
Sidharth Malhotra Kiara Advani Back Together After A Break: బీటౌన్‌లో అప్పటిదాగా జంటగా కలిసి కనిపించిన లవ్ బర్డ్స్, దంపతులు ఒక్కసారిగా విడిపోతున్నారని రూమర్స్ రావడం పరిపాటే. ఇలాంటి సంఘటన ఇటీవల బీటౌన్‌లో జరిగింది. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు స్పందించలేదు. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కియారా-సిద్ధార్థ్ విడిపోయారని వార్తలు వచ్చి ఫ్యాన్స్‌ను షాక్ గురి చేయగా వారు కలిసి చెట్టాపట్టాలేసుకుని కనిపించిన వీడియో ఆనందాన్ని కలిగిస్తుంది.
ఇటీవల సల్మాన్ ఖాన్ నిర్వహించిన ఓ వేడుకలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియరా అద్వానీ తళుక్కుమన్నారు. ఒకరొకరు నవ్వుకుంటూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇది చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఒకవైపు రొహిత్ శెట్టి పోలీస్ సిరీస్ కోసం సిద్ధార్థ్ ఇస్తాంబుల్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు భూల్ భులయా 2 ప్రమోషన్లలో కియరా బిజీగా మారింది. ఈ టైట్ షెడ్యూల్స్ వల్ల వారి మధ్య కొంత బ్రేక్ వచ్చినట్లయింది. ఈ బ్రేక్ వల్లే వారు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయని వారి సన్నిహితులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియోతో వారు చెప్పిందే నిజమని తెలుస్తోంది.
చదవండి: సౌత్ ఇండస్ట్రీపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ షేర్షాలో కలిసి నటించారు. ప్రమోషన్ల సమయంలో వారి మధ్య సన్నిహిత్యం చూసి వారు లవ్‌లో ఉన్నారని కన‍్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్. తర్వాత వచ్చిన బ్రేకప్ పుకార్లు అభిమానులను అసంతృప్తికి గురిచేశాయి.
చదవండి: ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే..
Comments
Please login to add a commentAdd a comment