్ ఇంటికి వెళ్లి.. ఆయన పేరెంట్స్‌తో కాసేపు గడుపుతుంటుంది కూడా. ► రీసెంట్గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన షేర్షా.. ఈయన జీవిత కథ ఆధారంగానే తీసింది. ఇందులో డింపుల్ పాత్రను కియారా అద్వానీ పోషించింది. Heartfelt Tributes to great patriot Param Vir Chakra Captain #VikramBatra on his birth anniversary. He’s an epitome of courage, sacrifice and bravery. His exemplary bravery and valour would always inspire the Nation. #AmritMahotsav pic.twitter.com/2QDQWoYI1n — Ministry of Culture (@MinOfCultureGoI) September 9, 2021 - సాక్షి, స్పెషల్ డెస్క్ -
ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది: బాలీవుడ్ హీరో
సాక్షి, ముంబై: కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర పోషించిన నటుడు షేర్షా మూవీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. షేర్షాకు లభించిన అపూర్వ స్పందన, నెటిజన్ల ప్రేమకు సిద్ధార్థ్ సోషల్ మీడియాద్వారా సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) రేటింగ్‌లో 8.8 తో టాప్‌లో నించింది. 'నంబర్ 1 రేటింగ్ హిందీ మూవీ' అంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. (Shershaah Movie: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్) అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర చేయడం, మూవీ విజయవంతంకావడంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇది తనకు చాలా ప్రత్యేకం, ఎప్పటికీ గుర్తుండిపోయేదని పేర్కొన్నాడు. ఈ సందర్బంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అటు కియారా అద్వానీ కూడా సినిమా సక్సెస్ కావడంపై చాలా ఎమోషనల్‌గా ఉంది. దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. సినిమా తాను కెప్టెన్ బాత్రా కుటుంబాన్ని కలిశానని, తాను అచ్చం డింపుల్లాగా ఉన్నానని చెప్పడంతో తనకు కన్నీళ్లొచ్చాయని ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే నిజజీవిత డింపుల్‌తో కూడా మాట్లాడాననీ, షేర్షా మూవీలోని పాటలు ఆమెకు బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పారు. తాజాగా మూవీలో విక్రమ్ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని వీక్షిస్తూ కియారా భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అయింది. (Shershaah: వెక్కి వెక్కి ఏడ్చిన కియారా అద్వానీ వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్
సాక్షి,ముంబై: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాల కాలంలో విడుదలైన ఈ మూవీలో ముఖ్యమైన సన్నివేశాలు, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర నటన, ఉద్వేగ సన్నిశాల డైలాగ్స్‌తో యువ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జయహో అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ‘‘ఒక్కసారి సైనికుడిగా ఉంటే ఇక జీవితాతం అతడు సైనికుడే’’ ‘‘అయితే జెండా చేత బూని వస్తా.. లేదంటే త్రివర్ణ పతాకం చుట్టుకొని వస్తా.. కచ్చితంగా తిరిగి రావడం మాత్రం ఖాయం.’’ సహచరుడిని కోల్పోయిన తరుణంలో నీళ్లు నిండిన కళ్లతో కెప్టెన్ బాత్రా తన తోటి జవాన్లతో ఇలా అంటాడు.. "ఏ వార్ బడీ కుత్తీ ఛీజ్ హై యార్" యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటూ నినదిస్తాడు. చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్న విక్రమ్ భాత్రా యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటాడు. సాధారణ పౌరుడి జీవితంలో అనుకున్నది సాధించడం వేరు...కానీ ఒక సైనికుడిగా దేశ రక్షణ పోరాటంలో నిర్దేశిత మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్వేగపూరిత సన్నిశంలో ఈ డైలాగ్ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. దీంతోపాటు ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందన్నట్టుగా కెప్టెన్ విక్రమ్ బాత్రా అతని స్నేహితురాలు డింపుల్ చీమా అందించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్నికూడా షేర్షా బాగా హైలైట్ చేసింది. వీరి పెళ్లికి డింపుల్ తండ్రి అడ్డుపడ్డ సన్నివేశం, ఆర్మీలో చేరాలనే బాత్రా కల కోసం అందించిన ప్రోత్సాహంతోపాటు, ఆమె తెగువకు, ప్రేమకు సెల్యూట్ చేస్తుందీ సినిమా. నరనరాన దేశభక్తిని నింపుకున్న వీరజవాన్ విక్రమ్ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర ఫుల్మార్క్లు కొట్టేయగా, విక్రమ్ ప్రేయసి డింపుల్ క్యారెక్టర్లో కియారా అద్వానీ అటు అందంతో ఆకట్టుకోవడంతోపాటు ఇటు తెగువ, ధైర్యం ఉన్న మహిళగా అభినయంలోనూ జీవించింది. అలాగే కెప్టెన్ సంజీవ్‌గా శివ్ పండిట్, మేజర్ అజయ్ సింగ్‌గా నికితిన్ ధీర్, విక్రమ్ స్నేహితుడు సన్నీ పాత్రలో సాహిల్ వైద్ ఇలా అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. -
వైరల్ అవుతున్న కియారా, సిద్దార్థ్‌ల రొమాంటిక్ వీడియో!
బాలీవుడ్ రూమర్డ్ కపుల్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాలకు సంబంధించిన రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా గత కొంతకాలంగా వీళ్లీద్దరూ డేటింగ్లో ఉన్నట్లు బీ-టౌన్లో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి ప్రేమాయణాన్ని గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ హాలీడే వేకషన్‌కు మాల్దివులు వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా సిద్దార్థ్ మల్హోత్రా ఇటీవల ఓ వీడియో షేర్ చేశాడు. బ్యాగ్రౌండ్లో వారిద్దరూ నటించిన తాజా చిత్రం ‘షెర్షా’ సాంగ్ ప్లే అవుతుండగా.. కియారా అలా ముందుకు నడుస్తూ ఉంటే వెనకాల సిద్దార్థ్ వచ్చి తన చేయి పట్టుకుని రొమాంటిక్‌గా వెనక్కి లాగుతూ కనిపించాడు. ఈ సన్నివేశంలో వారిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చూడటానికి అచ్చం ‘రియల్ కపుల్‌లా ఉన్నారు’, ‘క్యూట్ జోడి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా సిద్దార్థ్, కియారాలు తొలిసారి జంటగా నటించిన ‘షెర్షా’ మూవీ అగష్టు 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ పరమ వీర చక్ర అవార్డు గ్రహీత, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందింది. ఇక షేర్షా మూవీ ప్రమోషన్లో భాగంగా సిద్దార్థ్ ఈ వీడియో షేర్ చేశాడు. కాగా ఇటీవల కియారా ఓ ఇంటర్య్వూలో సిద్దార్థ్ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితుడని, తామిద్దరం మంచి స్నేహితులమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
'యంగ్ హీరోతో డేటింగ్'.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కియారా
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పెళ్లిపై స్పందించింది. గత కొంతకాలంగా ఆమె బాలీవుడ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్లో ఉన్నట్టు బీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసింతే. వీరిద్దరూ కలిసి హలీడే వేకషన్‌కు మాల్దివులకు వెళ్లడం, తరచూ కియారా సిద్దార్థ్ ఇంటికి వెళుతూ మీడియా కెమెరాలకు చిక్కడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే తమ రిలేషన్‌పై ఈ కపుల్ ఎప్పుడు స్పందించలేదు. ఇదిలా ఉండగా కియారా, సిద్దార్థ్‌లు జంటగా నటించిన ‘షేర్షా’ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో కియారా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా సిద్దార్థ్‌తో తన రిలేషన్, అలాగే తన వివాహ ప్రణాళికి గురించి కూడా చెప్పుకొచ్చింది. కియారా మాట్లాడుతూ.. సిద్దార్థ్ మంచి నటుడని తన పనిపై ఎప్పుడు ఫోకస్‌గా ఉంటాడంటూ అతడిపై ప్రశంసలు కురిపించింది. ఇక సిద్దార్థ్ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితుడని, తామిద్దరం మంచి స్నేహితులుగా ఉంటామంటూ సిద్దార్థ్‌తో రిలేషన్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది ఈ భామ. ఇక తన పెళ్లి ఎప్పుడని హోస్ట్ ప్రశ్నించగా.. తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తెలియదు కానీ అరెంజ్డ్ మ్యారేజ్ మాత్రం చేసుకోనని చెప్పింది. తను ఎప్పటికైనా లవ్ మ్యారేజ్‌యే చేసుకుంటానని స్పష్టం చేసింది. ‘షేర్షా’ చిత్రం పరమ వీర చక్ర అవార్డు గ్రహీత, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందింది. ఇక దీని అనంతరం కియారా రామ్‌చరణ్‌తో మరోసారి జోడి కట్టనుంది. సన్సెషనల్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ‘ఆర్సీ 15’ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా కియారా నటించనుంది. -
ఆలియాకు కమిట్మెంట్ ఇవ్వలేదు..కానీ జాక్వెలిన్‌తో డేటింగ్
ఆలియా భట్.. అభినయమే ఆమెను అభివర్ణిస్తుంది.. సిద్ధార్థ్ మల్హోత్రా.. నటుడిగా నిరూపించుకోవాలన్న తపనే అతన్ని నిలబెడుతోంది.. కెరీర్, క్యారెక్టర్ మధ్య ఉన్న ఆ అంతరమే ఈ ఇద్దరి ప్రేమను కొనసాగనివ్వలేదు! ఆ బ్రేకప్ స్టోరీనే చెబుతోంది ఇవ్వాళ్టి ‘మొహబ్బతే’... వారసత్వ పరిఛాయే ఆలియాకు సినీరంగ ప్రవేశం కల్పించినా.. ప్రతిభతోనే స్థిరపడింది. అందం ఆమెకు అదనపు ఆకర్షణ మాత్రమే అయింది. ఆలియా ఎంట్రీకి పూర్తి భిన్నమైన ఇంట్రడక్షన్ సిద్ధార్థ్ది. పద్దెనిమిదో ఏటనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టి.. ఆ గ్రాఫ్‌ని కిందపడకుండా చూసుకున్నాడు. అయినా ఆ రంగం మీద ఆసక్తి తగ్గిపోయి సినిమా వైపు కదిలాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కరణ్ జోహార్ దగ్గర చేరి ‘మై నేమ్ ఈజ్ ఖాన్’కి పనిచేశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా విడుదలైంది. అది (వరుణ్ ధవన్‌తో పాటు) ఆలియా, సిద్ధార్థ్లకూ మొదటి సినిమా. అయితే ఇదివరకు చెప్పుకున్న సినిమా వాళ్ల ప్రేమ కథల్లా ఈ జంట మధ్య లవ్ ఆ సినిమా సెట్స్ మీద స్టార్ట్ కాలేదు. స్నేహం మాత్రమే ఏర్పడింది. అది అలా కొనసాగి కొనసాగి ప్రేమగా మారింది. ఆ విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో సిద్ధార్థ మల్హోత్రే చెప్పాడు.. ‘మేమిద్దరం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌గా కలవలేదు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు అని. డేటింగ్ కంటే ముందు నుంచే ఆలియా నాకు తెలుసు.. స్నేహితురాలిగా. మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ప్రేమగా మారిందో కూడా తెలీలేదు’ అని. షికార్లు.. పుకార్లు యాజ్ యూజువల్.. వీళ్లిద్దరూ కలసి నటించింది ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘కపూర్ అండ్ సన్స్’ .. ఈ రెండు సినిమాల్లోనే. అందుకే సెట్స్ మీద పుట్టే ఆకర్షణ కన్నా.. సినిమాకవతలి అవగాహనతోనే దగ్గరయ్యారు. ఇద్దరి షెడ్యూల్స్‌లోని ఖాళీ సమయాల్లో షికార్లకెళ్లారు.. పార్టీలు చేసుకున్నారు.. హ్యాంగవుట్స్తో సేద తీరారు. అవన్నీ మీడియాలోని సినిమా కాలమ్స్‌లో ఎక్స్ట్రా స్పేస్‌ను తీసుకున్నాయి. బాలీవుడ్ జనాలు ఈ జంట మీద కామెంట్లు సంధించేకంటే ముందే తమ ప్రేమను ప్రకటించాలని నిర్ణయించుకున్నారిద్దరూ. ఆలియా స్టార్ అయ్యింది..దూరం పెరిగింది ఆలియా నటించిన సినిమాలు హిట్ల మీద హిట్లు కొడుతూ ఆమెను స్టార్‌గా మార్చేశాయి. సిద్ధార్థ్ ఎంచుకున్న సినిమాలు ఫ్లాప్‌లతో నటుడిగా అతన్ని నిరూపించుకునే ప్రయత్నలలోనే ఉంచేశాయి. ఇది సహజంగానే అతని ఈగోని ప్రభావితం చేసింది. మానసికంగా ఆలియాతో దూరాన్ని పెంచింది. ఆ దూరాన్ని తను నటిస్తున్న సినిమాల్లోని కథానాయికల దగ్గర సాన్నిహిత్యంగా మలచుకున్నాడు సిద్ధార్థ్. అలా అతని జీవితంలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వచ్చింది ‘ఎ జెంటిమన్’ చిత్రంతో. సిద్ధార్థ్ లైఫ్‌లోకి జాక్వెలిన్ ఎంట్రీ ఆ సినిమా సెట్స్ మీద వాళ్లిద్దరూ ఒకరి ఆకర్షణకు ఒకరు లోనయ్యారు. షూటింగ్ అయిపోయాక కూడా మియామీ (అమెరికా) బీచుల్లో గంటలు గంటలు కాలక్షేపం చేశారు. లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లారు. డిన్నర్ డేట్స్ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆలియాతో మాటలు, మంచిచెడుల విచారణ మిస్ అయింది ఆ ప్రేమ డైరీలో. సిద్ధార్థ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలియాకు అనుమానం వచ్చేలోపలే జాక్వెలిన్‌తో అతని వ్యవహారం ఆమె చెవిన పడింది. ఫీలైంది. పొగిలి పొగిలి ఏడ్చింది. తనను అతను అర్థం చేసుకుంది అంతేనా? అని బాధ పడింది. ఆ ప్రేమకు బలం లేదని నిర్ధారించుకుంది. సిద్ధార్థ్‌ను క్షమించింది.. కెరీర్ మీద మరింత దృష్టి పెట్టింది. బ్రేకప్‌కి కొన్ని కారణాలున్నాయి ఇద్దరూ కలుసుకున్నప్పుడు.. సంజాయిషీ అడిగారు.. ఇచ్చుకున్నారు. ‘స్నేహాన్ని మాత్రం భద్రం చేసుకుందాం..’ అని నిశ్చయించుకున్నారు. ఆ మాట మీదే ఉన్నారు. అలా నాలుగేళ్ల ఆ ప్రేమకు బ్రేక్ పడింది. విడివిడిగా వాళ్ల ప్రయాణం కొనసాగింది. ‘కలసి ఉండాలి అనుకోవడానికి ఏ రీజన్ లేకపోయినా విడిపోవాలి అనుకోవడానికి కచ్చితంగా కారణం ఉంటుంది. అలా మా బ్రేకప్కీ మాకంటూ కొన్ని కారణాలున్నాయి. నాలుగేళ్ల మా సాహచర్యంలో సంతోషాలెన్నో.. స్పర్ధలూ అన్నే. స్పర్థలను మరిచిపోయి... హ్యాపీ మూమెంట్స్నే గుర్తుపెట్టుకోవాలి అనుకున్నాం. అందుకే విడిపోయినా ఫ్రెండ్స్‌గా హాయిగా.. హ్యాపీగా ఉన్నాం’ అని చెప్పాడు సిద్ధార్థ్ మల్హోత్రా కాఫీ విత్ కరణ్ షోలో. ‘సిద్ధార్థ్, నేను ఒకేసారి ఫీల్డ్‌లోకి వచ్చాం. మా ఇద్దరి మధ్య బోలెడంత చరిత్ర ఉంది. మేం కలసి చేసిన ప్రయాణంలోని ఎన్నో మలుపులకు ఇద్దరం సాక్షులమే. నిజం చెప్పాలంటే.. సిద్ధార్థ్ మీద నాకెలాంటి నెగెటివ్ థాట్స్ లేవు. అతనంటే అప్పుడెంత గౌరవం ఉందో.. ఇప్పుడూ అంతే ఉంది. నా విషయంలో తనూ అలాగే ఉన్నాడనుకుంటున్నాను. మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడుకుంటాం.. కలవాలనిపిస్తే కలుస్తాం.. ఎలాంటి బ్యాడ్ వైబ్స్ లేకుండా’ అని ఆలియా భట్ కూడా చెప్పింది ఓ ఇంటర్వ్యూలో. అయితే ఈ జంట విడిపోవడానికి సిద్ధార్థ్ మల్హోత్రా.. ఆలియాకు కమింట్మెంట్ ఇవ్వకపోవడమే కారణమంటాయి బాలీవుడ్ వర్గాలు. ∙ఎస్సార్ -
నో థియేటర్..ఓన్లీ ‘ఓటీటీ’: నష్టాలకే మొగ్గు!
ఓవైపు థియేటర్ యాజమాన్యాల హెచ్చరికలు.. మరోవైపు సంగ్ధిగ్ధ స్థితిలో నిర్మాతలు ఓటీటీ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాయి. వెరసి.. ‘పెద్ద సినిమాల రిలీజ్’ వివాదాస్పదంగా మారుతోంది. అయితే సౌత్‌తో పోలిస్తే.. నార్త్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. మరి ‘డిజిటల్’ రిలీజ్‌లతో నిర్మాతలు నిజంగా అంత లాభపడుతున్నారా? సాక్షి, వెబ్‌డెస్క్: కిందటి ఏడాది కరోనా-లాక్డౌన్ టైం నుంచే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి హిందీ సినిమాలు. నెలకు కమ్‌సేకమ్ ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా ఉంటుండగా, అందులో స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలు, అప్పుడప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఉంటున్నాయి. అయితే చాలాకాలం నుంచి థియేటర్లు తెరుస్తారనే సంకేతాలు ప్రభుత్వాల నుంచి వెలువడుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ స్ట్రీమింగ్ సర్వీసులకే ప్రాధాన్యం ఇస్తోంది బాలీవుడ్. ‘భుజ్’ లాంటి భారీ ప్రాజెక్టు ఓటీటీ రిలీజ్‌కే మొగ్గు చూపడం అందుకు నిదర్శనం. కొసమెరుపు ఏంటంటే.. ఇలా ఓటీటీ రిలీజ్ ద్వారా ఫిల్మ్‌మేకర్స్ పెద్దగా వెనకేసుకుంటోంది ఏం లేకపోగా.. కొందరైతే నష్టాలతోనే అమ్మేసుకుంటున్నారు. ఒరిగిందేం లేదు ఆలస్యం చేయకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తే జనాలకు ఎక్కువ రీచ్ ఉంటుందని నిర్మాతలు పైకి చెప్పుకుంటున్నప్పటికీ.. ఆర్థికంగా ఆ నిర్ణయం వాళ్లను పెద్ద దెబ్బే తీస్తోంది. కిందటి ఏడాది లాక్డౌన్ టైంలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ మూవీ అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ. డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫలితం ‘డిజాస్టర్’. కానీ, ఆ సీజన్లో వచ్చిన సినిమాలతో పోలిస్తే.. ఓటీటీ హక్కుల ద్వారా వంద కోట్ల దాకా వెనకేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో వరుణ్ ధావన్ ‘కూలీ నెం.1’ క్రిస్మస్ సీజన్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. నిజానికి టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాలు గనుక థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉంటే.. మినిమమ్ వంద కోట్ల బిజినెస్.. మాగ్జిమం 250 కోట్ల దాకా ఫుల్‌రన్ బిజినెస్ చేసి ఉండేవేమో. అటుపై టాక్‌ను బట్టి శాటిలైట్, ఓటీటీ రైట్స్‌తో అదనంగా ఆదాయం వచ్చి ఉండేది. అదే విధంగా ఈ ఏడాదిలో సల్మాన్ ఖాన్ ‘రాధే’, ఫర్హాన్ అక్తర్ ‘తూపాన్’ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ, వీటి రేంజ్‌కి థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే.. డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా పెద్దగా వచ్చిన లాభం ఏం లేదని బాలీవుడ్ ట్రేడ్ గణాంకాలే చెప్తున్నాయి. అయినను ఓటీటీకే.. అక్షయ్ కుమార్ బాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన సినిమా మినిమమ్ వంద కోట్ల బిజినెస్ చేస్తుంటుంది. అలాగే అజయ్ దేవగన్‌కి కూడా వంద కోట్ల మార్కెట్ ఉంది. ఫర్హాన్ అక్తర్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లకు రేంజ్ 75 కోట్ల రూపాయల పైనే. ఇక స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలు ఎలాగూ 30 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేస్తుంటాయి. ఇలాంటి టైంలో లాభాలు తెచ్చే థియేటర్ బిజినెస్‌ను కాదని.. ఓటీటీకే ఫిక్స్ అవుతున్నారు నిర్మాతలు. త్వరలో బాలీవుడ్లో ‘భుజ్ ది ప్రైడ్’, సిద్దార్థ్ మల్హోత్రా ‘షేర్ షా’లు ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతున్నాయి. మరో నాలుగైదు సినిమాలు కొన్ని రిలీజ్ కాగా, మరికొన్ని కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకులనే అలరించబోతున్నాయి. మొత్తంగా థియేటర్ బిజినెస్‌తో ఇవి ఐదారు వందల కోట్ల దాకా బిజినెస్ చేయొచ్చు. కానీ, కేవలం 150 కోట్ల డీల్‌తో ముగించుకుని డిజిటల్ తెరపై సందడి చేయబోతున్నాయి. ఇందులో భుజ్.. భారీ కాస్టింగ్, బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే నిర్మాణ ఖర్చుల కంటే తక్కువ ధరకు ఓటీటీ రిలీజ్‌కు వెళ్తుండడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే షేర్షా కూడా బడ్జెట్ కంటే తక్కువ మార్కెట్‌తోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన లాభాల మాటేమోగానీ.. లాస్‌తోనే ఈ రెండు సినిమాలు థియేటర్లను కాదనుకుని రిలీజ్ అవుతున్నాయి. అయితే పరిస్థితులు చక్కబడితే తిరిగి థియేటర్లో భారీ సంఖ్యలో స్క్రీన్లపై రిలీజ్ చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. మరి ఇందుకు థియేటర్-మల్టీఫ్లెక్సుల యాజమాన్యాలు అంగీకరిస్తాయా? అనేది ప్రశ్నార్థకమే. బ్యాడ్మార్క్ వల్లే.. కరోనా టైం నుంచే బాలీవుడ్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. సుశాంత్ మరణానంతరం బాలీవుడ్ పరిణామాలు విపరీతంగా మారిపోయాయి. ఆడియొన్స్‌లో ఇండస్ట్రీ పట్ల నెగెటివిటీ కొనసాగుతోంది. ఉదాహరణగా సడక్-2కు ఎంత దారుణంగా తిప్పి కొట్టారో తెలిసిందే. అలాగే మంచి సినిమాలకు ఆదరణ కూడా అంతంతగా మాత్రంగానే దక్కింది. అనూహ్యంగా.. ఓటీటీలో సౌత్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభించడం విశేషం. ఈ తరుణంలోనే థియేట్రికల్ రిలీజ్‌కు బడా ఫిల్మ్ మేకర్లు వెనుకంజ వేస్తున్నారనేది ముంబైకి చెందిన ఓ సీనియర్ క్రిటిక్ అభిప్రాయం. అయితే ఇందులో నిజం లేదని, పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లు ఓపెన్ అయ్యాక పరిస్థితి మునుపటిలా మారుతుందనేది బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెబుతున్నాడు. ఏదేమైనా బాలీవుడ్ మునుపటిలా కలెక్షన్లు కొల్లగట్టే స్థితికి చేరేది అనుమానమనేది చాలామంది విమర్శకుల అంటున్న మాట. -
రష్మిక సినిమా: గాయపడ్డ హీరో
ముంబై: శాంతను బగ్చీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిషన్ మజ్ను’. ఈ చిత్రం షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ మోకాలికి గాయమైంది. అయినప్పటికీ షూట్ ని ఆపకుండా తరువాత 3 రోజులు కొనసాగించాడు. సిద్ధార్థ్ మల్హోత్రాకు సన్నిహితులలో ఒకరు అతని మోకాలికి లోహపు ముక్క తగిలి గాయమైందని వెల్లడించారు. గాయం తరువాత అతనికి రక్తస్రావం, వాపు లాంటివి లేవు, కానీ నొప్పితో మాత్రం బాధపడుతున్నాడని తెలిపాడు. ‘మిషన్ మజ్ను’ 1970 కాలానికి సంబంధించిన కథ కావడంతో అప్పటి కాలం సెట్ వేయడానికి నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. కాబట్టే, నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశ్యంతో మల్హోత్ర దెబ్బ తగిలినప్పటికీ షూటింగును కొనసాగించాడు. ‘మిషన్ మజ్ను’ తో దక్షిణాది హీరోయిన్ రష్మిక మందన్నా తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. 1970లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. భారతదేశం అత్యంత సాహసోపేతమైన మిషన్ కు సంబంధించిన కథ, అలాగే ఇది రెండు దేశాల మధ్య సంబంధాన్ని శాశ్వతంగా మార్చివేసిన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ( చదవండి: ‘వైల్డ్‌డాగ్ ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు’ ) -
బాలీవుడ్లో కొత్త మిషన్‌ను స్టార్ట్ చేసిన రష్మిక
బాలీవుడ్లో కొత్త మిషన్‌ను స్టార్ట్ చేశారు హీరోయిన్ రష్మికా మందన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శంతను బాగ్చీ దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమా ‘మిషన్ మజ్ను’లో నటిస్తున్నారామె. 1971నాటి బ్యాక్‌డ్రాప్‌లో స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తారు సిద్ధార్థ్ మల్హోత్రా. తాజాగా ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు రష్మికా మందన్నా. ‘‘ఈ సినిమాలో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’, శర్వానంద్ చేస్తున్న ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాల్లో నటిస్తున్నారామె. తమిళంలో రష్మిక నటించిన ‘సుల్తాన్ ’ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. -
‘మిషన్ మజ్ను’ షూటింగ్ ప్రారంభం
అతి తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీని దక్కించుకున్న రష్మిక మందన్నా..వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్లో సెన్సేషనల్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. లక్నోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో హీరో, హీరోయిన్ల ఫస్ట్‌లుక్ ఫోటోని చిత్రబృందం విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ఓ మిషన్ విజయవంతం చేసే రా ఏజెంట్‌గా సిద్ధార్థ్ కనిపించనుండగా, రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. (దుమ్మురేపుతున్న రష్మిక ‘టాప్ టక్కర్’ టీజర్) 1970 నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శాంతను బాగ్చీ దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూ వాలా, అమర్ బుటాల, గరిమ మెహత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తైన తర్వాత అమితాబ్ బచ్చన్ సినిమాలోనూ రష్మిక కనిపించనుంది. వికాస్ బాల్ దర్శకత్వంలో వస్తున్న ‘డాడీ’ సినిమాలో అమితాబ్ కుమార్తె పాత్రలో రష్మిక కనిపించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పొగరు, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ రష్మిక నటించనుంది. (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
ప్రియుడితో బాలీవుడ్ బ్యూటీ చెట్టాపట్టాల్!
అందరూ ఒకేలా ఉండరు. బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు తమ పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో చెప్పుకునేందుకు ఎల్లప్పుడూ రెడీ ఉంటారు. మరికొందరు మాత్రం వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచేందుకే సుముఖత చూపుతారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రెండో రకానికి చెందుతుంది. సహ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఏడాది నుంచి వార్తలు వినిపిస్తునే ఉన్నాయి, కానీ ఆమె దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో గత నెలాఖరున బాంద్రాలోని సిద్ధార్థ్ నివాసానికి వెళ్తూ కియారా కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది. కానీ ఈసారి కియారా ఏకంగా ప్రియుడిని వెంటేసుకుని నిర్మాత కరణ్ జోహార్ ఇంటికి వెళ్లింది. ఆదివారం కరణ్ తన కవలలు యశ్, రూహిల బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పుట్టినరోజు వేడుకలకు లవ్ బర్డ్స్‌కు ఆహ్వానం అందడంతో వీరు జంటగా కలిసి వచ్చారు. పార్టీ అనంతరం రాత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వీరితో పాటు కరీనా కపూర్, గౌరీ ఖాన్, రాణీ ముఖర్జీ, నేహా ధూపియా సహా పలువురు సెలబ్రిటీలు సైతం కరణ్ ఇంట్లోని వేడుకకు హాజరై సందడి చేశారు. ఇదిలా వుంటే కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. దీనికి విష్ణువర్దన్ దర్శకత్వం వహించగా కరణ్‌జోహార్ సహనిర్మాతగా వ్యవహరించాడు. చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఇంటికి హీరోయిన్! ప్రతిభ ఉంటే అవకాశాలొస్తాయి: కృతిక కమ్రా -
ప్రియుడి ఇంటికి వెళ్తూ దొరికిన బ్యూటీ!
తెలిసీ తెలీని వయసులో బ్యూటీ కియారా అద్వానీ ప్రేమలో పడింది. దీంతో ఆమె పేరెంట్స్ నీ వయసెంత? నువ్వు చేస్తున్న పనులేంటి? ముందు నీ చదువు మీద దృష్టి పెట్టు అని హెచ్చరించారు. ఇదెప్పుడో స్కూల్ డేస్‌లో జరిగిన ఘటన. తర్వాత కియారా స్కూల్, కాలేజ్ దాటేసి బాలీవుడ్లో అడుగు పెట్టి హీరోయిన్గా ప్రజాదరణ పొందుతోంది. అదే సమయంలో తోటి నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో పడ్డట్లు ఏడాది కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం నాడు బాంద్రాలోని సిద్ధార్థ్ నివాసానికి వెళ్తూ కియారా దర్శనమివ్వగా నెటిజన్లు ఫొటోలు క్లిక్‌మనిపించారు. (చదవండి: ‘షోలే’ నటుడు కన్నుమూత) వారిని దాటుకుని ఎలాగోలా సిద్ధార్థ్ ఇంటికి చేరుకున్న ఆమె అతడిని వెంటేసుకుని భోజనానికి వెళ్లొచ్చారట. మొత్తానికి బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ కెమెరాకు దొరికిపోయిన కియారా ఫొటోలు ప్రస్తుతం బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌లోనూ ఈ జంట 2020కి గుడ్‌బాయ్ చెప్పేందుకు మాల్దీవులకు వెళ్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కింది. ఇదిలా వుంటే కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. దీనికి విష్ణువర్దన్ దర్శకత్వం వహించగా కరణ్‌జోహార్ సహనిర్మాతగా వ్యవహరించాడు. (చదవండి: పర్యటనకు వెళుతున్న బాలీవుడ్ జంటలు) -
‘థ్యాంక్ గాడ్’ అంటున్న అజయ్, రకుల్
ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకుంటే ‘థ్యాంక్ గాడ్’ అంటుంటాం. ఇప్పుడు అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రాలు కూడా ధన్యవాదాలు దేవుడా అంటున్నారు. మరి వీరు ఏ విపత్తు నుంచి తప్పించుకున్నారో తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే. అజయ్ దేవగణ్, రకుల్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న హిందీ చిత్రం ‘థ్యాంక్ గాడ్’. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఈ నెల 21న సెట్స్ మీదకు వెళ్లనుంది. వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. -
న్యూ ఇయర్ వేడుకల్లో బాలీవుడ్ జంటలు
ముంబై: కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు బాలీవుడ్ సెలబ్రిటీలు జంటలుగా విదేశాలకు పయనమవుతుంటారు. ఈ సమయంలోనే ఆయా సెలబ్రిటీల మధ్య ఉన్న రిలేషన్షిప్ బయటపడుతుంది. తాజాగా ఈ జాబితాలో సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, అనన్య పాండే-ఇషాన్ కట్టర్లు చేరారు. కొత్త సంవత్సరం వేడుకను జరుపుకునేందుకు ప్రచారంలో ఉన్న ఈ రెండు ప్రేమ జంటలు విడివిడిగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొద్దికాలంగా కియారా, సిద్దార్థ్ మల్హోత్రాలు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి ప్రేమ వ్యవహరంపై వస్తున్న వార్తలను ఈ జంట కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ బీ-టౌన్ రోడ్లపై మాత్రం వీరిద్దరూ చక్కర్లు కొడుతూ మీడియా కెమారాలకు చిక్కుతుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ జంట న్యూ ఇయర్ సందర్భంగా మాల్ధీవుల పర్యటనకు వెళుతూ విమానాశ్రయంలో మీడియా కెమారాలకు చిక్కారు. అలాగే అనన్య, ఇషాన్‌ల ఎయిర్‌పోర్టు ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరి మధ్య ప్రేమయాణం నడుస్తుందంటూ ఇటీవల బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వార్దిద్దరూ ఎప్పుడు కూడా స్పందించలేదు. అయినప్పటికి అనన్య, ఇషాన్‌లు కలిసి పార్టీలకు, విందులకు జంటగా హజరవుతుంటారు. ఈ క్రమంలో క్యాజువల్ వేర్లో అనన్య, ఇషాన్‌లు ఎయిర్‌పోర్టులోకి వెళుతూ కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. దీంతో ఈసారి న్యూ ఇయర్‌ను వీరిద్దరూ జంటగా జరుపుకోనున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడతున్నారు. అయితే అనన్య, ఇషాన్‌లు ‘ఖాలీపీలీ’లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తామీద్దరం మంచి స్నేహితులం అయ్యామంటూ పలు ఇంటర్వ్యూల్లో అనన్య, ఇషాన్‌లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. -
ఒక్కసారి ఒరిజినల్ సాంగ్ వినండి: రెహమాన్
పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేయటం అన్ని చిత్ర పరిశ్రమల్లో ఓ ట్రెండ్‌గా కొనసాగుతోంది. అయితే కొన్ని పాటల మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. సరిగా మెప్పించని పాటలు సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే. సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా నటించిన మసక్కలి 2.0 హిందీ పాట ఇటీవల విడుదలైంది. కొత్త వర్షన్ మసక్కలి పాటను తనీష్ బాగ్చి రూపొందించారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా ఈ మసక్కలి 2.0 పాటపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్విటర్లో స్పందించారు. ‘ఒక పాటను రూపొందించడానికి నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. పలుమార్లు మార్చి మార్చి పాటను రూపొందించాల్సి ఉంటుంది. ఒరిజినల్ మసక్కలి పాట కోసం సుమారు 200 మంది సంగీతకారులు పనిచేశారు. అందుకే ఒకసారి మసక్కలి ఒరిజినల్ పాటను విని సంతోషించండి’ అని రెహమన్ పేర్కొన్నారు. అంతేకాకుండా మసక్కలి ఒరిజనల్ పాట లింక్‌ను కూడా షేర్ చేశాడు. కాగా ఈ పాటను ఏఆర్ రెహమన్ ‘ఢిల్లీ 6’ మూవీ కోసం కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పాట పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ పాటను మోహిత్ చౌహాన్ పాడగా, ప్రసూన్ జోషి సాహిత్యం అందించారు. ఇక ‘ఢిల్లీ 6’ సినిమాలో సోనమ్ కపూర్, అభిషేక్ బచ్చన్లు జంటగా నటించిన విషయం తెలిసిందే. ‘ఢిల్లీ 6’ సినిమాకు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. Enjoy the original #Masakali https://t.co/WSKkFZEMB4@RakeyshOmMehra @prasoonjoshi_ @_MohitChauhan pic.twitter.com/9aigZaW2Ac — A.R.Rahman (@arrahman) April 8, 2020 -
'సార్! నాలో ఏం చూసి హీరోగా అవకాశం ఇచ్చారు'
రూపవంతుడు అనే మాట అందరికీ వర్తించదు. చెక్కిన శిల్పంలా ఉంటాడు అని అందరినీ అనలేము.సిద్దార్థ్ మల్హోత్రా ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే ‘ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు. ఈ ఫేసే అతణ్ణి కాపాడింది. గాడ్ఫాదర్లు లేకపోయినా స్ట్రగుల్ చేద్దామంటే సపోర్ట్ లేకపోయినా పట్టుదలతో పోరాడి మిడిల్ క్లాస్ నుంచి టాప్ క్లాస్‌కు చేరిన హీరో కథ ఇది. సిద్దార్థ్ మల్హోత్రాకు తాను అందగాణ్ణని తెలియదు. పుట్టింది పెరుగుతున్నది ఢిల్లీలో. వాళ్ల నాన్న మర్చంట్ నేవీలో పని చేసేవాడు కనుక నేవీ అంటే సముద్రంతో పని కనుక సముద్రాన్ని చూసినా, నదిని చూసినా తండ్రిని తలుచుకుని ఎగ్జయిట్ అయ్యేవాడు. చదువు పెద్దగా రాలేదు. రగ్బీ ఆడేవాడు. పెద్దయ్యాక ఏమవుతావ్ అంటే ‘రివర్ రాఫ్టర్ ట్రయినర్ని అవుతా అని అనేవాడు. రివర్ రాఫ్టర్ అంటే ఒడిదుడుకుల ప్రయాణం. కాని విధి అతణ్ణి అంతకంటే వొడిదుడుకులు ఉన్న ప్రవాహంలో పడేసింది. ఆ ప్రవాహం పేరు సినిమా ఇండస్ట్రీ. రెస్టారెంట్లో ఆఫర్ సిద్దార్థ్ కామర్స్‌లో డిగ్రీ చేస్తుండగా ఒకరోజు రెస్టారెంట్లో కూచుని టీ తాగుతుంటే ‘ఈ కుర్రాడు అందగాడు’ అని గ్రహించిన ఒక యాడ్ ఏజెన్సీ అతని దగ్గరకు వచ్చి ‘నువ్వు బాగున్నావ్.. మోడలింగ్ చెయ్’ అని చెప్పాడు. అప్పుడు సిద్దార్థ్ వయసు సరిగ్గా 18 సంవత్సరాలు. ఆ వయసులో రంగుల ప్రపంచంలో అడుగు పెట్టడం ఏ కుర్రాడికైనా ఎగ్జయిట్ చేసే సంగతే కదా. సరే అన్నాడు. ముంబైతో పోల్చితే ఢిల్లీలో మోడలింగ్ ప్రపంచం చిన్నది. ఆ చిన్న ప్రపంచంలో సిద్దార్థ్ స్టార్ అయ్యాడు. మంచి మంచి బట్టలు వేసుకుని ర్యాంప్ మీద నడవడం, అందుకు డబ్బులు కూడా రావడం కిక్ ఇచ్చింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. డిగ్రీ పూర్తయ్యింది. మామూలుగా అయితే ఎం.బి.ఏ చేయాలనేది ప్లాన్. ఇప్పుడు మోడలింగ్ వల్ల మనసు చదువు మీద నిలవడం లేదు. అలాగని మోడలింగ్ కూడా నచ్చట్లేదు. ఒకరోజు తన ఏజెన్సీకి వెళ్లి ‘ఇక మోడలింగ్ చేయను’ అన్నాడు. ‘ఏం’ అన్నారు వాళ్లు. ‘ఏముంది ఇందులో చేయడానికి. ఇచ్చిన డ్రస్ వేసుకొని కెమెరామాన్ ఇమ్మన్న ఫోజు ఇవ్వాలి. బోరు కొడుతోంది’ అని వచ్చేశాడు. మనసు పెద్ద తెర మీద ఉంది. ఈ ముఖం పెద్దతెరకు సూట్ అవుతుంది అనుకున్నాడు. ఆఫీస్‌లో నిద్ర షారూక్ ఖాన్‌తో ‘రా–వన్’ లాంటి భారీ సినిమా తీసిన అనుభవ్ సిన్హా ఆ సినిమా తీయడానికి ముందు చిన్న సినిమా తీయడానికి ఢిల్లీ వచ్చి ఆడిషన్స్ నిర్వహించాడు. ఊళ్లో అందంగా ఉన్న కుర్రవాడు సిద్దార్థ్ కనుక పెద్ద శ్రమ లేకుండానే సెలెక్ట్ అయ్యాడు. ‘నా సినిమాలో నువ్వే హీరో’ అనేసరికి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చి బ్యాగ్‌లో బట్టలతో పాటు కొన్ని కలలను కూడా కుక్కుకుని ముంబైకి చేరుకున్నాడు. అనుభవ్ సిన్హా ఆఫీసులోనే బస. ఆఫీస్ ఉన్నప్పుడు బయట తిరిగి ఆఫీస్ మూసేసే సమయానికి చేరుకుని అక్కడే పడుకోవడం. సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. చివరకు ‘రా–వన్’ అవకాశం రావడంతో సినిమాయే ఆగిపోయింది. ఆ తలదాచుకునే చోటు కూడా లేదు. ముంబైలో ఒక్కరోజు గడపడమే ఖర్చుతో కూడిన పని. మిడిల్ క్లాస్ మనుషులు ఎంతని పంపుతారు... ? ఫ్రెండ్స్ ఇళ్లలో హాల్ మీద చాప వేసుకొని పడుకోవడం, బెడ్రూమ్ అంత ఇల్లు మాత్రమే ఉన్న చోట అక్కడే సిగ్గులేకుండా అడ్జస్ట్ అవడం ఇలా కొనసాగింది. ఢిల్లీలో ఆడిషన్ ఇచ్చిన అనుభవంతో ముంబైలో ఆడిషన్స్ ఇవ్వడానికి వెళితే లెక్క చేసేవారు కాదు. ‘నేను పెద్ద మోడల్ని’ అంటే ‘నీలాంటి వాళ్లు వెయ్యి మంది వస్తుంటారు’ అని తేలిక చేసేవారు. అవమానాలు.. అవమానాలు.. అవమానాలు... ఆటో రిక్షా చూపిన దారి ఒకరోజు ఫ్రెండ్‌తో కలిసి ఆటోలో వస్తూ ఉంటే ఆ ఫ్రెండ్ సినిమా వాళ్ల కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ‘నీకెలా తెలుసు?’ అని అడిగితే ‘నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. నువ్వూ చెయ్. సినిమా పని తెలుస్తుంది’ అని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎలా దూరాలో సిద్దార్థ్‌కు తెలియదు. ఒక మోడల్‌గా ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పరిచయం ఉంది కాబట్టి వెళ్లి ఆయనను అడిగితే ‘ధర్మా ప్రొడక్షన్స్ వాళ్లకు చెబుతాను. వెళ్లి పని చెయ్’ అన్నాడు. ధర్మా ప్రొడక్షన్స్ వాళ్లు ఆ సమయంలో జాన్ అబ్రహమ్, అభిషేక్ బచ్చన్‌లతో ‘దోస్తానా’ తీస్తున్నారు. ఆ సినిమాలో మొదట పని చేశాడు సిద్దార్థ్. ఆ తర్వాత ఆ సంస్థ అధిపతి, దర్శకుడు అయిన కరణ్ జొహర్ కింద షారూక్ ఖాన్ హీరోగా ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాకు పని చేశాడు. అదే సినిమాకు ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద హీరోగా ఉన్న వరుణ్ ధావన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్. ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ సెట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా కరణ్ జొహర్‌తో తమకు యాక్టింగ్ చేయాలని చెబుతూ వచ్చేవారు. కరణ్ జొహర్ స్టార్ కిడ్స్‌కు లిఫ్ట్ ఇవ్వడంలో ముందుంటాడు... చాన్స్ ఇస్తే (దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడైన) వరుణ్ ధావన్‌కు ఇవ్వొచ్చు... ఏ తాడూ బొంగరం లేని నాకెందుకు ఇస్తాడు అని సిద్దార్థ్ అనుకునేవాడు. కాని వరుణ్ దగ్గర లేనిది తన దగ్గర ఉన్నది ఒకటి ఉంది. అందమైన ముఖం. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా తీయాలనుకున్నాడు కరణ్ జొహర్. హీరోయిన్గా మహేశ్ భట్ కూతురు ఆలియా భట్‌ను తీసుకున్నాడు. ఒక హీరోగా స్టార్ కిడ్ వరుణ్‌ను తీసుకున్నాడు. ఇంకో వేషానికి మాత్రం సిద్దార్థ్‌ను ఎంచుకున్నాడు. ‘సార్... నాలో ఏం చూసి’ అని తబ్బిబ్బయితే ‘నీ ముఖం చూసి’ అన్నాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సూపర్ హిట్ అయ్యింది. రాత్రికి రాత్రి అందులో నటించిన ముగ్గురూ స్టార్స్ అయ్యారు. ఆలియా భట్‌కు నెక్ట్స్ సినిమా ‘హైవే’ వరుణ్ ధావన్‌కు ‘మై తేరా హీరో’ హిట్. కాని సిద్దార్థ్ రెండో సినిమా ‘హసీ తో ఫసీ’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన ‘ఏక్ విలన్’ వంద కోట్ల క్లబ్‌ను దాటింది. అక్షయ్ కుమార్‌తో నటించిన ‘బ్రదర్స్’ యావరేజ్‌గా నిలిచింది. ‘కపూర్ అండ్ సన్స్’ హిట్. సిద్దార్థ్ ప్రయాణం ఒక హిట్ ఒక ఫ్లాప్‌గా నడుస్తూ ఉంది. కాని ఎప్పటికప్పుడు కొత్త సినిమా వస్తూనే ఉంది. ప్రస్తుతం అతను కరణ్ జొహర్ నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా పరమ వీర చక్ర పురస్కార గ్రహీత విక్రమ్ భాత్ర జీవితం ఆధారంగా మిలట్రీ నేపథ్యంలో తీస్తున్న బయోపిక్ ‘షేర్ షా’లో నటిస్తున్నాడు. దర్శకుడు విష్ణువర్థన్ (పంజా ఫేమ్). ప్రవర్తన ముఖ్యం సిద్దార్థ్ గొప్ప నటుడు కాకపోవచ్చు. కాని తన రూపానికి వచ్చిన నటనను కలిపి సినిమాను మోసుకుపోవడంలో అతనికి తిరుగు లేదు. క్రమశిక్షణ పాటించడం, ఫోజులు కొట్టకపోవడం, దుమారాల్లో చిక్కుకోకుండా ఉండటం ప్రస్తుతం అతనికి కవచాలుగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్‌వంటి నటుడు సిద్దార్థ్‌ను మెచ్చుకొని తమ్ముడిలా చూసుకుంటూ ఉన్నాడు. ఏమి ఉందో ఎంత ఉందో తెలుసుకుని కెరీర్‌ను మలుచుకోవడం తెలిసిన నటుడు సిద్దార్థ్. అతడి తెర జీవితం అతని ముఖమంత అందంగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. -
‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’
‘ఆయన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు’ అందుకే ఈ సినిమాని, క్యారెక్టర్‌ను సీరియస్‌గా తీసుకున్నానని బాలీవుడ్ హీరో సిద్దార్థ మల్హోత్రా అన్నాడు. నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కెప్టన్ విక్రమ్ బత్రా త్యాగాన్ని గుర్తు చేస్తూ అతడు ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ప్రస్తుతం.. కెప్టెన్ ‘విక్రమ్ బాత్రా ’ బయోపిక్ ‘షేర్షా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్. ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ.. షేర్షాలో కెప్టెన్ పాత్రకు పూర్తి న్యాయం చేసి అమరవీరుల కుటుంబాలను సంతోష పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కెప్టెన విక్రమ్ బాత్రా పాకిస్తాన్ చొరబాటు దారుల నుంచి భారత భూభాగాలను రక్షించి.. దేశ సేవలో ఆయన ప్రాణాలు అర్పించారు. యుద్ధంలో ఆయన ధైర్యాన్ని చూసిన పాకిస్తాన్ ఆర్మీ ఆయనను షేర్షా (లయన్ కింగ్ ) అని పిలిచేదట. ఈ నేపథ్యంలో సిద్ధార్థ మాట్లాడుతూ ‘ఆయన కీర్తిని తెరపై చూపించాల్సిన భాధ్యత ఎంతో ఉంది. షేర్షా మూవీని కమర్షియల్ సినిమాలా కాకుండా బాత్రా కీర్తిని ఇనుమడింపజేసేలా నిర్మించాలి అనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. తాను విక్రమ్ బాత్రా తల్లిదండ్రులను, సోదరుడిని కలిసినప్పుడు.. వాళ్లు కెప్టెన్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. ‘షేర్షా పాత్రలో నటించడం అంత సులభమైన విషయం కాదని, దేశ రక్షణ బాధ్యత తన భుజాలపై ఉందని కెప్టెన్ భావించేవారని సిద్ధార్థ్ అన్నాడు. కాగా ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహించనున్నాడు. Beginning the journey of #Shershaah soon!@SidMalhotra @Advani_Kiara @vishnu_dir #HirooJohar @apoorvamehta18 @b_shabbir #AjayShah #HimanshuGandhi @dharmamovies pic.twitter.com/QBoxMeBDcv — Karan Johar (@karanjohar) May 2, 2019 -
సినిమాలు తీస్తా
బాలీవుడ్ బెస్ట్ యంగ్ హీరోస్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఒకరు. హీరో కాకముందు షారుక్ ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ (2010) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సిద్ధార్థ్. ప్రస్తుతం హీరోగా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు కదా. హీరోగా రాణిస్తున్న మీరు భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తారా? అనే ప్రశ్న ఈ కుర్ర హీరో ముందు ఉంచితే.... ‘‘షారుక్గారి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కానీ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మొదట్నుంచి నాకు ఫిల్మ్ మేకింగ్‌పై స్పెషల్ ఫోకస్ ఉంది. భవిష్యత్‌లో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. డైరెక్షన్ గురించి మాత్రం ఇప్పుడేం చెప్పలేను’’ అన్నారు. ‘మర్జావాన్’ మూవీ సిద్ధార్థ్ నెక్ట్స్ రిలీజ్. ప్రస్తుతం ‘షేర్షా’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. -
అతనితో రిలేషన్షిప్లో లేను
తాను ఎవరితోనూ ప్రేమలో లేనని ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ స్పష్టం చేసింది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో తాను ప్రేమాయణం సాగిస్తున్నానంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. ‘నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. నాపై వస్తున్న వార్తల్లో అవాస్తవాలే’ అని కియారా కొట్టిపారేసింది. ఇదే విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహర్ సిద్ధార్థ్ మల్హోత్రా వద్ద ప్రస్తావించగా.. పని తప్ప తనకింకేదీ సంతోషాన్నివ్వదని అతను సమాధానమిచ్చాడు. ‘కియారాతో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. పత్రికల్లో నాపై వచ్చే రూమర్ల గురించి నాకు తెలియదు. నా జీవితం మీరనుకుంటున్నట్టు రంగులమయం కాదు. నిజజీవితంలో నాకుండే ఆనందాలు చాలా తక్కువ’’ని చెప్పుకొచ్చాడు. ఒకపైపు తమ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు చెబుతుండగా.. సిద్ధార్థ్ మాజీ ప్రేయసి ఆలియా భట్ మాత్రం కియారాతో అతడు డేట్‌కు వెళ్తే బాగుంటుందని చెప్పడం విశేషం. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్లో క్రేజ్ సంపాదించిన అందాల భామ కియారా అద్వానీ.. కళంక్, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్, అక్షయ్ కుమార్ ‘గుడ్ న్యూస్’ తదితర సినిమాల్లో నటిస్తోంది. -
కొత్తగా కనిపిస్తా
రకుల్ ప్రీత్‌సింగ్ ఇంటి డోర్‌ని ఈ మధ్య తట్టిన అవకాశాలన్నీ బాలీవుడ్, కోలీవుడ్ నుంచే వచ్చినట్టున్నాయి. అందుకే ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో పాత్ర తప్ప ఆమె చేస్తున్న మిగతావన్నీ హిందీ, తమిళ సినిమాలే. ‘వెంకీమామ’ సినిమా కమిట్ అయ్యారనే వార్త ఉంది. ఇప్పటికే హిందీ చిత్రం ‘దేదే ప్యార్ దే’ షూటింగ్ పూర్తి చేసిన రకుల్ తాజాగా మరో హిందీ సినిమా కూడా ఓకే చేశారు. మిలాప్ జవేరీ దర్శకత్వంలో ‘మర్జావా’ చిత్రంలో హీరోయిన్గా ఎంపికయ్యారామె. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా నటిస్తారు. తారా సుతారియా మరో హీరోయిన్. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్గా రకుల్ కనిపిస్తారట. ఈ సినిమాలో తన పాత్ర గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మిలాప్ నాకీ స్క్రిప్ట్ వినిపించగానే నచ్చింది.నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏదైనా చేయాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి పాత్ర అది. అలాగే నా పాత్రకు మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్ర పోషించలేదు. ఇందులో కొత్తగా కనిపిస్తాను. సిద్ధార్థ్‌తో ‘అయ్యారే’ తర్వాత మళ్లీ యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఇక అజయ్ దేవగన్, రకుల్, టబు తదితరులు నటించిన ‘దేదే ప్యార్ దే’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. తమిళంలో సూర్యతో ‘ఎన్జీకే’, కార్తీ సరసన ‘దేవ్’ చిత్రాలతో పాటు శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు రకుల్. -
‘ఆషికీ 3’ హీరోగా సిద్ధార్థ్.!
బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్టైనర్లు ఆషికీ, ఆషికీ 2. ముఖ్యంగా ఆషికీ 2 ఘనవిజయం సాధించటమే కాదు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సిరీస్‌లో మరో భాగాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అయితే మూడో భాగంలో హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత మహేష్ భట్ ఆషికీ 3కి సంబంధించి సిద్ధార్థ్ తో చర్చలు జరిపారు. సిద్ధార్థ్ కూడా ఈ సూపర్ హిట్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆషికీ 2 చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వంలో వహించారు. మరో మూడో భాగానికి మోహితే దర్శకత్వం వహిస్తారా లేక మరో దర్శకుడు తెర మీదకు వస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో భార్య!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేయబోతోంది. సిద్ధార్థ మల్హోత్రా సరసన హీరోయిన్గా నటించేందుకు ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత డీహెచ్ లారెన్స్ రచించిన ‘లేడీ చాలర్ల్సీ లవర్’ నవల ఆధారంగా హిందీలో తెరకెక్కబోతున్న సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తారని వినిపిస్తోంది. తాజాగా ‘పద్మావత్’ సినిమాతో మెప్పించిన సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. నేహా ధూపియా టాక్‌షోలో పాల్గొన్న మీరా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందని పేర్కొంది. అదే షోలో మాట్లాడిన షాహిద్ కూడా మీరాకు సిద్ధార్థ మల్హోత్రా నటన అంటే ఇష్టమని తెలిపాడు. భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు భావిస్తున్న ఈ ప్రాజెక్టులో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆంగ్ల సాహిత్య విద్యార్థి కావడంతో లారెన్స్ రచనల గురించి, తాను చేయబోయే పాత్ర గురించి ఆమెకు పూర్తిగా తెలుసునని సన్నిహితులు తెలిపారు. ఈ సినిమాలో షాహిద్ కూడా అతిథి పాత్ర పోషించే అవకాశముందట. మొత్తానికి మీరా బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నదని, భన్సాలీ సినిమాతో ఆమె ఆరంగేట్రం చేస్తుండటం తనకు ఆనందం కలిగిస్తోందని షాహిద్ చెప్పాడు. -
భ్రాంతి కాదు నిజం అయారి
‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ (దేశాన్నే అమ్మేస్తే ఇంకేం మిగిలి ఉంటుంది?) అంటూ దేశమంతా అలుముకున్న అవినీతి మీద ఆలోచనను రేకెత్తించేదే ‘అయారి’ సినిమా! ‘ఎ వెడ్నెస్ డే’, ‘స్పెషల్ చబ్బీస్’, ‘బేబీ’ తీరులో ఈ సినిమా ఉత్కంఠను రేకెత్తించలేకపోయినా.. దర్శకుడు నీరజ్ పాండే మార్క్నైతే చూపిస్తుంది. అయారి.. అంటే భ్రాంతి.. తాంత్రికత.. మాంత్రికత! అన్నీ బాగున్నట్టు అనిపించే, ఫీల్ గుడ్ ఫీల్ భ్రాంతిని కలిగించే పరిస్థితుల వెనక ఉన్న అసలు కథను చూపించే సినిమా. ఇది కేవలం కల్పితం. ఎవరినీ, దేనినీ ఉద్దేశించి కాదు అంటూ ప్రారంభంలో డిస్క్లేమర్ వేసినా.. రక్షణ శాఖలో జరుగుతున్న అవినీతిని సెల్యూలాయిడ్ మీద చూపించిన చిత్రం ఇది. అందుకే పైన చెప్పిన మాట అంటాడు ఆర్మీ చీఫ్ ‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ అని! ఆహారధాన్యాల దగ్గర నుంచి ఆయుధాల దాకా అన్ని శాఖల్లో అంతటా అవినీతే. ఎక్కడికక్కడ దేశాన్ని అమ్ముకుంటూ పోతే ఇంకేం మిగులుతుంది? మనకన్నా ముందు తరం.. తర్వాత తరాలకు ఏం స్ఫూర్తిని పంచుతారు? సంపాదన ఆశలో పడి ఈ తరం ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది? అంటూ తరాల ఆలోచనల అంతరాలనూ ప్రశ్నిస్తుంది? చర్చకు చోటిస్తుంది. దేశ భక్తి అనే పెద్ద మాటలు వద్దు కాని.. ఆరోగ్యకరమైన వాతావరణమైతే దేశంలో ఉండాలికదా! మన దేశంలో మనం భద్రంగా ఉన్నామనే భావనైతే కలగాలి కదా! దేశానికి కంచెలా ఉన్న రక్షణ శాఖ ఆ నమ్మకాన్నివ్వాలి కదా! అదే అమ్మకానికి తయారైపోతే? విశ్వాసాన్ని కోల్పోతాడు ఓ యంగ్ సోల్జర్, మేజర్ జయ్ బక్షి (సిద్ధార్థ్ మల్హోత్రా). రక్షణ శాఖలోని పెద్ద తలకాయలైతే ఆయుధాలు అమ్మే డీలర్స్‌తో డీల్ కుదుర్చుకొని నిజాయితీగా పనిచేస్తున్న టీమ్‌ను పణంగా పెట్టాలనుకున్నప్పుడే మొత్తం మిలటరీ వ్యవస్థ మీదే గౌరవాన్ని తుడిచేసుకుంటాడు. ఆ డీల్‌లో తానూ వాటా పంచుకోవాలనుకుంటాడు. డ్యూటీని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన కల్నల్ అభయ్ సింగ్ (మనోజ్ బాజ్‌పాయ్)ను స్ఫూర్తిగా తీసుకుని.. విధి నిర్వహణలో అతనంతటివాడిని కావాలని కలలు కని ఆర్మీలోకి వస్తాడు. కల్నల్ అభయ్‌సింగ్ నేతృత్వంలోని కోవర్ట్ ఆపరేషన్స్ (స్పెషల్)లో సభ్యుడిగా ఉంటుంటాడు జయ్ భక్షి. ఒకరకంగా కల్నల్‌కు ఏకలవ్య శిష్యుడు జయ్. ఆపరేషన్స్ నిర్వహణలో ఆలోచన దగ్గర్నుంచి, వ్యూహప్రతివ్యూహాలు, ఆచరణ అన్నీ తన గురువులాగే చేస్తుంటాడు. ట్యాపింగ్.. రేటింగ్ ఈ స్పెషల్ టీమ్ అసైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఓ మిలిటరీ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు ఓ డీల్ తీసుకుని రావడం గురించి. ఓ ఆర్మ్స్ డీలర్ తరపున ఓ ఆఫర్ తీసుకొని వస్తాడు ఆ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు. ఆ డీల్‌ను మన్నించి వాళ్ల దగ్గర ఆయుధాలు కొంటే అమరవీరుల వితంతువులకు సంక్షేమ ఫండ్‌నూ ఇస్తారనే తాయిలాన్నీ చూపిస్తాడు. ఆ ఆఫర్‌కు తల వంచని చీఫ్ ‘‘చివరకు దేశాన్నీ అమ్మేస్తున్నామన్న మాట’’ అంటూ చురకా అంటిస్తాడు. ‘‘అనధికారికంగా.. 20 కోట్ల ఫండ్‌తో మీరు నిర్వహిస్తున్న స్పెషల్ టీమ్ కోవర్ట్ ఆపరేషన్స్ మాటేంటి?’’ అని అప్పటిదాకా రహస్యంగా ఉన్న విషయాన్ని బయటపెట్టి బ్లాక్‌మెయిలింగ్‌కు తలపడ్తాడు ఆ ఆఫీసర్. ఆ స్పెషల్ టీమ్ ఓ కాజ్ కోసం.. ఎవరికీ తెలియకుండా నియమించింది. అది బయటపడేసరికి ఖంగు తింటాడు ఆర్మీ చీఫ్. వాళ్ల సంభాషణను ట్యాప్ చేస్తున్న జయ్ కూడా విస్మయం చెందుతాడు. అయినా తలవంచడు ఆర్మీ చీఫ్. దేశానికి రక్షణగా నిలవాల్సిన ఆ శాఖలోని అవినీతి మొత్తం మిలటరీ మీదే విశ్వాసాన్ని పోగొడ్తుంది జయ్‌కు. ఆ టీమ్‌లోంచి ఈ ఆఫీసర్ టీమ్‌లోకి మారుతాడు జయ్.. డబ్బు సంపాదించుకోవడానికి. అప్పటికే ఈ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం ఓ ఎథికల్ హ్యాకర్ సోనియా (రకుల్‌ప్రీత్ సింగ్)తో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్తాడు జయ్. ఇప్పుడు ఈ ఆఫీసర్ టీమ్‌లో చేరి తన కోవర్ట్ టీమ్ రహస్యాలను చెప్పేందుకు పదికోట్లకు డీల్ కుదుర్చుకుని తన ప్రియురాలితో దేశాన్ని వదిలిపోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఉంటాడు కూడా. ఈ విషయం కల్నల్ అభయ్సింగ్కు తెలుస్తుంది. జయ్ కోసం వేట మొదలుపెడ్తాడు. ఇందులో భాగంగానే లండన్ చేరతారు ఇద్దరూ. అప్పటికే సోనియా లండన్ చేరుకుని ఉంటుంది జయ్ ప్లాన్‌లో భాగంగా. గురువు దగ్గర నేర్చుకున్న విద్యతో అతనికి దొరక్కుండా జాగ్రత్త పడ్తుంటాడు జయ్. ఇంకా పై ఎత్తులు వేసి దగ్గరకు రప్పిస్తాడు కల్నల్. ఇందులో ఇంటర్నేషనల్ ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ (అదిల్ హుస్సేన్)ను పావులా వాడుకుంటాడు అభయ్. ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ కూడా ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆఫీసరే. ఇండియన్ ఆర్మీలో ఉన్న లొసుగులు, విధివిధానాలన్నిటినీ ఔపోసన పట్టిన అతను ఆయుధాల వ్యాపారంతో కోట్లకు పడగలెత్తొచ్చని ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ వ్యాపారం మొదలుపెడ్తాడు. విదేశీ కంపెనీల ఆయుధాలకు డీలర్‌గా మారి మన దేశంలోని మిలటరీ అధికారులకు లంచాలిస్తూ అసలు ధరకన్నా నాలుగు రెట్ల ధరతో ఆయుధాలను కొనిపిస్తుంటాడు. అలా రిటైరయ్యి, మళ్లీ ఉద్యోగంలో చేరిన ఓ ఆర్మీ ఆఫీసర్‌నూ పట్టి.. ఆయన ద్వారా చీఫ్‌కు తన వర్తమానం పంపిస్తాడు అలా. ఆర్మీ చీఫ్ వద్దనేసరికి జయ్ భక్షి సహాయంతో ఆ చీఫ్ నియమించిన కోవర్ట్ ఆపరేషన్స్ గుట్టు రట్టు చేసి టీఆర్పీలో నంబర్ మూడులో ఉన్న ఓ చానల్ రిపోర్టర్‌కు ఇస్తాడు టెలికాస్ట్ చేయమని. దాంతో చానల్ రేటింగ్‌ను పెంచుకొని నంబర్‌వన్ చానల్‌గా అయిపోమ్మని. మోసం.. దగా అయితే కల్నల్ అభయ్ సింగ్ ఆ పాచిక పారనివ్వడు. జయ్‌ను పట్టుకునే క్రమంలో జయ్ ద్వారా తెలుసుకున్న, అందుకున్న సమాచారంతో ఆ చానల్ రిపోర్టర్‌ను కలుసుకొని ఇంకో రికార్డర్ ఇస్తాడు టెలికాస్ట్ చేసుకొమ్మని. ఆఫీసర్ ఇచ్చినది వేసుకోవాలో.. ఇప్పుడు తాను ఇచ్చింది వేసుకోవాలో విచక్షణ నీదే అంటాడు. అది అమరవీరుల వితంతువుల కోసం ముంబైలో కట్టిన నివాస సముదాయంలో జరిగిన అవినీతికి సంబంధించిన వార్తాకథనం. ఆ రిపోర్టర్ అభయ్‌సింగ్ ఇచ్చిన కథనాన్నే టెలికాస్ట్ చేయిస్తుంది. ఆ ఆఫీసర్ తుపాకితో పేల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఆ నిర్మాణం అవినీతిలో ప్రధాన హస్తం ఆ ఆఫీసర్‌దే. ఈ మొత్తం వ్యవహారం... రక్షణ శాఖ పట్ల అభయ్‌సింగ్, జయ్ల మ«ధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి ఆ ఇద్దరినీ ఒక్కటిచేసే దిశగా సాగి సినిమాను ఎండ్ చేస్తుంది. కశ్మీర్ ఓ ప్రదేశం కాదు.. రక్షణ శాఖ, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులు, డీలర్లు, దేశీ మీడియా.. ఇవన్నీ కలిసి ఎలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాయి? ఆ లాబీ ముసుగులో ఎవరి ప్రయోజనాలను వాళ్లు ఎంతెంత నెరవేర్చుకుంటున్నారు? ఈ నేపథ్యంలో దేశ రక్షణ, దానిపట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ఎలా పణంగా పెడ్తున్నారు? అనేదాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతుందీ సినిమా. ‘‘ఇండియా, పాకిస్తాన్ ఈ రెండు దేశాల వైపు ఎందరో మేధావులు, విద్యావేత్తలు ఉన్నారు. అయినా కశ్మీర్ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపట్లేదు?’’ అని ప్రశ్నిస్తాడు జయ్.. కల్నల్ అభయ్సింగ్ను. ‘‘కశ్మీర్ ఓ ప్రదేశంకాదు.. ఓ ఇండస్ట్రీ. దానివల్ల వ్యాపారుల దగ్గర్నుంచి రాజకీయనాయకుల దాకా అందరికీ లాభాలున్నాయి. ఓ సమస్య లాభాలను పంచుతున్నంత కాలం దాన్ని కాలం చెల్లనివ్వకుండా చూసుకుంటారు ’’ అంటాడు కల్నల్. ఎంత నిజం? అదే నిజం దేశంలోని అన్ని సమస్యలకు వర్తిస్తుంది. అదే చెప్తుంది.. చూపిస్తుంది ‘అయారి’ సినిమా. పాలకులు, కార్పోరేట్ శక్తులు కలిసి సమస్యలతో ప్రయోజనాలను పిండుకుంటే ప్రజలకు అంతా బాగుందనే భ్రాంతి కలగజేస్తూ జోకొడ్తుంటారు. చైతన్యం కాకపోతే అయారి (భ్రాంతే) మిగుల్తుంది. మనోజ్‌భాజ్‌పాయ్ ఈ సినిమాకు ఊపిరి. ఆదిల్ హెస్సేన్, నసీరుద్దీన్ షా, అనుపమ్ఖేర్ల నటన గురించి ప్రతేక్యంగా చెప్పేదేముంటుంది? పాత్రలను పండిస్తారు. వీళ్లకు సమ ఉజ్జీగా సిద్ధార్థ్ మల్హోత్రా శక్తియుక్తులను కూడదీసుకున్నాడు. రకుల్‌ప్రీత్.. డాన్సింగ్ డాల్‌గా మిగల్లేదు. దర్శకుడు నీరజ్‌పాండే ఇంతకుముందు తీసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళితే నిరాశపడ్తారు. కాబట్టి ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ‘అయారి’ అలరిస్తుంది. – శరాది -
హీరోయిన్ను ఎత్తేశాడు
సాక్షి, సినిమా : బాలీవుడ్లో అయ్యారీ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత రకుల్ ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం గనుక హిట్ అయితే మళ్లీ పాగా వేయొచ్చన్నది ఈ బ్యూటీ ప్లాన్. అందుకే చిత్ర ఫలితం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్ సమయంలో చోటు చేసుకున్న ఓ ఘటన వైరల్ అవుతోంది. ఈ చిత్ర హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రకుల్ ప్రమోషన్లలో పాల్గొంది. ఢిల్లీలోని ఎస్ ఆర్ సీసీ కళాశాలకు ఇటీవల వీళ్లిద్దరూ వెళ్లిన సందర్భంలో తమాషా ఘటన జరిగింది. అక్కడి విద్యార్థులు ఈ జంటను డాన్స్ చేయాల్సిందిగా కోరారు. దీంతో ఈ చిత్రంలోని ‘లేయ్ డూబా’ అనే పాటకు డ్యాన్స్ సిద్ధార్థ్-రకుల్ డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో రకుల్ ని సిద్ధార్థ్ అమాంతం ఎత్తుకోవటంతో విద్యార్థులంతా కేకలు వేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Sidharth 😍😍😍😍✌ A post shared by HARAYANA HP RJ PB DL shootout (@selfie__stan) on Feb 13, 2018 at 10:14pm PST -
సారీ చెప్పినా.. సిధార్థ్‌పై ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సిధార్థ్ మల్హోత్రా చిక్కుల్లో పడ్డాడు. భోజ్‌పురి భాషను అవమానించాడన్న విమర్శల నేపథ్యంలో అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ విషయాన్ని భోజ్‌పురి నటుడు, బీజేపీ నేత మనోజ్ తివారీ వెల్లడించారు. ‘‘సిధార్థ్ చేసిన వ్యాఖ్యలు నేను విన్నా. 22 కోట్ల మంది మనోభావాలను అతను దారుణంగా దెబ్బతీశాడు. నేను వాటిని ఖండిస్తున్నా. మనం ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. కళాకారులకు ఆ బాధ్యత ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అతను మంచి నటుడే. కానీ, ఇలా వ్యవహరించటం కుసంస్కారం. క్షమాపణలు చెప్పినా ప్రజలు అతన్ని వదిలేస్తారని నేను అనుకోవట్లేదు’’ అని తివారీ తెలిపారు. పట్నా, వారణాసి, కోల్‌కతా, ముంబై, తదితర ప్రాంతాల్లో ఇప్పటికే సిధార్థ్ పై భోజ్‌పురి కమ్యూనిటీ ఫిర్యాదులు చేయగా.. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు సమాచారం అందుతుందని తివారీ వెల్లడించారు. అసలేం జరిగిందంటే... ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్ కోసం హీరో సిధార్థ్, హీరోయిన్ రకుల్, నటుడు మనోజ్ బాజ్‌పాయి... సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకు వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంలో మనోజ్ బాజ్‌పాయి బలవంతం మేరకు భోజ్‌పురి భాషలో సిధార్థ్ ఓ డైలాగ్ చెప్పాడు. అయితే ఫన్నీగా సాగిన ఆ ఎపిసోడ్ కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలుగా మారిపోవటంతో భోజ్‌పురి కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిధార్థ్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేసింది. నటి నీతూ చంద్ర కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే చివరకు సిధార్థ్ ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పినా.. పరిస్థితి చల్లారటం లేదు. I recently tried speaking a new language while I was on a TV show. In the process if I inadvertently hurt anyone's feelings or sentiments, I apologise and assure you that no disrespect was meant in any way. — Sidharth Malhotra (@S1dharthM) 22 January 2018 -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఇత్తే ఫాక్
-
ఆ నటుడు ఎందుకిలా చేశాడు?
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నెటిజన్ల ప్రపంచానికి షాకిచ్చాడు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి వైదొలుగుతున్నట్లు చేసిన పోస్ట్ వైరల్ అయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో తన ప్రొఫైల్ ఫొటోను తొలగించి, బ్లాక్ గా ఉన్న ఫొటోను అప్లోడ్ చేశాడు సిద్ధార్థ్. 'సారీ ఐ యామ్ డన్' అంటూ చేసిన ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది. గంటల వ్యవధిలోనే వేల రీట్వీట్లు, లైక్స్ తో నటుడి పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అసలు సిద్ధార్థ్ ఎందుకిలా చేయడంటూ నెటిజన్లు కామెంట్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. తన లేటెస్ట్ మూవీ ఐజారీ పబ్లిసిటీ కోసం నటుడు ఇలా చేశాడని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నటి అలియా భట్‌తో ప్రేమ, గొడవ అంటూ పలు వదంతులు ప్రచారం కావడాన్ని వ్యతిరేకిస్తూ బ్లాక్ ఫొటో అప్లోడ్ చేసి నిరసన వ్యక్తం చేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఐజారీ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పాయ్, రకుల్ ప్రీత్ సింగ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ విడుదల కానుందని, ప్రమోషన్ కోసమే సిద్ధార్థ్ తన ఫొటోలకు బదులు బ్లాక్ ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా అప్డేట్ చేసి ఉండొచ్చునన్న టాక్ వినిపిస్తోంది. sorry iam done ! — Sidharth Malhotra (@S1dharthM) 14 December 2017 -
వీళ్లు విడిపోయారా ! మరి ఈ ఫొటోలేంటి?
ముంబయి : బాలీవుడ్లో ఎక్కువగా వదంతులు, ఊహాగానాలు తమ చుట్టూ తిప్పుకుంటున్న జంట అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా. చాలా రహస్యంగా తమ బంధాన్ని కొనసాగిస్తున్న వీరిద్దరు ఇటీవలె బ్రేకప్ చెప్పేసుకున్నారని, విడిపోయారని వార్తలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ వార్తలన్నీ కూడా ఒట్టి అబద్ధాలేనని, తాము కలిసే ఉన్నామని చెప్పేలా ఇప్పుడు కొన్ని ఫొటోలు ఆన్లైన్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఏక్తాకపూర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చక్కగా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ చాలా అన్యోన్యంగా దర్శనం ఇచ్చారు. ఇద్దరు కలిసి ఏక్తాకపూర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరు విడిపోయినట్లు కాకుండా మునుపటికంటే మరింత దగ్గరైనట్లు కనిపించారు. గార్జియస్ లుక్‌లో కనిపించినా అలియా నవ్వుతూ సిద్ధార్థ్‌తో తెగ కబుర్లు చెబుతూ కనిపించింది. దీంతో మీడియా వర్గాలంతా ఆశ్చర్యపోయారు. వారిద్దరు విడిపోలేదని, కలిసే ఉన్నారని, అందుకు ఇవిగో సాక్ష్యాలు అంటూ పలు ఫొటోలు పంచుకున్నారు. -
మాజీ లవర్‌తో నటి డేటింగ్?!
