హీరో విజయ్‌పై తప్పుడు ప్రచారం.. మండిపడుతున్న ఫ్యాన్స్! | Thalapathy Vijay To Remove His Arm From Around Her Shoulder Video Goes Viral | Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: హీరో విజయ్‌పై తప్పుడు ప్రచారం.. అసలు నిజం ఇదే!

Published Sun, Jun 30 2024 2:22 PM | Last Updated on Sun, Jun 30 2024 2:58 PM

Thalapathy Vijay To Remove His Arm From Around Her Shoulder Video Goes Viral

కోలీవుడ్ ‍స్టార్ ‍హీరో విజయ్ గతేడాది లియో సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. అయితే దళపతి ప్రస్తుతం ఆయన గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఆయన తన పార్టీ తరఫున 10,12వ తరగతి విద్యార్థులను సన్మానించారు. వరుసగా రెండో ఏడాది టాప్ స్టూడెంట్స్‌ను విజయ్ సత్కరించారు. అయితే ఈ వేడుకలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్‌పై నెటిజన్స్‌ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ విద్యార్థిని భుజంపై వేయగా.. ఆమె అతని చేతిని పక్కకు తీస్తూ కనిపించింది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్‌ హీరోకు తగిన బుద్ధి చెప్పిందంటూ పోస్టులు పెట్టారు.

అయితే దీనిపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వీడియో చూపకుండా.. ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. దయచేసి ఇలాంటి వీడియోలతో విజయ్ ప్రతిష్టను దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు. సోషల్ మీడియా రీచ్ కోసం ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేయవద్దని హితలు పలుకుతున్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement