video viral
-
‘నిఖిల్ కుమారస్వామి కంటే ఆమె 10 రెట్లు బెటర్’
నిఖిల్ కుమారస్వామి కంటే ఆమె 10 రెట్లు బెటర్ అంటున్నారు కన్నడిగులు. అంతేకాదు కర్ణాటకలో చాలా మంది రాజకీయ నాయకుల వారసుల కంటే ఆమె మెరుగ్గా ఉన్నారని కూడా ప్రశంసిస్తున్నారు. నెటిజనుల నుంచి కితాబు అందుకున్న ఆమె ఎవరు కాదో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తనయ ఐశ్వర్య డీకేఎస్హెగ్డె. ఆమెను ఎందుకు పొగుడుతున్నారంటే..?బెంగళూరులో గ్లోబల్ అకాడమి ఆఫ్ టెక్నాలజీ వేదికగా జరుగుతున్న వీటీయూ యూత్ ఫెస్ట్ 2025లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐశ్వర్య డీకేఎస్ హెగ్డె (Aisshwarya DKS Hegde) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆమెక మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఊహిస్తున్నారు.ఇంతకీ జరలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి?వీటీయూ యూత్ ఫెస్ట్ 2025కు (VTU Youth Fest 2025) సంబంధించిన పోస్టర్లను ఇంగ్లీషులో ప్రింట్ చేశారు. వీటిలో ఎక్కడా కన్నడ భాష కనిపించలేదు. ఇదే విషయాన్ని సదరు జర్నలిస్టు.. ఐశ్వర్య దృష్టికి తీసుకొచ్చాడు. ఈవెంట్ సైన్ బోర్డులపై కన్నడ లేకపోవడం గురించి ప్రశ్నించాడు. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా, కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చింది. ‘మా తప్పులను ఎత్తి చూపడానికే కదా మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు మా తప్పులను కనిపెడితేనే కదా మేము దిద్దుకోగలం. తప్పులు చేయడం మానవ సహజం. మేమూ మనుషులమే కదా’ అని ఐశ్వర్య జవాబిచ్చింది.ఈ వీడియో వైరల్ (Video Viral) కావడంలో నెటిజనులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, విమర్శలను స్వీకరించే తీరుకు నెటిజనులు ఫిదా అయ్యారు. ఐశ్వర్యకు సహజంగానే నాయకత్వ లక్షణాలు వచ్చాయని చాలా మంది కామెంట్ చేశారు. అంతేకాదు చాలా రాజకీయ నాయకుల వారసులతో పోలిస్తే ఆమె మెరుగ్గా ఉందని కితాబిచ్చారు కూడా.‘ఆమె రాజకీయాల్లో రారు’ ‘ఈ అమ్మాయి భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకురాలు కానుంది. ఆమెకు ఒక నియోజకవర్గం అవసరం. నిఖిల్ లేదా చాలా మంది బీజేపీ రాజకీయ నాయకుల పిల్లల కంటే 10 రెట్లు మెరుగ్గా ఉంది. కన్నడ బాగా మాట్లాడుతుంది, అత్యంత ఆత్మవిశ్వాసం కలిగి ఉంది. విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తెలుసు’ అంటూ ఒక నెటిజన్ ప్రశంసించారు. అయితే ఆమె పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టకపోవచ్చని ఒక యూజర్ ఊహించారు. ‘ఆమె ఆత్మవిశ్వాసం సాటిలేనిది, కానీ ఆమె రాజకీయాల్లో చేరదు. దీన్ని బుక్‌మార్క్ చేసుకోండి’ అని పేర్కొన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన ఐశ్వర్య తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తుందా, లేదా అనేది వేచి చూడాలి.ప్రదీప్ ఈశ్వర్ ‘ఫీమేల్ వెర్షన్’వ్యవహార శైలిలో చిక్కబల్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్, ఐశ్వర్య మధ్య సరూప్యం ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఐశ్వర్యను ప్రదీప్ ఈశ్వర్.. ‘ఫీమేల్ వెర్షన్’గా వర్ణించాడు. ‘ఒకే స్వరం, అదే శృతి - ఆమె అతని స్త్రీ రూపం!’ అని వ్యాఖ్యానించాడు. ఈ పోలిక ఆమె కమాండింగ్‌గా మాట్లాడే విధానాన్ని సూచించింది. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులకు మాత్రమే ఇది సాధ్యమని చాలా మంది నమ్ముతారు. అయితే తనకు విద్యావేత్తగా ఉండటమే ఇష్టమని గతంలో ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య చెప్పారు. కాబట్టి ఆమె రాజకీయాల్లోకి రాకపోవచ్చని కొందరు అంటున్నారు. కాగా, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను (Amartya Hegde) 2020లో ఆమె వివాహం చేసుకున్నారు. చదవండి: దక్షిణాదిపై వివక్ష మరింత పెరిగిందినిఖిల్కు కలిసిరాని అదృష్టంకాగా, నిఖిల్ కుమారస్వామి (Nikhil Kumaraswamy) జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు. అతడు మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే హీరోగా రాణించకపోవడంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సుమలత చేతిలో పరాజయం పాలయ్యాడు. 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రామనగర నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2024 నవంబర్‌లో చన్నపట్న ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఆయనకు విజయం దక్కలేదు. #Karnataka #DKShivakumar daughter brilliantly responds to a reporter on the question why there is backdrop is not in kannada.pic.twitter.com/3oIlyO5pk7— Apurva Mirajkar (@apurvasays) March 23, 2025 -
ఐపీఎల్ ప్రారంభ వేడుక.. కింగ్ ఖాన్‌తో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
వేసవి క్రీడా సంబురం ఐపీఎస్ సందడి అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఏడాది మెగా సీజన్ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీతారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశాపటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది.అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ క్రికెటర్లను కాసేపు నటులుగా మార్చేశారు. తనతో పాటు విరాట్ కోహ్లీ, రింకూ సింగ్‌ను డ్యాన్స్ చేయించారు. పఠాన్ మూవీలోని ఓ సాంగ్‌కు కింగ్ కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతేకాకుండా ఈ వేడుకలో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన పాటలతో అభిమానులను అలరించారు. పుష్ప-2 సాంగ్ పాడి ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం షారూక్ ఖాన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. చివరిసారిగా జవాన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. King Khan 🤝 King Kohli When two kings meet, the stage is bound to be set on fire 😍#TATAIPL 2025 opening ceremony graced with Bollywood and Cricket Royalty 🔥#KKRvRCB | @iamsrk | @imVkohli pic.twitter.com/9rQqWhlrmM— IndianPremierLeague (@IPL) March 22, 2025 -
వీడియో: ట్రంప్ కూతురా మజాకా.. ప్రత్యర్థిని పడగొట్టిన ఇవాంక ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంక ట్రంప్(43) ప్రాచీన సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ జియూ–జిత్సూ(జుజుత్సూ)లో చక్కటి ప్రావీణ్యం సంపాదించారు. ఆమె జుజుత్సూలో శిక్షణ పొందుతున్న వీడియోను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మియామీలోని ఓ వ్యాయామశాలలో ఇవాంక ట్రంప్ జుజుత్సూ నైపుణ్యాలను ప్రదర్శించారు. తన ప్రత్యర్థని క్షణాల్లో మట్టికరిపించారు. నీలం రంగు బెల్ట్ ధరించిన ఇవాంక తన హస్త లాఘవంతో అందరినీ ఇంప్రెస్ చేశారు. జుజుత్సూలో ఆమె బలం, క్రమశిక్షణ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో బ్లూబెల్ట్ సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. ఇవాంక ట్రంప్ జుజుత్సూను నిత్యం సాధన చేస్తుంటారు.ఇక, డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇవాంక ట్రంప్ ఆయనకు సీనియర్ సలహాదారుగా సేవలందించారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబ బాధ్యతలకే పరిమితం అవుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ కుటంబ, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తనకు దొరికిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. Ivanka Trump is a Jiu-Jitsu badass pic.twitter.com/IFtJROhjTt— Sara Rose 🇺🇸🌹 (@saras76) March 22, 2025 -
Viral video: 95 పైసల కోసం గొడవ.. అసలేం జరిగిందంటే..
నోయిడా: కేవలం 95 పైసల కోసం ఓ మహిళా జర్నలిస్టు, క్యాబ్ డ్రైవర్ వాదించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అయితే, నెటిజన్లంతా క్యాబ్ డ్రైవర్‌కే మద్దతు ఇస్తున్నారు. ఈ వాగ్విదానికి సంబంధించిన వీడియోను దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే హక్కుల కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించగా, ఆమె తనను బెదిరించి టాక్సీ ఛార్జీ చెల్లించడానికి నిరాకరించిందని డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. కాగా, తాను జర్నలిస్టునని సదరు మహిళా జర్నలిస్టు క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించినట్లుగా ఆ వీడియోలో ఉంది.మిగతా 95 పైసలు కూడా చెల్లిస్తే పోయేదానికి ఈగోకు పోయి ఆ మహిళా గొడవకు దిగిందని ఓ నెటిజన్.. కేవలం 95 పైసల కోసం క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించడం అవసరమా..? అంటూ మరో నెటిజన్ ప్రశ్నలు గుప్పించారు. క్యాబ్ డ్రైవర్‌ది తప్పులేకపోయినా మహిళా కార్డు ఉపయోగించి అతడిని బెదిరించడం కరెక్టు కాదు. చేతిలో డబ్బులు లేకపోతే బస్సులో వెళ్లొచ్చుగా క్యాబ్‌లో వెళ్లి గొడవపడటం ఎందుకు..?’’ అంటూ యూజర్లు ఆ మహిళను తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై మహిళా జర్నలిస్టు శివంగి శుక్లా వివరణ ఇస్తూ.. తాను క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించలేదని, అతడే తనతో దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. లోకేషన్‌కు దూరంగా క్యాబ్‌ను ఆపేశాడని, లోకేషన్‌కు తీసుకెళ్లమంటే కుదరదని దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో తాను క్యాబ్ దిగి రూ.129 పేమెంట్ చేశానని, తొందరలో పైన ఉన్న 95 పైసలు చూసుకోలేదు. ఇంతలోనే 95 పైసలు ఎందుకు కొట్టలేదంటూ క్యాబ్ డ్రైవర్‌కు గొడవ దిగాడని, దాంతో తాను జర్నలిస్టునని, దబాయించవద్దని వార్నింగ్ ఇచ్చానని ఆ మహిళా జర్నలిస్టు తెలిపారు.Who is this Journalist threatening @Uber_India driver of police action just because he asked her to pay the fare ? Plz identify her & ask her to travel in bus if she doesn't want to payAlso - in public interest, please ask every cab driver you meet to install cameras pic.twitter.com/PA9qqdBluJ— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 21, 2025 -
ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్‌ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్‌తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్‌తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రశంసల వర్షంతన మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025 ఎవరీ బినితా చెట్రీ?అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్ఫైర్లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్‌గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే! -
జనసేన కిరణ్ రాయల్ లీలలు.. వెలుగులోకి మరో సంచలన వీడియో
సాక్షి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా కిరణ్ రాయల్ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది.కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళలుజనసేన ఇంచార్జీ కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడించారు. మహిళను మోసం చేసిన కిరణ్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ పోలీసులు బెదిరించారు. బాధితురాలి న్యాయం జరిగే వరకు కదిలేదని.. మహిళలు మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదంటూ ప్రశ్నిస్తూ.. ఇదేనా మీరు రక్షణ కల్పించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సమగ్ర విచారణ జరిపించాలిజనసేన నేత కిరణ్ రాయల్‌పై మహిళా సంఘాలు మండిపడుతున్నారు. మహిళను మోసం చేసిన ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐద్వా తిరుపతి జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి మాట్లాడుతూ.. బాధిత మహిళకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. పార్టీ నాయకుడు కాబట్టి చర్యలు తీసుకోమంటే చూస్తూ ఊరుకోం. కిరణ్ రాయల్ తప్పు ఉందని విచారణలో తేలితే ఆందోళన చేపడతాం. బాధిత మహిళకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’’ అని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్మరోవైపు, కిరణ్ రాయల్ నీచుడు.. రాజకీయ ప్రతినిధిగా అనర్హుడు అంటూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్నాడు. కిరణ్ రాయల్‌ను జనసేన నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ముంబయిలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా తన ప్రియురాలు నీలం ఉపాధ్యాయ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ పెళ్లి వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తన సోదరుడి పెళ్లి ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మండపం వద్దకు సోదరుడిని తీసుకురావడంతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త నిక్ జోనాస్లో కలిసి ఈ పెళ్లి వేడుకలో అలరించింది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఆడుతు పాడుతు ఊడుస్తుంటే...
అంతకు మించిన హాయి ఏమున్నది! శ్రమదానం మనకు కొత్త కాదు. అయితే అయేషా చేసిన శ్రమదానం వీడియో వైరల్ అయింది. ఇంతకీ ఆమె శ్రమదానం ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే... అయేషా మన అమ్మాయి కాదు. జోద్పూర్ను చూడడానికి తుర్కియే నుంచి వచ్చింది. జోద్‌పూర్‌లోని మాండోర్ గార్డెన్‌కు వెళ్లిన అయేషా అక్కడి పనివాళ్లు ఊడ్చే దృశ్యాలను చూసింది. ‘నాకు కూడా ఒక చీపురు కావాలి’ అని అడిగింది. అక్కడ ఉన్న గైడ్, వర్కర్స్ అయేషా జోక్ చేస్తుంది అనుకున్నారు. కాని ఆమె సీరియస్‌గానే అడిగింది అని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. చీపురుతో అరగంట పాటు ఊడ్చుతూ శ్రమదానం చేసింది.ఈ వీడియోను చూస్తూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘గార్డెన్లకు వెళ్లడం అనేది ఆహ్లాదకరమైన అనుభవం. అయితే గార్డెన్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తూ చిరాకు కలిగిస్తుంది. చెత్త వేసే వాళ్లు గార్డెన్లకు వెళ్లడానికి అనర్హులు. పరిసరాల పరిశుభ్రత అనే స్పృహ ఉన్న ఆయేషాలాంటి వాళ్లు మనకు ఆదర్శం కావాలి’ ‘శ్రమదానానికి సరిహద్దులు లేవని నిరూపించిన వీడియో ఇది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తి.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇటీవలే విడుదల పార్ట్-2తో (viduthala Part-2) ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల పార్ట్- 1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.(ఇది చదవండి: ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)అయితే తాజాగా విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్‌ని వెనక నుంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాలితో తన్నాడు. పక్కనే సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడే వారంతా ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగ్గా.. తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అప్పట్లో బెంగళూరులో ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.Ithu eppa nadanthathu..🥹🙄..Enna @VijaySethuOffl sollave illa..🤭..But it was a nice Kick 😉..#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8#BiggBossTamil8Season #VijaySethupathi #VJS pic.twitter.com/XRtsMl31yo— BiggBossTamil8 (@BigBossTamilOTT) January 28, 2025 -
కొమురవెల్లిలో అఘోరీ హల్చల్
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన అఘోరీ (నాగసాధువు) మంగళవారం హల్చల్ చేసింది. కత్తితో జనంపైకి దూసుకువచ్చి దాడికి పాల్పడింది. ఈ క్రమంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భక్తులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ముందుగా ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకునేందకు ప్రయత్నించింది. దిగంబరంగా కాకుండా వస్త్రాలు ధరించి స్వామి వారిని దర్శించుకుకోవాలని ఆల య అధికారులు సూచించారు. దీంతో కోపోద్రిక్తురాలైన అఘోరీ ఒక్క సారిగా కత్తిని చేత పట్టుకుని హంగామా సృష్టించింది. ఈక్రమంలో స్థానికునికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉండి వీడియో చిత్రీకరిస్తున్న ఓ విలేకరి సెల్‌ఫోన్ లాక్కోని ధ్వసం చేసింది. అంతే కాకుండా ప్రజలను తీవ్ర పదజాలంతో దూషించింది. అనంతరం తన వద్ద ఉన్న నల్లని వస్త్రాలు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని అఘోరీని పంపించడంతో సమస్య సద్దు మణిగింది. అఘోరీలు దైవమార్గంలో ఉంటూ భక్తులకు మార్గదర్శకంగా ఉండాల్సింది పోయి భక్తులపై దాడి చేయడం ఏమిటని స్థానికంగా చర్చనీయంశమైంది. అఘోరీ కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న విషయం విధితమే.#Aghori #Siddipeta… pic.twitter.com/0AXdKSzt0V— January 28, 2025 -
టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. సెలబ్రేషన్స్ చూశారా!
టాలీవుడ్ కమెడియన్ నటుడు అలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడీతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.జుబేదాను పెళ్లాడిన అలీ..అయితే జుబేదాను పెళ్లాడిన అలీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2022 డిసెంబర్లో పెద్దకూతురు ఫాతిమా పెళ్లిని గ్రాండ్‌గా చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా అలీ సైతం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మనం కూడా చూసేద్దాం.గ్రాండ్‌గా అలీ పెళ్లి వేడుక..ఇటీవల తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలీ దంపతులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి వివాహా వేడుక జరుపుకున్నారు. తమ ఇద్దరు కూతుర్ల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియో జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. వారి సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
విమానంలో ప్రయాణికుల ఫైట్
సాక్షి, చెన్నై: కొచ్చి నుంచి చెన్నైకు వచ్చిన విమానం గాల్లో ఉండగా ఇద్దరు ప్రయాణికులు ముష్టి యుద్ధానికి దిగారు. సినీ ఫైట్‌ను తలపించే విధంగా సాగిన ఈ ఫైట్ చెన్నై విమానాశ్రయంలో టెన్షన్ రేపింది. కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి చెన్నైకు శనివారం రాత్రి 171 మంది ప్రయాణికులతో విమానం చెన్నైకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కేరళకు చెందిన డేవిస్(35), అమెరికాకు చెందిన కసన్ ఎలియా(32) ప్రయాణికుడి మధ్య వాగ్వాదం ముదిరి, ఇద్దరూ ముష్టియుద్ధానికి దిగారు. వీరిని వారించేందుకు తోటి ప్రయాణికులు ప్రయతి్నంచి విఫలమయ్యారు. విమానంలోకి సిబ్బంది బుజ్జగించారు. అయితే ఇద్దరూ ఏ మాత్రం తగ్గకపోగా వారు ఇచ్చిన హెచ్చరికలు ఇతర ప్రయాణికులకు ముచ్చెమటులు పట్టించాయి. తమ వద్ద బాంబులు ఉన్నట్టు దాడికి రెడీ అని ఆ ఇద్దరు పరస్పరం హెచ్చరించడంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయానికి ఫైలట్లు సమాచారం అందించారు. చేసేది లేక విమానాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ల్యాండింగ్ చేశారు. రిమోట్ ఏరియాకు తరలించారు. భద్రతా బలగాలు పరుగులు తీశాయి. ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాయి. విమానంలోని అందరి బ్యాగ్‌లను తనిఖీలు చేశారు. క్షుణ్ణంగా తనిఖీల తర్వాత విమానంలో ఉన్న ప్రయాణికులను రాత్రి 2.30 గంటల సమయంలో బయటకు పంపించారు. ఆ ఇద్దర్ని అరెస్టు చేసి ప్రశ్నించారు. -
కుంటుతూనే ఈవెంట్‌కు పుష్ప భామ.. సాయం చేసిన హీరో
పుష్ప భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కొద్ది రోజుల క్రితం గాయపడిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయమైంజి. అయితే చికిత్స పొందిన తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించింది. ఇవాళ ముంబయిలో జరిగిన ఛావా ట్రైలర్ లాంఛ్‌కు ఈవెంట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ.తన కాలు సహకరించుకున్నా ఛావా (Chhaava) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు రష్మిక హాజరైంది. రష్మిక కుంటుతూ ఈవెంట్‌కు వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా హీరో విక్కీ కౌశల్ ఆమెను చేతపట్టుకుని స్టేజీపై నడిపించుకుంటూ వెళ్లారు. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మిక డెడికేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ఛావా. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీలో శంభాజీ భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. #TFNExclusive: Beautiful @iamRashmika snapped in a stunning look for #Chhaava trailer launch in Mumbai!!♥️#RashmikaMandanna #Pushpa2TheRule #TheGirlfriend #Kubera #TeluguFilmNagar pic.twitter.com/qEpiTvn59I— Telugu FilmNagar (@telugufilmnagar) January 22, 2025 -
తప్పతాగిన నటుడు.. అర్ధనగ్నంగా కేకలు వేస్తూ.. వీడియో వైరల్!
రజినీకాంత్ జైలర్ మూవీ పేరు వినగానే ఆయనే గుర్తుకు వస్తారు. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్‌తో అభిమానులను అలరించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం రజినీకాంత్ ఖాతాలో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో తనదైన విలనిజంతో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్థాయిలో వివాదాల్లోనూ నిలిచారు. గతంలో వినాయకన్‌ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.వీడియో వైరల్..తాజాగా వినాయకన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫుల్‌గా తాగి గట్టిగా అరుస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇందులో వినాయకన్ అర్ధనగ్నంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఆయన ఇంట్లో బాల్కనీలో ఉండగా తీసినట్లు తెలుస్తోంది. విజువల్స్ చూస్తే ఎవరితోనో గొడవ పడుతున్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్ ప్రవర్తనపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమాల నుంచి అతన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లోనూ న్యూసెన్స్..గతంలో జైలర్ నటుడు వినాయకన్ మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోయాడు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.కాగా మలయాళ నటుడైన వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. చివరిసారిగా ఇటీవల రిలీజైన ఉన్ని ముకుందన్ చిత్రం మార్కోలో కనిపించారు. #Vinayakan 🥃🔞🙉Actor or Drunker 😡He should be banned from acting.pic.twitter.com/JK3UWJTzop— Tharani ᖇᵗк (@iam_Tharani) January 20, 2025 -
స్క్విడ్ గేమ్ సిరీస్‌లో మన హీరోలు.. ఈ వీడియో చూశారా?
ఇటీవల విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోన్న వెబ్ సిరీస్ స్క్విడ్‌గేమ్-2(Squid Game-2) . గతంలో వచ్చిన సీజన్-1కు కొనసాగింపుగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు స్క్విడ్ గేమ్ -3 కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అది పొరపాటుగా పోస్ట్ చేశామని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్‌కు(web series) ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఈ సిరీస్ అంతా ఆడియన్స్‌ను ఉత్కంఠకు గురి చేస్తుంది.అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్‌లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహా ఎంత బాగుందో కదా? మరి అదే నిజమైతే బాగుండని మీకు అనిపిస్తోంది కదా? అవును.. మన హీరోలు ఆ గేమ్‌ను ఎలా ఆడతారో అనే ఆసక్తి ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఉంటుంది. అందుకే అసాధ్యం కాని వాటిన సుసాధ్యం చేయొచ్చని మరోసారి నిరూపించారు. అదెవరో కాదండి.. అదే మానవాళికి సవాలు విసురుతోన్న ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్). తాజాగా ఏఐ సాయం రూపొందించిన స్క్విడ్ గేమ్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.ఈ వీడియోలో మన స్టార్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ వీరంతా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు హీరోలు, కమెడియన్స్ సైతం ఈ స్క్విడ్‌గేమ్ వెబ్సిరీస్లోని పాత్రలతో వీడియోను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన ఈ వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అభిమాన హీరోల ఏఐ ఇమేజ్‌ల వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌ల్లో స్క్విడ్ గేమ్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన స్క్విడ్‌గేమ్ సీజన్-2 ఓటీటీలో రికార్టులు సృష్టిస్తోంది. మొదటివారంలోనే అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.సీజన్-3పై అప్డేట్..స్క్విడ్ గేమ్ సీజన్-2కు (Squid Game Season-2) ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇటీవలే సీజన్-3 అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పొరపాటున డేట్ రివీల్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ. This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8— Priyanka Reddy - Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025 -
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి.. వీడియో వైరల్
తారక్ మెహతా కా ఊల్టా చష్మా షో నటి జీల్ మెహతా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు ఆదిత్య దూబేను పెళ్లి చేసుకుంది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.అయితే జీల్ మెహతా వివాహ వేడుక డిసెంబర్ 28న జరిగింది. కాస్తా ఆలస్యంగా అభిమానులతో ఈ గుడ్ న్యూస్ పంచుకుంది. కాగా.. జీల్ మెహతా తారక్ మెహతా కా ఊల్టా చష్మా సిట్కాట్తో పాటు చల్దీ దా నామ్ గడ్డి సీరియల్లోనూ నటించింది.కాగా.. గతేడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న జీల్ మెహతా, ఆదిత్య దూబే ఏడాది చివర్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. తారక్ మెహతా కా ఊల్తా చష్మా షో సోను పాత్రలో అభిమానులను మెప్పించింది. జీల్ మెహతా 2008 నుంచి 2012 వరకు ఈ సిట్కామ్ షోలో కనిపించింది. మరో సీరియల్ చల్దీ దా నామ్ గడ్డిలో ప్రియాంక పాత్రలో అలరించింది. ఈ సిరీయల్ 2007 నుంచి 2008 వరకు కొనసాగింది. View this post on Instagram A post shared by Priya Parikh | Wedding Content Creation (@sociallydreaming) -
రైలు పట్టాల మధ్యలో పడుకుని.. చావు తప్పించుకున్నాడు
ఓ వ్యక్తి పట్టాలపై నడుస్తుండగా ఎదురుగా రైలు దూసుకొచ్చింది. వెంటనే పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు తన మీదుగా వెళ్తున్నంత సేపు కదలలేదు. మెదలలేదు. రైలు వెళ్లిపోగానే లేచి.. దుమ్ము దులుపుకొని ఇంటి దారి పట్టాడు. చూసినవారికి మాత్రం గుండె ఆగిపోయినంత పనయ్యింది. కేరళ రాష్ట్రంలో కన్నూర్ జిల్లాలో జరిగిన ఘటనను చిత్రీకరించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. మంగళూరుృతిరువనంతపురం ట్రైన్ కన్నూర్ృచిరక్కల్ రైల్వే స్టేషన్ల గుండా వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆ మార్గంలోని పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతను ఫోన్లో మాట్లాడుతుండటంతో రైలు దగ్గరగా వస్తున్న విషయాన్ని గమనించలేదు. తీరా చూసేసరికి.. తప్పించుకునే వీలులేకుండా పోయింది. వెంటనే సమయ స్ఫూర్తితో వ్యవహరించిన పవిత్రన్.. పట్టాల మధ్యలో పడుకున్నాడు. ట్రైన్ వెళ్లిపోగానే లేచి ఇంటికెళ్లిపోయాడు. #Kerala: A middle-aged man from Chirakkal narrowly survived after a train passed over him in Pannenpara, Kannur, while he was walking along the tracks. Eyewitnesses reported that he lay down on the tracks just before the train approached, emerging unscathed. pic.twitter.com/ZPApakxHRp— Informed Alerts (@InformedAlerts) December 24, 2024 అయితే వీడియో వెనుకనుంచి చిత్రీకరించడంతో వ్యక్తిని గుర్తించడం కష్టమైంది. వైరలైన వీడియోను చూసిన పోలీసులు.. తాగిన మత్తులో వ్యక్తి అలా చేశాడేమోనని భావించారు. తరువాత విచారించగా ఆ వ్యక్తి స్కూల్ వ్యాన్ క్లీనర్‌గా 56 ఏళ్ల పవిత్రన్ అని తేలింది. తాను తాగలేదన్న పవిత్రన్.. ప్రాణాలను కాపాడుకోవడానికి అలా పట్టాలపై పడుకున్నానని చెప్పారు. ఇంకా ఆ భయం నుంచి తేరుకోలేదన్నారు. వీడియో చూసి తాము ఆశ్చర్యపోయామని, బక్కగా ఉండటం వల్లే పవిత్రన్ ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు అంటున్నారు. -
అక్కినేనివారి కోడలు.. ఆనందంలో స్టెప్పులు అదుర్స్.. వీడియో వైరల్!
ఇటీవలే అక్కినేనివారి ఇంట పెళ్లి వేడుక జరిగింది. ఈనెల 4న అక్కినేని హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిపెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.అయితే పెళ్లికి ముందు శోభిత డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే సమయంలో తెలుగు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని బ్లాక్‌బస్టర్ బ్లాకబస్టరే అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో చిందులు వేసింది. This video of #SobhitaDhulipala proves happiest brides are the prettiest #NagaChaitanya #viralvideo #GalattaIndia pic.twitter.com/9MUHLG0K35— Galatta India (@galattaindia) December 10, 2024 -
తాళికట్టే శుభవేళ.. శోభిత- నాగచైతన్య పెళ్లి వీడియో వైరల్!
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి ముగిసింది. వేదమంత్రాల సాక్షిగా నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు.తాజాగా శోభిత- నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శోభిత మెడలో చైతూ తాళి కడుతున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో నాగార్జునతో పాటు వెంకటేశ్ కూడా కనిపించారు. ఇది చూసిన ఫ్యాన్స్ కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. Once again Happy marriage life @chay_akkineni @sobhitaD 💐💐💐Happy for you #SoChay #Chayo #SoChayWedding pic.twitter.com/tLPP4xARqG— Яavindra (@Nag_chay_akhil) December 5, 2024 -
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్‌కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్‌కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
రామ్ చరణ్ దంపతులపై క్యూట్ వీడియో.. స్పందించిన ఉపాసన!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు.. మెడికల్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది. ఎడిటింగ్ చాలా ముద్దుగా ఉంది.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. గేమ్ ఛేంజర్‌లో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలిచింది. What a cute edit. ❤️ ❤️ thank u for all the love. https://t.co/AMtAtr2w0T— Upasana Konidela (@upasanakonidela) November 28, 2024 -
క్షేమంగానే ఉన్నా.. ఆరోగ్యంపై సునీతా విలియమ్స్ క్లారిటీ
-
తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఇంత అద్భుతంగా చేశారా?
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్య. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సందడి చేశారు. ఇంటిని అలంకరించిన తీరు అభిమానులను కట్టిపడేస్తోంది. (ఇది చదవండి: తారకరత్న కూతురు బర్త్ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!)కాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nishka Nandamuri (@nishkatarakratna) -
సూపర్ పవర్ ఉందంటూ..
సేలం: తనకు సూపర్ పవర్స్ ఉన్నాయంటూ ఓ కళాశాల విద్యార్థి నాలుగో అంతస్తుపై నుంచి అమాంతం కిందకు దూకి కాళ్లు, చేతులు విరగొట్టుకున్న ఘటన కోవైలో కలకలం రేపింది. కాగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కోవై జిల్లా మలుమిసంపట్టి సమీపంలో మైలేరిపాళయంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇందులో ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపంలో ఉన్న మేక్కూర్ గ్రామానికి చెందిన యువకుడు ప్రభు (19) హాస్టల్లో బస చేసి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభు మంగళవారం సాయంత్రం అతను బస చేసి ఉన్న హాస్టల్లో నాలుగో అంతస్తుపై నుంచి అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో చేతులు, కాళ్లు విరిగి పోయి తీవ్రంగా గాయపడిన ప్రభును సహ విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్టిపాళయం పోలీసులు జరిపిన విచారణలో బాధితుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రభు అని తెలిసింది. తనకు సూపర్ పవర్ ఉందనే భ్రమలో ఉన్న ప్రభు తాను ఎంత ఎత్తయిన భవనం పై నుంచైనా దూకగలడని, తనకు ఏమీ కాదనే నమ్మకాన్ని పలు మార్లు స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఇదే విధంగా పక్క భవనం పైకి జంప్ చేసిన క్రమంలో కింద పడి గాయపడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి ప్రభు కిందకు దూకిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.Shocking, a 19-year-old #BTech #student, believed he had #superpowers and jumped off the fourth floor of the students' hostel building in #Coimbatore , #TamilNadu The student from Mekkur village near Perundurai in Erode district suffered injuries. 28/10/24 pic.twitter.com/sGXqeMyRWF— Dilip kumar @DBN (@Dilipkumar_PTI) October 30, 2024 -
హస్తినలో యమునా తీరం... కాలుష్య కాసారం!
చూసేందుకు పాల నురగలా తళతళా మెరిసిపోతూ కని్పస్తోంది కదూ! కానీ ఇదంతా దేశ రాజధానిలో యమునా నదిని నిలువెల్లా కబళించిన కాలుష్యం తాలూకు నురగ! ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నురగలో అమోనియా, పాస్పేట్ వంటివి ప్రమాదకర పాళ్లలో ఉన్నట్టు నిపుణులు తేల్చారు. ఇది శ్వాసతో పాటు పలురకాలైన చర్మ సమస్యలకు దారి తీస్తుందని వివరించారు. యమునలో కాలుష్యం కొంతకాలంగా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతున్నా వర్షాకాలంలో ఈ స్థాయి నురగను ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ పొడవునా యమునలో కాలుష్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్న 13 హాట్స్పాట్లను గుర్తించినట్టు రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. దుమ్ము, ధూళితో పాటు నురగను నియంత్రించేందుకు 80 చోట్ల యాంటీ స్మాగ్ గన్స్ మోహరిస్తామన్నారు. కానీ మాటలే తప్ప యమునలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. -
ఇజ్రాయెల్ వ్యూహం బ్యాక్‌ఫైర్!
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ అధినేత యాహ్యా సిన్వర్(61) హత్య విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం వికటిస్తోంది. హమాస్ సభ్యులను భయకంపితులను చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన డ్రోన్ వీడియో దృశ్యం నిజానికి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇజ్రాయెల్‌పై భీకర పోరాటానికి పురికొల్పుతోంది. ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జవాన్లు చేసిన దాడిలో సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సిన్వర్ చివరి క్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. సిన్వర్ కుడి చెయ్యి చాలావరకు నుజ్జునుజ్జుగా మారింది. బాంబుల దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఓ భవనంలో ఒక సోఫాలో ఆయన కూర్చొని ఉన్నారు. చుట్టూ దుమ్మూ ధూళి దట్టంగా పేరుకుపోయి ఉంది. తనపై దాడి చేస్తున్న డ్రోన్‌పై ఆయన ఎడమ చెయ్యితో కర్ర లాంటిది విసురుతూ కనిపించారు. ఒకవైపు ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తున్నా, మరోవైపు శత్రువుపై పోరాటం ఆపలేదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిసింది. రక్షణ వలయం లేదు.. కవచం లేదు గాజా భూభాగంలోని భారీ సొరంగంలో సిన్వర్ తలదాచుకుంటున్నాడని, చుట్టూ బాడీగార్డులతో దుర్భేద్యమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడని, అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన వారిని రక్షణ కవచంగా వాడుకుంటున్నాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇజ్రాయెల్ అధికారులు సైతం ఇదే విషయం పదేపదే వెల్లడించారు. కానీ, వీడియో దృశ్యం చూస్తే సిన్వర్ సొరంగంలో లేడు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్నాడు. ఆయన చుట్టూ రక్షణ వలయం గానీ, రక్షణ కవచం గానీ లేదు. ఇజ్రాయెల్ చెప్పిందంతా అబద్ధమేనని ఈ దృశ్యాలు రుజువు చేశాయి. మద్దతుదారుల కంటతడిమృత్యువుకు చేరువవుతూ కూడా సిన్వర్ సాగించిన పోరాటాన్ని చూసి పాలస్తీనావాసులు, హమాస్ మద్దతుదారులు కంటతడి పెడుతున్నారు. వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఇజ్రాయెల్‌పై కసిగా మారుతోంది. సిన్వర్ హత్యకు ప్రతీకారం తప్పదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డ్రోన్ వీడియో దృశ్యం పాలస్తీనా పౌరులకు స్ఫూర్తిదాయకంగా మారడం గమనార్హం. వారంతా ఇజ్రాయెల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. సిన్వర్ త్యాగాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ ఆశించింది ఒకటి కాగా, జరుగుతున్నది మరొకటి కావడం గమనార్హం – సాక్షి, నేషనల్ డెస్క్ఇదీ జరిగిందిసిన్వర్ హత్య ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ సైనికాధికారులు కొన్ని వివరాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 828వ బిస్లామాచ్ బ్రిగేడ్ తాల్ అల్–సుల్తాన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. సైనికుల కంట పడకుండా సందులు గొందులు తిరుగుతూ తప్పించుకొనేందుకు ప్రయతి్నంచారు. వారిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఓ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ డ్రోన్లు గుర్తించాయి. దాంతో జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. యుద్ధట్యాంకుతో పేల్చివేశారు. ఈ ఘటనలో సిన్వర్ మరణించాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను కూడా సైన్యం అంతం చేసింది. అయితే, తొలుత చనిపోయిన వ్యక్తి సిన్వర్ అని ఇజ్రాయెల్ సైన్యానికి తెలియదు. అనుమానంతో మృతదేహం వేలిని కత్తిరించి, ఇజ్రాయెల్‌కు పంపించి డీఎన్ఏ టెస్టు చేశారు. సిన్వర్ డీఎన్ఏతో అది సరిగ్గా సరిపోయింది. దాంతో చనిపోయింది సిన్వర్ అని తేల్చారు. -
కండలవీరుడికి ముద్దు పెట్టిన హీరోయిన్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రియాలిటీ షో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ సీజన్ అభిమానులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోంది. తాజా ఎపిసోడ్లో బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ మెరిసింది. ఇటీవల విడుదలైన తన మూవీ విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాను ప్రమోట్ చేసేందుకు వచ్చింది.ఈ ఎపిసోడ్లో పాల్గొన్న మల్లికా షెరావత్.. సల్మాన్ ఖాన్‌పై ప్రేమవర్షం కురిపించింది. ఇండియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ కొనియాడింది. నా కళ్లలో కళ్లు పెట్టి చూడు అంటూ సల్మాన్‌తో సరదాగా మాట్లాడింది. మీరు నా హృదయంలో ఉన్నారంటూ వేదికపైనే సల్మాన్‌కు ముద్దుపెట్టి మరి తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ సిగ్గుపడుతూ కనిపించారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. సల్మాన్ హోస్ట్‌గా ఉన్న ఈ రియాలిటీ షోలో మల్లికా షెరావత్ మొదటిసారి కనిపించింది. ఈ ఎపిసోడ్‌కు మల్లికతో పాటు చిత్రంలో నటించిన రాజ్‌కుమార్ రావు, ట్రిప్తి డిమ్రీ కూడా హాజరయ్యారు. 1990లో ఓ చిన్న పట్టణంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
డ్రైవర్ లెస్ కారులో మంటలు.. వీడియో వైరల్
జైపూర్: రాజస్థాన్‌లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. జైపూర్‌లో డ్రైవర్ లెస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై పార్క్ చసిన బైక్‌లను ఢీకొడుతూ మంటలతోనే కారు ముందుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కారు ఓనర్ అల్వార్‌కు చెందిన ముఖేష్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ముఖేష్ గోస్వామి అతని స్నేహితుడు జితేంద్ర జంగిద్ నడిపారు. అయితే కారు బానెట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటాన్ని ఆయన గమనించారు. మంటలు చెలరేగడంతో కారు హ్యాండ్‌బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ జితేంద్ర.. అందులో నుంచి బయటకు దూకేశారు. ఎలివేటెడ్ రోడ్డులో కారు మంటలతో అక్కడ పార్క్ చేసిన పలు బైక్‌లను ఢీకొడుతూ కిందికి కదిలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి దినేష్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. Watch Burning Car on #Jaipur Road Causes Panic Among Commuters | #Burningcar pic.twitter.com/mzEKAGCyU6— KINGSNEWS (@KINGSNEWS7) October 13, 2024చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్ -
దాండియా ఆడిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరో మాస్ యాక్షన్ మూవీతో అభిమానులను అలరించనున్నారు. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా విశ్వక్ సేన్ దసరా పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా గుజరాతీ స్టైల్లో దాండియా ఆడుతూ కనిపించారు. తన సిస్టర్‌తో కలిసి విశ్వక్ సేన్ దాండియా ఆడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. #TFNReels: Mass Ka Das @VishwakSenActor plays dandiya with his sister at Navaratri celebrations!!❤️#VishwakSen #Laila #MechanicRocky #TeluguFilmNagar pic.twitter.com/UuzlCM3ZVP— Telugu FilmNagar (@telugufilmnagar) October 11, 2024 -
కర్ణాటక న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు సుమోటో కేసు
న్యూఢిల్లీ, సాక్షి: వివాదాస్పద వ్యాఖ్యల వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేదవ్యాసాచార్ శీర్షానందపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటక హైకోర్టును ఆదేశించింది.సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, సంజయ్ ఘోష్‌లు.. జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద వ్యాఖ్యలతో కూడిన ‘ఎక్స్’ పోస్టును ప్రస్తావిస్తూ తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా సీజేఐను అభ్యర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ ‘‘ఇలాంటి అంశాలపై కొన్ని సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తూనే హైకోర్టు నుంచి నివేదిక తెప్పించండి’’ అని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి పరిపాలన పరమైన అనుమతులు పొందిన తరువాత రిజిస్ట్రార్ జనరల్ తమకు నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై వచ్చే మంగళవారం మళ్లీ విచారణ చేస్తామని తెలిపారు.‘‘సోషల్ మీడియా విస్తృత వాడకంలో ఉన్న ఈ కాలంలో అందరూ మనల్ని (న్యాయమూర్తులు) చాలా నిశితంగా పరిశీలిస్తూంటారు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి వ్యవహరించాలి’’ అని కూడా సీజేఐ వ్యాఖ్యానించారు.ఇంతకీ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద ఏం మాట్లాడారంటే.. కొన్ని రోజుల క్రితం రెండు వీడియోలో ఎక్స్‌లో పోస్ట్ అయ్యాయి. అందులో జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద మాట్లాడుతూ బెంగళూరులోని ఒక ప్రాంతాన్ని ‘పాకిస్థాన్’తో పోల్చారు. అక్కడ ఒక్కో ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నా పోలీసులు పట్టించుకోరని ఆయన వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. ఇది వాస్తవమని.. ఎంతటి పెద్ద అధికారి అయినా అక్కడ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోరని కూడా జడ్జి కన్నడలో తెలిపారు. ఇక రెండో వీడియోలో ఓ మహిళ న్యాయవాదిని ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.One month old video of Karnataka High Court, Justice Vedavyasachar Srishananda while Criticizing the cops referred to an area (Gori Palya) in Bengaluru as Pakistan. Gori Palya is an area where a large number of Muslims live. He was referring to auto pooling in that area where… pic.twitter.com/H1FwKKEg7S— Mohammed Zubair (@zoo_bear) September 19, 2024 "Justice Vedavyasachar Srishananda Faces Backlash Over Gender-Insensitive Remark"Karnataka High Court pic.twitter.com/UG2O1gQwMC— ADV Pramod Kumar (@thelawyr) September 20, 2024 -
బాయ్‌ఫ్రెండ్‌తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!
ఇటీవలే భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న నటి, మోడల్ నటాసా స్టాంకోవిచ్ ప్రస్తుతం ముంబయిలో చిల్ అవుతోంది. విడాకుల తర్వాత సెర్బియా వెళ్లిపోయిన నటాషా దాదాపు రెండు నెలల తర్వాత ఇండియాకు వచ్చింది. అయితే ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్ కూడా ఉన్నారు. వీరిద్దరు కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. అంతకుముందే తాను ముంబయికి వచ్చిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన కుమారుడు అగస్త్యతో పాటు ఇండియాక వచ్చినట్లు తెలిపింది. ఇటీవల తన కొడుకు పుట్టినరోజును సెర్బియాలో తన కుటుంబం, బంధుమిత్రులతో కలిసి జరుపుకుంది. బర్త్ డేకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.కాగా.. నటాసా స్టాంకోవిచ్ మొదట యాడ్స్‌లో నటించడం ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రకాష్ ఝా తెరకెక్కించిన సత్యాగ్రహం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. అంతేకాకుండా డిష్కియావూన్, యాక్షన్ జాక్సన్, 7 అవర్స్ టు గో, జీరో వంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వహ్వా రసం పూరి.. తింటారా మైమరచి!
మీరెప్పుడైనా పానీ పూరి తిన్నారా? వాటిల్లో రకరకాల ఫ్లేవర్స్ రుచి చూశారా?తినే ఉంటారు! మరి.. రసం పూరి?దీన్ని తినాలంటే మాత్రం మీరు... కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపికి వెళ్లాల్సిందే! ఎందుకంటే అక్కడి ‘విప్ర’ ఛాట్ హోమ్‌కు వెళ్లాల్సిందే! జూనియర్ ఎన్టీఆర్, కాంతార హీరో రిషభ్ శెట్టిలు ఇటీవల దర్శించుకున్న ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాకుండా.. ఉడుపి టమోటా రసంకు చాలా ప్రసిద్ధి. శ్రీకృష్ణ మఠం నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈ వంటకం ఓ స్పెషల్ అట్రాక్షన్. దీని రుచి, పరిమళం వేరే లెవల్ అని అంటారు అభిమానులు. ఇంతలా చాలామంది అభిమానం చూరగొన్న వంటకానికి మరింత ప్రచారం కల్పించాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ‘విప్ర’ ఛాట్ హోమ్ వారు సాధారణ పానీ పూరి స్థానంలో రసం పూరిని ప్రవేశపెట్టారు. ఉడుపి రసంను పూరీల్లో పోసి ఇస్తారన్నమాట! ఈ సారి మీరేమైనా ఉడుపి వెళితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి! మధుకర్ ఆర్. మయ్యా అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ సరికొత్త ఛాట్ వీడియో ఒకటి పోస్ట్ చేశారుಉಡುಪಿ ಸಾರನ್ನು ಚ್ಯಾಟ್ಸ್ ರೂಪದಲ್ಲಿ ಸವಿದಿದ್ದೀರಾ| ವಿಪ್ರ ಚಾಟ್ ಹೋಮ್ ರಸಂ ಪುರಿ | ಕೃಷ್ಣ ಮಠದ ಪಾರ್ಕಿಂಗ್ ಏರಿಯಾದ ಶ್ರೀರಾಮ ಧಾಮ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ | ಉಡುಪಿಯ ಕಂಡೀರಾ pic.twitter.com/h2DPhS5H1p— Madhukara R Maiya 🇮🇳 (@madhumaiya) September 2, 2024 -
ప్రారంభమైన అరగంటకే లూటీ!
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కొత్తగా ప్రారంభించిన షాపింగ్ మాల్ ‘డ్రీమ్ బజార్’ప్రారంభోత్సవం రోజునే లూటీకి గురయ్యింది. ఈ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఒక బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. దీనిని చూసిన జనం మాల్ లోనికి ప్రవేశించి, తమకు తోచిన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో అరగంటలో మాల్ మొత్తం ఖాళీ అయిపోయింది.రూ. 50 కంటే తక్కువ ధరలకే వివిధ వస్తువులను విక్రయిస్తామంటూ ఈ మాల్‌ను ప్రారంభించారు. మొదటి రోజునే మాల్ విధ్వంసానికి గురయ్యింది. పాకిస్తాన్లో తొలి మెగా పొదుపు దుకాణంగా ఈ మాల్‌కు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ప్రారంభోత్సవం రోజున దుస్తులు, వివిధ ఉపకరణాలు గృహోపకరణాలను భారీ తగ్గింపు ధరలకు అందిస్తామని మాల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో మాల్ తెరుచుకోగాగానే వేలాది మంది మాల్‌లోకి ప్రవేశించి, చేతికి అందిన వస్తువులను పట్టుకుపోయారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పరిశీలించి చూస్తే కరాచీలోని గులిస్తాన్-ఎ-జోహార్ ప్రాంతంలో ఈ మాల్‌ను ప్రారంభించారని తెలుస్తోంది. దాదాపు లక్ష మంది మాల్‌పై దాడి చేసి, ఒక్క వస్తువు కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది.ఏఆర్వై న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం మాల్లో పరిస్థితిని నియంత్రించడానికి అక్కడి సిబ్బంది తలుపులు మూసే ప్రయత్నం చేయగా, బయటనున్నవారు కర్రలతో గ్లాస్ ఎంట్రీ గేట్‌ను పగలగొట్టి లోనికి చొరబడ్డారు. దీని తరువాత మాల్తో పరిస్థితి చాలా భయానకంగా మారింది. మరోవైపు నగరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మాల్ వెలుపల వేలాది జనం గుమిగూడారు. ఈ ఘటనను చాలామంది తమ ఫోన్లతో వీడియోలు తీశారు. మాల్ ప్రారంభించిన అరగంటలోనే ఖాళీ అయిపోయిందని, జనం వస్తువులన్నింటినీ పట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త మాల్ తెరవగా 3:30 కల్లా వస్తువులన్నీ లూటీ అయ్యాయని సమాచారం. A businessman of Pakistani origin living abroad opened a huge mall in Gulistan-e-Johar locality of Karachi, which he named Dream Bazaar. And today on the day of inauguration he had announced a special discount. A crowd of about one lakh Paki goths stormed the mall and looted the… pic.twitter.com/OmLvMn6kHF— Politicspedia (@Politicspedia23) September 1, 2024 -
లవ్ ఈజ్ ఇన్‌ద ఎయర్ : లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
తాజ్‌మహల్ ముందే లవ్ ప్రపోజ్ చేయాలా ఏంటి? ఈఫిల్ టవర్ముందు నిలబడే ఐ లవ్ యూ చెప్పాలా? మంచి ఘడియ ముంచుకు రావాలే గానీ ఎక్కడైనా మనసులోని ప్రేమను వ్యక్తం చేయొచ్చు. అందుకే ఇండిగో విమానంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసిందో ప్రేయసి. లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అన్నట్టున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. "నేను గాలిలో ప్రపోజ్ చేశాను" అంటూ ప్రియురాలు ఐశ్వర్య బన్సల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అందమైన ఈ వీడియో ప్రేమికుల మనసు దోచుకుంటోంది.బన్సల్, ప్రియుడు అమూల్య గోయల్ ఫ్లైట్ ఎక్కడంతో వీడియో ప్రారంభమవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత, బన్సల్ తన బాయ్‌ఫ్రెండ్ వైపు నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లపై నిలబడి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీంతో ప్రియుడు ఫుల్ ఖుష్ ఆగి ఆ క్షణంలోనే ఓకే చెప్పేసాడు. అంతే క్షణం ఆలస్యంగా తన బెటర్ హాఫ్ వేలికి ఉంగరాన్ని తొడిగింది. అంతేకాదు దీన్ని ఇండిగో కూడా సెలబ్రేట్ చేసింది. ఫ్లైట్ అటెండెంట్ మైక్రోఫోన్ తీసుకుని, ఇతర ప్రయాణీకుల దృష్టిని ఆకర్షిస్తూ ఈ పెళ్లి ప్రపోజ్ ప్రకటన చేయడం విశేషం. తన జీవితంలో ఎంతో అందమైన ఈ క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాను. కానీ ఊహించిన దాని కంటే మించి ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు. సిబ్బంది ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డా.. అన్నీ అనుకున్నట్టుగాజరిగాయంటూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేసింది బన్సల్. ఈ ప్రణయ పక్షుల వీడియోను మీరు కూడా చూసేయండి మరి! View this post on Instagram A post shared by Aishwarya Bansal (@aishwaryabansal_) -
పొగరుబోతుకు ఆర్మీ జవాన్ జవాబు!
ఆర్మీ అంటేనే క్రమశిక్షణకు, కట్టుబాట్లకు పేరు.. బెటాలియన్లోనైనా.. బయటనైనా జవాన్లు పద్ధతి ప్రకారం ఉంటారు. మరి.. తమ చుట్టూ ఉన్నవారు పద్ధతి మీరి కనిపిస్తే... పొగరుగా ప్రవర్తిస్తూంటే...? సహించలేరు కదా? ఈ వీడియోలో కూడా అదే జరిగింది. ఇందులో స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తి డివైడర్‌కు ఆవల.. ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంగా నిలబడటమే కాకుండా.. ఆంబులెన్స్కూ దారివ్వకుండా... పక్క నుంచి వెళ్లాల్సిందిగా పొగరుగా వ్యవహరించాడు. ఈ విషయం కాస్తా.. వెనుక ఉన్న ఆర్మీ వాహనం డ్రైవర్ కంట పడింది. కాసేపు ఊరకున్న.. ఆ వ్యక్తి పొగరుగా చేస్తున్న చేష్టలను ఆ జవాను తట్టుకోలేకపోయాడు. వాహనం నుంచి కిందకు దిగి.. ఆ వ్యక్తి హెల్మెట్‌పైనే ఒక్కటిచ్చుకున్నాడు... ‘‘బుద్ధుందా.. ఎదురుగా ఆంబులెన్స్ వచ్చినా దారి ఇవ్వవా’’ అని గడ్డిపెట్టినట్లు ఉన్నాడు. అయినా ఆ వ్యక్తి పక్కకు జరగలేదు సరికదా.. ఇంకాస్తా దురుసుగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో ఆ జవాలు.. వాహనంలో ఉంచిన లాఠీని బయటకు తీసి పని చెప్పబోయాడు. ఈ లోపు అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసు... ‘‘మీరు ఉండండి సర్. ఇక నేను చూసుకుంటాను కదా’’ అని సర్ది చెప్పింది.ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. @shilpa_cn హ్యాండిల్ కలిగిన ‘ఎక్స్’ ఖాతాదారు ఒకరు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్మీ జవాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.Satisfying video 🤌🏻Indian Army 😍 pic.twitter.com/H6nnlehIaD— Shilpa (@shilpa_cn) August 25, 2024 -
Wayanad: రాత్రికి రాత్రే.. భయానక దృశ్యాలు వైరల్
కేరళ వయనాడ్ ప్రకృతి విపత్తుతో కకావికలం అయ్యింది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి.. బురద ప్రవాహం గ్రామాల్ని ముంచెత్తింది. సుమారు 300 మంది మరణించగా.. వందల మంది నిరాశ్రయులయ్యారు. మరో వంద మందికి పైగా జాడ లేకుండా పోయారు. ఈ విలయం ధాటికి దెబ్బతిన్న గ్రామాలు.. అక్కడి ప్రజలూ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.CCTV footage of the devastating #Wayanadlandslide in #Kerala which occurred 20 days ago, has gone viral.The disaster claimed 231 lives, with 212 body parts recovered, while 118 people remain missing.The footage, now circulating widely, captures the catastrophic moment,… pic.twitter.com/5FV9NbgaW9— South First (@TheSouthfirst) August 19, 2024అయితే.. కొండచరియలు విరిగినపడిన సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారి బురద కలగలిసిన జలప్రవాహం ఎగిసిపడి ముంచెత్తిన దృశ్యాలు వీడియోల్లో కనిస్తున్నాయి. -
చైతూ- శోభిత ఎంగేజ్మెంట్.. వాలైంటెన్స్ డే వీడియో వైరల్!
అక్కినేని హీరో నాగాచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈనెల 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు.అయితే చైతూ, శోభితకు అందరిలా కాకుండా కాస్తా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే జంటకు నాగచైతన్య సినిమాకు సంబంధించిన వీడియోతో స్పెషల్‌గా విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో నాగ చైతన్య వాలైంటైన్స్ డే సందర్భంగా షేర్ చేశారు. హీరోయిన్ సాయిపల్లవితో తండేల్ డైలాగ్ చెబుతూ వాలైంటైన్స్ డే రోజు శుభాకాంక్షలు తెలిపారు.అయితే చైతూ ప్రస్తుతం తండేల్ మూవీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. #TFNReels: A beginning of infinite love.. Yuvasamrat @Chay_akkineni & @sobhitaD ❤️♾️Wishing you both endless joy and a beautiful journey together!! 💞#NagaChaitanya #SobhitaDhulipala #TeluguFilmNagar pic.twitter.com/LR9HGGYsCU— Telugu FilmNagar (@telugufilmnagar) August 10, 2024 -
వయనాడ్ విలయం: ప్రకృతి ప్రకోపం.. శిథిలాల కింద నుంచి ఫోన్లు.. వీడియోలు చూశారా?
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. సహాయక చర్యలు ముందుకు సాగుతున్నా కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన వాళ్లు దేవుడ్ని తలుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. வயநாடு நிலச்சரிவு இயற்கை பேரிடரின் காட்சிகள். பலி எண்ணிக்கை 54 ஐ கடந்தது...உயிரிழப்புகள் உயரும் என அஞ்சப்படுகிறது. #WayanadLandslide#WayanadDisaster#Wayanad pic.twitter.com/AmTZjlHel7— Abdul Muthaleef (@MuthaleefAbdul) July 30, 2024శిథిలాల కింది నుంచే ఫోన్లు.. అర్ధరాత్రి చిమ్మచీకట్లో కొండచరియలు, బురద విరుచుకుపడటంతో వయనాడ్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. చాలామంది బాధితులు శిథిలాల కింద నుంచి ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడ్డారు. ‘‘ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కావడంలేదు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’’ అంటూ ఓ మహిళ ఫోన్ కాల్‌ను అక్కడి టీవీ చానెల్స్ ప్రసారం చేశాయి. ఇల్లు, అయినవాళ్లు కనిపించక రోదిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. बेहद दुःखद खबर केरल से 😔😢भीषण बारिश से लैंडस्लाइड,मलबे में दबे 100 से ज्यादा लोग, 8 लोगों की मौत।images says it all about the Wayanad landslide. #Wayanad#Wayanad #Landslide #WayanadLandslide #WayanadDisaster #WayanadLandslides pic.twitter.com/eLHoO5bDkF— Ashfak 🇮🇳 Hussain (@AshfakHMev) July 30, 2024 Devastating landslide in Wayanad, Kerala So awful,praying God 🙏 for the safety & Well -being of all affected people and keep the kith and kin safe.Let's Pray For Them 🙏🙏Credits To Respective Owner #WayanadLandslide #Kerala @praddy06 @ChennaiRains@RainStorm_TN pic.twitter.com/jlDUv6aWHx— Shahidarafi (@Shahidarafi51) July 30, 2024BAD NEWS केरल से😭भीषण बारिश से लैंडस्लाइड, मलबे में दबे 100 से ज्यादा लोग, 8 लोगों की मौत।#Wayanad#WayanadLandslide pic.twitter.com/rsqnolljcs— police wala (@COP_DineshKumar) July 30, 2024The death toll in the Wayanad landslides has risen to 8. Those dead also include three children. The first landslide was reported at nearly 2 am. Later, at nearly 4.10 am, the district was struck by another landslide. #WayanadLandslide #Wayanad #Kerala pic.twitter.com/TCAWfMdaCz— Vani Mehrotra (@vani_mehrotra) July 30, 2024 225 మంది భారత ఆర్మీ బృందం రెస్య్కూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. విపత్తు జరిగిన ప్రదేశంలో కీలకమైన వంతెన కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈ ఘటనలో ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. చూరల్మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలు ధ్వంసం అయ్యాయి. సమీపంలోని గ్రామాల్లో అనేక ఇళ్లు ధ్వసం అయ్యాయి. భారీ వరదలతో అనేక భవనాలు నీటీలో మునిగి దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.മനുഷ്യർക്ക് വേണ്ടി മനുഷ്യർ 🫂#WayanadLandslide #WayanadDisaster pic.twitter.com/ERvONWTXAG— 5Zy (@5zy_dq) July 30, 2024 Beautiful Place is Now Being Scary Place #Wayanad Please Rescue the Peoples Safely !! #WayanadLandslidepic.twitter.com/vcIcHeQtLx— 𝐁𝐚𝐥𝐚𝐣𝐢_𝐏𝐚𝐥𝐚𝐧𝐢𝐑𝐚𝐣🇮🇳 (@Karunas_Balaji) July 30, 2024बेहद दुखद केरल के वायनाड में भीषण बारिश के बीच लैंडस्लाइड, मलबे में दबे 100 से ज्यादा लोग, 8 लोगों की मौत। 😢😢#kerla #WayanadLandslide pic.twitter.com/S60tluurNT— Jeetesh Kumar Meena (@jeeteshsaray) July 30, 2024#WayanadLandslide | The death toll in #Kerala reaches 36 Very sad to know this !! #Wayanad #Kerala#WayanadLandslide pic.twitter.com/1kIC4eTpa5— Anupama (@Anupamabbk) July 30, 2024केरल वायनाड में प्रक्रृति अपना रोद्र रूप दिखा रही है ,19 लोगो की मौत की खबर है हजारो लोग फसें हुए है हम सबको वायनाड के लिये प्रार्थना करनी चाहिए 😢#Kerala#WayanadLandslide pic.twitter.com/Nf433ANQX6— Jeetesh Kumar Meena (@jeeteshsaray) July 30, 2024 -
డచ్ కార్యాలయంలో భారతీయ వంటకాలు..వీడియో వైరల్!
భారతదేశ సంస్కృతిలానే ఇక్కడ ఆహారం కూడా సంప్రదాయనుగుణంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని భారతీయ వంటకాల గురించి ఖండాంతరాలకు వ్యాప్తి అవుతోంది. విలక్షణమైన స్వీట్స్, మసాలాతో కూడిన వంటకాలు చూసి విదేశీయలు సైతం టేస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. పైగా వాళ్లు కూడా ఈ వంటకాలను చేసేందుకు రెడీ అవుతున్నారు కూడా. ఇప్పడు ఇదంత ఎందుకంటే..మన భారతీయ వంటకాలను ఓ డచ్ కంపెనీ తన ఉద్యోగులకు సర్వ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెదర్లాండ్‌లో అనువింద్ కన్వాల్ అనే భారతీయుడు తన ఆఫీస్‌లో ఉద్యోగులుకు భారతీయ ఆహరం పేరుతో మన సంప్రదాయ వంటకాలు సర్వ్ చేసిన వీడియోని పంచుకున్నారు. ఇది ]ప్రశ్నించగదిగినది' అనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు కన్వాల్ పోస్ట్‌లో తన కార్యాలయంలో భారతీయ ఆహారం అనేది కొంచెం సందేహాస్పదంగా ఉన్నప్పటికీ.. ఎలా ఈ వంటకాలను వండారు అనేదాని గురించి తాను తెలుసుకోవాలనుకోవడం లేదని అన్నారు. అలాగే తన కార్యాలయంలో బెల్ పెప్పర్ పడిమా చట్నీ, నాన్స్ తదితర భారతీయ వంటకాలను సర్వ్ చేసినట్లు కూడా తెలిపారు. ఈ వీడియోకి ఒక మిలియన్‌కి పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు మాత్రం ఇలా వైవిధ్యంగా ఉండేందుకు ప్రయత్రిస్తున్న సదరు కంపెనీని ప్రశంసించగా, మరికొందరూ భారతీయ వంటకాలు ఖండాంతారాలకు చేరుకోవడం విశేషమే కాకుండా టేస్టే చేయాలనే వారి ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాల్సిందేనని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anuvind Kanwal (@anuvindkanwal) (చదవండి: టేస్ట్ అట్లాస్ మెచ్చిన డెజర్ట్‌తో గుండె ఆరోగ్యం పదిలం..!) -
Insta Reels: పోలీస్ స్టేషన్‌ను వదల్లేదు!
హైదరాబాద్, సాక్షి: సోషల్ మీడియాలో మోజుతో ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నీమధ్య తిరుమల పుణ్యక్షేత్రంలోనూ రీల్స్ చేసి ఆకతాయిలు భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను వదల్లేదు. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్న స్నేహితుడిని చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడ ఇన్‌స్టా రీల్ చేశాడు. పీఎస్ ఆవరణలో అంతా వీడియో తీశాడు. పైగా దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాటను ఉంచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. A viral video filmed at the Bandlaguda Police Station in Hyderabad's Old City shows a suspect in lock-up meeting another person while recording a reel, they had posted on Instagram also. This incident highlights the issue of VIP treatment to suspects, rowdies and criminals at… pic.twitter.com/WRaLmYJoLH— Naseer Giyas (@NaseerGiyas) July 16, 2024 -
ఇంగ్లిష్ యాదవ్ చాచా
ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్ చాచా అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇతడిని ‘ఆటోడ్రైవర్ యాదవ్ చాచా’ అని పిలిచే వారు చాలా తక్కువ. ‘ఇంగ్లిష్ యాదవ్ చాచా’ అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్ వీడియోలో భూషణ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ యాదవ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడించాడు. ‘ఇంగ్లిష్ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష’ అంటూ మాట్లాడాడు యాదవ్. -
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
-
‘‘నా ఆధార్, నా ఫోటో..’’ క్యూట్ బేబీ ఫోజులు వైరల్ వీడియో
భారత దేశంలో అపుడే పుట్టిన శిశువు నుంచి వయో వృద్ధుల దాకా పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇది ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రం. అలాగే బ్యాంకింగ్ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా. ఇలా దేనికోసమైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. తాజాగా ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.సాధారణంగా ఆధార్ కార్డులో ఫోటో చూసుకొని దేవుడా.. అనుకునే వాళ్లు చాలామంది (ఇపుడు ఫోటో మార్చుకునే అవకాశం ఉందనుకోండి) ఉన్నారు. ఇలాంటి ఫోటోలపై చాలా జోక్స్ వినే వింటాం. ఈ సంగతి తనకు తెలుసులే అన్నట్టు ఆధార్ కార్డ్ ఫొటోకు ఓ చిన్నారి (గున్‌గున్) ఇచ్చిన ఫోజులు విశేషంగా నిలిచాయి. అసలే పింక్ గౌన్‌లో చందమామలా ముద్దుగాముద్దుగా ఉంది. దీనికి తోడు ఎవరో చెప్పినట్టు రకాల రకాలుగా క్యూట్ , క్యూట్‌గా ఫోజులిచ్చింది. < View this post on Instagram A post shared by BabyNaysha (@gungun_and_mom) బుగ్గలపై చేయి పట్టుకుని ఒకసారి, అమాయకంగా చూస్తూ ఒకసారి, చిలిపిగా, అందంగా మల్లెపువ్వులా నవ్వుతూ కనిపించింది. అచ్చంగా పార్లే జీ పాపాలాగా కనిపించింది. దీంతో ఈ చిట్టి తల్లి వాళ్ల అమ్మ వీడియో తీసి గున్‌గున్ అండ్ మామ్అనే ఇన్‌స్టా ఐడీలో పోస్ట్ చేసింది. అంతే ఇది వైరల్ అయిపోయింది.‘పార్లే జీ గర్ల్’ అంటూ నెటిజన్లు తెగ పొగిడేశారు. ఆధార్ ఫోటో అందంగా కనిపించేది ఈ బేబీ ఒక్కతే ఒక యూజర్ కమెంట్ చేయగా, ‘నేను నా రెండేళ్ల కుమార్తెను ఆధార్ కార్డ్ ఫోటో కోసం వెళ్లినపుడు నాకూ ఇదే అనుభవం" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇన్‌స్టాలో 18.3 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. -
మోదీ గారూ రోడ్లు కిధర్ హై
సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక సామాన్యులు ప్రశ్నించే పద్ధతులు మారాయి. ఏకంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక గ్రామీణ మహిళవిడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ‘మధ్యప్రదేశ్ నుంచి 29 సీట్లు ఇచ్చాం. మరి మా రోడ్ల సంగతేంటి?’ అని అడుగుతూ డొక్కు రోడ్ల మీద ఆమె ప్రయాణం చేస్తూ తీసిన వీడియో మోడి వరకు చేరేలా ఉంది.పూర్వం ప్రధానికి కార్డు ముక్క రాసి పడేసేవారు జనం. ఇవాళ ఒక వీడియో చేసి వదులుతున్నారు. కార్డు రాస్తే ఎవరికీ తెలిసేది కాదు. కాని వీడియో లక్షలాది మంది కంట పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లా అటవీ ప్రాంతంతో, బొగ్గు గనుల నిక్షేపాలతో ఉంటుంది. కాని వెనుకబాటుతనం కూడా ఉంది. ‘మేం అడవుల్లో ఉంటాం. అయితే మాకు రోడ్లు అక్కర్లేదా మోదీ గారూ’ అని శివాని సాహు అనే మహిళ మోదీని ప్రశ్నించింది. ‘మధ్యప్రదేశ్ మీకు 29 సీట్లు ఇచ్చింది. ఇప్పుడైనా రోడ్లు వేయండి. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. మేము ఎం.ఎల్.ఏ, ఎం.పి, కలెక్టర్ అందరినీ కలిశాం. కాని ఏం ప్రయోజనం లేదు. వానొస్తే మా పరిస్థితి అధ్వానం. బస్సు మలుపు తిరగలేదు. పిల్లలు నడవడం కూడా వీలు కావడం లేదు. రోడ్లు వేయండి మోదీ గారూ’ అని ఆమె వేడుకుంది. అంతే కాదు ‘ ఈ వీడియో మోదీ గారికి చేరేవరకు షేర్ చేయండి’ అని కోరింది. దాంతో అందరూ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో వచ్చాక సిధి జిల్లాలో పురోభివృద్ధి గురించి చర్చ నడుస్తోంది. అన్నట్టు ఇది నాటి మహా విదూషకుడు బీర్బల్ జన్మస్థలం. ఆయన మళ్లీ పుడితే ఇలాంటి ప్రభుత్వ పనితీరు చూసి ఎన్ని పరిహాసాలు ఆడేవాడో. మరెన్ని వ్యంగ్యాలు పోయేవాడో. వాతలు వేసేవాడో. -
లైవ్ రిపోర్టింగ్‌లో మహిళా జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం
టెలివిజన్ జర్నలిస్టుగా లైవ్ రిపోర్టింగ్ చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారంకాదు. ఒక్కోసారి భయంకరమైన అనుభవాలు, మరి కొన్నిసార్లు అనూహ్యమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కోవలోనే లైవ్ రిపోర్టింగ్‌లో పాకిస్థానీ మహిళా రిపోర్టర్ పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. రిపోర్ట్ చేస్తుండగా ఎద్దు దాడి చేసిన అనూహ్య ఘటన నెట్టంట వైరల్‌గా మారింది.‘‘పాకిస్తాన్లో ప్రత్యక్ష ప్రసార టీవీ కవరేజీ సమయంలో బుల్ హిట్స్ రిపోర్టర్” అనే క్యాప్షన్‌తో ఎక్స్‌లో ఒక వీడియో షేర్ అయింది. 10 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుందీ వీడియో.Bull Hits Reporter during Live tv Coverage in Pakistan pic.twitter.com/eP23iFXykv— Ghar Ke Kalesh (@gharkekalesh) July 2, 2024 మార్కెట్లో ఎద్దుల ధరలపై స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది. ఎద్దుల జంట రూ. 5 లక్షల ధర పలుకు తోందనీ, అంతకంటే తక్కువకు విక్రయించేందుకు అక్కడి వ్యాపారాలు సిద్ధంగా లేరు అని చెబుతుండగానే , అకస్మాత్తుగా ఒక ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె కేకలు వేస్తూ అల్లంత దూరాన ఎగిరి పడింది. ఆమెచేతిలోని మైక్ కూడా అల్లంత దూరాన పడింది. దీంతో పక్కనే ఉన్న వ్యాపారి స్పందించి చెల్లాచెదురుగా పడి పోయిన ఆమె మైక్రోఫోన్, మౌత్‌ను ఆమెకు అందించాడు. కొంతమంది రిపోర్టర్ యోగ క్షేమాలపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు యూజర్లు రకరకాల కామెంట్లు చేశారు. లైవ్ రిపోర్టింగ్లోఇదో హఠాత్తు పరిణామమనికొందరు, ఫీల్డ్ రిపోర్టింగ్ సమయంలో జాగ్రత్త తీసుకోవాలని మరికొందరు వ్యాఖ్యానించారు. -
హీరో విజయ్‌పై తప్పుడు ప్రచారం.. మండిపడుతున్న ఫ్యాన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గతేడాది లియో సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. అయితే దళపతి ప్రస్తుతం ఆయన గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఇటీవల ఆయన తన పార్టీ తరఫున 10,12వ తరగతి విద్యార్థులను సన్మానించారు. వరుసగా రెండో ఏడాది టాప్ స్టూడెంట్స్‌ను విజయ్ సత్కరించారు. అయితే ఈ వేడుకలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్‌పై నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ విద్యార్థిని భుజంపై వేయగా.. ఆమె అతని చేతిని పక్కకు తీస్తూ కనిపించింది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ హీరోకు తగిన బుద్ధి చెప్పిందంటూ పోస్టులు పెట్టారు.అయితే దీనిపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వీడియో చూపకుండా.. ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దయచేసి ఇలాంటి వీడియోలతో విజయ్ ప్రతిష్టను దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు. సోషల్ మీడియా రీచ్ కోసం ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేయవద్దని హితలు పలుకుతున్నారు. Oooo CHOLE BHATORE WAALI, "Fan Moment" mein bhi tatti karne ki aadat nahi jayegi tum jaise "Z" Class logo ke.... (For those who might think wrong)Here is the rest of the Video that She Cut to be a Cindi Chor..... @actorvijay pic.twitter.com/czoqbg347F— NETAJI🙏 (@__NETAJI__) June 29, 2024 hats off to this girl for showing this idli his place pic.twitter.com/PN1YW3lKru— Moana (@ladynationalist) June 29, 2024 -
జిమ్‌లో అల్లు స్నేహారెడ్డి.. వర్కవుట్స్ చూశారా!
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే. సినిమాలకు సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారుతాజాగా స్నేహారెడ్డి జిమ్‌లో వర్కవుట్ చేస్తోన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వేరే లెవెల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 ఊహించని విధంగా డిసెంబర్‌కు వాయిదా పడింది.Giving us major fitness goals, #AlluSnehaReddy seen streching & flexing to the core at the gym! 📸💪#AlluArjun #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/QHMYWqNuNA— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2024 -
‘ఏం చేసావ్ నాగ్ ? అసలేంటి ఇదంతా!’ కల్కి నటి భావోద్వేగ పోస్ట్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రధానంగా నాగ్ అశ్విన్ కథ, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్, వీఎఫ్ఎక్స్, ఇలా పలు రకాలుగా మేజిక్ చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సెన్సేషనల్ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించిన ఫరియా అబ్దుల్లా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. అలాగే షూటింగ్ సందర్భంగా తీసుకున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)ఏం చేసావ్ నాగ్ అశ్విన్? అసలేంటి ఇదంతా! ఇప్పుడే కల్కి 2898AD చూసాను. అయినా మళ్ళీ వెంటనే చూడాలని అనిపిస్తోంది అని పేర్కొంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరి అంచనాలను మించిపోతోంది అద్భుతమైన ఫీలింగ్ ఇది అంటూ వైజయంతి మూవీస్ అండ్ టీంకు అభినందనలు తెలిపింది. ఫరియా షేర్ చేసిన ప్రభాస్‌తో సెల్ఫీ , తన పాత్రకు సంబందించిన లుక్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరియన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి అడియన్స్ ఫిదా. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటన పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకా దీపికా పదుకోనె, దిశా పఠాని, స్టార్ హీరో కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
దటీజ్ నవీన్ పట్నాయక్
నవీన్ పట్నాయక్.. దేశంలో సుదీర్ఘకాలం(24 ఏళ్లపాటు) ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. రాజకీయాల్లో మృదుస్వభావిగా ఆయనకంటూ ఓ ట్యాగ్‌లైన్ ఉంది. అలాగే.. మెచ్యూర్డ్ స్టేట్స్‌మన్‌గా వాజ్‌పేయి లాంటి రాజకీయ ఉద్ధండులతో ప్రశంసలు అందుకున్నారాయన. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పటికీ.. ఒడిశాలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొల్పుతూ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారాయన.తాజాగా ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన రాకను గమనించి.. సీఎం మోహన్ మాఝి సహా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడ్డారు. వాళ్లందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లబోయారు. ఆ సమయంలో కంటాబంజి ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి నిలబడి తనను తాను పరిచయం చేసుకున్నారు. అది చూసి.. ‘‘మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’’ అని నవీన్ అన్నారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చిరునవ్వులు చిందించారు.Naveen Patnaik & CM Mohan Majhi greet each other in assembly. Beautiful Video pic.twitter.com/6BL21FAZP5— Times Algebra (@TimesAlgebraIND) June 18, 2024ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల(గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి)నుంచి నవీన్ పట్నాయక్ పోటీ చేశారు. అయితే కంటాబంజిలో భాజపా అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓడిపోయారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. Naveen Patnaik’s dignity is a touchstone in political relationships. Here’s how he greeted the party that has all but wiped him out. Yes, they weren’t the kind of political enemies we’re accustomed too, but Naveen has been nothing but an image of grace. pic.twitter.com/VzYQKJ5WnS— Shiv Aroor (@ShivAroor) June 12, 2024 ఇదే కాదు.. సీఎంగా మోహన్ మాఝి ప్రమాణ స్వీకారానికి నవీన్ పట్నాయక్ హాజరై ఆశీర్వదించిన తీరు రాజకీయ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది కూడా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక మాట. అలాగే.. ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండాలో నవీన్‌ను చూసి నేర్చుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల మాట. -
జీరో-వేస్ట్ వెడ్డింగ్: పర్యావరణ హితంగా పూర్వీ పరిణయ వేడుక
పెళ్లి అనంగానే ఎంత ఆర్భాటంగా జరుగుతుందో అంతే రేంజ్లో వేస్ట్ వస్తుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే ఉంటుంది. మంచినీళ్ల బాటిళ్ల దగ్గర నుంచి భోజనాల వరకు ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే వస్తుంది. అలాంటి వాటికి చోటివ్వకుండా శభాష్ అనేలా ఎకో ఫ్రెండ్లీగా పెళ్లి చేసుకుంది ఓ జంట. ఒకరకంగా చెప్పాలంటే 'జీరో వేస్ట్ వెడ్డింగ్'కి అసలైన నిర్వచనంగా నిలిచింది ఆ దంపతుల పెళ్లి.బెంగుళూరులోని వధువరులు అందరికీ ఆదర్శంగా నిలిచేలా జీరో వేస్ట్ వెడ్డింగ్‌ని జరుపుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వధువు డాక్టర్ పూర్వీ భట్ షేర్ చేసుకుంది. ఇది తన కల అని, కేవలం తన కుటుంబం సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఆనందంగా చెప్పుకొచ్చింది. భూమాతను కాలుష్యం కోరల నుంచి రక్షించుకునేందుకే తాను ఇలాంటి వివాహం చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా తన తల్లి సహకారంతోనే ఇలా జీరో వేస్ట్ వివాహాన్ని చేసుకోగలిగానని అంటోంది. అంతేగాదు ఆ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో పెళ్లి మండపాన్ని చెరకు గడలతో నిర్మించారు. డెకరేషన్‌కి మామిడి ఆకులు, కొబ్బరి ఆకులను వినియోగించారు. భోజనాలను అరటి ఆకుల్లో వడ్డించగా, వధువరుల దండలను పువ్వులు, పత్తిదారలతో రూపొందించినవి ఉపయోగించారు. అలాగే రిటర్న్ గిఫ్ట్‌గా కూడా జ్యూట్ బ్యాగ్‌లను ఇచ్చారు. ఎక్కడ ఇసుమంత ప్లాస్టిక్ గానీ, పేపర్ని గాని వినియోగించలేదు. పైగా ఈ తంతు ముగిసిన వెంటనే ఆ పెళ్లి మండపానికి ఉపయోగించిన చెరుకుగడలను గోవులకు తినిపించగా, మిగతా ఆకుల వేస్ట్ అంతా పోలాలకు ఉపయోగపడేల కంపోస్ట్ ఎరువుగా మార్చారు. అలాగే పెళ్లిలో పెద్ద ఎత్తున వినియోగించే వాటర్ వేస్ట్‌ని చెట్లకు వెళ్లేలా మళ్లించారు. ఎక్కడా..నీళ్ల దగ్గర నుంచి ప్రతి వస్తువు తిరిగి భూమిలోనే ఇంకిపోయేలా ఉండే ఎకోఫ్రెండ్లీ వస్తువులనే ఉపయోగించారు ఆ వధువరుల తల్లిదండ్రులు. ఇలాంటి వివాహాన్ని జరిపించినందుకు వధువు డాక్టర్ భట్ తన తల్లిని అభినందించి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడా వీక్షించండి. View this post on Instagram A post shared by Dr.Poorvi Bhat | Nutrition & Wellness (@herbeshwari)(చదవండి: చింత వద్దిక.. చింత చిగురు ఉందిగా..) -
జేడీయూ నేతపై దాడి.. వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్
పట్నా: జనతా దళ్యునైటెడ్ (జేడీయూ) నేత రాజ్‌దీప్ అలియాస్ రాజ్ యాదవ్‌పై శనివారం భాగల్పూర్లో గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేశారు. పర్బాతీ చౌక్ వద్ద ఉన్న మార్కెట్లోకి రాజ్‌యాదవ్‌ను లాక్కెళ్లి దుండగులు కర్రలు, రాడ్లతో విక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా దాడి చేసిన అనంతరం తమ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని దుండగులు రాజ్‌యాదవ్‌ను బలవంతపెట్టారు.VIDEO | Bihar: A local JD(U) leader Raja Yadav was thrashed by miscreants over an alleged land dispute matter in Bhagalpur on Saturday. CCTV visuals of the incident. (Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/lQftoVCXov— Press Trust of India (@PTI_News) June 2, 2024 ఈ ఘటనను రికార్డు చేసిన దుండగులు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేవారు. దీంతో దాడికి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది. తీవ్ర గాయాల పాలైన రాజ్‌యాదవ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుల్లో ఒకడైన చందర్ యాదవ్ అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసులతో నివేదా పేతురాజ్ వాగ్వాదం.. అసలు విషయం ఇదన్నమాట!
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పరిచయం అక్కర్లేదు.చెన్నైకి చెందిన ముద్దుగుమ్మ మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలోనూ మెరిసింది. అయితే ఇటీవల నివేదాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలైంది. కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారితీసింది. ఏకంగా పోలీసులతోనే వాగ్వావాదానికి దిగింది. ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వాదించింది. దీంతో అసలేం జరిగిందంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు. కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేయగా.. మరికొందరు ఇంకా ఏదో జరిగి ఉంటుందని ఎవరికీ వారు ఊహించేసుకున్నారు.తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. ఇదంతా మూవీ ప్రమోషన్లలో భాగమేనని తేలిపోయింది. తాజాగా ఈ విషయాన్ని జీ5 ట్వీట్ చేసింది. పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేదా పేతురాజ్ లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాను జూన్ 14నుంచి జీ5 స్ట్రీమింగ్ చేయనున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని తేలడంతో నెటిజన్స్ షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. Here you go! Not caught in the act, but really one for our latest original #PARUVUonZee5@GoldBoxEnt @sushkonidela @NagaBabuOffl #vishnulaggishetty @saranyapotla @Nivetha_Tweets @nareshagastya @patnaikpraneeta #AmitTiwari @pavansadineni @siddharth_vox @Rajvadlapati pic.twitter.com/z0ILXhKE7w— ZEE5 Telugu (@ZEE5Telugu) May 31, 2024 -
పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
అన్నానగర్: కోయంబత్తూరులో అనుమతి లేకుండా పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి చిన్నతనం నుంచి గుడి రూపు ప్రాంతంలో సంచరించే పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో కోయంబత్తూరులోని పులి యంగులం నివాస ప్రాంతంలో పాము సంచరిస్తోందని ఆ ప్రాంత ప్రజలు వారికి సమాచారం అందించారు. పాములు పట్టే ఉమామహేశ్వరి, సంజయ్ ఘటనా స్థలానికి చేరుకుని 8 అడుగుల పొడవున్న పామును పట్టుకుని అడవిలోకి పంపించారు. అంతకుముందు స్నేక్ క్యాచర్ ఉమా మహేశ్వరి పాము పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అనుమతి లేకుండా పామును పట్టుకుని, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. #Coimbatore Forest Department arrested two individuals for illegally handling an Indian rat snake and posting a video of it on social media, which went viral on May 25. The snake, listed under Schedule I of the Wildlife Protection Act, 1972, is a protected species.@THChennai📽️:… pic.twitter.com/WCenHD66Sf— Avantika Krishna (@AvantikaKrish) May 28, 2024 -
మరోసారి రష్మిక వీడియో వైరల్..!
డీప్ ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు దుండగులు ఆధునిక టెక్నాలజీతో దుర్వినియోదగానికి పాల్పడుతున్నారు. మొదట రష్మిక మందన్నా డీప్ ఫేక్ రావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు ప్రముఖ తారలు సైతం ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం సైతం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ఇదిలా ఉండగా మరోసారి రష్మిక డీప్ ఫేక్ బారిన పడింది. ఆమె ఫేస్‌ను మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రముఖ కొలంబియా మోడల్ డానియెలా విల్లారియల్ ఇన్స్టాగ్రామ్ రీల్‌ను ఎడిట్ చేసిన ఈ వీడియోను రూపొందించారు. అందులో రష్మిక ఫేస్ వచ్చేలా మార్చిన వీడియో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు. కాగా.. గతేడాది నవంబర్లోనూ రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరలైన సందడి తెలిసిందే. ఆ వీడియోను రూపొందించిన ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అలియా భట్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ వంటి ప్రముఖులు డీప్ ఫేక్ బాధితులుగా నిలిచారు. సినిమాల విషయానికొస్తే పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్లో సికందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించనుంది. -
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్‌ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్‌లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా ఈ టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్‌తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్ జర్నలిస్ట్ కరణ్‌థాపర్ ది వైర్ తరఫున ప్రశాంత్ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్ థాపర్ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కరణ్ థాపర్ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్ థాపర్ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్సైట్లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్ థాపర్.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్ఎస్ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్ థాపర్ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024 -
మూడు కన్నుల ఎద్దు.. వైరల్ వీడియోలో నిజమెంత?
మూడు కన్నులు ఉండే ఎద్దును మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు దానికి మూడు కొమ్ములు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపోతారు. ఇటువంటి విచిత్రమైన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎద్దు మెడలో గంట కూడా ఉంది. దీనిని చూసినవారంతా ఈ వీడియో నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు.కొందరు సోషల్ మీడియా యూజర్స్ దీనిని శివుని నందిగా పరిగణిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన నిపుణులు.. ఎవరో దీనిని ఎడిట్ చేశారని, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎద్దుకున్న మూడవ కన్ను మిగిలిన రెండు కళ్ళకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎవరో చాలా తెలివిగా దాని రెండు కళ్ల మధ్యన ఈ మూడో కన్ను ఉండేలా ఎడిట్ చేశారని తెలుస్తోంది. మొదటిసారి ఎద్దును చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పరిశీలనగా చూస్తే మూడో కన్ను రహస్యం బయటపడుతుంది.కాగా ఈ వీడియోను @prem_collection__60 అనే ఖాతాతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా వీక్షణలు దక్కగా, నాలుగు లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ ‘హే! నంది మహారాజ్.. నా తరపున భోలేనాథ్‌కి జై శ్రీరామ్ అని చెప్పు అని రాయగా, మరొకరు ఈ వీడియో ఫేక్ అని రాశారు. ఇంకో యూజర్ మ్యుటేషన్ కారణంగా ఇలా జరుగుతుందని రాశారు. Oh, there's a cow with three horns and three eyes that always surprises everyone 🥰🥰 pic.twitter.com/ujYoy0wSm9— Nam Police (@boynam_boy) May 8, 2024 -
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తాము పార్టీకి వెళ్లలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్ వీడియోలను రిలీజ్ చేశారు. తాము హైదరాబాద్‌లోనే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేశారు.అయితే ఇదిలా ఉండగా.. హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. తన ఇంట్లోనే బిర్యానీ వండుతున్న వీడియోను పంచుకున్నారు. దీంతో హేమ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ రెసీపీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
అకటా... నడిబజార్లో లక లక లక
‘కంటెంట్ క్రియేటర్లు తలుచుకుంటే వైరల్‌కు కొదవా!’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీడియో వైరల్ చేయడానికి వారు చిత్రవిచిత్రములు చేయగలరని మరోసారి నిరూపించిన వైరల్ వీడియో ఇది.ప్రీతీ థాపాఅనే క్రియేటర్ చంద్రముఖి గెటప్‌లో డ్యాన్స్ చేసింది. ఇందులో వింతేముంది అనిపించవచ్చు. అయితే ప్రీతి డ్యాన్స్ చేసింది స్టేజీ మీద కాదు. ఇంట్లో కాదు. ఏకంగా అస్సాంలోని గువాహటి చౌరస్తాలో.ఈ వీడియోకు వచ్చిన విశేష ఆదరణ చూసి సంతోషంతో.... ‘గయ్స్, మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు రావడం లేదు’ అని స్పందించింది ప్రీతి.‘మీకు సంతోషంతో మాటలు రాక΄ోవడం సరే, మాకు మాత్రం షాక్‌తో నోట మాట రాలేదు. రోడ్డుపై డ్యాన్స్ ఏమిటీ!’ అని వెక్కిరించారు కొందరు నెటిజనులు.‘మీ డ్యాన్స్ స్కిల్స్ సంగతి ఎలా ఉన్నా ముందు ట్రాఫిక్ రూల్స్‌ను ΄ాటించడం నేర్చుకోండి’ అని కొందరు సలహా ఇచ్చారు. -
సూపర్ మామ్: తన క్యూటీస్‌తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
మే 12 ఆదివారం మాతృదినోత్సవ వేడుకలను ప్రపంచంమంతా ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీల దాకా మదర్స్ డేని ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయన తార ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.Happy Mother’s Day👩👦👦to all the Super Moms 😇💝 pic.twitter.com/BxYyOJl0vK— Nayanthara✨ (@NayantharaU) May 12, 2024 సూపర్ మామ్స్ అందరికీ హ్యాపీ మదర్స్‌డే అంటూ నయన్ తన విషెస్ అందించారు. తన కవల పిల్లలిద్దరితో ఆనందంగా గడుపుతున్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కమెంట్ చేశారు. ఇంకా స్టార్ హీరోయిన్ అలియా తన ఫ్యామిలీతో గడిపిన ఫోటోను షేర్ చేసింది. భర్త రణబీర్ కపూర్, అత్తగారు నీతూ కపూర్ ,తల్లి సోనీ రజ్దాన్,సోదరి షాహీన్ భట్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.అలాగే కాజల్ అగర్వాల్ కూడా తల్లితో ఉన్న ఒక ఫోటోలు షేర్ చేసి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందించింది. -
Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
న్యూఢిల్లీ: వరసబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మణిశంకర్ అయ్యర్ చేరిపోయారు. దక్షిణభారత వాసులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పిట్రోడా వివాదం ముగిసేలోపే అయ్యర్ పాత వీడియో ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయింది. పాక్ పట్ల కాంగ్రెస్ పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని బీజేపీ దుమ్మెతిపోయగా అవి అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలని, పారీ్టతో సంబంధం లేదని కాంగ్రెస్ ఖరాకండీగా చెప్పేసింది. అయ్యర్ అన్నదేంటి? ఏప్రిల్‌లో ‘చిల్పిల్ మణిశంకర్’ పేరిట జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ‘‘ పొరుగుదేశమైన పాకిస్తాన్‌కు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది కూడా సార్వ¿ౌమ దేశమే. దాయాది దేశంతో తగాదాలకు పోతే భారత్‌పై అణుబాంబు వేయాలనే దుర్బుద్ధి పాక్ పాలకుల్లో ప్రబలుతుంది. పాక్‌తో కఠినంగా వ్యవహరించొచ్చు. కానీ చర్చలైతే జరపాలికదా. సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని తిరిగినంతమాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతాయి. పాక్‌లో పిచ్చోడు అధికారంలోకి వస్తే భారత్‌కు ప్రమాదమే కదా. పాక్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మన అణుబాంబును లాహోర్‌లో పేలిస్తే తిరిగి దాని రేడియోధారి్మక ప్రభావం కేవలం ఎనిమిది సెకన్లలోనే మన అమృత్సర్పై పడుతుంది. అందుకే పాక్‌తో చర్చల ప్రక్రియ మొదలెట్టాలి’’ అని అన్నారు. -
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్ ఫేక్ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్‌ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.కాగా.. అలియా డీప్‌ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఆమె ఫేస్‌ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. View this post on Instagram A post shared by Unfixface (@unfixface) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
వైఎస్ వివేకా కేసులో సంచలన వీడియో
-
జిమ్‌లో పుష్ప డైరెక్టర్ భార్య.. పెద్ద సాహసమే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
రీల్స్‌తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్‌గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్‌లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్‌కు సమ్మర్ వెకేషన్‌కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్‌ను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్‌ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్‌లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్‌లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
Chittoor: రికార్డింగ్ డాన్స్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
చిత్తూరు అర్బన్: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభాసుపాలవుతున్నారు. ఇటీవల ఓ బైకు నడిపిన ఆయన రెండు చేతులు వదిలేస్తూ.. జాతీయ రహదారిపై చేసిన స్టంట్లు, దాన్ని వీడియోలు తీయించి వైరల్ చేసిన తీరు చూసి జనం నవ్వుకున్నారు. దీనిపై యువత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, కనీసం రోడ్డుపై స్టంట్లు చేసేప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవాలనే అవగాహనలేకపోవడం ఏంటని విద్యావంతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నుంచి బయటపడకముందే తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో జగన్మోహన్ నాయుడు రికార్డింగ్ డ్యాన్సు చూస్తూ కనిపించారు. ఇద్దరు యువతులతో కలిసి ఆయన వేసిన కుప్పి గంతులు చూపరులకు వెగటుపుట్టస్తున్నాయి. బెంగళూరులో డిస్కోలు, పబ్బులు, మద్యం బార్లలో పిచ్చి గంతులు వేసే వ్యక్తి, బాధ్యతారహితంగా వ్యవహరించే మనిషి నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసుకోండి..! అంటూ పలువురు ఈ వీడియోలను ట్రోల్ చేశారు. సైకిల్ పోవాలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ కార్యకర్తలు అంతర్మథనంలో పడ్డారు. తమ అభ్యర్థి నిర్వాకాలతో పార్టీ పరువు బజారున పడిందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్‌లో సదరు అభ్యర్థి ఇంకేం వీడియోలతో నవ్వులపాలు చేస్తాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
' నాలుగు రోజులు పట్టిందట'.. మెగా కోడలి స్టన్నింగ్ వీడియో వైరల్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే వేకేషన్ నుంచి తిరిగొచ్చింది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత తొలిసారి ట్రిప్‌కు వెళ్లిన లావణ్య ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. లావణ్య పెళ్లి తర్వాత ఆమె నటించిన మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య.. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జిమ్‌లో తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను లావణ్య ఇన్‌స్టాలో షేర్ చేసింది. అత్యంత కఠినమైన సాధన చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు లావణ్య సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'నాలుగు నెలల తర్వాత జిమ్‌కు వచ్చా. మునుపటిలా మళ్లీ సాధన చేయడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మళ్లీ నా దారిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చింది. కాగా.. దాదాపు ఏడేళ్ల క్రితం లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 2017లో తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో లీక్!
ఇటీవలే హీరోయిన్ తాప్సీ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహా వేడుకలో కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తన పెళ్లి గురించి తాప్సీ ఎక్కడే గానీ వెల్లడించలేదు. ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్‌కీ షాదీ' అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఆ తర్వాత తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ శారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని అభిమానులు విషెస్ తెలిపారు. పెళ్లి వీడియో లీక్.. తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురిలా రెడీ అయిన ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సింపుల్‌గా తాప్సీ పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు. తాప్సీ సీనీ కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T — Bollywood Bubble (@bollybubble) April 3, 2024 View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
'అందువల్లే నాకు అవకాశాలు రావడం లేదు'.. జగపతి బాబు కామెంట్స్ వైరల్!
టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. లెజెండ్ సినిమా తర్వాత పూర్తి స్థాయి విలన్‌గా మారిపోయారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ప్రభాస్ సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2లో జగ్గు భాయ్ నటిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలరిస్తున్నారు. తాజాగా జగపతిబాబు ఓ వీడియోను తన ట్విటర్లో పంచుకున్నారు. లెజెండ్ తర్వాత తన కెరీర్లో వచ్చిన మార్పులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగపతి బాబు మాట్లాడుతూ..' నాకు చిన్న సినిమాలు చేయాలని కోరిక ఉంది. కమిటేడ్గా చేస్తున్నారు. కొత్తగా ఉంటున్నాయి సినిమాలు. ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే.. నేను డబ్బున్న పేదవాడిని. నా చేతిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఓకే. కానీ ఆ సినిమాల షూటింగ్స్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమాలు చేతిలో ఉన్నాయి కదా అని.. వేరే అవకాశాలు రావడం లేదు. కానీ మరోపక్క.. అమ్మో జగపతిబాబు పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని అనుకుంటున్నారని' అని చెప్పారు. 'కానీ పెద్ద సినిమాల వాయిదాల వల్ల నాకున్న చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు. దీంతో అటు.. ఇటు కాకుండా అయిపోయా. గతంలో రెండు, మూడుసార్లు నా పని అయిపోయిందని ఓ స్టేజీలో నేనే అనుకున్నా. అది కూడా లెజెండ్ సినిమాకు రెండు నెలల ముందు. కానీ మళ్లీ వచ్చాను. మీ జగపతిబాబు ఎక్కడికీ పోడు. వెళ్లినట్లు వెళ్తాను.. కానీ మళ్లీ వస్తూనే ఉంటాను.' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. అంతే కాకుండా లెజెండ్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. కాగా.. జగపతిబాబు ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. Dabbunna Pedhavadini….. Inko #Legend kosam Eduruchustuna. pic.twitter.com/C1GzB8RXrR — Jaggu Bhai (@IamJagguBhai) April 2, 2024 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 -
టీడీపీ అభ్యర్థి పార్థసారథికి పెద్దవ్వ ఝలక్
నూజివీడు: ‘మీరు ఇచ్చే హామీలు నెరవేరుస్తామని హామీపత్రం రాసివ్వండి. లేకపోతే మీకు ఓటు వేయం...’ అంటూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిని ఓ వృద్ధురాలు నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కె.పార్థసారథి శనివారం నూజివీడులోని 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... స్థానికులు తమ గృహాలు చెరువు పోరంబోకు స్థలంలో ఉన్నాయని, వాటికి పట్టాలు ఇప్పించాలని కోరారు. దీనిపై పార్థసారథి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే నివేశన స్థలాలకు పట్టాలు ఇప్పిస్తామని, లేనిపక్షంలో పొజిషన్ సర్టిఫికెట్లు అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో స్థానికంగా నివాసం ఉంటున్న తులసమ్మ అనే వృద్ధురాలు జోక్యం చేసుకుని ‘నోటి మాట చెబితే కుదరదు. రాతపూర్వకంగా హామీపత్రం రాసివ్వాలి. లేకపోతే ఓట్లు వేయం’ అని చెప్పారు. దీంతో తులసమ్మతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈలోపు కొందరు స్థానికులు జోక్యం చేసుకోవడంతో వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!
సమ్మర్ వచ్చేసింది...ఎండలు మండిపోతున్నాయని కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కల్తీ కోకా కోలా డ్రింక్ బాటిల్స్ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!) ఈ వీడియో ప్రకారం కోకా కోలా లేబుల్స్ వేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఒక వ్యక్తి డ్రింక్‌ను నింపుతున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందిరా ఇది.. ఎపుడు చూడలే అంటూ ఒకింత ఆందోళనగా కమెంట్స్ చేస్తున్నారు. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ఈ కోకాకోలా ఫ్యాక్టరీలో తయారైనా ఒకటే, బాత్ రూంలో తయారైనా ఒకటి పెద్దగా తేడా ఏముంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోకాకోలాను ట్యాగ్‌ను గమనార్హం. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకా కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) A forward doing the rounds. Things get ...... With @CocaCola pic.twitter.com/vAhxcDhb1F — R. Balakrishnan (@BalakrishnanR) March 29, 2024 -
బర్రెలక్క పెళ్లి సందడి : ప్రీ-వెడ్డింగ్ వీడియో హల్చల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం రేపిన యూట్యూబర్ బర్రెలక్క పెళ్లి కబురు ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తనకు కాబోయే భర్తను ఇన్‌స్టగ్రామ్ వేదికగా పరిచయం చేసింది బర్రెలక్క. దీంతో ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బర్రెలక్క అలియాస్ శిరీష షేర్ చేసిన వీడియో ప్రకారం ఈ వేసవిలోనే బర్రెలక్క మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. వరుడు పేరు వెంకట్. అయితే అతడి వృత్తి ఎక్కడి వాడు అనే వివరాలు మాత్రం ఇంకా సస్పెన్సే. కాగా తెలంగాణంలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష(బర్రెలక్క) నిరుద్యోగ సమస్యలపై ఇన్‌స్టగ్రామ్‌లో వీడియోలు చేస్తూ బర్రెలక్కగా పాపులర్ అయింది. భారీగా (781 వేలు) ఫాలోయర్లను సంపాదించుకుంది.ఆదాయాన్ని కూడా బాగానే ఆర్జించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో సోషల్ మీడియా స్టార్ కాస్తా పొలిటికల్ స్టార్ అతరించింది. నిరుద్యోగ యువత, పలు నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలునుంచి భారీ స్పందనతోపాటు, కొంతమంది రాజకీయ నాయకులు ఆమెకు మద్దతినిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీచేస్తానని ప్రకటించిన శిరీష ఇలా అనూహ్యంగా పెళ్లి పీటలెక్కుతుండటం ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
సీఎం భగవంత్ మాన్ వీడియో వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు
లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేస్తున్న పనులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజవర్గంలో కల్తీ మద్యం బారినపడిన మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్, పాటల రచయిత బబ్బు మాన్‌తో కారులో ప్రయాణిస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. While Rome was burning Nero was playing flute ! Following in the foot steps of Nero, Bhagwant Mann ji is singing tappas while people in own constituency Sangrur are dying of illicit liquor. ਜਦੋਂ ਰੋਮ ਸੜ ਰਿਹਾ ਸੀ ਤਾਂ ਨੀਰੋ ਬੰਸਰੀ ਵਜਾ ਰਿਹਾ ਸੀ! ਨੀਰੋ ਦੇ ਨਕਸ਼ੇ-ਕਦਮਾਂ 'ਤੇ ਚੱਲ ਕੇ ਭਗਵੰਤ… pic.twitter.com/uAVvzz9Ybf — Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) March 21, 2024 ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ప్లూట్ వాయించినట్ల ఉంది భగవంత్ మాన్ వ్యవహారం. ఒకవైపు కల్తీ మద్యంతో ప్రజలు మరణిస్తుంటే.. భగవంత్ మాన్ పాటలు పాడుతున్నారు’అని పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్ మాన్కు సంబంధించిన వీడియోను సునీల్ జాఖర్ తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నా శాంతి భద్రతల పరిస్థితుల విషయంపై కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు. ‘దిర్బా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది మంది కల్తీ మద్యం బారినపడి మరణించారు. ఈ నియోజకవర్గానికి పంజాబ్ ఎక్సైస్ మంత్రి పాతినిధ్యం వహిస్తున్నారు. దిర్బా.. సంగ్రూర్ లోక్‌సభ పరిధితో వస్తుంది. అది సీఎం భగవంత్ మాన్ సొంత జిల్లా. ఆప్ ప్రభుత్వం కనీసం బాధ్యత వహించపోవటం దారణం’అని ప్రతాప్ సింగ్ విమర్శలు చేశారు. ఇక.. ఇటీవల చోటు చేసుకున్న కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: Punjab CM: ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్! -
సోదర సోదరీమణులారా.. ఒక లుక్ ఇటు వేయరా
ఒక వీడియా 35 మిలియన్ల వ్యూస్‌తో వైరల్ కావడానికి ఎన్ని విన్యాసాలు చేయాలి? ‘అబ్బే! అంతక్కర్లేదండి’ అని చెప్పడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 35 మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అయిన ఈ చిన్న వీడియోనే సాక్ష్యం. కీస్ అనే మహిళ కెమెరా లెన్స్ ముందు పసిబిడ్డను పడుకోబెట్టి ‘కెన్ యూ ప్లీజ్ వాచ్ మై బేబీ ఫర్ మీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పసిబిడ్డ అసా«ధారణ విన్యాసాలేమీ చేయలేదు. కెమెరాను అలా చూస్తూ ఉన్నాడంతే. పసిబిడ్డ తేనెకళ్లు, చివర్లో నవ్విన నిష్కల్మషమైన నవ్వు లక్షలాది మంది ప్రేక్షకులను కదిలించింది. ప్రపంచంలో ఎన్ని భాషలు అయినా ఉండొచ్చు. అయితే శిశువుది మాత్రం విశ్వభాష. అది అందరికీ అర్థమవుతుంది. అందరికీ తెగ నచ్చుతుంది అని చెప్పడానికి, పవర్ ఆఫ్ సింప్లిసిటీకి అద్దం పట్టే ఈ వీడియోనే నిదర్శనం. -
‘బొద్దింకల దోసె’?! షాక్ అయిన అమ్మడు
సామాన్యంగా బొద్దింకలను చూస్తేనే శరీరం ఝల్లుమంటుంది...అలాంటి బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త "ఆహారంలో బొద్దింక". ట్రైన్, రెస్టారెంట్, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని కనౌట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం కోసం ఓక మహిళ, ఆమె స్నేహితురాలు దోసను ఆర్డర్ చేసారు. సరిగ్గా అలా తినడం మొదలు పెట్టిందో లేదో.. అక్కడ అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. ఏంటా అని పరిశీలనగా చూసింది. అంతే.. ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఎనిమిది బొద్దింల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇవి చదవండి: నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా! దీంతో ఈ సంఘటనను రికార్డుచేయాలని నిర్ణయించుకుంది. స్నేహితురాలి సాయంతో వీడియో రికార్డ్ చేస్తోంది. ఇంతలోనే హోటల్ సిబ్బందిలో ఒకరు ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా ప్లేట్‌ను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ‘బొద్దింకల’పై ఆరా తీస్తున్నారు. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని ఇషాని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కేఫ్ లైసెన్స్, శుభ్రతపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. రెస్టారెంట్ల పరిశుభ్రత స్థాయి, లైసెన్స్‌లను తనిఖీ చేయడానికి అధికారులు క్రమం తప్పకుండా రెస్టారెంట్లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నమోదు కావంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ది క్వింట్’ షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
Chugurova: ఆహా...పోహ వైరల్
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బ్లాగర్స్ మన దేశానికి వచ్చి స్థానికులతో హాయిగా కలిసిపోతారు. ఆ జ్ఞాపకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మన దేశానికి వచ్చిన రష్యన్ బ్లాగర్ చుగురోవా వీడియో వైరల్ అయింది. మహారాష్ట్రలోని చిన్నపాటి హోటల్‌కి వెళ్లిన చుగురోవా అక్కడ ఉన్న సూర్యవన్షి అనే మహిళను ‘నమస్తే దీదీ’ పలకరించి ‘ఏం చేస్తున్నారు?’ అని అడిగింది. ‘పోహ’ (అటుకుల ఉప్మా) అని చెప్పింది సూర్యవన్షి. ‘నాకు కూడా నేర్పించరా?’ అని చుగురోవా అడగగానే ఓకే చెప్పింది సూర్య. సూర్య డైరెక్షన్లో టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి...మొదలైనవి తరగడం నుంచి పెనంలో వేడి నూనెలో వేయడం వరకు ఎన్నో చేసి ‘పోహ’ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది చుగురోవా. ఆ తరువాత ‘పోహ తినండి....వోన్లీ ఇరవై రూపాయలు మాత్రమే’ అని హిందీలో అరిచింది. ‘నమస్తే దోస్తో’ కాప్షన్స్‌తో ‘మేకింగ్ పోçహ’ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది చుగురోవా. -
జొమాటో మహిళా డెలివరీ ఏజెంట్ల కొత్త డ్రెస్ చూశారా? వీడియో వైరల్
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అంతర్జాతీయమ హిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. తన మహిళా డెలివరీ సిబ్బంది కోసం కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. ఇకపై తమ ఫుడ్ డెలివరీ మహిళా డ్రైవర్లు కుర్తాలు ధరిస్తారని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. చాలామంది మహిళా డెలివరీ ఉద్యోగులు జొమాటో టీ-షర్టులతో అసౌకర్యంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జొమాటో తెలిపింది. వారు కొత్త డ్రెస్ కుర్తాలు వేసుకున్నవీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ కొత్త డ్రెస్‌కోడ్‌ను చాలా బావున్నాయంటూ చాలామంది ప్రశంసించారు. మరికొంతమంది మాత్రం వారి అన్యాయ మైన వేతనాలు, పని పరిస్థితుల గురించి పట్టించుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఉద్యోగుల సౌకర్యాలు, వేతనాలు, పని వాతావరణం గురించి ఆలోచించాలని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. View this post on Instagram A post shared by Zomato (@zomato) -
కేన్సర్‌పై యువతి పోరు : ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో
ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని కేన్సర్ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది. ముందుగా గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలావరకు ప్రమాదం తప్పుతుంది. ఇది తెలియక చాలామంది ఆందోళనలో పడిపోతారు. తాజాగా చర్మ కేన్సర్ బారినపడి కోలుకున్న ఒక యువతి ఈ ధైర్యాన్నిస్తోంది. తీవ్రమైన మెలనోమా బారిన పడి కోలుకున్నతన జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కేన్సర్ బాధల నుంచి కోలుకున్న వైనాన్ని రికార్డ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన అలోండ్రా సియెర్రా టిక్‌టాక్‌లో స్కిన్ క్యాన్సర్ బారిన పడింది. గత ఏడాది కాలంగా చికిత్సలు, ఆపరేషన్లను అచంచలమైన ధైర్యంతో ఎదుర్కొంది. అంతేకాదు తనలాంటి వారికి అవగాహన కల్పించేందుకు, బలాన్నిచ్చేందుకు తాను అనుభవించిన బాధలను పంచుకుంటూ ఒక పవర్ఫుల్ సందేశాన్ని ఇవ్వడం విశేషం. వయస్సు, జెండర్, లేదా చర్మం రంగుతో సంబంధం లేకుండా ఎవరినైనా దాడి చేసే మెలనోమా అత్యంత తీవ్రమైనదని ఇది చాలా త్వరగా విస్తరిస్తుందని కూడా హెచ్చరించింది. తగిన శ్రద్ధతో చికిత్స తీసుకోవాలని సూచించింది. తన జుట్టును షేవ్ చేసుకోవడం నుండి మళ్లీ పొడవాటి జుట్టు దాకా, తీవ్రమై అలసట నుంచి పూర్తి ఆరోగ్యం దాకా ఇలా మొత్తం జర్నీని రికార్డు చేసింది. ‘‘నేను ముందుకు సాగడానికి తగిన శక్తిని వచ్చిన దేవునికి ధన్యవాదాలు’’ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెకు అభినందనలు అందించారు. అదృష్టవంతురాలు, ఆమె చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. క్రేజీ క్లిప్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 20 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. Woman with cancer records her recovery process pic.twitter.com/aJxSLI398z — Crazy Clips (@crazyclipsonly) March 7, 2024 -
ఏం బుర్రరా అయ్యా! చిరుతకే షాకిచ్చాడు..!
చిరుతపులి వస్తే పెద్దవాళ్లమే కంగారు పడిపోతాం.. అస్సలు ఏం చేయాలో తోచదు.. కానీ ఒక 12 ఏళ్ల బుడ్డోడు మాత్రం భలే చాకచక్యంగా వ్యవహరించాడు. అదీ చాలా తాపీగా...దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన నాసిక్‌లోని మాలేగావ్‌లో వెలుగుచూసింది. మోహిత్ అహిరే (12) ఇంటి మెయిన్ డోర్ తలుపు దగ్గరే ఉన్న సోఫాలో కూర్చుని స్మార్ట్‌ఫోన్ మొబైల్ గేమ్‌లో మునిగిపోయాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ, నేరుగా ఇంట్లోకి వచ్చేసింది చిరుతపులి. అనూహ్యంగా మోహిత్‌కి అతి సమీపంనుంచే లోపలికి దర్జాగా ఎంట్రీ ఇచ్చేసింది. ఇది చూసిన మోహిత్ ఏమాత్రం కంగారు పడకుండా అక్కడినుంచి లేచి, బయటికి వచ్చేసి, తలుపు లాక్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవలో రికార్డ్ అయ్యాయి. అతని రియాక్షన్ ఇపుడు ఇంటర్నెట్లో ప్రశంసల్ని దక్కించు కుంటోంది. వన్య ప్రాణులు ఎదురుపడి నపుడు ప్రశాంతంగా ఉండటం, అక్కడినుంచి తప్పించుకోవడం అనే విషయాలను గుర్తు చేసింది. What an amazing presence of mind Mohit Ahire, a 12-year-old boy, locked a leopard inside an office cabin until assistance arrived in Malegaon & the leopard was rescued. Mohit immediately informed his father, who is a security guard, that he trapped a leopard inside the office. pic.twitter.com/FELlOGac1t — Anshul Saxena (@AskAnshul) March 6, 2024 మోహిత్ అహిరే తండ్రి మ్యారేజ్ హాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆఫీస్ క్యాబిన్లో కూచుని గేమ్ ఆడుకుంటుండగా మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు వచ్చేంతవరకు ఆఫీసు క్యాబిన్లో దానిని బంధించారు. ‘‘ముందు దాన్ని చూడగానే షాక్ అయ్యా..కానీ, వెంటనే తేరుకుని బైటపడ్డా..తలుపును వేగంగా లాక్ చేశా..’’అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు మోహిత్ అంతకుముందే సమీప నివాస ప్రాంతంలో చిరుతపులిని గమనించారు స్థానికులు. తరువాత మ్యారేజ్ హాల్ యజమానికి ఫిర్యాదు మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు , అధికారులు వేగంగా స్పందించారు. ఐదేళ్ల మగ చిరుతపులిని బంధించారు. సమీపంలోనే వ్యవసాయ పొలాలు, నది ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు చిరుతపులులు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
ముఖేష్ అంబానీ ‘లడ్డూ రివర్స్’ వీడియో వైరల్, అసలు నిజం ఇది!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. ముఖేష్ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ నెల( మార్చి) 1, 2,3 తేదీల్లో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల ప్రారంభంలో వేల మందికి అన్న దానం చేశారు. "ఖానా కమ్ పడ్ గయా హై.తూ థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఫుడ్ తక్కువైంది.. కొంచెం సర్దుకు పోండి) అనే పేరుతో పోస్ట్ అయిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అంబానీ ఎందుకు అలా చేస్తారు. అని ఆశ్చర్యపోతున్నారా? అసలు నిజం ఇది..! దీనికి సంబంధించి అసలు వీడియోను రివర్స్‌గా రూపొందించిన ఫేక్ వీడియో ఇది. JIO, after some years of free internet pic.twitter.com/VlFPKrsq6g — Tweeting Quarantino (@rohitadhikari92) March 5, 2024 కమ్యూనిటీ విందులో విస్తర్లలో వడ్డించిన తరువాత, భోజనాలకు కూర్చున్న వారి నుంచి లడ్డూలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా వీడియో ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఇదీ సంగతి అంటూ కొంతమంది ఈ వీడియోపై కమెంట్ చేశారు. అయితే ఇది రివర్స్ వీడియో అంటూ అసలు సంగతి చెప్పారు కొంతమంది. మరి కొంతమంది యూజర్స్ జియో..ఉచితంగా డేటా అలవాటు చేసిన కొన్నాళ్ల తరువాత పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఇదీ అసలు వీడియో.. In run up to marriage ceremony of Anant Ambani, community feast are being organized in villages around the Jamnagar refinery. Today, in Jogvad village, Billionaire #MukeshAmbani himself seen offering food to the guests in a community feast. pic.twitter.com/0Nb7dWMdVM — Kumar Manish (@kumarmanish9) February 28, 2024 కాగా అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధికా మర్చంట్‌తో ఈ ఏడాదిలో ఏడడుగులు వేసుందుకు రడీ అవుతున్నాడు. గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ లవ్‌బర్డ్స్ ఈ నెలలో అంగరంగ వైభవంగా ప్రీ- వెడ్డింగ్ బాష్ నిర్వహించారు. బాలీవుడ్సెలబ్రిటీలు, క్రీడారంగ ప్రముఖులతోపాటు బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ సహా పలువురు ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు ఈ వేడుకల్లో విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
భార్యతో తిట్లు తిన్న ప్రముఖ డైరెక్టర్.. వీడియో వైరల్!
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో సెల్వరాఘవన్ ఒకరు. స్టార్ హీరోలందరితో ఆయన పలు సినిమాలు చేశారు. కాదల్ కొండేన్ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన 7/జీ బృందావన కాలనీ హీరోయిన్ను 2006లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఏడాది తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన గీతాంజలిని 2011లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజాగా డైరెక్టర్ సెల్వ రాఘవన్ తన భార్యతో గొడవ పడిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన భార్య తిడుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెల్వరాఘవన్ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ సతీమణితో గొడవ పడిన విషయాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో ఎంతటి వారైనా భార్య చేతిలో తిట్లు తప్పవని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో సెల్వ రాఘవన్ కూడా నేనేం చేశాను.. నన్ను ఎందుకు తిట్టావు.. అంటూ ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరలవుతోంది. కాగా.. సెల్వ రాఘవన్ ప్రస్తుతం ధనుష్ చిత్రంలో 'రాయాన్' ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Selvaraghavan (@selvaraghavan) -
మరో అందమైన సాయంత్రం: సింగర్ సునీత, వీడియో వైరల్
టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత ఉపద్రష్ట పరిచయం అవసరం లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమై స్థానం సంపాదించుకుంది సునీత. ఒకపక్క కరియర్‌ను నిర్మించుకుంటూనే, సింగిల్ మదర్‌గా పిల్లల్ని తీర్చి దిద్దుకుంది. అంతేకాదు వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లిచేసుకోని తన జీవితానికి కొత్త బాటలు వేసుకున్న ఈ సింగర్ ఇపుడు తన బిడ్డల్ని కూడా ప్రయోజకుల్ని పనిలో బిజీగా ఉంది. అనేక టీవీ షోలు, కన్సర్ట్లతో లైమ్లైట్ లో ఉండటమే కాదు, తన వ్యక్తిగత జీవిత విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పచ్చని పుచ్చతోటలో విహరిస్తూ ఒకవీడియోను పెట్టింది.దీంతో ఫ్యాన్స్‌తో లైక్స్, కమెంట్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా ఇటీవల సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయయ్యాడు. 'సర్కారు నౌకరి' అనే మూవీలో పాత్రకు తగ్గట్లు నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
విజయ్ దేవరకొండపై అమ్మాయిల వీడియో.. స్పందించిన హీరో!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే యూత్‌లో విజయ్‌కు ఉన్న మామూలు క్రేజ్ లేదు. రౌడీ హీరోగా అభిమానుల్లో గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. అంతే కాదు.. మన హీరో గ్లామర్‌కు అమ్మాయిలు సైతం ఫిదా అవుతుంటారు. అలాంటి గ్లామర్ మనోడి సొంతం. తాజాగా ఈ జాబితాలో విద్యార్థినిలు కూడా చేరిపోయారు. అదేంటో ఓ లుక్కేయండి. తాజాగా ఇద్దరు విద్యార్థినిలు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను విజయ్ దేవరకొండ చూసి కామెంట్ చేస్తేనే మేము పరీక్షలకు ప్రిపేర్ అవుతాం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది కాస్తా నెట్టింట పెద్దఎత్తున వైరలవడంతో ఏకంగా విద్యార్థినిలు చేసిన వీడియోకు విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు. 'మీరు పరీక్షల్లో 90 శాతం మార్కులు తెచ్చుకుంటే.. కచ్చితంగా మిమ్మల్ని కలుస్తా' అంటూ ఫ్యామిలీ స్టార్ హీరో కామెంట్ చేశారు. విద్యార్థినిలు అభిమానంతో వీడియో చేసినా.. విజయ్ స్పందించిన తీరు చూస్తే ఆయన సింప్లీసిటీ ఏంటో అర్థమవుతోంది. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harshitha reddy (@harshithaareddy__) -
సీతారాంపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపల్ నిర్వాకం
-
'తప్పుగా అనుకోవద్దు ప్లీజ్'.. వారందరికీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రిక్వెస్ట్!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7పై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆదిరెడ్డికి ఓ సమస్య వచ్చిపడింది. సాయం కావాలంటూ ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అభిమానులుకు ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా ఇలా రావొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: అయోధ్య రామ మందిరానికి బిగ్ బాస్ 'ఆదిరెడ్డి' విరాళం) ఆది రెడ్డి వీడియోలో మాట్లాడుతూ మాట్లాడుతూ.. 'దయచేసి అర్థం చేసుకోండి .. నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. నాకు వీలైనంత సాయం చేస్తుంటే ఉంటా. కానీ డైరెక్ట్‌గా ఇంటికి చాలా మంది వస్తున్నారు. వాళ్ల అందరికి నేనేం చేయగలను చెప్పండి . ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను. కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి. దయచేసి ఎవరు కూడా ఇంటికి కానీ.. సెలూన్‌కు కానీ రావొద్దు. సమాజానికి నా వంతు కృషి చేస్తాను. అంతే కానీ అందరికి చేయలేను కదా. ఎలాగోలా వచ్చిన వాళ్లకి ఛార్జీలకి ఇచ్చి పంపుతున్నా . దయచేసి అర్థం చేస్కోండి. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలంటే కామెంట్స్, మెసేజేస్ ద్వారా పంపండి.' అంటూ విజ్ఞప్తి చేశారు ఆదిరెడ్డి. కాగా.. ఆదిరెడ్డి ఇటీవలే 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించాడు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
ఆర్జీవీ ఫేవరేట్ భామ.. మరో క్రేజీ వీడియో షేర్ చేసిన డైరెక్టర్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వ్యూహం. ఈ చిత్రంలో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించగా.. దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందు వల్ల మరింత ఆలస్యమవుతోంది. ఇదిలా ఉండగా.. గతంలో ఆర్జీవీ ఓ అమ్మాయి వీడియోను షేర్ చేశారు. ఆ అమ్మాయి చేతుల్లో కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తూ కనిపించింది. ఆ తర్వాత తన గురించి వివరాలు తెలిస్తే చెప్పండంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. అంతే కాకుండా ఆ అమ్మాయితో ఏకంగా సినిమాను కూడా ప్రకటించి షాకిచ్చారు ఆర్జీవీ. తాజాగా ఆ అమ్మాయి చేసిన మరో వీడియోను ట్విటర్లో పంచుకున్నారు రాంగోపాల్ వర్మ. ఆ వీడియోతో అభిమానులకు ఓ ఆసక్తికర ప్రశ్న సంధించారు ఆర్జీవీ. ఆమె సంగీతం వింటోందా? లేదా సంగీతమే ఆమె నుంచి వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) Can somebody tell me if she’s listening to the music ???? , or is the music coming out of her ???? pic.twitter.com/zNxR7HaBMh — Ram Gopal Varma (@RGVzoomin) January 29, 2024 -
వైరల్: అవునండీ... ఇది బిర్యానీ టీ
వేడి వేడిగా బిర్యానీ తింటే ఎంత మజా? ఆ తరువాత వేడి వేడిగా టీ తాగుతుంటే ఎంత మజా! ఆ మజాను ఈ మజాను మిక్స్ చేసి ‘బిర్యానీ టీ’ తయారుచేసింది ‘మాస్టర్ చెఫ్ 4’ విజేత నేహాదీపక్షా. టీ ఆకులు, దాల్చిన చెక్క, సోంపు, నల్లమిరియాలు, యాల కులు... మొదలైన వాటితో నేహా తయారు చేసిన ఈ ‘బిర్యానీ టీ’ చవులూరిస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా నెటిజనులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఆహో ఓహో!’ అని పొగడ్తల దండకం అందుకుంటే, మరి కొందరు ‘బిర్యానీ టీ అంటే ఏమిటో కాదు వేడి వేడి బిర్యానీని వేడి వేడి టీలో కలపడం’ అని జోక్ చేస్తున్నారు. ఐస్‌క్రీమ్ రోల్ మేకర్ కూలింగ్ పాన్‌ను ఉపయోగించి ఒక చెఫ్ తయారుచేసిన ‘స్క్రీమ్టీ’కూడా ఈమధ్య నెట్‌లోకంలో హల్చల్ చేసింది. -
హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వరుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare) జాగింగ్ చేసుకుంటూ పెళ్లి మండపానికి రావడం, అలాగే వధువు ఇరాఖన్ చాలా సాదాసీదా కనిపించడం తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్‌రావు సందడిగా కనిపించడం విశేషంగా నిలిచింది. తాజా మరో విషయం నెటిజనులను కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది. ప్రతీ ఇంటికి ఆడబిడ్డ అంటే మురిపెం. అడిగింది కాదనకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కానీ పెళ్లీడు వచ్చి ఒక అయ్యలో చేతిలో పెట్టి అత్తారింటికి పంపే క్రమంలో మాత్రం తన ప్రాణమే పోతున్నంత బాధపడతారు. ముఖ్యంగా తండ్రులు బరువెక్కిన గుండెలతో భావోద్వేగానికి గురవుతుంటారు. ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అని ఓ సినీ కవి అన్నట్టు తాజాగా తన కుమార్తె పెళ్లిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా కంటతడి పెట్టుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) ఇప్పటికే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఇరా-నూపుర్ జంట బుధవారం ఉదయపూర్‌లో ఉంగరాలు మార్చుకుని మరో వివాహ వేడుకను జరుపుకున్నారు. ఈ సమయంలో పెళ్లికూతురు తండ్రి అమీర్ ఖాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అమీర్ , తన మాజీ భార్య రీనా దత్తాతో కలిసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) -
స్టార్ హీరో ఈవెంట్లో అసభ్య ప్రవర్తన.. యాంకర్‌తో అలా!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్‌తో అసభ్య ప్రవర్తన బుధవారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్లో ఆమె అసభ్యకరంగా తాకాడు. అతని తీరుతో విసిగిపోయిన యాంకర్ అక్కడే దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ సైతం యాంకర్ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలోనూ పోస్ట్ చేసింది. 😨😨 pic.twitter.com/JJljl7ntBc — Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024 -
షాకింగ్ ఘటన.. కోర్టులోనే జడ్జిపై దాడి చేసిన నిందితుడు
లాస్ వెగాస్: అమెరికాలోని కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెయిల్ నిరాకరించారన్న కోపంతో నిందితుడు తీర్పు చెబుతున్న జడ్జిమీదకు దూసుకెళ్లి దాడి చేశాడు. ఈ అనూహ్య పరిణామం లాస్ వెగాస్‌లోని కోర్టు హాలులో బుధవారం జరిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కోర్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. యూఎస్ వార్తా పత్రిక న్యూయార్క్ పోస్టు ప్రచురించిన వివరాల ప్రకారం.. లాస్ వెగాస్‌లోని క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టులో క్రిమినల్ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో నిందితుడు 30 ఏళ్ల డియోబ్రా రెడెన్కు బెయిల్ ఇచ్చేందుకు మహిళా జడ్జి మేరి కే హోల్ధస్ నిరాకరించారు. అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్న నేపథ్యంలో.. మళ్లీ మళ్లీ నేరం చేయకుండా సరైన శిక్ష పడాల్సిందేనని తెలిపారు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ఒక్కసారిగా జడ్జి బెంచ్ వద్దకు దూసుకొచ్చాడు. న్యాయమూర్తి వద్దకు దూకి దాడి చేశాడు. పిడికిలితో పదేపదే కొట్టడంతో సాయం కోసం ఆమె కేకలు వేసింది. Man assaults judge in Las Vegas after probation request denied. pic.twitter.com/Vw5emstedD — Great Clips (@Altaynova) January 3, 2024 ఆమె పక్కనే ఉన్న క్లర్క్, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే నిందితుడి దాడిలో జడ్జి సహా ఆమె సహాయకుడికి స్పల్పంగా గాయాలయ్యాయి. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. నిందితుడి చర్యతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్‌చేసి అతడిపై కొత్త నేరారోపణలు మోపి జైలుకు తరలించారు. A man attacked a Clark County judge in court today after she denied his probation. 😬 pic.twitter.com/CkJXj7Tc5a — non aesthetic things (@PicturesFoIder) January 3, 2024 -
విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!
తమిళస్టార్ నటుడు, డీఎండీకే అధినేత మృతి పట్ల పలువురు సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్‌కాంత్ మృతిపట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో విశాల్ ఏడుస్తున్న వీడియో అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. విశాల్ వీడియోలో మాట్లాడుతూ..' కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వార్త విన్నాక నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా. నేను నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్‌కాంత్ సార్‌కు ఇదే నా కన్నీటి నివాళి' అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు. కాగా.. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో మంగళవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. -
ఆర్జీవీ బ్యూటీ.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ!
సంచలన డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సరే అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. రాం గోపాల్ వర్మ ట్వీట్ చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే కచ్చితంగా సెన్షెషనల్ అవ్వాల్సిందే. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా? నెటిజన్స్ తెగ వెతకడం ప్రారంభించారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె కేరళకు చెందిన అమ్మాయిగా తెలిసింది. ఆర్జీవీ ఆ యువతి రీల్ షేర్ చేయడంతో ఆమెకు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ఆ యువతి పేరు శ్రీలక్ష్మి సతీశ్ అని తెలిసింది. ఆ తర్వాత ఆర్జీవీ తనను పొగిడారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది కూడా. అయితే తాజాగా ఆర్జీవీ ఏకంగా ఆ యువతితో సినిమా తీసేందుకు రెడీ అయిపోయారు. ఆమెతో శారీ అనే సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులంతా మొత్తానికి మన ఆర్జీవీ అనుకున్నంత పని చేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో వైరల్ అయిన యువతిని.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఈ చిత్రం ద్వారానే శ్రీలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఫిక్సయినట్లే. ఆర్జీవీ డెన్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అఘోశ్ వైష్ణవం దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. కాగా.. ప్రస్తుతం రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Aghosh D Prasad (@aghoshvyshnavam_avm) -
ఏమోయి? తెలుసునా మోయి మోయి!
‘ఇంటర్నెట్టున ఏ నిమిషానికి ఏ ట్రెండు వచ్చునో ఎవరు ఊహించెదరు’ అని పాడుకోవాల్సిన టైమ్ ఇది. ప్రస్తుతం ‘మోయి మోయి’ అనేది వైరల్ ట్రెండ్‌గా మారింది.‘టిక్‌టాక్’లో వైరల్ అయిన సెర్బియన్ పాట నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. ఈ ట్రెండ్‌లో భాగంగా రకరకాల మీమ్స్, పేరడీలు, రీల్స్ వస్తున్నాయి. ‘మోయి మోయి’కి సొంత డ్యాన్స్‌ను కూడా క్రియేట్ చేశారు. సెర్బియన్ సింగర్–సాంగ్‌రైటర్ టెయా డోర ‘మోయి మోయి’ సాంగ్ యూట్యూబ్‌లో 60 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. నిజానికి పాటలో ‘మోయి మోర్’ అని ఉంటుంది. అయితే మిస్టేక్ వల్ల‘మోర్’ కాస్త ‘మోయి’గా మారింది. తన పాట ట్రెండ్ కావడంతో టెయా డోర ఆనందంతో తబ్బిబ్బైపోతూ‘థ్రెడ్స్’లో ఇలా స్పందించింది... ‘సెర్బియన్ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తం కావడం సంతోషంగా ఉంది. ప్రతిరోజూ ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వస్తున్నాయి. ఐ లవ్ యూ’ ‘మోయి మోయి’ ట్రెండ్ నేపథ్యంలో బాలీవుడ్ నటీమణులు ఉర్ఫీ జావెద్, డాలీ సింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఉర్వీ, డాలీసింగ్ల ‘మోయి మోయి’ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ‘వావ్’ అంటున్నారు. -
డీప్ ఫేక్.. మరో స్టార్ హీరోయిన్ వీడియో వైరల్!
యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కత్రినా కైఫ్,అలియా భట్, కాజోల్ ఫోటోలు సైతం నెట్టింట వైరలయ్యాయి. దీంతో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కడో ఒక చోట వైరలవుతూనే ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ డీప్ ఫేక్ బారిన పడింది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా.. అందులోని వాయిస్‌ను మార్చి వైరల్ చేశారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్ సింక్ అయ్యేలా క్రియేట్ చేశారు. ఆ వీడియోలో ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడిస్తున్నట్లు రూపొందించారు. ఓ బ్రాండ్ ప్రకటనతో 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ ఆ బ్రాండ్‌నే ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
డిప్రెషన్‌కు వాడే టాబ్లెట్ పేరేంటి?.. నవీన్ పొలిశెట్టి వీడియో వైరల్!
ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అభిమానులను అలరించిన హీరో నవీన్ పొలిశెట్టి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ','జాతి రత్నాలు' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం 'జాతి రత్నాలు' డైరెక్టర్‌తోనే మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా నవీన్ పొలిశెట్టి ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియోలో నవీన్ మాట్లాడుతూ..' అరే వంశీ.. అదేదో డిప్రెషన్ కోసం ఏదో టాబ్లెట్ ఉందన్నావ్ కదరా.. ఆ టాబ్లెట్ పేరేంట్రా?.. ఒక ఫ్రెండ్ కోసం అడుగుతున్నారా? నాకోసం నేనేందుకు అడుగుతారా?.. ఇప్పుడు నా లైఫ్‌లో జాయ్‌ఫుల్ ఫేజ్‌లో ఉన్నా.. డోలో 650 నా.. అరే నువ్వు ఎంబీబీఎస్ చదివావా? లేక పేమేంట్ సీటా? అని అన్నారు. అయితే ఈ వీడియోకు వరల్డ్ కప్ ఫైనల్-2023 అంటూ ట్యాగ్ చేశారు. అయితే మ్యాచ్‌లో ఇండియా ఓటమిని ఇంకా మర్చిపోలేక ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Inkenni rojulo 💔 Asking for a friend . Dolo 650 daily #CWC2023Final pic.twitter.com/ssd0Je5DO5 — Naveen Polishetty (@NaveenPolishety) November 21, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ పోరు: ఆనంద్ మహీంద్ర వీడియో గూస్ బంప్స్ ఖాయం!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final) పోరు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ కోసం IAF తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ దృశ్యం తనకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే 123 వేలకు పైగా వ్యూస్‌ని సాధించేసింది. అటు ఫ్యాన్స్‌తో పాటు, ఇటు దేశ వ్యాప్తంగా ఈ ఫైనల్ దంగల్ క్రేజ్ అలా ఉంది మరి. ఈమ్యాచ్‌కు సంబంధించి శుక్ర, శనివారాల్లో ఎయిర్‌షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.మోటెరాలోని టెక్ మహీంద్రా ఇన్నోవేషన్ సెంటర్‌ను పర్యవేక్షిస్తున్న తమ ఉద్యోగి ఈ క్లిప్ తీశారని ట్వీట్ చేశారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రంగాలకు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్‌కు ముందు ప్రదర్శన ఇవ్వనుందట. టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రపంచకప్ టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడ నుండటం ఇది రెండోసారి. ఈ సిరీస్‌లో ఓటమి అనేదే లేకుండా రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతోంది. టీమిండియా రికార్డ్ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. Spoiler alert! My colleague @manishups08 who’s overseeing the Tech Mahindra Innovation Centre at Motera took this clip of the IAF practising their drill for the World Cup final… Goosebumps inducing….🇮🇳 pic.twitter.com/HQvQIzZVpf — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తారా? యువతి హెయిర్‌స్టైల్‌పై ఫైర్
క్రియేటివిటీకి కాదేదీ అనర్హం అన్నట్లు ఈమధ్య జనాలు వెరైటీ స్టంట్లతో పబ్లిసిటీ దక్కించుకుంటున్నారు. సోషల్‌మీడియాలో పాపులారిటీ, లైకుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి వెరైటీ హెయిర్‌స్టైల్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఏదైనా పండగ వస్తుందంటే చాలు అమ్మాయిల హడావిడి మామూలుగా ఉండదు. వేసుకునే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అందరి కంటే డిఫరెంట్‌గా రెడీ అవ్వాలని తెగ ట్రై చేస్తుంటారు. తాజాగా ఓ యువతి దీపావళి సందర్భంగా వెరైటీ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. రాకెట్లు, భూచక్రాలు సహా రకరకాల క్రాకర్స్‌తో జుట్టును అందంగా అలంకరించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హెయిర్ స్టైలిస్ట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది పర్ఫెక్ట్ దివాళీ బ్లాస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో యూజర్ స్పందిస్తూ.. ఒక్క అగ్గిపుల్లని ఆమె జుట్టుపైకి విసిరితే ఎంత ప్రమాదమో ఊహించండి, క్రియేటివిటి ఉండొచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ హితవు పలికారు. View this post on Instagram A post shared by kamal_hairstylist_official (@kamal_hairstylist_official) -
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్‌కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్‌ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్‌తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్‌ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్‌లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
నిహారిక లవ్ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్!
నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరీర్ మొదలెట్టి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిహారిక ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలో పెళ్లిలో సందడి చేసింది. అన్న పెళ్లి డ్యాన్స్ వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీ జరిగిన గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీ కూడా హాజరైంది. అయితే ప్రస్తుతం మరో పెద్ద బాధ్యతను నిహారిక తీసుకుంది. దాదాపు 15 మంది కొత్త నటీనటులతో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి నూతన దంపతులు వరుణ్ - లావణ్య కూడా హాజరయ్యారు. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. తనకు అత్యంత ఇష్టమైనవారికి.. అంతే కాకుండా తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారందరికీ ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ ఓక్క వీడియోలోనే అందరూ వచ్చేలా పోస్ట్ చేసింది. వీడియోతో పాటు 'లవ్ లెటర్ టూ ఆల్ మై ఏంజెల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందులో లావణ్య త్రిపాఠి, శ్రీజ కొణిదెల, జ్యోతిరాజ్ సందీప్, నిహారిక మదర్ కూడా ఉన్నారు. నా జీవితంలోకి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అంటూ ప్రస్తావించింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
మృణాల్తో డేటింగ్ వార్తలు.. స్పందించిన బాద్షా!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. గతంలోనే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్‌కు హాజరవ్వడమే. పార్టీకి హాజరైన ముద్దుగుమ్మ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో సన్నిహితంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ రూమర్స్‌పై ర్యాపర్ బాద్షా స్పందించారు. ‘మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు' అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి వస్తున్న రూమర్స్ గురించే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీపావళి బాష్‌లో రాపర్ బాద్షా, మృణాల్ ఠాకూర్ చేయి పట్టుకుని నడుస్తూ వీడియోలో కనిపించారు. కాగా. మృణాల్ ఇటీవలే ఇషాన్ ఖట్టర్‌తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన 'పిప్పా'లో కనిపించింది. బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా రచించిన 'ది బర్నింగ్ ఛాఫీస్' పుస్తకం ఆధారంగా రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 10న విడుదలైన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంషు పైన్యులి, సోని రజ్దాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. -
యూట్యూబర్ పైత్యం: మండిపడుతున్న నెటిజనులు
యూట్యూబ్‌లో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది వింత విన్యాసాలు, ప్రమాదకర ఫీట్స్‌తో సోషల్‌మీడియా యూజర్లకు చిరాకు తెప్పించడం ఈ మధ్య కాలంలో రొటీన్‌గా మారి పోయింది. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పటాకులు కాల్చిన వీడియో నెటిజనులకు ఆగ్రహం తెప్పింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై యూట్యూబర్ నిర్భయంగా పటాకులు స్నేక్ క్రాకర్స్ కాల్చుతున్న వీడియో ట్విటర్లో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లకు, యూట్యూబర్ల అతి చేష్టలకు హద్దు పద్దూ లేకుండా పోతోందంటూ ఆగ్రహం పెల్లుబుకింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దీంతో ర్వైల్వే శాఖ స్పందించింది. ఫూలేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా స్టేషన్ సమీపంలో ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో రైలు పట్టాలపై కుప్పగా పోసిన పాము బిళ్లల్ని ఒక్కసారిగా వెలిగించాడు. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రైన్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేసింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి...ప్రాణాలతో చెలగాటాలా అంటూ ఒకరు, అసలే దేశమంతా కాలుష్యంతో మండిపోతోంది. దీపావళి సందర్భంగా పిల్లలు ఎక్కువగా ఇష్ట పడే ఈ పాము బిళ్ళలు ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తాయంటూ మరొకరు మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా? పర్యావరణం కలుషితమవుతోంది. రైలు పట్టాల దగ్గర ఇలాంటి ప్రయోగాలు ప్రమాదకరం అంటూ తీవ్రంగా స్పందించడం గమనార్హం. అంతేకాదు ఇది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు..చర్యలు తీసుకోండి అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వీడియోపై నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పందించింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆదేశించింది. ప్రస్తుతం వీడియోపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్నేక్ క్రాకర్స్ అనేవి అత్యధిక మోతాదులో PM2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్)ను విడుదల చేస్తాయని 2016నాటి చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF), పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. YouTuber bursting crackers on Railway Tracks!! Such acts may lead to serious accidents in form of fire, Please take necessary action against such miscreants. Location: 227/32 Near Dantra Station on Phulera-Ajmer Section.@NWRailways @rpfnwraii @RpfNwr @DrmAjmer @GMNWRailway pic.twitter.com/mjdNmX9TzQ — Trains of India 🇮🇳 (@trainwalebhaiya) November 7, 2023 -
ఇదే అప్పుడు జరిగి ఉంటే.. ఊహించుకుంటేనే భయంగా ఉంది: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎవరిదో వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మిక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా చేయడాన్ని సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. బాధ్యులను తగిన విధంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (ఇది చదవండి: రిసెప్షన్లో లావణ్య ధరించిన చీర చాలా స్పెషల్.. ధర ఎంతో తెలుసా..?) అయితే తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో పట్ల రష్మిక మందన్నా స్పందించింది. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తలుచుకుంటే నిజంగా భయంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. ట్వీట్లో రష్మిక ప్రస్తావిస్తూ..' ఇలాంటి విషయం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇలాంటివి నాకే కాదు..టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి చాలా భయంగా ఉంటుంది. ఈ రోజు నేను ఒక మహిళగా, నటిగా మాట్లాడుతున్నా. నాకు మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. కానీ నేను స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. దీన్ని ఎలా తట్టుకోలగనో నా ఊహకు అందడం లేదు. ఇలాంటి వాటి బారిన మనలో ఎక్కువ మంది పడకముందే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలి.' అంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫేక్ వీడియోను అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు ఖండించారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. (ఇది చదవండి: సలార్ ట్రైలర్ విడుదల తేదీ లాక్..?) I feel really hurt to share this and have to talk about the deepfake video of me being spread online. Something like this is honestly, extremely scary not only for me, but also for each one of us who today is vulnerable to so much harm because of how technology is being misused.… — Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023 -
'అసలు ఏంట్రా ఇదంతా.. ఏం చేస్తున్నారు హౌస్‌లో..'!
బిగ్ బాస్ రియాలిటీ షో అభిమానులను ఓ రేంజ్లో అలరిస్తోంది. హిందీ బిగ్ బాస్ సీజన్-17 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ వారంలో తాజాగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మనస్వి మామ్‌గాయ్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ఈ వారంలో ఈ వారం నామినేట్ అయినవారిలో సమర్థ్ జురెల్, ఇషా మాల్వియా, అరుణ్ మాశెట్టి, సనా రయీస్ ఖాన్ కూడా ఉన్నారు. మానస్వికే తక్కువ ఓట్లు రావడంతో ఎంట్రీ ఇచ్చిన వారానికే బయటకొచ్చేసింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సల్మాన్ భాయ్ ఏంటి ఇదంతా అని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో ఇషా, జురెల్ ఇద్దరూ ఒకే బెడ్‌పై నిద్రిస్తూ కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ కంటెస్టెంట్స్‌పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశాడు. సల్మాన్ భాయ్ ఫ్యామిలీ షో పేరుతో ఈ మసాలా డ్రామా ఏంటి? అని కామెంట్ చేశాడు. మరొకరు రాస్తూ.. ఫ్యామిలీ షో పేరుతో ప్రేక్షకులకు ఇలాంటివీ చూపించడమేంటని మండిపడుతున్నారు. బిగ్ బాస్ షోను అడల్ట్ షోగా మార్చేశారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. హౌస్‌లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో అభిషేక్ అక్కడే ఉన్నారు. -
సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!
ఇటీవలే దయా వెబ్ సిరీస్‌లో ప్రేక్షకులను పలకరించిన నటి గాయత్రి గుప్తా. అంతకంటే ముందే యాంకర్‌గా, షార్ట్ ఫిలింస్ చేస్తూ కూడా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. గతంలో టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. తాజాగా ప్లాట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. భాను భవతారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో వికాస్, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలో పోషించారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది గాయత్రి గుప్తా. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. గతంలో ఓ బోల్డ్ వీడియో షేర్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా తన చిత్రం ప్లాట్ మూవీ రిలీజ్ సందర్భంగా మరో వీడియోను షేర్ చేసింది. అభిమానులతో లైవ్ తీసిన వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ రోజు ప్లాట్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్దామనుకున్నా..కానీ కుదరలేదు అంటూ ఏడుస్తూ కనిపించింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ప్లాట్ సినిమా చూడండి అంటూ అభిమానులను కోరింది. అయితే ఈ వీడియోలోనూ మరింత బోల్డ్‌గా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ గాయత్రికి ఏమైందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమా రిలీజ్ రోజే ఇలాంటి వీడియో ఏంటీ మేడం అని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి అని ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారని తెలిపింది. అయితే సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నానని తెలిపింది. View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఆయనతో ప్రత్యేక పూజలు!
బిగ్‌బాస్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ అషురెడ్డి. సోషల్ మీడియాలో రీల్స్‌తో ఫేమస్ అయిన అషు పలు టీవీ షోల్లో కనిపించింది. అంతేకాకుండా బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ కామెడీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటూ అలరిస్తూనే ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను పంచుకుంటోంది. (ఇది చదవండి: బిగ్‌బాస్‌లో అతనొక్కడే నాకు తెలుసు.. ఎందుకంటే?: బాలాదిత్య కామెంట్స్!) తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దాదాపు రూ.70 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారును సొంతం చేసుకుంది. అనంతరం లగ్జరీ కారుకు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించింది. తన కొత్త కారు రేంజ్ రోవర్‌కు వేణుగోపాల స్వామితో పూజలు చేయించింది. అయితే సినీ తారలపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. అందువల్లే కామెంట్స్ చేయకుండా.. ఆ సెక్షన్‌ను క్లోజ్ చేస్తూ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Venu Swamy Parankusham (@parankushamvenu) -
భార్యకు జెర్సీ నటుడు స్పెషల్ విషెస్.. వీడియో రిలీజ్!
సింధు సమవేలి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరో హరీశ్ కల్యాణ్. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. కాదలి, జైశ్రీరామ్, నాని జెర్సీ లాంటి టాలీవుడ్ చిత్రాల్లో కనిపించారు. ఇటీవలే విడుదలైన ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన ఎల్జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. అయితే గతేడాదే హరీష్ కల్యాణ్ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. నర్మద అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. చెన్నైలో జరిగిన వీరి పెళ్లికి కోలీవుడ్ సినీతారలు, ప్రముఖులు సైతం హాజరయ్యారు. తాజాగా హరీశ్ కల్యాణ్ దంపతులు తమ మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య నర్మద పట్ల ప్రేమను చాటుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తన భార్యతో కలిసి ఉన్న ఆనందకరమైన క్షణాలను పంచుకుంటూ స్పెషల్ విషెస్ తెలిపారు. ఒకవైపు సినిమాలతో పాటు బిజీగా ఉంటూ.. మరోవైపు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం హరీశ్ కల్యాణ్ నటిస్తోన్న నూరు కోడి వానవిల్, డీజిల్ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. అనంతరం మరో ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) View this post on Instagram A post shared by Dhoni Entertainment Pvt Ltd (@dhoni.entertainment) -
థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు
టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల వింతలు, అద్భుతాలతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొట్టేలా చేస్తున్నాయి. తాజాగా 5డీ ఎఫెక్ట్‌తో థియేటర్లో ఫైర్ సీన్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో టెక్నాలజీ ఓవర్ డోస్‌పై మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు మనకు 2డీ, 3డీ,4డీ సినిమాల గురించి తెలుసు. ఇది భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరపై వండర్స్ క్రియేట్ చేసేలా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్స్‌తో సినిమాలోని పాత్రలూ, దృశ్యాలు మనల్నీ మమేకం చేసేలా చేస్తాయి. అక్కడ జరుగుతున్న సీన్స్ నిజంగా మనచుట్టూ జరుగుతున్నాయేమో అనుకునేలా విజువల్స్‌లో కనిపిస్తాయి. స్క్రీన్‌పై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. సినిమాలో వర్షం పడినా, మంచు కురిసినా..చూసే ప్రేక్షకులకు కూడా కొన్ని సాంకేతిక పద్ధతులతో ఆ ఫీలింగ్ కలిగించేలా చేస్తుంది. ఇప్పుడు 5డీ థియేటర్లు ఒక అడుగు ముందుకేసి ఆడియెన్స్‌కు ఆ ఫీల్‌ను మరింత దగ్గర చేసింది. కానీ మితిమీరిన టెక్నాలజీ వాడకంతో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు అనేలా గుర్తుచేస్తుంది ఈ వైరల్ వీడియో. 5డీ ఎక్స్ స్క్రీన్‌తో సినిమా థియేటర్లో ప్రేక్షకులు మూవీని ఎంజాయ్ చేస్తుండగా సడెన్‌గా ఓ ఫైర్ యాక్సిడెంట్‌కి సంబంధించిన సీన్ పడింది. అంతే క్షణాల్లో థియేటర్ మొత్తం అంటుకున్నట్లు కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు కూడా భలే థ్రిల్‌గా ఫీల్ అయ్యారు. అయితే ఇది రియల్ ఫైర్ యాక్సిడెంట్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 5డీ ఎఫెక్ట్ బాగానే ఉంది కానీ, నిజంగానే ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ప్రేక్షకుల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడొద్దంటూ థియేటర్ ఓనర్స్‌పై గుర్రమంటున్నారు. మరోవైపు టెక్నాలజీని మితిమీరి వాడితే అనర్థాలే తప్పా మరొకటి ఉండదు. స్పేస్, వాటర్ వరకు ఓకే కానీ ఇలా నిప్పుతో చెలగాటం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. This is how people die. If a theater does somehow manage to go up in flames, people will think it's the 5D cinema effects. — JDM is the Shiz! (Scarface) (@FloatyRedHead23) October 13, 2023 My issue is what if a real fire broke out? This kind of stuff is awesome but desensitizes the mind and creates a loss of reaction time. — Cosmic-books 🇨🇦 (@foerster_bryan) October 13, 2023 -
రూ.1.3 కోట్ల కారులో బాబా రామ్‌దేవ్ - వీడియో వైరల్
ప్రముఖ యోగా గురువు 'బాబా రామ్‌దేవ్' సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 డ్రైవ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కారు ఎవరిదీ, దాని ధర ఎంత, ఇతర వివరాలు ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారుని పతంజలి CFA దివ్యాంశు కేసర్వాణి గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఆటో వార్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో రామ్‌దేవ్ బాబా ఈ కారుని కొనుగోలు చేయలేదని యూపీ ఈస్ట్ అండ్ సెంట్రల్ రీజియన్‌లోని పతంజలి గ్రూప్ సీఎఫ్ఓ ఇచ్చారని తెలిపారు. ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ధర సుమారు రూ. 1.3 కోట్లు వరకు ఉంటుంది. సెడోనా రెడ్ కలర్ షేడ్‌లో ఉన్న ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉండటం వీడియోలో చూడవచ్చు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదీ చదవండి: హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే.. నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా రెండవది 3.0-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజిన్ 394 Bhp పవర్, 550 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 296 Bhp పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ & ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి. View this post on Instagram A post shared by AUTO WAAR (@auto.waar) -
ఘోరం: వివాహ వేడుకలో అగ్ని వర్షం.. వీడియో వైరల్..
ఇరాక్‌లో దారుణం జరిగింది. ఓ వెడ్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మందికిపైగా మృతి చెందారు. 150 మంది గాయపడ్డారు. దక్షిణ ఇరాక్‌లోని కరాకోష్ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన వివాహ వేదికలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. Video shows the aftermath of the fire in a wedding hall in Hamdaniyah 110 dead including bride and groom 550 injured #Iraq #Hamdaniyah #Fire pic.twitter.com/2duD5vmoks — North X (@__NorthX) September 27, 2023 వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేశారు. జనం కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. వధువరులు ఎంతో ఘనంగా ముస్తాబై వేదిక ఎక్కారు. మిరిమిట్లు గొలిపే కాంతి వెలుగుల మధ్య స్టెప్పులు వేశారు. ఇంతలోనే వేదిక పై భాగంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ వంటి డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోగా.. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. #Update Watch till end Fire at a wedding in Iraq kills at least 100, injures 150 #Wedding #celebration #fire #Hamdaniya #Nineveh #Iraq #Viral #ViralVideo pic.twitter.com/m4pmdLHiNv — ANSHULGAUTAM (@ANSHUL__GAUTAM) September 28, 2023 వేదిక పైభాగం నుంచి అగ్ని వర్షం కురిసిన మాదిరిగా మంటలు కిందికి దూసుకొచ్చాయి. ఏర్పాటు చేసిన డెకరేషన్ విభాగాలు మంటల్లో కాలి కిందపడ్డాయి. జనం ఆహాకారాలతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 100 మంది చనిపోగా.. 150 మంది గాయపడ్డారు. నాసిరకమైన డెకరేషన్ వస్తువుల వల్లే ఇదంతా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేదిక నిర్మాణంలో మండే స్వభావం ఉన్న డెకరేషన్ ఐటమ్స్‌ను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. Tragedy at a wedding in Iraq, was caused by "gross negligence" and "security failures", according to the government investigation. Fire resulted in more than 100 deaths.#Irak #Iraq #الحمدانية #نينوى #hamdaniya pic.twitter.com/yYUZe1K0Qa — NewsAlerts Global (@NewsAlertsG) October 2, 2023 ఇదీ చదవండి: Pakistan Earthquake Prediction: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? -
దీపికా పదుకొణె సాంగ్.. హీరోయిన్ కంటే బాగా చేసింది!
డ్యాన్స్ అనేది ఓ అందమైన కల. సినీ తారలకైతే వారి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. కేవలం వారి డ్యాన్స్ చూసి పిచ్చా ఫ్యాన్‌గా మారిపోతుంటారు. అంతే కాకుండా వారిలా డ్యాన్స్ చేస్తూ తన అభిమాన తారలను మరిపిస్తుంటారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొణె డ్యాన్స్ చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి నటించిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రంలో నగదా అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఏ ఈవెంట్ జరిగినా ఈ సాంగ్ కచ్చితంగా ఉంటుంది. అయితే నవరాత్రుల సందర్భంగా చాలా చోట్ల ఈ పాటను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. (ఇది చదవండి: చాలా ఎమోషనల్‌గా సాగిన సిద్ధార్థ్ 'చిన్నా' ట్రైలర్) తాజాగా ఈ పాటకు ఓ మహిళ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అచ్చం దీపికా పదుకొణెను మరిపించేలా డ్యాన్స్ చేసింది. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలాలోని నగదా సాంగ్‌కు తన స్టెప్పులతో మరిపించింది. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుండగా.. ఏమాత్రం తేడా లేకుండా ఆ మహిళ పాటలోని స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఏకంగా ఏడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల ప్రశంసలు ఆమె డ్యాన్స్‌ను చూసిన నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. వావ్... ఇది ఓ అద్భుతమైన నృత్యం.. నాకు బాగా నచ్చింది అంటూ కామెంట్ చేశారు. ఈ పాటకు ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది అంటూ పోస్టులు పెడుతున్నారు. అచ్చం దీపికా పదుకొణెను మరిపించిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రం 2013లో విడుదలైంది. ఈ చిత్రంలో సుప్రియా పాఠక్, శరద్ కేల్కర్, రిచా చద్దా నటించారు. ఈ చిత్రం ద్వారానే రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల మొదటిసారి కలిసి నటించారు. (ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!) View this post on Instagram A post shared by kreethi (@_.kretx_.k) -
'మీ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు'.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!
కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సంయుక్తా హెగ్డే. సినిమాలే కాకుండా సంయుక్త కన్నడ, హిందీ రియాల్టీ షోలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ భామ ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ శ్రద్ధతో ఉంటోంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ షేర్ వీడియోలు చేస్తూ ఉంటోంది. ఇటీవల సంయుక్తా హెగ్డే సినిమాల కంటే ఇలాంటి వీడియోలతోనే ఎక్కువగా పాపులర్ అవుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఆమె తీరుపై నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: హౌస్‌లో అందాల పోటీ.. నాకేం తక్కువా అంటూ అమర్ దీప్ ఫైర్!!) బిగ్ బాస్ కంటెస్టెంట్ సంయుక్త తాజాగా డ్యాన్సర్ కిషోర్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. జంగ్లీ సినిమాలోని సోనూ నిగమ్ పాడిన నాలో నువ్వే అనే పాటకు సంయుక్త, కిషన్ రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేశారు. అయితే ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఆమె డ్రెస్‌ను చూసిన కొందరు నెటిజన్స్ మీకు కనీసం సెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒక నటిగా మీరు అందరికీ రోల్ మోడల్‌గా ఉండాలి కానీ.. మీరే ఇలా బరితెగించడమేంటని పోస్టులు పెడుతున్నారు. సంయుక్త అలాంటి డ్రెస్సులు ధరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీ డ్యాన్స్ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కాగా.. సంయుక్త గతంలో చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురైంది. 'కిరిక్ పార్టీ' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి సంయుక్త హెగ్డే.. సినిమాల కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. గతంలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌ను కొట్టినందుకు సంయుక్త వార్తల్లో నిలిచారు. అంతేకాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలు, వీడియోలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. కాగా.. తమిళ చిత్రసీమలో కూడా సంయుక్తా హెగ్డే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా కన్నడ చిత్రం 'తుర్తు నిర్గమన'లో కనిపించింది. ప్రస్తుతం 'క్రీమ్' సినిమాతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) View this post on Instagram A post shared by Kishen Bilagali (@kishenbilagali) -
'సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చా'.. విశాల్ సంచలన వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం లంచం తీసుకున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఈ అనుభవం ఎదురైందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అంతే కాకుండా ట్వీట్‌తో పాటు మనీ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్స్ నంబర్లతో సహా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) విశాల్ ట్వీట్లో రాస్తూ..' వెండితెరపై సైతం అవినీతిని చూపిస్తున్నారు. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఆఫీసులో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశా. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుంచి మధ్యవర్తికి చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకోస్తున్నా. నేను ఇలా చేయడం నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశమే లేదు. అందరి కోసమే నా వద్ద ఉన్న సాక్ష్యాలు కూడా పెడుతున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. #Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l — Vishal (@VishalKOfficial) September 28, 2023 -
నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్
డైమండ్ సిటీ సూరత్ డైమండ్ బిజినెస్‌కు పెట్టింది పేరని అందరికీ తెలుసు. అయితే తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి కోట్ల విలువైన డైమండ్లున్న ఒక వీడియో పోగొట్టు కున్నాడని వార్త వైరల్ అయింది. దీంతో డైమండ్ల కోసం వేట మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గుజరాత్లోనివరచ్చా ప్రాంతంలో ఒక వ్యక్తి అనుకోకుండా వజ్రాల ప్యాకెట్‌ను పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం ఎగబడ్డారు జనం. అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, కోట్ల విలువైన వజ్రాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాయనే వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. కొందరైతే ఏకంగా మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా వదిలిపెట్టకుండా డైమండ్స్ కోసం వెతికేశారు. కొంతమంది వజ్రాలను దక్కించు కుని సంబరాలు చేసుకున్నారు. కానీ అవి నకిలీ వజ్రాలని తేలడంతో ఉసూరుమన్నారు. (మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?) అయితే తనకు దొరకింది నకిలీ వజ్రం అని తేలిందని, ఇది ఇమిటేషన్ జ్యూయల్లరీ, లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్ అని అరవింద్ పన్సేరియా వాపోయారు. ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అయి ఉంటుందన్నారు. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన మినీ బజార్ వరచ్చా ప్రాంతంలో వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు వదంతులు వ్యాపించాయని తెలుస్తోంది. #સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ. પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl — 𝑲𝒂𝒍𝒑𝒆𝒔𝒉 𝑩 𝑷𝒓𝒂𝒋𝒂𝒑𝒂𝒕𝒊 🇮🇳🚩 (@KalpeshPraj80) September 24, 2023 -
మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?
Tesla Optimus ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోమరో అడుగు ముందుకేసింది. స్వయంగా మనిషిలా ఆలోచించే రోబోలను గత ఏడాది ప్రకటించిన టెస్లా ఇపుడు అచ్చం మనిషిలాగే అన్ని పనులను చేయగలదంటూ తన అద్బుతమైన రోబో ఆప్టిమస్ వీడియోను టెస్లా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోబోట్ వస్తువులను సులువుగా పట్టుకోవడం, మానవుని కంటే వేగంతో క్రమబద్ధీ కరించగల సామర్థ్యాన్ని సాధించింది. ముఖ్యంగా నమస్తే ఫోజుతోపాటు, యోగా చేస్తున్న ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. మొక్కలకు నీళ్లు పోయడం, బాక్సులను మోయడం లాంటి పనులను చేసిన రోబో వీడియోను ఎలాన్ మస్క్ ప్రదర్శించారు. అయితే చివర్లో రోబో తడబడడం, ఇంజినీర్లు వచ్చి.. దానిని సరిచేయడం ట్రోలింగ్‌కు దారి తీసింది. ఇపుడు దాన్ని అధిగమించి సరికొత్త ప్రోగ్రెస్‌తో దూసుకొచ్చింది. ఈనేపథ్యంలో పురోగతి అంటూ ఈ వీడియోను మస్క్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. హ్యూమనాయిడ్ బైపెడల్ రోబో ‘ఆప్టిమస్’ స్వయంగా-కాలిబ్రేట్ చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వస్తువులు, దాని కలర్స్‌ను గుర్తించి సంబంధిత ట్రేలో పెట్టడం మనం ఈవీడియోలో చూడవచ్చు. అంతేకాదు చాలా చక్కగా యోగా కూడా చేస్తోంది. ఎండ్-టు-ఎండ్ శిక్షణ పొందిన న్యూరల్ నెట్‌వర్క్‌తో వస్తువులను గుర్తిస్తోంది. ఈ విషయంలో మానవుడు జోక్యం చేసుకున్నపుడు, అతనికంటే వేగంగా రోబో విజయవంతంగా పనిని పూర్తి చేసింది. కలర్స్ బ్లాక్‌లను ఒక క్రమంలో పెడుతుండగా, స్థానాన్ని మార్చి నప్పటికీ, రోబోట్ వాటిని సరైన ట్రేలో ఉంచింది.అంతేకాదు బ్లాక్‌ను తిరగేసి పెట్టినపుడు దాన్ని మార్చి కరెక్ట్‌గా ఉంచడం కూడా ఇందులో చూడొచ్చు. దీంతో వెల్ డన్ టెస్లా టీం. అభినందనలు అంటున్నారు ట్వీపుల్. అంతేకాదు మస్క్ మామ మామూలోడు కాదు భయ్యా అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. నెక్ట్స్ రోబో కోసం వెయిటింగ్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. Optimus can now sort objects autonomously 🤖 Its neural network is trained fully end-to-end: video in, controls out. Come join to help develop Optimus (& improve its yoga routine 🧘) → https://t.co/dBhQqg1qya pic.twitter.com/1Lrh0dru2r — Tesla Optimus (@Tesla_Optimus) September 23, 2023 pic.twitter.com/30mCr2Duk9 — Elon Musk (@elonmusk) September 25, 2023 కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్‌క్వార్టర్స్‌లో గత ఏడాది జరిగిన ఒక ఈవెంట్లో ప్రకదర్శించిన హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ టెక్నాలజీ ఆకట్టుకుంది. త్వరలో సెక్సీ రోబోలను సృష్టిస్తామంటూ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మార్చిలో ఇన్వెస్టర్ డే సందర్భంగా, టెస్లా ఐదు రోబోలను ప్రదర్శించింది. ఇపుడిక ఒక ఏడాదిలోపే మరో కీలకమైన పురోగతిని సాధించడం విశేషం. -
వెనుక రైలు..ముందు గేట్...తగ్గేదేలే
-
నోరు జారిన ఎమ్మెల్యే చిన్నయ్య..
-
రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఏకంగా టాప్‌లెస్‌తో!
బిగ్ బాస్ బ్యూటీ సోనాలి రౌత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ది ఎక్స్పోజ్తో 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం సోనాలి షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడు బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బ్యూటీ ఈ సారి టాప్ లెస్తో ఉన్న వీడియోను పంచుకుంది. అంతే కాకుండా వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఐ యామ్ ఫీలింగ్ గుడ్ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోనాలి రౌత్ అభిమానులు ఈ వీడియోను ఇష్టపడుతున్నారు మరియు నటిని ప్రశంసిస్తున్నారు. ఓ అభిమాని జార్జియస్ బ్యూటీ అని కామెంట్ చేయగా.. మరొకరు ' అద్భుతమైన మచ్చలేని అందాల రాణి అంటూ పోస్ట్ చేశారు. సోనాలి రౌత్ పెద్దగా సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపును దక్కించుకుంది. View this post on Instagram A post shared by Sonali Raut (@isonaliraut) -
బెజోస్ ప్రియురాలితో నటాషా పూనావాలా స్టెప్పులు; ఫోటోలు, వీడియో వైరల్
ప్రముఖ వ్యాక్సిన్ మేకర్ సీరంసీఈవో అదార్ పూనావాలా భార్య, సీరంఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషాపూనావాలా మరోసారి ఒక అంతర్జాతీయ వేదికపై తళుక్కున మెరిసారు. ప్రముఖ గాయని సల్మా హాయక్ సహ-అధ్యక్షురాలిగా ఉన్న కెరింగ్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవానికి హాజరైనఅతిథులలో ఫ్యాషన్ మొగల్ నటాషా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ షియాపరెల్లి గౌనులో నటాషా తనదైన ఫ్యాషన్ స్టయిల్లో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్, సల్మాతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించి వీడియోను, ఫోటోలను నటాషా పూనావాలా ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీరితోపాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకు ఫోటోలు, వీడియోలను, సల్మా హాయక్ , లారెన్ శాంచెజ్ షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 12న అమెరికాలో మాన్హాటన్లో సల్మా హాయక్ ఇచ్చిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్లో పలువురుమహిళా ప్రముఖులు స్పెషల్ గెస్ట్‌లు విచ్చేశారు. ముఖ్యంగా నటి ఓప్రా విన్ఫ్రే తన ప్రసంగంతో ఆకట్టుకుంది. ఇంకా మలాలా, నికోల్ కిడ్మాన్, కిమ్ కర్దాషియాన్, ఒలివియా వైల్డ్ లారెన్ శాంటో డొమింగో, ఎల్సా కాలిన్స్, జూలియా గార్నర్, లియోనార్డో డికాప్రియో, కింబాల్ మస్క్, క్రిస్టియానా మస్క్, డెరెక్ బ్లాస్బర్గ్ లాంటి వారున్నారు. 'కేరింగ్ ఫర్ ఉమెన్' విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లింగ-ఆధారిత హింసను ఎదుర్కోవడానికి ,మహిళలు ,పిల్లలపై హింకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) View this post on Instagram A post shared by Salma Hayek Pinault (@salmahayek) View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) -
డెలివరీ బాయ్‌కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్
జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్‌కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ. 45,000.. వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్‌కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. View this post on Instagram A post shared by Raj Gothankar (@raj_official_2151) -
నా భర్త లాస్ట్‌స్టేజీలో ఉన్నారు.. హోంగార్డు నాగమణి వీడియో వైరల్
ఖలీల్‌వాడి: సీఎం సారూ.. హోంగార్డులను పర్మినెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్‌స్టేషన్ హోంగార్డు నాగమణి చేసిన వీడియో వైరల్ అయ్యింది. గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్ భార్య అనుభవిస్తున్న బాధను తాను కూడా అనుభవిస్తున్నట్లు చెప్పారు. ‘‘నా భర్త సాయికుమార్ లాస్ట్‌స్టేజీలో ఉన్నారని డాక్టర్లు చెప్పారు. పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాం.. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాలా చాలా మంది హోంగార్డులు తమ వ్యక్తిగత బాధలను చెప్పుకోలేక పోతున్నారు. చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నాం. హాస్పిటల్ ఖర్చులు, స్కూల్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం.. పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నామే గాని మావి విలువ లేని బతుకులు.. సీఎం సారు హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని గతంలో చెప్పారు అందుకే అడుగుతున్నాం..హోంగార్డు యూనియన్ నేతలైన ఏడుకొండలు, ప్రేమ్, రాజేందర్, ఇబ్రహీం, వెంకటేశ్, శివన్న సీఎం సార్‌కు ఈ వీడియోను చేరే వరకు పంపండి’’అని ఆ వీడియోలో కోరారు. తామూ తెలంగాణ బిడ్డలమేనని హోంగార్డులకు న్యాయం చేస్తే సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకొని బతుకుతామని ఆ వీడియోలో ఆమె వ్యాఖ్యానించారు. చదవండి: హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి -
అసిస్టెంట్ పెళ్లిలో శ్రీవల్లి సందడి.. వైరలవుతున్న ఫోటో!
పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ క్రష్‌గా గుర్తింపు దక్కించుకున్న భామ రష్మిక. ప్రస్తుతం పుష్ప-2తో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. సందీప్ వంగా డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ రెయిన్బోలోనూ కనిపించనుంది. అయితే తాజాగా ఆమె తన అసిస్టెంట్ సాయి పెళ్లికి హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి ఎల్లో శారీ ధరించి సంప్రదాయ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ రష్మిక వివాహానికి హాజరైన నూతన వధువరులను ఆశీర్వదించారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) అయితే ఈ పెళ్లిలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేడుకలో పాల్గొన్న పుష్ప భామ నూతన దంపతులను ఆశీర్వదించింది. ఈ క్రమంలోనే రష్మిక కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు నూతన వధువరులు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది ముద్దుగమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రష్మిక బిజీ షెడ్యూల్లోనూ అసిస్టెంట్ పెళ్లికి హాజరు కావడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన పెళ్లిపై గురించి స్పందించింది. తన పెళ్లికి ఇంకా చాలా సమయముందని వెల్లడించింది. కొన్నేళ్లపాటు కెరీర్‌పైనే దృష్టిపెట్టనున్నట్లు తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప-2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) (ఇది చదవండి: గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!) Our rashu at Sai Babu wedding ♥️@iamRashmika #Rashmika #RashmikaMandanna pic.twitter.com/IGtAVL0l9g — RoshSam💌 (@RoshSamLover) September 3, 2023 -
జేడీఎస్ నేత యువతులతో రాసలీలలు .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
రాయచూరు రూరల్: జేడీఎస్ యువ విద్యార్థి విభాగం అధ్యక్షుని రాసలీలలు బయట పడ్డాయి. శుక్రవారం దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగి తేలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని అమాయక యువతులను వలలో వేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విడివిడిగా వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ కావడం సంచలనం కలిగించింది. ఇలా యువతుల బతుకులను బుగ్గిపాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో జేడీఎస్ సీనియర్ నేతలు స్పందిస్తూ వ్యక్తిగతంగా వారి మధ్య వ్యవహారం ఉండవచ్చన్నారు. -
ఏంటి బాబాయ్..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..?
ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నా కొందరు తంబాకు అలవాటును మానుకోరు. దాన్ని నోట్లో పెట్టుకుంటే గానీ కొందరికి బుర్ర పనిచేయదు. ఇంట్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇలా.. ఎక్కడ ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇక గోడ కనిపిస్తే చాలు ఉమ్మివేస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ అది ఏ ట్రైనో, బస్సో కాదండీ.. ఏకంగా విమానంలోనే.. వీడియోలో చూసిన విధంగా ఓ వృద్ధుడు విమానంలో ప్రయాణిస్తున్నాడు. నాలుక లాగేసిందో.. ఏమో..! గానీ విమానంలో ప్రయాణిస్తుండగానే తంబాకును జేబులో నుంచి తీశాడు. దాన్ని చేతిలో వేసుకునే నలిపి.. అమాంతం పెదవి కింది భాగంలో పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కరోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. फ्लाइट में हो या ट्रेन में एक खिली खैनी बहुत जरूरी हैं 😂😅 pic.twitter.com/GknxrYtJwY — छपरा जिला 🇮🇳 (@ChapraZila) August 26, 2023 వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'విమానంలోనే తంబాకు వేశావ్.. సరేగానీ ఎక్కడ ఉమ్మివేస్తావ్ బాబాయ్..!' అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. వీరు మారరురా బాబు.. అంటూ మరో నెటిజన్ స్పందించాడు. నాలుక లాగేస్తుందా..? తాత అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.''నాకూ కొంచం పెట్టవా..' అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఇదీ చదవండి: గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..? -
నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..
జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన దేశభక్తిని చాటుకున్నారు. కింద ఉంచిన జాతీయ జెండాను గమనించి అప్రమత్తయ్యారు ఆయన. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా.. ఇవాళ హాజరైన నేతలతో ఓ ఫొటోషూట్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వేదిక ఎక్కబోయారు. తమకు కేటాయించిన స్థానాల్లో నిల్చుని ఫొటోలు దిగాల్సి ఉంది. అయితే.. అక్కడ నేతలు ఎవరెక్కడ నిల్చోవాలనే గుర్తు కోసం ఆయా నేతలకు సంబంధించిన దేశాల జెండాల పేపర్ పీస్‌లను ఉంచారు. PM Narendra #Modi notices the Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at #BRICS, makes sure to not step on it, picks it up, and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit.#ModiInBRICS pic.twitter.com/pXCypilo4H — அகத்தியன் (@riverinerabbit) August 23, 2023 ఈ క్రమంలో వేదిక ఎక్కబోతూ.. అక్కడ జెండాను గమనించిన మోదీ.. దానిని తీసుకుని తన జాకెట్ జేబులో పెట్టుకున్నారు. మరోవైపు అప్పటికే తమ దేశపు జెండాపై అడుగేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు.. మోదీ చర్యను గమనించి అక్కడే ఉన్న సిబ్బందికి ఆ జెండాను అందించారు. -
వెకేషన్లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన బన్నీ.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్‌గా కావడంతో ఈ మూవీపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎస్పీగా భన్వర్ సింగ్ షెకావత్‌గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ నటన మరింత ఆసక్తిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!) అయితే గతనెలలో షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన బన్నీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. యూరప్‌లో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ సంగీత ఉత్సవం టుమారో ల్యాండ్‌కు అల్లు అర్జున్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడే అందరి మధ్యలో డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ కనిపించారు. దీంతో కొంతమంది అభిమానులు బన్నీతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ వేడుక జూలై చివర్లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో నటించనున్నారు. (ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు) View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
అనంతగిరి అడవుల్లో రేసింగ్ పై స్పందించిన పోలీసులు
-
కరీంనగర్: ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతూ సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. దాన్ని పట్టుకునేందుకు అధికారులు వలలు ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఎయిర్ గన్‌తో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇవ్వగా.. అనంతరం రేకుర్తి సమ్మక్క గద్దెల్లోకి భల్లూకం పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారుల గాలింపు ప్రక్రియ ముమ్మరం చేసి చివరికి పట్టుకున్నారు. కాసేపట్లో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని అడవిలో విడిచిపెట్టనున్నారు. నడిరోడ్డు పై హల్చల్ కాగా నడిరోడ్డుపై సంచరిస్తూ నగర వాసులను పరుగులు పెట్టిస్తోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఓ కాలనీలోకి ప్రత్యక్షమైన ఎలుగుబంటి.. శనివారం ఉదయం రేకుర్తిలో నడిరోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. దీంతో ఎలుగు బంటిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు పెట్టారు. ఎలుగుబంటి సంచరిస్తుండగా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మరో వైపు ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎలుగుబంటి కోసం హన్మకొండ నుంచి ప్రత్యేకంగా వలలు, ఎయిర్ గన్స్, ఇతర ఎక్విప్ మెంట్ తో వచ్చారు. చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్ మరో బంపర్ ఆఫర్.. -
ఇదేం పోయేకాలం.. సెలూన్లో షేవింగ్ చేయించుకున్న మహిళ
బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.. కలియుగంలో వింతలు, విచిత్రాలు జరగుతాయని. అందుకు తగ్గట్లే సోషల్ మీడియా వచ్చాక అవన్నీ నిజమనే సంఘనటలు చాలానే జరిగాయి. తాజాగా మరో వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ఇదేం విచిత్రం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి వింతలు చూస్తామనుకోలేదు అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?ఆ వింతైన సంఘటన ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అబ్బాయిలు షేవింగ్ కోసం సెలూన్‌కి వెళ్తుంటారు. కానీ తాజాగా ఓ అమ్మాయి సెలూన్‌కి వెళ్లి షేర్ చేయించుకుంది. బార్బర్ ఆమె ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి అబ్బాయిలకు చేసినట్లే షేవింగ్ చేశాడు. దీనికోసం మగవాళ్లకు వాడే బ్లేడ్‌నే ఉపయోగించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. 5జీ కదా.. అన్నీ మరుతుంటాయి. మహిళలు కూడా అన్నింట్లో సమానమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు? ఆమె నిజంగా అమ్మాయేనా అంటూ విస్మయం చెందుతున్నారు. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఇలాంటి వింతలు జరుగుతాయని ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటూ స్పందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఓ అమ్మాయి షేవింగ్ చేసుకున్న వీడియో ఒకటి టిక్‌టాక్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రోజూ షేవింగ్ చేయడం చర్మానికి మంచిదని, దీనివల్ల మృణకణాలు తొలిగిపోయి, చర్మం మరింత మృదువుగా, సహజసిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. షేవింగ్ వల్ల ఎలాంటి హానీ జరగదని, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని షేవింగ్ వెనుక తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. -
పెప్పర్ఫ్రై సీఈవో అనూహ్య మరణం: లాస్ట్పోస్ట్, వీడియో వైరల్
Ambareesh Murty Instapost viral ఆన్లైన్ ఫర్నిచర్ సంస్థ పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు సీఈవో అంబరీష్ మూర్తి ఆకస్మిక మరణం తరువాత ఏ నిమిషానికి ఏం జరుగునో..ఈ మాటలు కచ్చితంగా గుర్తొస్తాయి ఎవరికైనా. లేహ్‌లో విహార యాత్రలో ఉండగా గుండెపోటుతో మూర్తి కన్నుమూయడం దిగ్ర్భాంతికిగురించి చేసింది. ఈసందర్బంగా ఆగస్టు 6న ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ వీడియో వైరల్‌గా మారింది. మోటార్ సైకిల్ డైరీస్ (వై మీ :)?)" అని టైటిల్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బైకర్, ట్రెక్కర్ మూర్తి మోటార్‌సైకిల్‌తో కొన్ని గేర్ సమస్యలను ఎదుర్కొన్న తర్వాత దేవుడు తనను "దేవదూత"గా అంగీకరించడానికి "తిరస్కరించాడు" అని ప్రకటించారు. లడఖ్ ట్రిప్‌లో "ప్రతి బైకర్‌కి స్వర్గం" అంటూ లడఖ్ రోడ్లను ప్రశంసించిన ఆయన ఈ ట్రిప్‌లో తనకెదురైన సమస్య గురించి మాట్లాడుతూ, "నాకు గేర్ ట్రబుల్స్ మొదలయ్యాయి. నేను నా బైక్ థర్డ్, ఫోర్త్, ఫిప్త్ ఐదవ గేర్లను యాక్సెస్ చేయలేకపోయాను. అందుకే ఒక గేర్‌పై, ఫస్ట్, అండ్ సెకండ్లోవెళ్లా. చివరికి ఐన్‌స్టీన్ ఏమి చేస్తాడో అదే చేసా..ఒక పెద్ద రాయిని తీసుకొని గేర్ పెడల్‌ను కొట్టాను,ఆ తర్వాత అంతా బాగానే ఉంది." అన్నారు. కానీ అంతలోనే అనంతలోకాలకు తరలిపోవడం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానలను విషాదంలో ముంచేసింది. లేహ్ పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు మరో సహ వ్యవస్థాపకుడు ఆశీష్ షా సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బైక్ రైడ్ అంటే ఎంతగానో ఇష్టపడే మూర్తి.. తరచుగా మోటార్‌సైకిల్‌పై ముంబై నుంచి లేహ్‌కు వెళ్లేవారు. మూర్తి మృతిపై స్పాటిఫై ఇండియా ఎండీ అమర్జిత్ బాత్రా, డ్రూమ్ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్, క్యాష్‌కరో కో-ఫౌండర్ స్వాతి భార్గవ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 1994లో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ చదివిన మూర్తి ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ చేశారు. ఆ తర్వాత క్యాడ్బరీస్, ఐసీఐసీఐ ఏఎంసీ (ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్), లివైస్, ఈబే ఇండియా తదితర సంస్థల్లో పని చేశారు. 2011లో ఆశీష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని ప్రారంభించారు. View this post on Instagram A post shared by Ambareesh Vedantam Murty (@ambareeshmurty) -
చెట్లు నరుకుతుండగా వింత ఘటన.. వీడియో వైరల్
ప్రకాశం జిల్లా: ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చెట్లు నరుకుతుండగా అకస్మాత్తుగా చెట్టులోంచి మంచినీళ్లు వచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో కొంతమంది చెట్లు నరుకుతుండగా, ఓ చెట్టులోంచి అకస్మాత్తుగా మంచినీళ్లు వచ్చాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను సైతం తాగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి.. -
ఏకాంత వీడియో బలిగొంది
బనశంకరి: ఏకాంతంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో ఆందోళనకు గురైన యువతీ యువకుడు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన దావణగెరె నగరంలో చోటుచేసుకుంది. వివరాలు... ఆలూరట్టి తాండాకు చెందిన రతన్ (20), జగళూరు తాలూకాకు చెందిన యువతి దావణగెరె కాలేజీలో డిగ్రీ బీకాం రెండవ ఏడాది విద్యార్థులు. ఇద్దరూ ప్రేమించుకున్నట్లు తెలిసింది. 2 నెలల కిందట కాలేజీ పైన ఇద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని గమనించి వారికి తెలియకుండా ఎవరో మొబైల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది స్థానికంగా సోషల్ మీడియాతో పాటు ఇంటర్నెట్లోని కొన్ని వెబ్సైట్లలో బాగా ప్రసారమైంది. మొదట యువతి బలవన్మరణం ఇది తెలిసి యువతి ఇంట్లో ఏమంటారోనని భయాందోళనకు గురై, శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త తెలుసుకుని రతన్ హాస్టల్ నుంచి సొంతూరు ఆలూరట్టి తాండాకు చేరుకుని రాత్రికి ఉరివేసుకుని తనువు చాలించాడు. పిల్లలను కోల్పోయిన కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై ఇద్దరి తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేసి ఘోరానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న జిల్లా ఎస్పీ అరుణ్ తెలిపారు. -
మహిళ ఓవర్ యాక్షన్.. టికెట్ అడిగాడని కండక్టర్‌పై తిట్ల పురాణం
యశవంతపుర(బెంగళూరు): బస్ కండక్టర్‌ను మహిళ ఒకరు నోటికొచ్చినట్లు తిట్టిన వీడియో వైరల్ అయ్యింది. బెంగళూరులో సిటీ బస్ ఎక్కిన మహిళ టికెట్ తీసుకోలేదు. కండక్టర్ ఆమెను టికెట్ తీసుకోవాలని కోరగా ఉచిత ప్రయాణమని తెలిపింది. ఆధార్ కార్డు చూపాలని కండక్టర్ కోరగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని అని ఆమె ఐడీ కార్డు చూపారు. స్థానిక చిరునామా కార్డును చూపించాలని, లేదా టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో మహిళ రౌద్రరూపం దాల్చింది. ఇష్టానుసారం తిట్ల పురాణం వినిపించింది. కొందరు ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మహిళ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. #FreebusJourney in #KSRTCBus in #Karnataka An argument started between a woman passenger and a #bmtc bus conductor when the Conductor asked the woman to show Aadhar Card or Voter Card of Karnataka only to avail the free bus ride. The woman showed her Aadhaar card in her phone… pic.twitter.com/DoKMOsAvkQ — NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) July 26, 2023 చదవండి: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు.. -
కరీనా కపూర్ కనీసం పట్టించుకోలేదు: నారాయణ మూర్తి వీడియో వైరల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా నారాయణ మూర్తి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అభిమానులను కరీనా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ దీనిని తాజాగా ఓ ఇన్‌స్టా పేజీలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటీ కాన్పూర్ చర్చా కార్యక్రమంలో నారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి కరీనా కపూర్ ప్రస్తావన తీసుకొచ్చారు. అభిమానుల పట్ల ఆమె వ్యవహరించిన తీరును నారాయణ మూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. అయితే మధ్యలో ఆయన సతీమణి సుధామూర్తి కల్పించుకొని నారాయణ మాటలను వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ నారాయణ మూర్తి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు. ‘నేను ఓసారి లండన్ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి హాయ్ అంటూ పలకరించారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే కనీసం లేచి నిల్చొని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే’నన్నారు నారాయణ మూర్తి. చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే! ఇంతలో సుధామూర్తి కల్పించుకొని.. కరీనాకు కోట్లలో అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుందని అన్నారు. ‘నారాయణ మూర్తి ఓ సాఫ్ట్వేర్ వ్యక్తి, కంపెనీ ఫౌండర్.. నీకు 10వేల మంది అభిమానులు ఉంటారేమో.. కానీ, సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా’’ అని అన్నారు. సుధామూర్తి మాటలకు అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. ఆమెను ప్రశంసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. అయినప్పటికీ నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం కూడా ఆ ప్రేమను తిరిగి ప్రదర్శించాలి. ఏ రూపంలోనైనా సరే.. అది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మనలోని అహాన్ని తగ్గించే మార్గాలు అంతే’ నని అన్నారు. చదవండి: 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్ View this post on Instagram A post shared by ENTREPRENEURS OF INDIA (@eoindia) -
బైజూస్ ఆఫీస్‌లో జగడం.. ఘర్షణకు దిగిన మహిళా ఉద్యోగి.. వీడయో వైరల్
ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్సెంటివ్‌ల విషయంలో జరిగిన అన్యాయంపై ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్‌తో ఘర్షణకు దిగినట్లుగా ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగి ఇన్సెంటివ్‌లు, ఇతర విషయాల్లో తనకు జరిగిన అన్యాయంపై తన బాస్‌ను గట్టిగా ప్రశ్నించింది. తనను ఉన్నట్టుండి తొలగించారని, ఫైనల్ సెటిల్మెంట్లోనూ అన్యాయం జరిగిందని, కేవలం రూ. 2,000 మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందంటూ ట్విటర్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 'ఘర్ కే కలేష్' అనే ట్విటర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన వీడియో ప్రామాణికత నిర్ధారణ కాలేదు. ఈ వీడియోపై పలువురు ట్విటర్ యూజర్లు ప్రతిస్పందించారు. ఇలాంటివి జరగకుండా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవడం మేలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఫైనల్ సెటిల్మెంట్లో ఆమెకు కేవలం రూ.2000 మాత్రమే ఇవ్వడంపై బైజూస్ యాజమాన్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Kalesh b/w Employee and Byjus Companyy over giving lot’s of mental pressure during job (Unfortunately Girl is missing since then) pic.twitter.com/xzgIUbqjeq — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 -
దేవదా... నా నటన నచ్చిందా?
సినిమాలలోని పాపులర్ సీన్లను రీక్రియేట్ చేసి ఆనందించడం మనకు కొత్త కాదు. సంజయ్‌లీలా బన్సాలీ ‘దేవదాస్’ సినిమాలో ‘పారు’ పాత్రలోని ఐశ్వర్యారాయ్‌ని అనుకరిస్తూ కైరా ఖన్నా అనే బాలిక చేసిన వీడియో తాజాగా వైరల్ అయింది. ఐకానిక్ సినిమాలలోని పాపులర్ సీన్లను అనుకరిస్తూ కైరా చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ‘జిస్ వక్త్ తుమ్హారే సాథ్ హోతి హమ్ ఉస్ వక్త్ బద్నామి కా బీ డర్ నహీ లగ్తా’ ‘దస్ సాల్ పహ్లే తుమ్హరే నామ్ కా దియా జలాయ థా మైనే. ఉసే ఆజ్ తక్ బుజ్నే నహీ దియా’... ఇలా ‘దేవదాస్’ సినిమాలోని ‘పారు’ పాపులర్ డైలాగ్‌లతో ‘వావ్’ అనిపించింది కైరా ఖన్నా. ‘డైలాగుల నుంచి ఎక్స్ప్రెషన్ వరకు అద్భుతం’ ‘అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న కైరాకు బాలీవుడ్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది’... అంటూ నెటిజనులు కైరా ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. -
విమాన ప్రయాణం.. మధ్యలో లేచి డబ్బులు కావాలంటూ
కొన్ని కార్యక్రమాలకు విరాళాలు సేకరించడం మనకు తెలిసిన విషయమే. ఇలాంటివి సాధారణంగా రోడ్లపైనో లేదా బస్సుల్లో సేకరిస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా ఏకంగా విమానంలో విరాళాలు అడుగడం ప్రారంభించాడు. అయితే అతను నెట్టింట ఫేమ్ కోసం ఇలా చేశాడా లేదా నిజంగానే విరాళాల కోసం ఇలా చేశాడో తెలియదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడి ప్రజలకు రెండు పూటలా భోజనం తినడం కూడా కష్టంగా మారిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఓ పాకిస్తాన్ వ్యక్తి విమానంలో ప్రయాణిస్తుండగా.. సడన్‌గా లేచి విరాళాల కోసం ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘మేము మదర్సా కట్టడం కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బు ఇవ్వదలచుకుంటే నా వద్దకు వచ్చి ఇవ్వనవసరం లేదు. నేనే మీరు కూర్చున్న చోటుకు వస్తాను. నేనేమీ భిక్షాటన చేయడం లేదు. నాకు సాయం చేయండి’ అంటూ అభ్యర్థించడం మొదలు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరో వైపు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అటు ఐఎంఎఫ్‌తో పాటు స్నేహపూర్వక దేశాల నుంచి రుణాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ వీడియో వైరల్ అవడంతో దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. Viral video whereby a Pakistani can be seen begging in a flight; Says I am not a beggar but need money to make a madrasas in Pakistan. pic.twitter.com/hUB3ZzVJGn — Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2023 చదవండి ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్! -
కుక్కపిల్లలను భయపెట్టాలనుకున్నారు.. కానీ.. తల్లి కుక్క ఎంట్రీతో సీన్ రివర్స్..
కొత్త వ్యక్తులు కనిపిస్తే కుక్కలు మొరగడం ప్రారంభిస్తాయి. ఇంకా కోపం ఎక్కువ ఉన్న కుక్కలైతే అస్సలు ఊరుకోవు. వెంబడించి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సమయాల్లో బెదిరిస్తే కొన్నికుక్కలు భయంతో పారిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది ఇద్దరు యువకులకు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియోలో చూపిన విధంగా.. ఇద్దరు యువకులు దారి వెంట మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారిని చూసిన రెండు కుక్క పిల్లలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. కుక్క పిల్లలే కదా..! అన్నట్లు ఒక్కసారిగా ముందుకు వచ్చి వాటిని బెదిరించే ప్రయత్నం చేశారు యువకులు. అంతే.. భయంతో వెనక్కి పరుగులు పెట్టాయి. కానీ అసలు ట్విస్టు ఇక్కడే ఎదురైంది ఆ యువకులకు. వెనక్కి వెళ్లిన కుక్క పిల్లలు తన తల్లిని తీసుకువచ్చాయి. తల్లి కుక్క భారీ ఆకారంలో ఉండటంతో యువకులు.. చచ్చాం.. రా.. బాబోయ్.. అన్నట్లు భయంతో వెనక్కి పరుగులు పెట్టారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. Don't underestimate anything, there is always something stronger than you! Made me laugh a lot! 🤣🤣pic.twitter.com/r8WWEP5NSA — Figen (@TheFigen_) July 8, 2023 వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. కుక్క పిల్లలే కదా..! అని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్ చేశారు. దేన్ని అండర్ ఎస్టిమేట్ వేయకూడదని.. దాని వెనకాల ఎంత పెద్ద బలం ఉంటుందో తెలియదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసి మరికొంతమంది నవ్వులు కురిపించారు. కానీ కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరికొందరు. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
గ్లామర్ హద్దులు చెరిపేస్తోన్న కాంచన నటి.. వీడియో వైరల్!
సోషల్ మీడియా వచ్చాక సినీ తారలు ఎప్పటికికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. కొందరైతే ఏకంగా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్నారు. తాజాగా బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 26 ఏళ్ల నిక్కీ తంబోలి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. (ఇది చదవండి: రామాయణ నటికి బాడీ షేమింగ్.. 'చిన్న ఏనుగు' అంటూ!) మరింత హాట్ ఫోటోలు, వీడియోలతో అభిమానుల గుండెల్ని షేక్ చేస్తోంది. తాజాగా నిక్కీకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో హంగామా చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది నిక్కీ. అందు కోసం గ్లామర్ హద్దులను చెరిపేస్తోంది బాలీవుడ్ భామ. అయితే ఈ వీడియో కొందరు అభిమానులు బాగుందని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్లో అందాల ఆరబోతలో ఉర్ఫీ జావెద్ ఒకరు. ఇప్పుడు అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని పోటీ పడుతున్నారు. కాగా.. నిక్కీ తంబోలి చివరిసారిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం 'జోగిరా సరా రా'లో ఐటెమ్ సాంగ్‌లో కనిపించింది. అంతే కాకుండా నిక్కీ 'ఎంటర్టైన్మెంట్ కి రాత్ హౌస్‌ఫుల్' రియాల్టీ షోలో కూడా కనిపించింది. 'బిగ్ బాస్ -14' తర్వాత నిక్కీ తంబోలి పాపులారిటీ బాగా పెరిగింది. నిక్కీ తంబోలి తెలుగులో ఎక్కువగా బోల్డ్ పాత్రల్లోనే నటించింది. ఆమె నటించిన చీకటి గదిలో చితక్కొట్టుడు, తిప్పరా మీసం సినిమాలతో బాగానే క్రేజ్ దక్కించుకుంది. లారెన్స్ తీసిన కాంచన -3లోనూ నిక్కీ తంబోలి నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంది. (ఇది చదవండి: హీరోయిన్గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్ రెమ్యునరేషనా?) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) -
కిరాక్ పార్టీ హీరోయిన్.. అలాంటి వీడియోలు అవసరమా నీకు!
కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సంయుక్తా హెగ్డే. ప్రస్తుతం షూటింగ్‌లతో విదేశీల్లో బిజీగా ఉంది. సినిమాలే కాకుండా సంయుక్త కన్నడ, హిందీ రియాల్టీ షోలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ భామ ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ ఉంటోంది. ఇటీవల సంయుక్తా హెగ్డే సినిమాల కంటే వ్యక్తిగత సమస్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో సంయుక్తి షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై ఆమెను కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరేమో తప్పుబడుతున్నారు. సంయుక్త లుక్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఆమె జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే.. కానీ ఇప్పుడామె స్టార్ హీరోయిన్!) ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన ముద్దుగుమ్మ.. 'మీ శరీరం మీ ఆస్తి. మనం ఎలాంటి సామాజిక నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మహిళలు దృఢంగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. బలమనేది పురుషులు లేదా స్త్రీలకు సంబంధించింది కాదు. బలం, విశ్వాసం మీ శక్తిని పెంచుకోవడానికి ప్రతిరూపం' అంటూ అర్ధనగ్నంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. మీరు ఇతర మహిళలకు స్ఫూర్తి అని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు ఒక మహిళగా మీ శరీరాన్ని ఇలా ప్రదర్శించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఫేమ్ కోసం మీరు చేస్తున్న జిమ్మిక్కు అంటూ కామెంట్ చేస్తున్నారు. తరచుగా వివాదాలే బిగ్ బాస్ సీజన్ 5లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా వచ్చిన సంయుక్త హెగ్డే తన కంటెస్టెంట్ సమీర్‌ను చెంపపై కొట్టడంతో వార్తల్లో నిలిచింది. అప్పట్లో సంయుక్త ప్రవర్తనను అందరూ వ్యతిరేకించారు. తరువాత 2020లో.. బెంగళూరులోని ఒక పార్క్‌లో సంయుక్త తన స్నేహితులతో కలిసి హులా హూప్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళతో గొడవ పడ్డారు. అలాగే, గతేడాది కాంపౌండ్ పూల్ దగ్గర బ్లూ మైక్రో బికినీలో కనిపించి వార్తల్లో నిలిచింది. కాగా.. కర్ణాటకకు చెందిన సంయుక్త హెగ్డే రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సంయుక్త కోలేజ్ కుమార్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో కిరాక్ పార్టీ ద్వారా అడుగు పెట్టారు. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న సంయుక్త హెగ్డే చాలా ఏళ్ల తర్వాత రానా సినిమాతో మళ్లీ కన్నడలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన అర్జెంట్ ఎగ్జిట్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న క్రీమ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) (ఇది చదవండి: ఈ వారం కొత్త సినిమాల సందడి.. ఓటీటీలోనే ఎక్కువ!) -
మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట వెలుగుచూసింది. సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను మరవకమునుపే ఈ ఘటన బయటకు వచ్చింది. కదులుతున్న వాహనంలో ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అరికాళ్లు నాకించారు. వ్యక్తిగత వైరం నేపథ్యంలో జరిగిన తాజా ఘటనపై పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కదులుతున్న వాహనంలో గోలూ గుర్జర్ అనే వ్యక్తి మరో వ్యక్తిని పదేపదే కొట్టడం, దూషిస్తూ అతడితో బలవంతంగా అరికాళ్లు నాకించడం ఉన్నాయి. అతడు చెప్పినట్లుగానే గోలూ గుర్జర్‌ను బాధితుడు పొగిడాడు. మరో వీడియో క్లిప్‌లో గోలూ గుర్జర్ చెప్పుతో బాధితుడి మొహంపై కొడుతున్నట్లుగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి కుటుంబం ఫిర్యాదు మేరకు గోలూ గుర్జర్, సుదీప్ గుర్జర్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు, బాధితుడు దబ్రా పట్టణానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. బాధితుడు మొహ్సిన్ ఖాన్ మే 21వ తేదీన గోలూ గుర్జర్‌ను కొట్టాడని గ్వాలియర్ పోలీసుఅధికారి రాజేశ్ చందేల్ చెప్పారు. దాడిపై గోలూ డబ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. కక్ష గట్టిన గోలూ గుర్జర్ తన వారితో కలిసి జూన్ 30న ఖాన్‌ను నిర్బంధించి, దాడికి దిగినట్లు చెప్పారు. -
మంకీ హెయిస్ట్.. డబ్బుల బ్యాగ్‌ను భలేగా కొట్టేసింది
-
ఒక్క దెబ్బకి ఆ కోతి లక్షాధికారి అయ్యింది!
Monkey Stole Money Viral రాత్రికి రాత్రే నసీబ్ మార్చుకుని కోటీశ్వరులైన మనుషుల కథల్ని విని ఉంటాం. కానీ, ఓ కోతి పట్టపగలే.. అదీ అడ్డదారిలో కొన్ని గంటలపాటు లక్షాధికారిగా మారిపోయిందట. ఇది సోషల్ మీడియాలో పేలుతున్న జోక్ మాత్రమే. ఉత్తర ప్రదేశ్ షాహాబాద్‌లో జరిగిన ఓ సరదా ఘటన.. ఓ వ్యక్తిని కాసేపు ఆగమాగం చేసింది. ఓ కోతి లక్షా యాభై వేల నగదు ఉన్న సంచిని ఓ మోటర్ సైకిల్ నుంచి ఎత్తుకెళ్లింది. షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి సేల్ డీడ్ కోసం నగదుతో రిజిస్ట్రీ ఆఫీస్ వచ్చాడు. ఆ సమయంలో ఓ కోతి అక్కడికి వచ్చింది. పార్కింగ్‌లో ఉన్న ఒక్కో బ్యాగ్‌ను వెతుక్కుంటూ ముందుకెళ్లింది. అయితే.. దాని కన్ను డబ్బులున్న షరాఫత్ బ్యాగ్ మీదే పడింది. అంతే.. నైస్‌గా దానిని ఎత్తుకెళ్లింది. కాసేపటికి బండి దగ్గరకు వచ్చిన ఆయన డబ్బు లేకపోయేసరికి దొంగతనం జరిగిందేమో అనుకుని లబోదిబోమన్నాడు. ఈలోపు కొందరు బ్యాగ్ కోతి ఎత్తుకెళ్లిందని చెప్పడంతో దాని కోసం వెతికారు. అది కాస్త దగ్గర్లోని ఓచెట్టుపై నిమ్మలంగా కూర్చుని ఉంది. చాలాసేపు ప్రయత్నించాకే.. అది ఆ బ్యాగ్‌ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో షరాఫత్ ఊపిరి పీల్చుకున్నాడు. -
ఏం తెలివి సామీ.. క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తున్న మోడ్రన్ బిక్షగాడు
మనం ప్రతిరోజూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, దేవాలయాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చగాళ్లను చూస్తుంటాం. కొందరు తమకు తోచినంత సాయం చేస్తారు. ఇంకొందరేమో చిల్లర లేదని సింపుల్‌గా చెప్పి తప్పించుకుంటుంటారు. అయితే ఈ బిచ్చగాడి నుంచి మాత్రం మీరు అస్సలు తప్పించుకోలేరు. ఇందుకంటే ఇతను టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తూ చాలా స్టైల్‌గా అడుక్కుంటున్నాడు. సాధరణంగా యచకులు పాత సంచి లేదా ఏదైనా చిన్న బొచ్చులాంటి పాత్ర పట్టుకొని అడ్డుకోవడం చూశాం. కానీ ఇది డిజిటల్ యుగం కదా. కాలం మారడంతో మనమూ మారాలి అనుకున్నాడేమో ఏకంగా ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ దానం చేయమని అడుక్కుంటున్నాడు. ముంబైలోని ఓ రద్దీ లోకల్ ట్రైన్లో కనిపించింది ఈ దృశ్యం. చక్కగా పాటలు పాడుతూ స్టైల్లో క్యూఆర్ కోడ్ ఇచ్చి భిక్షాటన చేయడంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు. ఓ వ్యక్తి ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డిజిటల్ భిక్షగాడి తెలివికి నెటిజన్లు షాకవుతున్నారు. మరికొందరేమో ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు సొంతంగా ఉద్యోగం చేస్తూ బతకొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. #MumbaiLocal #DigitalIndia That's Mumbai local where you can see the height of using digital payment A beggar is carrying the online payment sticker with him so you have not to bother about excuses of not having change its purely a cashless facility 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/HIxlRJkbmM — 💝🌹💖jaggirmRanbir💖🌹💝 (@jaggirm) June 25, 2023 -
డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!
సాధారణంగా కారు కొనాలనుకున్న వారు సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ, ధర లాంటి వివరాలను పరిశీలించి తమకిష్టమైనకారును సొంతం చేసుకుంటారు. కానీ డోర్లు, టైర్లు లేని కారును ఎక్కడైనా చూశారా? ప్రపంచంలోనే అతి చిన్నకారుగా పిలుస్తున్న ఈ కారుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, దానుకనుగుణంగా కొత్త ఫీచర్లు, డిజైన్లతో స్టైలిష్ కార్లతోపాటు, బడ్జెట్ కార్లపై కార్మేకర్లు దృష్టిపెడుతున్న క్రమంలో ఈ బుల్లి కారు సోషల్ మీడియా యూజర్లను భలే ఆకట్టుకుంటోంది. 37 మిలియన్ల వ్యూస్‌తో, లైక్స్, రీట్వీట్స్తో దూసుకుపోతోంది. బహుశా ఇది మిస్టర్ బీన్ కోసం మిస్టర్ బీన్ కనిపెట్టాడేమో అంటూ ఒకరు కమెంట్ చేశారు. అలాగే నమ్మశక్యం కాని డిజైన్ వెనుక ఉన్న సృజనాత్మకతను అభినందిస్తున్నారు. "మాస్సిమో" ట్విటర్ ఖాతాలో గత నెల 26న ఈ వీడియోను షేర్ చేసింది. వైరల్ వీడియోలో, సియాన్ కలర్కారును చూస్తే, టైర్లు లేదా తలుపులు లేవు. దీంతో నిజంగా ఇదే కారేనా అన్న అనుమానం కూడా కలుగకమానదు.వాస్తవానికి, ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ కారమాఘెడన్ పోస్ట్ చేసింది. The lowest car in the world [📹 carmagheddon (IT): https://t.co/9z0IrZySua]pic.twitter.com/AvExqIFJnA — Massimo (@Rainmaker1973) June 25, 2023 -
అంబానీ ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు: వీడియో వైరల్
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కోట్ల రూపాయల కొత్త కారు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల కోటి రూపాయలు పెట్టి, పెయింటింగ్,ఇ తర మార్పులు చేసిన ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు రోల్స్ రాయిస్ కెమెరాకు చిక్కింది. (టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ!) ఇటీవల కోటి రూపాయలకుపైగా ఖర్చుపెట్టి మరీ పెయింటింగ్ వేయించిన రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్యూవీ కెమెరాకు చిక్కింది. ఇక ఇన్‌స్టా యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. ర్యాప్ షేడ్స్లైట్స్ మారుతున్న తీరు విశేషంగా నిలిచింది. అయితే నిజంగా ఇది రంగులు మార్చడం కాదు. సైకెడెలిక్ ర్యాప్ వివిధ షేడ్స్ లైట్ల క్రింద వివిధ రంగులను రిప్లెక్ట్ చేస్తుంది. అలా ఈ కారు రంగులు మారుతున్న భ్రమను మనకు కలిగిస్తుందన్న మాట. అంబానీ సొంతమైన రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర దాదాపు రూ.13.14 కోట్లు. సాధారణంగా, రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర రూ.6.8 కోట్ల నుండి ప్రారంభం. అయితే మీడియా నివేదికల ప్రకారంకోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే పెయింటింగ్, 21 అంగుళాల వీల్స్, ఇతర కస్టమైజేషన్ కారణంగా దీని ధర రూ.13.14 కోట్లకు పెరిగిందన్నట్టు. అంతేకాదు దీని రిజిస్ట్రేషన్ నంబర్ '0001' కోసం రూ. 12 లక్షలు చెల్లించారట. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) కాగా అంబానీ లగ్జరీ నివాసం ముంబైలోని రూ. 15,000 యాంటిలియా, రూ. 850 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌తో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ల్యాండ్ రోవర్, లంబోర్ఘిని ఫెరారీ లాంటి టాప్ కార్లు అంబానీ కుటుంబం సొంతం. -
ఈ వీడియో చూస్తే.. రెస్టారెంట్లో చికెన్ కర్రీ ఆర్డర్ చేయరు!
ఇంటి వంట ఎంత రుచి, శుచిగా ఉన్నా రెస్టారెంట్లను అప్పుడప్పుడు సందర్శించాల్సిందే. ఇదే ప్రస్తుత ట్రెండ్. కొన్ని పుడ్ ఐటమ్స్ ఫలానా రెస్టారెంట్లో బాగుంది అని తెలిస్తే చాలు.. క్యూలో ఉండి ఆ వంటకాన్ని ఇంటికి తెచ్చుకోవడమో, లేదా అక్కడే తినడమో చేస్తుంటారు. రెస్టారెంట్లో పుడ్ అనగానే రుచి వరకు ఓకే గానీ నాణ్యత విషయంలో మాత్రం అంతంత మాత్రమేనన్న ఘటనలు బోలెడు ఉన్నాయి. ఇక వెజ్ పరిస్థితి ఎలా ఉన్నా నాన్‌వెజ్ వంటకాల విషయంలో మాత్రం కొన్ని రెస్టారెంట్లు క్వాలిటీ పరంగా షాక్‌లు ఇస్తూనే ఉంటాయి. తాజాగా పంజాబ్‌లోని లుధియానాలో ఓ కస్టమర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చికెన్ కర్రీలో ఎలుకలుంటాయ్ వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి లుధియానాలోని ప్రకాష్ ధాబాకు వెళ్లాడు. వెయిటర్ తన వద్దకు రాగానే.. ఆ వ్యక్తి తనకు నచ్చిన చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. కాసేపు అనంతరం ఆర్డర్ తన టేబుల్ ముందుకు వచ్చింది. ఇక ఆకలిగా ఉన్న ఆ కస్టమర్.. ఓ పట్టు పట్టాలని తినేందుకు రెడీ అయ్యాడు. అంతలో చికెన్ గ్రేవీలో ఎలుక కనిపించింది. చికెన్ ముక్క అనుకుని గబుక్కున నోట్లో వేసుకుందామని చూసిన ఆ కస్టమర్ దెబ్బకు హడలిపోయాడు. సిబ్బందికి ఈ విషయం చెప్పగా.. వాళ్లు పట్టించుకోకపోవడమే కాకుండా.. అసలు తమది తప్పే కాదన్నట్టుగా మాట్లాడారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కస్టమర్. ఆ వీడియోలో.. "ప్రకాష్ ధాబా లూథియానా. ఇండియా చికెన్ కర్రీలో ఎలుకను వడ్డించండి. రెస్టారెంట్ యజమాని ఫుడ్ ఇన్స్పెక్టర్కి లంచం ఇవ్వడంతో ఇంత స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నారా ??? అనేక భారతీయ రెస్టారెంట్లలోని కిచెన్‌లో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి" అని పోస్ట్ కింద క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఇదిలా ఉండగా రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ కస్టమర్ కావాలనే తమ హోటల్ గుడ్ విల్ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కస్టమర్‌కే సపోర్ట్ చేశారు. అంత పెద్ద తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారా అంటూ మండి పడుతున్నారు. ఇంకొందరు...అసలు ఆ రెస్టారెంట్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేసేయాలని ఫైర్ అవుతున్నారు. లుధియానాలో ఇదేం కొత్త కాదు. చాలా రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Parkash dhaba Ludhiana. India Serve rat in chicken curry. Restaurant owner bribe the food inspector and go free??? Very poor standards in Kitchen of many Indian restaurants. Be aware . pic.twitter.com/chIV59tbq5 — NC (@NrIndiapolo) July 3, 2023 -
ఇదేంటో చెప్పగలరా.. మీ బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కాదు.. ఎందుకుంటే
ఫొటోలోని బొమ్మను చూసి ఇదేంటో చెప్పండి.. బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కావడం లేదా.. ఇది క్యూట్‌గా ఉన్న పిల్లి బొమ్మ!! ఏ మూల నుంచి కూడా పిల్లిలా కనిపించని ఈ చిత్రాన్ని గీసింది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోగా చెబుతున్న అమెకా.. ఈ మధ్య పిల్లి బొమ్మ గీయమని చెప్పినప్పుడు ఇలా గీసింది. 30 సెకన్లలో గీయడం పూర్తిచేసి.. పోలే అదిరిపోలే అన్న స్టైల్లో ఫీలింగ్ ఇచ్చి.. ఎలా ఉందేంటి? అని అక్కడున్న శాస్త్రవేత్తను అడిగింది. దానికి ఆయన అంత బాగోలేదు అని అంటే.. తెగ ఫీలైపోయింది కూడా. నేను గీసిన బొమ్మే నీకు నచ్చలేదంటే.. నీకు ఆర్ట్ మీద అస్సలు అవగాహన లేనట్లుందని కౌంటరిచ్చింది. తాజాగా ఈ వీడియోను దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కొత్త తరం రోబోల వల్ల చాలా రంగాల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆర్టిస్టుల వరకూ ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. వాళ్ల జాబులు సేఫేనని పలువురు వీడియోను చూసి కామెంట్ చేశారు. చదవండి: భయం వద్దు మిత్రమా... కూల్‌గా తినుమా! -
ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య
సాధారణంగా సెలబ్రిటీలు బయట కనిపించరు. ఒకవేళ కనిపించినా సరే ఎవరితోనూ మాట్లాడకుండా, వచ్చిన పని చూసుకుని వెళ్లిపోతారు. హీరో నాగశౌర్య మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని రోడ్డుపై ఓ అమ్మాయి-అబ్బాయి గొడవ పడుతుంటే మధ్యలోకి దూరాడు. వాళ్లకు ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అదేమంత పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఎందుకులేరా బాబు అని వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు. ఇప్పుడు సందర్భం రావడంతో అసలు ఆ రోజు ఏం జరిగిందనేది బయటపెట్టాడు. (ఇదీ చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?) ఏంటి గొడవ? ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇది. హైదరాబాద్ రోడ్డుపై ఓ అబ్బాయి-అమ్మాయి గొడవ పడుతున్నారు. అటుగా కారులో వెళ్తున్న హీరో నాగశౌర్య.. ఈ గొడవ చూసి ఆగిపోయాడు. వాళ్లిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ పెద్దగా ఫలించలేదు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇది మూవీ ప్రమోషన్ కోసమని కొందరు అంటే.. ఏం జరిగిందా అని మరికొందరు ఆసక్తి చూపించారు. తాజాగా నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో ఇదే ప్రశ్న అడగ్గా... ఆరోజు అసలేం జరిగిందనేది నాగశౌర్య బయటపెట్టేశాడు. జరిగింది ఇదే! 'నేను పనిమీద కూకట్పల్లి నుంచి వెళ్తున్నాను. ఆ సమయంలో ఓ అబ్బాయి తన లవర్ ని కొట్టడం చూశాను. వెంటనే కారు ఆపి అతడి దగ్గరికి వెళ్లి ఎందుకు కొడుతున్నావ్, ఆమెకు సారీ చెప్పమని అడిగాను. అతడి రియాక్ట్ అయ్యేలోపు ఆ అమ్మాయి మాట్లాడింది. 'నా భాయ్ ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు నీకేంటి?' అని నాకు కౌంటర్ వేసింది. ఆ అమ్మాయి అలా అడిగితే మనం మాత్రం ఏం చేస్తాం. ఆ రోజు జరిగిన సంఘటనలో అబ్బాయిది కాదు అమ్మాయిదే తప్పు. ఇంకో రూమర్ ఏంటంటే.. ప్రచారం కోసం ఆ గొడవని నేనే ప్లాన్ చేశానన్నారు. కానీ వాళ్లెవరో కూడా నాకు తెలియదు' అని నాగశౌర్య చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?)