బాలీవుడ్ భామ ఆలియా భట్ తాజాగా ఓ హ్యాండ్సమ్ యువకుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫొటోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. వైరల్‌గా మారిన ఈ ఫొటోల్లో ఉన్న ఆ యువకుడు ఎవరని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అతను ఎవరో కాదు ఆలియా మాజీ ప్రియుడు అలీ దదార్కర్. ఈ ఫొటోల్లో ఆలియా బెస్ట్ ఫ్రెండ్ అకాంక్ష రంజన్ కూడా ఉంది. యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆలియా ప్రేమలో మునిగిపోయిందని ఆ మధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య వీరికి బ్రేకప్ అయిందట. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ సైతం చెప్పకనే చెప్పేశారు. అంతేకాకుండా ఈ మధ్య 'జెంటిల్మన్' సినిమాలో తనతోపాటు నటించిన జాక్వలిన్ ఫెర్నాండేజ్‌తో సిద్ధార్థ్ సన్నిహితంగా ఉంటున్నాడట. సినిమాలోనూ, సినిమా ప్రమోషన్‌లోనూ ఈ ఇద్దరి మధ్య బాగా కుదిరిన కెమిస్ట్రీ కూడా రూమర్స్‌కు తావిచ్చింది. ఇది ఇలా ఉండగా ఆలియా ఇలా మాజీ ప్రియుడితో కనిపించడంతో గాసిప్ రాయుళ్లకు పని కల్పించింది. ఆలియా-అలీ గతంలో డేటింగ్ చేశారు. అంతకుమించి అలీ గురించి పెద్దగా వివరాలు తెలియదు. అతనితో ఆలియా చక్కర్లు కొడుతున్న ఫొటోలు మాత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. Bffs ! -
అన్ ఫాలో అలియా.. అఫైర్ కన్ఫర్మ్?
సాక్షి, ముంబై: బాలీవుడ్ లో లాంగ్ రిలేషన్లు ఎక్కువ కాలం కొనసాగుతాయన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. అయితే దీపిక-రణ్వీర్ లాంటి జంటపై రూమర్లు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు వాటిని తమ ప్రేమతో పటాపంచల్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో బాలీవుడ్ జంట విడిపోబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. తన తొలిచిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో నటి అలియా భట్ డీప్ రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒక హీరోయిన్ మూలంగా ఏడాదిగా వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని, ఇప్పుడు బ్రేకప్ స్టేజీకి చేరిపోయారని ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం రాసింది. శ్రీలంక బ్యూటీ జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌తో సిద్ధార్థ్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు రేగుతున్నాయి. వీరిద్దరు నటించిన ఏ జెంటిల్ మెన్ చిత్రం విడుదల విషయం తెలిసిందే. గతేడాది ఆ చిత్రం ప్రారంభమైన దగ్గరి నుంచే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చిత్రం ప్రమోషన్ టైంలో కూడా టీవీ ఛానెళ్లలో కాస్త అతి క్లోజ్ నెస్ ప్రదర్శించారు. జాక్వెలిన్‌తో అఫైర్ మూలంగానే అలియాను సిద్ధార్థ్ దూరం పెడుతున్నాడని, తరచూ ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయని ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య జాక్వెలిన్.. అలియాను ట్విట్టర్ లో అన్ ఫాలో అయ్యిందంట. దీంతో వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని అర్థమౌతోంది. మరి ఈ బ్రే..క...ప్ వార్తలపై ఆ ప్రేమ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఔను.. బ్రేకప్ అయింది: యువ హీరో
సెలబ్రిటీల చుట్టూ గాసిప్‌లు కొత్త కాదు. నిత్యం ఏదో రకమైన వదంతి సినీ ప్రముఖుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్ యువజంట సిద్ధార్థ్ మల్హోత్రా- అలియా భట్ డేటింగ్ చేస్తున్నట్టు ఎన్నోసార్లు కథనాలు వచ్చాయి. ఈ ఇద్దరు ప్రేమలో మునిగితేలినట్టు ఆ మధ్య వినిపించింది. ఆ తర్వాత ఏమైందో ఏమిటో తెలియదు కానీ వీరి మధ్య దూరం పెరిగింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ పరోక్షంగా ధ్రువీకరించాడు. ఆలియా భట్‌తో బ్రేకప్ అయిన విషయాన్ని చెప్పకనే చెప్పాడు. నేహా ధూఫియా చాట్‌షో 'నో ఫిల్టర్ నేహా' కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధార్థ్.. 'నేను ఎప్పుడు ఒంటరిగానే ఉన్నా' అని స్పష్టం చేశాడు. ఆలియాతో రిలేషన్షిప్లో ఉన్న విషయాన్ని కూడా సిద్ధార్థ్ ఏ రోజు ధ్రువీకరించలేదు. కానీ సినీ పరిశ్రమలో మీకు బాగా నచ్చే వ్యక్తి ఎవరని నేహా అడిగితే.. వెంటనే ఆలియా పేరు చెప్పేశాడు. గతంలో ఈ యువ జంట చాలా సన్నిహితంగా పార్టీలు, వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. 'ఆలియా నా కళ్లలోకి చూస్తుంది. నేను తన కళ్లలోకి చూస్తాను. ఇద్దరం ప్రపంచాన్ని మరిచిపోతాం. తను నాకు ఎంతో సన్నిహితురాలు. ఇప్పుడు నా జీవితంలో తను ఎంతో ముఖ్యమైన వ్యక్తి' అని సిద్ధార్థ్ గతంలో మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఆ హీరోతో నో ప్రాబ్లమ్: నటి
ముంబయి: బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండేజ్ చేసిన వ్యాఖ్యలు నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు సంతోషాన్నిస్తాయి. కానీ అతడి ప్రేయసి అలియా భట్‌కు మాత్రం చాలా కోసం తెప్పించే ఉంటాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శ్రీలంక భామ జాక్వెలైన్ మాట్లాడుతూ.. 'నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా ఈజీగా కలిసిపోతాను. అతడితో నటించడమంటే కష్టమనిపించదు. అతడు చాలా ఎనర్జీతో నటిస్తాడు. అందుకే ఇతర హీరోలతో పోల్చితే సిద్ధార్థ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చాలా ఈజీగా ఉంటుందని' ఆమె పేర్కొన్నారు. జాక్వెలైన్ కామెంట్లపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమె చెప్పిన విషయం నిజమేనన్నాడు సిద్ధార్థ్. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతో బిజీ షెడ్యూలున్నా తనలాగే జాక్వెలైన్ ఎంతో ఎనర్జీతో పనిచేస్తుందని, కష్టించేతత్వం ఆమె సొంతమని కితాబిచ్చాడు. మరోవైపు తన ప్రియుడు సిద్ధార్థ్‌తో జాక్వెలైన్ క్లోజ్‌గా ఉండటంపై అలియా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆ మధ్య ప్రియుడిపై అలిగిన అలియా.. తమ వెకేషన్‌ను రద్దు చేసినట్లు బీటౌన్‌లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు ఒకరిపై మరొకరు ఈ తరహాలో ప్రశంసలు కురిపిస్తుంటే అలియా ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాక్వెలైన్లు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'ఏ జెంటిల్మన్'. ఆగస్టు 25న ఈ మూవీ విడుదల కానుంది. -
లవర్స్ మధ్య చిచ్చుపెట్టిన మరో నటి!
న్యూఢిల్లీ: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువ జంట రిలేషన్ ప్రమాదంలో పడింది. కరణ్ జోహర్ దర్శకత్వంలో 2012లో తెరకెక్కిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన జంట అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా. గత ఐదేళ్ల నుంచి అలియా, సిద్ధార్థ్ చాలా క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తరచుగా పార్టీలకు వెళ్తూ అక్కడ ఫొటోలకు ఫోజులిచ్చేవారు. అయితే తామిద్దరం ప్రేమికులమని, తమ రిలేషన్‌ను బయటపెట్టేవారు కాదు. ఇన్ని రోజులుగా సజావుగా సాగిన వీరి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. 'కిక్' భామ, శ్రీలంక అందం జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌తో కొంతకాలం నుంచి సిద్ధార్థ్ క్లోజ్‌గా మూవ్ కావడంపై ప్రేయసి అలియా ఇదివరకే వార్నింగ్ ఇచ్చింది. అయినా హీరో వ్యవహారంలో మార్పు రాలేదని ప్రియుడిపై అలిగిన ఈ ముద్దుగుమ్మ.. తాము ప్లాన్ చేసుకున్న సమ్మర్ వెకేషన్‌ను క్యాన్సల్ చేసింది. ప్రస్తుతం రీలోడెడ్ మూవీలో నటిస్తున్న సహనటి జాక్వెలైన్‌తో సిద్ధార్థ్ లైన్(గీత) దాటుతున్నాడని భావించిన ఈ చిన్నది టూర్‌ను రద్దు చేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. జాక్వెలైన్‌తో ఇలాగే రిలేషన్ కొనసాగిస్తే బ్రేకప్ చెప్పేందుకు కూడా అలియా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. రణబీర్ కపూర్ కు జోడీగా డ్రాగన్‌లో షూటింగ్లో అలియా బిజీ బిజీగా ఉంది. -
సిద్ధార్థ ప్రపోజల్‌కు ప్రియాంక ఓకే చెప్పేసింది
ముంబయి: బాలీవుడ్ నటి, హాలీవుడ్లో సైతం హల్చల్ చేసిన ప్రియాంక చోప్రా మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఏక్ విలన్‌తో మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్థ మల్హోత్రాకు ఓకే చెప్పింది. అతడు పెళ్లి ప్రపోజల్ చేయగానే నవ్వులు చిందిస్తూ ఒప్పేసుకుంది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఆమె ఓకే చెప్పింది పెళ్లికే గానీ, నిజ జీవితంలో పెళ్లికి కాదు. నిరవ్ మోడీ ఆభరణాలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో భాగంగా వారు ఈ దృశ్యంలో కలిసి నటించారు. ఇంకెప్పుడు ఎవరికీ ఎస్ అని చెప్పకూడదనుకున్న ఒకమ్మాయి.. తనను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్న ఓ అబ్బాయి నిరవ్ బ్రాండ్‌కు చెందిన ఉంగరం తీసుకొచ్చి ఇవ్వగానే వెంటనే ఎస్ అని చెప్పేసే సీన్లో వారు నటించారు. ఈ ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది. నిరవ్ మోడీ జ్యువెలర్స్ ఎప్పటికీ నో చెప్పలేరు అంటూ యాడ్ ముగుస్తుంది. ఇప్పుడు ఈ యాడ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ అయింది. బాలీవుడ్ వర్గాలు అప్పుడే గుసగుసలతో వండి వార్చేస్తున్నారు. దీనికి ఫన్నీగా సిద్ధార్థ స్పందిస్తూ ప్రియాంక.. ‘అందరూ నువ్వు నా ప్రపోజల్‌కు ఎస్ చెప్పావని చర్చించుకుంటున్నారు.. సంతోషంగా ఉంది కదా’. అని ట్విట్టర్లో ప్రశ్నించగా.. ‘నీ గురించి కాదుగానీ, నా గురించి నా ఉంగరం గురించి అందరూ మాట్లాడుతున్నారు’ అంటూ మరో ట్వీట్‌ను ప్రియాంక బదులుగా ట్వీటింది. ఈ సరదా సంభాషణ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది.